:
[26/09, 6:58 pm] +91 99089 49429:
[26/09, 6:58 pm] +91 99089 49429
*(16)*
బంగారంతోనూ, స్ఫటికమణులతోనూ అలంకారయుతంగా అమర్చబడిన చిన్న, పెద్ద గవాక్షాలు, ఇంద్రనీల మహానీల మణులు పరచిన వేదికలు ఆ పుష్పకానికి మరింత వన్నె తెస్తున్నాయి.
*(17)*
ఆ విమానం అడుగుభాగం (గచ్చు) విచిత్రవర్ణంగల పగడాలతోనూ, అమూల్యమైన మణులతోనూ, సాటిలేని ముత్యాలతోనూ పొదగబడి అద్భుతంగా విరాజిల్లుతోంది.
*(18)*
సువాసనలు వెదజల్లే ఎర్రచందనం, బంగారు రంగు చందనం ఆ విమానమంతటా అలదడంచే అది బాలభానునిలా భాసిస్తోంది.
*(19)*
సుందరమైన వివిధ కూటాగారాలచే (గదులచే) కూడుకొన్నదీ, దివ్యమైనట్టిదీ అయిన ఆ పుష్పక విమానాన్ని హనుమంతుడు అధిరోహించాడు.
*(20)*
హనుమంతుడు ఆ పుష్పకంలోనికి రాగానే మద్యాది పానీయాలు, భక్ష్యాలు, అన్నాలు మొదలైన ఆహార పదార్థాల నుండి వెలువడిన కమ్మని వాసనలను ఆఘ్రాణించాడు.
*జై శ్రీహనుమాన్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి