20, జనవరి 2021, బుధవారం

ధ్వజస్తంభ

 ఈ ధ్వజస్తంభ విశేషం 

మామూలుగా దేవాలయాలలో ధ్వజస్తంభం పైన జెండా ఆకారంలో ముందుకు ఉండి దానిలో మూడు చీలలను ఏర్పాటు చేస్తారు అవి మూడు వేదాలకు ప్రతీకలుగా చెప్తారు కానీ ఈ ధ్వజస్తంభ విశేషం ఏమంటే గర్భాలయ నమునాని దీనిపై ప్రతిష్టించారు తద్వార ఆలయ రూపం దాని సంప్రదాయం (శైవం లేదా వైష్ణవ అని ఇది వైష్ణవాలయం) తెలుస్తుంది ఇలాంటి ధ్వజస్తంభం మనం ఈ ఆలయం లోనే చూడగలం మన స్థపతుల నిర్మాణ శైలికి ఇది ఒక అద్భుత సాక్ష్యం!!!

అరుదైన "ధ్వజ స్తంభం" - మన్నార్గుడి, తమిళనాడు లోని రాజగోపాలస్వామి ఆలయంలో ఉంది.10 వ శతాబ్దం లో చోళ రాజులు దీనిని నిర్మించారు.

ఓం నమో నారాయణాయ!!!


(General concept...సాధారణంగా ప్రతి ఆలయానికి ధ్వజస్థంభం ఉంటుంది.... జాగ్రత్తగా పరిశీలిస్తే... ఇది ఆలయగోపురానికంటే ఎత్తుగా ఉంటుంది... దీనికి కారణం.. ధ్వజ స్థంభం పైభాగంలో ఉన్న రాగి లోహం ... మెరుపు మరియు ఉరుముల సమయంలో ఉన్న ఆవేశాన్ని ఆకర్షించి ఆయా ఆలయాలపై పిడుగులు పడకుండా చేస్తుంది... అందువలన ఉరుము తుఫానుల సమయంలో ఆలయంలో ప్రజలు ఆశ్రయం తీసుకున్నా.. పిడుగుపాటుకు గురయ్యేవారు కాదు.. ఎలా అయినా మన పూర్వీకుల విజ్ఞానం అర్థంచేసుకునే కొలది... పెరుగుతూనే ఉంది...

తప్పకుండా పిల్లలకు అలవాటు చేయండి.

 తప్పకుండా పిల్లలకు అలవాటు చేయండి.

🙏_ఎడమ వైపు నిద్ర పోవడం*🙏

భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని పచనం ( జీర్ణం ) చెయ్యటానికి జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది . మెదటగా మెదడు లోని రక్తం , తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది . అపుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది . అందు వలన నిద్ర వస్తుంది . నిద్ర పోవడం మంచిది .

ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవలెను . ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు *వజ్రాసనం* వేయండి . 

# రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు . కనీసం *2 గంటల* తర్వాత నిద్ర పోవాలి . మీరు వెంటనే నిద్ర పోవడం వలన *డయాబెటీస్* , *హార్ట్ ఎటాక్* వచ్చే ప్రమాదముంది .

*పడుకునే విధానం* :----

ఎడమ ప్రక్కకు తిరిగి , ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలి . 

# దీనిని *వామ కుక్షి* అవస్దలో విశ్రమించటం అంటారు . 

# మన శరీరంలో *సూర్యనాడి , చంద్ర నాడి మరియు మధ్యనాడి* అనే మూడు నాడులున్నాయి . సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చెయ్యటానికి పనికొస్తుంది . ఈ సూర్య నాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది . 

# మీరు అలసత్వానికి గురైయినపుడు , ఇలా ఎడమ వైపున తిరిగి పడుకొనుట వలన అలసత్వం తొలగి పోతుంది . మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు .

*ప్రయోజనాలు ( Benefits )* :--

1 . గురక తగ్గి పోవును . 

2. గర్బిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది . గర్బాశయంకు , కడుపులోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగును . వెన్ను నొప్పి , వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగును . 

3 . భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది . 

4 . వీపు , మెడ నొప్పులున్నవారు ఉపశమనం పొందెదరు . 

5 . శరీరంలో వున్న విషాలని , వ్యర్ద పదార్ధలని తొలగించే రసాయనాలకు తోడ్పడుతుంది .

6 . తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి నెట్టి వేయ బడును .

7 . కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి . 

8 . జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగును . 

9 . గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేయును . 

10 . గుండెలోని మంటను నిరోధిస్తుంది . కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి . 

11 . ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు . 

12 . కొవ్వు పదార్ధాలు సులభంగా జీర్ణం అవుతాయి . 

13 . మెదడు చురుకుగా పని చేస్తుంది . 

14 . పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోలు చేస్తుంది . 

15 . ఆయుర్వేధం ప్రకారం *ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి* .

ప్రతి ఒక్కరు వారి వారి పద్దతులలో నిద్రపోతారు . కావున వెంటనే మీరు మీ పద్ధతిని మార్చుకోవాలంటే చాలా కష్టం . కాని మీరు మీ ఆరోగ్యం కొరకు కొద్దిగా ప్రయత్నం చేస్తే మార్పు చేసుకోవచ్చును . 

ఎడమ వైపు తిరిగి పడుకొనిన యెడల , మీ శరీరంలో కలిగే మార్పులను ప్రతి రోజు మీరు గమనించ వచ్చును .

*మీరు ఈ చిన్న మార్పుని చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి*

*గమనిక* : ----

తల తూర్పు వైపు పెట్టి పడుకోవాలి . కుదరకపోతే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి . 

# ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు . చదువు కునేందుకు , ఏదైనా అభ్యాసానికి ఉత్తర దిశ మంచిది ...

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Hindu





శ్రీమద్భగవద్గీత

 🙏శ్రీమద్భగవద్గీత🙏

7వ అధ్యాయము 

జ్ఞాన విజ్ఞాన యోగము


మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే ।

యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ।। 3 ।।


మనుష్యాణాం — మనుష్యులలో; సహస్రేషు — వేల మందిలో; కశ్చిత్ — ఎవరో ఒకరు; యతతి — పరిశ్రమిస్తారు; సిద్ధయే — పరిపూర్ణ సిద్ధి కొరకు; యతతామ్ — ఈ ప్రయత్నించేవారిలో; అపి — కూడా; సిద్ధానాం — పరిపూర్ణ సిద్ది సాధించినవారిలో; కశ్చిత్ — ఎవరో ఒకరు; మాం — నన్ను; వేత్తి — తెలుసుకోనును; తత్త్వతః — యదార్ధముగా.


భావము 7.3: వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ది కోసం ప్రయత్నిస్తారు; మరియు పరిపూర్ణ సిద్ది సాధించిన వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను యదార్థముగా తెలుసుకుంటారు.


వివరణ: ఈ శ్లోకంలో 'సిద్ధి' అన్న పదం పరిపూర్ణత కోసం వాడబడింది. ఈ పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. సిద్ధి అన్న పదానికి సంస్కృత నిఘంటువు నుండి కొన్ని అర్థాలు ఇక్కడ చూడండి : అలౌకికమైన శక్తుల సంపాదన, పనిలో సాఫల్యము, విజయము, నిపుణత, నెరవేర్చుట, సమస్య కి పరిష్కారం, వంట లేదా ఏదేని పని పూర్తి, స్వస్థత, లక్ష్యాన్ని చేరుకొనుట, పక్వమునకు వచ్చుట, అత్యున్నత సుఖము, మోక్షము, అసాధారణ మైన నైపుణ్యం, పరిపూర్ణత. శ్రీ కృష్ణుడు ఈ పదాన్ని ఆధ్యాత్మికతలో పరిపూర్ణత కోసం వాడుతున్నాడు, ఇంకా అంటున్నాడు, "అర్జునా, అసంఖ్యాకమైన ఆత్మలలో అతి కొద్ది వాటికి మాత్రమే మానవ దేహం లభించింది. మానవ జన్మ పొందిన వారిలో, కొద్ది మంది మాత్రమే పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తారు. పరిపూర్ణత సాధించిన ఆ జీవాత్మలలో, నా సర్వశ్రేష్ఠమైన స్థాయిని మరియు దివ్య మహిమలను యెఱింగిన వారు చాలా అరుదు" అని.


ఆధ్యాత్మిక సాధనలో పరిపూర్ణత సాధించిన జీవులు, ఎందుకు భగవంతుడిని గూర్చి యదార్థముగా తెలుసుకోనలేరు? ఇది ఎందుకంటే, దేవుని పై భక్తి లేకుండా ఆయన గురించి తెలుసుకోవటం కానీ, గ్రహించటం కానీ సాధ్యం కాదు. కర్మ, జ్ఞాన, హఠ యోగులు వంటి ఆధ్యాత్మిక సాధకులు, వాటితో పాటుగా భక్తిని కూడా జోడించకపోతే, భగవంతుడి గురించి తెలుసుకోలేరు. భగవద్గీతలో, ఈ విషయాన్ని శ్రీ కృష్ణుడు పదే పదే చెప్తున్నాడు:


"ఆయన సర్వాంతర్యామి మరియు సర్వ భూతములు ఆయన యందే స్థితమై ఉన్నా సరే, ఆయన భక్తి ద్వారా మాత్రమే తెలుసుకోబడుతాడు. 8.22"


"అర్జునా, ఏ ఇతర మార్గం ద్వారా కాకుండా, కేవలం భక్తి ద్వారా మాత్రమే, నీ ముందే నిలబడి ఉన్న నేను ఎవరినో, యదార్థముగా తెలుసుకోబడుతాను. ఈ పద్దతిలో, నీవు నన్ను తెలుసుకొని, నా దివ్య దృష్టిని పొంది, నా యొక్క జ్ఞాన రహస్యాలలోనికి ప్రవేశించగలవు. " 11.54


"కేవలం ప్రేమ యుక్త మైన భక్తి ద్వారా మాత్రమే, నేను యదార్థముగా ఎవరో తెలుసుకోవచ్చు. నా వ్యక్తిత్వాన్ని భక్తి ద్వారా తెలుసుకున్న పిదప, నా దివ్య ధామానికి చేరుకుంటారు. " 18.55


ఈ విధంగా, భక్తి రహితంగా ఆధ్యాత్మిక పురోగతి కోసం పాటు పడే వారు భగవంతునిపై సిద్ధాంత పరమైన జ్ఞానానికే పరిమితమై పోతారు. వారికి పరమ సత్యము యొక్క వాస్తవిక అనుభవపూర్వక విజ్ఞానం లభించదు.


చాలా మంది మనుష్యులలో కొద్ది మందికి మాత్రమే తాను యదార్థముగా తెలియును అని చెప్పిన పిదప శ్రీ కృష్ణుడు ఇక తన ప్రాకృతిక (భౌతిక) మరియు దివ్య శక్తుల గురించి చెప్పబోతున్నాడు. మొదట 'అపరా ప్రకృతి', అంటే భౌతిక శక్తి క్షేత్రము, గురించి పరిచయం చేస్తున్నాడు; ఇది నిమ్న స్థాయి శక్తి అయినా భగవంతుని యొక్క శక్తి స్వరూపమే.

వెల్లుల్లితో వైద్యం -

 వెల్లుల్లితో వైద్యం  - 


 లక్షణాలు - 


     దీని రసం కారంగా ఉండును. వేడి చేయును . దీనిని లొపలికి తీసుకున్న మిక్కిలి వేడి చేయును . 


 ఉపయోగాలు  - 


 *  శరీరములో కఫముని పొగొట్టును. 


 *  శ్లేష్మంని పొగొట్టును.


 *  వాతము , బాలింతలకు వచ్చే సూతికా రోగము , టైఫాయిడ్ జ్వరం పొగొట్టును.


 *  దేహము అంతా చల్లబడే మహావాతం ను పొగొట్టును. 


 *  పాతకాలం నుంచి ఉండు జ్వరం పొగొట్టును. 


 *  వాతనొప్పులు , కీళ్లనొప్పులు , పక్షవాతం ని నిర్మూలించును. 


 *  ఊపిరి తీసుకుంటున్నప్పుడు వచ్చే ఊపిరిగొట్టు నొప్పి పొగొట్టును. 


 *  అజీర్ణం , అజీర్ణం వలన వచ్చే కడుపునొప్పి పొగొట్టును.


 *  శరీరం యొక్క ఉబ్బుని నిర్మూలించును. 


 *  కడుపులో ఏర్పడే బల్లలు నివారించును. 


 *  గుల్మము , మూలవ్యాధి , కుష్టు , క్షయ ని నివారించును. 


 *  నోటికి రుచి లేకపోవటం , హుద్రోగము , ఆస్తమా , తలనరములకు సంబంధించిన రోగములు నివారించబడును. 


 * బ్రాంకైటిస్ , ఒంటినొప్పులు నివారించబడును. 


 *  దేహము పచ్చబరుచునట్టి జ్వరముని నివారించబడును. 


 *  విరిగిన ఎముకలను అతుక్కోనున్నట్టు చేయును . 


 *  మూత్రము , చెమటని శుభ్రపరచును. 


 *  కంఠస్వరం ని బాగుగా చేయును . 


 *  చేతులు , కాళ్లు వణికే రోగమును పొగొట్టును .


 *  మూత్రపు సంచిలో పుట్టెడు రాయిని కరిగించును. 


 *  స్త్రీలకు పాలు ఉత్పత్తి అయ్యేలా చేయును . 


 *  అంజూరా , అక్రోటుతో తినిన విషము విరుచును. 


 * వెల్లుల్లిపాయల రసముని , వెల్లుల్లి పాయలు వేసి కాచిన నూనె గాని చెవిలో పోసిన చెవుడు , చెవినొప్పి మాయం అగును. 


 *  వెల్లుల్లిపాయలలో పసుపువేసి నూరి పక్షవాతం వచ్చిన అంగములకు పట్టించిన పక్షవాతం నివారణ అగును. 


 *  వెల్లుల్లిపాయలు నూరి కట్టిన గోరుచుట్టు , కణుపు మీద పుట్టిన గడ్డ , గడ్డలు నివారణ అగును. 


 *  ఒకే రెక్క కలిగిన వెల్లుల్లిపాయ ని రెండుముక్కలుగా కోసి ఒక ముక్కని పాము కరిచిన చోట అంటించిన విషము హరించును . విషము పీల్చడంలో దీనిని మించినది లేదు . 


 *  పచ్చి వెల్లుల్లిపాయని ప్రతిరోజు తినుచుండిన అతిమూత్ర వ్యాధి కట్టును . మోతాదు పూటకు 1 రెబ్బ నుంచి 8 రెబ్బలు వరకు పెంచుకుంటూ వెళ్లవలెను . ఇలా రెండు పూటలా తినవలెను .


 *  ఆవనూనెలో వెల్లుల్లిపాయలు వేసి కాచి వడగట్టి ఆ నూనె పూసిన గజ్జి , చిడుము మానును . 


  దీనిని అతిగా వాడటం వలన కలుగు నష్టాలు -


 

 *  శరీరం నందు మిక్కిలి వేడి చేయను.


 *  రక్తము నందు పైత్యంని హరించును . 


 *  తలనొప్పిని కలుగజేయును .


 *  కండ్లకు హానిచేయును .


 *  స్ప్లీన్ , ప్రేవులకు హానిచేయను . 


 *  గర్భిణీ స్త్రీలు వాడరాదు. 


 *  రక్తవిరేచనాలు కలిగించును.


 *  రక్తపోటు పెంచును. 


 *  వేడి శరీరం గలవారు అతితక్కువ మోతాదులో వాడవలెను . 


 *  దాహము కలిగించును. 


     దీనికి విరుగుళ్లు  నెయ్యి , దానిమ్మ రసం , పులుసు , పాలు , బాదము నూనె 


 గమనిక  - 


         ఈ మధ్య చాలామంది వెల్లుల్లిపాయని ఎటువంటి అనుపానం లేకుండా తీసుకుంటున్నారు. అలా తీసుకొవడం వలన విపరీత ఫలితాలు కలుగుతాయి . 


       వెల్లుల్లి రెబ్బలని అన్నం ఇగురుతున్నప్పుడు 

దానిలో గుచ్చి అన్నంతోపాటు తినవలెను . కారం లేకుండా ఉడికి ఉంటాయి.


      వెనిగర్ లో నానబెట్టి కొన్ని దినముల తరువాత ఉపయొగించవలెను .  


      పైన చెప్పిన పద్ధతులని ఉపయోగించి వెల్లుల్లి ని తీసుకోవడం వలన అద్భుత ఫలితాలు వస్తాయి . రక్తనాళాలోని కొవ్వుని కూడా నివారిస్తుంది.


  

      గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

అన్నమాచార్య చరితము

 🌹అన్నమాచార్య చరితము 🌹



సర్వేశ్వరుని కృపన్ సంకల్ప మొందియు 

           యానాటి నుండియు యన్నమయ్య 

దినమున కొకభక్తి  దివ్యగీతంబుతో 

             పరమాత్మ శ్రీ హరిన్ ప్రస్తుతించి 

యానంద పరవశం బనుభవించుచు నుండె 

              యత్యంతగా తన యాత్మ యందు 

అన్నమాచార్యుని  హరి కీర్తనంబులు 

              తిరుమల దాటియు తిరిగె భువిలొ 

వేంకటేశుకు జరిగెడి వేడుకలను 

నిగమ వేద్యుకు జరిగెడి నిత్య పూజ 

శ్రీని వాసుకు జరిగెడి సేవ లన్ని 

వర్ణనము జేసె పాడెను  నన్నమయ్య 


కొండ పైన నతడు కొండలరాయుని 

యర్చనంబు జేసి యనుదినంబు 

తిరిగి పయనమయ్యు తిరుమల నుండియు 

తాళ్ళ పాక జేరె సతుల తోడ 


అన్నమయ్యంతట హరికీర్తనంబుల

        నప్పటి కప్పుడు జెప్పు చుండ 

సంతోషడెందాన సహచరశిష్యులు 

         గ్రంధస్థపరచేరు కంఠబట్టి 

కాలగర్భము నందు గలసిపోకుండగ 

           పదికాలముల పాటు భద్రపరచ 

తదుపరి వానిని తామ్ర రేకుల పైన 

          చెక్కించి యుంచేరు సిద్ధముగను 

యన్నమయ్య నోటి హరికీర్తంబులు 

వాడ వాడ లందు వ్యాప్తి పొంది 

సకల జనుల యొక్క సన్మతి గెలిచియు

నిలిచె పదకవితగ నిఖిల మందు 


తదుపరన్నమయ్య ధర్మపత్నులతోడ 

తీర్థయాత్ర లందు దిరుగ నెంచి 

సకల దేవళముల సందర్శనము సేయ 

పయనమయ్యె తాళ్లపాక నుండి 


              తీర్థ యాత్రలు     


తొలుత తన గ్రామమందున వెలసి యున్న 

చెన్నకేశవు దర్శించి సన్నుతించి 

సకల సంబారముల తోడ సతుల తోడ 

భక్తి మీరగ యాత్రకు పయన మయ్యె 


మార్గ మధ్యమందు మహిమాన్వితంబగు 

నందలూరు గ్రామ నడిమి నున్న 

సౌమ్యనాధ స్వామి సన్నిధిం జేరియు 

ప్రణతు లిడెను మిగుల భక్తి తోడ 


ఘనత నొంటిమిట్ట గ్రామంబు నందున్న 

రఘుకుల గుణధాము రామచంద్రు

దివ్య  దర్శనంబు భవ్యంబుగా పొంది 

ప్రణతు లిడెను  మిగుల భక్తి తోడ 


కడప నగరమందు కడు వైభవంబున 

వెలసి యుండినట్టి వెంకటేశు 

కన్నులార గాంచి కాన్కల నర్పించి 

ప్రణతు లిడెను మిగుల భక్తి తోడ 


చనియు నన్నమయ్య చాగలమర్రికి 

చెన్నకేశవుడిని సన్నుతించె 

కన్నులార గాంచి కాన్కల నర్పించి 

ప్రణతు లిడెను మిగుల భక్తి తోడ 


తదుప రన్నమయ్య దారిలో నెలకొన్న 

వివిధ దేవళముల వేడ్క జూచి 

క్షితిని నారసింహ క్షేత్రమై వర్ధిల్లు 

శ్రీ యహోబిలమును జేరె కడకు


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

శంఖనిధి, పద్మనిధి

 🌹  *శంఖనిధి, పద్మనిధి అంటే ఎవరో తెలుసా..?* 🌹

(20.1.21)


తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకులవలె సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు ఉన్నాయి.  ఆలయంలోనికి ప్రవేశించే ముందు భక్తులు తమ  కాళ్ళను ప్రక్షాళన చేసుకుంటారు. అక్కడే శ్రీవారి ఆలయం గడపకు ఇరుప్రక్కలా కనిపిస్తాయి శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు.  సాధారణంగా భక్తులు తమ కాళ్ళను కడుక్కునే ఆలోచనలో ఉంటాము. కాబట్టి ఈ శంఖనిధి, పద్మనిధి విగ్రహాలను గమనించే అవకాశం తక్కువగా ఉంటుంది. దానికి తోడు ఎంతోసేపు ఎదురుచూసిన ఆలయప్రవేశం ఆనందంలో కూడా గమనించం.


తిరుమలలో శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ముందు వారు ఎవరో ముందు తెలుసుకుందాం.


శంఖనిధి, పద్మనిధులు శ్రీ వేంకటేశ్వరస్వామివారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. ఇందులో ఎడమవైపున అంటే దక్షినదిక్కున ఉన్న రక్షకదేవత పేరు శంఖనిధి, ఇలాగే కుడిప్రక్కన అంటే ఉత్తరదిక్కున ఉన్న రక్షకదేవత పేరు పద్మనిధి . శంఖనిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ధరించివుంటాడు. పద్మనిధి రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి. ఆగమ శాస్త్రం ప్రకారం సాధారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకార ప్రవేశద్వారంవద్ద ఏర్పాటు చెయ్యడం సంప్రదాయం.


దీన్ని బట్టి తిరుమల ఆలయం మూడుప్రాకారాలు కలిగిన ఆలయమని తెలుస్తోంది. ఈ నిధిదేవతల పాదాలవద్ద ఆరంగుళాల పరిమాణంగల రాజవిగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉండడం గమనించవచ్చు. ఈ విగ్రహం విజయనగర రాజైన అచ్యుతదేవరాయలది. బహుశా అచ్యుతరాయలే ఈ నిధిదేవతలను ప్రతిష్టించి ఉంటాడనవచ్చు. ఇంతకు ముందు వీరిని మీరు గమనించివుండకపోతే ఈసారి శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు గమనించి నమస్కరించి ఆలయంలో ప్రవేశించండి.

శ్రీచక్రార్చన

 శ్రీచక్రార్చన వివరణ...!! శ్రీచక్రానికి మించిన చక్రము ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకే అది “చక్రరాజము” అయినది. సమస్త దోషములను నివారించి సమస్త కోరికలను తీర్చి, సకల సౌభాగ్యాలు ఇచ్చే దివ్యమైన యంత్రము శ్రీచక్రం. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన అందరికీ సులభసాధ్యమైన పని కాదు. అయిననూ పట్టుదలతో శ్రద్ధతో సాధించలేనిది ఏదీ లేదు ఈ లోకంలో. మానవ దేహమే శ్రీచక్రము. సాధకుని దేహమే దేవాలయము. మానవ దేహము నవ రంద్రములతో కూడినది. శ్రీచక్రము తొమ్మిది చక్రముల సమూహము. శరీరంలోని షట్చక్రాలకూ, శ్రీచక్రము లోని తొమ్మిది చక్రములకు అవినాభావ సంబధము కలదు. శరీరంలోని తొమ్మిది ధాతువులకు ఇవి ప్రతీకలు. శ్రీచక్రము లోని తొమ్మిది చక్రములను తొమ్మిది ఆవరణములుగా చెప్పెదరు. అందుకే శ్రీచక్రమునకు నవావరణ పూజ చేయుదురు. నాలుగు శివ చక్రములు, ఐదు శక్తి చక్రములు కలసి మొత్తం తొమ్మిది చక్రములతో శ్రీదేవి విరాజిల్లుతూ వుంటుంది. తొమ్మిది చక్రములలో విడివిడిగా ఒక్కో దేవత వసిస్తూ వుంటుంది. చివరన బిందువులో కామకామేశ్వరులు నిలయమై వుంటారు. శివ, శక్తి, చక్రములతో కలసి శివశక్తైక్య రూపిణి లలితాంబిక అయినది. అర్ధనారీశ్వర తత్వమై, కామ కామేశ్వరుల నిలయమై, సృష్టికి ప్రతి రూపమై వెలుగొందినది ఈ శ్రీచక్రము. సృష్టికి సూక్ష్మ రూపమే ఈ శ్రీచక్రము. శ్రీ దేవి నిలయమే ఈ శ్రీచక్రము. శ్రీచక్రమే శ్రీదేవి. శ్రీదేవియే శ్రీచక్రము. శ్రీచక్రము 3 రకములుగా లోకంలో పూజింపబడుచున్నది. ౧. మేరు ప్రస్తారము ౨. కైలాస ప్రస్తారము ౩. భూ ప్రస్తారము. సప్త కోటి మహా మంత్రములతో సర్వ దేవతా స్వరూపమైన శ్రీచక్రమును విప్పూజించిన యెడల, సర్వ శక్తులూ, జ్ఞానము, మోక్షము ప్రాప్తించునని మన పూర్వీకులు, ఋషులు విప్వక్కాణించి యున్నారు. శ్రీచక్రము యొక్క నాలుగు ద్వారాలు నాలుగు వేదాలకు ప్రతీకలు. ఆ ద్వారాలలో గనుక ప్రవేశించి నట్లైతే దేవీ సాక్షాత్కారం లభించినట్లే. ఈ శ్రీవిద్యను మొదట్లో పరమేశ్వరుడు పరమేశ్వరికి ఉపదేశించెను. పరమేశ్వరుడు జగత్తునందు గల ప్రాణుల కామ్య సిద్దుల కొరకు చతుషష్టి (64) తంత్రములను సృష్టించెను. కామేశ్వరీ దేవి కోరిక మేరకు చతుర్విధ పురుషార్ధములు ఒక్క మంత్ర తంత్రము వలన కలుగు 

షడాననం

 షడాననం చందన లేపితాంగం

మహోరసం దివ్య మయూర వాహనం

రుద్రస్య సూనుం సురలోక నాథం

బ్రహ్మణ్య దేవం శరణం ప్రపధ్యే


జాజ్వల్య మానం సురబృంద వంద్యం

కుమారధారా తట మంతిరస్తం

కందర్ప రూపం కమనీయ గాత్రం

బ్రహ్మణ్య దేవం శరణం ప్రపధ్యే


ద్విషట్భుజం ద్వాదశ దివ్యనేత్రం

త్రైతనుం శూలమశిం దధానం

శేషావతారం కమనీయరూపం

బ్రహ్మణ్య దేవం శరణం ప్రపధ్యే


సురారి ఘోరాహవ శోభమానం

సురోత్తమం శక్తిధరం కుమారం

సుధార శక్త్యాయుత శోభి హస్తం

బ్రహ్మణ్య దేవం శరణం ప్రపధ్యే


ఇష్టార్థ సిద్ధిప్రద మీశ పుత్రం

ఇష్టాన్నధం భూసుర కామధేనుం

గంగోద్భవం సర్వ జనానుకూలం

బ్రహ్మణ్య దేవం శరణం ప్రపధ్యే


యశ్లోక పంచకమిదం పఠతేచ భక్త్యా

బ్రహ్మణ్య దేవ వినివేశిత మానసః సన్

ప్రాప్నోతి భోగమాఖిలం భువి యద్యదిష్టం

అంతేస గచ్ఛతి ముదాగుహ సామ్యమేవ


                     - ఆది శంకరాచార్యులు

            గానం - శంకరన్ నంబూద్రి