ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
28, సెప్టెంబర్ 2020, సోమవారం
కరపాత్రీ స్వామీజీ
శ్రీశంకరార్య సిద్ధాంత
కరపాత్రీయ భాసితమ్ |
కపిలాశ్రమ తీర్థమ్ తమ్
యతీంద్ర సంస్మరేద్ధృదా ||
కరపాత్రీ స్వామీజీ పూర్వాశ్రమ జన్మస్థలము, కపిలాశ్రమ తీర్థ స్వామీజీ పూర్వాశ్రమ జన్మస్థలము ఒకటే ౘోటు. ప్రతాపఘర్ జిల్లాలోని బాబూగంజ్ లో వీరి పరంపరానుగత క్షేత్రము ఉన్నది. అందరికీ పైసే లావొ అంటూ చెప్పినా, ఆ డబ్బంతా క్షేత్ర నిర్వహణకే పంపించేవారు. అనేక మంత్రానుష్ఠానాలు దీక్షగా, రోౙుల తరబడి నిట్టు ఉపవాసంతో చేసేవారు. దేశంలోని అనేక ధార్మిక పీఠాలలో, ఉత్తర హిందూస్థానములోని అనేక అఖాడాలలో విశిష్ట గుర్తింపు కలవారు.
వారు బ్రహ్మీభూతులు కావడము అనుష్ఠాన పరంపరకు ఒక లోటు.
వారి దివ్యస్మృతి లోకానికి మార్గము చూపేలా చేయాలని పరమాత్మను స్మరిస్తూ
మంత్రి పదవి లభిస్తే
మంత్రి పదవి లభిస్తే కొండ మీది హనుమను దర్శించు కుంటానని మొక్కుకున్నాడు రాయుడు.
రాయుడికి మంత్రి పదవి లభించింది.
కొండమీది హనుమంతుడిని దర్శించుకొని కొండకింద వున్న తిక్కశంకరయ్య హోటల్ లో భోజనం చేద్దామని సిబ్బందితో సహా వెళ్ళాడు.
అక్కడి హోటల్ని చూసి విస్తుపోయాడు.రెండు అంతస్తులతో వైభవోపేతంగా వుంది. చాలా కార్లు నిలిచి వున్నాయి.అక్కడ జనం కూడా చాలా మందే వున్నారు.
30 ఏళ్ళ క్రితం అక్కడ చిన్న పెంకుటింట్లో వుండేది ఆ హోటల్. ఆ హోటల్ని శంకరయ్య అనే ఒక విశ్రామ ఉపాధ్యాయుడు నడిపేవాడు. అరటి ఆకుల్లో భోజనం పెట్టేవాడు.రెండుకూరలు,రెండు పచ్చళ్ళు,పప్పు,పులుసు అన్నీ ఉండేవి. మంచి ఘుమ ఘుమ లాడే నెయ్యి కూడా వేసేవాడు. గడ్డ పెరుగు కూడా వేసేవాడు.
హాయిగా తినండి.నిదానంగా
తినండి తొందరేమీ లేదు అని అంటూ అన్ని బల్లల దగ్గరికీ బెత్తం పట్టుకొని తిరిగేవాడు. ఎంత కావాలో అంతే పెట్టించుకోండి ఆహారాన్ని వృధా చెయ్యకండి అని హెచ్చరిస్తూ తిరిగేవాడు.
ఎవరైనా పారేస్తే చెయ్యి చాపమని బెత్తంతో కొట్టేవాడు. ఎంత పెద్దవాళ్ళయినా, చిన్నవాళ్ళయినా పారేస్తే దెబ్బలు తినాల్సిందే.
బళ్ళో పిల్లలు తప్పు చేస్తే ఎలా కొట్టే వాడో ఇక్కడా అంతే. అక్కడ వేరే మంచి హోటల్ లేకపోవడంతో.
అక్కడ పదార్థాలు చాలా రుచిగా వుండడంతో అందరూ అక్కడికే వచ్చేవాళ్ళు.అందరూ అతన్ని తిక్కశంకరయ్య అని పిలిచేవారు.
రాయుడు అప్పట్లో రాజకీయాల్లోకి రాలేదు.పెద్ద వ్యాపార వేత్తగా డబ్బు బాగానే గడించాడు.
అప్పట్లో తనకు వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తే కొండ మీది హనుమను దర్శించుకుంటానని మొక్కుకొని లాభాలు బాగా రాగానే కొండమీది స్వామిని దర్శించుకొని ఆ హోటల్ లో భోజనం చేద్దామని వచ్చాడు.
శంకరయ్య ఎంత చెప్తున్నా వినకుండా అది వెయ్యండి యిది వెయ్యండి. అని అన్నీ వేయించుకొని తిన్నంతా తిని సగం పారవేసి చెయ్యి కడుక్కున్నాడు.అది చూసి శంకరయ్యకు కోపం నసాళానికి అంటింది.
బెత్తం పట్టుకొని రాయుడి దగ్గరకు వచ్చి చేయి చాచమన్నాడు.చుట్టూ వున్నవాళ్ళు అతను ఎవరనుకున్నావు? పెద్ద జమీందారు. అయినా డబ్బు చెల్లిస్తున్నాం మా యిష్ట మొచ్చినంత తింటాం పారేస్తాం నీకేమిటి?అన్నారు అతని వెంట వచ్చినవాళ్ళు.
మీరు డబ్బు చెల్లించినా సరే పారెయ్యడానికి మీకు హక్కు లేదు.ఎన్ని కోట్లు డబ్బు వున్నా ఆకలేస్తే డబ్బు తింటారా?మీకందరికీ కూడా సామాజిక బాధ్యత వుండాలి. బరువూ బాధ్యత తెలుసుకొని నడుచుకోవాలి. అన్నాన్ని పారేస్తే మీకు ఎప్పుడయినా ఆకలి వేసినప్పుడు అన్నం దొరకదు.
*అన్నం పరబ్రహ్మ స్వరూపం* దాన్ని వృధా చెయ్యకూడదు.యిలా వ్యర్థం చేస్తే మీ తరువాతి తరాలవారికి తినడానికి తిండి దొరకదు. అన్నాడు.రాయుడు నవ్వుతూ చెయ్యి జాచాడు.శంకరయ్య బెత్తంతో గట్టిగా కొట్టాడు. అప్పటి సంగతి రాయుడికి జ్ఞాపకం వచ్చింది.
తర్వాత ఎమ్.ఎల్.ఏ గా నిలబడి గెలిచాడు.ఇప్పుడు మంత్రి పదవి లభించింది.
ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ ఆ హోటల్ లో ప్రవేశించాడు.తన అనుచరులతో పాటు.
శంకరయ్య చనిపోయినట్టున్నాడు,అతని ఫోటో అక్కడ బల్ల మీద పెట్టివుంది పూలమాల వేసి.
ఆ ఫోటో వెనక అతని బెత్తం కూడా వుంది బూజు పట్టి. మంత్రిగారు వచ్చారని అక్కడి యజమాని శంకరయ్య కొడుకు విఘ్నేశ్వరయ్య పరిగెత్తుకుంటూ వచ్చి తెగ హడావుడి చేసి తన మనుషులతో చెప్పి రకరకాల పదార్థాలను వద్దంటున్నా వినకుండా వేయించాడు. అందరూ తినలేక చాలా పారవేశారు.
అది చూసి రాయుడికి చాలా బాధ కలిగింది.తట్టుకోలేక పోయాడు.శంకరయ్య ఫోటో వెనక వున్న బెత్తం చేతిలోకి తీసుకున్నాడు.కోపంగా విఘ్నేశ్వరయ్య దగ్గరికి వెళ్లి యింత అతి మర్యాద చేసే అవసరం లేదు.ముందు నీ బాధ్యత తెలుసుకో ఎంత భోజనం వృధా అయింది చూడు,అని అతన్ని చెయ్యి చాచమని చితక బాదాడు.
ఆ బూజు పట్టిన బెత్తాన్ని ముద్దు పెట్టుకొని ఆ బెత్తాన్ని ఫోటో వెనకాల పెట్టి బయటకు నడిచాడు.
ఈ కాలంలో అటువంటి నేతలు వున్నారా?వుంటే వారికి పాద నమస్కారం చెయ్యాల్సిందే. మనమంతా కూడా ఎక్కడయినా సరే తినే పదార్థాలను వృధా చెయ్యకూడదు.ఇప్పటికీ మా యింట్లో మా పిల్లలతో సహా దీన్ని పాటిస్తాము.
*(నవ్య వార పత్రిక సౌజన్యం తో...)*
*అన్నం పరబ్రహ్మ స్వరూపం* దాన్ని పారవేస్తే మరుజన్మలో మనకు *అన్నమో రామచంద్రా* అని ఏడ్చే గతి పడుతుందని పెద్దలు చెప్తారు.
*(తినే పదార్ధం ఏదైనా అన్నమే)*
🙏🙏🙏🙏🙏
తిలోత్తమ
**
ఎంతటి అన్నదమ్ములైనా, ఒకే తల్లిదండ్రులకి పుట్టినా జీవితంలో ఎప్పుడైనా ఒక సమయంలో మనస్పర్ధలూ, ఈర్ష్యాద్వేషాలూ రావచ్చు. అలా రాకుండా ఉండాలంటే తగిన విధంగా ధర్మ మార్గంలో ప్రవర్తించాలి అని సందేశం ఇచ్చే కధ మనకు మహాభారతంలో కనిపిస్తుంది.
ద్రౌపది స్వయంవరం తరువాత పాండవులు కుంతితో కలిసి హస్తినకు వచ్చారు. దృతరాష్టుడిచ్చిన అర్ధ రాజ్యంలో ఖాండవ వనంలో ఇంద్రప్రస్థపురాన్ని ఏర్పర్చుకొని పాండవులు రాజ్యమేలుతుండగా ఒక సారి అక్కడికి నారదుడు వచ్చాడు. ధర్మరాజు చేసిన అతిధి పూజలను అందుకొన్నాకా ద్రౌపది లేని సమయం చూసి పాండవులకి ఒక కధను చెప్పాడు.
పూర్వం నికుంభుడనే రాక్షసుడికి సుందుడు ఉపసుందుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేవారు. రాక్షసులైనా బ్రహ్మను గురించి కఠోర తపస్సు చేయతలపెట్టి వింధ్యపర్వతాలకు వెళ్ళారు. ఆ సోదరుల తపోదీక్షకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. కామరూపం, కామగమనం, అమరత్వం, సకలమాయలూ మొదలైన వరాలని వారు కోరుకొన్నారు. పుట్టిన ప్రాణి గిట్టక మానదు కావున అమరత్వం ఇవ్వడం కుదరదని చతుర్ముఖుడు చెప్పాడు. వారిరువురకీ ఒకరి పట్ల ఒకరికి అమితమైన ప్రేమాభిమానాలున్నాయి కనుక ఇద్దరూ ఒక వరం అడిగారు. ఇతరులెవ్వరి వలనా మరణం లేకుండే స్థితి కోరుకొన్నారు.. వారికి బ్రహ్మ ఇచ్చిన శక్తుల వల్ల పులులూ, ఏనుగుల రూపాలు ధరించి మునుల ఆశ్రమాలను దాడి చేసి చిందరవందర చేయసాగారు. వరగర్వంతో సాధుజనులకి కంటకంగా మారి చెలరేగసాగారు. ఋషులంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తమ బాధలు మొరపెట్టుకొన్నారు. ఇతరులెవ్వరి వలనా మరణం లేకుండా వరం కోరుకొన్నారు కానీ వారిలో ఒకరి వలన ఇంకొకరికి మరణం కలుగకుండ వరం కోరుకోలేదన్న సూక్ష్మాన్ని గ్రహించి వెంటనే విశ్వకర్మను పిలిపించి సృష్టిలోకెల్ల అత్యంత సౌందర్య రాశి ఐన కన్యను సృష్టించమని ఆఙ్ఞాపించాడు. అందుకుగాను సృష్టిలో అన్ని వస్తువులలోంచీ నువ్వు గింజంత ప్రమాణంలో అందాన్ని స్వీకరించి ఆ సౌందర్యరాశిలో పొందుపరచాలని సూచించాడు. అలా విశ్వజనితమైన సౌందర్యపు 'రాశి' జీవంపొందింది. ఆమెకు బ్రహ్మ తిలోత్తమ (తిల ప్రమాణంలో అన్నిటి అందం పొందింది కనుక) అని పేరుపెట్టాడు. తిలోత్తమ వెంటనే బ్రహ్మకూ విశ్వకర్మకూ నమస్కరించి కర్త్వ్యోన్ముఖురాలయ్యింది. మద్యం మత్తులో మదిరాక్షులనడుమ భోగాలనుభవిస్తున్న సుందోపసుందుల ముందు నిలచి వయ్యారాలను ఒలకబోసింది. ఆ ఇద్దరినీ అమితంగా ఆకట్టుకొంది. వారిద్దరూ ఆమెకోసం పోటీ పడసాగారు. అప్పుడు తిలోత్తమ ఆ ఇద్దరిలో ఎవరు బలాఢ్యుడో అతనికే తను సొంతమౌతానని చెప్పింది. ఆత్మీయానుబధంతో ఉన్న సోదరులు కాస్తా ఒకరి మీదకు ఒకరు కాలు దువ్వుకొన్నారు. భీకరమైన పోరు సలిపి ఇద్దరూ మరణించారు.
ఆత్మీయులైన సోదరులే ఐనా స్త్రీ విషయంలో ఇలా తగవులు రావచ్చు కనుక పాండవులు ద్రౌపది విషయంలో అలా ప్రవర్తించకూడదని హితవు పలికాడు నారదుడు. అప్పుడు నారదుడి సమక్షంలోనే ధర్మరాజు తన సోదరులతో కలిసి ద్రౌపది తో ఒక్కొక్కరూ ఒక సంవత్సరం భర్తగా ఉండేలా ఆ సమయంలో వేరెవరైనా ఈ కట్టుబాటు దాటితే ఒక సంవత్సరం తీర్ధయాత్రలకు వెళ్ళి లా ఏర్పాటు చేసాడు.
సీనియర్ సిటిజన్స్ దయచేసి గమనించండి
🙏🌹సీనియర్ సిటిజన్స్ దయచేసి గమనించండి
యునైటెడ్ స్టేట్ లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం 51% పైగా వృద్ధులు మెట్లు ఎక్కేటప్పుడు పడిపోతారు.
ప్రతి సంవత్సరం, చాలా మంది అమెరికన్లు మెట్లు ఎక్కేటప్పుడు పడి చనిపోయారు.
* నిపుణుల రిమైండర్: *
60 సంవత్సరాల తరువాత, ఈ 10 చర్యలకు దూరంగా ఉండాలి.
* 1. మెట్లు ఎక్కవద్దు. *
మీరు తప్పక ఎక్కితే, మెట్ల కేసు రైలింగ్‌లను గట్టిగా పట్టుకొని ఎక్కండి,
* 2. మీ తలను వేగంగా తిప్పకండి. *
కళ్ళు బైర్లు కమ్మి మీరు క్రింద పడిపోవచ్చు,
* 3. మీ కాలి బొటనవేలును తాకడానికి మీ శరీరాన్ని వంచవద్దు.🤸🤸
మొదట మీ శరీరాన్ని సిద్ధం చేసుకోండి,
* 4. మీ ప్యాంటు ధరించడానికి నిలబడకండి.
కూర్చుని మీ ప్యాంటు ధరించండి *
* 5. నిలబడి ఒక్కసారి గా పడుకోకుండా మీ శరీరం యొక్క ఒక వైపు (ఎడమ చేతి వైపు, లేదా కుడి చేతి వైపు) నుండి కూర్చోని పడుకోండి,
* 6. వ్యాయామానికి ముందు మీ శరీరాన్ని ట్విస్ట్ చేయవద్దు. మొదట మీ శరీరాన్ని సిద్ధం చేసుకోండి,
* 7. వెనుకకు నడవకండి. *
వెనుకకు పడటం వలన తీవ్రమైన గాయం అవుతుంది.
* 8. భారీ బరువును ఎత్తడానికి నడుము వంచవద్దు. మీ మోకాళ్ళను వంచి, సగం చతికిలబడినప్పుడు వస్తువును పైకి ఎత్తండి. 🏋♀ *
* 9. మంచం మీద నుండి వేగంగా లేవకండి. మంచం నుండి లేవడానికి ముందు కొన్ని నిమిషాలు వేచి ఉండండి. *
* 10. వాష్‌రూమ్‌లో అధిక శక్తిని ఉపయోగించవద్దు. ఇది సహజంగా రావనివ్వండి. *
ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఎల్లప్పుడూ చురుకుగా ఉండాలి మరియు
🥀🌹🥀అన్ని బాదలకి దివ్య ఔషదo
చిరునవ్వు ఒకటే🥀🌹🥀
🥀🌹🥀ఎన్ని కష్టాలు వచ్చినా సరే
గుండె నిబ్బరంతో ఉంటూ🥀🌹🥀
🥀🌹🥀పెదవులపై నీ చిరునవ్వు ని
ఎప్పటికి చెదరనివ్వకు నేస్తం🥀🌹🥀
🥀🌹🥀నీ చిరునవ్వు కి నీ కష్టాలు
దాసోహం అవుతాయి నేస్తం 🥀🌹🥀
దయచేసి అందరూ సీనియర్లకు ఫార్వార్డ్ చేయండి 💐🙏
జ్యోతిష్య శాస్త్ర గణనలో భిన్నపద్దతులు
జ్యోతిష్య శాస్త్ర గణనలో భిన్నపద్దతులను పాటిస్తారు. సూర్యుడి గమనాన్ని అనుసరించి లెక్కగడితే సౌరమానమని, చంద్రుని గమనాన్ని అనుసరించి లెక్కగడితే చాంద్రమానమని అంటారు.
సూర్యుని చుట్టూ భూమి చుట్టివచ్చే కాలాన్ని సౌర సంవత్సరం అంటారు. కాని ఈ బ్రమణం వల్ల నెలలు ఏర్పడవు. నెలలను కొలవడానికి చంద్ర బ్రమణమే ఆధారం. భూమి చుట్టు చంద్రుని ప్రదక్షిణా కాలాన్ని నెల అంటారు. దాన్నే చాంద్ర మాసమని అంటారు. ఆ విధంగా ఏర్పడిన 12 చాంద్ర మాసాలను కలిపి ఒక సంవత్సరం అని అనలేము. సూర్యుడు .... మేషం, వృషభం, వంటి 12 రాసులలో ఒక్కో రాసిలో ఒక్క నెల సంచరించడాన్ని సౌర మాసం అని అంటారు. సూర్యుడు ఒక రాసి నుండి మరో రాసిలోనికి ప్రవేశించ డాన్ని రాశి సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం ప్రతి నెలలోనూ జరుగుతుంది. కాబూ మనం మఖర రాశి సంక్రమణాన్ని మాత్రమే మఖర సంక్రాంతిగా గుర్తిస్తున్నాము. ఒక్కో రాశిలో ఒక నెలపాటు తిరగాల్సిన సూర్యుడు...... రెండు నెలల పాటు ఒకే రాశిలో వుండటం వల్ల ఏర్పడేదె అధిక మాసం. ఇందులో మొదటి నెలలో రవి సంక్రాంతి వుండదు. దాన్నె అధిక మాసం అంటారు.
అధిక మాసము చంద్ర మానము ద్వారానే వస్తుంది. చాంద్రమానం అంటే చంద్ర కళలను (తిధులను)ఆధారంగా ఒక నెల రోజులను లెక్కించడము. సూర్యుడు ఏడాదిలో 12 రాశుల చక్రాన్నిపూర్తి చేస్తే చంద్రుడు రోజుకు ఒక నక్షత్రం చొప్పున నెలకు 27 నక్షత్రాల దగ్గరే వుంటాడు. అనగా 12 క్ష్ 27 = 354 రోజులు. సూర్యుడి చుట్టు భూమి తిరగడానికి 365 రోజులా, 6 గంటలు, 11 నిముషాలు 31 సెకెండ్లు పడుతుంది. చంద్రునికైతె 354 రోజులె పడుతుంది. వీరిద్దరి మధ్య సుమారు 11 రోజులు తేడా వున్నది. ఈ వ్వత్యాసం వల్ల భూమి సూర్యుని చుట్టు 19 సార్లు తిరిగితే చంద్రుడు 235 సార్లు తిరుగుతున్నాడు. దాని వలన 19 సంవత్సరాలకు..... ఏడాదికి 12 మాసాల చొప్పున 238 మాసాలు రావలసి వుండగా 235 మాత్రమె వస్తున్నాయి. అనగా చంద్రుడు 7 నెలలు అధికంగా తిరుగుతున్నాడని అర్థం. ఆ లెక్కన ప్రతి ముప్పై రెండున్నర సౌరమాసాలకు ఒక చంద్రమాసం అధికంగా వస్తుంది. ఈ విషయాన్ని మొట్టమొదట గ్రహించిన వారు భారతీయఋషులు.
ఈ అధిక మాసము ఎప్పుడూ చైత్ర మాసము నుండి ఆశ్వయుజ మాసం మధ్యలోనే వస్తుంది. ఒక సారి అధిక మాసము వచ్చాక తిరిగి 28 నెలలకు మరోసారి వస్తుంది. ఆ తర్వాత 34, 34, 35, 28 నెలలకు వస్తుంది. అధిక మాసం ముందు వచ్చి ఆతర్వాత నిజ మాసం వస్తుంది. ఈ అధిక మాసాన్ని మలమాసం అని అంటారు. అనగా ఈ అధిక మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు.
అధికమాసానికి మాధవమాసమని, పురుషోత్తమ మాసమని కూడా పేర్కున్నాయి. ఈ అధికమాసంలో చేసే జపం, దానం, పూజ కోటి రెట్ల ఫలితాన్నిస్తాయి. కార్తీక, మాఘమాసాల వలె అధికమాసంలో కూడా ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానాలు చేయాలి. ఈ మాసంలో ఎదైన కొత్త దీక్ష తీసుకుని, నియమబద్ధంగా గడుపుతూ, ఏదైనా నామజపం లేదా మంత్రజపం చేసినా విశేషఫలితం ఉంటుంది.
శిలాఫలకం
కొందరు జాలరులు సముద్రములో చేపలు పడుతుండగా వాళ్లకు ఒక శిలాఫలకం దొరికింది. దానిమీద ఏవో అక్షరాలు వున్నట్టుగా వారికి కనిపించింది ఇదేదో శ్లోకం లాగుంది భోజరాజు గారికి యిస్తే మంచి బహుమతి యిస్తారు అని రాజు కు తెచ్చి యిచ్చారు. భోజరాజు వారికి మంచి బహుమానం యిచ్చి పంపించారు. ఆయన దాన్ని పండితులకు యిచ్చియిదేమితో పరిశీలించమని ఆజ్ఞాపించాడు. వారు దానిని నిశితంగా పరిశీలించి
ఒక పాదం మాత్రం అర్థమయిందని చెప్పారు.
"అయిఖలు విషమ పురాకృతానాం భవతి హి జంతుషు కర్మణాం విపాకః"
అర్థము:-అయ్యయ్యో!పూర్వ కర్మల ఫలితం ప్రాణులకు చాలా విషమం గా వుంటుంది.
ఇంకో పాదం పూర్తిచేయమని భోజుడు కవి భవభూతి ని ఆజ్ఞాపించారు. భవభూతి యిలా పూరించాడు.
" క్వను కులమ కలంకం ఆయతాక్ష్యా?కవ చ రజనీ చర సంగమ అపవాదః?"
అర్థము:-- విశాలాక్షి అయిన సీత యొక్క అకలంక మైన కుల మెక్కడ?రాక్షసునితో సంబంధం కలిపే అపవాదు ఎక్కడా?
కానీ రాజుకు ఆ పూరణ నచ్చలేదు. తానూ యిలా పూరించాడు.
"క్వ జనక తనయా? క్వ చ దశకంధర మందిరే నివాసః"
అర్థము :-- ఎక్కడి జనక మహారాజు కూతురు, రామపత్ని?ఎక్కడ దశకంధరుడి ఇంటిలో వుండడం. తన పూరణ కూడా ఆయనకు నచ్చ లేదు. కాళిదాసు వంక చూశాడు మహా కవీ మీరే మంటారు? అన్నాడు. కాళిదాసు కండ్లు మూసుకొని కాసేపు ధ్యానం చేసి యిలా చెప్పాడు. ఇది హనుమంతుడు వ్రాసిన హనుమ ద్రామాయణము లోని యుద్ధ కాండ లోని శ్లోకములో రెండవ పాదముగా వున్నది. అని మొత్తం శ్లోకం చెప్పాడు.
"శివ శిరసి శిరాంసి యాని రేజు: శివ! శివ! తాని లుఠ౦తి గృధ్ర ప్రాదై:
అయి ఖలు విషమః పురాకృతానాం భవతి హి జంతుషు కర్మణాం విపాకః "
అర్థము:-శివ శివ! ఏ తలలు శివుని తలపై విరాజిల్లెనో(శివ- శిరసి) (రావణుడు ఒకసారి తన తలలు ఖండించి శివుడి శిరస్సు పై పడ వేస్తాడు ) అట్టి తలలు యిప్పుడు యుద్ధము లో తెగి పడి గ్రద్దల కాళ్ళచే దొర్లింప బడుతున్నాయి ఆయ్యో! పూర్వజన్మ కర్మ ఫల పరిణామం ప్రాణులకు యెంత కఠినమో కదా!
ఇది సముద్రము లో లభించినది. దాని చరిత్ర ఏమిటో ?చెప్పగలరా? అని అడిగాడు భోజుడు.
అందుకు కాళిదాసు,యిది హనుమద్రామాయణము లోనిది. హనుమంతుడు దాన్ని రామునికి చూపించగా రాముడు హనుమా!యిందులో నీ శౌర్యాన్నినీవే ఎక్కువగా వర్ణించి నట్టున్నది.స్వోత్కర్ష ఎక్కువగా కనపడుతుంది అని అన్నాడు. దానితో హనుమంతుడు రామునికి నచ్చని ఈ గ్రంథ మెందు లకు? అని సముద్రములో పారవేసినాడు. అందులోని ఒక శిలాఫలకమే యిది . అన్నాడు కాళిదాసు.
అందుకు రాజు నీ పూరణ యుక్తము గానే యున్నది. కానీ యిదే కవి హృదయమని యెట్లు నిర్దారింప గలవు?అన్నాడు. అప్పుడు కాళిదాసు హనుమంతుని ధ్యానించాడు. హనుమంతుడు ప్రత్యక్ష మై కాళిదాసు పూరించినది సరియైనదే అని చెప్పాడు. అప్పుడు భోజుడు ఇది జరిగి చాలా కాలమైంది కదా! మీకు అంత బాగా జ్ఞాపకముందా?అన్నాడు. అప్పుడు హనుమంతుడు రాజా!నీ ఉద్యాన వనము లో నైరుతి దిశ లో నున్న చెట్టు యొక్క ఆకు పసరు తెచ్చి ఈ శిలాఫలకము పైన పూయండి అప్పుడు ఆ శ్లోకము స్పష్టముగా కనిపిస్తుంది అని చెప్పి అదృశ్య మయ్యాడు. వారు అలా ఆ పసరు పూయగానే శ్లోకము స్పష్టంగా కనిపించింది.. అది కాళిదాసు పూరించిన శ్లోకము గానే వున్నది. అప్పుడు భోజుడు,సభాసదులు కాళిదాసు ప్రతిభను కీర్తించి నారు.
--------------------- -------------------------
సహస్రారాంబుజారూఢా* యైనమః. 🙏
౧౦౫. ఓం *సహస్రారాంబుజారూఢా* యైనమః. 🙏
మ. సతతంబున్ నిను సంస్మరించిన *సహస్రారాంబుజారూఢ*! వి
స్తృత విజ్ఞాన వివేకముల్ గలుఁగు, వాసిన్ గొల్పు చిత్తేజమున్
నుత సంస్కారము నీ కృపన్ గలుగు, నేనున్ నిన్ మదిన్ నిల్పి నా
గతినే మార్చుకొనంగ నుంటి నిక వేగంబీవె నన్ గావుమా.🙏
అమ్మ పాదారవిందములకు ప్రణమిల్లుచు🙏
చింతా రామకృష్ణారావు.
గ్రహములయొక్క యుతి
గ్రహములయొక్క యుతి, వీక్షణ, స్థితి యిత్యాదులచే వచ్చిన ఆయుర్థయమును నిర్థేశిక హరణలకు అన్వయించవలసి ఉంటుంది.
1. రాశి నందు ఒకటి కంటే హెచ్చు గ్రహములున్నచో గ్రహము ఇచ్చు ఆయుర్థాయమును సగమునకు తగ్గి ంచవలెను.
2. గ్రహము నీచలో ఉండినా అస్తంగత్వము చెందినా ఆయుర్థాయమును సగమునకు తగ్గి ంచవలెను.
3. గ్రహము శతృక్షేత్రములో ఉన్నచో ఆయుర్థాయమునందు మూడవవంతు ఆయువును తగ్గించాలి.
4. భ చక్ర దృశ్య సగభాగములో పాపగ్రహమున్నచో ఆయుర్థాయమును క్రింది విధంగా తగ్గించాలి.
12 వ యిల్లు - పూర్తిగా💯%
11 వ యిల్లు - సగమునకు( 50%)
10 వ యిల్లు - మూడవ వంతు( 75%)
9వ యిల్లు - పావు భాగము (25%)
8 వ యిల్లు - 1/5 వ భాగము
7వ యిల్లు - 1/6 భాగము
భ చక్ర దృశ్యపు సమభాగములో శుభుడు గాని ఉన్నచో పైన తెల్పిన వివిధ ఇండ్లలో పాపగ్రహము పోగొట్టుకొను ఆయువులో
సగభాగము మాత్రమే పోగొట్టు కొనును.
(5) గ్రహయుద్దమునందు పరాజిత గ్రహము అయినచో 1/ 3 వ భాగము తగ్గించవలెను.
(6) రవి గాని చంద్రుడు గాని గ్రహణమునందున్నచో 1/3 భాగము తగ్గించవలెను.
ఒకే గ్రహము (పైన తెల్పిన) ఒకటి కంటే హెచ్చువిధములైన హరణలకు(తగ్గింపులకు )
గురి అయితే అన్నింటిలో హెచ్చు హరణమును మాత్రమే ఒక పర్యాయమే గురిచేయవలెను.
పూజ్యులు పెద్దలు శ్రీ మాన్ వాసుదేవ శర్మగారు
కోరిన పిమ్మట నా పరిధిలో శోధ్య పిండమును భినాష్టక వర్గరీత్యా ఆయుర్థాయము గణన చేయు విధానమును తెలియజేయడమైనది.
ఇది కాకుండా ఆయుర్దాయమును నిర్థారణ చేయుట కు "నక్షత్రాయు పద్దతి కూడా వాడుకలో కలదు(రెండవ పద్దతి ).
🙏🙏🙏
*మీ ఆరోగ్యంß మీ చేతుల్లోనే ఉంది.**_
💐🙏💐🙏💐🙏💐 _
*ప్రతి మనిషి తన జీవితంలో బాగా సంపాదించాలి, పాలరాతితో ఇంద్ర భవనం లాంటి ఇల్లు కట్టు కోవాలి అని, ఆ ఇంటి ముందు ఖరీదైన ఫారిన్ కారును నిలపాలి అని, జీవితంలో ఇంతకంటే సాధించ వలసినది, సంపాదించ వలసినది ఇంకేముంది అనుకుంటున్నారు..*_👌
_**మొన్నీమధ్య ఒక పనిమీద బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది. పని మధ్యాహ్నానికే అయిపోయింది. తిరుగు ప్రయాణం మాత్రం మరుసటిరోజు, బాగా సమయం ఉంది. రెన్నేల్లక్రితం మా దగ్గరి బంధువు ఒకాయన అక్కడ ఒక మంచి ఇళ్ళు కట్టుకొని గృహప్రవేశం చేశాడు కానీ కరోనా ప్రభావం వల్ల అప్పుడు రాలేకపోయాం. సరే ఇప్పుడు టైమ్ ఉంది కదా అని కలిసి వద్దాం అని బయలు దేరి వెళ్లాను. ఇంటిముందు ఆటోదిగి ఇంట్లోకి ప్రవేశించబోతూ ఒకసారి ఇంటి బయట చేయించిన ఎలివేషన్ చాలా రిచ్ గా ఉంది. బయటనుండే గ్రానైట్ రాతితో నిర్మించబడింది. ఇంటిముందు ఒక పెద్ద విదేశీ కారు నిలిపి ఉంది.*_
_**గడపలోనే ఎదురైన వెంకటేష్ వచ్చావా బావా, లోపలికిరా అంటూ సాదరంగా ఆహ్వానించి సోఫాలో కూర్చుండబెట్టాడు. అవి విదేశీ ఫర్నీచర్ అనుకొంటా సుతిమెత్తగా ఉన్నాయి. ఏమేవ్ మీ అన్నయ్య వచ్చాడే ఒకసారి వచ్చి పలకరించు అన్నాడు. పనిమనిషి ఖరీదైన వీల్ చైర్ ను తోసుకుంటూ వస్తోంది. అందులో కూర్చొన్న పద్మావతి దూరం నుండే నమస్కారం అన్నయ్యా, ఇప్పుడు తీరిందా మమ్మల్ని చూడడానికి అంటూ, పనిమనిషితో అన్నయ్యకు కాఫీ తీసుకురా అంటూనే..*_
_**ఆయనకు చెక్కర వేసి తీసుకురా, నాకు మీ అయ్యగారికి చెక్కర లేకుండా తీసుకురా అంటూ, ఎంటన్నయ్యా విశేషాలు ఇంట్లో అందరూ బావున్నారా.. ఆ బాగానే ఉంటారులే మేమేమో అక్కడ నుండి వచ్చాక కేవలం డబ్బు సంపాదన అంటూ ఈ ఇరవై ఏండ్లూ ఎన్నో రకాల వ్యాపారాలు చేసుకుంటూ ఏంతో డబ్బు సంపాదించాం, కానీ ఏం లాభం అదే రీతిలో ఎన్నో రకాల జబ్బులను కూడా సంపాదించు కొన్నాము. చూశారుగా మాకు బీపీలు, షుగర్లు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, కీళ్ళనొప్పులు, కాళ్ళనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చూశారుగా మొన్నే మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకొని ఇదిగో ఇలా వీల్ చైర్ లో తిరగాల్సిన కర్మ పట్టింది.*_
_**ఇక మీరు, వదినగారు, చక్కగా యోగా గురూజీలుగా, ఆక్యుపంక్చర్ డాక్టర్లుగా ఎదిగి మీరు, మీ పిల్లలు హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడమే కాకుండా ఊరూరు తిరుగుతూ కొన్ని వేలమందికి ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతను అందిస్తున్నారు. మీరెంతో గొప్ప పని చేస్తున్నారు అన్నయ్యా, అంటూ మాట్లాడడానికే ఆయాస పడసాగింది. ఇంతలో రెండు జంటలు ఇంట్లోకి వస్తున్నారు. వారి వేషధారణ చూస్తే ఆ జీన్స్ ప్యాంట్లు చాలా ఖరీదైనవే కానీ ప్యాంట్ల నిండా రంధ్రాలు, చిరుగులే, వాటిపైన వేసుకొన్న బనియన్లు పిచ్చి పిచ్చి రంగులలో ఉండి శరీరంలో వేటిని దాచలో వాటినే ప్రదర్శించుకొంటూ వస్తున్నారు.*_
_**వారిని చూస్తుంటే సంతల్లో అడుక్కునే బిచ్చగాల్లు గుర్తుకు వచ్చారు. వారితో ఇదిగో మామయ్యోచ్చాడు అంటే, 'హాయ్ హలో ' అంటూ చేతులూపుతూ, బూటుకాళ్ళతోనే పైనున్న వారి గదుల్లోకి వెళ్ళిపోయారు. మీకు ఇద్దరేకదా పిల్లలు అంటే, వాళ్ళకి వాళ్ళే లవ్ మ్యారేజ్ లు చేసుకొన్నారు. ఎవరు ఏ కులమో, ఏ మతమో తెలియదు కానీ రిచ్ ఫ్యామిలీ వారట. అందుకే ఎవరికీ తెలియకుండా ఏదో అలా ముగించేసాము అన్నది. ఇంతలో పనిమనిషి సుబ్బమ్మ వచ్చి అమ్మ భోజనానికి రండంది. చాలా కాస్ట్లీ డైనింగ్ టేబుల్, నాకేమో అన్నీ వడ్డించారు వారికి మాత్రం రాగిజావ, కూరగాయల సూపులు, డాక్టర్ల సలహా మేరకు రోజు వారి భోజనం అదేనట. భోజనం తర్వాత వారితో ఒక కథ చెబుతాను వినండి అని చెప్పాను.*_
_**నాకు తెలిసిన కాంట్రాక్టర్ దగ్గర రంగయ్య అనే గొప్ప తాపీ మేస్త్రీ ఒకడు ఉండేవాడు. అతని నైపుణ్యం అద్భుతం! ముప్ఫై సంవత్సరాలుగా అతను అదే కాంట్రాక్టరు దగ్గర పని చేస్తుండడం వల్ల ఆ కాంట్రాక్టరుకు కూడా ఆ మేస్త్రీ అంటే చాలా గౌరవం అభిమానం అందువల్లనే వాళ్ళ సంబంధం అన్ని సంవత్సరాలపాటు కొనసాగింది. చివరికి ఒక రోజున మేస్త్రీ కాంట్రాక్టరుతో "అయ్యా! ప్రస్తుతం మనం చేస్తున్న ఈ పని అయిపోగానే, నేను ఇక రిటైరు అయిపోతాను. బాగా పెద్దవాడిని అయిపోయాను, శరీరం కూడా సహకరించడం లేదు. ఇక పనిని చాలించి శేష జీవితాన్ని విశ్రాంతిగా గడపాలని ఉన్నది, అందుకే ముందుగానే తెలియ జేస్తున్నాను ఏమంటే మీకు పనిలో కష్టం కలగకూడదు గద, అందుకని " అన్నాడు.*_
_**కాంట్రాక్టర్ సరే కానీ నాదొక చిన్న కోరిక కాదనకు. నాకోసం మరొక్క చక్కని ఇల్లు కట్టిచ్చి వెళ్ళు అన్నాడు. మేస్త్రీ కూడా కాదనలేక అయిష్టంగానే ఒప్పుకున్నాడు గాని, నిజానికి కొత్త ఇంటి పని మొదలయ్యేసరికి, మేస్త్రీకి ఆ పని పెద్ద బరువులాగా తోచింది. మనసు ఏమాత్రం పనిలో అస్సలు నిలవలేదు. దాంతో ఆ పని అరకొరగా సాగింది. నిర్మాణపు క్వాలిటీ కూడా బాగా రాలేదు. కాంట్రాక్టర్, మేస్త్రీలు కూడా ఆ మార్పును గమనించారు, అయినా కాంట్రాక్టర్ సర్దుకు పోతూ కొన్ని సూచనలను ఇచ్చినా మేస్త్రీ వాటిని అన్నిటినీ పెడచెవిన పెట్టాడు. "ఎలాగో ఒకలాగా జరిగిపోయి, పని గడిస్తే చాలు" అనుకున్నాడు.*_
_**కొత్త ఇంటి పని పూర్తయ్యే సమయానికి కాంట్రాక్టరు వచ్చి చివరి ఇన్స్పెక్షను చేశాడు. నిర్మాణపు పనితనం ఏమంత బాగా రాలేదు, చాలా లోపాలు కనబడ్డాయి. ఆయనేమీ ఆశ్చర్య పోలేదు ముందునుండీ పనిని చూస్తూనే ఉన్నాడు కాబట్టి, నిట్టూర్చి తన జేబులోంచి ఆ ఇంటి తాళాల గుత్తి తీసి, మేస్త్రీ చేతుల్లో పెడుతూ అన్నాడు, చూడు రంగయ్య ఇదిగో ఇకనుండి ఈ ఇల్లు నీకే సొంతం. ఇన్నాళ్ళ మన స్నేహానికి గుర్తుగా నేను నీకు ఇవ్వదలచిన బహుమతి ఇది " అని అంటూ రంగయ్య భుజం తట్టి వెళ్ళి పోయాడు.*_
_**మేస్త్రీ నిర్ఘాంత పోయాడు. అయ్యో ! "ఎంత ఘోరం జరిగి పోయింది, ఈ ఇల్లు నాకు ఇవ్వడానికే అనే సంగతి ముందుగానే నాకు తెలిసుంటే ఎంత బాగుండేది, తను ఆ ఇంటి నిర్మాణంలో తన ముఫై ఏండ్ల అనుభవాన్ని రంగరించి ఆ ఇంటికి జీవం పోసి ఉండేవాడిని! ఇప్పుడు ఇక చేయగలిగింది ఏమీ లేదు. లోపభూయిష్టమైన ఈ ఇంట్లోనే తన శేష జీవితాన్ని గడపాల్సిందే, తన తప్పుల్ని తను ప్రతిరోజూ చూసుకొంటూ, అందుకు ప్రతిరోజూ సిగ్గుపడుతూ గడపాలి! అయ్యో! ముందుగానే తెలిసి ఉంటే ఎంత బాగుండేదో! ఇప్పుడేమీ చెయ్యలేమే! " అనుకొంటూ కుమిలి కుమిలి ఏడవ సాగాడు.*_
_**అలాగే మనందరమూ కూడా ఈ మన శరీరాలను నిర్మించుకునే మేస్త్రీలం మనమే. మనదే ఈ ఇల్లు. ఇందులో ఉండాల్సిందీ మనమే. మనం మన యీ శరీరాన్ని ప్రేమ, ఆప్యాయతలతో, ఆరోగ్యంగా ఉండేటట్లు శ్రద్ధగా నిర్మించుకుంటే, అది మన జీవితానికి అనుకూలంగాను, వసతిగాను ఉంటుంది. బాగా పని చేస్తుంది. అట్లా కాక, మనం దాని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, అది పాడై అనారోగ్యం పాలౌతుంది. అప్పుడు మనం రోగాలతో బాధలు పడుతూ, పశ్చాత్తాపంతో బ్రతకాల్సిందే.*_
_**నిజానికి "మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ". ఆరోగ్యమే మహాభాగ్యము. భగవంతుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని మనకు ఆరోగ్యాన్ని పెంచే ఆహారపు అలవాట్లతో కాపాడుకోవడం, రోజూ వ్యాయామం, యోగా ప్రాణాయామం, ధ్యానం చేయడం, మంచి పుస్తకాలను చదవడం లాంటివి చేయడం మన చేతుల్లోనే ఉంది. అది మన ధర్మం. అది మన బాధ్యత. మనం నివసించే ఇంటిని ఎంతో ఖర్చు చేస్తూ ఎంత శ్రద్ధగా నిర్మించు కొంటామో, అంతే శ్రద్ధగా మన శరీరాన్ని కూడా నిర్మించుకొని కాపాడుకోవాలి. అందుకే పెద్దలన్నారు "మన దేహమే దేవాలయం " అని.. శుభం భూయాత్.*_👌
*మీ ఆరోగ్యంß మీ చేతుల్లోనే ఉంది.**_
**ఆరోగ్యమే మహాభాగ్యం.**_ _**Health is Wealth.**_
*Prevention is Better than Cure.*
*జై శ్రీమన్నారాయణ - జై శ్రీహనుమాన్*
సందేహం;- మా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏఏ స్తోత్రాలు చదవాలో దయచేసి తెలియజేయగలరు.
సమాధానం;- గాలి ఎక్కువగా పీల్చుకోవడం, నీళ్ళు ఎక్కువగా త్రాగడం, మితంగా సాత్విక ఆహారం తీసుకోవడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ఇవి మన ఆరోగ్య సౌధానికి నాలుగు ప్రధాన స్తంభాలు. ఆపైన ఈ క్రింది స్తోత్రాలు చదువుకుంటే భగవదనుగ్రహం వల్ల పరిపూర్ణ ఆరోగ్యం ఉంటుంది.
*(01)*
ప్రతిరోజూ ఉదయించే సూర్యుని ముందు నిల్చొని *ఆదిత్య హృదయం* చదవాలి. శాస్త్ర పద్దతిలో సూర్య నమస్కారాలు కూడా చేస్తే మంచిది.
*(02)*
వాల్మీకి రామాయణం యుద్ధకాండలోని యాభై తొమ్మిదవ సర్గ పారాయణం చెయ్యాలి. ఇది మనలోని అహంకారాన్ని, అంతః శత్రువులను తగ్గిస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది.
*(03)*జాతకాలు చూపెట్టి జ్యోతిష్కులు చెప్పిన మహాదశ, అంతర్ధశలలోని గ్రహదోషాలను నివారించడానికి, వాయు పురాణంలోని *ఉమా సంహిత* లో సూచించిన విధంగా ఆయా ఘట్టాలు పారాయణం చెయ్యాలి.
*(04)*
నవగ్రహాలకు అధిపతి శ్రీసుదర్శనులవారు. భగవంతుని సంకల్పానుసారం వారు నడుస్తారు. మన కర్మ ఫలాలను, ప్రధానంగా అనారోగ్యములను నియంత్రించే ఆదేశాలను భగవంతుడు నరసింహ దివ్య రూపంలో సుదర్శనుల వారికి కటాక్షిస్తారని ప్రసిద్ధి. అందువల్ల వారికి ప్రీతి కలిగించే సుదర్శన శతకము, సుదర్శనాష్టకం, నృసింహాష్టకం, లక్ష్మీనరసింహ శతనామావళి పారాయణం అర్చన చేయడం మంచిది.
*(05)*
అనారోగ్యాన్ని దూరం చేయడానికి ధన్వంతరి అష్టోత్తర శతనామ అర్చన సత్ఫలితాన్నిస్తుంది.
*శుభంభూయాత్*
రామాయణము- *సుందరకాండ - తొమ్మిదవ సర్గ*
:
[26/09, 6:58 pm] +91 99089 49429:
[26/09, 6:58 pm] +91 99089 49429
*(16)*
బంగారంతోనూ, స్ఫటికమణులతోనూ అలంకారయుతంగా అమర్చబడిన చిన్న, పెద్ద గవాక్షాలు, ఇంద్రనీల మహానీల మణులు పరచిన వేదికలు ఆ పుష్పకానికి మరింత వన్నె తెస్తున్నాయి.
*(17)*
ఆ విమానం అడుగుభాగం (గచ్చు) విచిత్రవర్ణంగల పగడాలతోనూ, అమూల్యమైన మణులతోనూ, సాటిలేని ముత్యాలతోనూ పొదగబడి అద్భుతంగా విరాజిల్లుతోంది.
*(18)*
సువాసనలు వెదజల్లే ఎర్రచందనం, బంగారు రంగు చందనం ఆ విమానమంతటా అలదడంచే అది బాలభానునిలా భాసిస్తోంది.
*(19)*
సుందరమైన వివిధ కూటాగారాలచే (గదులచే) కూడుకొన్నదీ, దివ్యమైనట్టిదీ అయిన ఆ పుష్పక విమానాన్ని హనుమంతుడు అధిరోహించాడు.
*(20)*
హనుమంతుడు ఆ పుష్పకంలోనికి రాగానే మద్యాది పానీయాలు, భక్ష్యాలు, అన్నాలు మొదలైన ఆహార పదార్థాల నుండి వెలువడిన కమ్మని వాసనలను ఆఘ్రాణించాడు.
*జై శ్రీహనుమాన్*
*సుందరకాండ - తొమ్మిదవ సర్గ*
*(11,12)*
ఈ పుష్పక విమానాన్ని పూర్వం బ్రహ్మదేవుని కోసం దేవశిల్పియైన విశ్వకర్మ స్వర్గంలో నిర్మించాడు. ఆ పుష్పకం సమస్తమైన రత్నాలతో అలంకరింపబడింది. కుబేరుడు కఠోర తపస్సు చేసి దానిని బ్రహ్మ నుండి పొందాడు. తన పరాక్రమంచే కుబేరుణ్ణి నిర్జించి రావణుడు ఆ పుష్పక విమానాన్ని కైవసం చేసుకొన్నాడు.
*(13,14)*
ఆ పుష్పకం తోడేళ్ళ బొమ్మలు మలచబడిన బంగారు, వెండి స్తంభాలతో శోభాయమానంగా ప్రకాశిస్తూన్నది. దాని పై భాగం మేరు, మందర పర్వతాలకు దీటైన, ఆకాశాన్ని తాకుచున్నవా అన్నట్లున్న అనేక కూటాగారాలతో (పెద్ద పెద్ద గదులు) సమలంకృతమై ఒప్పారుతోంది.
*(15)*
అగ్నిమల్లే, సూర్యునిమల్లే ప్రకాశిస్తూన్న ఆ పుష్పక విమానాన్ని విశ్వకర్మ తన నైపుణ్యాన్నంతా ప్రదిర్శించి నిర్మించాడు. దాని లోనికి వెళ్ళడానికి రూపొందించిన మెట్లు బంగారుమయమైనవి. అందులో సుందరమైన వేదికలు అమర్చబడి ఉన్నాయి.
*జై శ్రీహనుమాన్*
గౌరవ పట్టభద్రులకు
ఈ కింద తెలిపిన లింక్ ని క్లిక్ చేసి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ లొగల గౌరవ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కొరకు పట్టభద్రుల వివరాలు నమోదు చేయగలరు మరియు ఈ లింక్ ను మిగిత పట్టభద్రులకు పంపి నమోదు చెపించగలరని విన్నపం
*31.10.2017 తేది ముందు డిగ్రీ పొందినవారు అర్హులు.*
https://forms.gle/chDCX3pZW3mvWT8u8
అభినంధనలతో
మీ
ఎల్ రమణ
రాష్ట్ర పార్టీ అధ్యక్షులు టిడిపి.టీఏస్
9848046723
9701200009
lgandularamana@gmail.com
పండిట్ మహేంద్ర పాల్ ఆర్యా
ఈయన పేరు పండిట్ మహేంద్ర పాల్ ఆర్యా .
తాను ముస్లిం గా ఉన్నప్పటి పేరు మెహబూబ్ అలీ పాషా .
నాలాంటి వాళ్ళకి పితామహుడు .
20 ఏళ్ల వరకు మస్జీద్ లో ఇమామ్ గా చేశారు .
కానీ ఖురాన్ దైవ గ్రంధం కాదు అని తెలిసి . తన లో ఉన్న సత్యాన్వేషిని నిద్ర లేపాడు . ఎందరో ఇమామ్ లకి , ముఫ్తి లకి , మౌలానా లకి తన మదిలో ప్రశ్నలని సంధించారు . కానీ ఏ ఒక్కరు కూడా సమాధానం ఇవ్వలేకపోయారు .
ఆర్య సామాజ్ కి తన లేఖ పంపారు . అక్కడ ఆయనకి తన ప్రశ్నలకు సమాధానం దొరికింది .
ఆ తరువాత దయానంద సరస్వతీ గారి సత్యర్థ ప్రకాశము చదివాక . నిజమైన దైవ జ్ఞానం వేదాలు మాత్రమే అని తెలుసుకున్నారు .
32 ఏళ్లుగా వేదం పండితుడిగా చేస్తున్నారు .
ఎందరో ముస్లిం ఇమామ్ లకి , మౌలానా లకి సవాలు విసిరారు . ఖురాన్ దైవ గ్రంధం అని నిరూపించమని.
దాదాపుగా 3000 వేల డిబేట్ లు చేశారు . ఒక్కటి కూడా ఓడిపోయిన రికార్డ్ లేదు .
ఎందరో నాస్తికులని సైతం ఓడించారు.
ప్రముఖ ముస్లిం వక్త జాకీర్ నాయక్ ని ఈ దేశం వదిలి వెళ్లే లా చేసిన వారిలో ఈయన కూడా ఒకరు .
పీస్ టీవీ నుండి చాలా మంది వచ్చారు ఈయన తో డిబేట్ చెయ్యడానికి కానీ ఆయన తో గెలవలేకపోయారు .
ముస్లిం లని కాడి ఏకాంగా 20,000 ల మంది ముస్లిం స్కాలార్ లని తిరిగి సనాతనం కి తిరిగి ఘర్ వాపసి చేశారు .
సరియైన ప్రోత్సాహం లేక డబ్బులు లేక ఇలా మిగిలిపోయారు . కానీ ఆయన లాంటి చాలా మంది శిష్యులని తయారు చేసారు .
ఆశిష్ చౌరసియా .
అరిహన్త ఆర్యా
రాహుల్ ఆర్యా
అంకూర్ ఆర్యా
లాంటి ఎంతో మంది ఈయన్ని గురువా భావిస్తారు .
జై సనాతనం .
శ్రీ వరాహస్వామి
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శ్రీ వరాహస్వామి వారి విగ్రహం అయహోళె కర్ణాటక లోనిది. దీనిని 7 వ శతాబ్దంలో కట్టించారు. ఇందులో వరహస్వామి వారు తన రెండు కోరలతో భూమాతను రక్షించే విధంగా చెక్కబడింది. భూమి గోళాకృతిలో ఉన్నదని మనకు వేదకాలంలోనే తెలుసు. కానీ ఈ విషయాన్ని పాశ్చాత్యులు ఎంత రాద్ధాంతానికి దారితీసారంటే, కోపర్నికస్/గెలీలియో, ఇలా చాలా సిద్ధాంతాలు మనకు నేర్పారని పాఠ్యాంశాలలో ఇప్పటికీ బోధిస్తున్నారు. గెలీలియో ఈ విషయాన్ని 16 వ శతాబ్థంలో చెపితే ఈ శిల్పం చెక్కింది 7 వ శతాబ్థంలో ఇప్పుడు చెప్పండి.
ఈ విగ్రహములో గెలీలియో కంటే 800 సంవత్సరాల క్రితమే భూమిని గుండ్రంగా చూపించిన భారతీయ శిల్పులు, నా సనాతన హిందువులు కన్నా ఏ విదేశీ సైంటిస్టూ, తక్కువే కదా?
**హిందూ ధర్మం** 51
**దశిక రాము**
(సత్యం)
నిజాలు మాట్లాడే రోజులు కావండి ఇవి. ఇప్పుడు నిజాలు మాట్లాడేవాళ్ళు, నిజాయతీగా బ్రతికేవాళ్ళు సమాజంలో జీవించడం కష్టమని అనుకోను మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఎవరి కోసం నిజాలు మాట్లాకుండా ఉండడమేమిటి? ఎవరి మెప్పుకోసమో అబద్ధాలు చెప్పడేమిటి? సత్యం అనేది ధర్మం. వ్యక్తిగతంగా ఆచరించవలసింది. మిమ్మల్ని భగవంతుని వద్దకు చేర్చేది సత్యమే. సమస్త స్మృతుల్లో చెప్పబడింది, ఋషుల చేత ఎలుగెత్తి చాటబడింది సత్యం. సత్యవ్రతాన్ని ఆచరించడం.
సత్యం వద ధర్మం చర......సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం అంటూ విద్యాభ్యాసం ముగిసే సమయంలో గురువు శిష్యునికి భోధిస్తారు. సత్యాన్నే పలుకు, ధర్మాన్ని ఆచరించు ......... సత్యాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకు, ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టకు అని అర్దం. సమస్త విద్యల యొక్క ప్రధాన సందేశం సత్యవంతులుగా బ్రతకడమే.
మంత్రానికి ప్రాణం సత్యం. ఎంత జపం చేసినా, ఎన్ని పూజలు చేసిన అబద్ధాలు మాట్లాడే వాడికి ఆ జపఫలితం రాదు, మంత్రం సిద్ధించదు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, నేను ఎప్పటి నుంచో మంత్రం జపిస్తున్నా కానీ ఫలితం లేదు లాంటి మాటలు చాలామంది మాట్లాడుతుంటారు. సత్యవంతుడు కానీవారికి మంత్రం పనిచేయదని గుర్తించరు.
అబద్ధాలు చెప్పడానికి నేర్పు కావాలేమో, తెలివి ఉండాలేమో, కానీ నిజాన్ని ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. నిజాన్ని ఒప్పుకోలేకపోవడమే పిరికితనం. తెలివైనవాడు జీవితంలో పైకి రావచ్చు, అదృష్టం లేకపోతే పతనం కావచ్చు. కానీ ధైరవంతుడు జీవితంలో అన్నిటిని ఎదురుకుని నిలబడతాడు, గొప్ప స్థానానికి చేరుతాడు. ధైర్యమే బలం, పిరికితనమే బలహీనత. అందుకే స్వామి వివేకానందా బలమే జీవనం, బలహీనతే మరణం అన్నారు. నిజాన్ని అంగీకరించలేని వాడు నిరంతరం చస్తూనే ఉంటాడు. ధైర్యం బలాన్నిస్తే, సత్యం ధైర్యానిస్తుంది. సత్యవంతులే ధైర్య వంతులు, ధీరులు. అధ్యాత్మిక జీవితంలో పురోగతి సత్యపాలన మీదనే ఆధారపడి ఉంటుంది. కనుక జీవితంలో ప్రధానమైన లక్షణం సత్యవంతులుగా బ్రతకడం. అదే ధర్మం.
తరువాయి భాగం రేపు.......
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి*
https://chat.whatsapp.com/HUn5S1ETDNTG580zg5F9PU
**ధర్మో రక్షతి రక్షితః**
https://chat.whatsapp.com/Iieurm6WILS6u4QsiHHq95
*ధర్మము - సంస్కృతి* గ్రూప్
ద్వారా , పురాణాలు , ఇతిహాసాలు, దైవ లీలలు పోస్ట్ చేస్తూ అందరికీ మన సనాతన ధర్మ వైభవాన్ని తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాము.మీరు కూడా సహకరిస్తే అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
ఘంటసాలకు నచ్చిన పొగడ్త*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
బాలు గారు చెప్పిన....
*ఘంటసాలకు నచ్చిన పొగడ్త*
➖➖➖✍️
ఒక సారి ఘంటసాల గార్ని ఒకళ్ళు అడిగారట
"ఏ కళాకారులైనా తమ కళని గుర్తించాలని చూస్తారు కదా.. ఒక గాయకుడిగా మీ జీవితంలో మీకు చాలా బాగా నచ్చిన పొగడ్త చెప్పండి.." అని
.
అప్పుడు ఆయన
(ఆ రోజుల్లో టీవిలూ అవీ లేవు కనక ఆయన రూపం జనానికి తెలిసే అవకాశం లేదు)
"ఒకసారి నేను ఒక టీ కొట్టు పక్కన టీ తాగుతున్నాను. 'మహాకవి కాళిదాసు' సినిమాలోని "మాణిక్యవీణా...అని పాట రేడియోలో వస్తోంది. ఆ పాటను.. అక్కడున్న ఒక రిక్షా అతను ఎంతగానో లీనమైపోతూ గొంతుకలిపి పాడుతూ విని ఒక చోటుకొచ్చేసరికి అతను ఆగిపోయి... ఇహ పాడలేక...
"అబ్బబ్బబ్బ ఏంపాడాడ్రా.. ఏం పాడాడ్రా...ఘంటసాల.!!!!..
'నంజకొడుకు' సంపేసినాడ్రా...సంపేసినాడ్రా నంజకొడుకు నంజకొడుకు... సంపేసినాడ్రా" అంటూ అరిచేస్తూ అన్నాడట."
ఆ మాటలు ఆ పక్కనే కూర్చున ఘంటసాల గారు విని నవ్వుతూ ఆయనకూడా చూశారట.
ఘంటసాల గారు ఈ మాటలు చెప్పగానే అక్కడున్న ఆయన అభిమానులు షాకైపోయి కాసేపాగి తేరుకుని చాలా ఆశ్చర్యంగా..."అదేమిటీ మాస్టారు మిమ్మల్ని అన్ని తిట్లు తిడితే మీ అమ్మగారిని కూడా అలా తిట్టేస్తుంటే మీకు కోపం రాలేదా బాధయ్యలేదా" అని అడిగారుట.
దానికి ఆయన
"హృదయంలోంచి వచ్చే నిజమైన భావావేశం ఏ వస్త్రం ఏ ఆచ్చాదనా లేకుండా చాలా సహజంగా .. నగ్నంగా వుంటుంది. అదే నిజమైన పొగడ్త.. ఆ ఆవేశంలో అక్కడ సంస్కారం ప్రవేశించినప్పుడు అది కొంత కృతకంగా ఆర్టిఫిషియల్ గా తయారౌతుంది. అతను అసలేమీ ఆలోచించకుండా ఏమీ అనుకోకుండా తన భావావేశాన్ని వ్యక్తం చేశాడు. ఒక కళాకారుడిగా దాన్ని నేను కూడా అర్థం చేసుకోలేకపోతే ఎలా" అన్నారట.
అదీ ఘంటసాల గారి రసవంతమైన మనసు.
.
ఈ మాటలు ఒకసారి ఘంటసాల శ్యామలగారు నాతో చెప్తుంటే నా మనసులో ఘంటసాల గారి మీద గౌరవం ఇంకా ఇంకా ఎంతో పెరిగిపోయింది.
ఎదుటివారి ఆవేశాన్ని అర్థం చేసుకుని మాటల్లోని పైపైన వచ్చే అర్థాన్ని పట్టించుకోకుండా,
అంతే సహజంగా మనసునులోని భావాన్ని చూడడం, చూడడం అర్థం చేసుకోవడం ఎంత మందికి వీలౌితుంది.!!!!
.. అంత సునిశితంగా ఎదుటివారి మాటల్లో మనసు మాత్రమే చూడడం ఆయనవల్లైంది కనకనే ఆయన, తన పాటల్లో ఆ భావాల్ని అలా అంత గొప్పగా లీనమై పలికించారేమో.!!
అందుకే ఆ సంగీత సరస్వతి ఆయనను అలా హత్తుకుని పొదువుకుందేమో...తన ఆ సంగీతాన్ని ఆయనకు ప్రసాదించిందేమో.. అనిపించింది నాకు. -✍️
- SPB
🌷🙏🌷
. ఓం శుభంకర్యై నమః.🙏
౬౮౨. ఓం శుభంకర్యై నమః.🙏
నయగుణ వర్తనంబులననారతమున్ జరియింత్రు సజ్జనుల్
ప్రియముగ నిన్నుఁ గొల్చుచు చరించుచునుండుట చేసి ధాత్రి, ని
ర్భయము, సుశీలమున్, జయము, భాగ్యము గల్గును నిన్ను నమ్మినన్,
బ్రియమున నిన్నె గొల్చెదను ప్రీతిని నన్ గను మో శుభంకరీ!🙏
అమ్మకు పాదాభివందనము చేయుచు🙏
చింతా రామకృష్ణారావు.