29, సెప్టెంబర్ 2026, మంగళవారం

మంగళవారం🍁* *🌹29సెప్టెంబర్26🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

 *🍁 మంగళవారం🍁* 

*🌹29సెప్టెంబర్26🌹*  

  *దృగ్గణిత పంచాంగం*       

                

         *ఈనాటి పర్వం* 

      *సంకష్టహర చతుర్ధి*

 

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*భాద్రపద మాసం - బహుళ పక్షం* 


*తిథి : తదియ* సా 05.09 వరకు ఉపరి *చవితి*

*వారం  : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : అశ్విని* ఉ 09.03 వరకు ఉపరి *భరణి*

*యోగం : వ్యాఘాత* ఉ 06.13 *హర్షణ* రా 03.20 ఉపరి *వజ్ర*

*కరణం  : వణజి* ఉ 06.13 *భద్ర* సా 05.09 ఉపరి *బవ* రా.తె 04.03 వరకు ఆపైన *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*మ 12.00 - 01.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *రా 03.06 - 04.36*

అభిజిత్ కాలం  : *ప 11.34 - 12.22*

*వర్జ్యం    : శేషం ఉ 06.46 & సా 06.04 - 07.34*

*దుర్ముహూర్తం  : ఉ 08.21 - 09.09 రా 10.46 - 11.34*

*రాహు కాలం : మ 02.58-04.28*

గుళికకాళం      : *మ 11.58 - 01.28*

యమగండం    : *ఉ 08.57 - 10.28*

సూర్యరాశి : *కన్య                       

చంద్రరాశి : *మేషం*  

సూర్యోదయం :*ఉ 06.06*

సూర్యాస్తమయం :*సా 06.07*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     : *ఉ 05.57 - 08.21*

సంగవ కాలం        : *08.21 - 10.46*

మధ్యాహ్న కాలం    : *10.46 - 01.10*

అపరాహ్న కాలం  : *మ 01.10-03.34*

*ఆబ్ధికం తిధి        : భాద్రపద బహుళ తదియ*

సాయంకాలం    : *సా 03.34 -05.58*

ప్రదోష కాలం    : *సా 05.58 - 08.22*

రాత్రి కాలం      :*రా 08.22 - 11.34*

నిశీధి కాలం     :*రా 11.34 - 12.22*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.21 - 05.09*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

అదృష్టం

  అదృష్టం వాననీరు లాంటిది... శ్రమ బావినీరు లాంటిది..... రోజూ స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావిని నమ్ముకోవాలి....


శుభ మంగళవారం 🌹Happy Tuesday

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        సప్తమోధ్యాయః

                    జ్ఞాన విజ్ఞాన యోగము


తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ।

ప్రియో హి జ్ఞానినోఽత్యర్థమహం స చ మమ ప్రియః ।। 17 ।।

 


ప్రతిపదార్థ;



తేషాం — వీరందరిలో; జ్ఞానీ — జ్ఞానములో స్థితమై ఉన్నవారు; నిత్య-యుక్తః — ఎల్లప్పుడూ దృఢ సంకల్పంతో; ఏక — అనన్యముగా; భక్తిః — భక్తి; విశిష్యతే — శ్రేష్ఠమైన; ప్రియః — ప్రియమైన; హి — ఖచ్చితంగా; జ్ఞానినః — జ్ఞానములో స్థితమైనవారు; అత్యర్థం — గొప్పగా; అహం — నేను; సః — అతను; చ — మరియు; మమ — నాకు; ప్రియః — ప్రియమైన వాడు.



తాత్పర్యము:


వీరందరిలో కెల్లా, జ్ఞానంతో నన్ను పూజించే వారు, మరియు నా పట్ల దృఢ సంకల్పముతో మరియు అనన్య భక్తితో ఉన్నవారిని, అందరి కంటే, శ్రేష్ఠమైన వారిగా పరిగణిస్తాను. నేను వారికి ప్రియమైనవాడిని మరియు వారు నాకు ప్రియమైనవారు.



వివరణ :


ఆపదలో, ప్రాపంచిక వస్తువుల కోసం, లేదా కుతూహలంతో - భగవంతుడిని ఆశ్రయించే వారికి ఇంకా నిస్వార్థ భక్తి లేనట్టే. నెమ్మదిగా, క్రమక్రమంగా భక్తి ప్రక్రియలో, వారి మనస్సు పవిత్రమై వారికి భగవంతునితో తమకున్న నిత్య-శాశ్వత అనుబంధ జ్ఞానం పెంపొందుతుంది. అప్పుడు వారి భక్తి అనన్యమైనదిగా, ఏక చిత్తముతో, నిరంతరం భగవత్ పరంగా కొనసాగుతునే ఉంటుంది. ఈ ప్రపంచం వారిది కాదనే జ్ఞానం పొందటం వలన మరియు ఇక్కడ సంతోషమనేది దొరకదు అని తెలియటం వలన, వారు అనుకూల పరిస్థితుల కోసం తపించరు లేదా ప్రతికూల పరిస్థితుల పట్ల శోకించరు. ఈ విధంగా, వారు నిస్వార్థ భక్తిలో స్థితమై ఉంటారు. సంపూర్ణ ఆత్మ సమర్పణ శరణాగతి దృక్పథంలో, దివ్య సఖుడి కోసం ప్రేమాగ్నిలో తమని తాము సమర్పించుకుంటారు. కాబట్టి, అటువంటి జ్ఞానంలో స్థితులై ఉన్న భక్తులు, తనకు అత్యంత ప్రియమైన వారని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.

రేబిస్ దినోత్సవం*

 *సెప్టెంబర్ 28 - ప్రపంచ రేబిస్ దినోత్సవం*


*ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా (World Rabies Day)* *రేబిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.*


*ఉద్దేశ్యం:*

*రేబిస్ వ్యాధి ప్రమాదాలు, నివారణ మార్గాలు,  జంతువుల ద్వారా ఈ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించడం.*


*చరిత్ర:*

*మొట్టమొదటి రేబిస్ వ్యాక్సిన్‌ను కనుగొన్న ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్* *1895 సెప్టెంబర్ 28న మరణించారు. ఆయన జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. గ్లోబల్ అలయన్స్ ఫర్ రేబీస్ కంట్రోల్ (GARC) మరియు  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) సంయుక్తంగా 2007లో ఈ వేడుకలు ప్రారంభించాయి.*


*రేబిస్ గురించి తెలుసుకోండి:*

*🔴 ప్రాణాంతక జంతుజన్య వ్యాధి, ఎక్కువగా కుక్క కాటు ద్వారా వ్యాపిస్తుంది*

*🔴లక్షణాలు బయటపడితే 100% ప్రాణాంతకం, కానీ సకాలంలో వ్యాక్సిన్‌తో 100% నివారించవచ్చు*

*🔴ప్రధాన లక్షణం: జలభయం (Hydrophobia)* - *నీటిని చూసినా, తాగబోయినా గొంతు కండరాలు బిగుసుకుపోయి తీవ్ర భయాందోళన*


*✅ ప్రథమ చికిత్స - ప్రాణం కాపాడుతుంది:*

*1. కుక్క/జంతువు కరిచినా, గీరినా వెంటనే గాయాన్ని సబ్బుతో, కుళాయి నీటితో కనీసం 15 నిమిషాలు బాగా కడగాలి*

*2. బెటాడిన్ / స్పిరిట్ వంటి యాంటీసెప్టిక్ రాయాలి*

*3. వెంటనే వైద్యుడిని కలిసి యాంటీ-రేబిస్ టీకా తీసుకోవాలి*

*4. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా రేబిస్ వ్యాక్సిన్ వేయించాలి*


*🎯 2026 థీమ్: "Stronger Together - అందరం కలిసికట్టుగా బలపడదాం"*

*రేబిస్ రహిత ప్రపంచం ఒక్కరితో సాధ్యం కాదు, అందరూ కలిస్తేనే సాధ్యం!*