31, అక్టోబర్ 2024, గురువారం

దీపావళి

 దీపావళి


వెలిగింపవే! వీధి వీధుల విజ్ఞాన దివ్యప్రభాజాల దీపమాల! కట్టింపవే! కమ్ర కల్యాణ భారతీ ద్వారాల మంగళ తోరణాలు! వినిపింపవే! విశ్వవీణపై విద్యాప్ర వీణవై స్వాతంత్ర్య వీరగీతి! మ్రోగింపవే! జగన్మోహకమ్ముగ దిగ్ది గంతాల విజయ సంక్రాంతి భేరి!


మానవానంద మాధవీ మందిరమున భద్రపీఠిక గొల్వయ్యె భాగ్యలక్ష్మి శ్రీపదాబ్జద్వయమ్ము నర్చింపరావె! హృదయ పుష్పాంజలుల్ సమర్పించిపోవె !


~ సుధాంశు

*8 - భజగోవిందం

 *8 - భజగోవిందం / మోహముద్గర*

🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅


*భజగోవిందం శ్లోకం:-6*


*యావత్పవనో నివసితి దేహేతావత్పృచ్ఛతి కుశలం గేహే।* 

*గతవతి వాయౌ దేహేపాయే భార్యాబిభ్యతి తస్మిన్క యే॥ భజ ॥6.*


*ప్రతి॥* పవనః = ఊపిరి (జీవం); యావత్ = ఎంతవరకు; దేహే = దేహమునందు; నివసితి = వుంటుందో;  తావత్= అంతవరకు; గేహే = ఇంటియందు; కుశలం = క్షేమసమాచారము సంగతిని; పృచ్ఛతి = అడుగుతారు; దేహాపాయే= దేహానికి అపాయము కలిగి న స్థితిలో; వాయౌ= ఊపిరి, జీవము; గతవతి = పోయినట్టి దయితే( అప్పుడు); భార్యా = అర్ధాంగికూడా; తస్మిన్ = ఆ; కాయే =' శరీరమునుగూర్చి; బిభ్యతి = భయపడి పోతుంది.


*భావం:-*


శరీరంలో ఊపిరివున్నంతవరకే ఇంటిలోని ఎవరైనా దగ్గరుకువచ్చి నీ గురించిన కుశల ప్రశ్నలనడిగేది, నీనుంచి ఊపిరి తప్పుకొని వెళ్ళిపోతే, శరీరం నశించిపోయే స్థితిలో అపాయంలో పడిపోతే, అప్పుడు నీ దగ్గరకు వచ్చేవాళ్ళూ క్షేమమడిగే వాళ్ళూ వుండరు. నీ అర్ధాంగియైన స్త్రీ కూడ ఆ శరీరాన్ని చూసి జడుసుకొని భయపడుతుంది.


*వివరణ:-*


విచారణచేత మహోన్నతమైన సత్యపదార్థాన్ని అన్వేషించ టానికిగాను మనసును ఆ పదార్థంవైపుకు నడిపించాలి. అంటే గుడ్డిగా ప్రేమించటం, మమకారం పెంచుకోవటం శుష్కమైన అనుభవాలు పొందాలని కోరటం అనే వైపునుంచి దానిని మళ్ళించటం అన్నమాట. అది చాలా అత్యవసరమైనట్టి సంగతి. నిస్సంగత్వమనేది యీ ప్రాపంచిక వస్తు విషయాలను గూర్చి వుండాలి. కాని నిస్సంగత్వమనే ఈ భావం కొన్ని మతగ్రంథాల్లో అవసరమైనదానికన్న ఎక్కువగానే నొక్కి చెప్పటం జరుగుతోంది. బౌద్ధమతంలో అలాంటిది అతిగ వున్నదనిపిస్తుంది. అలా చెప్పినట్లయితే సాధకుడికి జీవితం మీద బ్రతకటానికి తగిన శ్రమపడడం మీద ఒక విముఖత కలుగుతుంది. జీవితంలో పసకనపడదు. ఉత్సాహం పల్చనై పారి యింకిపోతుంది.


జీవితం మీద ధ్యానం సాధకునికి "ప్రపంచం వట్టి దుఃఖమయం” అనిపించే టట్లుండరాదు. ఎక్కడో చీకటి భోగాలకు అతన్ని లాక్కుపోరాదు. అలాగే జీవితం సుఖమయమని సుఖం అనుభవించటానికే - ఏ పద్ధతైనేమి అనే గుడ్డి పంథాకూడా పనికి రాదు. విద్వాంసులు ఈ విషయంలో చాల జాగ్రత్తగా చెప్పారు. బహిర్గతమైన విషయ ములపై ధ్యాసవుంచి నిస్కారమై ప్రాపంచిక విషయాలమిదా అతిగా మనసుని ప్రవర్తిం పజేయటాన్ని నిరాకరిస్తూ అందరినీ మానవుల సేవలో నిమగ్నులు కావలసిందని అంతర్గతమైన దృష్టిని అలవరుచు కోవలసిందనీ వారు ఆదేశించారు.


ఋషులు అన్నారు - జీవితాన్ని యధాతధంగా చూడవలసిందీ అని అలా చూడటంలో అసంగత్వమనేది పాటించ మన్నారు. అప్పుడే ప్రపంచపు సరియైన దృశ్యం చూచినవాళ్ళ మవుతాము. ఆ పైన జీవితానికి వాస్తవికతలేని తనాన్ని చెప్పారు. మనసులో ఏముంటే అదే ఎదుట వున్నదన్నప్పుడు వాస్తవికత ఎక్కడుంటుందిగనక, దీనివల్లనే ఒకానొక స్వాస్థ్యమైన ఆశావాదమును అలవాటు చేయడం జరిగింది. జీవితం మీద సాధకుడికి పూర్వమున్న విలువలు తగ్గిన క్షణాన గురువులు వేదాంతికమైన క్రొత్త విలువ లను వారి మనసులో తగినసమయంలో ప్రవేశపెట్టుతారు.


పాశ్చాత్య దేశాలకు చెందిన విమర్శలకు ఇలాంటి శ్లోకాల్లోని ఈ బహళార్థా లు సాధక ప్రయోజనాలను గుర్తించక వ్యతిరేకంగా మాట్లడతారు, పూర్వ దేశాల జీవితంలో వితాన్ని చీకటిగా దుఃఖమయంగా చిత్రించుతారని మనిషిలో జీవితంలో వుండే బ్రతకాలనే చింతనే పారద్రోలు తారనీ - అభివృద్ధి నిరోధకంగా చెబుతారనీ విమర్శిస్తూ వుంటారు.


 సంగ్రహంగా చెప్పాలంటే దేహాన్నే అన్నిటికన్న మిన్నగా పూజించుట మనేది తగని పని దానికోసమే అన్నీ చేయటం దానికోసమే డబ్బు సంపాదించటం దానికోసమే తగలేయటం చేస్తాం. ఇదే పరమార్థమనకొంటే ఇంతకంటే శోచనీయమై విషయం లేదు. ఇంత కంటే మూర్ఖత్వం లేదు. శరీరమే అన్నిటికంటే గొప్పదైనదీ పూజించ దగింది, అయితే అది శాశ్వతంగా వుండేదైనా కాదే. క్షణాల్లో మారిపోతుంది. కృశించి పోతుంది, ముసలి దవుతుంది. రాలి పోతుంది. శరీరంతో కష్ట పడాల్సిందే, పనిచెయ్యాలి, పోరాడాలి, కూడబెట్టాలి, ఇతర్లను మేపాలి, జనాన్ని సృష్టించాలి, గుడ్డలు గేహాలు యివ్వాలి.-- ఇవన్నీ దేనికది ఆలోచిస్తే అవుసరమైనవే కాని మొత్తం జీవితకాలం యిలానే వెచ్చించి వేయడం మనిషి సామర్థ్యాలను మట్టిపాలు చెయ్యటం వంటిది. ఈ శరీరం పెరిగి సడలి, చేవలేనిదై, చివరకు మట్టిపాలై పోతుంది కదా!


శరీరం కోసమే శరీరంలో నివసించి వుంటామనే దృష్టి రాక్షస దృష్టి రాక్షస రాజు పేరు విరోచనుడు అతడొకప్పుడు విజ్ఞాన వేత్తయయిన బ్రహ్మదగ్గరకు వెళ్ళుతాడు. ఆయన ఉపదేశించిన జ్ఞానం విరోచనుడికి ఇతడి సంస్కారాన్ననుసరించి అర్థమైంది, విరోచనుడు నమ్మినదేమిటంటే- (నేను అనేది వేరు, శాశ్వతుడైన ఆత్మవేరు) ఈ నేను అనేది శరీరమే. ఆ యాత్మను సేవించి పూజించటమే పరమోత్కృష్టమైన మతము! అని ఇది సరియైనది కాదు, ఈ శ్లోకంలో ఒక ఆలోచనా పద్ధతి తెలియ బరచబడింది. ఆ దోవలో విచారించుతూపోతే శరీరంతోగల ప్రేమబంధము అంతమయిపోయి, మనిషిలోని వ్యర్థమైన పై మెరుగులు విచ్ఛిన్నమై పోతవి.


జీవి చనిపోయిన తరువాత మిగిలేది కళ్ళకు కనబడటానికి శరీరం మాత్రం ఏ జంతువైనా చనిపోతే దాని శరీరంలోని చర్మం మాంసం మొదలైనవి ఇతర్లకు ఉపయోగిస్తవి. కాని మనుష్యుడు చనిపోతే అతని శరీరానికి యే మాత్రం విలువలేదని చెప్పవచ్చు, ఒక్క జుగుప్సను కలిగించే విలువతప్ప, ఇలాంటి పనికిరాని మురికి మూట అయిన శరీరం కోసమే బ్రతికినన్నాళ్ళున్నూ ధనం ఆర్జించటం, కూడబెట్టడం, గొంతులు కొయ్యటం, దుష్ప్రవర్తనలో తగులుకోవటం క్రూరమయిన యుద్ధాలు ప జెయ్యటమూనూ జరుగుతూ వున్నాయి. చివరకు ఆ శరీరం పడిపోయిన స్థితిలో ఇన్నాళ్ళు ఎంతో సన్నిహితంగా ప్రియులుగా వున్న భార్యయే జీవిత భాగ స్వామిని యే తన ప్రియుడి శరీరం - భర్త శరీరం అలాంటి స్థితిలో చూసి విపరీతమయిన భయానికి లోనవుతుంది.


జీవితంలోని ఈ భావ తాత్పర్యమును అనుసంధానం చేయటంవల్ల పై మెరు గుల మీదనుంచి మనసు మళ్ళి ప్రయోజనకరమైన అసంగత్వము అలవాటు అగుతుంది. శరీర రక్షణం చేయవలసిందే - ఎందుకంటే అది మనకు ఉపకరిస్తుంది. కనుక దాన్ని శుభ్రముగాను అందంగానూ వుంచాల్సిందె, మేపాలి దుస్తులు తొడగాలి, బాగు చేస్తుండాలి. మనకున్న యితరమైన వాహనాలను యెలా కడిగి శుభ్రముచేసి కాపాడుకొంటామో అలాగే దీన్ని కూడా పోషించు కోవాలి. శరీరాన్ని సేవించాలి. - కాని ఎల్లప్పుడూ - ఆ శరీరం ఒకానొక వస్తువని అది విశాలమైన యితర క్షేత్రాల్లో మనం ఉత్తీర్ణత పొందటాని కనువైన వస్తువు మాత్రమేననే విషయం, జ్ఞాపకంలో వుంచుకొని మరీ సేవించాలి.శరీరం శాశ్వతంగా మనకు వుండేదికాదు. ఇప్పుడున్న సమర్థతనే నిరంతరం కలిగి అది మనకు ఉపయోగపడుతూ వుండేది కాదు. అది నశించి పోతుంది తప్పనిసరి.


ఈ సమ్యగ్విజ్ఞానంతో శరీరంలో మనం మనినట్లయితే- దుఃఖపుంజం తగ్గి అత్యంత స్వాఫ్ట్యపూర్ణమైన జీవితం నడపవచ్చు.


*సశేషం*

🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔

వ్యర్ధాలను బహిష్కరించు అవయవాల గురించి వివరణ

 మానవ శరీరంలోని వ్యర్ధాలను బహిష్కరించు అవయవాల గురించి వివరణ  - 


      మానవ శరీరం ఒక సజీవమైన యంత్రం శరీరము నందు ఎలాంటి అన్యపదార్ధము చేరినను దానిని బయటకి బహిష్కరింప చేయుటకు శరీరము పనిచేస్తుంది . ఉదాహరణకు కాలుకు ముల్లుగాని , కొయ్యగాని గుచ్చుకొని విరిగిన దానిని శరీరము నుంచి బయటకి పంపుటకు చీముపట్టి ఆ తరువాత సులభముగా బయటకి వచ్చును. ఇదే విధముగా శరీరంలోని అంతరావయవములలో ఏదేని మలపదార్దము ( అన్య పదార్థము లేదా రోగ పదార్థము ) చేరినచో అది బయటకి పంపుటకు శరీరంలోని నాలుగు బహిష్కరణ అవయవాలు పనిచేయును . ఇప్పుడు వాటి గురించి మీకు వివరిస్తాను .  అవి 


     *  ప్రేవులు . 

     *  మూత్రపిండములు . 

     *  ఉపిరితిత్తులు . 

     *  చర్మము . 


  *  ప్రేవులు  - 


        మల పదార్థము మొదట ప్రేవులలో నిలువచేరి వివిధ వ్యాధులను కలుగచేస్తుంది . అందువలనే      " సర్వరోగా మలాశయః " అన్నారు. ఈ మల పదార్థం మలబద్ధక సమస్య వలన బయటకి వెళ్లక ప్రేవులలో నిలువ ఉండి అచ్చట కొంతకాలానికి మురిగిపోయి విషవాయువులు తయారైయ్యి రక్తములో కలిసి ప్రవహించి ఇతర అంతర అవయవములకు అవరోధము కలిగించి రోగములను కలుగచేయును . 


                మలబద్ధకం వలన మొదట అజీర్ణము చేయును . అజీర్ణము వలన విరేచనములు ఆ తరువాత బంక విరేచనాలు , రక్తవిరేచనాలు , అమీబియాసిస్ , అసిడిటీ , అల్సర్ ఇలా ఒకదాని తరువాత ఒకటి వచ్చును. ఇవన్నియు జీర్ణకోశ సంబంధ వ్యాదులు. ఈ వ్యాధులన్నింటికి మలబద్ధకమే కారణం . ఈ సమస్య ప్రారంభములోనే జాగ్రత్తవహించని యెడల దీర్ఘకాలిక వ్యాధిగా మారి తరువాత తీవ్ర సమస్యలు తెచ్చును . 


*  మూత్రపిండములు  - 


 ప్రేవులు పూర్తిగా పనిచేయని స్థితిలో శరీరంలోని మాలిన్యములు బయటకి పంపుటకు మూత్రపిండములు బాగుగా పనిచేయవలసి ఉంటుంది. అందుకే మలబద్దకం సమస్య ఉన్నవారికి మూత్రం అధికంగా వచ్చును. కొంతకాలమునకు మూత్రపిండములు కూడా అలసిపోయి చెడిపోవును . కావున మూత్రపిండములలో రాళ్లు , మూత్రనాళములో రాళ్లు , మూత్రకోశములో రాళ్లు మొదలగు వ్యాధులు సంభవించును . దీనివల్ల రక్తములో మూత్రము కలియుట , రక్తపోటు మొదలగు సమస్యలు కలుగును. 


 *  ఊపిరితిత్తులు  - 


     మూత్రపిండ వ్యాధులకు మందులు వాడిన శరీరంలోని మురికిని బయటకి పంపుటకు ఉపిరితిత్తులు ప్రయత్నించును. దగ్గు , జలుబు , అలర్జీ , దమ్ము  ద్వారా శరీరంలోని తెమడను బయటకి పంపుటకు ప్రయత్నించును. ఈ సమస్యను కూడా అణుచుటకు మందులు వాడుచున్న శరీరం నందలి మలిన పదార్థము చర్మము క్రిందికి వెళ్లి చర్మవ్యాధులను కలగచేయును . 


 *  చర్మము  - 


     రక్తములో ఉన్న మాలిన్యాలను చర్మము ద్వారా బహిష్కరించుటకు ప్రయత్నించునప్పుడు గజ్జి , తామర , పుండ్లు , గడ్డల రూపములో కనిపించును. దీనిని మనం మందులతో అణిచివేయుచుండిన చర్మవ్యాధి , కుష్టు మొదలగు వ్యాధులు వచ్చును . 


       పైన వివరించిన నాలుగు బహిష్కరణ అవయవాలు చక్కగా పనిచేసినంత కాలం ఏ రోగము దరిచేరదు . ఇందులో ఏ ఒక్కటి తన విధిని సరిగ్గా నిర్వర్తించలేకపోయినా శరీరము అంతా రోగగ్రస్తం అవుతుంది. అంతేకాని శరీరంలో వివిధ అవయవములకు సంబంధం లేదు అనుకోకూడదు. 


             ఈవిధముగా శరీరంలోని నాలుగు బహిష్కరణ అవయవాలు మందుల వలన దోషపూరితమై ఒకదాని పని ఇంకొకటి చేసి రోగగ్రస్తము అగును. కావున సమస్య మొదలగు క్రమము నందే సరైన జాగ్రత్తలు పాటించి ఎప్పటికప్పుడు శరీరంలోని మాలిన్యాలను బయటకి పంపవలెను. 


            ఈ మధ్యకాలంలో చాలా మంది ఉదయాన్నే లేవగానే మలవిసర్జనకు వెళుతున్నాము .మలబద్ధక సమస్య లేదనుకుంటున్నారు. నిజానికి రోజుకు రెండుసార్లు మలవిసర్జన చేయుట అత్యుత్తమ పద్దతి. అదేవిధముగా ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషధములు తీసుకుని ఉదరమును మరియు ప్రేవులను శుభ్రపర్చుకోవలెను. ఉదయాన్నే మలవిసర్జన చేసినప్పుడు బయటకి వెళ్లునది కేవలం 60 % మాత్రమే . మిగిలిన 40 % ప్రేవులకు పట్టి ఉండును. అది అలా మురిగిపొయి విషవాయువులు వెలువడి రక్తములో కలిసి శరీరంలోని మిగతా అవయవాలకు చేరుకుని ఆయా అవయవ సంబంధ రోగాలను కలుగ చేయును . కావున ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషధాలను తీసుకుని ఉదరము మరియు ప్రేవులను శుభ్రపర్చుకోవలసిందిగా ముఖ్య సూచన . 


                          సమాప్తం 


        మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - శరదృతువు - ఆశ్వయుజ మాసం - కృష్ణ పక్షం - చతుర్దశి - చిత్ర -‌‌ గురు వాసరే* (31.10.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*