28, నవంబర్ 2023, మంగళవారం

 *_ॐ卐 -|¦¦| సుభాషితమ్ |¦¦|- ॐ卐_*

𝕝𝕝 శ్లో 𝕝𝕝 

*ఐశ్వర్యేషు సమస్తేషు తృప్తిరేకా విశిష్యతే।*

*తృప్త్యా చైవ మనశ్శాంతిః కైవల్యమపి సాధ్యతే॥*

         (సుభాషితరత్నకోశః)



𝕝𝕝తా𝕝𝕝 *సంపదలెన్ని ఉన్ననూ "తృప్తి లేనిదే అవన్నీ నిరర్థకాలే! తృప్తియే గొప్ప సంపదయని చెప్పబడుతున్నది. తృప్తివల్ల మనశ్శాంతి లభించును." తద్వారా సాధనతో మోక్షాన్ని కూడా పొందుట సాధ్యమే...

కార్ యానేన గచ్ఛేమ
హస్తేన మతదానం
కమలచిహ్నాయ దద్యామ

తెలంగాణామాతరం కమలైః పూజయేమ

కారులో పోదాం
చెయ్యితో కమలం గుర్తుకు 
ఓటు వేద్దాం

తెలంగాణ తల్లిని కమలాలతో పూజిద్దాం

Panchaag


 

 *విత్తనం తినాలని*

                 *చీమలు చూస్తాయ్*.. 

                *మొలకలు తినాలని*

                 *పక్షులు చూస్తాయ్*..

           

                 *మొక్కని తినాలని*

                *పశువులు చూస్తాయ్*


                 *అన్ని తప్పించుకుని*

             *ఆ విత్తనం వృక్షమైనపుడు*..


            *చీమలు, పక్షులు, పశువులు*..

         *ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్*....


            *జీవితం కూడా అంతే TIME*

          *వచ్చే వరకు వేచివుండాల్సిందే*

          *దానికి కావాల్సింది ఓపిక మాత్రమే*.....        


               *లైఫ్ లో వదిలి వెళ్ళిన*

           *వాళ్ళ గురించి ఆలోచించకు*..


              *జీవితంలో ఉన్న వాళ్ళు*

              *శాశ్వతం అని భావించకు*..


           *ఎవరో వచ్చి నీ బాధను అర్థం*

           *చేసుకుంటారని ఊహించకు*...


              *నీకు నీవే ధైర్యం కావాలి*.....

          *నీకు నువ్వే తోడుగా నిలబడాలి*...


                  *లోకులు కాకులు,*

                 *మనిషిని చూడరు*,

              *మనస్సును చూడరు,*

              *వ్యక్తిత్వాన్ని చూడరు.*


                     *కనిపించింది,*

            *వినిపించింది నమ్మేస్తారు*,

                 *మాట అనేస్తారు,*


                 *ఒక్కోసారి మన కళ్ళే*

              *మనల్ని మోసం చేస్తాయి.*


           *మరొకసారి చెప్పుడు మాటలు*

                        *జీవితాలను*

                  *తలకిందులు చేస్తాయి*


             *అబద్దాలతో, మోసాలతో*

                   *కీర్తి, ప్రతిష్టలను*

         *ఎంత గొప్పగా నిర్మించుకొన్నా*..

          *అవి కుప్పకూలి పోవడానికి*

               *ఒక్క "నిజం"చాలు*.

             *అందుకే కష్టమైనా సరే*

          *నీతిగా బ్రతకడమే మనిషికి*

                  *ఉత్తమ మార్గం.*

         

                *ఒక చిన్న మొక్కనాటి*

      *ప్రతిరోజూ వచ్చి కాయకాసిందా అని*      

                   *చూడకూడదు.*


             *ఎందుకంటే అది పెరగాలి*

                *మొక్క వృక్షం కావాలి*

          *పుష్పించాలి, పిందెలు రావాలి*

         *అవి కాయలై , పండితే తినగలం.*


              *అలాగే నేను ఇది కావాలి*

              *అనే కోరిక కూడా మొలకై*

       *వృక్షమై ఫలవంతం ఔతుందని తెలిసి*    

         *మసలుకోండి*


               *జీవితంలో కష్టము,*

             *కన్నీళ్ళు, సంతోషము,*

        *బాధ ఏవి శాశ్వతంగా ఉండవు*,


     *కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు.*

       *ఆనందం, ఆవేదన కూడా అంతే.*


              *నవ్వులూ, కన్నీళ్ళూ*

              *కలగలసినదే జీవితం*


             *కష్టమూ శాశ్వతం కాదు,*

       *సంతోషమూ శాశ్వతమూ కాదు.*


                   

    


                      *ఓడిపోతే*

            *గెలవడం నేర్చుకోవాలి*,


                     *మోసపోతే*

       *జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి*


                  *చెడిపోతే ఎలా*

           *బాగుపడలో నేర్చుకోవాలి,*


         *గెలుపును ఎలా పట్టుకోవాలో*

                *తెలిసిన వాడికంటే*

                   *ఓటమిని ఎలా*

          *తట్టుకోవాలో తెలిసిన వారే*

               *గొప్ప వారు నేస్తమా* !


              *దెబ్బలు తిన్న రాయి*

            *విగ్రహంగా మారుతుంది*


              *కానీ దెబ్బలు కొట్టిన*

             *సుత్తి మాత్రం ఎప్పటికీ*

          *సుత్తిగానే మిగిలిపోతుంది*....


          *ఎదురు దెబ్బలు తిన్నవాడు*,

         *నొప్పి విలువ తెలిసిన వాడు*

          *మహనీయుడు అవుతాడు*...


       *ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు*

    *ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు*...

    

         

  


                 *డబ్బుతో ఏమైనా*

           *కొనగలమనుకుంటున్నారా*

             *అయితే కొనలేనివి ఇవిగో*


            *మంచం పరుపు కొనవచ్చు*

                    *కానీ నిద్ర కాదు*


                 *గడియారం కొనవచ్చు*

                    *కానీ కాలం కాదు*


                  *మందులు కొనవచ్చు*

                   *కానీ ఆరోగ్యం కాదు*


                  *భవంతులు కొనవచ్చు* 

                   *కానీ ఆత్మేయిత కాదు*


                   *పుస్తకాలు కొనవచ్చు*

                      *కానీ జ్ఞానం కాదు*


          *పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు*

                     *కానీ జీర్ణశక్తిని కాదు*

                    

      


        *ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే*

      *అందరి కన్నా ముందు మేకలే జ్ఞానులు*

                          *కావాలి,*


       *స్నానాలతోనే పాపాలు పోతే ముందు*

           *చేపలే పాప విముక్తులు కావాలి,*


           *తలక్రిందులుగా తపస్సు చేస్తేనే*

          *పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు*

             *గబ్బిలాలకే ఆ వరం దక్కాలి,**ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది*

  *నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ*

       *పరుగులు పెడితే ప్రయోజనమే లేదు*,


             *నీలో లేనిది బయటేమీ లేదు* 

          *బయటఉన్నదంతా నీలోనూ ఉంది*


        *తెలిసి మసులుకో  --  కలిసి జీవించు.....*

  🙏


 

 


 https://youtube.com/shorts/gU6MY1YgD3o?si=boUMV8V8Arh7Rj19


 https://youtube.com/shorts/sg-IZumSWws?si=jn9c5aKDxc1JQ3U2


 *జైశ్రీరామ్*


                              15-5-2020

                              అభ్యాసం-13


                             *సుభాషితం*


"కర్తా కారయితా శ్ఛైవ

  ప్రేరకా శ్ఛనుమోదకః |

  పుణ్యకార్యే పాపకార్యే

  చత్వార స్సమభాగినః"||


                            *భావం*


చేసేవాడు, చేయించేవాడు, ప్రేరణ ఇచ్చేవాడు, చేసిన కార్యాన్ని అమోదించేవాడు  ఈ నల్గురు కూడా పుణ్య పాప కార్యాలలో సమమైన భాగస్వాములు అవుతారు.

       మనం చెయ్యటంలేదుకదా అని స్త్రీలపై అఘాయిత్యాలు, గోహత్యలు, దేవాలయాల విధ్వంసం, ధార్మిక గ్రంధాలు అవమానం, స్వామీజీలు-పూజారులపై హత్యలు మన కళ్ళముందే ఇన్ని జరుగుతున్నా మనమంతా చూసీచూడనట్లు, వినీవిననట్లు ఉంటున్నాం,కాని దురదృష్టం ఏంటంటే ఆ పాపాలన్నింటిలో మనకుకూడా భాగస్వామ్యం ఉంటుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేక పోతున్నాం. 


                       *అమృతవచనం*


 *బ్రహ్మర్షి*వసిష్ఠులు* వారు *దశరధ* *మహారాజుతో* విశ్వామిత్రుడు యజ్జ్న రక్ఛణార్దం రాముని పంపమని అడిగినప్పుడు, రాముని పట్లగల ప్రేమ వాత్సల్యం తో నిరాకరిస్తూ ఇదితప్ప వేరే ఏదైనా కోరుకోమన్నప్పుడు ఇలా అన్నారు:

       రాజా ! ఇక్ష్వాకువంశంలో పుట్టావు.ధర్మమూర్తివని,సత్యవాదివని ముల్లోకాలలో కీర్తి సంపాదించావు.ఇంతటివాడివి ఆడినమాట తప్పుతావా ! ఇలా చేస్తాను అని ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలి.ఇచ్చినమాట నిలబెట్టుకోపోతే దేవతల ప్రీతికోసం చేసిన యజ్జ్నయాగాదులవలన వచ్చిన పుణ్యం,ప్రజల సుఖంకోసం త్రవ్వించిన చెరువులు,నూతులు మొదలైన పుణ్యకార్యాలవల్ల లభించిన పుణ్యం అంతా పోతుంది.

      విశ్వామిత్రుడు నీవద్దకు నిస్సహాయుడై రాలేదు.తలచుకుంటే ఆ రాక్షసులను తానే స్వయంగా సంహరించగలడు.ఆ మహాత్ముడు నీ కుమారులకు మేలుచెయ్యాలనే కోరికతో వారిని తనతో పంపమంటున్నాడు.వేరే ఆలోచన లేకుండా రాముణ్ణి ఇతడివెంట పంపు.నువ్వు,నీ సైన్యం,నీ రాజప్రాసాదం రాముడికి రక్ఛణ అనుకుంటున్నావేమో, అది ఉత్తి భ్రమ.రాముడికి ఈ *కౌశికుడి* రక్ఛణను మించిన రక్ఛణ వేరొకటి లేదు.

      అప్పుడు దశరధుడు వశిష్ఠులవారి మాటలమీద పూర్తి విశ్వాసం ఉంచి తానే స్వయంగా రామలక్ష్మణులను సిద్దపరచి విశ్వామిత్ర మహర్షి కూడా సంతోషంగా అడవులకు పంపుతాడు.

       పూర్వకాలంలో మహారాజులు, చక్రవర్తులు కులగురువుల, రాజగురువుల మాటలను విని శిరోధార్యంగా స్వీకరించేవారు.

       అప్పటికి ఇప్పటికి పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.ఇప్పటి పరిపాలకులు ఆశ్రమ పీఠాధిపతులను, మఠాధిపతులను,స్వామీజీలను కనీసం  గౌరవించటం మాని విమర్శిస్తూ వారికి  తగిన రక్షణకూడా కల్పించలేకపోతున్నారు.కలియుగ ప్రభావమో ఏమో !


                         శ్రీవేంకటేశ్వర్లు వబిలిశెట్టి


.

 మనలో చాలామంది కి తెలియని ఒక మంచి పురాణ గాధ ..మీకోసం..


చాలా  మంచి పోస్టు  . అందరూ చదవండి .


ఊర్మిళాదేవి కోరుకున్న వింత వరం

రావణసంహారం జరిగిపోయింది. రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగవైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒకరోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి.

'14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేనిమనిషే ఇంద్రజిత్తుని చంపగలడు. లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే... ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు,' అని ఎవరో గుర్తుచేశారు.

ఆ మాటలు విన్న రాములవారికి ఒక అనుమానం వచ్చింది. ''14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు.

నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిదని తెలుసు. కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు,' అని అడిగారు.

''మనం వనవాసం చేస్తున్నన్నాళ్లూ, నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడిని,'' అని జవాబిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి. కానీ సరదాగా ఆ ఆహారపు పొట్లాలన్నీ ఓసారి లెక్కపెడదామని అనుకున్నారట. దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు. కానీ లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది. ''లక్ష్మణా! ఓ ఏడు రోజులపాటు ఆహారంగానీ ఆరగించావా ఏం!'' అని పరిహాసంగా అడిగారట రాములవారు.

''అన్నయ్యా! మొదటి సందర్భంలో, తండ్రిగారి మరణవార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోనేలేదు. రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు. మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు. నేను ఇంద్రుజిత్తు సంధించిన బాణానికి మూర్ఛిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు. మర్నాడు ఇంద్రుజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు. ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్యాపాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు. మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది. ఇలా ఏడు సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు,'' అని బదులిచ్చాడు లక్ష్మణుడు.

లక్ష్మణుడి నిబద్ధతకు రాములవారి మనసు కరిగిపోయిందని వేరే చెప్పాలా. అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు. ''తల్లీ! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతోపాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీసురాలివై ఉండు!'' అన్నారట రాములవారు.

రాములవారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్లు చెమ్మగిల్లాయి. కానీ ''ప్రభూ! నాకు నీ పాదపద్మాల దగ్గర చోటుకంటే వేరే వరమేదీ వద్దు. ప్రతిరోజూ నీ పాదాల చెంతకి చేరుకుని, నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు,'' అని వేడుకుందట ఊర్మిళ.

''కలియుగంలో పూరీక్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు,'' అంటూ వరాన్ని అందించారట. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారుచేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు. పూరీలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే! ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది.

పిల్లాడి రుద్రయ్య

 *** ఆలోచనాలోచనాలు *** తెలుగు నీతి పద్య రత్న కదంబం ***                   *** 1* ఉ. మాటలచేత దేవతలు మన్నన జేసి వరంబు లిత్తు;రా/ మాటలచేత భూపతులు మన్నన జేసి ధనంబు లిత్తు; రా/ మాటలచేత మానినులు మన్ననజేసి మనంబు లిత్తు, రా/ మాటలు నేర్వకున్న యవమానము,న్యూనము, మానభంగమున్.( చాటుపద్యము)                   2* ఉ. కోరికతో ధనాఢ్యుఁడని కుత్సితు నల్పుని దుష్టచిత్తునిన్/ జేరినవార లీప్సితముఁ జెంది సుఖింపరు, హానిఁగాంతు రా/ చారు ఫణాగ్రభాగ విలసన్మణిరాజము గల్గి వెల్గినన్/ గ్రూర భుజంగమున్ గవయఁ గూడెనె శ్రీకర రాజశేఖరా!       (రాజశేఖర శతకము, సత్యవోలు సుందర కవి)          3* శా. సత్యం బెప్పుడు దప్పడేనియు, దురాచారుండు గాడేని, యౌ/ చిత్యం బేమరడేని , దుర్జనుల గోష్ఠింబొందడే, భక్తి సాం/ గత్యం బాదటఁ బాయడేని, మదనగ్రస్తుండు గాడేని,నీ/ భృత్యుండాతడు మూడులోకములలోఁ బెంపొందు సర్వేశ్వరా! (సర్వేశ్వర శతకం, యథావాక్కుల అన్నమయ్య)                    4* శా. గాజుంబూస యనర్ఘ రత్నమగునా? కాకంబు రాయంచయౌ/ నా? జోరీగ మధువ్రతేంద్ర మగునా? నట్టెన్ము పంచాస్యమౌ/ నా? జిల్లేడు సురావనీజమగునా? నానా దిగంతంబులన్/ రాజౌనా ఘనలోభి దుర్జనుడు? భర్గా! పార్వతీ వల్లభా! ( శ్రీ భర్గ శతకం, కూచిమంచి తి మ్మకవి)                                5* సీ. సాధుసజ్జనులతో జగడమాడినఁ గీడు, కవులతో వైరంబు గాంచఁగీడు.                          పరమదీనులఁ జిక్కఁబట్టి కొట్టినఁ గీడు, బిచ్చగాండ్రను దుఃఖపెట్టఁ గీడు.                                   నిరుపేదలను జూచి నిందఁ జేసినఁ గీడు,పుణ్యవంతులఁ దిట్టఁబొసగుఁ గీడు.                సద్భక్తులను దిరస్కారమాడినఁ గీడు, గురుని ద్రవ్యము దోఁచుకొనినఁ గీడు.               తే.గీ. దుష్టకార్యములొనరించు దుర్జనులకు/ ఘనతరంబైన నరకంబు గట్టిముల్లె/ భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర! ( నరసింహ శతకం, కాకుస్థం శేషప్ప కవి)                                      6* శా. స్నానంబుల్ నదులందుఁ జేయుట, గజస్నానంబు చందంబగున్/ మౌనంబొప్ప జపించు వేద మటవీ మధ్యంబులో నేడ్పగున్/ నానహోమములెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యై చను/ న్నీ నామోక్తియు, నీ పదాబ్జరతియున్ లేకున్న నారాయణా! ( నారాయణ శతకము, బమ్మెర పోతన)      7* కం. ఆచార్యున కెదిరింపకు/ ప్రోచినదొర నింద సేయఁబోకుము కార్యా/ లోచనము లొంటిఁ జేయకు/ మాచారము విడువఁ బోకుమయ్య కుమారా! (కుమార శతకము, పక్కి అప్పల నర్సయ్య)                              8* కం. ఉడుముండదె నూఱేండ్లునుఁ/ బడియుండదె పేర్మి పదినూఱేండ్లున్/ మడువునఁ గొక్కెర యుండదె/ కడునిలఁ బురుషార్థపరుడు గావలె సుమతీ! ( బద్దెన కవి‌, సుమతీ శతకము)               9* ఆ.వె. అనగ ననగ రాగమతిశయిల్లుచునుండు/ తినగ తినగ వేము తియ్యనుండు/ సాధనమున పనులు సమకూరు ధరలోన/ విశ్వదాభిరామ వినురవేమ! ( వేమన శతకం,యోగి వేమన)            10* సత్ప్రవర్తనంబు, సౌఖ్యంబు, మర్యాద/ మంచివారి పొందు మనకు నిచ్చు/ కలుషమతుల పొందు కలహాలు గొనితెచ్చు/ లలిత సుగుణజాల! తెలుగు బాల! (తెలుగు బాల శతకం, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి)                   11* నల్లనిదని విడువజెల్లునె కస్తూరి/ తెల్లనిదని దాల్తె రెల్లుపూవు/ వన్నెలోన నేమి వైభోగమున్నది/ విలువ కట్టి చూడ తెలుగు బిడ్డా! ( తెలుగు పూలు, నార్ల చిరంజీవి)                      12* నిలిచి నీళ్ళు త్రాగ నీరుకారు బ్రతుకు/ పరుగులెత్తవోయి పాలు త్రాగ/ పరుగునుండె పుట్టె నరుని నాగరికత/ వాస్తవమ్ము నార్లవారి మాట! ( నార్ల వేంకటేశ్వర రావు)                                      "" ఆనో భద్రాః క్రతవోయన్తు విశ్వతః""-- ఋగ్వేదం.          " అన్ని వైపుల నుండి మనకు ఉదాత్త భావనలు లభించుగాక!"                       (Let noble thoughts come from every side.).                                        తేది 28--11--2023, మంగళవారం, శుభోదయం.

 *విధి విసిరే చివరి అస్త్రం "ముసలితనం"*


వృద్ధాప్యపు బందిలదొడ్డిలో నువ్వు  ఒంటరివి.

వృద్ధోపనిషత్ లోని  ప్రతీ పేజీ 'మసకే', సాయం తక్కువ. సలహాలు ఎక్కువ. మనిషి ఏడో ఋతువే "వృద్ధాప్యం".

కాలధర్మంలో దేహధర్మమే "వృధ్ధాప్యం".

మంచం మీద వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. ఈ లోకంలో పుట్టిన ప్రతీవాడు"వృద్ధోపనిషత్"

లో భాగస్వామి కాక తప్పదు. జీవితం భళ్లున తెల్లవారుతుంది. మెల్లగా చీకటి పడుతుంది. వృద్ధుడికి వెన్నుపై కళ్ళుంటాయన్న ఓ నానుడి 

వుంది. అంటే వృద్ధాప్యంలో వెనుక చూపే తప్ప ముందు చూపు వుండదు. జీవితంలో మనం ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. మన కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక అయితే వృద్ధాప్యంలో  దాన్నెవరూ గుర్తించరు. అసలు పట్టించుకోరు.‌ ఓ సారి సీనియర్ సిటిజన్ బడిలోకి అడుగుపెడితే సమాజం మన గురించి పట్టించుకోదు. పాత వస్తువులా ఓ పక్కన పడేస్తుంది. "ఆరోజుల్లో నేను" అంటూ గత వైభవ చర్విత చర్వణం తప్ప భవిష్యత్ ఆలోచన వుండదు. కాళ్ళు, కీళ్ళు, ఒళ్ళు సడలి, కదల్లేక, మెదల్లేక, దేహాన్ని వదల్లేక, ఏమీ చేయలేక, వృద్ధులు పడే మనోవ్యధ అంతా ఇంతా కాదు.‌

వృద్ధాప్యం అనేసరికి అదేదో శాపంగా భావిస్తుంటారు జనం. నిజానికి వృద్ధాప్యం శాపమో

పాపమో కాదు. అది ప్రకృతి పరమధర్మం. వృద్ధాప్యం రాగానే బయటివాళ్ళు సరే కుటుంబ సభ్యులు‌ కూడా చులకనగాచూస్తారు. నిన్న మొన్నటిదాకా తలొంచిన వానపాములు సైతం 

తలెగరేసి, నిలదీస్తాయి. లెక్కలు అడగటం మొదలెడతాయి.

"ఏమండీ / నాన్నగారూ." అంటూ విధేయంగా వుండే  భార్యాపిల్లలు కూడా ధిక్కరించడం మొదలు పెడతారు. వాళ్ళేదో పుడింగులన్నట్లు లేనిపోని సలహాలు, సూచనలిస్తుంటారు. ఏంమాట్లాడినా, యేం చేసినా వాళ్ళకు నచ్చదు సరికదా 'చాదస్తం' అంటూ కరివేపాకులా తీసిపారేస్తారు. లోకువగా చూస్తారు. మధ్యతరగతి కుటుంబం అయితే, మనం సంపాదించిన డబ్బు ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా? లేక చూసీ చూడనట్టు మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో మన పక్క గదిలో మనవాళ్ళే చర్చిస్తూ ఉంటారు.

అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్క గదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది. ఆరాత్రి నిద్ర కరువవుతుంది.

చివరి మజిలీ !!

మనిషి జీవన ప్రయాణంలో చివరి మజిలీ వృద్ధాప్యం. మనం కాదనుకున్నా కూడా కోరి వస్తుంది వృధ్ధాప్యం. మనిషి జీవితం ఋతువులతో ముడిపడి వుంటుంది. వసంత ఋతువుతో మొదలయ్యే కాలం శిశిరంతో ముగుస్తుంది. వసంతకాలం మన పుట్టుక అనుకుంటే, శిశిరం వృద్ధాప్యం. వసంతంలో ప్రకృతి ఆకుపచ్చగా, రంగురంగుల పూలతో మురిపిస్తుంది.మనసు ఉల్లాసభరితమవుతుంది. ఇక శిశిరానికొచ్చేసరికి ఆకులు పండి, ఎండి, రాలి, చెట్లు మోడులవుతాయి. అలాగే వృద్ధాప్యంలో మనిషి దేహం కూడా ఒడలి, ఎండిన మోడవుతుంది. అయితే వృద్ధాప్య దశకు చేరుకున్నారంటే జీవితంలో వాళ్ళు ఎన్నెన్ని చూసివుంటారు. ఎంత అనుభవంగడించి వుంటారో!ఒక్క సారి ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకే వృద్ధుల్ని భారంగా కాకుండా గౌరవంగా చూడాలి. వారి అనుభవాన్ని యువతరం చూపుడువేలుగా తీసుకొని ముందుకు నడవాలి.

అప్పుడు వాళ్ళ భవిష్యత్తు మహత్తరంగా వుంటుంది. కానీ దురదృష్టంయేమంటే, వృద్ధుల్ని గౌరవించడం అటుంచి  అసలు లెక్కేచేయరు. కొందరైతే ముసలాళ్ళను భరించలేక  వృద్ధాశ్రమాల పాలు చేస్తారు. ఇవాళ మనం చేసిందే రేపు మన పిల్లలు కూడా చేస్తారన్న సోయి ఏమాత్రం వుండదు.

ఏతావాతా వృద్ధాప్యం శాపంగా మారుతుంది. యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టేస్తాం. మధ్య వయసులో సంపాదించింది ఖర్చుపెట్టి పిల్లల్ని విదేశాలకు పంపుతాం. నా కొడుకు అమెరికాలోనో, ఇంకేదో దేశంలో వున్నాడనో, కూతురు ఆస్ట్రేలియా లోనో ఇంకేదో దేశంలో ఉన్నదనో గర్వంగా చెప్తూ ఫాల్స్ ప్రిస్టేజి ఫీలవుతాం. అంతా బాగానే వుంటుంది. పిల్లలూ విదేశాల్లో సెటిలైపోయి బాగుంటారు. మన వృద్ధాప్యంలో మాత్రం వాళ్ళు కనీసం చూడటానికి

కూడా రారు. అప్పుడప్పుడు సీజనల్ గా వచ్చే సెల్ ఫోన్ కాల్స్ తోనే సరిపెట్టుకోవాలి. తృప్తి పడాలి. కొడుకో, కూతురో, మనవడో గుర్తొచ్చి, వాళ్ళతో మాట్లాడాలని ఫోన్ చేస్తే 'సారీ.! బిజీ.' అంటూ సమాధాన మొస్తుంది.

పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో, వృద్ధాప్యంలో తిరిగి అదే పరిస్థితి సంభవిస్తుంది. అయితే ఒకటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి కన్నతల్లి

ఉంటుంది. వృద్ధాప్యంలో ఎవరూ వుండరు. అదృష్టం

బాగుంటే అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురు తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ వుండొచ్చు.

అనాథాశ్రమంలో అయితే  వాళ్ళు కూడా ఉండరు.

అయితే ఇది అందరికీ జరుగుతుందని కాదు.

కొందరుంటారు అదృష్టవంతులు తల్లిదండ్రుల్ని  ప్రేమించే పిల్లలూ వుంటారు. అలాంటివాళ్ళు తల్లిదండ్రులు వృద్ధులైనా నెత్తిన పెట్టుకొని ఎంతో ప్రేమతో చూసుకుంటారు. బతుకంతా బుద్ధిబలం మీద ఆధారపడ్డ వారికి ముసలితనం కన్నా పెద్ద శిక్ష వుండదేమో? బాగా

బతికిన మహామహులే ముసలితనం రాగానే దిగజారి హీనమై పోవడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి అవస్థను

తలుచుకుంటేనే భయమేస్తుంది. భగవాన్.!

ఇలాంటి దురవస్థ ఎవరికీ రాకూడదు. ఇందులో నుంచి అందర్నీ తప్పించు తండ్రీ.

వృద్ధాప్యం శాపం కాదు.

ఓ వరం. 

ఏకాంతంలో సంగీతాన్ని వింటూ కాలక్షేపం చెయ్యొచ్చు.

ఓపిక, సదుపాయముంటే పెరటి మొక్కల్ని పరిరక్షిస్తూ కాలం గడపోచ్చు.

చిన్న పిల్లలుంటే కొద్ది సేపు వారికి ఇంటరెస్టు ఉన్న టాపిక్స్ కబుర్లు చెప్పుకోవచ్చు, ఆడుకోవచ్చు.

ఏం చేసినా అఫెక్షన్ బ్యాంక్ లో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనం మానసికంగా ఇలా ప్రిపేర్ అవుతామో? మన 

వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాలపాటు వాయిదా వెయ్యొచ్చు.

సో… ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ అయిన వారు,

భవిష్యత్తులో సీనియర్ సిటిజన్స్ కాబోయేవారు జీవితాల మీద ఓ లుక్కేసి వుంచుకోండి.!🙏

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



సత్యవ్రతుడికి తనమీద తనకే అసహ్యంవేసింది. కన్నతండ్రి శపించాడు. రాజ్యం నుంచి

వెళ్ళగొట్టాడు. గురువు శపించాడు. పిశాచత్వం సంక్రమించింది. ఛీ! ఎందుకొచ్చిన బతుకు ! మరణించడమే

మేలనుకున్నాడు. త్వరత్వరగా ఎండుకట్టెలు ఏరి తెచ్చి చితిని పేర్చుకున్నాడు. స్నానంచేసివచ్చి చండికాదేవిని

మనసారా ఒక్కసారి స్మరించి అగ్నిలో ప్రవేశించబోయాడు. జగన్మాత - కరుణామయి - ప్రత్యక్షమయ్యింది.

ఆగు ఆగు అంది.

హే సత్పురుష ! ఏమిటి నువ్వు చేస్తున్న పని. ఆత్మహత్య మహాపాపమని ఎరగవా ? నీ

నిషాదత్వం పిశాచరూపం ఈ క్షణంలోనే తొలగిపోతాయి. తపోవృద్ధుడైన నీ తండ్రి వచ్చి స్వయంగా నీకు

పట్టాభిషేకం జరిపిస్తాడు. రేపే నిన్ను రాజధానికి తీసుకువెళ్ళడానికి మంత్రులూ సామంతులూ వస్తారు.

ధర్మబద్ధంగా రాజ్యం పరిపాలించు. మీ తండ్రి తపస్సులు ఫలిస్తాయి. కామాన్ని జయించి బ్రహ్మలోకం

పొందుతాడు.

వరాలు ఇచ్చి జగదీశ్వరి అదృశ్యమయ్యింది. మరణ ప్రయత్నం విరమించి త్రిశంకుడు ఆశ్రమానికి

వచ్చాడు. నారదుడు అయోధ్యకు వెళ్ళి ఈ జరిగిన వృత్తాంతాన్ని మంత్రి సామంతులకు తెలియపరిచాడు.

అరుణ మహారాజు తపస్సుచేసుకొంటున్న చోటుకి వెళ్ళి అంతా వివరించాడు. తన కుమారుడు అగ్ని

ప్రవేశానికి సిద్ధమయ్యాడన్నమాట వినడంతోనే అరుణుడు విలవిలలాడాడు. నారదుడితో కలిపి రాజధానికి

తిరిగివచ్చాడు. మంత్రులను సమావేశపరిచిసత్యవ్రతుడికి తాను దేశబహిష్కరణ విధించండం

మొదలుకొని అతడి అగ్నిప్రవేశమూ అమ్మవారి ఆశీర్వాదమూ వరకు అన్నీ వివరించి, మీరంతా త్వరగా

వెళ్ళి సత్యవ్రతుడిని సగౌరవంగా, నామాటగా ఆహ్వానించి తీసుకురండి, పట్టాభిషేకం జరిపించి నేను

మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోతాను అన్నాడు.

 రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణకల్పవల్లికా


రాముడు షడ్వికార జయరాముడు సాధుజనావన వ్రతో


ద్దాముడు రాముడే పరమదైవము మాకని మీ యడుంగు గెం


దామరలే భజించెదను భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!


భావం: దయకు సముద్రం వంటివాడవైనవాడు దశరథరాముడు. అందరినీ సంతోషపెట్టేవాడు. చేసిన పాపాలను తొలగించేవాడు. కల్పవృక్షపు తీగలే తోటగా కలిగి, శుభప్రదమైన లక్షణాలను ప్రసాదించేవాడు. జననమరణాల వంటి ఆరు వికారాలను జయించేవాడు. మంచివారిని రక్షించడమే దీక్షగా కలవాడు. దయ అనే గుణం కలిగినవాడు. ఇన్ని లక్షణాలతో ప్రకాశిస్తున్న భద్రాద్రిరామా! నీ పాదాలను కొలుచుకుంటాను.


ప్రతిపదార్థం: రాముడు అంటే ఆనందం కలిగించేవాడు; ఘోర అంటే భయంకరమైన; పాతక అంటే పాపాలను; విరాముడు అంటే పోగొట్టేవాడు; సత్ + గుణ అంటే మంచిగుణాలు అనెడి; కల్పవల్లికా అంటే కల్పవృక్షపుతీగయే; ఆరాముడు అంటే తోట అయినవాడు; షట్ + వికార అంటే జననమరణాలు మొదలైన ఆరు వికారాలను; జయ అంటే తెలియచేయడం చేత; రాముడు అంటే మనసు తెలిసినవాడు; సాధుజన అంటే మంచివారిని; ఆవన అంటే రక్షించటం అనే; వ్రత అంటే నియమం చేత; ఉద్దాముడు అంటే గొప్పవాడైన; శ్రీరాముడే అంటేఇక్ష్వాకు వంశంలో పుట్టిన శ్రీరామచంద్రుడే; మాకు అంటే మా అందరికీ; పరమ దైవము అంటే ప్రధానమైన దేవుడు అని; మీ అంటే మీ యొక్క; అడుగు అంటే పాదాలు అనెడి; కెంపు + తామరలను అంటే ఎర్రతామరలను; ఏను అంటే నేను; భజించెదను అంటే పూజిస్తాను; దాశరథీ అంటే దశరథుని కుమారుడైన రామా; కరుణ అంటే దయకు; పయోనిధీ అంటే సముద్రుని వంటివాడా!

అనిభావం!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *90వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శుక్రగ్రహా చరిత్ర - 2*


ఆ రాత్రికే కుబేరుడి మీద ఉశనుడు ప్రయోగించిన యోగ ప్రభావం నశించింది. అతీంద్రియ శక్తితో తనను ఉశనుడు మోసం చేసి , నిలువు దోపిడీ చేశాడని కుబేరుడు తెలుసుకున్నాడు. విశ్వ సంపన్నుడైన తను రాక్షస గురువు కుతంత్రంతో నిరుపేదగా మారిపోయాడు. కోశాగారాలన్నీ బోసి పోయి ఉన్నాయి. అపారమైన ఆ సంపదను మాయం చేసిన ఉశనుడి యోగ బలం కుబేరుణ్ణి ఆశ్చర్యంలో ముంచి వేసింది.


*"నాథా ! తక్షణం ఉశనుడి మీదా , అతని శిష్యుడు వృషపర్వుడి మీదా దండయాత్ర చేయండి !"* కుబేరుడి ధర్మపత్ని 'భద్ర' ఆవేశంతో అంది. *"ఉశనుడు మోసగాడు ! అతగాడికి మీరు తగు విధంగా బుద్ధి చెప్పాలి. ఆ మోసగాడు దోచుకున్న సంపదను వెంటనే మన కోశాగారాలలో భద్రంగా దాచుకోవాలి !"*


*"దేవీ ! అది జరగని పని ! యోగబలంతో ఆ మాయావి దోచుకువెళ్ళిన దాన్ని బుద్ధి బలంతో గానీ , భుజబలంతో గానీ తిరిగి పొందలేం ! ఆ ఉశనుడి యోగశక్తిని మహా యోగశక్తితో జయించాలి..."* కుబేరుడు సాలోచనగా అన్నాడు. 


*"అంత మహాయోగ బలం మీకు ఉంటే - ఉశనుడి యోగబలం మీ మీద పనిచేసేది. కాదుగా , నాథా."* భద్ర అనుమానంగా ప్రశ్నించింది.


*"మహాయోగశక్తిని మించిన మహత్తరమైన , మహనీయమైన శక్తి ఈ కుబేరుడి హృదయంలో ఉంది !"* కుబేరుడు ఉద్రేకంతో పైకి లేస్తూ అన్నాడు. *"ఆ కైలాస వాసుని స్నేహమే నాకు ఉన్న మహత్తర , మహనీయ శక్తి ! ఇప్పుడే పరమశివుణ్ణి ఆశ్రయిస్తాను ! ఉశనుడి దుర్మార్గానికి తగిన శిక్ష ఆయనే విధిస్తాడు !".*



****************************

కుబేరుడి అపార సంపదను హరించి , తన యోగ శక్తితో భద్రపరిచి వచ్చిన గురువు ఉశనుడిని వృషపర్వుడు విజయోత్సాహంతో తన సభలో సన్మానిస్తున్నాడు. 


రాక్షస ప్రముఖులూ , రాక్షస యువకులూ ఉశనుడి మీద పుష్ప వర్షం కురిపిస్తున్నారు.


*“గురుదేవా ! ఈ క్షణం నుంచి మన ధనాగారాలన్నీ మీ ఆధీనంలోనే ఉంటాయి. మా కోశాధికారి మీరే ! ఐశ్వర్య ప్రదాత అయిన మీరే మాకు ప్రత్యక్షదైవం.”* వృషపర్వుడు ఉత్సాహంతో అన్నాడు.


*"నీ రాక్షస కులాన్ని దేవతల తలదన్నే శక్తిగా రూపొందించడమే నా ధ్యేయం , వృషపర్వా ! నా మాతృమూర్తి ఆ లక్ష్యంతోనే నన్ను కన్నది !"* ఉశనుడు విజయగర్వంతో అన్నాడు. *“ఇప్పుడు నీ సంపదలో నీ స్థాయి ఇంద్రుడి స్థాయిని అధిగమించింది ! నా యుద్ధ తంత్రాలతో శక్తిలో కూడా మన అసురులు ఆ సురలను మించి ప్రకాశిస్తారు !"*



******************************


తన ప్రియమిత్రుడైన కుబేరుడు చెప్తున్నది వింటున్న కొద్దీ పరమశివుడిలో ఆగ్రహజ్వాల రగుల్కొంటోంది. ఆయన దవడలు అదురుతున్నాయి. ఫాలనేత్రంలో కోపాగ్ని రాజుకుంటోంది. ఆవేశంతో ఆయన విశాల విలోచనాలు నుదుర్ని పైకి తోస్తూ విచ్చుకుంటున్నాయి. ఆపుకోలేని ఆగ్రహంతో ఒక్కసారి తల విదిల్చాడు పరమశివుడు. తామ్రవర్ణ జటాజూటం నీలలోహిత తరంగంలాగా ఊగింది.


*"కుబేరా! ”* మహారుద్రుడి గంభీర కంఠం కైలాసగిరి సానువులలో ప్రతిధ్వనించింది , భీకరంగా. *"ఆ ఉశనుడు చేసింది మహా నేరం ! యోగవిద్యా దురుపయోగం ! ఆ మాయావికి తగిన శిక్ష విధిస్తాను !"*


క్షణంలో త్రిశూలం ఆయన దక్షిణ హస్తంలో ప్రత్యక్షమైంది. ఆయన హుంకారం కైలాసమంతటా వ్యాపించింది. *"ఎక్కడ ? ఉశనుడెక్కడ ?”* ఆగ్రహావేశాలతో గర్జిస్తున్న శివుణ్ణి కుబేరుడు భయ భక్తులతో చూశాడు.


వృషపర్వుడి సభలో రాక్షసులు ఉశనుడిని కీర్తిస్తూ జయజయ ధ్వానాలు చేస్తున్నారు. ఆనందోత్సాహాలతో అందరూ సురాపానం చేయడంలో నిమగ్నమై పోయారు. వృషపర్వుడు స్వయంగా అందిస్తున్న పానపాత్రను అందుకోబోతూ ఉశనుడు ఆగాడు.


చెయ్యెత్తి అసురులను వారించాడు. గురువాజ్ఞతో అసురులందరూ మౌనాన్ని ఆశ్రయించారు. కళ్ళు చిట్లించి , ఏకాగ్రతతో వింటున్నాడు ఉశనుడు. ఆయన ముఖంలో రంగులు మారుతున్నాయి. ఆశ్చర్యం , ఆందోళన , భయం ఒకదాన్నొకటి తరుముతూ ఆయన ముఖం మీద ప్రత్యక్షమవుతున్నాయి.


*"ఎక్కడ ? ఉశనుడెక్కడ ?”* పరమశివుని కంఠధ్వని ఆయనకు స్పష్టంగా అంతరంగంలో వినిపిస్తోంది , ధమరుక ధ్వనిలా !


ఉశనుడు వృషపర్వుడి వైపు ఆందోళనగా చూశాడు.


*"వృషపర్వా ! పరమశివుడు ఉగ్రుడై పోయాడు. నా కోసం యుద్ధనాదం చేస్తున్నాడు !"*


*"గురుదేవా !”* వృషపర్వుడు నోరు వెళ్ళబెట్టాడు.


*"ఆ కుబేరుడు శివుణ్ణి శరణుజొచ్చినట్టున్నాడు. పరమశివుడు అతగాడికి పరమ మిత్రుడు..."* ఉశనుడు ఆలోచిస్తూ అన్నాడు. 


*"రుద్రుడు ఉగ్రుడైతే ప్రమాదమే !"* వృషపర్వుడు భయంగా ఉన్నాడు. *"ఇప్పుడు కర్తవ్యం , గురుదేవా?"*


ఉశనుడు కూర్చున్న చోటు నుండి లేచాడు. *“కర్తవ్యం శూలపాణి సన్నిధికి వెళ్ళడమే !"*


*"గురుదేవా !"*


*"ఆయన ఆగ్రహాన్ని నియంత్రించడానికి అదొక్కటే మార్గం !"* అంటూ ఉశనుడు నిష్క్రమిస్తూ - అంతర్థానమైపోయాడు.


వృషపర్వుడూ , రాక్షసప్రముఖులూ ముఖాలు చూసుకొన్నారు.



****************************


శూలాన్ని ఎత్తి పట్టుకొని , ఆగ్రహ తాండవం చేస్తున్నట్టు *"ఎక్కడ ? ఉశనుడెక్కడ ?”* అంటూ కేకలు వేస్తున్న పరమశివుడికి కొంచెం దూరంలో , తన యోగశక్తితో సాక్షాత్కరించిన ఉశనుడు , మహారుద్రుడి మహారౌద్రాన్ని ప్రత్యక్షంగా చూసి , వణికిపోయాడు. భయంతో పక్కనే ఉన్న పొదలో నక్కిదాక్కున్నాడు. అయితే , ఆ ముక్కంటి నుండి తప్పించుకోవడం అసాధ్యమన్న జ్ఞానం ఆ వెంటనే కలిగింది ఉశనుడికి. వెంటనే పొదలోంచి ఇవతలకి వచ్చి , గుండె దిటవు చేసుకుని , పరమేశ్వరుని సమీపానికి వెళ్ళిపోయాడు. తన చేతికి దగ్గరగా అందుబాటులో ఉన్న ఉశనుడిని పట్టుకుని , పరమశివుడు ఒళ్ళు తెలియని ఆవేశంతో , నోటిలో వేసుకుని , గుటుక్కున మ్రింగివేశాడు.


మహేశ్వరుడి మహాశరీరంలో ఉశనుడు సుళ్ళు తిరుగుతూ ఉండిపోయాడు. అక్కడ పొంగుతున్న ఉధృతమైన వేడిమిని భరించలేక తల్లడిల్లిపోయాడు. పరమేశ్వరుడు ఉశనుడు వెలికి రావడానికి అవకాశం లేకుండా నవరంధ్రాలను బంధించి వేశాడు !


మహారుద్రుడి జఠరకుహరంలో ఉక్కిరిబిక్కిరయిపోతున్న ఉశనుడు - మార్గాంతరం లేక - ఆయననే శరణుజొచ్చి , కీర్తిస్తూ - తనను రక్షించమని ప్రార్థించాడు. పరమశివుడు కనికరించాడు. తన జననాంగ ద్వారాన్ని తెరచి , ఆ రంధ్రం గుండా వెలికి రమ్మని ఉశనుణ్ణి ఆజ్ఞాపించాడు.


ఉశనుడు వెంటనే పరమేశ్వరుని జననాంగ మార్గం గుండా వెలికి వచ్చాడు. శివుడు అతడి వైపు నిప్పులు కక్కుతూ చూశాడు. అప్పుడు పార్వతీదేవి ఆయన ఆగ్రహాన్ని గుర్తించింది.


*"స్వామీ... శాంతించండి ! ఉశనుడు మీ శుక్రమార్గం ద్వారా బయల్పడ్డాడు. ఆ కారణంతో అతడు నాకు పుత్రుడైనాడు. నాకు పుత్రుడైనవాడు , మీకూ పుత్రుడే ! మన్నించి , ఉశనుడికి మనుగడ ప్రసాదించండి !"* అంది పార్వతి నాథుణ్ణి శాంతింపజేస్తూ.


పరమశివుడు చిరునవ్వు నవ్వాడు. *"నీ కోరిక తీరుస్తాను ! నీ కుమారుడన్నావు , కాబట్టి ఉశనుడిని తేజోవంతుడిగా చేస్తున్నాను. నా శుక్రద్వార నిర్గతుడైన కారణంగా నేటి నుండి ఈ ఉశనుడు 'శుక్రుడు' అని పిలువబడతాడు."*


పార్వతి తృప్తిగా నవ్వింది. ఉశనుడు శివుడి పాదాలకు ప్రణమిల్లాడు , 'ధన్యోస్మి అంటూ.


*"శుక్రా ! ధనకాంక్షతో నువ్వు కాని పని చేశావు ! కుబేరుడు ధనాధిపతిగా ఉండటానికి జన్మించాడు ! విశ్వధన నిర్వాహకుడినే కొల్లగొట్టడం ధర్మం కాదు. కుబేరుడి నుండి నువ్వు సంగ్రహించి దాచుకున్న సంపద తిరిగి అతనికే చేరుతుంది ! కుబేరుడిని నువ్వు నీ కోసం దోచుకోలేదు గనుక , నీ నిస్వార్థతకు బహుమతి ప్రసాదిస్తున్నాను ! భవిష్యత్తులో నువ్వు ఐశ్వర్యకారకుడవవుతావు. అందుకు కావలసిన ఐశ్వర్యం నీకు అందుతూనే ఉంటుంది !"* పరమశివుడు చెయ్యెత్తి దీవిస్తూ అన్నాడు.


*"పరమేశ్వరా ! మీ ఆగ్రహం అనుగ్రహంతో పదునెక్కి ఉంటుంది ! అందుకే , 'ఉశనుడు ఎక్కడ' అని మీరు హుంకరించగానే , స్వయంగా వచ్చి , చరణాల ముందు వాలిపోయాను !"* శుక్రుడు వినయంగా అన్నాడు.


శివుడు చిరునవ్వుతో శిరస్సు పంకించాడు.


శుక్రుడు పార్వతికి చేతులు జోడించాడు. *"జగన్మాతను మాతృదేవతగా పొంది , తరించాను !”*


*"దీర్ఘాయుష్మాన్ భవ !"* పార్వతి నవ్వుతూ దీవించింది.

  

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

 హిందూ మ‌తంలో 108 ప్రాముఖ్య‌త.......?!


హిందూ మ‌తంలో 108కు ఎంతో విశిష్ట‌త ఉంది. మ‌నం ఏదైనా మంత్రం జ‌పించ‌డానికి ఈ సంఖ్య ముఖ్యం. ఉపనిషత్తులు 108 అష్టోత్తర నామావళి 108 జపమాలలో పూసలు 108 పురాణాల ప్రకారం చంద్రుడికి భూమికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి 108 రెట్లు .ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలున్నాయి.

దేవభాషలో అక్షరాలు 108. భరతుడి నాట్య శాస్త్రంలో నాట్య భంగిమలు 108. దేవాలయానికి 108 ప్రదక్షిణలు చేయటం శ్రేష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి. గాయత్రి 108 సార్లు జపిస్తే సకల శాస్త్రాలను పూజించినట్లే అంటారు.కానీ వీటికన్నా మరెన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ సంఖ్యతో ముడిపడి ఉన్నాయి. అవేమిటో ఒకసారి తెలుసుకుని పలువురికి తెలియ చేద్దాము...


దేవుడి స్మ‌ర‌ణ‌

ఓంకారం 108 సార్లు జపిస్తే భగవంతునికి దగ్గరయినట్లే అంటారు. హనుమాన్ చాలీసా 108 సార్లు ఉచ్చ‌రిస్తే కోరికలు సిద్ధిస్తాయంటారు. శనిదేవునికి 108 నామాలు ఉంటాయి.

ప్ర‌తి చోటా హిందువులు 108 అనే సంఖ్య‌కు ప్రాధాన్య‌త ఇచ్చేందుకు ప‌లు కార‌ణాలు ఉన్నాయి.


రాశి-న‌క్ష‌త్రాల ప‌రంగా

ఇందుకు ప్రముఖమైన కారణం 27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు = 27 x 4 = 108 అని, ప్రతి మనిషి ఈ 108 నక్షత్ర పాదాలలో ఒకదానిలో పుట్టి ఉంటాడు. కావున ఈ సంఖ్యకు అంత ప్రాముఖ్యత వుంది..


ఖ‌గోళ ప‌రంగా 108 నంబ‌ర్ ఏ విధంగా ముఖ్యం అంటే....


సూర్యునికి, భూమికి ఉన్న దూరం 149.6 మిలియన్ కిలోమీటర్లు. ఈ దూరాన్ని సూర్యుని చుట్టుకొలత 1391000 కి.మీ. తో భాగిస్తే వచ్చే సంఖ్య రమారమి 108. .

అలాగే చంద్రునికి, భూమికి ఉన్న దూరం 38లక్షల కిలోమీటర్లు. దాన్ని చంద్రుని చుట్టుకొలత అయిన 3474 కి.మీ. తో భాగిస్తే వచ్చే సంఖ్య 108.

27 న‌క్ష‌త్రాలు, ప్ర‌తి న‌క్ష‌త్రానికి 4 పాదాలు = 27x 4 = 108

12 రాశులు, 9 న‌క్ష‌త్ర పాదాలు = 12x9=108


హైంద‌వ జీవ‌న విధానం ఆధారంగా 108

మ‌న‌కు ఉన్న ముఖ్య శివ‌లింగాల సంఖ్య 108, అందుకే శైవ మ‌త‌స్థులు 108 కు ప్రాముఖ్య‌తనిస్తుంటారు.


గౌడియ వైష్ణవంలో బృందావనం లో 108 గోపికలను పూజిస్తారు.

దేశంలో 108 వైష్ణవ దివ్య క్షేత్రాలు ఉన్నాయి.

కంబోడియాలో ఆంగ్‌కోర్ వాట్ గుడిలో 108 మంది (అసురులు, దేవతలు) కలిసి సాగరమధనం చేసినట్టు చిత్రింపబడివుంది.


జ‌పమాల‌లో 108 పూస‌లు

శాస్త్రం ప్ర‌కారం ఒక వ్య‌క్తి ఒక రోజులో అంటే 24 గంట‌ల్లో 21600 సార్లు శ్వాస తీసుకుంటారు.

అంటే 12 గంట‌ల్లో 10800 సార్లు శ్వాస తీసుకుంటాడ‌ని లెక్క‌. ఈ లెక్క ప్ర‌కారం మ‌నిషి దేవుడిని త‌ల‌చుకునేట‌ప్పుడు 10800 సార్లు చేయ‌డం క‌ష్టం కాబ‌ట్టి., చివ‌రి రెండు సున్నాలు తీసివేసి 108ను ప్రామాణికంగా ఉంచార‌ని కొంత మంది పెద్ద‌లు చెబుతుంటారు.

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *90వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శుక్రగ్రహా చరిత్ర - 2*


ఆ రాత్రికే కుబేరుడి మీద ఉశనుడు ప్రయోగించిన యోగ ప్రభావం నశించింది. అతీంద్రియ శక్తితో తనను ఉశనుడు మోసం చేసి , నిలువు దోపిడీ చేశాడని కుబేరుడు తెలుసుకున్నాడు. విశ్వ సంపన్నుడైన తను రాక్షస గురువు కుతంత్రంతో నిరుపేదగా మారిపోయాడు. కోశాగారాలన్నీ బోసి పోయి ఉన్నాయి. అపారమైన ఆ సంపదను మాయం చేసిన ఉశనుడి యోగ బలం కుబేరుణ్ణి ఆశ్చర్యంలో ముంచి వేసింది.


*"నాథా ! తక్షణం ఉశనుడి మీదా , అతని శిష్యుడు వృషపర్వుడి మీదా దండయాత్ర చేయండి !"* కుబేరుడి ధర్మపత్ని 'భద్ర' ఆవేశంతో అంది. *"ఉశనుడు మోసగాడు ! అతగాడికి మీరు తగు విధంగా బుద్ధి చెప్పాలి. ఆ మోసగాడు దోచుకున్న సంపదను వెంటనే మన కోశాగారాలలో భద్రంగా దాచుకోవాలి !"*


*"దేవీ ! అది జరగని పని ! యోగబలంతో ఆ మాయావి దోచుకువెళ్ళిన దాన్ని బుద్ధి బలంతో గానీ , భుజబలంతో గానీ తిరిగి పొందలేం ! ఆ ఉశనుడి యోగశక్తిని మహా యోగశక్తితో జయించాలి..."* కుబేరుడు సాలోచనగా అన్నాడు. 


*"అంత మహాయోగ బలం మీకు ఉంటే - ఉశనుడి యోగబలం మీ మీద పనిచేసేది. కాదుగా , నాథా."* భద్ర అనుమానంగా ప్రశ్నించింది.


*"మహాయోగశక్తిని మించిన మహత్తరమైన , మహనీయమైన శక్తి ఈ కుబేరుడి హృదయంలో ఉంది !"* కుబేరుడు ఉద్రేకంతో పైకి లేస్తూ అన్నాడు. *"ఆ కైలాస వాసుని స్నేహమే నాకు ఉన్న మహత్తర , మహనీయ శక్తి ! ఇప్పుడే పరమశివుణ్ణి ఆశ్రయిస్తాను ! ఉశనుడి దుర్మార్గానికి తగిన శిక్ష ఆయనే విధిస్తాడు !".*



****************************

కుబేరుడి అపార సంపదను హరించి , తన యోగ శక్తితో భద్రపరిచి వచ్చిన గురువు ఉశనుడిని వృషపర్వుడు విజయోత్సాహంతో తన సభలో సన్మానిస్తున్నాడు. 


రాక్షస ప్రముఖులూ , రాక్షస యువకులూ ఉశనుడి మీద పుష్ప వర్షం కురిపిస్తున్నారు.


*“గురుదేవా ! ఈ క్షణం నుంచి మన ధనాగారాలన్నీ మీ ఆధీనంలోనే ఉంటాయి. మా కోశాధికారి మీరే ! ఐశ్వర్య ప్రదాత అయిన మీరే మాకు ప్రత్యక్షదైవం.”* వృషపర్వుడు ఉత్సాహంతో అన్నాడు.


*"నీ రాక్షస కులాన్ని దేవతల తలదన్నే శక్తిగా రూపొందించడమే నా ధ్యేయం , వృషపర్వా ! నా మాతృమూర్తి ఆ లక్ష్యంతోనే నన్ను కన్నది !"* ఉశనుడు విజయగర్వంతో అన్నాడు. *“ఇప్పుడు నీ సంపదలో నీ స్థాయి ఇంద్రుడి స్థాయిని అధిగమించింది ! నా యుద్ధ తంత్రాలతో శక్తిలో కూడా మన అసురులు ఆ సురలను మించి ప్రకాశిస్తారు !"*



******************************


తన ప్రియమిత్రుడైన కుబేరుడు చెప్తున్నది వింటున్న కొద్దీ పరమశివుడిలో ఆగ్రహజ్వాల రగుల్కొంటోంది. ఆయన దవడలు అదురుతున్నాయి. ఫాలనేత్రంలో కోపాగ్ని రాజుకుంటోంది. ఆవేశంతో ఆయన విశాల విలోచనాలు నుదుర్ని పైకి తోస్తూ విచ్చుకుంటున్నాయి. ఆపుకోలేని ఆగ్రహంతో ఒక్కసారి తల విదిల్చాడు పరమశివుడు. తామ్రవర్ణ జటాజూటం నీలలోహిత తరంగంలాగా ఊగింది.


*"కుబేరా! ”* మహారుద్రుడి గంభీర కంఠం కైలాసగిరి సానువులలో ప్రతిధ్వనించింది , భీకరంగా. *"ఆ ఉశనుడు చేసింది మహా నేరం ! యోగవిద్యా దురుపయోగం ! ఆ మాయావికి తగిన శిక్ష విధిస్తాను !"*


క్షణంలో త్రిశూలం ఆయన దక్షిణ హస్తంలో ప్రత్యక్షమైంది. ఆయన హుంకారం కైలాసమంతటా వ్యాపించింది. *"ఎక్కడ ? ఉశనుడెక్కడ ?”* ఆగ్రహావేశాలతో గర్జిస్తున్న శివుణ్ణి కుబేరుడు భయ భక్తులతో చూశాడు.


వృషపర్వుడి సభలో రాక్షసులు ఉశనుడిని కీర్తిస్తూ జయజయ ధ్వానాలు చేస్తున్నారు. ఆనందోత్సాహాలతో అందరూ సురాపానం చేయడంలో నిమగ్నమై పోయారు. వృషపర్వుడు స్వయంగా అందిస్తున్న పానపాత్రను అందుకోబోతూ ఉశనుడు ఆగాడు.


చెయ్యెత్తి అసురులను వారించాడు. గురువాజ్ఞతో అసురులందరూ మౌనాన్ని ఆశ్రయించారు. కళ్ళు చిట్లించి , ఏకాగ్రతతో వింటున్నాడు ఉశనుడు. ఆయన ముఖంలో రంగులు మారుతున్నాయి. ఆశ్చర్యం , ఆందోళన , భయం ఒకదాన్నొకటి తరుముతూ ఆయన ముఖం మీద ప్రత్యక్షమవుతున్నాయి.


*"ఎక్కడ ? ఉశనుడెక్కడ ?”* పరమశివుని కంఠధ్వని ఆయనకు స్పష్టంగా అంతరంగంలో వినిపిస్తోంది , ధమరుక ధ్వనిలా !


ఉశనుడు వృషపర్వుడి వైపు ఆందోళనగా చూశాడు.


*"వృషపర్వా ! పరమశివుడు ఉగ్రుడై పోయాడు. నా కోసం యుద్ధనాదం చేస్తున్నాడు !"*


*"గురుదేవా !”* వృషపర్వుడు నోరు వెళ్ళబెట్టాడు.


*"ఆ కుబేరుడు శివుణ్ణి శరణుజొచ్చినట్టున్నాడు. పరమశివుడు అతగాడికి పరమ మిత్రుడు..."* ఉశనుడు ఆలోచిస్తూ అన్నాడు. 


*"రుద్రుడు ఉగ్రుడైతే ప్రమాదమే !"* వృషపర్వుడు భయంగా ఉన్నాడు. *"ఇప్పుడు కర్తవ్యం , గురుదేవా?"*


ఉశనుడు కూర్చున్న చోటు నుండి లేచాడు. *“కర్తవ్యం శూలపాణి సన్నిధికి వెళ్ళడమే !"*


*"గురుదేవా !"*


*"ఆయన ఆగ్రహాన్ని నియంత్రించడానికి అదొక్కటే మార్గం !"* అంటూ ఉశనుడు నిష్క్రమిస్తూ - అంతర్థానమైపోయాడు.


వృషపర్వుడూ , రాక్షసప్రముఖులూ ముఖాలు చూసుకొన్నారు.



****************************


శూలాన్ని ఎత్తి పట్టుకొని , ఆగ్రహ తాండవం చేస్తున్నట్టు *"ఎక్కడ ? ఉశనుడెక్కడ ?”* అంటూ కేకలు వేస్తున్న పరమశివుడికి కొంచెం దూరంలో , తన యోగశక్తితో సాక్షాత్కరించిన ఉశనుడు , మహారుద్రుడి మహారౌద్రాన్ని ప్రత్యక్షంగా చూసి , వణికిపోయాడు. భయంతో పక్కనే ఉన్న పొదలో నక్కిదాక్కున్నాడు. అయితే , ఆ ముక్కంటి నుండి తప్పించుకోవడం అసాధ్యమన్న జ్ఞానం ఆ వెంటనే కలిగింది ఉశనుడికి. వెంటనే పొదలోంచి ఇవతలకి వచ్చి , గుండె దిటవు చేసుకుని , పరమేశ్వరుని సమీపానికి వెళ్ళిపోయాడు. తన చేతికి దగ్గరగా అందుబాటులో ఉన్న ఉశనుడిని పట్టుకుని , పరమశివుడు ఒళ్ళు తెలియని ఆవేశంతో , నోటిలో వేసుకుని , గుటుక్కున మ్రింగివేశాడు.


మహేశ్వరుడి మహాశరీరంలో ఉశనుడు సుళ్ళు తిరుగుతూ ఉండిపోయాడు. అక్కడ పొంగుతున్న ఉధృతమైన వేడిమిని భరించలేక తల్లడిల్లిపోయాడు. పరమేశ్వరుడు ఉశనుడు వెలికి రావడానికి అవకాశం లేకుండా నవరంధ్రాలను బంధించి వేశాడు !


మహారుద్రుడి జఠరకుహరంలో ఉక్కిరిబిక్కిరయిపోతున్న ఉశనుడు - మార్గాంతరం లేక - ఆయననే శరణుజొచ్చి , కీర్తిస్తూ - తనను రక్షించమని ప్రార్థించాడు. పరమశివుడు కనికరించాడు. తన జననాంగ ద్వారాన్ని తెరచి , ఆ రంధ్రం గుండా వెలికి రమ్మని ఉశనుణ్ణి ఆజ్ఞాపించాడు.


ఉశనుడు వెంటనే పరమేశ్వరుని జననాంగ మార్గం గుండా వెలికి వచ్చాడు. శివుడు అతడి వైపు నిప్పులు కక్కుతూ చూశాడు. అప్పుడు పార్వతీదేవి ఆయన ఆగ్రహాన్ని గుర్తించింది.


*"స్వామీ... శాంతించండి ! ఉశనుడు మీ శుక్రమార్గం ద్వారా బయల్పడ్డాడు. ఆ కారణంతో అతడు నాకు పుత్రుడైనాడు. నాకు పుత్రుడైనవాడు , మీకూ పుత్రుడే ! మన్నించి , ఉశనుడికి మనుగడ ప్రసాదించండి !"* అంది పార్వతి నాథుణ్ణి శాంతింపజేస్తూ.


పరమశివుడు చిరునవ్వు నవ్వాడు. *"నీ కోరిక తీరుస్తాను ! నీ కుమారుడన్నావు , కాబట్టి ఉశనుడిని తేజోవంతుడిగా చేస్తున్నాను. నా శుక్రద్వార నిర్గతుడైన కారణంగా నేటి నుండి ఈ ఉశనుడు 'శుక్రుడు' అని పిలువబడతాడు."*


పార్వతి తృప్తిగా నవ్వింది. ఉశనుడు శివుడి పాదాలకు ప్రణమిల్లాడు , 'ధన్యోస్మి అంటూ.


*"శుక్రా ! ధనకాంక్షతో నువ్వు కాని పని చేశావు ! కుబేరుడు ధనాధిపతిగా ఉండటానికి జన్మించాడు ! విశ్వధన నిర్వాహకుడినే కొల్లగొట్టడం ధర్మం కాదు. కుబేరుడి నుండి నువ్వు సంగ్రహించి దాచుకున్న సంపద తిరిగి అతనికే చేరుతుంది ! కుబేరుడిని నువ్వు నీ కోసం దోచుకోలేదు గనుక , నీ నిస్వార్థతకు బహుమతి ప్రసాదిస్తున్నాను ! భవిష్యత్తులో నువ్వు ఐశ్వర్యకారకుడవవుతావు. అందుకు కావలసిన ఐశ్వర్యం నీకు అందుతూనే ఉంటుంది !"* పరమశివుడు చెయ్యెత్తి దీవిస్తూ అన్నాడు.


*"పరమేశ్వరా ! మీ ఆగ్రహం అనుగ్రహంతో పదునెక్కి ఉంటుంది ! అందుకే , 'ఉశనుడు ఎక్కడ' అని మీరు హుంకరించగానే , స్వయంగా వచ్చి , చరణాల ముందు వాలిపోయాను !"* శుక్రుడు వినయంగా అన్నాడు.


శివుడు చిరునవ్వుతో శిరస్సు పంకించాడు.


శుక్రుడు పార్వతికి చేతులు జోడించాడు. *"జగన్మాతను మాతృదేవతగా పొంది , తరించాను !”*


*"దీర్ఘాయుష్మాన్ భవ !"* పార్వతి నవ్వుతూ దీవించింది.

  

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 14*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 *14. మూర్తి నాయనారు*


పాండ్యదేశానికి రాజధాని అయిన మదురైలో వణిగ వంశంలో మూర్తినాయనారు అవతరించాడు. భక్తియే స్వరూపంగా కలిగిన నాయనారు మధురైలో నెలకొని ఉన్న శివునికి రోజూ చందనం అరగదీసి ఇస్తూ

ఉండేవాడు.


ఒక పర్యాయం కర్ణాటక రాజు పాండ్యదేశంపై దండెత్తి యుద్ధంలో

పాండ్యరాజును ఓడించి దేశాన్ని తన కైవశం చేసుకున్నాడు. అతడు విభూతి  ధారణ చేసిన శివభక్తులపై ద్వేషాన్ని పెంచుకున్నాడు. జైనమతాన్ని దేశంలో

వ్యాపింపజేయడానికి కంకణం కట్టుకున్నాడు. మూర్తినాయనారును జైన

మతానికి మార్చాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. 


కాని అతని

సంకల్పం నెరవేర లేదు. మూర్తినాయనారు చేస్తూ వస్తున్న చందన

కైంకర్యానికి విఘ్నం తీసుకురావాలని తలచి అతనికి ఎవరూ చందనం

కట్టెలు ఇవ్వకూడదని కట్టడి చేశాడు. ఈ రాజు నా కైంకర్యానికి అడ్డంకిని

కలిగించాడు. 


కాని చందనాన్ని అరగదీసే నా చేతులకు అతను ఏవిధంగా

అడ్డంకిని కలిగించగలడు? అని భావించి మూర్తినాయనారు తన చేతులను

చందనం అరగదీసే రాయిపై పెట్టి అరగదీయడం ప్రారంభించాడు.

చేతిపైనున్న చర్మం ఊడిపోయింది. రక్తం ప్రవాహంగా కారడం

ప్రారంభించింది. ఎముకలు కూడ బయటపడ్డాయి. అయినప్పటికీ మూర్తి

నాయనారు తన పనిని కొనసాగించాడు. 


ఆ రోజు రాత్రి మూర్తినాయనారుకు

పరమేశ్వరుడు కలలో ప్రత్యక్షమై "నీకు అపకారం తలపెట్టిన ఈ రాజు

త్వరలోనే నశిస్తాడు. ఈ రాజ్యం నీ చేతికి వస్తుంది. నీవు యథాప్రకారం

నాకు కైంకర్యం చేస్తూ చివరగా కైలాసంలో నా సన్నిధికి చేరుకుంటావు”

అని అనుగ్రహించాడు.

ఆరోజు రాత్రే కర్ణాటకరాజు మరణించాడు. 


చనిపోయిన ఆరాజుకు

సంతానం లేరు. సమర్ధుడైన రాజు లేకపోతే దేశం నశించిపోతుందని

దేశంలోని పెద్దలందరూ కలసి ఆలోచించారు. “ఒక ఏనుగుకు కళ్లను గంతలు కట్టి వదలుదాం. అది ఎవరిని తీసుకువస్తుందో వారినే మనం

రాజుగా చేద్దాం” అని తీర్మానం చేశారు. అదేప్రకారం పట్టపుటేనుగు కళ్లకు

గంతలు కట్టి వదిలారు. 


ఆ ఏనుగు రాజవీధుల గుండా వచ్చి అక్కడ నిలబడి ఉన్న మూర్తినాయనారు మెడలో మాలనువేసింది. మంత్రులు,

రాజ ప్రముఖులు మొదలైనవారు మూర్తినాయనారును ఆహ్వానించి వారికి

 వైభవంగా పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించారు. 


మూర్తినాయనారు

పవిత్ర పంచాక్షరినే పఠిస్తూ పరమేశ్వరుని ధ్యానంలో కాలం గడిపాడు.

ప్రజలందరినీ తన కన్నబిడ్డలవలె కాపాడుతూ చివరగా పరమేశ్వరుని

తిరుచరణాలను చేరుకున్నాడు.

*పద్నాల్గవ చరిత్ర సంపూర్ణం*

     

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 14*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే*

*ప్రముఖ్యోఽహం తేషామపి కిముత బంధుత్వమనయోః |*

*త్వయైవ క్షన్తవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః*

*ప్రయత్నాత్కర్తవ్యం మదవనమియం బంధుసరణిః 14*


ఓ పశుపతీ! నీవు సమర్థుడవు, దీనులకు ముఖ్యబంధువువు కదా. నేను ఆ దీనులలో మొట్టమొదటివాడను. ఇంక మన ఇద్దరి బంధుత్వము గురించి  వేరే చెప్పనక్కరలేదు కదా. ఓ శివా! నా సమస్త అపరాధములనూ నీవు క్షమించుము. నన్ను ప్రయత్నపూర్వకముగా రక్షించుము. ఇదేకదా బంధుమర్యాద (బంధువులతో మెలగవలసిన తీరు).


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 100*


*రామకృష్ణ ఆరాధన*


బలరాంబోసు ఇంటి నుండి శ్రీరామకృష్ణుల అస్థుల కలశాన్ని తీసుకువచ్చి, దానిని విడిగా ఒక గదిలో అమర్చి ఆ గదిలోనే ధ్యానం మొదలైన ఆధ్యాత్మిక  సాధనలు ఆ యువ సన్న్యాసులు అనుష్ఠించసాగారు. స్వామి రామకృష్ణానంద మఠంలో నిరంతరంగా నివసించనారంభించినప్పుడు ఆ గదిని తీర్చిదిద్దాడు. గది మధ్యలో గురుదేవుల చిత్రపటాన్ని అమర్చి నిత్యపూజకు శ్రీకారం చుట్టాడు. స్వామీజీతో సహా పలువురు సోదర శిష్యులకూ, సురేంద్రాదులకు ఇదినచ్చలేదు.


శ్రీరామకృష్ణులు తమను అర్చించమని ఎవరితోనూ చెప్పలేదని వారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేగాక విరజాహోమం నిర్వర్తించి యథావిధిగా సన్న్యాసం పుచ్చుకొన్న తరువాత పూజాది క్రతువుల అగత్యం లేదన్నది వారి వాదం.


ఒక రోజు పూజామందిరంలో నిలబడే ఆరాధనను ప్రతిఘటిస్తూ వాడిగా వేడిగా స్వామీజీ వాదించసాగారు. అందుకు స్వామి రామకృష్ణానంద కూడా యుక్తమైన జవాబులిచ్చాడు. కాసేపటికల్లా వాదాలు తారస్థాయిని చేరుకొన్నాయి. ఒక ఘట్టంలో స్వామి రామకృష్ణానంద స్వామీజీ జుట్టు పట్టుకొని ఈడ్చుకొంటూ పూజామందిరం నుండి బయటికి త్రోసివేశాడు. అంతా కళ్లుమూసి తెరచేటంత లోనే జరిగిపోయింది. 


పిదప తన చర్యకు పశ్చాత్తాపం చెంది స్వామీజీని క్షమాపణ కోరాడు. మనఃస్ఫూర్తిగా క్షమించడం మాత్రమే కాక అతడి గురుభక్తిని స్వామీజీ ఎంతగానో శ్లాఘించారు. ఈ విషయంగా పలుమార్లు భేదాభిప్రాయాలు తలెత్తినప్పటికీ రామకృష్ణ ఆరాధన మాత్రం కొనసాగింది.


స్వామి రామకృష్ణానంద పూజా విధానాన్ని చూసినవారు అక్కడ గురుదేవుల దివ్యసాన్నిధ్య అనుభూతి పొందారనడం అతిశయోక్తి కాదు. సజీవులయిన వారికిఎలా సకలోపచారాలు చేస్తామో, అదే విధంగా గురుదేవులను ఆయన ఆరాధించాడు. ఆయనకు నైవేద్యం అర్పించబడింది. ఆరాత్రికం నిర్వహించారు. ఆరాత్రిక సమయంలో "జై గురుదేవా, శ్రీ గురుదేవా" అని అందరూ కలసి ఉచ్చరించేవారు; కొన్ని సమయాల్లో గురుగీత శ్లోకాలు పారాయణ చేసేవారు. దీపారాధన కన్నులపండువగా ఉండేది. అందరూ ముక్తకంఠంతో 'జయ శివ ఓంకార" అనే పాట పాడేవారు.


రోజులు గడిచేకొద్దీ పూజా విధానాన్ని మరింతగా క్రమబద్ధీకరించాడు. రామకృష్ణానంద స్వామి. సంస్కృతంలో చక్కని అభినివేశం గల ఆయన తగిన మంత్రాలు చేర్చి రామకృష్ణ పూజా పద్ధతిని రూపొందించారు.


నిత్య పూజే కాకుండా శివరాత్రి, కాళీపూజ లాంటి విశేష పర్వదినాలను, క్రిస్మస్ ను వారు ఉత్సవం మాదిరి జరుపుకొన్నారు.🙏

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

.                   *శ్లోకం - 90*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*దదానే దీనేభ్యః శ్రియమనిశ మాశానుసదృశీ*

*మమందం సౌందర్యప్రకర మకరందం వికిరతి |*

*తవాస్మిన్ మందార స్తబక సుభగే యాతు చరణే*

 *నిమజ్జ న్మజ్జీవః కరణచరణ ష్షట్చరణ తామ్ ‖*



తవాస్మిన్ మందార స్తబక సుభగే యాతు చరణే = అమ్మా శ్రీ భ్రమరాంబికా, 

నీ సౌభాగ్యకరమైన పాదములు దేవలోకంలో పూచే మందారముల గుత్తి వలె ఉన్నవి. 


అమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి = నీ పాద పుష్పాలు అమన్దమైన (అల్పము కాని) సౌందర్య మకరందమును (జ్ఞానానందమును) ప్రకటిస్తున్నాయి.


నిమజ్జ న్మజ్జీవః కరణ చరణ ష్షట్చరణతామ్ = ఆ గుత్తిలోని మకరందమును ఆస్వాదించటానికి నా జీవుడనే తుమ్మెద, దాని ఆరు పాదాలతో నీ పాద మందారములలో మునిగిపోయింది. జ్ఞానానందమును అనుభవించే జీవుడికి ఇక లౌకిక వ్యవహారములలో ఆసక్తి ఉండక, సదా ఆ ఆనందంలో మైమరచిపోతూ ఉంటాడు సమాధి స్థితిలో

శ్రీ రామకృష్ణ పరమహంస వలె, రమణ మహర్షి వలె.


తుమ్మెద మకరందం త్రావుతూ మైమరచి ఇక ఆ పూవును వదలలేని మైకంలో పడి, అలాగే ఉండిపోతుంది. ఒక్కొక్కసారి పద్మముల వంటి పుష్పములు రాత్రి వేళ ముడుచుకుపోయినప్పుడు అందులో నుండి కదలలేక అందులోనే ప్రాణములు విడుస్తుంది.


ఇప్పుడు ఈ జీవుడికి కల ఆరు చరణములేమిటి? పంచ జ్ఞానేంద్రియములు, మనస్సు (అంతఃకరణ సముదాయము) ఏ వస్తువైనా, ముందు జ్ఞానేంద్రియము (కన్ను ముక్కు చెవి నాలుక చర్మము) తో స్వీకరింపబడి మనస్సును చేరి అనుభవింపబడుతున్నది. ఇక్కడ అమ్మవారి పాదములలో ఆశ్రయము పొందవలెనంటే షట్చక్రముల ఛేదన ద్వారా సహస్రారమును చేరే సాధన చేయటమని భావించవచ్చు. ఆ విధంగా అనన్య భక్తినీ,సంపూర్ణ శరణాగతిని చేసి సాధన చేసే జీవునికి


దదానే దీనేభ్యః శ్రియమనిశ-మాశానుసదృశీ = దీనేభ్యః అంటే అహంకార రహితులైనవారికి, వారి కోరికలననుసరించి (ఆశా అనుసదృశీమ్) 

శ్రియం అనిశం ఎల్లప్పుడూ శుభములను మోక్షమును, దదానే ఇస్తుంది అమ్మవారి పాదద్వయం.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

శుభోదయం, నేటి పంచాంగం *మంగళవారం, నవంబరు 28, 2023*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

  *దక్షిణాయనం - శరదృతువు*

  *కార్తీక మాసం - బహళ పక్షం*

తిథి  పాడ్యమి* మ1.40 వరకు

వారం   :మంగళవారం* (భౌమవాసరే)

నక్షత్రం  :రోహిణి* మ1.55 వరకు  

యోగం : *సిద్ధం* రా11.14 వరకు

కరణం  :కౌలువ* మ1.40 తదుపరి *తైతుల* రా1.39 వరకు

వర్జ్యం  : *ఉ.శే.వ7.29వరకు*రా7.38 - 9.17*

దుర్ముహూర్తము : *ఉ8.28 - 9.13*

 మ10.30 - 11.22*

అమృతకాలం    : *ఉ10.42 - 12.18*   తె5.27నుండి*                  

రాహుకాలం : *మ3.00 - 4.30*

యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30*

సూర్యరాశి: *వృశ్చికం* || చంద్రరాశి: *వృషభం*

సూర్యోదయం: *6.15* సూర్యాస్తమయం: *5.20*

*సర్వేజనా సుఖినో భవంతు **

 🕉️🪔  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️

🪔 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 🪔


*శ్లోకం*


*సంసారకూప మతిఘోర మగాధమూలం*

*సంప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య*

*దీనస్య దేవ కృపయా శరణాగతస్య*

*లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్* ||


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 05_* _


తా॥

ఓ నరసింహస్వామీ! సంసారమనునది భయంకరమును, మిక్కిలి లోతైనదియును అగుపడు నుయ్యి. నేను ఆ కూపములో పడిపోయితిని. వందల కొలదిగా ఉన్న దుఃఖములనెడి సర్పములు నన్ను చుట్టుముట్టినవి. గొప్ప ఆపదలో ఉన్నాను. ఓ నృసింహదేవా!దీనుడనైన నాకుచేయూతనిచ్చి యుద్ధరింపుము. లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము.

 🕉 మన గుడి : నెం 251





⚜ గుజరాత్ : పట్టి, సురేంద్రనగర్


⚜ శ్రీ వర్నీంద్ర ధామ్ 


💠 శ్రీ స్వామినారాయణ్ మందిర్ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మరియు అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి మరియు ఇది స్వామినారాయణ సంప్రదాయంలో భాగం.  


💠 స్వామినారాయణ సంప్రదాయం స్థాపకుడు అయిన స్వామినారాయణ్ తన ఆస్తికత మరియు దేవతా ఆరాధనలో భాగంగా దేవాలయాలను స్థాపించాడు.  

అతను క్రింది నగరాల్లో తొమ్మిది దేవాలయాలను నిర్మించాడు;  

అహ్మదాబాద్, 

భుజ్, 

ములి, 

వడ్తాల్, 

జునాగఢ్, 

ధోలేరా, 

ధోల్కా, 

గధ్‌పూర్ & జెతల్‌పూర్.  


💠 ఈ దేవాలయాలలో అతను నారాయణ్ దేవ్, లక్ష్మీనారాయణ్ దేవ్, రాధాకృష్ణ దేవ్, రాధారామన్ దేవ్, రేవ్తి-బల్దేవ్జీ, మదన్ మోహన్ దేవ్ మొదలైన వివిధ హిందూ దేవుళ్ల చిత్రాలను ఏర్పాటు చేశాడు. 


💠 శ్రీ స్వామినారాయణ దేవాలయాలు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు కానీ విదేశాలలో కూడా చాలా ఖ్యాతిని కలిగి ఉన్నాయి.  

USA, ఆస్ట్రేలియా, సీషెల్స్, కెనడా, థాయిలాండ్, ఫిజీ, మారిషస్, న్యూజిలాండ్, ఒమన్, UAE మరియు జాంబియాలలో ప్రసిద్ధ స్వామినారాయణ దేవాలయాలు ఉన్నాయి.  స్వామినారాయణ వారసత్వం యొక్క ప్రముఖ లక్షణాలలో ఒకటి ఆలయ వాస్తుశిల్పం.  స్వామినారాయణుడు నిర్మించిన ఆలయాల్లోని కృష్ణుని ప్రాధాన్యతకు నిదర్శనం.  


💠 ఇక్కడి వర్నీంద్ర ధామ్ స్వామినారాయణ దేవాలయం, సురేంద్రనగర్ జిల్లా, దాసాదా తాలూకాలోని విరామ్‌గాం, గాంధీనగర్ హైవే, మల్వన్ చోక్డి పట్టి మీదుగా పట్టి వద్ద ఉన్న అందమైన ఆలయం. 

ఈ ఆలయం పోయిచాలోని నీలకంఠం స్వామినారాయణ ఆలయంలో రెండవ భాగం. 


💠 ఈ అందమైన ఆలయాన్ని శ్రీ వడ్తాల్ స్వామి నారాయణ ఆలయం కింద శ్రీ స్వామి నారాయణ గురుకుల్ సూరత్ నిర్వహిస్తోంది.


💠 ఇప్పుడు ప్రతిరోజూ వేలాది మంది భక్తులతో గుజరాత్‌లోని ప్రధాన పుణ్యక్షేత్రం మరియు పర్యాటక ప్రదేశం.  

అద్భుతమైన డిజైన్, విగ్రహాలు, ఎగ్జిబిషన్, లైటింగ్ మొదలైన వాటితో 15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ పవిత్ర స్థలం మినీ పోయిచ్ అని ప్రసిద్ధి చెందింది. 

వర్నీంద్రధం శ్రీ స్వామినారాయణ గురుకుల్ సూరత్ పరిధిలోని శ్రీ వడ్తాల్ స్వామినారాయణ గడి కింద ఉంది మరియు దీనిని ధర్మవల్లభదాస్ స్వామి రూపొందించారు. 


💠 ఈ ప్రధాన తీర్థయాత్ర ఆకర్షణ 17 అక్టోబర్ 2017న సాధారణ ప్రజల కోసం తెరవబడుతుంది మరియు తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందింది.  

ప్రతి ఒక్కరి మనస్సు మరియు ఆత్మ పరమాత్మతో ముడిపడి ఉన్నట్లు భావించే పరమేశ్వరుని ఆరాధనకు ఇది సరైన స్థలం.  


💠 ఇతర హిందూ దేవాలయాల మాదిరిగానే స్వామినారాయణ దేవాలయాలు, ఆరాధకులు మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు వీలుగా కేంద్ర మందిరం చుట్టూ నడక మార్గాలను కలిగి ఉంటాయి.  

వీటిని తరచుగా డిజైన్లు మరియు పొదగబడిన పాలరాతితో అలంకరిస్తారు.  

ప్రధాన మందిరం ప్రాంతం రెయిలింగ్‌లతో విభజించబడింది.  


💠 దేవుడిపై పూర్తి ఏకాగ్రత ఉండేలా దేవాలయాల్లో స్త్రీ, పురుషులను వేరు చేయాలని స్వామినారాయణ్ ప్రచారం చేసినందున రైలింగ్‌లో ఒక వైపు మహిళలకు ప్రత్యేకించబడింది. 


💠 సమీప రైల్వే స్టేషన్ విరామగం రైల్వే స్టేషన్ (30 కి.మీ.).


 

 *శ్రీ లక్ష్మీనరసింహ కరావలంబం స్తోత్రము*

*అనువాద పద్యము*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి* 


*5  తే గీ.నారసింహుడా సంసారనావ నాకు*

*భయము గొలిపెడు లోతైన బావి యిదియె*

*వందల కొలది సర్పములు బంది చేసి*

*వెంటపడుచు యెన్నియో వెతలు పెట్టె*

*గొప్ప ఆపదలో నుంటి చెప్పలేని*

*దుఃఖ బాధల నందు నే దూరిపోతి*

*దీనుడను నుద్దరింపుము దేవదేవ*

*లక్ష్మితో వచ్చి రక్షించు లక్షణముగ*

*శ్రీధరున్ని చేయూతతో  చేరదీయు*

 *1983*

*కం*

అనవసరంబగు వారల

ననవరతము తలచుచుండ నవి గొప్పవగున్.

అనయము మననముజేయగ

ననతులు సహితము ఘనమగు నవనిన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! అనవసరమైన వాటి ని గురించి నిరంతరం గా తలచుకొనుట వలన అవి గొప్పగా ప్రాచుర్యం పొందుతాయి. ఎల్లప్పుడూ స్మరించుకొనడం వలన అల్పములు(అనతులు) కూడా ఈ భూలోకంలో గొప గొప్పవిగా కీర్తించబడును.

*సందేశం*:-- అతిగా తలచుటచే అల్పములే గొప్పగా వర్ధిల్లుతాయి కనుక మంచి వాటి (వారి) నే ఎక్కువగా తలచుకొనవలెను,తద్వారా మంచి వర్ధిల్లుతుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*శ్లోకం*


*సంసారకూప మతిఘోర మగాధమూలం*

*సంప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య*

*దీనస్య దేవ కృపయా శరణాగతస్య*

*లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్* ||


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 05_* _


*తా: ఓ నరసింహస్వామీ! సంసారమనునది భయంకరమును, మిక్కిలి లోతైనదియును అగుపడు నుయ్యి. నేను ఆ కూపములో పడిపోయితిని. వందల కొలదిగా ఉన్న దుఃఖములనెడి సర్పములు నన్ను చుట్టుముట్టినవి. గొప్ప ఆపదలో ఉన్నాను. ఓ నృసింహదేవా!దీనుడనైన నాకుచేయూతనిచ్చి యుద్ధరింపుము. లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము*.


🧘‍♂️🙏🪷 ✍️🙏

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


మంగళవారం, నవంబరు 28,2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

కార్తీక మాసం - బహుళ పక్షం

తిథి:పాడ్యమి మ1.40 వరకు

వారం:మంగళవారం (భౌమవాసరే)

నక్షత్రం:రోహిణి మ1.55 వరకు  

యోగం:సిద్ధం రా11.14 వరకు

కరణం:కౌలువ మ1.40 వరకు తదుపరి తైతుల రా1.39 వరకు

వర్జ్యం:ఉ.శే.వ7.29వరకు & రా7.38 - 9.17

దుర్ముహూర్తము:ఉ8.28 - 9.13 &

మ10.30 - 11.22

అమృతకాలం:ఉ10.42 - 12.18 &

తె5.27నుండి

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30

సూర్యరాశి:  వృశ్చికం

చంద్రరాశి: వృషభం 

సూర్యోదయం:6.15

సూర్యాస్తమయం: 5.20


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

 పురాతన భాష ఏది?


నేను పరమాచార్య స్వామివారి దర్శనానికి మొదటిసారి శ్రీమఠానికి వెళ్ళినప్పుడు అక్కడ నలుగురు విదేశీయులు ఉన్నారు. ఒక ఇజ్రాయిలి, ఒక ఇటలీయుడు, ఒక జర్మనీయుడు, ఒక ఆంగ్లేయుడు. వారు ‘పాశ్చాత్య మరియు తూర్పు ఆసియాలో అత్యంత ప్రాచీన భాషలు’ అనే అంశంపై పి.హెచ్.డి చేయడానికి వచ్చారు. పాశ్చాత్య విభాగంలో లాటిన్, హీబ్రూ మరియు గ్రీకు భాషలు; తూర్పు ఆసియా విభాగంలో సంస్కృతము మరియు తమిళము అధ్యయనం చేస్తున్నారు. 


మహాస్వామి వారు అనుష్టానం కొరకు లోపలికి వెళ్ళారు. వారు స్వామివారి ఫోటో తీయాలనుకున్నారు కాని సహాయకులు ఒప్పుకోలేదు. వారు ఉదయం నుండి ఒక చెట్టు నీడన నిలుచున్నారు. స్వామివారి పూజ ఎంతసేపటికి అవుతుంది అని సేవకులను అడిగారు కాని వారికి సరైన సమాధానం దొరకలేదు. 


మహాస్వామి వారు పది నిముషాలలో బయటకు వచ్చారు. మేమందరమూ వెళ్ళి సాష్టాంగం చేసాము. మెడలో కెమరా తగిలించుకున్న వ్యక్తివైపు చూసి మహాస్వామి వారు ఫోటోలు తీసుకోండి అన్నట్టు సైగ చేసారు. మూడు చిత్రాలకు అనుమతి ఇచ్చి నాల్గవ చిత్రం తీస్తుండగా ఆపమన్నారు. వారి రాకకు కారణం అడిగారు. 

వారు వచ్చిన ఉద్దేశమును వివరించారు. 


మహాస్వామి వారు వారితో, ”ఏది అత్యంత ప్రాచీన భాష అని మీరు ఒక నిర్ణయానికి వచ్చారా?” అని అడిగారు. 


”పాశ్చాత్య భాషలలో హీబ్రూ చాలా ప్రాచీనమైనది. కాని తూర్పు ఆసియాలో సంస్కృతము తమిళము రెండు ప్రాచీనమైనవి అని అందరూ అంటున్నారు. మాకు అనుమానం వచ్చి మీ వద్దకు వచ్చాము” అని ఇజ్రాయిలీ చెప్పాడు.


అందుకు మహాస్వామి వారు “వీటన్నిటికంటే ప్రాచీనమైన భాష ఒకటి ఉంది. అది వైదిక భాష. సంస్కృతము హీబ్రూ కూడా దాని నుండే వచ్చాయి” అని అన్నారు. ”హీబ్రూ లో పునర్జన్మ గురించి ఒక శ్లోకం ఉంది. దాన్ని మొత్తం చెప్పగలవా?” అని ఇజ్రాయలీని అడిగి మొదటి రెండు పదాలు ఎత్తిచ్చారు.


అతను మూడు నాలుగు నిముషాలపాటు దాన్ని చెప్పాడు. స్వామి వారు చుట్టూ చూసి, అక్కడున్న పిల్లలతో “మీరు ఋగ్వేదం చదువుకున్నారా? ఈ శ్లోకాన్ని చెప్పగలరా?” అని అడిగారు. 


ఆ పిల్లలు ఐదు నిముషాలపాటు ఉచ్చరించారు. స్వామి వారు నాతో “ఈ పిల్లలు చెప్పినది వారికి అర్థమైందేమో అడుగు?” అన్నారు. 


నలుగురు ఏమి మాట్లాడలేదు. స్వామి వారు ఆ పిల్లలవైపు తిరిగి “ఇతను హీబ్రూ లో చెప్పినది మీకు ఖచ్చితంగా అర్థమై ఉండదు” అని అన్నారు. 


మరలా నావైపు తిరిగి, “ఆ ఇజ్రాయిలీతో చెప్పు అతను చెప్పినది ఈ పిల్లలు చెప్పినది రెండూ ఒక్కటేనని” అని అన్నారు. నేను అతనితో, “నువ్వు చెప్పిన శ్లోకం ఆ పిల్లలు చెప్పిన శ్లోకం రెండూ ‘ఉచ్చారణలలో’ ఒక్కటే అని స్వామివారు చెప్తున్నారు” అని చెప్పాను. 


”ఏమిటి? కేవలం ‘ఉచ్చారణలలో’ మాత్రమే కాదు ‘అక్షరాలలో’ కూడా రెండూ ఒక్కటే” అని నా మాటలను సరిచేసారు. 


ఈ విషయాన్ని నిరూపిస్తానని ఒక కలం కాగితం ఇమ్మనారు. “వేదాలలో భూగోళం 32 భాగాలుగా విభజించబడింది అని చెప్పబడింది. ఈ 32 భాగాలలోని ప్రతి భాగంలో వేదాక్షరాలు ఎలా మార్పు చెందాయి ఎలా ఉచ్చరింపబడతాయి అని కూడా చెప్పబడింది”. వచ్చిన ఆ నలుగురిని వారి ఏ ప్రాంతం వారో కనుక్కుని ప్రతి వేదాక్షరం వారి ప్రాంతాలలో ఎలా మార్పు చెందింది అనే విషయం చెప్పారు. ఆ పిల్లల్ని ఋగ్వేదం నుండి మళ్ళా ఒక శ్లోకం చెప్పమని ఆ శ్లోకంలోని ప్రతి అక్షారం వారి వారి ప్రాంతలో ఎలా పలుకుతారో చెప్పారు. 


ఆ పిల్లల వైపు తిరిగి “ఈ శ్లోకాన్ని నేను కొద్దిగా వేరే ఉచ్చారణలో హీబ్రూ భాషలో వీటిని ఎలా పలుకుతారో అలా చెప్తాను. అది తప్పు అనుకోకండి. వేదాలలో ఇది ఇలా కూడా ఉచ్ఛరించవచ్చు అన్న ఆదేశము ఉన్నది” అని అన్నారు. 


పరమాచార్య స్వామివారు మెల్లిగా మొదలుపెట్టారు. అద్భుతం ఆ ఇజ్రాయిలీ కూడా స్వామివారితో చెప్పడం ప్రారంభించాడు. 


మేమందరమూ నిర్ఘాంతపోయాము. “నేను అప్పుడే చెప్పాను. ఋగ్వేదములో ఉన్న శ్లోకమే హీబ్రూ లో కూడా ఉన్నదని. కాని అక్షరాలు కొద్దిగా మార్పుతో ఉంటాయి. (దక్షిణాన ‘యమున’ అంటే ఉత్తరాన ‘జమున’ అంటారు. దక్షిణాన ‘వ’ పశ్చిమ బెగాల్ లో ‘బ’. తమిళంలో ‘ప’ కన్నడంలో ‘హ’ అలా . . .) కాబట్టి ప్రపంచంలో అతి ప్రాచీనమైన భాష ‘వైదిక భాష’”


మహాస్వామి వారు ఆ నలుగురిని ఋగ్వేద అక్షరములు వారి వారి భాషలలో ఎలా ఉచ్చరింపబడతాయో ఒక పట్టిక వెయ్యమన్నారు. పదిహేను నిముషాలలో అంతా రాసారు. దాన్ని చూసి ఇజ్రాయిలీ ఆశ్చర్యముతో ఇది అసలు ఊహింపశక్యము కానిది అని అన్నాడు. 


స్వామి వారు అతనితో “ఏమిటి అన్ని భాషలూ వేద భాషనుండే పుట్టాయని ఇప్పుడు ఒప్పుకుంటావా?” అని అడిగారు. కాని అతని మొహంలో అతను ఒప్పుకున్నట్టు కనబడడంలేదు. ”హీబ్రూ నుండే వేదాలు పుట్టి ఉండోచ్చు. అని అతని సందేహము కదా?” అని అడిగారు. అందుకు అతను అవును “హీబ్రూ నుండే వేదాలు పుట్టి ఉండొచ్చు కదా?” అన్నాడు. 


స్వామి వారు నవ్వుతూ, “మీవద్ద తాళం మాత్రమే ఉంది. మా వద్ద తాళంచెవి కూడా ఉంది. వేదాలలో ఏ మహర్షి భారతదేశం నుండి వెళ్ళి ఇజ్రాయల్ లో వేదాన్ని వ్యాప్తి చేసారో అనే విషయం కూడా ఉంది” అని చెప్పారు. 


అతను చివరికి ఒప్పుకున్నాడు. 


--- తిరువణ్ణామలై గౌరీశంకర్ గారి తమిళ ఇంటర్వ్యూ వీడియో నుండి

Panchaag


 

Vijayawada oddly