13, జనవరి 2026, మంగళవారం

సుభాషితమ్

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


    శ్లో𝕝𝕝   *యత్ర యచ్చారుతా హేతుః* 

             *తత్తు తత్రైవ నిక్షిపేత్* l

             *నార్ప్యం నేత్రాంజనం పాదే*

             *నేత్రే వాధరవర్ణకమ్* ll


           _// *గాయత్రీ నీతి గీతావళిః* _//


తా𝕝𝕝 *సౌందర్యాభరణాలనుగానీ సౌందర్యలేపనములనుగానీ ఎచ్చట అలంకరించుకుంటే శోభాయమానంగా కనిపిస్తామో వాటిని అచ్చోటనే అలంకరించుకోవాలి.* 

*కళ్లకి ధరించే కాటుకను పాదములకు, పెదవులకు ధరించే అధరవర్ణకము(Lipstick)ను కళ్లకు ధరించరుగదా?*


✍️💐🌹🌸🙏

నక్షత్ర స్తోత్ర మాలిక - 13 వ రోజు.*

  🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷


*నక్షత్ర స్తోత్ర మాలిక - 13 వ రోజు.*


*నక్షత్రం*. *హస్త* (Hasta)


*అధిపతి*_ *చంద్రుడు* (Moon)


*ఆరాధించాల్సిన దైవం.  సవిత (సూర్యుడు)* / *గాయత్రీ మాత.*


*హస్త నక్షత్ర జాతకులు మరియు బుద్ధి బలం, చేసే పనులలో నేర్పు (Skills) పెరగాలని కోరుకునే వారు పఠించాల్సిన స్తోత్రం.*


🙏 *శ్రీ గాయత్రీ స్తోత్రం (విశ్వామిత్ర కృతం*) 🙏


*ఆదిశక్తే జగన్మాతః భక్తకామదుఘేఽనఘే* ।

*సర్వశక్తిస్వరూపే చ గాయత్రి నమోఽస్తు తే* ॥ 1 ॥


*ఋగ్వేదరూపే గాయత్రి ప్రాతఃసంధ్యే ప్రకీర్తితే* ।

*బ్రహ్మలోకప్రదే దేవి గాయత్రి నమోఽస్తు తే* ॥ 2 ॥


*యజుర్వేదస్వరూపే చ మధ్యం దినే స్థితేఽనఘే* ।

*విష్ణులోకప్రదే దేవి గాయత్రి నమోఽస్తు తే* ॥ 3 ॥


*సామవేదస్వరూపే చ సాయంసంధ్యే విభావరీ* ।

*శివలోకప్రదే దేవి గాయత్రి నమోఽస్తు తే* ॥ 4 ॥


*సర్వవర్ణే సర్వశక్తే సర్వజ్ఞే సర్వమంగళే* ।

*సర్వదేవమయే దేవి గాయత్రి నమోఽస్తు తే* ॥ 5 ॥


*వరదే గీతశాస్త్రజ్ఞే సర్వపాపవినాశిని* ।

*వేదమాతర్నమస్తుభ్యం గాయత్రి నమోఽస్తు తే* ॥ 6 ॥


*హంసవాహేఽక్షసూత్రజ్ఞే పుష్పమాలే జటాధరే* ।

*ఓంకారరూపే గాయత్రి గాయత్రి నమోఽస్తు తే* ॥ 7 ॥


*ధ్యాయేత్ కుమారీం గాయత్రీం వేదమాతరం ఈశ్వరీమ్* ।

*నిత్యం భక్త్యా పఠేద్యస్తు స యాతి పరమాం గతిమ్* ॥ 8 ॥


*విశేషం*


● *సవితృ దేవత*.


*గాయత్రీ మంత్రం సాక్షాత్తు ఈ నక్షత్ర దేవత అయిన 'సవిత'ను ఉద్దేశించి చేసినదే. అందుకే హస్త నక్షత్రం రోజున గాయత్రీ మంత్రాన్ని (లేదా పైన ఇచ్చిన స్తోత్రాన్ని) జపించడం వల్ల అద్భుతమైన తెలివితేటలు, మనోధైర్యం లభిస్తాయి*.


● *హస్త*. (చేయి) ఈ నక్షత్రం మన చేతులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కొత్త పనులు ప్రారంభించేటప్పుడు లేదా వృత్తి విద్యలలో రాణించాలనుకునే వారు ఈ రోజున ఈ స్తోత్రం పఠించడం శుభకరం.


🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

భాగవతం వింటే బాగవుతాం'*

  *'భాగవతం వింటే బాగవుతాం'*

_శ్రీ పోతన భాగవత మధురిమలు_

 

(5.2-79-ఆ)

మేషతులల యందు మిహిరుం డహోరాత్ర

మందుఁ దిరుగు సమవిహారములను;

బరఁగఁగ వృషభాది పంచరాసులను నొ

క్కొక్క గడియ రాత్రి దక్కి నడచు.


*భావము:-* మేషరాశిలో, తులారాశిలో సూర్యుడు సంచరిస్తున్నపుడు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య అనే ఐదు రాసులలో సంచరించే సమయంలో ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి తగ్గుతూ వస్తుంది.


ఎం ఎస్ రామారావు గారి *తెలుగులో హనుమాన్ చాలీసా* తో శుభోదయం.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః

సంక్రాంతి పండుగ

  2008వ సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ 

జనవరి 15న రావడం ప్రారంభమయింది.


అంతకుముందు1935 నుండి 2007వరకు జనవరి 

14ననే పండుగ. ఇదో 72 ఏళ్ల సమయం. ప్రతీ 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒకరోజు తర్వాత

కు మారుతుంది.

 

1935 నుండి 2007 వరకు జనవరి 14న,

2008 నుండి 2080 వరకు జనవరి 15న,

2081 నుండి 2153 వరకు జనవరి 16న 

సంక్రాంతి పండుగ వస్తుంది.


ఎందుకిలా అంటే, సాధారణంగా, సూర్యుడు ధనూ

రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించిననాడే మకర 

సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజు 

నుండి మిధునరాశికి ప్రవేశించేదాకా ‘ఉత్తరాయణ పుణ్యకాలం’గా వ్యవహరిస్తారు.


ఇక, సూర్యుడు ప్రతీసంవత్సరం మకరసంక్రమణం చేసినప్పుడు 20 నిమిషాలు ఆలస్యం అవుతోంది. 

స్థూల గణన ఆధారంగా ఇది 3 సంవత్సరాలకు 

ఒక గంట, 72 ఏళ్లకు ఒక రోజుగా మారుతోంది.


ఈ లెక్కన, ఇంగ్లీష్‌ క్యాలెండర్‌ ప్రకారం, 72 ఏళ్లకు

ఒకసారి సంక్రాంతి తర్వాతి రోజుకు మారుతుంది. 

జనవరి 16న సంక్రాంతి రావడం మొదలవుతుంది

శ్రీల ప్రభుపాద ఉవాచ!

  శ్రీల ప్రభుపాద ఉవాచ!

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

దయగల భక్తుడిని దీన-నాథ అని పిలుస్తారు, పేదలు, అమాయకులైన ప్రజల రక్షకుడు.

కృష్ణ భగవానుని దీన-నాథ లేదా దీన-బంధు అని కూడా పిలుస్తారు, పేద జీవుల యొక్క యజమాని లేదా నిజమైన స్నేహితుడు, మరియు అతని స్వచ్ఛమైన భక్తుడు కూడా దీన-నాథ యొక్క అదే స్థానాన్ని తీసుకుంటాడు. 


భక్తి సేవ యొక్క మార్గాన్ని బోధించే దీన-నాథులు లేదా శ్రీకృష్ణ భగవానుడి భక్తులు దేవతలకు ఇష్టమైనవారు అవుతారు. 


సాధారణంగా ప్రజలు భౌతిక ప్రయోజనాలను పొందడం కోసం దేవతలను, ప్రత్యేకించి శివుడిని ఆరాధించడంలో ఆసక్తిని కలిగి ఉంటారు, కానీ శ్రీమద్-భాగవతంలో నిర్దేశించినట్లుగా భక్తి సేవా సూత్రాలను ప్రబోధించడంలో నిమగ్నమైన స్వచ్ఛమైన భక్తుడు, దేవతలను విడిగా పూజించాల్సిన అవసరం లేదు; 

దేవతలు అతని పట్ల స్వయంచాలకంగా సంతోషిస్తారు మరియు వారి సామర్థ్యంలో అన్ని ఆశీర్వాదాలను అందిస్తారు. 


చెట్టు వేరుకు నీళ్ళు పోయడం ద్వారా ఆకులు మరియు కొమ్మలు స్వయంచాలకంగా నీటిని పొందుతాయి, కాబట్టి, భగవంతునికి స్వచ్ఛమైన భక్తితో సేవ చేయడం ద్వారా, దేవతలుగా పిలువబడే భగవంతుని కొమ్మలు, మరియు ఆకులు వంటి వారు స్వయంచాలకంగా భక్తుడి పట్ల ప్రసన్నం చెందుతారు మరియు వారికీ అన్ని దీవెనలను అందిస్తాయి.


(శ్రీమద్-భాగవతం, స్కందము.4)

అధ్యాయం.12, వచనం.51)


హరే కృష్ణ

సదా మీ శ్రేయోభిలాషి

గౌరవం పొందడం కంటే

  *నేటి సూక్తి*


*గౌరవం పొందడం కంటే పొందిన దానిని నిలబెట్టుకోవడం కష్టం.*


*క్రాంతి కిరణాలు*


*కం. ఘనమగు సన్మానంబుల*

*ననవరతము పొందుచున్న నానందంబే*

*పనులెన్నో సాధించుచు*

*ఘనతలు నిలుపుకొనగ ఘన కష్టంబయ్యెన్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

విమానాలు

 


పురాతన భారత గ్రంథాల్లో చెప్పిన ‘విమానాలు’ నిజంగానే ఉన్నాయా? గంధార శిల్పం చెబుతున్న ఆశ్చర్యకర నిజం!

పురాతన భారతీయ గ్రంథాల్లో ‘విమానాలు’ అనే పదం కేవలం కథలకే పరిమితమా?

లేదా నిజంగా అప్పటి వారికి అధునాతన సాంకేతిక జ్ఞానం ఉందా?

👉 గంధార ప్రాంతంలో లభించిన కొన్ని శిల్పాల్లో

👉 నేటి విమానాలు / స్పేస్ క్యాప్సూల్‌లను తలపించే ఆకృతులు కనిపిస్తాయి

ఈ శిల్పాల్లో

✔ లోపల కూర్చున్న మనిషి ఆకారం

✔ ముందుభాగంలో శంకువులాంటి డిజైన్

✔ వెనుక భాగంలో యంత్ర నిర్మాణంలాంటి ఆకృతి

ఇవన్నీ చూసిన పరిశోధకులు

👉 ఇవి కేవలం అలంకార శిల్పాలు కాకుండా

👉 అప్పటి వారి ఊహాశక్తి లేదా తెలియని సాంకేతిక అవగాహనకు సంకేతాలేమో అని భావిస్తున్నారు

అయితే ప్రశ్న ఒక్కటే—

మన పురాణాలు నిజంగా మనం ఊహించినదానికంటే చాలా ముందున్నాయా? 🤔

చైనా మాంజా తీవ్ర గాయాలు*

 *Today news information*




*చైనా మాంజా బారిన పడి వృద్ధ మహిళకు తీవ్ర గాయాలు*


రంగారెడ్డి జిల్లా:

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.


అల్మాస్‌గూడ ప్రధాన రహదారిపై రోడ్డుప్రక్కన నడుచుకుంటూ వెళ్తున్న యాదమ్మ (వయసు సుమారు 70 సంవత్సరాలు) అనే వృద్ధ మహిళకు అకస్మాత్తుగా చైనా మాంజా కాలికి చుట్టుకుంది.


ఈ ఘటనలో ఆమె కాలు తీవ్రంగా కోసుకుపోయి భారీగా రక్తస్రావం జరిగింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వృద్ధురాలిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 


ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతున్నట్లు సమాచారం.


నిషేధిత చైనా మాంజా వినియోగం వల్ల ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడుతున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

భోగి పండుగ రోజు

 భోగి పండుగ రోజు చిన్నారుల తలల మీద రేగు పండ్లను మాత్రమే పోస్తారు..... మిగతా ఏ పండ్లనూ పోయరు ..... ఎందుకో మీకు తెలుసా...........? 

అయితే ఒక్కసారి దీనిని చదవండి.


బోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.


అంతేగాక మన శాస్త్రాలలో ఏమున్నదంటే...........


రేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు. పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజూ చుట్టుపక్కలవున్న చెట్లనుంచి ఒక్క రేగు పండుని ఆహారంగా తీసుకునే వాళ్లు. 


సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ, రేగు పళ్ళని తింటూ, ఆ ప్రదేశాల్నీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి ఆశీర్వదించారు. ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం.


బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగ భాగ్యాలతో తులతూగుతారంటారు. అందుకే భోగినాడు పెద్దవారు పిల్లలకి భోగి పళ్ళుపోసి ఆశీర్వదిస్తారు. 


వారి ఆశీర్వచనాలతోబాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో పురాణ కాలం నుండి దీనిని ఆచరిస్తూ వస్తున్నారు.

నిత్యం నైమిత్తికం చైవ

  *నిత్యం నైమిత్తికం చైవ క్రియాంగం మలకర్షణం ।* *తీర్థాభావే తు కర్తవ్యముష్ణోదకపరోదకైః ॥*


*పరోదకైః శీతోదకైః । గంగాదిపుణ్యజలమిశ్రేణేన కూపవాప్యాద్యుద కమపి పవిత్రం భవతి తదుక్తం మత్స్యపురాణే --*


*పుణ్యాంభసా సమాయోగాదుష్టమప్యంబు పావనం । అపవిత్రమపి ప్రాప్య గంగాం యాతి పవిత్రతాం ॥*


ఒకవేళ పుణ్య తీర్థాలు అందుబాటులో లేకపోతే.. నిత్య, నైమిత్తిక, క్రియాంగ మరియు మలకర్షణ స్నానాలను వేడి నీటితో (ఉష్ణోదక) లేదా సాధారణ చల్లని నీటితో (పరోదక) చేయవచ్చు.


పుణ్య నదుల నీటితో కలిసినప్పుడు వేడి నీరు లేదా అశుద్ధమైన నీరు కూడా పవిత్రమవుతుందని మత్సపురాణ వచనం.


అలాగే గంగాజలంతో చేరిన ఏ అపవిత్రమైన వస్తువైనా పవిత్రతను పొందుతుందని మహాభారతం చెబుతోంది.

సుభాషితమ్

  ॐॐ卐 *నేటి సుభాషితమ్* 卐ॐॐ


  శ్లో𝕝𝕝 *“చింతనీయాహి విపదాం*

          *ఆదావేవ పతిక్రియా*।

          *న కూప ఖననం యుక్తం*

          *ప్రదీప్తే వహ్నినా గృహే"* ॥

           

తా𝕝𝕝 *“రాబోయే ఆపదలను గ్రహించి వాటికి ముందుగానే ప్రతిక్రియలను ఆలోచించాలి*. 


భావము:

ఇల్లు తగులబడుతూ ఉంటే అప్పుడు నుయ్యి త్రవ్వాలనుకోవటం యుక్తం కాదుకదా?" అని ఈశ్లోకానికి భావం.

@@@@@@@@@@@@@@@@


`నా అనువాద పద్యం`


తే.గీ.

దూరదృష్టిచే నాపదఁ బాఱఁజూచి 

చింతఁజేయ నివారణ చెలగు సుఖము 

యుక్తమవబోదు కష్టమ్ము లొదవు పిదప 

గృహము తగలడ నుయిఁ ద్రవ్వఁ గెరలినట్లు 

------------

కెరలు=విజృంభించు 

*~శ్రీశర్మద*

రుద్రః అంటే శివుడా, విష్ణువా?.

  రుద్రః అంటే శివుడా, విష్ణువా?. వేదంలో రుద్రారాధనే కదా ముఖ్యంగా ఉన్నది?


" రుద్రః " విష్ణుసహస్రనామాలలో ఒక అద్భుత నామం. ఈ రుద్రః నామం గురించి ఆదిశంకరులు అద్భుతమయిన భాష్యం చెప్పారు.


రుద్రహృదయోపనిషత్తు - యజుర్వేదం - శ్రీరుద్రః రుద్రః రుద్రః అని 3 సార్లు అంటే సమస్త పాపాలు దగ్ధమయిపోతాయి అని తెలియచేస్తూంది. కరుణామూర్తి.


" రోదయతి అంతఃకాలయితి రుద్రః " - ప్రళయ సమయంలో అందరినీ ఏడిపించేవారు రుద్రుడు అని.


" రురుం ద్రావయతి ఇతి రుద్రః " - రురుం అంటే దుఃఖము, దుఃఖహేతువు రెండింటినీ కరిగించేస్తాడు, పోగొడుతాడు అని.


శివపురాణం " రుత్ దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతి యః ప్రభుః రుద్రయిత్యుచ్యతే తస్మాత్ శివః పరమ కారణం " అని తెలియచేస్తూంది - దుఃఖం, దుఃఖ కారణం రెండూ పోగొడుతాడు అని.


" అత్యంతిక దుఃఖనాశకః " - ఏ దుఃఖం పోతే ఇక దుఃఖమే ఉండదో ఆ స్థితిని రుద్రుడు ఇస్తారు అని - ఆనందప్రదాత.


" ప్రణత దుఃఖద్రావకః " - దుఃఖాన్ని ద్రవింపచేయువాడు. అందుకే కష్టం రాగానే రుద్రాభిషేకం చేసుకో, పంచాక్షరి చెయ్యి అంటారు.


ఋగ్వేదం " ఋషీణాం దృతమస్య రూపముపలభ్యతే " - ఋషులకు ధ్యానం చేస్తే వెంటనే కనిపిస్తాడుట రుద్రుడు.


" రుదంతే నాదాంతే ద్రవతి ద్రావయితి ఇతి రుద్రః " - వేదం - నాదం చివర లభించి ఆనందస్వరూపుడిగా ద్రవించువాడు అని. ఓం అని స్మరించి నప్పుడు మ్..... అంటాం చివరలో. మ్... చివరలో ప్రకృతిలో లీనమయినప్పుడు సాధకుల మీద అమృతధార కురిపిస్తారుట రుద్రుడు.


వేదం " ఓం నమోభగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే బాహి " అంది. రుద్రుడైన విష్ణువునకు నమస్కారములు అని.


అందుకే ఓ పండితుడు " రుద్రుడు కాని విష్ణువు, విష్ణువు కాని రుద్రుడు నాకు వద్దు " అన్నారు. అంటే దుఃఖం ( రుద్రుడు పోగొడుతాడు ) పోగొట్టని విష్ణువు ఎందుకు. విష్ణువు ( సర్వత్రా వ్యాపించిన వాడు ) కాని రుద్రుడు ఎందుకు అని.


" శివాయ విష్ణురూపాయ

శివరూపాయ విష్ణవే "


ఇంకా రుద్రుడు వేరు, విష్ణువు వేరు అనుకుంటే మూర్ఖత్వం. అటువంటి వారికి జ్ఞానం ప్రసాదించమని అమ్మవారిని కోరుకుందాం.

మైండ్ బ్లోయింగ్

  *

 *_భారత్ గురించి 35 'మైండ్ బ్లోయింగ్' నిజాలివి_* 

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

_(వీటిని చదువుతుంటేనే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఆ నిజాలు మీకోసం...)_


*01. ప్రపంచంలో ఇంగ్లీష్ అత్యధికంగా మాట్లాడే రెండో దేశం భారత్. తొలి దేశం అమెరికా.*


*02. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతి పెద్దది. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది.*


*03. ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే..!*


*04. ప్రపంచంలో అత్యధిక శాఖాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40 శాతం భారతీయులు మాంసాహారం ముట్టరు.*

 

*05. ఇండియాలోని రోడ్లతో భూమి అంతటినీ 117 సార్లు చుట్టేయొచ్చు.*


*06. భారత సాఫ్ట్ వేర్ కంపెనీలు 90 దేశాలకు తమ ప్రొడక్టులను ఎగుమతి చేస్తాయి. అమెరికా సహా మరే దేశానికీ ఈ ఘనత దక్కలేదు.*


*07. మార్స్ పరిశీలనకు ఉపగ్రహాలను పంపేందుకు ఇతర దేశాలు వెచ్చించిన మొత్తంలో 75 శాతం తక్కువకే ఇస్రో విజయం సాధించింది.*


*08. యూఎస్, జపాన్ ల తరువాత సూపర్ కంప్యూటర్లను తయారు చేసిన, చేస్తున్న ఏకైక దేశం ఇండియానే..!*


*09). 2014లో జరిగిన ఎన్నికల్లో ఇండియాలో ఓట్లు వేసిన వారి సంఖ్య 54 కోట్లు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల మొత్తం జనాభా కన్నా ఇదే అధికం.*


*10. మరో ఏడాది నాటికి ప్రపంచంలోని కార్మిక శక్తిలో 25 శాతం ఇండియా నుంచే వెళుతుందని అంచనా.*


*11. జాతీయ క్రీడ అంటూలేని దేశాల్లో ఇండియా ఒకటి.* 


*12. ఇండియాలో సుమారు 1000 భాషలున్నాయి. జాతీయ భాష కూడా లేదు. హిందీ, ఇంగ్లీష్ లు అధికార భాషలుగా గుర్తింపు పొందాయి.*


*13. అన్ని యూరోపియన్ భాషలకూ మూలమైన సంస్కృతం ఇండియాలో పుట్టిందే..!* 


*14. ప్రపంచ తొలి యూనివర్శిటీ.. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే ఇండియాలో మొదలైంది. అదే తక్షశిల. ఇక్కడ ప్రపంచ నలుమూలల నుంచి 10,500 మంది విద్యార్థులకు 60 సబ్జెక్టుల్లో బోధనలు సాగాయనడానికి ఆధారాలున్నాయి.*


*15. గతంలో భారత రూపాయి ఎన్నో దేశాల్లో అధికారిక కరెన్సీగా చలామణి అయింది. ఒమన్, దుబాయ్, కువైట్, బహ్రయిన్, ఖతార్, కెన్యా, ఉగాండా, సీషల్స్, మారిషస్ దేశాలు అధికారిక కరెన్సీగా రూపాయిని వాడాయి.*


*16. ఇప్పటివరకూ జరిగిన ప్రపంచ స్థాయి పోటీల్లో ఓటమెరుగని జట్టుగా భారత కబడ్డీ జట్టు నిలిచింది. భారత కబడ్డీ ఆటగాళ్లు తాము ఆడిన అన్ని వరల్డ్ కప్ పోటీల్లో విజేతలుగా నిలిచారు.*


*17. వరల్డ్ రికార్డులను క్రియేట్ చేయడంలో ప్రపంచంలో మూడో స్థానం మనది. తొలి రెండు స్థానాల్లో అమెరికా, బ్రిటన్ ఉన్నాయి.*


*18. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో ఇండియా రెండవది.*


*19. ప్రపంచంలోనే సుగంధ ద్రవ్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఇండియానే..!* 


*20. 1990లో జరిగిన గల్ఫ్ వార్ సమయంలో అతిపెద్ద ప్రజల తరలింపును భారత్ చేపట్టింది. ఆ దేశాల్లో ఉన్న సుమారు 1.7 లక్షల మందిని 488 ఎయిర్ ఇండియా విమానాలు 59 రోజులు శ్రమించి దేశం దాటించాయి.*


*21. ఐక్యరాజ్యసమితి నిర్వహించే శాంతి దళాల్లో అత్యధికులు భారతీయులే..!* 


*22. గడచిన 1000 సంవత్సరాల్లో భారత్ స్వయంగా ఏ దేశంపైనా దాడి చేయలేదు.*


*23. 1896 వరకూ ప్రపంచానికి వజ్రాలను అందించిన ఏకైక దేశం ఇండియా మాత్రమే. కృష్ణా నది డెల్టా, ముఖ్యంగా ఇప్పటి హైద్రాబాద్,తెలంగాణ,కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలెన్నో లభించాయి.*


*24. చైనా, అమెరికాల తరువాత అతిపెద్ద సైనిక శక్తి మనదే.*


*25. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే ప్లాట్ ఫాం ఖరగ్ పూర్ లో ఉంది. దీని పొడవు 2.773 కిలోమీటర్లు.*


*26. ప్రపంచంలో తొలిసారిగా పర్సనలైజ్డ్ స్టాంపులను అందించిన దేశం ఇండియానే..!* 


*27. ఇండియాలో రోజుకు 14,300 రైళ్లు తిరుగుతుండగా, అవి ప్రయాణించే దూరం చంద్రడికి, భూమికి మధ్య ఉన్న దూరానికి మూడున్నర రెట్లు అధికం.*


*28. ప్రపంచంలో అత్యధికంగా సినిమాలు తీసే దేశం కూడా ఇండియానే..!* 


*29. ప్రపంచంలో అత్యంత పురాతన నగరం మనదేశంలోనే ఉంది. అదే వారణాసి.*


*30. ఇసియాలోనే అత్యంత పరిశుభ్ర గ్రామం మేఘాలయాలో ఉంది. దాని పేరు మౌలినాంగ్. ప్రపంచంలోనే అత్యధికంగా వర్షం పడే ప్రాంతమూ మేఘాలయాలో ఉంది. అదే చిరపుంజి. ఇక్కడ ప్రతియేటా సరాసరిన 467 అంగుళాల వర్షపాతం నమోదవుతుంది.*


*31. అత్యధిక విద్యార్థులు ఉన్న స్కూలు కూడా మనదే. లక్నోలోని సిటీ మాంటిస్సోరి పాఠశాలలో ఏటా 45 వేల మంది విద్యను అభ్యసిస్తుంటారు.*


*32. పన్నెండేళ్లకు ఓసారి జరిగే గంగానది కుంభమేళాకు వచ్చే ప్రజల సంఖ్య అంతరిక్షం నుంచి కూడా కనిపించేంత ఎక్కువగా ఉంటుంది.*


*33. సంఖ్యాశాస్రాన్ని ఆర్యభట్ట కనుగొంటే, బ్రహ్మగుప్త సున్నా విలువ ప్రపంచానికి తెలిపారు.*


*34. ఆల్ జీబ్రా, త్రికోణమితిలను ప్రపంచానికి అందించింది ఇండియానే.*


*35. మానవ చరిత్రలో తొలి వైద్య విధానం 'ఆయుర్వేద'ను అందించింది ఇండియానే..!*

 

*ఇవే కాదు, ఇంకెన్నో ఘనతలను ఇండియా సాధించింది, సాధిస్తూ ఉంది.*

విజ్ఞాన శాస్త్రము - కంప్యూటర్ పరిజ్ఞానము 5 T*

  *విజ్ఞాన శాస్త్రము - కంప్యూటర్ పరిజ్ఞానము 5 T*


 సభ్యులకు నమస్కారములు..


కంప్యూటర్ అనేది సాధారణంగా ఉపయోగించలేని డేటాను కూడా సమాచారంలోకి బదిలీ చేసే పరికరం. వినియోగదారు ఇచ్చే సూచనల సమితి ప్రకారం, అది ఇన్‌పుట్‌ను ప్రాసెస్ చేస్తుంది మరియు కావలసిన ఫలితాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆధునిక డిజిటల్ కంప్యూటర్‌లను వాటి పరిమాణం మరియు సామర్థ్యం ఆధారంగా వర్గీకరించారు. వివిధ రకాల కంప్యూటర్‌ల పరిమాణం మరియు డేటా నిర్వహణ సామర్థ్యాలను ఉపయోగించి వాటిని క్రింది సమూహాలుగా వర్గీకరించవచ్చు. 

*1) పరిమాణం ప్రకారం కంప్యూటర్లు*

i) సూపర్ కంప్యూటర్

ii) మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్

iii) మినీ కంప్యూటర్

*2) డేటాను నిర్వహించే సామర్థ్యం ప్రకారం కంప్యూటర్లు*

i) డిజిటల్ కంప్యూటర్

ii) హైబ్రిడ్ కంప్యూటర్

iii) అనలాగ్ కంప్యూటర్

*3) పరిమాణం ఆధారంగా*

i) మైక్రో కంప్యూటర్

ii) మినీ కంప్యూటర్

iii) మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్

iv) సూపర్ కంప్యూటర్

*4) పని ఆధారంగా*

i) అనలాగ్ కంప్యూటర్

ii) డిజిటల్ కంప్యూటర్

iii) హైబ్రిడ్ కంప్యూటర్

*5) ప్రయోజనం ఆధారంగా*

i) ప్రత్యేక ప్రయోజనం

ii) సాధారణ ప్రయోజనం.

 *సంక్షిప్తంగా*

కంప్యూటర్లు పరిమాణం, ప్రయోజనం లేదా ప్రాసెసింగ్ రకం ఆధారంగా వర్గీకరించబడ్డాయి, వీటిలో విస్తృతంగా సూపర్ కంప్యూటర్లు, మెయిన్‌ఫ్రేమ్‌లు ఉన్నాయి. మినీ కంప్యూటర్లు మరియు మైక్రో కంప్యూటర్లు (P, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్‌లు) అలాగే సర్వర్లు, వర్క్‌స్టేషన్లు మరియు ఎంబెడెడ్ సిస్టమ్‌ల వంటి ప్రత్యేక రకాలు, ప్రాథమికంగా, అవి అనలాగ్, డిజిటల్ లేదా హైబ్రిడ్, అత్యంత ఆధునిక పరికరాలు డిజిటల్. 


నిన్నటి ఆంగ్ల భాషలో ఉన్న సమాచారమును తెలుగు భాషలోకి అనువదించినది కూడా కంప్యూటరే.  


ధన్యవాదాలు

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ధామి

  ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ధామి పాఠశాలల్లో భగవద్గీత పారాయణం తప్పనిసరి చేశారు..!!🚩🚩🙏🙏


లక్ష్యం: విద్యార్థులను భారతీయ సంస్కృతి, నైతిక విలువలు మరియు జీవిత తత్వశాస్త్రంతో అనుసంధానించండి. దేవభూమి దాని మూలాలకు క్షమాపణ చెప్పడం లేదు..!!


సాంస్కృతిక ఐక్యత, విలువ ఆధారిత విద్య, సంకోచం లేదు..!! భారతదేశంలో మిగిలి ఉన్న రాష్ట్రాలు ఎప్పుడు ఈ విద్యా విధానాన్ని తీసుకొస్తుందో వేచి చూడాలి మరి జైశ్రీరామ్

అంత్యక్రియలప్పుడు

  అంత్యక్రియలప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?*


*వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం... మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు కానీ... ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపు పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 కే అంతిమయాత్ర అవుతుంది.*


*ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే... శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు.*


*బతికి ఉన్నంత కాలం భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదన లో లీనమై పోతుంది. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో... శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసే దాకా... ఆత్మ, మళ్లీ తన శరీరం లోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి... తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది.*


*పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని (డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు) విప్పి కింద పోస్తారు. ఎందుకంటే... శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద... తన వాళ్ళ మీద... ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే... ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే... అంతలోపు లెక్కించకపోతే, మళ్ళీ... తిరిగి మొదటి నుండి లెక్కించాలి.*


*శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే... కుండా నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో... నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది. కుండను కింద పడేసి పగలగొడతాం అంటే... ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెల్లిపో... అని ఆత్మకు మనమిచ్చే సంకేతం.*


*హిందూ సాంప్రదాయం లో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది. కానీ తెలిసిన వారు, తెలియని వాళ్లకు చెప్పరు. అదే మన ఖర్మ... ఇలా ఎందుకు చేస్తున్నారు, అంటే... ఏమో నాకు తెలియదు మా తాత ఇలాగే చేసాడు నేను ఇలాగే చేస్తున్నాను కానీ... ఎందుకు చేస్తున్నానో తెలియదు.*


*దయచేసి భారత ఆచార, సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి. అందులో నిగూఢ అర్థం దాగి ఉంటుంది.*

విజ్ఞాన శాస్త్రము

  *విజ్ఞాన శాస్త్రము - కంప్యూటర్ పరిజ్ఞానము 6 T*


 సభ్యులకు నమస్కారములు.


కంప్యూటర్లు అనేక రంగాలలో ఉపయోగించే బహుముఖ పరికరాలు. కొన్ని సాధారణ ఉపయోగాలు...

1) *విద్య* :- పరిశోధన, అభ్యాసం మరియు విద్యా సామగ్రిని యాక్సెస్ చేయడం కోసం.

2) *వ్యాపారం* :- డేటా ఖాతాలు, కమ్యూనికేషన్ మరియు ప్రెజెంటేషన్‌లను నిర్వహించడం.

3) *కమ్యూనికేషన్* :- ఇమెయిల్‌లు, వీడియో కాల్‌లు, S మీడియా మరియు సందేశం పంపడం.

4) *వినోదం* :- ఆటలు ఆడటం, వీడియోలు చూడటం మరియు సంగీతం వినడం

5) *డేటా నిల్వ*:- పెద్ద మొత్తంలో సమాచారాన్ని నిల్వ చేయడం మరియు నిర్వహించడం.

6) *ప్రోగ్రామింగ్* :- సాఫ్ట్‌వేర్ మరియు అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడం

7) *డిజైన్ మరియు సృజనాత్మకత* :- గ్రాఫిక్ డిజైన్‌లు, ఫోటో ఎడిటింగ్ మరియు వీడియో ప్రొడక్షన్.

8) *ఇంటర్నెట్ యాక్సెస్* :- వెబ్‌సైట్‌లు మరియు ఆన్‌లైన్ సేవలను బ్రౌజ్ చేయడం.


పైన పేర్కొన్న ఉపయోగాలు కంప్యూటర్లు రోజువారీ పనులు, వృత్తిపరమైన పని మరియు విశ్రాంతి కార్యకలాపాలలో ఎలా సహాయపడతాయో హైలైట్ చేస్తాయి.

 *సంక్షిప్తంగా*

కంప్యూటర్లు *కమ్యూనికేషన్* (ఇమెయిల్, వీడియో కాల్స్), *విద్య* (పరిశోధన, ఆన్‌లైన్ లెర్నింగ్), *వ్యాపారం* (డేటా నిర్వహణ, ఫైనాన్స్), *వినోదం* (గేమ్స్, సినిమాలు, సంగీతం) మరియు *సృజనాత్మకత* (డిజైనింగ్ మరియు ఎడిటింగ్) కోసం ఉపయోగించే విభిన్న సాధనాలు. ఈ ఫంక్షన్లన్నీ పనులను ఆటోమేట్ చేస్తాయి, విస్తారమైన డేటాను నిల్వ చేస్తాయి మరియు ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందిస్తాయి, ఇవి సాధారణ పత్రాల సృష్టి నుండి సంక్లిష్టమైన శాస్త్రీయ పరిశోధన మరియు బ్యాంకింగ్ వరకు పనులకు అవసరమైనవిగా చేస్తాయి.

ధన్యవాదములు

టంటట టంట టంట టట టంటట టంటట టంటటమ్మనెన్*

  *టంటట టంట టంట టట టంటట టంటట టంటటమ్మనెన్*

ఈ సమస్యకు నా పూరణ.


గంటల శబ్దముల్ వినెను గట్టున నున్న గురుండు లేచి తాన్


వెంటన వచ్చు శిష్యునికి వేగము నీటిని తెమ్మనంగనే


గుంటన కాలు జారివడ కోవెల మెట్లను చెంబు దొర్లగన్


టంటట టంట టంట టట టంటట టంటట టంటటమ్మనెన్.


అల్వాల లక్ష్మణ మూర్తి

వైకుంఠ ద్వారాలను

  *వైకుంఠ ద్వారముద్ఘాట్య

భక్తానాం కృపయా హరే ।

ఏకాదశ్యాం ప్రసీద త్వం

మోక్షదో భవ సర్వదా ॥*



వైకుంఠ ద్వారాలను తెరిచి భక్తులపై కృప కురిపించే హరే, 

ఈ ఏకాదశి నాడు శ్రీ విష్ణు మూర్తి అనుగ్రహం సర్వదా మీకు కలగాలని మనసారా కోరుకుంటున్న...


వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు


శ్రీ సద్గురు పీఠం తరపున

శ్రీధర్ శర్మ తోటపల్లి..✍

విజ్ఞాన శాస్త్రము - కంప్యూటర్ పరిజ్ఞానం 7 T*

 *విజ్ఞాన శాస్త్రము - కంప్యూటర్ పరిజ్ఞానం 7 T*


సభ్యులకు నమస్కారములు 


కంప్యూటర్ సైన్స్ చాలా విస్తృతమైనది, ప్రాథమిక అల్గోరిథంలు మరియు డేటా నిర్మాణాల నుండి 1) AI (కృత్రిమ మేధస్సు) 2) సైబర్ భద్రత 3) క్లౌడ్ కంప్యూటింగ్ 4) వెబ్/యాప్ అభివృద్ధి డిజిటల్ ఆవిష్కరణల కోసం దాదాపు ప్రతి పరిశ్రమ మరియు ఆధునిక జీవితంలోని అంశాన్ని తాకే గణన యొక్క సిద్ధాంతం, రూపకల్పన మరియు అనువర్తనాన్ని కవర్ చేస్తుంది. AI (కృత్రిమ మేధస్సు) కాకుండా కంప్యూటర్ రంగంలో తాజా అభివృద్ధి *క్వాంటమ్ కంప్యూటింగ్*. క్వాంటం కంప్యూటింగ్ క్వాంటం మెకానిక్స్‌పై ఆధారపడి ఉంటుంది, ఇది క్యూబిట్స్ = క్వాంటమ్ బిట్ = బిట్ అనేది ప్రాథమిక సమాచారం = క్లాసికల్ బిట్ = 0 లేదా 1కి సారూప్యంగా ఉంటుంది.


క్యూబిట్ వ్యవస్థ ఔషధ ఆవిష్కరణ, పదార్థం, శాస్త్రం, కృత్రిమ మేధస్సు మరియు ఆధునిక క్రిప్టోగ్రఫీని విచ్ఛిన్నం చేయడం కోసం ఒకేసారి కీలకమైన అనేక అవకాశాలను అన్వేషించడం ద్వారా క్లాసికల్ కంప్యూటర్ల కంటే ఘాటుగా వేగంగా సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి అనుమతిస్తుంది, *ఇది ఇప్పటికీ ఒక ప్రయోగాత్మక సాంకేతికత*. 


ధన్యవాదములు.

సమస్య పూరణ.

  *వ్యాధి నెఱింగి తగ్గుటకు నౌషధమిచ్చును న్యాయవాదియే*

ఈ సమస్యకు నా పూరణ. 


మేధ మధించి మూలికలు మేటివి మిన్నగ సేకరించుచున్


బాధలు లుప్తమై జవము ప్రాప్తము గాగ భిషగ్వరుండు నీ


వ్యాధి నెఱింగి తగ్గుటకు నౌషధమిచ్చును - న్యాయవాదియే


సాధన శోధనన్ గెలుచు శాస్త్రము తర్కము సొంతమైనచో.



అల్వాల లక్ష్మణ మూర్తి.

దత్తపది

  *అన్న - మిన్న - కన్నె - చెన్ను* (దత్తపది)

సీతా స్వయంవరం.


అన్న ధనువును సౌమిత్రి యందుకొనగ


మిన్న చాపము రామన్న మీదికెత్తి


కన్నెదురుగను విరిచెను కట్టెవోలె


సీత రాముని మెడ వేసె చెన్ను దండ.



అల్వాల లక్ష్మణ మూర్తి

[ *మితము నతిక్రమించి తిన మేలగు నెప్పుడు మానవాళికిన్* 

ఈ సమస్యకు నా పూరణ. 


హితమగునెట్లు భోజనము? హేతువు కాదది చేటు చేయదే?


సతమును ప్రొద్దు పోయి తిన సంబరమంచును రాతిరంతయున్


కృతములు హాని సల్పుగద! కేళిక కాదది దుర్భరంబునౌ, 


మితము నతిక్రమించి తిన మేలగు నెప్పుడు? మానవాళికిన్. 


అల్వాల లక్ష్మణ మూర్తి.

పంచ రంగనాధ క్షేత్రాలు....

 పంచ రంగనాధ క్షేత్రాలు....

 [ ధనుర్మాసం సందర్భంగా]

జలం ఏ పాత్రలోకి ఒంపితే, ఆ రూపాన్ని పొందుతుంది. భగవంతుడు కూడా అంతే! భక్తులు ఏ రూపంలో ఆయనను కొలుచు కోవాలనుకుంటే.... ఆ రూపంలోకి ఇమిడిపోతాడు. అలా ఆదిశేషుని మీద శయనించే విష్ణుమూర్తిని, రంగనాథస్వామిగా కొల్చుకోవడం కద్దు. దక్షిణాదిన ఈ రంగనాథ స్వామి ఆలయాలు చాలానే కనిపిస్తాయి. వాటిలో పంచరంగ క్షేత్రాల గురించి చెప్పుకోవాల్సిందే. కావేరీ తీరాన వెలసిన ఈ పంచరంగ క్షేత్రాలు తమిళ, కన్నడ ప్రజలకు చాలా ప్రత్యేకం. ఆ పంచరంగ క్షేత్రాల వివరాలు ఇవిగో…

శ్రీ రంగపట్నం:– ఈ పేరు వినగానే మనకు టిప్పు సుల్తాన్‌ కథలే గుర్తుకువస్తాయి. టిప్పు రాజ్యానికి రాజధానిగా సాగిన ఈ పట్నానికి ఆ పేరే అందులోని రంగనాథుని ఆలయం మీదుగా వచ్చింది. ఇక్కడి శ్రీదేవి, భూదేవి సహిత రంగనాథుని ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. పశ్చిమ గాంగేయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి టిప్పు సుల్తాన్‌ సహా కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన రాజులంతా ఈ స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించినవారే!

 

తిరుప్పునగర్‌:– తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉందీ గ్రామం. ఇందులోని స్వామి పేరు ‘అప్పకుడతాన్‌ పెరుమాళ్‌’. ఇక్కడ ఉభమన్యు అనే రాజుకి విష్ణుమూర్తి ఒక ముసలివాని రూపంలో దర్శనమిచ్చాడట. ఆయనకు ఎంత ఆహారాన్ని అందించినా ఆకలి తీరలేదట. చివరికి పరాశర మహర్షి సూచనతో భక్తితో అప్పాలని అందించినప్పుడే తృప్తి లభించిందట. అప్పటి నుంచి ఈ స్వామికి అప్పకుడతాన్ స్వామి అని పేరు. పంచరంగ క్షేత్రాలలోనే కాకుండా వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటిగా కూడా ఈ ఆలయాన్ని ఎంచుతారు.


కుంబకోణం:– ఒకప్పుడు హేమ రుషి అనే ఆయన సాక్షాత్తు లక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని తపస్సుని ఆచరించాడట. దాంతో లక్ష్మీదేవి ఒక తటాకంలోని కలువల నుంచి ఉద్భవించింది. అలా అవతరించిన లక్ష్మీదేవిని కోమలవల్లి అన్న పేరుతో కొలుచుకున్నారు. లక్ష్మీదేవి చెంత ఆ విష్ణుమూర్తి కూడా ఉండాల్సిందే కదా! ఆయన కూడా భువికి అవతరించాడు. ఇలా అవతరించిన స్వామిని అరవముదన్ లేదా సారంగపాణి అని పిల్చుకుంటారు.

 

మయిలదుతురై:– చంద్రుని తపస్సుకి మెచ్చి ఆ విష్ణుమూర్తి అవతరించిన చోటు ఇది. పరాకల్‌ అనే ఆళ్వారుని భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడే స్థిరపడిపోయారట. అలా చూసుకున్నా ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు తోస్తుంది. ఇక్కడి స్వామి పేరు ‘పరిమళ పెరుమాళ్‌’. వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటైన ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. ఈ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపుదిద్దుకుందని చెబుతారు.

 

శ్రీ రంగం:– పంచరంగ క్షేత్రాలలో శ్రీరంగాన్ని ఆద్యరంగం (చివరి క్షేత్రం)గా పిలుస్తారు. కానీ అన్నింటిలోకీ ప్రముఖమైనది ఈ ఆలయమే! విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంఖు రూపంలా తోచే ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మితమైంది. ఇక్కడి మూలవిరాట్టుని సాక్షాత్తు విభీషణుడు ప్రతిష్టించినట్లు చెప్పుకొంటారు. విష్ణుభక్తిలో శ్రీరంగానికి ఉన్న ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా తక్కువే! గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నది ఇక్కడే! ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించడానికే 300 ఏళ్లకు పైగా సమయం పట్టిందని చెబుతారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన గోపురంగా ప్రసిద్ధకెక్కిన ఈ ఆలయాన్ని దర్శించకుంటే సర్వశుభాలూ కలుగుతాయని నమ్మకం.

 

ఇవీ పంచరంగ క్షేత్రాల విశేషం. కొన్ని జాబితాలలో ఇందులోని కుంబకోణం బదులు వటనగరంలోని రంగనాథ పెరుమాళ్‌ ఆలయాన్ని పేర్కొంటూ ఉంటారు.🙏

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ ।

తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ।। 38 ।।


ప్రతిపదార్థ:


సుఖ — సుఖము; దుఃఖే — దుఃఖములో; సమే కృత్వా — సమానముగా భావించి; లాభ-అలాభౌ — లాభ నష్టములు; జయ-అజయౌ — గెలుపు ఓటములు; తతః — అ తరువాత; యుద్ధాయ — యుద్ధమునకు; యుజ్యస్వ — సిద్దుడవు అవుము; న — కాదు; ఏవం — ఈ విధముగా; పాపం — పాపము; అవాప్స్యసి — పొందెదవు.


  తాత్పర్యము :


సుఖ-దుఃఖాలని, లాభ-నష్టాలని మరియు జయాపజయములను సమానంగా తీసుకుంటూ, కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము. నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు.


 వివరణ:


లౌకిక స్థాయి నుండి అర్జునుడిని ఉత్సాహపరిచిన పిదప, శ్రీ కృష్ణుడు, ఇప్పుడు కర్మశాస్త్ర విషయంలో మరింత లోనికి వెళుతున్నాడు. శత్రువులను సంహరించటం వలన పాపం తగులుతుందని అర్జునుడు భయాన్ని వ్యక్తం చేశాడు. శ్రీ కృష్ణుడు ఈ భయాన్ని పోగొడుతున్నాడు. కర్మ ఫలాలపై ఆసక్తి లేకుండా తన కర్తవ్యాన్నినిర్వర్తించమని అర్జునుడికి ఉపదేశము చేస్తున్నాడు. పని పట్ల ఇలాంటి దృక్పథం అతన్ని తద్వారా వచ్చే ఏదేని పాప ఫలితాల నుండి విముక్తి కలిగిస్తుంది.


స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసినప్పుడు, మనం కర్మలను సృష్టిస్తాము. అవి తదుపరి కాలంలో కర్మఫలితాలను (ప్రతిచర్యలు) కలుగచేస్తాయి. మాథర్ శృతి ఇలా పేర్కొంటున్నది:


పుణ్యేన పుణ్య లోకం నయతి పాపేన పాపముభాభ్యామేవ మనుష్యలోకం


‘మంచి పనులు చేస్తే స్వర్గ లోకాలకు పోయెదవు; చెడు పనులు చేస్తే నరక లోకాలకు వెళ్లెదవు; ఈ రెంటి మిశ్రమం చేస్తే మళ్ళీ ఈ భూలోకానికి తిరిగి వచ్చెదవు.’ ఏ విధంగా అయినా మనం కర్మ-ప్రతిఫల బంధాల్లో చిక్కుకుంటాము. ఈ విధంగా లౌకికమైన మంచి పనులు కూడా మనలను బంధిస్తాయి. అవి భౌతికమైన మంచి ప్రతిఫలములను కలుగచేస్తాయి, అవి ఇంకా కర్మ రాశిని పెంచి, ఈ లోకంలో ఆనందం ఉన్నది అన్న భ్రమను మరింత పెంచుతాయి.


కానీ, స్వార్థ ప్రయోజనాలను విడిచిపెడ్తే, ఇక మన చర్యలు కర్మ-ఫలితాలని (కర్మ బంధాలని) సృష్టించవు. ఉదాహరణకు, హత్య చేయటం పాపం, మరియు ప్రపంచంలోని ప్రతి దేశం యొక్క న్యాయ చట్టం దానిని ఒక దండించదగ్గ నేరంగా ప్రకటించింది. కానీ, ఒక పోలీసు, తన కర్తవ్య నిర్వహణలో బందిపోటు దొంగల నాయకుడిని చంపితే అతను దానికి శిక్షింపబడడు. ఒక సైనికుడు శత్రు సైనికుడిని యుద్దంలో చంపితే, దానికి అతను శిక్షార్హుడు కాడు. నిజానికి అతని వీరత్వానికి ఒక పతకం కూడా ఇవ్వబడవచ్చు. ఈ పనులు స్వార్థ ప్రయోజనంతో కానీ, చెడు బుద్ధితో కానీ చేసినవి కాకపోవటం వలన వీటికి శిక్ష ఉండదు; ఆయా పనులు దేశ సేవలో తమ కర్తవ్యముగా చేసినవి. భగవంతుని న్యాయం కూడా ఇలాగే ఉంటుంది. ఎవరైనా అన్నీ స్వార్థ ప్రయోజనాలను విడిచి, కర్మలను భగవంతుని పట్ల కర్తవ్యంగా చేస్తే, అలాంటి పనులు కర్మ ఫలితాలను కలుగచేయవు.


కాబట్టి, అర్జునుడిని ఫలితాల పట్ల అనాసక్తుడై, కేవలం తన కర్తవ్య నిర్వహణ పట్ల మాత్రమే శ్రద్ధ చూపమని శ్రీ కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. జయాపజయాలని, సుఖదుఃఖాలని ఒకలాగే పరిగణిస్తూ సమదృష్టితో పోరాడితే, శత్రువులను సంహరించినా, అతనికి పాపం అంటదు. ఈ విషయం తదుపరి భగవద్గీత 5.10వ శ్లోకంలో కూడా మళ్లీ చెప్పబడింది: ‘తామరాకు నీటిచే తాకబడనట్టుగా, ఎవరైతే తమ కర్మలన్నిటినీ, మమకారము లేకుండా భగవదర్పితముగా చేస్తారో వారికి పాపము అంటదు.’


మమకారాసక్తి లేకుండా కర్మలను ఆచరించమని గంభీరమైన ముగింపు చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు, తను చెప్పిన దాని వెనుక ఉన్న తర్కము ఆవిష్కరించటానికి, కర్మ శాస్త్రం గురించి మరింత వివరంగా చెప్తానంటున్నాడు.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం - దశమి - విశాఖ -‌‌ భౌమ వాసరే* (13.01.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*