17, నవంబర్ 2022, గురువారం

ముఖ్య ఆయుధం

 🙏జై శ్రీమన్నారాయణ🙏


*తల రాతను కూడా మార్చగల*

     *హరి నామ జపం!*


*ఒక రైతు విత్తనాలను భూమిలో నాటినపుడు అవి నేలలో సరిగ్గా పడినా, తలక్రిందులుగా పడిన మొక్క మాత్రం పైకే మొలుస్తుంది.*


*అలాగే, భగవన్నామాన్ని ఏ విధంగా జపించినా సత్ఫలితం తప్పక లభిస్తుంది.*


*మంత్ర జపం ద్వారా అన్ని అవరోధాలు తొలగిపోతాయి. అయితే కర్మ అనేది ఉంది కాబట్టే కర్మ భూమిపైన జన్మించాము, భగవంతుడు ఎవరి కర్మను వారి చేతనే రాయిస్తారు, కారణం ఆత్మ పరమాత్మ అంశ. దేహంతో ఉన్నంత వరకే జీవికి స్వార్థం, ఆశ,  నేను, నాది, భయం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి.*


*ఆత్మ వివేకం కలిగినది. మనలో పంచ భూతాలు ఉంటాయి, నిద్రావస్థలో దేహానికి ఒక్క భూతం మటుకే కాపలాగా ఉంటుంది మిగిలిన నాలుగు భూతాలలో ఒకటి మన పాప పుణ్యాలకు పద్దు రాస్తుంది. అదే "చిత్రగుప్తుడు" చిత్ర మైన ఆత్మ గుప్తంగా దాగి ఉండి పాప పుణ్యాలు లెక్క రాస్తుంది.*


*మిగిలిన మూడు భూతాలు మన ఆలోచన బట్టి ఎక్కువగా ఏది తలుస్తుంటామో దాన్ని చూస్తుంది..(నిద్రలో వెంటనే లేవగానే కాసేపు ఎక్కడ ఉన్నాము ఎటువైపు ఉన్నాము అర్థం కాదు!  కారణం మిగిలిన భూతాలు దేహంలోకి చేరాక మనకు పూర్తి సృహ వస్తుంది.*


*అందుకే వెంటనే లేచి వెళ్ల కూడదు. రెండు నిముషాలు ఆగి భగవంతుడి నామాన్ని పలుకుతూ పడక దిగాలి. లేకుంటే ఒక్కోసారి కాస్త అనారోగ్యంతో ఉన్నవారికి  ప్రాణం పోయే ప్రమాదం కూడా జరుగుతుంది.*


*ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు అధికంగా  కృష్ణ నామ జపం చేసే వాళ్ళు స్వప్నంలో పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనం పొందడానికి కారణం ఇదే! ఎక్కువగా వాళ్ళు తలచే బృందావనం మథుర, పండరి పురం, తిరుమల, అయోధ్య, శ్రీరంగ  క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు.. అస్ట్రోల్ జర్నీ స్వప్నం తోనే మొదలై తర్వాత ఎరుకలో చేసే ధ్యానంలో కూడా అది సాధ్యం అవుతుంది.*


 *దేహాన్ని విడిచిన జీవుడు తిరిగి పరమాత్మలో చేరలేక  అధికంగా రోధిస్తారు. విలువైన మానవ జీవితాన్ని పాప కర్మల ద్వారా వృధా చేసుకున్నందుకు  బాధ పడతాడు.*


*అయితే ఆ కర్మలలో    పుణ్య కార్యాలు, కూడా చేసుకొని ఉంటే మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది, కానీ వారు చేసుకున్న పాపము, పుణ్యం ఆధారంగా స్వర్గం నరకం చేరుకొంటారు కానీ వైకుంఠ ప్రాప్తి లభించదు, వైకుంఠ    ప్రాప్తి లేదా గోలోక ప్రాప్తి  కలగాలంటే గురుపరంపరంలో గురువుని స్వీకరించి, గురువు ఇచ్చిన హరినామాన్ని  జపించి భక్తి యుక్త సేవ చేసి, గురువు చెప్పిన మార్గంలో వెళ్తే తప్ప  గోలోకం చేరుకొంటారు.*

 

 *ఏ విధమైన జీవితం గడిపితే వారికి విముక్తి లభిస్తుందో ఆ విధంగా రాసుకుంటారు, తమ తల రాత కాబట్టి ఎక్కడ రాసేటప్పుడు స్వార్ధం కలుగుతుందో అని చై వెనక్కి పెట్టి చూడకుండా తలరాతను నుదిటి గీతలుగా రాసుకుంటారు..*


*"నీ తల రాత నీచే రాయబడినది, నువ్వు అనుభవిస్తున్న జీవితం నీ కర్మానుసారం నువ్వు కోరుకున్నదే... అందుకనే.. దేవుడు నాకు ఎందుకు ఇలాంటి జీవితం ఇచ్చాడు అని భగవంతుని నిందించ కూడదు.*


*ఎటువంటి పాప పుణ్యం చేసిన వారు అయినా ఎంత నీచులు దౌర్భాగ్యులు అయినా, రాక్షస స్వభావం ఉన్న వారు అయినా   ఎవరైనా దైవ ఆరాధనకు అర్హత ఉన్న వాళ్లే నేను ఇది చేయవచ్చా అని ఎవరూ సందేహించాల్సిన పని లేదు! కారణం భగవంతుడికి బేధ భావం లేదు.*


*బ్రతికి ఉన్నంత కాలం మళ్ళీ మళ్ళీ అవకాశం భగవంతుడు ఇస్తూనే ఉంటాడు మారడానికి! అలాగే ఒక బాధతో పాటు మంచిని, మంచి అవకాశాన్ని కూడా ఇస్తూనే ఉంటాడు!   అది గుర్తించాలి!  అంటే నీ బుద్దికి వివేకం ఉండాలి, అది కలగాలి అంటే...*


*ఆధ్యాత్మిక సాధన, హరే రామ, హరే కృష్ణ మహామంత్రం జపం, సేవ, పారాయణం, సత్సంగం, గురుసేవ, ఆలయ దర్శనం ఇలా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటే తక్కినవన్ని వెన్నంటే వస్తాయి.*


*మనసు నిలకడకు ముందు కలియుగంలో హరి నామ జపమే ముఖ్య ఆయుధం, ఆధారం, గొప్ప మార్పుకి అవకాశం..!*

         *ఓం తత్సత్*

కామెంట్‌లు లేవు: