18, ఫిబ్రవరి 2021, గురువారం

మాఘ పురాణం*_🚩 🚩 _*7 వ అధ్యాయము*_

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*7 వ అధ్యాయము*_🚩


      *గురువారం*

*ఫిబ్రవరి 18, 2021*



🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*లోభికి కలిగిన మాఘమాస స్నాన ఫలము*


🕉️☘☘☘☘☘☘🕉️


వశిష్ట మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు యిట్లు తెలియజేసెను. పార్వతీ ! చాలాకాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు అసంతవాడయను నామముగల పెద్దనగరముండెను. అందు బంగారుశెట్టి అను వైశ్యుడొకడు వుండెను. అతని భార్యపేరు తాయారమ్మ. బంగారుశెట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది , కాని , అతడు ఇంకనూ ధనాశకలవాడై తనవద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కాని ఒక్కనాడైననూ శ్రీహరిని ధ్యానించుటగాని , దానధర్మాలు చేయుటగాని యెరుగడు. అంతేకాక బీదప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు ఋణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి , వారి ఆస్తులు సైతము స్వాధీన పరచుకొనేవాడు. ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళెను , ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూచి , *"తల్లీ ! నేను ముసలివాడను నా గ్రామము చేరవలయునన్న యింకనూ పది ఆమడలు వెళ్ళవలసియున్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది , ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద రాత్రి గడుపనిమ్ము నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్భ్రాహ్మణుడను , సదాచారవ్రతుడను ప్రాతఃకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయెదను"* అని బ్రతిమలాడెను.


తాయారమ్మకు జాలికలిగెను వెంటనే తన అరుగుమూల శుభ్రము చేసి , అందొక తుంగచాపవేసి , కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికెను. ఆమె  దయార్ద హృదయమునకు ఆ వృద్ద బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపుమని చెప్పి , *"ఆర్యా మాఘస్నానము చేసి వెళ్ళెదనని యన్నారు కదా ! ఆ మాఘస్నానమేమి ?* *సెలవిండు వినుటకు కుతూహలముగా నున్నది"* అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటికప్పుకొని , *"అమ్మా మాఘమాసము గురించి చెప్పుట నాశక్యము కాదు , ఈ మాఘమాసములో నది యందు గాని , తటాకమందు గాని లేక నూతియందుగాని సూర్యోదయము అయిన తర్వాత చన్నీళ్ళు స్నానము చేసి విష్ణుమందిరనికి వెళ్ళి తులసి దళముతోను , పూలతోను పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను , తరువాత మాఘపురాణము పఠించవలెను.* ఇట్లు ప్రతిదినము విడువకుండా నెలరోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన , దానధర్మములు చేయవలెను. ఇట్లు చేసినయెడల మానవునికి రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. *ఒకవేళ ఈ నెలరోజులూ చేయలేనివారూ , వృద్దులూ , రోగులు ఒక్కరోజయినను అనగా ఏకాదశినాడు గాని , ద్వాదశినాడు గాని లేక పౌర్ణమినాడు గాని పై ప్రకారము చేసినచో సకలపాపములు తొలగి సిరిసంపదలు , పుత్రసంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను"* అని చెప్పగా , ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడ ప్రాతఃకాలమున బ్రాహ్మణునితో బాటు నదికిపోయి స్నానము జేయుటకు నిశ్చయించుకొనెను.


అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారుశెట్టి యింటికిరాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టికి కోపమువచ్చి , వంటినిండా మంటలు బయలదేరినట్టుగా పళ్ళు పటపటాకొరికి *"ఓసీ వెర్రిదానా ! ఎవరు చెప్పినారే నీకీ సంగతి ? మాఘమాసమేమిటి ? స్నానమేమిటి ? వ్రతము , దానములేమిటి ? నీకేమైనా పిచ్చి పట్టినదా ? చాలు చాలు అధిక ప్రసంగముచేసినచో నోరునొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి ఎవరికిని ఒక్కపైసాకూడా వదలకుండా వడ్డీలు వసూలుచేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా ? చలిలో చన్నీళ్ళు స్నానముచేసి , పూజలుచేసి , దానములుచేస్తే వళ్ళూ యిల్లూ గుల్లయి , నెత్తి పైన చెంగు వేసుకొని 'భిక్షాందేహీ' అని అనవలసినదే జాగ్రత్త ! వెళ్ళి పడుకో"*, అని కోపంగా కసిరాడు.


ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు. యెప్పుడు తెల్లవారునా యెప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకొని యింటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి , మగనికి చెప్పకుండ నదికిపోయి స్నానముచేయుచున్నది. ఈలోగా బంగారుశెట్టి పసిగట్టి  ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికిపోయి నీళ్ళలోదిగి భార్యను కొట్టబోవుచుండగా , ఆ యిద్దరూ కొంతతడవు నీళ్ళలో పెనుగులాడిరి అటుల మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారుశెట్టి భార్యను కొట్టి యింటికి తీసుకువచ్చినాడు.


కొన్ని సంవత్సరములు తరువాత ఒకనాడు ఇద్దరకూ ఒకవ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారుశెట్టిని తీసుకొనిపోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసికొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రధముపై ఎక్కించుకొని తీసికొనిపోవుచుండిరి. అపుడు తాయారమ్మ యమభటులతో యిట్లు పలికెను.


*"ఓ యమభటులారా ! ఏమిటీ అన్యాయము ? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి ? నా భర్తను యమలోకమునకు తీసుకొనిపోవుట  ఏమిటి ? ఇద్దరమూ సమానమేగదా"* అని వారి నుద్దేశించి అడుగగా , ఓ అమ్మా ! నీవు మాఘమాసములో ఒక దినమున నదీస్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కానీ , నీ భర్త అనేకులను హింసించి , అన్యాయముగా ధనార్జన చేసి అనేకులవద్ద అసత్త్యములాడి నరకమన్న భయములేక భగవంతునిపై భక్తిలేక వ్యవహరించునందులకే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికిరి.


ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. *"నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్తకూడా నీటమునిగినాడు కదా ! శిక్షించుటలో యింత వ్యత్యాసమేలకలుగెను ?"* అని అనగా  ఆ యమభటులకు సంశయము కలిగి , యేమియు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని , ఆమె వేసిన ప్రశ్ననూ తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టికచూడగా , ఇద్దరకూ సమానమైన పుణ్య ఫలము వ్రాసియున్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారుశెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి యేమయ్యెనో యని ఆతృతతో ఉండగా , బంగారుశెట్టిని పుష్పకవిమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యా భర్తలిద్దరూ మిక్కిలి సంతోషమందిరి. రాజా ! వింటివా ! భార్యవలన భర్తకు కూడా యెటుల మోక్షము కలిగెనో భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్యా యధాలాపముగా ఒక్కరోజు మాఘమాసస్నానము చేసినందున యిద్దరికిని వైకుంఠప్రాప్తి కలిగినదిగా ! గనుక మాఘస్నానము నెలరోజులు చేసినచో మరింత మోక్షదాయకమగుటలో సందేహములేదు.


*ఏడవ అధ్యాయము సమాప్తం*

🌹🌷🌼🛕🔔🌼🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

భరద్వాజ మహర్షి

 మన మహర్షులు- 25


భరద్వాజ మహర్షి 


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


 భరద్వాజ మహర్షి సప్తఋషులలో ఒకరు.

సప్త ఋషుల గురించి మహాభారతంలోనూ, పురాణాలలోనూ కూడా ప్రస్తావించబడింది.


ఈయన తపస్సు చేసిన ఆశ్రమం పేరు 'భరద్వాజతీర్థ'


దేవతల గురువైన బృహస్పతి కుమారుడు 'భరధ్వాజుడు'. 


మహాభారతం లో కురుపాండవుల గురువైన ద్రోణాచార్యుడు భరద్వాజుని కుమారుడే...

 ద్రోణుడికి అశ్వత్థామ పుట్టాడు. ఇలా భరద్వాజ వంశం వృద్ధి అయింది.


భరద్వాజుడు భృగుమహర్షిని అడిగి  పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయి..సృష్టి ఎలా జరిగింది ..వంటి అనేక విషయాలు తెలుసుకున్నాడు.


చరక సంహిత ప్రకారం, ఈతడు వైద్య శాస్త్రాన్ని దేవతల రాజు అయిన ఇంద్రుని వద్ద అధ్యయనం చేసాడు.


 భరద్వాజుడు మూడు కాలాలు తెలుసుకోకలిగిన జ్ఞానంతో గొప్ప తపశ్శక్తితో చాలామంది శిష్యుల్తో తన ఆశ్రమంలో వున్నాడు.


రామాయణంలో భరతుడు తన అన్న అయిన రాముణ్ణి  అయోధ్యకు తిరిగి తీసుకురావడానికి అయోధ్య ప్రముఖులతో, మంత్రులతో, పురజనులతో, చతురంగ బలాలతో అడవికి బయలు దేరతాడు. భరధ్వాజ మహర్షి ఇతని భాతృభక్తిని పరీక్షించి, ప్రశంసించి భరతునితో పాటు వచ్చిన అందరికీ తన తపశ్శక్తితో షడ్రసోపోతమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. శ్రీరాముడు వనవాస సందర్భంగా భరద్వజ దంపతులను దర్శించి వారి ఆశీర్వచనాలు తీసుకుంటాడు. 


 భరద్వాజుడు తీర్థయాత్రలు చేస్తూ వ్రేపల్లె వచ్చి యమునానదిలో స్నానం చెయ్యాలనుకుని అక్కడున్న వాళ్లని రేవు చూపించమన్నాడు. వాళ్ళు ఆయన్ని ఆటలు పట్టించారు

గోపాల బాలకులతోనూ, బలరాముడితోనూ అందరితో కలిసి అక్కడ తిరుగుతున్న శ్రీకృష్ణుడు పరుగుపరుగూ వచ్చి మహర్షికి నమస్కారం చేసి ఆతిథ్యం తీసుకోమన్నాడు.


 భరద్వాజుడు అతణ్ణి శ్రీకృష్ణుడయిన విష్ణుమూర్తి అవతారంగా తెలుసుకుని స్తోత్రం చేశాడు.


 భరద్వాజుడు రాజధర్మాల్ని చెప్తూ రాజుకి గద్ద చూపు, కొంగ వినయం, కుక్క విశ్వాసం, సింహ పరాక్రమం, కాకి సంశయం, పాము నడక ఉండాలని, ధర్మకార్యక్రమాలు

ఎలా చెయ్యాలో, దోషుల్ని ఎలా దండించాలో కూడా శత్రుంజయుడనే రాజుకి చెప్పాడు


 ఒకసారి గొప్పగొప్ప మనులందరూ భరద్వాజుడి దగ్గరకొచ్చి శాస్త్రోక్తంగా ఉదయం ముఖం కడుక్కోవటం దగ్గర్నుంచి పడుక్కునే వరకు అన్ని పనులు ఎలా చెయ్యాలో తెలుసుకున్నారు. ఏ కొత్త పని మొదలు పెట్టినా తూర్పువైపు తిరిగే మొదలుపెట్టాలని అన్ని విషయాలు వివరంగా చెప్పాడు భరద్వాజుడు. ఈ గ్రంధాన్నే 'భరద్వాజ స్మృతి' అన్నారు.


అన్నిటికంటే  ఆశ్చర్యం కలిగించే విషయం...


 భరద్వాజుడు వైమానిక శాస్త్రం' అంటే విమానాలు ఎలా తయారు చెయ్యాలి అని, ఒక గ్రంథం రాశాడు. ఈ పుస్తకంలో ఎనిమిది అధ్యాయాలున్నాయి


మనం ఇప్పుడు తెలుసుకుంట్నుది భరద్వాజ మహర్షికి ఎపుడో తెలుసన్నమాట. 

ఈ విమానం ఎలా వుంటందంటే విరగనిది కోసినా తెగకుండా కాలిపోకుండా ఉండేది నాశనంకాకుండానూ వుంటుంది. .

. ఈ విమానంలో శత్రువుల మాటలు వినగలిగేలా, ఫోటోలు తీసుకోగలిగేలా,

శత్రువిమానం రాకపోకలు తెలుసుకోగలిగేలా పైలట్లని మూర్చపోయేలా చెయ్యకలిగేవి

చాలా పరికరాలుంటాయి. అంటే ఇవి యుద్ధవిమానాలేమో.


విమానానికి 31 భాగాలుండాలనీ. విమానం నడిపే వాళ్ళకి వేరువేరు బట్టలుండాలనీ, కాలాన్ని బట్టి తినడానికి మూడు రకాల ఆహార పదార్థాలుండాలనీ వాటి వల్ల గాలిలో ఉండే ఇరవై అయిదు రకాల విషాలు ఏం చెయ్యకుండా వుంటాయనీ రాశాడు.


పదహారు రకాల లోహాలో తయారు చేస్తే ఏ వాతావరణానికయినా తట్టుకుని చెక్కు చెదరకుండా వుంటుందిట. 

ఈ విమానం తయారు చేసే పద్ధతి అద్భుతంగా వుంది కదూ..


జ్ఞాననిధులు మన మహర్షులు ..🙏🙏🙏


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

సూర్యుడు రథం మారుతాడు

 ధర్మసందేహాలు-సమాధానం


🍁🍁🍁🍁


ప్ర: సూర్యుడు రథం మారే రోజు కాబట్టి రథసప్తమి అని పేరు వచ్చింది అంటారు. ఇది అజ్ఞానం కాదా? సూర్యునికి రథం ఉందా? సూర్యుడు రథం మార్తాడా?




జ: వేదభాషను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. రథము అనే మాటకి అర్థం - గమన లక్షణము కలది రథము. ఇక్కడ గమనం అంటే కాంతి.


సూర్యునికి ఉదయాస్తమయాలు లేవు. మనం ఉన్న స్థితి బట్టి అలా కనబడుతుంది అనే విషయం సృష్టిలో మొట్టమొదటిగా చెప్పినది వేదం. 


ఎలాంటి పరికరాలు లేకుండానే యుగాల క్రిందటే ఈ విషయం చెప్పిన మన మహర్షులకి ఇంత చిన్న విషయాలు తెలియవా?


 ఇదొక్కటి ఆలోచిస్తే మన హైందవ ధర్మం గొప్పదనం తెలుస్తుంది.


పూర్తి వైజ్ఞానిక స్పృహతోనే సూర్యారాధన చేసిన జాతి భారత జాతి. కేవలం నమ్మకం కాదు. విశ్వాసానికి కారణం ఒక విజ్ఞానం. సూర్యున్ని కేవలం ప్రకృతిలో ఉన్న ఒక మండుచున్న అగ్నిగోళము అని దర్శించకుండా ఒక చైతన్య స్వరూపమైన భగవంతుని ఆకారం అనే ఉదాత్త భావన మన విజ్ఞానంతో కూడిన విశేషం. ఆ విజ్ఞానాన్ని ఆధారం చేసుకొనే మన విశ్వాసం ఆధారపడి ఉంది.


సూర్యుడు రథం మారుతాడు అంటే సూర్యుని కాంతి యొక్క గమనము మారుతుంది అని చెప్పడం దీనిలో ఉన్న ఆంతర్యం. ఆ మార్పు వచ్చిన సప్తమిని రథసప్తమి అని వ్యవహరిస్తాం. 


వేదభాష సంకేత భాష. అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలే తప్పా అజ్ఞానం అని తోసేస్తే మన అజ్ఞానం బయటపడుతుంది.


🍁🍁🍁

సైనసైటిస్ కొరకు కొన్ని సులభ యోగాలు -

 సైనసైటిస్  కొరకు కొన్ని సులభ యోగాలు   -


 *  రోజు మంచి పలుచటి వేపనూనె రెండు ముక్కు రంధ్రాలలో ఒక్కో బొట్టు వేస్తుంటే క్రమంగా సైనస్ దూరం అవుతుంది.


 *  తులసి ఆకులని నీడలో ఎండబెట్టి తరువాత బాగా దంచి చూర్ణం చేయాలి . ముందు జల్లెడ పట్టి ఆ తరువాత వస్త్రగాలితం చేయాలి . అంటే పలుచని నూలుబట్టలో వేసి మెత్తటి చూర్ణం కిందికి దిగేలా చేతితో కలబెట్టాలి. ఈ చూర్ణం ని కొద్దికొద్దిగా నస్యం లాగా పీలుస్తుంటే ముక్కుకి సంబందించిన సైనసైటిస్ , వూపిరి ఆడకపోవడం , తుమ్ములు , శ్లేష్మం , నీరు , రక్తం ధారగా కారడం , దగ్గు , పడిశం, రొంప , విపరీతమైన తలనొప్పులు కంటి మసకలు ఇలాంటి వ్యాధులు అన్ని ఎంతకాలం నుంచి మనలని వేధిస్తున్నా కొద్దిరోజులలోనే మటుమాయం అయిపొతాయి.


 గమనిక  - 


        కఫాన్ని కలిగించే ఆహారపదార్థాల అయిన చల్లని నీరు , కూల్ డ్రింక్స్ , మినుములు , బచ్చలికూర, గొంగూర, పనసకాయ , ఖర్జూరం , కొబ్బరినీరు , తీపి , పులుపు , ఉప్పు పదార్థాలు, అజీర్తి కలిగించేవి వంటి పదార్థాలు నిషిద్దం .


      పెసరపప్పు , ఉలవలు , బార్లీ , పొట్లకాయలు, కాకరకాయలు, నక్కదోసకాయలు, అరటిపువ్వు , శెనగలు, కంద, వాము , బూడిదగుమ్మడి , దాల్చినచెక్క, నిమ్మపండు, పసుపు,మిరియాలు , మునగాకులు తప్పక ఆహారం లో ఉండేలా చూసుకోండి.


       నీరు తాగినప్పుడల్లా గోరువెచ్చని నీరు తాగండి. 

 

       పై నియమాలు పాటించటం వల్ల వీలయినంత తొందరలో సైనసైటిస్ సమస్య తీరును .


 


         మరిన్ని సులభయోగాలు నా గ్రంథాల యందు ఇవ్వడం జరిగినది.

 

    గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

రథసప్తమికి జిల్లేడకుకి

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*రథసప్తమికి జిల్లేడకుకి సంబంధం ఏమిటి?*


రథసప్తమినాడు స్నానసమయంలో నెత్తిపై జిల్లేడాకు పెట్టుకోవాలి. ఆ ఆకునే ఎందుకు పెట్టుకోవాలి? ఏ తమలపాకో చిక్కుడాకో ఎందుకు పెట్టుకోకూడదు అన్నసందేహమూ వస్తుంది.


దీని వెనుక ఒకకథ ఉంది. పూర్వం అగ్నిష్వాత్తులు అనే పండితులు మహానిష్ఠతో చాలా యజ్ఞాలు చేశారు.


ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది, వాళ్ళని స్వర్గానికి తీసుకురండని దేవవిమానం పంపించాడు. ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిష్వాత్తులు. ఆ దేవవిమానం చూసిన సంభ్రమంలో వారు ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు.


అయితే ఆసమయంలో పెద్దగాలిరావడంతో కొంత వేడివేడి నెయ్యి ప్రక్కనే ఉన్న ఒకమేకపై పడింది. ఆ వేడికి మేకచర్మం ఊడిపోయి మరణించి, దాని ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవవిమానంలో కూర్చుంది. ఆచర్మం ప్రక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది.


అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్త్వం మారిపోయి, మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది.


అలా జిల్లేడాకు యజ్ఞంత సమయంలో ఆజ్యధారలు ధరించడంతో పరమపవిత్రం అయ్యింది. జిల్లేడు ఆకును ముట్టుకొంటే మేకచర్మంలా మెత్తగా ఉంటుందందుకే! జరిగిన దానికి అగ్నిష్వాత్తులు బాధపడ్డారు. అప్పుడు ఆకాశవాణి, "మీరు దుఃఖించాల్సిన పనిలేదు. మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి, దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది.


ఈ జిల్లేడు మేకచర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారింది" అని పలికింది. ఆ మాట అగ్నిష్వాత్తుల్ని సంతోషపరిచింది. అది మాఘశుద్ధ సప్తమీతిథి.


అప్పటి నుండి రథసప్తమినాడు నెత్తిపై జిల్లేడాకు పెట్టుకుని, సూర్యప్రీతి కోసం స్నానం చేసేవారికి లేశమాత్రం యజ్ఞఫలం లభిస్తోంది. ఏడుజన్మల పాపాలు పోతున్నాయి.

🙏🙏🙏

నన్ను కన్నరోజు

 🕉️ *నన్ను కన్నరోజు (ఓ కథ)*

 

 *సౌదామిని వంట పూర్తి చేసి రెండోసారి కాఫీ చేసి పేపర్ చదువుతున్న భర్త అశోక్ కు ఇచ్చి తానూ తాగుతూ అక్కడే కూర్చోబోయింది.*


 *ఇంతలో లాండ్ లైన్ మ్రోగింది. ఒక చేత్తో కాఫీ కప్పు పట్టుకుని రెండో చేత్తో ఫోన్ రిసీవర్ ఎత్తింది.* 


 “ *హలో అమ్మా!  ఏం చేస్తున్నావ్? నేను చెప్పింది గుర్తుందిగా. తొందరగా పని తెముల్చుకుని ఐదుగంటల వరకు రెడీగా ఉండండి.*  *నేనిచ్చిన కొత్తచీర మాత్రమే కట్టుకోవాలి . బ్లౌజ్ కూడా కుట్టించాకదా. నాన్నగారికి కూడా చెప్పు. నేను కార్ పంపిస్తా..లేట్ చేయొద్దు మరి.“ అని హడావిడిగా చెప్పింది కూతురు భావన..* 


 *“అమ్మలూ... నీ* *పుట్టినరోజు నాడు కూడా ఈ హడావిడి ఎందుకురా? నీ ఆఫీసు ప్రోగ్రాం కాగానే పిల్లలు, అల్లుడు గారితో కలిసి ఇంటికొచ్చేయి. నీకిష్టమైనవి చేసి ఉంచుతా. అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కలిసి తిందాం.. ఎన్ని రోజులైంది మనమంతా కలిసి. నువ్వేమో ఎప్పుడూ బిజీ బిజీ అంటావు”  అనునయంగా చెప్పింది సౌదామిని.* 


 *“అమ్మా! పది రోజుల* *మందునుండి చెప్తున్నా. ఇవాళ మా ఆఫీసు* *వార్షికోత్సవంతోబాటు నాకు అవార్డు ఇస్తున్నారు.  నా పుట్టినరోజు కూడా  అని నిన్నూ, నాన్నగారిని రమ్మని. మళ్లీ ఇప్పుడిలా అంటావేంటి. నా మాటంటే అసలు లెక్కలేదా నీకు. అవునులే.. నిన్ను రమ్మన్నాను చూడు నాదే తెలివితక్కువతనం. ఇంతకీ వస్తున్నావా లేదా. ఆఖరిసారి అడుగుతున్నా!” కోపంగా అరిచింది భావన.* 


 *“వస్తున్నా తల్లీ! అంత నిష్టూరాలెందుకు? నువ్వు ఇచ్చిన చీరనే కట్టుకునే వస్తాను. సరేనా!!  ఐదుగంటలకు కార్ పంపించు“ నవ్వుకుంటూ చెప్పింది.*


*పేపర్ చదువుతూనే ఇటువైపో చెవి వేసిన అశోక్ కూడా గుంభనంగా నవ్వుకున్నాడు..*


*ఫోన్ పెట్టేసి తర్వాత సౌదామిని నిశ్శబ్దంగా కూర్చుంది. ఏమీ మాట్లాడలేదు. అశోక్ అలసిపోయినట్టుంది అని కాస్సేపు చూసాడు. కాని తన ధోరణిలో మార్పు రాలేదు.*


*“ఏంటి సౌదా! ఏమైంది? ఈ మధ్య నువ్వు చాలా డల్ గా ఉంటున్నావు. ఆరోగ్యం బావుంది కదా. ఏధైనా జరిగిందా. నాకు చెప్పొచ్చుగా.. ఇంట్లో ఉన్నదే మనమిద్దరం. నువ్విలా ఉంటే ఎలా?”*


*“అంత సీరియస్ ఏమీ లేదండి. బాధ్యతలేమీ లేవు, పిల్లలు ఎవరి సంసారాల్లో వాళ్లు సంతోషంగా ఉన్నారు. అబ్బాయి కూడా మనకు దగ్గరలో లేడు. వాడి పిల్లలను కూడా చూడలేదు మనం.*


 *అయిదేళ్లయిపోయింది వాడు ఇండియా వచ్చి. రమ్మంటే సెలవులు లేవంటాడు.  అమ్మాయి పిల్లలు కూడా పెద్దవాళ్లయ్యారు. వాళ్లు స్కూళ్లు అంటూ మనకు కనపడడం తగ్గిపోయింది.*


 *వాళ్లను నేనేమీ అనడం లేదు, కాని ఈ ఒంటరితనాన్ని కాదు గాని, ఖాళీ సమయాన్ని భరించలేకపోతున్నాను.*


 *మనిద్దరికి వంట చేయడం, పూజ, పుస్తకాలు తప్ప నాకు వేరే పనేమీ లేదు. మీరన్నా కనీసం స్నేహితులతో క్లబ్బులో కలుస్తుంటారు..” ఉదాసీనంగా అంది సౌదామిని.*


*“అలాంటప్పుడు నువ్వు మళ్లీ ఎందుకు చదువుకోకూడదు. రోజూ కాలేజీకి వెళ్లేపని లేకుండా దూరవిద్యలో చేరు. పెళ్లప్పుడు ఎమ్.ఏ.తో ఆపేసావు కదా. ఇంకా చదువు. మనకు డబ్బులకేమీ కొదువ లేదు. నీకు తీరిక సమయం కూడా చాలా ఉంది.  ఎమ్.ఫిల్. లేదా పిహెచ్.డి చేయొచ్చుగా.. కాలక్షేపం ఉంటుంది. ఈ నిరాశ, నిరాసక్తత కూడా మాయమైపోతుంది.”  అన్నాడు అశోక్.*


*“ఇప్పుడు చదువా? అందరూ నవ్వుతారేమోనండి.. చదువంటే నాకు ఇష్టమే కాని చిన్నపిల్లలతో కలిసి పరీక్షలు రాయడం.. అదీ నావల్ల కాదేమో.. సరేలెండి చూద్దాం. ఏది ఎలా జరగాలనుందో” అంటూ లేచి వంటింట్లోకి వెళ్లి సర్దడం మొదలుపెట్టింది. కాని తన ఆలోచనల్లో మౌనంగా మారిపోయింది.*

*****


*సాయంత్రం సరిగ్గా ఐదుగంటలకు భావన పంపిన కారు వచ్చింది.* *అప్పటికే తయారై ఉన్న సౌదామిని, అశోక్ లు ఇంటికి తాళం వేసి బయలుదేరారు.* 

*వాళ్లు భావన ఆఫీసు ప్రాంగణానికి చేరుకునేసరికి, అక్కడంతా కోలాహలంగా ఉంది. ఉద్యోగులంతా హాలులోకి ప్రవేశిస్తున్నారు.*


 *తల్లిదండ్రులను చూసిన భావన వారికి ఎదురొచ్చి అమాంతంగా తల్లిని కౌగిలించుకుంది.*


 *“అమ్మా! ఈ నెమలిపింఛం రంగు  పట్టుచీర నీకు ఎంత బావుందో... చాలా అందంగా కనిపిస్తున్నావు.*

*కదా నాన్నగారు?” అని అడిగింది.*


*అశోక్ మందహాసం చేసాడు.  సౌదామిని మాత్రం సిగ్గుపడిపోయింది. భావన వాళ్లిద్దరినీ మొదటి వరుసలో కూర్చోబెట్టి మళ్లీ కలుస్తానని స్టేజి వెనుకవైపు వెళ్లిపోయింది.*


*మెల్లిగా హాలు నిండిపోయింది. కంపెనీ 10వ వార్షికోత్సవంతోబాటు, ఇటీవలే ఒక పెద్ద విదేశీ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసినందుకు చాలా ఘనంగా ఏర్పాట్లు చేసారు.*


 *ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ మానేజర్ భావన కాబట్టి తనకి ఇంకా ఎక్కువ భాధ్యతలు ఉన్నాయి. కంపెనీలోని అన్ని విభాగాలలో పనిచేసే ఉద్యోగులందరూ వచ్చినట్టున్నారు. కోలాహలంగా ఉంది హాలంతా..*


*భావన పిల్లలను అల్లుడు తీసుకుని వస్తాడని వాళ్లకోసం ఎదురు చూడసాగింది  సౌదామిని.* 

*****

*మరోగంటలో ముఖ్య అతిధి రాగానే కార్యక్రమం మొదలైంది. కంపెనీ డైరెక్టర్లు, ముఖ్య అతిధి ప్రసంగాలు ముగిసిన తర్వాత ప్రాజెక్టులో పాల్గొన్నవారందరికీ బహుమతులు ఇచ్చారు.*


 *వాళ్ల నాయకురాలిగా ఎంతో సమర్ధవంతంగా పనిచేసిన భావనను అందరూ ప్రశంసించారు.*


 *అంతేకాకుండా ఈరోజు భావన పుట్టినరోజు కాబట్టి  మరింత ఘనంగా శుభాకాంక్షలు అందిద్దామని కంపెనీ చైర్మన్ ప్రకటించాడు.*


 *సౌదామిని భావన పిల్లలకోసం అటూఇటూ చూస్తూనే భావనకు  వస్తోన్న అభినందనలు చూసి మురిసిపోతోంది.*

*పది నిమిషాల్లో ఒక పెద్ద కేకును స్టేజ్ మధ్యలో టేబుల్ మీద పెట్టారు. స్టేజ్ మొత్తం రంగురంగుల బెలూన్లను కట్టారు. భావనను పిలిచారు. భావన ముందుకొచ్చింది.*


*కాని “ఒక్క నిమిషం“ అంటూ మైక్ దగ్గరకు వెళ్లి “అమ్మా! ఒక్కసారి స్టేజ్ మీదకు రావా? నాన్నగారు కూడా రావాలి. నాకోసం..” అని పిలిచింది. వెంటనే అందరూ చప్పట్లు కొట్టారు.*


*మేమెందుకు అనుకుంటూ సందేహంగానే సౌదామిని, భర్తతో కలిసి స్టేజ్ మీదకు వచ్చింది. భావన తల్లిని కేక్ ముందు నిలబెట్టింది. అటు, ఇటు తను, తండ్రి నిలబడ్డారు. కేక్ మీద రాసింది చదివిన సౌదామిని నివ్వెరపోయింది..  భావనకు బదులు తన పేరు కనఫడింది. అమ్మకు శుభాకాంక్షలు అని..*


 *అయోమయంగా కూతురివైపు చూసింది.*

*భావన చిరునవ్వుతో మైక్ ముందుకు వచ్చి “ ఫ్రెండ్స్! ఇవాళ కంపెనీ విజయోత్సవాలతోబాటుగా నా  పుట్టినరోజు కూడా జరపాలని అనుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాని ఇవాళ నా పుట్టినరోజు కాదు” అని ఆగింది..*


 *“అవును.. ఇది నా పుట్టినరోజు కాదు. మా అమ్మ, నన్ను కన్నరోజు. తను అమ్మగా మారినరోజు.  ఈ రోజు నా జన్మకు కారణమైన నా తల్లికి కాక నాకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడమేంటి?*

*అందుకే ఈ రోజును మా అమ్మ నన్ను కన్నరోజుగా జరుపుకోవాలనుకుంటున్నాను. చిన్నప్పుడు ప్రతీ సంవత్సరం అమ్మ మన పుట్టినరోజు పండగలా జరుపుతుంది. కొత్తబట్టలు, చాక్లెట్లు, స్వీట్లు... ఎన్ని చేసేదో, కాని పెద్దయ్యాక మన  పుట్టినరోజులో అమ్మ అంతగా కనిపించదు. స్నేహితులు, కాబోయే భర్త లేదా అత్తవారింటివారు మాత్రమే ఉంటారు. కాని  మన పుట్టుకకు కారణమైన అమ్మలేని మన పుట్టినరోజును ఎంత ఘనంగా జరుపుకున్నా  వృధాయే కదా. అందుకే ఈ విజయోత్సవ వేళ  అమ్మకే  ఈ రోజు అంకితం.. అమ్మా! అటు చూడు"అంటూ స్టేజ్ కుడివైపుకు చూపించింది..*


*అది చూసిన సౌదామిని ఆశ్చర్యపోయింది. తను చూస్తుంది కలయా? నిజమా ? అని నమ్మలేకపోయింది.*

*అమెరికాలో ఉండే  సౌదామిని కొడుకు అన్వేష్, కోడలు స్వప్న, మనవరాళ్లు శిల్ప, శ్రేయ కనబడ్డారు. వారి వెనకాలే అల్లుడు, మనవళ్లు  నేహాంత్, శ్రేయాంశ్...* *మనవరాళ్లు ముచ్చటగా పట్టుపరికిణీలలో, మనవళ్లు సిల్క్ కుర్తా పైజామాలు వేసుకుని ఎంత ముద్దుగా ఉన్నారో..*


*సౌదామిని తన కొడుకును చూసి అయిదేళ్లయింది.  మనవరాళ్లను కూడా మొదటిసారి ప్రత్యక్షంగా చూస్తోంది. వాళ్లు పుట్టినప్పటినుండి వాళ్ల ఆటలన్నీ స్కైప్ లోనే చూడడం. వాళ్లంతా వచ్చి సౌదామినిని చుట్టుముట్టారు. మనవళ్లు, మనవరాళ్లు అమ్మమ్మా! బామ్మా! అంటూ కౌగిలించుకున్నారు..*

*సౌదామినికి సంతోషంతో కళ్లనీళ్లు వచ్చేసాయి.  అది చూసి హాల్లో ఉన్నవారికి కూడా మనసు చెమరించింది.*


*భావన పిలవగానే పిల్లలు నలుగురూ వచ్చి మైక్ ముందు నిలబడి నెల రోజులనించి ప్రాక్టీసు చేసిన, సౌదామినికి ఇష్టమైన అన్నమయ్య కీర్తనను పాడారు.*

  

*కంపెనీ చైర్మన్, డైరెక్టర్లు కూడా ఈ ఏర్పాట్లు ముందే తెలుసన్నట్టు చిరునవ్వులతో నిలబడ్డారు*.


*అన్వేష్ వచ్చి మైక్ అందుకున్నాడు..” ఫ్రెంఢ్స్.. నిజానికి ఇది అక్కకి సంబంధించిన ప్రోగ్రామ్.. తన కంపెనీ, తన ప్రాజెక్టు విజయంతోపాటు తన పుట్టినరోజు కూడా..  కాని ఇలా తన పుట్టినరోజను అమ్మ కన్నరోజుగా మార్చడం అన్న ఆలోచన వచ్చినందుకు నిజంగా హాట్సాఫ్ అక్కా.. నువ్వు చెప్పింది నిజమే..*


 *అమ్మలేకుండా మనం లేము.  మన పుట్టినరోజును అమ్మ ఎప్పుటికీ మర్చిపోదు కారణం తను నవమాసాలు మోసి కని, అల్లారుమద్దుగా, క్రమశిక్షణతో పెంచుతుంది. అమ్మకు తోడుగా నాన్న ఎప్పుడూ వెన్నంటే ఉన్నారు. నాన్న డబ్బులు కట్టినంత మాత్రాన మనం  ఇంజనీర్లు, డాక్టర్లం అయిపోతామా.. మనకోసం, మన చదువులు, సంతోషంకోసం నాన్న సంపాదనలో బిజీగా ఉంటారని, మన ప్రతీ ఆవసరం అమ్మకు తెలుసుకుంటుంది..ఎంత కష్టమైనా తీర్చడానికి ప్రయత్నిస్తుంది. నాన్నను, మనను, మన పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది అమ్మ*.


 *కాని తన అవసరాలు, ఇష్టాల గురించి ఎవరికి ఎంత తెలుసని. కనీసం తన  పుట్టినరోజు కూడా మనం గుర్తుపెట్టుకోము. ఎందుకంటే మనం మన ఉద్యోగ, వ్యాపార, కుటుంబ వ్యవహారాల్లో బిజీ కాబట్టి...*


 *ఇప్పుడు అక్క కారణంగా నేను చేస్తున్న తప్పు కూడా తెలిసి వచ్చింది. అందుకే  సెలవులు లేవు, తీరిక లేదు అంటూ అమ్మ దగ్గరకు రావడాన్ని వాయిదా వేస్తున్న నేను వెంటనే వచ్చేసా. నేను రావడమే అమ్మకు పెద్ద బహుమతి అని నాకు తెలుసు కదా” అని ఉద్వేగంతో మాట్లాడిన అన్వేష్ కళ్లు తుడుచుకుంటూ తల్లి దగ్గరకు వెళ్లాడు.*


*సౌదామిని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఏం మాట్లాడాలో కూడా తెలీడం లేదు. కూతురి ఆలోచనకు సంతోషించాలా? తన  పిల్లలు తనను ఇంతగా ప్రేమిస్తూ, గౌరవిస్తున్నందుకు సంతోషించాలా అర్దం కాని స్థితిలో ఉంది.  భర్త, పిల్లలు, మనవళ్లతో  కేక్ కట్ చేసింది. హాలు మొత్తం కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది.*


*“అమ్మా! మీరు మా అందరికీ  రెండు మంచి మాటలు చెప్పండి. తల్లిమీద ఇంత మంచి అభిప్రాయం , ప్రేమ, ఆఫ్యాయతలు ఉన్న మీ పిల్లలను చూస్తే మీ పెంపకం, మీరు నేర్పిన సంస్కారం కనిపిస్తున్నాయి. ఇవి ఈనాటి పిల్లలందరికీ  అర్ధమవ్వాలి. చెప్పండి ప్లీజ్.. ” అని రిక్వెస్ట్ చేసాడు కంపెనీ చైర్మన్ నారాయణరావు..*

 

*“అయ్యో! నేనేం మాట్లాడగలను.  మీరనుకున్నంత గొప్పదాన్నేమీ కాదు. అందరిలాంటి తల్లినే. వద్దు” అంటూ చేతులు జోడించి మొహమాటంగా చెప్పింది సౌదామిని.*


*“మాట్లాడాలి....మాట్లాడాలి.. “అంటూ హాల్లో కేకలు వినపడ్డాయి..*


*భావన కూడా తల్లిని మాట్లాడమనడంతో తప్పనిసరై మైక్ ముందుకు వచ్చింది.*


*“వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక క్రింద ఉన్న పెద్దలకు నమస్కారాలు. పిల్లలకు ఆశీర్వాదాలు. మా పిల్లలు నామీద ఉన్న ప్రేమతో మరీ గొప్పగా చెప్తున్నారు కాని నేను చేసిందేమీ లేదు. అందరు అమ్మలలాగానే నా  పిల్లలు కూడా గొప్ప చదువులు చదవాలి, మంచి ఉద్యోగంలో స్థిరపడాలి. పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. వారికి తగిన సహాయ సహకారాలను అందించాను.*


 *కాని మీరంతా నా పిల్లల ఈడువాళ్లే కాబట్టి ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను.*

*పెద్ద చదువులు చదవండి. ఉద్యోగాలు చేయండి. సంపాదించండి.*


*కాని కుటుంబాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. కుటుంబం అంటే తల్లిదండ్రులే కాదు భాగస్వామి, పిల్లలు కూడా... మీరు ఎంత సంపాదించినా మీకోసం మీ పిల్లలకోసమే కదా. మీరు మీ భాగస్వామితో , పిల్లలతో ఆనందంగా ఉండడానకి కావలసినంత సంపాదించండి చాలు.*


 *తరతరాలకు సంపాదించడం కోసం ఇప్పటి మీ సంతోషాలను, జీవితాలను పణంగా పెట్టకండి. యంత్రాలలా కాకుండా మనుషుల్లా మీ మనసుకు తగినట్టుగా బ్రతకండి.. అంతే..*


*మరొక్కమాట.. మీ పుట్టినరోజు సంబరాలు  మీకు మాత్రమే  సొంతం కాదు. మీ జన్మకు కారణమైన అమ్మానాన్నలు కూడా ఉన్నారని మాత్రం మరచిపోవద్దు. ఉంటాను “  అని వినయంగా చెప్పింది.*

 

*కంపెనీ ఉద్యోగులు, చైర్మన్, డైరెక్టర్ల కరతాళ ధ్వనులతో హాలంతా మారుమ్రోగిపోయింది.*

*భర్త, పిల్లలతో కలిసి సంతోషంగా ఇంటికి బయలుదేరింది సౌదామిని.*


 *ఇప్పుడు ఆమెకు ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది.. కారులో కూడా మనవళ్లు, మనవరాళ్లతో తెగ కబుర్లు చెప్పసాగింది, వాళ్ల కబుర్లు వింటూ చిన్నపిల్లలా మారిపోయింది..  తన కూతురు, కొడుకు కలిసి చేసిన ఈ కార్యక్రమంలో తన వంతు బాధ్యతను పూర్తి చేసానన్న తృప్తితో ఆ మనోహరమైన దృశ్యాన్ని అశోక్ చూస్తూ ఉండిపోయాడు.*


*ఇంటికి రాగానే అందరూ హాల్లో చేరారు. వాళ్లకు భోజనం ఏర్పాట్లు చేయడానికి వంటింట్లోకి వెళ్లబోతున్న సౌదామినిని బలవంతంగా హాల్లోనే కూర్చోబెట్టారు. అంతలోనే హోటల్ నుండి ఆర్డర్ చేసిన భోజనం వచ్చేసింది.*


 *సౌదామిని, భర్తను, పిల్లలను, వాళ్ల పిల్లలను చూసుకుంటూ  పట్టరాని ఆనందంతో పొంగిపోయింది. వాళ్లు రావడం ఒక ఎత్తైతే తను కన్నరోజు అంటూ అంత గొప్ప గౌరవాన్ని ఇవ్వడం గురించి తలుచుకుని ఇంకా ఆశ్చర్యంగానే ఉంది.*


*తమ పిల్లలతో పాటు అమ్మకు అటు ఇటు కూర్చున్న భావన, అన్వేష్ కలిసి తాము నెలరోజులనుండి ప్లాన్ చేసిన ఈ కార్యక్రమం గురించి తల్లికి వివరించసాగారు.  వాళ్లకు తోడుగా నిలిచిన  కోడలు, అల్లుడు, అశోక్ దూరం నుండే వాళ్లను చూసి నవ్వుకున్నారు.  వాళ్ల మాటలు ఎంతకీ ఆగడం లేదు..*


*“సౌదా! ఇదిగో నా తరఫున నీకో చిన్న బహుమతి. నీకు చాలా ఇష్టమైనదే అని నాకు తెలుసు” అంటూ అశోక్ ఒక కవర్ ఆమె చేతిలో పెట్టాడు.*


*“అయ్యో! ఇప్పుడు మీరు కూడా బహుమతి ఇవ్వాలా? పిల్లలకు తోడుగా ఉండి ఇదంతా చేయించారు చాలదూ.. ఏముంది ఈ కవర్ లో?” అంటూ కవర్ తెరిచింది.*


*పిల్లలందరూ కూడా ఆ కవర్ లో ఏముందా అని ఆసక్తిగా చూసారు.*


*సౌదామిని పేరు మీద ఎమ్.ఫిల్  అఫ్లికేషన్ ఫారమ్ పూర్తిగా నింపి, కావలసిన సర్టిఫికెట్లు జతచేసి ఉన్న కాగితాలవి. సంతకం పెట్టి సబ్మిట్ చేస్తే చాలు.*


*అది చూసి పిల్లలంతా సంతోషంగా చప్పట్లు కొట్టారు.. ఆ నవ్వులు, కేరింతలు సౌదామిని మొహంలో  కూడా ప్రస్ఫుటంగా కనిపించాయి.*

రథసప్తమినాడు చెప్ప వలసిన శ్లోకం

 *రథసప్తమినాడు చెప్ప వలసిన శ్లోకం

 *

యధా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు|

తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ|

ఏత జ్జన్మకృతం పాపం

యచ్చ జన్మాంతరార్జితం|

మనోవాక్కాయజం యిచ్చి జ్ఞాతా జ్ఞాతేన యే *పునః|

 ఇతి సప్తవిధం 

పాపం స్నానాన్మే సప్త సప్తికే* |

 *సప్త వ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి** |

సుభాషితమ్

 🌸🙏 *!! శుభోదయ సుభాషితమ్!!* 🙏🌸


శ్లో|| తత్కర్మ యన్న బంధాయ సా విద్యా యా విముక్తయే।

ఆయాసాయాపరం కర్మ విద్యాన్యా శిల్పనైపుణమ్॥


తా|| ఏది బంధాన్ని కలిగించదో అదే కర్మ. ఏది ముక్తికి మార్గాన్ని చూపిస్తుందో అది విద్య. వేరొక కర్మ (పని) అంతా వృథా ప్రయాసయే. ఇతర విద్యలన్నీ ఉట్టి నేర్పరితనాలే....

🙏✨💖🌷

మొగలిచెర్ల

 *విష్ణు సహస్ర నామం..*


దాదాపు తొమ్మిది పది సంవత్సరాల క్రితం.."మేము చాలా దూరం నుంచీ వస్తున్నామండీ..మిట్టపాలెం నారాయణస్వామి వారి ఆలయం, భైరవకోన, సిద్దేశ్వరీ ఆలయం అన్నీ చూసుకొని ఇక్కడకు వచ్చాము..మాకు ఈరాత్రికి ఇక్కడ ఉండటానికి బస ఏదైనా ఉన్నదా?..మేము మొత్తం ఇరవై మంది దాకా ఉన్నాము.." అని ఒక శనివారం సాయంత్రం నాలుగు గంటల వేళ ఆ వచ్చిన వాళ్ళు అడిగారు..మా సిబ్బంది తో మాట్లాడి..ఒక రేకుల షెడ్ (ఆరోజుల్లో ఉన్న వసతి అదే..) వాళ్లకు కేటాయించాము..అందరూ స్నానాలు చేసి మరో గంట కల్లా మందిరం లోపలికి వచ్చేసారు..ఆరోజు జరుగబోయే పల్లకీసేవ గురించి అడిగి తెలుసుకున్నారు..తామూ అందులో పాల్గొంటామని చెప్పారు..అందరి పేర్లూ నమోదు చేసుకున్నారు..


"అయ్యా..ఈరోజు రాత్రికి పల్లకీసేవ తరువాత భజన కార్యక్రమం ఉన్నది కదా..భజన చేసే మాస్టారు తనకు ఆరోగ్యం బాగా లేనందున రాలేకపోతున్నానని ఇప్పుడే కబురు పెట్టాడు..మనం ఈరోజు ప్రత్యేకంగా భజన ఉన్నది అని ముందుగా అందరికీ చెప్పి ఉన్నాము..ఇప్పుడేమి చేద్దాం?" అని మా సిబ్బంది వచ్చి తెలిపారు..కొంచెం సేపు ఆలోచించాను..ఏమీ తోచలేదు..ప్రతి శనివారం పల్లకీసేవ తరువాత స్వామివారి మంటపం లో భజన కార్యక్రమం ఉంటుంది..భక్తులు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు..ఆ కార్యక్రమ నిర్వహణ కొఱకు భజన పాటలు పాడే వ్యక్తిని నియమించుకున్నాము..అతనికి వాయిద్య సహకారం అందించే వాళ్ళనూ ఏర్పాటు చేసుకున్నాము..శనివారం రాత్రి 9.30 గంటల నుండి 11.30 వరకూ ఆ భజన పాటలు సామూహికంగా పాడుతారు..అదొక కోలాహలంగా జరిగే కార్యక్రమం..ఆ కార్యక్రమానికి అంతరాయం ఏర్పడుతుందేమో ననే సంశయం మనసులో ఏర్పడింది..


మరో అరగంటకు పల్లకీసేవ ప్రారంభం అవుతుంది అనుకునే సమయం లో ఇరవై మంది ఒకే బృందం గా వచ్చిన వాళ్ళు నేరుగా నా దగ్గరకు వచ్చి.."అయ్యా..పల్లకీసేవ కు ఇంకెంత సమయం ఉన్నది?.." అని అడిగారు.."ఓ అరగంట మాత్రమే ఉన్నది..సరిగ్గా ఏడు గంటలకు మొదలు పెడతాము..ఇప్పుడు ఆరున్నర సమయం.." అని చెప్పాను..కొద్దిగా నిరుత్సాహ పడ్డట్టు గా చూసారు.."ఏమిటి విషయం..?" అన్నాను.."మా వాళ్లలో ఒక ఐదుగురు ఆడవాళ్లు వున్నారు..విష్ణు సహస్రనామం రాగయుక్తం గా ఆలపించాలని అనుకుంటున్నారు..కనీసం యాభై నిమిషాలు సమయం కావాలి..మేము ఇంకొంత ముందుగా మిమ్మల్ని అడిగి వుండ వలసింది..వాళ్ళు ఈ వాతావరణం చూసి..ఇక్కడ విష్ణు సహస్రనామం గానం చేయాలని ఉత్సాహ పడ్డారు.." అన్నారు.."మీరు కొద్దిగా ఓపిక పడితే..పల్లకీసేవ పూర్తి కాగానే..పల్లకీ ఉన్న ప్రదేశం లోనే..ఆ మండపం లోనే..మీ వాళ్ళ చేత విష్ణు సహస్రనామం గానం చేయించే అవకాశం కల్పిస్తాను..ఈరోజు రాత్రి 9.30 కి ఇక్కడ భజన కార్యక్రమం ఉన్నది..భజన పాటలు పాడే మాస్టారు రాలేదు..ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాము..మీరు సమ్మతిస్తే ఇలా చేద్దాము.." అన్నాను..విష్ణు సహస్రనామం గానం చేస్తామని చెప్పిన ఐదుగురు ఆడవాళ్ళూ సంతోషంగా ఒప్పుకున్నారు..


ఆరోజు రాత్రి 9.30 గంటలకు భక్తులందరూ మండపం లో కూర్చున్న తరువాత..విష్ణు సహస్రనామం రాగయుక్తం గా ఆలపించారు..అద్భుతంగా గానం చేశారు..సుమారు గంట సేపు పట్టింది..అది పూర్తి కాగానే హనుమాన్ చాలీసా గానం చేశారు.."అయ్యా..ఏదో ఒక క్షేత్రం లో మేము ఇలా గానం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాము..కానీ ఇక్కడ మాకు అవకాశం దొరికింది..మీరు అనుమతి ఇస్తే..మేము ఐదుగురమూ..మరో నాలుగు శనివారాలు ఇదే సమయానికి ఇలాగే వచ్చి గానం చేసి వెళతాము..మొత్తం ఐదు వారాలు ఇక్కడ విష్ణు సహస్రనామం గానం చేద్దామని అనుకున్నాము.." అన్నారు.."తప్పకుండా ఏర్పాటు చేస్తాను..మీరు మరో నాలుగు శనివారాలు రావడం మాత్రం మానుకోవద్దు.." అని చెప్పాను..


ఆ తరువాత నాలుగు శనివారాలు ఆ ఐదుగురు ఆడవాళ్ళూ క్రమం తప్పకుండా వచ్చి స్వామివారి సన్నిధిలో విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా గానం చేసి, ప్రక్కరోజు ఉదయం స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వెళ్లారు..కనీసం వాళ్ళ రాకపోకలకు అయ్యే వ్యయాన్ని కూడా తీసుకోలేదు.."ఒక్క పైసా కూడా వద్దండీ..మేము స్వామివారికి ఈరకంగా సేవ చేయాలని అనుకున్నాము..చేస్తున్నాము..మా పుణ్యం కొద్దీ మాకు ఈ అవకాశం దొరికింది.." అని చెప్పారు..


భజన మాస్టారు రాకపోవడం..అదే సమయానికి ఈ ఆడవాళ్లు వచ్చి విష్ణు సహస్రనామం గానం చేయడం..ఒకవారం మాత్రమే కాకుండా వరుసగా ఐదు వారాలు అలా  కొనసాగడం ..ఏదో కాకతాళీయం గా జరిగే ఘటన కాదు..స్వామివారి సంకల్పం  మాత్రమే!!


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

అమ్మా శారదా

 హఠాత్తుగా డ్రైవరు చెప్పాడు “సార్ సార్ నేను బ్రేకు పైన కాలు తీసేసాను అయినా బస్సు వెనక్కు పడిపోవడం లేదు. ఒక వంద మంది వెనక నిలబడి బస్సును పట్టుకున్నట్టుగా బస్సు ఆగిపోయింది. ఏమి భయపడకండి. నేను మెల్లిగా బస్సును తిప్పుతాను” అని తన ప్రయత్నం మొదలు పెట్టాడు. కాని మేము నామఘోష ఆపలేదు.


హమ్మయ్య చివరగా డ్రైవరు బస్సును తిప్పాడు. అందిరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలు. సరిగ్గా ఒకటిన్నరకు శృంగేరి సంస్థానం ప్రవేశ ద్వారం చేరుకున్నాము. మాకోసం ఎదురు చూస్తున్న నాగేశ్వర గణపదిగళ్ మమ్మల్ని చూడగానే నవ్వుతూ, “రండి రండి మీరందరూ మద్రాసు నుండి వస్తున్నారు కదూ? ముందు కాళ్ళు చేతులు కడుక్కుని కొద్దిగా తినండి. చలా ఆకలిగా ఉన్నారు. మీ కోసమని అన్నం ఉప్మా, వంకాయ గొజ్జు సిద్ధం చేసాము” అని అన్నారు. 


”శాస్త్రిగారు మేము వస్తున్నామని మీకు ఎలా తెలుసు? మేము మీకు జాబుకూడా రాయలేదు” అని అడిగాను. అతను నవ్వుతూ, “అవును నిజం. మీరు వస్తున్నారని మావంటివారికి తెలియకపోవచ్చు. కాని లోపల ఉన్న త్రికాలవేదులు శ్రీ మహాసన్నిధానం వారికి అంతా తెలుసు. మీకు తెలుసా, దాదాపు పదకొండు గంతలప్పుడు స్వామి వారు నన్ను పిలిచి, ‘శారదాంబ దర్శనం కోసం 54 మంది భక్తులు వస్తున్నారు. వారు చాలా ఆకలిగొని ఉంటారు. మీ వాళ్ళకి చెప్పి అన్నం ఉప్మా వంకాయ గొజ్జు తయారుచేఏయించి సిద్ధంగా ఉంచు. అలాగే వారు కోసం ఒక పెద్ద హలును సమకూర్చు’. అన్నీ ముగించుకొని మిమ్మల్ని ఆహ్వానించడానికి నేను ఇక్కడ నిలబడ్డాను” అని మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసారు. 


శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దూరదృష్టి, వారి అవ్యాజమైన కరుణని తలచుకొని నేను ఆశ్చర్యపోయాను. నా కళ్ళ వేంట నీరు వచ్చింది. అది శాస్త్రి గారు “దీనికే మీరు ఆశర్యపోతున్నారు. రేపు ఉదయం మీకు మరొక విషయం కూడా చెప్తాను. మీరు అది విని ఇంకా ఆశ్చర్యపోతారు” అని అన్నారు. అరిటాకులపై వేడి వేడిగా అన్నం ఉప్మా, వంకాయ గొజ్జు వడ్డించారు. మా కడుపులు నిండుగా తిని ఆ రాత్రికి విశ్రమించాము. 


మరుసటి రోజు ఉదయం తుంగా నదిలో మా స్నానాలు ముగించుకొని దక్షిణామ్నాయ శృంగేరి పీఠాధీశ్వరులు మహాసన్నిధానం శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దర్శనానికి బయలుదేరాము. రాత్రి మేము కలిసిన శాస్త్రి గారు కూడా మాతోనే ఉన్నారు. 


నేను వారికి రెండుచేతులు జోడీంచి నమస్కరించి “నిన్న మీరు మాకు ఇంకొక విషయం చెబుతాను అన్నారు. దయచేసి చెప్పవలసిందిగా వేడుకుంటున్నాను” అని వారిని ప్రార్థించాను. 


వారు చెప్పడం ప్రారంభించారు “రాత్రి దాదాపు 12:00 గంటల సమయంలో మహాసన్నిధానం వారు వారి ఏకాంత మందిరంలో కూర్చుని శాస్త్ర సంబధమైన పుస్తకాలు చూస్తున్నారు. నేను బయటి గదిలో కూర్చున్నాను. హఠాత్తుగా బయటకు వచ్చి స్వామి వారు తమ రెండు చేతులని గోడకి ఆనించి గట్టిగా అదుముతూ, ఏదో మంత్రం చదవనారంభించారు. నేను లేచి నిలబడ్డాను. వారిని చూస్తే ఆ గోడ పడకుండా ఆపుతున్నట్టు ఉంది. నాకు ఏమి అర్థం కాలేదు. 


ఒక ఐదు నిముషాల తరువాత గోడపైనుండి చేతులు తీసి, మహాసన్నిధానం వారు నా దగ్గరకు వచ్చి ‘నేను ఇలా గోడకు చేతులు అడ్డుపెట్టి జపం చెయ్యడం చూసిన నీకు వింతగా అగుపిస్తోది కదూ. ఏమి లేదు! మద్రాసు నుండి శారదాదేవి దస్ఱనానికి వస్తున్న బస్సు దారి తప్పింది. వారు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నామని తెలుసుకుని బస్సును వెనక్కు తిప్పుతుండగా, బ్రేకులు పడక లోయలోకి పడిపోతోంది.


అందులో ఉన్న భక్తులు గట్టిగా "అమ్మా శారదా! కాపాడు కాపాడు" అని అరిచారు. అందుకనే గోడకి నా చేతులను అడ్డుపెట్టి ఆ బస్సు పడకుండా ఆపాను. ఇప్పుడు అంతా సవ్యంగా ఉంది. బస్సు శృంగేరి వైపు వస్తోంది. నీవు వెళ్ళి నేను ఆనతిచ్చినట్టుగా వారికి అన్నీ సిద్ధం చెయ్యి’ అని చెప్పి వారు గదిలోకి వెళ్ళిపోయారు. నేను ఇదంతా విని స్థాణువైపోయాను.” ఇది విని మేమందరమూ ఉండబట్టలేక కన్నీరు కారుస్తూ, ఆ నడయాడే శారదా దేవిని చూడటానికి బయలుదేరాము. 


శ్రీవారికి సాష్టాంగం చేసి నిలుచున్న నావైపు చూసి, శ్రీ శ్రీ శ్రీ మహాసన్నిధానం వారు నవ్వుతూ, మాకు హెచ్చరిక చేస్తున్నట్టు “మహాత్ములు చెప్పినదాన్ని ఎప్పుడూ వినాలి. దాన్ని తప్పకుండా పాటించాలి. అలాకాకుండా ప్రవర్తిస్తే జరగవలసినవి ఏవి సరిగ్గా జరగవు. ఏమిటి అర్థమైందా?” అని అన్నారు. మహాసన్నిధానం వారు చెప్తున్నది కంచి పరమాచార్యులు వారు మాకు ఆజ్ఞాపించినదాని గురించే అని నాకు అర్థమైంది.


--- శ్రీ రమణి అన్న, శక్తి వికటన్ ప్రచురణ


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


https://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

అరికాళ్ళకు కొబ్బరి నూనె

 *మీ అరికాళ్ళకు కొబ్బరి నూనె వ్రాయండి*


87 సంవత్సరాల వయస్సులో కూడా, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, తలనొప్పి, దంతాల నష్టం లేదు. కొబ్బరి నూనెను పూయడం అతని చికిత్స మరియు ఫిట్నెస్ యొక్క మూలం.


 Man మణిపాల్‌కు చెందిన ఒక విద్యార్థి మాట్లాడుతూ, కొబ్బరి నూనెను నా అరికాళ్ళ క్రింద వేయమని నా తల్లి పట్టుబట్టింది. చిన్నతనంలో తన దృష్టి బలహీనపడిందని చెప్పారు. ఆమె ఈ ప్రక్రియను కొనసాగించినప్పుడు, నా కంటి కాంతి క్రమంగా పూర్తిగా మరియు ఆరోగ్యంగా మారింది.


  కేరళకు నేను సెలవు కోసం వెళ్ళానని ఒక పెద్దమనిషి రాశాడు. నేను అక్కడ ఒక హోటల్‌లో పడుకున్నాను. నేను నిద్ర పోలేకపోయాను. నేను బయట నడవడం ప్రారంభించాను. రాత్రి బయట కూర్చున్న పాత కాపలాదారు నన్ను "ఏమిటి విషయం?" నేను నిద్రపోలేనని చెప్పాను! "మీకు కొబ్బరి నూనె ఉందా?" నేను చెప్పలేదు, అతను వెళ్లి కొబ్బరి నూనె తెచ్చి, "మీ పాదాల అరికాళ్ళను కొన్ని నిమిషాలు మసాజ్ చేయండి" అని అన్నాడు. నేను నిద్రలోకి తిరిగి వెళ్ళాను.


  • నాకు కడుపు సమస్య వచ్చింది. కొబ్బరి నూనెతో నా అరికాళ్ళకు మసాజ్ చేసిన తరువాత, నా కడుపు సమస్య 2 రోజుల్లో నయమవుతుంది.


 15 నేను గత 15 సంవత్సరాలుగా ఈ ట్రిక్ చేస్తున్నాను. ఇది నాకు బాగా నిద్రపోయేలా చేస్తుంది. కొబ్బరి నూనెతో నా పిల్లల అరికాళ్ళను కూడా మసాజ్ చేస్తాను. ఇది వారిని సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.


 Legs నా కాళ్ళు ఎప్పుడూ వాపుతో ఉంటాయి మరియు నేను నడుస్తున్నప్పుడు, నేను అలసిపోతాను. నేను రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నూనె మసాజ్ యొక్క ప్రక్రియను నా పాదాల అరికాళ్ళపై ప్రారంభించాను. కేవలం 2 రోజుల్లో, నా కాళ్ళ వాపు మాయమైంది.


  • ఇది అద్భుతమైన విషయం. విశ్రాంతి చిట్కా కోసం నిద్ర మాత్రల కంటే ఈ చిట్కా మంచిది. ఇప్పుడు నేను ప్రతి రాత్రి నా అడుగుల కొబ్బరి నూనె అరికాళ్ళతో నిద్రపోతాను.


 • నా తాత పాదాలకు మండుతున్న అనుభూతి మరియు తలనొప్పి ఉన్నాయి. కొబ్బరి నూనెను తన అరికాళ్ళపై వేయడం ప్రారంభించే సమయానికి, నొప్పి పోయింది.


   • నాకు థైరాయిడ్ వ్యాధి వచ్చింది. నా కాళ్ళు అన్ని వేళలా దెబ్బతింటున్నాయి. గత సంవత్సరం ఎవరో రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను పాదాల అరికాళ్ళకు మసాజ్ చేయాలని సూచించారు. నేను శాశ్వతంగా చేస్తున్నాను. ఇప్పుడు నేను సాధారణంగా నిశ్శబ్దంగా ఉన్నాను.


 • నాకు పన్నెండు సంవత్సరాల క్రితం హేమోరాయిడ్స్ వచ్చాయి. నా స్నేహితుడు నన్ను 90 సంవత్సరాల వయస్సులో ఉన్న ఒక age షి వద్దకు తీసుకువెళ్ళాడు. కొబ్బరి నూనెను అరచేతులపై, వేళ్ళ మధ్య, వేలుగోళ్ల మధ్య, మరియు గోళ్ళపై రుద్దమని ఆయన సూచించారు మరియు ఇలా అన్నారు: నాభికి నాలుగైదు చుక్కల కొబ్బరి నూనె వేసి నిద్రపోండి. నేను అతని సలహాను అనుసరించడం ప్రారంభించాను. నాకు చాలా ఉపశమనం కలిగింది. ఈ చిట్కా నా మలబద్ధకం సమస్యను కూడా పరిష్కరించింది. నా శరీర అలసట కూడా మాయమైంది. గురకను నివారిస్తుంది.


  

  Legs నా కాళ్ళు మరియు మోకాళ్ళలో నొప్పి వచ్చింది. కొబ్బరి నూనె మసాజ్ యొక్క కొనను నా పాదాల అరికాళ్ళపై చదివినప్పటి నుండి, ఇప్పుడు నేను రోజూ చేస్తాను, అది నాకు నిద్ర వస్తుంది.


  Bed చాలా సంవత్సరాల నుండి నాకు వెన్నునొప్పి వచ్చింది, నేను పడుకునే ముందు కొబ్బరి నూనె మసాజ్ ను నా కాళ్ళ మీద వాడటం మొదలుపెట్టినప్పటి నుండి, నా వెన్నునొప్పి పూర్తిగా తగ్గిపోయింది మరియు నా నిద్ర బాగా మెరుగుపడింది.


   దక్షిణ భారత రహస్యం ఈ క్రింది విధంగా ఉంది:


   రహస్యం చాలా సులభం.

 "మీరు కొబ్బరి నూనెను మాత్రమే వర్తించనవసరం లేదు. మీరు ఏదైనా నూనె, ఆవాలు, ఆలివ్ మొదలైనవాటిని పాదాల అరికాళ్ళపై మరియు మొత్తం పాదాలకు వర్తించవచ్చు, ముఖ్యంగా అరికాళ్ళపై మూడు నిమిషాలు మరియు పాదాలకు మూడు నిమిషాలు.


 అరికాళ్ళపై 100 యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉన్నాయి.

 మానవ అవయవాలను నొక్కడం మరియు మసాజ్ చేయడం ద్వారా కూడా నయం చేస్తారు.

   *ఫుట్ రిఫ్లెక్సాలజీ*


 *దయచేసి ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో పంచుకోండి*