*1983*
*కం*
అనవసరంబగు వారల
ననవరతము తలచుచుండ నవి గొప్పవగున్.
అనయము మననముజేయగ
ననతులు సహితము ఘనమగు నవనిన సుజనా.
*భావం*:-- ఓ సుజనా! అనవసరమైన వాటి ని గురించి నిరంతరం గా తలచుకొనుట వలన అవి గొప్పగా ప్రాచుర్యం పొందుతాయి. ఎల్లప్పుడూ స్మరించుకొనడం వలన అల్పములు(అనతులు) కూడా ఈ భూలోకంలో గొప గొప్పవిగా కీర్తించబడును.
*సందేశం*:-- అతిగా తలచుటచే అల్పములే గొప్పగా వర్ధిల్లుతాయి కనుక మంచి వాటి (వారి) నే ఎక్కువగా తలచుకొనవలెను,తద్వారా మంచి వర్ధిల్లుతుంది.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి