ప్రశ్న పత్రం సంఖ్య: 37 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.
1) తోలి పూజల వేల్పు ఎవరు
i ) వినాయకుడు ii ) సుబ్రమణ్యస్వామి iii )విష్ణుమూర్తి iv ) బ్రహ్మదేముడు
2) ఏదయినా పని చేసే ముందు ఎలక్ట్రీషన్ కరంటు ఉందొ లేదో తెలుసుకోవటానికి వాడే పరికరం
i ) స్క్రూడ్రైవరు ii ) కటింగ్ ప్లేయర్ iii ) టెస్టర్ iv ) పానా
3) చర్మవ్యాధులు రాకుండా ఇలా నివారించ వచ్చు
i ) ప్రతి రోజు స్నానం చేయటం వలన ii ) సంపెంగి నూనె పూసుకోవటం వలన iii ) అత్తరు పూసుకోవటం వలన iv ) సెంట్ పూసుకోవటం వలన
4) రామాయణంలో ________వేట
i ) జింకల ii ) తాటకి iii ) పిడకల iv ) పులి
5) చిరస్మరణీయుడు అనగా
i ) ఎప్పటికి స్మరణకు రానివాడు ii ) అప్పుడప్పుడు స్మరించదగిన వాడు iii ) ఎప్పుడు స్మరించదగిన వాడు iv ) దుర్మార్గుడు .
6) సీతాదేవికి ఆ పేరు ఎలావచ్చింది
i ) జనక రాజు కూతురు కాబట్టి ii ) నాగలి చాలు నందు దొరికినందున iii ) సీతాఫలం చెట్టుక్రింద దొరికినందుకు iv ) యాజ్ఞవల్క్ మహర్షి యజ్ఞం చేయించినందుకు
7) పంచ భీములలో ఒకరు
i ) దృతరాష్టుడు ii ) జరాసంధుడు iii ) భార్గవుడు iv ) విశ్వామిత్రుడు
8) పురాణాలూ ఎన్ని
i ) 14 ii ) 19 iii ) 18 iv ) 24
9) దనం మూలం ఇదం జగత్ అనగా
i ) దనమే అన్నిటికి కారణం అని , ii ) జగత్తు మొత్తం ధనమే అని iii ) ములలో ధనము ఉంటుందని iv ) ధాన్యము కూడా దనం అని
10) మనిషి శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది
i ) కాలేయము ii ) గుండె iii ) మూత్ర పిండాలు iv ) జీర్ణాశయము
11) గజ స్నానం అని ఎప్పుడు ఉపయోగిస్తాము అనగా
i ) ఏనుగు చేసే స్నానం ii ) కుక్క స్నానం iii ) స్నానం సంపూర్ణంగా చేయనప్పుడు iv ) సబ్బు లేకుండా స్నానం చేసినప్పుడు
12) సింహ బలుడు అని ఈయనని అంటారు
i ) కీచకుడు ii ) మారీచకుడు iii ) సైన్ధవుడు iv ) అత్రి మహర్షి
13) ఎప్పుడు సంపద కలిగిన
i ) అప్పుడు రాబందులు వచ్చును ii ) అప్పుడు రోగములు వచ్చును iii ) అప్పుడు కళ్ళు నెత్తికి ఎక్కును iv ) అప్పుడు బంధువులు వత్తురు
14) అరుణోదయం అనగా
i ) సూర్యోదయానికన్నా ముందు యెర్రని కాంతి ii ) చేంద్రోయంకన్నా ముందు శ్వేతకాంతి iii ) సూర్యోదయం iv ) చేంద్రోదయం
15) ఇంటి స్లాబులో సిమెంట్, కంకర, ఇసుక కలిపే నిష్పత్తి
i ) 1,2,4 ii ) 1,3,4 iii ) 2,3,5 iv ) 2,2,3
16) కపర్ది అనునది ఈ దేముడికి సంబందించినది
i ) పరమ శివుడు ii ) విష్ణు మూర్తి iii )బ్రహ్మ దేముడు iv ) ఇంద్ర దేముడు.
17) జాతక శాస్త్ర ప్రకారం మనిషి గరిష్టంగా ఎన్ని సంవత్సరాలు బ్రతక వచ్చు.
i ) 75 సంవత్సరాలు ii ) 87 సంవత్సరాలు iii ) 100 సంవత్సరాలు iv ) 120 సంవత్సరాలు
18)భూ ప్రపంచంలో భూమి ఎన్నవ వంతు వున్నది.
i ) 1/3 ii ) 1/2 iii ) 1/5 iv ) 1/9
19) లా అఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అనునది ఈ శాస్త్రంలో చదువుతాం.
i ) ఇంగ్లీష్ ii ) ఎకనామిక్స్ iii ) చరిత్ర iv ) రాజనీతి శాస్త్రం
20) తనదుర సందులేదు కానీ మెడకోక ______
i ) తబలా ii ) డోలు iii ) వీణ iv ) పియానో