శుభోదయం🙏
సుభాషితం!
చ: తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితి నంచు గర్వితమతిన్ జరియించితి దొల్లి, యిప్పుడు
జ్జ్వల మతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై,
తెలియని వాడనై మెలగితిన్ గతమయ్యె నితాంత గర్వమున్;
భర్తృహరి -అను: ఏనుగు లక్ష్మణకవి;
తెలివి గలవానికి, లేనివానికీ గలతేడా లను మహర్షి భర్తృహరి నిరూపిస్తున్నాడు. తెలివి లేనంతకాలం( అజ్ఙానావస్థలో) నేనే మహాండితుడనని విర్ర వీగాను. నాఅదృష్టవశాన పండిత సాహచర్యంలో కొంచెంగా పాండిత్యం కలిగింది.
యిప్పుడు నాకు అసలు విషయంతెలిసింది? యేమని? నాకేమీ రాదని. నేను అజ్ఙానినని. అంతే గతంలో నాకున్న అంతులేని గర్వం అణగి పోయింది. వినయం అబ్బింది! అంటున్నాడు కవి.
నిజమైన విద్యావంతు డెప్పుడూ గర్వపడడు. వినయంతో ఉంటాడు. యితరులను తక్కువజేసి యెప్పుడునూ మాటతూలడు. గర్వపడటం పండితుల యెడ తిరస్కారం., అజ్ఙానానికి నిదర్శనాలు!🙏🙏🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌟🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి