7, సెప్టెంబర్ 2020, సోమవారం

అనేకత్వం నుంచి ఏకత్వంలోకి...




మనం ఈ లోకంలోకి ఎందుకొచ్చామని ప్రశ్నించుకుంటే- ఎవరినుంచీ ఏ మార్గంలోనూ సమాధానం దొరకదు... ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో తప్ఫ జీవితం రూపంలో లభ్యమైన ఇంత అమూల్యమైన ప్రయాణాన్ని ఇంత అర్థంలేని, ఇంత చవిలేని, ఇంత నిరర్థకమైన గమ్యం కోసమే చేశామని అర్థమై, వచ్చిన దారివైపు, ఆ చివర మొదలు పెట్టిన స్థానంవైపు చూస్తే- ఎంత అనాలోచితంగా, ఇంత అలవోకగా చేశామేమిటని... మన అజ్ఞానానికి మనమే సిగ్గుపడతాం.

ఒక పనిని లేదా కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు తగినదాన్ని ఎన్నుకునే అవకాశం చాలావరకు మనకుంది. అల్లాటప్పా పని కాకుండా అమూల్యమైనదాన్ని, మన శ్రమకు తగిన ఫలితం ఇవ్వగలిగేదాన్ని ఎన్నుకోవాలి. మానవ జన్మ మనం ఎన్నుకున్నది కాకపోయినా (నిజానికి లోతుగా ఆలోచిస్తే అది మనం ఎన్నుకున్నదే. కర్మ ఫలాల ఫలితంగా)- దాన్ని ఎలా జీవించాలనే విషయం, దేనికి ఉపయోగించుకోవాలనే విషయం, నిర్ణయం మన మేధా పరిధిలోనే ఉంది. అంత మంచి వెసులుబాటును మనం సవ్యంగా వినియోగించుకోలేకపోతే మనకంటే మూర్ఖులు మరెవరూ ఉండరు.

ఈ లోకంలో లాభనష్టాలు, గెలుపోటముల ప్రసక్తి లేనిది కేవలం ఆధ్యాత్మిక రంగం మాత్రమే. ఒకే ఒక సంకల్పం, ఏకసూత్రం... స్వస్థానాన్ని, శాశ్వత ధామాన్ని చేరుకోవడం. పరమాత్మ పాదాల చెంత నిర్వికల్ప విశ్రాంతిని, శాశ్వత ఉపశాంతిని పొందడం. మార్గం ఒకటే అయినా మార్గమధ్యాన్ని నిరాటంకం, కంటకరహితం చేసుకోవలసి ఉంది. మలుపులు, మారు మార్గాంతరాలు లేకపోయినా మన మనసు చేసిన మార్గ నిర్దేశాన్ని అనుసరిస్తూనే మన అడుగు వేయబోయే మన ముందరి భాగాన్ని ప్రయాణ సౌలభ్యంగా మలచుకోవలసి ఉంది. దాని ఉద్దేశం- రేపటి ప్రయాణికులకు సానుకూలం చేయడం కూడా అయిఉండాలి. ప్రతి మానవ ప్రయత్నానికీ అందరి శ్రేయస్సు కూడా లక్ష్యమై ఉండాలి. ఇదే మానవ జీవన ప్రయాణ ఉద్దేశం, భగవన్నిర్దేశం కూడా.

ఒక మహావృక్షం నాజూకు తీగల అల్లికను ఆహ్వానిస్తుంది. పూలు పూయనిస్తుంది. ఒక చీమల పుట్ట పాముల వసతికి అంగీకరిస్తుంది. ఒక కాకి కోకిల పిల్లకు పొత్తిలి పరుస్తుంది. ప్రకృతి సదా సర్వదా ‘పరోపకార ప్రకృతి’తోనే తన ఉనికిని పరిపూర్ణం చేసుకుంటుంది... అదీ అత్యంత సహజంగా. మనిషి ఎందుకు అసహజ జీవనాన్ని ఎన్నుకున్నాడు? అనుక్షణం ప్రకృతితోనే జీవిస్తూ, ప్రకృతి సహకారాన్నే పొందుతూ ప్రయోజనాల విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఏకమాత్రంగా, ఏకసూత్రంగా, కళ్లు మూసుకుని ఆ అంధకార సహకారంతో తానొక్కడినే అనే భ్రమను తనకు తానే కల్పించుకుని స్వార్థంతో జీవిస్తున్నాడు. నిజానికి తాను ఆత్మనని తెలుసుకునేవరకు- తాను ఒక్కడు కాదు, అనేకం, అనేకానేకం. తాను ఆత్మనని గ్రహించిన క్షణమైతే... ప్రతి అణువూ తానే. శ్రీరామకృష్ణులు అలాంటి ఆత్మభావంతో లయమైనప్పుడే పరమహంస కాగలిగారు. అయితే ముందుగా అనేకత్వాన్ని అంగీకరించి సాధనా పూర్వక క్రమ పరిణామంలో, అనేకత్వాన్ని ఏకత్వ స్థాయిలోకి మలచుకున్నప్పుడు, మమేకమైనప్పుడు మాత్రమే అటువంటి అనుభూతి, పరివర్తన, స్థితి... సుసాధ్యం!

సమస్య

🏇🏽:-
పద్యమ్మును పాతి పెట్టు వారలకు నతుల్.*
~~~~~~~
పూరణ:-
భోగయగారి చన్ద్రశేఖర శర్మ
~~~~~~~~~
కందం:-
*******
పద్యము వినినను, వ్రాసిన
సద్యశమందును సతతము జననుతులందున్
హృద్యముగా జనహృదయములో
పద్యమ్మును పాతిపెట్టు వారలకు నతుల్.*
౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿

బాల్య స్నేహితుడు

...👬🏻👭🏻🧍🏻

తాడేపల్లిగూడెం పెళ్లికి వచ్చాం...ఊళ్ళో ఊర్వశి థియేటర్లో ఎన్టీఆర్ "రాముడు భీముడు" సినిమా ఆడుతోంది.

మా ఆవిడ సినిమాకి వెళదామంటే.. సరే అని వెళ్ళాం.

టికెట్స్ తీసుకొని లోపలికి వెళుతుంటే..
ఎంట్రన్స్ డోర్ దగ్గర టికెట్స్ చింపుతూ ఉన్న గోపి గాడు నన్ను గుర్తు పట్టాడు. పలకరించుకున్నాక, మా ఆవిడకి పరిచయం చేశాను. నిడదవోలులో ఇంటర్లో క్లాస్మెట్ అని..!

హాల్లో కూర్చున్నాక అడిగింది.. "అదేమిటండి మీ క్లాస్మెట్ అంటున్నారు.....ఇలా గేట్ దగ్గర టికెట్స్ చింపే ఉద్యోగంతో పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషిస్తాడో కదా పాపం.." అంది.

"ఏమో చదువు అయ్యాక, ఇప్పుడే గదా కలిసింది" అన్నాను.

వాడిల్లు చిన్నప్పుడు మా వీధిలోనే...చాలా అల్లరి వెధవ....సినిమాల పిచ్చి ఎక్కువ...ప్రతి రోజు పేపర్ తిరగెయ్యటం, ఏ సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందో చూడటం...

ప్రతీ సినిమా రిలీజ్ రోజే ఉదయం ఆట చూసేయ్యటం...సినిమా హాల్స్ కేబిన్ దగ్గరకి వెళ్ళి తెగి పోయిన ఫిల్మ్ ముక్కలు ఏరు కోవటం..ఇదే పని.

అప్పుడప్పుడు వాడి డబ్బులుతో నేల టిక్కెట్ కి నన్ను కూడా తీసుకెళ్లేవాడు...
"ఎందుకురా" అంటే..
"ఒక్కడిని అయితే బెంచ్ టికెట్ తీసుకునేవాడిని.. నువ్వూ వస్తే 2నేల టికెట్స్..అంతే గదరా.."
అనేవాడు నవ్వుతూ ఆప్యాయంగా...!

"మా పెద్దోళ్ళు, వాడితో తిరిగితే ఎక్కడ చెడి పోతామో అని వాడితో ఆడనిచ్చే వారు కాదు.
చివరకు వాళ్ళు చెప్పినట్టే, వీడు లైఫ్ లో ఎదుగు బొదుగు లేకుండా ఇలా తగలడ్డాడు" అన్నాను.

"మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను చాలా మంచోడులా ఉన్నాడు....లేపోతే మిమ్మల్ని తన డబ్బులతో సినిమాలకి ఎందుకు తీసుకెళుతాడు..
అయినా మీరు మటుకు చేసేది ఏమైనా పెద్ద ఉద్యోగమా ఏంటి....ఇప్పటి వరకు కనీసం ఓ స్కూటర్ కూడా కొనలేదు" అంటూ దెప్పింది.

నాకు ఉక్రోషం వచ్చి "ఎలా చూసినా వాడికంటే బెటరే కదా" అన్నాను.

ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చిన..ఆ కుర్రోడికి డబ్బులు ఇవ్వబోతుంటే.. "వద్దు సార్" అని వెళ్లి పోయాడు.

ఇదంతా గమనిస్తున్న మా ఆవిడ.. "నిజంగా మీ ఫ్రెండ్ మంచోడు అండీ..మీరే సరిగ్గా పలకరించ లేదు..పోజు కొడుతూ మాట్లాడారు." అన్నది.

"కాదులే...వాడి పొజిషన్ ఇప్పుడు బాగా లేదు కదా.. నేను కాస్త ఆప్యాయంగా మాట్లాడాననుకో...రేపు ఎప్పుడైనా అప్పు అడిగితే...అదో తలనొప్పి మళ్లీ..!" అన్నాను సాలోచనగా.

*అతను ఏ పొజిషన్ లో ఉన్నా.. బాల్య స్నేహితుడు బాల్య స్నేహితుడే..!* అంది.

"కనీసం కూల్ డ్రింక్స్ పంపినందుకైనా వెళ్ళేటప్పుడు థాంక్స్ చెప్పండి" అంది నిశ్చయంగా..

సినిమా అయిపోయింది..

మా ఆవిడ పోరు పడలేక..ఎంట్రన్స్ దగ్గర సిబ్బందిని, వాడి గురించి వాకబు చేస్తే...అతను పై ఫ్లోర్ లోని ఒక రూమ్ లోకి తీసుకెళ్లాడు.

పెద్ద ఎయిర్ కండిషనింగ్ రూమ్...ఒక సోఫాలో గోపి గాడు కూర్చుని ఉంటే....హాల్ మేనేజర్ ఆరోజు కలెక్షన్స్ లెక్కలు చెబుతున్నాడు...ఎదురుగా డిస్ట్రిబ్యూటర్ తాలూకు వాళ్ళు అనుకుంట...మేము లోపలికి వెళ్లగానే...లేచి బయటకు వెళ్లిపోయారు.

గోపి గాడు మమ్మల్ని చూడగానే రారా.. రారా.. అంటూ ఇద్దర్ని కూర్చో బెట్టి, కాఫీ తెప్పించాడు. ఇదంతా ఆశ్చర్యంగా పరికించి చూస్తున్న నాకు అప్పుడు అర్థమైంది ఆ సినిమా హాలు వాడిదేనని.!

మొదట్లో 16mm ప్రొజెక్టర్ తో ఊర్లలో పండగలకి పబ్బాలకి సినిమాలాడించి, ఈ స్టేజీకి ఎదిగాడుట. ఇంకా ఏలూరులో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందట. కొత్త సినిమాలు జిల్లాల వారిగా కొంటాడుట..! అలా తను ఎదిగిన క్రమాన్ని చెప్పుకొచ్చాడు.

"ఎలా వచ్చార్రా.." అని అడిగితే..
"రిక్షాలో" అని చెప్పా.

డ్రైవర్ని పిలిచి, వద్దన్నా వినకుండా తన కారులో మమ్మల్ని ఇంటి వద్ద దింపేసి రమ్మన్నాడు.

దారిలో మా ఆవిడ.. "ఇలా ఇంకెప్పుడూ, ఎవర్నీ తక్కువ అంచనా వేయకండి....ముఖ్యంగా చిన్ననాటి మిత్రులను..." అంది చిరు కోపంగా.!!

(శ్రీ ఆచంట సుబ్రహ్మణ్యం గారి రచన ఇది)

👉మాట : *మన కళ్ళకు కనబడేవన్నీ నిజాలు కాదు...మనం చేసేదే మంచి పని కాదు...మనం సంపాదించినదే ఎక్కువ కాదు...ఎదుటివాడిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించు...వాడు మన కన్నా గొప్పవాడే..* 👈

ఋగ్వేదం లోని

జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః

ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే (అనగా శిసువుకి జన్మతః జ్ఞానం అనేది అసహజం).వేదం నేర్చిన వారే విప్రులు,బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం.
అదేవిధంగా "వేద విధులతో సంచరించక,దేవతలను పూజించక,వివేకములు లేక,కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో
పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు. శూద్రులే అగుదురు.

వినుమా! వేంకటేశ



కోరగ నిన్ను మోక్షమిడ గొంతెమ కోరికగా హసించెదో
కోరగలేదొ మిన్ను పయి కోకనద ప్రియుఁ జేకొనంగ నా
డా రఘురామ బాలకునివై! మఱి నేనును బాలకుండనే
నీరజనేత్ర నీకు! నిడ నీవిధి కాదొకొ వేంకటేశ్వరా!

(శ్రీ కవితా ప్రసాద్ విరచిత "వినుమా!వేంకటేశ!" ద్విశతకము నుంచి)

శ్రీరామాయణం vs మహాభారతం vs భాగవతం

#
1) మనం ఎలా జీవించాలి? - శ్రీరామాయణం చెబుతుంది
2) మనం ఎలా జీవిస్తున్నాం? - మహాభారతం చెబుతుంది
3) మనం ఏ విధంగా జీవిస్తున్నా, తప్పుల నుండి ఎలా నేర్చుకోవాలి - భక్తి మరియు మోక్షం ఎలా పొందాలో - భాగవతం చెబుతుంది

1) శ్రీ రామాయణం మార్గం చూపిస్తుంది
2) మహాభారతం మార్గం సరిదిద్దుతుంది
3) భాగవతం మార్గం సుగమం చేస్తుంది.

చిన్న వయస్సులో - మహాభారతం వినాలి -
కౌరవులు & పాండవుల కథ మనకు అర్థమవుతుంది. చెడు అలవాట్ల పాఠాలు విన్న తర్వాత మనల్ని మనం సరిదిద్దుకుంటాము.

మధ్య వయసులో - శ్రీరామాయణం వినాలి.
రావణుడు ఎలా చెడిపోయాడో మనకు అర్థమవుతుంది. రావణుడు వేదాలు నేర్చుకున్న పండితుడు అయినప్పటికీ చంపబడ్డాడు, అవతలి వ్యక్తి భార్యను కోరుకుంటాడు.

వృద్ధాప్యంలో- భాగవతం వినాలి.
శ్రీకృష్ణ లీలలు వినడం వల్ల మనము దేవునిపై దృష్టి పెట్టగలుగుతాము.వెన్న దొంగ కథలు మనకు శాంతిని, ఆనందాన్ని ఇస్తాయి. భాగవతం అటువంటి అద్భుతమైనది.

వీఆర్వో వ్యవస్థ రద్దు

వీఆర్వో వ్యవస్థ రద్దు!..కొత్త రెవెన్యూ యాక్ట్​ రెడీ

ఇతర శాఖల్లోకి వీఆర్వోల విలీనం!
కొత్త రెవెన్యూ యాక్ట్​ రెడీ
ల్యాండ్ మేనేజ్ మెంట్​ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్​గా పేరు!
ఈ అసెంబ్లీ సమావేశాల్లో పెట్టనున్న ప్రభుత్వం

కొత్త రెవెన్యూ యాక్ట్​ రెడీ అయింది. దీనికి  ‘ల్యాండ్  మేనేజ్​మెంట్​ అండ్​ అడ్మినిస్ట్రేషన్​ యాక్ట్ ’గా పేరు పెట్టినట్లు తెలిసింది. దీని బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. తొలుత చట్టంగా తీసుకురావాలా.. లేక.. రెవెన్యూ కోడ్​గా తీసుకురావాలా అనే అంశంపై కొద్ది రోజులుగా తీవ్ర చర్చ జరిగింది. అయితే చట్టం చేయడానికి అసెంబ్లీ ఆమోదం ఉంటే సరిపోతుంది. కానీ రెవెన్యూ  కోడ్​కు మాత్రం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి కావడంతో చట్టానికే ప్రభుత్వం మొగ్గు చూపింది. రెవెన్యూ శాఖలో మార్పుపై కొన్నాళ్లుగా సభల్లో, అసెంబ్లీలో తరుచూ మాట్లాడుతున్న సీఎం కేసీఆర్.. ​ మొదట్లో రెవెన్యూ కోడ్​ ను తీసుకురావాలని భావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లోనూ అప్పటి సీఎం చంద్రబాబు 1999లో ఇలాంటి ప్రయత్నం చేశారు. అప్పటికే ఉన్న 191 చట్టాలను ఒక చోట చేర్చి ఆంధ్రప్రదేశ్‌‌ భూమి రెవెన్యూ కోడ్‌‌–1999 పేరుతో రూపొందించారు. ఇందులో 17 భాగాలు, 47 అధ్యాయాలు, 260 సెక్షన్లను పొందుపరిచారు. అసెంబ్లీలో ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపగా.. కేంద్ర న్యాయ శాఖ 146 ప్రశ్నలతో తిప్పి పంపింది. దీంతో కోడ్‌‌ ఆచరణ రూపం దాల్చలేదు. ఇప్పుడు కూడా కోడ్​ తీసుకొచ్చినా మళ్లీ అదే పరిస్థితి ఏర్పడడమో లేదంటే ఆలస్యం కావడమో జరిగే అవకాశముందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చేందుకు మొగ్గు చూపినట్లు తెలిసింది.  ఇందులో అవినీతికి ఆస్కారం లేకుండా సులభంగా నిమిషాల్లో మ్యుటేషన్ చేయడం, అక్కడికక్కడే పాస్​ బుక్కులు  జారీ చేయడమే ప్రధానాంశాలుగా పెట్టుకున్నట్లు తెలిసింది.

ఫస్లీ– 1317  నుంచి కొత్త చట్టంగా..!
తెలంగాణలో భూచట్టాలకు 113 ఏండ్ల చరిత్ర ఉంది. నిజాం రాష్ట్రంలో 1907లో ‘ఫస్లీ–1317’ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ ఫస్లీ – 1317 చట్టమే ఇప్పటివరకు అమల్లోకి వచ్చిన అన్ని భూచట్టాలకు ఆధారంగా ఉంది. అన్ని చట్టాలు, భాగాలు, చాప్టర్లు, సెక్షన్లు కలిపి ఈ చట్టం ఉండేది. భూ పరిపాలనకు సంబంధించి అప్పటివరకు ఇదే సమగ్ర చట్టం. హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర ప్రదేశ్​ విలీనం తర్వాత  భూపరిపాలన, కౌలుదారులు, రైతుల  హక్కులు, భూసేకరణ, పంపిణీకి సంబంధించి ఇలా ఒక్కో అంశంపై ఒక్కో యాక్ట్​ రూపొందించారు. లేదంటే చట్టంలోనే రూల్స్​, కండిషన్స్​ను సబ్‌‌ సెక్షన్లుగా విడగొట్టారు. ఇలా చేస్తూ వచ్చిన చట్టాలు, జీవోలు కలిపితే వాటి  సంఖ్య 124కు చేరింది. వీటన్నింటి స్థానంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకురాబోతుంది. ఈ చట్టానికి ల్యాండ్ మేనేజ్​మెంట్​ అండ్​ అడ్మినిస్ట్రేషన్​ యాక్ట్​ గా నామకరణం చేసినట్లు తెలిసింది.
రెవెన్యూ శాఖలో వీఆర్వోల వ్యవస్థ రద్దు ఖాయమైపోయింది. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రికార్డులన్నీ డిజిటలైజ్​ చేయడం, కాస్తు కాలమ్​ తొలగించడంతో భూపరిపాలనలో ఇక వారి అవసరం లేదని ప్రభుత్వం భావించినట్లు తెలిసింది. వీఆర్వోలను ఇతర శాఖల్లో విలీనం చేయనున్నారు. వారందరికీ జూనియర్ అసిస్టెంట్​ క్యాడర్​లో పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. వీఆర్వో వ్యవస్థ రద్దుపై సీఎం  కేసీఆర్​ అసెంబ్లీలో రెవెన్యూ యాక్ట్​ ప్రవేశపెట్టే సందర్భంగా స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముందని రెవెన్యూ సంఘాల నేత ఒకరు చెప్పారు.

ఒక వాట్సాప్ మెసేజ్ ఆధారంగా

నటరాజుముద్రలే

నాట్యంబుజేయంగ నటరాజుముద్రలే
       సరిదిద్దుకొనజాలు గరితయామె
గానంబుసాగింప వాణియేవీణనే
       శ్రుతిలయల్ సరిదిద్దు సుదతియామె
నాయకిగ నటింప నాయకులే తల
        వంచగా జేసెడు వనితయామె
పలుకుముచ్చటదోప పదపాళిభాషణో
         చ్చారణల్ గావించు చానయామె

కథల దర్శకిబాధ్యతార్ఘ్యత్వమందు
సంస్కృతిని గాచుధైర్యానసాగునుడుల
అగ్రతాంబూలమందినయనదయైన
భానుమతియె సార్థకనామభాగ్యవతియ.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

శివాపరాధ క్షమాపణ స్తోత్రమ్



ఆదౌ కర్మప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం
విణ్మూత్రామేధ్యమధ్యే క్కథయతి నితరాం
 జాఠరో జాతవేదాః |
యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం
శక్యతే కేన వక్తుం
క్షన్తవ్యో మేఽపరాధః
 శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో
||1||

బాల్యే దుఃఖాతి రేకాన్మలలులితవపుః స్తన్యపానే పిపాసా
నో శక్తశ్చేన్ద్రియేభ్యో భవ గుణ జనితా
 జన్తవో మాం తుదన్తి |
నానారోగాదిదుఃఖాదుదన పరవశః శంకరం న స్మరామి
 క్షన్తవ్యో మేఽపరాధః
 శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో
|| 2 ||

ప్రౌఢోఽహం యౌవనస్థో విషయవిషధరైః పంచభిర్మర్మసన్ధౌ
దష్టో నష్టోఽవివేకః సుతధన యువతి
స్వాదుసౌఖ్యే నిషణ్ణః |
శైవీ చిన్తావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం
క్షన్తవ్యో మేఽపరాధః
 శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో
|| ౩||

వార్ధక్యే చేన్ద్రియాణాం విగతగతిమతిశ్చాధి
దైవాది తాపైః
పాపైర్రోగైర్వియోగై-స్త్వనవ సితవపుః ప్రౌఢిహీనం చ దీనమ్ |
మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో
||4 ||

నో శక్యం స్మార్తకర్మ ప్రతిపదగహనప్రత్యవాయాకులాఖ్యం
శ్రౌతే వార్తా కథం మే ద్విజకులవిహితే బ్రహ్మమార్గే సుసారే |
జ్ఞాతో ధర్మో విచారైః శ్రవణమననయోః కిం నిదిధ్యాసితవ్యం
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో
|| 5 ||

స్నాత్వా ప్రత్యూషకాలే స్నపనవిధివిధౌ నాహృతం గాంగతోయం
పూజార్థం
వా కదాచిద్వహు-తరగహనాత్ఖణ్డబిల్వీదలాని |
నానీతా పద్మమాలా సరసి వికసితా గన్ధపుష్పైస్త్వదర్థం
 క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో
|| 6 ||

దుగ్ధైర్మధ్వాజ్య యుక్తైర్దధిసితసహితైః స్నాపితం నైవ లింగం
నో లిప్తం చన్దనాద్యైః కనక విరచితైః పూజితం న ప్రసూనైః |
ధూపైః కర్పూరదీపైర్వివిధరసయుతైనైవ భక్ష్యోపహారైః
 క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో
|| 7||

ధ్యాత్వా చిత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో
హవ్యం తే లక్షసంఖ్యైర్హుతవహవదనే నార్పితం బీజమన్త్రైః |
నో తప్తం గాంగతీరే వ్రతజపనియమై రుద్రజాప్యైర్న వేదైః
 క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో
|| 8 ||

స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయమరుత్కుణ్డలే సూక్ష్మమార్గే
శాన్తే స్వాన్తే ప్రలీనే ప్రకటితబిభవే జ్యోతిరూపేఽపరాఖ్యే |
లింగజ్ఞే బ్రహ్మవాక్యే సకలతనుగతం శంకరం న స్మరామి
 క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో
||9 ||

నగ్నో నిఃసంగశుద్ధస్త్రిగుణవిరహితో ధ్వస్తమోహాన్ధకారో
 నాసాగ్రే న్యస్తద్రుష్టిర్విదితభవగుణో నైవ ద్రుష్టః కదాచిత్ |
ఉన్మన్యాఽవస్థయా త్వాం విగతకలిమలం శంకరం న స్మరామి
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో
|| 10 ||

చన్ద్రోద్భాసితశేఖరే స్మరహరే గంగాధరే శంకరే
 సర్పైర్భూషిత కణ్ఠకర్ణవివరే నేత్రోత్థవైశ్వానరే |
 దన్తిత్వక్కౄతసున్దరాంబరధరే త్రైలోక్యసారే హరే
  మోక్షార్థం కురు చితవృత్తిమఖిలామన్యైస్తు కిం కర్మభిః
|| 11 ||

కిం వాఽనేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన
కిం కిం వా పుత్రకళత్ర-మిత్రపశుభిర్దేహేన గేహేన కిమ్
జ్ఞాత్వైతత్క్షణభఙ్గురం సపదిరే త్యాజ్యం మనో దూరతః
స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీవల్లభమ్
|| 12 ||

ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం
ప్రాత్యాయాన్తి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం
 తస్మాన్మాం శరణాగతం శరణద త్వం రక్ష రక్షాధునా
|| 13 ||

కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణనయనజం వా మానసం వాఽపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో
|| 13 ||

ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం శివాపరాధక్షమాపణ స్తోత్రం సంపూర్ణమ్ ||

సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయచ |
అఘోరాయచ ఘోరాయ శ్రీ మహాదేవాయ మంగళం ||

బ్రేకింగ్ న్యూస్.



భారతదేశంలో భారతీయులు మాత్రమే న్యూస్ చానల్స్ కానీ మీడియా హౌసులు కాని నడపాలని

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టు లో వేసిన PIL ఫలితంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.

నిజానికి భారత దేశంలో పని చేస్తున్న ఎక్కువ న్యూస్ చానల్స్ మీడియా హౌసులు నడుపుతున్నది సౌదీ అరేబియా,ఇటలీ,అమేరికా, దుబాయ్ నాగరీకులు. తత్ఫలితంగా ఈ వీడియో హౌసులు , న్యూస్ చానల్స్ భారత జాత్యాభిమానానికి వ్యతిరేకంగా ఆయా యజమానులు చెప్పినట్లు ఆడుతూ ఉన్నాయి.
ఇది దేశ స్వాతంత్య్రానికి దేశం స్వాభిమానానికి ,ఐక్యతకు దెబ్బ తీస్తూ ఉంది.

భారత దేశంలో ఉన్న ప్రెస్ మీడియా లు విదేశీ పెట్టుబడుల తొ నడుస్తున్న వే అందులో కొన్ని మీ ముందుకు తేస్తున్నమ్....

NDTV: ఈ చానెల్ కి స్పెయిన్ దేశానికి చెందిన గాస్పెల్ ఆఫ్ చారిటీ సంస్థ నుండి పెద్ద మొత్తంలో విరాళాలు సమకూరుతాయి. ఈ చానెల్ వామపక్ష భావాలకి ఎక్కువ ప్రాదాన్యతనిస్తుంది. ఈ చానెల్ కి పాకిస్తాన్ పై కూడా కాస్త ప్రేమ ఉంది. ఎందుకంటే గతంలో పాక్ అధ్యక్షుడు తనదేశంలో కార్యక్రమాలు నిర్వహించుకోడానికి ఈ చానెల్ కి అనుమతినిచ్చేడు. ఇక NDTV సి.ఇ.ఒ. ప్రణయ్ రాయ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ కి తోడల్లుడు. అంటే ప్రకాశ్ కారత్ సతీమణి బృందా కారత్, ప్రణయ్ రాయ్ భార్య అక్కచెల్లెళ్ళు. ఇంక చెప్పేదేముంది?

India Today: ఈ పత్రికకు NDTV అండదండలు బాగా ఉన్నాయి. హిందుత్వంపై విద్వేషం వెదజల్లడం అంటే ఈ పత్రికకి భలే సరదా.

CNN-IBN: ఈ చానెల్ కి వంద శాతం విరాళాలు సదరన్ బాప్టిస్ట్ చర్చి సమకూరుస్తుంది. దీని కేంద్ర కార్యాలయం అమెరికాలో ఉంది. ప్రపంచమంతటా ఈ చానెల్ కి బ్రాంచ్ లు ఉన్నాయి. సదరన్ బాప్టిస్ట్ చర్చి ఈ చానెల్ ద్వారా తన కార్యక్రమాల కోసమే ఏటా 800 మిలియన్ల డాలర్లు ఖర్చు పెడుతుంది. రాజ్ దీప సర్దేశాయ్ భారతదేశంలో ఈ చానెల్ హెడ్.

Times group list: టైమ్స్ ఆఫ్ ఇండియా, మిడ్ డే, నవభారత్ టైమ్స్, స్టార్డస్ట్, ఫెమినా, విజయ్ టైమ్స్, విజయ్ కర్నాటక, టైమ్స్ నౌ (ఇది 24 గంటల వార్తా చానెల్ ) ... ఇలా చాలా ఉన్నాయి ఈ గ్రూపులో. ఈ గ్రూపుకు బెన్నెట్ & కోల్ మాన్ లు స్వంతదారులు. ఈ చానెల్ కి 80 శాతం నిధులు వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ సమకూరుస్తుంది. మిగతా 20 శాతం నిధులు బ్రిటన్, ఇటలీ దేశాలకు చెందిన వారి నుండి సమకూరుతాయి. వీరిలో ఇటలీకి చెందిన ఇటాలియన్ రోబర్షియో మిండో అనే వాడు సోనియా గాంధీకి బంధువు.

Star TV: ఈ చానెల్ ని నిర్వహిస్తున్నది ఒక ఆస్ట్రేలియన్. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో గల సెయింట్ పీటర్స్ పోంటిఫీషియల్ చర్చి ఈ చానెల్ కి నిధులను సమకూరుస్తుంది.

Hindustan Times: ఇది గతంలో బిర్లా గ్రూపు ఆధీనంలో ఉండేది. తరువాత శోభనా భారతీయ ఆధీనంలోకి వెళ్ళింది. ప్రస్తుతం ఇది టైమ్స్ గ్రూపుతో కలిసి పనిచేస్తోంది.

The Hindu: ఇది 125 సంవత్సరాలకు పైగా మనదేశంలో ప్రచురితమౌతున్న ఆంగ్ల దినపత్రిక. ఈ పత్రిక సంపాదకుడు ఎన్. రామ్ భార్య స్విట్జర్లాండ్ దేశీయురాలు. ఈ మధ్యనే ఈ పత్రికను స్విట్జర్లాండుకు చెందిన జాషువా సొసైటీ స్వాధీనం చేసుకుంది.

Indian Express: స్వర్గీయ రామనాథ్ గోయెంకా నేతృత్వంలో పత్రికా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలబడిన ఈ పత్రిక ఆయన తరువాత రెండు ముక్కలైంది. అవి The Indian Express (Northern edition) మరియు The New Indian Express (southern edition). వీటిలో The Indian Express లో ACTS క్రిస్టియన్ మిషనరీలకు ప్రధాన భాగస్వామ్యం ఉంది.

ఆంద్రజ్యోతి: హైదరాబాదులోని పచ్చి మతతత్వ పార్టీ అయిన మజ్లిస్ పార్టీ, ఒక మాజీ కాంగ్రెస్ మంత్రి కలిసి ఈ పతికను కోనేసుకున్నారు.

The Statesman: ఇది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) నియంత్రణలో ఉంది.

Kairali TV: ఇది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్ట్) నియంత్రణలో ఉంది.

మాతృభూమి: ముస్లిం లీగ్ నాయకులూ, కమ్యూనిస్టు నాయకులూ ఈ పత్రికలో ప్రధాన పెట్టుబడిదారులు.

ఏసియన్ ఏజ్ మరియు దక్కన్ క్రానికల్: ఇవి సౌదీ అరేబియాలోని ఒక కంపెనీ నియంత్రణలో ఉంది.

Tehelka.com: ఇది తరుణ్ తేజపాల్ ఆధిపత్యంలో ఉంది. ఈయన గారికి తరచుగా అరబ్ దేశాల నుండి బ్లాంక్ చెక్ వస్తుంది. ఈ వెబ్ సైట్ ముఖ్య ఉద్దేశ్యం హిందువులను, హిందూ సంస్థల నాయకత్వాన్ని ఎండగట్టడమే.

సుప్రీంకోర్టు కనుక డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారికి అనుకూలంగా స్పందిస్తే A B P, Aajtak ,NDTv లాంటి చాలా చానెల్స్ మూతపడవలసిందే. ఈ చానెళ్ళకు వెన్నులో చలి పుడుతున్నా ఈ విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ లో చేప్పలేకపోతుండడం గమనించాలి.

మనదేశంలో ప్రెస్సు, మీడియా ఎవరి చెప్పు చేతుల్లో ఉన్నాయో తెలిసిందిగా. ఇక వాటిల్లో ఎలాంటి పక్షపాత ధోరణితో కూడిన వార్తలు వస్తాయో మనందరికీ అనుభవమే కదా.

ఒక్క ఉదాహరణ చూద్దాం.

2002లో గుజరాత్ లో గోద్రా స్టేషన్లో సబర్మతీ ఎక్స్ ప్రెస్ దహనం, ఆ తరువాత జరిగిన కల్లోలాలు అందరికీ తెలిసినవే. అప్పుడు రాజదీప్ సర్దేసాయ్, భర్ఖా దత్ NDTVలో పని చేస్తున్నారు. NDTV తరఫున ముస్లిం బాధితుల వివరాలు మాత్రమే సేకరించి, ప్రసారం చెయ్యడానికి సౌదీ అరేబియా నుండి సర్దేసాయ్, భర్ఖా దత్ లకు ఐదు మిలియన్ల డాలర్ల డబ్బు ఈనాముగా ముట్టజెప్పబడింది. వాళ్ళు కూడా తమకు అప్పజెప్పబడిన పనిని అత్యంత విస్వసనీయతతో చేసారు. ఆ గుజరాత్ అల్లర్లకు సంబంధించి NDTV లో ఏ ఒక్క హిందూ బాధితుని వివరాలు, ఇంటర్వ్యూ ప్రసారం కాలేదు. సమర్మటీ ఎక్స్ ప్రెస్ లో సజీవంగా దహనమైన హిందువుల గురించి ఎంత మంది రిపోర్ట్ చేసినా NDTV మాత్రం ప్రసారం చేయలేదు.

దయచేసి ఈ వ్యాసాన్ని చుసినా వెంటనే షేర్ చెయ్యడి

అలానే ఈ చానల్స్ నిజస్వరూపం తెలియక చాలామంది
హిందువులు ఇలాంటి చానల్స్ ని చూస్తున్నారు

తప్పనిసరి షేర్ చెయ్యడి .......

భారత్ టుడే (తెలుగు )చానెల్ని మాత్రం తప్పకుండ చుడండి .......

ఇట్లు మీ భారతీయుడు

*భాగవతామృతం*


ఏకవింశతి అవతారములు

1-63-వ.వచనము
అది సకలావతారంబులకు మొదలి గని యైన శ్రీమన్నారాయణ దేవుని విరాజమానం బయిన దివ్యరూపంబు; దానిం బరమ యోగీంద్రులు దర్శింతురు; అప్పరమేశ్వరు నాభీకమలంబువలన సృష్టికర్తలలోన శ్రేష్ఠుండైన బ్రహ్మ యుదయించె; నతని యవయవస్థానంబుల యందు లోకవిస్తారంబులు గల్పింపంబడియె; మొదల నద్దేవుండు కౌమారాఖ్య సర్గంబు నాశ్రయించి బ్రహ్మణ్యుండై దుశ్చరంబైన బ్రహ్మచర్యంబున చరియించె; రెండవ మాఱు జగజ్జననంబుకొఱకు రసాతలగత యయిన భూమి నెత్తుచు యజ్ఞేశుండయి వరాహదేహంబుఁ దాల్చె; మూడవ తోయంబున నారదుం డను దేవర్షియై కర్మనిర్మోచకంబైన వైష్ణవతంత్రంబు సెప్పె; నాలవ పరి ధర్మభార్యా సర్గంబు నందు నరనారాయణాభిధానుం డై దుష్కరంబైన తపంబు సేసెఁ; బంచమావతారంబునం గపిలుం డను సిద్ధేశుం డయి యాసురి యను బ్రాహ్మణునకుఁ దత్త్వ గ్రామ నిర్ణయంబు గల సాంఖ్యంబు నుపదేశించె; నాఱవ శరీరంబున ననసూయాదేవి యందు నత్రిమహామునికిం గుమారుండై యలర్కునికిఁ బ్రహ్లాద ముఖ్యులకు నాత్మవిద్యఁ దెలిపె; నేడవ విగ్రహంబున నాకూతి యందు రుచికి జన్మించి,యజ్ఞుం డనఁ ప్రకాశమానుండై యామాది దేవతల తోడం గూడి, స్వాయంభువమన్వంతరంబు రక్షించె; అష్టమ మూర్తిని మేరుదేవి యందు నాభికి జన్మించి యురుక్రముం డనం బ్రసిద్ధుండై విద్వజ్జనులకుఁ బరమహంస మార్గంబుం బ్రకటించె; ఋషులచేతఁ గోరంబడి; తొమ్మిదవ జన్మంబునఁ బృథుచక్రవర్తియై భూమిని ధేనువుం జేసి సమస్త వస్తువులం బిదికె; చాక్షుష మన్వంతర సంప్లవంబున దశమం బైన మీనావతారంబు నొంది మహీరూపం బగు నావ నెక్కించి వైవస్వతమనువు నుద్ధరించె; సముద్ర మథన కాలంబునం బదునొకొండవ మాఱు కమఠాకృతిని మందరాచలంబుఁ దన పృష్ఠకర్పరంబున నేర్పరియై నిలిపె; ధన్వంతరి యను పండ్రెండవ తనువున సురాసుర మధ్యమాన క్షీరపాథోధి మధ్య భాగంబున నమృత కలశ హస్తుండై వెడలెఁ; బదమూఁడవది యయిన మోహినీ వేషంబున నసురుల మోహితులం జేసి సురల నమృతాహారులం గావించెఁ; బదునాలుగవది యైన నరసింహరూపంబునం గనకకశిపుని సంహరించెఁ; బదునేనవది యైన కపట వామనావతారంబున బలిని బదత్రయంబు యాచించి మూఁడులోకంబుల నాక్రమించెఁ; బదునాఱువది యైన భార్గవరామాకృతిని గుపితభావంబుఁ దాల్చి బ్రాహ్మణ ద్రోహు లయిన రాజుల నిరువదియొక్క మాఱు వధియించి భూమి నిఃక్షత్త్రంబు గావించె; బదునేడవది యైన వ్యాస గాత్రంబున నల్పమతు లయిన పురుషులం గరుణించి వేదవృక్షంబునకు శాఖ లేర్పఱచెఁ; బదునెనిమిదవ దైన రామాభిధానంబున దేవకార్యార్థంబు రాజత్వంబు నొంది సముద్రనిగ్రహాది పరాక్రమంబు లాచరించె; నేకోనవింశతి వింశతితమంబు లైన రామకృష్ణ రూపంబులచే యదువంశంబు నందు సంభవించి; విశ్వంభరా భారంబు నివారించె; నేకవింశతితమం బైన బుద్ధనామధేయంబునం గలియు గాద్యవసరంబున రాక్షస సమ్మోహనంబుకొఱకు మధ్యగయా ప్రదేశంబున జినసుతుండయి దేజరిల్లు; యుగసంధి యందు వసుంధరాధీశులు చోరప్రాయులై సంచరింప విష్ణుయశుం డను విప్రునికిఁ గల్కి యను పేర నుద్భవింపంగలం" డని; యిట్లనియె.
అది = అది {ఈవిధముగనుండే రూపము}; సకల = అన్ని; అవతారంబులు = అవతారములు; కున్ = కు; మొదలిగని = మూలవిరాట్టు; ఐన = అయినటువంటి; శ్రీమన్నారాయణదేవుని = శ్రీమన్నారాయణుని {శ్రీమన్నారాయణదేవుడు - అత్యంత శుభకరమైన నారాయణు డగు దేవుడు}; విరాజమానంబు = విశేషముగ ప్రకాశించుచున్నది; అయిన = అయిన; దివ్య = దివ్యమైన; రూపంబు = రూపము; దానిన్ = దానిని; పరమ = గొప్ప; యోగి = యోగులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; దర్శింతురు = దర్శించెదరు; ఆ = ఆ యొక్క; పరమేశ్వరు = భగవంతుని; నాభీ = బొడ్డు; కమలంబు = కమలము; వలనన్ = నుండి; సృష్టికర్తల = సృష్టికర్త లందరి; లోనన్ = లోను; శ్రేష్ఠుండైన = ఆద్యుడైన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఉదయించె = పుట్టెను; అతని = అతని యొక్క; అవయవ = అవయవముల; స్థానంబులు = స్థానముల; అందున్ = లో; లోక = లోకముల యొక్క; విస్తారంబులు = విస్తరణలు; కల్పింప బడియెన్ = పుట్టింప బడినవి; మొదలన్ = మొదట(1); ఆ = ఆ యొక్క; దేవుండు = దేవుడు (ఆదినారాయణమూర్తి); కౌమార = కౌమార {కౌమార ఆఖ్యలు - సనకుడు, సనందనుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు}; ఆఖ్య = అను పేరుగల; సర్గంబున్ = సృష్టి (సంఘము) నందు; ఆశ్రయించి = అవతరించి; బ్రహ్మణ్యుండు = బ్రాహ్మణ హితుడు; ఐ = అయి; దుశ్చరంబు = ఆచరించుటకు మిక్కిలి కష్టమైనది; ఐన = అయినటువంటి; బ్రహ్మచర్యంబునన్ = బ్రహ్మచర్యమున; చరియించె = నడిచెను; రెండవ = రెండవ(2); మాఱు = సారి; జగత్ = జగత్తులయొక్క; జననంబు = పుట్టుక; కొఱకున్ = కోసము; రసాతల = రసాతలమున; గత = ఇమిడినది; అయిన = అయిన; భూమిని = భూమండలమును; ఎత్తుచున్ = ఉద్దరిస్తూ; యజ్ఞేశుండు = యజ్ఞమునకు అధిపతి; అయి = అయి; వరాహ = వరాహ; దేహంబున్ = రూపమును; తాల్చెన్ = ధరించెను; మూడవ = మూడవ(3); తోయంబునన్ = సారి; నారదుండు = నారదుడు; అను = అను పేర; దేవర్షి = దేవలోకఋషి; ఐ = అయి; కర్మ = కర్మబంధాలను; నిర్మోచకంబు = విడిపించగలిగినవి; ఐన = అయిన; వైష్ణవ = విష్ణుమూర్తి ఆరాధనమనే; తంత్రంబు = తంత్రము / సిద్ధాంతమును; సెప్పెన్ = చెప్పెను; నాలవ = నాల్గవ(4); పరి = సారి; ధర్మ = ధర్ముడు; భార్యా = (అతని) భార్యల; సర్గంబునందు = సృష్టి యందు / కలయిక యందు; నరనారాయణ = నరనారాయణులనే; అభిధానుండు = పేర్లు గలవాడు; ఐ = అయి; దుష్కరంబైన = చేయుటకు మిక్కిలి కష్టమైన; తపంబు = తపస్సు; చేసెన్ = చేసెను; పంచమ = ఐదవ(5); అవతారంబునన్ = అవతారములో; కపిలుండు = కపిలుడు; అను = అనే; సిద్ధేశుండు = సిద్ధులలో శ్రేష్ఠుడు; అయి = అయి; ఆసురి = ఆసురి; అను = అను; బ్రాహ్మణు = బ్రాహ్మణున; కున్ = కు; తత్త్వ = తత్త్వముల {తత్త్వములు - ప్రకృతి మహత్తాదు లిరువదినాల్గు}; గ్రామ = సమూహము యొక్క; నిర్ణయంబు = నిర్ణయము; కల = కలిగినటువంటి; సాంఖ్యంబున్ = సాంఖ్యమును {సాంఖ్యము – తత్త్వదర్శనములలో నొకటి}; ఉపదేశించెన్ = ఉపదేశించెను; ఆఱవ = ఆరవ(6); శరీరంబున = అవతారమున; అనసూయాదేవి = అనసూయాదేవి; అందున్ = వలన; అత్రిమహాముని = అత్రిమహాముని; కిన్ = కిని; కుమారుండు = పుత్రుడు; ఐ = అయి; అలర్కుని = అలర్కున; కిన్ = కును; ప్రహ్లాద = ప్రహ్లాద; ముఖ్యులు = మొదలగు ముఖ్యమైనవారల; కున్ = కు; ఆత్మవిద్యన్ = ఆత్మవిద్యను; తెలిపెన్ = తెలియజేసెను; ఏడవ = ఏడవ(7); విగ్రహంబునన్ = అవతారమున; ఆకూతి = ఆకూతి; అందున్ = కిని; రుచి = రుచి; కిన్ = కిని; జన్మించి = పుట్టి; యజ్ఞుండు = యజ్ఞుడు; అనన్ = అనబడుతూ; ప్రకాశమానుండు = అవతరించినవాడు; ఐ = అయి; యామ = యామ {యామ - కాలవిభాగమైన యామమును నిర్ణయించినవాడు}; ఆది = మొదలైన; దేవతలన్ = దేవతలను; కూడి = కలిసి; స్వాయంభువ = స్వాయంభువు డనే; మన్వంతరంబున్ = మనువు కాలములో; రక్షించె = (సృష్టిని) రక్షించెను; అష్టమ = ఎనిమిదవ(8); మూర్తిని = అవతారమునందు; మేరుదేవి = మేరుదేవి; అందున్ = కిని; నాభి = నాభి; కిన్ = కిని; జన్మించి = పుట్టి; ఉరుక్రముండు = ఉరుక్రముండు; అనన్ = అని; ప్రసిద్ధుండు = ప్రసిద్ధి పొందినవాడు; ఐ = అయి; విద్వజ్జనులు = పాండిత్యముగలవారల; కున్ = కు; పరమహంస = పరమహంస {పరమహంస - సర్వ పరిత్యాగము చేసి జ్ఞానమార్గమున చరించు వాడు}; మార్గంబున్ = మార్గమును; ప్రకటించెన్ = ఉపదేశించెను; ఋషుల = ఋషుల; చేతన్ = చేత; కోరంబడి = ప్రార్థింపబడి; తొమ్మిదవ = తొమ్మిదవ(9); జన్మంబునన్ = జన్మలో; పృథు = పృథుడనే; చక్రవర్తి = సార్వభౌముడు; ఐ = అయి; భూమిని = భూమండలమును; ధేనువున్ = గోవుగా; చేసి = చేసి; సమస్త = సమస్తమైన; వస్తువులన్ = వస్తువులను; పిదికెన్ = పిదికెను; చాక్షుష = చాక్షుష అనే {చాక్షుషుడను మనువు కాలం కనుక చాక్షుష}; మన్వంతర = మన్వంతరంలో {మన్వంతరము - మనువు పరిపాలన కాలము}; సంప్లవంబునన్ = జలప్రళయమున; దశమంబు = పదవది(10); అయిన = అయినటువంటి; మీన = మీనముగా; అవతారంబు = అవతారమును; ఒంది = పొంది; మహీ = భూమియొక్క; రూపంబగు = రూపముగల; నావన్ = ఓడను; ఎక్కించి = ఎక్కించి; వైవస్వత = వైవస్వతుడనే; మనువున్ = మనువును; ఉద్ధరించెన్ = ఉద్ధరించెను; సముద్ర = సాగరము; మథన = మథించబడిన (చిలికే); కాలంబునన్ = కాలమున; పదునొకొండవ = పదుకొండవ(11); మాఱు = సారి; కమఠ = కూర్మ; ఆకృతిని = అవతారములో; మందరాచలంబున్ = మందరపర్వతమును; తన = తనయొక్క; పృష్ఠ = వీపుపైనుండే; కర్పరంబున = వెన్నుచిప్పమీద; నేర్పరి = నేర్పుగలవాడు; ఐ = అయి; నిలిపెన్ = నిలిపెను; ధన్వంతరి = ధన్వంతరి; అను = అను; పండ్రెండవ = పండ్రెండవ(12); తనువునన్ = అవతారములో; సుర = దేవతలచేతను; అసుర = రాక్షసులచేతను; మధ్యమాన = మధింపబడుచున్న; క్షీరపాథోధి = పాలసముద్రముయొక్క; మధ్యభాగంబునన్ = మధ్యభాగములో; అమృత = అమృతము నిండిన; కలశ = బిందె / కలశము; హస్తుండు = హస్తమున ధరియించినవాడు; ఐ = అయి; వెడలెన్ = ఉద్భవించెను; పదమూఁడవది = పదమాడవది(13); అయిన = అయినట్టి; మోహినీ = మోహినీ; వేషంబునన్ = అవతారములో; అసురుల = రాక్షసులను; మోహితులన్ = మోహితులుగా; చేసి = చేసి; సురలన్ = దేవతలను; అమృత = అమృతమును; ఆహారులన్ = భుజించినవారిగా; కావించెన్ = చేసెను; పదునాలుగవది = పద్నాలుగవది(14); ఐన = అయినట్టి; నరసింహ = నరసింహ; రూపంబునన్ = అవతారములో; కనకకశిపుని = హిరణ్యకశిపుని {హిరణ్యకశిపుడు - బంగారు వస్త్రము ధరించు వాడు}; సంహరించెన్ = రూపుమాపెను; పదునేనవది = పదిహేనవది(15); ఐన = అయినట్టి; కపట = మాయా; వామన = వామనుడు; అవతారంబునన్ = అవతారములో; బలినిన్ = బలి(చక్రవర్తి)ని; పద = అడుగులు; త్రయంబున్ = మూడు; యాచించి = దానముగా అడిగి; మూఁడు = మూడు; లోకంబులన్ = లోకములను; ఆక్రమించెన్ = ఆక్రమించెను; పదునాఱువది = పదహారవది(16); ఐన = అయినటువంటి; భార్గవరామ = పరశురామ {భార్గవుని కుమారుడు - పరశురామ}; ఆకృతినిన్ = అవతారములో; కుపితభావంబున్ = కోపాన్ని; తాల్చి = పొంది; బ్రాహ్మణ = బ్రాహ్మణులకు; ద్రోహులు = ద్రోహము చేసినవారు; అయిన = ఐనటువంటి; రాజులన్ = రాజులను; ఇరువదియొక్క = ఇరవై ఒక్క(21); మాఱు = సార్లు; వధియించి = సంహరించి; భూమిన్ = భూమిని; నిఃక్షత్త్రంబు = క్షత్రియులు లేనిస్థితి; కావించెన్ = కలుగ చేసెను; పదునేడవది = పదిహేడవది(17); ఐన = అయినట్టి; వ్యాస = వ్యాసుని; గాత్రంబునన్ = శరీరమున; అల్ప = మందమైన; మతులు = ప్రజ్ఞానము కలవారు; అయిన = అయినట్టి; పురుషులన్ = మానవులమీద; కరుణించి = దయచూపి; వేద = వేదమనే; వృక్షంబునకున్ = వృక్షమునకు; శాఖలు = శాఖలు {వేదమునకు - ఋక్ యజుస్ సామ అధర్వణ అని 4 శాఖలు}; ఏర్పఱచెన్ = ఏర్పాటుచేసెను; పదునెనిమిదవ = పద్దెనిమిదవది(18); ఐన = అయినట్టి; రామ = శ్రీరాముని; అభిధానంబునన్ = పేరుతో, అవతారముతో; దేవ = దేవతలయొక్క; కార్యార్థంబు = పనికొఱకు; రాజత్వంబున్ = రాజత్వమును {రాజత్వము - రాజు అను తత్వము}; ఒంది = స్వీకరించి; సముద్ర = సాగరమును; నిగ్రహ = నిగ్రహించుట; ఆది = మొదలైన; పరాక్రమంబులు = శౌర్యవంతము లైన పనులు; ఆచరించెన్ = చేసెను; ఏకోనవింశతి = పందొమ్మిదవది(19); వింశతితమంబు = ఇరువదవది(20); ఐన = అయినట్టి; రామ = బలరాముడు; కృష్ణ = శ్రీకృష్ణుడు; రూపంబుల = శరీరముల; చేన్ = తో; యదు = యాదవ; వంశంబు = కులము; అందున్ = లో; సంభవించి = అవతరించి; విశ్వంభర = భూదేవియొక్క; భారంబు = భారమును; నివారించెన్ = తప్పించెను; ఏకవింశతితమంబు = ఇరువదియొకటవ(21); ఐన = అయినట్టి; బుద్ధ = బుద్ధుడనే; నామధేయంబునన్ = పేరుతో; కలియుగ = కలియుగముయొక్క; ఆది = మొదలు; అవసరంబునన్ = అగు కాలంబున; రాక్షస = రాక్షసులను; సమ్మోహనంబు = మోహితులుగాచేయుట; కొఱకున్ = కోసము; మధ్యగయా = మధ్యగయ అను; ప్రదేశంబునన్ = స్థలములో; జిన = జినుడియొక్క; సుతుండు = పుత్రుడుగ; అయి = పుట్టి; తేజరిల్లున్ = ప్రకాశించు; యుగసంధి = యుగముల నడిమి కాలము (కలియుగం తరువాత, కృతయుగానికి ముందు); అందున్ = లో; వసుంధరాధీశులు = భూమిని పాలించువారు; చోరప్రాయులు = దొంగలు వంటివారు; ఐ = అయి; సంచరింపన్ = తిరుగుతుండగ; విష్ణుయశుండు = విష్ణుయశుడు; అను = అనే; విప్రుని = బ్రాహ్మణు; కిన్ = నకు; కల్కి = కల్కి; అను = అనే; పేరన్ = పేరుతో; ఉద్భవింపంగలండు = అవతరించును; అని = అని; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = చెప్పెను.
అది అన్ని అవతారాలకు మూలవిరాట్టయిన అదినారాయణుని దేదీప్యమానమైన దివ్యరూపం. ఆ దివ్యరూపాన్ని మహాత్ములైన యోగీంద్రులు దర్శిస్తారు. శ్రీమన్నారాయణ దేవుని నాభికమలం నుంచి సృష్టికర్తలలో ఆద్యుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. శ్రీహరి అవయవ స్థానాలనుంచి లోకాలు సమస్తము ఆవిర్భవించాయి.
1) ఆదినారాయణదేవుడు మొదట కౌమార మనే స్వర్గాన్ని ఆశ్రయించి సనకసనందనాది రూపాలతో కఠోరమైన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తు బ్రహ్మణ్యుడై చరించాడు.
2) రెండవసారి యజ్ఞవరాహదేహం ధరించి విశ్వసృష్టి నిమిత్తం రసాతలం నుంచి భుమండలాన్ని ఉద్ధరించాడు.
3) మూడవ పర్యాయం నారదు డనే దేవర్షిగా జన్మించి మోక్షదాయకమైన వైష్ణవధర్మాన్ని బోధించాడు.
4) నాలుగవ అవతారంలో ధర్ముడను వానికి మూర్తి యందు నరనారాయణ స్వరూపుడై ఆవిర్భవించి ఆత్మశాంతికోసం అపారమైన తపస్సు చేసాడు.
5) ఐదవ అవతారం కపిలావతారం. దేవహూతి కర్దములకు జనించి ఆసురి అనే బ్రాహ్మణునికి తత్త్వనిరూపకమైన సాంఖ్యాన్ని ఉపదేశించాడు.
6) ఆరవ అవతారంలో అత్రి అనసూయలకు దత్తాత్రేయుడై పుట్టి అలర్కుడు, ప్రహ్లాదుడు మొదలైవారికి ఆత్మవిద్య ప్రబోధించాడు.
7) ఏడవ పర్యాయం యజ్ఞుడనే నామంతో రుచికి, ఆకూతికి కుమారుడై, యమాది దేవతలతో స్వాయంభువ మన్వంతరాన్ని సంరక్షించాడు.
8) ఎనిమిదవ రూపంలో నాభికి మేరుదేవియందు ఉరుక్రముడను పేర ప్రభవించి పండితులకు పరమహంస మార్గాన్ని ప్రకటించాడు.
9) తొమ్మిదవ జన్మలో ఋషుల ప్రార్థన మన్నించి పృథుచక్రవర్తి యై భూదేవిని గోవు గావించి సర్వ ఓషధులను పిదికాడు.
10) పదవదైన మత్స్యావతారం దాల్చి చాక్షుష మన్వంతరంలో సంభవించిన జలప్రళయంలో నావపై నెక్కించి వైవస్వత మనువును కాపాడాడు.
11) పదకొండవ పర్యాయం కూర్మావతారం స్వీకరించి మున్నీటిలో మునగిపోతున్న మందరపర్వతాన్ని నేర్పుగా వీపుపై ధరించాడు.
12) పన్నెండవ అవతారంలో ధన్వంతరి యై దేవదానవులు మథిస్తున్న పాలసముద్రంలో నుంచి అమృతకలశం హస్తాన ధరించి సాక్షాత్కరించాడు.
13) పదమూడవ అవతారంలో మోహిని వేషంలో రాక్షసులను వంచించి దేవతలకు అమృతం పంచి పెట్టాడు.
14) పద్నాలుగవ సారి నరసింహమూర్తిగా అవచతరించి ధూర్తుడైన హిరణ్యకశిపుణ్ణి రూపుమాపాడు.
15) పదిహేనవ అవతారంలో మాయా వామనుడై బలిచక్రవర్తిని మూడడుగులు దానమడిగి ముల్లోకాలు ఆక్రమించాడు.
16) పదహారవమారు పరశురాముడై రౌద్రాకారంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజులను, ఇరవై ఒక్కమారు సంహరించి ధాత్రిని క్షత్రియహీనం కావించాడు.
17) పదిహేడవసారి వేదవ్యాసుడై అల్పప్రజ్ఞులైన వారికోసం వేదశాఖలను విస్తరింపజేశాడు.
18) పద్ధెనిమిదవ పర్యాయం శ్రీరాముడై సముద్రబంధనాది వీరకృత్యాలు ఆచరించి దేవకార్యం నిర్వర్తించాడు.
19) పందొమ్మిదవ అవతారంలో బలరాముడుగా,
20) ఇరవయ్యో అవతారంలో శ్రీకృష్ణుడుగా సంభవించి భూభారాన్ని హరించాడు.
21) ఇరవై ఒకటవసారి బుద్ధుడై మధ్య గయా ప్రదేశంలో తేజరిల్లి రాక్షసులను సమ్మోహపరచి ఓడిస్తాడు.
22) ఇరవై రెండవ పర్యాయం కల్కి రూపంతో విష్ణుయశుడనే విప్రునికి కుమారుడై జన్నించి కలియుగాంతంలో కలుషాత్ములైన రాజులను కఠినంగా శిక్షిస్తాడు అని పలికి సూతుడు ఇంకా ఇలా అన్నాడు.
1-64-మ.మత్తేభ విక్రీడితము

సరసిం బాసిన వేయు కాలువల యోజన్ విష్ణునం దైన శ్రీ
కర నానా ప్రకటావతారము లసంఖ్యాతంబు లుర్వీశులున్
సురలున్ బ్రాహ్మణసంయమీంద్రులు మహర్షుల్ విష్ణునంశాంశజుల్
హరి కృష్ణుండు బలానుజన్ముఁ డెడ లే; దా విష్ణుఁడౌ నేర్పడన్.
సరసిన్ = సరస్సు నుండి; పాసిన = వెలువడిన; వేయు = అనేకము లైన / వెయ్యి; కాలువల = కాలువల; యోజన్ = వలె; విష్ణుని = హరి; అందైన = నుండి ఉద్భవించిన; శ్రీకర = శుభములు కలిగించు; నానా = అనేక విధముల; ప్రకట = కనబడిన; అవతారములు = అవతారాలు; అసంఖ్యాతంబులు = లెక్కపెట్టలేనివి; ఉర్వీశులు = రాజులు {భూమి పతులు, రాజులు}; సురలున్ = దేవతలు; బ్రాహ్మణ = బ్రాహ్మణులు; సంయమ = జితేంద్రియులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; మహా = గొప్ప; ఋషుల్ = ఋషులు; విష్ణుని = హరియొక్క; అంశాంశ = సూక్ష్మఅంశలతో; అజులు = పుట్టిన వారు; హరి = హరి; కృష్ణుండు = కృష్ణుడు; బల = బలరామునికి; అనుజన్ముఁడు = తోబుట్టువు వలె; ఎడల లేదా = వచ్చాడు కదా; విష్ణుఁ డౌ = హరి యై; ఏర్పడన్ = ఉండగా.
ప్రపంచంలో సరస్సుల నుండి ఎన్నో కాలవలు వెలువడి ప్రవహిస్తూ ఉంటాయి; అలాగే శ్రీమన్నారాయణుని లోనుంచి విశ్వశ్రేయోదాయకములైన ఎన్నెన్నో అవతారాలు ప్రావిర్భవిస్తూ ఉంటాయి; రాజ్యాలేలేవాళ్ళు, దేవతలు, బ్రాహ్మణులు, బ్రహ్మర్షులు, మహర్షులు ఆ నారాయణుని సూక్ష్మ అంశలచే ఉద్భవించిన వారే; పూర్వం బలరామునిగా, అతని సోదరుడు శ్రీకృష్ణునిగా శ్రీమహావిష్ణువు తానే అవతరించాడు కదా.

1-65-క.కంద పద్యము

భగవంతుం డగు విష్ణుఁడు
జగముల కెవ్వేళ రాక్షసవ్యధ గలుగుం
దగ నవ్వేళలఁ దడయక
యుగయుగమునఁ బుట్టి కాచు నుద్యల్లీలన్.
భగవంతుండు = భగవంతుడు; అగు = అయిన; విష్ణుఁడు = హరి; జగములు = లోకములు; కు = కు; ఎవ్వేళ = ఏవేళ; రాక్షస = రాక్షసులవలన; వ్యధ = బాధ; కలుగున్ = కలుగుతుందో; తగన్ = తగినట్లుగ; ఆ = ఆ; వేళలన్ = సమయములలో; తడయక = ఆలస్యము చేయక; యుగయుగమునన్ = ప్రతియుగములోను; పుట్టి = ఉద్భవించి; కాచున్ = రక్షించును; ఉద్యత్ = యత్నమనే; లీలన్ = మాయతో.
ప్రతి యుగంలో రాకాసుల చేష్ఠలతో లోకాలు చీకాకుల పాలయ్యే సమయాలలో, భగవంతుడైన శ్రీమహావిష్ణువు విడువక తగిన అవతారాలు అవతరించి దుష్టుల శిక్షించి, శిష్టుల రక్షించి లోకాలను ఉద్ధరిస్తాడు.
1-66-ఆ.ఆటవెలది

అతిరహస్యమైన హరిజన్మ కథనంబు
మనుజుఁ డెవ్వఁ డేని మాపు రేపుఁ
జాల భక్తితోడఁ జదివిన సంసార
దుఃఖరాశిఁ బాసి తొలఁగిపోవు.
అతి = మిక్కిలి; రహస్యము = రహస్యము {రహస్యము - దాచుకొనదగ్గది}; ఐన = అయినట్టి; హరి = హరియొక్క; జన్మ = అవతారముల; కథనంబు = కథలు; మనుజుఁడు = మానవుడు; ఎవ్వఁడేని = ఎవరయిన; మాపు రేపున్ = రాత్రి+పగలు - అనునిత్యము; చాల = ఎక్కువ; భక్తి = భక్తి; తోడన్ = తో; చదివిన = పఠించినచో; సంసార = సంసారములోని; దుఃఖ = వ్యధల; రాశి = సమూహము; పాసి = దూరముగ; తొలఁగి = తొలగి; పోవున్ = పోవును.
అత్యంత రహస్య గాథలైన వాసుదేవుని అవతార గాథలు, ఏ మానవుడైతే ఉదయము సాయంకాలము అత్యంత శ్రద్ధాభక్తులతో నిత్యము పఠిస్తాడో, అతడు దుఃఖమయమైన సంసార బంధాలకు దూరంగా తొలగిపోయి ఆనందం అనుభవిస్తాడు.
1-67-వ.వచనము
వినుం డరూపుం డయి చిదాత్మకుం డయి పరఁగు జీవునికిం బరమేశ్వరు మాయాగుణంబు లైన మహదాది రూపంబులచేత నాత్మస్థానంబుగా స్థూలశరీరంబు విరచితం బైన, గగనంబు నందుఁ బవనాశ్రిత మేఘ సమూహంబును, గాలి యందుఁ బార్థివధూళిధూసరత్వంబును నేరీతి నారీతి ద్రష్ట యగు నాత్మ యందు దృశ్యత్వంబు బుద్ధిమంతులు గానివారిచేత నారోపింపంబడు నీ స్థూలరూపంబుకంటె నదృష్టగుణం బయి యశ్రుతం బైన వస్తు వగుటం జేసి వ్యక్తంబు గాక సూక్ష్మం బై కరచరణాదులు లేక జీవునికి నొండొక రూపంబు విరచితంబై యుండు; సూక్ష్ముఁ డయిన జీవునివలన నుత్క్రాంతి గమనాగమనంబులం బునర్జన్మంబు దోఁచు; నెప్పు డీ స్థూల సూక్ష్మ రూపంబులు రెండు స్వరూప సమ్యగ్జ్ఞానంబునఁ బ్రతిషేధింపఁ బడు; నపుడ నవిద్యం జేసి యాత్మను గల్పింపంబడు ననియుం దెలియు నప్పుడు జీవుండు బ్రహ్మ దర్శనంబున కధికారి యగు; దర్శనం బన జ్ఞానైక స్వరూపంబు; విశారదుం డైన యీశ్వరునిదై క్రీడించుచు నవిద్య యనంబడుచున్న మాయ యుపరతయై యెప్పుడు దాన విద్యారూపంబునం బరిణత యగు నప్పుడు జీవోపాధి యయిన స్థూలసూక్ష్మరూపంబు దహించి జీవుడు కాష్ఠంబు లేక తేజరిల్లు వహ్ని చందంబునం దాన యుపరతుం డయి బ్రహ్మస్వరూపంబునం బొంది పరమానందంబున విరాజమానుం డగు; ఇట్లు తత్త్వజ్ఞులు సెప్పుదు" రని సూతుం డిట్లనియె.
వినుండు = వినండి; అరూపుండు = రూపములేనివాడు; అయి = అయి; చిదాత్మకుండు = జ్ఞాని {చిదాత్మకుడు - చేతనా రూపమైన ఆత్మ కలవాడు / జ్ఞాని}; అయి = అయి; పరఁగు = ప్రవర్తిల్లు; జీవుని = జీవు; కిన్ = నకు; పరమేశ్వరు = పరమేశ్వరునియొక్క; మాయా = మాయతోకూడిన; గుణంబులు = గుణములు; ఐన = అయినట్టి; మహత్ = మహత్తు; ఆది = మొదలగు {మహత్త్వాదులు - మహత్తు, అహంకారము, పంచభూతములు, తన్మాత్రలు, పంచేంద్రియములు, అంతఃకరణములు. (వీటి సహాయముతోనే జీవులు ఉద్భవిస్తారు}; రూపంబుల = రూపముల; చేతన్ = చేత; ఆత్మస్థానంబుగాన్ = స్వస్థానముగా; స్థూల = భౌతికమైన; శరీరంబు = శరీరము; విరచితంబు = ఏర్పాటుచేయబడినది; ఐన = అయినట్టి; గగనంబునందున్ = ఆకాశమునందు; పవన = వాయువును; ఆశ్రిత = ఆశ్రయించిన; మేఘ = మేఘముల; సమూహంబును = సమూహమును; గాలియందున్ = వాయువునందు; పార్థివ = భూమికి సంబంధించిన; ధూళి = ధూళితోను; ధూసరత్వంబును = దుమ్ముతోనుకూడినట్టి; ఏ = ఏ; రీతి = విధమైతే; ఆ = ఆ; రీతి = విధముగ; ద్రష్ట = చూచువాడు; అగు = అయినట్టి; ఆత్మ = ఆత్మ; అందున్ = లోపల; దృశ్యత్వంబున్ = చూడబడు దానితత్త్వము; బుద్ధిమంతులు = జ్ఞానముగలవారు; కానివారి = కాకుండాఉండేవారి; చేతన్ = చేత; ఆరోపింపంబడున్ = లేనిది యన్నట్లు గా భావింపబడును; ఈ = ఈయొక్క; స్థూల = భౌతిక; రూపంబు = రూపము; కంటెన్ = కంటెను; అదృష్ట = చూడబడని; గుణంబు = గుణములు; అయి = కలిగియుండినదై; అశ్రుతంబు = వినబడనిది; ఐన = అయినట్టి; వస్తువు = పదార్థము; అగుటన్ = అగుట; చేసి = వలన; వ్యక్తంబున్ = అభివ్యక్తము / తెలియబడునది; కాక = కాకుండ; సూక్ష్మంబై = సూక్మమై; కర = చేతులు; చరణ = కాళ్లు; ఆదులు = మొదలగుని; లేక = లేని; జీవుని = జీవుని; కిన్ = కి; ఒండొక = ఇంకొక; రూపంబు = రూపము; విరచితంబు = ఏర్పరచబడినది; ఐ = అయి; ఉండున్ = ఉండును; సూక్ష్ముఁడు = సూక్షమమైనవాడు; అయిన = అయినట్టి; జీవుని = జీవుని; వలనన్ = వలన; ఉత్క్రాంతి = వ్యక్తపరచ బడిన; గమన = వెడలుట; ఆగమనంబులన్ = వచ్చుటలను; పునర్జన్మంబున్ = మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నట్లు; తోఁచున్ = అర్థమగును; ఎప్పుడు = ఎప్పడు; ఈ = ఈయొక్క; స్థూల = భౌతిక; సూక్ష్మ = సూక్ష్మ; రూపంబులు = రూపములు; రెండున్ = రెండును; స్వ = తన; రూప = రూపముయొక్క; సమ్యక్ = పూర్తియైన; జ్ఞానంబునన్ = జ్ఞానమువలన; ప్రతిషేధింపఁబడున్ = అడ్డగింపబడును; అపుడ = అప్పుడు; అవిద్యన్ = అజ్ఞానము; చేసి = వలన; ఆత్మను = ఆత్మయందు; కల్పింపంబడును = కల్పింపబడతాయి; అనియున్ = అనీ; తెలియున్ = తెలసిన; అప్పుడు = అప్పుడు; జీవుండు = జీవుడు; బ్రహ్మ = పరబ్రహ్మను; దర్శనంబు = ధర్శించుట; కున్ = కు; అధికారి = తగినవాడు; అగున్ = అగును; దర్శనంబు = దర్శనము; అనన్ = అనగా; జ్ఞాన = జ్ఞానముయొక్క; ఏక = ప్రత్యేకమైన; స్వరూపంబు = స్వరూపము; విశారదుండు = నేర్పరియైనవాడు; ఐన = అయినట్టి; ఈశ్వరునిది = ఈశ్వరు యొక్క; ఐ = అయి; క్రీడించుచున్ = క్రీడిస్తూ / వినోదము గా చరిస్తూ; అవిద్య = అవిద్య; అనంబడుచున్ = అనిపిలవబడుచు; ఉన్న = ఉన్నట్టి; మాయ = మాయ; ఉపరత = నిలచిపోయినది; ఐ = అయి; ఎప్పుడు = ఎపుడైతే; తాన = తానే; విద్య = విద్యయొక్క; రూపంబునన్ = రూపమగ; పరిణత = పరిణామముచెందినది; అగున్ = అగునో; అప్పుడు = అప్పుడు; జీవ = జీవునకు; ఉపాధి = ఆధారము; అయిన = అయినట్టి; స్థూల = భౌతికమైన; సూక్ష్మ = సూక్ష్మమైన; రూపంబున్ = రూపము; దహించి = నశించి; జీవుడు = జీవుడు; కాష్ఠంబు = కట్టె; లేక = లేకనే; తేజరిల్లున్ = ప్రకాశించు; వహ్ని = అగ్ని; చందంబునన్ = వలె; తాన = తనే; ఉపరతుండు = నిలిచిపోయినవాడు; అయి = అయి; బ్రహ్మ = బ్రహ్మయొక్క; స్వరూపంబునన్ = స్వరూపమును; పొంది = ప్రాప్తించి; పరమ = అన్నిటికంటె నుత్తమమైన; ఆనందంబునన్ = ఆనందములో; విరాజమానుండు = విశేషముగ ప్రకాశించువాడు; అగున్ = అగును; ఇట్లు = ఈవిధముగ; తత్త్వజ్ఞులు = తత్త్వజ్ఞానము గలవారు; చెప్పుదురు = చెబుతారు; అని = అని చెప్పి; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈవిధముగ; అనియె = చెప్పెను.
వినండి, ప్రాకృత రూప రహితుడు చిదాత్మస్వరూప జ్ఞానస్వరూపుడు ఐన జీవునికి మహదాదులైన మాయాగుణాల వల్ల ఆత్మస్థానమైన స్థూలశరీరం ఏర్పడింది; గగన మందు మేఘసమూహాన్ని ఆరోపించినట్లూ, గాలి యందు పైకి లేచిన దుమ్ముదుమారాన్ని ఆరోపించినట్లూ అజ్ఞానులైన వారు సర్వదర్శి అయిన ఆత్మ యందు దృశ్యత్వాన్ని ఆరోపించుతున్నారు; జీవునికి కనిపించే ఈ స్థూలరూపం కంటే కనిపించనిది, వినిపించనిది ఐన జీవాత్మ యొక్క ఉత్ర్కాంతి గమనాగమనాల వల్ల మళ్లీ మళ్లీ జన్నిస్తున్నట్లు అనిపిస్తుంది; స్వస్వరూపజ్ఞానం వల్ల ఈ స్థూల సూక్ష్మరూపాలు రెండు తొలగిపోతాయని, మాయవల్ల ఇవి ఆత్మకు కల్పింపబడతాయని గ్రహించి నప్పుడు జీవునికి బ్రహ్మసందర్శనానకి అధికారం లభిస్తుంది; సమ్యక్ జ్ఞానమే దర్శనం; సర్వజ్ఞుడైన ఈశ్వరునికి లోబడి క్రీడిస్తూ అవిద్య అనబడే మాయ ఉపశమించి, తాను విద్యగా పరిణమించినప్పుడు ఉపాధి అయిన స్థూల సూక్ష్మరూపాలను దగ్ధం చేసి, కట్టె లేకుండా ప్రకాశిస్తున్న అగ్నిలాగా తానే బ్రహ్మస్వరూపాన్ని పొంది, పరమానందంతో విరాజిల్లుతాడని తత్త్వవేత్తలు వివరిస్తారు” అని సూతుడు మళ్లీ చెప్పసాగాడు.
1-68-చ.చంపకమాల

జననము లేక కర్మముల జాడలఁ బోక సమస్త చిత్త వ
ర్తనుఁడగు చక్రికిం గవు లుదార పదంబుల జన్మకర్మముల్
వినుతులు సేయుచుండుదురు వేదరహస్యములందు నెందుఁ జూ
చిన మఱి లేవు జీవునికిఁ జెప్పిన కైవడి జన్మకర్మముల్
జననము = పుట్టుక; లేక = లేని; కర్మముల = కర్మల; జాడలన్ = వెంట; పోక = పోని; సమస్త = సర్వుల; చిత్త = చిత్తములలో; వర్తనుఁడు = చరించేవాడు; అగు = అయిన; చక్రి = చక్రధారియైన హరి; కిన్ = కి; కవులు = కవులు; ఉదార = గొప్ప; పదంబుల = పదములతో; జన్మ = పుట్టుక; కర్మముల్ = నడతల; వినుతులు = పొగడ్తలు; సేయుచున్ = చేస్తూ; ఉండుదురు = ఉంటారు; వేద = వేదము లందలి; రహస్యములు = రహస్యములు {రహస్యములు - దాచుకొనదగ్గవి}; అందున్ = లోపల; ఎందున్ = ఎందులోను కూడ; చూచిన = వెతికి చూచిన; మఱి = ఇంక; లేవు = లేవు; జీవుని = జీవుని; కిన్ = కొరకు; చెప్పిన = చెప్పబడిన; కైవడిన్ = విధమైన; జన్మ = జన్మలు; కర్మముల్ = కర్మలు.
“చక్రధారుడైన ఆ హరికి జన్మ అన్నది లేదు. ఏ కర్మలూ ఆయనని అంటవు. సమస్తజీవుల చిత్తములలోను ఆయన నివసిస్తూ ఉంటాడు. ఆ పరాత్పరునికి విద్వాంసులు జన్మలు కర్మలు కల్పించి. ఉదాత్తములైన పదజాలాలతో వర్ణిస్తున్నారు. స్తోత్రాలు చేస్తున్నారు. వాస్తవానికి వేదాలన్నీ వెదకి చూసినా జీవునికి వలె దేవునికి జన్మలు కర్మలు లేనేలేవు.
1-69-మ.మత్తేభ విక్రీడితము

భువనశ్రేణి నమోఘలీలుఁ డగుచుం బుట్టించు రక్షించు నం
తవిధింజేయు మునుంగఁడందు; బహుభూతవ్రాతమం దాత్మతం
త్రవిహారస్థితుడై షడింద్రియ సమస్తప్రీతియున్ దవ్వులన్
దివిభంగిం గొనుఁ జిక్కఁ డింద్రియములం ద్రిప్పున్ నిబంధించుచున్.
భువన = లోకముల; శ్రేణిన్ = సమూహములో; అమోఘ = అమోఘమైన {అమోఘమైనది - వ్యర్థము కానిది}; లీలుఁడు = లీల కలవాడు; అగుచున్ = అగుచూ; పుట్టించు = సృష్టించు / సృష్టి; రక్షించున్ = రక్షించు / స్థితి; అంతవిధిన్ = అంతముచేయుటను / లయలను; చేయు = చేయును; మునుంగఁడు = లోనుకాడు; అందున్ = అందు; బహు = అనేక; భూత = జీవుల; వ్రాతము = సమూహము; అందున్ = లోపల; ఆత్మ = స్వయముగ అల్లుకొనిన; తంత్ర = తంత్రము / అల్లిక - స్వతంత్ర; విహార = విహారముచేయు; స్థితుడు = స్థితిగలవాడు; ఐ = అయి; షట్ = ఆరు; ఇంద్రియ = ఇంద్రియముల యొక్క {ఇంద్రియములు - మనసు, పంచేంద్రియాలు కలిసి 6}; సమస్త = సమస్తమైన; ప్రీతియున్ = దగ్గరలు; దవ్వులన్ = దూరములను; దివి = ఆకాశము; భంగిన్ = వలె; కొనున్ = గ్రహించును; చిక్కఁడు = చిక్కుకొనడు; ఇంద్రియములన్ = ఇంద్రియములను; త్రిప్పున్ = విహరింపచేయును; నిబంధించుచున్ = నియమించును.
ఈ సకల భువన జాలాన్నీ తన అమోఘమైన లీలావిలాసం చేత శ్రీమన్నారాయణుడు పుట్టిస్తుంటాడు, రక్షిస్తుంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. కాని తాను మాత్రం ఆ జనన మరణాలలో నిమగ్నం కాడు. సర్వ ప్రాణి సమూహ మందు ఆత్మస్వరూపుడై విహరిస్తుంటాడు. ఎంతో దూరంలో అందకుండా స్వర్గంలాగా ఉండి, జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సమకూరుస్తూ, తాను మాత్రం ఇంద్రియాలకు అతీతుడుగా ఉండి, నియంతయై ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతూ ఉంటాడు.
1-70-చ.చంపకమాల

జగదధినాథుఁడైన హరిసంతతలీలలు నామరూపముల్
దగిలి మనోవచోగతులఁ దార్కికచాతురి యెంత గల్గినన్
మిగిలి కుతర్కవాది తగ మేరలు సేసి యెఱుంగ నేర్చునే?
యగణిత నర్తనక్రమము నజ్ఞుఁ డెఱింగి నుతింప నోపునే?
జగత్ = సృష్టికి; అధి = పై; నాథుడు = పతి - అధిపతి; ఐన = అయినట్టి; హరి = హరియొక్క; సంతత = ఎడతెగని; లీలలు = లీలలు; నామ = నామాలు; రూపముల్ = రూపములు; తగిలి = పూనుకొని; మనో = ఆలోచనల; వచో = వాక్కుల; గతులన్ = రీతులతో; తార్కిక = తర్కమునకు సంబంధించిన; చాతురి = నేర్పు; ఎంత = ఎంత; కల్గినన్ = కలిగి యున్నప్పుటికిని; మిగిలి = అతిశయించి; కు = చెడ్డ; తర్క = హేతు విమర్శ; వాది = వాదించువాడు - చెడ్డ వాదనలు వాదించువాడు; తగ = తగిన; మేరలు = హద్దులు; సేసి = చేసి; ఎఱుంగ = తెలిసికొన; నేర్చునే = గలడా; అగణిత = లెక్కకందని; నర్తన = లీలలు, వర్తనములు; క్రమమున్ = విధానమును; అజ్ఞుఁడు = అజ్ఞానము కలవాడు; ఎఱింగి = అర్థము చేసికొని; నుతింపన్ = అభినందించుట; ఓపునే = చేయకలడా.
సర్వలోకేశ్వరుడైన శ్రీహరి లీలావిలాసంగా నానావిధాలైన నామరూపాలు ధరిస్తూ ఉంటాడు. కళా హృదయం లేని అజ్ఞుడు, నాట్యంలోని అందచందాలను అర్థంచేసికొని ఆనందించి అభినందించ లేనట్లే, వితర్కాలు కుతర్కాలు నేర్చినవాడు తర్క శాస్ర్త పాండిత్యం ఎంత ఉన్నా, భగవంతుని సత్యస్వరూపాన్ని మనస్సుచేత గానీ వాక్కుల చేతగానీ ఇంత అని గ్రహింపలేడు.
1-71-ఉ.ఉత్పలమాల

ఇంచుక మాయలేక మది నెప్పుడు బాయని భక్తితోడ వ
ర్తించుచు నెవ్వఁడేని హరిదివ్యపదాంబుజ గంధరాశి సే
వించు, నతం డెఱుంగు నరవింద భవాదులకైన దుర్లభో
దంచితమైన, యా హరి యుదార మహాద్భుత కర్మమార్గముల్.
ఇంచుక = కొంచెము కూడ; మాయ = మాయ / మర్మము; లేక = లేకుండా; మదిన్ = మనసులో; ఎప్పుడు = ఎల్లప్పుడూ; పాయని = విడువని; భక్తి = భక్తి; తోడన్ = తో; వర్తించుచున్ = నడచు కొనుచు; ఎవ్వఁడేని = ఎవరైతే; హరి = హరియొక్క; దివ్య = దివ్యమైన; పద = పాద; అంబుజ = పద్మముల యొక్క; గంధ = వాసన; రాశి = మొత్తములను; సేవించున్ = సేవించునో; అతండు = అతడు; ఎఱుంగున్ = తెలియును; అరవిందభవ = బ్రహ్మదేవుడు {అరవిందభవుడు - పద్మమున పుట్టిన వాడు, బ్రహ్మ}; ఆదులు = మొదలైనవారు; కున్ = కి; ఐన = అయినను; దుర్లభ = లభించనిది; ఉదంచితము = విజృంభణము కలది; ఐన = అయినట్టి; ఆ = ఆ; హరి = హరియొక్క; ఉదార = చక్కటి; మహా = గొప్ప; అద్భుత = ఆశ్చర్యకరమైన; కర్మ = కర్మలయొక్క; మార్గముల్ = విధానములు.
మర్మము అన్నది కొంచం కూడ లేకుండ, ఎడతెగని భక్తితో ప్రవర్తిస్తూ, నారాయణ చరణారవింద సుగంధాన్ని సేవించే మహాత్ముడు, బ్రహ్మాదులకు సైతం అందుకొన శక్యం కాని భగవంతుని అత్యద్భుతమైన లీలావిశేషాలను తెలుసుకొంటాడు” ఇలా చెప్పి సూతుడు శౌనకాది మహర్షులతో ఇలా అన్నాడు.
1-72-మ.మత్తేభ విక్రీడితము

హరిపాదద్వయభక్తి మీ వలన నిట్లారూఢమై యుండునే
తిరుగంబాఱదు చిత్తవృత్తి హరిపై దీపించి మీలోపలన్
ధరణీదేవతలార! మీరలు మహాధన్యుల్ సమస్తజ్ఞులున్
హరిచింతన్ మిముఁ జెంద వెన్నడును జన్మాంతర్వ్యధాయోగముల్
హరి = హరియొక్క; పాద = పాదములు; ద్వయ = జంట మీది; భక్తి = భక్తి; మీ = మీ; వలనన్ = వలన; ఇట్లు = ఈవిధముగా; ఆరూఢమై = నెలకొని, ఎంతగానో; ఉండున్ = ఉండును; ఏతిరుగన్ = ఇంకొక విధముగ; పాఱదు = విస్తరించదు; చిత్త = చిత్తము యొక్క; వృత్తి = ప్రవృత్తి; హరి = హరి; పై = మీద; దీపించి = ప్రకాశిస్తూ; మీ = మీ; లోపలన్ = అందు; ధరణీదేవతలారా = విప్రులులారా {ధరణీదేవతలు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; మీరలు = మీరు; మహా = మిక్కిలి / గొప్ప; ధన్యులు = సార్థకజీవులు; సమస్త = సర్వము; అజ్ఞులున్ = తెలిసిన వారు; హరి = హరిమీది; చింతన్ = భక్తి వలన; మిమున్ = మిమ్ములను; చెందవు = అంటవు; ఎన్నడును = ఎప్పుడూ; జన్మాంతర = వివిధజన్మలలో; వ్యధ = బాధలయొక్క; యోగముల్ = యోగములు.
“ఓ బ్రహ్మణ్యులారా ! మీరు పుణ్యవంతులలో శ్రేష్ఠులు, సర్వం తెలిసిన మునివరేణ్యులు. మీలో శ్రీహరి చరణయుగంపై భక్తి ఇంతగా ఆరూఢమై ఉన్నది. మీ హృదయాలు శ్రీహరి యందు అసక్తములై ఎడబాటు ఎరుగకుండా ఉన్నాయి. శ్రీమన్నారాయణ సంస్మరణ ప్రభావం వల్ల ఈ చావు పుట్టుకల బాధలు ఎన్నడూ మీ సమీపానికి రాలేవు.

🙏🚩🕉పురోహితుడు అంటే ఎవరు🕉🚩

🙏
శ్లో:జన్మనా జాయతే శూద్రః
సంస్కారద్వ్దిజ ఉచ్యతే౹
విద్యయా యాతి విప్రత్వం
త్రిభిః శ్రోత్రియ ఉచ్యతే౹౹
🦢పుట్టుకతో శూద్రుడు, ఉపనయన కాలంలో ద్విజుడు,విద్యాభ్యాసంలో విప్రుడు, ఈ మూడింటితో అతడు శ్రోత్రియుడు అగును🦋
👉పురోహితుడు అనగా:ముందుగా హితము పలికెడివాడు
👉పురోహితుడు అనగా:ధర్మార్థ కామమోక్షములకు సోపానము
👉పురోహితుడు అనగా:పూజనీయుడు
👉పురోహితుడు అనగా:సహృదయతకు, మృదుభాషనకు, మధురానుభూతికి మారుపేరు
👉పురోహితుడు అనగా:నిత్య కర్మానుష్ఠానము ఒనర్చు ఒక తపస్వి
👉పురోహితుడు అనగా:ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు
👉పురోహితుడు అనగా:హైందవ సాంప్రదాయానికి రక్షణ కవచం
👉పురోహితుడు అనగా:సాదారణమైన పేరు వశిష్ఠుడు
👉పురోహితుడు అనగా:మానసిక వ్యాధిని ఛేదించె సైకాలజీ, ఒక హిప్నాటిస్ట్
👉పురోహితుడు అనగా:ఆత్మస్థైర్యమును, నమ్మకమును కలిగించె, బాధలను తొలగించె పిలాసపీ, ఒక మెజీషియన్
👉పురోహితుడు అనగా:సందేహ నివృత్తికి ఒక నిఘంటువు
👉పురోహితుడు అనగా:తాను ఉద్దరింపబడుచు, ఇతరులను ఉద్ధరింపజేయు జ్ఞాన దీపిక
👉పురోహితుడు అనగా:భగవంతునికి భక్తునికి మద్య ఒక వారధి
👉పురోహితుడు అనగా:భూత భవిషత్వర్తమాన కాలముల సూచిక
👉పురోహితుడు అనగా:శుభాశుభ కార్యములను ఆరాధించు సమదర్శి
👉పురోహితుడు అనగా:నిత్య కాల గణన చేయు గణిత వేత్త
👉పురోహితుడు అనగా:గోసంపద, వృక్ష సంపదతో వాతావరణ కాలుష్యాన్ని నివారించు యజ్ఞమూర్తి
👉పురోహితుడు అనగా:పర్యావరణ పరిరక్షణలో వృక్ష ప్రతిష్టకు మొదటి ప్రతినిధి
(జన్మ నక్షత్ర వృక్షాలు, యజ్ఞసమిదల వృక్షాలు, ఫలపుష్పాది వృక్షాలు, ఓషధివృక్షాలు మొదలగువాటిని ప్రతిష్టించి, పెంచి, పోషించుమని ప్రోత్సహించువాడు)
👉పురోహితుడు అనగా:ధర్మ శాస్త్ర ప్రియుడు

🌹🌿🍇పురోహితము🍇🌿🌹
పు ,అనగా పురజనులందరికి
రో ,అనగా రోజురోజుకి
హి ,అనగా హితముచెప్పుచు
త ,అనగా తరింపజేసి
ము ,అనగా ముదముగూర్చునది🔥🥥🍁🦢🚩

జై తెలుగు తల్లీ!

మొన్న కలలో తెలుగు తల్లి కనిపించింది. అమ్మా! బాగున్నావా? అంటే కంట నీరు పెట్టుకుంది. ఏమమ్మా, ఎందుకా కన్నీరు? అంటే ఇలా చెప్పుకొచ్చింది.
కామేశం!

అచ్చులలో ఋ ఋ, ఌ , ౡ లను ఎప్పుడో తీసేసేరు.ఋషులంతా రుషులయ్యేరు, లాయం అని రాయడమూ తెలియక దాని అర్ధమూ తెలియక ఌ, ౡ లను ఖండించేరు. ఇక విసర్గ వాడకం ఎప్పుడో పోయింది. ఇక హల్లుల విషయానికి వస్తే "క"వర్గంలోని అను నాసికం ఎప్పుడు ఎలా వాడాలో ఎవరికీ తెలియకుండాపోయింది. "చ" వర్గంలో ఉన్న మరో ౘ, ౙ లను అందరూ మరచిపోయేరు.

ఇక ఉభయాక్షరాలకొస్తే శకట రేఫ అదేరా! బండి "ఱ" వాడకమే లేదు. అందరూ 'ర' తో సరిపెట్టుకుంటున్నారు.
పోనీలే పిల్లలు అని సరిపెట్టుకుంటే ఈ మధ్య మరో సమస్య రా!

'ళ' బదులు 'ల', 'ణ' బదులు 'న' వాడేస్తున్నార్రా!
కళ్ళు, పెళ్ళి అనడానికి కల్లు, పెల్లి అంటునారు. కల్లు అంటే ఏమిటో నీకు తెలుసుగా, తాటి కల్లో ఈత కల్లో కాదూ, అదీ కాకపోతే సన్ని కల్లూ, ఉప్పు కల్లూనూ.
ఇక వీణ, జాణ అనడానికి బదులు వీన,జాన అంటునారు, వేణుని వేను అంటున్నారు.

ఇలా నా శరీరంలోని ఒక్కొక్క అక్షర భాగాన్ని తొలగిస్తూ పోవడం న్యాయమా చెప్పు! అంటూ వాపోయింది.పోతనగారైతే కాటుక కంటినీరు అని పద్యం ఎత్తుకునేవారు. ఆయన మహానుభావుడు కనుక, నేను మామూలు భావు(కు)ణ్ణి కనుక ఇదిగో ఇలా!

ఏటికి మాకు కావలయు నేబదియారగు నక్షరమ్ములున్‌ మాటల తీరు తెన్నులను మార్చిన నేమగునంచు నీ నాటికి తల్లినెంతగనొ నవ్వుల పాలొనరించు చుండ తా కాటుక కంట నీరొల్కగా తెలుగమ్మయె కుంగి పోదొకో మిత్రులూ, అందరం కలిసి కట్టుగా మన తెలుగమ్మను కాపాడుకుందాం. పిల్లలకు తెలుగు నేర్పుకుందాం, తెలుగువారితో తెలుగులోనే మాట్లాడుకుందాం. తెలుగు టంకణం (టైపింగ్) నేర్చుకుందాం. వ్యాఖ్యలన్నీ చక్కగా తెలుగులోనే వ్రాసుకుందాం. ఏమంటారు? తెలుగుకు పట్టిన తెగులుకు దేహశుద్ధి చేద్దాం.

జై తెలుగు తల్లీ!

(రచయిత : శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారు )

journey of CORONA

Dendukuri Nagabhushana Sastry
S/o Krishna Murthy
Mobile Number: 88979 95750.

*As per Astrology, The journey of CORONA*

It came to limelight on 26/12/2019 - Amavasya – Moola -Thursday- in the Makara Lagna (from 07.58 A.M to 09.49 A.M).

Six planets namely Sun, Moon, Mercury, Jupiter, Saturn, and Ketu were in Sagittarius sign. Sagittarius is a twelfth house (vyaya) from Capricorn.

Mars was in Scorpio. Venus was in Capricorn. Rahu was in Gemini. As a whole except Venus, the remaining eight planets were directly involved in giving birth to this pandemic. 

Such planetary combinations used to take place once in a hundred years. Sometimes more than that. All this is about the departure time of CORONA*.

To every journey, the end must be inevitable. This principle of life only stimulated me to find out the time that when this pandemic will reach its ending point.

As I have said yesterday eight planets will be in their respective good signs on 14/09/2020 and 15/09/2020. The eight planets only that gave birth to this pandemic on 26/12/2019 will give an end to this.

That will be on 14/09/2020 Dwadasi; Monday Aslesha Mesha Lagna (from 19.45 to 21.29 PM). 

During this period between 19.45 PM to 21.29 PM the scientist whose name starts with the first letter *"ఫ"/"pha"* will succeed in bringing out the vaccine for this pandemic.
             
Next, the scientists will announce this victory on 15/09/2020 - in between 19.41 PM to 21.25 PM - Mesha Lagna - Trayodasi -Magha - Tuesday(seven planets in good condition + eighth planet Moon was accepted by planet Jupiter(ninth aspect).

This is how Karona will end its journey.

✍️👍✍️

Always follow Government instructions and guidelines.

మళ్లీ మోదటికి

తనకు మెట్లెక్కడం భారమనుకుని , *లిఫ్ట్* ను కనుక్కుని ఎక్కడం
అలవాటు పడ్డాక ,
తద్వారా
పెరిగిన కొవ్వును
కరిగించు కోవడానికై
 *మళ్లీ*
 *మెట్లెక్కుతున్నాడు* !!!!

నడక కష్టమనీ, ఎంతో శ్రమపడి కారు ను తయారు చేసుకుని,
వాడటం మొదలెట్టాక ,
లావెక్కిన తనను తాను.. తగ్గించు కోవడానికై,
వాఁకింగ్ పేరుతో
 *మళ్లీ* *రోడ్డున* *పడ్డాడు* *మనిషి* !!


హరిత విప్లవం అంటూ
అనేక రసాయనాల్ని వాడి, పంటలను పెంచుకున్నానని
గర్వపడేలోగా, వాటి
దుష్ప్రభావం తెలిసి
మళ్లీ ఆర్గానిక్ పేరు
జపిస్తున్నాడు!!

పారిశ్రామిక విప్లవంతో
ఏదో సాధించాననుకుని మిడిసిపడ్డ మనిషి,
తను నాశనం చేసిన
ప్రకృతిని బ్రతికించు కోవడానికి మళ్లీ పర్యావరణ మంత్రం పఠిస్తున్నాడు!!

పిజాలు, బర్గర్లు అంటూ వెంపర్లాడిన,
మనిషి కరొనా పుణ్యమా అని
మళ్లీ ఆరోగ్యకరమైన ఇంటి తిండికి అలవాటు
పడుతున్నాడు!!

ఇంగ్లీష్ మందులంటూ, జిమ్ములంటూ పరిగెత్తిన మనిషి కరొనా నుంచి రక్షణ కై మళ్లీ యోగా , ప్రాణాయామం,
ఆయుర్వేదం అనడం నేర్చుకుంటున్నాడు!!!

ఉమ్మడి కుటుంబాలని చీదరించుకుని,
చిన్న కుటుంబాలతో సుఖపడదామనుకున్న, మనిషి మళ్లీ అంతా కలిసుందాం రా అంటూ పాత బంధాల వైపే మొగ్గు చూపు తున్నాడు!!!

పడచు పిల్ల లాంటి పట్నం మోజులో పడి తల్లి లాంటి పల్లెను మరచిన మనిషి, కరోనా భయంతో , ఫామ్ హౌజుల పేరిట,
పచ్చని ప్రకృతి కొరకై
 *మళ్లీ* *పల్లె* *బాట* *పట్టాడు* !!

 *ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమోమరి*!!

*కర్మ సిధ్ధాంతం*



మనం అద్దె ఇళ్ళలో ఉంటాము. ఒకానొకప్పుడు ఆ ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని ఆదేశిస్తే వెంటనే సామాను అంతా సర్దుకుని వేరు ఇల్లు వెతుక్కుంటాము.  ఎక్కడకు వెళ్ళినా పోగు చేసుకున్న సామాను అంతా తీసుకుని వెళతాము. అలాగే ఈ శరీరం కూడా ఓ అద్దె ఇల్లు. ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం వ్రాయబడి ఉంటే అన్నేళ్ళు ఉంటాము.  ఋణం తీరిన తర్వాత ఈ శరీరం నుంచి ఆత్మ బయటకు గెంటి వేయబడుతుంది. దానికి ఆ  తర్వాత దేహం మీద ఏ హక్కు ఉండదు.
అప్పుడు అది తాను గత జన్మలో చేసుకున్న పాప పుణ్యాలు అంతకముందు జన్మల పాప పుణ్యాలను వెంటబెట్టుకుని వెళుతుంది. అవే సంచిత కర్మలు.
ప్రారబ్ధ కర్మలు అనేక సంచిత కర్మలతో కలిసి జీవుడు ప్రయాణిస్తుంటాడు. ఏ ప్రాణి అయినా శరీరం విడిచి పెట్టే సమయంలో అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచిత కర్మల నుంచి ఏ కర్మలు అయితే పక్వానికి వస్తాయో  లేదా పండుతాయో ఆ కర్మలను అనుసరించి, జీవుడికి తదుపరి దేహం ఇవ్వబడుతుంది. అంటే జన్మల పరంపరలో జీవుడు చేసిన కర్మలలో అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మ ప్రారబ్ధ కర్మ. ఈ దేహం ప్రారబ్ధ కర్మ ఆధారంగా ఏర్పడింది.  ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. అంతవరకు ఆ ఫలాలను అనుభవించ వలసిందే. ప్రారబ్ధం తీరిన క్షణమే మరుక్షణం కూడా కాదు ఆ క్షణమే ఆత్మ దేహాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ ఇంకో శరీరం యొక్క అన్వేషణలో పడుతుంది.
ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. ఈ జన్మలో మన కుటుంబ సభ్యులు మిత్రులు సన్నిహితులు ఆప్తులు బంధువులు మొదలైన వారంతా ఒక జన్మలో మన కర్మల ఆధారంగా మనమే ఎంచుకున్నాము. ఆ యా వ్యక్తులతో మనకున్న ఋణం కారణంగా వారి నుంచి సేవ పొందడమో లేదా సేవ అందించడమో చేస్తాము. ఆ ఋణమే బంధము.  ఈ శరీరం ఏర్పడడానికి కారణమైన ప్రారబ్ధ కర్మలన్నీ ఈ జీవితం ముగిసేనాటికి ఖర్చయిపోగా జన్మ జన్మల నుంచి వస్తున్న సంచిత కర్మలకు ఈ జన్మలో చేసిన సంచిత కర్మలు కలుస్తాయి.  ఈ  మొత్తం కర్మల్లో ఏ కర్మలైతే పక్వానికి సిద్ధంగా ఉంటాయో అంటే అనుభవించడానికి సిద్ధమవుతాయో అవి ప్రారబ్ధాలుగా మారి జీవుడి తదుపరి దేహం ఉంటుంది. ఈ చక్రం ఇలానే  కొనసాగుతుంది. అందుకే *ఆదిశంకరులు* భజగోవింద స్తోత్రంలో
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
అని అన్నారు.
మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పిండంగా ఎదగడం.... అంటూ అందులో స్పష్టం చేశారు.  ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు అంతా నా ప్రారబ్ధం అంటాము.  అంటే ఇదే. మనం ఒకనాడు తెలిసో తెలియకో చేసిన పాప పుణ్య కర్మల ఫలం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నాము.  అలాగే పాపం పండింది అనేమాట కూడా ఉపయోగిస్తాము. పాపం పండడమేంటి? అంటే ఎప్పుడో చేసిన దుష్కర్మ ఈనాడు తన ఫలితాన్ని చూపిస్తోంది. ఎప్పుడో చిన్న విత్తనం వేశాడు, అది మొలకెత్తి, పెరిగి, పెద్దదై ఈనాడు ఫలాలను ఇస్తోంది. ఆ ఫలాలను అనుభవించాల్సింది కూడా ఆ విత్తనం వేసినవాడే. విత్తనం చిన్నదే కానీ, దాని నుంచి వచ్చే చెట్టు పెద్దదే కావచ్చు. అలానే చేసిన పని కూడా. కాబట్టి సాధ్యమైనంతవరకు సత్కర్మలే చేయమని శాస్త్రం చెబుతుంది. --- వాణిశ్రీ వేగి
టెలిగ్రామ్’ ద్వారా (గురుగీత) పొందాలనుకునేవారు: HTTPS://T.ME/GURUGEETA

480వ నామము

ఓం పాయసాన్న ప్రియాయై నమః🙏
(శ్రీ లలితా సహస్రనామములలో 480వ నామము)

సీసము.
పాయసాన్నప్రియా! పరమాన్న మే భక్తి. భక్తులందింతురు వరలఁ గొనుము.

యతులు గృహస్థులు నతులితంబుగ నిన్ను విశ్వసించుదురమ్మ వేల్పు వనుచు.

సాన్ నిధ్యమున్ నిల్చి సన్నుతించుచు నిన్ను వేడ్కతో గాంచనీ విశ్వజనని!

నయవర్తనమునుండి జయశీలవగు నిన్ను నా మది నిల్పనీ బ్రేమఁ గనుచు,

ప్రియసుభాషణ పాయసంబయి కదుర న

యాన్విత చరిత నీకు మా యర్చనమవ

వన్ దనము చేతునమ్మ నీ వందుమమ్మ

దేవమానవ పూజితా దిక్కు నీవె.
🙏
(ఈ సీస పద్యమున పాదములందలి మొదటి అక్షరములను కలుపగా
పాయసాన్న ప్రియా వందే🙏అగును)

అమ్మకు భక్తితో నమస్కరించుచు
చింతా రామకృష్ణారావు.
🙏🙏🙏

లలితా స్తవరాజః బ్రహ్మాణ్డమహాపురాణే ॥


దేవా ఊచుః
జయ దేవి జగన్మాతర్జయ దేవి పరాత్పరే ।
జయ కల్యాణనిలయే జయ కామకలాత్మికే ॥ ౩.౧౩.౧॥

జయకారి చ వామాక్షి జయ కామాక్షి సున్దరి ।
జయాఖిలసురారాధ్యే జయ కామేశి మానదే ॥ ౩.౧౩.౨॥

జయ బ్రహ్మమయే దేవి బ్రహ్మాత్మకరసాత్మికే ।
జయ నారాయణి పరే నన్దితాశేషవిష్టపే ॥ ౩.౧౩.౩॥

జయ శ్రీకణ్ఠదయితే జయ శ్రీలలితేఽమ్బికే ।
జయ శ్రీవిజయే దేవి విజయశ్రీసమృద్ధిదే ॥ ౩.౧౩.౪॥

జాతస్య జాయమానస్య ఇష్టాపూర్తస్య హేతవే ।
నమస్తస్యై త్రిజగతాం పాలయిత్ర్యై పరాత్పరే ॥ ౩.౧౩.౫॥

కలాముహూర్తకాష్ఠాహర్మాసర్తుశరదాత్మనే ।
నమః సహస్రశీర్షాయై సహస్రముఖలోచనే ॥ ౩.౧౩.౬॥

నమః సహస్రహస్తాబ్జపాదపఙ్కజశోభితే ।
అణోరణుతరే దేవి మహతోఽపి మహీయసి ॥ ౩.౧౩.౭॥

పరాత్పరతరే మాతస్తేజస్తేజీయసామపి ।
అతలం తు భవేత్పాదౌ వితలం జానునీ తవ ॥ ౩.౧౩.౮॥

రసాతలం కటీదేశః కుక్షిస్తే ధరణీ భవేత్ ।
హృదయం తు భువర్లోకః స్వస్తే ముఖముదాహృతమ్ ॥ ౩.౧౩.౯॥

దృశశ్చన్ద్రార్కదహనా దిశస్తే బాహవోఽమ్బికే ।
మరుతస్తు తవోచ్ఛ్వాసా వాచస్తే శ్రుతయోఽఖిలాః ॥ ౩.౧౩.౧౦॥

క్రీడా తే లోకరచనా సఖా తే చిన్మయః శివః ।
ఆహారస్తే సదానన్దో వాసస్తే హృదయే సతామ్ ॥ ౩.౧౩.౧౧॥

దృశ్యాదృశ్యస్వరూపాణి రూపాణి భువనాని తే ।
శిరోరుహా ఘనాస్తే తు తారకాః కుసుమాని తే ॥ ౩.౧౩.౧౨॥

ధర్మాద్యా బాహవస్తే స్యురధర్మాద్యాయుధాని తే ।
యమాశ్చ నియమాశ్చైవ కరపాదరుహాస్తథా ॥ ౩.౧౩.౧౩॥

స్తనౌ స్వాహాస్వధాఽఽకరౌ లోకోజ్జీవనకారకౌ ।
ప్రాణాయామస్తు తే నాసా రసనా తే సరస్వతీ ॥ ౩.౧౩.౧౪॥

ప్రత్యాహారస్త్విన్ద్రియాణి ధ్యానం తే ధీస్తు సత్తమా ।
మనస్తే ధారణాశక్తిర్హృదయం తే సమాధికః ॥ ౩.౧౩.౧౫॥

మహీరుహాస్తేఽఙ్గరుహాః ప్రభాతం వసనం తవ ।
భూతం భవ్యం భవిష్యచ్చ నిత్యం చ తవ విగ్రహః ॥ ౩.౧౩.౧౬॥

యజ్ఞరూపా జగద్ధాత్రీ విశ్వరూపా చ పావనీ ।
ఆదౌ యా తు దయాభూతా ససర్జ నిఖిలాః ప్రజాః ॥ ౩.౧౩.౧౭॥

హృదయస్థాపి లోకానామదృశ్యా మోహనాత్మికా ॥ ౩.౧౩.౧౮॥

నామరూపవిభాగం చ యా కరోతి స్వలీలయా ।
తాన్యధిష్ఠాయ తిష్ఠన్తీ తేష్వసక్తార్థకామదా ।
నమస్తస్యై మహాదేవ్యై సర్వశక్త్యై నమోనమః ॥ ౩.౧౩.౧౯॥

యదాజ్ఞయా ప్రవర్తన్తే వహ్నిసూర్యేన్దుమారుతాః ।
పృథివ్యాదీని భూతాని తస్యై దేవ్యై నమోనమః ॥ ౩.౧౩.౨౦॥

యా ససర్జాదిధాతారం సర్గాదావాదిభూరిదమ్ ।
దధార స్వయమేవైకా తస్యై దేవ్యై నమోనమః ॥ ౩.౧౩.౨౧॥

యథా ధృతా తు ధరణీ యయాఽఽకాశమమేయయా ।
యస్యాముదేతి సవితా తస్యై దేవ్యై నమోనమః ॥ ౩.౧౩.౨౨॥

యత్రోదేతి జగత్కృత్స్నం యత్ర తిష్ఠతి నిర్భరమ్ ।
యత్రాన్తమేతి కాలే తు తస్యై దేవ్యై నమోనమః ॥ ౩.౧౩.౨౩॥

నమోనమస్తే రజసే భవాయై నమోనమః సాత్త్వికసంస్థితాయై ।
నమోనమస్తే తమసే హరాయై నమోనమో నిర్గుణతః శివాయై ॥ ౩.౧౩.౨౪॥

నమోనమస్తే జగదేకమాత్రే నమోనమస్తే జగదేకపిత్రే ।
నమోనమస్తేఽఖిలరూపతన్త్రే నమోనమస్తేఽఖిలయన్త్రరూపే ॥ ౩.౧౩.౨౫॥

నమోనమో లోకగురుప్రధానే నమోనమస్తేఽఖిలవాగ్విభూత్యై ।
నమోఽస్తు లక్ష్మ్యై జగదేకతుష్ట్యై నమోనమః శాంభవి సర్వశక్త్యై ॥ ౩.౧౩.౨౬॥

అనాదిమధ్యాన్తమపాఞ్చభౌతికం హ్యవాఙ్మనోగమ్యమతర్క్యవైభవమ్ ।
అరూపమద్వన్ద్వమదృష్టగోచరం ప్రభావమగ్ర్యం కథమంబ వర్ణయే ॥ ౩.౧౩.౨౭॥

ప్రసీద విశ్వేశ్వరి విశ్వవన్దితే ప్రసీద విద్యేశ్వరి వేదరూపిణి ।
ప్రసీద మాయామయి మన్త్రావిగ్రహే ప్రసీద సర్వేశ్వరి సర్వరూపిణి ॥ ౩.౧౩.౨౮॥

ఇతి స్తుత్వా మహాదేవీం దేవాః సర్వే సవాసవాః ।
భూయో భూయో నమస్కృత్య శరణం జగ్మురఞ్జసా ॥ ౩.౧౩.౨౯॥

తతః ప్రసన్నా సా దేవీ ప్రణతం వీక్ష్య వాసవమ్ ।
వరేణ చ్ఛన్దయామాస వరదాఖిలదేహినామ్ ॥ ౩.౧౩.౩౦॥

ఇన్ద్ర ఉవాచ
యది తుష్టాసి కల్యాణి వరం దైత్యేన్ద్రపీడితాః ।
దుర్ధరం జీవితం దేహి త్వాం గతాః శరణార్థినః ॥ ౩.౧౩.౩౧॥

శ్రీదేవ్యువాచ
అహమేవ వినిర్జిత్య భణ్డం దైత్యకులోద్భవమ్ ।
అచిరాత్తవ దాస్యామి త్రైలోక్యం సచరాచరమ్ ॥ ౩.౧౩.౩౨॥

నిర్భయా ముదితాః సన్తు సర్వే దేవగణాస్తథా ।
యే స్తోష్యన్తి చ మాం భక్త్యా స్తవేనానేన మానవాః ॥ ౩.౧౩.౩౩॥

భాజనం తే భవిష్యన్తి ధర్మశ్రీయశసాం సదా ।
విద్యావినయసమ్పన్నా నీరోగా దీర్ఘజీవినః ॥ ౩.౧౩.౩౪॥

పుత్రమిత్రకలత్రాఢ్యా భవన్తు మదనుగ్రహాత్ ।
ఇతి లబ్ధవరా దేవా దేవేన్ద్రోఽపి మహాబలః ॥ ౩.౧౩.౩౫॥

ఆమోదం పరమం జగ్ముస్తాం విలోక్య ముహుర్ముహుః ॥ ౩.౧౩.౩౬॥

ఇతి శ్రీబ్రహ్మాణ్డమహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యానే
లలితాస్తవరాజో నామ త్రయోదశోఽధ్యాయః ॥

శ్రీమహాలక్ష్మీ లలితాస్తోత్రమ్



          ॥ ధ్యానమ్ ॥

చక్రాకారం మహత్తేజః తన్మధ్యే పరమేశ్వరీ
జగన్మాతా జీవదాత్రీ నారాయణీ పరమేశ్వరీ
వ్యూహతేజోమయీ బ్రహ్మానన్దినీ హరిసున్దరీ
పాశాంకుశేక్షుకోదణ్డ పద్మమాలాలసత్కరా
దృష్ట్వా తాం ముముహుర్దేవాః ప్రణేముర్విగతజ్వరాః
తుష్టువుః శ్రీమహాలక్ష్మీం లలితాం వైష్ణవీం పరామ్

         ॥ శ్రీదేవాః ఊచుః ॥

జయ లక్ష్మి జగన్మాతః జయ లక్ష్మి పరాత్పరే
జయ కల్యాణనిలయే జయ సర్వకలాత్మికే
జయ బ్రాహ్మి మహాలక్ష్మి బ్రహాత్మికే పరాత్మికే
జయ నారాయణి శాన్తే జయ శ్రీలలితే రమే 
జయ శ్రీవిజయే దేవీశ్వరి శ్రీదే జయర్ద్ధిదే
నమః సహస్ర శీర్షాయై సహస్రానన లోచనే
నమః సహస్రహస్తాబ్జపాదపఙ్కజశోభితే
అణోరణుతరే లక్ష్మి మహతోఽపి మహీయసి 
అతలం తే స్మృతౌ పాదౌ వితలం జానునీ తవ
రసాతలం కటిస్తే చ కుక్షిస్తే పృథివీ మతా
హృదయం భువః స్వస్తేఽస్తు ముఖం సత్యం శిరో మతమ్
దృశశ్చన్ద్రార్కదహనా దిశః కర్ణా భుజః సురాః
మరుతస్తు తవోచ్ఛ్వాసా వాచస్తే శ్రుతయో మతాః
క్రిడా తే లోకరచనా సఖా తే పరమేశ్వరః
ఆహారస్తే సదానన్దో వాసస్తే హృదయో హరేః
దృశ్యాదృశ్యస్వరూపాణి రూపాణి భువనాని తే
శిరోరుహా ఘనాస్తే వై తారకాః కుసుమాని తే
ధర్మాద్యా బాహవస్తే చ కాలాద్యా హేతయస్తవ
యమాశ్చ నియమాశ్చాపి కరపాదనఖాస్తవ
స్తనౌ స్వాహాస్వధాకారౌ సర్వజీవనదుగ్ధదౌ
ప్రాణాయామస్తవ శ్వాసో రసనా తే సరస్వతీ
మహీరుహాస్తేఽఙ్గరుహాః ప్రభాతం వసనం తవ
ఆదౌ దయా ధర్మపత్నీ ససర్జ నిఖిలాః ప్రజాః
హృత్స్థా త్వం వ్యాపినీ లక్ష్మీః మోహినీ త్వం తథా పరా
ఇదానీం దృశ్యసే బ్రాహ్మీ నారాయణీ ప్రియశఙ్కరీ
నమస్తస్యై మహాలక్ష్మ్యై గజముఖ్యై నమో నమః
సర్వశక్త్యై సర్వధాత్ర్యై మహాలక్ష్మ్యై నమో నమః 
యా ససర్జ విరాజం చ తతోఽజం విష్ణుమీశ్వరమ్
రుదం తథా సురాగ్రయాఁశ్చ తస్యై లక్ష్మ్యై నమో నమః
త్రిగుణాయై నిర్గుణాయై హరిణ్యై తే నమో నమః
యన్త్రతన్త్రాత్మికాయై తే జగన్మాత్రే నమో నమః
వాగ్విభూత్యై గురుతన్వ్యై మహాలక్ష్మ్యై నమో నమః

కమ్భరాయై సర్వవిద్యాభరాయై తే నమో నమః
జయాలలితాపాఞ్చాలీ రమాతన్వై నమో నమః
పద్మావతీరమాహంసీ సుగుణాఽఽజ్ఞాశ్రియై నమః
నమః స్తుతా ప్రసనైవంఛన్దయామాస సవ్దరైః 

॥ ఫల శ్రుతి శ్రీ లక్ష్మీ ఉవాచ ॥

స్తావకా మే భవిశ్యన్తి శ్రీయశోధర్మసమ్భృతాః
విద్యావినయసమ్పన్నా నిరోగా దీర్ఘజీవినః
పుత్రమిత్రకలత్రాఢ్యా భవిష్యన్తి సుసమ్పదః
పఠనాచ్ఛ్రవణాదస్య శత్రుభీతిర్వినశ్యతి
రాజభీతిః కదనాని వినశ్యన్తి న సంశయః
భుక్తిం ముక్తిం భాగ్యమృద్ధిముత్తమాం చ లభేన్నరః
శ్రీలక్ష్మీనారాయణసంహితాయాం దేవసఙ్ఘకృతా శ్రీమహాలక్ష్మీలలితాస్తోత్రమ్

సర్వేజనాః సుఖినోభవంతు , శుభోదయం

పూరి_అద్భుతాల_మహాక్షేత్రం



పురీ జగన్నాథ మహాక్షేత్రం ఒక పుణ్య స్థలం,
విశ్వాస కేంద్రమే కాదు- అత్యంత ప్రాచీన చారిత్రక ప్రశస్తి కలిగిన వైభవ భూమి.

సముద్రతీరంలో శ్రీ జగన్నాథ బలభద్ర సుభద్రామూర్తుల భవ్య మందిరం నీలాచలమనే చిన్న కొండపై నెలకొని ఉంది. నీల మాధవుడిగా నారాయణుడు అనాదిగా ఇక్కడ వేంచేసి ఉన్నాడని స్కాందాది పురాణాల కథనం.

ఒకే నారాయణ స్వరూపం నాలుగు మూర్తులుగా వ్యక్తమైందని స్కాందపురాణ ‘పురుషోత్తమ ఖండం’ చెబుతోంది. దారు(కర్ర)వులతో ఏర్పడిన మూర్తులు గల ప్రసిద్ధక్షేత్రం ఇదొక్కటే. ఎన్నో ప్రత్యేక లక్షణాలు కలిగిన ఈ ఆలయ విధులన్నీ విలక్షణమైన ఆగమాలను అనుసరించి నిర్వహిస్తుంటారు.

జగన్నాథమూర్తి యందు పురుష సూక్త మంత్రాలతోపాటు శ్రీ నృసింహ అనుష్టుప్‌ మంత్రశక్తిని బ్రహ్మ ప్రతిష్ఠించాడని వ్యాసుడి వచనం. వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రంతో బలభద్రుడు ప్రతిష్ఠితుడయ్యాడని, దేవీ సూక్తులతో సుభద్రాదేవి స్థాపితమైందని పురాణం వివరించింది. ఈ ముగ్గురితోపాటు సుదర్శన మహామంత్రాలతో ప్రతిష్ఠ పొందిన సుదర్శనదేవుడి మూర్తి కూడా గర్భగృహంలో కొలువై ఉంటుంది.

పురుషోత్తమ క్షేత్రంగా పురాణ ఋషులు చెప్పిన ఈ క్షేత్రంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. పన్నెండేళ్లకోసారి విగ్రహాలను మార్చే ప్రక్రియే అద్భుతంగాను, మార్మికంగాను ఉంటుంది. ఏ క్షేత్రంలోనూ లేని ప్రత్యేకత ఇది.

అదే విధంగా ప్రసాద మహిమ మరొక వైశిష్ట్యం. ఇక్కడి అన్నం, శాకపాకాలు- అత్యంత పవిత్రమైనవి, మహిమ కలవని అనాది విశ్వాసాచారం.

ఆదిశంకరులు, జయదేవుడు, చైతన్య మహాప్రభువు వంటి మహాత్ములు ఈ క్షేత్రంలో స్వామిని తనివితీరా సేవించుకున్నారు. శంకరుడు భారతదేశపు తూర్పు పీఠాన్ని ఈ క్షేత్రంలో నెలకొల్పారు. ఇది ఋగ్వేద పీఠం. కృష్ణభక్తి సంప్రదాయ ప్రవర్తకుడు శ్రీ చైతన్య మహాప్రభువు ఈ క్షేత్రంలోనే స్వామి దర్శన తాదాత్మ్యంలో లీనమై సిద్ధిని పొందారు.

వైశాఖ శుక్ల అష్టమినాడు పుష్యయోగంతో కూడిన గురువారం నాడు ఈ దేవతామూర్తుల ప్రతిష్ఠ జరిగిందని స్కాందం చెబుతోంది. రథయాత్ర ఆషాఢ శుద్ధ విదియనుంచి పదిరోజులు జరిగే బ్రహ్మాండమైన మహోత్సవం.

నందిఘోష అనే జగన్నాథ రథం, తాళధ్వజ నామం గల బలభద్రుడి రథం, దేవదళన(దర్పదళన) పేరున్న సుభద్రా రథం- మూడింటికీ దేని ప్రత్యేకత దానిదే. నిర్మాణం పూర్తయ్యాక, రథాలపై వివిధ స్థానాల్లో వేర్వేరు దేవతా శక్తులను ఆవాహన చేస్తారు. ప్రత్యేక హవిస్సులతో హోమం చేసి, రథాలను శక్తిమంతం చేశాక, మూలమూర్తులను వైభవంగా తీసుకువచ్చి ఆరోహింపజేస్తారు.

అటుపై విశేష పూజల అనంతరం మహారాజ వీధిలో యాత్ర సాగుతుంది. దివ్య కోలాహలాలతో, సంగీత నృత్యోత్సవాలతో సాగే రథం గుండిచా మందిరానికి చేరాక, విగ్రహాలను దింపి ఆ మందిరంలో పదిరోజులు ప్రజా దర్శనార్థం ఉంచి, తిరుగు రథయాత్ర ద్వారా మళ్ళీ పూర్వ మందిరానికి తీసుకువస్తారు.

ప్రపంచంలోనే అరుదైన మహోత్సవంగా అభివర్ణించదగిన ఈ రథయాత్ర మన మహా సంస్కృతికి సంకేతం.

**దశిక రాము**



*చాంపేయగౌరార్ధశరీరకాయై*

*కర్పూరగౌరార్ధశరీరకాయై*

*ధమ్మిల్లకాయై చ జటాధరాయ*

*నమః శివాయై చ నమః శివాయ.*


*మన్దారమాలాకలితాలకాయై*

*కపాలమాలాఙ్కితకన్ధరాయ*

*దివ్యాంబరాయై చ దిగంబరాయ*

*నమః శివాయై చ నమః శివాయ.*

☘ *శుభోదయం* ☘
🙏🙏🙏 

సమయ ప్రయాణికులు.....

 (Time travellers...)

మహాభారతంలో ఒక కధ ఉంది... కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది. అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు.

ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు.

దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ.. ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ...

ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం...

ఆ చిత్రం పేరు "Interstellar" ఈ చిత్రం 2014 లో వచ్చింది. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రం లో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు.
కూతురంటే అతనికి ప్రాణం.

ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు.
తన కూతురు గదిలో దూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో. అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శని గ్రహానికి(Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని(Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్.

అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా. వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని.. వగైరా వగైరా(etc etc..).. అప్పటికి ఆ హీరో కూతురు వయ్యస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి). ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు. అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం. నాలుగవ డైమెన్షన్ కాలం.

అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట..
అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించ గలడన్న మాట. అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు. అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు.

ఇప్పుడు అర్ధం అయ్యిందా... అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికో సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే.
ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు. అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కాని హీరో వయసు మాత్రం మారదు. ఎందుకంటే హీరో వెళ్లిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలలో సమానం..

పైన మహా భారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కధగానే తీసుకుంటాం. కాని ఆ కధలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే "సమయ విస్ఫారణం"(Time dilation), "కృష్ణ బిలం"(Black hole), "వెచ్చని రంధ్రం” (Warm hole) వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మము యందు చెప్పడం జరిగింది..

అందుకే స్వామీ వివేకానంద అన్నారు.. "సైన్స్ అభివృద్ధి అయ్యేకొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది" అని.

ఇతర లోకాలకు, మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే "సమయ విస్ఫారణం” (Time dilation) అని నేటి సైన్స్ చెబుతుంది. మనం మహాభారతంలో చదువుకున్నాం. పాండవులు చివరి రోజులలో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు మీదుగా ప్రయాణం చేయడం. కాని.. స్వర్గం ఉండేది భూమిపై కాదు. మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలు వెళ్లడం ఏంటి అని అనుమానం వస్తుంది.. నాక్కుడా వచ్చింది..

పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి.. హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వార్మ్ హోల్ ఉన్నాయన్న మాట.. అలాగే ఆది శంకరాచార్యుల వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్ధం అవుతుంది...

మన హిందూ సనాతన ధర్మము ప్రకారం.. మరియు గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి 11 -15 రోజుల వరకూ ప్రతీరోజూ పిండ ప్రధానం చేస్తారు. ఆ తరువాత సంవత్సరం వరకూ నెలకొక్కసారి చేస్తుంటారు. ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు..

ఎందుకో తెలుసా... చనిపోయిన 11 – 15 రోజుల వరకూ జీవుడు భూమిపైనే ఉంటాడు. అందుకే ప్రతీరోజు పిండ ప్రధానం చేస్తాం. ఆ తరువాత జీవుడు స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరు కోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం. ఆ సమయంలో భూమిపై నెలరోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒకరోజుతో సమానం. అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజు కొకసారి పెట్టినట్టు.. ఇక సంవత్సరం తరువాత స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకుంటారు. అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం.

ఎందుకంటే అక్కడ ఒక రోజు, భూమిపై ఒక సంవత్సరంతో సమానం. ఇలానే ఎన్నో లోకాలు, ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి. ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే "సమయ విస్ఫారణం"(Time Dilation) అంటాం..

ఇట్లానే.. బ్రహ్మ దేవుఁడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినపుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయ్యింది. అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా, జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు...

ఇలా మన పురాణాలలో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం మన సంస్కృతిని కాదని పరమతం మాయలో పడుతున్నారు.. మన తరువాత ఎప్పుడో వచ్చిన మతాలు ఇలాంటి విజ్ఞానానంలో మన హిందూ సనాతన ధర్మమునకు దరిదాపుల్లో కూడా రాలేవు..

కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి..
💙🧘🙏🧘🙏💙

అరటి ఆకులు - ప్లాస్టిక్ పోట్లాలు


కాంచి మహాస్వామి వారు 1960లో తిరుచ్చి నేషనల్ కాలేజ్ హైస్కూలులో మకాం చేస్తున్నారు. స్వామివారి అనుగ్రహం కోసం ప్రతిరోజూ వేలసంఖ్యలో భక్తులు వస్తున్నారు. వచ్చినవారందరికీ మంచి రుచి అయిన భోజనం పెడుతున్నారు.

ఉదయం పదకొండు గంటలకు మొదలయ్యే ఈ అన్నదానం సాయంత్రం నాలుగ్గంటల వరకూ జరిగేది. ఏర్పాట్లు చేసే బృందం సభ్యులు ఈ భక్తుల తాకిడిని నియంత్రించడానికి, భోజనాలు అయ్యాక వారిని పంపడానికి చాలా తంటాలు పడుతున్నారు.

వారి సమస్యను స్వామివారికి చెప్పి, భోజనానికి వచ్చే భక్తులకు పంక్తి భోజనం కాకుండా ఆహార పోట్లాలను ఇచ్చే విషయమై స్వామివారికి తెలిపారు.

పరమాచార్య స్వామివారు ఆ కమిటీ సభ్యులను ముందర కూర్చొబెట్టుకుని రెండు ప్రశ్నలను అడిగారు.

మొదటిది: ఆహార పోట్లాలోని పదార్థాన్ని తిన్న తరువాత ఆ అరటి ఆకులను వారు ఎక్కడ పడవేస్తారు?

రెండవది: దాహాన్ని తీర్చుకోవడానికి గ్లాసు నీళ్ళకోసం వారు ఎక్కడకు వెళతారు?
స్వామివారు ముందర కూర్చున్నవారు ఎవ్వరూ ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు.

వారి మౌనాన్ని గమనించి స్వామివారే చెప్పారు, “ఖర్చును, పని ఒత్తిడిని తగ్గించుకోవాలని మీరు ఆలోచిస్తున్నారు. ఆకలిగా ఉన్నవాడు మాత్రమే మొదటి బంతిలో కూర్చోవాలని చూస్తాడు. ఇతరులు చివరి బంతిలో కూర్చుంటారు”

“నేను ఎన్నో ప్రాంతాలకు వెళ్లినప్పుడు, భోజనం తరువాత ఆ అరటి ఆకులను ఒక తొట్టెలో పడవేస్తారు. నేను చూశాను ఆ ఆకులలో మిగిలిపోయిన పదార్థాలను నారికురవలు సేకరిస్తారు. మరియు ఆ ఆకులకు అంటుకున్న ఆహార పదార్థాలను ఆవులు తింటాయి. మీరు గమనించండి, ఆకులు వేసి భోజనం పెట్టడం వల్ల ఎందరో ఇతరుల ఆకలి కూడా తీరుతోంది”.

“ఆహార పోట్లాలను తయారుచెయ్యాలన్న మీ ఆలోచనను విరమించుకొని, అందరికీ అరటి ఆకులు వేసి భోజనం పెట్టండి. ఇంతమంది ప్రజలు ఆహారం స్వీకరించడాన్ని చూడటం, దానికోసం ఖర్చు పెట్టుకోవడం కూడా మీకు పుణ్యం. నాకు ఆనందం కూడా”

అన్న సమారాధనలు చెయ్యడం చూశాము కానీ, దానియొక్క గొప్పదనాన్ని ఇటువంటి మహాత్ములు చెప్పిన తరువాతనే అర్థం చేసుకున్నాము.

--- రా. వేంకటసామి. ‘శక్తి వికటన్’ ఆగస్ట్ 15, 2004 ప్రచురణ

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

త్రికోటేశ్వర స్వామి

త్రికోటేశ్వర స్వామి, కోటప్పకొండ, గుంటూరు జిల్లా*

పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ. సృష్టికర్త బ్రహ్మదేవునికే జ్ఞానోపదేశం ఇచ్చిన ప్రదేశంగా యుగయుగాల నుంచి ఖ్యాతిచెందింది. ‘చేదుకో కోటయ్య.. మమ్మాదుకోవయ్యా...’ అంటూ యల్లమంద కోటయ్యగా ప్రజల పూజలందుకొనే త్రికోటేశ్వరస్వామి వారి దేవాలయం గుంటూరు జిల్లా నరసరావు పేట సమీపంలోని కోటప్పకొండ గ్రామంలో ఉంది. మహాశివరాత్రి పర్వదినాల్లో అత్యంత రద్దీగా భక్తజనంతో నిండిపోతుంది.
ఈ కొండను ఏ కోణం నుంచి చూసిన మూడు శిఖరాలు కనబడుతుంటాయి. అందుకే దీనికి త్రికూటాచలమనే పేరు వచ్చింది. ఈ మూడు శిఖరాలను బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావిస్తారు.
పురాణ కథనం
శివుడు దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తరువాత బాలదక్షిణామూర్తి అవతారంలో బాలునిగా మారి కైలాసంలో కఠిన తపస్సును ఆచరిస్తూంటాడు. ఆ సమయంలో బ్రహ్మ దేవతలందరితోను కలిసి దక్షిణామూర్తిని సందరిస్తాడు. స్వామి వారిని మాకు జ్ఞానబోధ చేయమని వేడుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు త్రికూటాచలానికి వస్తే జ్ఞానాన్ని ఇస్తానని చెప్తాడు. అప్పుడు బ్రహ్మతో పాటు ఇతర దేవతలందరు కూడా త్రికూటాచలానికి వస్తారు అప్పుడు శివుడు త్రికూట కొండపైనే వెలసి వారందరికి జ్ఞానోపదేశాన్ని బోధిస్తాడు. ఆ ప్రదేశంలో ఉన్న గుడికే పాత కోటప్పగుడి అని పేరు. ఆలయం లోపలి లింగం కేవలం ఒక్క అడుగు మాత్రమే ఉంటుంది. గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరమని, పక్కన ఉన్న శిఖరాన్ని విష్ణు శిఖరమని అంటారు.
దక్ష యజ్ఞం సమయంలో హవిస్సును స్వీకరించిన పాపం పోవడానికి విష్ణువు ఈ శిఖరం పై తపస్సు ఆచరిస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై త్రిశూలంతో నేల మీద పొడుస్తాడు. అలా పొడిచినప్పుడు ఏర్పడ్డ రంధ్రాల నుంచి వచ్చిన జలాన్ని స్వీకరించి స్నానమాచరిస్తే సకల పాపాలు తొలుగుతాయని చెప్తాడు. విష్ణువు శివుడు చెప్పిన విధంగా చేసి తన పాపాలను పోగొట్టుకుంటాడు. ఆ విధంగా ఇక్కడ వెలసిన శివున్ని పాపవినాశనేశ్వరుడనే పేరుంది.
రుద్ర శిఖరానికి నైరుతి భాగంలో ఉన్న శిఖరానికి బ్రహ్మ శిఖరమని పేరు. రుద్రవిష్ణు శిఖరాలపై స్వయంభువుగా లింగాలు వెలిశాయి. కానీ బ్రహ్మ శిఖరం పై ఏమి లేకపోవడంతో బాధపడిన బ్రహ్మ శివుని కోసం తపస్సు చేసి లింగావిర్భవం అయ్యేటట్లు చేస్తాడు.
ఈ ప్రదేశానికి తూర్పున మునిమంద/ ఎల్లమంద అనే పేర్లు గల చిన్న పల్లెటూరు ఉంది. ముందుగా బ్రహ్మదిదేవతలంతా ఈ ప్రదేశంలో ఉన్నారని అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని ప్రశస్తి. బ్రహ్మ శిఖరం మీద ఉన్న లింగానికే కొత్త కోటప్పకొండ అని పేరు.
మహాభక్తురాలు.. ఆనందవల్లి..
స్థలపురాణం ప్రకారం శివభక్తుడైన సాలంకయ్యకు శివఅనుగ్రహంతో ఐశ్వర్యం లభిస్తుంది. పరమేశ్వరుడు కొన్ని రోజుల పాటు జంగమదేవర రూపంలో అతని ఇంటికి వచ్చేవాడు. కొన్నాళ్లకు కనిపించలేదు. దీంతో సాలంకయ్య నిరాశ చెందాడు. ఆ సమయంలోనే ఒక దంపతులకు ఆనందవల్లి అనే పాప జన్మించింది. పెరిగేకొద్ది శివునిపై భక్తి పెంచుకొని శైవగీతాలు ఆలపించేది. కొంతకాలం అనంతరం తపస్సు చేయడంతో స్వామి ప్రత్యక్షమయ్యారు. ఆనందవల్లి ప్రతిరోజూ రుద్రాచలానికి వచ్చి శివలింగానికి పూజలు నిర్వహించేది. ఈ సంగతి తెలుసుకున్న సాలంకయ్య తనకు కూడా శివదర్శనం ఇప్పించాలని కోరాడు. అయితే ఆమె అంగీకరించక శివుని ఆరాధనలో కొనసాగింది. ఒక రోజు అభిషేకం కోసం జలం తీసుకువెళుతుండగా నీటి కొరకు ఒక కాకి బిందె మీద వాలింది. దీంతో ఆగ్రహించి కాకులు ఇక్కడకు రాకూడదని శాపం పెట్టింది. ఇప్పటికీ కాకులు ఈ క్షేత్రంలో రాకపోవడం విశేషం. ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆమెను కుటుంబజీవితం కొనసాగించమని బ్రహ్మచారిణిగా ఉన్న ఆమెను గర్భవతిగా మారుస్తాడు. అయినా ఆమె శివారాధన చేయడం మానలేదు. ఆమె భక్తికి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై తానే ఆమె వెంట వచ్చి పూజలు స్వీకరిస్తానని అయితే ఇంటికి వెళ్లే సమయంలో తిరిగి చూడకుండా వెళ్లాలని ఆజ్ఞాపిస్తాడు. ఆనందవల్లి కొండ మెట్లు దిగుతూ ఒక చోట కుతూహలం కొద్దీ వెనక్కు తిరిగి చూడటంతో స్వామి వెంటనే అక్కడ వున్న గుహాలో లింగరూపం ధరించాడు. ఆనందవల్లికి కుమారుడు జన్మించాడు. తాను వెనక్కు తిరిగిచూడటంపై వల్లి బాధపడింది. మరణానికి సిద్ధం కావడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఆ సమయంలో బాలుడు కూడా అదృశ్యమవుతాడు. ఇదంతా శివమాయ అని ఆనందవల్లి గ్రహిస్తుంది. అనంతరం శివునిలో ఆమె ఐక్యమైంది. 

అశ్వత్ధవ్రుక్చం

🍀🍀🍀🍀🍀🍀🍀🍀అశ్వత్ధవ్రుక్చం యొక్క ప్రాశస్త్యం గురించి :'అశ్వత్ధవ్రుక్చం లో సర్వ దేవతలు ఉంటారు. దాని మహాత్మ్యము గురించి బ్రహ్మాండ పురాణం లో నారద మహర్షి చెప్పాడు. అశ్వత్ధమే నారాయణ స్వరూపం. ఆ వ్రుక్చం యొక్క మూలమే బ్రహ్మ. దాని మధ్య భాగమే విష్ణువు. దాని చివరి భాగమే శివుడు. కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులు ను పూజించినట్లే. అలానే, త్రిమూర్తులూ దానియొక్క దక్షిణ, పడమర, ఉత్తర దిక్కులు లోని కొమ్మలు. తూర్పు దిక్కుకున్న కొమ్మల లో ఇంద్రాది దేవతలు ఉంటారు. దాని వ్రేళ్ళలో మహర్షులు, గోబ్రాహ్మణులు, నాలుగు వేదాలు ఉంటాయి. సప్త సముద్రాలు, పుణ్య నదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి. ఆ చెట్టు యొక్క మూలంలో 'అ' కారము, మానులో 'ఉ' కారము, దాని పండ్లు 'మ' కారము. ఆ వ్రుక్చం అంతా కలిపి ప్రణవ స్వరూపమే. ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించ గలరు? అది సాక్షాత్తు కల్పవృక్షమే. ఈ వ్రుక్చం ను సేవించవలసిన విధానం నారదమహర్షి ఇలా చెప్పాడు. "అశ్వత్ధ ప్రదక్షిణం చైత్ర, ఆషాడ, పుష్య మాసాలలోనూ, గురు, శుక్ర మౌడ్యాలలోనూ, క్రుష్ణ పక్షంలోనూ ప్రారంభించకూడదు. శుభ సుముహూర్తం లో స్నానాదులు చేసుకొని శుచియై ఉపవశించి మరీ ప్రారంభించాలి. ఆది, సోమ, శుక్ర వారాల్లో నూ, సంక్రమణ సమయాలు మొదలైన నిషిద్ధ సమయాలలోనూ, రాత్రి భోజనం అయ్యాక ఈ వ్రుక్చం ను సేవించకూడదు. సాధకులు మొదట ఆత్మస్తుతి, పరనింద, జూదము, అసత్యములను విడిచి పెట్టాలి. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి, ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగ యమున లను పూజించాలి. అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్ధ వ్రుక్చం నకు భక్తి తో ఏడుసార్లు అభిషేకం చేయాలి. అప్పుడు మరల స్నానం చేసి, దేవతా మయమైన ఆ వ్రుక్చం నకు పురుష సూక్తవిధానంగా షోడశోపచార పూజ చేయాలి. అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని ఎనిమిది బాహువులు కలవానిగా ధ్యానించాలి. తర్వాత విష్ణు సహస్ర నామ చదువుతూ గానీ, మౌనంగా గానీ, ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణ మొదట, చివరా నమస్కారము చేయాలి. ఇలా రెండు లక్షలు ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు నశించి, నాలుగు పురుషార్ధాలు సిద్ధిస్తాయి. త్రికరణశుద్ధిగా దానిపై దృష్టి ని నిలిపి, బిడ్డలు కలగాలన్నా, పెళ్లి కావాలన్నా సంకల్పం తో ప్రదక్షిణ చేస్తే తప్పక అనుకున్న పనులు జరుగుతాయి. శనివారం నాడు ఈ చెట్టు ను త్రాకి మ్రుత్యుంజయ మంత్రము జపిస్తే మ్రుత్యుభయం తొలగుతుంది. అశ్వత్ధాన్ని పూజించాక.
శనీశ్వరుని మంత్రమును జపించితే శని దోషం కూడా తొలగి, అభీష్ట సిద్ధి కలుగుతుంది.
             గురువారం, అమావాస్య కలిసిన రోజు న రావిచెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది. అక్కడ వేద విప్రునికి మ్రుష్టాన్నం పెడితే కోటిమంది బ్రాహ్మణులు కు సమారాధన చేసిన ఫలితముంటుంది. అక్కడ చేసిన గాయత్రీ జపం వలన నాలుగు వేదాలు చదివిన ఫలితం ఉంటుంది. రావిచెట్టును స్థాపించి తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది. దానిని కొట్టివేయడం మహాపాపం. పైన తెలిపిన ప్రదక్షిణలు చేశాక, ఆ సంఖ్య లో పదవ వంతు హోమం, అందులో పదవవంతు బ్రాహ్మణ సమారాధనమూ చేయాలి. ఈ వ్రతకాలములో బ్రహ్మ చర్యం అవలంభించాలి. ఉద్యాపన తర్వాత బంగారు రావిచెట్టు ను, అలంకరించిన ఆవుదూడలను, గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని, ఉదారమైన దక్షిణ లతో సౌశీల్య వంతులు, కుటుంబీకులు అయిన వేద విప్రులకు దానమివ్వాలి. ఇలా చేస్తే తప్పక అభీష్టం సిద్ధిస్తుంది.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀

రామాయణమ్.54


...
రాముడి వన గమనమునకు కౌసల్య అనుమతించటంలేదు. తల్లిని సమాధాన పరుచట ఇప్పుడు ఆయన కర్తవ్యము! .
.
అమ్మా ! నీవు,నేను,లక్ష్మణుడు,సుమిత్రామాత అందరమూ తండ్రిగారి ఆజ్ఞకు బద్ధులము కావలసినదే ! అది సనాతన ధర్మము!
( తండ్రి కుటుంబపు పెద్ద ,He is Superior to all in the family,
కుటుంబ వ్యవస్థ క్షీణదశకు చేరుకున్న నేటి రోజులలో దాని ప్రాముఖ్యత ప్రస్తుతము అర్ధము కాదు అని నా భావన).
.
నాయనా! నీ తండ్రి వలే నేను కూడా నీకు గురు స్థానములో ఉన్నాను కావున నీకు అనుజ్ఞ ఇవ్వను అని పలుకుతున్న తల్లిని, ఆవిడకు అండగా నిలచిన లక్ష్మణుని చూసి.....

రాముడు ,....కొరివిమంటలు పట్టుకొన్న మనుష్యులచే అడవిలో చుట్టుముట్టబడ్డ గొప్ప ఏనుగు లాగ అయిపోయాడు.
.
ఇంతగా వారిస్తున్నా ,ఆయన బుద్ది మాత్రము ఒకదానియందే స్థిరముగా ఉన్నది అదియే "ధర్మము".
.
(ధర్మమార్గమునుండి రవ్వంతయినా ప్రక్కకు జరుగడు .నిశ్చయాత్మకమైన ,నిర్ణయాత్మకమైన బుద్ధి ధర్మమునందేగలవాడు ఒక్కడే !..అతడే "రాముడు".)
.
తన బుద్ధి మారకుండా దృఢముగా నిలుచుని ,స్థిరగంభీర కంఠముతో ,లక్ష్మణా ఎందుకు నీవు అమ్మతో చేరి నన్ను బాధిస్తావు? .కష్టపెడతావు?
.
అర్ధము,కామము నాకు ముఖ్యము కావు !
వాటికొరకు నాలో వెంపర్లాట లేదు !
ధర్మము పాటించడమే నాకు చాలా ఇష్టము ,
ధర్మపథము నాకిష్టమైన మార్గము.
.
తండ్రి మనకు పూజ్యుడు,
 ఆయన వృద్ధుడు కావచ్చుగాక,
కామప్రేరితుడు గావచ్చుగాక,
ఆయన కోపముగానైనా,సంతోషముగానైనా ఆజ్ఞాపించినప్పుడు ధర్మదృష్టి కలవాడెవడైనా చేయకుండా ఉంటాడా!.
.
కేవలము రాజ్యము ,భోగములకొరకు గొప్పగొప్ప ఫలితాలిచ్చే ధర్మమార్గము నేను వదలను గాక వదలను...
.
యశోహ్యహం కేవలరాజ్య కారణాత్
న పృష్ఠతః కర్తుమలం మహోదయమ్!
.
ఈ జీవితము అల్పకాలికమైనది దీనికోసం తుచ్ఛమైన రాజ్యము ధర్మవిరుద్ధముగా సంపాదించను.
.
  శ్రీ రామసింహం ధర్మగర్జన చేసింది
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

ధర్మధ్వజం
హిందు చైతన్య వేదిక

ఆచారాల్లో అంతరార్ధాలు



నిత్య జీవితంలోని ప్రతీపనిని ఆచారంగా సనాతన సంప్రదాయంలో నిర్దేశించారు. దాన్ని ఒక మతంలా కాకుండా జీవనవిధానంగా ఉండేట్లుగా ఆచరింపజేశారు. కొన్నింటిని ప్రకృతి పరంగా.. మరికొన్నింటిని శాస్ర్తీయకోణంలో.. ఇంకొన్నింటిని పౌరాణిక దృక్కోణంతో.. ఖగోళ దృష్టితో చూడవచ్చు. ఇవన్నీ ఎవరూ కదల్చలేనంతగా మన మనస్సుల్లో నాటుకుపోయాయి. వాటిని ఒక ఆచారంగా పరిగణిస్తూ కాకుండా.. అంతరార్థం తెలుసుకుని పాటించడం ద్వారా.. సత్యం దిశగా వెళ్లేందుకు దోహదపడుతుంది.
మనం ఏ పని ప్రారంభించినా తొలుత గణపతిని పూజిస్తాం. ఆ గణేశుడు గణాలకు అధిపతి. మూలానికి లేదా ఆధారానికి ఆది దైవం. యోగ శాస్త్రం ప్రకారం గణపతి మూలాధార చక్రానికి అధిపతి. ఆధారమన్నా, మూలమన్నా ఒక్కటే. ఏ పనికైనా మూలం.. అంటే.. ఏదో ఒక కారణం; దాని కోసం ఏదో ఒక ఆధారం లేకుంటే అది జరగదు. కాబట్టి మూల-ఆధార అనే రెండు శబ్దాలు గణపతి ఏ పనికైనా ప్రథమ పూజర్హత గలవాడని సూచిస్తాయి. ఏది ఆధారమో అది మొదట పట్టుకొవాలన్నది అంతరార్థం.

అలాగే మన పూర్వికులు జుట్టు-బొట్టుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు జుట్టు పరుషుల్లో అంత ప్రాధాన్యం లేకున్నా.. ముత్తయిదవులకు పాపెట ఒక ముఖ్య నియమం. గర్భిణీ స్ర్తీలకు మూడో నెలలో జరిగే ఒక చిన్నపాటి ఉత్సవంలో భర్త భార్యకు పాపెట తీస్తాడు. సీమంతంలో.. సీమ అనగా ఎల్ల లేదా పొలిమేర. అప్పుడే ఈ పాపెట ప్రాధాన్యతను మరోసారి గుర్తించవచ్చు. పాపెటకు నడినెత్తిన బ్రహ్మరంధ్రానికి దగ్గరి సంబంధం ఉంది. స్ర్తీలకు పాపెట ఎక్కడ ఆగుతుందో అక్కడి నుండి శిఖ అనగా జుట్టు ప్రారంభమయ్యేది.

పూర్వం కులాలకు అతీతంగా పురుషులంతా అర్ధముండ శిరస్కలే. తలపై గల ఈ సీమాంతం అనగా శిఖ స్థానాన్ని బ్రహ్మరంధ్ర స్థానం అంటారు. అది శరీరానికి దశమ ద్వారం. శరీరంలోకి జీవుడు అక్కడి నుంచే ప్రవేశిస్తాడు కాబట్టి మళ్లీ అక్కడి నుండే వెళ్లాలి. యోగులు తమ యోగ సాధనతో అలా కపాలాన్ని ఛేదించుకొని దేహ త్యాగం చేస్తారు. ఈ బ్రహ్మరంధ్ర స్థానం ప్రధాన ఆయువుపట్టు స్థానం. అక్కడ దెబ్బ తగిలితే సద్యోమరణం సంభవిస్తుంది. కాబట్టి భౌతిక ప్రయోజనంగా శిఖను పెట్టారు.


అలాగే వైదిక కర్మల్లో శిఖ ప్రాధాన్యం చాలా ఉంది. దేవాలయానికి ధ్వజ స్తంభంలా, ధ్యాన శరీరానికి ఆధ్యాత్మిక ప్రపంచతో సంబంధం కలిపేది శిఖ. అలాగే భ్రూమధ్య స్థానంలో ధరించే బొట్టు- కుంకుమ, గోరోచనం, కేసరి, కస్తూరి, భస్మం, విభూతి, గంధం, గోపీచందనం.. ఏదైనా ఏ సంప్రదాయం ప్రకారం ధరించినా ముఖానికి అందాన్ని కలిగిస్తుంది. ఆ బొట్టు ధరించే స్థలం ఆజ్ఞా చక్రస్థానం. దీనికి త్రివేణి సంగమం, త్రికూట స్థానం అని పేర్లున్నాయి.


జాగ్రదవస్థలో దేహంలోని జీవుడు ఆజ్ఞా చక్రస్థానంలోనే ఉంటాడు. జీవుని రంగు ఎరుపు. అందుకే ఇక్కడ కుంకుమ ధరించాలనే అంతరార్థం ఉంది. ఉదాహరణకు శివుడు భస్మ స్వరూపుడు. బ్రహ్మ రాసిన రాత నుదిటిపై ఉంటుంది అంటారు. దీనిని కన్పించకుండా చేయగల శక్తి శివతత్వానికి ఉంటుందని, అలాగే ఊర్ధ్వ పుండ్రాలు మనం పొందాల్సిన ఊర్ధ్వగతిని సూచించే సంకేతాలు. ఇలా ప్రతీ సంప్రదాయంలో ఎన్నో సంకేతాలు, అంతరార్థాలున్నా.. వాటిని ఆచరించే విషయాలుగా మనకు అందించారు ఋషులు. వాటి వెనుక ఉన్న నిగూఢార్థాన్ని గ్రహించి.. ఆచరిస్తే అదే పరమానందం.

ప్రాభాతభాస్కరదర్శనం



లోకాలవ్యాపించి చీకాకులే గొల్పు
     చీకట్లనే బాపు సేవకుడయి
అరుణార్ద్రరాగాల నవనియే పులకించు
     మమతలేపండించు మతధనుడయి
అరవిచ్చుమోముల యందాలచిందించు
     పద్మాల మురిపించు బాంధవుడయి
ఆరోగ్య భాగ్యోదయాహ్లాదమొదవించు
     ప్రత్యుషస్సుల పంచు రాగదుడయి

ప్రతి దినమ్మున ప్రాజ్నగభాసుడైన
వెలుగు విందులగావించు పెద్దయైన
కిరణ సాహస్ర విన్యాస భరితకీర్తి
భాస్కరుని రమ్య దర్శన ప్రాప్తిగలిగె.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

ప్రయోగాత్మకంగా న్యాయ స్థానాల కార్యకలాపాలు

తేదీ: 07-09-2020 నుండి  11-09-2020 వరకు ప్రయోగాత్మకంగా మన కరీంనగర్ జుడిషియల్ డిస్ట్రిక్ట్ పరిధి లో గల న్యాయ స్థానాల కార్యకలాపాలు గౌరవ హైకోర్టు ఆఫ్ తెలంగాణ వారి విధి విధానాల ప్రకారం ప్రారంభం.

1) కక్షి దారులకు న్యాయస్థానాల సముదాయాల లోనికి అనుమతి లేదు.

2) ప్రతి రోజు ఒక్కొక్క కోర్టులో సివిల్ మరియు క్రిమినల్ కలిపి 20 కేసులు మాత్రమే విచారించడం జరుగుతుంది.

3) కేసు విచారణకు ఆ కేసుకు సంబంధించిన ఇరువురు న్యాయవాదులను మాత్రమే కోర్ట్ హాల్ లోనికి అనుమతించడం జరుగుతుంది.

4) ఇరుపక్షాల న్యాయవాదులు సంసిద్ధత వ్యక్తం చేసిన కేసులను మాత్రమే విచారిస్తారు.

5) ఒక వేళ ఎవరైనా న్యాయవాదులు విచారణకు సంసిద్ధత వ్యక్తం చేయని యెడల ఆ కేసులలో గౌరవ న్యాయమూర్తి గారు ఎలాంటి వ్యతిరేక ఉత్తర్వులను జారీ చేయరు.

6) సీనియర్ న్యాయవాదులు మరియు ఇంకా ఇతరత్రా కారణాల చేత ఎవరైనా న్యాయవాదులు కోర్టుకు రానివారు ఉంటే వారి వారి ఇంటి నుంచే వర్చువల్ కోర్టు ద్వారా వాదోపవాదాలు చేయవచ్చును.

 7) ప్రతి న్యాయవాది విధిగా మాస్కు ధరించి రావాలి.

8) ప్రతి కోర్టు హాలు ముందు శానిటైజర్ అందుబాటులో ఉంచడం జరుగుతుంది.

 9) కాస్ లిస్టు ఒక రోజు ముందుగా మన గ్రూపులో పోస్ట్ చేయడం జరుగుతుంది

10) ప్రతిరోజు లోక్ అదాలత్ ద్వారా కేసుల రాజీ చేయడం జరుగుతుంది. రాజీ పడే కక్షి దారులు మన కోర్ట్ కాంటీన్ దగ్గర ఉంటే కోర్టు సిబ్బంది వీడియో కాల్ ద్వారా సంబంధిత గౌరవ న్యాయ మూర్తులతో అనుసంధానం చేస్తారు.
                                   ఇట్లు
                  *అనిగంటి వెంకటేష్ *
                        అడ్వకేట్
                       *కరీంనగర్ *
                      * 8497996662*

ధార్మికగీత - 13


                                       ***
            శ్లో:- జీర్యంతే  జీర్యతః  కేశా: ౹
                   దంతాః  జీర్యంతి జీర్యతః ౹
                   జీర్యతః  చక్షుషీ  శ్రోత్రే ౹
                   తృష్ణా ఏకా తరుణాయతే౹౹
                                       ***
భా:- మనిషి శైశవ, బాల్య,కౌమార, యౌవన దశలను  జవ సత్త్వాల జోరులో  సంతోషంగా  గడిపి, వృద్ధాప్యంలోకి రాగానే, మనప్రమేయం లేకుండానే క్రమంగా శిరోజాలు  తెల్లబడి,   రాలిపోతుంటాయి.  కొన్ని టన్నుల ఆహారాన్ని నమలడంలో అలసి, సొలసిన దంతాలు  ఊడిపోతుంటాయి. సమస్త ఇంద్రియాలలో తలమానికమై, ప్రకృతి రామణీయకతని పసందైన విందుగా అందించి, జీవితానికే చుక్కాని యైన  "కళ్ళు" కనబడని పరిస్థితి దాపురిస్తుంది. ఇష్టమైనా, కష్టమైనా పంఖానుపుంఖాలుగా ఎన్నో విషయాలు విని, విని    "చెవులు" వినబడకుండా పోతాయి. కాని మనం పుట్టగానే మనతో పుట్టిన "ఆశ" మాత్రము కరగని, తరగని  నిత్య నూతన యౌవనంతో  మిసమిసలాడుతున్నది. కాన బాల్యంలో భక్తిబీజాలను అంకురింపజేసుకొని, కౌమారంలో బలపరచుకొని, యౌవనంలో స్థిరపరచుకొని,   పలు క్షేత్రాలు, తీర్ధాలు దర్శించి, ముదిమిలో  ఆశలను విడనాడాలి. జీవన్ముక్తికి సాధన చేయాలి. పోతన గారు సెలవిచ్చినట్లు "అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తు"లమై నిరంతరం ఆధ్యాత్మిక పథంలో నడవగలగాలని సారాంశము.
                                    ***
                     సమర్పణ  :  పీసపాటి
**********************

శ్రీ గురవే నమః



ప్రహ్లాద బాలుడు  ప్రజ్ఞాని యైనను
           కోరి విద్యలు నేర్చె గురువు కడను
శ్రీరామచంద్రుడు స్థిరచిత్తు డయ్యును
           కోరి విద్యలు నేర్చె గురువు కడను
పరమాత్మ కృష్ణుండు బ్రహ్మమే యయ్యును
           కోరి విద్యలు నేర్చె గురువు కడను
శంకరాచార్యుడు షట్శాస్త్ర వేద్యుడై
           కోరి విద్యలు నేర్చెగురువు కడను
గురువు నేర్పని విద్యకు గురుతు లేదు
ఆరయ భక్తితొ నుతియించ గురువె బ్రహ్మ
ఆరయ భక్తితొ నుతియించ గురువె విష్ణు
ఆరయ భక్తితొ నుతియించ గురువె శివుడు
గురువె పరమాత్మ , మూలంబు  గురువు గురువె

గోపాలుని మధుసూదన రావు

 గురువులకు నెల్ల గురులై

గురులఘుభావములు లేక కొమరారు జగ

ద్గురులు త్రిలోకహితార్థము

గురుశిష్యన్యాయలీలఁ గొలిచిరి వేడ్కన్...
ప్రాభాతభాస్కరదర్శనం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
లోకాలవ్యాపించి చీకాకులే గొల్పు
     చీకట్లనే బాపు సేవకుడయి
అరుణార్ద్రరాగాల నవనియే పులకించు
     మమతలేపండించు మతధనుడయి
అరవిచ్చుమోముల యందాలచిందించు
     పద్మాల మురిపించు బాంధవుడయి
ఆరోగ్య భాగ్యోదయాహ్లాదమొదవించు
     ప్రత్యుషస్సుల పంచు రాగదుడయి

ప్రతి దినమ్మున ప్రాజ్నగభాసుడైన
వెలుగు విందులగావించు పెద్దయైన
కిరణ సాహస్ర విన్యాస భరితకీర్తి
భాస్కరుని రమ్య దర్శన ప్రాప్తిగలిగె.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.
 +91 89197 29199:
***************
40వ పద్యం
మ.
మును నీచే నపవర్గరాజ్యపదవీమూర్ధాభిషేకంబు గాం
చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో  చింతించి చూడంగ నె
ట్లనినన్ గీటఫణీంద్రపోతమదవేదండోగ్రహింసావిచా
రిని గాగా, నిను గాన గాక మదిలో శ్రీకాళహాస్తీశ్వరా!
**********************

పితృకర్మలు

వేదం విధించిన కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి. 

నవమాసాలు కడుపులో పెట్టుకొని, రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి, పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణభారము వహించిన తండ్రికి కృతజ్ఞత చూపడము మానవత్వము.   విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి.

మనం తల్లితండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచు, సత్కీర్తిని పొందుతూ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి.  వీటి కోసమే మాసికాలు, ఆబ్దీకాలు నిర్దేశించ బడ్డాయి.  మాసికం అంటే మరణించిన సంవత్సరం లోపు ప్రతీ నెలా వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దీకం.  అంటే నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రియంగా జరిపించి, మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించటం మన విధి. అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు మాసికం అయితే నెల వరకు, ఆబ్దీకం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని మన నమ్మకం.

మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లితండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే భాద్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు ఆబ్దీకాలు పెట్టాలి.

కాని ప్రస్తుత కాలంలో వివిధ కారణాలతో చాలా మంది ఈ కార్యక్రమాలు చేయలేక పోతున్నందుకు వారిలో వారు భాధపడుతున్నారు.  అనేక మంది వివిధ కారణాల వల్ల ఈ కార్యక్రమాలు చేయలేకపోతున్నారు.

కొంత మంది స్వదేశం వచ్చినప్పుడో లేక స్వగ్రామం వచ్చినప్పుడో, ఏ కాశీలోనో ఏ గయలోనో పితృ తర్పణాలు ఒక్కసారి చేస్తే సరిపోతుందని అనుకుంటారు.  అది పొరపాటు.  ఎందుకంటే పుణ్య నదులలో పుణ్యక్షేత్రాలలో చేసిన కర్మలు పవిత్రమైనవే కాని అవి పూర్తిగా సమాప్తం కావు. కాబట్టి పుత్రులు తామున్నంత వరకు పితృకార్యాలు (మాసికం, ఆబ్దీకం) చేయాలి. అలా చేయలేని పరిస్థితులలో ఆ కార్యాన్ని నిర్వర్తించే వారిపై నమ్మకం ఉంచి చేయించిన కూడా ఫలితం లభిస్తుంది.

మాసికాలు, ఆబ్దీకాలు ఒక్క మన తల్లి తండ్రులకు మాత్రమే గాక మగ పిల్లలు లేని బంధువులకు మనం కర్తగా ఉండి ఈ కర్మలను నిర్వర్తించవచ్చును.

ఉదా : మావయ్య, అత్తయ్య, తాత, బామ్మ, అమ్మమ్మ, అన్న, వదిన, తమ్ముడు, భార్య, కొడుకు, పిన్ని, బాబయ్య, పెద్దమ్మ, పెద్దనాన్న మొదలగు వారికి కర్మలను నిర్వహించినచో వారు మోక్షమార్గం పొందగలరు.

తీర్థయాత్రలకి వెళ్ళలేని వారు కనీసం తీర్థయాత్రలు చేసిన వారిని చూసిన, సేవించినా కూడా పుణ్యం కలుగుతుందని పురాణాలలో చెప్పబదింది.  అలాగే మాసికాలు, ఆబ్దీకాలు స్వయంగా పెట్టలేని వారు తగు వ్యక్తుల సహాయ సహకారాలతో పెట్టించటం కూడా స్వయంగా పెట్టినంత ఫలితానిస్తుంది.  ఇది మన భారతీయతలోని సనాతన ధర్మం, సంప్రదాయం తద్వారా వారి వంశాభివృద్దిని ఆయుక్షేమాన్ని, సుఖ శాంతులను పొందగల్గుతారు.

ఒకసారి భీష్ముడు తన తండ్రికి పితృకర్మ తలపెట్టాడు. పరమనిష్ఠతో పితృకర్మలు సమర్పిస్తున్న కుమారుడి శాస్త్రబద్ధతకు మురిసిన ఆయన తండ్రి శంతనుడు స్వయంగా పిండాన్ని అందుకోవడానికి దిగివచ్చాడు.  పిండాన్ని తనకు ఇవ్వమని కుమారుడిని అడిగాడు. ‘శాస్త్రాలు ఒప్పుకోనందున నేను పిండాన్ని నీ చేతుల్లో పెట్టలేను’ అని భీష్ముడు అన్నాడు.  పిండాలను భూమిమీదనే పెట్టాలని శాస్త్రాలు నియమాన్ని విధించాయి.

పితృ కర్మలు అనగా ఆబ్దీకములు(శ్రాద్ధ కర్మలు, తద్దినములు) వదిలిపెట్టడము అంటే చేయకపోవడం వలన మన యొక్క వంశాన్ని, మన పిల్లల్ని, మనల్ని కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది.

నిత్య, నైమిత్తిక, కామ్య కర్మలను ఆచరించే మానవులు, తమ పితృ దేవతలను ఉద్దేశించి చేసే కర్మ శ్రాద్ధ కర్మ.  శ్రాద్ధ కర్మ అంటే శ్రద్ధతో ఆచరించ వలసినది. మృతులైన పిత్రాదులను ఉద్దేశించి శాస్త్రోక్తమైన కాలమందును, దేశమందును పక్వాన్నము గాని(భోక్తలకు భోజనము ), యామాన్నము గాని (బియ్యము, పచ్చి కూరలు, పప్పు దినుసులు మొదలగునవి), హిరణ్యము(బంగారము) గాని విధి ప్రకారము బ్రాహ్మణులకు దానము చేయుట శ్రాద్ధమనబడును.

అశ్రద్ధ అనగా నాస్తికత్వ బుద్ధి చే పితృదేవతలు లేరని, అనేవారి పితరులు రక్తము త్రాగుదురు(భోజనము అందక) పితృ దేవతలను ఉద్దేశించి మంత్ర పూర్వకముగా ఇచ్చే వస్తువులు ఏ రూపముగా ఇచ్చినను వారికి చేరును.

మనము శ్రాద్ధ కర్మ చేయునపుడు పితృ దేవతలు వాయురూపమున అతి త్వరగా వచ్చి భోజనము భుజింతురు అందుచే శ్రీ రామ చంద్రుడు శ్రాద్ధము చేయునపుడు సీతా దేవి బ్రాహ్మణుల యందు దశరధాదులను చూసెనని కధ ఉన్నది.

మనం పెట్టే ఈ శ్రాద్ధ కర్మలు మన తండ్రి, తాత, ముత్తాత, తల్లి, నానమ్మ మొదలైన వారికే కాకుండా మన రక్త సంబంధీకులు, స్నేహితులలో అగ్ని ప్రమాదము, వాహన ప్రమాదము ఇలా అనేక ప్రమాదములలో మరణించిన వారికి ఉపనయనము అవ్వకముందే మరణించిన వారిని కూడా ఈ సంధర్భముగా మనము త్రుప్తి పరుస్తాము.   అంతే కాక మన ఇంట్లో పని చేసి మరణించిన వారికి కూడా మనము ఈ శ్రాద్ధ కర్మలు ద్వారా తృప్తిపరుస్తాము.

అపుత్రస్యగతిర్నాస్తి: అంటే వారసులు లేని వారికి ఉత్తమగతులు సంప్రాప్తించబోవని సాధారణంగా నిస్సంతువులు నిరంతరం దుఖిఃస్తుంటారు. సంతానం లేకపోతే ఉత్తమ గతులు సంప్రాప్తించవని భావించడం, ఆ క్రమంలో నిరంతరం దుఖిఃంచడం వ్యర్థం.  సృష్టికి పునరుత్పత్తి అనేది అవసరం కాబట్టి దానిని కొనసాగించడం కోసం తన తదనంతరం వారసులు ఉండాలని అందరూ భావిస్తుంటారు.  వాస్తవానికి వారసులు అంటే సంతానం అని మాత్రమే కాదు.  చేసే పని ఏదైనప్పటికీ దానిని అందుకొని కొనసాగించే వారసుడిని పొందాలనేది అపుత్రస్యగతిర్నాస్తిః యొక్క వాస్తవిక అర్థం.

పితరులను ఉద్దేశించి, వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్దతో అర్పించేదే శ్రాద్ధం.  ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది.  వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు.  పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పని సరి విధి.  శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపం లో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు.  వారు బ్రాహ్మణులతో కూడా వాయురూపం లో భోజనం స్వీకరిస్తారు.

శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతం గా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణం లో చెప్పబడింది.  ఆదర్శ పూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతతి వారి ఆయువు, విద్య ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మలో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది.  అన్ని దానాలలోను అన్న దానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది.  అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది.

కొంత మంది వివిధ కారణాలతో తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు. ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు.  ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు.  ఇది నిజము.

పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు.  మనందరి (జీవుల) రాకపోకలను, వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ.  వసువులు, రుద్రులు, ఆదిత్యులు.. మొదలుగా గల దేవతలను పితృదేవతలు అంటారు.

కర్మ క్షయం కాని జీవుడు మరణించిన తరువాత పుడతాడు అనేది నిజం.   కానీ వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేము.  ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు 300 సంవత్సరాలు పడుతుంది. వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపొలేదు.  అది ఆ జీవుని యొక్క సంకల్ప బలం, తనకి గల ప్రారబ్ధ, ఆగామి, సంచితం అనే కర్మలపైన ఆధార పడి ఉంటుంది.

ఒకవేళ వెంటనే పుట్టినా సరే మనం చేసే పితృకర్మల ఫలితం వారికి అందుతుంది. వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టినది వారికి ఏది ఆహారమో ఆ రూపంలో అందుతుంది.  ఇలా చేయడానికి ఒక వ్యవస్థని పితృదేవతలు ఏర్పాటు చేసేరు.  ఉదాహరణకు, ఆ జీవుడు ఆవుగా పుడితే గడ్డి మొదలైన రూపంగా మారి మనం పెట్టిన ఆహారం అందుతుంది.  వారిని ఉద్దేశించి అలా చేసినందుకు పితృదేవతలు కూడా సంతోషించి మనకి మంచి కలుగజేస్తారు.  ఒకవేళ గతించిన వారు ముక్తిని పొంది లేదా ఉత్తమ గతులలో ఉండి మనం చేసినవి అవసరం లేని స్థితిలో ఉంటే మనం చేసిన పితృకర్మల ఫలితం మనకే మన కోరికలు తీరే విధంగా వస్తుంది.  కానీ గతించిన వారి స్థితి మనకు తెలియదు కనుక మనం జీవించి ఉన్నంత కాలం పితృకర్మలు చేయవలసినదే.

ఈ జన్మతో బంధం తెంచుకున్న జీవన్ముక్తులకి తప్ప మిగతావారికి గతించిన తరువాత కూడా తన పూర్వీకులతోనూ, తన తరువాతి తరం వారితోనూ సంబంధం ఉంటుంది.  మనం పెట్టే ఆహారం స్వీకరిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని కాపాడేది వాళ్ళే.
********************