17, నవంబర్ 2022, గురువారం

రామాయణానుభవం_ 216*

 *రామాయణానుభవం_ 216* 


[ _శ్రీ రాముడు శివలింగాన్ని ప్రతిష్టించలేదు.

వాల్మీకి అలా దర్శనం చేసి అక్షర రూపం గా రాయలేదు_ 


పుష్పకవిమానం లో లంక నుండి బయలుదేరినపుడు సీతమ్మ కు జరిగిన విషయాలను స్థలాలను చూపుతూ రాముడు మాట్లాడుతున్న సందర్భం లో.......


*అత్ర పూర్వం మహాదేవః ప్రసాద మకరోత్ ప్రభుః ॥* 

*అత్రరాక్షసరాజోఽయ మాజగామ విభీషణః ||*


ఇట్లు లంకానగరమును మొదలుపెట్టి సేతుబంధము వరకు చూపెట్టి చెప్పి, అటు పిమ్మట ఉత్తర తీరమునందు దర్భశయన స్థాననమును నిర్దేశించి చూపుచున్నాడు;

ఇక్కడ రెండు విషయాలు పూర్వం జరిగినవి చెబుతూ.....


సముద్రజలాధి పతి అయిన సముద్ర రాజు నన్ను అనుగ్రహించిన స్థలం ఇది....


ఇక్కడే రాక్షస రాజు విభీషణుడు నా వద్దకు వచ్చి శరణాగతి చేస్తే ఆనుగ్రహించాను.....


శరణాతి చేస్తే రక్షించడం నా ధర్మమని  నువ్వే చెబుతుంటావు కదా....


ఇచ్చట “_మహాదేవః = మహాదేవుడు_', అని ఔచిత్యము వలన సముద్రరాజు చెప్పబడుచున్నాడు; కాని, 'శివుడు' కాదని తెలియవలెను; ప్రభుః = ప్రభువైన; సముద్ర జలమునకు అధిష్టాతయైన; మహాదేవః = సముద్రరాజు, ప్రసాదం = (నాకు), ప్రసన్నతను, (అనుగ్రహమును), 

అకరోత్ = చేసెను;


*"చాపమానయసొమిత్రే శరాంశ్చాశీ విషోపమాన్ | సాగరం శోషయిష్యామి"* 


లక్ష్మణా! ధనుస్సును, సర్పములతో సమానములైన భాణములను తెమ్ము, సముద్రమును ఎండింపజేయగలను; యుద్ధ సర్గ 21, శ్లో. 22) అని కోపించిన నన్ను అనుగ్రహించెను; (కోపించిన నాకు సముద్రుడు ప్రసన్నుడయ్యెను-అని అర్ధము; 'ప్రసాదస్తు ప్రసన్నతా”- (ప్రసాదము, ప్రసన్నత-ఈ రెండు శబ్దములు నైర్మల్యమునకు, ప్రసన్నమగుటకు వర్తించును అని *అమరము కాని మహాదేవుడనగా ఇచ్చట రుద్రుడని అర్ధము కాదు;*


విరోధ భావము అని ఒకటి ఉన్నది....


అత్ర అనే పదం పూర్వము జరిగిన విషయాలు చెబుతున్నాడు......శివ లింగ ప్రతిష్ట అన్నది జరిగిన విషయాలకు ఇది విరోధ  భావం అనే దోషం అపాదించ బడుతుంది.


'పూర్వము' అనుదానికి "పూర్వ కల్పము”- అని అర్థము కాదు, అని చెప్పదగినది; 

“ఆత్మానం మానుషమన్యే (నన్ను మనుష్యునిగా భావించుకొనుచున్నాను అని చెపుకొనుచున్నవానిచేత, సుగ్రీవుడు మొదలగు వారి సమక్షమందు, "తాను విష్ణువుయొక్క అవతారము" అని సూచించుటతో పూర్వవృత్తమును బహిర్గతము చేయుట ఔచిత్యము కాకపోవుట వలనను; 

పూర్వ కల్పమునందు చేయబడిన సేతువు ఉండినదగుచుండగా, మరల దానిని నిర్మాణము చేయుట నిరుపయోగమగుట వలనను తిరిగి వచ్చునపుడు పరమశివుడు అనుగ్రహించినాడనుట యుకుదురదు; 

ఇంతే కాకుండ, ఇచ్చట *'ఇతి'- అనుపదము, పూర్వ శ్లోకమునందు చెప్పబడినట్లు, నలునిచే చేయబడిన, సేతువును పరామర్శించుటయే ఉచితమైనది,* కాని పూర్వకల్పమునందు చేయబడిన సేతువును పరామర్శించుట కాదు; అది ఉన్నను కూడ నశించినదని అనుట సంభవమగును.


అయితే వేరొక పురాణానుసారముగ శివలింగ ప్రతిష్ఠ అర్థ పరమనుట యుక్తము; కూర్మ పురాణమునందు తెలుప బడింది.


ఇటువంటి పురాణ వచనముల ననుసరించి, "అత్రపూర్వం మహాదేవః ప్రసాద మకరోత్ ప్రభుః "-అను ఈ శ్లోకము లింగప్రతిష్ఠను తెలుపుచున్నది; అని కొందరు చెప్పుదురు; *కాని ఆమాట అయుక్తము;* ఏలననగా, పైన చెప్పబడినట్లు దోషములు అధికముగా నున్నవి;


 పురాణములకంటే ఇతిహాసమే ఎక్కువగా ఆదరింపదగినది, గ్రంథ సౌష్ఠవము వలనను, *పురాణము కంటే ఇతిహాసమే పరిగ్రహింపదగినది* అని చెప్పబడుచున్నది. _"ఇతిహాస పురాణం పంచమం"_ - (నాలుగు వేదములు; ఐదవది ఇతిహాస పురాణములు) 


ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ (ఇతిహాపురాణములతో వేదమును విశదీకరించవలెను) అని మొదలగు వానియందు, పురాణ శబ్దముకంటే ఇతిహాస శబ్దము అధికాక్షరములు గలదైనప్పటికిని "ఇతిహాస పురాణాభ్యాం" - అని "ఇతిహాసపురాణం” అని *సమాసమునందు మొదట ప్రయోగించుట వలనను*; పురాణములకంటె ఇతిహాసము మిక్కిలి ఆదరింపదగినదగుట వలనను,


 ఇతిహాసము పురాణములకంటే గొప్పనైనది. ఇంతేకాకుండ, వేదః ప్రాచేత సాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా ॥ (వేదమే ప్రాచేతసుడైన వాల్మీకి నుండి సాక్షాత్తుగా రామాయణ రూపమున నవతరించినది) అని శ్రీరామాయణము వేదమే అని చెప్పబడుచుండుట చేతను; చతుర్ముఖ బ్రహ్మయొక్క వరప్రదాన మూలముగా విరచితమైనదగుట చేతను పురాణముల కంటె మిక్కిలి ప్రబలమైనది శ్రీరామాయణము; కావున వాల్మీకి రామాయణ విషయముతో పురాణ విషయమునకు విరోధము కలిగినప్పుడు తామస పురాణ వచనములు ప్రమాణములు కావు;


 ఇంతేకాకుండ; పురాణములు _“సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశోమన్వంత రాణి, వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం_ , (సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరములు, వంశానుచరితము అని ఐదు లక్షణములు గలది పురాణము) అని సర్గ ప్రతిసర్గాదులలో వంశానుచరితము ఇతిహాసమువలే పురావృత్త కథనము నందు (పూర్వము జరిగిన కథను ఉన్నదున్నట్లు చెప్పుటయందు) ప్రధాన తాత్పర్యము గలది పురాణముకాదు; 


*కావున ఇచ్చట శ్రీరాముడు లింగ ప్రతిష్ఠ చేసినాడనుటకంటె, మహాదేవుడైన సముద్రుడు అనుగ్రహించినాడనియు చెప్పుటయే సమంజసము.*


పై వ్యాసం వాల్మీకి రామాయణం కు అతి ప్రాచీన సంస్కృతవ్యాఖ్యానమైన గోవిందరాజీయం అనుసరించి మరియు పూర్వాచార్యులు అనుగ్రహ భాషణం మేర అందించడం జరుగుతోంది.]

** 


శ్రీరాముడు పుష్పకవిమానాన్ని భరద్వాజాశ్రమ ప్రాంతంలో దింపాడు. పదునాల్గు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. సరిగ్గా ఆ రోజు పంచమి. రఘువీరుడు భరద్వాజమహర్షి దర్శనం చేసుకుని భక్తితో నమస్కరించాడు. "మహర్షీ! రాజ్యంలో ప్రజలంతా క్షేమంగా సుభిక్షంగా ఉన్నారా? భరతుడు ప్రజాపరిపాలన సబబుగా సాగిస్తున్నాడా ! మా తల్లులు కుశలమే కదా !" - రాముడు ప్రశ్నల వర్షం కురిపించాడు.


 మహర్షి సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ అనునయంగా పలికాడు.


*పంకదిగ్ధస్తు భరతో జటిల స్వాం ప్రతీక్షతే* | *పాదుకే తే పురస్కృత్య సర్వం చ కుశలం గృహే* ॥


రఘువరా ! బురదలో కూరుకుపోయిన భరతుడు నీ పాదుకలను తదేకదీక్షగా అర్చిస్తూ జడలు పెంచుకొని నీ రాకకోసం ఎదురుచూస్తున్నాడు. ఇంక ఇంటిలో అందరూ కుశలమే.


నారచీరలు కట్టుకొని భార్యా సమేతుడవై లక్ష్మణుడితో నీవు ఆనాడు వచ్చినప్పుడు చూసి నేనెంతగానో మనసులో బాధపడ్డాను, దుఃఖించాను. కానీ ఇప్పుడు మిత్రపరివారంతో శత్రువిజయంతో క్షేమంగా తిరిగి వచ్చిన నిన్ను చూస్తూంటే ఒక దివ్యమైన ఆనందానుభూతి కలుగుతోంది. నాయనా! 


వనవాసంలో నీవు పడ్డ కష్టాలూ సుఖాలూ అన్నీ నాకు తెలుసు. రావణాసురుడు సీతను అపహరించడం మొదలుగా ఖరదూషణ మారీచాది సంహారమూ, సుగ్రీవమైత్రి, సేతుబంధనం, రావణ సంహారం అన్నీ నాకు తెలిసాయి. 

*మిత్రానీ ధన ధన్యాని ప్రజానాం సమ్మతానివ* |

*జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ*

ఈ ప్రపంచంలో స్నేహితులు, సంపద మరియు ధాన్యాలు చాలా గౌరవించబడతాయి. తల్లి మరియు మాతృభూమి స్వర్గం కంటే కూడా చాలా గొప్పవి.

అటుపైని దేవతలు అంతా ప్రత్యక్షమై వరాలు ఇవ్వడం కూడా ఎరుగుదును. 


ఇప్పుడు నేనూ ఒక వరం ఇస్తాను. దశరథాత్మజా ! ఈ పూట ఇక్కడ ఉండి అర్ఘ్యం స్వీకరించి రేపు అయోధ్యకు వెళుదువుగాని.


రాముడు మరి మాట్లాడకుండా సరే అని శిరసావహించి - మహర్షీ! ఇక్కడినుంచి అయోధ్యవరకూ మార్గంలో చెట్లన్నీ కాలం కాని కాలం అయినప్పటికీ ఫలాలతో నిండిపోయి ఉండాలి. ఇదేనేను కోరుకునే వరం అన్నాడు. 

అంతే మరుక్షణంలో ఆశ్రమ ప్రాంతంలోనూ కనుచూపుమేర మార్గంలో అద్భుతమైన ఫలసంపదతో నిండిపోయాయి. మూడు యోజనాల దూరమూ ఇలాగే ఉంది. రాక్షసులూ వానరులూ యథేచ్ఛగా ఆ ఫలాలను ఆరగించారు.


అటు పై ఏకాంతంగా కూర్చుని అయోధ్యానగరం వైపు చూస్తూ శ్రీరాముడు ఆలోచనలో పడ్డాడు. ఆంజనేయుణ్నిపిలిచాడు.


హనుమా ! శృంగబేరపురం వెళ్ళి నిషాదాధిపతియైన గుహుణ్ని సందర్శించినా మాటగా కుశలం అడుగు. నా క్షేమవార్త అందించు. అతడు పరమానందభరితుడవుతాడు. నాకు ఆత్మీయుడు. 


అయోధ్యకు మార్గం ఉపదేశిస్తాడు. భరతుడి ప్రవృత్తిని గురించికూడా చెబుతాడు. 

*అయోధ్యాయాశ్చ తే మార్గమ్ ప్రవృత్తిం భరతస్య చ* |

*నివేదయిష్యతి ప్రితో నిషాదధిపతిర్గుహః*


అటునుంచి నందిగ్రామం వెళ్ళి భరతుడికి నా కుశలవార్తనూ, సీతా లక్ష్మణులతో క్షేమంగా తిరిగి వచ్చిన విషయాన్నీ తెలియజెయ్యి. రావణ సంహారాన్నీ, వాలి వధనూ, సుగ్రీవ మైత్రినీ, మొత్తం జరిగిన వృత్తాంతం అంతా యథా క్రమంగా చెప్పు. బ్రహ్మరుద్రాదులిచ్చిన వరాలగురించీ, దివ్యవిమానంలో మా తండ్రి దశరథుడు ప్రత్యక్షమైన విషయమూ, చెప్పిన మాటలూ అన్నీ వివరించు. రాక్షసరాజైన విభీషణుడితో, వానరరాజైన సుగ్రీవుడితో నేను వచ్చి భరద్వాజాశ్రమంలో ఉన్న సంగతి స్పష్టంచెయ్యి. ఇదంతా వింటున్నప్పుడు భరతుడి ముఖ కవళికల్లో వస్తున్న మార్పులు గమనించు.

*ఏతచ్ఛ్రుత్వా యమకారం భజతే భరతస్తథాః* |

*స చ తే వేదితవ్యాః స్యత్సర్వం యచ్ఛాపి మాం ప్రతి*


*సర్వకామ సమృద్ధం హి* *హస్త్యశ్వరథసంకులమ్* । 

*పితృ పైతామహం రాజ్యం కస్య నావర్తయే న్మనః* |


*సంగత్యా భరతః శ్రీమాన్ రాజ్యార్థి చేత్ స్వయం భవేత్* | *ప్రశాస్తు వసుధాం కృత్స్నా మఖిలాం రఘునందనః*


సమస్త భోగాలకూ ఆలవాలమై సమృద్ధమై పితృపైతామహక్రమాగతమైన రాజ్యం ఎంతటివాడి మనసునైనా ప్రలోభపెడుతుంది. కాబట్టి రాజ్యాధికార - రాజభోగ సాంగత్యం వల్ల భరతుడు ఒకవేళ రాజ్యకాంక్షకు లోనయ్యుంటే అతడే ఏలుకుంటాడు. సమస్త సామ్రాజ్యాన్నీ అతడి ఏలుబడికే వదిలేస్తాను.  భరతుడి మనసులోని ఆలోచనలూ అభిప్రాయాలూ ఆశలూ గ్రహించి నీవు ఇక్కడున్నట్టు తిరిగిరావాలి. మేము బయలుదేరి  అక్కడికి రాకముందే నీవు ఎదురువచ్చి మమ్మల్ని కలుసుకోవాలి.

*తస్య బుద్ధిం చ విజ్ఞాయ వ్యవస్థాయాం చ వానర* |

*యవన్నా దూరం యాతః స్మః క్షిప్రమాగంతుమర్హసి*

[17/11, 4:37 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 217* 


-రామాజ్ఞను స్వీకరించి హనుమంతుడు  శృంగబేరపురం చేరి గుహుడికి రామాగమనవార్త అందించి ఆనందింపజేసి ఫలపుష్ప సంభరితమై అలరారుతున్న నందిగ్రామం చేరుకున్నాడు. 


అయోధ్యకు ఒక క్రోశమాత్రం దూరంలో ఆ గ్రామం ఉంది. అక్కడ కృష్ణాజినాంబరధారియై దీనవదనంతో, జడలుగట్టిన తలతో, స్నాన సంస్కారాదిరహితమైన శరీరంతో, కందమూలఫలాశనంతో, ఇంద్రియ నిగ్రహంతో, బ్రహ్మర్షి తేజస్సుతో, తాపసుడుగా ఉన్న భరతుణ్ని చూసాడు. పాదుకలు ముందుంచుకొని రాజ్యపాలన సాగిస్తున్న వైనం గుర్తించాడు. అతడి అమాత్యులూ, మంత్రులూ, సేనాధిపతులూ అందరూ కాషాయాంబరధారులయ్యే ఉన్నారు. అంతా సమగ్రంగా గ్రహించిన ఆంజనేయుడు భరతుణ్ని సమీపించి......


ఆర్యా! నీకు ప్రియం తెలియజేస్తున్నాను. దారుణమైన ఈ శోకం విడిచిపెట్టు. ఎవరికోసం నీవు ఇంతకాలంగా ప్రతీక్షిస్తున్నావో ఆ రామునితో, నీ అగ్రజునితో, ఈ క్షణంలో నీవు కలిసి ఉన్నావు. రావణ మహారాక్షసుణ్ని సంహరించి, సీతాదేవిని పరిగ్రహించి, లక్ష్మణ సమేతుడై శ్రీరాముడు తిరిగి వచ్చాడు.


అని విన్నవించగానే పట్టరాని ఆనందంతో, హర్షాతిరేకంతో భరతుడు సొమ్మసిల్లి పడిపోయాడు. క్షణంలో తేరుకొని ఆంజనేయుణ్ని గట్టిగా కౌగిలించుకొని ఆనందబాష్పాలతో అభిషేకించాడు. నీవు దేవుడవో మానవుడవో కానీ నాకు ఇంతటి ప్రియమయిన వార్త అందించావు.


ఎన్నో సంవత్సరాల తరువాత నా ప్రభువు (కుశల) వార్తను విన్నాను.


*కళ్యాణీ బత గాధేయం లౌకికీ ప్రతిభాతి మే* | *ఏతి జీవంత మానందః నరం వర్షశతా దపి*


జీవించి ఉంటే నూరేళ్ళకయినా ఒక శుభవార్తను వినవచ్చు. (ఈ శుభప్రదమైన గాధ అదే చెబుతోంది)


తపస్విజనులు కూర్చునే బ్రుని అనే ఆసనంమీద మారుతిని కూర్చోబెట్టి సవిస్తరంగా అన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఉత్సుకతతో ఆనందంతో విన్నాడు. దేవతలు వరాలు కురిపించగా పుష్పకారూఢుడై మిత్ర పరివార సహితంగా విచ్చేసి శ్రీరాముడు భరద్వాజాశ్రమంలో విడిదిచేసాడని హనుమంతుడు అంతా వివరించాడు. గంగా తీరానికి తిరిగి వచ్చి ముని సన్నిధిలో ఈ రోజు గడుపుతున్న శ్రీరాముణ్ని రేపు పుష్యయోగ సమయంలో నీవు దర్శించడం సముచితంగా ఉంటుందని చెప్పి ముగించాడు.


భరతుడు ఆనందపరవశుడై ఇంతకాలానికి నా కోరిక నెరవేరింది అంటూ శత్రుఘ్నుణ్ని చూసి అయోధ్యాపట్టణాన్ని సర్వాంగసుందరంగా ద్వార తోరణాలతో జెండాలతో ముత్యాల ముగ్గులతో అలంకరింపజెయ్యమనీ, సర్వదేవతలకూ అర్ఘ్యపాద్యాలూ, నైవేద్యాలు సమర్పింప జెయ్యమనీ, 

సూతులూ పౌరాణికులూ వైతాళికులూ వివిధ వాద్య నిపుణులూ నటీమణులూ అంతా రేపు సిద్ధంగా ఉండేట్టు ఏర్పాట్లు చెయ్యమని ఆజ్ఞాపించాడు. 


మార్గంలో ఎత్తుపల్లాలు సరిచేయించు. చల్లని నీటితో కళ్ళాపు చల్లించు. లాజలతో పువ్వులతో రకరకాల ముగ్గులు వేయించు. వీథివీథినీ పతాకాలతో అలంకరింపించు. ఇంటింటికీ ఎత్తయిన జెండాలు ఎగురవేయించు. రాజమార్గం అంతా పూలదండలతో ఆచ్ఛాదించి, పూలబాటగా తయారుచేయించు. ఇదంతా రేపు సూర్యోదయ సమయానికి సిద్ధం అవ్వాలి. రాజకాంతలూ అమాత్యులూ, సేనాపతులూ, దండనాయకులూ, పండిత ప్రకాండులూ, వేదవిదులూ అందరూ రేపు బయలుదేరాలి. ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు ఈ మంత్రులంతా గజసైన్యంతో నడవాలి. 


తక్కినవారు రథబలంతో ఆశ్వికదళంతో - తరలి వెళ్ళాలి. చతురంగబలాలన్నీ వెయ్యి వెయ్యిగా నియమించు. ఆవెనుక మాతృమూర్తులు ముగ్గురూ పల్లకీలలో వస్తారు. అశ్వహేషలతో, గజఘీంకారాలతో రథనేమి స్వనంతో మంగళతూర్యారావాలతో భూనభోంతరాళాలు మారుమ్రోగేట్టు మనమంతా ఎదురు సన్నాహం వెళ్ళాలి. వెల్ల గొడుగు, తెల్లని వింజామరలూ పూలదండలూ సమస్త రాజలాంఛనాలూ సిద్ధం చేయించు.


ఇలా హడావిడిగా భరతుడు అందరికీ ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. ఎవరి పనులకు వాళ్ళు వెంటనే తరలి వెళ్ళిపోతున్నారు......


** 


రథ, గజ, తురగాలపై రాజపరివారము సీతారామలక్ష్మణులకు స్వాగతం చెప్పడానికి మంగళవాద్యాలతో, భేరీ ధ్వనులతో, జయజయధ్వానాలతో నందిగ్రామం వెలుపలికి బయలు దేరారు.


భరతుడు శ్రీరాముని పాదుకలను శిరస్సుపై ఉంచుకొని బయలుదేరాడు. పూలు, పూజాద్రవ్యాలు, ఫలాలు, లడ్డూలు గైకొని పురజన, మంత్రి, సామంత పురోహితులు బయలు దేరారు.


ఛత్ర, చామరాలతో, వాల వ్యజనాలతో (విసన కఱ్ఱలతో) శత్రుఘ్నుడు సపరివారంగా బయలుదేరే సమయానికి వానరమహాసైన్యం గంగానదిని దాటుతున్న కోలాహలం వినవచ్చింది. ఇసుక తిన్నెలనుంచి ధూళి- మేఘాలై ఆకాశంలోకి లేచింది. అంతలోకీ ధగధ్ధగాయమానంగా మెరిసిపోతూ పుష్పకవిమానం కనిపించింది. సీతారామలక్ష్మణులూ, సుగ్రీవుడూ కనిపించారు. 


*తతో హర్షసముద్భూతో నిస్వనో దివ మస్పృశత్* , *స్త్రీబాలయువవృద్ధానాం రామోజయ మితి కీర్తితే*


అంతే స్త్రీ బాలవృద్ధుల జయ ధ్వానాలు - మహా సముద్ర తరంగ ఘోషలాగా మిన్నుముట్టాయి. 

అందరూ ఆకాశంలోకి చూస్తున్నారు. రాముణ్ని చూస్తున్నారు. రెప్పవేయకుండా ఆత్రంగా రామచంద్రుణ్ణి చూస్తున్నారు.


ఎన్ని సంవత్సరాల ఎదురు చూపుల ఫలమిది! ఎన్ని సంవత్సరాల తపః ఫలమిది! హంసలు వహిస్తున్న పుష్పకవిమానం పుడమిపై వాలింది. పరుగు పరుగున భరతుడు గోవు దగ్గరికి వెళ్లే దూడలాగా రామచంద్రస్వామి దగ్గరకు వెళ్లాడు. శ్రీరాముడింకా విమానం దిగనే లేదు. భరతుడు ఒక్కసారి రాముని పాదాలపై వాలాడు. తన పవిత్రమైన కన్నీటితో రాముని శ్రీపాదాలను కడుగుతున్నాడు. ఆ పాదాలను గట్టిగా పట్టుకొన్నాడు. ఆయనకు ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న పెన్నిధి లభించింది. తాను వదిలితే ఆ పెన్నిధి మళ్లీ ఎక్కడ దూరమవుతుందో అనే భయం కలిగింది.


ఇంత కాలం నుండి తాను అనుభవిస్తున్న దుఃఖమంతా పొంగి పొంగి పైకి వస్తున్నది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. గొంతు బొంగురు పోయింది. అతికష్టము మీద “అన్నా” అని అని అనగలిగాడు.


కొంతసేపటికి శ్రీరామచంద్రుడు భరతుని తన చేతులతో లేవనెత్తాడు. తన తొడపై కూచోబెట్టుకొన్నాడు ఆయన బుగ్గలను నిమిరాడు. ఆయన శరీరాన్నంతా తడిమాడు.


మహాత్ముడైన భరతుడు తేరుకొని లక్ష్మణుని కౌగిలించి, సీతాదేవికి నమస్కరించి, సుగ్రీవ, జాంబవదంగదులను ఆదరించాడు.


*త్వ మస్మాకం చతుర్ణాం తు భ్రాతా సుగ్రీవ పంచమః* । *సౌహృదా జ్జాయతే మిత్ర మపకారోరి లక్షణమ్*


విభీషణుని చేరదీసి, "మహాత్మా! దురాత్ముడైన స్వంత సోదరుని విడిచి, ధర్మాత్ముడైన మా అన్నకు తోడయ్యావు. నీ అనన్య సహాయంతోనే రఘు కుల సంభవుడు ధర్మ సంస్థాపన చేయగలిగాడు" అని ప్రశంసించాడు.


శత్రుఘ్నుడు కూడ భరతునితో పాటు సీతా రామ లక్ష్మణుల పాదారవిందాలకు ప్రణమిల్లాడు.


అప్పుడు రఘురాముడు విమానం దిగి, తన తల్లి కౌసల్యాదేవి దగ్గరకు వెళ్లి, "తల్లీ! నీ మాట వినక, నిన్నొంటిరిగా వదలి, అడవులకు వెళ్లిన నీ కొడుకును క్షమించుమని” ఆమె పాదాలకు ప్రణమిల్లాడు. మిగిలిన తల్లుల కాళ్లకు నమస్కరించాడు. కులగురువైన వశిష్ట మహర్షి పాదాంబుజాలకు ప్రణమిల్లాడు.


పౌరులందరు “శ్రీరామచంద్రా! మా తండ్రీ!" నీకు స్వాగతము, సుస్వాగతమని” చేతులు జోడించారు.


అప్పుడు భరతుడు అంతవరకు “రాజప్రతినిధులుగా ఉన్న రామ పాదుకలను తెచ్చి, అన్నా! ఇంతవరకు ఇదిగో నీ పాదుకలే సింహాసనాన్ని అలంకరించి, రాజ్యాన్ని పాలించాయి. ఇప్పుడు నీవే స్వయంగా పాలించడానికి వచ్చావు. కనుక వీటిని నీ పాదారవిందాలకు ధరించుమని రాముని కాళ్లకు తొడిగాడు.


శ్రీరామచంద్రుడు పుష్పకవిమానాన్ని కుబేరుని వద్దకు పంపివేశాడు. ఆయన భరతుని నివాసమైన ఆశ్రమానికి వెళ్లాడు......

[17/11, 4:37 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 218* 


రామ పాదుకలను సమర్పించిన భరతుడు గంభీరం గా మాట్లాడుతున్నాడు....


మహావీరా! ఈ రాజ్యభారాన్ని వహించడానికి నీవొక్కడవే సమర్థుడవు. దీనిని మా తల్లి నాకు అప్పగించింది. నేను నీకు అప్పగించాను. కాదని నీవు మళ్ళీ నాకు అప్పగించావు. ఇప్పుడు తిరిగి మళ్ళీ నీకు అప్పగించాను.


*జగ దద్యాభిషిక్తం త్వామనుపశ్యతు సర్వతః* ॥ *ప్రతపంత మివాదిత్యం మధ్యాహ్నే దీప్త తేజసమ్*


ఈ రాజ్యాన్ని నీవు పరిపాలించకపోతే, అందుకు అంగీకరించకపోతే అది పెంచిన చెట్టు పుష్పించిందే కానీ ఫలించలేదు అన్నట్టుగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో ప్రచండ సూర్యుడులాగా పట్టాభిషిక్తుడవై ప్రకాశిస్తున్న నిన్ను ఈ ప్రజలంతా ఈ రోజు చూడాలి.


*యావ దావర్తతే చక్రం యావతీ చ వసుంధరా* |

*తావత్త్వ మిహ సర్వస్య స్వామిత్త్వ మనువర్తయ* ॥


సూర్యచంద్రులు ఉన్నంతకాలం, ఈ భూమి ఉన్నంతకాలం నీవు ప్రభువుగా పరిపాలన సాగించు.


శ్రీరామచంద్రుడు భరతుని ప్రార్ధనను అంగీకరించి, రాజ్యపాలనకు అంగీకరించాడు. భరతునికి నెత్తిపై నుండి మోయలేని బరువును క్రిందకు దించినట్లయింది.


శత్రుఘ్నుని ఆజ్ఞ ప్రకారము మంగలివారు వచ్చారు. రామలక్ష్మణ, భరతులకు గడ్డాలు తీసి, మీసములు సవరించి క్షౌరము చేశారు.


ముందు భరతుని మంగళ స్నానము చేయుమని రఘురాముడు కోరాడు. ఆయన తరువాత మిగిలిన సోదరులు స్నానం చేశారు. ఆ తరువాత శ్రీరామభద్రుడు మంగళ స్థానం చేశాడు. రాముని తరువాత సుగ్రీవాదులు, విభీషణుడు మంగళ స్నానమాచరించారు


శత్రుఘ్నుడు శ్రీరామచంద్రస్వామికి, ఆ తరువాత మిగిలిన వారందరికి నూతన వస్త్రాలను సమర్పించాడు. అతిలోక సుందరుడైన స్వామి, మంగళస్నానము, నూతన వస్త్రాలంకారములతో సాటిలేని సహజకాంతితో ప్రకాశించాడు.


సీతాదేవికి, వానరాంగనలకు రాజమాతలు స్నాన, అలంకారాలను సమకూర్చారు. ఈ మధ్యలో అయోధ్యానగర వీధులను పరిమళ జలాలతో చల్లి, ముత్యాలతో ముగ్గులను పెట్టి ధ్వజతోరణాలతో అత్యంత నూతనంగా అలంకరించారు.


సుమంత్రుడు ఎంతో కాలం నుంచి తాను అనుకొన్న కోరిక తీరిందనే సంతోషంతో _రామచంద్రస్వామికి దివ్యరథాన్ని తెచ్చాడు. ఆకుపచ్చని గుఱ్ఱాలను కట్టిన ఆ రథాన్ని శ్రీరామచంద్రుడు మహేంద్రునివలె అధిరోహించాడు.


రాజవీధులందు రథముపై శ్రీరామభద్రుడు ఊరేగింపుగా వెళ్లాడు. భరతుడు రథాశ్వముల పగ్గాలను పట్టుకొని సారథ్యము చేశాడు. ఉత్తమమైన తెల్లని గొడుగును శత్రుఘ్నుడు రామునికి పట్టాడు. కైంకర్యములో తృప్తి పడని లక్ష్మణుడు ఒక చేత్తో విసన కఱ్ఱను పట్టుకొని, మరొక చేత్తో వింజామరను ధరించి వీస్తున్నాడు. విభీషణుడు కూడ తెల్లని వింజామరను చేతిలో ధరించి రామచంద్రస్వామికి వీస్తున్నాడు.


ఆకాశంలో దేవతలు, మహర్షులు నిలబడి స్తోత్రాలను వినిపిస్తున్నారు. సుగ్రీవుడు శత్రుంజయమనే మహా గజాన్ని ఎక్కి రామచంద్రుని రథము ప్రక్కనే వెళ్లుతున్నాడు.


నగరాలు, శంఖాలు, వీణానాదాలు, తూర్యాలు మంగళ ధ్వనులను కావిస్తున్నాయి. శ్రీరామభద్రునికి ఎదురుగా మంత్రి సామంత పురోహిత పౌరజానపదులు వచ్చి స్వాగతం పలికారు.


పసుపు పచ్చని అక్షతలను తీసికొని కన్యలు, బ్రాహ్మణులు గోవులతో సహా ముందు నడుస్తున్నారు.


రామచంద్రుడు సమీపంలో ఉన్నవారితో సుగ్రీవ స్నేహము, హనుమ కార్యదక్షతల గురించి ప్రశంసిస్తున్నాడు.


ఈ విధంగా ఊరేగింపుగా వెళ్లి దశరథ భవనం చేరుకొన్నాడు.

*


[ “ *యావదావర్తతే చక్రం*। *యావతీచవసుంధరా* ! *తావత్త్వమిహ సర్వస్య స్వామిత్వమనువర్తయ* ”


రామభద్రా! ఈ కాల చక్రము తిరుగుతున్నంత వరకు (నిరంతరం), ఈ భూమి ఉన్నంతవరకు (ఎల్లప్పుడు) ఈ జగత్తు సర్వానికి నీవే స్వామిగా ఉండాలి" అని ప్రార్థన చేసాడు భరతుడు.


ఈ శ్లోకము చాల ముఖ్యమైనది. ప్రతిరోజు ఉదయాస్తమయాలలో  స్వామిని ఉద్దేశించి ఈ ప్రార్థనను మనము చేయాలి.


శ్రీరామచంద్రస్వామి కాలచక్రము, నింగి, నేల, సూర్యచంద్రులు ఉన్నంతవరకు సకల జగత్తును పరిపాలించాలి. మనను కూడ స్వామే పరిపాలించాలి. మనము స్వామికి సంబంధించిన వాళ్లము (దాసులము) అయినప్పుడు మనను స్వామి పాలించవలసిందే. కదా! అప్పుడు "మనను పాలించుమని" ప్రార్ధించడం దేనికి? అంటే మనము చేతనులము కదా! కొంత జ్ఞానము కలవాళ్లము కదా! ఈ జ్ఞానముతో మనకు, స్వామికి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పుకొని, మనను పాలించుమని కోరాలి. అంటే సంబంధ జ్ఞానము వలన ప్రార్థన ఏర్పడుతుందన్న మాట!]

** 


తండ్రి భవనంలో ప్రవేశించి, తల్లులందరికి నమస్కారం చేశాడు రామభద్రుడు. సీతాలక్ష్మణులతో సహా,


అందమైన తన (రాముని) ఇంట్లో సుగ్రీవునికి విడిది ఏర్పాటు చేయుమని భరతునికి తెలిపాడు.


సుగ్రీవుడు వేగవంతులైన నలుగురు వానరోత్తములను పిలిచి నాలుగు సముద్రాల జలాలను తెమ్మని ఆజ్ఞాపించాడు. మరికొందరు దేశంలోని పుణ్యనదీ జలాలను తీసిక రావడానికి బయలు దేరారు.


గరుత్మంతునితో సమానమైన వేగంతో వెళ్ళి తూర్పు సముద్రంనుంచి సుషేణుడు,

దక్షిణ సముద్రంనుంచి ఋషభుడు, పశ్చిమ సముద్రంనుంచి గవయుడు, ఉత్తర సముద్రంనుంచి అనలుడు సువర్ణఘటాలలో జలం తెచ్చారు.


ఇక్ష్వాకుకుల బ్రాహ్మణుడైన వసిష్ఠుడు పలువురు వేదవేదాంగ వేత్తలయినపురోహితులతో కలిసి, సీతారాములను రత్నసింహాసనంమీద కూర్చోబెట్టాడు. మున్ముందుగా వసిష్ఠుడూ, తరువాత వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు వరసగా మంత్రపూరితమైన సుగంధసలిలాలతో పురుషోత్తముడైన శ్రీరాముణ్ని అభిషేకించారు. అటుపైని ఋత్విక్కులూ, కన్యలూ, మంత్రులూ, సేనాపతులూ ఆనందతరంగిత హృదయులై అభిషేకించారు.


శత్రుఘ్నుడు శ్వేత గొడుగు పట్టుకున్నాడు. సుగ్రీవుడు వింజామర వీసాడు. విభీషణుడు మరొకవైపు నిలిచి వింజామర సున్నితంగా వీచాడు..


ఆశుభసమయంలో అష్టదిక్పాలకులూ వచ్చి అనర్ఘరత్న ఖచితమైన దివ్యాభరణాలను బహూకరించారు. ప్రకృతి అంతా సుఖావహంగా సుగంధ పరిమళాలతో తన సంతోష పారవశ్యాన్ని ప్రకటించింది.


అభిషేకార్ధుడయిన శ్రీ రామచంద్రుడు గోవులను, గుర్రాలను, ఏనుగులను, బంగారు నగలను, ధన, కనక, రత్న, మణి, మాణిక్య, ముక్తా రాశులను దివ్యాంబరాలను ప్రజలకు విపులకు పంచిపెట్టాడు.


మణులూ రత్నాలూ పొదిగి చేసిన దివ్యహారాన్ని సూర్యకాంతులు వెదజల్లుతున్న దాన్ని సుగ్రీవుడికి స్వయంగా - సమర్పించాడు. వైడూర్యాలు పొదిగిన అంగదాలను అంగదుడికి తొడిగాడు. చంద్రజ్యోత్స్నలు విరజిమ్ముతున్న జాతి ముత్యాలహారం సీతాదేవి చేతికి ఇచ్చాడు. ఆ తల్లి ఇంకా మరికొన్ని ఆభరణాలు, దివ్యాంబరాలూ కలిపి పట్టుకొని భర్తవైపు చూసింది.


 “ *ప్రదేహి సుభగేహారం*। *యస్య తుష్టాసి భామినీ*। *పౌరుషం విక్రమో బుద్ధిః* *యస్మిన్నే తాని సర్వశః* ”


"సౌభాగ్యవతీ! ఎవ్వనిలో పౌరుషము, పరాక్రమము, సద్బుద్ధి మొదలైన సర్వ సుగుణాలు ఉన్నాయో? ఎవ్వరి వలన నీవు సంతోషాన్ని పొందావో, అటువంటి మహా పురుషునికి ఈ దివ్యహారాన్ని బహూకరించుమని” శ్రీరామచంద్రస్వామి తెలిపాడు.

అన్నీ ఆంజనేయుడికి బహూకరించింది.


తన కంఠంనుంచి విలువైన రత్నహారం తీసి వానరవీరులను చూస్తూ మాటిమాటికీ భర్తవైపు చూస్తోంది. ఆమె మనసు గ్రహించిన రాముడు "జానకీ! నీవు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో వారికి సమర్పించు. నీ ఇష్టం" అన్నాడు. ఆ మణిహారాన్నికూడా ఆంజనేయుడికే బహూకరించింది. ఆ ఆభరణం దాల్చి హనుమంతుడు ఎంతో గొప్పగా ప్రకాశించాడు.

*దదౌ స వాయుపుత్రాయా తంన హారమసితేక్షనా* |

*హనుమాంస్తేన హారేణ శుశుభే వానరర్షభః*

*చంద్రంశుచయగౌరేణ శ్వేత్భ్రేణ యథాచలః*


ఇల్లాగే ద్వివిద మైందులకూ సర్వవానరులకూ రాక్షసులకు ఋక్షవీరులకూ విలువైన బహుమానాలు వారి వారి కోరికలకు అనుగుణంగా రాముడు పంచిపెట్టాడు. విభీషణ, సుగ్రీవ, హనుమజ్జాంబవదాదులు యథోచితంగా గౌరవింపబడ్డారు. పూజింపబడ్డారు. అందరూ ఆనందంతో సంతృప్తితో శ్రీరామునికి- ఎవరికి వారు ప్రత్యేకంగా నమస్కరించి సెలవు తీసుకున్నారు. సుగ్రీవుడు కిష్కింధకు చేరుకొన్నారు.


" *లబ్ద్వా కులధనం రాజా! లంకాం ప్రాయాద్విభీషణః* ”

నీతిమంతుడు, ప్రఖ్యాత రాజైన విభీషణుడు కూడా తన జాతినిధిని పొందిన తరువాత, రాక్షసులలో అగ్రగామి వారిని అనుసరించి, లంకకు తిరిగి వచ్చాడు.


[ఇక్కడ విభీషణుడు పొందిన కులధనం అంటే ఏమిటి? శ్రీరాముని కులధనమా? విభీషణుని కులధనమా? శ్రీరాముని కులధనమంటే ఇక్ష్వాకు మహారాజు కాలం నుండి శ్రీరామచంద్ర స్వామి వరకు ఆర్చింబడుతున్న శ్రీరంగనాథస్వామి అర్చ్యా మూర్తి అని పూర్వాచార్యులు నిర్ణయం.]


అందరు పెద్దలూ ఎవరి దారిని వారు వెళ్ళారు. అప్పుడు లక్ష్మణుణ్ని పిలిచి యౌవరాజ్య భారం వహించమని రాముడు కోరాడు. ఎంతగా ఎన్ని విధాల చెప్పినా లక్ష్మణుడు అంగీకరించక భరతుడే అర్హుడనడంతో భరతుడికే యువరాజుగా పట్టాభిషేకం జరిపించాడు.

*సర్వాత్మనా పర్యనునీయమానో* |

*యదా న సౌమిత్రిరూపైతి యోగమ్* |

*నియుజ్యమాణోపి చ యావరాజ్యే*

*తతోభ్యషించద్భరతం మహాత్మా*

[17/11, 4:40 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 56 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu

2. క్షీరసాగర మథనం:

పంచమి ఉండగా ఉన్న శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆవిర్భవించగానే కేవలం ఆవిడ చూపుల చేత లోకములకన్నింటికి ఐశ్వర్యమును ఇచ్చింది. దానివలన మొట్టమొదట అనుగ్రహమును పొందినవాడు దేవేంద్రుడు. మనము ఐశ్వర్యమునకు గాని, అధికారమునకు గాని, భోగలాలసతకు గాని, వైభోగమునకు కాని, ఇంద్రుణ్ణి ఒక హద్దుగా చెప్పుకుంటాము.

ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక అరణ్యప్రాంతంలో తిరుగుతున్నాడు. ఆయన సురాపానం చేసి రంభతో కలిసి విహరిస్తున్నాడు. ఆ సమయంలో అటుగా దుర్వాసోమహర్షి వస్తున్నారు. ఆయన మహా బ్రహ్మజ్ఞాని. శంకరాంశ సంభూతుడు. ఇంద్రుడు ఆయనకు నమస్కారం చేశాడు. ఆయన చుట్టూ ఉన్న పరివారం దేవేంద్రుడిని కుశలం అడిగి దేవేంద్రుని ఆశీర్వచనం చేశారు. దుర్వాసోమహర్షి చేతిలో ఒక పారిజాత పుష్పం ఉన్నది.

ఆ పారిజాత పుష్పమును ఈయన కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ‘మహానుభావా! ఈ పుష్పమును స్వీకరించండి’ అని కృష్ణుడు ఇచ్చాడు. అది భగవంతునిచే స్వయంగా ఇవ్వబడినది. ఈశ్వర నిర్మాల్యం అంటారు. లక్ష్మీదేవి అందులోనే ఉంటుంది. ఇంద్రుడు సురాపానం చేసి మదోన్మత్తుడై ఉన్నాడు. ఆ పువ్వును తీసుకున్నాడు. పువ్వును తీసుకున్నప్పుడు కళ్ళకు అద్దుకుని పక్కన పెట్టాలి. ఈశ్వర నిర్మాల్యం అయినట్లయితే తలమీద కానీ, చెవిలో కానీ పెట్టుకోవచ్చు లేదా ఎవరూ తొక్కనిచోట దానిని భద్రం చేయవచ్చు. ఇంద్రుడు ఆ పువ్వును తీసుకొని ఐరావతం మీదకి విసిరాడు. ఆ ఐరావతం విశేషమయిన తేజస్సును సంతరించుకుంది. అది భగవంతుని నిర్మాల్యం. అది దాని శిరస్సు మీద పడింది. అది తేజస్సును పొంది ఇంద్రుడిని మోయడం మానివేసి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. దుర్వాసో మహర్షి ఇంద్రుడిని చూసి ‘నీవు ముకుంద పాదారవిందము నుండి వచ్చిన పారిజాత పుష్పమును తిరస్కరించావు కనుక నీవు ఉత్తరక్షణం ఐశ్వర్య భ్రష్టుడవు అయ్యెదవు గాక! స్వర్గలక్ష్మి ఇప్పుడే బయలుదేరి స్వస్థానమయినటువంటి వైకుంఠములో ఉన్న మహాలక్ష్మిలో ఐక్యం అయిపోతుంది. ఇక నీకు స్వర్గంలో ఐశ్వర్యం ఉండదు’ అన్నారు. ఈమాట వినగానే శత్రువులు వచ్చేస్తారు. ఐశ్వర్యం పోవడానికి ఒక కారణం ఉండాలి కదా! రాక్షసులు అందరూ వచ్చేశారు. చుట్టుముట్టి పడగొట్టేశారు. ఇంద్రుని ఐశ్వర్యం పోయింది. ఇంద్రునికి ఐశ్వర్యం పోవడానికి కారణం తెలిసింది. దేవతలు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు ‘అప్పుడప్పుడు నీవు కండకావరంతో ప్రవర్తిస్తూ ఉంటావు. ఒకప్పుడు బృహస్పతి జోలికి వెళ్లావు. ఇవాళ దుర్వాసోమహర్షి జోలికి వెళ్లావు. అందువలన ఐశ్వర్యం పోయింది. నీకు మరల ఐశ్వర్యం ఆ పద్మనాభుడి అనుగ్రహంతోనే రావాలి. ఆయననే ధ్యానం చెయ్యాలి’ అని కన్నులు మూసుకుని ధ్యానమునందు ఉన్నవాడై ఆ పరమాత్మను ధ్యానం చేసి పరమ సంతోషంతో చిరునవ్వు నవ్వాడు. అనగా ధ్యానమునందు ద్యోతకమైన నారాయణుడు ఒక మార్గోపదేశం చేసాడు.

బ్రహ్మగారు ‘ నీకు ఐశ్వర్యము పోయినది కదా! నీవయినా నేనయినా మరల ఐశ్వర్యము ఇమ్మని శ్రీమన్నారాయణునే అడగాలి. ఆయన పాదముల మీద పువ్వును నీవు విసిరేశావు. అందుకు దుర్వాసునికి కోపం వచ్చింది. పరమాత్మకు కోపం రాదు. ఆయనా కోపం పెట్టేసుకుంటే ఇక లోకంలో ఉద్ధరించే వాడెవడు? పరమాత్మకి శాశ్వత కోపం ఉండదు. నీవు దుర్వాసుని నన్ను అర్థించడం వల్ల పరమాత్మ సంతోషిస్తున్నాడు. తప్పు చేసినవాడు తనకు ఎంత దగ్గర వాడయినా పరమాత్మ శిక్షిస్తాడు. ఆయన శాశ్వతంగా ఎవరి పట్ల శత్రువు కాదు. శాశ్వత మిత్రుడు కాదు. మీ నడవడిని బట్టి ఆయన మిత్రత్వము కాని, శత్రుత్వము కానీ ఆవిష్కరింప బడుతుంది. ఇంద్రా! నేను కాని, దుర్వాసుడు కానీ, సమస్త దేవతలు శ్రీమన్నారాయణుడికి మ్రొక్కి నమస్కరించినపుడు సంతోషిస్తాము. మాకు నమస్కరించి శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందడం కాదు. శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తే మేమందరం నీకు ఆప్తులం అవుతాం. ఆయనను ప్రార్థన చేద్దాం’ అన్నారు.

బ్రహ్మగారు ఆమాట చెప్పగానే ఇంద్రునికి ధైర్యం వచ్చింది. తప్పు చేసిన వాడిని పరమాత్మ రక్షిస్తాడు అనే జ్ఞానం కలిగింది.పశ్చాత్తాప ప్రకటన జరిగిందంటే వెంటనే స్వామి వరం ఇచ్చేస్తాడు. దితి సంధ్యాకాలంలో తప్పు చేసింది -హిరణ్యకశిపుడు పుట్టాడు. భర్త దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప పడింది. మనవడు ప్రహ్లాదుడు పుట్టాడు.తప్పు చెయ్యడం సహజం. పశ్చాత్తాప పడి మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడం మంచిమనిషి లక్షణం. అపుడు ఇంద్రుడు తాను చేసింది తప్పు పనే అని, తనను మన్నించమని మనస్సులో అనుకుని స్వామిని ప్రార్థించాడు. అంతే! ఎక్కడికో వెళ్ళి కూర్చుని జీవితాంతం తపస్సు చేసిన వాళ్లకి దొరకని పరమాత్మ దర్శనం పశ్చాత్తాపం కలగగానే ఇంద్రునికి దొరికింది. వెంటనే పరమాత్మ ఇంద్రుని ఎదుట ప్రత్యక్షం అయ్యాడు. అలా సగుణంగా కనపడగానే అందరూ చూడలేక కళ్ళు మూసేసుకున్నారు. ఎదురుగుండా ఉన్నదేదో అర్థం చేసుకోలేకపోయారు. చూడడానికి కూడా ఈశ్వరానుగ్రహమే ప్రసరించింది. ఆయనను చూడడానికి ఆయన అనుగ్రహం కావాలి. అంతటా వ్యాపించిన ఆయన ఈ కంటితో చూడడానికి వీలుగా ఎదురుగుండా ఈశ్వరానుగ్రహంతోనే చూసారు. పరమాత్మ ప్రత్యక్షం అయేసరికి వీరందరి తరపున చతుర్ముఖ బ్రహ్మగారు పరమాత్మను ప్రార్థన చేశారు.

శ్రీమన్నారాయణుడు ఈ స్తోత్రం విని చాలా సంతసించాడు. ‘నీవు ఐశ్వర్యము పోయింది కదా అని విచారిస్తున్నావు. ఐశ్వర్యమేమిటి! ఈ శరీరమునకు యౌవనము పోకుండా మృత్యువు రాకుండా ప్రళయకాలమునందు మాత్రమే మరల లీనమయేలా వార్ధక్యం రాకుండా, ఐశ్వర్యం చెడకుండా, అనారోగ్యం రాకుండా, నిరంతరం తేజస్సుతో, కనురెప్ప పడకపోయినా సరే హాయిగా సమస్త తేజస్సును చూడగలిగి భూమికి పాదము ఆనకుండా అంతటా తిరగగలిగిన ఇన్ని శక్తులను ఇవ్వగలిగిన అమృతమును మీకు ఇస్తాను’ అని అన్నారు. అదీ ఈశ్వరానుగ్రహం అంటే. ఇంద్రుడు నోరు విప్పి ఏమీ అడగలేదు. పరమాత్మను మనసులో తలచుకొని ‘నాది తప్పే మహానుభావా’ అన్నాడు. పరమాత్మ అమృతమును ఇస్తాను అంటున్నాడు. ‘మీరు అనేక ఓషధులను తీసుకురండి. గడ్డి తీసుకురండి. పువ్వులు తీసుకురండి. ఇవన్నీ పట్టుకు వెళ్ళి పాలసముద్రంలో వెయ్యండి. మంధర పర్వతమును తీసుకువచ్చి కవ్వంగా మెల్లగా పాలసముద్రంలోకి దించండి. దానికి వాసుకిని త్రాడుగా చుట్టండి. దేవతలు, దానవులు దానిని అటుఇటు పట్టుకోండి. ఇపుడు మీకు ఐశ్వర్యం పోయింది కాబట్టి దానవులు మీమాట వినరు. నాగుపాము కూడా ఎలుకను పట్టుకోవాలంటే కలుగులో నుంచి వచ్చి కాసేపు పడుకుంటుంది. దానవులను మట్టు పెట్టడానికి మీరు కొంచెం ఓర్పు వహించి స్నేహం చేయండి. వారిని క్షీర సాగర మథనమునకు తీసుకు వచ్చి సాగరమును చిలకండి. అందులోంచి అమృతం పుడుతుంది. మొదట హాలాహలం వస్తుంది. అగ్నిహోత్రం వస్తుంది. భయపడకండి. పూనికతో మరల చిలకండి. చాలా గొప్ప గొప్ప వస్తువులు పుడతాయి. మనసు పారేసుకోవద్దు. నిగ్రహించుకోండి. నేను ఇస్తే పుచ్చుకోండి. లేకపోతే ఊరుకోండి. ఎవరికీ ఏది ఇవ్వాలో నాకు తెలుసు. అది వాడికి ఇస్తాను అంటే

దేవతలు శ్రీమన్నారాయణుని మాటలు శ్రద్ధగా విని తప్పకుండా అలా చేస్తాం అని చెప్పి వారు బయలుదేరారు. మొట్టమొదట మంధర పర్వతమును తీసుకువెళ్ళి సముద్రంలో పెట్టాలి. ఇపుడు దేవతలు త్వష్ట ప్రజాపతి దగ్గరకు వెళ్ళి తమకొక పెద్ద తవుకోలను తయారుచేసి ఇవ్వవలసినదని కోరారు. త్వష్టప్రజాపతి ఎందుకు? అని అడిగాడు. దేవతలు ‘మేము మంధర పర్వతమును కింద తవ్వేస్తాము. తరువాత దానిని ఊడబెరికి సముద్రం వద్దకు తీసుకువెడతాము. అలా చేయమని శ్రీమన్నారాయణుడు చెప్పాడని చెప్పారు. ఆయన వారు కోరిన విధంగా తవుకోలను చేసి ఇచ్చాడు. వారు దానిని తీసుకువెళ్ళి మంధరపర్వతం అడుగు భాగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతుంటే పెద్ద గొయ్యి పడింది. మంధర పర్వతమును తీసుకువెళ్ళి సముద్రంలో దింపాలి. అందుకని కొన్ని తాళ్ళు వేసి దానిని ఊపుతున్నారు. అలా ఊపి మొత్తం మీద పర్వతమును అందరూ కలిసి పైకి ఎత్తారు. అయితే అది పక్కకి ఒరిగిపోయి పడిపోయింది. ఈ సందర్భంలో దానికింద పడి కొందరు మరణించారు. మిగిలిన వారందరూ ప్రక్కకు చేరి ఈ మంధరపర్వతమును సముద్రము వరకు తీసుకుని వెళ్ళడానికి మనం శ్రీహరి సహాయం అడగలేదు. అడిగి ఉంటే ఆయనే వచ్చి మనకు సహాయం చేసి ఉండేవాడు. ఆయన వస్తే ఎంత బాగుండునో’ అని అనుకున్నారు. వాళ్ళు ఈమాట అనుకునేసరికి బంగారురంగులో ఉన్న గరుడపక్షిమీద నుంచి శ్రీమన్నారాయణుడు క్రిందకి దిగి దేవతలను ఓదార్చి మంధరపర్వతమును బంతివలె నేర్పుతో చేతితో పట్టుకుని, దానిని తీసుకుని మరల గరుడవాహనం ఎక్కి వెళ్ళిపోయారు. శ్రీమన్నారాయణుడు పాలసముద్రం ఒడ్డున దిగి గరుత్మంతుడిని వెనక్కు పంపించి వేశాడు. చిలికేటప్పుడు వాసుకి శరీరం ఒరిసి పోకుండా మంధరపర్వతమును నునుపుగా చెక్కించారు. వాసుకిని తీసుకు వచ్చి పర్వతమునకు చుట్టి పాలసముద్రంలో పెట్టారు. ఇప్పుడు అది మునిగి పోకూడదు. దేవతలను పిలిచి వారిని వాసుకి తలవైపు పట్టుకొనమని రాక్షసులను పిలిచి వారిని తోకవైపు పట్టుకొనమని చెప్పాడు. వెంటనే దేవతలు అందరూ వెళ్ళి వాసుకి తలవైపు పట్టుకున్నారు. రాక్షసులు ‘మేము తోక పట్టుకోవడం ఏమిటి? మేము తలవైపు పట్టుకుంటాము’ అన్నారు. అందుకు స్వామి వెంటనే ఒప్పుకుని రాక్షసులను తలవైపు పంపి దేవతలను తోకవైపు పట్టుకొనమని చెప్పారు. దేవతలు మారు మాట్లాడకుండా వాసుకి తోకవైపు వెళ్ళి తోకను పట్టుకున్నారు. స్వామి మాటల పట్ల దేవతలకి గల విశ్వాసం వారిని అమృతం తాగేట్లు చేస్తుంది.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

instagram.com/pravachana_chakravarthy

[17/11, 4:40 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 57 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

పామును మంధరపర్వతమునకు చుట్టారు. అందరూ కలిసి తిప్పాలి. అది క్రిందకు జారిపోకూడదు. దేవదానవులిరువురూ చిలకడం ప్రారంభించారు. గిరగిరమని పర్వతం తిరిగింది. భుగభుగభుగమని పాలసముద్రం లేచింది. నురగలు లేచాయి. కెరటములు లేచాయి. పక్షులు, పాములు, తాబేళ్లు, చేపలు, మొసళ్ళు ఎగిరెగిరి పడుతున్నాయి. కొన్ని చచ్చిపోతున్నాయి. విపరీతమయిన ధ్వని చేస్తోంది. దానికి తోడు వీళ్ళ అరుపులు. అంత కోలాహలంగా ఎవరి మానాన వారు మంధరపర్వతమును గిరగిర తిప్పేస్తున్నారు. వాసుకి ‘మీరు సరిగ్గా చిలకడం లేదు వదలండి’ అని కేకలు వేశాడు. వాళ్ళందరూ వాసుకిని వదిలేశారు. పట్టు తప్పిపోయి మంధర పర్వతం జారి క్రిందపడిపోయింది. అందరూ శ్రీమన్నారాయణుని వైపు చూశారు. ఎవ్వరూ గమనించలేని స్థితిలో ఆది కూర్మావతారమును స్వీకరించాడు. కొన్ని లక్షల యోజనముల వెడల్పయిన పెద్ద డిప్ప. ఆ దిప్పతో పాలసముద్రం అడుగుకి వెళ్ళి ఇంతమంది కదల్చలేని మంధరపర్వతమును తన వీపుమీద పెట్టుకున్నాడు. ముందు వచ్చి తుండమును అటూ ఇటూ ఆడిస్తున్నాడు. తన నాలుగు కాళ్ళను కదల్చకుండా తానే ఆధారమయి, మంధరపర్వతమును వీపుపై ధరించి ఉన్నాడు. ఆ కూర్మము నిజంగా ఆహారమును తినినట్లయితే ఈ బ్రహ్మాండములనన్నిటిని జీర్ణము చేసుకొనగలదు. అటువంటి ఆదికూర్మమై పాలసముద్రం క్రింద పడుకున్నాడు. ఇపుడు మంధరపర్వతమును ఆదికూర్మం భరిస్తోంది. మరల మంధరపర్వతమును వాసుకిని చుట్టి రాక్షసులు తలవైపు దేవతలు తోకవైపు ఉండి చిలకడం ప్రారంభించారు. భూమి అదిరిపోతోంది. సముద్రంలోంచి కెరటములు పైకి లేస్తున్నాయి. సిద్ధులు, చారణులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు ఆకాశంలో నిలబడిపోయి ఆ దృశ్యమును చూస్తున్నారు.

ఎక్కడో సత్యలోకంలో బ్రహ్మగారు భావసమాధిలో ఉన్నారు. ఈ చప్పుడు ఆయన చెవుల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు. సత్యలోకంలోంచి బయటకు వచ్చి ఏమిటి ఈ చప్పుడు? అన్నారు. అక్కడి వాళ్ళు స్వామీ! పాలసముద్రమును చిలుకుతున్నారు. అందులో నారాయణుడు కూడా ఉన్నాడు అన్నారు. బ్రహ్మగారు కూడా పైనుంచి క్రిందకు చూస్తున్నారు. ముందు అమృతం రాలేదు. హాలాహలం ముందు పుట్టుకు వచ్చింది. అది ఒక్కసారి పాలసముద్రం మీద నుండి పైకి లేచింది. ప్రళయకాలంలో ఉండే అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉన్నది. అది వెంట తరుముతుంటే దేవతలు రాక్షసులు అందరూ వాసుకిని వదిలిపెట్టి పరుగు మొదలు పెట్టారు. అన్ని లోకములలో అగ్నిహోత్రం ప్రబలి పోతున్నది. పరుగెత్తి పరుగెత్తి కైలాసపర్వతం మీద వున్న పరమశివుని అంతఃపురము దగ్గరకు వెళ్ళి అక్కడి ద్వారపాలకులు అడ్డు పెట్టగా వారిని పక్కకు తోసివేసి లోపలి ద్వారం దగ్గరకు వెళ్ళి అక్కడే నిలబడి రక్షించు అని అరుస్తున్నారు. స్వామి పరమశివుడు వీరి అరుపులు విని ఏదో ఆపద సంభవించి ఉండవచ్చునని బయటకు వచ్చారు. వారు శంకరునితో ‘ఈశ్వరా! నీవు ఈ విశ్వమంతా నిండి నిబిడీ కృతమయిన వాడివి. నీవు తండ్రివి. మేము చెయ్యకూడని పని ఒకటి చేశాము. ఇంట్లో ఏదయినా శుభకార్యం చేస్తున్నప్పుడు మనకొక సంప్రదాయం ఉన్నది. ముందుగా తల్లిదండ్రులకు నమస్కారం చేసి వారికి బట్టలు పెట్టి పీటలమీద కూర్చుంటారు. దేవదానవులు ఆ పని చేయలేదు. స్వామికి నమస్కరించలేదు. అందుకని స్వామి వీళ్ళకి పాఠం నేర్పాలి అనుకున్నాడు. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ‘మేము మంధరపర్వతం పెట్టి సముద్రమును చిలికితే హాలాహలం జనించింది. లోకములను కాల్చేస్తోంది. దయచేసి దానిని నీవు స్వీకరించవలసినది’ అన్నారు.

మూడుమూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు

భేదమగుచు దుది నభేదమై యోప్పారు బ్రహ్మమవగ నీవ ఫాలనయన!

నీవు భూతభవిష్యద్వర్తమాన రూపములలో ఉంటావు. నీవే బ్రహ్మవిష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు. నీవే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త రూపంలో ఉంటావు. అందుకని మూడింటికి ఆధారమయిన మూలపురుషుడవు కనుక ఈశ్వరా! ఈ హాలాహలమును నీవు పుచ్చేసుకో’ అన్నారు. వారి కోరికను విన్న పరమశివుడు వెంటనే పార్వతీ దేవి వద్దకు వెళ్ళాడు. అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుని ఉన్నది. శంకరుడు ఆమెవంక చూసి ‘కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి; ప్రభువై

యుంటకు నార్తుల యాపద, గెంటించుట ఫలము; గాదె గీర్తి మృగాక్షీ!!

ఈ ఘట్టము వినిన వాళ్లకి కొన్ని కోట్ల జన్మల వరకు అయిదవతనం తరిగిపోకుండా కాపాడుతుంది. ఈ ఘట్టంలో అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది. ‘చూసావా పార్వతీ! నీళ్ళలోంచి వేడి పుట్టింది. పాపం పిల్లలందరూ ఏడుస్తున్నారు. ప్రభువు అన్నవాడు బిడ్డలకు కష్టం వస్తే ఆదుకోవాలి. అందుకని వాళ్ళను రక్షించాలని అనుకుంటున్నాను’ అన్నాడు. ఆవిడ సమస్త బ్రహ్మాండములకు తల్లి. మాతృత్వము ఒక్కొక్కసారి భర్తృత్వమును కూడా తోసేస్తుంది. అది తల్లితనానికి ఉన్న గొప్పతనం. అందుకని మాతృత్వమును ఆమెలోంచి ఉద్భుదం చేస్తున్నాడు శంకరుడు. ‘మీ అన్నయ్య స్థితికారుడు. లోకముల నన్నిటిని నిలబెట్టాలి. ఇపుడు లోకములకు ఇబ్బంది వచ్చింది. మరి నేను ఆయనను సంతోష పెట్టాలి కదా! అందుకని నేను హాలాహలమును త్రాగేస్తాను.

శిక్షింతు హాలాహలమును భక్షింతును మధురసూక్ష్మ ఫలరసము క్రియన్

రక్షింతు ప్రాణి కోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖీ!

నేను ఈ హాలాహలమును చిన్న ద్రాక్షపండును తినేసినట్లు తినేస్తాను. దానివలన నాకేమీ ఇబ్బంది రాదు. అలా చేసి ఈ ప్రాణికోట్లనన్నిటిని రక్షిస్తాను. అది నా దివ్యమయిన లీల. నాకేమయినా అవుతుందని నీవేమాత్రం బెంగ పెట్టుకోనవసరం లేదు. నేనెలా తినేస్తానో సంతోషంగా చూస్తూ ఉండు’ అన్నాడు. పార్వతీ దేవి ‘సరే, మీకు ఎలా ఇష్టమయితే అలా చేయండి’ అంది.

మ్రింగెడు వాడు విభుండని మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్

మ్రింగు మనె సర్వమంగళ, మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో!

ఆవిడకు శంకరుడు త్రాగబోయేది విషం అని తెలుసు. విషం త్రాగితే ప్రమాదమనీ తెలుసు. త్రాగుతున్న వాడు తన భర్త అనీ తెలుసు. అయినా త్రాగమంది. ఆవిడ సర్వమంగళ. అందుకని తాగెయ్యమన్నది. శంకరుని జీవనమునకు హేతువు పార్వతీదేవి మెడలోని మంగళసూత్రమని పోతనగారు తీర్పు ఇచ్చారు. దేవతలందరూ జయజయధ్వానాలు చేస్తుంటే హాలాహలమునకు ఎదురువెళ్ళి దానిని చేతితో పట్టుకుని ఉండగా నేరేడు పండంతచేసి గభాలున నోట్లో పడేసుకుని మింగేశాడు. ఎదురు వెళ్ళినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ మ్రింగినప్పుడు కానీ వేడికి ఆయన ఒంటిమీద ఒక్క పొక్కు పుట్టలేదు. ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు. ఆయన చల్లని చూపులతో అలానే ఉన్నాడు. శంకరుని పాదములు నమ్ముకున్న వాడు హాలాహలం లాంటి కష్టము వచ్చినా కూడా అలా చల్లగా ఉంటాడు. అటువంటి వానికి బెంగ ఉండదు. ఆయన నోట్లో పెట్టుకుని మ్రింగుదామనుకున్నాడు. కంఠం వరకు వెళ్ళింది.

ఉదరము లోకంబులకును సదనంబగు టెరిగి శివుడు చటుల విషాగ్నిం

గుదురుకొన గంఠబిలమున బదిలంబుగ నిలిపె సూక్ష్మఫలరసము క్రియన్.

మింగేస్తే అడుగున అధోలోకములు ఉన్నాయి. కాలిపోతాయని మింగలేదు. పైన ఊర్ధ్వలోకములు ఉన్నాయి. కక్కితే ఊర్ధ్వలోకములు పోతాయి. పైకీ వదలలేదు, క్రిందకీ వదలలేదు. కంఠంలో పెట్టుకున్నాడు. ఆయన అలా చేసేసరికి పార్వతీ దేవి చాలా సంతోషించింది. లోకం పొంగిపోయింది. అప్పటినుండి ఆయనకు నీలలోహితుడు, నీలగ్రీవుడు అని పేరు వచ్చింది. ఆయనకు నీలకంఠుడు అని పేరు. ‘నీలకంఠా అని పిలిస్తే చాలు ఆయన పొంగిపోతాడు. హాలాహాల భక్షణం కథ వీనిన వాళ్లకి మూడు ప్రమాదములు జరుగవు. ఈ కథ వినిన వాళ్ళని పాము కరవదు. హాలాహలభక్షణం కథను నమ్మిన వాళ్ళని తేలు కుట్టదు. అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదములు రావు. అంతంత శక్తులు ఇటువంటి లీలలయందు ఉన్నాయి. వాటిని క్షీరసాగర మథనంలో ఆవిష్కరించి వ్యాస భగవానుడు ఫలశ్రుతి చెప్పారు.

మళ్ళీ అందరూ బయలుదేరి ఆనందంతో పాలసముద్రం దగ్గరకి వెళ్ళిపోయారు.క్షీరసాగర మథనం మొదలుపెట్టారు. అలా మథిస్తుంటే సురభి కామధేనువు పైకి వచ్చింది. ఆ కామదేనువుకి అందరూ నిలబడి నమస్కారం చేశారు. దేవమునులకు లౌకికమయిన కోరికలు ఉండవు. వారు కామధేనువు పాలతో హవిస్సులను అర్చిస్తాము అని అన్నారు. లోక కళ్యాణార్థం హవిస్సులను ఇస్తారు. ఆ గోవును స్వామి దేవమునులకు ఇచ్చి మీరు దీని పాలతో దేవతలకు హవిస్సులను అర్పించాలి. దేవతలు సంతోషించి వర్షములు కురిపిస్తారు. అందరూ బాగుంటారు. అందరికీ పనికి వచ్చేవాడికి కామధేనువు ఉండాలి. కామధేనువు దేవమునులకు ఇవ్వబడింది. వారు దానిని పుచ్చుకున్నారు. 

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

instagram.com/pravachana_chakravarthy

[17/11, 4:40 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 58 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


మళ్ళీ పాలసముద్రమును చిలకడం మొదలుపెట్టారు. అందులోంచి ఒక తెల్లటి గుఱ్ఱము ఒకటి బయటకు వచ్చింది. దానిని ఉచ్చైశ్రవము అంటారు. ఈ గుఱ్ఱమును చూడగానే ఇంద్రునికి కించిత్ మమకారం పుట్టింది. శ్రీమన్నారాయణుని సూచన మేరకు ఏమీ మాట్లాడలేదు. ఆ అశ్వమును బలిచక్రవర్తి తనకిమ్మనమని అడిగాడు. ఆ తరువాత మళ్ళీ చిలకడం మొదలు పెట్టారు. పాల సముద్రంలోంచి బ్రహ్మాండమయిన కల్పవృక్షం వచ్చింది. ఆ కల్పవృక్షమునకు పువ్వులు పూసి ఉన్నాయి. ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వారికి అయిదవతనం తరగదు. దానిమీద నుండి వచ్చే గాలి ఎవరు పీలుస్తారో వారి ఆరోగ్యం పాడవదు. కల్పవృక్షం దగ్గరకు వెళ్ళి ప్రార్థనలు చేసిన వారికి ఫలముల రూపంలో కోర్కెలు తీరుస్తుంది. ఈ కల్పవృక్షమును ముందు ఇంద్రునికి ఇచ్చారు. ఆయన దానిని తీసుకున్నాడు. తరువాత అప్సరసలు పుట్టారు. ఆ అప్సరసలు దేవకాంతలై, దేవ నర్తకీమణులై ఉండిపోయారు. పాల సముద్రమును ఇంకా చిలకడం మొదలు పెట్టారు. లక్ష్మీదేవి ఆవిర్భావం జరుగబోతోంది. ఆమె శుక్రవారం పంచమినాడు పుట్టింది.

పచ్చటికాంతితో, తెల్లటి వస్త్రములు కట్టుకుని ‘పద్మాననే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే’ అని నల్లనికన్నులతో, సొగసయిన చూపులతో, మాతృ వాత్సల్యంతో అందరివంక చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారు చూపులు ఎంతవరకు పడ్డాయో అంతవరకూ దరిద్రములు అన్నీ తొలగిపోయాయి. అందరూ ఆనందమును పొందారు. లక్ష్మీదేవి ఆవిర్భావఘట్టం వింటున్న వారికి కొన్ని కోట్ల జన్మల నుండి వెంటబడిన దరిద్రం నశిస్తుంది. ఇది పరమయధార్థం. పుడుతూనే ఆ తల్లి యౌవనంలో పుట్టింది. ఇంద్రుడు వెంటనే కలశ స్థాపనం చేసి అమ్మవారిని దర్శనం చేసి చెప్పిన స్తోత్రం వ్యాసభాగవతంలో లేదు. కానీ దేవీ భాగవతంలో ఉన్నది. దానికి పెద్దలు ఒకమాట చెపుతారు. ఈ స్తోత్రమును చెయ్యడానికి కొన్నిరోజులు నియమం ఉంది. అలా ఈ స్తోత్రమును తెలిసికానీ, తెలియక కానీ చేస్తే ఆ వ్యక్తి భూమండలమును శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు. పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది. అమ్మవారు తెల్లనిచీర కట్టుకుంది. పచ్చటిముఖంతో, బంగారురంగుతో మెరిసిపోతూ ఉంది. నల్లనిజుట్టు కలిగి ఉంది. కబరీబంధం చుట్టూ చక్కటి మల్లెపువ్వులు, సంపంగి పువ్వులు, జాజిపువ్వులు, అలంకరించుకుని ఉన్నది. మెడనిండా హారములు వేసుకుని ఉన్నది. వరదముద్రపట్టి చేతితో ఐశ్వర్యమును కురిపిస్తూ మీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తున్నది. రెండు పాదములను కలిపి పద్మాసనం వేసుకుని ఉన్నది.

నమః కమల వాసిన్యై నారాయణ్యై నమోనమః |

కృష్ణ ప్రియాయై సతత౦ మహాలక్ష్మ్యై నమోనమః ||

పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమోనమః |

పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః ||

సర్వస౦పత్స్వరూపిణ్యై సర్వారాధ్యాయై నమోనమః |

హరిభక్తి ప్రదాత్ర్యై చ హర్షదాతత్యై చ నమోనమః ||

కృష్ణ వక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమోనమః |

చ౦ద్రశోభా స్వరూపాయై రత్న పద్మే చ శోభనే ||

స౦పత్త్యధిష్ఠాతృదేవ్యై మహాదేవ్యై నమోనమః |

నమో వృద్ధి స్వరూపాయై వృద్ధిదాయ్యై నమోనమః ||

యథా మాతా స్తనాధానా౦ శిశూనా౦ శైశవే సదా |

తథా త్వ౦ సర్వదా మాతా సర్వేషా౦ సర్వరూపతః ||

(శ్రీదేవీ భాగవతం – 9వ స్కంధము)

పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా విన్న బిడ్డడిని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మపాలు తప్ప వేరొకటి లేదు. ఈలోకము నందు మనము సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కులేదు. అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే. ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు. తృప్తి ఉండాలి. అమ్మా! ఆనాడు బిడ్డడయినందుకు అమ్మ పాలిచ్చి బ్రతికించినట్లు సమస్త లోకములకు తల్లివయిన నీవు కూడా దయతో మాకు ఐశ్వర్యమును ఇచ్చి కాపాడు’ అని ఇంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు. అటువంటి తల్లి మనకు విష్ణు భక్తిని ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది.

అమ్మవారు ఆవిర్భవించడం ఒక ఎత్తు. ఆమె అయ్యవారిని చేరడం ఒక ఎత్తు. శక్తి అనేది కంటికి కనపడదు అనుభవైకవేద్యము. పరమాత్మ శక్తితో కూడినవాడై అనుగ్రహిస్తాడు. ప్రక్కన లక్ష్మి చేరి ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఇంద్రుడికి ఐశ్వర్యమును అనుగ్రహిస్తున్నాడు. ఆవిడకు భర్త నిర్ణయింపబడాలి. అటువంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు ? ఎక్కడ పుట్టిందో అక్కడివాడు తండ్రి అవుతాడు. ఇపుడు పాలసముద్రుడే తండ్రి. అందుకనే మనం ప్రతిరోజూ ‘లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం’ అని పిలుస్తూ ఉన్న అమ్మవారికి మంగళ స్నానం చేయించడానికి అన్నీ సమకూరుస్తున్నారు. ఆ తల్లి మంగళస్నానం చేయడం కోసమని ఒక పీట మీద కూర్చోవాలి. దేవేంద్రుడు ఒక మణిమయ పీఠమును తెచ్చి అక్కడ పెట్టాడు. ఈ పీఠం ఇచ్చిన వాడికి పీఠం దక్కుతోంది. లక్ష్మీదేవికి మీరు ఏమి ఇస్తే అది మీకు దక్కుతుంది. అమ్మవారు మంగళస్నానం చేయడానికి దానిమీద కూర్చుంది. అమ్మవారు స్నానం చేయడానికి నీళ్ళు తీసుకు రావాలి. పసుపు కుంకుమలకి లోటు లేకుండా చాలాకాలంనుండి పసుపు కుంకుమలతో ఉన్న యువతులు నీరు తీసుకువచ్చి అక్కడ పెట్టారు. ఆ నీటిలో కొద్దిగా పసుపు కలపాలి, దానిలోకి పల్లవములు వెయ్యాలి. పల్లవములు వేయడం చేత జలములు మంగళ స్నానములకు యోగ్యములు అవుతాయి. పల్లవములను భూదేవి తెచ్చి ఇచ్చింది. గోవులు పంచద్రవ్యములను ఇచ్చాయి. వసంతుడు తేనెను తెచ్చి ఇచ్చాడు. మంగళ స్నానం చేయించే ముందు వధువుకి కొద్దిగా తేనె ఇవ్వాలి. లోపల మంగళ స్నానక్రియ జరుగుతుంటే బయట వచ్చిన బ్రాహ్మణులు కూర్చుని చక్కటి స్వస్తి మంత్రములు చెప్తూ ఉంటారు. అక్కడ స్వస్తి మంత్రములు చదువుతుండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి. మహర్షులు వేద మంత్రములను చదువుతున్నారు. మంగళధ్వనులు జరగాలి. లక్ష్మీ దేవి మంగళస్నానానికి మేఘములు మంగళ ధ్వనులు చేశాయి. మేఘములే వేణువులను ఊదాయి. పరమసంతోషంతో గంధర్వసతులు అందరూ అక్కడ లక్ష్మీదేవికి మంగళస్నానములు జరుగుతున్నాయని నాట్యం చేస్తున్నారు.

అమ్మవారు స్నానం చేసిన తరువాత ఆ రోజున అమ్మవారు కట్టుకోవలసిన పట్టు చీరను తండ్రి సముద్రుడు నిర్ణయం చేసి వస్త్రద్వయమును ఇచ్చాడు. వస్త్రద్వయం అనగా చీరతో బాటు ఒక రవికల గుడ్డ లేక మరొక వస్త్రం పెట్టి ఇవ్వాలి లేదా ఒక వస్త్రం మీద కనీసం ఒక దూదిపోగు పెట్టి ఇవ్వాలి. ఇంటి యజమానికి సన్నిహితుడయిన స్నేహితుడు ఉంటాడు. ఆయనను ‘సుహృత్’ అంటారు. ఆయన బిడ్డను తన బిడ్డగా భావిస్తాడు. సముద్రుడు తండ్రి అయితే సముద్రములో ఉన్న వరుణుడే సుహృత్. సుహృత్ అమ్మవారు వేసుకుందుకు వైజయంతీ మాలను ఇచ్చాడు. అమ్మవారు వేసుకోవడానికి కావలసిన గాజులు హారములు నగలు వీటినన్నిటిని ఒక దంతపుపెట్టెలో పెట్టి విశ్వకర్మ తెచ్చి అమ్మవారికి ఇచ్చాడు. సరస్వతీ దేవి ఒక మంచి తారహారమును ఇచ్చింది. బ్రహ్మగారు ఒక తామరపువ్వును ఇచ్చాడు. నాగరాజులు అమ్మవారు చెవులకు పెట్టుకునే కుండలములు ఇచ్చారు. శృతి తనంత తానుగా ఒక రూపమును దాల్చి అమ్మవారికి ఆశీఃపూర్వకమయిన భద్రతను చేకూర్చగలిగిన మంత్రమును ఆమ్నాయము చేసింది. దిక్కులను స్త్రీలతో పోలుస్తారు. దిశాకాంతలందరూ ‘అమ్మా! లక్ష్మీ నీవు ఎల్ల లోకములకు ఏలిక రాణివై పరిపాలించెదవు గాక! అని ఆశీర్వచనం చేశారు. ఆ తల్లికి తనంత తానుగా వరుడిని ఎంచుకోగలిగిన పద్ధతిని సముద్రుడు ఆమోదించాడు. ఆమె చేతికొక చెంగల్వ పూదండ ఇచ్చాడు. దండ పట్టుకుని ఎవరి మెడలో వేయాలి అని బయలుదేరుతున్నది. లక్ష్మీదేవికి సంబంధించిన ఈ పద్యములు వింటే కన్నెపిల్లలకు మంచి భర్తలు వస్తారు అంటారు. ఆవిడ జగత్తునకంతటికీ తల్లి. నారాయణుడి వంక చూసింది. ఇలాంటివాడు నాకు భర్త కావాలి అనుకుంది. తామరపువ్వుల వంటి కన్నులున్న శ్రీమన్నారాయణుడు ఏమీ తెలియని వానిలా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అమ్మవారు గబగబా సింహాసనం దిగి నడిచి వచ్చి ఆ వరమాలను ఆయన మెడలో వేసింది. ఆ సమయంలో అమ్మవారు అందరినీ చూసింది కానీ రాక్షసుల వైపు చూడలేదు. అంతే వారు దరిద్రులయిపోయారు. వాళ్లకి అమృతం పోయింది. సముద్రుడు మామగారు అయ్యాడు. అమ్మాయి అయ్యవారి దగ్గరకు చేరితే తాను మామగారు అవుతాడు. మామగారు తన కొడుకుకి అల్లుడికి అభేదం పాటించాలి. కొడుకుకి ఎంత అమూల్యమయిన వస్తువు ఇస్తాడో అల్లుడికి కూడా అలా ఇవ్వగలగాలి. ఎందుకు అంటే ఆయన ఇపుడు పితృపంచకంలోకి వెళ్ళాడు. మామగారు అవగానే సముద్రుడు తనలో ఉన్న కౌస్తుభమును తీసుకువచ్చి శ్రీమన్నారాయణునికి బహూకరించాడు. శ్రీమన్నారాయణుడు ఆ కౌస్తుభమును తన మెడలో పెట్టుకున్నాడు. ఒక పక్క శ్రీవత్సమనే పుట్టుమచ్చ మెరుస్తున్నది.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[17/11, 4:40 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 59 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


లక్ష్మీదేవి చూపు రాక్షసుల మీద మాత్రం పడలేదు. దానివలన వారికి కీడు ప్రారంభం అయింది. లక్ష్మీదేవిని పొంది శ్రీమన్నారాయణుడు తరించాడు. కన్యాదానం చేసి సముద్రుడు తరించాడు. అమ్మవారి అనుగ్రహమును పొంది ఇంద్రుడు తరించాడు. ఇంద్రునికి రాజ్యం రాబోతోంది. రాక్షసులకు రాజ్యం చేజారి పోబోతోంది. ఐశ్వర్యం పోయేముందు దెబ్బలాటలు వస్తాయి. అందుకే ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడూ పరమప్రసన్నంగా మాట్లాడుకోవాలి. తదనంతరము దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రము మళ్ళీ చిలకడం ప్రారంభించారు. వారికి అమృతం లభించాలి. అమృతం లభించే వరకు క్షీరసాగర మథనం నడుస్తూ ఉండాలి. చాలాసేపు చిలికిన తరవాత అందులోంచి శ్రీమహావిష్ణువు అంశ కలిగిన వాడు, పచ్చని పట్టు వస్త్రమును ధరించిన వాడు, కంబుకంఠుడు, శంఖ చక్ర గదా పద్మములను ధరించిన మహాపురుషుడు క్షీరసాగర మథనం జరుగుతుండగా ఆ పాల సముద్రంలోంచి ఆవిర్భవించాడు. ఆయనను ధన్వంతరి అని పిలుస్తారు. ఆయన వైద్యశాస్త్రమున కంతటికీ అధిదేవత. ధన్వంతరి అనుగ్రహం కలగడం చేత శరీరములో ఉండే రోగమును గుర్తించి ఆ రోగము నివారణ కావడానికి కావలసిన మందును వైద్యులు నిర్ణయించి ఔషధమును ఇస్తారు. ఆ ఔషధము నందు ధన్వంతరి అనుగ్రహము ప్రకాశించడం చేత మనకు లోపల ఉన్న శారీరకమయిన రోగం నశిస్తుంది. ఆయన యాగమునందు హవిస్సును అనుభవిస్తాడు. ఆయన చేతిలో అమృత పాత్ర ఉన్నది. ధన్వంతరి స్వరూపము శ్రీమహావిష్ణువు స్వరూపమే.

ఇప్పటివరకూ దేవతలు రాక్షసులు క్రమశిక్షణతో చిలుకుతున్నారు. వాళ్ళు దేనికోసం అయితే చిలుకుతున్నారో అటువంటి అమృతపాత్ర వారి ఎదురుగుండా కనపడింది. దేవతలతో కలిసి క్షీరసాగరమును మధించారు కాబట్టి అందులో దేవతలకు కూడా భాగం ఇవ్వవలసి ఉంటుందనే విషయమును రాక్షసులు మరచిపోయారు. ధన్వంతరి చేతిలో ఉన్న అమృత పాత్రను లాక్కుని ఎవరి మటుకు వారు ముందుగా అమృతం తాగేద్దామని ఆ పాత్ర పట్టుకుని సముద్రము ఒడ్డున పరుగులు తీస్తున్నారు. వారిలో వారు బలము కలిగిన వారు ఆ పాత్ర పట్టుకుని పరుగెడుతుండగా వారియందు అమంగళకరమైన కలహం అతిశయించింది. ఐశ్వర్య భ్రష్టత్వమునకు ప్రధాన కారణం కలహం ఏర్పడడం. రాక్షసులు అమృతపాత్రను పట్టుకు పారిపోతుంటే దేవతలు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేశారు. పరమాత్మ మోహినీ రూపమును స్వీకరించాడు. మోహినిని చూసేసరికి రాక్షసులకు స్పృహ తప్పిపోయింది. అమృతపాత్రమీద కోరిక తగ్గింది. తుచ్ఛ కామమునకు జారిపోయారు. వారి కోరిక ఒకటే ‘మనం ఎవరు ఈమెతో బాగా మాట్లాడి ఈమెను వశం చేసుకోగలం’. శ్రీమహావిష్ణువు కేవల శరీరరూపం చేత రాక్షసులను మోహ పెట్టాడు. వాక్కు చేత సత్యమును చెప్తున్నాడు. ‘మీరు ఏదో పాత్ర పట్టుకు వచ్చి అందులో ఉన్నదానిని పంచమని నన్ను అడుగుతున్నారు. కానీ మిమ్మల్ని చూస్తే నాకు ఒకమాట చెప్పాలని అనిపిస్తోంది. మీకు అర్థం అయితే బాగుపడతారు. చెప్తున్నాను వినండి’ అన్నాడు.

‘తన ధర్మపత్ని యందు అనురాగం ఉండడం ఎప్పుడూ దోషం కాదు. కానీ కనపడిన ప్రతి స్త్రీయందు అర్థములేని ఒక భావన పెంచుకోవడం చాలా ప్రమాదకరం. మీరింతమంది నన్ను ఇలా చూస్తున్నా మీతో మాట్లాడాలని తలంపు కానీ కలిగిందంటే అది మిమ్మల్ని కాల్చే కార్చిచ్చు అవవచ్చు. గుర్తుపెట్టుకోండి. నా తప్పేమీ లేదు’ అని అన్నది. మోహిని మాటలు వాళ్ళ తలకెక్కవు. ఎందుకు అంటే వాళ్ళు కామమునకు వశులై బలహీనమయిన మనస్సు కలవారై మోసపోవడానికి సిద్ధపడ్డారు. ‘మీరు నన్ను పెద్ద చేసి నా చేతిలో అమృతపాత్ర పెడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చావని కూడా నన్ను అడగలేదు. ఇపుడు నేను ఈ పాత్రనుపట్టుకుని అంతర్ధానం అయిపోతే మీ బ్రతుకులు ఏమయిపోతాయి? మీరు ఎంతో కష్టపడ్డారు’ అన్నది.

రాక్షసులు నిజంగా ఈమె మాటలలోని యధార్థమును గ్రహించిన వారయితే ‘తల్లీ! మేము ఈ పని చేసి ఉండకుండా ఉండవలసింది’ అని కాళ్ళమీద పడి వెంటనే వాళ్ళ మనసు మార్చుకున్నట్లయితే క్షీరసాగరమథన కథ వేరొకలా ఉంటుంది. చాలామంది క్షీరసాగర మథనంలో శ్రీమన్నారాయణుడు మోసం చేసి రాక్షసులకు అమృతమును పంచి ఇవ్వలేదు అంటారు. అది నిజం కాదు. మోహిని మాటలు విన్న తరువాత కూడా రాక్షసులు ‘అమృతమును నీవే మాకు పంచాలి’ అన్నారు. వారి మాటలు విని మోహిని వారినుంచి అమృత పాత్రను తీసుకుంది. ‘చక్కగా స్నానం చేసి ఆచమనం చేసి రండి. రాక్షసులంతా ఒకవైపు దేవతలంతా ఒకవైపు కూర్చోండి. అమృతమును పోస్తాను’ అన్నది. అలాగే కూర్చున్నారు. ఆమె దేవతలకు అమృతం పోస్తుంటే ఆమె శరీర పృష్ఠ భాగం రాక్షసులకు కనపడుతుంది. వాళ్ళు దానికి తృప్తి పడిపోయేవారు. వీళ్ళల్లో ఎవరికీ అమృతం మీద దృష్టిలేదు. ఆవిడ అంగాంగములమీదే దృష్టి ఉంది. అదే వారి పతనమునకు కారణం. వాళ్ళు అమృతమును పోగొట్టుకుంటున్నారు. తమ మరణమును వారే కొని తెచ్చుకుంటున్నారు. రాక్షసులకు ఉన్న కామ బలహీనత చేత మొత్తము జాతిని గెలిచింది. అప్పటికీ ఇప్పటికీ అంతే. కామమునకు లొంగిపోయే బలహీనతను పెంచుకుంటున్నది కనుక లోకమంతా కామమునకు నశించిపోతోంది. మోహిని దేవతలవైపు పవిత్రంగా కనపడుతుంది. రాక్షసుల వైపు మోహజనకంగా కనపడుతోంది. దీనిని రాహువనే రాక్షసుడు మోహిని తమను మోసం చేస్తున్నదని గ్రహించాడు. ఆయన వెళ్ళి దేవతలవైపు కూర్చున్నాడు. కానీ ప్రవృత్తి చేత రాక్షసుడు. ఆవిడ రాహువు దగ్గరకు వచ్చింది. రాహువు సూర్యచంద్రుల ప్రక్కన కూర్చున్నాడు. వాళ్ళిద్దరికీ అమృతం పోస్తున్నప్పుడు వాళ్ళు రాహువును సూచిస్తూ ‘ వాడు రాక్షసుడు. వాడికి అమృతం పోయవద్దు’ అని సైగచేశారు. శ్రీమన్నారాయణుడు దీనిని కనిపెట్టాడు. రాహువు రాక్షసుడయినా మోహినీ రూపంలోని శ్రీమహావిష్ణువు అమృతం పోశాడు తప్ప పంక్తినుంచి లేవమని అనలేదు. ఇపుడు రాహువు అమృతము త్రాగాడు. అతడు త్రాగిన అమృతము క్రిందికి దిగిందంటే రాక్షసశరీరము అమృతత్వమును పొందుతుంది. అతనికి రాక్షస ప్రవృత్తి. వెంటనే సుదర్శనమును ప్రయోగించి కుత్తుక కోసేశాడు. పరమాత్మ ఏక కాలమునందు ధర్మాధర్మములను ఆవిష్కరించాడు. అమృతంతో కూడినందు వల్ల తల నిర్జీవం కాలేదు. మొండెం మాత్రం క్రిందపడిపోయింది. పంక్తియందు కూర్చున్న వాడికి అమృతం పోయడం ధర్మం. రాక్షసుడు బ్రతికి ఉంటే ప్రమాదం తెస్తాడు కాబట్టి నిర్జించడం ధర్మం. శిరస్సు అమృతం త్రాగిందని బ్రహ్మగారు నవగ్రహములలో ఒక గ్రహ స్థానమును ఇచ్చి రాహువును అంతరిక్షమునందు నిక్షేపించారు. ఆనాడు కనుసైగ చేసినందుకు గాను రాహువు సూర్య చంద్రులను ఇప్పటికీ గ్రహణ రూపంలో పట్టుకుంటూ ఉంటాడు.

తదనంతరము మోహిని వరుసగా దేవతలకు అమృతం పోసి రాక్షసుల వైపు తిరిగి అమృతం అయిపోయినట్లుగా కుండ తిప్పి చూపించింది. అపుడు రాక్షసులు దేవతలతో యుద్ధం మొదలు పెట్టారు. మోహినీ స్వరూపం అంతర్ధానం అయిపోయింది. ఈవిధంగా దేవతలు అమృతం పొందారు. చాలారోజులు యుద్ధం జరిగింది. అందులో ‘నముచి’ అని ఒకడు బయల్దేరాడు. వాడు దేవేంద్రునితో బ్రహ్మాండమయిన యుద్ధం చేశాడు. దేవేంద్రుడు వాని పరాక్రమం చూసి ఆశ్చర్యపోయి ‘వీడు ఎలా చనిపోతాడు?’ అని అడిగాడు. ‘వాడు తడిలేని పొడిలేని వస్తువుతో మాత్రమే తాను చనిపోయేలా వరం అడిగాడు. అందుకని వారిని తడి పొడి లేని వస్తువుతో కొట్టు’ అన్నారు. ఇంద్రుడు తన వజ్రాయుధమును సముద్రపు నురుగులోకి తీసుకు వెళ్ళి అటూ ఇటూ తిప్పాడు. నురుగు తడి పదార్ధం కాదు పొడి పదార్ధం కాదు. అలా ప్రయోగించేసరికి నముచి చచ్చిపోయాడు. దీనిని ఒక కథగా కాకుండా అంతకు మించి ఇందులో తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. కష్టం వచ్చినపుడు దేవతలు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేశారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరుని ప్రార్థన చేయడం అనేది ఈ జాతి సొత్తు. క్షీరసాగరము అనేది ఒక పాలకుండ. అది మన హృదయమందే ఉన్నది. ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. పాలకుండను విడిచిపెట్టి లోకము చుట్టూ తిరుగడము చేత అశాంతి ఉన్నది. ఏది శాంతిని ఇస్తుందో దానిని పట్టుకుంటే శాంతిని ఇస్తుంది. మనస్సు శాంతిగా ఉండాలంటే శాంతికరమైన పదార్ధమును పట్టుకోవాలి. మనలో ఉన్నది పట్టుకోవడం బయట తిరగడం వలన సాధ్యం కాదు. బయటకు వెళ్ళడం కాదు. లోపలికి వెళ్ళాలి. మనకెప్పుడూ బయటకు వెళ్ళడమే తెలుసు కానీ లోపలికి వెళ్ళడం తెలియదు. లోపలికి వెళ్ళడానికి అసలు ప్రయత్నం చేయలేదు. అలా ప్రయత్నం చేయడమే క్షీరసాగర మథనం. పాలసముద్రంలో మంధర పర్వతమును దింపడం అంటే ధ్యానంలో మన మనస్సును తీసుకు వెళ్ళి స్వామి దగ్గర పెట్టడం అన్నమాట. ధ్యానమునందు నిష్ఠ కుదరడానికి చాలా ప్రయత్నం చేయాలి. లేకపోతే మనస్సు మంధర పర్వతం ఊగినట్లే ఊగుతుంది. కంగారుపడిపోకూడదు. మళ్ళీ దానిని వెనకకి తీసుకురావాలి. స్వామీ! నా ధ్యానము బాగా కుదిరేటట్లు చూడని ప్రార్థన చేయాలి. తొట్రుపడితే భగవంతుడినే ప్రార్థించారు. ఆయన ఆదికూర్మమయ్యాడు. ఆయనే ఆధారం అయాడు. అలాగే ధ్యానంలో చెదిరిన నీ మనస్సును కుదర్చడానికి స్వామి ఏదో రూపంలో సహాయం చేస్తాడు. ఇదే మంధర పర్వతమును దింపి క్షీర సాగరమథనం చేయడము. అలా ధ్యానం చేయగా చేయగా ముందు ప్రశాంతత కలుగుతుంది.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[17/11, 4:40 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 60 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


వామనావతారం

అమృతోత్పాదనం అయిన తరువాత ఆ అమృతమును సేవించిన దేవతలు వార్ధక్యమును మరణమును పోగొట్టుకున్న వారై మళ్ళీ సామ్రాజ్యమును చేజిక్కించుకొని అత్యంత వైభవముతో జీవితమును గడుపుతున్నారు. ఒక గొప్ప ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. అమృతం త్రాగిన తరువాత ఒకవేళ అది అహంకారమునకు కారణం అయితే పరిస్థితి ఏమిటి? ఈ అనుమానములను తీర్చడానికే కాలగమనంలో ఉత్థాన పతనములు జరుగుతాయి. రాక్షసులకు నాయకత్వం వహించిన బలిచక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయినందుకు బెంగ పెట్టుకోలేదు. తన గురువయిన శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి పాదములు పట్టుకున్నాడు. ‘మహానుభావా! మాకందరికీ కూడా అమృతోత్పాదనంలో భాగం ఇచ్చారు కష్టపడ్డాము. కానీ అమృతమును సేవించలేకపోయాము. అమృతమును సేవించకపోవడం వలన ఇక మేము శాశ్వతంగా ఎప్పుడూ దేవతల కన్నా అధికులం కాకుండా ఉండిపోవలసినదేనా? అమృతం త్రాగినవారిని కూడా ఓడించగలిగిన శక్తి మాకు మీ పాదముల నుండి వస్తుందని మేము నమ్ముతున్నాము. మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాలి. నేను పరిపూర్ణమయిన విశ్వాసంతో మీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను’ అన్నాడు.

ఇపుడు గురుశక్తి గొప్పదా? అమృతము గొప్పదా? ఈ విషయం తేల్చాలి. శుక్రాచార్యులవారు బలి చక్రవర్తితో ‘ఇప్పుడు నేను నీతో ఒక యాగం చేయిస్తాను. దీనిని ‘విశ్వజిత్ యాగము’ అంటారని ఆ యాగమును బలిచక్రవర్తి చేత ప్రారంభింప జేశారు. యాగమునకు ఫలితము విష్ణువే ఇవ్వాలి. విశ్వజిత్ యాగము నడుస్తోంది. అది పరిపూర్ణం అయ్యేసరికి ఆ యాగగుండములో నుండి ఒక బంగారురథము బయటకు వచ్చింది. దానిమీద ఒక బంగారు వస్త్రము కప్పబడి ఉన్నది. సింహము గుర్తుగా గలిగిన పతాకం ఒకటి ఎగురుతున్నది. అద్వితీయమయిన అక్షయ తూణీరముల జంట వచ్చింది. ఒక గొప్ప ధనుస్సు వచ్చింది. శుక్రాచార్యుల వారి అనుమతి మేరకు బలిచక్రవర్తి వాటిని స్వీకరించాడు. బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. ఆయన వచ్చి ఒక స్వర్ణ పుష్పమాల బలిచక్రవర్తి మెడలో వేశాడు. శుక్రాచార్యుల వారు అనుగ్రహంతో అమృతం తాగిన వాళ్ళని ఓడించడం అనేది బలిచక్రవర్తి కోరిక. విశ్వజిత్ యాగం ఫలించింది. స్వర్ణ పుష్పమాలను మెడలో వేసుకొని దివ్యరథమును ఎక్కి అమరావతి మీదకి దండయాత్రకు వెళ్ళాడు.

ఇంద్రుడు ఈవార్త తెలుసుకున్నాడు. ‘అవతలి వాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు. నేను యుద్ధం చేయగలనా? శుక్రాచార్యులు బలిచక్రవర్తి చేత విశ్వజిత్ యాగం చేయించాడు. ఆయన శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తను సలహా నిమిత్తం గురువుగారి దగ్గరకు వెళ్ళాలి’ అనుకుని ఇంద్రుడు దేవతలతో కలిసి గురువు గారయిన బృహస్పతి వద్దకు వెళ్ళాడు. దేవతలను ఉద్దేశించి ఆయన అన్నారు ‘ఈవేళ బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారి అనుగ్రహం పరిపూర్ణముగా ఉన్నది. నాకు తెలిసినంత వరకు బలిచక్రవర్తిని ఓడించగలిగిన వాడు సృష్టిలో ఇద్దరే ఉన్నారు. ఒకడు శివుడు, రెండు కేశవుడు. ఇంకెవరు బలిచక్రవర్తిని ఓడించలేరు. మనం ఆయననే ప్రార్థన చేద్దాము’ అని చెప్పగా వారందరూ శ్రీమహావిష్ణువును ప్రార్థన చేశారు.

శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఒక చిత్రమయిన మాట చెప్పారు ‘బృహస్పతి చెప్పినది యథార్థము. ఏ గురువుల అనుగ్రహముతో ఈవేళ బలిచక్రవర్తి ఈ స్థితిని పొందాడో మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికి బలిచక్రవర్తి దూరమైన రోజున మీరు బలిచక్రవర్తిని చిటికిన వేలితో కొట్టగలరు. గురువుల అనుగ్రహం అంత స్థాయిలో ఉండగా మీరు వానిని ఏమీ చేయలేరు. యుద్ధం చేయడం అనవసరం. మీరు అమరావతిని విడిచిపెట్టి వేషములు మార్చుకుని పారిపోండి’ అని చెప్పాడు. దేవతలు తలొక దిక్కుపట్టి వెళ్ళిపోయారు. బలిచక్రవర్తి అమరావతి వచ్చి చూశాడు. ఒక్కడు కూడా లేడు. దివ్యమయిన అమరావతీ పట్టణం సునాయాసంగా తనది పోయింది. ఇంద్ర సింహాసనమును అధిరోహించి కూర్చున్నాడు. ఇకనుంచి యజ్ఞ యాగాది క్రతువులు ఏవి చేసినా హవిస్సులు తనకే ఇమ్మనమని ఆజ్ఞాపించాడు. మళ్ళీ అహంకారము ప్రారంభమవుతుంది. బలిచక్రవర్తి వైభవం కొనసాగుతోంది. ఆయన దానధర్మములకు పెట్టింది పేరు. అటువంటి బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు. ముల్లోకములను పాలన చేస్తున్నాడు. ఆయన మహాభక్తుడు రావణాసురుని వంటి ఆగడములను చేసిన వాడు కాదు. ఇటువంటి సమయంలో చిత్రమయిన ఒక సంఘటన జరిగింది.

కశ్యపప్రజాపతికి ఇద్దరు భార్యలు. ఒకరు అదితి, ఒకరు దితి. ఇంద్రాదులు అదితి కుమారులు. ఇవాళ వారు అమరావతిని విడిచిపెట్టి అరణ్యములలోకి వెళ్ళిపోయారు. ఆవిడ బాధ భరించలేక ఒకనాడు తన భర్త అయిన కశ్యప ప్రజాపతికి చెప్పింది. కశ్యపప్రజాపతి గొప్ప బ్రహ్మజ్ఞాని. ఆయన ఒక నవ్వు నవ్వి ‘అదితీ! ఈ భార్యలేమిటి? కొడుకులేమిటి? రాజ్యాలేమిటి? ఈ సింహాసనములు ఏమిటి? ఈ గొడవలు ఏమిటి? ఇదంతా నాకు అయోమయంగా ఉన్నది. ఈ సంబంధములకు ఒక శాశ్వతత్వం ఉన్నదని నీవు అనుకుంటున్నావా? నేను అలా అనుకోవడం లేదు. ఉన్నదే బ్రహ్మమొక్కటే అని అనుకుంటున్నాను. నీవు విష్ణు మాయయందు పడిపోయావు. అందుకని ఇవాళ నీ బిడ్డలు, దితి బిడ్డలు అని రెండుగా కనపడుతున్నారు. ఒకరికి ఐశ్వర్యం పోయింది. ఒకరికి ఐశ్వర్యం ఉన్నదని బాధపడుతున్నావు. నేనొక మాట చెప్పనా! ఈ ప్రపంచంలో కష్టములో ఉన్నవానిని ఈశ్వరుడు ఒక్కడే రక్షించగలడు. ఆయనను అడగాలి గానీ నన్ను అడుగుతావేమిటి? నిజంగా రక్షణ పొందాలి, నీ కొడుకైన దేవేంద్రుడు దేవతలు తిరిగి ఆ సింహాసనమును పొందాలి అని నీవు అనుకున్నట్లయితే మహానుభావుడయిన ఆ జనార్దనుని పూజించు. ఆయన ప్రీతి చెందితే ఆయన చేయలేనిది ఏదీ ఉండదు. సర్వేశ్వరుడయిన నారాయణుని ప్రార్థించు’ అని చెప్పి ‘పయో భక్షణము’ అనే ఒక వ్రతమును కల్పంతో ఆమెకు ఉపదేశం చేశాడు. ఆ వ్రతం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది మనందరం చేసే వ్రతం కాదు.

ముళ్ళపంది లేదా అడవిపంది తన కోరతో పైకెత్తిన మట్టిని తీసుకొని ఒంటికి రాసుకుని స్నానం చేసి చాలా జాగ్రత్తలు తీసుకొని పన్నెండు రోజులు ఆ కల్పమును ఉపాసన చేయాలి. అలా చేయగలిగితే భగవంతుడిని సేవించగలిగితే పన్నెండు రోజులలో శ్రీమన్నారాయణుని అనుగ్రహము కలుగుతుంది. భగవంతుడయిన శ్రీమన్నారాయణుని అనుగ్రహమును కోరి నీవు ఈ వ్రతమును చేయవలసింది’ అని చెప్పాడు. ఆవిడ భర్త మాటలను నమ్మి పన్నెండు రోజులు ఈ వ్రతం చేయగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆవిడ శ్రీమన్నారాయణుడు కనపడితే తన కొడుకుకి రాజ్యం ఇప్పించాలని వ్రతం చేస్తోంది. నిజంగా శ్రీమన్నారాయణుడు కనపడేసరికి అదితి ఆయన రూపమును కళ్ళతో జుర్రుకు త్రాగేసింది. గట్టిగ కంఠం రాక ఏమి మాట్లాడుతున్నదో కూడా వినపడకుండా అలా చూస్తూ ఉండిపోయింది. ఆమె చేస్తున్న ఆ స్తోత్రము అంతటా నిండి నిబిడీకృతమయిన వాడెవడున్నాడో ఆయనకే వినపడాలి.

స్వామి అదితిని ‘నీవు ఈపూజ ఎందుకు చేశావు?’ అని అడిగాడు. ఆవిడ ‘స్వామీ! నా కుమారుడయిన దేవేంద్రుడు రాజ్యభ్రష్టుడు అయ్యాడు. నా కుమారునికి రాజ్యం ఇవ్వవలసింది’ అని అడిగింది. స్వామి ‘నీ కుమారునికి రాజ్యం ఇప్పిస్తాను’ అని అనకుండా ‘అమ్మా! నీ కుమారుడు ఇంద్రుడు, కోడలు శచీదేవి బాధపడుతున్నారని అనుకుంటున్నావు కదా! వాళ్ళందరూ నీవు సంతోషించేటట్లు నేను తప్పకుండా నీవు అడిగిన పని చేస్తాను. కానీ అమ్మా, నాకు ఒక కోరిక ఉంది. ‘ఇపుడు ఈశ్వరుడు అదితిని వరం అడుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి! వరము అడగడానికి కూర్చున్న అదితిని నారాయణుడు . ‘అమ్మా! నాకు నీ కొడుకునని అనిపించుకోవలెనని ఉన్నది. నీ గర్భవాసము చేయాలని అనిపిస్తోంది. నీ కొడుకుగా పుడతాను’ వరము అడిగాడు. అలా అడిగేసరికి అదితి తెల్లబోయింది. ఆమె ‘స్వామీ! నాకు అంత భాగ్యమా! తప్పకుండా’ అన్నది. స్వామి ‘నీ భర్తను ఇదే రూపంతో ఇంతకు పూర్వం ఏ భక్తితో ఉన్నావో అలా నీ భర్తను సేవించు. నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తాను’ అన్నాడు. ఎంతో యథాపూర్వకంగా పుట్టాడు. ఆమె గర్భమునందు ప్రవేశిస్తే బ్రహ్మగారు శ్రీమన్నారాయణుని స్తోత్రం చేశారు. అదితి గర్భం గర్భాలయం అయింది.

గర్భము నిలబడినది కనుక ఆవిడ చుట్టూ ఉన్న స్త్రీలు వేడుక చేశారు. అమ్మ కడుపులో ఉండవలసిన కాలము పూర్తయిన తరువాత మంచి ముహూర్తం చూసుకొని శ్రావణమాసంలో ద్వాదశి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్సంజ్ఞాతలగ్నంలో ఆయన జన్మించాడు. ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసిన వయస్సు పొందిన బాలుడిగా శంఖ, చక్ర, గద, పద్మములతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. అదితి స్తోత్రం చేసింది. కశ్యపప్రజాపతి స్తోత్రం చేశారు. వెంటనే ఆయన తన రూపమును ఉపసంహారం చేశారు. ఉపనయనం చేసుకునే వయస్సు ఉన్న వటువుగా ఎనిమిది సంవత్సరముల పిల్లవానిగా మారిపోయాడు. వటువుకి కశ్యప ప్రజాపతి ముంజెగడ్డితో చేసిన మొలత్రాడు ఇచ్చారు. తల్లి అదితి కౌపీనం ఇచ్చింది. బ్రహ్మగారు కమండలం ఇచ్చారు. సరస్వతీ దేవి అక్షమాలను ఇచ్చింది. సూర్యభగవానుడు ఆదిత్యమండలమునుండి క్రిందికి దిగి వచ్చి గాయత్రీ మంత్రమును ఉపదేశం చేశాడు. చంద్రుడు చేతిలో పట్టుకునే మోదుగకర్రతో కూడిన దండమును ఇచ్చాడు. ఇంతమందీ ఇన్ని ఇస్తే కృష్ణాజినంతో కట్టుకునే నల్లటి జింకచర్మమును దేవతలు పట్టుకు వచ్చి ఇచ్చారు. యజ్ఞోపవీతమును పట్టుకుని దేవతల గురువైన బృహస్పతి వచ్చారు. వీళ్ళందరూ ఉపనయన మంత్రములతో పిల్లవానికి సంస్కారములన్నీ చేశారు. భిక్షాపాత్రను సాక్షాత్తు కుబేరుడు ఇచ్చాడు. భవానీమాత వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది. ఇది తీసుకొని మహానుభావుడు బయలుదేరి బలిచక్రవర్తి కూర్చున్న చోటికి వెళ్ళాడు. బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కూర్చుని ఉన్నాడు. బలిచక్రవర్తి మహాతేజస్సుతో వస్తున్న వటువును చూశాడు. వటువు బ్రహ్మచారి కాబట్టి రాజును ఆశీర్వచనం చేయవచ్చు. వటువు ‘ఓహో! నీవేనా బలిచక్రవర్తివి. నీవేనా భూరి దానములు చేసే వాడివి. నీకు స్వస్తి స్వస్తి స్వస్తి. స్వస్తి అంటే శుభము. ఇలా బలిచక్రవర్తిని చూడగానే ఆశీర్వదించాడు.

బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించాలి. బలిచక్రవర్తి వెంటనే లేచి నిలబడి వింధ్యావళిని బంగారు పళ్ళెమును తీసుకురమ్మనమని చెప్పాడు. వటువును ఉచితాసనము మీద కూర్చోబెట్టి ఆ బంగారుపళ్ళెమును వటువు కాళ్ళ క్రింద పెట్టి ఆయన పాదములు కడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు. వింధ్యావళికి తీర్థం ఇచ్చాడు. ఆయన పాదోదకమును శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

వివాహంలో ఆటంకాలు భక్తితో జపించాలి

 🎻🌹🙏వివాహంలో ఆటంకాలు ఎదురయ్యే వారు శివుని ఈ 11మంత్రాలు భక్తితో జపించాలి!!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంతా అంటారు. శివుడి ని అనేక రకాల పేర్లతో పూజిస్తుంటారు. అంతే కాదు శివుడిని లయకారుడు, భోళా శంకరుడు, త్రినేత్రుడు,ముక్కంటి అని కూడా అంటారు. అష్టదిక్పాలకులు అధిపతి కూడా ఆ మహేశ్వరుడు అని అంటారు. అంతేకాదు నవగ్రహాలకు అధిపతి కూడా శివుడే అని అంటారు.


 అందుకే ఆ భోలశంకరుడి ఆశీస్సులు మనపై ఉంటే అన్ని ఇబ్బందులు ఇట్టే సమసిపోతాయని నమ్మకం. ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నాయని భావిస్తున్నా… శివుడ్ని పూజిస్తే తొలగిపోతాయి. ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే కోరిన వరాలు ఇచ్చేస్తారు.


శివుణ్ణి భక్తితో నమస్కరిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి. శివునికి బిల్వ పత్రాలంటే చాలా ఇష్టం. వాటితో అర్చన చేస్తే మంచిది. శివుణ్ణి భక్తితో పూజిస్తే తెలివితేటలు, మానసిక ప్రశాంతత కలగటమే కాకుండా జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. 


శివుణ్ణి ఆరాదిస్తే వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవు. ఒకవేళ వచ్చిన వెంటనే సమసిపోతాయి.


ముఖ్యంగా పెళ్లి కానీ అమ్మాయి అయినా అబ్బాయిలు అయినా శివుణ్ణి ఆరాదిస్తే పెళ్ళికి ఉన్న ఆటంకాలు అన్ని తొలగిపోయి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.


 శ్రీ మహా విష్ణువు పార్వతికి శివారాధన ఎలా చేయాలో చెప్పారు.11 మంత్రాలతో శివుణ్ణి ఆరాదిస్తే మనసులోని కోరికలు నెరవేరతాయి. అలాగే పెళ్లి కానీ వారికీ పెళ్లి త్వరగా అవుతుంది.


ఈ 11 నామాలు శివుని శరీరంలోని ఒక్కో భాగానికి సంబందించినవి.


 ఇప్పుడు ఆ నామాల గురించి తెలుసుకుందాం…ఈ నామాలను భక్తితో ఉచ్చరిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి.


1.ఓం హ్రీం హృదయా నమ: –

 హృదయాన్ని ఆరాధించడం.


2.ఓం హ్రీం ష్రైసే స్వాహ.- శిరస్సును పూజించడం.


3.ఓం హ్రీం శిఖాయి వషత్.- శివుని జాటజూటాన్ని అభిషేకించడం.


4.ఓం హ్రీం కవచాయ నమ:- శివుని కీర్తిని శ్లాఘించడం.


5.ఓం హ్రీం నేత్ర త్రయాయ వషత్ -కనులను పూజించడం.


6.ఓం హర అస్త్రాయ పహత్ – భుజాలను అభిషేకించడం.


7.ఓం హ్రీం సద్యయోజటాయ నమ:


8.ఓం హ్రీం వామదేవాయ నమ:


9.ఓం హ్రీం అఘోరాయ నమ:


10.ఓం హ్రీం తత్పురుషాయ నమ:


11.ఓం హ్రీం ఇష్ణాయ నమ: ...🚩🌞🙏🌹🎻


శ్రీ లలితా పరమేశ్వరి దేవస్థానం వారి సౌజన్యంతో సేకరణ...🙏💐


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

దృఢ విశ్వాసం అత్యంత ఆవశ్యకం

 వేద వాంగ్మయంలో హోమ పక్షి ప్రస్తావన ఉంది. ఆ పక్షి ఎప్పుడూ ఆకాశంలోనే ఎగురుతూ ఉంటుంది. దానికి ఆహారం ఆకాశంలో దొరకదు కాబట్టి, భూమి మీద ఆహారాన్ని స్వీకరిస్తుంది. కానీ, కాళ్లు భూమిపై మోపదు. అది గుడ్లు కూడా భూమిమీద పెట్టదు. ఆకాశంలో ఎగురుతూనే గుడ్డు జారవిడుస్తుంది. గుడ్డు భూమిపైకి జారేలోగానే దాన్నుంచి పక్షిపిల్ల బయటకు వస్తుంది. పిల్ల అలా కిందికి జారుతున్న సమయంలోనే రెక్కలు మొలుచుకొస్తాయి. పక్షిపిల్ల లక్ష్యం తన తల్లిని చేరటమే! రెక్కలు అల్లాడించి పైకి ఎగిరే ప్రయత్నం చేస్తుంది. నెమ్మదిగా తల్లిని కలుసుకోవడమనే లక్ష్యాన్ని సాధిస్తుంది. భగవంతుని చేరాలనే లక్ష్యాన్ని భక్తుడు అలా సాధించుకోవాలంటారు రామకృష్ణ పరమహంస. సంసారికైనా, సన్యాసికైనా ఆశించదగ్గ ఏకైక బ్రహ్మపదార్థం- భగవంతుడే!

   ఆధునిక ప్రపంచంలో లౌకిక జీవనం చేసే మానవులకు కర్మ, జ్ఞాన యోగాలు అనుష్ఠించడం ఎంతవరకు ఆచరణ సాధ్యం? కర్మయోగం నిష్కామకర్మను (చేసిన కర్మకు ఫలితాన్ని ఆశించకపోవడం) ప్రతిపాదిస్తుంది. నిష్కామకర్మ ఆధునిక జీవితంలో సాధ్యమా అని యోచిస్తే, సమాధానం ఆశాజనకంగా ఉండదు. జీతమే లక్ష్యంగా ఉద్యోగం, లాభమే లక్ష్యంగా వ్యాపారం, ఆదాయమే లక్ష్యంగా పెట్టుబడి- మనం చేసే అలాంటి వ్యాపకాలేవీ నిష్కామకర్మలు కావు. జ్ఞానయోగం నేను, నాది అనే భ్రమను వీడమంటుంది. స్థితప్రజ్ఞతను ప్రతిపాదిస్తుంది. సుఖాల్లో పొంగిపోతాం. కష్టాల్లో కుంగిపోతాం. రోగాలకు చలించిపోతాం. చావంటే వణికిపోతాం. మరి స్థితప్రజ్ఞత సాధించేదెన్నడు?

ఓ దేహధారిగా స్థితప్రజ్ఞుడికీ దేహావసరాలుంటాయి. ఆ అవసరాలు తీర్చుకోకుండా బతుకు బండి సాగదు. బాహ్యసంరక్షకులుగా ఎవరున్నప్పటికీ ఎవరికైనా దేహభారం వహించేది నిజానికి దైవమే. ఆ ఎరుకే ఆయన పట్ల మనిషి చూపగల నిజమైన కృతజ్ఞత! సంపద, పలుకుబడి, అందం, అధికారం, హోదా, కళాభినివేశం వంటి ప్రలోభాలకు దాసుడుకాని వ్యక్తి ఆత్మసాధన పట్ల నిజాయతీ కలిగి ఉంటాడు. కలియుగంలో భక్తిమార్గం ద్వారానే దైవాన్ని సాకారం చేసుకోవాలనే కల నిజం చేసుకోవచ్చంటాయి శాస్త్రాలు. లక్ష్యాన్ని సాధించగలనన్న సాధకుడి బలమైన విశ్వాసం అతడికి సత్ఫలితాలను అందిస్తుంది.

ఒకప్పుడు ఓ ప్రాంతంలో అనావృష్టి విలయతాండవం చేసింది. వరుణదేవుడి కరుణ కోసం గ్రామస్థులంతా దేవాలయంలో జప తపాలు, ప్రత్యేక పూజలు చేయాలని సంకల్పించారు. నిర్ణయించిన ముహూర్తానికి వైదిక కర్మలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణానికి ఓ బాలుడు గొడుగుతో వచ్చాడు. పూజాఫలంగా వర్షం కురుస్తుందనీ, అప్పడు ఛత్రం ఉపయోగించవచ్చనీ బాలుడి బలమైన విశ్వాసం. అటువంటి నమ్మకం అవసరం. లక్ష్యాన్ని సాధించగలనన్న దృఢ విశ్వాసం సాధకుడికి ఉండటం అత్యంత ఆవశ్యకం! 

లక్ష్యశుద్ధి లేకుండా లక్ష్యసిద్ధి జరగదన్నది పెద్దల మాట!

అమృతవే తాగినాక, పాయసవేం రుచిస్తుందీ

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

       *🌷నేనూ,'మిథునం'🌷*          

                      🌷🌷🌷

సాధారణంగా, మనవో మంచి కథనో, నవలనో చదివినప్పుడ దానికి, మనసులో ఓ పటం కట్టేసు కుంటాం.  మీ అందరి సంగతీ ఏవోగానీ, నేను మాత్తర వంతే! ఆ రచైత మహత్తరంగా వొర్ణించేడూ, పాత్రల్నీ అంటే, మరీనూ.  అయ్యి కళ్ళముందే నిలిచిపొయ్యి నిచ్చతాండవమే!  అట్టా గుండెకి అత్తుకుపొయ్యి చదూ తున్నప్పుడల్లా, గిలిగింతలు పెడతా, సివరాకరి కొచ్చే ప్పటికి, గుండెని సివుక్కుమనిపిచ్చి, కళ్ళని సెరువులు సేసేసి, మసకబారిన సూపుకి కాసింతసేపు యితరాలు కనపడకుండా సేసే వృద్ధజంట కతనే *'మిథునం'*.  అది మొట్టమొదటగా అచ్చులో వొచ్చినప్పుడే చదివేసి,

ముగింపు దుఃఖాన్ని,  శ్రీరవణగారికి ఉత్తరంలో కుమ్మ రిచ్చిగాని, కుదటపడలా.  ఆ కథని గుండెల్లోనూ, తరవాత పుస్తకంగా వొచ్చాక కొనీసుకుని బీరువాలోనూ, బద్రంగా దాచుకున్నా.  అప్పట్టోనే ఎంతోమంది మిత్రులకిచ్చి చదివిచ్చా.  ఎన్నో, ఎన్నెన్నోసార్లు నేనూ చదివా, రావాయణంలెక్కన!చదివిన ప్రతీసారీ లంకంత పెరడూ, అందులో కంఠాలు చింపుకుంటో చిటచిట మాటల్తో, బావి దగ్గర బకెట్లకొద్దీ నీళ్ళు తోడినెత్తిన పోసుకుంటోన్న బక్కపల్చటి బర్తగారూ, పూలూ, కాయలూ కోస్తో అందవైన ముసలి జింక లాంటి బార్యా కళ్ళక్కడతారు.  ఎంత సుందర దృశ్యవనీ?  ఏదో ఆళ్ళపాటికి ఆళ్ళు, ఆళ్ళింటోనే పడివున్నారు కాబట్టి కానీ, ఏ కొడుకులింటో వున్నా

ఆళ్ళని బరించగలరాని? పిల్లలకన్నా కనాకష్టం గోలయ్యే యిద్దరిదీనూ! ఇతరులెవ్వరికీ ప్రవేశవే లేని మరో ప్రెపంచం వారిద్దరిదీనూ.  అదే,వేరెవ్వరైనా సరే, 'ముసలాళ్ళిద్దరూ ఎప్పుడూ పోట్టాడుకు చస్తానే వుంటారు', అని ఈసడించి పడెయ్యరూ?  అందుకే, వాళ్ళింటోనే వాళ్ళగోలల్లో వాళ్ళు కిందా మీదా పడుతుంటారు.  ఆ దశాబ్దానికే అత్యుత్తవవైన అంత చక్కని, తేటనీటి ప్రవాహవూ, పారిజాతవనవూ, రవివర్మ చిత్తరవూ, వగైరాలవంటి ఆ కథాకన్యని, శ్రీరవణగారి కళాసృష్టిని, సినీమాగా తియ్యబోతున్నారు, అనంగానే నెత్తిన పిడుగుపడ్డట్టే అనిపిచ్చింది. గుండెనెవరో గుప్పెట్టో నొక్కేసినట్టు వొహటే బాధ.  అది ఓ పెద్ద కథ మాత్రవే, పైగా యిద్దరే మూలస్తంభాలూ.

పూరీపిండి వుండతో,రుమాలీరోటీ వొత్తితే చిరిగి చీలికలయ్యి పోదూ?ఈ కథ కూడ ఎంతదనీ?  దాన్నో సినీమాగా సాగదియ్యడానికీ ఎన్నెన్ని అతుకులో

గందా వెయ్యాలీ?  కథ చదవకుండా, సినీమా చూసిన వాళ్ళు ఆనందించ గలరేవో కాని, నాలా కథకి హృదయం పారేసుకున్న వారికి పరకంతన్నా నచ్చుతుందాని?  అసలా వృద్ధజంటని ఎంపిక చెయ్యడవే ఓ యజ్ఞవయ్యే. ఆ పి.యల్. నారాయణగారు బతికున్నా బాగుండేది, అతికినట్టుండేవారు ఆహార్యానికి.  ఆయన పక్కన, 'గోదావరి' సిన్మాలో, నాయికకి  హీరోగారి మామ్మ 'గోరింటాకు' పెడుతుంది. ఆవిడయితే చక్ఖగా సరిపొయ్యే వారు.  జోడీ సరే, కథాసాగదీతల సంగతో?  ఎంత దిగులేసిందో, ఏవేవి కలిపి దాన్ని కలగూరగంపని చేస్తారోనని?సరే, గడపదాటని బంగారుతల్లి లాంటి పదారణాల పల్లెపిల్లలాంటి కథని, ఏకంగా తెరపైకెక్కించి తైతక్కలాడించేందుకు,

అంగీకరించారని శ్రీరవణగారిమీద ఎంతకోప వొచ్చిందో?  సరే, ఆయన సృష్టీ, ఆయనిష్టం, అనుకొని మర్చిపొయ్యేందుకుఅష్టకష్టాలూ పడ్డాకాని, పనవ్వలే.  చివరికా సినీమా వొచ్చిపడింది, జహనమ్మీద.  సహజ పరిమళ భరితవైన మల్లిపువ్వుకీ, రంగుల ప్లాస్టీకు పువ్వుకీ వున్నంత తేడా వుంది కథకీ, సినీమాకీ, అన్నారు చూసొచ్చిన మిత్రులొకరు.  ఆయన కూడ ఆకథకి దాసోహపడ్డవారే. 'అప్పాదాసుగారిందులో సకలకళా కోవిదులూ, గొప్ఫమానవతా మూర్తులూ, మన్నూమశానవూనూ. అసలిందులోజంట, నిజ్జంగానే సినిమా జంట.  అంతా డ్రామాలే, సహజత్వవే లేదు.  మన కథలో జంట మాత్తరవే, అస్సలయిన, నిఖార్సయిన *'మిథునం',* మన వెరిగినవాళ్ళూ, మనకయిన వాళ్ళూనూ!  సినిమాలో వాళ్ళు బొత్తిగా అపరిచితుల్లా చిరాగ్గా అ(క)నిపించారు, వాళ్ళ అతి వేషాలతో ' అన్నారు, ఆత్మీయంగా కతలో వాళ్ళని తలచుకొంటా! ముందే రకరకాల బయాల్తో వున్న నేను, ఈనాటికీ ఆసినీమా చూళ్ళేదు.  రంగోలీ చూస్తే, రవివర్మ చిత్రాన్ని చూసినట్టు కాదుగా?అందుకే పుస్తంకంతోనే వున్నా.

'మిథునం'ని మస్తకంలోనూ, మనసులోనూ నింపుకునే వున్నా!అమృతవే తాగినాక, పాయసవేం రుచిస్తుందీ?

                🌷🌷🌷

(ఇది ,కేవలం నా మనసుకి తోచినది మాత్రవే. దానిని సినిమాగా మాత్రవే మొదటిసారి చూసి ఆనందించిన

అదృష్టవంతులందరికీ, హృదయపూర్వక అభినందనలు!)


సేకరణ: వాట్సాప్ పోస్ట్. 

🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

సంస్కృతంలో పుష్పాల పేర్లు:-*

 *-:సంస్కృతంలో పుష్పాల పేర్లు:-*


1.సేవంతికా = చామంతి

2.సూర్యకాంతి: = పొద్దుతిరుగుడు

3.మాలతీ = మాలతీ

4.వకులం = పొగడ

5.కమలం = తామర

6.జపా = మందార

7.జాతీ = జాజి

8.నవమల్లికా = విరజాజి

9.పాటలం = గులాబీ

10.నక్షత్ర సేవంతికా = నక్షత్ర చేమంతి

11.కురవకం = గోరింట

12.ప్రతాపన: = తెల్లమందారం

13.శిరీషం = దిరిశెన పువ్వు

14.ఉత్పలం = కలువపువ్వు

15.అంభోజం = తామర

16.సితాంభోజం = తెల్ల తామర

17.కుశేశయం = నూరు వరహాలు

18.కరవీరం = గన్నేరు

19.నలినం = లిల్లీ

20.శేఫాలికా = వావిలి

21.కుందం = మల్లె

22.అంబష్టం = అడివి మల్లె

23.జాతీ సుమం = సన్న జాజి

24.గుచ్చ పుష్పం = బంతి

25.కేతకీ = మొగలి

26.కర్ణికారం = కొండ గోగు

27.కోవిదారం = దేవకాంచనము

28.స్థలపద్మం = మెట్ట తామర

29.బంధూకం = మంకెన

30.కురంటకం = పచ్చ గోరింట

31.పీత కరవీరం = పచ్చ గన్నేరు

32.గుచ్చ మందారం = ముద్ద మందారం

33.చంపకం = సంపెంగ

34.పున్నగం = పొన్న పువ్వు

35.పుష్ప మంజరీ = పూలవెన్ను

36.అర్క = జిల్లేడు

37. నంద్యావర్తనం = నందివర్ధనం

38. బృహతీ = వాకుడు

39. ద్రోణ = తుమ్మిపూలు.

జంతు వాద్యం - జైలు

 జంతు వాద్యం - జైలు


ఒకసారి ఘటం మ్యాస్ట్రో విక్కు వినాయకరం గారి అబ్బాయి శ్రీ సేల్వగణేశ్ న్యూఢీల్లి కచేరిలో కంజీర వాయించారు. మరుసటి రోజు పత్రికలలో ఆయన అద్భుతమైన ప్రదర్శన గురించి చాలా గొప్పగా వచ్చింది. దాన్ని చూసిన అప్పటి పర్యావరణ శాఖ మంత్రి ఆ కంజీర జంతువుల చర్మంతో చేయబడినది అని తెలుసుకుని జంతువుల హక్కులు కాపాడాలని సేల్వగణేశ్ ను వెంటనే అరెస్ట్ చెయ్యవలసిందిగా పోలీసులను ఆదేశించారు.


ఆ వార్త విన్న వెంటనే వినాయకరం గారి ఇంట్లో భయాందోళనలు మొదలయ్యాయి. అదిగాక, కంజీరను జంతువు చర్మంతోనే చేస్తారు. ఎన్నో ఏళ్లుగా వాటిని ఇలాగే చనిపోయిన జంతువుల చర్మంతో తయారుచేస్తారు. సమయాభావం వల్ల వాళ్ళ న్యాయవాదిని కూడా కలవలేకపోయారు.


వినాయకరం గారికి వెంటనే మహాస్వామివారు గుర్తుకు వచ్చి, భోరున ఏడుస్తూ కంచికి కాలినడకన వస్తాన మమ్ములని కాపాడమని మొక్కుకున్నారు. కంచికి వెళ్తూ దారిలో టి త్రాగడం కోసమని ఒక దుకాణంలో ఆగారు. టి తాగుతూ అక్కడున్న రేడియోలో నుండి వస్తున్నా వార్తను విని ఆశ్చర్యపోయారు.


ఏవో కారణాల వల్ల ఆ పర్యావరణ శాఖ మంత్రిని ఆయన పదవి నుండి తొలగించినట్టు ఆ వార్తా సారాంశం. దాంతో ఆయన కుమారున్ని అరెస్టు చెయ్యలేదు.


జంతువుల చర్మంతో చేసిన వాయిద్యములనే మంగళ వాయిద్యములు అంటారు. శుభకార్యాలలో వీటిని తప్పక వాయించాలి. వీటిని చనిపోయిన జంతువుల చర్మంతో తయారుచెయ్యాలి కాని, వాటిని తయారుచెయ్యడం కోసం జంతువులను చంపరాదు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కాలభైరవాష్టకం

 కాలభైరవాష్టకం


శివాయ నమః || 


దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం 

వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్  

నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం 

కాశికాపురాధినాథ కాలభైరవం భజే|| ౧|| 


భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం 

నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ | 

కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం 

కాశికా పురాధినాథ కాలభైరవం భజే||౨|| 


శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం 

శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ | 

భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం 

కాశికా పురాధినాథ కాలభైరవం భజే ||౩|| 


భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం 

భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్ | 

వినిక్వణన్మనోజ్ఞహేమకిఙ్కిణీలసత్కటిం 

కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౪|| 


ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం 

కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ | 

స్వర్ణవర్ణశేషపాశశోభితాఙ్గమణ్డలం 

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫|| 


రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం 

నిత్యమద్వితీయమిష్టదైవతం నిరఞ్జనమ్ | 

మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం 

కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౬|| 


అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసన్తతిం 

దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ | 

అష్టసిద్ధిదాయకం కపాలమాలికన్ధరం 

కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౭|| 


భూతసఙ్ఘనాయకం విశాలకీర్తిదాయకం 

కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్ | 

నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం 

కాశికాపురాధినాథ కాలభైరవం భజే ||౮|| 


కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం 

జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ | 

శోకమోహదైన్యలోభకోపతాపనాశనం 

తే ప్రయాన్తి కాలభైరవాఙ్ఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||౯|| 


ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ||

కార్తికం

 *అనేక పేర్ల కార్తికం*


స్కాందపురాణంలో న కార్తీక సమో మాసః అనే వాక్యం ఉంది అంటే కార్తికంతో సమానమైన మాసం లేదు అని అర్థం. కృత్తికా నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఉన్నందున ఈ మాసం కార్తికమైందన్న విషయం తెలిసిందే. చాంద్రమానం ప్రకారం కార్తిక మాసానికి నాలుగు పేర్లు ఉన్నాయి. అవి కార్తికం, బహుళం, ఊర్జం, కార్తికి. ఈ నాలుగు పేర్లలో ఒక్కొక్క పేరుకు ఒక్కో విశిష్టత ఉంది. కృత్తికా నక్షత్రానికి అగ్ని నక్షత్రం అని పేరు. చలిబాధ అధికమైన ఈ మాసంలో శరీరంలోని అగ్నిని చల్లారకుండా కాపాడేది (అంటే పూర్తి చలికాలం ఇంకా రాదు) కనుక ఈ మాసం కార్తికం అయింది. బహుళ మైన ప్రయోజనాలు అందించేది కనుక దీనికి బహుళం అనే మరో పేరు ఉంది. అలాగే ఊర్జం అంటే ఉత్సాహం. కొన్ని రకాల నియమ నిష్ఠలు పాటించటానికి ఉత్సాహం ఉండాలి. వాటివల్ల ఉత్సాహం వచ్చే అవకాశమూ ఉంది. చలిగా ఉన్నా ఉదయాన్నే స్నానానికి వెళ్లే వారు ఉంటారు. అదే ఉత్సాహం. ఈ కారణాల వల్ల ఈ మాసానికి ఊర్జం అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక క కృత్తికా నక్షత్రంతో అనుబంధమైన మాసం కాబట్టి కార్తికం అనే పేరు వచ్చింది. ఇవి కాక ఈ మాసానికి కౌముది మాసం అనే పేరు కూడా ఉంది. కౌముది అంటే వెన్నెల. శరత్కాలపు స్వచ్ఛమైన వెన్నెల జాబిలి ఈ మాసంలో అం దంగా ప్రకాశించి సకల జీవ కోటికి ప్రశాంత


తను, పరమానందాన్ని కలిగిస్తుంది. దీపావళి మొదలు కార్తిక మాసం నెల రోజుల పాటు ఉదయం సాయంకాలాల్లో దీపాలు వెలిగిస్తే ఉత్తమ లోకాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.


🚩  🚩

కాలభైరవ జయంతి

 ॐ          ఈరోజు కాలభైరవ జయంతి 

    Today is Sri Kala Bhairava Jayanthi 

    


धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं

कर्मपाशमोचकं सुशर्मदायकं विभुम्।

स्वर्णवर्णकेशपाशशोभिताङ्गनिर्मलं

काशिकापुराधिनाथकालभैरवं भजे ॥


ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం

కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ I 

స్వర్ణవర్ణకేశపాశశోభితాఙ్గనిర్మలం

కాశికాపురాధినాథకాలభైరవం భజే ৷৷ 


    ధర్మమును రక్షించువాడు,    

    అధర్మమును నాశనము చేయువాడు, 

    కర్మపాశములను విడిపించువాడు, 

    సుఖమునిచ్చువాడు, 

    అంతటా వ్యాపించినవాడు, 

    బంగారు వన్నెకల కేశపాశములతో శోభిల్లు నిర్మల శరీరుడు, 

    కాశీ నగరమునకు అధిపతియైన కాలభైరవుని సేవించుచున్నాను.


Salutations to Lord Kalabhairava, the supreme lord of Kashi, 


  - who ensures that dharma (righteousness) prevails, 

  - who destroys the path of adharma (unrighteousness); 

  - who saves us from the bonds of karma, thereby freeing our soul; and 

  - who has golden-hued snakes entwined around his body.

ద్రోణాచార్యుడు

 మహాభారతంలోని పాత్రలు 

*1* *ద్రోణాచార్యుడు*


ద్రోణుడు భరద్వాజుని పుత్రుడు. ఈతని భార్య కృపి. కొడుకు అశ్వత్థామ. తండ్రి దగ్గరే సకలవిద్యలూ నేర్చుకున్నాడు. అగ్నివేశుడనే ముని దగ్గర ధనుర్విద్యను నేర్చుకున్నాడు. ద్రుపదుడూ, ద్రోణుడూ చిన్ననాటి మిత్రులు. కానీ వీరి జీవన స్థాయిలో ఆకాశానికీ, భూమికీ ఉన్న అంతరం. ద్రోణుని అపారమైన విద్యానైపుణ్యాలు అతని పేదరికంతో మరుగున పడిపోయాయి. తనకూ పాలు కావాలని మారాం చేశాడు. పిల్లవాడికి పాలను కూడా సమకూర్చలేని తన దీనస్థితికి తానే చింతిస్తూ డబ్బుకై వెదుకులాడగా పరశురాముడు చాలా దానాలు చేస్తున్నాడని తెలుసుకొని అక్కడికి వెళతాడు. అయితే ద్రోణుడు అక్కడికి వెళ్ళే సమయానికి పరశురాముడు సమస్తాన్నీ దానం చేసేస్తాడు. ద్రోణున్ని వట్టి చేతులతో పంపడం ఇష్టం లేక అస్త్రయోగ రహస్యాన్ని నేర్పుతాడు. ద్రోణుడు తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని దగ్గరకు వెళ్ళి తమ బాల్యాన్ని గుర్తుచేసే ప్రయత్నం చేయగా ద్రుపదుడు రాజకుటుంబీకులకూ, పేదవారికీ మధ్య స్నేహ సంబంధం అసంభవమని అవహేళన చేసి మాట్లాడుతాడు. ఆర్థిక సహాయం చేయమని అర్థించినా ద్రోణుని అవమానించి వెళ్ళగొడతాడు. ఆ అవమానాగ్నితో బాధపడుతూ ద్రోణుడు ఆ ఊర్లో ఉండలేక తన భార్యనూ, కొడుకునూ వెంటబెట్టుకొని తనకు చెల్లెలినిచ్చి పెళ్ళి చేసిన బావ కృపాచార్యుని దగ్గరకు హస్తినాపురానికి వస్తాడు.భీష్ముని ఆజ్ఞమేరకు కృపాచార్యుని దగ్గరే శిష్యరికం చేస్తున్న కురుపాండవులు ఒకనాడు ఆడుకుంటూ బంతిని బావిలో పడేస్తారు. దాంట్లోంచి బంతిని ఎలా తీయాలో తెలియక సతమతమవుతున్న వారిని చూసి ఆ బంతిని నేను తీయగలనని చెప్పి గడ్డిపరకలనే అస్ర్తాల్లాగ ప్రయోగించి సునాయాసంగా బయటకు తీసి వారిచేతిలో బంతిని పెడతాడు ద్రోణుడు. ఈతని గొప్పదనాన్ని భీష్మునికి పరిచయం చేస్తారు కురుపాండవులు. భీష్మునికి తన గురించిన పూర్తి వివరాలూ సత్యభాసితంగా చెప్పిన ద్రోణుడి ఉదాత్తతకు చలించి భీష్ముడు కురుపాండవులకు అస్త్ర విద్యాభ్యాసం చేయాలనీ వేడుకొని ధనధాన్య వస్త్ర, వస్తువులతో సత్కరించి ఆదరిస్తాడు. ఆనాటి హస్తినలో కురుపాండవులకు గురువుగా స్థిరపడిన ద్రోణుడు వారిని మంచి నిపుణులుగా తీర్చిదిద్దుతాడు. అర్జునునికి ప్రత్యేకంగా విలువిద్యను నేర్పి తనను మించిన వాడుగా చేస్తాడు. నిజానికి అర్జునునిపై గల పక్షపాతంతో ఏకలవ్యుని దగ్గర బోటనవేలిని గురుదక్షిణగా తీసుకొని తన గురుత్వానికి తగిన న్యాయం చేయలేకపోయాడు ద్రోణుడు. అన్నం పెట్టినందుకు తీర్చుకునే ఋణంగా భావించాడు. కురుపాండవుల విద్యాభ్యాసం ముగియగానే తనకు గురుదక్షిణగా ద్రుపదున్ని ప్రాణాలతో పట్టి తెచ్చి నాకు అప్పగించమని కోరాడు. అందరూ ప్రయత్నించారు. కానీ చివరికి అర్జునుడు విలువిద్యా నిపుణుడైన ద్రుపదున్ని బంధించి తెచ్చాడు. ద్రుపదుని రాజ్యాన్ని తాను తీసుకొని అందులోని సగభాగాన్నే భిక్షగా ద్రుపదునికిచ్చి ఇప్పుడు మన స్నేహంలో సమానత్వం ఉందని చెప్పి అతణ్ని ప్రాణాలతో వదిలేస్తాడు ద్రోణుడు. అర్జునునికి తన సమస్తాన్నీ నేర్పి తనతో ప్రతియుద్ధం చేయరాదని మాట తీసుకుంటాడు ద్రోణుడు. ద్రోణాచార్యుడు తన శిష్యులైన కురుపాండవుల మధ్య పెరుగుతున్న దూరాన్ని చూసి వ్యథ చెందుతుండేవాడు. లక్క ఇంట్లో పాండవులు మరణించారని తెలిసి చాలా దుఃఖించిన ద్రోణుడు వారు బతికే ఉన్నారనీ ద్రౌపదిని పెళ్ళి చేసుకున్నారనీ తెలుసుకొని సంతోషించాడు. పాండవులను నాశనం చేసేందుకు కౌరవులు చేస్తున్న ప్రయత్నాలకు వత్తాసు పలుకకపోగా ద్రోణుడు వాటిని వ్యతిరేకిస్తే దుర్యోధనుడు ఈతన్ని పాండవ పక్షపాతిగా చూసేవాడు. కానీ భీష్మ ధృతరాష్ర్టులు ద్రోణున్ని గౌరవించే పద్ధతికి జీవితమంతా కట్టుబడే ఉన్నాడు ద్రోణుడు. కురుక్షేత్ర యుద్ధంలో గురువుగా తన ఆశీస్సులను పాండవులకిచ్చి, ఒక రాజసేవకునిలా కురుపక్షంలో పోరాడాడు ద్రోణుడు. కర్ణ దుర్యోధనులు ఎంత తులనాడినా తనకు జీవితాన్నిచ్చిన భీష్ముని ఆదరణకు తలొగ్గాడు ద్రోణుడు. అంపశయ్యపైకి భీష్ముడు చేరుకోగానే ద్రోణుడు సర్వసేనాధిపత్యం వహించాల్సి వచ్చింది. ధుర్యోధనుని ఆలోచన మేరకు ధర్మరాజుని సజీవంగా బంధిస్తానని వాగ్థానం చేస్తాడు ద్రోణుడు. విశ్వ ప్రయత్నం చేసినా అది సాధ్యపడలేదు. పాండవులకు ద్రోణుని వీరోచిత యుద్ధ విహారం కూడా ఆటంకం కలిగించింది. ఇంతలో అశ్వత్థామ చనిపోయినట్టూ అది ద్రోణుని కొడుకు కాదు ఏనుగనే విషయం ద్రోణునికి వినిపించకుండా ఎత్తువేసి యుద్ధం నుంచి పక్కకు వచ్చేలా చేశారు పాండవులు. ధర్మరాజు మాటలు నమ్మి కుప్పకూలిపోయాడు. దుష్టద్యుమ్నుని చేతిలో చివరికి మరణించాడు. పాండవులూ కౌరవులపైన ద్వేషంతో ద్రోణున్ని నిందించారు. కౌరవులు ద్రోణుడు పాండవ పక్షపాతని భావించి తులనాడారు. ఏది ఏమైనప్పటికీ ద్రోణుడు తన పరిస్థితుల కారణంగా గురుపదాన్ని చేపట్టాల్సి వచ్చింది. ధర్మాధర్మాల వ్యత్యాసం తెలిసినా రాజధర్మానికి తలొగ్గి ఏకపక్షంలో తన జీవితం నడిపించాల్సి వచ్చింది. తన భావాలకూ, మానసిక సంఘర్షణలకూ అన్యాయం చేసుకోవాల్సి వచ్చింది. పరతంత్ర పరీక్షలో స్వేచ్ఛను ఫణంగా పెట్టాల్సి వచ్చింది. పరాధీనతలో నలిగిపోయిన దిగ్గజమే ద్రోణాచార్యుడు.

తెలుగు భాష గొప్పదనం

 రాసిందెవరో కానీ . . .

మా లెక్కల ఫిజిక్స్ పంతుళ్ళ పని కొంచెం తేలిక చేశారు . . .

థాంక్యూ ఫ్రెండూ . . .


అమ్మ చేసిన రొట్టె *వృత్తము*

సగానికి మడిచిన దోసె *అర్ధ వృత్తము*

మనం కూర్చునే స్టూల్ *చతురస్త్రం*

పడుకునే మంచం *దీర్ఘ చతురస్త్రం*

మనకిష్టమైన లడ్డూఒక  *గోళము*

సగం మన మిత్రునికిస్తే *అర్ధ గోళము*

మన తరగతి గది ఒక *ఘనం*

మనం కూర్చునే బెంచీ ఒక *దీర్ఘ ఘనం*

మన జెండా కర్ర ఒక *స్థూపం*

కొడవలి మలుపు ఒక *చాపం*

ధాన్యపు రాశి ఒక *శంఖువు*

రూపాయి రూపాయి కలిపితే *కూడిక*

కొనడానికి కొంత తీస్తే *తీసివేత*

తలా పది పంచితే *భాగహారం*

హెచ్చిస్తే *గుణకారం*

కూర్చుంటే *జడత్వం*

కదిలితే *చలనం*

పరిగెత్తితే *వేగం*

ఆగి ఆగి పరుగు తీస్తే *త్వరణం*

పడిపోతే *ఆకర్షణ*

విడిపోతే *వికర్షణ*

తన చుట్టూ తాను తిరిగితే *భ్రమణం*

గుడి చుట్టూ తిరిగితే *పరిభ్రమణం*

మాట్లాడడానికి *శక్తి*

పనిచేయడానికి *బలం*

గంటకు ఎంతపని చేస్తావో అది *సామర్థ్యం*

వింటున్నా మంటే *శబ్దం*

చూస్తున్నామంటే *వెలుగు*

రంగులన్ని *వర్ణ పటం*

ఆహారం అరగడం *జీవక్రియ*

అరిగిన ఆహారం శక్తిగా మారడం *రసాయన క్రియ*

ఉచ్వాస నిశ్వాసాలు *శ్వాస క్రియ*

నేను చూశాను *భూతకాలం*

నేను చూస్తున్నా *వర్ధమాన కాలం*

నేను చూడ బోతున్నా *భవిష్యత్ కాలం*

నాకు తొంభై ఏళ్ళు ఇక *పోయే కాలం*


బతుకుల్లో లేనిది ఏముంది శాస్త్రాల్లో ..


సరిగా అర్థం చేసుకుంటే మన బతుకే ఒక శాస్త్రం...

మనిషిని, ఇతర ప్రాణుల్ని , ప్రకృతిని గురించి తెలుసుకోవడం తప్ప.

భయమెందుకు నీకు ...

నీకంటే ప్రపంచంలో ఎవరు గొప్ప...

తెలుసుకో పదిలంగా

నేర్చుకో సులభంగా...!   


*అదే మన తెలుగు భాష గొప్పదనం👍

హృద్రోగ

 *గుండెనొప్పి వచ్చినప్పుడు* ఒకవేళ మనం ఒంటరిగా వున్నప్పుడు మనకు మనం చేసుకునే ప్రథమ చికిత్స గురించి Dr. గీతా క్రిష్ణస్వామి గారు రాసిన ఈ క్రింది విషయం, ఓ రెండు నిమిషాలు కేటాయించి చదవటం మనకు చాలా మంచిది !


       అప్పుడు రాత్రి 7/45 అయింది , ఆరోజు ఎక్కువ పని భారంతో ఆఫీస్ నుంచి బాగా అలసిపోయి తిరిగి వస్తున్నాం,ఎంతో నిస్సత్తువగా,చిరాకుగా కూడా వుంది ! ఇంతలో అకస్మాత్తుగా గుండెలో ఎదో గట్టిగా పట్టేసినట్లు తీవ్రంగా నొప్పి మొదలయింది ,ఆ నొప్పి అలా భుజాలవరకు,ఇంకా పైకి దవడల వైపు కూడా ప్రాకుతోంది ! అప్పటికి ఇంకా ఇల్లు చేరలేదు,హాస్పిటల్ కు చేరుకోవటానికి దూరం కనీసం 5 కిలోమీటర్లు వుంది కానీ అతి త్వరలో అక్కడకు చేరుకోగలమా అన్న సందేహంతో మరింత కంగారు కూడా మొదలయ్యింది !

       

       ఇలాంటి క్లిష్ట సమయంలో హాస్పిటల్ చికిత్స అందే లోపల ఒకరికి ఒకరు, వెంటనే ఇచ్చే CPR చికిత్స గురించి తెలిసినా, ఎవరికి వారే చికిత్స చేసుకునే విధానం తెలియక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, మరేం చేయాలి ?......

        

       ఇటువంటి సంకట పరిస్థితిలో  హాస్పిటల్ చికిత్స అందే లోపల మన ప్రాణాలను మనమే ఎలా కాపాడుకోవచ్చో Dr గీతా క్రిష్ణ స్వామి గారు చెప్పిన సలహా చాలా అద్భుతం ! అది చాలా సులభం అని కూడా మీకు తెలుస్తుంది ఈ క్రిందిది చదివిన తరువాత !

     

        ఆ క్లిష్టమైన ఘడియలలో గుండె కొట్టుకోవటంలో లయ తప్పుతోందని మనకు అర్థం అవుతున్న సమయంలో, దగ్గరలో ఎటువంటి సహాయం అందే మార్గం లేనప్పుడు, ఇక స్పృహ కోల్పోతామేమో సమయానికి........  మనకు ఇంకా *ఓ పది సెకండ్ల సమయం మాత్రం మన చేతిలో వుంది*, మనం పూర్తిగా స్పృహ కోల్పోవటానికి ! ఈలోగా ?????😱

   

       అలాంటి ఆ పది సెకండ్ల అమూల్యమైన సమయంలో మనం చేయవలసినది ఒక్క *దగ్గటం* మాత్రమే !    😊 ! *ఆశ్చర్యంగా వుంది కదూ !* ఆ దగ్గు రిపీట్ చేస్తుండటమే ! అది ఎలా అంటే, దగ్గే ముందు ఊపిరి బాగా పీల్చుకుంటూ దగ్గుతుం డాలి, ఒకసారి ఊపిరి పీల్చుకుని 

దగ్గటానికి రెండు సెకండ్ల చొప్పున కేటాయిస్తూ,బాగా లోతునుంచి, ఒకవేళ కఫం వున్నట్లయితే,అది  బయటకు వచ్చేటట్లు ఎలా దగ్గుతామో అంత ఉదృతంగా, ఆగకుండా మనకు ఏదైనా సహాయం అందే వరకూ దగ్గుతూనే వుండాలి అలా ! ఈలోగా గుండెలో సరి అయిన మార్పు వచ్చి మాములుగా కొట్టుకోవటం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది !  

   

       ఈ దగ్గటం మనకు ఎంతలా సహాయ పడుతుందంటే , మనం గట్టిగా ఊపిరి పీల్చి నప్పుడు, మన ఊపిరి తిత్తులు, ప్రాణ వాయువుతో ( ఆక్సిజన్) పూర్తిగా నిండి, గుండె మీద వొత్తిడి తెచ్చిపెడుతుంది,ఆ వొత్తిడి వల్ల గుండెలో వున్న రక్త నాళాలు స్పందించి, మరల సరిఅయిన రీతిలో రక్త ప్రసరణ జరిగి, గుండె కొట్టుకోవటంలో లయ మరల యధాస్థితికి  చేరు కోవటానికి తోడ్పడుతుంది ! అంటే చికిత్స అందే లోపల మనకు మనమే ప్రథమ చికిత్స చేసుకుంటు ఇలా ప్రాణాలను నిలుపు కుంటున్నామన్న మాట !

        

        ఇటువంటి ఉపయోగకరమైన  సమాచారం మనం ఎంత మందికి పంపిస్తే అందులో కొంత మందికైనా ఇది ఉపయోగ పడి వారి ప్రాణాలు నిలిపిన వారి మౌతాం !

   

   *హృద్రోగ నిపుణులు కూడా అదే చెబుతున్నారు*

   

      అందువల్ల, మనం రోజూ పంపించే మెసేజెస్ తో పాటు ఇదీ కూడా కలపి పంపించి నట్లైతే  పరోక్షంగానైనా ఎందరికో సహాయ పడిన వాళ్ళ మవుతాం !

మీ....

size of God?

 What's​ the size of God?   Excellent reading


A boy asked the father: _What’s the size of God?_ Then the father looked up to the sky and seeing an airplane asked the son: What’s the size of that airplane? The boy answered: It’s very small. I can barely see it. So the father took him to the airport and as they approached an airplane he asked: And now, what is the size of this one? The boy answered: Wow daddy, this is huge! Then the father told him: God, is like this, His size depends on the distance between you and  Him. *The closer you are to Him, the greater He will be in your life!*

ముఖ్య ఆయుధం

 🙏జై శ్రీమన్నారాయణ🙏


*తల రాతను కూడా మార్చగల*

     *హరి నామ జపం!*


*ఒక రైతు విత్తనాలను భూమిలో నాటినపుడు అవి నేలలో సరిగ్గా పడినా, తలక్రిందులుగా పడిన మొక్క మాత్రం పైకే మొలుస్తుంది.*


*అలాగే, భగవన్నామాన్ని ఏ విధంగా జపించినా సత్ఫలితం తప్పక లభిస్తుంది.*


*మంత్ర జపం ద్వారా అన్ని అవరోధాలు తొలగిపోతాయి. అయితే కర్మ అనేది ఉంది కాబట్టే కర్మ భూమిపైన జన్మించాము, భగవంతుడు ఎవరి కర్మను వారి చేతనే రాయిస్తారు, కారణం ఆత్మ పరమాత్మ అంశ. దేహంతో ఉన్నంత వరకే జీవికి స్వార్థం, ఆశ,  నేను, నాది, భయం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి.*


*ఆత్మ వివేకం కలిగినది. మనలో పంచ భూతాలు ఉంటాయి, నిద్రావస్థలో దేహానికి ఒక్క భూతం మటుకే కాపలాగా ఉంటుంది మిగిలిన నాలుగు భూతాలలో ఒకటి మన పాప పుణ్యాలకు పద్దు రాస్తుంది. అదే "చిత్రగుప్తుడు" చిత్ర మైన ఆత్మ గుప్తంగా దాగి ఉండి పాప పుణ్యాలు లెక్క రాస్తుంది.*


*మిగిలిన మూడు భూతాలు మన ఆలోచన బట్టి ఎక్కువగా ఏది తలుస్తుంటామో దాన్ని చూస్తుంది..(నిద్రలో వెంటనే లేవగానే కాసేపు ఎక్కడ ఉన్నాము ఎటువైపు ఉన్నాము అర్థం కాదు!  కారణం మిగిలిన భూతాలు దేహంలోకి చేరాక మనకు పూర్తి సృహ వస్తుంది.*


*అందుకే వెంటనే లేచి వెళ్ల కూడదు. రెండు నిముషాలు ఆగి భగవంతుడి నామాన్ని పలుకుతూ పడక దిగాలి. లేకుంటే ఒక్కోసారి కాస్త అనారోగ్యంతో ఉన్నవారికి  ప్రాణం పోయే ప్రమాదం కూడా జరుగుతుంది.*


*ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు అధికంగా  కృష్ణ నామ జపం చేసే వాళ్ళు స్వప్నంలో పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనం పొందడానికి కారణం ఇదే! ఎక్కువగా వాళ్ళు తలచే బృందావనం మథుర, పండరి పురం, తిరుమల, అయోధ్య, శ్రీరంగ  క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు.. అస్ట్రోల్ జర్నీ స్వప్నం తోనే మొదలై తర్వాత ఎరుకలో చేసే ధ్యానంలో కూడా అది సాధ్యం అవుతుంది.*


 *దేహాన్ని విడిచిన జీవుడు తిరిగి పరమాత్మలో చేరలేక  అధికంగా రోధిస్తారు. విలువైన మానవ జీవితాన్ని పాప కర్మల ద్వారా వృధా చేసుకున్నందుకు  బాధ పడతాడు.*


*అయితే ఆ కర్మలలో    పుణ్య కార్యాలు, కూడా చేసుకొని ఉంటే మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది, కానీ వారు చేసుకున్న పాపము, పుణ్యం ఆధారంగా స్వర్గం నరకం చేరుకొంటారు కానీ వైకుంఠ ప్రాప్తి లభించదు, వైకుంఠ    ప్రాప్తి లేదా గోలోక ప్రాప్తి  కలగాలంటే గురుపరంపరంలో గురువుని స్వీకరించి, గురువు ఇచ్చిన హరినామాన్ని  జపించి భక్తి యుక్త సేవ చేసి, గురువు చెప్పిన మార్గంలో వెళ్తే తప్ప  గోలోకం చేరుకొంటారు.*

 

 *ఏ విధమైన జీవితం గడిపితే వారికి విముక్తి లభిస్తుందో ఆ విధంగా రాసుకుంటారు, తమ తల రాత కాబట్టి ఎక్కడ రాసేటప్పుడు స్వార్ధం కలుగుతుందో అని చై వెనక్కి పెట్టి చూడకుండా తలరాతను నుదిటి గీతలుగా రాసుకుంటారు..*


*"నీ తల రాత నీచే రాయబడినది, నువ్వు అనుభవిస్తున్న జీవితం నీ కర్మానుసారం నువ్వు కోరుకున్నదే... అందుకనే.. దేవుడు నాకు ఎందుకు ఇలాంటి జీవితం ఇచ్చాడు అని భగవంతుని నిందించ కూడదు.*


*ఎటువంటి పాప పుణ్యం చేసిన వారు అయినా ఎంత నీచులు దౌర్భాగ్యులు అయినా, రాక్షస స్వభావం ఉన్న వారు అయినా   ఎవరైనా దైవ ఆరాధనకు అర్హత ఉన్న వాళ్లే నేను ఇది చేయవచ్చా అని ఎవరూ సందేహించాల్సిన పని లేదు! కారణం భగవంతుడికి బేధ భావం లేదు.*


*బ్రతికి ఉన్నంత కాలం మళ్ళీ మళ్ళీ అవకాశం భగవంతుడు ఇస్తూనే ఉంటాడు మారడానికి! అలాగే ఒక బాధతో పాటు మంచిని, మంచి అవకాశాన్ని కూడా ఇస్తూనే ఉంటాడు!   అది గుర్తించాలి!  అంటే నీ బుద్దికి వివేకం ఉండాలి, అది కలగాలి అంటే...*


*ఆధ్యాత్మిక సాధన, హరే రామ, హరే కృష్ణ మహామంత్రం జపం, సేవ, పారాయణం, సత్సంగం, గురుసేవ, ఆలయ దర్శనం ఇలా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటే తక్కినవన్ని వెన్నంటే వస్తాయి.*


*మనసు నిలకడకు ముందు కలియుగంలో హరి నామ జపమే ముఖ్య ఆయుధం, ఆధారం, గొప్ప మార్పుకి అవకాశం..!*

         *ఓం తత్సత్*

 శ్లోకం:☝️కాలాష్టమీ

*భుక్తిముక్తిదాయకం*

  *ప్రశస్తచారువిగ్రహం*

*భక్తవత్సలం స్థిరం*

  *సమస్తలోకవిగ్రహం ।*

*నిక్వణన్మనోజ్ఞహేమ-*

  *కిఙ్కిణీలసత్కటిం*

*కాశికాపురాధినాథ-*

  *కాలభైరవం భజే ॥*

   - కాలభైరవాష్టకం 4


భావం: ఐహికాముష్మిక ఫలముల నిచ్చువాడు, సుందర రూపము కలవాడు, భక్తవత్సలుడు, రుద్రస్వరూపుడు కనుక స్థాణువువలె స్థిరమైనవాడు, సమస్త ప్రపంచమునూ నిగ్రహించువాడు, నడుమునందు మోగుచున్న అందమైన బంగారు చిరుగంటలు ధరించినవాడు, కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచు


న్నాను.🙏