ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
10, నవంబర్ 2023, శుక్రవారం
కాలంతో పాటు మనం కూడా మారాలి అనే వింత పోకడ లో పెళ్లి లో చేస్తున్న తప్పులు 👇
**************
👉*నిశ్చయ తాంబూలానికే జంటను కలపడం,
👉*పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్లు చేయటం,
👉*గొప్ప కోసం ఈవెంట్స్ చేయటం,
👉*ఆర్భాటంగా మండపాలు కట్టడం,
👉*మెహిందీ పేరుతో,సంగీత్ పేరుతో తాగి తందనాలాడడం..
👉*డిజైనర్ శారీస్ కు వేలకు వేలు ఖర్చుపెట్టడం,
👉*బ్రైడల్ మేకప్పంటూ రెచ్చిపోవడం,
*👉పట్టెడన్నానికి ప్లేటు రేటు పెంచుతూ పోవటం ,ఆప్యాయత అన్న పదానికి అర్ధమే లేకుండా పోవడం..
👉*దావత్ పేరుతో మద్య, మాంసాలను సేవించి,వికృత నాట్యాలు చేయడం,
👉*కడుపు కట్టుకుని దాచింది హారతిచేయటం,లేదా *అప్పులు చేయడం (విది లేక)*
*మధ్యతరగతి మనిషికి అవసరమా..?*
👉*ఒకడిని చూసి ఒకడు,
*👉ఒకడ్నిమించి ఒకడు
వెర్రెక్కి పోతున్నారు
నేటి కాలంలో.
*ఎంత తింటాడు మనిషి?
*దేంట్లో దొరుకుతుంది వినోదం?
*ఎలా చేయాలి వేడుక?
*ఎలా ఖర్చు పెట్టాలి కష్టార్జితం?
*ఏ రకంగా పెరుగుతుంది ఆప్యాయత?
*ఏది కడితే వస్తుంది హుందాతనం?
*ఏ విధంగా ఇనుమడిస్తుంది అందం?
*ఎలా పెరుగుతుంది ఆకర్షణ?
👉*ఏ విధంగా బలపడుతుంది బంధం?
ఒక్కసారి, ఆలోచించి ఆచరిస్తే,
పెళ్ళితో వస్తుంది జీవితంలోకి కళ.
*పదిమందితో పట్టెడన్నం తింటే,
*మనసు విప్పి హాయిగా మాట్లాడుకుంటే,
*కార్యం జరిగే ఇంట చేతనైనంత సాయం చేస్తే,
*సహజమైన అందానికి పెద్దపీట వేస్తే,
*సాంప్రదాయం విధానానికి కట్టుబడి ఉంటే,
*దాచిన సోమ్ము సద్వినియోగ పడితే,
కార్యం చేసినవాడి బతుకు చీకటి కాదు. మధ్య తరగతి బతుకుల్లో వెలుగు పోదు.
*👉ముహూర్తం చూసి పారేసే కార్డుకి,
*పెళ్ళయిన వెంటనే తీసేసే పందిరికీ,
*చెమటపడితే కారిపోయే రంగుకీ,
*పెళ్ళినాడు మాత్రమే కట్టే వలువలకీ,
*నాలుగు మెతుకు తింటే నిండిపోయే కడుపుకీ,
*సరదాగా కబుర్లు చెపితే వచ్చే నవ్వుకీ,
*ఒక్కరోజులో ముగిసిపోయే వేడుకకీ,
ఉన్నదంతా ఊడ్చిపెడితే
పదికాలాలు బతకడానికొచ్చే
కొత్తమనిషికి
తర్వాత పెట్టేది ఏమిటి?
*👉అప్పు చేసి ఖర్చుచేసే,
వెర్రితనం కాదు పెళ్ళంటే!
*ఇంటికి దీపాన్ని తెచ్చుకునే
ఇంగితమైన పని వివాహ మంటే!
*శక్తికి మించి ఎగరటం,
*అప్పుచేసి ఆర్బాటం చేయటం
*ముమ్మాటికీ తప్పు👌*.
*కళ్యాణానికి కాస్త ఖర్చు చాలు, కలిసుండటానికే కావాలి ధర్మ,అర్ధములు*. *ఇది తెలుసుకున్ననాడు ప్రతినిత్యం బ్రతుకులో శ్రీరస్తు! శుభమస్తు! అవిఘ్నమస్తు*
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
ధనత్రయోదశి
*నేడు ధనత్రయోదశి*
🪷 ధనత్రయోదశి 🪷
ఆశ్వీయుజ మాసంలో కృష్ణ పక్షం లో వచ్చేటువంటి త్రయోదశికి ధన త్రయోదశి అని పేరు.
ధనత్రయోదశి రోజున చేయవలసిన పనులు ఏమిటి తెలుసుకుందాం. ఈ ధన త్రయోదశి అనేది యమధర్మరాజుకి ప్రీతికరమైన రోజు. ఆరోజున ఆయనను పూజించడం వలన మరియు దీపం పెట్టడం వలన అపమృత్యు దోషాలు తొలగించి నరకలోకప్రాప్తి లేకుండా చేస్తారు. ధనత్రయోదశి రోజున మన ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలను లక్ష్మీదేవికి అలంకరించి పూజించాలి.
పూర్వకాలంలో హేమరాజు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు కుమారుడు పేరు సులోచనుడు. ఆ సులోచనుడు యొక్క జాతకం ప్రకారం వివాహమైన నాలుగవ రోజు మృత్యు గండం ఉందని జ్యోతిష్యులు తెలియజేశారు.ఆ తర్వాత కొంత కాలానికి వివాహ వయస్సు వచ్చేసరికి వివాహం చేశారు. కానీ ఆ నాలుగో రోజు రానే వచ్చింది ఆరోజు చాలా బాధతో తన కొడుకుని యమధర్మరాజు తీసుకుపోతాడు అని బాధపడ్డారు కానీ అదేమీ తెలియని ఆ రాకుమారి తన నగలన్నీ తీసి అమ్మవారికి అలంకరించి లక్ష్మీ పూజ చేసి యమదీపం వెలిగించి గుమ్మం లో పెట్టింది. తనకు ఉన్న మృత్యు దోషం ప్రకారం ఆ యమధర్మరాజు 4వ రోజున రానే వచ్చారు సర్పరూపంలో రాకుమారుడిని కాటు వేయడానికి. ఆ సర్పరూపంలో వచ్చినటువంటి యమధర్మరాజు గుమ్మం లో పెట్టిన యమదీపం మరియు లక్ష్మీదేవికి అలంకరించిన బంగారు నగల యొక్క కాంతి ని చూసి మైమరిచిపోయారు. ఈ లోపల సులోచనుడు యొక్క మృత్యు గండ సమయం దాటిపోయి మృత్యు గండం తొలగిపోయింది.
అందుకని యమ ప్రీత్యర్థం గుమ్మం సాయంకాలం గుమ్మంబయట యమ దీపం పెట్టి దాని కింద శ్రీముగ్గు వేసి గుమ్మానికి ఒకపక్కగా పెట్టి పూజించండి.లక్ష్మీదేవికి బంగారు నగలు అలంకరించి లక్ష్మీ పూజ చేసి ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ యమదీపం అనేది మట్టి ప్రమిదలో వత్తులు వేసి నువ్వుల నూనెతో చెయ్యాలి.
ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో స్వయంగా తయారు చేసిన తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగాపెట్టి అమ్మవారిని కొలవడం వలన అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలతో పాటు అన్ని రకాల సంపదలు కలుగుతాయి.
శ్రీ దేవీ భాగవతం
శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
శర్యాతి వెంటనే అంగీకరించాడు. ఈ రోజే వెడదాం. ఇద్దరం కలిపివెడదాం. అమ్మాయినీ
అల్లుణ్ణి చూసివద్దాం - అని ఓదార్చాడు. వెంటనే రథం అధిరోహించి చ్యవనమహర్షి ఆశ్రమం చేరుకున్నారు.
రూపయౌవన సంపన్నుడై దేవపుత్రుడిలా వెలిగిపోతూ కళ్ళు మూసుకుని జపం చేసుకుంటున్న మునీశ్వరుణ్ణి
చూశారు. ఇద్దరూ క్షణకాలం ఆశ్చర్యపోయారు. ఇదేమిటి? ఈ సుందరాకారుడెవరు? ఛీఛీ! ఎంత
మహాపాపం చేస్తోంది మన అమ్మాయి. లోకానికి తెలిస్తే ఎంత అప్రతిష్ఠ! గుడ్డిమగడిని చంపేసి ఈ
అందగాడితో కాపురం పెట్టిందన్నమాట. కామపీడితురాలై ఇంతపని చేసిందా? అవును, ఎంతటివారికైనా
యౌవనంలో మన్మథుడు అతిదుస్సహుడుగదా! మనువంశానికి పెద్ద కళంకం, మాయని మచ్చ తెచ్చిపెట్టింది.
కన్యా యోగ్యాయ దాతవ్యా పిత్రా సర్వాత్మనా కిల |
తాదృశం హి ఫలం ప్రాప్తం యాదృశం వై కృతం మయా ॥
(6-16)
కన్నకూతురు కళంకిని అయ్యిందంటే ఆ తండ్రి జీవితం పరమకుత్సితం. అన్ని పాపాలూ
మూటగట్టుకుని ఏడిపించడానికే పుడుతుంది కూతురు. నేనూ పొరపాటే చేశాము. నా స్వార్థం కోసం
వృద్ధాంతానికి కట్టబెట్టాను. అన్ని విధాలా యోగ్యుణ్ణి చూసి కన్యాదానం చెయ్యాలంటారు. నేను
చేసినదానికి తగిన ఫలమే దక్కింది.
(6-19)
ఈ దుశ్శీలను ఏం చేసినా పాపం లేదు. నరికిపారెయ్యాలి. కానీ స్త్రీహత్యాపాతకం
అంటుకుంటుంది. అందులోనూ కన్నకూతిరిని సంహరించడం మరీపాపం. నిష్కళంకమైన మనువంశానికి
నా చేతులతో నేనే కళంకం తెచ్చిపెట్టినవాడినవుతాను. లోకాపవాదానికి భయపడనా, ప్రేమానురాగాలకు
కట్టుపడవా ? ఏమి చెయ్యాలో తోచడంలేదు.
బ్రతుకు ధనం కోసం కాదు
*బ్రతుకు ధనం కోసం కాదు ధర్మం కోసం. జీవిత పరమార్ధం భుక్తి మాత్రమే కాదు- భక్తి, సమత్వ బుద్ధి ప్రధానం.*
ప్రకృతిలోని చరాచర సృష్టి జీవనానికి అర్ధం. పరమార్ధం ఉంటాయి. చీమ నుంచి బ్రహ్మ వరకు రూపాలు వేరువేరుగా ఉన్నా ఎవరి పరిధిలో జీవనం వారిది. జీవిత కాలం కూడా నిర్దేశితమై ఉంటుంది. జీవిత లక్ష్యం తెలుసుకోవాల్సిన అవసరం మనిషికి మాత్రమే ఉంది. మానవులు బుద్ధిజీవులు. మిగిలిన అన్ని ప్రాణులకు స్వయం నిర్ణయాధికారం లేదు. అవి ఏ జాతికి చెందినవో ఆ జాతి లక్షణాలు మరణించే వరకు ఉంటాయి. అవి కేవలం చిన్న పరిధిలోనే బతుకుతాయి. ఆకలి, నిద్ర, మైధునం భయం... నాలుగింటికే ఆలోచన. ఆచరణ | పరిమితమవుతాయి. మనిషి జీవిత లక్ష్యానికి పరిమితి లేదు. అది ఆకాశమంత విశాలం. జీవిత లక్ష్యం మోక్ష సాధన అని వేదాంతులు చెబుతారు.
ఎవరి జీవితం ఎలా గడుస్తుందో మాత్రం ఎవరూ కచ్చితంగా నిర్ణయించలేరు, జాతకం, జ్యోతిషశాస్త్రం సైతం కొంతవరకే ఊహించగలవు ఎవరి జీవితానికి వారే నిర్ణేతలు. సూచనలు, సలహాలు, హితోక్తులు, సందేశాలు... వంటివి అనేకం అందుబాటులో ఉన్నాయి. స్వీకరించడం, తిరస్కరించడంలో ఎవరికి వారి స్వీయ నిర్ణయం. మనుషులు అందరూ గొప్పవారు కాకపోయినా.? మంచివారు మాత్రం కావాలని పెద్దలు చెబుతారు. మంచితనమే మానవతా లక్షణం.
ఒక మనిషి ప్రవర్తన ద్వారానే అతడి జీవితాన్ని అందరూ అర్థం. చేసుకుంటారు. వృత్తివ్యాపారాలు, వివిధ రంగాల్లో ప్రవేశం వారివారి అభిరుచులు, అర్హతలను అనుసరించి జరుగుతుంది. సాధించిన అవకాశం, అధికారం క్రమంగా మార్పు తెస్తాయి. తర్కబద్ధంగా, విజ్ఞతతో కూడిన జ్ఞానంతో కొందరు ఆదర్శవంతమైన జీవన విధానాన్ని కొనసాగిస్తారు. సేవ, సహాయం సామాజిక న్యాయం అందరికీ అందించి తమ జీవితాన్ని సార్ధకం చేసుకుంటారు. మరి కొందరు తమకు లభించిన వాటిని దుర్వినియోగం చేయడమే. లక్ష్యంగా భావిస్తారు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు రగిల్చి సామాజిక విద్వేషాలు రెచ్చగొట్టి ఆనందిస్తారు.
రామాయణంలో కబంధుడు, విరాధుడు అలాంటివారే. యక్షులు, గంధర్వుల స్థాయికి చేరుకున్న స్థితి నుంచి మద, మాత్సర్యం, అహంకారంతో సాధువులు, సజ్జనులను అవమానించి వారి శాపానికి గురయ్యారు. ఉన్నతమైన స్థానం కోల్పోయి రాక్షస స్వభావంతో నీచ స్థానం పొందారు. పురాణాల్లో రాక్షసులుగా నిలిచారు. బ్రతుకు ధనం కోసం కాదు ధర్మం కోసం. జీవిత పరమార్ధం భుక్తి మాత్రమే కాదు- భక్తి, సమత్వ బుద్ధి ప్రధానం.
చరిత్రలో తామర్లేన్, చెంఘిజ్ ఖాన్ ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. కార్యదక్షత, పట్టుదలతో పేరు సాధించారు. అంత ఘనమైన | స్థాయికి చేరినవారు అసంబద్ధంగా, క్రూరంగా ప్రవర్తించి చరిత్రహీనులయ్యారు.
ప్రతివారూ తమ జీవిత అర్థం తెలుసుకోవాలి. తమ జీవన గమనం పరిశీలించుకుని అవసరమైతే. మార్చుకోవాలి. ప్రేమ, దయ, జాలి, కరుణతో పాటు సహనం, సంయమనం, సహజీవనం సాగిస్తే మానవులుగా చీరస్మరణీయులు అవుతారు. ప్రపంచంలో నియంతృత్వం ఎంతో కాలం కొనసాగలేదు. అధర్మానికి ఆయువు తక్కువ, సత్యమే శాశ్వతంగా ఉంటుంది.
శాంతికాముకులు, సత్ప్రవర్తన కలిగినవారి జీవితం సఫలమవుతుంది. వసిష్ఠుడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మర్షి స్థానాన్ని పొందాడు. ఆయన శక్తి, సామర్ధ్యాలు చూసి ఈర్ష్యతో విశ్వామిత్రుడు తానుకూడా బ్రహ్మర్షి కావాలనుకున్నాడు. అంతటి ఉన్నతమైన పదవి సాధించాలంటే తనలోని ఆరు శత్రువులను (కామ | క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు) జయించాలని గ్రహించి పరివర్తనతో సాధించాడు. బ్రహ్మర్షిగా శాశ్వత కీర్తి సంపాదించాడు. ప్రతి మనిషి జీవితంలో ఉన్నత స్థితికి చేరాలనే ఆశయంలో తప్పు లేదు. ఎంచుకునే మార్గం ధర్మబద్ధంగా ఉండాలి.
🍁ప్రేమ, త్యాగం, విశాలత్వం జీవిత అర్థాలు, పరమార్ధాలు. అవి తెలుసుకుని జీవిస్తే ధన్యం....
తెలియకుండా బ్రతికితే వ్యర్ధం.🙏
బాహ్యస్పృహలో లేనివారి
*ప్ర : జీవితమంతా భగవదారాధన చేస్తూ,స్మరణ చేస్తూ మంచి పనులు చేస్తూ ఉండి,అవసాన దశలో పక్షవాతం, హృద్రోగం వంటి వ్యాధులకు లోనవ డంవల్ల బాహ్యస్పృహ కోల్పోవడం జరుగుతుంది. అట్టివారు నామ స్మరణ చేసేందుకు శరీరం, మనస్సు సహకరించని స్థితిలో వారి గతి ఏమిటి ?*
జ : "అన్తకాలే చ మామేవ స్మరన్ ముక్త్యా కలేబరం l యః ప్రయాతి సమద్భావం యాతి నాన్యత్ర సంశయః॥
- చివరి దశలో భగవత్ స్మరణ చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేవారు భగవత్ భావాన్ని పొందుతారని శ్రీకృష్ణ వచనం. ఇది నిజమే. కానీ బాహ్యస్పృహలో లేనివారి విషయం వేరు. జీవితమంతా భగవచ్చింతన చేసేవారు - స్పృహ ఉన్నంతవరకు చేస్తున్న కారణంగా వారికి తప్పక సద్గతి కలుగుతుంది.
" స్పృహకు అంతము కలిగే వరకు " అనే అర్థాన్నే తీసుకోవాలి.
" అన్తకాలే చ "- అనడంలో "అన్తకాల మునందు కూడా " అని అర్థం. నిత్యం స్మరించేవానికే అవసానకాలంలో స్ఫూరణకు వస్తుంది. నిత్యస్మరణం వల్ల భగవద్భావం వ్యక్తి వ్యవస్థగా మారిపోతుంది. భావన భగవన్మయమైన వాడు, బాహ్యస్పృహ లేకున్నా సద్గతి పొందుతాడు.దీనిలో సందేహం లేదు.
*రాశి ఫలితాలు
*10-11-2023*
*భృగు వాసరః* *గురు వారం*
*రాశి ఫలితాలు*
*మేషం*
దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమౌతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
*వృషభం*
ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. దైవ చింతన పెరుగుతుంది.
*మిధునం*
శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు. వృత్తి వ్యాపారాలలొ మిశ్రమ ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
*కర్కాటకం*
నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అందరికి నచ్చేవిధంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.
*సింహం*
ప్రారంభించిన పనులలో జాప్యం కలుగుతుంది నిలిచిపోతాయి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలలలో స్వంత ఆలోచనలు కలసి రావు. దైవ చింతన కలుగుతుంది.
*కన్య*
ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. ఇంటాబయటా సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాల పొందుతారు. ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
*తుల*
కీలక వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దూర దేశ సంచారం చేయవలసి వస్తుంది. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు.
*వృశ్చికం*
ధనాదాయ మార్గలు పెరుగుతాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘాకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
*ధనస్సు*
చుట్టుపక్కల వారితో స్ధిరాస్తి వివాదాల కలుగుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
*మకరం*
సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహనిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి.
*కుంభం*
అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బందిపడతారు. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు పరుస్తుంది.
*మీనం*
కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
🕉️
ధన్వంతరీ మహాత్యం
ధన్వంతరీ మహాత్యం
ఆశ్వయుజ మాసం బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి జయంతి. ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు పెద్దలు. శరీరం ఆరోగ్యంగా లేకపోతే మనస్సుకు ఏకాగ్రత ఉండదు. సకల సుఖాలు అనుభవించడానికి ఆరోగ్యమే ఉండాలి. అందుకే పెద్దలు దీవించేటప్పుడు ‘‘ఆయురారోగ్య ఐశ్వర్య, సంతాన, ఉద్యోగ ప్రాప్తిరస్తు’’ అంటారు. ఆయువు తర్వాత ఆరోగ్యానికే పెద్దలు ప్రాముఖ్యత ఇచ్చారని తెలుస్తుంది. ఆరోగ్యానికి అధిదేవత ధన్వంతరి. సకల రోగాల విముక్తికై మనమంతా ధన్వంతరిని పూజించాలి. సాక్షాత్తూ విష్ణుమూర్తియే ధన్వంతరిగా పాలకడలి నుండి అమృతభాండం పట్టుకుని అవతరించిన రోజు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవారు ఈ రోజున ధన్వంతరి పూజ తప్పక చేయాలి.
భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం.
బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం భాస్కరుని (సూర్యభగవానుని) వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న ధన్వంతరి. ఇతడు సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.
కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు")- ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.
విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంధాన్ని రచించాడని ఒక అభిప్రాయం.
ధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి (Etymology) చెప్పబడింది. మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉంది.
భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తరువాత రమాదేవి అవతరించి విష్ణువు వక్షోభాగాన్ని అలంకరించింది. తరువాత ధన్వంతరి అవతరించాడు.
"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు.
వైద్యవిద్యకు అధిదేవుడు. సనాతన వైద్య శాస్తమ్రైన ఆయుర్వేదాన్ని వృత్తిగా గైకొన్నవారు ఈ రోజు ధన్వంతరీ పూజ చేస్తారు. యాగాలు చేస్తారు. వైద్యులు మాత్రమే ధన్వంతర యాగాన్ని, పూజలను చేస్తారని, మరెవ్వరూ చేయరు అనే భావన చాలామందిలో ఉంది. కాని ఈ ధన్వంతరి భవరోగాలను పోగొట్టే దైవం. అందుకే ధన్వంతరి వ్రతాన్ని ఆనవాయితీగా లేనివారు కూడా ఆనాడు శ్రీమన్నారాయుణిడిని, ధన్వంతరిని స్మరించుకొని హరినామస్మరణ చేస్తే సకల రోగాలు పటాపంచలవుతాయి. సంపూర్ణ ఆరోగ్యం సంప్రాప్తమవుతాయి. ఆయుర్వేదానికి ప్రథమ గురువు సుశ్రుతుడు. ధన్వంతరి నుండి మొదట ఆయుర్వేద శాస్త్రం ఉపదేశం పొందినాడు. ప్రపంచంలోని ప్రతి వస్తువులోనూ ఔషధ గుణాలు, ప్రతి చెట్టు ఔషధాల నిస్తుందని చెప్తుంది ఆయుర్వేదం. కేరళ రాష్ట్రంలో త్రిశూరవద్ద ధన్వంతరి ఆలయం ఉంది. అనారోగ్యంతో బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శించి విష్ణు సహస్రనామార్చన చేస్తే అన్ని రోగాలు పటాపంచలవుతాయని భక్తుల నమ్మకం.
పురాణ కథనం ప్రకారం సురాసురులు కలిసి పాలసముద్రాన్ని మధించారు. ధర్మాచరణతో మనుగడ సాగించేవారికి అపారమైన జ్ఞానాన్ని, అనంతమైన సంపదను అందించడానికి విశ్వపాలకుడు, జగద్రక్షుడైన ఆ నారాయణుడు నడుం కట్టాడు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మధించినప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది. ఆ హాలాహలాన్ని పరమశివుడు మింగేసి గరళకంఠుడు అయ్యాడు. ఆ తర్వాత కామధేనువు, ఐరావతం, ఉచె్తై్చశ్రవం పుట్టాయి. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మీ, కల్పవృక్షం ఉద్భవించింది. చిట్టచివరగా శ్రీమన్నారాయణుడు పరిపూర్ణ ప్రశాంత సాకార పరంజ్యోతి స్వరూపుడుగా ధన్వంతరి రూపం ధరించి చేతిలో అమృత కలశంతో వెలుపలికి వచ్చాడు. అమృత కలశంలోనే సమస్త శారీరక, మానసిక, అజ్ఞానరోగాలకు ఔషధాలు నిక్షిప్తమై ఉన్నాయి. శ్రీమహావిష్ణువుకు ప్రతి రూపమైన ధన్వంతరి నాలుగు భుజాలుతో ఉద్భవించాడు. దేవదానవులు అతనికి నమస్కరించారు.
వైభవంగల ధన్వంతరి (శ్రీమహావిష్ణువు) పటాన్ని కుంకుమతో, పుష్పాలతో అలంకరించి, స్వామి సహస్రనామాన్ని పఠిస్తూ తెల్లపూవులు లేదా తులసీ దళాలతో అర్చించాలి. అనంతరం పాయసాన్ని నివేదించాలి. ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ ముందుగా స్వీకరించి అనంతరం ఖచ్చితంగా కనీసం అయిదుగురికైనా పంచాలి.
మేడి (ఔదాదుంబరం) చెట్టు మొదట్లో ఉండడానికి దత్తుడు ఇష్టపడుతాడు. ఆ మేడి చెట్టును మనము పూజ్యభావంతో చూస్తాము. అట్టి చెట్టు కింద కూర్చుని శ్రీ దత్తాత్రేయుని మంత్రం పఠిస్తే, ఈ కలియుగంలో నామస్మరణ మాత్రాననే తరించగల అవకాశము మానవ జాతికున్నది. కనుక శ్రీ దత్తావారిని తలచి ఆయురారోగ్యములను, స్మరించి భోగభాగ్యములను పొంది, శ్రీదత్తుని విషయమై ఏదైనా మనము అనుకున్నచో, అనుకున్న రోజుదగ్గరనుండే ఒక చక్కని మార్పు కలుగుట జరుగుతుంది.
ఈ స్తోత్రము ప్రతి రోజు చదివిన ఎడల సర్వ రోగములు నశించి ఆయురారోగ్యములు కలుగగలవు.
ఎవరికైనా అనారోగ్యము లేక దీర్ఘకాలిక రోగములు వున్నఎడల ఆ రోగ గ్రస్తులు కానీ లేక వారి సంబంధీకులు కానీ ఈ మంత్రము పఠించిన ఎడల ఆ రోగము ఉపశమించును.
ఓం నమో భగవతే
మహా సుదర్శన
వాసుదేవాయ ధన్వంతరయే
అమృత కలశ హస్తాయ
సర్వ భయ వినాశాయ
సర్వ రోగ నివారణాయ
త్రైలోక్య పతయే
త్రైలోక్య విధాత్ర్తే
శ్రీ మహా విష్ణు స్వరూప
శ్రీ ధన్వంత్రి స్వరూప
శ్రీ శ్రీ ఔషధ చక్ర
నారాయణ స్వాహా
ఓం నమో భగవతే
వాసుదేవాయ ధన్వంతరయే
అమృతకలశ హస్తాయ
సర్వ భయ వినాశాయ
త్రైలోక్య నాథాయ
శ్రీ మహా విష్ణవే నమః
*శ్రీమతే రామానుజాయ నమ:*
*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*
*ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం*
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *నమామ్యహం*
శుక్రవారం, నవంబరు 10,2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం
తిథి:ద్వాదశి ఉ11.21 వరకు
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:హస్త రా11.56 వరకు
యోగం:విష్కంభం సా5.48 వరకు
కరణం:తైతుల ఉ11.21 వరకు
తదుపరి గరజి రా12.05వరకు
వర్జ్యం:ఉ6.55 - 8.40
దుర్ముహూర్తము:ఉ8.21 - 9.06 &
మ12.07 - 12.52
అమృతకాలం:సా5.23 - 7.08
రాహుకాలం:ఉ10.30 - 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30
సూర్యరాశి : తుల
చంద్రరాశి : కన్య
సూర్యోదయం:6.05
సూర్యాస్తమయం: 5.23
*శ్రీమతే రామానుజాయ నమ:*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
///// ఆలోచనాలోచనాలు /////
------౦ కష్టాలు- కడగండ్లు ౦----- ***** కష్టం అనేది ఒక గులకరాయి వంటిది. దాన్ని కంటికి మరీ దగ్గరగా ఉంచుకొని చూస్తే మొత్తం ప్రపంచాన్నే ఆక్రమిస్తుంది. అందువలన మిగిలిన అన్నింటినీ పూర్తిగా కప్పివేస్తుంది. దానిని కంటికి సరైన దూరంలో ఉంచి చూస్తే దాని పరిమాణాన్ని అంచనా వెయ్యగలం. పూర్తిగా కాళ్ళ దగ్గర పడేసి గమనిస్తే , దానిని సులువుగా అధిగమించగలమనే ధైర్యం మనకు కలుగుతుంది. ***** కష్టాలు కూడా ఒకందుకు మంచివే! మన నిజమైన శ్రేయోభిలాషులు ఎవరో మనకు ఆ సమయంలోనే మనకు తెలిసిపోతారు. ***** కష్టాలు వచ్చి ఉక్కిరిబిక్కిరి చేసి, చివరలో మనకు ఎంతోకొంత మేలు చేసిపోతాయి. వాటి ప్రభావం నుండి బయటపడ్డప్పుడు కానీ ఈ రహస్యం బోధపడదు , మన మనస్సుకు. ***** కష్టాన్ని ఎదుర్కోకుండా చేతగానివలె కూర్చుంటే అది భయంకరమైన "సింహం" లాగా తయారు అవుతుంది. తెగువచూపి, మొండి ధైర్యం తో ఎదుర్కొన్నావా దాని స్థాయి పొగరుమోతు" గుఱ్ఱం" గా దిగజారిపోతోంది. శక్తియుక్తులన్నీ కూడదీసుకొని ఆ కష్టాన్ని అధిగమించావా? ఓడిపోయిన కష్టం ఒక" గాడిద" స్తాయికి దిగజారుతుంది. దీని కోసమా, మనం ఇంత శ్రమపడింది, అని మన మనస్సుకు తోస్తుంది. ***** అయినా మహనీయులు పడిన కష్టాలతో పోల్చుకొంటే మన కష్టాలు ఏపాటివి. ధర్మరాజు, నలచక్రవర్తి, శ్రీరాముడు వీరంతా కష్టాల కొలిమిలో కాగి దృఢచిత్తంతో విజయవంతంగా వెలువడ్డారు. వారి గాధలు మనకు కష్టాలలో ధైర్యాన్ని కలుగజేస్తాయి. ***** బంగారం పడే కష్టాలు ఇతర ఏ లోహం పడటం లేదు. అందువలననే " అపరంజి" కి అందరూ మోహపడతారు. ***** ఎలోపతి వైద్యంలో కొన్ని ద్రవరూప మందులపై "" Shake well before use"" అని ముద్రించబడి ఉంటుంది. భగవంతుడు కూడా చేసేపని అదే! మనం బాగా పరిణతిచెంది, పదిమందికి ఇంకా ఎక్కువ ఉపయోగపడాలనే సదుద్దేశ్యంతో మనలను మనం భరించగలిగినంత కష్టాల్లో ముంచి, తేల్చి ఆపై మనకొక ఉన్నతిని కలుగజేస్తున్నాడు. ***** మనకు వచ్చే కష్టాలన్నీ కరెంటు మీటరు వద్ద మనం ఏర్పరచుకొన్న ఫ్యూజ్ వైర్ లాంటివి. ఓల్టేజి అధికమైనప్పుడు " ఫ్యూజ్ వైర్" మాత్రమే కాలిపోయి ఇంట్లోని ఖరీదైన విద్యుత్ పరికరాలను కాపాడటం మనం గమనిస్తూనే ఉంటాం గదా! ***** దుఃఖం, సోమరితనం ఈ రెండూ పిల్లలు ఆటస్థలంలో ఆడుకొనే"" సీ-సా"" క్రీడాపరికరం వంటివి. ఒకటి క్రిందకు పోయినప్పుడు, మరొకటి పైకి లేస్తుంది. నిరంతరం పనిలో మునిగితేలేవారికి కష్టాల్లో ఏడవడానికి కూడా సమయం లభించదు. ***** ఎన్నోకష్టాలను అధిగమించినవారికి ఒక రహస్యం అవగతమవుతుంది. అదేమిటయ్యా! అంటే " ఏ కష్టమూ శాశ్వతంగా మనల్నే అంటిపెట్టుకుని ఉండదని."" ***** మనం తమాషాగా ఇట్లా ఆలోచిద్దాం. మనం "" నరకలోకం"" లోనే ఉన్నామని కాసేపు భావిద్దాం. అక్కడే కూర్చొని, తీరుబడిగ రాగయుక్తంగా ఏడవటం అయితే చెయ్యం కదా! ఏదోవిధంగా ఆ "" నరకలోకాన్నుండి"" విముక్తి కై ప్రయత్నిస్తాంగదా! అదేదో ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేస్తే , రేపటి మన ఇబ్బందులకు ఈ అభ్యాసం ఎంతోకొంత ఉపయోగపడుతుంది కదా! ఆలోచించండి. ***** యుద్ధానికి వెళ్ళే ప్రతి యోధుడు తన శరీర రక్షణకు గట్టి కవచాన్ని ధరిస్తాడు. మనం కూడా అంతే! వీలయినంతగా "" హాస్యరసాన్ని"" అలవర్చుకొంటే , ప్రతి చిన్న సమస్యను పెద్దదిగా భావించి, ఆందోళన చెందకుండా నెమ్మదిగా కష్టాలనుండి బయటపడే మార్గాలను అన్వేషించగలం. * * * * * * * * * * * * * * * * * * * * Answers to sharpen your mind! 1* Time 2* Racecar 3* Your breath 4* "B" is the daughter of "A". ~~~~~~~~~~~~~~~~. ***** అర్థబేధము గల పదములు ***** 1* సమజము= పశువుల మంద. సమాజము = మానవ సంఘము. 2* సమము = సమానము. శమము = శాంతము. 3* సరము = దండ. శరము = బాణము. 4* సర్వదా = ఎల్లప్పుడు. సర్వధా = అన్ని విధములు. 5* స్వరాజ్యము = స్వాతంత్య్రము. స్వారాజ్యము = స్వర్గము. - - - - - - - - - - - - - - - - - - - - - తెలుగు పొడుపుకథలు. 1* వృషభుడికి నూరు కళ్ళున్నాయి గాని చూడలేడు? ( జల్లెడ) 2* వీళ్ళెప్పుడూ విడిపోరు. స్నేహితులు మాత్రం కారు. ఎప్పుడూ కలవరు. శత్రువులు మాత్రం కారు. ఇంతకూ వీళ్ళెవరండీ బాబూ! ( రైలు పట్టాలు) 3* వాకిలివేసి ఇల్లు. తెల్లని సున్నం వేసి ఉంది. అద్దెకు దిగేవారే లేరు? ( కోడిగుడ్డు) 4* విలువలేని కండ. విస్తుపోయే ముండ. నమ్మి ముందుకు సాగితే, మిగిలేది ఎండ? ( ఎండమావులు ) 5* విసనకర్ర కాడ వింతలు బుట్టె; కోటకొమ్మ కాడ కొమ్మలు బుట్టె; కొమ్మ కొమ్మకు కోటి బిడ్డలు బుట్టె? ( పసుపు చెట్టు ) తేది 10--11--2023, శుక్రవారం, శుభోదయం.
జలగలు ఉపయోగించే విధానం -
ఆయుర్వేద వైద్యం నందు జలగలు ఉపయోగించే విధానం -
జలము ఆయువుగా కలవి కావున జలాయుకములు అనియు , జలము నివాసస్థానం కలవి కావున జలౌకలని మరియు జలగలు అని పిలవబడుతున్నవి. ఇవి 12 విధములు గా ఆయుర్వేదం విభజించింది. ఇందు విషము కలిగినవి నల్లటి రంగులోని బేధము వలన 6 విధములు . అందు కృష్ణ అనునది కాటుక రంగు పెద్ద శిరస్సు గలది. కర్బూర అనునది బొమ్మిడ అను చేప వంటి ఆకృతి కలిగి ఒకచోట చిన్నగా , మరొకచోట పెద్దగా ఉండు పొట్ట కలిగి ఉండును. కలగర్ద అనునది ముడుతలతో కూడి ఉండి పెద్ద పార్శ్వములతో కలిగిన ముఖం
ఉండును. ఇంద్రాయుధ అనునది ఇంద్రధనస్సులోని నానారంగులు గల నీలపు చారలతో కూడుకుని ఉండును. సాముద్రిక అనునది కొద్దిగా నలుపు , పసుపు రంగులతో ఉండి అనేక ఆకృతులుగల తెల్లని మచ్చలతో కూడుకుని ఉండును. గోచందనం అనునది ఆంబోతు బుడ్డ వలే పొట్ట యందు ఒక గీత కలిగి సన్నని ముఖం కలిగి ఉండును.
పైనచెప్పిన 6 రకాల జలగలు విషము కలిగి ఉంటాయి. ఇవి కరిచినచో కాటునందు వాపు , మిక్కిలి దురద, మూర్చ, జ్వరం, తాపము , వాంతి కలుగును.
ఇప్పుడు మీకు విషము లేని జలగలు గురించి వివరిస్తాను. విషములేని జలగలు మొత్తం 6 రకాలు . అందులో కపిల అనునది ప్రక్కల యందు మనశ్శిలతో రంగు వేసినట్లు ఉండి వీపున నిగనిగలాడుచూ పెసలవలే ఆకుపచ్చ రంగు కలిగి ఉండును. పింగళి అనునది కొంచం ఎరుపు రంగు గుండ్రని శరీరం పచ్చని రంగు ఉండి వేగముగా కదులును. శంఖముఖి అనునది యకృత్ వలే ఎరుపు నలుపు రంగులు కలిగి శీఘ్రముగా రక్తమును తాగే స్వభావం పొడవైన వాడి అయిన ముఖం కలిగి ఉంటుంది. మూషిక అనునది ఎలుక వంటి ఆకారం , రంగు , దుర్వాసన కలిగి ఉంటుంది. పుండరీకం అనునది పెసల వలే పచ్చని రంగు , పద్మముల వలే విశాలమైన ముఖం కలిగి ఉండును. సావరిక అనునది నిగనిగలాడుచూ తామరాకు వంటి రంగు కలిగి 18 అంగుళముల పొడవు కలిగి ఉండును. ఇది ఏనుగులు, గుఱ్ఱములకు చికిత్స చేయుటలో మాత్రమే వాడవలెను .మనుష్యులకు పనికిరాదు. వీటిని నిర్విష జలగలు అందురు.
ఈ విషము లేనటువంటి జలగలు లభించు ప్రదేశాలు ముఖ్యంగా ఢిల్లీకి పశ్చిమ దిశలోను , సహ్యాద్రి పర్వతాలు అనగా నర్మదా నది ప్రవహించు పర్వత ప్రాంతాలలోను, మధురా ప్రాంతంలోనూ ఈ విషము లేనటువంటి జలగలు ఉండును. ఈ ప్రదేశాలలో లభించు జలగలు పెద్ద శరీరం కలిగి మంచి బలముతో ఉండి శీఘ్రముగా రక్తమును పీల్చెడి స్వభావం ఎక్కువుగా ఉండి విషము లేకుండా ఉండును.
విషముతో కూడిన చేపలు , పురుగులు , కప్పలు , మూత్రపురీషములు క్రుళ్ళుట చేత పుట్టిన జలగలు మరియు కలుషిత జలము నందు పుట్టిన జలగలు, నీటిలోని పద్మములు కుళ్లుటచేత పుట్టిన జలగలు విషపూరితంగా ఉండును. శుద్ధజలము నందు పుట్టిన జలగలు విషం లేకుండా ఉండును.
ఇప్పుడు జలగలను పట్టే విధానం వాటిని పోషించే విధానం మీకు తెలియచేస్తాను .
రక్తముతో కూడిన తోలు , జంతుమాంసం , వెన్న , నెయ్యి, పాలు మొదలగు వాటితో కూడిన అన్నమును జలగలు ఉన్న ప్రదేశంలో వేసినచో అవి పైకి వచ్చును. అప్పుడు వాటిని పట్టుకొని మంచి కుండలో చెరువునీటిని , బురదని పోసి అందులో ఉంచవలెను. వాటికి తిండి కొరకు నాచు, ఎండిన మాంసము , నీటిలో పుట్టే దుంపల చూర్ణం ఇవ్వవలెను. అవి నిద్రించుటకు గడ్డి, నీటి యందు పుట్టే పచ్చి ఆకులను ఆ కుండ నందు వేయవలెను . రెండు మూడు రోజులకు ఒకసారి ఆ కుండ యందలి నీటిని తీసివేసి కొత్తనీటిని పోసి ఆహారం కూడా కొత్తదానిని వేయవలెను . ప్రతి ఏడు రోజులకు ఒకసారి కుండను మార్చవలెను . ఈ జలగలను శరత్కాలం పట్టుకొనుట మంచిది .
జలగలను వైద్యంలో ఎలా ఉపయోగించాలో మీకు వివరిస్తాను.
జలగలచే పోగొట్ట తగిన రోగము కలిగిన వానిని కూర్చుండబెట్టి కాని , పడుకోపెట్టి కాని జలగ పట్టించవలసిన ప్రదేశములో వ్రణము లేనిచో ఆ ప్రదేశంలో ఎండించిన ఆవుపేడ చూర్ణం , మన్ను కలిపి మర్దన చేయవలెను . ఆ తరువాత జలగలను తీసుకుని ఆవాలు , పసుపు కలిపి నూరి కలిపిన నీటిలో ముంచి వేరొక మంచినీటి పాత్రలో ముంచి వాటిని రోగమున్న ప్రదేశములో పట్టించవలెను. ఆ తరువాత ఆ జలగకు మంచి కాటన్ గుడ్డ ముక్కతో ముఖము విడిచి శరీరం అంతయు కప్పవలెను. అప్పుడు ఆ జలగ రోగ స్థానమును పట్టును . అలా పట్టనిచో ఆ రోగస్థానం పైన పాలచుక్క గాని రక్తపుచుక్క గాని వేయుట లేక కత్తితో గీయుట చేసినచో జలగ వెంటనే రోగస్థానమును పట్టును . అప్పుడు కూడా జలగ పట్టనిచో దానిని వదిలి వేరొక జలగ పట్టించవలెను .
జలగ ఎప్పుడూ తన ముఖమును గుర్రపుడెక్క వలే విస్తరించి స్కంధమును పైకెత్తి రోగస్థానమును తగులుకొనునో అప్పుడు అది రక్తమును పీల్చుతుంది అని అర్ధంచేసుకొనవలెను వెంటనే దానిని తడిగుడ్డతో కప్పి మధ్యమధ్యలో తడుపుచుండవలెను . అలా చేస్తున్నచో రక్తం బాగుగా పీల్చును. ఆ పీల్చుటలో ముందుగా దుష్టరక్తమునే పీల్చును .
జలగ రక్తం పీల్చుతూ ఉన్నప్పుడు కొంత సమయం తరువాత పోటు , దురద మొదలగుచున్న అప్పటివరకు అది దుష్టరక్తం పీల్చి ఆ తరువాత మంచిరక్తం పీల్చడం మొదలు అయినది అని అర్థం . ఆ తరువాత వెంటనే జలగను తీసివేయవలెను . రక్తం యొక్క రుచి మరిగి ఆ జలగ రానిచో దాని ముఖము పైన సైన్ధవ లవణము వేసినచో విడిచివేయును .
చెడు రక్తం పీల్చిన జలగను శుద్దిచేయు విధానం గురించి మీకు తెలియచేస్తాను.
పైన చెప్పినట్టు రోగస్థానమును విడిచిన జలగకు శరీరం పైన బియ్యపు పిండిని పూసి ముఖం నందు నూనె, ఉప్పు కలిపి రాసి ఎడమచేతితో తోకను పట్టుకొని కుడిచేతితో ముఖము వరకు ఆవుపాలు పితికినట్లు చేయవలెను . ఈ విధంగా చేస్తూ తాగిన రక్తమును బయటకి కక్కునట్టు చేయవలెను . ఆ తరువాత ఆ జలగను శుభ్రపరచి మంచినీటితో కూడిన పాత్ర యందు ఉంచవలెను. అప్పుడు అది ఉత్సాహముగా సంచరించును. అలా సంచరించకుండా కదలక మొద్దుగా ఉన్నచో చెడురక్తం దాని శరీరం నుంచి పూర్తిగా బయటకి పోలేదు అని గ్రహించి మరలా కక్కించు ప్రయత్నం చేయవలెను . కక్కించాక మరలా కుండ నందు భద్రపరచవలెను.
జలగతో రోగనివారణ క్రియ చేశాక చేయవలసిన విధి గురించి వివరిస్తాను.
జలగ ద్వారా చెడు రక్తం తీసాక ఆ గాయమునకు ఔషదాలు కలిపిన ఆవునెయ్యి పూయవలేను . కొందరికి తేనె కూడా పూయవచ్చు.
పైన చెప్పిన జలగతో చెడు రక్తాన్ని తీయు విధానాన్ని రక్తమోక్షణం అంటారు. ఈ క్రియను రోగి యెక్క బలం, రోగం యొక్క బలాన్ని అంచనా వేసుకొని మాత్రమే అంచనా వేసుకొని చేయవలెను .
సంపూర్ణం
మరింత విలువైన సమాచారం మరియు ఆయుర్వేద ఔషధ సులభ చిట్కాల కొరకు నా గ్రంథములు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్
9885030034
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
నవగ్రహా పురాణం🪐* . *72వ అధ్యాయం*
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *72వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*కుజగ్రహ చరిత్ర - 2*
భూదేవి చిరునవ్వు నవ్వింది. *"నువ్వు ఆ తల్లి వద్దకు వెళ్ళడం కాదు , ఆమే నీ ముందు సాక్షాత్కరించాలి. కరుణనూ , వరాలనూ సముపార్జించుకునే సన్మార్గం అదే ! శరీరాన్ని ఈడ్చుకుంటూ కైలాసానికి శారీరకంగా వెళ్ళడం కాదు , నువ్వు చేయాల్సింది ! నువ్వు చేయాల్సింది మానసిక సాధన. శరీరాన్ని అదుపులో ఉంచి , నియమ నిష్ఠలతో ఇంద్రియాల వ్యాపారాలను నియంత్రించి , ఏకాగ్రతతో , ఏకైక దీక్షతో ఆ పరాశక్తిని ధ్యానిస్తూ తపస్సు చేయి. నీ ఆత్మ భావనా తరంగాలతో ఆ దేవిని ఆహ్వానించు !"* కుజుడు మౌనంగా , ఉద్రేకంతో చూశాడు.
ప్రశాంత వాతావరణం నిత్యవిహారం చేస్తున్న అందమైన అరణ్యప్రాంతంలో కుజుడు తపస్సు ప్రారంభించాడు. నియమం , నిష్ఠ , ఏకాగ్రత , ఏకైక దీక్ష... భూమాత చేసిన సూచనలు కుజుడిలో మారుమ్రోగుతున్నాయి.
కొన్ని రోజులు గడిచాయి. ఇప్పుడు భూదేవి సూచనలు అతనికి వినిపించడంలేదు. *“ఎండిపోయిన ఆకులు గాలికి ఎగురుతూ వచ్చి తపస్సులో ఉన్న కుజుడి మీద తేలికగా వాలుతున్నాయి.
కాలచక్రం తిరుగుతోంది. తిరుగుతూ వర్తమానాన్ని గతంలోకి తోస్తోంది. భవిష్యత్తును వర్తమానంలోకి లాగుతోంది. నిరంతర కాలగమన విన్యాసాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ , ప్రకృతి తన ధర్మాన్ని నిర్వర్తిస్తోంది.
ఇప్పుడు చిగురాకులూ , మొగ్గలూ , పువ్వులూ గాలిలో నాట్యం చేస్తూ , కుజుడి మీదా , చుట్టూ వాలుతున్నాయి. కుజుడికి నీడనిస్తున్న చెట్టు రెమ్మల్లోంచి పిందెలు తొంగిచూస్తున్నాయి.
కాలం తన మంత్ర విద్యను ప్రదర్శిస్తూనే ఉంది. చెట్టు రెమ్మలోంచి తొంగిచూస్తున్న పిందెలు ముదిరి కాయలయ్యాయి.
కైలాసం...
పార్వతీ పరమేశ్వరుడు మానససరోవర తీరంలో ఆహ్లాదకరంగా విహరిస్తున్నారు. ఆదిదంపతులైన ఆ ఇద్దర్ని అనుకరిస్తూ , సరోవరంలో హంసల జంట ఒకదాన్నొకటి ప్రేమగా రాసుకుంటూ జల విహారం చేస్తున్నాయి....
*"స్వామీ..."* పార్వతి నడక ఆపి , అంది.
శివుడు ఆమె వైపు చూశాడు. ఆయన మూడవ కంటి క్రింద అందమైన కనుబొమలు , అందంగా కలుసుకున్నాయి.
*"చూశారా ? మీ పుత్రుడు 'కుజుడు' తపస్సు చేస్తున్నాడు"* అంది పార్వతి..
*"అలాగా ? ఎవరి గురించి దేవి ?"* శివుడు అమాయకంగా అడిగాడు. *“నా గురించే...”*
*"నీ గురించి తపస్సు చేస్తే , చూడాల్సింది నువ్వు నేను కాదు !"* పరమశివుడు చిరునవ్వుతో అన్నాడు.
*"మీ కుమారుడు నా గురించి తపస్సు చేయడం ఏమిటి ?"* పార్వతి చిరునవ్వు నవ్వింది.
పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వాడు. *"నా కళ్ళల్లోకి చూస్తూ , చెప్పు ! నా పుత్రుడు. నీ పుత్రుడు కాడా ? కాలేడా ? కానివ్వవా ?"*
పార్వతి మనోహరంగా నవ్వింది. *"ఎందుకు కాడు ? ఎందుకు కాలేదు ? ఎందుకు కానివ్వను ?"*
*“అయితే నన్ను...”*
*"ఎందుకు అడిగానంటే , నేను రానప్పుడు మీరు కన్న కొడుకు కదా ! ఏమి వరం ఇవ్వమని ఆజ్ఞాపిస్తారో తెలుసుకుందామని అడిగాను !"* పార్వతి నవ్వుతూ అంది.
*“తండ్రి చెప్పడం తల్లిని చిన్నబుచ్చడమే ! తన బిడ్డలకు ఏమివ్వాలో తల్లికి తెలిసినంతగా తండ్రికి తెలీదు. తన బిడ్డలకు అమ్మ అడిగినవన్నీ ఇస్తుంది ; అడగనివి ఎన్నో ఇస్తుంది !"*
పార్వతి ఒక్కసారిగా పరమేశ్వరుడిని తన బాహులతలతో బంధించింది. *"తల్లి తత్వాన్ని ఎంత గొప్పగా చెప్పారు !”* అంది.
*"తల్లి లేని వాణ్ణి కదా ! అందుకే అంత గొప్పగా చెప్పగలిగాను !"* శివుడు నవ్వుతూ అన్నాడు. *“అన్నట్టు 'నేను కన్న' కుజుడిని ఎప్పుడు అనుగ్రహిస్తావు ?”*
*"అది రహస్యం ! అతి రహస్యం !”* పార్వతి నవ్వింది.
వాహ్యాళి ముగించి పార్వతీ పరమశివులు మందిరం వైపు తిరిగారు. సరస్సులో విహరిస్తున్న హంసలు రెండూ వెంటనే నీళ్ళలోంచి ఇవతలకి వచ్చి , వాళ్ళ వెనకనే నడవసాగాయి.
హంసలు చేస్తున్న సవ్వడి విని శివుడు వెనుదిరిగి చూశాడు.
*"పార్వతీ , ఆ హంసలు ఎందుకు నడుస్తున్నాయో తెలుసా ?”*
*"ఊహూ ! నాకు 'హంస హృదయం' తెలీదు !"* పార్వతి నవ్వుతూ అంది.
*“నాకు తెలుసు !”* శివుడు ఆమెనే చూస్తూ అన్నాడు. *“చెప్పనా ?”*
*“చెప్పండి !”* పార్వతి కుతూహలంగా అడిగింది.
*"నీ నడకను చూస్తూ , నీలా నడవడం నేర్చుకోవడానికి !"* శివుడు చిరునవ్వుతో అన్నాడు.
పార్వతి కిందికి వంగి , మానస సరోవరంలోని నీటిని దోసిటీతో తీసుకుని శివుడి మీదికి చల్లింది , చిలిపిగా.
కుజుడి మీద నీడ పరుస్తున్న చెట్టు మీది నుంచి కాయ , పండై , రాలింది. కుజుడు తదేక ధ్యానంలో ఉన్నాడు. ఉన్నట్టుండి ఎవరో తనలో ఏదో స్పందన కలుగజేస్తున్నారు. సున్నితంగా , సుఖకరంగా , చాలా నెమ్మదిగా ఎవరో తనను ధ్యానం నుండి మేల్కొలుపు తున్నారు. ఏదో అవ్యక్తానందాన్నీ , అద్భుత స్పర్శ సుఖాన్నీ కలిగించే మలయమారుతం తన శరీరాన్ని స్పృశిస్తూ ఉల్లాసాన్ని అందిస్తోంది. మధురాతి మధురమైన ఏదో పిలుపు లీలగా తన సర్వస్వానికీ వినిపిస్తోంది. ఏదో మహా సుగంధం తనను చుట్టుముట్టింది.
తదేక ధ్యానముద్రలో నిత్యనిమీలితంగా ఉండిపోయిన కుజుడి నేత్రాలు అసంకల్పితంగా విచ్చుకున్నాయి. కుజుడి శరీరం ఒక్కసారిగా జలదరించింది. ఎదురుగా మెరుపుతీగ ! కాదు... మెరుపుతీగలాంటి మహా సౌందర్యం ! కళ్ళెదుట చిరునవ్వు వెన్నెలలు కురిపిస్తూ... పార్వతి , శివాని , త్రిలోక సుందరి ! త్రిజగన్మోహనమూర్తి ! దుర్గ ! చండిక !
*"అమ్మా...'*
*“ఆ పిలుపు వినిపించే వచ్చాను. ఏం కావాలో కోరుకో !"*
*"అమ్మా !”*
పార్వతి ముఖం చిరునవ్వుతో వికసించింది. *"అమ్మనే ! అడుగు , మంగళా ! ఏం కావాలి ?"*
*'మంగళా !'* అన్న సంబోధన కుజుడిలో ఆలోచనల్ని రేపుతోంది. కుజుడి పెదవులు
కదిలాయి. అప్రయత్నంగా అడిగాడు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
సౌందర్యలహరి🌹* . *శ్లోకం - 73*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
. *శ్లోకం - 73*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*అమూ తే వక్షోజా వమృతరసమాణిక్య కుతుపౌ*
*న సందేహస్పందో నగపతి పతాకే మనసి నః |*
*పిబంతౌ తౌ యస్మా దవిదితవధూసంగరసౌ*
*కుమారా వద్యాపి ద్విరదవదనక్రౌంచదళనౌ ‖*
మాణిక్య కలశముల వంటి అమ్మవారి స్తనద్వయము నుండి స్రవించునది జ్ఞానామృత క్షీరము. ఓ పర్వతరాజపుత్రీ ఈ విషయములో ఎట్టి సందేహము లేదు. ఎందువల్లనంటే నీ స్తన్యమును గ్రోలిన గణపతి (విరదవదన). సుబ్రహ్మణ్యస్వామి (క్రౌంచదళనౌ). వీరిద్దరూ సదా శిశు స్వరూపములు. (కుమారావద్యా). నిరంతర జ్ఞానస్వరూపులు. స్త్రీ సాంగత్య రసిక భావన లేనివారు. (అవిదితవధూ సంగరసికౌ).
అమ్మవారి అనుగ్రహము పొందిన వారికి విషయ వాంఛ, లౌకిక దృష్టి ఉండవు. పరమ వైరాగ్య దృష్టి కలిగియుంటారని, స్త్రీలంతా వారికి తల్లి వలెనే కనబడుతారనీ భావము.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 . *భాగం 83*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *భాగం 83*
బుద్ధుడు అనుభూతి పొందిన బోధిచెట్టు క్రింద కాసేపయినా కూర్చుని ధ్యానం చేయాలనే తపన ఆతడిలో తీవ్రతరం కాసాగింది. కనుక ఏప్రిల్ మొదటి వారంలో ఒక రోజు మధ్యాహ్నం నరేంద్రుడు, తారక్, కాళీ ఎవరికీ తెలియకుండా ఇంటి దొడ్డిదారి గుండా బుద్ధగయకు బయలుదేరారు.
ముగ్గురూ కాషాయాంబరాలు ధరించారు. సన్న్యాసులు ఉంచుకొన్నట్లు చేతిలో పటకారు ఉంచుకొన్నారు. బుద్ధగయకు పోవడానికి మర్నాడు ఉదయం దాకా రైలు లేనందువలన ఆ రాత్రి ఒక దుకాణంలో గడిపారు. నరేంద్రుడు వేకువన మూడు గంటలకల్లా లేచి కిచ్చుడి వండాడు. అది తిని ముగ్గురూ బయలుదేరారు. దారి పొడవునా బుద్ధుని జీవితం గురించే మాట్లాడుకొన్నారు. మూడవ రోజు ఉదయం గయ చేరుకొన్నారు. అక్కడ ఫల్గు నదిలో స్నానం చేసి, పితృ తర్పణాలర్పించారు. అక్కడ నుండి ఎనిమిది మైళ్లు నడిచి సాయంత్రం బుద్ధ గయ చేరారు.
సాయంత్రం సద్దుమణిగాక ముగ్గురూ బోధిచెట్టు క్రింద ధ్యానంలో కూర్చున్నారు. కాసేపటికి నరేంద్రుని ముందు ఒక అసాధారణమైన దివ్యకాంతి కనబడింది. అతడి మనస్సు ప్రశాంతమై, ఆనందంతో నిండిపోయింది. నరేంద్రుడు ఆ ఆనందంలో మునిగిపోయినట్లు కూర్చున్నాడు. బుద్ధుని అద్భుతమైన గుణగణాలు, సాటిలేని కరుణ, మానవత్వం ఉట్టిపడే ఉపదేశాలు, బౌద్ధమత ప్రభావంతో
భారతదేశ చరిత్రలో జరిగిన పరిణామాలు మొదలైనవన్నీ అతడి మనోనేత్రం ముందు భాసించాయి.
అతడి కళ్ల వెంట ఆనందబాష్పాలు స్రవించాయి. ఆ దృశ్యం చెదరిపోగానే అతడు తారక్ ను కౌగిలించుకొని పిల్లవాడిలా విలపించాడు. తారక్, కాళీలు కూడా పరమానందాన్ని చవిచూశారు. మర్నాడు ఉదయం విలపించడానికి కారణం ఏమిటని నరేంద్రుణ్ణి అడిగినప్పుడు, "బుద్ధునితో సంబంధం గల స్థలంలో, ఆయన లేడనే ఆలోచన వచ్చినప్పుడు నా హృదయం వేదనతో తల్ల డిల్లింది. అందుకే విలపించాను" అన్నాడు.
|అక్కడ కాశీపూర్ లో హఠాత్తుగా ఈ ముగ్గురూ కనిపించకుండా పోవడం పెద్ద సంచలనాన్ని సృష్టించింది. అందరూ ఎంతో దిగులు చెందారు. చివరికి వాళ్లు బుద్ధగయకు వెళ్లిన విషయం ఎలాగో తెలిసింది. ఈ సంగతి గురుదేవులతో చెప్పినప్పుడు ఆయన, "అతడు ఎక్కడకు పోగలడు? ఎన్ని రోజులు ఉండి పోతాడు? త్వరలో తిరిగి వస్తాడు. దిగులుపడకండి" అన్నారు. కాసేపటి తరువాత, "మీరు ప్రపంచం నలుమూలలా పయనించి చూడండి. మీరు దేనినీ చూడ లేరు. అక్కడ ఉన్నవన్నీ (తమ దేహాన్ని చూపుతూ) ఇక్కడ ఉన్నాయి"🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
పోతనగారి రూపచిత్రణ !
శు భో ద యం🙏
పోతనగారి రూపచిత్రణ !
శా: తాటంకాచలనంబుతో భుజనటధ్ధమిల్ల బంధంబుతో ,
శాటీముక్త కుచంబుతో , నదృఢ చంచత్కాంచితో ,శీర లా
లాటేపముతో , మనోహర కరా లగ్నోత్తరీయంబుతోఁ ,
గోటీందు ప్రభతో , నురోజభర సంకోచద్వలగ్నంబుతోన్;
భాగవతము- దశమస్కంధము- గజేంద్ర మోక్షము- బమ్మెఱపోతన ;
బమ్మెఱ వారి రూపచిత్రణము బాపూ బొమ్మను బోలియుండును. భాగవతములోని ఆయాఘట్టములలో నతడు జూపిన ప్రతిభ నాన్యతో దర్శనీయము. ప్రకృత పద్యము గజేంద్ర మోక్షములోనిది. భక్తరక్షణా పరాయణుడగు నారాయణుడు.
గజేంద్రుని మొఱవిని వైకుంఠమునుండి సపరివారముగా బయలుదేరినాడు. ఆకాశమార్గమున పరుగు లెత్తు చున్నాడు. చీరచెంగు
నారాయణుని చేతజిక్కి లక్ష్మీదేవియు నతనివెనుక బరుగిడ సాగినది. అపుడామెయవస్థారూపమును పోతన బహురమ్యముగా
చిత్రించినాడు.
తాటంకా చలనంబుతో- తాటంకములంటే కర్ణాభరణాలు అవి అటునిటు ఊగుతున్నాయట.
భుజనటత్ ధమ్మిల్ల బంధంబుతో- ధమ్మిల్లము - అంటే జుట్టుముడి . అది ఊడిపోయి కేశసంపద భుజములపై జీరాడుచు
న్నదట.
శాటీ ముక్త కుచంబుతో- రెవిక ముడివిడింది వక్షోజ సంపద బయటకు కనిపిస్తోందట.
అదృఢ చంచత్కాంచితో-కాంచి - అంటే వడ్డాణం అదికాస్తా వదులై క్రిందికి జారుతున్నదట.
ఉశీర లలాటేపముతో- ఉశీరములు అంటే వట్టివేళ్ళు- చలువ గలగటంకోసం ఫాలభాగంలో
వట్టివేరుల రసం పట్టీలా వేసుకుంటారు. అదికరగిపోయి క్రిందికి జారుతున్నది.
మనోహర కరాలగ్నోత్తరీయంబుతో- మనోహరుడు ఆమెభర్తగారు విష్ణువు ఆయనచేతిలో ఈమె చీరచెంగు
చిక్కుబడినదట.
కోటీందు ప్రభతో- కోటి చంద్రులకాంతితో వెలిగిపోతున్న ముఖమండలముతో నున్నదట.
ఉరోజ భర సంకోచత్ వలగ్నంబుతోన్- పాలిండ్ల బరువుకు ఈమెనడుము నిలుచునా లేదా? యను ననుమానము
నకు తావిచ్చు చున్నదట.
మొత్తంమీద భావమిది; హరితో ఆకాశ వీధిలో పరుగిడు నప్పుడు లక్ష్మీదేవి యాకారమిటులున్నది.
కదలుచున్న కర్ణాభరణములు. కొప్పువిడి భుజములపై తారాడు కేశములు. ముడివిడివిడి రెవిక నుండి వెలికి
గనబడు పాలిండ్లు. క్రిందికి జారుచున్న వడ్డాణము. కరగి క్రిందకు జారు వట్టివేరుల గంధము. మగనిచేత చిక్కు
కొన్న చేలచెరగు. కోటిచంద్ర ప్రభా భాసమానమైన ముఖమండలము. పాలిండ్ల వ్రేగున వణకు నడుము గలిగి
చూపరులకు వింత గొల్పు చున్నదట!
ఇదీ పోతనగారి రూప చిత్రణ! మనో నేత్రాలతో దర్శించి ఆనందాన్ని పొందండి!
స్వస్తి!!🌷🙏🙏🙏🙏👌👌👌🙏🌷🌷🙏🙏🙏🙏🙏🙏
_నవంబరు 10, 2023_*
ॐశుభోదయం, పంచాంగం ॐ
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*_నవంబరు 10, 2023_*
*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*
*దక్షిణాయనం**శరదృతువు*
*ఆశ్వయుజ మాసం**కృష్ణ పక్షం*
తిథి: *ద్వాదశి* ఉ11.21
వారం: *భృగువాసరే*
(శుక్రవారం)
నక్షత్రం: *హస్త* రా11.56
యోగం: *విష్కంభం* సా5.48
కరణం: *తైతుల* ఉ11.21
*గరజి* రా12.05
వర్జ్యం: *ఉ6.55-8.40*
దుర్ముహూర్తము: *ఉ8.21-9.06*
*మ12.07-12.52*
అమృతకాలం: *సా5.23-7.08*
రాహుకాలం: *ఉ10.30-12.00*
యమగండం: *మ3.00-4.30*
సూర్యరాశి: *తుల*
చంద్రరాశి: *కన్య*
సూర్యోదయం: *6.05*
సూర్యాస్తమయం: *5.23
లోకాః సమస్తాః* సుఖినోభవంతు*
🕉🕉 🕉🕉
మధురభాషణం
శ్లోకం:☝️
*దాతృత్వం ప్రియవక్తృత్వం*
*ధీరత్వముచితజ్ఞతా l*
*అభ్యాసేన న లభ్యన్తే*
*చత్వారః సహజా గుణాః ॥*
అన్వయం: _దానకరణం, మధురభాషణం, ధైర్యం, ఉచిత-అనుచితయోః వివేకః ; ఏతే చత్వారః గుణాః అభ్యాసేన న లభ్యన్తే l అపి తు సహజతయా ఏవాఽఽగచ్ఛన్తి ll_
భావం: దానధర్మాలు చేయడం, మధురంగా మాట్లాడడం, ఎటువంటి పరిస్థితులో కూడ ఓపికగా ధైర్యంగా ఉండడం, తప్పు ఒప్పుల గురించి తెలుసుకోవడం ఈ నాలుగు గుణాలు సహజంగా పుట్టుకతోనే వస్తాయి. వీటిని సాధన ద్వారా పొందలేము.
వేద ఆశీర్వచనం.
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5124*
*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - ఆశ్వీయుజ మాసం - కృష్ణ పక్షం - ద్వాదశి - హస్త - భృగు వాసరే* (10.11.2023)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
https://youtu.be/9gYjBZ1NrHo?si=ZYpnDCtz97RGO4H5
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
-----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
ఈ రోజు పంచాంగం 10.11.2023 Friday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస కృష్ణ పక్ష: ద్వాదశి తిధి భృగు వాసర: హస్త నక్షత్రం నిష్కంభ యోగ: తైతుల తదుపరి గరజి కరణం ఇది ఈరోజు పంచాంగం.
ద్వాదశి మధ్యాహ్నం 12:32 వరకు.
హస్త రాత్రి 12:05 వరకు.
సూర్యోదయం : 06:22
సూర్యాస్తమయం : 05:37
వర్జ్యం : ఉదయం 07:04 నుండి 08:48 వరకు .
దుర్ముహూర్తం : పగల 08:37 నుండి 09:22 వరకు తదుపరి మధ్యాహ్నం 12:22 నుండి 01:07 వరకు.
రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు
యమగండం : మద్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
పూజాకార్యక్రమాల సంకల్పము.
**********
*శుభోదయం*
*********
సంధ్యా వందన మరియు
ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము.
పూర్వ పద్ధతి పంచాంగం.
తేదీ. 10.11..2023
శుక్ర వారం (భృగు వాసరే)
**************
గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును.
__________________
శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతాు హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
శరదృతౌ
ఆశ్వయుజ మాసే కృష్ణ పక్షే ద్వాదశ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)
భృగు వాసరే
శుభ నక్షత్రే
శుభ యోగే,
శుభకరణ,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ
శ్రీమాన్_______గోత్రః_____నామధేయః
శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం
సంధ్యాముపాసిష్యే.
సంధ్యా వందనం కొరకు మాత్రమే.
ఇతర పూజలకు
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
శరత్ ఋతౌ ఆశ్వయుజ మాసే కృష్ణ పక్షే ద్వాదశ్యౌపరి త్రయోదశ్యాం,
భృగు వాసరే అని చెప్పుకోవాలి.
ఇతర ఉపయుక్త విషయాలు
సూ.ఉ.6.06
సూ.అ.5.23
శాలివాహనశకం 1945 వ సంవత్సరం.
విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం.
కల్యబ్దాః 5124 వ సంవత్సరం.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం
కృష్ణ పక్షం ద్వాదశి ఉ. 11.21 వరకు.
శుక్ర వారం.
నక్షత్రం హస్త రా.11.59 వరకు.
అమృతం సా. 5.27 ల 7.11 వరకు.
దుర్ముహూర్తం ఉ.8.21 ల 9.06 వరకు.
దుర్ముహూర్తం మ.12.06 ల 12.51 వరకు.
వర్జ్యం ఉ.7.00 ల 8.44 వరకు.
యోగం విష్కంభం సా. 5.52 వరకు.
కరణం తైతుల ఉ.11.21 వరకు.
సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.
రాహు కాలం ఉ. 10.30 ల 12.00 వరకు.
గుళిక కాలం ఉ.7.30 ల 9.00 వరకు.
యమగండ కాలం మ.3.00 ల 4.30 వరకు.
***********
పుణ్యతిధి ఆశ్వయుజ బహుళ త్రయోదశి.
.**********
*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,
(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)
S2,/C92, 6 -3 -1599/92,బి
Sachivalayanagar,
Vanasthalipuram,
Rangareddy Dist, 500 070,
80195 66579.
.**********
*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*
వారి
*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*
*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును*
*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*
*సంప్రదించండి*
ఫోన్(చరవాణి) నెం లను
*9030293127/9959599505
*.**************
ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.
**************
మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.
🙏🙏🙏
వాళ్ళు చదివింది..*
🙋♂️👌✅
*ఈ ప్రపంచంలో లెక్కలు (Mathamatics) రానిది ఎవరికో తెలుసా?*
' *మన అమ్మ'లకి*
*ఎలాగంటే!..*
*ఆకలి అవుతోంది... 2 చపాతీలు పెట్టమంటే..నాలుగు పెడుతుంది.*
*పొద్దున్నే 7 గంటలకు లేపి..పది అయ్యిందిరా అంటూంది.*
*స్కూల్ పరీక్షల్లో నూటికి 30 మార్కులొస్తే..*
*పక్కింటి పిన్ని అడిగితే మావాడికి యాభై పైనే వచ్చాయని చెప్తుంది*
*బయటకు వెళ్ళాలి ఖర్చులకు ..ఓ యాభైరూపాయలు ఇవ్వమంటే..*
*పోపులడబ్బా నుండి వందరూపాయలు తీసి ఇస్తుంది.*
*దొంగచాటుగా సెంకడ్ షోకి వెళ్ళి రాత్రి ఒంటిగంటకొచ్చి పడుకుంటే...*
*పొద్దున్నే నాన్నకి తెలిసి కేకలేస్తే రాత్రి పదింటికే పడుకున్నాడని కవర్ చేస్తుంది.*
*అమ్మకి నిజంగా లెక్కలు తెలియవు.. ఒక్క ప్రేమ తప్ప!*
*ఎందుకంటే!..*
*వాళ్ళు చదివింది..*
*B'Comలో Physics కాదు..*
*వాళ్ళు చదివింది..*
*జీవనం Life లో Ethics.*
❤️💕❤️💕🙋♂️