*🙏🌹మిత్రులారా! చిలక జోస్యం అని అవహేళన చేయవద్దు. ఇది చాలా ముఖ్యం. అందరికీ షేర్ చేయండి. గ్రహాల పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు మన భారత దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దేశం మొత్తం మీద అంతర కలహాలు తో సమస్యలు వస్తాయి. ప్రతీ చోట ఇదే పరిస్థితి ఉంది. అధికారంలోకి రాలేము అని గ్రహించి, ప్రస్తుతం దుష్ట శక్తులు మేలుకుని అన్నీ ఒక్కటి అవుతున్నాయి. రాబోయే కాలంలో భారత దేశ భద్రతకు అనుకూలంగా ఉండే బిల్లులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, ఊళ్లలో చాలా చోట్ల రకరకాల గొడవలు, దాడులు, కుట్రలు, చోటా, బడా నాయకుల మీద దాడులు జరిగే అవకాశాలున్నాయి. సాధ్యమైనంత వరకు టీ, కాఫీ, ఫలహారాలు, మందు, మాంసం ఇంట్లో తాగండి, తినండి. బయట ఎక్కువ సమయం గడపడం మంచిది కాదు. తస్మాత్ నోరు, ఒళ్ళు జాగ్రత్త!🙏🌹*
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
13, మే 2024, సోమవారం
సజ్జనుడు కాడు.
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 బోధితోఽపి బహుసూక్తి విస్తరైః
కిం ఖలో జగతి సజ్జనో భవేత్|
స్నాపితోఽపి బహుశో నదీజలైః
గర్దభః భవతి కిం హయః క్వచిత్||
*....మధురకవి శ్రీ హనుమంతాచార్యులు….*
తా𝕝𝕝 "నీచుడికి ఎన్ని మంచిమాటలు చెప్పిననూ సజ్జనుడు కాడు.
గాడిదను పుణ్యనదీజలాలతో స్నానం చేయించిననూ అది గుర్రము కాదు కదా".
*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*
*_అడ్మిన్ - సంస్కృతసుధాసింధువు_*
యోగులు వందనీయులే
"మంత్రే తీర్ధే ద్విజే *దైవే* దైవజ్ఞే..
యాదృశీ భావనా సిద్థిర్భవతి తాదృశీ"
అన్నారు కనుక ఎవరి మనసు ఏ రూపాన్ని దైవంగా పట్టుకున్నా తప్పులేదు కానీ వేలం వెఱ్ఱి గా కారాదు. వైదిక ధర్మం, సదాచారం, సత్సంప్రదాయం, సనాతన ధర్మానికి పెద్దపీట వేయకపోతే అంత ఆచరణీయం కాదేమోననీ. అవైదికం గా ఉన్నచో దత్త సంప్రదాయం అని చెప్పిదాటవేస్తున్నారేమోనని అనిపిస్తుంది. యజనం ప్రాధాన్యత కోల్పోవడం, ప్రతిష్టాత్మకమైన దేవతా మూర్తిని అందరూ స్పృశించడం, ఇంకా చాలా.. హైందవ ధర్మానికి గొడ్డలిపెట్టు వంటిదని అనిపిస్తుంది. శౌచం, నిష్ఠ.. ఇత్యాదులు ఆవశ్యకం కనుక ... తత్సంప్రదాయ రాహిత్యం శిష్ఠాచారం కాదని (నేను తప్పు కావచ్చు) నాకు అనిపించింది. కానీ మహానుభావులు, యోగులు వందనీయులే. 🙇♂️
జిహ్వకో రుచి..
*జిహ్వకో రుచి...*
💐💐💐💐💐
"మావిడికాయ్ పప్పు చేశావ్, బ్రమ్మాండంగా ఉంది, అదే చేత్తో నాలుగప్పడాలు, రెండు ఒడియాలు, ఓ పది చల్లమిరపకాయలూ కూడా వేయించేస్తే, స్వర్గానికి జానెడు దూరంలో ఉండేది కదటోయ్..."
"ఇందాకే యూట్యూబులో చూశాను, మా డాక్టర్ గారి వీడియో...*'డీప్ ఫ్రై' చేసినవి తింటే, ఆరోగ్యం అటకెక్కుతుందని* చెప్పారు...పైగా, అందరికీ చెప్పమన్నారు..."
"మనింట్లో అటక లేదుగా...ఏం పర్లేదు...మా గురువుగారు, గరికిపాటి గారు చెప్పారు... *'రసహీనమైన బతుకు బతికే కంటే, అన్నీ సుబ్బరంగా తిని, 50 ఏళ్ళకే బకెట్ తన్నేస్తే, నష్టం ఏంటి ?'* అని !"
"మొదలెట్టారా, మీ వితండవాదం ? వయసులో ఉండగా ఏం తిన్నా హరాయించుకుంటుంది మన శరీరం...తిన్నన్నాళ్ళు తిన్నాం...
ఇప్పటినుంచైనా కాస్త జాగ్రత్తగా వుంటే ఏవైందిట ?"
"ఏడు దశాబ్దాలు దాటేశాం...
నాటౌటు...
ఇప్పటిదాకా ఏం కాలేదు...ఇప్పటికీ గుండ్రాయిలా ఉన్నాం...ఒకవేళ నోరు కట్టుకుని, వందేళ్ళు బతికినా...ఎవరికోసం, ఎందుకోసం ? ఓ కొత్తావకాయ తినక, మాగాయ్ అన్నంలో పెరుగు కలుపుకోక, నాలుగు మావిడిపళ్ళు, పది పనసతొనలు తినక, ఎందుకు బతకడం ? ఒకవేళ అన్నీ మానేసి, నెయ్యి - నూని కూడా ఒదిలేసి, చెరో రెండూ ఎండు పుల్కాలు తిని, బతికేస్తాం అనుకో...సెంచరీ కొట్టేస్తామా ? ఎవరైనా గేరంటీ ఇవ్వగలరా ? హంసలాగ ఆర్నెల్లు బతకమన్నారుగా ?"
"మీతో వాదించే కన్నా...ఊరుకోడం అంత ఉత్తమం లేదు..."
"కదా...అంచేత, ఆ చల్ల మిరపకాయల డబ్బా, అప్పడాల డబ్బా, ఒడియాల మూట, నాకు కనపడకుండా ఎక్కడ దాచేశావో చెప్పు...నేనే వేయించుకు తింటాను..."
"ఇప్పుడు నన్ను వేయించుకు తింటున్నది చాలదూ...మీతో వేగడం కష్టం...మళ్ళీ మీకెందుకు శ్రమ ? నేనే వేయించి తెస్తాను, భోయినం దగ్గర కూచున్నాక మీరు లేవడం ఎందుకు..."
"ఇప్పుడు నా అర్ధాంగి అనిపించావు, రానీ, అవన్నీ వచ్చేదాకా వేచి ఉంటాను, వచ్చేప్పుడు...కాస్త కొత్తావకాయ్ జాడీకూడా తీసుకురా..."
"మహాప్రభో...మీకో నమస్కారం !"
"దీర్ఘ సుమంగళీ భవ !!!"
*వారణాసి సుధాకర్.*
💐💐💐💐💐💐💐
. అధిక విద్యావంతు
☝️🌹👌 *ఈ బ్రాహ్మణ దంపతులు సజ్జనులైన వారు ఓటు వేయని కారణంగా వచ్చే నష్టాన్ని. శ్రీ నరసింహ శతకము లో సీస పద్యము ద్వారా చక్కగా వివరించారు.*
(శ్రీ నరసింహ శతకము తెలుగు శతక సాహిత్యంలో ప్రముఖమైనది )🙏
సీ. అధిక విద్యావంతు - లప్రయోజకులైరి
పూర్ణశుంఠలు సభా - పూజ్యులైరి
సత్యవంతులమాట - జన విరోధంబాయె
వదరుబోతులమాట - వాసికెక్కె
ధర్మవాదనపరుల్ - దారిద్ర్యమొందిరి
పరమలోభులు ధన - ప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగ - భూత పీడితులైరి
దుష్టమానవులు వ – ర్ధిష్ణులైరి
తే. పక్షివాహన । మావంటి - భిక్షుకులకు
శక్తిలేదాయె నిక నీవె - చాటు మాకు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।🙏 జగన్నాథ
మీకు ఆయన బాగా తెలుసు.
దయనీయ స్థితిలో భిక్షాటన చేస్తున్న బ్రాహ్మణుడిని చూసి అక్బర్ వ్యంగ్యంగా బీర్బల్‌తో ఇలా అన్నాడు - 'బీర్బల్! వీరు మీ బ్రాహ్మణులు! బ్రహ్మదేవుడు అని ఎవరిని అంటారు. వారు బిచ్చగాళ్ళు.
అప్పుడు బీర్బల్ ఏమీ మాట్లాడలేదు. కానీ అక్బర్ రాజభవనానికి వెళ్ళినప్పుడు, బీర్బల్ తిరిగి వచ్చి బ్రాహ్మణుడిని ఎందుకు వేడుకున్నాడు అని అడిగాడు.
బ్రాహ్మణుడు చెప్పాడు - 'నా దగ్గర డబ్బు, స్టాక్, భూమి లేవు మరియు నేను పెద్దగా చదువుకోలేదు. కాబట్టి కుటుంబ పోషణ కోసం యాచించడం నా అవసరం.
బీర్బల్ అడిగాడు - భిక్ష ద్వారా రోజుకు ఎంత సంపాదిస్తారు?
బ్రాహ్మణుడు సమాధానం చెప్పాడు - ఆరు నుండి ఎనిమిది నాణేలు.
బీర్బల్ అన్నాడు - నీకు ఉద్యోగం వస్తే అడుక్కుంటావా?
బ్రాహ్మణుడు అడిగాడు - నేను ఏమి చేయాలి?
బీర్బల్ చెప్పాడు - మీరు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి మరియు ప్రతిరోజూ 101 గాయత్రీ మంత్రాలను చదవాలి మరియు దీనికి మీకు ప్రతిరోజూ 10 నాణేలు లభిస్తాయి.
బ్రాహ్మణుడు బీర్బల్ ప్రతిపాదనను అంగీకరించాడు. మరుసటి రోజు నుండి బ్రాహ్మణుడు భిక్షాటన మానేసి, భక్తితో గాయత్రీ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు మరియు సాయంత్రం 10 నాణేలను బహుమతిగా తీసుకుని తన ఇంటికి తిరిగి వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత, బీర్బల్ బ్రాహ్మణుని నిజమైన భక్తి మరియు ఉత్సాహాన్ని చూసిన తర్వాత గాయత్రీ మంత్రాల సంఖ్య మరియు నాణేల సంఖ్య రెండింటినీ పెంచాడు.
ఇప్పుడు గాయత్రీ మంత్రం యొక్క శక్తి వల్ల బ్రాహ్మణుడు ఆకలి, దాహం మరియు శారీరక రుగ్మతల నుండి విముక్తి పొందాడు. గాయత్రీ మంత్రం పఠించడం వల్ల అతని ముఖం వెలిగిపోతోంది. ప్రజల దృష్టి బ్రాహ్మణుల వైపు ఆకర్షితుడయ్యింది. భక్తులు ఆయన దర్శనం చేసుకుని స్వీట్లు, పండ్లు, డబ్బు, వస్త్రాలు సమర్పించడం ప్రారంభించారు. ఇప్పుడు అతనికి బీర్బల్ నుండి లభించే నాణేలు కూడా అవసరం లేదు. భక్తితో సమర్పించే వస్తువుల పట్ల బ్రాహ్మణుడికి ఆకర్షణ ఉండదు. ఎప్పుడూ మనసుతో గాయత్రీ జపం చేయడం మొదలుపెట్టాడు.
ఒక బ్రాహ్మణ సాధువు గాయత్రీ పఠిస్తున్న వార్త సర్వత్రా వ్యాపించింది. దర్శనం కోసం సుదూర పట్టణాల నుంచి భక్తులు రావడం ప్రారంభించారు. బ్రాహ్మణుడు తపస్సు చేసిన స్థలంలో భక్తులు ఆలయాన్ని, ఆశ్రమాన్ని నిర్మించారు. అక్బర్‌కు బ్రాహ్మణుని కాఠిన్యం గురించి కూడా వార్తలు వచ్చాయి. చక్రవర్తి సందర్శనకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు మరియు అతను రాజ బహుమతులు తీసుకుని, రాజ వైభవంతో బీర్బల్‌తో సాధువును కలవడానికి వెళ్ళాడు. అక్కడికి చేరుకున్న రాజు బ్రాహ్మణుడికి కానుకలు సమర్పించి నమస్కరించాడు. రాజు బీర్బల్‌తో బయటకు వచ్చాడు, అటువంటి అద్భుతమైన సాధువును చూసినందుకు హృదయం నిండిపోయింది.
అప్పుడు బీర్బల్ అడిగాడు - ఈ సాధువు నీకు తెలుసా?
అక్బర్ అన్నాడు - లేదు, బీర్బల్, నేను అతనిని ఈరోజు మొదటిసారి కలిశాను.
అప్పుడు బీర్బల్ అన్నాడు - మహారాజా! మీకు ఆయన బాగా తెలుసు. మీరు ఎవరిని ఎగతాళి చేశారో ఇదే బిచ్చగాడు బ్రాహ్మణుడు! బ్రహ్మదేవుడు అని ఎవరు అంటారు' ఈరోజు మీరు ఆ బ్రాహ్మణుని పాదాలకు నమస్కరించారు.
అక్బర్ ఆశ్చర్యానికి అవధులు లేవు. బీర్బల్ అడిగాడు - అయితే ఇంత గొప్ప మార్పు ఎలా జరిగింది?
బీర్బల్ అన్నాడు - మహారాజా! అతను మొదట బ్రాహ్మణుడు. పరిస్థితుల కారణంగా, అతను తన మతం యొక్క సత్యం మరియు అధికారం నుండి దూరమయ్యాడు. ధర్మ గాయత్రీ మంత్రం బ్రాహ్మణుడిని 'బ్రహ్మ'గా చేసి, చక్రవర్తిని అతని పాదాలపై పడేలా చేసింది.
బ్రాహ్మణులు ఆసనాలకు, తపస్సులకు దూరంగా జీవిస్తున్నందున, అందుకే వారు బాధపడుతున్నారు. ప్రస్తుతం, బ్రాహ్మణులందరూ వారి చర్యలతో తిరిగి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది, వారి ఆచారాలను తెలుసుకోవడం మరియు అనుసరించడం, అసలు బ్రాహ్మణంలో విలీనం చేయగల సామర్థ్యం ఉంది".
ఒక బ్రాహ్మణుడు తన కార్యమార్గంలో దృఢంగా నడిస్తే, దైవిక శక్తులు అతనిని అనుసరిస్తాయి
*సర్వే జనాః సుఖినో భవన్తుః*
మూడు కోరికలు"
"మానవుని మూడు కోరికలు"
"ప్రతి వ్యక్తీ అనుదినం ఈ మూడు కోరికలు ఆశిస్తే చాలు. ఈశ్వరారాధనలో స్వామిని అర్ధించవలసిన ఆకాంక్షను క్రింది శ్లోకంలో అమర్చి చెప్పారు మహాత్ములు..."
"అనాయా సేన మరణం, వినా దైన్యేన జీవనమ్ |
దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే ||"
"ఆయాసం లేకుండా మరణం, దైన్యం లేని జీవితం, దేహం విడిచాక మోక్షం... ఈ మూడింటినీ ప్రసాదించ వలసినదిగా పార్వతీపతిని అర్ధిస్తున్నారు."
మొదటిది...
"ముందుగా ముగింపు సుఖంగా జరగాలనే కోరికను వ్యక్తం చేయడం చక్కని ఔచిత్యం. ప్రాణ ప్రయాణ సమయంలో కలిగే శారీరక, మానసిక యాతన మన ఆధీనంలో లేదు. కనుక ఆ సమయంలో ఎటువంటి యాతన ఉండకుండా; భగవత్ స్మరణతో అనాయాసంగా దేహాన్ని విడవడం ఒక వరం."
రెండవది...
"బతుకు గడవవలసిన తీరు. ఇది దైన్యం లేకుండా ఉండాలి. దిగులు, ఆధివ్యాదులు లేకుండా, మనసును కుంగదీసే పరిస్థితులు రాకుండా సాఫీగా జీవితం సాగాలనే అందరి కోరిక. అదే దీనిలో ఉంది."
మూడవది...
"అంతిమ లక్ష్యం, జీవితానికి చివరి గమ్యం మృత్యువు కాదు. మృత్యువు తరువాత జీవుని స్థితి ఏమిటి.. చేసిన దుష్కర్మలకు అనుగుణంగా దుర్గతులు తప్పవు. అందుకే మళ్ళీ దుర్గతుల పాలవకుండా, జన్మ పరంపరలకు లోనుకాకుండా పరమేశ్వరునిలో లీనం కావాలని కోరుకోవాలి."
"ఆ లక్ష్యం నెరవేరాలంటే జీవితమంతా సద్బుధ్ధితో, సత్కర్మలతో, సద్భక్తితో సాగాలి. అటువంటి జీవితమే దైన్యరహిత జీవితం. నిరంతరం భక్తితో సదాశివుని స్మరించే వారికి, ఆరాధించే వారికి ఈ మూడు కోరికలు నేరవేరతాయనడంలో సందేహం లేదు."
తెలుగు సొగసు!
తెలుగు సొగసు!!
సీ.
అలకలు నటియించి అటువైపు తిరిగిన /
చెలి మోములోనున్న చిలిపితనము //
బుజ్జి పాపాయిని పొత్తిళ్ళ లాలించు /
అమ్మదనములోని కమ్మదనము //
ఏరువాకల నాళ్ళ నిగురొత్తు వరిచాళ్ళ /
జనపదమ్ములలోని జానుదనము //
వేసవి నడిరేయి వెన్నెల చిలికించు /
నెలవంక నవ్వులో చలువదనము //
తే.గీ.
కన్నె సరిగంచు పరికిణీ కలికితనము /
ఎంకిపాట పల్లవిలోని పెంకితనము /
కలిపి వడపోత పోసిన తెలుగుదనము! /
తెలుగు సొగసును వర్ణింప నలువ తరమె! /
తెలుగుభాష అందచందాల యోష!
మనభాషలోనిఅందాలకిపాశ్చాత్యులే పరవశించారు.
నాల్పస్యతపసఃఫలమ్మనే ఆర్యోక్తి---
"ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్"--
అనేమాట---
మన'అజంత'భాషాసౌందర్యాలకి ప్రాచ్యపాశ్చాత్యులసర్టిఫికెట్లు
"దేశభాషలందు తెలుగులెస్స"--
అన్నది-- "పదిభాషలుతెలిసిన ప్రభువుచూచి భాషయననిద్ది యనిచెప్పబడినభాష" కి ప్రభు సత్కారం!
అటువంటి తెలుగుబాస సొగసు చెప్పటమెవ్వరితరం?
అయితే కాలప్రవాహంలో కవులు వర్ణిస్తూనే ఉన్నారు.
రసజ్ఞులానందిస్తూనేయున్నారు
ఆధునికకాలంలో ఒక సుకవి వ్రాసిన పద్యం చూడండి- ఎంతమురువుగొల్పుతున్నదో!
సాహిత్యం కాంతా సమ్మితంగా
హితంప్రబోధిస్తుంది.
-భార్య భర్తని లాలించిదారిలోకి తెచ్చుకున్నట్లు!
అటువంటి భార్య భర్తపై లేనికోపం ప్రదర్శిస్తూ- తన ముంగురులు నుదుటి రంగ
స్థలాన నాట్యమాడగా- తన చిర్నవ్వు భర్తకి తెలియనీయ
కుండగా అటువైపుతిరిగి ముసిముసినగవుల్ని పెదాల
నడుమనే కప్పిపుచ్చుకొనే
జాణతనంలో ఎంత సరస శృంగార లావణ్యం!
ఆ *చిలిపితనం*----
పొత్తిళ్లలో పరుండి కేరింతలాడే
బుజ్జిపాపని ఒళ్ళంతానిమిరే తల్లి లాలనలోనిఅమ్మతనపు
టానందం- అందులోని శిశుతాస్ఫూర్తి వెన్క పిహితమై
యున్న పరమాత్మతత్త్వంలోని
ఆ *కమ్మదనం*----
తొలకరిలోదుక్కి ప్రారంభంలో పల్లెల్లో వరిచాళ్లు ఇగురొత్తు 'సీజన్లో'--- మనకి జనపదాల్లో
కనిపించేరమణీయ దృశ్యాల్లోని
సౌందర్య విలాసాతిశయంగల
ఆ *జానుదనం*----
(జాను--Grace)
"వేసవి- వెన్నెల"
(ఆరుద్ర గారి కృతి కాదండోయ్!)--- ఎంత contrast!
మండువేసగి నాటి రాత్రి పండు వెన్నెల కురియించే జాబిల్లి ----
(కాదు--- కాదు-- *నెలవంక*!)
----(ఎట్టి వక్రోక్తి వైభవం!)!!
అటువంటిచందమామనవ్వులో-- మనమనుభవించే ఆహ్లాదకరమైన
ఆ *చలువదనం*----
ఆ "వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్ల" కట్టుకొన్న పట్టు పరికిణీలోని---
సంప్రదాయగతమైయున్న
( *మాయమైపోతున్న* అట్టి అమ్మాయిని ఈనాటి దేశంలో వెదకిపట్టుకోవల్సిందే!)
ఆ *కలికితనం*-----
"కళ్ళెత్తితేసాలుకనకాభిసేకాలు"
-- అనదగ్గ ఎంకిలేమ సొగసుపాటలోనిసొయగముఅంతా రంగరించి విరియించిన
ఆంధ్రకళాసంస్కృతివైభవంలో
ఆ *పెంకితనం*----
ఆ తన *తనాల* ధనాల
నన్నింటిని
కలగలిపి--కలనేతనేసి--వడబోతబోసి--ఆ సారాన్ని ఆసాంతం సొంతంచేసికొన్నమనభాషలోని
ఆ *తెలుగుదనం*----
తత్పరీమళం-- దాని సర్వస్వం--- వర్ణించటం ఎవరితరం? నలువ తరమా?-
--- అంటే---కాదని కవిభావం.
బ్రహ్మకి పర్యాయపదాల్లో *నలువ* నే యెన్నుకోవటం గమనీయం.
నాలుగు వాయిలుగల వానికే సాధ్యం కాదట! అంటే ఆయన
తలలోనాల్క పైనిలిచిన దేవికీ
ఆ ముదిమదితప్పిన మొదటి
వేల్పు సృష్టిలోని 'వేయితలల
వానికిని'సాధ్యంకాదనే భావం!
--ఇలా అంటూనే అద్భుతంగా వర్ణించిన ఈ కవిగారి కైతలతేనె
*తీయందనం*- మనంఏమని చెప్పగలం?!
ఈ సీసంలోని పది పదాలు తనకి ఎంతో నచ్చాయని కవిగారే స్వయంగా వాక్రుచ్చారు.
అయితే - ఆ పది పదాలు తనకిప్పుడు గుర్తులేవుట! పదాలన్నీ అందంగా అమరినపుడు---- కొన్ని అందాలే ''పద్దాక"---
(అస్తమాను-ఎల్లప్పుడూ--- అనటానికి మా గోదారి జిల్లాల్లో
జానపదులువాడేమాట!)
గుర్తుంచుకోవటం కష్టమే మరి!
ఇంతకీ--- కవిగారు
*శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారు*
చూశారా?-చెప్పటంమరిచాను!
ఇది రసజ్ఙభారతి కానుక!
శంకరుల అవతారం
ॐ శంకర జయంతి ప్రత్యేకం
( నిన్న 12వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి )
భాగం 2/10
శంకరుల అవతారం
1.ఆవశ్యకత
శతాబ్దాల క్రితంనాటి దేశ పరిస్థితులు గమనిస్తే, అనేక సమస్యలతోపాటు వివిధ దేవతారాధనలమధ్య సమన్వయం లోపించడం వంటి సంకుచిత భావాలు తెలుస్తాయి.
ఆ సమయంలో పరమేశ్వరుడు ఆదిశంకరులుగా అవతరించి దేశపరిస్థితిని సరిదిద్దారు.
అయితే, ఆ కాలంలోని పరిస్థితులు ఇప్పుడు లేవు కదా! అని, ఇప్పటి పరిస్థితులకి అనుగుణంగా మరొక విధానం రావాలనే వాదన కొంతమంది చెయ్యొచ్చు.
కానీ ఏ అవతార విశేషాలైనా, అవి, అన్ని కాలాలలోనూ ఉపయోగపడేవే!
ఉదాహరణకి
1.శ్రీమద్వాల్మీకి రామాయణ కథ భూమిమీద పర్వతాలూ, నదులూ ఉన్నంతవరకూ నడుస్తుందని సాక్షాత్తూ బ్రహ్మదేవుడే వాల్మీకిమహర్షితో చెప్పి వ్రాయించాడు. అది కథాభాగంగా ఉన్న వేదవివరణ కనుక.
2.ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు భగవద్గీత ఉపదేశించాడు.అది ఆ కాలంలోని అర్జునునికి మాత్రమేకాక, అందఱూ ఏ కాలంలోనైనా తెలిసికొని, సాధనలో గమ్యాన్ని చేరడానికి. అది వేదాంతమైన ఉపనిషత్సారం కాబట్టి.
* అదే విధంగా అద్వైత సిద్ధాన్తాన్నీ, స్మార్త సంప్రదాయాన్నీ, సులువుగా ఆచరించే ఆరాధనా విధానాన్నీ, ఇటువంటివి అనేకం, ధర్మాచార్యులుగా ఆదిశంకరులు అందించారు.
అవన్ని వేదప్రామాణికం.
వేదం సార్వకాలీనం కదా!
త్రేతాయుగంనాటి మానవరూపంలో శ్రీరాముని ధర్మాచరణ,
ద్వాపరంనాటి శ్రీకృష్ణుని ప్రకటిత దైవశక్తితో చేసిన బోధ అన్నికాలాలకీ అనుసరణీయం కదా!
అట్లే, జగద్గురువులైన ఆదిశంకరుల అవతార లక్ష్యం - బోధనా విధానమూ ఎప్పటికీ అనుసరించదగినదే! విశేషించి కలియుగంలో అత్యంత ఆవశ్యకం.
కొనసాగింపు ....
=x=x=x=
— రామాయణం శర్మగా పిలువబడే
బొడ్డపాటి శ్రీరామ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ
భద్రాచలం
వేద ఆశీర్వచనం.
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5125*
*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం - షష్ఠి - పునర్వసు - ఇందు వాసరే* (13.05.2024)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
-----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
సంతాన హీనత
స్త్రీ , పురుషులలో సంతాన హీనత ఎవరిలో ఉందో తెలుసుకొను పరీక్ష -
పంటపోలంలో కాని , ఇంటి వెనక కూరగాయలు పెంచే దొడ్లో కాని విడివిడిగా చిన్నచిన్న మళ్ళు చేయాలి . ఆ మళ్ళలో శనగ విత్తనాలు చల్లి ఒక మడిలో స్త్రీ , మరొక మడిలో పురుషుడు ప్రతిరోజు మూత్రం విసర్జించాలి.
అలా ఒక వారం , పది రోజుల పాటు చేస్తే ఎవరు మూత్రం పొసిన మడిలో మొక్కలు మొలవవో వారిలో సంతానాన్ని ఉత్పత్తి చేసే జీవశక్తి లోపించినది అని తెలుసుకోవాలి . సరిఅయిన చికిత్స తీసుకుని వారు సంతానవంతులు కావోచ్చు .
మరియొక పరీక్ష - వీర్యంలో బలానికి
ఒక చెంబు నీరు తీసుకుని దానిలో వీర్యాన్ని వేసినప్పుడు అది మునిగితే దానిలో బలం ఉన్నట్టు అది తేలితే దానిలో బలం తక్కువ ఉన్నట్టు. మగవాడు ఉమ్మి వూసినప్పు డు , మూత్రం వదిలినప్పుడు అది పడే దూరాన్ని బట్టి అతని యెక్క సంతానం కలిగించే బలాన్ని అంచనా వేసేవారు. ఇది ప్రాచీన ఆయుర్వేద వైద్యులు పరీక్షించే విధానం .
సరియయిన ఔషధాలు సహాయంతో నపుంసకుడు ని సైతం సంతానవంతుడు గా మార్చడం ఒక్క ఆయుర్వేదానికే సాధ్యం .
గమనిక -
వీర్యకణాల సంఖ్య తక్కువుగా ఉన్నవారు నా నెంబర్ నందు సంప్రదించగలరు ..
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
పాతివ్రత్య మాహాత్మ్యం
. 🪔
పాతివ్రత్య మాహాత్మ్యం
అత్రిమహర్షి భార్య అనసూయాదేవి. తన పాతివ్రత్య మాహాత్మ్యం చేత ఆ మాట బ్రహ్మవిష్ణుమహేశ్వరులను శిశువులుగా చేసి ఆడించింది, పాలిచ్చింది. ముగ్గురుమూర్తులూ ఆ దంపతులకు కొడుకులయ్యారు.త్రిమూర్తుల సమిష్టిరూపంగా అత్రి,అనసూయల బిడ్డడైన శ్రీదత్తాత్రేయుడు అనాదిగా హైందవ జాతీయుల పూజలందుకుంటున్నాడు. విష్ణువు దత్తాత్రేయుడని శివుడే దుర్వాస మహర్షి అని, బ్రహ్మదేవుడు చంద్రుడనీ భావించడం కూడా సనాతన సంప్రదాయం. శ్రీ దత్తాత్రేయుణ్ణి పూజించడం త్రిమూర్తులను పూజించడమే. తెల్లవారు ఝామున స్నానం చేసి సంధ్యావందనాది నిత్యకృత్యాలను ఆచరించిన తరువాత శ్రీ దత్తాత్రేయుడిని షోడశోపచారాలలో అర్చించడం సంప్రదాయం.
పవిత్ర నదులలో ఈ రోజున స్నానం చేసి ఆతరిని అనసూయను శ్రీదత్తాత్రేయుడిని పూజించడం విశేష వ్రాత. శ్రీ దత్తాత్రేయుని చెంత నిలబడి ఉండే గోమాత సకల చరాచర సృష్టికి ప్రతీక. ఆయనను పరివేష్టించి ఉండే శునక చతుష్టం - నాలుగు కుక్కలు - నాలుగు వేదాలకు ప్రతిరూపాలు. శునకం కాలభైరవుడు.
జై శ్రీ రామ్
కంచర్ల వెంకట రమణ
పంచాంగము
🕉️
పంచాంగము 🌓 13.05.2024
విక్రమ సంవత్సరం: 2081 పింగళ
శక సంవత్సరం: 1946 క్రోధి
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: వసంత
మాసం: వైశాఖ
పక్షం: శుక్ల - శుద్ధ
తిథి: షష్ఠి రా.తె.05:00 వరకు
తదుపరి సప్తమి
వారం: సోమవారం - ఇందువాసరే
నక్షత్రం: పునర్వసు ప.01:59 వరకు
తదుపరి పుష్యమి
యోగం: శూల ఉ.07:39 వరకు
తదుపరి గండ
కరణం: కౌలవ సా.04:49 వరకు
తదుపరి తైతుల రా.తె.05:00 వరకు
తదుపరి గరజ
వర్జ్యం: రా.10:29 - 12:11 వరకు
దుర్ముహూర్తం: ప.12:38 - 01:30
మరియు ప.03:13 - 04:05
రాహు కాలం: ఉ.07:21 - 08:58
గుళిక కాలం: ప.01:49 - 03:26
యమ గండం: ఉ.10:35 - 12:12
అభిజిత్: 11:47 - 12:37
సూర్యోదయం: 05:44
సూర్యాస్తమయం: 06:40
చంద్రోదయం: ఉ.10:16
చంద్రాస్తమయం: రా.11:50
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
దిశ శూల: తూర్పు
🍚 చందన షష్ఠి 🍚
🌾 మాతృస్కందపూజ 🌾
🎋 పుత్ర ప్రాప్తి వ్రతం 🎋
💦 షష్ఠోపవాసము 💦
📂 నూతన వటువు వస్త్రదానం 📂
🚩 కంచి జగద్గురు శ్రీ ఉజ్జ్వల
మహాదేవేంద్ర సరస్వతి స్వామి
పుణ్యతిథి 🚩
🪔 శ్రీ నరసింహస్వామి
నవరాత్రారంభం 🪔
🏳️ శ్రీ మంగళ ఉపాధ్యాయ
పుణ్యతిథి 🏳️
🚩 శ్రీ సత్యాత్మతీర్థ నవవింశతి
పీఠారోహణ మహోత్సవం 🚩
🛕 శృంగేర్యాం శ్రీ శంకరాచార్య
రథోత్సవం 🛕
🚩 శ్రీ రామచంద్రతీర్థ పుణ్యతిథి 🚩
🏳️ కాచియప్ప నాయనార్
గురుపూజ 🏳️
🚩 సంత్ శ్రీ ఖేతేశ్వర్ మహారాజ్
పుణ్యతిథి 🚩
🏳️ శ్రీ వామనపండిత్ పుణ్యతిథి 🏳️
🎊 కనోడా శ్రీ బహుస్మర్ణ మాతా
ఉత్సవం 🎊
🔯
వైశాఖ పురాణం - 4
🕉️ *సోమవారం - మే 13, 2024*🕉️
_*🚩వైశాఖ పురాణం - 4 వ అధ్యాయము🚩*_
🕉🕉🕉🕉🕉🕉🕉
*వైశాఖధర్మ ప్రశంస*
☘☘☘☘☘☘☘☘️☘️
నారద మహర్షిని అంబరీష మహారాజు *"మహర్షీ ! వైశాఖమాసమున చేయవలసిన చేయదగని ధర్మములను దయయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి యిట్లనెను.* అంబరీషమహారాజా ! నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది. వినుము , నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగస్నానము , పగటినిద్ర , కంచుపాత్రలో భుజించుట , (కంచుపాత్ర కాక మరియొక పాత్రలో భుజింపవలెనని నారదుని యుద్దేశ్యము కాదు. వ్రతము నాచరించువారు పాత్రలో , కంచములో భుజింపరాదు. అరటి ఆకు , విస్తరాకు , తామరాకు మున్నగు ఆకులయందు భుజింపవలెనని నారదుని అభిప్రాయము. ధనవంతులు - బంగారు , వెండిపాత్రలలోను , సామాన్యులు కంచుపాత్రలలోను ప్రాతఃకాలమున వెనుకటి దినములలో భుజించెడివారు.) మంచముపై పరుండుట , గృహస్నానము , నిషిద్దములైన ఆహారములను ఉల్లి మొదలైన వానిని భుజింపకుండుట అను ఎనిమిదిటిని వైశాఖమాసవ్రతము చేయువారు మానవలెను. రెండుమార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి యందు భుజింపరాదు అనగా పగటియందు భుజించి రాత్రి భోజనమును మానవలెను.
వైశాఖమాసవ్రతమును పాటించు వాడు తామరాకున భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసవ్రతము పాటించువారు, యెండలోనడచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్దలతో తలపై జల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమ ఆసనమన గూర్చుండబెట్టి వానినే శ్రీ మహావిష్ణువుగ భావించి వాని పాదములను నీటిచే కడిగి యా పవిత్రజలమును తలపై జల్లుకొనిన వాని పాపములన్నియు పటాపంచలై నశించును. ఆ జలమును తలపై జల్లుకొనిన గంగ మున్నగు సర్వతీర్థముల యందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును.
విష్ణుప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానము చేయక , తామరాకు మున్నగు ఆకులయందు ఆహారమును భుజింపక , విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిదకడుపున బుట్టి తరువాత జన్మయందు కంచరగాడిదగా జన్మించును. ఆరోగ్యవంతుడై యుండి దృఢశరీరము కలిగి స్వస్థుడైయున్నను వైశాఖమున గృహస్నానము చేసినచో నీచ జన్మనందును వైశాఖమున బహిస్నానము నదీ తటాకాదులలో చేయనివాడు వందలమార్లు శునక జన్మమునొందును. స్నానాదులు లేక వైశాఖమాసమున గడిపినవాడు పిశాచమై యుండును. వైశాఖమాసవ్రత మాచరించినప్పుడే వానికి పిశాచత్వము పోవును. వైశాఖమున లోభియై జలమును , అన్నమును దానము చేయనివాడు పాపదుఃఖముల నెట్లు పోగొట్టుకొనును ? పోగొట్టుకొనలేడని భావము.
శ్రీమహావిష్ణువును ధ్యానించుచు నదీస్నానము నాచరించినవారు గత మూడు జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకొనురు. ప్రాతఃకాలమున సూర్యోదయ సమయమున సముద్రస్నానము నాచరించినచో ఏడు జన్మలలో చేసిన పాపములును పోవును. జాహ్నవి , వృద్దగంగ , కాళింది , సరస్వతి , కావేరి , నర్మద , కృష్ణవేణి యని గంగానది యేడు విధములుగ ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్దినందినవి. అట్టి సప్తగంగలలో ప్రాతఃకాలస్నానము వైశాఖమున చేసిన కోటి జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకొనుచున్నారు. దేవతలచే నిర్మితములైన సముద్రాదులందు స్నానమును వైశాఖమాస ప్రాతఃకాలమున చేసినవారి సర్వపాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోపాదమంత ప్రమాణము కల బహిర్జలమున(లోతు లేకున్నను ఆరుబయట తక్కువ జలమున్న సెలయేళ్లు) గంగాది సర్వతీర్థములు వసించును. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్దలతో వాని యందు స్నానమాడవలెను.
రసద్రవ్యములలో క్షీరముత్తమము. క్షీరము కంటె పెరుగు ఉత్తమము. పెరుగుకంటె నెయ్యి ఉత్తమము. నెలలలో కార్తికమాసముత్తమము. కార్తికముకంటె మాఘమాసముత్తమము. మాఘముకంటె వైశాఖముత్తమము. ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము దానము మున్నగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును.
కావున నిట్టి పవిత్రమాసమున ధనవంతుడైనను , దరిద్రుడైనను , యధాశక్తి వ్రతము నాచరించుచు బ్రాహ్మణునకు యధాశక్తిగ దానమీయవలెను కంద మూలములు , పండ్లు , వ్రేళ్లు , కూరలు , ఉప్పు , బెల్లము , రేగుపండ్లు , ఆకు , నీరు , మజ్జిగ మొదలగువానిని నిచ్చినను కలుగు పుణ్యమనంతము. బ్రహ్మ మున్నగు దేవతలంతటి వారికిని యీ మాసమున వ్రత దానాదులు లేనిచో నెట్టి ఫలితము లేదు. దానము చేయనివాడు దరిద్రుడగును. దరిద్రుడగుటచే పాపముల నాచరించును. అందుచే నరకము నందును. కావున యధాశక్తిగ దానము చేయుట యెట్టి వారికైనను ఆవశ్యకము. కావున తెలివియున్నవారు సుఖమును కోరుచు దానము చేయవలయును. ఇంటిలో నెన్నియలంకారములున్నను పైకప్పులేనిచో ఆ యిల్లు నిరర్ధకమైనట్లు జీవి యెన్ని మాస వ్రతముల నాచరించినను వైశాఖవ్రతము నాచరింపనిచో వాని జీవితమంతము వ్యర్థము. అన్ని మాసముల వ్రతముల కంటె వైశాఖమాస వ్రతము ఉత్తమమను భావము. స్త్రీ సౌందర్యవతియైనను , గుణవంతురాలైనను , భర్త కలిగియున్నదైనను , భర్తను ప్రేమించుచు , భర్తృప్రేమను కలిగియున్నను , వైశాఖవ్రతము నాచరింపనిచో ఎన్ని లాభములున్నను వ్యర్థురాలని యెరుగుము. అనగా సర్వశుభలాభములనందిన యువతులును వైశాఖ వ్రతమును చేయనిచో వారికి నున్నవన్నియు నిష్పలములు వ్యర్థములునని భావము. గుణములెన్ని యున్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సద్ర్వతము లెన్నిటిని చేసినను వైశాఖమాస వ్రతమును చేయనిచో యన్నియు వ్యర్థములగును సుమా ! శాక సూపాదులు (కూర పప్పు) యెంత యుత్తమములైనను , యెంత బాగుగవండినను ఉప్పులేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖవ్రతమును చేయనిచో నెన్ని వ్రతములును చేసినను అవియన్నియు వ్యర్థములే యగును సుమా. స్త్రీ యెన్ని నగలను ధరించినను వస్త్రము లేనిచో శోభించదో అట్లే యెన్ని సద్ వ్రతముల నాచరించినను వైశాఖవ్రతము నాచరింపనిచో అవి శోభింపవు. కావున ప్రతి ప్రాణియు నీ విషయమును గమనించి వైశాఖమాస వ్రతమును తప్పక ఆచరింపవలెను. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమాసమున శ్రీమహావిష్ణువు దయను వైశాఖ వ్రతము నాచరించి పొందవలెను. ఇట్లు చేయనిచో నరకము తప్పదు. వైశాఖ స్నానాదికముచే సర్వపాపక్షయమై వైకుంఠప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానము హోమము మున్నగు వానిని యితర మాసములలో చేసినచో వచ్చు ఫలములకంటె వైశాఖమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వానిని చేసిన వచ్చు ఫలమత్యధికము. వైశాఖవ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసినవానికంటె వీనిని ఫలముల చేయును. మదమత్తుడైన మహారాజైనను , కాముకుడైనను , ఇంద్రియలోలుడైనను వైశాఖమాస వ్రతము నాచరించినచో వైశాఖస్నానమాత్రముననే సర్వదోషముల నశింపజేసి కొని పుణ్యవంతుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసమునకు శ్రీమహావిష్ణువే దైవము.
వైశాఖమాస వ్రతారంభమున స్నానము చేయుచు శ్రీమహావిష్ణువు నిట్లు ప్రార్థింపవలయును.
*మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ |*
*ప్రాతః స్నానంకరిష్యామి నిర్విఘ్నం కురుమాధవ ||*
పిమ్మట స్నానము చేయుచు క్రింది శ్లోకములను మంత్రములను చదివి అర్ఘ్యము నీయవలయును.
*వైశాఖే మేషగేభానౌ ప్రాతః స్నాన పరాయణః |*
*అర్ఘ్యంతేహం ప్రదాస్యామి గృహాణ మధుసూదన ||*
*గంగాయాః సరితస్సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే |*
*ప్రగృహ్ణీతమయాదత్త*
*మర్ఘ్యం సమ్యక్ ప్రసీదథ ||*
*ఋషభఃపాపినాం శాస్తాత్వం యమ సమదర్శనః |*
*గృహాణార్ఘ్యం మయాదత్తం యధోక్త ఫలదోభవ ||*
అని ప్రార్థించి అర్ఘ్యములనిచ్చి స్నానమును ముగించుకొనవలెను. పిమ్మట మడి , పొడి బట్టలను కట్టుకొని వైశాఖమాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలయును. వైశాఖమాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథను వినవలెను , చదవవలెను. ఇట్లు చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నియు నశించును. ముక్తి లభించును. ఇట్లు చేసినవారు భూలోక వాసులైనను స్వర్గలోకవాసులైనను , పాతాళలోకవాసులైనను యెచటను వారికి కష్టము కలుగదు. వారికి గర్భవాసము స్తన్యపానము కలుగవు. అనగా పునర్జన్మయుండదు. ముక్తి సిద్దించును.
వైశాఖమున కంచు పాత్రలో భుజించువారు , శ్రీమహావిష్ణువు సత్కధలను విననివారును , స్నానము , దానము చేయనివారును , నరకమునకే పోదురు. బ్రహ్మహత్య మున్నగు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు కాని వైశాఖస్నానము వ్రతము చేయని వానికి పాపమును ప్రాయశ్చిత్తము లేదు.
తను స్వతంత్రుడై యుండి తన శరీరము తన యధీనములోనే యుండి , నీరు తనకు అందుబాటులో నుండి స్నానమాడవీలున్నను , స్నానమాడక నాలుక తన యధీనములో నుండి *'హరి'* యను రెండక్షరములను పలుకకయున్న నీచ మానవుడు జీవించియున్న శవము వంటివాడు. అనగా ప్రాణము మాత్రముండి వినుట చూచుటమున్నగు లక్షణములు లేని *'శవము'* వలె నతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరిని యెట్లైనను సేవింపనివాడు పందిజన్మనెత్తును.
పవిత్రమైన వైశాఖమాసమున వైశాఖవ్రతమును పాటించుచు ప్రాతఃకాలమున బహిస్నానము చేసి తులసీదళములతో శ్రీమహావిష్ణువు నర్చించి విష్ణు కధాశ్రవణము దానము చేసినవారు మరు జన్మలలో మహారాజులై జన్మింతురు. పిమ్మట తమ వారందరితో గలసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యము నందుదురు. శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణముగనో నిర్గుణముగనో భావించి పూజింపవలయును సుమా.
_*వైశాఖ పురాణం నాలుగవ అధ్యాయం సంపూర్ణం*_
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
సోమవారం*🕉️ 🌷 *మే 13, 2024*🌷
*ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ*
🕉️ *సోమవారం*🕉️
🌷 *మే 13, 2024*🌷
*************************
*************************
*ధృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంతఋతౌః* *వైశాఖమాసం - శుక్లపక్షం*
*తిథి : షష్ఠి* *రా 02.50*
వరకు ఉపరి సప్తమి
వారం: *సోమవారం* (ఇందువాసరే)
*నక్షత్రం : పునర్వసు* *ఉ 11.24* వరకు ఉపరి పుష్యమి
*యోగం : శూల* *ఉ 07.42* వరకు ఉపరి గండ
*కరణం : కౌలువ* మ 02.21 *తైతుల* రా 02.50 ఉపరి *గరజి*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 09.00 - 12.00 సా 04.00 - 06.00*
అమృత కాలం : *ఉ 08.54 10.34*
అభిజిత్ కాలం : *ప 11.38 - 12.30*
*వర్జ్యం : రా 07.57 - 09.40*
*దుర్ముహుర్తం : మ 12.30 - 01.21 & 03.04 - 03.56*
*రాహు కాలం : ఉ 07.14 - 08.51*
గుళిక కాలం : *మ 01.40* *03.17*
యమ గండం : *ఉ 10.27 - 12.04*
సూర్యరాశి : *మేషం*
చంద్రరాశి : *కర్కాటకం*
సూర్యోదయం: *ఉ 05.37* || సూర్యాస్తమయం:
*సా 06.30*
*ప్రయాణశూల : తూర్పు* దిక్కుకు ప్రయాణం పనికిరాదు
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.38 - 08.12*
సంగవ కాలం : *08.12 - 10.47*
మధ్యాహ్న కాలం : *10.47 - 01.21*
అపరాహ్న కాలం :*మ 01.21 - 03.56*
*ఆబ్ధికం తిధి : వైశాఖ శుద్ధ షష్ఠి*
సాయంకాలం : *సా 03.56 - 06.30*
ప్రదోష కాలం : *సా 06.30 - 08.44*
నిశీధి కాలం :*రా 11.41 - 12.26*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08 - 04.53*
🌷 *సర్వే జనాః*🌷
🌹 *సుఖినోభవంతు*🌹
🙏 *శుభమస్తు*🙏_________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
_మే 13, 2024_*
ॐశుభోదయం, పంచాంగం ॐ
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*_మే 13, 2024_*
*శ్రీ క్రోధి నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*వసంత ఋతువు*
*వైశాఖ మాసం*
*శుక్ల పక్షం*
తిథి: మర్నాడు *షష్ఠి* తె4.56
వారం: *ఇందువాసరే*
(సోమవారం)
నక్షత్రం: *పునర్వసు* మ1.44
యోగం: *శూలం* ఉ10.06
కరణం: *కౌలువ* సా4.45
&
*తైతుల* తె4.56
వర్జ్యం: *రా10.12-11.53*
దుర్ముహూర్తము: *ఉ12.21-1.12*
&
*మ2.54-3.45*
అమృతకాలం: *ఉ11.15-12.54*
రాహుకాలం: *ఉ7.30-9.00*
యమగండం: *ఉ10.30-12.00*
సూర్యరాశి: *మేషం*
చంద్రరాశి: *మిధునం*
సూర్యోదయం: *5.32*
సూర్యాస్తమయం:*6.19*
లోకాః సమస్తాః*
*సుఖినోభవంతు*
విరాళాలు ఇవ్వగలరు
విరాళాలు ఇవ్వగలరు
రోజు మన బ్లాగుని 1000 నుండి 2000 మంది ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుండి చూస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. ముఖ్యంగా అమెరికా నుంచి చూస్తున్న వారి సంఖ్య భారత దేశ వీక్షకులను మించి కొన్ని రోజులు వున్నాయి అంటే అతిశయోక్తి లేదు. బ్లాగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు చూపే ఆదరణే ఈ బ్లాగు పురోగవృద్దికి పునాది. ఈ బ్లాగులో వివిధ అంశాలు మన హిందూ ధర్మానికి చెందినవి, విద్య వైజ్ఞానికమైనవి, రోజు పోస్టు చేస్తుంటే వాటిని మీరు తిలకిస్తున్నారు. ఈ బ్లాగులో సాహిత్య, సాంస్కృతిక, హిందుత్వ ముఖ్యంగా ఆధ్యాత్మికమైన విషయాలకు విశేష స్థానాన్ని కల్పిస్తున్నాము. ఈ బ్లాగును ఇంతకంటే మెరుగుగా తీర్చి దిద్దాలని కోరుకుంటున్నాము.
ఈ రోజుల్లో ఏ పని చేయాలన్న ధనంతో కూడుకున్నదని మనకు తెలుసు " ధనమ్ములం మిదం జగత్" ఏ కొత్త గాడ్జెట్ కొనాలన్నా ఎంతో ఖరీదులో ఉంటున్నాయి. మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా మారక పొతే ఆధునికతలో వెనక పడి ఉంటాము అన్నది అక్షర సత్యం. కాబట్టి ప్రేక్షకులను కోరేది ఏమిటంటే మీరు మీకు తోచినంత విరాళాన్ని ఇచ్చి ఈ బ్లాగు అభివృద్ధికి తోడ్పడగలరు. క్రింది మొబైలు నంబరుకు జీ పే, పెటియం, లేక ఫోనుపే చేయగలరు. మీరు పంపే విరాళాలను కృతజ్ఞతతో స్వీకరించి బ్లాగు అభివృద్ధికి వినియోగించ బడును.
9848647145
నక్షత్రం లక్షణాలు
జ్యోతిష్య ప్రియులకు,
'బృహత్సంహిత ' లో ఏ నక్షత్రం వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయని చెప్పారో, ఇక్కడ గమనిద్దాం:
౧. అశ్విని : చక్కని రూపం, దక్షత కలిగిన వారు, నీతివంతులు, ప్రియభాషనులు.
౨. భరణి : దృడ నిశ్చయులు , సుఖవంతులు, సత్యవ్రతులు, ఆరోగ్యవంతులు.
౩. కృత్తిక : ప్రక్యతులు, తేజస్సులు.
౪. రోహిణి : సత్యవంతులు, శుభ్రత, ప్రియంవద, స్దిరమతి , సురూప.
౫. మృగశిర : చపలులు, ఉత్సాహవంతులు, చతురులు, భోగులు, భీకరులు.
౬. ఆరుద్ర : గర్వితులు, కృతఘ్నులు, అయిన వారిని ప్రేమించే వారు.
౭. పునర్వసు : మంచి స్వభావం కలవారు, అల్ప సంతుష్టులు , రోగులు.
౮. పుష్యమి : శాంతస్వభావం కలవారు. పండితులు, ధర్మ పరాయణులు.
౯. ఆశ్లేష : సర్వ భక్షకులు, కృతఘ్నులు, అమాయకులు , సున్నితత్వం కలవారు.
౧౦. మాఘ : భోగులు, ధనవంతులు, పిత్రు భక్తులు, మహొద్యమ కారులు.
౧౧. పూర్వఫల్గుణి : ఎప్పుడు ప్రియ వచనములు పలుకు వారు. దాతలు, ద్యుతిమానులు, రాజసేవకులు.
౧౨. ఉత్తరఫల్గుణి : భోగులు, సుఖములు కలవారు, విద్య ప్రాప్తి కలవారు.
౧౩. హస్త : ఉత్సాహవంతులు , చోర స్వభావం కలిగి ఉంటారు.
౧౪.చిత్త : మీననేత్రులు. గడసరులు.
౧౫. స్వాతి : కృపాళులు , ప్రియ వాక్కు కలవారు, ధర్మశ్రితులు .
౧౬. విశాఖ : ఈర్ష బుద్ధి కలవారు. ద్యుతులు, మాన్యవచనులు.
౧౭. అనురాధ : విదేశీ యానం కలవారు, ధర్మాత్ములు.
౧౮. జ్యేష్ఠ : పలువురు మిత్రులు కలవారు, సంతృప్తి కలవారు, కోప స్వభావం కలవారు.
౧౯. మూల : లక్ష్మి పుత్రులు , సుఖపడువారు, స్ధిర మనసు కలవారు.
౨౦. పూర్వషాడ : సౌహర్ర్ధ హృదయం కలవారు, ఇష్ట పూర్వకంగా పని చేయువారు, కళలను ఇష్టపడు వారు.
౨౧. ఉత్తరాషాడ : ధార్మికులు, బహు మిత్రులు కలవారు, కృతజ్ఞత కలిగిన వారు .
౨౨. శ్రవణం : ఉదార స్వభావం కలవారు, ఖ్యాతి పొందేడివారు , ధనవంతులు.
౨౩. ధనిష్ట : దాతలు, ధన లబ్దము కలిగిన వారు, సంగిత ప్రియులు.
౨౪. శతభిషం : సాహసికులు, కోప స్వభావం కలవారు, వ్యసన పరులు.
౨౫. పూర్వాభాద్ర : సంతోషమును తృప్తిగా అనుభవించలేని వారు, ధనవంతులు, దాతలు.
౨౬. ఉత్తరాభాద్ర : ఎక్కువ సంతానం కలవారు, ధార్మికులు, జితశత్రులు , వక్తలు.
౨౭.రేవతి : శూరులు, శుచివంతులు, సుభగులు, సంపూర్ణంగులు కలవారు.
కృతజ్ఞత
కృతజ్ఞత
లేని వారికి చేసే
సహాయం
విశ్వాసం లేని
వారితో కలిసి చేసే
వ్యాపారం ...
మనకు
సమయం ఇవ్వని
వారితో చేసే స్నేహం ...
ఎక్కువ కాలం కొనసాగవు .....!!
*శుభోదయం*
పంచాంగం 13.05.2024 Monday.
ఈ రోజు పంచాంగం 13.05.2024 Monday.
స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస శుక్ల పక్ష: షష్థి తిధి ఇందు వాసర: పునర్వసు నక్షత్రం శూల యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం. ఇది ఈరోజు పంచాంగం.
షష్థి రాత్రి 02:52 వరకు.
పునర్వసు పగలు 11:26 వరకు.
సూర్యోదయం : 05:49
సూర్యాస్తమయం : 06:36
వర్జ్యం : రాత్రి 08:00 నుండి 09:43 వరకు.
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:38 నుండి 01:29 వరకు తిరిగి మధ్యాహ్నం 03:11 నుండి 04:03 వరకు.
అమృతఘడియలు : పగలు 08:57 నుండి 10:36 వరకు.
రాహుకాలం : పగలు 07:30 నుండి 09:00 వరకు.
యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.
శుభోదయ:, నమస్కార: