6, సెప్టెంబర్ 2024, శుక్రవారం

సెప్టెంబర్, 07, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

         🍁 *శనివారం*🍁

🌹 *సెప్టెంబర్, 07, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                     


             *ఈనాటి పర్వం* 

*శ్రీ వరసిద్ధి వినాయక (వ్రతం) చతుర్థి*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం -  శుక్లపక్షం*


*తిథి : చవితి* సా 05.37 వరకు ఉపరి *పంచమి*

*వారం    : *శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : చిత్త* మ 12.34 వరకు ఉపరి *స్వాతి*


*యోగం  : బ్రహ్మ* రా 11.17 వరకు ఉపరి *ఐంద్ర*

*కరణం  : భద్ర* సా 05.37 ఉపరి *బవ* పూర్తిగా రాత్రంతా


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 10.30 - 01.00 సా 05.00 - 06.00*

అమృత కాలం:శేషం ఉ 07.08 వరకు

అభిజిత్ కాలం  : *ప 11.40 - 12.30*


*వర్జ్యం         : సా 06.51 - 08.39*

*దుర్ముహూర్తం:ఉ 05.55 - 07.34*

*రాహు కాలం : ఉ 09.00 - 10.33*

గుళికకాళం      : *ఉ 05.55 - 07.27*

యమగండం    : *మ 01.38 - 03.10*

సూర్యరాశి : *సింహం*

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 05.55* 

సూర్యాస్తమయం :*సా 06.16*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 05.55 - 08.23*

సంగవ కాలం   :      *08.23 - 10.51*

మధ్యాహ్న కాలం :*10.51 - 01.18*

అపరాహ్న కాలం: *మ 01.19 - 03.47*

*ఆబ్ధికం తిధి:భాద్రపద శుద్ధ చవితి*

సాయంకాలం  :  *సా 03.47 - 06.16*

ప్రదోష కాలం    :  *సా 06.16 - 08.35*

రాత్రి కాలం     :  *రా 08.35 - 11.42*

నిశీధి కాలం     :*రా 11.42 - 12.29*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.08*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీ వేంకటేశ్వర దివ్య వర్ణన స్తోత్రం....!!*


 శిరంవజ్ర కిరీటం - 

వదనం శశివర్ణ ప్రకాశం 


ఫాలే కస్తూరి శ్రీగంధ తిలకం - 

కర్ణం వజ్ర కుండల శోభితం 


నాసికా సువాసికా పుష్పదళం - 

నయనే శశిమండల ప్రకాశం 


కంఠే సువర్ణపుష్ప మాలాలంకృతం - 

హృదయే శ్రీనివాస మందిరం 

కరం కరుణాభయసాగరం 

భుజే శంఖ చక్రగదాధరం 


స్కంధే సువర్ణ యజ్ఞోపవీత భూషణం - 

సర్వాంగే స్వర్ణపీతాంబర ధరం 


పాదే పరమానందరూపం - 

సర్వపాపనివారకం 


సర్వం స్వర్ణమయం - 

నామం శ్రీ వేంకటేశం 


శ్రీనివాసం - శ్రీ తిరుమలేశం - 

నమామి శ్రీ వేంకటేశం !!...🚩🌞🙏🌹


🙏 *ఓం నమో వెంకటేశాయ నమః*🙏


🍁🪔 🌹🌿🌹🌿🌹 🪔🍁


ఓం నమో వాయుపుత్రాయ 

భీమరూపాయ ధీమతే ।

నమస్తే రామదూతాయ 

కామరూపాయ శ్రీమతే ॥


మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే ।

భగ్నాశోక వనాయాస్తు దగ్ధలంకాయ ॥


తత్త్వ జ్ఞాన సుధాసిందు 

నిమగ్నాయ మహీయసే ।

ఆంజనేయాయ శూరాయ 

సుగ్రీవ సచివాయచ ॥


యక్షరాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహ్నతే ।

మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ద్రతే ॥


హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే ।

బలినా మగ్రగణ్యాయ నమః పాపహరాయతే ॥


    🙏🏻 *ఓం సర్వదుఃఖహరాయ నమః* 🙏🏻


   🍁⚛️🌹🪔🍁🪔🌹⚛️🍁


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

*శ్రీ ఆదిశంకరాచార్య చరిత్రము 4

 *శ్రీ ఆదిశంకరాచార్య చరిత్రము 4 వ భాగము* 

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


*కన్యాన్వేషణ:*


హిమమిత్రుడు పంపిన విప్రులు కాలి నడకను బయలుదేరి అనేక గ్రామములుదాటి అనేక దేశములు దాటి బహు దినములకు విశ్వామిత్రుని ఇంటికి చేరు కున్నారు. వారికి విశ్వమిత్రుడు అర్ఘ్యపాద్యాదులిచ్చి ఎన్నో పరిచర్యలు చేశాడు. కొంత సేపు విశ్రాంతి తీసుకొన్న పిమ్మట కుశల ప్రశ్నలతో పలకరించాడు: 'బ్రాహ్మణోత్త ములారా! మీరు చూడగా బహుదూర దేశంనుండి వచ్చినట్లనిపి స్తోంది. మీ రాకతో మా గృహం పావన మయ్యింది. మీకు ఈ దాసుడు ఏ రీతిగా సేవ చేయగలడు ఇది నా అదృష్టమని భావిస్తున్నాను, చెప్పండి'.


ఆ మాటలు విన్న విప్రులు వెంటనే తాము వచ్చిన కార్యం ఇలా సెలవిచ్చారు: ‘మహానుభావా! మీ స్వాంతనపు మాటలు, మీ మర్యాదలు మాకు సేద తీర్చాయి, వినండి. మేము వచ్చిన పని ఏమిటో చెప్పుతాము. హిమ మిత్రుడనే బ్రాహ్మణశ్రేష్ఠుని పంపున మీ వద్దకు వచ్చాము. అతని కుమారుడు విశ్వరూవుడనే పిల్లవాడు రూపు రేఖలలోను, విద్యలకు, వినయగుణ సంపత్తికి పేరు గన్నవాడు. మీ ప్రియ పుత్రిక అయిన ఉభయభారతికి అన్ని విధాలా అర్హుడైన వరుడని సంకల్పించి మానిర్ణయాన్ని తమకు నివేదించమని హిమమిత్రుడు మమ్మల్ని పంపాడు'. 'ఆడబోయిన తీర్థము ఎదురయింద' న్నట్లైంది విశ్వమిత్రునికి. ఇంటి లోనికిపోయి ఆ సంతోషంతో సంగతి భార్యకు చెప్పాడు. హిమ మిత్రుని కుమారుడు విశ్వరూపుడనే వరునకు మన ఉభయభారతి ఇచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చిన బ్రాహ్మణుల గుఱించి. పైకి చాలా ఆనందపడ్డా ఉభయభారతి తల్లికి కొన్ని అనుమానాలు పొడసూపాయి. ఉన్నది ఒక్కతే కూతురు గదా! వాళ్ళు ఉన్న ఊరు చాలా దూరం. ఎప్పుడయినా చూడడానికి వెళ్ళాలంటే ప్రయాస కదా! పిల్ల వాని చదువులేమిటో మంచి చెడ్డలు తెలుసుకొన్న పిమ్మట నిదానంగా ఆలోచన చేసి నిర్ణయిం చాలి కదా! అని ఆ తల్లి తన అభిప్రాయాలనూ అనుమానాలనూ వ్యక్తం చేసింది. ఆ మాటలకు సమాధానంగా విశ్వమిత్రుడు భార్యతో ఇలా అన్నాడు: 'కుండిన నగరానికీ ద్వారకకూ ఎంత దూరమో తెలుసా? కొన్ని రోజుల ప్రయాణం అటునుండి రావడానికి, భీష్మకమహారాజు ఏమైనా శ్రీకృష్ణుని గూర్చి తెలిసి కొందామని చారులను పంపాడా? శ్రీకృష్ణుని కీర్తి జగద్వ్యాప్తం కదా! అదే విధంగా ఈ విశ్వరూపుడు కూడ బహుయశస్సు సంపాదించుకొనిన వాడు. పైగా కుమారస్వామి అవతారమయిన కుమారిలభట్టు వద్ద చదువు నేర్చుకొన్న ప్రజ్ఞా వంతుడు. ధనసంపద అంటావా? బ్రాహ్మణునికి విద్యయే తరగని అమూల్యమయిన విత్తం. అది కాక హిమమిత్రుడు ధన ధాన్యాది ఐహిక భాగ్యం లోనూ లోటు లేని గృహస్థుడు'. 


ఆ విధంగా సంప్రతించు కొన్న తరువాత ఉభయ భారతి చెవిలో వేశారీ మాట. విన్నంతనే ఆమె ఆనందంతో సిగ్గుతో అరమొగ్గలా అయింది. వివాహప్రయత్నం తప్పక జయప్రదమగుననే నమ్మకం ఉభయభారతికి. ఆ నమ్మకంతో తానే ఒక గొప్ప ముహూర్తాన్ని నిశ్చయించినది. సకల శుభలక్షణములూ కల ముహూర్తమది. ఆ ముహూర్త యోగబలాన్ని బట్టి వ్యవధి పదునాలుగు రోజులే ఉన్నా ఒక ఆకు మీద లిఖించిన పత్రికను తమ వైపు బ్రాహ్మణున కిచ్చి పంపించారు. వచ్చిన విప్రవరులతో బాటు పరుగు పరుగున వారు హిమమిత్రుని దగ్గఱకు చేరుకొన్నారు. లగ్నపత్రిక అందుకున్న హిమ మిత్రుని ఆనందానికి అవధిలేదు. శుభవార్త అందించిన ఆ విప్రులను బహురీతులుగా సత్కరించాడు హిమ మిత్రుడు. తాము అందరూ సకుటుంబ పరివారంగా తరలి వస్తున్నామని వర్తమానం తెలిపారు మగ పెండ్లి వారు ఆడ పెండ్లి వారికి. సమయ వ్యవధి తక్కువ కావడంతో పెళ్ళికి సంబంధించిన పనులు సకలం చకచకా చురుకుగా జరుగుతున్నాయి.


*ఉభయభారతీ విశ్వరూపుల పరిణయము:*


పందిళ్ళు వేసే వాళ్ళు ప్రమోదంతో నిర్మించి, చూత పల్లవాలతో అలంకరించుచుండగా, వివాహవేదిక సర్వాంగ సుందరంగా తయారవు తోంది. పురమంతా పందిళ్ళే. ఊరంతా పెళ్ళివారే. మగపెళ్ళివారికి తగు విడిది ఏర్పాట్లు చేశారు. మేళతాళములు, మంగళవాద్యాలు మొదలైనవన్నీ సమకూర్చు కొని మగ పెళ్ళివారి రాకకై ఎదురు చూస్తున్నారు విశ్వమిత్రుని వైపు వారు.


ఇక హిమమిత్రుని వెంట ఆ పురప్రజలు అందరూ ప్రయాణ మయ్యారు. విప్రులతో, మిత్రులతో, భృత్యులతో, వేశ్యకన్యకల బృందాలతో, ఢంకానౌబత్తు కానాలతో, రామడోళ్లతో, ఇంకా పలురకాల మంగళ వాద్యాలతో మంచివేళ చూచికొని బయలు దేరారు మగపెండ్లివారు. ముత్యాల పల్లకిపై మందహాసంతో కూర్చున్న పెండ్లి కొడుకు విశ్వరూపుడు. గాయక శిఖామణులు, కవిపుంగ వులు, బ్రహ్మణ్యులైన బ్రాహ్మణులు వేద వాక్కులు పలుకుచుండగా, వాహనములపై ఎక్కి విజయ పరంపరలను అందుకొనుటకు వెడలే విజయుని సేనా వాహిని వలె విరాజిల్లినది ఆ జనసందోహం. మధ్య మధ్య మకాములు వేసికొంటూ, తొందర ఏ మాత్రం లేక నిబ్బరంగా తరలివస్తున్నారు. వెళ్ళి వెళ్ళి శోణానదీతీరం చేరుకొనగానే చెవులు చిల్లులు పడేటట్లు బాకాలు మారు మ్రోగాయి. అది మగ పెళ్ళి వారు వచ్చినట్లు సంకేతం. ఉలిక్కిపడిన కన్యాదాత వెంటనే ఎదురు వెళ్ళి స్వాగతం పలికి వారిని వెంట బెట్టుకొని ప్రత్యేకించి ఏర్పరచిన విడిదిలో ప్రవేశపెట్టాడు. ఒకరి నొకరు ఉదాత్త మర్యాద పూర్వకంగా పలకరించు కొన్నారు. వేదవిహితమైన వివాహకార్యక్రమం ముగిసింది. మండనమిశ్రుడు (విశ్వరూపుడు)మంగళసూత్రమును ఉభయ భారతి గళసీమను అలంకరింప జేశాడు.


*శంకరుల విద్యాభ్యాసము:* 


ఏడాది వెళ్ళకుండా శంకరబాలుడు అక్షరాలన్నీ గుర్తించ గలిగాడు. రెండవ యేడు రావడంతో పలు భాషల లిపులు విపులంగా నేర్వనారంభించాడు. దిద్ద నక్కఱ లేదు చూడడమే తడవుగా ఏదయినా ఆకళించుకోగలడు. రెండవ యేడు దాటలేదు శబ్దాలు కావ్యాలు నేర్వడం పూర్తయ్యింది. తాను నేర్వడమే కాదు తోటి బాలురకు కూడా నేర్పేవాడు. గురువుల నోట రావడం తడవు అన్నీ పలికేవాడు. తరువాత పురాణాలు చెప్పడం మొదలు పెట్టాడు. విద్యలన్నీ శంకర బాలుని ఆ విధంగా చేరుకొన్నాయి. ఆ విద్యాపాటవం ఆ నోట ఈ నోట ప్రాకి లోకులంతా విభ్రాంతులయ్యారు. వచ్చీరాని వయస్సులో మహావిద్వత్సంపన్నుడవడం వింతలలో వింత. సాక్షాత్తూ శంకరుడే అనిపించాడు. వేదవిద్య శంకరునికి సహజంగానే అబ్బింది. ఆ మృదు మధుర వేద నిస్వనం వినిన వారికి మరల మరల వినాలనిపించేది. శాస్త్రాల మాటకు వస్తే మంచి నీళ్ళ ప్రాయమే. దిగ్గజాలు వంటి పండితులతో చేసే చర్చలు బహు వినోదకరంగా ఉండేవి. ఉద్దండులైన పండితులను ఇట్టే పల్టీలు కొట్టించ గలిగేవాడు. కాని తర్కం జోలికి పోయేవాడు కాదు ఇష్టం లేక. కాని కుతర్కవాదులు ఇతని ముందు తల వంచ వలసిందే. బాలుని ప్రతిభ ఎంతదో తెలిసి కొందామని వచ్చిన వారందరూ శంకరునితో వాదులాడిన పిమ్మట అతనికి జోహారు లర్పించే వారు.


*శివగురుడు దివి కేగుట*:


సర్వసమర్థుడైన సత్పుత్రుని విద్యావైభవాన్ని కనులార గాంచి అమందానంద పుత్రోత్సాహ సంభరితుడైన శివగురుడు ఇలా భావించాడు. చిత్తమూ, విత్తమూ, జీవితమూ అన్నీ క్షణ భంగురాలే. ఈ పాంచభౌతిక గాత్రం నశ్వరమని నమ్మి పరమాత్మ లేనిచోటు లేదని తలపోస్తూ, శివగురుడు పరమ జ్ఞానిగా శాశ్వతంగా పరమపదమందే దిశగా అస్తమించాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆర్యాంబను గ్రామం లోని స్త్రీ పురుషాదులు చూడవచ్చారు. దగ్గరగా చేరి, ఆమెకు ఊరటగా ఇలా చెప్పారు: 'నీకు చెప్పదగిన వారముకాము. మమ్ములనందరినీ ప్రేమతో చూచినదానవు. శివగురుడు నిజంగా పోలేదు. చినిగిన బట్టను వదలినట్లు తన పాంచ భౌతికదేహాన్ని త్యజించి పరమాత్మలో లీనమయ్యాడు. ఆయన సర్వజ్ఞుడు. మనల కందరికీ వైరాగ్యజ్ఞానభిక్ష ప్రసాదించిన ఘనుడు. ఈ బిడ్డను చూసుకో. ఇటువంటి బిడ్డను నీ చేతులలో పెట్టి వెళ్ళాడు నీ భర్త. తెలివికి నిధానమయిన ఈ బిడ్డనికి పట్టుమని అయిదేండ్లు లేవు. మానవులం మన విధులు మనం నిర్వర్తించ డం కన్న చేయగలిగే దేముంది’ అంటూ సప్రేమగా ఊరివారు ఆర్యాంబకు బాసటగా ఊరటనిచ్చారు.


*ఉపనయనము:*


ఏడాది అప్పుడే గడచి పోయింది. నాలుగేళ్ళు నిండి ఐదవ ఏడు వచ్చింది. ఉపనయన వయస్సు రానక్కర లేదు మన శంకరబాలునికి. దైవజ్ఞులచే మంచి ముహూర్తం స్థిరపరచారు. చుట్టాలు, పక్కాలు, ఊరివారందరు, ఎందరో పండిత ప్రకాండులు వీరు వారననేల: నేల ఈనినట్లుగా ఆ అవతారపురుషుని ఉపనయనమహోత్సవాన్ని చూడడానికి వేంచేశారు తండోపతండాలుగా. వటువు తండ్రి లేడన్న చింత తక్క మరో చీకు లేదు శంకరుని తల్లికి. మహర్షుల సన్నిధానంలో జరిగింది ఆ వేదవిహిత ప్రక్రియ. వేదవిదుల ఆశీర్వచనాలు, బ్రహ్మచారికి ఉపయుక్త మయ్యే కానుకలు ఎన్నో అందాయి వటువుకు. పసుపు రంగు కౌపీనం ధరించి అదే రంగు యజ్ఞోపవీతం మెడలో ఉండగా, చేత పలాశ దండాన్నీ, చంకనొక జోలెని, జలపాత్రను ధరించిన నూతన వటువు బ్రహ్మసన్నిధానంలో తొలిగా మాతృదేవికి భిక్షావందన మాచరించాడు. ఆ నాటితో రెండవ జన్మ ఆరంభ మయ్యింది శంకరునకు. ద్విజుడైన శంకరుని బ్రహ్మ వర్ఛస్సు అసమానం అద్వితీయం.


*హరహర శంకర కాలడి శంకర*

*శ్రీ శంకరాచార్య చరిత్రము* 

*4 వ భాగము సమాప్తము*

🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗

చరిత్రము 4 వ భాగము

 *శ్రీ ఆదిశంకరాచార్య చరిత్రము 4 వ భాగము* 

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


*కన్యాన్వేషణ:*


హిమమిత్రుడు పంపిన విప్రులు కాలి నడకను బయలుదేరి అనేక గ్రామములుదాటి అనేక దేశములు దాటి బహు దినములకు విశ్వామిత్రుని ఇంటికి చేరు కున్నారు. వారికి విశ్వమిత్రుడు అర్ఘ్యపాద్యాదులిచ్చి ఎన్నో పరిచర్యలు చేశాడు. కొంత సేపు విశ్రాంతి తీసుకొన్న పిమ్మట కుశల ప్రశ్నలతో పలకరించాడు: 'బ్రాహ్మణోత్త ములారా! మీరు చూడగా బహుదూర దేశంనుండి వచ్చినట్లనిపి స్తోంది. మీ రాకతో మా గృహం పావన మయ్యింది. మీకు ఈ దాసుడు ఏ రీతిగా సేవ చేయగలడు ఇది నా అదృష్టమని భావిస్తున్నాను, చెప్పండి'.


ఆ మాటలు విన్న విప్రులు వెంటనే  తాము వచ్చిన కార్యం ఇలా సెలవిచ్చారు: ‘మహానుభావా! మీ స్వాంతనపు మాటలు, మీ మర్యాదలు మాకు సేద తీర్చాయి, వినండి. మేము వచ్చిన పని ఏమిటో చెప్పుతాము. హిమ మిత్రుడనే బ్రాహ్మణశ్రేష్ఠుని పంపున మీ వద్దకు వచ్చాము. అతని కుమారుడు విశ్వరూవుడనే పిల్లవాడు రూపు రేఖలలోను, విద్యలకు, వినయగుణ సంపత్తికి పేరు గన్నవాడు. మీ ప్రియ పుత్రిక అయిన ఉభయభారతికి అన్ని  విధాలా అర్హుడైన వరుడని సంకల్పించి మానిర్ణయాన్ని తమకు నివేదించమని హిమమిత్రుడు మమ్మల్ని పంపాడు'. 'ఆడబోయిన తీర్థము ఎదురయింద' న్నట్లైంది విశ్వమిత్రునికి. ఇంటి లోనికిపోయి ఆ సంతోషంతో సంగతి భార్యకు చెప్పాడు. హిమ మిత్రుని కుమారుడు విశ్వరూపుడనే వరునకు మన ఉభయభారతి ఇచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చిన బ్రాహ్మణుల గుఱించి. పైకి చాలా ఆనందపడ్డా ఉభయభారతి తల్లికి కొన్ని అనుమానాలు పొడసూపాయి. ఉన్నది ఒక్కతే కూతురు గదా! వాళ్ళు ఉన్న ఊరు చాలా దూరం. ఎప్పుడయినా చూడడానికి వెళ్ళాలంటే ప్రయాస కదా! పిల్ల వాని చదువులేమిటో మంచి చెడ్డలు తెలుసుకొన్న పిమ్మట నిదానంగా ఆలోచన చేసి నిర్ణయిం చాలి కదా! అని ఆ తల్లి తన అభిప్రాయాలనూ  అనుమానాలనూ వ్యక్తం చేసింది. ఆ మాటలకు సమాధానంగా విశ్వమిత్రుడు భార్యతో ఇలా అన్నాడు: 'కుండిన నగరానికీ ద్వారకకూ ఎంత దూరమో తెలుసా? కొన్ని రోజుల ప్రయాణం అటునుండి రావడానికి, భీష్మకమహారాజు ఏమైనా శ్రీకృష్ణుని గూర్చి తెలిసి కొందామని చారులను పంపాడా? శ్రీకృష్ణుని కీర్తి జగద్వ్యాప్తం కదా! అదే విధంగా ఈ విశ్వరూపుడు కూడ బహుయశస్సు సంపాదించుకొనిన వాడు. పైగా కుమారస్వామి అవతారమయిన కుమారిలభట్టు వద్ద చదువు నేర్చుకొన్న ప్రజ్ఞా వంతుడు. ధనసంపద అంటావా? బ్రాహ్మణునికి విద్యయే తరగని అమూల్యమయిన విత్తం. అది కాక హిమమిత్రుడు ధన ధాన్యాది ఐహిక భాగ్యం లోనూ లోటు లేని గృహస్థుడు'. 


ఆ విధంగా సంప్రతించు కొన్న తరువాత ఉభయ భారతి చెవిలో వేశారీ మాట. విన్నంతనే ఆమె ఆనందంతో సిగ్గుతో అరమొగ్గలా అయింది. వివాహప్రయత్నం తప్పక జయప్రదమగుననే నమ్మకం ఉభయభారతికి. ఆ నమ్మకంతో తానే ఒక గొప్ప ముహూర్తాన్ని నిశ్చయించినది. సకల శుభలక్షణములూ కల ముహూర్తమది. ఆ ముహూర్త యోగబలాన్ని బట్టి వ్యవధి పదునాలుగు రోజులే ఉన్నా ఒక ఆకు మీద లిఖించిన పత్రికను తమ వైపు బ్రాహ్మణున కిచ్చి పంపించారు. వచ్చిన విప్రవరులతో బాటు పరుగు పరుగున వారు హిమమిత్రుని దగ్గఱకు చేరుకొన్నారు. లగ్నపత్రిక అందుకున్న హిమ మిత్రుని ఆనందానికి అవధిలేదు. శుభవార్త అందించిన ఆ విప్రులను బహురీతులుగా సత్కరించాడు హిమ మిత్రుడు. తాము అందరూ సకుటుంబ పరివారంగా తరలి వస్తున్నామని వర్తమానం తెలిపారు మగ పెండ్లి వారు ఆడ పెండ్లి వారికి. సమయ వ్యవధి  తక్కువ కావడంతో పెళ్ళికి సంబంధించిన పనులు సకలం చకచకా చురుకుగా జరుగుతున్నాయి.


*ఉభయభారతీ విశ్వరూపుల పరిణయము:*


పందిళ్ళు వేసే వాళ్ళు ప్రమోదంతో నిర్మించి, చూత పల్లవాలతో అలంకరించుచుండగా, వివాహవేదిక సర్వాంగ సుందరంగా తయారవు తోంది. పురమంతా పందిళ్ళే. ఊరంతా పెళ్ళివారే. మగపెళ్ళివారికి తగు విడిది ఏర్పాట్లు  చేశారు. మేళతాళములు, మంగళవాద్యాలు మొదలైనవన్నీ సమకూర్చు కొని మగ పెళ్ళివారి రాకకై ఎదురు చూస్తున్నారు విశ్వమిత్రుని వైపు వారు.


ఇక హిమమిత్రుని వెంట ఆ పురప్రజలు అందరూ ప్రయాణ మయ్యారు. విప్రులతో, మిత్రులతో, భృత్యులతో, వేశ్యకన్యకల బృందాలతో, ఢంకానౌబత్తు కానాలతో, రామడోళ్లతో, ఇంకా పలురకాల మంగళ వాద్యాలతో మంచివేళ చూచికొని బయలు దేరారు మగపెండ్లివారు. ముత్యాల పల్లకిపై మందహాసంతో కూర్చున్న పెండ్లి కొడుకు విశ్వరూపుడు. గాయక శిఖామణులు, కవిపుంగ వులు, బ్రహ్మణ్యులైన బ్రాహ్మణులు వేద వాక్కులు పలుకుచుండగా, వాహనములపై ఎక్కి విజయ పరంపరలను అందుకొనుటకు వెడలే విజయుని సేనా వాహిని వలె విరాజిల్లినది ఆ జనసందోహం. మధ్య మధ్య మకాములు వేసికొంటూ, తొందర ఏ మాత్రం లేక నిబ్బరంగా తరలివస్తున్నారు. వెళ్ళి వెళ్ళి శోణానదీతీరం చేరుకొనగానే చెవులు చిల్లులు పడేటట్లు బాకాలు మారు మ్రోగాయి. అది మగ పెళ్ళి వారు వచ్చినట్లు సంకేతం. ఉలిక్కిపడిన కన్యాదాత వెంటనే ఎదురు వెళ్ళి స్వాగతం పలికి వారిని వెంట బెట్టుకొని ప్రత్యేకించి ఏర్పరచిన విడిదిలో ప్రవేశపెట్టాడు. ఒకరి నొకరు ఉదాత్త మర్యాద పూర్వకంగా పలకరించు కొన్నారు. వేదవిహితమైన వివాహకార్యక్రమం ముగిసింది. మండనమిశ్రుడు (విశ్వరూపుడు)మంగళసూత్రమును ఉభయ భారతి గళసీమను అలంకరింప జేశాడు.


*శంకరుల విద్యాభ్యాసము:* 


ఏడాది వెళ్ళకుండా శంకరబాలుడు అక్షరాలన్నీ గుర్తించ గలిగాడు. రెండవ యేడు రావడంతో పలు భాషల లిపులు విపులంగా నేర్వనారంభించాడు. దిద్ద నక్కఱ లేదు చూడడమే తడవుగా ఏదయినా ఆకళించుకోగలడు. రెండవ యేడు దాటలేదు శబ్దాలు కావ్యాలు నేర్వడం పూర్తయ్యింది. తాను నేర్వడమే కాదు తోటి బాలురకు కూడా నేర్పేవాడు. గురువుల నోట రావడం తడవు అన్నీ పలికేవాడు. తరువాత పురాణాలు చెప్పడం మొదలు పెట్టాడు. విద్యలన్నీ శంకర బాలుని ఆ విధంగా చేరుకొన్నాయి. ఆ విద్యాపాటవం ఆ నోట ఈ నోట ప్రాకి లోకులంతా విభ్రాంతులయ్యారు. వచ్చీరాని వయస్సులో మహావిద్వత్సంపన్నుడవడం వింతలలో వింత. సాక్షాత్తూ శంకరుడే అనిపించాడు. వేదవిద్య శంకరునికి సహజంగానే అబ్బింది. ఆ మృదు మధుర వేద నిస్వనం వినిన వారికి మరల మరల వినాలనిపించేది. శాస్త్రాల మాటకు వస్తే మంచి నీళ్ళ ప్రాయమే. దిగ్గజాలు వంటి పండితులతో చేసే చర్చలు బహు వినోదకరంగా ఉండేవి. ఉద్దండులైన పండితులను ఇట్టే పల్టీలు కొట్టించ గలిగేవాడు. కాని తర్కం జోలికి పోయేవాడు కాదు ఇష్టం లేక. కాని కుతర్కవాదులు ఇతని ముందు తల వంచ వలసిందే. బాలుని ప్రతిభ ఎంతదో తెలిసి కొందామని వచ్చిన వారందరూ శంకరునితో వాదులాడిన పిమ్మట అతనికి జోహారు లర్పించే వారు.


*శివగురుడు దివి కేగుట*:


సర్వసమర్థుడైన సత్పుత్రుని విద్యావైభవాన్ని కనులార గాంచి అమందానంద పుత్రోత్సాహ సంభరితుడైన శివగురుడు ఇలా భావించాడు. చిత్తమూ, విత్తమూ, జీవితమూ అన్నీ క్షణ భంగురాలే. ఈ పాంచభౌతిక గాత్రం నశ్వరమని నమ్మి పరమాత్మ లేనిచోటు లేదని తలపోస్తూ, శివగురుడు పరమ జ్ఞానిగా శాశ్వతంగా పరమపదమందే దిశగా అస్తమించాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆర్యాంబను గ్రామం లోని స్త్రీ పురుషాదులు చూడవచ్చారు. దగ్గరగా చేరి, ఆమెకు ఊరటగా ఇలా చెప్పారు: 'నీకు చెప్పదగిన వారముకాము. మమ్ములనందరినీ ప్రేమతో చూచినదానవు. శివగురుడు నిజంగా పోలేదు. చినిగిన బట్టను వదలినట్లు తన పాంచ భౌతికదేహాన్ని త్యజించి పరమాత్మలో లీనమయ్యాడు. ఆయన సర్వజ్ఞుడు. మనల కందరికీ వైరాగ్యజ్ఞానభిక్ష ప్రసాదించిన ఘనుడు. ఈ బిడ్డను చూసుకో. ఇటువంటి బిడ్డను నీ చేతులలో పెట్టి వెళ్ళాడు నీ భర్త. తెలివికి నిధానమయిన ఈ బిడ్డనికి పట్టుమని అయిదేండ్లు లేవు. మానవులం మన విధులు మనం నిర్వర్తించ డం కన్న చేయగలిగే దేముంది’ అంటూ సప్రేమగా ఊరివారు ఆర్యాంబకు బాసటగా ఊరటనిచ్చారు.


*ఉపనయనము:*


ఏడాది అప్పుడే గడచి పోయింది. నాలుగేళ్ళు నిండి ఐదవ ఏడు వచ్చింది. ఉపనయన వయస్సు రానక్కర  లేదు మన శంకరబాలునికి. దైవజ్ఞులచే మంచి ముహూర్తం స్థిరపరచారు. చుట్టాలు, పక్కాలు, ఊరివారందరు, ఎందరో పండిత ప్రకాండులు వీరు వారననేల: నేల ఈనినట్లుగా ఆ అవతారపురుషుని ఉపనయనమహోత్సవాన్ని చూడడానికి వేంచేశారు తండోపతండాలుగా. వటువు తండ్రి లేడన్న చింత తక్క మరో చీకు లేదు శంకరుని తల్లికి. మహర్షుల సన్నిధానంలో జరిగింది ఆ వేదవిహిత ప్రక్రియ. వేదవిదుల ఆశీర్వచనాలు, బ్రహ్మచారికి ఉపయుక్త మయ్యే కానుకలు ఎన్నో  అందాయి వటువుకు. పసుపు రంగు కౌపీనం ధరించి అదే రంగు యజ్ఞోపవీతం మెడలో ఉండగా, చేత పలాశ దండాన్నీ, చంకనొక జోలెని, జలపాత్రను ధరించిన నూతన వటువు బ్రహ్మసన్నిధానంలో తొలిగా మాతృదేవికి భిక్షావందన మాచరించాడు. ఆ నాటితో రెండవ జన్మ ఆరంభ మయ్యింది శంకరునకు. ద్విజుడైన శంకరుని బ్రహ్మ వర్ఛస్సు అసమానం అద్వితీయం.


*హరహర శంకర కాలడి శంకర*

*శ్రీ శంకరాచార్య చరిత్రము* 

*4 వ భాగము సమాప్తము*

🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗

వరాహ జయంతి"

 # నేడు "వరాహ జయంతి" #


బమ్మెర పోతన రచించిన భాగవతం ప్రకారం మహా ప్రళయం

సంభవించి భూమి జలంలో మునిగిపోయింది. జగత్తుకు ఆధారమైన భూమండలాన్ని తిరిగి పైకి తేవడానికి బ్రహ్మదేవుడు పుండరీకాక్షుని స్మరించ సాగాడు. ధ్యాన నిమగ్నుడైన బ్రహ్మ నాసిక

నుంచి, బొటనవేలు పరిమాణమున్న వరాహంగా

శ్రీహరి లోకోద్ధరణకై ఉద్భవించాడు. సకల దేవతలు చూస్తుండగానే, క్షణం లోపల

ఏనుగంత ప్రమాణం పెరిగి చూసే వారికి అద్భుతాశ్చర్యములు కలిగించారు.


వరాహస్వామి హిరణ్యాక్షుని సంహరించి భూమిని తన కోరలపై నిలిపి సముద్ర గర్భం నుంచి భూమిని పైకి తీసి ఉద్దరించాడు. అనంతరం స్వామి తిరుమల

కొండపై సంచరించినట్లుగా ఆధారాలున్నాయి. అందుకు నిదర్శనం తిరుమల కొండపై ఉన్న భూవరాహ స్వామి ఆలయం. భాద్రపద శుద్ధ తదియ రోజు వరాహ జయంతి సందర్భంగా

శ్రీమహావిష్ణువును వరాహ అవతారంలో పూజించిన వారికి ఐశ్వర్యం, ఆరోగ్యం

చేకూరుతాయని నమ్మకం.🙏

వినాయక వ్రత కధ*

 *వినాయక వ్రత కధ*




విఘ్నేశ్వరుని కథ

సూత మహాముని శౌనకాది మహా మునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు.పూర్వము గజ రూపము కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'భక్తా! నీ కోరికేమి ?' అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరము నందే నివసించాలి' అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించ సాగాడు.


కొద్ది రోజులకు పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి, మహా విష్ణువును ప్రార్థించి, 'ఓ దేవదేవా! ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మా సురుని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఎదైనా ఉపాయంతో, మహా శివుని కాపాడ వలసింది' అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు.


శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయాంగా తలచి, నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్య కారులుగా మార్చి, గజాసురుని పురానికి వెల్లి సన్నాయి వాయిస్తూ, నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు 'మీకేం కావాలో కోరుకోండి!' అనగా, విష్ణుమూర్తి 'ఇది మహమైన నందీశ్వరుడు. శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి' అని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి, శివునితో 'నా శిరస్సును లోకమంతా ఆరాధించ బడే టట్లుగా అనుగ్రహించి, నా చర్మమును నీ వస్త్రముగా ధరించమని' వేడు కొన్నాడు.


అభయమిచ్చిన తరువాత, విష్ణుమూర్తి నందికి సైగ చేయగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి 'ఇలా అపాత్ర దానం చేయకూడదు. దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది' అని చెప్పి అంతర్థ


వినాయక జననము

కైలాసములో పార్వతీ దేవి శివుని రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర వేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదముగావించి లోపలికి వెళ్లాడు. అప్పటికే పార్వతీ దేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది. శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది. శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా, శివుడు కూడా చింతించి, గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు. అందువల్ల 'గజాననుడు'గా పేరు పొందాడు. అతని వాహనము అనింద్యుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు.కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమార స్వామి పుట్టాడు. అతని వాహనము నెమలి. అతను మహా బలశాలి. 











విఘ్నేశాధి పత్యము

ఒక రోజు దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి 'మాకు ఏ పనిచేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని' కోరారు. ఆ పదవికి గజాననుడు, కుమార స్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు, 'మీలో ఎవరైతే ముల్లోకముల లోని అన్ని పుణ్య నదులలో స్నానం చేసి ముందు వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులు' అన్నాడు. దానికి అంగీకరించిన కుమార స్వామి వెంటనే తన నెమలి వాహనమెక్కి వెళ్లి పోయాడు. గజాననుడు మాత్రం చిన్న బోయిన ముఖంతో 'తండ్రీ! నా బలాబలాలు తెలిసీ మీరిలాంటి షరతు విధించటం సబబేనా ? నేను మీ పాద సేవకుడిని కదా! నా మీద దయ తలచి ఎదైనా తరుణోపాయం చెప్ప'మని కోరాడు. అంతట శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు.


'సకృన్ నారాయణే త్యుక్త్వా పుమాన్ కల్పశత త్రయం! గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక!'కుమారా! ఇది నారాయణ మంత్రం! ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్య నదులలో స్నానం చేసినట్టవుతుంది. షరతు విధించిందీ తండ్రే, తరుణోపాయం చూపిందీ తండ్రే కాబట్టి, ఇంక తాను గెలవగలనో లేదో, కుమార స్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను ? అని సందేహించకుండా, ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపించుచూ, మూడు మార్లు తల్లి దండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసములోనే ఉండి పోయాడు.


అక్కడ కుమార స్వామికి, మూడు కోట్ల యాభై నదులలో, ఏ నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించే వాడు. అన్ని నదులూ తిరిగి, కైలాసానికి వచ్చేసరికి అన్నగారు, తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి చింతించి, 'తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యము ఇవ్వండీ అన్నాడు.'


ఆ విధంగా బాధ్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు, విఘ్నేశ్వరుడైనాడు. ఆ రోజు అన్ని దేశాల లోని భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకములైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పళ్లు, పానకము, వడ పప్పు సమర్పించారు. విఘ్నేశ్వరుడు, తృప్తి పడి తిన్నంత తిని, తన వాహనానికి పెట్టి, తీసుకెళ్ల గలిగినంత తీసుకుని భుక్తాయాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరు కున్నాడు. ఎప్పటిలాగా తల్లి దండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు. చేతులసలు నేల కానితేనా ? పొట్ట వంగితేనా ? అలా విఘ్నేశ్వరుడు అవస్థ పడుతుంటే, శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పక పకా నవ్వాడు. చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి కుడుములన్నీదొర్లు కుంటూ బయటకు వచ్చేసాయి.


పార్వతీ దేవి దుఃఖించుచూ, చంద్రుని ఇలా శపించింది. 'ఓరి పాపాత్ముడా! నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు. అందుకని నిన్ను చూసిన వాళ్లు, పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు.' 


ఋషి పత్నులు నీలాప నిందలు పొందుట

ఆ సమయంలోనే సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదిక్షణాలు చేస్తున్నారు. అగ్ని దేవుడు ఆ ఋషి పత్నులను చూసి మోహించాడు. కాని ఋషుల శాపాలకు భయ పడ్డాడు. అతని కోరిక గ్రహించిన అగ్ని దేవుని భార్య, ఒక్క అరుంధతీ రూపము తప్ప మిగతా అందరి రూపమూ ధరించి అతనికి ప్రియం చేసింది. ఋషులది చూసి తమ భార్యలేనని తలచి వాళ్లను వదిలి వే్సారు. దీనికి కారణము, వారు చంద్రుని చూడటమే!


దేవతలు, మునులు వెళ్లి శ్రీ మహా విష్ణువుకు విన్నవించుకోగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి, అసలు విషయం తెలుసు కుని ఋషులకు వివరించి, వాళ్ల కోపం పోగొట్టాడు. కైలాసమునకు వచ్చి విఘ్నేశ్వరుని పొట్టను పాముతో కుట్టించి అమరత్వాన్ని ప్రసాదించాడు. అప్పుడు దేవతలు మొదలగు వారంతా 'ఓ పార్వతీ! నీవిచ్చిన శాపం వల్ల లోకానికే ముప్పు. నీ శాపాన్ని ఉపసంహరించు' అన్నారు. పార్వతి కూడా తన కుమారుని ముద్దాడి, 'ఏ రోజైతే చంద్రుడు నా కుమారుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడ రాదు' అని శాపోపశమనమును కలుగ చేసింది. ఆ రోజు బాధ్రపద శుద్ధ చతుర్థి. ఆ రోజు చంద్రుని చూడకుండా అందరూ జాగ్రత్తగా ఉన్నారు. ఇలా కొన్నాళ్లు జరిగింది. 


శమంతకోపాఖ్యానము

ద్వాపర యుగములో ద్వారకలోనున్న కృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి ఆ కబురూ ఈ కబురూ చెప్పి చంద్రుని మీద శాపం విషయం కూడా చెప్పాడు. "ఆ శాపం పొందిన వినాయక చవితి ఈ రోజే కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి" అనేసి స్వర్గానికి వెళ్లిపోయాడు. కృష్ణుడు కూడా ప్రజలందరికీ చంద్రుడ్ని చూడవద్దని చాటింపు వేసాడు. అతనికి పాలంటే ప్రీతి కదా! తనే స్వయంగా పాలుపితుకుదామని, అకాశం కేసి చూడకుండా ఆవు దగ్గర కెళ్ళి పాలు పితుకుతూంటే పాలలో చంద్రబింబం కనిపించింది. 'హతవిధీ! నేనేమీ నీలాప నిందలు పడాలో కదా!' అనుకున్నాడు.


కొన్నాళ్లకు సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరకి వచ్చాడు. అతని దగ్గర శమంతక మణి ఉంది. అది సూర్యవరము వల్ల పొందాడు. శ్రీ కృష్ణుడది చూసి ముచ్చటపడి తనకిమ్మని అడిగాడు. 'అది రోజుకు ఎనిమిది బారువులు బంగారము నిస్తుంది. అలాంటిది ఏ మూర్ఖుడు కూడా వదులుకోడు ' అన్నాడు సత్రాజిత్తు. దాంతో శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు.


ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటాడడానికి అడవికి వెళ్లాడు. అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసమనుకుని అతనిని చంపి మణిని తీసుకుని పోతూండగా జాంబవంతుడనే ఒక భల్లూకము సింహమును చంపి మణిని తన గుహకు తీసుకుని పోయి తన కూతురికి ఆట వస్తువుగా యిచ్చాడు. ఇదంతా తెలియని సత్రాజిత్తు 'ఇంకేముంది మణి నివ్వలేదని కోపంతో శ్రీకృష్ణుడే నా తమ్ముడ్ని చంపి మణి తీసుకున్నాడని ' చాటింపు వేసాడు. శ్రీ కృష్ణుడు 'తను భయపడినట్టుగా నీలాపనిందలు రానేవచ్చాయి. దానినెలాగైనా రూపుమాపాలి ' అని సంకల్పం చేసి సపరివారంగా అడవిలోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు. అక్కడ ప్రసేనుడి శవం, సింహం అడుగుజాడలు, గుహవైపుకి భల్లూకం అడుగు జాడలు కనిపించాయి.


ఆ దారి వెంట పోయి గుహలోకి వెళ్ళి ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని తీసుకుని వస్తూంటే ఎవరో వింత మనిషి వచ్చాడని జాంబవతి కేకలు వేసింది. అది విన్న జాంబవంతుడు కోపంగా శ్రీహరి మీదకి యుద్ధానికి దిగాడు. వాళ్ళిద్దరి మధ్య యిరువయ్యెనిమిది రోజులు రాత్రింబగళ్ళు హోరాహోరి యుద్ధం జరిగింది. రాను రాను జాంబవంతుడు క్షీణించడం మొదలుపెట్టాడు. అప్పుడతడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామ చంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి 'దేవాదిదేవా! ఆర్తజనరక్ష!నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాలకులైన శ్రీరామ చంద్రునిగా గుర్తించాను.


ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరుకోమంటే నేను తెలివి తక్కువగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందు ముందు తీరుతుందన్నావు. అప్పటినుంచీ నీ నామస్మరణ చేస్తూ నీ కోసం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నాను. నాయింటికి వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడిని స్వామీ! నాలో శక్తి క్షీణిస్తోంది. జీవితేచ్చ నశిస్తోంది నా అపచారము మన్నించి నన్ను కాపాడు. నీవే తప్ప నితః పరంబెరుగను ' అని పరిపరి విధాల ప్రార్థించాడు.


శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి శరీరమంతా తన చేత్తో నిమిరి 'జంబవంతా! శమంతక మణిని అపహరించానన్న నింద వచ్చింది. దాన్ని రూపుమాపడానికి వచ్చాను. నువ్వు అ మణినిస్తే నేనువెళ్ళివస్తాను ' అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా మణిని, తన కూతురు జాంబవతినీ కూడా కానుకగా ఇచ్చాడు.


తనతో వచ్చిన తన బంధుమిత్ర సైన్యంతో, శమంతకమణితో, జాంబవతితో సత్రాజిత్తు దగ్గరకెళ్ళి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు. సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది లేని పోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరాడు. ఆ పాపపరిహారంగా తన కుమార్తె అయిన సత్యభామని భార్యగా స్వీకరించమని అ మణిని కూడా కానుకగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు సత్యభామని స్వీకరిం చి, మణిని మృదువుగా తిరస్కరించాడు.


ఒక శుభముహుర్తమున శ్రీకృష్ణుడు సత్యభామనీ, జాంబవతినీ పెళ్ళి చేసుకున్నాడు. దానికి వచ్చిన దేవాది దేవతలు, ఋషులు శ్రీకృష్ణునితో స్వామీ! మీరు సమర్థులు కనుక నీలాపనిందలు తొలగించుకున్నారు. మాబోటి అల్పుల మాటేమిటి? అన్నారు. శ్రీహరి వారియందు దయతలిచి 'బాధ్రపద శుద్ధ చవితిరోజు ప్రమాదవశమున చంద్ర దర్శనము అయినా, ఆ రోజు ప్రొద్దున గణపతిని యధావిధిగా పూజించి శమంతకమణి కథను విని పూజాక్షతలు తలమీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరు గాక 'అని ఆనతీయగా దేవతలు, మునులు సంతోషించారు.


'కాబట్టి మునులారా! అప్పటినుంచి ప్రతి సంవత్సరము బాధ్రపద శుద్ధ చరుర్థి రోజు దేవతలు, మహర్షులు, మనుష్యులు, అందరూ తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి తమ తమ కోరికలను నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు ' అని సూతముని శౌనకాది మునులతో చెప్పారు. ఇది వినాయక మహత్యం 


వినాయక నిమజ్జనం

బాధ్రపద శుద్ధ చవితి తరువాత వినాయకుడికి నవరాత్రి పూజలు చెసిన తరువాత, మట్టి వినాయకులను ఆడంబరముగా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో కాని సముద్రములో కాని నిమజ్జనం చేస్తారు.

వినాయక చవితి ముందు రోజు

 *🎻🌹🙏 వినాయక చవితి ముందు రోజు గౌరీపూజ ఎందుకు చేస్తారు....? ?*



శక్తికి మూలం దేవత మరియు మంగళకరం, మంగళప్రదానికి సంకేతంగా గౌరీదేవిని పూజిస్తారు. గౌరీ పండుగను భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో జరుపుకుంటారు. 


గౌరీ గణేష్, గౌరీ చౌతి లేదా గౌరీ పండుగ అని పిలువబడే ఈ పండుగను గణేశ చతుర్థి సందర్భంగా జరుపుకుంటారు. 


గౌరీ పండుగ మరుసటి రోజు, భాద్రపద శుద్ద చతుర్థి రోజు నుండి గణేశ చతుర్థి పండుగ పర్వదినాలు ప్రారంభమవుతాయి.


సౌభాగ్యాలను ప్రసాధించే గౌరీ పండుగను వివాహిత మహిళలలకు జరుపుకుంటారు, గౌరీ దేవిని ఆరాధించడం వల్ల సుఖ, సంతోషాలతో పాటు ఆనందం, సంపద మరియు సుదీర్ఘ జీవితాన్ని ఇస్తుందని  తన భర్తను ఆయుష్యును దీవించి ఆశీర్వదిస్తుందని అంటారు. 


గౌరీ పండుగ వరమహాలక్ష్మి వ్రత మాదిరిగానే ఉంటుంది. తేడా ఏమిటంటే లక్ష్మి స్థానంలో గౌరీదేవిని పూజిస్తారు.


గణేశ చతుర్థి

సిరిసంపదలు సమృద్ధిగా, జ్ఞానం, గొప్పతనం, దీర్ఘాయువు, ఆరోగ్యం వంటి మంగళప్రదాలను ప్రసాదించే వారు గణేశుడు. పంచాగం ప్రకారం, పండుగ భాద్రపద మాసంలో వస్తుంది.


అన్నివేలలా కరుణ కలిగి, ఎల్లప్పుడు ఆశీష్యులను ప్రసాధించే గణేష్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు గణేశ చతుర్థిని జరుపుకుంటారు. 


ఈ పండుగను ఇంటి సాంప్రదాయాల ప్రకారం, ఒక రోజు, మూడు రోజులు, ఏడు రోజులు, పది రోజులు జరుపుకుంటారు. కొంతమంది గౌరీ, గణేశుడి విగ్రహాన్ని గౌరీ ఇంటికి తీసుకువస్తారు, 


మరో ఇద్దరు గౌరీ విగ్రహాలను కూడా తెచ్చి గణేశుని సోదరీమణులుగా ఆరాధిస్తారు.


గౌరీ చతుర్థి ఆచారం : 


మహిళలు చతుర్తికి ముందు రోజు గౌరీ దేవిని పూజించడం ఆచారంగా వస్తోంది. అమ్మ విగ్రహాన్ని పసుపుతో అలంకరించి బియ్యం లేదా ధాన్యాల కలశం ఉంచడం జరగుతుంది.


పూలు, పండ్లు సమర్పించి పూజిస్తారు. మరుసటి రోజు గణేశుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు....స్వస్తి

వినాయక చవితి రోజు చేసే పత్రి (ఆకు

 🌿🌼🙏 *వినాయక చవితి  రోజు చేసే పత్రి (ఆకు) పూజ_విశిష్టత                      ఆ ఆకులు_ఏవి ?*🙏🌼


🌿🌼🙏 *వినాయక చవితి రోజున చేసే పత్రి పూజ ( 21 ఆకుల పూజ ) యొక్క విశిష్టత ఏమిటి ?* 🙏🌼🌿


🌿🌼🙏 *ప్రతి పూజకు ముందు ఈ శ్లోకాన్ని మననం చేసుకుంటుంటాం. ఇందులో వినాయకుని తత్వం నిక్షిప్తమై ఉంది. ’శుక్లాంబరధరమ్’ అంటే తెల్లని ఆకాశం అని అర్థం. తెలుపు సత్వ గుణానికి సంకేతం. ’శుక్లాంబరధరం విష్ణుం’ అంటే సత్వగుణంతో నిండిన ఆకాశాన్ని ధరించినవాడని అర్థం. ’శశివర్ణం’ అంటే చంద్రుని వలె కాలస్వరూపుడని అర్థం. ’చతుర్భుజం’ అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే నాలుగు చేతులతో ప్రసన్నమైన శబ్ద బ్రహ్మమై సృష్టిని పాలిస్తున్నవాడని అర్థం. సర్వవిఘ్నాలను పోగొట్టే విఘ్ననివారకునికి మనసారా నమస్కరిస్తున్నానని ఈ శ్లోకం యొక్క అర్థం. విఘ్నాలను తొలగించి సత్వరఫలాన్ని, శుభములనిచ్చే శుభదాయకుడు గణపతి. హిందువులు జరుపుకునే సర్వశుభకార్యాలలోను విఘ్నేశ్వరుకే అగ్రపూజ.*🙏🌼🌿


🌿🌼🙏 *దేహాన్ని ఆరోగ్యంగా నిలుపుకుంటేనే ధర్మసాధన సాధ్యమవుతుంది. ఈ దృష్టితోనే విజ్ఞులైన మన పూర్వులు మన ఆచారాలలో, సంప్రదాయాలలో ఆరోగ్య సూత్రాలను ఇమిడ్చి, నియమాలను నిర్థారించారు. మన పండుగలు, దైవారాధనలు ఆరోగ్యసూత్రాలతో ముడిపడి ఉన్నాయన్నది నిజం. ఇందుకు వినాయకచవితి పూజ, ప్రప్రథమ ఉదాహరణమంటే అతిశయోక్తి కాదు.*🙏🌼🌿


🌿🌼🙏 *వినాయకచవితి రోజున నూనెలేని కుడుములను, ఉండ్రాళ్ళను నివేదించడం మన సంప్రదాయం. వర్షఋతువు కారణంగాఆరోగ్యభంగము కలుగకుండా ఉండేందుకు, ఆవిరిపై ఉడికించినవాటిని తినాలని చెప్పేందుకు ఉండ్రాళ్ళ నివేదన. ఆవిరిపై ఉడికినవి సులభంగా జీర్ణమై, పిత్త దోషాలను హరిస్తాయి. నువ్వులు, బెల్లంతో చలిమిడి తయారుచేసి గణపతికి నైవేద్యంగా పెడతాము. నువ్వులు శ్వాసరోగాలను, అధికామ్లం, అజీర్తిని తొలగించి నేత్రరోగాలను రాకుండా చేస్తాయి. బెల్లం జీర్ణశక్తిని కలిగించి, వాత, పిత్త దోషాలను పోగొడుతుంది. మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే నవధాన్యాలను గమనించిన మన పెద్దలు, వినాయకునికి తొమ్మిది(నవ) రోజుల పండుగను ఏర్పాటు చేసి, రోజుకొక ధాన్యంతో ప్రసాదాన్ని పంచే ఏర్పాటు చేసారు.*🙏🌼🌿


🌿🌼🙏 *వినాయకపూజలో పిండివంటలకు, ఫలాలకు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ పత్రాలకు ఉన్న ప్రాధాన్యత తక్కువేం కాదు. మన శరీర ఆరోగ్యపరిరక్షణకు కావలసిన పత్రాలు 21 అని గమనించిన మన పెద్దలు, ’ఏకవింశతిపత్రపూజ’ అని పత్రాలతోనే వినాయకుని పూజించే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ పత్రాలన్నింటినీ కలిపి పత్రి అంటారు. శ్రీహరి ఎత్తినవి (10) దశావతారాలైతే, శంకరుని రూపాలు ఏకాదశ (11) కాబట్టి, శివకేశవ అబేధంతో, మొత్తం ఇరవై ఒక్క పత్రాల్తో పూజ జరపాలని చెప్పారు. ఈ పత్రపూజ స్వామికి ప్రీతికరం.*🙏🌼🌿


🌿🌼🙏 *ఈ 21 పత్రాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి*…🙏🌼🌿


1. మాచీపత్రం (Artemisia vulgaris)


ఇది అన్ని ప్రాంతాలలో లభిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది నులిపురుగులను, కుష్ఠును, బొల్లి, దప్పికను పోగొడుతుంది. త్రిదోషాలను ఉపశమింపజేస్తుంది. ఈ పత్రాలను కాసేపు కళ్ళపై పెట్టుకుని పడుకుంటే నేత్రదోషాలు తగ్గుతాయి. తలపై పెట్టుకుంటే తలనొప్పులు మటుమాయమవుతాయి. నరాలకు బలాన్నిస్తుంది. ఇది ఘాటైన వాసన కలది కనుక, నాసికా పుటాలు శుభ్రపడతాయి. దీని చూర్ణాన్ని నూనెలో కలిపి ఒంటికి రాస్తే మంచి సువాసన వస్తుంది.


2. బృహతీపత్రం: వాకుడాకు: నేలమూలిక (solanum surattense)


దీనిలో తెలుపు, నీలిరంగు పువ్వులు పూసే రెండు రకాలుంటాయి. ఇది కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది. జ్వరం, శ్వాసశూల, గుండె జబ్బులను అరికడుతుంది. మలబద్ధకం, మూలవ్యాధులు తగ్గుతాయి. దీని రసాన్ని చర్మరోగాలకు పైపూతగా ఉపయోగిస్తారు. ఇది అన్ని ప్రాంతాలలో దొరుకుతుంది.


3. బిల్వపత్రం: మారేడు పత్రం (Aegle marmelos)


ఇది హిందువులకు అతి పవిత్రమైనది . బిల్వపత్రాల రసాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తే, పొడ, దురద, గజ్జి వంటి రోగాలు నివారింపబడతాయి. దీని నుంచి వచ్చే గాలిని శ్వాసిస్తే, శ్వాసకోశవ్యాధులు దరిచేరవు. ఈ పత్రాలను నమిలి తింటే మధుమేహానికి మందులా పనిచేస్తుంది. దీనిని గాలిసోకని ప్రాంతాలలో పెడితే పురుగు పుట్రా రావు. స్వచ్చమయిన గాలి కోసం మన పూర్వులు మారేడును పెంచారు.


4. దూర్వాయుగ్మం: గరిక (cynodon dactylon)


గరికకు వైద్యగుణాలున్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. చిన్న పిల్లలకు ముక్కునుండి రక్తం కారడాన్ని అరికడుతుంది. మూత్రబంధానికి, రక్త పైత్యానికి ఉపయోగపడుతుంది. దీనిని కషాయం చేసి తాగితే, క్రిములను నశింపజేసి, చర్మ రోగాలను తగ్గిస్తుంది.


5. దత్తూరపత్రం : ఉమ్మెత్త (Datura stramonium)


దీనిలో తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త అని రెండూ రకాలున్నాయి. ఉమ్మెత్త పత్రాల రసం తేలుకాటు, ఎలుక కాటుల విషాన్ని హరిస్తుంది. దీని పత్రాలు,కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటిలో ఔషధ గుణాలున్నాయి. ఉమ్మెత్తరసాన్ని తలపై మర్ధన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు మళ్ళీ వచ్చే అవకాశముంది. కీళ్ళనొప్పులకు, నువ్వుల నూనెను రాసి, ఈ పత్రాలను ఐదారుసార్లు కడితే నొప్పులు తగ్గుతాయి.


6. బదరిపత్రం : రేగు ఆకు : (zizyphus jujuba)


దీని పత్రాలు కురుపులను త్వరగా నయం చేస్తాయి. రోజు మద్యాహ్నం తరువాత రేగుపళ్ళను తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ పత్రం గాత్రశుద్ధికి మంచిది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఇంకా ఎన్నో రోగాలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.


7. తులసీపత్రం : (ocimum sanctum)


ఇందులో శ్వేత, కృష్ణ అని రెండు రకాలున్నాయి. ఈ పత్రాల రసం జ్వరం, జలుబు, దగ్గుఅల్ను తగ్గిస్తాయి. క్రిమిరోగాల్తోపాటు నోటి దుర్వాసనను అరికడుతుంది. తులసీతీర్థం గొంతును శుభ్రపరుస్తుంది….. మధుమేహం, గుండెపోటు, రక్తపోటువంటి వ్యాధులను అరికడుతుంది. దీని గాలి సర్వరోగనివారిణి., మూత్రసంబంధమైన వ్యాధులను, వాంతులను అరికడుతుంది.


8. అపామార్గపత్రం : ఉత్తరేణి పత్రం (Achyranthus aspera)


ఉత్తరేణి పుల్లతో పండ్లు తోమడంవల్ల చిగుళ్ళవాపు, రక్తం కారడం తగ్గి, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

భోజనం చేసిన తర్వాత వెంటనే విరోచనమై, కడుపునొప్పితో బాధపడేవారు ఈ పత్రాలను కడుపులోకి తీసుకుంటే మంచిది. కుష్టు, చర్మవ్యాధులను తగ్గిస్తుంది. కందిరీగలు, తేనేటీగలు, కుట్టినచోట ఈ పత్రాల రసాన్ని తీసి, పూస్తే నొప్పి తగ్గుతుంది. దీనిని దుబ్బెనచెట్టు అని కూడా అంటారు.


9. చూతపత్రం : మామిడి పతం (mangifera indica)


లేత మామిడి పత్రాలను నూరి, పెరుగులో కలిపి తింటే అతిసారవ్యాధి తగ్గుతుంది. మామిడి పత్రాలు, లేత కాడలను నమిలితే నోటిపూటలు, చిగుళ్ళ బాధలు త్వరగా తగ్గుతాయి. మామిడికాయ రక్తదోషాన్ని హరిస్తుంది. శరీరానికి ఉష్ణాన్నిచ్చి పుష్టినిస్తుంది. ఒరిసిన పాదాల కురుపులకు, మామిడి జీడి రసంతో పసుపును కలిపి రాస్తే పుండు మానుతుంది. ఈ చెట్టు జిగురుతో ఉప్పు కలిపి వెచ్చబెట్టి, కాళ్ళ పగుళ్ళకి రాస్తే, అమోఘంగా పని చేస్తుంది. దీని పత్రాలను శుభకార్యాలలో తోరణాలుగా కడతాం.


10. కరవీరపత్రం : గన్నేరు పత్రాలు (nerium indicum)


దీని పత్రాలు కుష్టురోగాన్ని, దురదను తగ్గిస్తాయి. ఈ ఆకుపసరు తలలోని చుండ్రును నివారిస్తుంది. దీని వేరుబెరడుని తీసి ఎంతకు మానని పుండ్లకు పైన కట్టుగా కడతారు. తెల్లగన్నేరు, బిళ్ళగన్నేరు, ఎర్రగన్నేరు అంటూ మూడు రకాలున్నాయి.


11. విష్ణుక్రాంతం : హరిపత్రం (Evolulus alsinoides)


ఆయుర్వేదంలో ఈ పత్రాలను జ్ఞాపకశక్తికి, నరాల అలహీనతకు వాడుతుంటారు. వాతం, కఫాలను నివారిస్తుంది. దంతాలను గట్టిపరుస్తుంది. క్రిములను, వ్రణాలను మటుమాయం చెస్తుంది రకరకాల దగ్గులను తగ్గిస్తుంది. ఇది జ్వరనివారిణి.


12. దాడిమీపత్రం : దానిమ్మ పత్రం (punica granatum)


ఈ చెట్టులోని అన్ని భాగాలు ఉపయోకరమైనవే. పత్రాలు, పళ్ళు, అతిసార, అజీర్ణ వ్యాధులను అరికట్టడానికి వాడతారు. ఈ పండ్లను తింటే రక్తం శుద్ధి అవుతుంది. చర్మం కాంతివంతమవుతుంది. ఇది వాతాన్ని,కఫాన్ని, పిత్తాన్ని హరిస్తుంది. హృదయనికి బలం చేకూరుస్తుంది.


13. దేవదారుపత్రం : (sedris diodaran)


దీని బెరడు కషాయం శరీరవేడిని తగ్గిస్తుంది. వెక్కిళ్ళను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.


14. మరువకపత్రం : మరువము:( originam marajOranaa)


దీని పత్రాల నుండి తీసిన నూనెను కీళ్ళనొప్పులకు పైపూతగా వాడతారు. శ్వాసరోగాలు, హృద్రోగాలను తగ్గిస్తుంది. తేలు, జెర్రి మొదలైన విషపు పురుగులు కుట్టినపుడు మరువం ఆకులరసాన్ని తీసి కడితేనొప్పి తగ్గుతుంది. ఇది దేహానికి చల్లదనాన్ని చేకూరుస్తుంది. చెవిలోని చీమును, చెవిపోటును తగ్గిస్తుంది. దీనిని పసుపుతో కలిపి రాస్తే గజ్జి, చిడుము మొదలైన చర్మవ్యాధులు తగ్గిపోతాయి. ఇది విరివిగా దొరుకుతుంది.


15. సింధువారపత్రం : వావిలాకు ( vitex negundo) దీని ఆకులను నీళ్ళలో వేసి మరగకాచి బాలింతలకు స్నానం చేయిస్తే, వాతం రాకుండా ఉండటమే కాకుండా ఒళ్ళునొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీని ఆకులను నూరి తలకు కట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది. చిగుళ్ళవాపు తగ్గేందుకు కూడ దీనిని ఉపయోగిస్తారు. దీని ఆకుల కషాయం శూలి మొదలైన వ్యాధులను తగ్గిస్తుంది.


16. జాజిపత్రం (nax maskaTaa)


ఇది అజీర్ణ నివారిణి. జాజి ఆకులను తింటే శరీరానికి తేజస్సు వస్తుంది. కంఠస్వరం గంభీరంగా ఉంటుంది. నోటి దుర్వాసన పోతుంది. దీనికి తులసికి ఉన్న గుణం ఉంది. దీనిని చాలామంది పెంచుతుంటారు.


17. గండకీపత్రం : కామంచి (soalnum nigrum)


దీనిని అడవిమల్లె అని కూడ అంటారు. దీని ఆకులరసం మూర్చ రోగాన్ని తగ్గిస్తుంది ఈ ఆకులతో కఫం, వాతం, రక్తపైత్యం,విరేచనాలు అరికట్టబడతాయి. అధికమూత్రాన్ని తగ్గిస్తుంది.


18. శమీపత్రం : జమ్మి పత్రం (prosopis spicigera)


దీని గాలి క్రిమిసంహారిణి. వాయు సంబంధమైన రుగ్మతలను నాశనం చేస్తుంది. దీని ఆకులద్వారా మూలవ్యాధి, అతిసారం తగ్గుతాయి. ఈ ఆకులరసాన్ని తలకు రాసుకుంటే జుట్టు నల్లబడుతుంది. ఈ ఆకు రసాన్ని పిప్పి పన్నులో పెడితే నొప్పి తగ్గి దంతం రాలిపోతుంది.


19. అశ్వత్థపత్రం : రావి ఆకు (ficus religiosa)


ఈ చెట్టును త్రిమూర్తుల రూపంగా పూజిస్తుంటారు దీని వేర్లు బ్రహ్మ, కాండం విష్ణువు, కొమ్మలు, ఆకులను శివరూపంగా భావించి పూజిస్తారు. ఈ చెట్టు నీడను ఇవ్వడంతో పాటు మంచి కాలుష్యనివారిణిగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టునుంచి వచ్చేగాలి ఆరోగ్యానికి మంచిది.ఈ ఆకుల, చెక్కరసం విరేచనాలు, నోటి వ్యాధులను తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ చెట్టునీడ క్రింద కూర్చుంటే, చదివింది చక్కగా ఒంటపడుతుందని మన పెద్దలు చెబుతుంటారు.


20. అర్జునపత్రం : మద్ది ఆకు (terminalia arjuna)


ఇది వాత రోగాలను పోగొడుతుంది. కఫాన్ని తగ్గిస్తుంది. ఆకుల రసం కురుపులను తగ్గిస్తుంది. దీని గింజలు తైలాన్ని బెణుకులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. దీని తెల్ల మద్ది అని కూడ అంటారు.


21. అర్కపత్రం : జిల్లేడు పత్రం (calotropis gigantia)


ఆయుర్వేదంలో దీనిని 64 రోగాల నివారిణిగా పేర్కొన్నారు. ఇది శరీరానికి వేడిని తగ్గిస్తుంది. అందుకే దీనిని అర్కపత్రమని అన్నారు.దీని ఆకులను నూనెలో కాచి, కీళ్ళకు రాస్తే కీళ్ళనొప్పులు తగ్గుతాయి. ఇది పాము విషాన్ని కూడా హరిస్తుందని అంటారు. వాత, పక్షవాతం, కుష్ఠు, కఫం తదితర వ్యాధులకు మందుగా వాడుతుంటారు. దీని ద్వారా జలుబు తగ్గుతుంది. జిల్లేడు పాలను పసుపుతో కలిపి ముఖానికి రాస్తే ముఖం కాంతివంతమవుతుంది.


🌿🌼🙏ఇలా వినాయక పూజలో ఉపయోగించే పత్రాల ద్వారా మన అనారోగ్య సమస్యలెన్నో తగ్గుతాయి. పత్ర పూజా విధానంలో ఎన్నో వైజ్ఞానిక విశేషాలున్నాయి. ఉదాహరణకు వినాయకునికి వెలగపండును నైవేద్యంగా పెడతాము. వెలగపండు గుజ్జును తేనెలో కలిపి తీసుకుంటే పైత్యం, వాంతులు తగ్గుతాయి.🙏🌼🌿







🌿🌼🙏అందరం భక్తి శ్రద్ధలతో " ఓం గం గణపతయే నమః "  స్వామివారిని స్మరిద్దాం ... మనం ఎంతగా తలచుకుంటే అంతగా అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు🙏🌼

108 రూపాలలో మహా గణపతులు

 108 రూపాలలో మహా గణపతులు 


1. ఏకాక్షర గణపతి

ప్రాతర్భజామ్య్భయదం ఖలు భక్త శోక

దావానలం గణ్విభుం వరకుంజరాస్యమ్

అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం

ఉత్సాహ వర్ధనమహం సుతమీశ్వరస్య


2. మహా గణపతి

భిభ్రాణోబ్జక బీజాపూరక కదా దంతేక్షు బాణైస్సమం

భిభ్రాణో మణికుంభశాలి కణిశం పాశంచ వక్ర్తాంచితం

గౌరంగ్యారుచి రారవిందయుతయా దేవ్యాసనాధాంతిక:

శోణాంగ శ్శుభమాతనోతుభవతాం నిత్యం గణేశో మహాన్


3. బాల గణపతి

కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం

బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం


4. తరుణ గణపతి

పాశాంకుశాపూస కపిత్ధ జంబూ

ఫలం తిలాం చేక్షు మపిసవ హసై:

ధత్తే సదాయ స్తరుణారుణాంభ:

పాయాత్సయుష్మాన్ తరుణో గణేశ:


5. విఘ్నరాజ గణపతి

విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్చతే 

మమతాసుర సంహర్తా విష్ణు బ్రహ్మేతివాచక:


6. సిద్ది గణపతి

ఏకదంతం చతుర్హస్తం పాశాంకుశ ధారిణమ్

అభయంచవరదం హసైర్ద దానమూషకధ్వజమ్


7. బుద్ధి గణపతి

త్రయీమయాఖిలం బుద్ధిధాత్రే

బుద్ధి ప్రదీపాయ సురాధిపాయ |

నిత్యాయ సత్యాయచ నిత్యబుద్ధే

నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యమ్ ||


8. లక్ష్మీ గణపతి

బిభ్రాణశ్శుక బీజపూర కమలం మాణిక్య కుంభాంకుశాన్

పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోత్సస్సరో నిస్సర:

శ్యామో రక్త సరోరుహేణ సహితో దేవీ చ యస్యాంతికే

గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీగణేశో మహాన్


9. సంతాన లక్ష్మీ గణపతి

శరణం భవదేవేశ సంతతిం సుదృఢాంకురు |

భవిష్యంతియే పుత్రామత్కులే గణనాయక: ||


10. దుర్గా గణపతి

తప్తకాంచన సంకాశం శ్చాష్ట్ట్ట మహత్తను: |

దీప్తాంకుశం శరం చాక్షం దంతం దక్షే వహన్కరై: ||


11. సర్వశక్తి గణపతి

ఆలింగ్య దేవీం హరితాం నిషణ్ణాం

పరస్పరాశ్లిష్టకటీ నివేశం

సంధ్యారుణం పాశసృణీం వహస్తం 

భయాపహం శక్తి గణేశ మీఢే


12. విరివిరి గణపతి

సుసిద్ధాదం భక్తిజనస్యదేవ సకామిదా మామిహ సౌఖ్యదంతం |

అకా మికాగాం భవబంధహరం గజాననం భక్తియుతం భజామ ||


13. క్షిప్ర గణపతి

దంతం కల్పలతా పాశ రత్నకుంభోప శోభితం

బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం


14. హేరంబ గణపతి

అభయ వరద హస్త: పాశదంతాక్షమాల:

పరశుమధ త్రిశీర్షం ముద్గరం మోదకం చ

విదధతు నరసింహ: పంచమాతంగ వక్త్ర:

కనక రుచిర వర్ణ: పాతు హేరమ్బ నామా


15. నిధి గణపతి

విచిత్ర రత్నై: ఖచితం సువర్ణ సమ్బూతకంగుహ్యమయా ప్రదత్తమం |

తధాంగులీష్పంగులికం గణేశ చిత్తేన సంశోభయ తత్పరేశ


16. వక్రతుండ గణపతి

స్వర్ణవర్ణ చతుర్బాహుం | పాశాంకుశధరం విభుం |

ఆమ్రపాత్ర స్వదంతంచ | శక్తియుతం విచింతయేత్


17. నవనీత గణపతి

దానాయ నానావిధ రూపకాంస్తే గృహాణ దత్తాన్మనసామయావై|

పదార్ధ భూతాన్ స్థిర జంగమాంశ్చ హేరమ్నమాం తారయ మోహభావాత్ ||


18. ఉచ్ఛిష్గ్ట గణపతి

లీలాబ్జం దాడిమం వీణాశాలి గుంజాక్ష సూత్రకం

దధ దుచ్ఛిష్ట నామాయం గణేశ: పాతు మేచక:


19. హరిద్రా గణపతి

హరిద్రాభం చతుర్బాహుం హరిద్రా వదనం ప్రభుమ్

పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ

భక్తాభయ ప్రదాతాం వందే విఘ్న వినాశనమ్


20. మోదక గణపతి

నాదబిందు కళాత్మకం వరనారదాది సుపూజితం |

మోదక ఫలదాయకం ప్రమోదవదన వినాయకం ||


21.మేధా గణపతి

సకలభాగ్య వశంకరం వర సాధు సజ్జన సంహితం 

అఖిలదేవ ప్రదాయకం మమ ఆత్మరక్ష వినాయకం


22.మోహన గణపతి

రక్ష రక్ష గణాధ్యక్ష రక్షత్రైలోక్య రక్షక 

భక్తానాం అభయంకర్తా త్రాతాభవ భవార్ణవాన్


23.త్రైలోక్య మోహన గణపతి

గదా బీజాపూరే ధను: శూలచక్రే సరోజతృలే

పాశాధాన్య ప్రదంతారి కరై: సందధానం

స్వశుండాగ్ర రాజం | మణి కుంభ

మంగాధి రూఢం స పత్న్యా ||


24. వీర గణపతి

భేతాళ శక్తి శరకార్ముక ఖేటఖడ్గ

ఖట్వాంగ ముద్గర గధాంకుశ ముద్వహస్తం

వీరం గణేశ మరుణం సతతం స్మరామి


25. ద్విజ గణపతి

యం పుస్తకాక్ష గుణ దండకమండలు

శ్రీవిద్యోతమాన కరభూషణమిందు వర్ణం

స్తంబేర మానన చతుష్టయ శోభమానం

త్వాం య: స్మరే ద్ద్విజ గణాధిపతే సధన్య: ||


26. ఋణవిమోచన గణపతి

సృష్ట్యా బ్రహ్మణా సమ్యక్ పూజిత: ఫలసిద్ధయే

సదైవ పార్వతీపుత్ర: ఋణనాశం కరోతుమే


27. సంకష్టహర గణపతి

ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం

భక్తావాసం స్మరేన్నిత్యంమాయుష్కారమార్ధ సిద్ధయే


28. గురు గణపతి 

ప్రవరం సర్వదేవానాం సిద్ధినాం యోగినాం గురుం |

సర్వస్వరూపం సర్వేశం జ్ఞానరాశి స్వరూపిణమ్ ||

అవ్యక్తమక్షరం నిత్యంసత్యమాత్మ స్వరూపిణం |

వాయుతుల్యంచ నిర్లిప్తం చాక్షతం సర్వసాక్షిణం ||


29. స్వర్ణ గణపతి 

వందే వందారుమందార, మిందు భూషణ నందనం |

అమందానంద సందోహ, బంధురం సింధురాననమ్ ||


30. అర్క గణపతి 

మూషారూఢం లంబసూత్రం సర్పయజ్ఞోపవీతినల|

విషాణం పాష కమలం మోదకంచ కరైధృతం ||


31. కుక్షి గణపతి 

సరోజన్మన భూషాణాం భరణోజ్వలహస్త తన్వ్యా సమా

లింగితాంగాం | కరీంద్రాననాం చంద్ర చూడం త్రినేత్రం రక్తకాంతిం భజేత్తం ||


32. పుష్టి గణపతి 

ఏకదంతం మహాకాయం లంబోదరం గజాననం |

విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహం ||


33. వామన గణపతి 

లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం |

అర్ధచంద్రధరం దేవం విఘ్నప్యూహం వినాశనం ||


34. యోగ గణపతి 

యోగరూఢో యోగ పట్టాభిరామో

బాలార్కభశ్చేంద్ర నీలాంశుకాఢ్య:

పాశాక్ష్వక్షాన్ యోగదండం దధానో

పాయాన్నిత్యం యోగ విఘ్నేశ్వరో న:


35. నృత్య గణపతి 

పాశాంకుశాపూప కుఠార దన్త చంచత్కరం వచరుతరాంగుళీయం

పీతప్రభం కల్పతరో రధస్ధం భజామి నృత్తైక పదం గణేశం


36. దూర్వా గణపతి 

దూర్వాంకురాన్వై మనసా ప్రదత్తాం స్త్రిపంచపత్రైర్యుతకాంశ్చ స్నిగ్ధాన్ |

గృహాణ విఘ్నేశ్వర సంఖ్యయా త్వం హీనాంశ్చ సర్వోపరి వక్రతుండ ||


37. అభీష్టవరద గణపతి

నమస్తే వేద విదుషే నమస్తే వేద కారిణే |

కమన్యం శరణం యామ: కోను న: స్వాద్భయాపహ: ||


38. లంబోదర గణపతి 

లంబోదరావతారో వైక్రోధాసుర నిబర్హణ:

శక్తిబ్రహ్మ ఖగ: సద్యత్ తస్యధారక ఉచ్యతౌ ||


39.విద్యా గణపతి 

భక్త ప్రియాయ దేవాయ నమో జ్ణాన స్వరూపిణే |

నమో విశ్వస్యకర్త్రేతే నమస్తత్పాలకాయచ ||


40. సరస్వతీ గణపతి 

వాగీశాద్యా స్సుమనస: సర్వార్ధానాముపక్రమే

యంనత్వాకృత కృత్వాస్స్యు: తం నమామి గజాననమ్ ||


41. సంపత్ గణపతి 

పక్వచూత ఫలపుష్ప మంజరీచేక్షుదండ తిలమోదకైస్సహ

ఉద్వహన్ పరశుమస్తుతే నమ: శ్రీ సమృద్ధియత హేమపింగళ:


42. సూర్య గణపతి 

హిరణ్యగర్భం జగదీశితారరమృషిం పురాణం మండలస్థం |

గజాననం యం ప్రవిశన్తిసంతస్తత్కాలయోగైస్త మహం ప్రపద్యే ||


43. విజయ గణపతి 

శంఖేక్షు చాప కుసుమేఘ కుఠారదంత

పాశాంకుశై: కళమమంజరికా సనైధై:

పాణిస్థితై: పరిసమావృత భూషణ శ్రీ:


44. పంచముఖ గణపతి 

గణేశాయ ధామ్నే పరేశాయ తుభ్యం సదానంద రూపాయ సర్వార్తిగాయ|

అపారస్వరూపాయ దేవాధిదేవ నమస్తే ప్రభో భక్త సంరక్షకాయ ||


45. నీలకంఠ గణపతి 

వినాయకం నాయకమౌక్తికం త్రయీ హారావళే రావళితం భుజంగమై: |

పినాకిజం నాకిజనేడ్య మంహసాం నివారణం వారణ్వక్త్ర మాశ్రయే ||


46. గాయత్రి గణపతి 

యజ్ఞోపవీతం త్రిగుణస్వరూపం సౌవర్ణమేవం హ్యహినాధ భూతం |

భావేనదత్తం గణనాథతత్వం గృహాణ భక్తోద్దృతి కారణాయ ||


47. చింతామణి గణపతి 

కల్పద్రుమాధ: స్థితకామధేయం |

చింతామణిం దక్షిణపాణి శుండమ్ |

బిభ్రాణ మత్యద్భుత చిత్రరూపం |

య: పూజయేత్తస్య సమస్త సిద్ధి: ||


48. ఏకదంత గణపతి 

అగజానన పద్మార్కమ్ గజానన మహర్నిశం

అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే


49. వికట గణపతి 

వికటోనామ విఖ్యాత: కామాసుర విదాహక: |

మయూర వాహనశ్చాయం సౌరబ్రహ్మధర: స్మ్రత: ||


50. వరద గణపతి 

వరదాభయ హస్తాయ నమ: పరశుధారిణే |

నమస్తే సృణిహస్తాయ నాభివిశేషాయతే నమ: ||


51. వశ్య గణపతి 

విఘ్నేశ వీర్యాణి విచిత్రకాణి వన్దే జనైర్మాగధకై: స్మృతాని |

శ్రుత్వాసమత్తిష్ఠ గజానన త్వం బ్రహ్మేజగన్మంగళకం కురుష్వ ||


52. కుల గణపతి 

శుండావిభూషార్థమనన్తఖేలిన్ సువర్ణజం కంచుకమాగృహేంణ |

రత్నైశ్చయుక్తం మనసామయాయ ద్ధతం ప్రభోతత్సఫలం కురుష్వ ||


53. కుబేర గణపతి 

రత్నై: సువర్ణేన కృతాని గృహాణచత్వారి మయాప్రకల్ప్య |

సమ్భూషయ త్వం కటకాని నాథ చతుర్భుజేషు వ్యాజ విఘ్నహారిన్ |


54. రత్నగర్భ గణపతి 

హేరంబతే రత్నసువర్ణయుక్తే సునూపుర మంజీరకే తథైవ|

సు కింకిణీ నాద యుతే సుబుద్ధ్యా సుపాదయో: శోభమయే ప్రదత్తే ||


55. కుమార గణపతి 

మాత్రే పిత్రేచ సర్వేషాం హేరంబాయ నమో నమ:

అనాదయేచ విఘ్నేశ విఘ్నకర్తే నమోనమ:


56. సర్వసిద్ధి గణపతి 

పరంధామ పరంబ్రహ్మ పరేశం పరమేశ్వరం |

విఘ్నవిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం |

సురాసురేంద్ర్యై: సిద్ధేంద్ర్యై: స్తుతం స్తౌమి పరాత్పరం |

సురపద్మచినేశంచ గణేశం మంగళాయనం ||


57. భక్త గణపతి 

నారికేళామ్ర కదళీ గుడ పాయస ధారిణం

శరచ్ఛశాంక సదృశం భజే భక్తగణాధిపమ్


58. విఘ్న గణపతి 

పాశాంకుశం ధరన్నామ ఫలాశీ చాఖవాహన:

విఘ్నం నిహస్తు న: సర్వ రక్తవర్ణో వినాయక:


59. ఊర్ధ్వ గణపతి 

కల్హారిశాలి కణిశేక్షుక చాపబాణ,

దంత ప్రరోహ కబర: కనకోజ్జ్వలాంగ:,

ఆలింగనోద్యత కర: తటిదాభకట్యా

దేయాత్స శతృభయ మూర్థ్వ గణేశ్వరస్తే


60. వర గణపతి 

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన

ఈప్సితం మేం వరం దేహి పరత్రా చ పరాంగతిమ్


61. త్ర్యక్ష్యర గణపతి 

సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితం

సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్


62. క్షిప్రప్రసాద గణపతి 

యక్షకిన్నర గంధర్వ సిద్ధవిద్యా ధరైస్సదా

స్తూయమానం మహాబాహుం వందే హం గణనాయకమ్


63. సృష్టి గణపతి 

ప్రాతర్నమామి చతురానన వన్ద్యమానం

ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానమ్

తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం

పుత్రం విలాస చతురం శివయో: శివాయ


64. ఉద్దండ గణపతి 

ప్రాత:స్మరామి గణనాథమనాథ బంధుం

సిందూరపూర పరిశోభితగండయుగ్మం

ఉద్ధండవిఘ్న పరిఖండన చండదండం

అఖండలాది సురనాయక బృందవంద్యమ్


65. డుండి గణపతి 

అక్షమాలాం కుఠారంచ రత్నపాత్ర స్వదంతకమ్

ధతైకరైర్విఘ్నరాజో డుంఢినామా మదేస్తున:


66.ద్విముఖ గణపతి 

స్వదంత పాశాంకుశ రత్నపాత్రం కరైర్దదానో హరినీలగాత్ర:

రత్నాంశుకో రత్న కిరీటమాలీ భూత్యై సదామే ద్విముఖో గణేశ:


67. త్రిముఖ గణపతి 

శ్రీమత్తీక్షణ శిఖాం కుశాక్ష వరదాన్ దక్షే దదానం కరై:

పాశాంచామృత పూర్ణకుంభమయం వామే దదానోముదా

పీఠే స్వర్ణమయారవింద విలసత్సత్కర్ణికాభాసురే

స్వాసీనస్త్రిముఖ: పరశురుచిరో నాగనన: పాతున:


68. సింహ గణపతి 

వీణాం కల్పలతా మరించ వరదం దక్షేవిధత్తేకరై:

వేణే తామరసం చ రత్న కలశం సన్మంజరీం చా భయం

శుండాదండలసన్ మృగేంద్ర వందన: శంఖేందు గౌర: శుభో

దీప్యద్రత్న నిభాంకుశో గణపతి: పాయా దపాయాత్సన:


69. గజానన గణపతి 

సదా సుఖానందమయం జలేచ సముద్రేన ఇక్షురసే నివాసం|

ద్వంద్వ స్థయానేనచ నాళరూపం గజాననం భక్తియుతం భజామ||


70. మహోదర గణపతి 

మహోదర ఇతిఖ్యాతో జ్ఞానబ్రహ్మ ప్రకాశక:

మోహాసుర నిహంతావై ఆఖువాహన ఏవచ ||


71. భువన గణపతి 

విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయతే |

నమో నమస్తే సత్యాయ సత్య పూర్ణాయ శుండినే ||


72. ధూమ్రవర్ణ గణపతి 

ధూమ్రవర్ణావతారశ్చాభి మానాసుర నాశక:

ఆఖువాహన ఏవాసౌ శివాత్మేతి స ఉచ్యతౌ


73. శ్వేతార్క గణపతి 

ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే

శ్వేతార్కమూలనివాసాయ

వాసుదేవ ప్రియాయ, దక్ష ప్రజాపతి రక్షకాయ

సూర్యవరదాయ కుమారగురవే


74. ఆధార గణపతి 

నాదం బాలసహస్ర భాను సదృశం నాగేంద్ర

వక్త్రాన్వితం | హస్తాభ్యాం చషకం పవిత్ర కలశం

హస్యంచ వృత్తాండవం | నానా చిత్రవిచిత్రయన్

పరగురుం ఆధార విద్యా స్థితిం | ఓంకార

ప్రణవాకృతిం గణపతిం నిత్యం భజేహం ప్రభో ||


75. భూతరోగ నివారణ గణపతి 

ఏకదంతం చతుర్హస్తం బిభ్రాణ పాశమంకుశం |

అభయం వరదం సాస్మృర్భధానం మూషిక ధ్వజం |


76. ప్రసన్న విఘ్నహర గణపతి 

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం |

పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ||


77. ద్వాదశభుజవీర గణపతి 

సురేంద్రనేన్యం హ్యసురై: సుసేవ్యం సమానభావన విరాజయంతం|

అనంతబాహుం మూషక ధ్వజం తం గజాననం భక్తియుతం భజామ: ||


78. వశీకర గణపతి 

బీజాపూరగదేక్షుకార్ములసచ్చక్రోబ్జ పాశోత్పల|

వ్రీహ్యగ్రస్వ విషాణ రత్న కలశప్రోద్యత్కరాంభోరుహ: ||

ధ్యేయోవల్లభయా సపద్మకరయాశ్లిష్టోజ్వల- ద్భూషయ

విశ్వోత్పత్తి విపత్తి సంస్తుతికరో విఘ్నో విశిష్టార్ధద: ||


79. అఘౌర గణపతి 

గజవదనమంచింత్యం తీక్ష్ణదంష్టృం త్రినేత్రం

బృహదుదరమశేషం భూతరాజం పురాణం

అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం |

పశుపతి సుతమీశం విఘ్నరాజం నమామి ||


80. విషహర గణపతి 

నాగాననే నాగకృతోత్తరీయే క్రీడారతే, దేవకుమార సంఘై: |

త్వయిక్షణం కాలగతిం విహాయతౌ ప్రాపతు కన్దుకతామినేన్దూ ||


81. భర్గ గణపతి 

బాలార్కకోటి ద్యుతి మప్రమేయం

బాలేందు రేఖా కలితోత్తమాజ్ఞమ్ |

భ్రమద్ద్విరేపావృత గణ్డభాగం భజే భవానీతనయం గణేశమ్ ||


82. సర్వ సమ్మోహన గణపతి 

స్వాంకస్థితాయానిజవల్లభయాముఖామ్భుజాలోకేన లోలనేత్రం |

స్మేరాననాస్యం మదవైభవేన రుద్ధం భజే విశ్వవిమోహనంతం ||


83. ఐశ్వర్య గణపతి 

సహస్ర శీర్షం మనసా మయా త్వం దత్తం కిరీటంతు సువర్ణజంవై |

అనేకరత్నై: ఖచితం గృహాణ బ్రహ్మేశతే మస్తక శోభనాయ ||


84. మాయావల్లభ గణపతి 

సంసారార్ణవ పారేచ మాయాపోతే సుదుర్లభే |

కర్ణధార స్వరూపంచ భక్తానుగ్రహకారకం |

వరం వరేణ్యం వరదం వరదానామపి ఈశ్వరం |

సిద్ధం సిద్ధి స్వరూపంచ సిద్ధిదం సిద్ధి సాధనమ్ ||


85. సౌభాగ్య గణపతి 

తతో హరిద్రామచిరంగులాలం సిన్ధూరకం తేపరికల్పయామి |

సువాసితం వస్తు సువాస భూతై: గృహాణ బ్రహ్మేశ్వర శోభనార్థమ్ ||


86. గౌరి గణపతి 

విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ |

లంబోదరాయ సకలాయ జగద్ధితాయ |

నాగాసనాయ కృతియజ్ఞ విభూషితాయ |

గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే ||


87. ప్రళయంకర్త గణపతి 

అకాలమేవ ప్రళయ: కథం లబ్ధో జనైరయం |

హా ! గజానన దేవేశ: హాహా విఘ్న హరావ్యయ ||


88. స్కంద గణపతి 

కుమార భుక్తౌ పునరాత్మహేతో: పయోధరే పర్వతరాజ పుత్ర్యా|

ప్రక్షాళయంతం కరశీ కరేణ మౌగ్ధ్యేనతం నాగముఖం భజామి ||


89. మృత్యుంజయ గణపతి 

సరాగలోకదుర్లభం విరాగిలోక పూజితం

సురాసురైర్నమస్కృతం జరాప మృత్యునాశకం ||


90. అశ్వ గణపతి 

రాజోపచారాన్వి విధాన్గృహాణ హస్త్యశ్వఛత్రాధికమాద రాద్వై |

చిత్తేన దత్తాన్గణనాధడుణ్డే హ్యపార సంఖ్యాన్ స్థిరజంగమాంస్తే ||


91. ఓంకార గణపతి 

వందే గణేశం భుజగేంద్ర భూషణం సమస్త భక్తాళికృతాతితోషణం

విశ్వం భరా సంస్థితలోక రక్షణం మదీయ పాపౌఘతమస్సు పూషణమ్ ||


92. బ్రహ్మవిద్యా గణపతి 

బ్రహ్మేభ్యో బ్రహ్మదాత్రేచ గజానన నమోస్తుతే |

ఆదిపూజ్యాయ జ్యేష్ఠాయ జ్యేష్ఠరాజాయతే నమ: ||


93. శివ అవతార గణపతి 

విఘ్నానాం పతయే తుభ్యం నమో విఘ్న నివారణ |

సర్వాంతర్యామిణే తుభ్యాం నమస్సర్వప్రియంకర ||


94. ఆపద గణపతి 

ఓమ్ నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే |

దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే ||


95. జ్ఞాన గణపతి 

గుణాతీతమౌనం చిదానంద రూపం |

చిదాభాసకం సర్వగం జ్ఞాన గమ్యం |

ముని శ్రేష్ఠమాకాశ రూపం పరేశం |

పరబ్రహ్మ రూపం గణేశం భజేమ ||


96. సౌమ్య గణపతి 

నమస్తే గణనాధాయ గణానాం పతయే నమ: |

భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యో సుఖదాయక ||


97. మహాసిద్ధి గణపతి 

గజవక్త్రం సురశ్రేష్ఠ కర్ణచామర భూషితం |

పాశాంకుశ ధరం దేవం వందే హం గణనాయకం ||


98. గణపతి 

సిందూరాస్త్రినేత్ర: పృథుతర జదరో హస్త పద్మం

దదానం | దంతం పాశాంకుశేష్ట్వానురుతర

విలసద్విజ పూరాభిరామం | బాలేందు ఖ్యాతిమౌళి

కరిపతి వదాన దాన పూర్ణార్థ గంధో | భోగేంద్రై

భూషితాంగోర్జేత్ గణపతిం రక్తస్త్రాంగరాగ: ||


99. కార్యసిద్ధి గణపతి 

యతోబుద్ధి రజ్ఞాననాశో ముముక్షో: |

యత స్సంపదోభక్త సంతోషదాస్సు: |

యతో విఘ్ననాశయత: కార్యసిద్ధి: |

సదాతం గణేశం నమామో భజామ: ||


100. భద్ర గణపతి 

అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయతే నమ:

సుగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయచ ||


101. సులభ గణపతి 

వందే గజేంద్రవదనం – వామాంకారూఢ వల్లభాశ్లిష్టం

కుంకుమపరాగశోణం – క్వులయినీ జారకోరకా పీడమ్ ||


102. నింబ గణపతి 

విఘ్నహర్తే స్వభక్తానాం లంబోదర నమోస్తుతే |

త్వాదేయ భక్తియోగేన యోగీశాం శాంతిమాగతా: ||


103. శుక్ల గణపతి 

అంతరాయ తిమిరోపశాంతయే

శాంతపావనమచింత్య వైభవం |

తంనరం వపుషికుంజరం ముఖే

మన్మహే కిమపి తుందిలంమహ: ||


104. విష్ణు గణపతి

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే


105. ముక్తి గణపతి

పాశాంకుశౌ భగ్నరథం త్వభీష్టం కరైర్దధానం కరరన్ద్రముక్తై: |

ముక్తాఫలాభై: పృథుశీకరౌఘై: సిఙ్చన్తమఙ్గం శివయోర్భజామి ||


106. సుముఖ గణపతి

ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమోనమ: |

ప్రసన్న జనపాలాయ ప్రణతార్తివినాశినే ||


107. సర్వ గణపతి

చతు: పదార్థా వివిధ ప్రకాశాస్త్త వివ హస్తా: సచతుర్భుజం |

అనాథనాథాంచ మహోదరంచ గజాననం భక్తియుతం భజామ:


108. సిద్ధిబుద్ధి గణపతి

సత్పద్మరాగ మణివర్ణ శరీరకాంతి:

శ్రీ సిద్ధిబుద్ధి పరిచర్చిత కుంకుమశ్రీ:

వక్షస్థలే వలయితాతి మనోజ్ఞ శుణ్డో

విఘ్నం మామపహర సిద్ధి వినాయకత్వమ్ ||

శనివారం, సెప్టెంబరు 7, 2024

 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*శనివారం, సెప్టెంబరు 7, 2024

    *శ్రీ క్రోధి నామ సంవత్సరం*      

 *దక్షిణాయణం - వర్ష ఋతువు*

  *భాద్రపద మాసం -  శుక్ల పక్షం*   

🔔తిథి      : *చవితి* మ1.51 వరకు

🔯వారం   : *శనివారం* (స్థిరవాసరే)

⭐నక్షత్రం  : *చిత్ర* ఉ10.27 వరకు

✳️యోగం : *బ్రహ్మం* రా10.11 వరకు

🖐️కరణం  : *భద్ర* మ1.51 వరకు

       తదుపరి *బవ* రా2.43 వరకు

😈వర్జ్యం   : *సా4.35 - 6.20*

💀దుర్ముహూర్తము : *ఉ5.49 - 7.27*

🥛అమృతకాలం.   : *తె3.07 - 4.52*  

👽రాహుకాలం       : *ఉ9.00 - 10.30*

👺యమగండ/కేతుకాలం : *మ1.30 - 3.00*

🌞సూర్యరాశి: *సింహం* || 🌝చంద్రరాశి: *తుల*

🌄సూర్యోదయం: *5.49* || 🌅సూర్యాస్తమయం:   *6.09  ? *వినాయక చవితి*      వినాయక చవితి శుభాకాంక్షలు*

సర్వేజనా సుఖినో భవంతు - ఇరగవరపు రాధాకృష్ణ

Panchaag


 

జలము కనుగొనుట -

 నిర్జల ప్రదేశం నందు చెట్ల ద్వారా జలము కనుగొనుట - 


 * తాటి చెట్టుకి కాని టెంకాయ చెట్టుకి గాని పుట్ట ఆవరించి ఉండిన దానికి పశ్చిమమున 6 మూరల దూరమున నాలుగు మాటల లోతున దక్షిణమున నుంచి వచ్చెడి జలధార ఉండును. 

 

 * టెంకాయ చెట్టుకి దక్షిణమున పుట్ట ఉండిన దానికి ఏడు మూరల దూరమున 5 మట్టుల లోతున సంరుద్ధజాలం కలిగి ఉండును. ఒక నిలువు లోతున నానా వర్ణములు కలిగిన శల్యములు , నల్లని రంగు కలిగిన మ్రుత్తికయు , ఆయుధములతో చేధించ దగిన పాషాణం ( రాయి ) , తెల్లని మన్ను, దాని క్రింద పడమట నుంచి ప్రవహిన్చేడు జలధార యు ఉండును. మరియు పుట్టలు ఉండిన యెడల వాటి సమీపమున జలము ఉండును. 

  

 * మారేడు చెట్టు, కానుగ చెట్టు, జీడి చెట్టు, మద్ది చెట్టు, చిత్తముధపు చెట్టు, వీటి యందు యే చేట్టుకైనా పుట్ట చుట్టుకొని యుండిన దానికి ఉత్తరమున మూడు మూరల దూరము నందు నాలుగున్నర నిలువు లోతున సమృద్ధిగల జలం ఉండును. నీరు లేని నిర్జల ప్రదేశం నందు గంబీరమైన శబ్దం పుట్టిన యెడల అచ్చట 35 పురుష ప్రమాణమున ఉత్తరమునకు ప్రవహించే జలనాది ఉండును. 


  * పెద్ద మాను చెట్టు కొమ్మలు అన్ని సరీగా ఉండి వాటిలో ఒక కొమ్మ నేలకు వంగి గాని , తెలుపు వర్ణం కలిగి కాని యున్దినట్లితే అచ్చట మూడు మట్ల లోతున జలం ఉండును. 


  * యే వృక్షం అయినా వాటి వాటి స్వభావం మారి చిగుళ్ళు, పువ్వులు, కాయలు మొదలగు వాటి వరనములు బెధముగా ఉండిన యెడల దానికి తూర్పున మూడు మూరల దూరమున నాలుగు మట్టుల లోతున జలం ఉండును. దాని యందు తెల్లని మన్ను రాళ్ళు ఉండును. 

 

 * రెండు తలల ఖర్జూరం చెట్లు ఉండిన యెడల దానికి పడమర మూడు మూరల దూరం నందు మూడు మట్టుల లోతులో స్వచ్చ జలం ఉండును. 

 

 * తెల్ల మోదుగ చెట్టు ఉండిన దానికి దక్శినమున మూడు మూరల దూరము నందు మూడు మట్టుల లోతున జలము ఉండును. 

 

 * యే ప్రదేశమున వేడి పొగలు ఉండునో అచ్చట రెండు నిలువుల లోతు అదిక ప్రవాహము గల జలదార ఉండును.


 * యే ప్రదేశము నందు పైరులు నలుపక్కల కోమలముగా నుండి మద్య యందు మాడిపోయి ఉండిన , తెలుపు వర్ణం కలిగి యుండినను మికకిలి కొమలముగా నుండినను అచ్చట అదిక ప్రమాణం గల జలదార నిలువు లోతు ఉండును. 

 

 * మరుభూమి అనగా నిర్జలమైన కొండల యందు ఉండు అరణ్యభుమి ములు మొదుగ చెట్టు కు పడమర పుట్ట యుండిన దానికి దక్షిణమున మూడు మూరల దూరము నందు 12 నిలువుల లోతున పడమటి నుండి ప్రవహించే జలనాడి ఉండును. 


 * దురద గొండి చెట్టుకి ఉత్తరమున పుట్ట యుండిన దానికి మూడు మూరల దూరము నందు 10 మట్టుల లోతున దక్షిణమున నుండి ప్రవహించే జలనాడి ఉండును. మరియు నిలువు లోతున పచ్చని వర్ణం గల కప్ప ఉండును . 

 

 * మరియు మద్ది చెట్టుకి ఉత్తరమున పుట్ట యుండిన యెడల దానికి దక్షిణమున రెండు మూరల దూరమున 15 పురుషుల ప్రమాణమున దక్షిణము నుంచి ప్రవహించే ఉప్పు నీటి జలదార ఉండును. 

 

బావి తవ్వునప్పుడు రాళ్లు పడినప్పుడు వాటిని బెధించుటకు ఉపాయం - 

 

 

 * బావి తవ్వునప్పుడు శిలలు కనిపించినప్పుడు వానిని పగలగోట్టుటకు మోదుగు కట్టెలను , దూబర కట్టెలను కాల్చి ఆ బూడిదను సున్నపు నీళ్ళలో కలిపి రాతిని తడిపి పగలగొట్టిన రాయి పగులును.


  * పూర్వము చెప్పినట్టుగా మోదుగ , తుబుర కట్టెలను కాల్చిన బూడిదను , దర్భల బస్మము , మొక్కలపు చెట్టు చెక్కలను, కాల్చిన బూడిద నీళ్లలో కలిపి ఆ నీళ్లు చక్కగా కాచి కాల్చిన బండ మీద 7 పర్యాయములు పోసి తడపగా రాళ్లు పగులును. 

 

 * ఉత్తరేను, తిప్పతీగా, వేపచెక్క, ఆకు, తుభర కట్టెలు, నువవు కట్టెలు, వీని బూడిద ను ఆవు ముత్రములో కలిపి కాచి 6 దినములు రాళ్ళ మీద పోసి నానబెట్టిన యెడల శిలలు పగులును. 

 

 * అరటి పట్టలను కాల్చి ఆ బూడిదను మజ్జిగ యందు కలిపి చక్కగా కాచిన తరువాత అందులొ రాతిని పగలగొట్టడానికి ఉపయొగించే ఆయుధములు ఒక దినమంతయు అందులొ నానబెట్టి రాతిపై ప్రయోగించగా ఆ ఆయుధములు చెడకుండా ఉండును. అలాగే ఆ ఆయుధముల చేత రాళ్లు , ఇనుము మొదలగు వాటిని పగలగొట్టిన ఆ ఆయుధములు మెరుపు , పదును పోకుండా ఉండును. 


       మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

భాగవత పద్యరత్నములు*

 *శ్రీ పోతన భాగవత పద్యరత్నములు*

*నేమాని సూర్యనారాయణ*

*" చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ - 10 "*


*4 - 881 - వచనము:*

పురుషుడు స్త్రీల యిండ్లను ఆశ్రయించి క్షుద్రమై, కామ్యపరిపాకం నుండి పుట్టిన జిహ్వ, ఉపస్థ మొదలైన కామ జనిత సుఖలేశాన్ని అన్వేషిస్తాడు. స్త్రీయందే మనస్సు నిల్పి మనస్సును కొల్లగొట్టే స్త్రీల మాటలను వినగోరుతాడు. కళ్ళముందే తోడేళ్ళ గుంపులాగా ఆయుస్సును హరించే రాత్రింబవళ్ళను లెక్కచేయడు. వెనుకనుండి బోయవాని వంటి యముడు శరీరాన్ని చీల్చివేస్తుండగా జీవుడు విహరిస్తాడు. కాబట్టి నీవు ఈ జీవుని లేడివంటి చేష్టలు కలవానిగా భావించు. బాహ్యవ్యాపారాలైన శ్రౌతస్మార్తాది రూపకర్మలను హృదయంలో నిగ్రహించు. అతి కాముకుల గాథలతో కూడిన సంసారాన్ని విడిచిపెట్టి, సర్వజీవులకు దిక్కైన భగవంతుని సేవించు. సంపూర్ణ విరక్తిని పొందు” అని నారదుడు చెప్పగా ప్రాచీనబర్హి ఇలా అన్నాడు.


*4 - 882 - కందపద్యము:*

*"మునివర! భగవంతుండవు*

*ననుపమ విజ్ఞాననిధివి ననఁదగు నీ చే*

*తను వివరింపంగాఁ దగి*

*యెనసిన యీ యాత్మతత్త్వ మిటు నాచేతన్.*


*భావము:*

“మునీంద్రా! భగవంతుడవు, మేటి జ్ఞానివి అయిన నీవు చెప్పిన ఆత్మ తత్త్వాన్ని…


*4 - 883 - వచనము:*

విని బాగా ఆలోచించాను. నాకు కర్మను బోధించిన ఆచార్యులకు ఈ ఆత్మతత్త్వం తెలియదు. తెలిస్తే కర్మని ఉపదేశింపరు కదా! ఆ ఆచార్యుల ఉపదేశం చేత నాకు ఆత్మతత్త్వం విషయంలో కలిగిన మహాసంశయం నీ వల్ల పటాపంచలయింది” అని ఇంకా ఇలా అన్నాడు.


*4 - 884 - సీసపద్యము:*

*అనఘాత్మ! యేమిటి యందు నీ యింద్రియ-*

  *వృత్తులు దగఁ బ్రవర్తింపకుండు*

*టను జేసి ఋషు లైన ఘనముగ మోహింతు-*

  *రట్టి యర్థము నందు నాత్మ సంశ*

*యము గల్గుచున్నది; యది యెట్టి దనినను-*

  *బురుషుఁ డేయే దేహమునను జేసి*

*కర్మముల్ చేసి తత్కాయంబు నీ లోక-*

  *మందునే విడిచి తా నన్యదేహ*


*4 - 884.1 - తేటగీతి:*

*మర్థితో ఘటియించి లోకాంతరమును*

*బొంది తత్కర్మఫలమును బొందు ననుచుఁ*

*బ్రకటముగ వేదవేత్తలు పలుకుచుందు*

*రన్న నది యెట్లు విన నుపపన్న మగును?*


*భావము:*

పుణ్యాత్మా! ఇంద్రియ వృత్తులలో అప్రవృత్తులై ఋషులు మోహించే అర్థం గురించి నాకు సంశయం కలుగుతున్నది. పురుషుడు ఏ దేహం చేత కర్మలు చేస్తాడో ఆ దేహాన్ని ఈ లోకంలోనే విడిచిపెట్టి తాను మరొక దేహాన్ని ధరించి మరొక లోకాన్ని చేరి అక్కడ కర్మఫలాన్ని అనుభవిస్తాడని వేదవేత్తలు చెపుతారు. ఇది ఎలా పొసగుతుంది?


*4 - 885 - వచనము:*

అంతేకాదు. చేసిన వేదోక్తమైన కర్మ ఆ క్షణంలోనే నశిస్తుంది కదా! ఇంక జీవుడు మరొక దేహం పొంది లోకాంతరంలో ఎలా అనుభవించగలడు?” అని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు ప్రాచీనబర్హితో ఇలా అన్నాడు “రాజా! లింగశరీరాన్ని ఆశ్రయించి ఉండే జీవుడు కలలో జాగ్రద్దేహాభిమానాన్ని విడిచి, అటువంటిదో లేక అటువంటిది కానిదో అయిన మరొక శరీరం పొందుతాడు. మనస్సులో సంస్కార రూపంలో ఆ హితమైన కర్మని ఆచరిస్తాడు. అలాగే జీవుడు ఏ లింగ శరీరం చేత కర్మని చేస్తాడో ఆ లింగశరీరం చేతనే లోకాంతరంలో ఆ ఫలాన్ని అనుభవిస్తాడు. భిన్న దేహాన్ని పొందడు. ఇవ్వటం, పుచ్చుకొనడం మొదలైన వానిలో స్థూల దేహానికి కర్తృత్వం ఉన్నదని భ్రమించకూడదు. జీవుడు అహంకారంతోను మమకారంతోను కూడినవాడు. ఆ జీవుడు మనస్సు చేత ఏ దేహాన్ని పొందుతాడో, ఆ దేహం చేతనే ప్రాప్తించిన కర్మని అనుభవిస్తాడు. అలా కాకుంటే కర్మ పునర్జన్మకు కారణం కావటం పొసగదు. కాబట్టి మనః ప్రధానమైన లింగశరీరానికే కర్తృత్వం పొసగుతుంది” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

అన్నదానము

 పద్యం:☝️

*అన్నదానము గొప్పదనవచ్చునే గాని*

*అన్నంబు జాములో నరిగి పోవు*        

*వస్త్రదానము గూడ భవ్యదానమె గాని*

*వస్త్రమేడాదిలో పాతదగును*

*గృహదానమొకటి యుత్కృష్ట దానమె గాని*

*కొంప కొన్నేండ్లలో కూలిపోవు*

*భూమిదానము మహా పుణ్యదానమె గాని*

*భూమి యన్యుల జేరి పోవవచ్చు*

*అరిగిపోక, ఇంచుకయేని చిరిగిపోక*

*కూలిపోవక యన్యుల పాలుగాక*

*నిత్యమయి, వినిర్మలమయి, నిశ్చలమయి*

*యొప్పుచుండు విద్యాదానమొకటి జగతి*

- చిలకమర్తి లక్ష్మీనరసింహం

రామో విరామో విరజో.

  👆 శ్లోకం 

రామో విరామో విరజో.                       

మార్గో నేయో నయోనయః||.                  

వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో                         

ధర్మో ధర్మవిదుత్తమః|.                       


ప్రతిపదార్థ:


రామ: - నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు.


విరామ: - సకలజీవులకు విశ్రాంతి స్థానమైనవాడు.


విరత: - విషయ వాంఛలు లేనివాడు.


మార్గ: - మోక్షమునకు మార్గము తానైనవాడు.


నేయ: - ఆత్మజ్ఞానము ద్వారా జీవులను నడిపించువాడు.


నయ: - జీవులను నడిపించి పరమపదస్థితికి గొనిపోవువాడు.


అనయ: - తనను నడుపువాడు మరొకడు లేనివాడు.


వీర: - పరాక్రమశాలియైనవాడు.


శక్తిమతాం శ్రేష్ఠ: - శక్తిమంతులలో శ్రేష్ఠుడైన భగవానుడు.


ధర్మ: - ధర్మ స్వరూపుడు.


ధర్మ విదుత్తమ: - ధర్మము నెఱింగినవారిలో శ్రేష్ఠుడు

*శ్రీ కాళహస్తీశ్వర శతకము - 32*

 💎🌅  *_-|¦¦||¦¦|-_* 🌄🪔


  🙏  //*సుభాషితమ్*// 🙏


  *రోసీ రోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్‌*

  *బాసీపాయదు పుత్త్ర మిత్ర జన సంపద్భ్రాంతి వాంఛా లతల్‌*

  *కోసీకోయదు నామనం బకట! నీకుం బ్రీతిగా సత్క్రియల్‌*

  *చేసీ చేయదు దీని త్రుళ్ళణఁపవే శ్రీకాళహస్తీశ్వరా!!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 32*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! స్త్రీరతియందు, పుత్రమిత్రబాంధవులయందు నాకు తనివి తీరినట్టే ఉండి మరల మరల కలుగుచున్నది....ఇటువంటి మనస్సును నాకు ఎందుకు ప్రసాదించితివి....నీ సేవానుతినతి సపర్యలు చేసి కూడా వాటిమీద మనస్సు నిలువదే.... ఈ సంసార బంధాల తలను వేగముగా త్రెంపి నన్ను కాపాడు ప్రభో!*

           

✍️🌺🌷🌹🙏

⚜ *శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 431*


⚜ *కర్నాటక  : మందార్తి _ ఉడిపి* 


⚜ *శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం* 



💠 మందర్తి దుర్గా పరమేశ్వరి ఆలయం శక్తి ఆరాధనలో ముఖ్యమైన మరియు పవిత్రమైన ఆలయాలలో ఒకటి.  

మహిషాసురమర్ధిని మరియు చాముండేశ్వరి యొక్క రాతి చిహ్నాలతో పాటు, ఇది తొమ్మిది పాత ముసుగులను కలిగి ఉంది, ఇది దేవత యొక్క విభిన్న రూపాలను వర్ణిస్తుంది.  ఆలయంలో నాగతీర్థం అనే చెరువు కనిపిస్తుంది.


💠 ఈ అమ్మవారు సుదేవ మహర్షిని కాపాడడానికి అవతరించింది.

సుదేవ మహర్షి  హేమాద్రి మహారాజు  దేవవర్మకి  ఆయన భార్య  జలజాక్షికి

మహిషాసురుని అకృత్యాలనుండి కాపాడతానని శరణు ఇచ్చాడు.  


🔆 స్థలపురాణం 🔆


💠 నాగలోకాధిపతియైన శంఖచూడునికి ఐదుగురు కుమార్తెలు.

మందరతి , నాగరతి , దేవరతి , చారురతి , నీలారతి అని పేర్లతో పెంచాడు.

వారిని శివపుత్రుడు ,  షణ్ముఖుడైన కుమారస్వామికే యిచ్చి పెళ్లి చేయాలనే కోరికతో వుండేవాడు.


💠 ఆ 5 నాగపుత్రికలకు

యవ్వనం వచ్చాక తండ్రి కోరిక తీర్చేందుకు  కుమారస్వామిని పరిణయం చేసుకోవాలని కైలాసానికి వెళ్ళేరు.

కానీ , అక్కడ నందదీశ్వరుడు

వారిని ఆడ్డగించడంతో వాగ్వాదము పెరిగి  నందీశ్వరుడు వారిని భూలోకంలో నాగులై చరించమని శపించాడు.


💠 దేవ వర్మన్ అనే రాజు ఏదో ఒక దండనకు లోనై హిమాద్రి కొండలలోని అడవులలో సంచరిస్తూండగా అక్కడ అడవి కారుచిచ్చులో చిక్కుకున్న ఐదు నాగులను రక్షించి తన బట్టలో మూటకట్టుకున్నాడు. 

వాటిని  తనతో పాటు తీసుకుని వెళ్ళాడు.

అవి  సమయం చూసుకొని ఒక్కొక్క చోట ఒక్కొక్క పుట్టలో దూరి

పోయాయి.


💠 ఆ విధంగా  మందరతి అన్న

నాగిని  వెళ్ళిన ప్రదేశానికి 'మందార్తి ' అని పిలవబడింది.

ఇతర నాగకన్యలు వెలసిన స్ధలాలను  నాగర్తి,  అర్చనమహ, శూరడి, నీలావరా అని ప్రసిధ్ధిపొందాయి.

ఈ ఐదు స్ధలాలలో దుర్గా పరమేశ్వరీ

ఆలయాలు  నిర్మించబడ్డాయి.


💠 ఒకసారి ఈ నాగకన్యలు దేవవర్మ కలలో కనపడి హిమాద్రి రాజు యొక్క పుత్రిక జలజాక్షి ఆపదలో చిక్కుకున్నదని వెంటనే వెళ్ళి ఆమెను కాపాడమని చెప్పారు.

దేవవర్మ వెంటనే వెళ్ళి రాజకుమార్తెను కాపాడాడు. 

హిమాద్రి రాజు తన పుత్రికను రక్షించిన దేవవర్మకే ఇచ్చి వివాహం చేసి  తన  రాజ్యానికి రాజుని చేశాడు.


💠 వ్యాఘ్రపాద మహర్షికి కిరతా అనే స్త్రీ కి  పుట్టిన మహిషుడనే రాక్షసుడు జలజాక్షిని 

ఒకసారి చూశాడు.  

జలజాక్షి మీద వ్యామోహంతో ఆవిడని బాధలు పెడుతూ  వచ్చాడు. ఆ రాక్షసుని ముందు  దేవవర్మ శక్తి సామర్ధ్యాలు పనిచేయలేదు.

జలజాక్షి  , దేవవర్మ  యిద్దరూ సుదేవ ముని ఆశ్రమానికి వెళ్లి , శరణు కోరారు.


💠 గొప్ప అతీంద్రియ శక్తులు కలిగిన ముని దుర్గాపరమేశ్వరి అనుగ్రహంతో  మహిషుడు పంపి మహోదరుడనే  రాక్షసుడు ప్రయోగించిన ఆయుధాలని అన్నిటినీ మింగేశాడు.

కోపంతో మహిషుడే స్వయంగా యుధ్ధానికి దిగాడు. 


💠 మునికి అండగా దుర్గాదేవి తన భూతగణాలతో  దుర్గాదేవి, మహిషాసురుని ముందు చెదల పుట్టగా అవతరించినది. 

అనేక ఆయుధాలతో పుట్టను నేలమట్టం చేయాలని చూశాడు.


💠 ఆ భయంకర చెదల పుట్ట మహిషాసురుని ఆయుధాలనన్నిటిని మింగి వేసింది.  

ఆఖరికి, దుర్గాదేవి భైరవుని సహాయంతో మహిషాసురుని అణిచి తన కాలితో తొక్కిపట్టినది.

శక్తిహీనుడైపోయిన మహిషాసురుడు అమ్మవారి కాళ్ళు పట్టుకొని , " ఇంక నా దేహం నీ కాళ్ళక్రిందనే వుంటుంది. అనుగ్రహించమని" ప్రార్ధించాడు.


💠 మహర్షి ప్రార్ధనకి కరుణించి అవతరించనట్లే , తన ప్రార్ధనలు కూడా మన్నించి ఈ ప్రాంత భక్తులను కాపాడుతూ వారి కోరికలు నెరవేరుస్తూ అక్కడే కొలువై వుండమని వేడుకొన్నాడు.

మహిషుని  ఆఖరి కోరిక నెరవేర్చి లోక కళ్యాణం కోసం మందార్తిలో దుర్గాదేవి వెలసింది.


💠 పిదప హేమాద్రి మహారాజు దేవవర్మ స్వప్నంలో కనిపించి తను వున్న ప్రదేశాన్ని తెలిపి తనను తీసుకుని వచ్చి ప్రతిష్టించమని ఆదేశించింది.

మహారాజు దుర్గాదేవి తెలిపిన చోటున లభించిన విగ్రహా రూపాన్ని తీసుకువచ్చి

ప్రతిష్టించి ఆలయం నిర్మించాడు.

ఈనాటికి  శ్రీ దుర్గా పరమేశ్వరి

అనే పేరుతో మహిమాన్వితమైన అమ్మవారిగా భక్తులు ఆరాధిస్తున్నారు.


💠 కేరళ శైలిలో , 5 అంతస్తుల గోపురం కలిగిన ఆలయం యిది.

లోపలికి ప్రవేశించగానే ధ్వజస్ధంభాన్ని, బలిపీఠాన్ని చూస్తాము.


💠 గర్భగుడిలో  ఆశీనురాలైన దుర్గాదేవి వరద హస్తాలతో అభయమిస్తూ పుష్పాలంకారాకృతితో భక్తులకు దర్శనము అనుగ్రహిస్తున్నది .


💠 లోపలి ప్రాకారంలో వీరభద్రుడు, సుబ్రహ్మణ్యస్వామి తీర్ధం సమీపమున నాగదేవతల విగ్రహాలను దర్శిస్తాము


💠 ఈ ఆలయంలో యక్షగాన,కణ్డేసేవ, గణేశచతుర్ధి,షష్ఠి, నవరాత్రి, రంగ పూజలు, కుంకుమార్చనలు వంటి అనేక

ఉత్సవాలు వైభవోపేతంగా చేస్తారు.


💠 ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో  ఘనంగా జరిపే రధయాత్రోత్సవంలో లక్షలాది  భక్తులు

పాల్గొని దేవి అనుగ్రహానికి పాత్రులవుతారు.


💠 దుర్గా పరమేశ్వరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు చండీహోమాలతో ఘనంగా జరుపుకుంటారు.  మందర్తి దుర్గా పరమేశ్వరి ఆలయంలో మకర మాసంలో ఐదు రోజుల మఠోత్సవాలు మరియు కుంభమాసంలో జాతర వార్షిక మరియు ముఖ్యమైన సంఘటనలు.


💠 మందర్తి ఉడిపికి ఉత్తరాన 30 కి.మీ దూరంలో ఉంది.  

బ్రహ్మ

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

   *"సర్వం ఖల్విదం బ్రహ్మ"*

        *అంటే ఏమిటి.।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*"సర్వం ఖల్విదం బ్రహ్మ" అనేది ఉపనిషత్తులుగా పిలువబడే వేద గ్రంథాల నుండి వచ్చిన సంస్కృత పదబంధం.*


*ఇది వైదిక ప్రజలకు తాత్విక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రకటన. పదబంధాన్ని ఈ క్రింది విధంగా విభజించవచ్చు:*


*1) సర్వం: దీని అర్థం "అన్ని" లేదా "ప్రతిదీ."*


*2) ఖలు: ఇది "నిజంగా" లేదా "నిజంగా" అని అర్థం వచ్చే ఒక ఉద్ఘాటన కణం.*


*3) ఇదం: దీని అర్థం "ఇది."*


*4) బ్రహ్మ: ఇది వేద తత్వశాస్త్రంలో అంతిమ వాస్తవికత లేదా అత్యున్నత విశ్వశక్తిని సూచిస్తుంది.*


*అన్నింటినీ కలిపితే, "సర్వం ఖల్విదం బ్రహ్మ"ని "ఇదంతా నిజానికి బ్రహ్మమే" లేదా "ఉన్నదంతా బ్రహ్మమే" అని అనువదించవచ్చు. వేద తత్వశాస్త్రంలో బ్రహ్మంగా తరచుగా సూచించబడే అంతిమ వాస్తవికత విశ్వంలోని ప్రతిదానికీ అంతర్లీనంగా ఉన్న సారాంశం అనే ఆలోచనను ఈ ప్రకటన వ్యక్తపరుస్తుంది. ప్రపంచం యొక్క వైవిధ్యం మరియు బహుళత్వం అనేది ఒక అంతిమ, మార్పులేని వాస్తవికత యొక్క వ్యక్తీకరణలు అనే భావనను ఇది తెలియజేస్తుంది. ఈ ఆలోచన అద్వైత వేదాంత యొక్క ద్వంద్వ రహిత తత్వశాస్త్రంలో ప్రధానమైనది.*


*ఓం నమః శివాయ॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

సర్వం ఖల్విదం బ్రహ్మ*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

     *సర్వం ఖల్విదం బ్రహ్మ*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఒకరోజు అతిథి ఒకరి ఇంటికి వస్తాడు. ఆ ఇంటి ఇల్లాలు ఎంతో రుచిగా జీడిపప్పు, పిస్తా వేసి పాయసం వండి పెడుతుంది. అతిథి అంత రుచికరమైన పాయసం తిని ఆనందంతో పాయస పాత్రలోని గరిటకు నమస్కారం చేస్తూ నువ్వు నాకు భగవంతుడివి ఇంత రుచికరమైన పాయసం విస్తరిలో వేసావు అంటాడు…*


*వెంటనే ఆ గరిట నన్ను పొగిడితే ఏమీ ఉపయోగం లేదు. వడ్డించిన చేతికి నమస్కరించు మరింత పాయసం దొరుకుతుంది అంటుంది.*


*ఇల్లాలు ఇది నా గొప్పతనం కాదు నా భర్త కష్టపడి సంపాదించి తెస్తే నేను వండిపెట్టాను ఆయనకు నమస్కరించమంటుంది.*


*యజమాని ఇందులో నా గొప్పతనమేమి లేదు భూదేవి మహిమ ఆమె వలన పండిన పంటతో నేను ఆతిథ్యం ఇచ్చాను అంటాడు.*


*భూదేవి నాకు జలం ఆధారం ఆయనకు నమస్కరించు అనగా.. జలం ఆగ్నికి, అగ్ని వాయువుకు, వాయువు ఆకాశానికి ఇలా చివరకు మా అందరికి ఆధారభూతమైన వాడు ఒక్కడే ఆయనే “పరమాత్మ” ఆయనకు నమస్కరించమని చెబుతారు.*


*మనం తినే పాయసానికి పరమాత్మకు సంబంధం ఇదే..*


*సృష్ఠిలో ప్రతిదానికి మూలం ఆ పరబ్రహ్మమే.. మన దగ్గర ఎంత ధనమున్నా, కీర్తి ప్రతిష్టలున్నా వాటన్నిటిని సృష్టించిన వాడు, వాటన్నిటికి అధిపతి ఆ పరమేశ్వరుడే..*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

అక్షింతలు

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*తల ఫై అక్షింతలు ఎందుకు వేస్తారు?*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసు కోనేపుడు పాదాల కెందుకు నమస్కరిస్తాం?*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*అక్షింతలు అంటే మన కందరికీ తెలుసు..*


*బియ్యం లో పసుపు కలిపి ఏ పండగ వచ్చినా, ఏ దైనా శుభకార్యాలు జరిగినా, దేవాలయాల లోను మన పెద్దలు మనల్ని అశీర్వదించడానికి  మనఫై అక్షింతలు వేస్తారు.*


*అయితే ఈ అక్షింతలు వెయ్యడం లోని పరమార్దం ఏమిటో  తెలుసు కుందాం..*


*అక్షింతలు అంటే  క్షతం కానివి.అని అర్ధం. అంటే రోకలి పోటుకు విరగనివి అని..  శ్రేష్ఠమైన బియ్యం అన్నమాట. అలాంటి బియ్యాన్ని పసుపు మరియు  నెయ్యితో లేక, నూనె తొ కలిపి అక్షింతలు తయారు చేస్తారు.*


*నవ గ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని...దాన వస్తువుగా పేర్కొంటారు.ఆ రకంగా నవ గ్రహాలలో చంద్రుడికి ప్రీతి కరమైన దాన వస్తువు బియ్యం.  చంద్రుడు మనస్సుకు అధినాయకుడు.*


*మనిషి మనసు, బుద్ధి, గుణము, వ్యసనము వీటన్నిటికి చంద్రుడే  కారణమని, మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా  ఉంటుంది. అని మన  పెద్దల నమ్మకం.*


*అందుకే  ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సు పై ప్రభావం చూపు తుందని, మనో ధర్మాన్ని నియంత్రిస్తాయి.అని గట్టిగా విశ్వసిస్తారు.. అందు కే అక్షింతలను తల ఫై వేసి ఆశీర్వదిస్తారు..*


*సైంటిఫిక్ గా చెప్పా లంటే బియ్యానికి విద్యుత్ శక్తిని గ్రహించే  తత్వం ఉంది.  దేహం ఓ విద్యుత్‌ కేంద్రం.విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి.*


*పెద్దలు మన ఫై అక్షింతలు వేసి ఆశీర్వదించే సమయంలో, వారి దేహం లోని విద్యుత్తులో కొంత బాగం ఈ అక్షంతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి, పుచ్చుకొనే వాళ్లకి కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. అంతే కాదండీ!*


*మనిషి దేహంలో విద్యుత్‌ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట. వాటిలో ప్రధాన మైనది. శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు,  విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా...*


*తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటి లోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది. శిరస్సు. ఈ కారణం గా అక్షింతల ద్వారా  పెద్దలలో ఉండే సాత్విక గుణం పిల్లలకు లభిస్తుంది.*


*ఇక పసుపు క్రిమి సంహారకం, ఆశీస్సులు ఇచ్చే వారికీ ఎటువంటి చర్మ వ్యాదులు లాంటివి. ఉన్నా అవి ఆశీస్సులు పుచ్చు కొనే వారికి రా కుండా ఉంటాయి.*


*పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు  మనకు అక్షింతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పర మార్థం ఇదే!*


*ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్య మేనట...*


    *‘అన్నాద్భవన్తి భూతాని’*


*అని భగవద్గీత లో మూడవ అధ్యాయం లో చెప్ప బడింది.*  


*జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం...భగవంతునిపై అక్షింతలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు...ఈ అన్నంలో పుట్టీ, తిరిగి ఈ జీవుడిని భగవంతుడి లోకి చేర్చడమే...*


*పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకొనేటప్పుడు పాదాల  కెందుకు నమస్కరిస్తాం?*


*పెద్దల దగ్గర మన ఆశీర్వాదం తీసు కొనేటపుడు వారి పాదాలకు నమస్కరించడం మన సంప్రదాయం. 

అయితే అలా... చెయ్యడం లోని అర్ధం ఏమిటో తెలుసు కుందాం..*


*మన  శరీరం లో...తల ఉత్తర దృవంఅయితే... పాదాలు దక్షిణ దృవం.. వ్యతిరేక దృవాలేఆకర్షించుకుంటాయి.. అప్పుడే గా శక్తి విడుదల అవుతుంది.*


*అలానే మనం పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసు కొనే టపుడు మన తలను వారి పాదాలకు తాకించి ఆశీర్వాదం తీసు కుంటాం. అప్పుడు వారి పాదాల లోని దక్షిణ దృవం మన తలలో గల ఉత్తర దృవం తో ఆకర్షితమై శక్తిని వెలువరిస్తుంది... అందుకే మన హిందూ  సాంప్ర దాయం లో పెద్దల కాళ్ళకు నమస్కరిస్తాం.*


*మన సంప్రదాయం లో  ప్రతీ దానికి ఏదొక పర మార్దం దాగి ఉంటుంది.*


*మన సంప్ర దాయాలను అర్దం లేని వని కొట్టి పారేయ కుండా వాటిలోని పరమార్దం తెలుసు కొని  ఆచరిద్దాం...*


*సర్వేజనా స్సుఖినో భవంతు*


*లోకాస్సమస్తా స్సుఖినో భవంతు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

మృణ్మయ గణపతే

 *మృణ్మయ గణపతే సర్వదా పూజ్యనీయం..*

భాద్రపద శుక్ల చతుర్థీ అంటే... వినాయకచవితి. ఈ గణపతి పూజా నియమాల గురించి ముద్గల పురాణంలో చెప్పబడింది. అందులో కణ్వమహర్షి భరతునికి గణపతి తత్వాన్ని, భాద్రశుక్ల చవితి వ్రత మహిమను చెప్పారు. అందులో భాగంగా ప్రధానమైన నియమం గణపతి యొక్క మూర్తిని మట్టితో మాత్రమే చేసి పూజించడం.  మిగతా పదార్ధాలతో చేసిన విగ్రహాల గురించి  అందులో ప్రస్తావన లేదు. గణపతిని మట్టితో పూజించడం వెనుక పంచీకరణం అనే ఒక తత్వం ఉంది. అసలేంటీ ఈ పంచీకరణం అంటే?

ఆకాశం నుండి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు,నీటి నుంచి భూమి ఉద్భవించాయి. ఇవి పంచభూతతత్వం.    జడపదార్ధమైన భూమి చైతన్యం కలిగిన నీళ్ళతో చేరినప్పుడు ప్రాణశక్తి కలిగి - ఆహారపదార్ధాలనూ, ఓషధులని మనకు అందిస్తుంది. నీరు ప్రాణాధారశక్తి. జడశక్తులు కలయికతో ఈ సృష్టి ఏర్పడిందనడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి, నీరు కలిపి తయారుచేస్తాం. అప్పుడది పూజార్హం అవుతుంది. మన శరీరంలో ఆరు చక్రాలు ఉన్నాయి అంటుంది యోగశాస్త్రం. ఆరు చక్రాల్లో మొదటిది మూలాధారచక్రం, వెన్నుపూస చివరిభాగాన ఉంటుంది. నాలుగు రేకులు పద్మంవలే, ఎరుపు రంగు కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం మూలాధారచక్రానికి గణపతి అధిష్ఠానదేవత. మూలాధారం - పృధ్వీ తత్వం, అంటే భూమికి సంకేతం. కనుక వినాయకున్ని మట్టితోనే చేయాలి.

పంచభూతాల్లో, ప్రతి భూతంలోనూ, దాని తత్వం 1/2 వంతు, తక్కిన 4 భూతాల తత్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే భూమి- అందులో 1/2 భూతత్వం అయితే, 1/8 జలం, 1/8 అగ్ని, 1/8 వాయువు, 1/8 ఆకాశం ఉంటాయి.  దీన్నే 'పంచీకరణం' అంటారు. ఒక్కో తత్వానికి ఒక్కో అధిష్ఠానదేవత ఉంటారు. భూతత్వానికి అధిష్ఠానదేవత గణపతి, ఆకాశతత్వానికి ఈశ్వరుడు (శివుడు), జలతత్వానికి నారాయణుడు, అగ్నితత్వానికి అంబిక, వాయుతత్వానికి ప్రజాపతి (బ్రహ్మ). మనం పూజించే విగ్రహంలో గణపతి తత్వం 1/2 భాగం ఉండగా, మిగిలిన ఈ అన్ని దేవతల తత్వం 1/8 భాగంగా ఉంటుంది. పరమాత్ముడు ఒక్కడే, ఎన్నో విధాల కనిపించినా, అన్నీ ఒక్కరూపమే.  మృణ్మయ వినాయక విగ్రహంలో 1/2 భూతత్వం, తక్కినవి 1/8 ప్రకారం ఉంటాయి. మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఆ మృణ్మయ ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠానదేవతలను పూజిస్తున్నాం అన్నట్లే . ఇది ఇతర పదార్ధాల చేత చేయబడిన గణపతి మూర్తులను ఆరాధించడం వలన కలుగదు. పంచభూతాలతో ఆధునిక మానవుడు సంబంధం తెంచుకున్న కారణం చేతనే అనేక సమస్యలకు, ఒత్తిళ్ళకు, రోగాలకు బాధితుడవుతున్నాడు.

ఏ తత్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, చివరికది ఆ తత్వాలలోనే లయం అవుతుంది. అదే సృష్టి ధర్మం. కనుక మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని నీళ్ళలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటివాటి తత్వాల్లో  లీనమవుతాయి. ఇదే పంచభూతాత్వాక శక్తి. అంటే ఇక్కడ అర్ధం ఏమిటంటే....చివరికి ఏదైనా పృథ్వి లో మిళితం కావాలిసిందే అన్నమాట. ఓషధిగుణాలు కల్గిన 21 రకాల పూజపత్రాలులతో పూజించడంలో ఉన్న పరమర్థమూ అదే.

కనుక వినాయకుడిని మట్టితో చేసి పూజించడమే సర్వులకు శుభప్రదం, మంగళప్రదం.

ఓం గం గణపతయే నమః

*-శృంగేరీ జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థమహాస్వామివారు.*

7. " మహా దర్శనము

 7. " మహా దర్శనము " ---ఏడవ భాగము -- -సుఖ ప్రసవము


 ఏడవ భాగము -- సుఖ ప్రసవము 


          మరు దినము ఆలంబిని తల్లితో కర్మ విచారము ప్రస్తావించి , భర్త తనకు చెప్పినదంతా చెప్పినది . తల్లికి ఆశ్చర్యము కాలేదు . " నువ్వు మంచి పనే చేసినావు , దేహమే నేను అనుకొనువారి మాట వేరు . దేహము నేను కాదు ; నేననేది వేరే ఇంకొకటుంది అని నమ్మువారు ఇటులనే చేయవలెను . నిజమే . ఆడది జన్మ ఎత్తినపుడే సిగ్గుపొరలను కప్పుకొనే పుడుతుంది . అలాగని మెట్టినింటికి ద్రోహము అగునట్లు చేయవచ్చునా ? అట్లు చేసిన , పుట్టింటికి కూడా ద్రోహము అయినట్లే . కాబట్టి నువ్వు చేసినది సరియైనదే . కానుపు గది ఎక్కడ అని అనుకున్నారు ? అది ముందు చెప్పు . " 


" నడిమింట్లోనే ఒక మూలలో తెరలు కట్టి చేయవలెను . " 


        " సరే , అక్కడే చేయండి , దానికి రెండు వైపుల నుండీ దారి ఉండనీ . బిడ్డ పుట్టగానే నేను మంత్రసానిని ఒక దారినుండీ బయటికి పిలుచుకొని వస్తాను . ఇంకొక దారి నుండీ నీ భర్త వచ్చి కర్మను ముగించుకొని వెళ్ళనీ . వారు వెళ్ళిపోగానే నువ్వు నన్ను పిలువు . నేను మంత్రసానితో పాటు వచ్చి తరువాతి కార్యము చేసెదను . " 


         ఆ దినము పంచమి , కర్మకు కావలసిన తేనె , నెయ్యి , బంగారము సిద్ధమయినాయి . ఆడవారు కర్మకు ఒప్పుకున్నందు వలన కర్మకు ఇక ఉన్న అడ్డు తీరిందని దేవరాతుడు బహుళ తృప్తుడైనాడు . 


         ఆలంబినికి ఆయాసము ఎక్కువగుతూ వచ్చినది . కూర్చుంటే లేచుట , లేస్తే కూర్చొనుట కష్టమగుతున్నది . దేవరాతుడు అది చూచి అగ్ని పరిచర్యను తానే వహించి చేస్తున్నాడు . 


         ఆలంబిని తల్లి జాయంతి కూతురికి వేడినీళ్ళు ఇస్తూ , ’ గర్భము జారినది , ఇక రెండో మూడో దినములు , అంతే . " అన్నది . కూతురు , " వారి మాట ప్రకారమైతే రేపే జననము కావలెను " అన్నది . తల్లి , " అయినా కావచ్చును , అయితే , బిడ్డ మాత్రము , ...ఆలంబీ , ఏమీ అనుకోవద్దు , మాంచి భూతపు బిడ్డ అవుతుంది " అంది . ఇద్దరూ నవ్వినారు . 


         గురువారము తెల్లవారింది . నడిమింట్లోనే ఒక మూలలో ప్రసూతి గృహము సిద్ధమయినది . తల్లి , బాలింత పడక మొదలైనవన్నీ సిద్ధము చేసి ఉంచినది . అందరూ త్వరితముగానే భోజనములు కానిచ్చినారు . గర్భిణి కూడా భోజన శాస్త్రము అయిందనిపించినది . మధ్యాహ్నపు సూర్యుడు నెత్తిపై నుండి పశ్చిమమునకు దిగు సమయమునకు , పొద్దుటి నుండీ అప్పుడప్పుడు వస్తున్న నొప్పి తీవ్రమైనది . వెంటనే , మజ్జిగన్నము తింటున్న తల్లి భోజనము వదలి చేతులు కడుక్కొని పరుగెత్తి వచ్చినది . 


         ఆలంబిని ఎక్కువ సేపు నొప్పులు తినలేదు . తల్లిని ఆనుకొని ఒరిగి కూర్చునియుండగనే మరియొక నొప్పి వచ్చినది . దానితో పాటే , జలోదయ , శిరోదయములు రెండూ ఏకకాలములోనే అయినవి . ఇంకొక ఘడియ లోపలే శిశువు లోకానికి వచ్చినది . తాను వచ్చినట్టు ప్రకటించుటకా అన్నట్టు ఏడ్చింది . 


         తల్లి జాయంతి , కూతురికి చెప్పినట్లే మంత్ర సానిని పిలుచుకొని బయటికి వెళ్ళినది . వేరే వాకిలి నుండీ దేవరాతుడు లోపలికి వచ్చినాడు . ఆచార్యుడు కొడుకు కుడి భుజమును ముట్టుకొని , " సరస్వతీ దేవి నీకు మేధను ఇవ్వనీ , ఇంద్రుడు నీకు మేధను ఇవ్వనీ " అను అర్థము వచ్చు మంత్రమును ఉచ్చరించినాడు . బిడ్డతల్లిని ఉద్దేశించి , " అరుంధతీ సమానురాలా, నువ్వు స్తోత్రములు చేయుటకు పాత్రురాలవు . వీర పుత్రుని పొందిన ఓ వీరమాతా , నీకు మంగళమగు గాక " అని అభినందించినాడు . 


         అక్కడనుండి వెళుతూ ,’ నేనిక స్నానము చేస్తాను . కొడుకు పుట్టగానే నిలుచున్నవాడు నిలుచున్నట్టే నీటిలో దుముకి స్నానము చేయవలెనంట . ఆ నీరు ఎంతగా పైకి ఎగసిపడితే అంత అక్షయమైన లోకములు పితృ దేవతలకు దొరికి మా పితృ ఋణము తీరునంట. నువ్వు ఇప్పుడు బిడ్డకు స్తన్యము నిచ్చునపుడు మరచిపోకుండా సరస్వతిని ధ్యానించు , " హే సరస్వతీ దేవీ , సర్వ ప్రాణులకూ అన్న ప్రదాతయైనది నీ స్తనము . రత్నములనూ , ధనమునూ అధికముగా ఇచ్చునది నీ స్తనము . దేవతలందరికీ రక్షణనిచ్చునది నీ స్తనము . దానిని ఈ బిడ్డకు కూడా ఇవ్వు" అని ఆమెను ధ్యానించి , బిడ్డకు స్తన్యమునివ్వు ’ అని నిర్దేశించి బయటికి వచ్చినాడు . 


         అతడు ఇవతలికి వచ్చిన తరువాత జాయంతీ , మంత్రసానులు మరలా వచ్చి బిడ్డకు వెచ్చటి నీరు ఇచ్చి , నాళమును కత్తరించి , చేయవలసినదంతా చేసి , బిడ్డకు స్తన్యపానము చేయించి తల్లీ బిడ్డలను నిద్రపుచ్చారు . 


         ఇక్కడ ఆచార్యుడు స్నానము చేసి లోపలికి వచ్చు వేళకు రాజ భవనము నుండీ రాజ పురోహితుడు , రాజ పురుషునితో పాటూ వచ్చినాడు . రాజ పురోహితుడు లోపలికి వస్తూనే ఆచార్యుడు ఎదురేగి " రండి రండి , రాజ పురోహితులు దయ చేయవలెను " అని స్వాగతము చెప్పినాడు . భార్గవుడు , ’ రథములో రాజపురుషుడు వచ్చినాడు . అతడిని రమ్మనండి ’ అన్నాడు . ఆచార్యుడు నీరుకారుతున్న శిరోజములను పిండుకుంటూ , " నాకోసము ఆపని మీరు చెయ్యండి , నేను మడి బట్ట కట్టుకొని వస్తాను ’ అని లోపలికి వెళ్ళినాడు . 


         అతడు బయటికి వచ్చువేళకు రాజ పురుషుడూ , పురోహితుడూ ఒక గదిలో కూర్చొనియున్నారు . ఇద్దరూ ఆచార్యునికి వందనము చేసి రాజాజ్ఞను తెలిపినారు : ’ శిశు జననమైన తర్వాత చేయవలసిన కర్మల నన్నిటినీ ఏ శంకా లేకుండా వైభవముగా జరిపించి రాజాశీర్వాదము చేయవలెనని మీకు చెప్పి రమ్మని మహారాజు మా ఇద్దరినీ పంపించినాడు " 


         ఆచార్యుడు , " ఇంట సుఖప్రసవమై పుత్ర జననమయినది . రాజాజ్ఞ ప్రకారము ఏ లోపమూ లేకుండా సర్వమునూ క్రమముగా జరిపించెదము . మేము చేయు ప్రతియొక్క కర్మ వలననూ మహారాజులకు నిస్సందేహముగా శ్రేయస్సు కలుగును అని వారికి తెలపండి . నేను సకాలములో వచ్చి దర్శనము చేసుకొనెదను " అన్నాడు .

సత్సంగం

 🔔 *సత్సంగం* 🔔


🙏🪷మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.


🙏🪷దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి…


*🙏శ్లో:"అనాయాసేన మరణం*

*వినా దైన్యేన జీవనం*

*దేహాంతే తవ సాన్నిధ్యం*

*దేహిమే పరమేశ్వరం."*


*🙏"అనాయాసేన మరణం"🙏*


🙏🪷నాకు నొప్పి లేక బాధ  లేని

మరణాన్ని ప్రసాదించు.


*🙏"వినా ధైన్యేన జీవనం"🙏*


🙏🪷నేను ఎవరి మీదా ఆధారపడకుండా,నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.


*🙏"దేహాంతే తవ సాన్నిధ్యం"🙏*


🙏🪷మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేనునిన్ను దర్శించుకునే విధంగా దీవించు. 


*🙏"దేహిమే పరమేశ్వరం"🙏*


🙏🪷ఓ భగవంతుడా నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.


🙏🪷1. అనుక్షణం నీ ప్రార్ధనలోనే గడిపే విధముగా అనుగ్రహించు. నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.


🙏🪷2. ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ .... నా బిడ్డలకు కానీ ...సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను, కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.


🙏🪷3. నాకు ఎప్పుడూ కూడా నీవు    సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.


🙏🪷ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాదిస్తాడని మరువకండి.


🙏🪷దీనినే ‘ *దర్పణ దర్శనం’* అంటారు, మనస్సనే దర్పణంలో  దర్శించి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహరాకాశాన ప్రతిష్టించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ.

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

మనందరికీ తెలిసిన పేర్లే

 సంస్కృత పేర్లు కాబట్టి ఇవి ఏవిటో అనుకుంటున్నాం కానీ, 

వీటి పేర్లు మన వాడుక భాషలో మనందరికీ తెలిసిన పేర్లే అండి 👍


మాచీ పత్రం అంటే చేమంతి ఆకులు,

దూర్వా పత్రం అంటే గరిక,

అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకులు,

దత్తూరపత్రం అంటే ఉమ్మెత్త ఆకులు,

బిల్వ పత్రం అంటే మారేడు దళాలు,

బదరీ పత్రం అంటే రేగు చెట్టు ఆకులు,

చూత పత్రం అంటే మామిడి చెట్టు ఆకులు,

కరవీరపత్రం అంటే గన్నేరు ఆకులు,

మరువక పత్రం అంటే మనం పూలకుండీల్లో పెంచుకునే మరువం & ధవనం, 

శమీ పత్రం అంటే జమ్మి చెట్టు ఆకులు,

సింధువార పత్రం అంటే వావిలి ఆకులు, నీళ్లలో మరిగించి ఆ నీళ్ళతో స్నానం చేస్తే body pains తగ్గుతాయి అని విన్నాం కదా అవేనండి వావిలి ఆకులు, 

అశ్వత్ధ పత్రం అంటే రావిచెట్టు ఆకులు,

దాడిమీ పత్రం అంటే దానిమ్మపళ్ళ చెట్టు ఆకులు, 

జాజి పత్రం అంటే సన్నజాజి, మల్లి, మొదలైన ఆకులు, 

అర్జున పత్రం అంటే మద్ధిచెట్టు ఆకులు, 

అర్క పత్రం అంటే జిల్లేడు ఆకులు 

ఇలా ఇవన్నీ మనకు తెలిసిన పేర్లే అండి,

చాలా వరకూ ఈ పత్రులు దొరుకుతాయి అండి 👍

వినాయక చవితి ముందురోజున 

కూరగాయల మార్కెట్ లో 

ప్రత్యేకించి ఈ పత్రులు  అమ్ముతారు అండి 👍


హరహరమహదేవ 🙏🙏