11, నవంబర్ 2023, శనివారం

 🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*రేపు దీపావళి పండుగ. అందరికీ ముందుగా శుభాకాంక్షలు*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔



_*దీపావళీ ఐదు రోజుల పండుగ అంటారు ? వాటి విశేషాలు ఏమిటి ?*_


*ధన్వంతరీ త్రయోదశి*


వాడుకలో ధన త్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలనే ఆశ పడుతున్నాం ! కానీ ఆరోజు *'ఆయుర్వేదానికి,* ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన *'ధన్వంతరీభగవాన్'* జయంతి. పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండముతో అవతరించాడు.


*నరక చతుర్దశి*


నరక యాతనల నుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి. నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు ప్రాక్జ్యోతీషపురం (నేటి అస్సాము ) ను పాలించే *'నరకుడు'* నర రూప రాక్షసుడు దేవీ ఉపాసకుడు కానీ దేవిని వామాచారంలో క్షుద్రపూజలు చేసి అనేక అధ్భుతశక్తులను సంపాదించి దేవతలను కూడా ఓడించాడు. వాడు ప్రతీ అమావాస్య- పౌర్ణమికి నవ యవ్వన రాచ కన్యలను దేవికి బలి ఇచ్చే వాడు , కాముకత్వంతో అనుభవించేవాడు. నరకుని చెరసాలలో వేలాది అందమైన మహిళలు ( రాచకన్యలు ) బందీలుగా వుండేవారు. ఆది వరాహమూర్తికి - భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు తామస ప్రవృత్తితో జనించాడు. శ్రీకృష్ణ భగవానుడు - సత్యభామ ( భూదేవీ అవతారం )తో కలసి గరుడారూడుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని శక్తి ( సత్యభామ ) సహకారంతో సంహరించాడు. నరకుని పీడ విరగడైంది కావున ఇది *'నరక చతుర్దశి'.*


*దీపావళీ*


రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సంధర్బంగా దీపావళి జరుపు కోవాటం , నరకుని బాధల నుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. దీపం - లక్ష్మీ స్వరూపం - ఐశ్వర్య స్వరూరం - జ్ఞాన స్వరూపం అందుకే మనం దీపావళీ రోజు లక్ష్మీపూజలు చేస్తాము. వ్యాపారస్తులు కొత్త లెక్కలు వ్రాసుకుంటారు.


*బలిపాఢ్యమి*


వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలి చక్రవర్తిని *'మూడు అడుగుల'* నేలను దానమడిగాడు. వామన వటువుకు దానమిచ్చాడు బలి , *'ఇంతింతైవటుడింతైనభోరాశిపైనల్లంతై'* అన్నట్లుగా ఒక పాదంతో భూమిని , ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన 'త్రివిక్రముడు' వేరొక పాదంతో బలిని పాతాళానికి అణచాడు. సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడి దీపకాంతులను చూసి మనమంతా సుఖశాంతులతో వుండాలని ఆశీర్వదించి వెలతాడట ఇదీ ఆయనకు వామనుడిచ్చిన వరం.


*యమద్వితీయ*


సూర్య భగవానునికి యముడు - శనిదేవుడు ఇద్దరు పుత్రులు. యమున అనే ఒక పుత్రిక కలదు. యముడు - యమున ఇద్దరూ అన్నా చెల్లెలు కదా ! తనపని ( జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశంతో ఈడ్చుక వచ్చి వారి వారి కర్మాను సారం వారి వారికి తగిన శిక్షలు విధించే పనిలో పడి పాపం చెల్లెలింటికి వెళ్ళటం లేదు యముడు. చెల్లి బతిమాలింది ఒకసారి మా ఇంటికి రా అన్నయ్యా అని బతిమాలింది చెల్లెలు కార్తీక శుద్ఘ విదియ , మంగళవారం రోజు తీరిక చేసుకుని తన చెల్లెలింటికి వెల్లి హాయిగా కొద్ది సేపు వుండి భోజనం చేసి వచ్చాడు యముడు చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగింది. ఎవరైతే ఈ రోజు చెల్లెలింటికి వెల్లి చెల్లెలికి కట్నకానుక లిచ్చి వాల్లింట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చేయి అని అడిగింది. ఈ యమునమ్మనే యమునా నది. కృష్ణుని భక్తురాలు. భగినీ హస్తభోజనం అన్న పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగ ఇప్పటికీ జరుపుకుంటారు.

Panchaag


 

⚜ శ్రీ నిష్కలంక మహాదేవ్ మందిర్

 🕉 మన గుడి : నెం 236






⚜ గుజరాత్ : భావనగర్


⚜ శ్రీ నిష్కలంక మహాదేవ్ మందిర్ 


💠 ఎత్తైన కొండల్లోనో, సముద్ర తీరంలోనో, నది ఒడ్డులో ఆలయాలు ఉండటం తెలుసు.. కాని సముద్రం మధ్యలో ఆలయం అంటే కొంత ఆశ్చర్యం కలగకమానదు.. సముద్రం మధ్యలో ఆలయం ఉంటే భక్తులెలా దర్శించుకుంటారనే అనుమానం రావచ్చు.

కాని గుజరాత్‌ కొలియాక్ సముద్ర తీర ప్రాంతంలో ఓ ఆలయం మాత్రం ఎంతో స్పెషల్.. సముద్రం మధ్యలో ఉండటమే కాదు.. భక్తులు దర్శించుకునేందుకు వీలుగా.. ఆ ఆలయానికి చేరుకోవడానికి నిర్ధిష్ట సమయం ఉంటుంది.

ఆ టైంలో ఎటువంటి నీరు ఆలయం వద్ద ఉండదంటే అతిశయోక్తికాదు.


💠 నిష్కలంక అంటే...కళంకం లేని స్థితి..వ్యవహరికం లో పాపము లేని ఉన్నతస్థితి. పాపప్రక్షాళన పాండవులకు జరిగిన ప్రదేశం కాబట్టి నిష్కలంక మహాదేవ్ గా భక్తులు స్వామిని పిలుస్తారు.


💠 ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే పొద్దున్నే మనం అక్కడికి వెళ్ళామనుకోండి, అప్పటికి అక్కడ గుడి కనిపించదు. అక్కడ ఆలయం ఉందనడానికి సూచికగా ఓ ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుంటుంది. తర్వాత మెల్లగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సముద్రం వెనక్కి వెళ్తూ ఉంటుంది. దాంతో ఆలయం పూర్తిగా కనిపిస్తూ వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది. ఇక భక్తులు అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి శివలింగానికి పూజలు చేస్తారు. 

ఇలా రాత్రి పదిగంటల వరకూ అక్కడే కాలం గడపొచ్చు. ఆ సమయం దాటితే మాత్రం అక్కడి నుంచి వెనక్కి వచ్చేయాల్సిందే! ఎందుకంటే మళ్ళీ సముద్రం ముందుకు వచ్చి ఆలయాన్ని నీటముంచుతుంది. 

అంటే మళ్లీ మర్నాడు మధ్యాహ్నం వరకు ఆలయం కనిపించదన్నమాట! అదీ అక్కడి విశేషం. ఆలయ ధ్వజస్తంభం ఎత్తు దాదాపు 20 మీటర్లు. అంటే దాదాపు ఆ ఎత్తువరకు నీళ్లు వచ్చేస్తాయి. 


💠 కొన్ని వందల ఏళ్ళుగా ఇక్కడ ఇలాగే జరుగుతోందట. ఈ పరమేశ్వర ఆలయాన్ని పాండవులు నిర్మించారన్నది స్థలపురాణ గాథ! పౌర్ణమి రాత్రి పోటు సమయంలో పదిగంటల వేళ సముద్రం బాగా ముందుకు వచ్చేయడం, మెల్లిగా ఆలయాన్ని తన గర్భంలో దాచేసుకునే దృశ్యం అక్కడి యాత్రికులకు ఎంతో కనువిందు చేస్తుంది...


💠  ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. సముద్రం మధ్యలో ఈ ఆలయం నిర్మాణం ఎలా చేశారనేది నేటి తరం ఇంజినీర్లకు, సాంకేతిక నిపుణులకు అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. ఈ ఆలయాన్ని వీక్షించిన వారు ప్రాచీన భారతీయుల నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు.



 ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సముద్రం పూర్తిగా వెనక్కి వెళ్లడంతో పూలు, పండ్లు, పూజా సామగ్రి అమ్మే వర్తకులు తమ సామాగ్రిని తోపుడు బండ్లపై వేసుకుని సముద్రంలో నడుచుకుంటూ ఆలయానికి చేరుకుంటారు. ఆ తరువాత ఆలయానికి వెళ్లే భక్తుల తాకిడి కూడా పెరుగుతుంది. రాత్రి 7 గంటల వరకూ భక్తులు మహాశివుడ్ని దర్శించుకోవడంతో పాటు.. ఈ ఆలయం వద్ద గడపవచ్చు. రాత్రి 7 గంటలు దాటిన తరువాత సముద్రం మళ్లీ ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అర్ధరాత్రి దాటే  సమయానికి ఆలయం పూర్తిగా సముద్రగర్భంలో మునిగిపోతుంది.


🔅 ఆలయ చరిత్ర 🔅


💠. పురాణాల ప్రకారం సముద్రం మధ్యలో ఉండే నిష్కలంక మహదేవ్ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్రే ఉంది. 

మహాభారతం యుద్ధం సమయంలో పాండవులు కౌరవులపై యుద్ధాన్ని గెలిచినప్పటికి.. ఆ యుద్ధంలో సొంత బంధువులను చంపిన పాపాల నుంచి విముక్తి పొందడానికి పాండవులు శ్రీకృష్ణున్ని ఆశ్రయిస్తారు. 


💠 శ్రీకృష్ణుడు ఒక నల్లని ఆవుకు నల్లని జెండాను కట్టి అవి ఎంత దూరం వెళితే అంత దూరం వాటి వెంట వెళ్లమంటాడట. 

ఎప్పుడైతే ఆ ఆవు, జెండా తెల్లగా మారతాయో అప్పుడు ఆ పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని శ్రీకృష్ణుడు చెబుతారని, దీంతో పాండవులు రోజుల తరబడి ఆవుల వెంటే నడిచేవారని పురాణాలు చెబుతున్నాయి. 

ఎంత దూరం నడిచినా వాటి రంగులో మార్పు రాలేదు. ఎప్పుడైతే చివరిగా ఆవు, జెండా కొలియాక్ సముద్ర తీరానికి చేరుకున్నాయో అప్పుడు ఉన్నట్టుండి అవి తెల్లగా మారతాయని, ఆ సమయంలో పాండవులు ఆ ప్రదేశంలోనే కూర్చుని పరమశివుని కోసం తపస్సు చేస్తారని, వారి భక్తికి మెచ్చిన శివుడు ఒక్కొక్కరి ఎదుట ఒక్కో స్వయంభువు శివలింగంగా అవతరిస్తాడని, దీంతో పాండవులు అమితానందపడి ఆ ఐదు శివలింగాలకు పూజలు నిర్వహించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

అదే ఈ దివ్యక్షేత్రం.


💠 పాండవుల పాపాలను కడిగిన ఈ పరమ పవిత్ర ప్రదేశం అప్పటి నుంచి నిష్కలంక్ మహదేవ్ గా ప్రసిద్ధి పొందినట్లు పురణ గాధల ద్వారా తెలుస్తోంది.


💠 ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కెరటాలు చాలా ఉధృతంగా వస్తుంటాయి.

బాగా కావాల్సిన వారు ఎవరైనా మరణిస్తే వారి ఆస్తికలను ఇక్కడి నీటిలో కలపడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరి ముక్తి లభిస్తుందని చాలా మంది విశ్వాసం. 


💠 ఆలయం గోపురంపై సూచికగా ఎగిరే జెండాను సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే మారుస్తారు. ఇప్పటి వరకూ తుపాన్లు, అలల వలన ఈ జెండా దెబ్బతినలేదంటే అతిశయోక్తి కాదు. 

దేవుడిపై భక్తి, పర్యటనల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఈ ప్రదేశం ఓ మరపురాని అనుభూతిని ఇస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

రాశి ఫలితాలు

 *11-11-2023*

*స్థిర వాసరః శని వారం*

*రాశి ఫలితాలు*

*మేషం*

చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నూతన వస్తు,వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.

*వృషభం*

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.  సోదరులతో  భూవివాదాలు కలుగుతాయి.  బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారమున కొన్ని నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి. ఉద్యోగాలలో  అదనపు పనిభారం తప్పదు. 

*మిధునం*

కుటుంబ వ్యవహారాలలో కీలక  నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి  ఒప్పందాలు చేసుకుంటారు.  దూరపు బంధువుల నుండి  అరుదైన  ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

*కర్కాటకం*

సన్నిహితుల నుండి ఆర్థిక ఒత్తిడి  పెరుగుతుంది.  ఇంటా బయట  గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.  అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు  నిరుత్సాహ పరుస్తాయి.

*సింహం*

ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా  పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది  సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభలా బాటలో పయనిస్తాయి.  ఉద్యోగమున అధికారులతో వివాదాలు రాజీ అవుతాయి.

*కన్య*

రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది . ఆత్మీయులతో గృహమున  సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి స్వంత  నిర్ణయాలు అమలు చేసి  లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తుల పనితీరుకు  అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

*తుల*

పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. బంధు  మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. నిరుద్యోగ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం అందదు.

*వృశ్చికం*

చేపట్టిన పనులు శ్రమాధిక్యాత తో కానీ పూర్తి కావు.  కొన్ని విషయాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. భూ సంబంధిత వివాదాలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన వ్యాపారాలు ప్రారంబానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది. 

*ధనస్సు*

సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ  కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. చేపట్టిన  వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుతాయి. 

*మకరం*

సంతాన విద్యా విషయాలపై  ద్రుష్టి సారిస్తారు. రాజకీయ వర్గాల ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో  శ్రమకు తగిన ఫలితం పొందుతారు. భూ సంభందిత క్రయ విక్రయాల లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.

*కుంభం*

ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గవరోదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు  మందగిస్తాయి  ఉద్యోగ వాతావరణం చికాకు కలిగిస్తుంది.

*మీనం*

కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది.  చేపట్టిన పనులులో  వ్యయప్రయాసలు అధికమౌతాయి. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగములు సామాన్యంగా సాగుతాయి.

🕉️

భక్తిసుధ

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 


*శ్లోకం*


*_రత్నసాను శరాసనం రజతాద్రి శృంగనికేతనం_*

*_శింజినీ కృత పన్నగేశ్వర మచ్యుతానలసాయకం_*

*_క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయై రభివందితం_*

*_చన్ద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః_....*


_ *శ్రీ చన్ద్రశేఖరాష్టకమ్ - 01* _


మణిమయ మౌక్తికాది రత్నముల చేత చేయబడిన ధనుస్సును ధరించి, రజతాద్రి పర్వతము పై నివసించి, వాసుకి అను సర్పమును తాడుగా కలిగి, విష్ణువుకు సహాయకుడిగా కలిగి, త్రిపురములను నాశనము చేసి, మూడు జగములచే పూజించబడి, చన్ద్రుని శిరస్సును ధరించిన చన్ద్రశేఖరుడైన ఆ శివుని పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?

సుభాషితం

 శుభోదయం🙏


సుభాషితం! 


         చ: తెలివి  యొకింత  లేనియెడ  దృప్తుడనై  కరిభంగి  సర్వమున్ 

               దెలిసితి నంచు  గర్వితమతిన్   జరియించితి  దొల్లి,  యిప్పుడు 

               జ్జ్వల  మతులైన   పండితుల   సన్నిధి  నించుక   బోధశాలినై, 

               తెలియని   వాడనై  మెలగితిన్   గతమయ్యె  నితాంత  గర్వమున్; 


                       భర్తృహరి -అను: ఏనుగు  లక్ష్మణకవి; 


               తెలివి  గలవానికి, లేనివానికీ గలతేడా లను మహర్షి భర్తృహరి  నిరూపిస్తున్నాడు. తెలివి  లేనంతకాలం(  అజ్ఙానావస్థలో) నేనే  మహాండితుడనని  విర్ర వీగాను. నాఅదృష్టవశాన  పండిత సాహచర్యంలో  కొంచెంగా  పాండిత్యం కలిగింది. 

యిప్పుడు  నాకు అసలు  విషయంతెలిసింది? యేమని? నాకేమీ రాదని. నేను అజ్ఙానినని. అంతే గతంలో నాకున్న అంతులేని గర్వం  అణగి పోయింది. వినయం అబ్బింది! అంటున్నాడు కవి. 


                            నిజమైన  విద్యావంతు డెప్పుడూ  గర్వపడడు. వినయంతో ఉంటాడు. యితరులను తక్కువజేసి యెప్పుడునూ మాటతూలడు. గర్వపడటం పండితుల యెడ తిరస్కారం., అజ్ఙానానికి  నిదర్శనాలు!🙏🙏🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌟🌷🌷🌷🌷

నవ్వడం వల్ల కలిగే

 *రోజు నవ్వడం వల్ల కలిగే అద్భుతమైన_ప్రయోజనాలు_*.💥💥


నవ్వు – నవ్వు మనకి చిన్నప్పటి నుంచీ సహజంగానే వచ్చింది. మనం చిన్నప్పుడు నవ్వడం మనకి ఎవరూ నేర్పలేదు. మనం చిన్నప్పుడు ప్రతీదానికి నవ్వుతాం. ఆఖరుకి నిద్రలో కూడా నవ్వుతాం. అది అమాయకమైన నిజమైన నవ్వు. ఆ చూస్తే చాలు చుట్టూ ఉన్నవాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు. అప్పుడు ఆ నవ్వుకి ఎలాంటి షరతులు, పరిధులు లేవు. మనం ఎదుగుతున్న కొద్దీ మిగతా హావభావాలు నేర్చుకుంటాము. నవ్వుని కొన్ని సందర్భాలలో మాత్రమే వాడుతూ ఉంటాము. ఫోటో కోసమో, వేరే వాళ్ళని పలకరించడానికో నవ్వుతాము. చిన్నపిల్లల కంటే పెద్దవాళ్ళు తక్కువ నవ్వుతారు. చిన్నపిల్లలు రోజుకి దాదాపు 400 సార్లు నవ్వుతారు. పెద్దలలో కేవలం 30% మాత్రమే రోజుకి 30 సార్లు నవ్వుతారు.


*నవ్వడం_వల్ల_ఎలాంటి_ఉపయోగాలు_ఉన్నాయో_ఇప్పుడు_చూద్దాం.*

1. నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యానికి హానికరం. మనం నవ్వినప్పుడు, మన శరీరం న్యూరోపెప్టైడ్స్‌ను విడుదల చేస్తుంది. ఈ చిన్న అణువులు ఒత్తిడి ఉపశమనం మరియు ప్రశాంతతను ప్రేరేపించే దిశగా పనిచేస్తాయి. కాబట్టి, మీరు ఒత్తిడికి గురైనప్పుడల్లా చిరునవ్వు నవ్వండి. ఇది ఒత్తిడిని తగ్గించడమే కాక, మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచి మీరు చెయ్యాలనుకున్న పనులు చేసేలా చేస్తుంది.


2. ఒక వ్యక్తి ఒత్తిడికి గురైనప్పుడు, హృదయ స్పందన రేటు మరియు రక్తపోటు పెరుగుతుంది. వ్యక్తి నవ్వినప్పుడు, ఎండార్ఫిన్ అనే ఫీల్-గుడ్ హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ హృదయ స్పందన రేటు మరియు రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.


3. నవ్వు మన సంబంధాలను మెరుగుపరుస్తుంది. మనం సహజంగా ఎక్కువ నవ్వే వ్యక్తుల వైపు ఆకర్షితులవుతాము. నవ్వినప్పుడు మరింత ఇష్టపడతాము.


4. నవ్వడం మనలను మరింత స్నేహపూర్వకంగా మరియు ఇతరులకు చేరువ చేస్తుంది.


5. మనం నవ్వినప్పుడు, మన శరీరం సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ ఆందోళన మరియు నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది.


6. ఒక బ్రిటీష్ పరిశోధన ప్రకారం, ఒక నవ్వు 2000 చాక్లెట్ తినడం ద్వారా వల్ల మెడదుకి వచ్చిన ఆనందాన్ని ఇస్తుంది. ఈ పరిశోధన కూడా ఒక చిరునవ్వు 16,000 రూపాయలు డబ్బు తీసుకున్నప్పుడు మెదడు ఎంత ఆనందంగా ఉంటుందో దానితో సమానం అని తేలింది. కాబట్టి, మీరు ఏమీ చేయకుండా 16,000 పౌండ్ల డబ్బు లేదా 15 లక్షల రూపాయలు అందుకోవాలని ఉందా? అయితే నవ్వండి. మీ ఒక్క చిరునవ్వు విలువ 15 లక్షల రూపాయలు. అద్భుతం కదా ?


7. మనం నవ్వినప్పుడు, మన శరీరం డోపమైన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ ఈ క్రింది విధంగా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.


8. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.


9. శ్రద్ధ మరియు ఏకాగ్రతను పెంచుతుంది


10. సృజనాత్మకతను పెంచుతుంది


11. ఎముకల బలాన్ని పెంచడానికి సహాయపడుతుంది


12. నొప్పి మరియు మంటను తగ్గించడంలో సహాయపడుతుంది


13. పగటిపూట మనల్ని అప్రమత్తంగా మరియు మేల్కొని ఉంచుతుంది


14. నవ్వు జీవితకాలాన్ని పెంచుతుంది. నవ్వే వ్యక్తుల జీవిత కాలం 7.2 సంవత్సరాలు ఎక్కువ ఉంటుందని ఒక పరిశోధనలో తేలింది. కాబట్టి, మరింత నవ్వి, ఎక్కువ కాలం జీవించండి.


15. నవ్వడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. మనం ఎక్కువగా నవ్వినప్పుడు, శరీరంలో తెల్ల రక్త కణాలు మరియు సహజ కిల్లర్ కణాల సంఖ్య పెరుగుతుంది. ఈ కణాలు అంటువ్యాధుల నుండి మనలను రక్షిస్తాయి.


16. నవ్వు మీరు పని చేసే ప్రదేశాన్ని మార్చేస్తుంది. నవ్వుతూ పనిచెయ్యడం వల్ల మీ సామర్థ్యం పెరుగుతుంది


17. నవ్వడం అనేది ఒక వ్యక్తి యొక్క అందాన్ని సహజంగా పెంచుతుంది . నవ్వు మీ వయసుకన్నా మూడు సంవత్సరాలు చిన్నవారిగా కనిపించేలా చేస్తుందని ఒక పరిశోధనలో తేలింది.


18. నవ్వడం అనేది మానసిక స్థితిని పెంచే వ్యాయామం.


19. నవ్వడం అంటువ్యాధి లాంటిది. మీరు నవ్వినప్పుడు, మిమ్మల్ని చూసే వ్యక్తులు అప్రయత్నంగా నవ్వుతారు మరియు వారు కూడా నవ్వుతూ ప్రయోజనాలను పొందుతారు. కాబట్టి నవ్వడం ద్వారా, మీరు ఇతరులు సంతోషంగా మరియు తక్కువ ఒత్తిడితో ఉండటానికి సహాయం చేస్తారు. నవ్వడం అనేది ఇతరులను సానుకూలంగా ప్రభావితం చేసే గొప్ప మార్గం.


20. నవ్వడం ఒక వ్యక్తిని మరింత ఆకర్షణీయంగా అందంగా చేస్తుంది.


21. ఒక వ్యక్తి నవ్వినప్పుడు గుండె చక్ర యాక్టివేట్ అయ్యి ప్రశాంతతను ఇస్తుందని ఎనర్జీ హీలింగ్ చెప్తుంది. .


22. నవ్వడం శారీరకంగా, మానసికంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా మన జీవితం యొక్క నాణ్యతను మెరుగుపరుస్తుంది.


ఇవి నవ్వు వల్ల కొన్ని ప్రయోజనాలు. మనలో చాలా మంది మనం సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే చిరునవ్వు అవసరం అని అనుకుంటారు.  ఫేక్ నవ్వు మంచిది కాదు అనుకుంటారు. ఫేక్ నవ్వు కూడా నిజమైన నవ్వు అంత ప్రయోజనకరం అని ఒక పరిశోధనలో తేలింది. మీరు నవ్వినప్పుడు, మీరు సంతోషంగా ఉంటారు. కాబట్టి, నవ్వడానికి ఒక కారణం కోసం వేచి ఉండకండి. మీరు విచారంగా, కోపంగా, చేదుగా, క్రోధంగా, అలసిపోయినప్పుడు, విసుగు చెంది ఉన్నప్పుడు ఎప్పుడైనా నవ్వండి. ఈ చిన్న పని మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.


డబ్బు ఖర్చు చేయకుండా మీరు చేయగలిగే సులభమైన వ్యాయామాలలో నవ్వడం ఒకటి.


*మీ_రోజువారీ_జీవితంలో_చిరునవ్వును_చేర్చడానికి_కొన్ని_మార్గాలు_ఇప్పుడు_చూద్దాం*.

1. మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు నవ్వుతూ చెయ్యండి . ఇది వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలను పెంచుతుంది.


2. మీరు యోగా చేస్తున్నప్పుడు, వంగిన అవయవాన్ని చూసి నవ్వండి. ఈ స్మైల్ మీ శరీరాన్ని నయం చేస్తుంది మరియు అవగాహనను కొనసాగించడంలో మీకు సహాయపడుతుంది.


3. మీరు ఏదైనా బోరింగ్ పని చేస్తున్నప్పుడు, దాని గురించి నవ్వుకోవడానికి మార్గాలను వెతకండి.


4. మీరు ఇన్నర్ స్మైల్ మెడిటేషన్ ప్రాక్టీస్ చెయ్యవచ్చు. ఇది ఒక ప్రసిద్ధ Taoist practice. ఇది చేసే వ్యక్తి శరీరంలోని ప్రతి అవయవాన్ని చూసి లోపల నవ్వుతాడు. ఈ మెడిటేషన్ ను సులువుగా సాధన చెయ్యడానికి సూచనలు ఇప్పుడు చూద్దాం.


5. సౌకర్యవంతమైన స్థితిలో – కుర్చీలో లేదా నేలపై – వెన్నెముక నిటారుగా కూర్చోండి


6. కళ్ళు మూసుకోండి


7. ఒక నిమిషం డీప్ బ్రీత్ తీసుకోండి మరియు మీ ఆలోచనలు మరియు భావోద్వేగాలను నెమ్మది అవుతాయి.


8. మెల్లగా నవ్వండి.


9. మీ తల నుండి మొదలుకొని మీ శరీరంలోని ప్రతి అవయవాన్ని చూసి నవ్వడం ప్రారంభించండి.


10. మీ ముఖంలోని ప్రతి అవయవాన్ని చూసి నవ్వండి.


11. మీ శరీరంలోని ప్రతి అవయవం చూసి నవ్వండి.


12. మీ చేతులను చూసి నవ్వండి.


13. మీ కింది దేహాన్ని చూసి నవ్వండి .


14. మీ కాళ్ళని చూసి నవ్వండి


15. మీ శరీరాన్నంతా చూసి నవ్వండి .


16. మీకు ఇబ్బందిగా లేనంత వరకూ నవ్వుతూనే ఉండండి


17. కృతజ్ఞతతో ఒక చిన్న ప్రార్థనతో ఈ సాధనను ముగించండి.


18. అద్దంలో చూసేటప్పుడు మిమ్మల్ని చూసి నవ్వండి


ప్రతి పరిస్థితిలో ఎల్లప్పుడూ నవ్వండి. నవ్వడానికి ఎటువంటి కారణాలు లేదా లక్ష్యాలు అవసరం లేదు. చిరునవ్వుతో మీ జీవితాన్ని మార్చుకోండి.

Keep స్మిలింగ్.


సేకరణ. మానస సరోవరం 👏

ఆలోచనాలోచనాలు

 00000 ఆలోచనాలోచనాలు 00000                               -----౦తప్పులతో తిప్పలు ౦-----                                  ***** మనిషి తన తప్పులను ఒప్పుకొనేంత గొప్పవాడై వుండాలి. వాటి నుండి లాభాన్ని పొందేంత తెలివైనవాడై వుండాలి. వాటిని సరిచేసుకొనేంత బలవంతుడై వుండాలి.          ***** నా గురువుల నుండి నేను ఎంతో నేర్చుకొన్నాను.                      నా పుస్తకాలనుండి నేను ఎంతో నేర్చుకొన్నాను.              మరీ ముఖ్యంగా నేను చేసిన తప్పులనుండి ఎంతో నేర్చుకొన్నాను.            అతిగా వాగేవారి నుండి మౌనంగా ఉండటంలోని ఆనందాన్ని నేర్చుకొన్నాను.     ఊరకే చిరాకుపడేవారి నుండి సహనాన్ని, శాంతంగా ఉండటాన్ని నేర్చుకొన్నాను.                      ***** పెన్సిల్ చివర ఎరేజర్ ఉండేది, తప్పులు కొనసాగించేవారికోసం కాదు ; తప్పులను సరిదిద్దుకొని సక్రమంగా ఉండాలని భావించేవారి కోసం.                                   ***** తప్పు చేయడం కాదు; దానిని వెంటనే దిద్దుకొని సరియైన మార్గంలో కొనసాగకపోవడమే పెద్ద తప్పు.చేసిన తప్పులనే తిరిగి మళ్ళీ చేసుకొంటూపోవడం తప్పున్నరతప్పు.                  ***** మేథావులు తప్పులు లేదా పొరబాట్లు చెయ్యరు. ఎందుకంటే వారు చేసిన తప్పులు లేదా పొరబాట్లు ద్వారా వారు "" మేథావులు"" గ పరిగణింపబడ్డారు కాబట్టి;    ***** ఇతరుల తప్పులనుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. వారు పూర్తిగా తప్పులన్నీ చేసేవరకు మనం ఈ భువిలో సజీవంగా ఉండకపోవచ్చు గదా!            ***** మన తప్పుల గురించి ఇతరులు చిలవలు పలవులుగా వర్ణించి లోకానికి చెప్పేముందు, మనమే మన తప్పును సంపూర్ణంగా ఒప్పుకొంటే ,అది ఎంతోకొంత క్షమించబడుతుంది. ఎవరైతే తమ తప్పులను ధైర్యంగా అంగీకరిస్తారో వారి తప్పులు తగలబెట్టబడి బూడిదగా మారతాయి.                        ***** చేసిన తప్పులు తెలుసుకోకపోవడం, తెలుసుకోవాలని భావించకపోవడం, తన తప్పు తనకు బాగా తెలిసిపోయినా, దానిని కప్పిపుచ్చడానికి ప్రయత్నించడం, దానిని సరియైనదే అని సమర్థించడానికి అసత్యాలు, అన్యాయాలతో నిలబెట్టడానికి ప్రయత్నించడం; ఇవన్నీ తప్పులతో ఆకాశానికి నిచ్చెన వెయ్యడంలాంటిది. కేవలం వ్యర్థప్రయత్నం మాత్రమే!                              ***** తప్పలపై మహనీయుల మాటలను పరికిద్దాం.                           1* ఒక్క తప్పు చెయ్యని వ్యక్తిని మీరు నాకు చూపించగల్గితే, నేను ఒక్క పని కూడా చెయ్యని మనిషిని మీకు చూపగలను.--- హెచ్. ఎల్. వేలాండ్.                       2* వ్యక్తి తాను తప్పు చేశానని ఒప్పుకోవడానికి సిగ్గు పడకూడదు. తన తప్పును తాను ఒప్పుకోవడమంటే నిన్నటికన్నా నేడు మనం తెలివిగా ప్రవర్తించినట్లు లెక్క. --- పోప్.                      3* తప్పులెన్నువారు, తమ తప్పులెరుగరయ్యా! --- యోగి వేమన.                       4* మనం ఇతరులలో కేవలం తప్పులను ఎంచి, ప్రకటించడం మొదలుపెట్టామా? మనకు బంధువులు మిగలరు. మిత్రులూ మిగలరు. మిగిలేది మనం మాత్రమే!-- అవ్వయార్.        5* తాను తప్పులను చేస్తున్నానని అనుమానించేవాడు, ఎప్పుడూ ఒప్పులనే చేసుకొంటూపోతాడు.--- స్పెయిన్ దేశపు సామెత.      6* అయినా రెండు తప్పులను కలిపితే , ఒక ఒప్పు అవుతుందని మీకు ఎవరు చెప్పారండీ! --- ఇంగ్లీషు సామెత.                    7* ఒక మనిషి మంచిగా ఉండాలని దైవం భావిస్తే, ఆ మనిషి తప్పులు చెయ్యకుండా అతనికి అంతఃదృష్టినిస్తాడు. --- మహమ్మదీయ సామెత.       8* ఇతరుల తప్పులను గమనించడం బహు తేలిక. తన తప్పులను గమనించడమే బహుకష్టం.--- బుద్ధ భగవానుడు.                        9* తప్పులను వెదికే స్వభావం ఉన్నవాడు , స్వర్గం లో కూడా అదే పనిని కొనసాగిస్తాడు.--- ధోరో.                                    10* తప్పులదేముంది. ఎవరైనా చేస్తారు. మూర్ఖులు మాత్రమే వాటిని సరిదిద్దుకోకుండా కాలాన్ని గడిపేస్తారు. --- సిసిరో.                                  చివరగా వెయ్యి ఆవుల మంద మధ్యన ఒక గేదె నడుస్తున్నా, జనం దానిని "ఆవుల మంద" గానే పిలుస్తారు. కాబట్టి మన ఒప్పుల సంఖ్యను పెంచుకొంటూ, తప్పులను వీలయినంత తక్కువ స్థాయికి తీసుకవెళదాం. ఏమంటారు?                        తేది 11 --11--2023, శనివారం, శుభోదయం.

Extremely challenging


 

బట్టబయలైన_రహస్యం

 *బట్టబయలైన_రహస్యం..*

*క్యాన్సర్_ఒక_వ్యాధి_కాదు....*.

*ఒక_విటమిన్_లోపం......*


*కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ నందితా డిసౌజా చెప్పిన దాని ప్రకారం క్యాన్సర్ అనే పదమే ఒక_పెద్ద_అబద్ధం*. క్యాన్సర్ భూతం పేరు చెప్పి ప్రపంచాన్ని ఎలా బయపెడుతున్నారో అందరికి తెలిసిందే. ఈ భూతం వెనుక దాగున్న నిజాన్ని బట్టబయలు చేయడమే ఈ పోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం..


మిమ్మల్ని అభ్యర్దించే ఒక విషయం ఏమిటంటే.... ఇప్పుడు మీరు తెలుసుకుంటున్న ఈ విషయాన్నీ కేవలం మీ మిత్రులకే కాకుండా మీ శత్రువులతో కూడా షేర్ చేయండి. ఇది మేము సొంతంగా రీసెర్చ్ చేసి చెబుతున్న విషయం కాకపోవచ్చు. కాని ఇందులో ఉన్న విషయాలు క్యాన్సర్ నుండి

*ఓ_నలుగురినైనా_కాపాడితే_అంతే_చాలు...*.


క్యాన్సర్ అనే దానికి నివారణ లేదని డాక్టర్స్ చెబుతారు. కానీ అది శుద్ధ అబద్ధం. క్యాన్సర్ అనేది నివారణ లేని జబ్బు కాదు... ఇది ఒక భయంకరమైన బిజినెస్ చాలా మంది అంటుంటారు.

ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది పిల్లల నుండి పెద్దల వరకు అందరికి వస్తుందని.... అందరిని భయపెడుతున్న మరియు భయపడుతున్న వాళ్ళకి


*అర్ధం_కావాలనే_ఈ_పోస్ట్ ఉద్దేశ్యం....*


*వరల్డ్_వితౌట్_క్యాన్సర్- World without CANCER అనే ఒక బుక్ ఉందని, దాన్ని అన్ని భాషలలో తర్జుమా చెయ్యకుండా ఎందుకు, ఎవరు అడ్డు పడుతున్నారో చూద్దాం.*

*క్యాన్సర్ అనేది B17 లోపమే గాని జబ్బు కాదు.*

👌👍ఈ లోపాన్ని అణచడానికి కీమోథెరపీ అని, సర్జరీ అని, హై డోస్ మెడిసిన్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ తో మనిషిని చంపకుండా చంపేస్తున్నారు.


మీకు గుర్తుందా? గతంలో అనే అంతుపట్టని వ్యాధితో ఎంతో మంది నావికులు చచ్చిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యాధికి స్కర్వీ (scurvy) అని పేరు పెట్టారు. విటమిన్ లోపం వల్ల ఎంతో మంది చనిపోయారు.


*అది విటమిన్ లోపం వల్ల వచ్చిన రోగం అని చెప్పకుండా... అంతుపట్టని రోగం అని చెప్పి ప్రజల నుండి డబ్బులు హాస్పిటల్స్ వాళ్ళు దోచుకున్నారు*


అది కేవలం విటమిన్ C వల్ల వచ్చిన రోగం.

*క్యాన్సర్_కూడా_ఇలాంటిదే...అంటే విటమిన్ లోపమే క్యాన్సర్_అని_అర్ధం. క్యాన్సర్ సెల్స్ ఎక్కడో ఉండవు మన బాడీ లోనే ఉంటాయని చాల మంది డాక్టర్స్ కూడా చెపుతారు.* అసలు లోపల ఉన్న క్యాన్సర్ బయటకు ఎందుకు వస్తుంది?


*మనం దానికి సంబంధించిన విటమిన్లు సరిగ్గా తీసుకోకపోవడం వలన.*


మానవత్వం లేని మనుషుల వల్ల, కాంక్రీట్ జంగల్ లో బ్రతుకుతున్న జీవితాల వల్ల, క్యాన్సర్ అనే ఒక పదం సృష్టించి... దాన్ని బిజినెస్ చేసారు కొంతమంది డాక్టర్స్.

*మనుషుల భయాన్ని ఆసరా చేసుకొని కొన్ని కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు. ఈ విషయం ఇప్పటిది కాదు... వరల్డ్ వార్ 2 తర్వాత క్యాన్సర్ అనే దాన్ని ఒక బిజినెస్ చేసి దాని ద్వారా బాగా సంపాదిస్తున్నారు. ఆ కాలంలో, ఈ కాలంలో బాగా ఖర్చు పెట్టి కూడా వీళ్ళు సాధించింది ఏంటో తెలుసా? రాకుండా_చూసుకోవడమట, నివారణట.* అసలు రాకుండా చెయ్యడం కాదు, అలా చేస్తే హాస్పిటల్స్ కి డబ్బులు రావు కదా.


మీకు గాని.. మీకు తెలిసిన వాళ్లకు గాని క్యాన్సర్ అని లోపం

*ఉంటె_కంగారు_పడాల్సిన_అవసరం లేదు మీరు చేయాల్సింది ఒకటే...*


ఈ రోజుల్లో ఎవరైనా స్కర్వీ (scurvy) వ్యాధితో చనిపోతున్నారా? లేదు.... ఎందుకంటే దానికి కారణం విటమిన్ C లోపం అని తెలుసుకొని ఆ లోపాన్ని సరిద్దికోవడం వల్ల.

మరి క్యాన్సర్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. *ఆ_లోపాన్ని_కూడా_B17_తో_పోగొట్టుకోవచ్చు.*


#క్యాన్సర్_రాకుండా_చేసుకోవడం_చాలసులువు!!


★15 నుండి 20 నేరెడు కాయలు..

★ క్రాన్బెరి/ఆపిల్ సీడ్స్.

★ ఎండు ద్రాక్ష.

★ బాదాం పప్పు.

★ బ్లాక్ మల్బెర్రి, బ్లూ మల్బెర్రి, కోరిందకాయ స్ట్రాబెర్రి.

★ నువ్వులు, అవిసె గింజలు.

★ ఓట్స్, బార్లీ, గోధుమ బియ్యం, నల్ల గోధుమలు.

★ బీర్ ఈస్ట్, వరి, తీపి గుమ్మడికాయ. తెల్ల ఆపిల్ ★ (పియర్ ఆపిల్)

★ నిమ్మ, ఉసిరి, చిక్కుడు, గోధుమ గడ్డి,

★ జీడీపప్పు,పిస్తా....... పైన చెప్పినవన్నీ


*అధిక_శాతంలో_విటమిన్_B17_కలిగిఉన్నవి.*


ఈ లోపాన్ని సరిదిద్దు కోవడానికి ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి.


*గోధుమ_మొలకలు (Wheat Sprouts )*


ఒక అద్భుతమైన క్యాన్సర్ నిరోధక మందు.


*రోజూ_ఒక_తులసి_ఆకు_తింటే_జీవితంలో ఎలాంటి క్యాన్సర్ లు దరిచేరవు..*


Wheat Sprouts bud is a Rich Source of Liquid Oxygen and the strongest anti-cancer matter in the name of "laetrile", and this matter is present in the fruit stone of ఆపిల్ (ఆపిల్ గింజలు). Laetrile is the extract form of vitamin B17 (Amygdalin)


అమెరికన్ మెడిసినల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏంచేస్తుందో తెలుసా, నిషేధించబడిన - *LAETRILE- ప్రొడక్షన్ ని రహస్యంగా ఇంప్లీమెంట్ చేస్తుంది (ఈ మందుని మెక్సికో లో తయారుచేయించి అమెరికాలోకి రహస్యంగా తరలిస్తున్నారు)*

Dr. హారొల్ద్ W.మన్నెర్ తన -డెత్ అఫ్ క్యాన్సర్- బుక్ లో క్యాన్సర్ ని -laetrile- ట్రీట్మెంట్ తో 90 శాతం వరకు నయం చేసారని వివరించారు.


*క్యాన్సర్_రావడానికి_ముఖ్యకారణం_ఏంటో తెలిస్తే అవాక్కవుతారు* అవేంటంటే

1) #వాష్_చెయ్యడానికి_వాడే_రసాయనాలు.

2) వాషబేసిన్ కడగడానికి ఉపయోగించే రసాయనాలు.

3) టాయిలెట్స్ శుభ్రపరచడానికి వాడే

రసాయనాలు పీలచడం.


మేము వాటిని తినడం లేదు కదా అని అనవచ్చు. కానీ మీరు పీలుస్తున్నారంటే అది ఒకరకంగా తినడం లాంటిదే. మీరు మీ ప్లేట్స్ ని లిక్విడ్స్ తోనే వాష్ చేస్తున్నారు కదా? అలా ఎంత క్లీన్ చేసిన సరే.. ఆ కెమికల్స్ కొంత మీ ప్లేట్స్ లో అలానే ఉంటాయి. ఆ ప్లేట్ లోని ఫుడ్ తింటున్నప్పుడు ఆ ఫుడ్ కి కెమికల్స్ అంటుకొని మీ శరీరంలోకి చేరతాయి. (పూర్వ కాలంలో ఆకులలో తినేది అందుకే కదా)


*దీనికి_విరుగుడు_ఏంటో_తెలుసా ???*

మీరు వెనిగర్ తో మీ పాత్రలను క్లీన్ చేసుకోవచ్చు.


*మీరు కొన్న కూరగాయల్ని ఒక అరగంట పాటు ఉప్పు నీళ్లలో నానబెట్టండి, తరువాత మంచి నీటి తో కడగండి మరియు దానికి వెనిగర్ ని ఆడ్ చెయ్యండి. దీనివల్ల క్యాన్సర్ ను వ్యాపింపజేసే కెమికల్స్ దూరంగా ఉంటాయి.*


దయచేసి ఈ పోస్టుని అందరితో షేర్ చేయండి..!!

ఈ విషయాన్నీ కేవలం మీ మిత్రులకే కాకుండా

మీ శత్రువులతో కూడా షేర్ చేయండి...!


*క్యాన్సర్_బారిన_పడకుండా_అందరిని_కాపాడండి. S

Travellor


 

జ్ఞానయోగం - భావవ్యక్తీకరణ*

 *జ్ఞానయోగం - భావవ్యక్తీకరణ*


అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ ।

స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే ।।


భగవద్గీత 17వ అధ్యాయం 15వ శ్లోకం


ఉద్వేగమును కలిగించనివి, సత్యములు అయినటువంటివి, కోపము పుట్టించనివి, ప్రయోజనకరమైనవి అగు మాటలు మరియు నిత్య వేద శాస్త్రముల పఠనము - ఇవి వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడుతున్నది.


వాక్కు యొక్క తపస్సు అంటే, సత్యములైన వాటినే మాట్లాడటం, ఎదుటివారికి ఉద్వేగమును కలిగించనివి, వినేవారికి ప్రియముగా, మరియు ప్రయోజనకారిగా ఉండే మాటలు మాట్లాడటమే. వేద మంత్ర పారాయణ అభ్యాసము కూడా వాక్కు సంబంధ తపస్సులోనే చెప్పబడినది.


మాట్లాడటం ఒక కళ. అందరూ మాట్లాడతారు. ఏది అనుకుంటే అది మాట్లాడేస్తారు. కానీ చక్కగా మాట్లాడటం మనకు వచ్చునా?అందరూ వక్తలు కాకపోయినా, చక్కటి సంబంధాలు నెలకొల్పాలంటే ఎంతో సౌమ్యంగా మాట్లాడాలి. చక్కగా సంభాషించాలి.  మరి చక్కగా మాట్లాడకపోతే నష్టమా? అవును ఎంతో నష్టం. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు.


మాట్లాడటంలో ఏముంది అని అనుకోవడం పొరపాటు. చక్కగా మాట్లాడటం ఒక కళ. తానొవ్వక ఇతరుల నొప్పించక మాట్లాడాలి. చాతుర్యంగా మాట్లాడాలి. మాట్లాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించాలి. మంచినే మాట్లాడాలి. చెడు మాట్లాడే అవకాశం రానివ్వకుండా జాగ్రత్తపడాలి. నిజాయితీగా మాట్లాడాలి. నిరాడంబరంగా మాట్లాడాలి. సందర్భానుసారం ఏం మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలి. వ్యవహారం చక్కబెట్టుకు రావడానికి అప్రమత్తంగా మాట్లాడాలి. ముందే దుర్యోధనుడు వచ్చినా, అర్జునుణ్ని ముందు పలకరించిన శ్రీకృష్ణుడు మాట్లాడిన విధానం, దాని వెనక ఉన్న రాజనీతిజ్ఞత గ్రహించాలి. కురుక్షేత్ర రణరంగం మధ్యలో రథాన్ని నిలిపి, అర్జునుడి విషాదం గ్రహించి, అతణ్ని యుద్ధం వైపు తిప్పిన ఆ భగవానుడి సంభాషణలు విశ్వస్ఫూర్తిదాయకమై భగవద్గీతగా వెలుగుతున్నాయి. ఆ పలుకుల వెనక ప్రస్తుత కాలానికి అవసరమైన వ్యక్తిత్వ వికాసం, మానవ సంబంధాల గురించి ఎన్నో విషయాలున్నాయి. ఇంతవరకు అంత అద్భుతంగా మాట్లాడిన అవతారమూర్తి కానరాడు. 


ఇచ్చిన కొన్ని నిమిషాల కాలాన్ని అపరిమితంగా సద్వినియోగం చేసుకుని చికాగో నగరంలో అద్భుత ప్రసంగం చేసి భారతదేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పిన వివేకానందుడి మాటలు అమెరికా అంతా మార్మోగాయి. దేశదేశాలు వివేకానందుడి వాక్కులకోసం పరితపించి పోయాయి. జ్ఞాన సరస్వతి వివేకానందుడి మాటలు నేటి యువతకు కూడా జీవన లక్ష్యంవైపు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాయి. అంకితభావం కలిగి, శుద్ధత్వం సంపాదించుకుని లోక కల్యాణం కోసం జీవించిన గురునానక్‌, ఆదిశంకరుల వంటి మహాత్ముల సంభాషణలు మరచిపోగలమా?


అందరం మాట్లాడతాం. మంచిగా మాట్లాడదాం. మంచి కోసం మాట్లాడదాం. దీన, హీన జనుల పక్షాన నిలబడి మాట్లాడదాం. లోకం నీతిమార్గంలో నడవడానికి, మహనీయుల బోధలు అనుసరించడానికి జనులను జాగృతం చేయడానికి మాట్లాడదాం. నీకోసం నాకోసం మాటలు తగ్గించి పదిమంది మేలు కోసం పరులహితం కోసం అహోరాత్రాలు మాట్లాడదాం. అదే నిజమైన దైవస్తుతి. జీవితంలో క్రమశిక్షణ, సమయ పాలన వుంటే మనిషి ఏదయినా సాధించగలడు. పనిలో నుంచే సంతోషాన్ని వెతుక్కోవాలి, ప్రతి ఒక్కరు ఆనందాన్ని స్వతహాగా సృష్టించుకోవాలి.


ఆలోచించకుండా మాట్లాడడం, గురి చూడకుండా బాణం వేయడం వంటిది. “తాను ఏమి మాట్లాడాలో తెలిసినవాడు, తెలివయినవాడు, తాను ఏమి మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు, వివేకవంతుడు.” అన్నారు స్వామి వివేకానంద. ఎవరయితే మాటలవల్ల, చేతలవల్ల ఇతరులకు బాధ కలిగిచకుండా వుంటారో వారే ఉత్తములు.

ఆకట్టుకునేలా మాట్లాడటం ఒక కళ. అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలు పెట్టాలో, ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ. మాటలు చాలా పదునయినవి కనుక జాగత్తగా వాడాలి, బలమయినవి కనుక సున్నితంగా వాడాలి, ఖరీదయినవి కనుక పొదుపుగా వాడాలి.  కేవలం నోటితో  మాట్లాడితే సరిపోదు. మరింత ప్రభావితంగా ఉండాలంటే మనసుతో మాట్లాడాలి. మాటే సంపదలకు, మానవ సంబంధాలకు మూలం. మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది. శత్రువుల్ని తయారుచేస్తుంది. మనిషికి భావవ్యక్తీకరణ గొప్ప ఆస్తి. ఏమి మాటలాడవనేదానికన్నా, ఎలా మాటలాడవనేదాన్ని బట్టి భావప్రసారణ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా వుంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంది.


సత్యం భ్రూయాత్ ప్రియం బ్రూయాన్ న బ్రూయాత్ సత్యం అప్రియం

ప్రియం చ నానృతం బ్రూయాద్ ఏష ధర్మః సనాతనః (మను స్మృతి 4.138)


"సత్యమునే పలుకుము, అది కూడా, వినేవారికి ప్రియముగా పలుకుము. సత్యమే అయినా ఇతరులకు బాధ/హాని కలిగించే విధముగా మాట్లాడవద్దు. ప్రియముగా ఉన్నా సరే ఎప్పుడూ కూడా అసత్యము పలకవద్దు. ఇదే మన సనాతన నీతి మరియు ధర్మ మార్గము.’


శుభం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


శర్యాతి మహారాజు ఇలా మల్లగుల్లాలు పడుతున్నాడు. రాజదంపతులు రథం దిగకుండా

ఆశ్రమానికి అల్లంతదూరంలో ఉండిపోయారు. అంతలోకీ అదృష్టవశాత్తు సుకన్యాదేవి పర్ణశాలనుంచి

బయటకు వచ్చింది. రథంలోనే నిలబడ్డ తల్లిదండ్రులను చూసింది. ఆనందం ఆపుకోలేక పరుగుపరుగును

వచ్చింది. రండి, రండి. అక్కడే ఆగిపోయారేం? తండ్రీ! ఏమిటి అలా ఉన్నావు? ఏదో లోలోపల

నలిగిపోతున్నట్టున్నారేమిటి? మునుపటి దుఃఖం ఇంకా మిమ్మల్ని వదలలేదా? ఇంక ఇప్పుడు

వదిలిపోతుందిలెండి రండి. అడిగో నా భర్త. నమస్కరించండి.

మండిపోతున్న శర్యాతి - కూతురి మాటలకు అడ్డుతగిలాడు. ఏడీ చ్యవనుడు? వృద్ధుడూ

అంధుడూ అయిన తాపసి ఏడీ? ఎక్కడున్నాడు? ఈ మదోన్మత్తుడైన యువకుడు ఎవరు? నాకేదో

సందేహంగా ఉంది. దుష్టురాలా! మహర్షిని చంపేసి కామాంధురాలపై ఈ కొత్తమొగుడితో కులుకుతున్నావా?

కులవినాశినీ! ఎంత మహాపాపం చేశావు? కులటలా ప్రవర్తించావు. నువ్వు చేసిన ఈ మహాపాపసముద్రంలో

నేనేకాదు ఇక్ష్వాకు వంశమంతా మునిగిపోయింది. ఈ సుందరాకారుడు కనపడుతున్నాడు. చ్యవమడి

అలికిడి ఎక్కడాలేదు.

సుకన్యాదేవి ఒక్కసారి పెద్దపెట్టున నవ్వేసింది. తల్లిదండ్రుల కుడిఎడమ చేతుల్ని తన ఎడమ

కుడిచేతులతో పట్టుకుంది. నవ్వుతూనే ఆశ్రమంలోపలికి నడిపించుకు వచ్చింది. నాన్నా! ఈయనే మీ

అల్లుడు. చ్యవనమహర్షి. అనుమానించవలసింది ఏమీలేదు. ఇది పచ్చి నిజం. అశ్వినీదేవతలు అనుగ్రహించి

వీరికి ఈ దివ్యరూపం ప్రసాదించారు. తండ్రీ! నేను నీ కూతుర్నికానా? పాపం చేస్తానని ఎలా అనుకున్నావు?

బహుశ వీరి రూపం నిన్ను భ్రమ పెట్టి ఉంటుంది. భార్గవ వంశోద్భవుడైన ఈ చ్యవనమహర్షికి నమస్కరించు.

అడుగు. జరిగినదంతా వారే చెబుతారు అని అర్ఘ్యపాద్యాలు తేవడం కోసం పర్ణశాలలోకి వెళ్ళింది.

ధన్వంతరి జయంతి..!!

 🙏నేడు ధన్వంతరి జయంతి..!!


🌿ధన్వంతరి నారాయణాంశ సంభూతుడు. మానవజాతికి చికిత్సా విధానాన్ని అనుగ్రహించిన ఆదివైద్యుడు. 


🌸శ్రీభాగవతం సహా వివిధ పురాణాల్లో ధన్వంతరి ప్రస్తావన ఉంది. అనేక ప్రాంతాల్లో ఆ ఆరోగ్యప్రదాతకు గుడికట్టి పూజిస్తున్నారు. అందులో ఒకటి తెలుగు నేల మీదా ఉంది.


🌷జన్మవృత్తం🌷


🌿ఒకవైపు దేవతలూ మరోవైపు రాక్షసులూ - క్షీరసాగర మథనం జరుగుతోంది. కల్పవృక్షం, కామధేనువు, లక్ష్మీదేవి, ఆ వరుసలో పదకొండవవాడిగా పాలకడలిలోంచి స్ఫురద్రూపి అయిన ఓ పురుషుడు ఉద్భవించారు.


🌸పెద్దపెద్ద కళ్లూ, ఒత్తయిన కేశాలూ, అంతెత్తు ఆకారం, చిరుదరహాసం తో ఉన్న ఆ రూపాన్ని ముక్కోటి దేవతలూ రెప్పవాల్చకుండా చూశారు.


🌿అతను పీతాంబరాన్ని కట్టుకున్నాడు, మణికుండలాలు ధరించాడు, మెడలో దివ్యమాల మెరిసిపోతోంది. ఓ చేతిలో అమృతభాండం ఉంది.


🌸మరో చేతిలో వనమూలికలున్నాయి. అచ్చంగా శ్రీమన్నారాయణుడిలా ఉన్నాడు - కాదుకాదు, సాక్షాత్తూ నారాయణుడి అంశే! బ్రహ్మాదులు అతనికి "ధన్వంతరి" అని నామకరణం చేశారు.


🌿ధన్వంతరి అంటే మనసుకు పట్టిన జాడ్యాల్నీ, శరీరానికి ముసురుకున్న వ్యాధుల్నీ తొలగించేవాడని అర్థం. పురాణాల ప్రకారం ధన్వంతరి ఆరోగ్యానికి అధిపతి. 


🌸పరిపూర్ణ ఆయువు కోసం ఘనంగా ధన్వంతరీ వ్రతం చేయడం ప్రాచీన సంప్రదాయం. ధనత్రయోదశినాడు లక్ష్మీదేవితో పాటూ ధన్వంతరినీ పూజిస్తారు. 


🌿ఏటా ధన్వంతరి జయంతిని సముద్ర తీరంలోనో స్వగృహంలోనో వైద్యశాలలోనో కలశాన్ని స్థాపించి పురాణాంతర్గతమైన ధన్వంతరి మహామంత్రాన్ని పఠించి  వైద్యులకూ సంపూర్ణ ఆరోగ్యవంతులకూ తాంబూలాలు ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. పెసర పులగాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం.


🌷పురాణ గాథలు…🌷


🌸ఓసారి, దుర్వాస మహాముని శాపం కారణంగా ముక్కోటి దేవతలూ అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితి లో ధన్వంతరి అరుదైన వనమూలికలతో చికిత్సలు చేసి అమరుల్ని ఆరోగ్యవంతుల్ని చేశాడని ఐతిహ్యం.


🌿ధన్వంతరి ప్రస్తావన ఒక్కో పురాణంలో ఒక్కోలా కనిపిస్తుంది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ధన్వంతరి సూర్యనారాయణుడి ప్రియశిష్యుడు. ఆయన దగ్గరే ఆయుర్వేదం నేర్చుకున్నాడు. 


🌸విష్ణుమూర్తి ఆదేశం ప్రకారం ద్వితీయ ద్వాపర యుగంలో కాశీ రాజ్యాన్ని పాలించిన చంద్రవంశ రాజు ధన్వనృపాలుడి కొడుకుగా అవతరించిన ధన్వంతరి ఆయుర్వేదాన్ని శాస్త్రంగా మలిచి శుశ్రుతుడితో సహా ఎంతోమందికి బోధించాడనీ అనేక సంవత్సరాల పాలన తర్వాత తిరిగి దైవత్వాన్ని పొందాడనీ పురాణాలు పేర్కొంటున్నాయి.


🌿ఆయుర్వేద వైద్యులకు ధన్వంతరే తొలిదైవం. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ధన్వంతరి ఆలయాలున్నాయి. అందులో ఒకటి తెలుగు గడ్డమీదా ఉంది.


🌷చింతలూరులో - ధన్వంతరి స్వామి ఆలయం..🌷


🌸తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని చింతలూరు గ్రామంలో ధన్వంతరి స్వామి ఆలయం ఉంది. గౌతమీ తీరాన, పచ్చని పంటపొలాల మధ్య, సుమారు రెండెకరాల సువిశాల ఆవరణలో స్వామివారు కొలువుదీరి ఉన్నారు.


🌿ఆలయంలో అడుగు పెట్టినంత మాత్రానే సమస్త రోగాలూ నయమైపోతాయని భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణంలో ఎత్తయిన ధ్వజస్తంభం కనిపిస్తుంది. 


🌸విశాలమైన ముఖ మండపం ఉంది. గర్భాలయంలో ధన్వంతరి దివ్య మంగళరూపం దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. కాశీలో ఏకశిలతో మలచిన పాలరాతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు.


🌿నాలుగు హస్తాలతో ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో అమృతకలశం, ఒక చేతిలో జలగతో స్వామి దర్శనమిస్తాడు. ప్రాచీన ఆయుర్వేదంలో జలగ చికిత్స ఓ భాగం. 


🌸చెడురక్తాన్ని పీల్చుకునే శక్తి ఉందా జీవికి. చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం వ్యవస్థాపకులు ద్విభాష్యం వెంకటేశ్వర్లు 1942లో ఈ ఆలయాన్ని నిర్మించారు.


🌿పూజాదికాలకు ఏ లోటూ లేకుండా శాశ్వత ప్రాతిపదికన గ్రామంలోనే పద్దెనిమిది ఎకరాల భూమిని కేటాయించారు. ఆయన వంశీకులైన ద్విభాష్యం వెంకట శ్రీరామమూర్తి చలువరాతితో సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. 


🌸ఈ గుడి రాజమండ్రి నుంచి 35 కిలో మీటర్లు దూరంలో ఉంది. ఏటా కార్తిక బహుళ త్రయోదశినాడు ధన్వంతరి జయంతిని వైభవంగా నిర్వహిస్తారు.


🌷ఇతర ప్రాంతాల్లో…🌷


🌿తమిళనాడులోని సుప్రసిద్ధ వైష్ణవక్షేత్రం శ్రీరంగం. అక్కడున్న రంగనాథ స్వామి ఆలయంలో ధన్వంతరి ఉపాలయం ఉంది. ఏ గుడిలో అయినా తీర్థంగా అభిషేక జలం ఇస్తారు. మహా అయితే, పంచామృతం పోస్తారు.


🌸ఇక్కడ మాత్రం వనమూలికలతో కూడిన కషాయాన్ని ఇస్తారు. ఆ తీర్థాన్ని తీసుకుంటే మొండివ్యాధులు సైతం మటుమాయమైపోతాయని ఓ నమ్మకం. కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయ ఆవరణలోనూ ఆ ఆరోగ్యదేవుడి విగ్రహం ఉంది.


🌿కేరళలోని గురువాయూర్ సమీపంలో కూడా ధన్వంతరి ఆలయాన్ని నిర్మించారు. కొత్తగా ఆయుర్వేద వైద్యవృత్తిని చేపట్టేవారు ముందుగా స్వామిని దర్శించుకుని పూజాదికాలు నిర్వహించడం ఇక్కడి సంప్రదాయం.

🌸కాలికట్ దగ్గర్లోనూ ఓ ధన్వంతరి క్షేత్రం ఉంది. వేపనూ, పసుపునూ మానవాళికి పరిచయం చేసిన ఘనత కూడా ధన్వంతరిదేనంటారు. శస్త్రచికిత్స విధానాన్ని శుశ్రుతాదులకు బోధించిన ఆదివైద్య గురువూ ఆయనేనంటారు..


🌹ఓం నమామి ధన్వంతరమాది దేవమ్!...


🙏 శ్రీ ధన్వంతరీ అష్టోత్తర శతనామావళి...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌹శ్రీధన్వంతరీ అష్టోత్తర శతనామావళి


ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

ఓం ధన్వంతరయే అమృత కలశ హస్తాయ నమః

ఓం సర్వామాయ నాశనాయ నమః

ఓం త్రిలోక్యనాధాయ నమః

ఓం శ్రీ మహా విష్ణవే నమః

ఓం ధన్వంతరయే నమః

ఓం ఆదిదేవాయ నమః

ఓం సురాసురవందితాయ నమః

ఓం వయస్తూపకాయ నమః


ఓం సర్వామయధ్వంశ నాయ నమః 

ఓం భయాపహాయై నమః

ఓం మృత్యుంజయాయ నమః

ఓం వివిధౌధధాత్రే నమః

ఓం సర్వేశ్వరాయ నమః

ఓం శంఖచక్ర ధరాయ నమః

ఓం అమృత కలశ హస్తాయ నమః

ఓం శల్య తంత్ర విశారదాయ నమః

ఓం దివ్యౌషధధరాయ   నమః

ఓం కరుణామృతసాగారాయ నమః


ఓం సుఖ కారాయ నమః

ఓం శస్త్రక్రియా కుశలాయ  నమః

ఓం దీరాయ నమః

ఓం త్రీహాయ నమః

ఓం శుభ దాయ నమః

ఓం మహా దయాళవే నమః

ఓం సాంగాగతవేదవేద్యాయ నమః

ఓం భిషక్తమాయ నమః

ఓం ప్రాణదాయ నమః

ఓం ఆర్తత్రాణపరాయణాయ నమః


ఓం ఆయుర్వేదప్రచారాయ నమః

ఓం అష్టాంగయోగనిపుణాయ నమః

ఓం జగదుద్ధారకాయ నమః

ఓం హనూత్తమాయ నమః

ఓం సర్వజ్ఞాయై నమః

ఓం విష్ణవే నమః

ఓం సమానాధి వర్జితాయ నమః

ఓం సర్వప్రాణీసుకృతే నమః

ఓం సర్వ మంగళకారాయ నమః

ఓం సర్వార్ధదాత్రేయ నమః


ఓం మహామేధావినే నమః

ఓం అమృతతాయ నమః

ఓం సత్యాసంధాయ నమః

ఓం ఆశ్రిత జనవత్సలాయ నమః

ఓం అమృత వపుషే నమః

ఓం పురాణ నిలయాయ నమః

ఓం పుండరీకాక్షాయ నమః

ఓం ప్రాణ జీవనాయ నమః

ఓం జన్మమృత్యుజరాధికాయ నమః

ఓం సాధ్గతిప్రదాయి నమః


ఓం మహాత్సాహాయై నమః

ఓం సమస్త భక్త సుఖ ధాత్రేయ నమః

ఓం సహిష్ణవే నమః

ఓం శుద్ధాయ నమః

ఓం సమాత్మనే నమః

ఓం వైద్య రత్నాయ నమః

ఓం అమృత్యవే నమః

ఓం మహాగురవే నమః

ఓం అమృతాంశోద్భవాయై నమః

ఓం క్షేమకృతే నమః

ఓం వంశవర్దరాయ నమః


ఓం వీత భయాయ నమః

ఓం ప్రాణప్రదే నమః

ఓం క్షీరాబ్ధిజన్మనే నమః

ఓం చంద్రసహోదరాయ నమః

ఓం సర్వలోక వందితాయ నమః

ఓం పరబ్రహ్మనే నమః

ఓం యజ్ఞబోగీధరేనయ నమః

ఓం పుణ్య శ్లోకాయ నమః

ఓం పూజ్య పాదాయ నమః

ఓం సనాతన తమాయ నమః


ఓం స్వస్థితాయే నమః

ఓం దీర్ఘాయుష్కారాకాయ నమః

ఓం పురాణ పురుషోత్తమాయ నమః

ఓం అమరప్రభవే నమః

ఓం అమృతాయ నమః

ఓం ఔషదాయ నమః

ఓం సర్వానుకూలాయ నమః

ఓం శోకనాశనాయ నమః

ఓం లోకబంధవే  నమః

ఓం నానారోగార్తిపంజనాయ నమః


ఓం ప్రజానాంజీవ హేతవే నమః

ఓం ప్రజారక్షణ దీక్షితాయ నమః

ఓం శుక్ల వాసనే నమః

ఓం పురుషార్ధ ప్రదాయ నమః

ఓం ప్రశాంతాత్మనే నమః

ఓం భక్త సర్వార్ధ ప్రదాత్రేనయ నమః

ఓం మహైశ్వర్యాయ నమః

ఓం రోగాశల్యహృదయే నమః

ఓం చతుర్భుజాయ నమః

ఓం నవరత్నభుజాయ నమః


ఓం నిస్సీమమహిమ్నే నమః

ఓం గోవిందానాంపతయే నమః

ఓం తిలోదాసాయ నమః

ఓం ప్రాణాచార్యాయ నమః

ఓం బీష్మణయే నమః

ఓం త్రైలోక్యనాధాయ నమః

ఓం భక్తిగమ్యాయ నమః

ఓం తేజోనిధయే నమః

ఓం కాలకాలాయ నమః

ఓం పరమార్ధ గురవే నమః


ఓం జగదానందకారకాయ నమః

ఓం ఆది వైద్యాయ నమః

ఓం శ్రీరంగనిలయాయ నమః

ఓం సర్వజన సేవితాయ నమః

ఓం లక్ష్మీ పతయే నమః

ఓం సర్వలోక రక్షకాయ నమః

ఓం కావేరిస్నాత సంతుష్టయ నమః

ఓం సర్వాభీష్టప్రదాయవిభూషితాయే నమః


ఇతి శ్రీ ధన్వంతరీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం..


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

*రాశి ఫలితాలు 11-11-2023

 *11-11-2023*

*స్థిర వాసరః శని వారం*

*రాశి ఫలితాలు*

*మేషం*

చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నూతన వస్తు,వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.

*వృషభం*

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.  సోదరులతో  భూవివాదాలు కలుగుతాయి.  బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారమున కొన్ని నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి. ఉద్యోగాలలో  అదనపు పనిభారం తప్పదు. 

*మిధునం*

కుటుంబ వ్యవహారాలలో కీలక  నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి  ఒప్పందాలు చేసుకుంటారు.  దూరపు బంధువుల నుండి  అరుదైన  ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

*కర్కాటకం*

సన్నిహితుల నుండి ఆర్థిక ఒత్తిడి  పెరుగుతుంది.  ఇంటా బయట  గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.  అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు  నిరుత్సాహ పరుస్తాయి.

*సింహం*

ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా  పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది  సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభలా బాటలో పయనిస్తాయి.  ఉద్యోగమున అధికారులతో వివాదాలు రాజీ అవుతాయి.

*కన్య*

రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది . ఆత్మీయులతో గృహమున  సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి స్వంత  నిర్ణయాలు అమలు చేసి  లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తుల పనితీరుకు  అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

*తుల*

పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. బంధు  మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. నిరుద్యోగ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం అందదు.

*వృశ్చికం*

చేపట్టిన పనులు శ్రమాధిక్యాత తో కానీ పూర్తి కావు.  కొన్ని విషయాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. భూ సంబంధిత వివాదాలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన వ్యాపారాలు ప్రారంబానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది. 

*ధనస్సు*

సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ  కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. చేపట్టిన  వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుతాయి. 

*మకరం*

సంతాన విద్యా విషయాలపై  ద్రుష్టి సారిస్తారు. రాజకీయ వర్గాల ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో  శ్రమకు తగిన ఫలితం పొందుతారు. భూ సంభందిత క్రయ విక్రయాల లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.

*కుంభం*

ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గవరోదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు  మందగిస్తాయి  ఉద్యోగ వాతావరణం చికాకు కలిగిస్తుంది.

*మీనం*

కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది.  చేపట్టిన పనులులో  వ్యయప్రయాసలు అధికమౌతాయి. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగములు సామాన్యంగా సాగుతాయి.

🕉️

చంద్రమోహన్.. ఇక లేరు .

 🚩🚩-చంద్రమోహన్.. ఇక లేరు .



♦️మనం  మెచ్చిన   ఒక ఉన్నత నటుడు   ఇకలేరు...

 ఈ రోజు ఉదయం   మరణించారు.


జననం మల్లంపల్లి చంద్రశేఖర రావు [1]

1942 మే 23

పమిడిముక్కల, కృష్ణా జిల్లా, భారత్

మరణం 2023 నవంబరు 11 (వయసు 82)

హైదరాబాదు

విద్య బి. ఎస్. సి, బాపట్ల వ్యవసాయ కళాశాల


జీవిత భాగస్వామి జలంధర

పిల్లలు ఇద్దరు కుమార్తెలు

తల్లిదండ్రులు 

మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి (తండ్రి)

శాంభవి (తల్లి)

బంధువులు శివలెంక కృష్ణప్రసాద్ (మేనల్లుడు)

పురస్కారాలు నంది అవార్డు

చంద్రమోహన్ (1942 మే 23 - 2023 నవంబరు 11) గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. కథానాయకుడిగా 175 పైగా, మొత్తం 932 సినిమాల్లో నటించాడు.[2] 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుండి సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.


క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపథంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు -  ఆశ్వీయుజ మాసం - కృష్ణ పక్షం  -  త్రయోదశి - చిత్ర -‌ స్థిర వాసరే* (11.11.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/eA9gj672k_M?si=72qxxT3dXXohKTE8



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*