15, ఫిబ్రవరి 2024, గురువారం

Amma paata


 

Locomotive


 

Language truck


 

Threading the needle


 

*🪐శ్రీ కృష్ణావతారం

 🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.                *పురాణ పఠనం*

.        *🪐శ్రీ కృష్ణావతారం🪐*

.               *91వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*యదు సాల్వ యుద్ధంబు* 


ఈ విధంగా యాదవసైన్యం ప్రద్యుమ్నుని రథాన్నిదాటి ముందుకు పోయి సాల్వుడి సైన్యాలను ఎదిరించింది. అప్పుడు రెండు పక్షాల బలాలకు జరిగిన బాహాబాహీ సంకుల సమరం దేవదానవ యుద్ధంలాగ కనబడసాగింది. అప్పుడు....ఓ పరీక్షిన్మహారాజా! ఆ సంకుల సమరంలో విస్తారమైన అల్లెత్రాళ్ళ టంకారాలు, మదగజాల ఘీంకారాలు, భటుల హూంకారాలు, భేరీ భాంకారాలు, వీరుల దురహంకారాలు, శత్రుసంక్షోభంగా భూమ్యాకాశాలు నిండాయి. గుఱ్ఱాల గిట్టల తాకిడికి, రథచక్రాల ఒరిపిడికి, భటుల పాదఘట్టనలకు లేచిన ధూళి ఆకాశం అంతా నిండి చీకట్లు వ్యాపించాయి. ఆ చీకట్లను పోగొడుతూ సైన్యం చేతులలోని కత్తులు గదలు మున్నగు ఆయుధాల కాంతులు ఆకాశ విహారుల చూపులకు మిరుమిట్లు గొలుపుతూ ఆకాశం నిండా వ్యాపించాయి.  ఓ పరీక్షిన్మహారాజా! ఆ సంకుల సమరంలో విస్తారమైన అల్లెత్రాళ్ళ టంకారాలు, మదగజాల ఘీంకారాలు, భటుల హూంకారాలు, భేరీ భాంకారాలు, వీరుల దురహంకారాలు, శత్రుసంక్షోభంగా భూమ్యాకాశాలు నిండాయి. గుఱ్ఱాల గిట్టల తాకిడికి, రథచక్రాల ఒరిపిడికి, భటుల పాదఘట్టనలకు లేచిన ధూళి ఆకాశం అంతా నిండి చీకట్లు వ్యాపించాయి. ఆ చీకట్లను పోగొడుతూ సైన్యం చేతులలోని కత్తులు గదలు మున్నగు ఆయుధాల కాంతులు ఆకాశ విహారుల చూపులకు మిరుమిట్లు గొలుపుతూ ఆకాశం నిండా వ్యాపించాయి. ఇరు పక్షాల సైన్యాలు పూని ఒకరి నొకరు ఎదిరించి బాణ వర్షాలు కురిపించి మర్మస్థానాలను చీల్చేస్తు, క్రోధంతో కన్నులనుండి నిప్పురవ్వలు రాలగా పెద్ద పెద్ద గదలతో తలలపై బాదుకుంటూ, భయంకరంగా పోరాడారు. అలా భీకరంగా పోరుసాగుతున్న సమయంలో అదంతా వీక్షిస్తున్న ప్రద్యుమ్నుడు...సాల్వుడు కలుషాత్ముడై పన్నిన అనంత మాయాజాలాలను వీక్షించాడు. వీరావేశంతో విజృంభించి, సూర్యుడు తన కిరణాలతో కారుచీకట్లను పటాపంచలు చేయునట్లు, ప్రద్యుమ్నుడు తన దివ్యాస్త్రాలతో ఆ మాయాజాలాన్ని ఛేదించాడు. గగనచరులు అతని పరాక్రమం చూసి పొగిడారు. అనంతరం... గొప్ప అతిరథుడి వలె ప్రద్యుమ్నుడు ఇరవైఐదు వాడి బాణాలతో సాల్వుడి సైన్యాధిపతిని నొప్పించాడు. పిడుగుల్లాంటి బాణాలు అనేకం ప్రయోగించి సాల్వుని మూపు పగలగొట్టాడు. లయకాలపు భైరవుడి లాగ విజృంభించాడు. అటుపిమ్మట....

 ప్రద్యుమ్నుడు పదేసి బాణాలు చొప్పున వేసి, సాల్వుడి మిత్రులైన రాజశ్రేష్ఠులను నొప్పించాడు. మూడేసి బాణాలు వేసి రథ, గజ, అశ్వాలను పడగొట్టాడు ఒక్కొక్క బాణం ప్రయోగించి సైనికులను చిందరవందర చేసాడు. ఇలా ప్రద్యుమ్నుడు ఎదురులేని విధంగా పరాక్రమించాడు. అలా మేరుపర్వతం అంత ధైర్యంతో ప్రద్యుమ్నుడు నిర్భయంగా అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శించగా, తిలకించిన ఉభయ సైన్యాలు ప్రస్తుతించాయి. అలా సాల్వుడితో యుద్ధం జరుగుతున్న సమయంలో....

సాల్వుడు సాంబుడి మీద అనేక బాణాలు ప్రయోగించి నొప్పించాడు. అంతట ఆ జాంబవతీ తనయుడు సాంబుడు తన ధనస్సు ఎక్కుపెట్టి సాల్వుడి వక్షాన్ని పదిహేను బాణాలతో కొట్టాడు. వాడి బాణాలు ఇరవై వేసి వాడి సౌభక విమానాన్ని అల్లల్లాడేలా చేసాడు. ఓ పరీక్షిత్తు రాజేంద్రా! గొప్ప రథికుడైన గదుడు రాహుముఖం లాంటి బాణాలను ప్రయోగించి శత్రువుల శిరస్సులు ఖండించి గుదులు గుదులుగా నేలకూలుస్తు మొక్కవోని పరాక్రమంతో విజృంభించాడు. ఆకాశంలో అతని పరాక్రమం చూసి దేవతలు ప్రస్తుతించారు. ఓ రాజశ్రేష్ఠుడా! సాత్యకి మహారోషంతో సాల్వుడి చతురంగబలాలను, సౌభక విమానము అనే చీకటిని సూర్యకిరణాల వంటి వాడి యైన బాణాలను ప్రయోగించి పటాపంచలు కావించాడు. సైనికులందరు అతని పరాక్రమాన్ని బహువిధాల ప్రశంసించారు. భానువిందుడు విజృంభించి, శత్రుసైన్యం అనే అడవిని తీవ్రమైన దావానలం వంటి తన బాణాలు అసంఖ్యాకంగా వేసి భస్మీపటలం చేసాడు. అతని ధనుర్విద్యా కౌశల్యాన్ని దేవతా సమూహం ప్రస్తుతించింది. చారుదేష్ణుడు ఆగ్రహంతో విజృంభించి వాడి బాణాలు అనేకం ప్రయోగించి సాల్వుని దండనాథులను సంహరించి సింహనాదం చేసాడు. యోధుడైన శుకుడు యుద్ధవిజయకాంక్షతో చెలరేగి తన భుజబలం విశదం అయ్యేలా శరసమూహంతో శత్రు సేనావ్యూహాన్ని నాశనం చేసాడు. సారణుడు విజృంభించి శత్రువీరులు తన బాహుబలానికి శత్రువులు భయపడేలాగా కుంతాలూ, శక్తులూ, బాణాలూ, గదలూ, కత్తులూ మొదలైన ఆయుధాలతో సాల్వుడి గుఱ్ఱాలను ఏనుగులను రథాలను ధ్వంసం చేసి ఉగ్రస్వరూపుడు అయి శౌర్యంతో సైనికులను సంహరించాడు. అక్రూరుడూ అతని తమ్ముళ్ళూ తిరుగులేని పరాక్రమంతో మెరసి ఈటె, చక్రము మున్నగు రక రకాల సాధనాల ప్రయోగంతో శత్రువులను వధించారు. ఓ పరీక్షిన్మహారాజా! రాజు కృతవర్మ శత్రువుల కవచాలు భేదించి, వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికాడు. ఇది అద్భుతమైన కార్యమని శత్రువులు సైతం పొగిడారు. రథికోత్తముడు అయిన అతడు యుద్ధధర్మాన్ని అవలంబించి విరోధులు పారిపోతుంటే వారిని చంపకుండా వదలిపెట్టాడు.


పరీక్షన్మహారాజా! ఆ సౌభకవిమానం తన మాయా ప్రభావంతో ఒకమారు ఆకాశంలో కనపడుతుంది; ఒకమారు భూమి మీద నిలబడుతుంది; ఒకమారు కొండశిఖరం మీద తిరుగుతుంది; ఒకమారు సముద్రమధ్యంలో విహరిస్తుంది; ఒకసారి ఒక్కటిగా, మరుక్షణంలో అనేక రూపాలతో ప్రత్యక్షమవుతుంది; ఒకతూరి సాల్వుడితో కూడి చూపట్టుతుంది; ఒకమారు ఏమీ లేకుండా కనపడుతుంది; ఒకమారు కొఱవి తిప్పినట్లుగా భయంకరంగా దర్శనమిస్తుంది; ఈ విధంగా ఆ విమానం శత్రువులు కలవరపడేటట్లు పెక్కువిధాలుగా తిరిగింది.ఇలా సౌభకవిమానం విజృంభించేసరికి అంతకు ముందు యాదవసైన్యంవల్ల భీతిచెందిన తన సైన్యాల్ని సాల్వుడు మళ్ళీ పురిగొల్పి యుద్ధోన్ముఖులను చేసాడు. అప్పుడు, సాల్వుడు యాదవసైన్యంమీద అగ్నిజ్వాల ల్లాంటి బాణాలను పింజ పింజతాకేలా వేసాడు. అయినా ఆ సైన్యం చెదరక బెదరక వెనుకంజ వేయక ధైర్యంతో నిలచి యుద్ధం చేసింది.

ఆ సమయంలో రెండు పక్షాల యోధులూ నదురూ బెదురూ లేకుండా, అలసిపోకుండా గట్టిగా పౌరుషంతో పోరాడారు. అప్పుడు ప్రసిద్ధులైన యోధుల మధ్య ద్వంద్వ యుద్ధం జరగసాగింది.

మునుపు ప్రద్యుమ్నుడి బాణాల వలన మిక్కిలి నొచ్చిన సాల్వుడి మంత్రి ద్యుముడు అనేవాడు గదను ధరించి ప్రద్యుమ్నుడిని ఎదుర్కున్నాడు.

నేర్పూ బలపరాక్రమాలూ ప్రదర్శిస్తూ ద్యుముడు గదతో కృష్ణకుమారుడు ప్రద్యుమ్నుడి వక్షం పగిలేలా మోదాడు. ఆ దెబ్బకి అతడు మేను గగుర్పడంతో చేతిలోని అస్త్రశస్త్రాలను రథంమీదనే వదిలి కనులు మూతలు పడి మూర్ఛపోయాడు. సారథి దారకుని కుమారుడు; యుద్ధధర్మం చక్కగా తెలిసినవాడు; నీతిశాస్త్ర పారంగతుడు; కనుక, రథాన్ని మళ్ళించి యుద్ధభూమినుండి ప్రక్కకు తోలుకుని పోయాడు. కొంతసేపటికి ప్రద్యుమ్నుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. సారథిని, తేరుకున్న ప్రద్యుమ్నుడు ఇలా మందలించాడు. “కృష్ణుడూ బలరాముడూ ఎగతాళి చేసేలా, శత్రువులు నవ్వేలా రణక్షేత్రం నుండి రథాన్ని తప్పించి, అపకీర్తి తెచ్చావు. యదువంశంలో పుట్టిన వీరకుమారులు పరాక్రమహీనులై ఈ మాదిరి యుద్ధరంగం నుంచి తొలగిపోరు కదా.” ఇలా అంటున్న ప్రద్యుమ్నుడితో సారథి ఇలా అన్నాడు. “యుద్ధధర్మం ప్రకారం శత్రువుల వలన రథికుడు నొచ్చినపుడు సారథి, సారథి దెబ్బతిన్నప్పుడు రథికుడూ పరస్పరం రక్షించుకోవాలి, కాబట్టి. నేను ఇలా చేసాను. నీవు బాధపడక విరోధులను గెలవడానికి ప్రయత్నించు.”

ఇలా సారథి చెప్పగా విని...మహాశూరుడు, అపార బలసంపన్నుడు అయిన ప్రద్యుమ్నుడు సారథి మాటలకు సంతోషించాడు. ధనుష్టంకారంతో శత్రువులను భయభ్రాంతులను చేస్తూ గొప్ప నేర్పుతో ద్యుముడి మీదకి తిరిగి రథాన్ని తోలించాడు. అలా శత్రువు ద్యుముడిని సమీపించి...మిక్కిలి ఆగ్రహంతో ప్రద్యుమ్నుడు అవక్రపరాక్రమం ప్రదర్శిస్తూ ఎనిమిది బాణాలను వేసి శత్రువు శరీరాన్ని పగులకొట్టాడు. నాలుగు బాణాలు వేసి అతని గుఱ్ఱాలను కూల్చాడు. రెండు బాణాలతో వాడి పతాకాన్నీ ధనుస్సునూ నుగ్గునుగ్గుచేసాడు. ఒక బాణంతో భయంకరంగా అతని సారథిని సంహరించాడు. పిమ్మట విక్రమించి ప్రద్యుమ్నుడు ఒక అమ్ముతో ప్రద్యుముని కంఠాన్ని భీకరంగా నరికాడు. అది చూసిన సాంబుడు మున్నగు యదు యోధులు ప్రద్యుమ్నుడిని ప్రస్తుతించారు. పదునైన బంగారు పింజలు గల బాణాలతో తాటిపండ్లను నేల రాల్చినట్లు సాల్వుని సైనికుల తలలు ఉత్తరించారు.ఆ యాదవులు సాల్వ యుద్ధ సమయంలో....కుప్పలు తెప్పలుగా గుఱ్ఱాలు కూలాయి; ఏనుగులు నేల మీద వ్రాలాయి; రథాలు నుగ్గనుగ్గు అయి కూలాయి; భటులు చచ్చి పడిపోయారు; బేతాళాలూ పిశాచాలూ భూతాలూ ఆనందంతో రక్తాన్ని త్రాగుతూ, మాంసం నంజుకుంటూ, ఎముకలు కొరుకుతూ. చప్పట్లతో తాళాలు చరుస్తూ, పారవశ్యంగా నృత్యాలు చేసాయి.

ఆ సంగ్రామరంగంలో ఆ సమయంలో....ఓ రాజా! ఆ రణరంగం సముద్రంలా మారింది ఖండించబడిన ఏనుగుల గండస్థలాలే మొసళ్ళుగా; తొండాలే పాములుగా; ఆ యేనుగుల కాళ్ళు తాబేళ్ళుగా; దంతాలు ముత్యపుచిప్పలుగా; వాటి కుంభస్థలాల నుండి రాలిపడిన ముత్యాలు రత్నాలుగా; తోకలు జలగలుగా; మెడలు కప్పలుగా; మెదడు బురదగా; ప్రేగులు పగడపుతీగలుగా; నరాలు నాచుతీవలుగా; క్రొవ్వు నురుగులా; ఎముకలు ఇసుకతిన్నెలుగా; రక్తము నీరుగా; మరణిస్తూ చేసే ఘీంకారాలు తరంగ శబ్దాలుగా; ఇలా ఆ రణభూమి సముద్రంతో పోల్చతగి పోలుపారింది. ఈ విధంగా యాదవ బలాలూ, సాల్వ సైన్యాలూ ఒకరిని ఒకరు జయించాలనే కోరికతో ఇరవైఏడు దినాలు పాటు తూర్పు పడమర సముద్రాలు తలపడి పోరుతున్నాయా అన్నట్లు భీకరంగా యుద్ధం చేశాయి. ఆ సమయంలో ఇంద్రప్రస్థం నుండి శ్రీకృష్ణుడు ద్వారకకు వస్తూ మార్గమధ్యంలో కనపడ్డ చెడ్డ శకునాలను కనుగొని సారథి యైన దారుకుడితో ఇలా అన్నాడు.


కృష్ణ సాళ్వ యుద్ధంబు 


చూడు దారుకా! అపశకునాలు ఆకాశంలోను, భూమి మీద అతిభీకరంగా కనబడుతున్నాయి. నేను ఇంద్రప్రస్థంలో ఉన్న విషయం తెలుసుకొని శిశుపాలుడి మిత్రులైన రాజులు మన పట్టణం మీద యుద్ధానికి తలపడినట్లు తోస్తున్నది. రథాన్ని వేగంగా పోనియ్యి. ఈ విధంగా శ్రీకృష్ణుడు పలుకగా, దారుకుడు మిక్కిలి వేగంతో రథం పోనిచ్చాడు.


అలా శీఘ్రమే ద్వారకను సమీపించి, వాసుదేవుడు బలపరాక్రమాలతో శత్రుసైన్యంతో తలపడి యుద్ధం చేసే యాదవసైన్యాన్ని, ఆకాశమార్గంలో మాయాప్రభావంతో మోసం చేస్తూ యాదవవీరులను; ఎంత కాలానికి భేదింప సాధ్యం కాకుండా తిరుగుతున్న సౌభక విమానాన్నీ, అందులో ఉన్న సాల్వుడిని చూసాడు. వాని సమీపానికి రథాన్ని తోలించాడు. శ్రీకృష్ణుడిని వీక్షించిన యదుసైన్యాలు పరమానందం పొందాయి. చైతన్యం కోల్పోయి దైన్యంగా ఉన్న తన సైన్యాన్ని చూసి సాల్వుడు పరాక్రమించాడు. నిప్పురవ్వలు అంతటా చెదరిపడేలా; అకాశం అంతా మంటలు వ్యాపించేలా; గంటలశబ్దంతో దిగ్గజాలు వణికేలా; సాల్వుడు భయంకరమైన శక్తి అనే ఆయుధాన్ని కృష్ణుడి రథసారథి అయిన దారుకుడి మీద ప్రయోగించాడు. అది ఆకాశం నుండి రాలిపడే కాంతిమంతమైన నక్షత్రంలా దూసుకు వస్తోంది... అలా నింగినుండి దూసుకు వస్తున్న ఆ శక్తి ఆయుధాన్ని శ్రీకృష్ణుడు ఒక్క బాణంతో మార్గం మధ్యలోనే పొడిపొడి చేసి నేలరాల్చాడు. మహాభుజబల సంపన్నుడు, వీరాధివీరుడు అయిన కృష్ణుడు అంతటితో శాంతించకుండా మొక్కవోని పరాక్రమంతో కొఱవి త్రిప్పుతున్నట్లు ఆకాశంలో గిరగిర తిరుగుతూ దుర్నరీక్ష్యంగా ఉన్న ఆ సౌభకాన్నీ అందులోని సాల్వుడిని తీక్షణమైన సూర్యకిరణాలతో సమానమైన పదహారు బాణాలను గుప్పించి నొప్పించాడు. సాల్వుడు కోపంతో తన ధనుస్సును మేఘగర్జనలా మ్రోగిస్తూ కృష్ణుని ఎడమ భుజంలో దిగబడేలా వాడి బాణాలు వేసాడు. అ దెబ్బకు కృష్ణుడు శార్ఙ్గము అనే పేరు కల తన ధనుస్సును రథంమీద జారవిడిచాడు. ఆకాశంలో దేవతలు భయపడుతూ చూడసాగారు. సకల భూతాలు హాహాకారాలు చేసాయి. అ సమయంలో రథంలోని కృష్ణుడు తెప్పరిల్లడం చూసి, బాహుబలశాలి సాల్వుడు ఉత్సాహంతో ఇలా అన్నాడు. “ఓ పద్మాక్షా! కృష్ణా! నా మిత్రుడు నా వాడు అయిన చైద్యరాజు శిశుపాలుడు కోరుకున్న కన్యకను నీవు నీతిహీనుడవు అయి పరిగ్రహించావు. అది చాలక ధర్మరాజు యాగ సభలో ఏమరుపాటుగా ఉన్న అతడిని పగబట్టి చంపావు. అంతటి తప్పుచేసిన నీవు ఇప్పుడు రణరంగంలో..బెదిరి పారిపోకుండా నా ఎదుట ధైర్యంగా నిలబడితే నా మిత్రుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నిన్ను నా కర్కశ బాణాగ్ని జ్వాలలలో ముంచి పగతీర్చుకుంటాను." ఇలా అంటున్న సాల్వుడితో శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. “ఓరోరి! మూర్ఖుడా! గొప్ప బలము, పరాక్రమం కల వీరుడిలా వాగుతున్నావు. నీకు చావు మూడిన సంగతిని గుర్తించలేకుండా ఉన్నావు.” అని పలికి తన గధాయుధాన్ని గిరగిర త్రిప్పి ఎదురుగా వస్తున్న సాల్వుడి మీదకు విసిరాడు. అలా శ్రీకృష్ణుడు గదను వేయగా.....శ్రీకృష్ణుని గదాఘాతంచేత సాల్వుడి నోటినుండి ముక్కునుండి రక్తం కారుతుండగా స్పృహ తప్పాడు. కొంతసేపటికి తేఱుకుని తెలివి తెచ్చుకున్నాడు. వెనువెంటనే సౌభకంతోపాటు అదృశ్యమయి. అలా సౌభకంతో సాల్వుడు అదృశ్యమై మాయలు పన్నిన ఆ సమయంలో...ఒకడు ఆకాశంలో నుండి దుఃఖిస్తూ దిగి వచ్చి, ఆ నందుని నందనుడైన శ్రీకృష్ణుని పాదపద్మాలకు నమస్కరించి సాల్వుడు మహా ఉగ్రతతో పూని వచ్చి ఆనకదుందుభి అని పిలువబడే నందమహారాజుని బంధించి తెచ్చాడు. ప్రభూ! శాల్వుడు మీతండ్రి వసుదేవుడిని బంధించి తెచ్చిన వార్త మీకు చెప్పవలసిందిగా దేవకీదేవి నన్ను మీ దగ్గరకు పంపించారు.” అది వినిన శ్రీకృష్ణుడు తండ్రిమీద ఉన్న మమకారం వలన విషాదంలో మునిగిపోయాడు. “మానవ గంధర్వ దేవరాక్షసాదులకు అయినా జయింప సాధ్యం కాని బలరాముడు జాగరూకతతో రక్షిస్తూ ఉండగా, బలహీనుడైన సాల్వుడి చేత వసుదేవుడు ఎలా పట్టుబడతాడు.” అని శ్రీకృష్ణుడు భావించి...ఇంకా...

ఇలా అనుకుంటూ మనస్సు వికలం అయి, “దైవనిర్ణయాన్ని తప్పించడం ఎవరికీ సాధ్యంకాదు కదా.” అని శ్రీకృష్ణుడు దుఃఖంతో బాధపడ్డాడు. ఇంతలో....ఆ దూత మళ్ళీ కనిపించి మాయావసుదేవుడిని కల్పించి, అతనిని బంధించి తీసుకు వచ్చి “ఓ కృష్ణా! పుండరీకముల వంటి కన్నులు ఉన్నాయి కదా చూడు. వీడే నీ తండ్రి నీ కన్నుల ముందే వీడి తల నరికేస్తాను. ఇక ఎవరి కోసం బ్రతుకుతావు? ఇక చాతనైతే రక్షించుకో.” అని దుర్భాషలు పలుకుతూ, భీకరమైన పెద్ద కత్తి జళిపిస్తూ, ఆ మాయావసుదేవుడి తల తరిగి, ఆ శిరస్సు పట్టుకుని సౌభకవిమానం లోనికి వెళ్ళిపోయాడు. అది చూసిన శ్రీకృష్ణుడు కొంతసేపు బాగా దుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు తన సైనికులచే గుర్తు చేయబడి, అది సాల్వుడు ప్రయోగించిన మయ నిర్మిత మాయ అని కృష్ణుడు గ్రహించాడు. ఆ క్షణం లోనే వసుదేవుడు పట్టుబడ్డాడు అని చెప్పిన దూత, ఆ మాయాకళేబరం అదృశ్యం అయిపోయాయి. పిమ్మట....ఆ సమయంలో, మునులు కొంతమంది వచ్చి, మాయా మోహితుడైన కృష్ణుడిని చూసి, చిక్కని భక్తితో వినయంగా సాక్షాత్తు విష్ణుమూర్తి అయిన వాడు, జయశీలుడు అయిన ఆయనతో ఇలా పలికారు.

“ఓ పుండరీకాక్షా! పురుషోత్తమా! సమస్తమైన లోకాలలో ఉన్న మానవులు అందరు రకరకాలుగా సంసారం అనే దుఃఖసముద్రంలో మునిగి దరి చేరలేక కొట్టుమిట్టాడుతున్న దశలో నిన్ను స్మరించి ఆ దుఃఖాలను పోగొట్టుకొంటారు.


అలాంటి సద్గుణాలకు నిధివై; దేవతాసమూహానికి ఆధారభూతుడవై; పరబ్రహ్మ స్వరూపుడవై; పరమయోగీశ్వరులకు కూడా అందనివాడవై; చిదానందరూపంతో ప్రకాశించే నీ వెక్కడ? అజ్ఞాన సంజాతాలు అయిన శోక, మోహ, భయాదు లెక్కడ? అవి నిన్ను అంట లేవు.” అని ఈ విధంగా ప్రస్తుతించి ఆ మునీశ్వరులు వెళ్ళిపోయారు.


సశేషం🙏


*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

Aeroplane secret


 

*తెలుగు భాషాభిమానుల కోసం.*

 *"ర"కీ "ఱ"కి మధ్య తేడా ఏమిటి?**👌


ఈ మధ్యనే వాట్సాప్ లో మెసేజ్ చూసాను. 

ద్వా.నా. శాస్త్రి గారు రాసారట. బావుంది.

 అది ఇక్కడ పెడతాను. forwarded as it is.


*తెలుగు భాషాభిమానుల కోసం.*👇


*అరసున్న [ ఁ ], బండి ' ఱ 'లు ఎందుకు?*


అరసున్న, బండి ' ఱ 'లు నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు.

 అలా చేసారు మన ఆధునిక భాషా వేత్తలు. 


తెలుగుకు పట్టిన దుర్గతి ఇది.

 అయితే, ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి.

 తెలుగు భాషా లక్షణాన్ని నిరూపించేవి. 

అంతేకాదు- కావ్యభాషలోను, లక్షణ శాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. 

కానీ వీటిగురించి తెలుగువాడు తెలుసు కోవాలిగదా! 

మన భాషా సంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా!


 అరసున్న( ఁ ) , ఱ- ల వల్ల అర్థభేదం ఏర్పడుతుంది.

 పదసంపదకి ఇవి తోడ్పడతాయి. 

ఎలాగో చూడండి:


అరుఁగు = వీధి అరుగు

అరుగు = వెళ్ళు, పోవు

అఱుగు = జీర్ణించు


ఏఁడు = సంవత్సరం

ఏడు = 7 సంఖ్య


కరి = ఏనుగు

కఱి = నల్లని


కాఁపు = కులము

కాపు = కావలి


కాఁచు = వెచ్చచేయు

కాచు = రక్షించు


కారు = ఋతువు, కాలము

కాఱు = కారుట (స్రవించు)


చీఁకు = చప్పరించు

చీకు = నిస్సారము, గ్రుడ్డి


తఱుఁగు = తగ్గుట, క్షయం

తఱుగు = తరగటం(ఖండించటం)


తరి = తరుచు

తఱి = తఱచు


తీరు = పద్ధతి

తీఱు = నశించు,

 పూర్తి(తీరింది)


దాఁక = వరకు

దాక = కుండ, పాత్ర


నాఁడు = కాలము

నాడు = దేశము, ప్రాంతము


నెరి = వక్రత

నెఱి = అందమైన


నీరు = పానీయం

నీఱు = బూడిద


పేఁట = నగరములో భాగము

పేట = హారంలో వరుస


పోఁగు - దారము పో( గు

పోగు = కుప్ప


బోటి = స్త్రీ

బోఁటి = వంటి [నీబోఁటి]


వాఁడి = వాఁడిగా గల

వాడి = ఉపయోగించి


వేరు = చెట్టు వేరు

వేఋ = మరొకవిధము


మడుఁగు = వంగు, అడఁగు

మడుగు = కొలను, హ్రదము

మొదలైనవీ ఉన్నాయి.


అయినా తెలుగు భాషను నాశనం చేస్తున్న కాలం దాపురించింది కదా!


       - డాక్టర్ ద్వా. నా. శాస్త్రి

కోపీనాధారులు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


1.  

*వేదాన్త వాక్యేషు సదా రమన్తో*

*బిక్షాన్న మాత్రేన చ తుష్ఠిమన్తః*

*అశోకమన్తః కరణే చరన్తః*

*కౌపీనవంతః ఖలు భాగ్యవంతః*


~కౌపీన పంచకం (శ్రీ ఆదిశంకరాచార్య)


భావము: *సదా వేదాంత వాక్యములను స్మరించుచు, బిక్షాటన వలన లభించినదానితో తృప్తి చెందేవారు, శోకము లేని అంతః కరణముతో చరించే కోపీనాధారులు* (అదృష్టవంతులు) చాలా భాగ్యవంతులు.!!!

బ్రహ్మవిద్య

 *బ్రహ్మవిద్య-అర్హత* 


*ప్రపంచంలో మొత్తము లెక్కవేసికొంటే తాను ఎదుటివానికి పెట్టింది ఎక్కువా?ఎదుటివాని దగ్గర తాను చేయించు కున్నది ఎక్కువా? లెక్కవేసికొంటే….*


*నిద్రలో కూడా గుర్తుపెట్టుకోండి, పెద్దలు చెప్పిన విషయం ఇది, నేను చెప్పింది కాదు; తాను ఇతరులకు చేసిన దానికన్న,ఇతరుల దగ్గరనుండి తాను పొందినది ఎక్కువ అయినవానికి బ్రహ్మవిద్య ఆ జన్మలో ఏనాడూ సిద్ధించదు.*


*అపరిగ్రహముండాలి.*


*జన్మ మొత్తము లెక్కవేసుకొంటే-తాను ఇతరులచేత చేయించుకొన్న దానికన్న, తాను ఇతరులకు చేసింది ఏనాడయితే ఎక్కువ అవుతుందో బ్రహ్మవిద్య రావడానికి అవకాశముంది.*


*అయితే, ఆ ఎక్కువ వచ్చాక కూడా, చాలాకాలానికి, ఇన్నాళ్ళ నుంచి ఇతరులకు నేను చేసిందే చాలా ఎక్కువ అని నసపుడుతుంది లోపల. ఇలాంటి మనోవికారానికి లొంగిపోవడం జరుగుతుంది.*


*ఏదో, ఈ పదేళ్ళ నుండియు, పాతికేళ్ళ నుండియు - పెద్దవాళ్ళ మాటవిని  ప్రతివాడికీ చాకిరీ చేయడమే తప్ప, ఎవరివద్ద ఏమీ పుచ్చుకొన్నవాడిని కాను అని ఏడుపు పుడుతుంది. ఇలాంటి నస, ఏడుపు మానివేసే సమయం వస్తుంది కొన్ని జన్మలయ్యాక. ఏడుపు మానివేసి సంతోషంగా వుండే సమయం వస్తుంది. వాడికది చేశాను, వీడికది చేశాను అని వాపోయే దుష్టదారిద్య్ర స్థితి పోతుంది మనకు.*


*అప్పటిదాకా మోక్షవిద్యకు అవకాశం లేదు, పరమ ప్రశాంతికి అవకాశం లేదు. అపరిగ్రహం రావాలి.*


*ఎవరికయినా సరే అయిదు రూపాయల పనిచేసిపెట్టి, రెండు రూపాయల పని పుచ్చుకోవాలి వాని వద్ద. మిగతా మూడు రూపాయలు అతనివద్దనే అట్టిపెట్టాలి. ఈ సేవింగ్స్ బ్యాంక్ చేతనై ఉండాలి.*


*అయిన తరువాత కూడా, మన తాలూకు అకౌంట్ ఇతరుల బ్యాంకులో ఉన్నదనే భావం మనస్సులో నుండి వదలాలి.*


*గుర్తుండటమనేది వదలవలసినదే. ఆ పీనాసితనం, పీనిష్టితనం, కంకుష్టం - అంటే మనమింత పుణ్యం చేశామనే దరిద్రం మనస్సుకు వదలిపోవాలి.*


*అప్పటినుంచి గాని పెద్దలు చెప్పిన మోక్షవిద్యకు మనకు అర్హత రాదు. ఇది యదార్థం.*


                  _*Master E.K.*_

దాతృత్వం

 శ్లోకం:☝️

*దానే తపసి శౌర్యే చ*

  *విజ్ఞానే వినయే నయే ।*

*విస్మయో న హి కర్తవ్యో*

  *బహురత్నా వసుంధరా ॥*


భావం: దాతృత్వం, తపస్సు, శౌర్యం, విజ్ఞానం, వినయం మరియు నీతి మొదలైన సుగణాలు చూసి ఆశ్చర్యపడకండి. ఎందుకంటే ప్రపంచమంతా ఇటువంటి అమూల్యమైన రత్నాలతో నిండివుంది.

పంచాంగం 15.02.2024

 ఈ రోజు పంచాంగం 15.02.2024 Thursday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతు మాఘ మాస శుక్ల పక్ష: షష్థి  తిధి బృహస్పతి వాసర: అశ్విని నక్షత్రం శుక్ల యోగ: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.


షష్థి పగలు 10:16 వరకు.

అశ్విని పగలు 09:28 వరకు.

సూర్యోదయం : 06:46

సూర్యాస్తమయం : 06:14


వర్జ్యం : తెల్లవారుఝామున 05:41 నుండి ఉదయం 07:12 వరకు తిరిగి సాయంత్రం 06:48 నుండి రాత్రి 08:21 వరకు.


దుర్ముహూర్తం : పగలు 10:35 నుండి 11:21 వరకు తిరిగి మధ్యాహ్నం 03:11 నుండి 03:56 వరకు.


అమృతఘడియలు : తెల్లవారుఝామున  04:08 నుండి 05:41 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార: