శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
#శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;
మ||
తలపన్ మానవ జీవితంపు గతులన్ తాళంబుగాజేసి ని
చ్చలు మ్రోగన్ కుడిచేతిలో డమరువున్;సంధిల్ల ప్రాణాగ్ని డా
పలికేలన్, వరదాభయప్రదములై వర్ధిల్లు హస్తద్వయం
బు లసన్ముద్రల దాల్ప;త్రొక్కగ నహంబున్ పాదపద్మంబు న
ర్తిలు దేవా ! నటరాజ! నీకు నతులో శ్రీ సిద్ధలింగేశ్వరా!
భావం;
నటరాజ స్వరూపాన్ని గమనిస్తే అర్ధమయ్యేదేమిటంటే
మానవ జీవన గతులను తాళములుగా చేసి నీ కుడిచేతిలో ఢమరుక మును నిత్యము మ్రోగిస్తూ ఉంటావు.
మరొక చేతిలో ప్రాణాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది.
మరో రెండు హస్తములు ఒక హస్తం వరముద్రలో,మరొక హస్తం అభయ ముద్రలలో ఉంటాయి.
కాలితో అహము అనే రక్కసిని తొక్కుతూ నాట్యం చేస్తూ ఉంటావు.
అటువంటి నీ నటరాజ స్వరూపానికి ఇవే నా నమస్కృతులు, స్వీకరించు స్వామీ,
శ్రీ సిద్ధ లింగేశ్వరా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి