2, ఏప్రిల్ 2025, బుధవారం

శారదనీరదేందు

 శారదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికా

హార, తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మం

దార, సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభా

కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు, భారతీ!


టీకా:

శారద = శరదృతు; నీరద = మేఘము; ఇందు = చంద్రుడు; ఘనసార = కర్పూరం; పటీర = మంచిగంధం; మరాళ = హంస; మల్లికా = మల్లిపువ్వుల; హార = దండ; తుషార = మంచు; ఫేన = నురుగు; రజత = వెండి; అచల = కొండ; కాశ = రెల్లుపువ్వులు; ఫణీశ = ఆదిశేషుడు; కుంద = అడవిమల్లె; మందార = కల్పవృక్షము; సుధా = పాల; పయోనిధి = సముద్రము; సిత = తెల్లని; తామరస = తామరపువ్వు; అమర వాహినీ = ఆకాశ గంగ {అమరవాహిని - అమర (దేవతల) వాహినీ (నది) - ఆకాశగంగ}; శుభ = శుభకర మైన; ఆకారతన్ = ఆకారముతో; ఒప్పు = అమరు; నిన్ను = నిన్ను; మదిన్ = మదిలో; కానగ = చూచుట; ఎన్నడు = ఎప్పుడు; కల్గు = కలుగుతుంది; భారతీ = సరస్వతీదేవీ.


భావము:

భారతీదేవి! తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగా నీ ఉజ్జ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తి వైన నీ దర్శనం కన్నులార మనసుదీర ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లీ!

లిపిడ్ ప్రొఫైల్*

 *⚡లిపిడ్ ప్రొఫైల్*

*అద్భుతంగా వివరించబడింది*  

ఒక ప్రముఖ వైద్యుడు లిపిడ్ ప్రొఫైల్‌ను ఒక ప్రత్యేక మార్గంలో వివరించేందుకు ఒక అందమైన కథను పంచుకున్నారు.  


**మన శరీరాన్ని ఒక చిన్న పట్టణంగా ఊహించుకోండి.** ఈ పట్టణంలోని ప్రధాన ఇబ్బంది కలిగించేవారు *కొలెస్ట్రాల్*. వారికి కొన్ని సహాయకులూ ఉన్నారు. ప్రధాన సహచరుడు *ట్రైగ్లిసరైడ్*. వారి పని ఏమిటంటే, రోడ్లపై తిరుగాడి గందరగోళాన్ని సృష్టించడం, మార్గాలను అడ్డుకోవడం.  


*హృదయం* ఈ పట్టణం యొక్క సిటీ సెంటర్. అన్ని రోడ్లు హృదయానికి దారితీస్తాయి. ఇబ్బంది కలిగించేవారి సంఖ్య పెరిగినప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలుసు. వారు హృదయం యొక్క పనితనాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు.  


కానీ మన శరీర-పట్టణానికి ఒక పోలీస్ ఫోర్స్ కూడా ఉంది.  

*HDL* మంచి పోలీస్, ఇబ్బంది కలిగించేవారిని అరెస్ట్ చేసి జైలులో (కాలేయం) ఉంచుతాడు. కాలేయం వారిని శరీరం నుండి డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటకు తోసేస్తుంది.  


అయితే, ఒక చెడ్డ పోలీస్ కూడా ఉన్నాడు, *LDL*, అతను శక్తి కోసం ఆశించేవాడు.  

*LDL* ఇబ్బంది కలిగించేవారిని జైలు నుండి విడుదల చేసి తిరిగి రోడ్లపైకి పంపుతాడు.  


మంచి పోలీస్ *HDL* కంటే చెడ్డవారు ఎక్కువగా ఉన్నప్పుడు, పట్టణం గందరగోళంగా మారుతుంది. అలాంటి పట్టణంలో ఎవరు ఉండాలనుకుంటారు?  


*మీరు ఇబ్బంది కలిగించేవారిని తగ్గించి, మంచి పోలీసులను పెంచాలనుకుంటున్నారా?*  


**నడవడం ప్రారంభించండి!** ప్రతి అడుగుతో, మంచి పోలీసులు *HDL* పెరుగుతారు, మరియు ఇబ్బంది కలిగించేవారు *కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్, మరియు LDL* తగ్గుతారు.  


మీ పట్టణం (శరీరం) తిరిగి దీప్తిని పొందుతుంది. మీ హృదయం, సిటీ సెంటర్, ఇబ్బంది కలిగించేవారి బ్లాకేడ్‌లు (హృదయ బ్లాక్) నుండి సురక్షితంగా ఉంటుంది. మరియు మీ హృదయం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.  


*కాబట్టి, మీకు అవకాశం దొరికినప్పుడల్లా నడవడం ప్రారంభించండి!*  

*ఆరోగ్యంగా ఉండండి... మరియు*  

*మంచి ఆరోగ్యాన్ని పొందండి*  


ఇది మంచి *HDL* ను పెంచడానికి మరియు చెడ్డ *LDL* ను తగ్గించడానికి ప్రధానంగా నడక ద్వారా సాధించే ఒక మంచి వ్యాసం. *ప్రతి నడక అడుగు HDL ను పెంచుతుంది. అందువల్ల, నడవండి, నడవండి మరియు నడవండి.*  

*సుఖంగా ఉండే సీనియర్ సిటిజన్స్ వీక్*  


### **తగ్గించాల్సినవి:**  

1. ఉప్పు  

2. చక్కెర  

3. బ్లీచ్ చేసిన పిండి  

4. పాల ఉత్పత్తులు  

5. ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు  


### **కావలసిన ఆహారాలు:**  

1. కూరగాయలు  

2. పప్పులు  

3. బీన్స్  

4. గింజలు  

5. గుడ్లు  

6. కోల్డ్ ప్రెస్డ్ నూనె (ఆలివ్, కొబ్బరి, ...)  

7. పండ్లు  


### **మరచిపోయేందుకు ప్రయత్నించాల్సిన మూడు విషయాలు:**  

1. మీ వయస్సు  

2. మీ గతం  

3. మీ ఫిర్యాదులు  


### **ప్రాముఖ్యమైనవి మరియు ప్రియమైనవి:**  

1. మీ కుటుంబం  

2. మీ స్నేహితులు  

3. మీ సానుకూల ఆలోచనలు  

4. శుభ్రమైన మరియు ఆహ్లాదకరమైన ఇల్లు  


### **అవలంబించాల్సిన మూడు ప్రాథమిక విషయాలు:**  

1. ఎప్పుడూ నవ్వండి / చిరునవ్వు  

2. మీ స్వంత వేగంతో క్రమం తప్పకుండా శారీరక కార్యకలాపాలు చేయండి  

3. మీ బరువును తనిఖీ చేసి నియంత్రించండి  


### **అభ్యసించాల్సిన ఆరు ముఖ్యమైన జీవనశైలులు:**  

1. దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగడానికి వేచి ఉండకండి  

2. అలసిపోయినప్పుడు మాత్రమే విశ్రాంతి తీసుకోవడానికి వేచి ఉండకండి  

3. అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వేచి ఉండకండి  

4. అద్భుతాల కోసం దేవుడిని నమ్మడానికి వేచి ఉండకండి  

5. మీలోని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి  

6. సానుకూలంగా ఉండి, ఎల్లప్పుడూ మంచి రేపటి కోసం ఆశించండి  


*మీ స్నేహితులు ఈ వయస్సు పరిధిలో (47-90 సంవత్సరాలు) ఉంటే, దయచేసి వారికి ఈ సందేశాన్ని పంపండి.* 


🙏 *_సర్వేజనా సుఖినోభవంతు._*

ఉచితం

 ఉచితం


ఎవరైనా హిందూ సోదరుడు తన కొడుకును హరిద్వార్ గురుకుల్‌లో చదువు కోసం చేర్చాలనుకుంటే, మార్చి 15, 2025 నుండి జూలై 15, 2025 వరకు హరిద్వార్‌లోని ఆచార్య పాణిగ్రహి చతుర్వేద సంస్కృత వేదపాఠశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి.


"ఆ పిల్లవాడు 6వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి."


గురుకులంలో వసతి, ఆహారం మరియు అన్ని ఇతర సౌకర్యాలు పూర్తిగా ఉచితం. అదనంగా, నెలకు ₹8,000 స్కాలర్‌షిప్ అందించబడుతుంది. పిల్లవాడు నాలుగు వేదాలు, వ్యాకరణం, సాహిత్యం, ఇంగ్లీష్ మరియు ఇతర ఆధునిక విషయాలలో విద్యను పొందుతాడు. గురుకుల్ వేదాలలో నిపుణుడిగా మారడానికి మరియు M.A వరకు ఉన్నత చదువులకు మార్గదర్శకత్వం అందించడానికి కూడా సహాయపడుతుంది.


ఈ సందేశాన్ని మీ అన్ని హిందూ సమూహాలలో పోస్ట్ చేయండి.

మీ మతం యొక్క గొప్ప విద్యా సంప్రదాయానికి మద్దతు ఇవ్వడానికి వీలైనంత ఎక్కువ మంది హిందువులకు ఈ సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించండి.


వెంటనే సంప్రదించండి!

హీరాలాల్ జీ – 9654009263


(ఈ సందేశం హిందువుల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు అందరు హిందువులకు చేరాలి.)


✊ జై! హిందూ!!🚩

నమస్కార ఫలం

 నమస్కార ఫలం (శృ౦గేరి శారదా పీఠం 35వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్ధ మహాస్వామి వారి జీవిత విశేషం) ఒక భక్తుడు దేవునికి ఇలా నివేదించుకుంటున్నాడు. “స్వామీ నేను చేసిన రెండు తప్పులను క్షమించి కాచు” అని సాష్టాంగపడి నమస్కార పూర్వకంగా అంటున్నాడు. రెండు తప్పులు ఏమిటి అంటే : ౧. నేను గత జన్మలో నీకు నమస్కారం చెయ్యలేదు. చేసి ఉన్నట్లయితే నాకు ఈ జన్మ ప్రాప్తించేది కాదు. కాబట్టి ఈ జన్మలో నీకు భక్తి పూర్వకంగా నమస్కరించుకుంటున్నాను. రెండవ తప్పు నేను మరొక జన్మలో నీకు నమస్కారం చెయ్యలేను. ఎందుకంటే ఈ జన్మలో నమస్కరిస్తున్నాను కాబట్టి నాకు మరు జన్మ లేదు. కాబట్టి ఉత్తరోత్తరా జన్మల ప్రశ్నే లేదు. కావున నా ఈ రెండు మహాపరాధాలను క్షమించి కాచుకో అని అర్ధిస్తున్నాడు. మన భక్తి కూడా ఇలా వుండాలి. మనమూ చేస్తున్నాము రోజూ నమస్కారం. అదొక సాధారణ క్రియగా మారింది తప్ప త్రికరణ శుద్ధిగా చేస్తున్నామా? మనం త్రికరణ శుద్ధిగా నమస్కరించినప్పుడు మనము కూడా ఆ భక్తుని స్థితికి చేరుకుంటాము. శివభుజంగస్తోత్రంలో శంకరులు ఇలా అంటారు. నేను పశువు సమానుడను. నువ్వు పశుపతివి. పశువు అయితే కాచవా అంటే నీ వాహనం నంది. కావున నువ్వు నన్ను కాచి కాపాడాలి. కాదు నేను పశువు కన్నా హీనుడవందువా నన్ను కాస్తేనే నీకు దరిద్రజన పోషక అన్న నామం సార్ధకమవుతుంది. నేను అపరాధాల చక్రవర్తిని. నన్ను కాచి నీ నామం స్థిరం చేసుకో. పోనీ పాపులను నువ్వు కాపాడవా అంటే అత్యంత హేయమైన పనులు చేసిన చంద్రుడిని నువ్వు నెత్తిన పెట్టుకున్నావు. తన భార్యలందరినీ ఒక్కమాదిరి చూసుకుంటానని మాటిచ్చి తప్పి, స్వయంగా తన గురు పత్నినే అపహరించిన చంద్రుడు అత్యంత ఘోరమైన తప్పులు చేసిన వాడు. అతడినే నువ్వు రక్షించ గలిగినప్పుడు నన్ను బ్రోచి కాపాడు మహేశ్వరా అని వేడుకుంటాడు. మనం కూడా త్రికరణ శుద్ధిగా ఆయనకు సర్వస్య శరణాగతి చేసి ఆయనను వేడుకుంటే తప్పక కాపాడతాడు. రక్షిస్తాడు. ఉద్ధరిస్తాడు. #SringeriJagadguruVaibhavam #శృంగేరిజగద్గురువైభవం

అనుబంధం

 🔔 *అనుబంధం* 🔔


*మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.ఇది చాలా అద్భుతమని  ఆశ్చర్యపోతుంటాం!!*


*మన చుట్టూ ఉన్న 7 అద్భుతాలు*


1. *తల్లి*

మనల్ని ఈలోకానికి  పరిచయం చేసిన వ్యక్తి,మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన తల్లి  1వ అద్భుతం!


2. *తండ్రి*

మన కళ్ళల్లో  ఆనందాన్ని చూడాలని  తన కన్నీళ్లను దాచేస్తాడు.మన పెదవులపై  చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు.దుఃఖాన్ని  తాను అనుభవిస్తూ,సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి 2వ అద్భుతం!


3. *తోడబుట్టిన వాళ్ళు*

మన తప్పులను వెనకేసుకురావాడానికి,మనతో పోట్లాడడానికి,మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు.తోడబుట్టినవాళ్లు 3వ అద్భుతం!


4..*స్నేహితులు*

మన భావాలను పంచుకోవడానికి,మంచి చెడు అర్థం అయ్యేలా చెప్పడానికి, ఏది ఆశించకుండామనకు దొరికిన స్నేహితులు. 4వ  అద్భుతం!


5. *భార్య / భర్త*

ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలనుఎదిరించేలా  చేస్తుంది. కలకాలం తోడు ఉంటూ ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే,ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది.భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే  5వ అద్భుతం మన సొంతం!


6. *పిల్లలు*

మనలో స్వార్థం మొదలవుతుంది.మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది.వారి ఆలోచనలే  ఎప్పుడూ చుట్టూ ఉంటాయి. వారికోసం మాత్రమే గుండె  కొట్టుకుంటూ ఉంటుంది.వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని తల్లి తండ్రులు  అసలు ఉండరు...

పిల్లలు..6వ అద్భుతం!


_*అన్ని అయిపోయాయి..

ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?*_


7. *మనవళ్ళు..మనవరాళ్లు*

వీరికోసం ఇంకా కొన్నిరోజులు  బతకాలనే ఆశపుడుతుంది.వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతంగా మళ్ళీ పసిపిల్లలం..అయిపోతాం.వీరు మన జీవితానికి  దొరికిన.. 7వ అద్భుతం!


*ఇన్ని అద్భుతాలమధ్య తిరుగుతూ,వీటి విలువలు మరిచి బ్రతుకుతున్న మనం మహా అద్భుతం..! కాసింత ప్రేమ చాలు,ఇంకెన్నో అద్భుతాలు  మన సొంతం అవుతాయి.చిన్న పలకరింపు  చాలుమనల్ని ఆ అద్భుతంగా  చూడడానికి.అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి  

మరో అద్భుతాన్ని  సృష్టించేద్దాం*




🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: మూడవ అధ్యాయం

కర్మయోగం: అర్జున ఉవాచ:


అథ కేన ప్రయుక్తో௨యం పాపం చరతి పూరుషః 

అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః (36)


కృష్ణా.. తనకు ఇష్టం లేకపోయినా మానవుడు దేని బలవంతంవల్ల పాపాలు చేస్తున్నాడు..


శ్రీ భగవానువాచ:


కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః 

మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్ (37)


రజోగుణంవల్ల కలిగిన కామక్రోధాలు అన్ని పాపాలకూ మూలకారణాలు. ఎంత అనుభవించినా తనివితీరని కామమూ, మహాపాతకాలకు దారితీసే క్రోధమూ ఈ లోకంలో మనవుడికి మహాశత్రువులు.

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*335 వ రోజు*

పాండవ శిబిరంలో ఆనందోత్సాహాలు

కలసిన కృష్ణార్జునులు

సైంధవవధా సందర్భమున కృష్ణార్జునులు చూపిన ప్రతిభ ధృతరాష్ట్రుడిలో భయోత్పాతాలు కలిగించాయి. " సంజయా ! సైంధవ వధానంతరం నా కుమారులు ఏమి చేసారో వివరించుము " అన్నాడు. సంజయుడు " మహారాజా ! సైంధవవధ కలిగించిన ఉత్సాహంతో పాండవసేన కౌరవసేనతో తలపడింది. కృపాచార్యుడు, అశ్వత్థామ అర్జునుడి మీద శరవర్షం కురిపించారు. అర్జునుడు ఆ శరములన్నీ ఖండించి తిరిగి వారి మీద శరవర్షం కురిపించాడు. శరధాటికి కృపాచార్యుడు స్పృహతప్పాడు. అతడి సారధి కృపాచార్యుని పక్కకు తీసుకు వెళ్ళాడు. అశ్వథ్థామ కూడా అతడి వెంట వెళ్ళి పోయాడు. అది చూసి అర్జునుడు ఖిన్నుడైయ్యాడు. కృష్ణుడు అర్జునుడుని ఓదారుస్తూ " అర్జునా ! దేవేంద్రునికైనా గెలువ సాధ్యం కాని కురుసేనను ఒంటి చేత్తో గెలిచిన నీ పరాక్రమము ప్రశంశనీయము. సైంధవుని తల వృద్ధక్షతుడి ఒడిలో పడవేసి మహా తపోధనుడి శాపం నుండి తప్పించు కున్నావు. ఇంద్రుడిచ్చిన శక్తాయుధంతో విర్ర వీగుతున్న కర్ణుని జయించి ప్రశంశా పాత్రుడవు కమ్ము " అన్నాడు. అర్జునుడు కృష్ణా ! అలా అనకు నీ కృపతో నేను సైంధవుని వధించగలిగాను. నీ కటాక్షవీక్షణం పొందిన వాడికి కార్య సిద్ధి కలుగక మానదు " అన్నాడు. ఆ మాటలకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి " అర్జునా! మన కొరకు ధర్మరాజు ఎదురు చూస్తుంటాడు. మనం వెళ్ళాలి " అన్నాడు. అర్జునుడు, సాత్యకి, భీముడు, ఉత్తమౌజుడు ధర్మరాజు వద్దకు వెళుతుండగానే సూర్యాస్తమయం అయింది. ఇరు పక్షాలు యుద్ధం మాని తమ శిబిరాలకు వెళ్ళారు. ధర్మరాజు శిబిరం చూసి కృష్ణుడు పాంచజన్యం పూరించాడు. ఆ శంఖధ్వని విని ధర్మరాజు వెలుపలకు వచ్చి ఒకే సారి వారిద్దరిని కౌగలించుకొని ఆనందబాష్పాలు రాల్చి " అర్జునా! అర్జునా! నీ శపధము నెరవేర్చుకున్నావు. ఈ మహానుభావుని దయ వలన ఈ గండం గడిచి బయట పడ్డాము " అని శ్రీకృష్ణుని కృతజ్ఞతాభావంతో చూసాడు. శ్రీకృష్ణుడు " ధర్మజా! కౌరవుల మీద మీకు ఉన్న కోపమే ఈ విజయానికి కారణం అయింది. మీ వంటి సత్పురుషుల కోపాన్ని తట్టుకోవడం ఎవరి తరం ? ఒక్క అర్జునుడే కాదు, సైంధవుని వధించుటే కాదు, ఇలాంటి దుస్సాధ్యమైన కార్యాలు ఎన్నైనా ఎవరైనా అవలీలగా చేయగలరు. మీలాంటి సత్ప్రుషుల కోపానికి ఉన్న ప్రభావం అలాటింది " అన్నాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజు " కృష్ణా! నీవే అలిగిన దేవాసురులు సహితం రూపు మాసిపోతారు. నీ దయ ఉంటే మాత్రమే జీవులు సుఖంగా జీవించగలరు. మా మీద నీ దయ ప్రసరించినంత కాలము మాకు కార్య సిద్ధి లభిస్తుంది " అన్నాడు వినయంగా. ఇంతలో భీముడు, సాత్యకి ధర్మరాజుకు నమస్కరించారు. ధర్మరాజు వారిని లేవనెత్తి కౌగలించుకున్నాడు. శత్రు సంహారంతో ధర్మరాజు ఆనందానికి అవధులు లేక పోయింది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వనాథ స్వామి ఆలయం

 🕉 మన గుడి : నెం 1068


⚜ కేరళ  :  కల్పతి - పాలక్కాడ్


⚜ శ్రీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వనాథ స్వామి ఆలయం 



💠 ఈ ప్రసిద్ధ ఆలయాన్ని 'దక్షిణ కాశి' / 'దక్షిణ వారణాసి' / 'కాశీ సగం' అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఈ ఆలయ నిర్మాణం కాశీ శ్రీ విశ్వనాథ ఆలయాన్ని పోలి ఉంటుంది.


💠 కాశీ శ్రీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించలేని భక్తులు ప్రతి సంవత్సరం ఈ అందమైన ఆలయాన్ని సందర్శిస్తారు


💠 తమిళనాడులోని తంజావూరు, మధురై, తిరుచ్చి, కుంభకోణం, మైలదుత్తురై, చిదంబరం, మాయవరం మొదలైన ప్రాంతాల నుండి వలస వచ్చిన కేరళలోని అతిపెద్ద తమిళ బ్రాహ్మణ అగ్రహార సముదాయం .


💠 ఈ ఆలయంలో, శ్రీ విశ్వనాథస్వామి (శివుడు) తూర్పు ముఖంగా ఉన్నాడు. శ్రీ విశాలాక్షి (పార్వతి) దక్షిణాభిముఖంగా ఉంది. 

జ్ఞాన నందికేశ్వరుడు శ్రీ విశ్వనాథస్వామికి ఎదురుగా ఉన్నాడు.  ఆలయంలో నందికేశ్వరుడు మూడు రూపాలలో కనిపిస్తాడు:

ఆత్మతత్వం, విద్యాతత్వం మరియు శివతత్త్వం. 


🔆 ఆలయ చరిత్ర


 💠 ఈ ఆలయ చరిత్ర 13వ శతాబ్దంలో తమిళనాడులోని కావేరీ నది ఒడ్డున ఉన్న మాయవరంలో నివసించిన తమిళ బ్రాహ్మణ వితంతువు 'లక్ష్మీ అమ్మాళ్' అనుభవానికి సంబంధించినది.


💠 ఒకసారి, 13వ శతాబ్దం ప్రారంభంలో, లక్ష్మీ అమ్మాళ్ తన స్వస్థలమైన తమిళనాడులోని మాయవరం (ప్రస్తుతం తమిళనాడులోని మైలాడుతురై) నుండి కాశీలోని శ్రీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్ళింది .


💠 ఆమె కాశీలో బస చేసిన చివరి రోజున గంగా నదిలో స్నానం చేస్తుండగా, అనుకోకుండా ఎక్కడినుండో ఒక శివలింగం (బాణ లింగం) గంగా నదిలో తేలుతూ వచ్చి ఆమె పాదాలను తాకింది.  

అది బాణ లింగమని గ్రహించిన లక్ష్మీ అమ్మాళ్ నీలా నది ఒడ్డున బాణ లింగాన్ని ఉంచి నదిలో స్నానానికి దిగింది.

తిరిగి బాణ లింగాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించినప్పుడు, అద్భుతంగా అది అక్కడ స్థిరంగా ఉండిపోయింది. 


💠 ఆమె కోరుకున్న విధంగా తన స్వదేశంలో బాణలింగాన్ని ప్రతిష్టించలేకపోయింది కాబట్టి, కల్పాతిలో మయూరనాథ్ స్వామి దేవాలయం మాదిరిగానే కొత్త ఆలయాన్ని నిర్మించమని పాలక్కాడ్ రాజును అభ్యర్థించింది.  


💠 ఆమె స్వస్థలం తమిళనాడులోని మాయవరంలో. 

ఆ తర్వాత, తమిళ సంస్కృతి/ఆచారం ప్రకారం ఈ కొత్త ఆలయంలో పూజలు చేసేందుకు తమిళ బ్రాహ్మణులను అనుమతించాలని ఆమె రాజును అభ్యర్థించింది.  

రాజు కూడా అందుకు అంగీకరించాడని చరిత్ర చెబుతోంది.


💠 తరువాత ఈ ఆలయ నిర్మాణం వాస్తు శాస్త్రం ప్రకారం పూర్తయింది.  పార్వతి, ఉపదేవతల విగ్రహాలను తయారు చేశారు.  

ఆచారాల ప్రకారం శివుడు - పార్వతి - ఉప దేవతలను ప్రతిష్టించిన తరువాత, ఆలయం భక్తుల కోసం తెరవబడింది.  అప్పుడు కూడా, శతాబ్దాల తర్వాత నేటికి (ఇప్పుడు), తమిళ బ్రాహ్మణ వేద పండితులు ఈ ఆలయంలో నిత్యపూజ మొదలైన వాటిని ఆపకుండా కొనసాగిస్తున్నారు. 


💠 తమిళనాడులోని మాయవరంలోని మయూరనాథ స్వామి ఆలయంలో నిర్వహించే నిత్య పూజల మాదిరిగానే ఈ ఆలయానికి సంబంధించిన నిత్యపూజలు నిర్వహించబడతాయి.


💠 ఈ ఆలయానికి ఉన్న చారిత్రిక ప్రాముఖ్యతను తెలుసుకుని, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి మరియు విదేశాల నుండి కూడా చాలా మంది భక్తులు ఈ ఆలయాన్ని నిత్యం సందర్శిస్తుంటారు.  

దేవతల ఆశీస్సులు తీసుకుంటారు నైవేద్యాలను కోరుకుంటారు.  

వారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కల్పతి రథోత్సవంలో (రథోత్సవం / ఉత్సవం) పాల్గొంటారు.  

రథాలు లాగేందుకు ఒకరికొకరు పోటీ పడుతున్నారు.  చివరగా, వారు సంతృప్తితో తమ స్వదేశానికి తిరిగి వస్తారు.


💠 ఈ ఆలయ రూపకల్పన కాశీ మరియు వారణాసిలోని శివాలయాల మాదిరిగానే ఉంది.

పవిత్ర గంగానది కాశీ మరియు వారణాసి గుండా ప్రవహిస్తే, ఇక్కడ పవిత్రమైన నీలా నది కల్పతి గుండా ప్రవహిస్తుంది.  


💠 ఈ దేవాలయాలన్నింటిలో రాతి మెట్లు నది వైపుకు చేరుకుంటాయి.   

ఇటువంటి సారూప్యతల కారణంగా కల్పతిలోని ఈ ఆలయాన్ని 'దక్షిణ కాశి' / 'దక్షిణ వారణాసి' / 'కాశీలో సగం' అని పిలుస్తారు.


🔆 ఉప దేవతలు


💠 గణపతి (గణేశుడు) - గర్భాలయానికి సమాంతరంగా, నవగ్రహాలు - గర్భాలయానికి ఎదురుగా, గంగాధర - దక్షిణాన, సుబ్రమణ్యుడు (మురుగన్) వల్లి-దేవయాని - తూర్పున, చండికేశ్వరుడు మరియు భైరవుడు - దక్షిణాభిముఖంగా ఉన్నారు.


💠 ప్రధాన పండుగలు: రథోత్సవం, శివరాత్రి, తిరువతీర.


💠 ప్రతి సంవత్సరం నవంబర్ 13 నుండి నవంబర్ 15 వరకు జరుపుకునే ఈ ఉత్సవాన్ని ఆస్వాదించడానికి భారతదేశం మరియు విదేశాల నుండి వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు కాబట్టి కల్పతి రథోత్సవం /ప్రపంచ ప్రసిద్ధ పండుగ.


💠 ఈ రథోత్సవం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'రథ సంగమం' దీనిని రథులు (శివుడు, పార్వతి, విష్ణువు, గణేష్ & మురుగ) అన్ని దేవతల కలయికగా కూడా పిలుస్తారు, ఇది ప్రధాన శివుని ముందు జరుగుతుంది. 


💠 పాలక్కాడ్ బస్ స్టాండ్ నుండి సుమారు 3.6 కి.మీ


రచన

©️ Santosh Kumar

15-16-గీతా మకరందము

 15-16-గీతా మకరందము

         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - క్షర, అక్షర పురుషులయొక్క స్వరూపమును వర్ణించుచున్నారు –


ద్వావిమౌ పురుషౌ లోకే 

క్షరశ్చాక్షర ఏవ చ | 

క్షరస్సర్వాణి భూతాని 

కూటస్థోఽక్షర ఉచ్యతే || 


తాత్పర్యము:- ప్రపంచమునందు క్షరుడనియు, అక్షరుడనియు ఇరువురు పురుషులు కలరు. అందు సమస్త ప్రాణులయొక్క దేహముల యొక్క అభిమాని క్షరుడనియు, కూటస్థుడగు జీవుడు (మనస్సు యొక్క అభిమాని) అక్షరుడనియు చెప్పబడుచున్నారు.


వ్యాఖ్య:- క్షరపురుషుడు, అక్షరపురుషుడు, పురుషోత్తముడు - అను మువ్వురు పురుషులను గూర్చి చెప్పబోవుచు మొట్టమొదట క్షరాక్షరులను గూర్చి భగవానుడీ శ్లోకమునందు తెలియజేయుచున్నాడు. నశించునట్టి దేహాదిదృశ్యపదార్థములన్నియు అనగా చరాచరజీవులయొక్క ఉపాధులన్నియు తాము అని అభిమానించువారు క్షరపురుషులనియు, ఆత్మచైతన్యము యొక్క ప్రతిబింబరూపులగు జీవులు (మనస్సులు తాము అని అభిమానించువారు) అక్షరపురుషులనియు ఇచట చెప్పబడిరి. క్షరమైన దేహములతో పోల్చిచూచినచో మోక్షపర్యంతము అనేక జన్మలకాలమువఱకు నశింపకుండ ఉండువా డగుటచే జీవుడు అక్షరుడనియు, కూటస్థుడనియు చెప్పబడెను. అయితే ఈ అక్షరుడు 8వ అధ్యాయమందు తెలుపబడిన అక్షరపరబ్రహ్మమనిగాని, కూటస్థుడనగా కూటస్థ చిదాత్మయనిగాని యెవరును తలంచరాదు. ఏలయనిన వారిరువురికిని "అకాశపాతాళ” భేదముకలదు. ఒకడు బింబము; మఱియొకడు ప్రతిబింబము. ఈ అధ్యాయమందు తెలుపబడిన అక్షరుడు ప్రతిబింబము - అనగా జీవుడు. ఈ క్షరాక్షరుల యిరువురి కంటెను వేఱైనట్టి, అనగా ఉపాధి అభిమానికంటెను, చిత్ప్రతిబింబమగు జీవుని (మనస్సు యొక్క అభిమాని) కంటెను వేఱుగానున్నట్టి ఉత్తమపురుషుని గూర్చి రాబోవు శ్లోకమున చెప్పబడును. ఆతడే పరమాత్మ.


ప్రశ్న:- ఈ ప్రపంచమున పురుషు లెందఱుకలరు? వారెవరు?

ఉత్తరము:- ఇరువురు కలరు - (1) క్షరుడు (2) అక్షరుడు - అని.

ప్రశ్న:- అందు క్షరపురుషు డెవడు?

ఉత్తరము:- సమస్తప్రాణులయొక్క దేహాద్యుపాధుల అభిమాని క్షరపురుషుడని చెప్పబడును.

ప్రశ్న:- అక్షరపురుషు డెవడు?

ఉత్తరము:- కూటస్థుడగు జీవుడు (మనస్సుయొక్క అభిమాని).

తిరుమల సర్వస్వం 196-*

 *తిరుమల సర్వస్వం 196-*

 *కపిల తీర్థం -1*


 *సప్తగిరుల సమారోహమైన తిరుమల కొండ పాదభాగంలో తిరుపతి పట్టణ శివారులో ఉన్న కపిలేశ్వరస్వామి ఆలయం, తిరుపతి వాసులకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవాలయం. తిరుమల యాత్రికులతోనూ, స్వామిని అనునిత్యం దర్శించుకునే తిరుపతి పట్టణవాసుల తోనూ కపిలేశ్వరస్వామి ఆలయం ఎల్లవేళలా కళకళలాడుతూ సందడిగా ఉంటుంది. కార్తీకమాసం మరియు ఇతర ముఖ్య పర్వదినాలలో పోటెత్తిన భక్తులు జనసంద్రాన్ని తలపిస్తారు. ఈ దేవాలయ సముదాయానికి ఎదురుగా అలిపిరికి వెళ్ళే దారిలో, ఈమధ్య కాలం లోనే ప్రతిష్ఠించబడ్డ; కపిలేశ్వరస్వామికి అభివాదం చేస్తూ గంభీరంగా కూర్చొనివున్న నందీశ్వరుని విగ్రహం ముచ్చట గొలుపు తుంటుంది. అందువల్లనే ఈ కూడలిని 'నంది సర్కిల్' గా పిలుస్తారు. ఈ ప్రాంతం నుండే తిరుమల శోభ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాల్లో, తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు, ఈ ప్రాంతమంతా విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది.*


 కపిలేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో సమున్నతమైన పర్వతశ్రేణుల నుంచి జాలువారే పవిత్ర జలధారను 'కపిలతీర్థం' గా వ్యవహరిస్తారు. శేషాచల శ్రేణుల్లోని ఏడుకొండల నుంచి ప్రవహించే వందల కొద్ది జలప్రవాహాలు ఒకదానితో ఒకటి సమ్మిళితమై, ఉధృతమైన జలపాతం గా మారి, ఈ తీర్థంలో బహిర్గతమవ్వడం ద్వారా ఆ సప్తగిరుల మహిమలన్నింటినీ పుణికిపుచ్చుకున్న ఈ కపిలేశ్వరతీర్థానికి విశేషమైన పౌరాణికప్రాశస్త్యం ఉంది.


 ఒక ప్రక్క ఎత్తయిన పర్వతశిఖరాలు, మరో ప్రక్క దట్టమైన, ఆకుపచ్చని అడవులు; మధ్యలో దివి నుండి భువికి వస్తున్నట్లుగా కానవచ్చే జలపాతం. ఆ ప్రకృతి సోయగం చూసి తీరవలసిందే గానీ, వర్ణింపశక్యం కాదు.


 కార్తీకమాసపు ప్రాతఃసంధ్యా సమయంలో చలికి గజగజా ఒణుకుతూ, శివకేశవులను స్మరించుకుంటూ, ఈ చల్లటి జలధార క్రింద పవిత్ర స్నానమాచరిస్తూ పరశమొందటం ఒక ఆధ్యాత్మిక మధురానుభూతి. ఆ మాసంలో కపిలతీర్థం ఎదురుగా ఉన్న పుష్కరిణికి ఇరుప్రక్కలా ఉన్న సంధ్యావందన మండపాలు, మండలదీక్ష లోనున్న అయ్యప్పస్వాముల తోనూ, పుష్కరిణి జలాలు గగనాన మెరిసే తారలను స్మరణకు తెచ్చే అరిటాకు దొన్నెల కార్తీక దీపాలతోనూ; ఉత్సవశోభను తలపిస్తాయి.


 *ఆ పేరెలా వచ్చింది?* 


 'కపిలతీర్థాని' కి ఆ పేరు రావటం వెనుక ఒక ఆసక్తికరమైన పౌరాణిక గాథ ఉంది.


 విశ్వంలో సృష్టిని విస్తరింపజేయడానికై బ్రహ్మ ద్వారా ఉద్భవించిన ప్రజాపతులలో ఒకరైన 'కర్దమప్రజాపతి' కి లోకకల్యాణార్థం సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే 'కపిలుడు' అనే పేరు గల పుత్రునిగా జన్మించాడు. దైవాంశ సంభూతుడైన ఆ బాలుడు కౌమారావస్థలో ఉండగానే తండ్రి కర్దమ ప్రజాపతికి, తల్లి 'దేవహూతి' కి *'కపిలగీత'* అనబడే ఆధ్యాత్మిక సారాన్ని బోధించి; వారిరువురికి ముక్తిని ప్రసాదించాడు. తదనంతరం ప్రశాంతమైన ప్రదేశం కోసం అన్వేషిస్తూ, పాతాళలోకానికి చేరుకొని, అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని, అందులో శివలింగాన్ని ప్రతిష్ఠించి తీవ్రమైన తపమాచరిస్తుండేవాడు.


 అదే సమయంలో ఇక్ష్వాకువంశస్తుడు, శ్రీరామచంద్రునికి పూర్వజుడు అయిన సగరచక్రవర్తి అశ్వమేధయాగాన్ని తలపెట్టి, అత్యంత ప్రతిభాశాలి, మిక్కిలి సమర్థవంతుడు అయిన తన మనుమడు అంశుమంతుని రక్షణలో యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు. 


 ఇంద్రదేవుడు అతని యాగాన్ని భగ్నం చేయడం కోసం ఆ అశ్వాన్ని తస్కరించి పాతాళలోకంలో ఉన్న కపిలమహర్షి ఆశ్రమంలో విడిచిపెట్టాడు. యాగాశ్వం జాడ ఎంతకూ తెలియక పోవడంతో, ఆజ్ఞ మేరకు అతని అరవై వేల మంది పుత్రులు భూమండలమంతా గాలించారు. అప్పుడు కూడా అశ్వం కానరాక పోవడంతో, భూమినంతా ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం చొప్పున పంచుకొని, మొత్తం 60 వేల యోజనాల పృథ్వీమండలాన్ని పాతాళం వరకు త్రవ్వుకుంటూ పోయారు. పాతాళలోకంలో మిగిలిన మూడు దిక్కులను ఆసాంతం గాలించిన తర్వాత, ఉత్తరదిక్కున కపిలమహర్షి ఆశ్రమంలో మేత మేస్తున్న యాగాశ్వం వారికి కనబడింది. కపిలమహర్షే ఆ అశ్వాన్ని దొంగిలించాడని భ్రమపడ్డ సగరపుత్రులు అతనిని దుర్భాషలాడగా, తపోభంగంతో కోపోద్రిక్తుడైన మునీశ్వరుడు దిక్కులు పిక్కటిల్లేలా 'హుంకారం' చేశాడు. దాంతో సగరపుత్రులు భస్మమై బూడిదరాశిలా మారిపోయారు. 


 సగరుని అశ్వపు జాడ గానీ, తన పుత్రుల యోగక్షేమాలు గానీ ఎంతకూ తెలియకపోవడంతో తల్లడిల్లిన సగరుడు తన మనుమడైన అంశుమంతుని పిలిచి తన పినతండ్రుల జాడ తెలుసుకోవలసిందిగా ఆదేశించాడు.


 సగరుని దేవేరులిద్దరిలో పెద్ద భార్యకు 'అసమంజసుడు' అనే అయోగ్యుడు పుత్రునిగా జన్మించగా; చిన్నభార్యకు అరువది వేల పుత్రులు కలిగారు. కొన్ని అకృత్యాల కారణంగా దేశ బహిష్కారానికి గురైన అసమంజసుని కుమారుడే 'అంశుమంతుడు'. ఆ విధంగా సగరుని అరువదివేల పుత్రులు అంశుమంతునికి పినతండ్రులవుతారు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కాలడి – కార్బన్ డేటింగ్*

 *కాలడి – కార్బన్ డేటింగ్* 


ఒకసారి కాంచీపురం శ్రీమఠానికి ఒక భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. అతని కుటుంబం బాగోగుల గురించి విచారించిన తరువాత మహాస్వామి వారు అతణ్ణి ఒక పని చేయమని చెప్పారు. ఒక గజఈతగాడితో కాలడిలోని పూర్ణానది(పెరియర్ నది) నుండి రెండు చోట్ల నది అడుగునుండి ఇసుక తీయమని చెప్పారు. ఒకటి ఆ నది కేరళలో కాలడిలోకి ప్రవేశించే ముందు మరియు ఇంకొకటి కాలడిలో.


తరువాత స్వామివారు అలా తీసిన ఇసుకని కార్బన్ డేటింగ్ ద్వారా ఆ ఇసుక యొక్క వయస్సు కనుగొనమని చెప్పారు. మహాస్వామి వారి ఆజ్ఞ మేరకు ఆ శాస్త్రజ్ఞుడు ఆ రెండుచోట్ల ఇసుకని తీయించి దాని వయస్సు నిర్ధారణ చేసారు. మొదట స్థలంలో తీసిన ఇసుక షుమారు లక్ష ఏళ్ళకు పూర్వం ఏర్పడినదని, రెండవ చోట తీసిన ఇసుక దాదాపు 2500 సంవత్సరాలకు పూర్వం ఏర్పడినదని తేలింది.


మనకు లభించే చరిత్ర ప్రకారం ఆది శంకరాచార్యుల తల్లి గారైన ఆర్యాంబ రోజూ స్నానానికి పూర్ణా నదికి వెళ్ళడానికి కష్టంగా ఉంటే శంకరులు పూర్ణా నదిని తమ పాదములను అనుసరించి (కాల్ + అడి = కాలడి) వచ్చి, తమ పూర్వీకులు నివసించిన ఇంటి ముందు నుండి ప్రవహించు లాగున చేశారు.


కాబట్టి కాలడిలోని ఆ నది ఇసుక వయస్సును బట్టి ఆది శంకరాచార్యుల వారు 2500 సంవత్సరాలకు ముందు దాదాపు క్రీ.పూ. 509లో పుట్టారని స్పష్టమగుచున్నది.


కింద ఉన్న చిత్రం కాలడిలో మనకు దర్శనమిచ్చే పూర్ణా నదీమతల్లి.


_//\\_ జయ జయ శంకర హర హర శంకర _//\\_


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

తీర్థ యాత్ర

 🔔 *తీర్థ యాత్ర* 🔔


న‌వ‌గ్రహ సంబంధిత క్షేత్రాలు............!!


న‌వ‌గ్రహ సంబంధిత క్షేత్రాలను సందర్శించాలనుకునే వారు రాష్ట్రఎల్లలు దాటిపోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే చాలా క్షేత్రాలలో నవగ్రహ పూజలు చేసుకోవచ్చు. 

అలాంటివి మన రాష్ట్రంలోనే చాలా జిల్లాలలో ఉన్నాయి. 


1. సూర్యుడు..!

1.అరసవెల్లి సూర్యనారాయ‌ణ స్వామి!

(శ్రీకాకుళం)

2. పెద్దాపురం సూర్యనారాయ‌ణ స్వామి!

(తూర్పుగోదావ‌రి)

3. గొల్లల‌మామిడాడ సూర్యనాయ‌ణ స్వామి!

(తూర్పు గోదావరి)

4. నందికొట్టూరు సూర్యనారాయ‌ణ స్వామి!

(కర్నూలు)


2. చంద్రుడు..!

1. గునుగుపూడిలో సోమేశ్వరస్వామి! (భీమ‌వ‌రం).

(ప‌శ్చిమ గోదావ‌రి ) 

2. కోటిప‌ల్లి సోమేశ్వరస్వామి!

(తూర్పుగోదావ‌రి) 

3. విజ‌య‌వాడ‌లో క‌న‌క‌దుర్గాదేవి!

పెద్దక‌ళ్ళే ప‌ల్లెలో దుర్గాదేవి!

 (కృష్ణా జిల్లా)

4. జొన్నవాడ కామాక్షిత‌యారు అమ్మవారు!

(నెల్లూరు)


3. అంగార‌కుడు (కుజుడు)..!

1. మోపిదేవి సుబ్రమ‌ణ్యస్వామి! మ‌రియు చోడ‌వ‌రం

(కృష్ణా జిల్లా)

2.బిక్కవోలు సుబ్రమ‌ణ్యస్వామి!మ‌రియు పెద్దాపురం

(తూర్పుగోదావ‌రి)

3.పెద్ద నందిపాడు, నాగులపాడు పుట్ట, పెద్దకూర‌పాడు పుట్ట, మంగ‌ళ‌గిరి సుబ్రమ‌ణ్య స్వామి, పొన్నూరు.

(గుంటూరు)

కుజ దోష నివారణకు యాదగిరి, ధర్మపురిలాంటి నృసింహ క్షేత్రదర్శనం కూడా మంచి ఫలితం ఇస్తుంది.


4. బుధుడు..!

1. ద్వార‌కా తిరుమ‌ల‌!

(ప‌శ్చిమ గోదావ‌రి) 

2. ర్యాలీ, అన్నవ‌రం, పిఠాపురం కుంతీమాధ‌వ స్వామి!

(తూర్పుగోదావ‌రి)

3.శ్రీకాకుళంలో ఆంధ్రా మ‌హావిష్ణువు.

4.తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వర స్వామి!

(చిత్తూరు)


5. బృహ‌స్పతి (గురువు)..!

1. చేబ్రోలు బ్రహ్మ దేవుడు.

(గుంటూరు)

2. అలంపురంలో బ్రహ్మదేవుడు.

(మ‌హ‌బూబ్ న‌గ‌ర్ )

3.కోటిప‌ల్లిలో కోటిలింగేశ్వర స్వామి!

మంద‌ప‌ల్లిలో బ్రహే్శ్వర స్వామి!

(తూర్పుగోదావ‌రి) 

4. అమ‌రావ‌తిలో అమ‌ర‌లింగేశ్వర స్వామి! కోట‌ప్పకొండ త్రికూటేశ్వర స్వామి!

(గుంటూరు)


6. శుక్రుడు..!

1. విశాఖ ప‌ట్టణం క‌న‌క‌మ‌హాల‌క్ష్మి, 

సింహాచ‌లం ల‌క్ష్మీ దేవి.

(విశాఖ)

2. అలిమేలు మంగాపురం, ప‌ద్మావ‌తీదేవి!

(చిత్తూరు)

3. పెంచ‌ల‌కోన ఆదిల‌క్ష్మీదేవి!

(నెల్లూరు)


7. శ‌ని..!

1. మంద‌ప‌ల్లెలో మందేశ్వర స్వామి!

(తూర్పుగోదావ‌రి)

2. హిందుపురం తాలూకా పావ‌గ‌డ‌లోని శ‌నిమ‌హాత్ముడు!

(అనంత‌పురం)

3. విజ‌యవాడ‌లోని కృష్ణన‌ది తీరాన జ్యేష్ణదేవి స‌హిత శ‌నైశ్చర్య స్వామి!

(కృష్ణా జిల్లా) 

4. న‌ర్శింగోలు (సింగ‌రాయ కొండ వ‌ద్ద) శ‌నీశ్వర స్వామి!

(ప్రకాశం)


8. రాహువు, 9. కేతువు..!

1. శ్రీ కాళ‌హ‌స్తి!

(చిత్తూరు)

2. మంద‌మ‌ల్లి నాగేశ్వర స్వామి!

(తూర్పుగోదావ‌రి)

3. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గాదేవి!

(కృష్ణా జిల్లా)

4. సంప‌త్ వినాయ‌క స్వామి!

(విశాఖ) 

5. అమ‌రావ‌తి వినాయ‌క‌స్వామి, 

తెనాలి వైకుంఠ‌పురం పుట్ట.

(గుంటూరు)


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

వేణుగానం

 శు  భో  ద  యం 🙏



వేణుగానం!


"ఏది మరొక్కసారి,హృదయేశ్వర!,గుండెలు పుల్కరింపఁగా/

ఊదగదోయి!ఊదగదవోయి!సుధామయ యుష్మదీయ వే /

ణూదయ రాగడోలికల నూయలలూగుచు విస్మృతిలో విలీనమై /

పోదును; నాదుక్రొవ్వలపుపువ్వుల ముగ్ధపరీమళమ్ముతో;


కరణామయి-ఉదయశ్రీ-

జంధ్యాలపాపయ్యశాస్త్రి.


        ఈపద్యంవింటే రాధికయేగాదు మనంగూడా తన్మయులమైపోతాం.శాస్త్రిగారి కవితాశక్తియలాంటిది!

         హే హృదయేశ్వరా! కృష్ణా! మరోసారి వేణువూదవా! మరోసారి,ఆఁహః కాదుకాదు మరోసారి,బృందావనిలోనీవు వేణువూదుతుంటే,ఆవలపుగానంలో నాతనువూ మనసూ మరచి తన్మయస్ధితిలోలీనమై, నాతొలివలపుల తీయనియూహలు మదిలో నూగుచుండగా,నీకోసంఈ రాధపరవసిపోతుంది.నీకోసం పలవరిస్తుంది.

మరొక్కసారి వేణువు నూదవయ్యా!కృష్ణా! నాకోసం,కాదుకాదు, మనకోసం;

          ఇదీ ఈపద్యంలోని రాధపిలుపు.శాస్త్రిగారి పద్యంలో వలపు రవంతైనా మీకు అందించగలిగానా నాజన్మధన్యమే!

                             స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌸🌷🌷🌷🌷🌷

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


*తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా*

*ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం*

*బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స*

*జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్ సత్యంబు దైత్యోత్తమా!*


*(ఆంధ్ర మహాభాగవతం)*


*భావము:- రాక్షసరాజా!  భక్తి మార్గాలు తొమ్మిది; అవి సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మనివేదనం, కీర్తనం, చింతనం.   ఈ నవ విధ భక్తులు అనే తొమ్మిది భక్తి మార్గాలను మనోవాక్కాయకర్మల (మనస్సు చేత, మాట చేత, క్రియ చేత ఒకే విధంగా నెరవేరుస్తూ, త్రికరణశుద్ధిగా) సర్వాంతర్యామి అయిన శ్రీహరిని నమ్మి ఉత్తముడుగా జీవించుట మానవులకు ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. ఇది కాక మరొక సత్యం నాకు కనబడుట లేదు.*


 ✍️💐🌹🪷🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం  - పంచమి - కృత్తిక -‌‌ సౌమ్య వాసరే* (02.04.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

రామాయణ

 శ్రీ‌శ్రీ‌శ్రీ‌

*ఇంటింటా సంక్షిప్త రామాయణ*    

      *పారాయ‌ణం*


 ********

     *4వ రోజు పారాయ‌ణం* 

     🌸 *కిష్కింధ కాండ*🌸


 శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం 

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి

              

   ***


శ్రీ‌ రామ లక్ష్మణులు శబరి ఆతిధ్యాన్ని స్వీకరించిన తరువాత పంపా సరోవరం అందాలను చూస్తూ ముందుకు సాగారు. సీతాప‌హ‌ర‌ణం గురించి విలపిస్తున్న రామునికి లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు.

శ్రీ‌రామా , నువ్వు దుఃఖాన్ని విడిచిపెట్టు.ఉత్సాహం ఉంటే ప్ర‌పంచంలో సాధించ‌లేనిదంటూ ఏదీ లేదు. నీవు లోకైక వీరుడ‌వు. దుఃఖం, శోకం, భ‌యం, ప్ర‌తిభ‌ను బ‌య‌ట‌కు రాకుండా చేస్తాయి. ఈ అడ్డు తొల‌గించుకో, నీకు చెప్పేటంత‌టివాడ‌ను కాను. అన్న‌య్యా... ఉత్సాహాన్ని పుంజుకో, ఈ బాధ  విడిచిపెట్టి జ‌ర‌గ‌వ‌ల‌సిన దాని గురించి ఆలోచించు అని అన్నాడు లక్ష్మణుడు. త‌మ్ముడి మాట‌లు రాముడికి ఉత్సాహాన్నిచ్చాయి. 

 క్రమంగా వారు ఋష్యమూక పర్వతాన్ని సమీపించారు.


*శ్రీ‌రాముడి వద్దకు*

*హనుమ*..


వాలి,సుగ్రీవులు వానరులు.అన్నదమ్ములు.

తన అన్న ఆయిన వాలి కోపానికి గురై తరిమి వేయబడిన సుగ్రీవుడు , తనవారితో కలసి ఋష్యమూక పర్వతం పైననే  తిరుగుతున్నాడు.  మహా ధనుర్ధారులైన రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భ‌య‌ప‌డ్డాడు. వాలి వీరిని త‌న పైకి యుద్ధానికి  పంపాడేమోన‌ని సుగ్రీవుడి భ‌యం.  వారెవ‌రో తెలుసుకుని ర‌మ్మ‌ని హనుమంతుడిని వారి వద్దకి పంపాడు.

హనుమంతుడు స‌న్యాసి రూపంలో  రామ‌ల‌క్ష్మ‌ణుల‌ను సమీపించాడు– 

ఓ పుణ్యపురుషులారా! తమరు, వేషధారణను బట్టి తాపసులవలెనున్నారు. ధరించిన ఆయుధాలను బట్టి చూస్తే సర్వ శత్రు సంహరణా దక్షుల వలె ఉన్నారు. నర నారాయణుల లాగా, సూర్యచంద్రులలాగా, అశ్వినీ దేవతల లాగా కనిపిస్తున్నారు. నేను సుగ్రీవుడు అనే వానరుని మంత్రిని. అతడు తన అన్న వాలి ఆగ్రహానికి గురై దీనుడై ఉన్నాడు.  సుగ్రీవుడు మీ స్నేహాన్ని కోరుతున్నాడు. నేను కోరుకున్న రూపాన్ని ధరించాగలను. గనుక బ్ర‌హ్మ‌చారి వేషంలో మిమ్ములను కలవడానికి వచ్చాను. నేను వాన‌రుడ‌ను. తమ పరిచయ భాగ్యాన్ని ప్రసాదించండి అని మృదువైన మాటలతో అన్నాడు.


హనుమంతుని మాటలకు, అతడి వినయానికి రాముడు ముగ్ధుడయ్యాడు. 

ల‌క్ష్మ‌ణుడివైపు తిరిగి రాముడు,....

 చూశావా ల‌క్ష్మ‌ణా....

 ఇత‌ని మాటలలో ఎక్కడా అనవసర శబ్దం గాని, అపశబ్దం గాని లేవు. వేదాలను, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడే ఇలా మాట్లాడగలడు. ఇటువంటి వానిని మంత్రిగా కలిగిన రాజు ఏద‌యినా సాధించగలడు అని చెప్పాడు.

రాముడి అనుమ‌తి తీసుకుని  లక్ష్మణుడు తమ రాకకుగల కారణాన్ని హనుమంతునికి వివరించాడు. కార్యార్ధులమై సుగ్రీవునితో స్నేహం కోరుతున్నామని చెప్పాడు. హనుమంతుడు తన నిజరూపం ధరించి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవునివద్దకు తీసికొనివెళ్ళాడు.


*శ్రీరామ, సుగ్రీవుల మైత్రి*:


హనుమంతుని ద్వారా  రామ ల‌క్ష్మ‌ణుల గురించి తెలుసుకుని  సుగ్రీవుడు  వారికి స్వాగ‌తం ప‌లికి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెదకడానికి తాను సహాయపడతాన‌న్నాడు. కొద్దిరోజుల క్రితం ఒక స్త్రీ ని రాక్ష‌సుడు అప‌హ‌రించుకు పోతుండ‌గా చూశాం. ఆమె జారవిడచిన నగలు మావ‌ద్ద ఉన్నాయి అని  వానరులు రామునికి చూపించారు. వాటిని చూచి రాముడు, క‌న్నీళ్ల ప‌ర్యంతం అయ్యాడు. క‌న్నీళ్ల‌తో రాముడి క‌ళ్లు మ‌స‌క‌బారాయి.

 ఈ ఆభ‌ర‌ణాలు మీ వ‌దిన సీత‌మ్మ‌వో కాదో చూడ‌మ‌ని,ల‌క్ష్మ‌ణుడికి చూపాడు రాముడు.


*నాహం జానామి కేయూరే* *నాహం జానామి కుండలే*

*నూపురేత్వభిజానామి నిత్యం పాదాభివందనాత్*

 అన్న‌య్యా.... ఈ కేయూరాలు, కుండలాలను నేను గుర్తించలేను. కాని నిత్యం వదినకు పాదాభివందనం చేయడం వలన ఈ నూపురాలు ఆమెవని మాత్రం చెప్పగలను అన్నాడు . ఆ ఆభ‌ర‌ణాల‌ను చూస్తూ

 రాముడు ఇంకా దుఃఖిస్తున్నాడు. రామా చింతించ‌కు సీత జాడ తెలుసుకుని తెచ్చి అప్ప‌గించే బాధ్య‌త నాది అని అనున‌య‌వాక్యాలు ప‌లికాడు సుగ్రీవుడు.

 రాముడూ సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మైత్రి కుదుర్చుకున్నారు.

 అన్న అయిన వాలితో సుగ్రీవుడికి వైరం ఎందుకు వ‌చ్చిందో రాముడు అడిగి తెలుసుకున్నాడు.

 కిష్కింధకు రాజైన వాలికి సుగ్రీవుడు తమ్ముడు.  ఒక సారి మాయావి అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ వాలి ఒక బిలం లోపలికి వెళ్ళాడు. బిలం వెలుపలే కాప‌లాగా ఉండమని వాలి తన తమ్ముడు సుగ్రీవునికి చెప్పాడు. ఒక నెల‌ గడచినా వారు వెలుపలికి రాలేదు. రాక్షసుని చేతిలో వాలి మరణించి ఉంటాడని, రాక్ష‌సుడు బ‌య‌ట‌కు వ‌స్తాడ‌ని భయపడ్డ సుగ్రీవుడు బిలం ద్వారాన్ని ఒక బండరాతితో మూసి నగరానికి తిరిగివచ్చాడు. మంత్రులు సుగ్రీవుడిని రాజును చేశారు.

కొంత‌కాలానికి వాలి బిలంలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి , సుగ్రీవుడు రాజ్యం కాజేయ‌డానికి బిలానికి బండ‌రాయిని అడ్డంగా పెట్టి వ‌చ్చాడ‌ని భావించి అత‌డిని నిందించాడు. సుగ్రీవుడి భార్య రుమ‌ను చేప‌ట్టి

 సుగ్రీవుడిని  రాజ్యంనుంచి తరిమేశాడు. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తనకు విశ్వాసపాత్రులైన నలుగురు మంత్రులతో తలదాచుకొన్నాడు. మతంగమహర్షి శాపంవలన వాలి ఋష్యమూక పర్వతం సమీపానికి రాడు.

దీనుడైన సుగ్రీవుని కథ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట యిచ్చాడు. వాలి అసమాన బల పరాక్రమాల గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునకు నమ్మకం కలిగించడానికి రాముడు కొండ లాంటి దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని పది క్రోసుల దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో ఏడు సాల వృక్షాలను ఛేదించాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకొని, అతనికి అభయమిచ్చాడు.


*వాలి- సుగ్రీవుల పోరు*

రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. రెండు కొండల్లా ఢీ కొంటున్న వారిరువురూ ఒకే విధంగా ఉన్నారు. వారిలో వాలి ఎవరో సుగ్రీవుడు ఎవ‌రో పోల్చుకోలేక రాముడు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో  త‌న‌ను కాపాడ‌నందుకు  రామునితో నిష్ఠూరంగా మొరపెట్టుకొన్నాడు సుగ్రీవుడు.


 వాలి , సుగ్రీవులు ఇద్ద‌రూ ఒకేరకంగా ఉండ‌డంవ‌ల్ల కాపాడ‌లేక‌ పోయానన్నాడు రాముడు. మరో సారి వాలితో యుద్ధానికి వెళ్ల మన్నాడు రాముడు. సుగ్రీవుడికి ధైర్యం చెప్పాడు.  ఈ సారి  ఒక పుష్ప‌మాల‌ను గుర్తుగా సుగ్రీవుని మెడలో వేసి పంపాడు . మళ్ళీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బయలు దేరిన వాలిని అతని భార్య తార అడ్డుకునింది. సుగ్రీవుడితో పోరు వ‌ద్ద‌ని వారించింది.  అంతకు ముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు వెంట‌నే  మళ్లీ యుద్ధానికి వ‌స్తున్నాడంటే,ఇందులో ఎదో రహస్యమ్ దాగి వున్నదని తార అనుమానించింది. రామ ల‌క్ష్మ‌ణుల‌ అండ చూసుకుని సుగ్రీవుడు వ‌స్తున్నాడ‌ని గ్ర‌హించ‌మ‌నింది.  కాని ,వాలి త‌న భార్య తార మాట  వినలేదు. తనకు ఇక్ష్వాకు రాకుమారులతో వైరం లేదు గనుక తనకు వారు ఏ హాని చేయరన్నాడు. కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు.

అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలా వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు చెట్టు చాటునుంచి కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని ,వాలి గుండెలపైకిసంధించాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు.

కొంత సేపటికి వాలికి తెలివి వచ్చింది. అతని గుండెలనుండి రక్తం ధారలుగా పారుతోంది. ప్రాణాలు కడగడుతున్నాయి. ఎదురుగా రాముడు, అతనికి ఇరుప్రక్కలా లక్ష్మణుడూ, సుగ్రీవుడూ క‌నిపించారు. నీరసంగా రాముని చూచి వాలి ఇలా నిందించాడు.--


*రాముని వాలి నిందించుట*:

రామా! నీవు మహా తేజోవంతుడవు. కాని నీవు చాటుగా వేసిన బాణం వ‌ల్ల‌ నీ వంశానికీ, తండ్రికీ అపకీర్తి తెచ్చావు. నేను నీకుగాని, నీ దేశానికి గాని ఏ విధమైన కీడూ చేయలేదు. అయినా నన్ను వధిస్తున్నావు. నీవు సౌమ్య మూర్తిగా నటిస్తున్న మాయమయుడివి. ఇంద్రియ లోభాలకు వశుడవయ్యావు. అన్ని దోషాలు నీలో కనబడుతున్నాయి. ధ‌ర్మం త‌ప్పి వ్య‌వ‌హ‌రించావు అని రాముడిని నిందించాడు.

నేను చావుకు భయపడేవాడిని కాను. సుగ్రీవుడు నా అనంతరం రాజ్యార్హుడే. కాని ఇలా కుట్రతో నన్ను చంపి నా తమ్ముడికి రాజ్యం కట్టబెట్టడం నీకు తగినపని కాదు. నీ చేతలను ఎలా సమర్ధించుకొంటావు? – అని వాలి అన్నాడు.


*రాముని సమాధానం*

వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు – ఇంద్ర నందనా! నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును.


నేను వేట మిష మీద నిన్ను చంపలేదు. ధర్మ రక్షణార్ధమే నిన్ను చంపాను. ప్రభువైన భరతుని ప్రతినిధులం గనుక మా రాజ్యంలో ధర్మహీనులను దండించే బాధ్యతా, హక్కూ మాకున్నాయి. కిష్కింధ మా రాజ్యంలోదే నని మరువకు.

నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యను నీవు వశం చేసుకొన్నావు. నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉన్నది. అందుకు మరణ దండనయే సరైన శిక్ష. కనుకనే మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్ర తత్వాలుండవని కిష్కింధకు అధిపతివైన నీకు తెలుసు.

ఇక చెట్టుమాటునుండి చంపానంటున్నావు... నీ మెడలోని కాంచనా మాలా వర ప్రభావాన్ని నేను మన్నించాలి గనుక ఉపాయం చేత నిన్ను కూల్చాను. పైగా నీది జంతు సంతతి .మాటు వేసి చంపడం సరయినదే.

అధ‌ర్మ వ‌ర్త‌నుడిని వధించడానికి యుద్ధ ధర్మాలు కూడా వర్తించవు. నీవు శిక్షార్హుడవు అన్నాడు. రాముడి స‌మాధానంతో వాలి తృప్తి చెందాడు. ధ‌ర్మ‌సూక్ష్మాల‌ను గ్ర‌హించాడు. 

 రామా! సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వ జన్మ సుకృతం. అయితే  గారాబంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగానే నీవు రక్షించు. నామీద వున్న ద్వేషంతో,  సుగ్రీవుడు నా భార్య‌ తారను హింసించకుండా చూడు. నా  అపరాధాలనూ మన్నించు అని వాలి వేడుకున్నాడు.


తరువాత వాలి సుగ్రీవుని పిలిచి  ప్రాణాలు  పోయే లోగా తన మెడలోని కాంచనమాలను తీసి అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. తార మాట విననందువల్లే తనకు ఈ దుర్గతి పట్టిందన్నాడు.. రాముడికి ఇచ్చిన మాట నిల‌బెట్టుకోమ‌న్నాడు. అలక్ష్యం చేయవద్దన్నాడు.


పిన తండ్రిని కూడా తండ్రి లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివికావన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని వాలి ప్రాణాలు వ‌దిలాడు.

 అనంతరం రాముడి ఆజ్ఞ‌పై  రాజుగా సుగ్రీవుడూ, యువరాజుగా అంగదుడూ అభిషిక్తులయ్యారు. తన వనవాస నియమం ప్రకారం పదునాలుగు సంవత్సరాలు నగరంలో ప్రవేశించకూడదు గనుక రాముడు  సుగ్రీవ ప‌ట్టాభిషేకానికి కిష్కింధకు వెళ్ళలేదు.

 అప్ప‌టికే వ‌ర్ష‌రుతువు వ‌చ్చేసింది. వర్షఋతువులో సీతా అన్వేషణా యత్నం సాధ్యం కాదు గనుక నాలుగు మాసాలపాటు కిష్కింధలో సుఖభోగాలు అనుభవించమని, కార్తిక మాసం రాగానే. సీతాన్వేషణకు సిద్ధం కావాలని రాముడు సుగ్రీవుడికి చెప్పాడు.


*లక్ష్మణుని ఆగ్రహం*


వర్షా కాలం అయిపోయింది. ఆకాశం నిర్మలమయ్యింది. కాని సుగ్రీవుడు ధర్మార్ధ విముఖుడై రేయింబగళ్ళు కామభోగాలలోనే గడుపుతున్నాడు.  రామకార్యం మరచిపోయాడు .      ఆ సమయంలో హనుమంతుడు సుగ్రీవుని వద్దకు వెళ్ళి – మహావీరా! నీవు రాజ్యాన్ని పొందడానికి కారణమైన శ్రీరామ చంద్రుని కార్యాన్ని ఉపేక్షించడం తగదు. మిత్రకార్యాన్ని విస్మరిస్తే అనర్ధాలు తప్పవు. శ్రీరామ చంద్రునికి కోపం తెప్పించకు.  వెంటనే సీతాన్వేషణకు మమ్ములను ఆజ్ఞాపించు – అని మంచి మాట‌లు చెప్పాడు. సుగ్రీవునికి కర్తవ్యం స్ఫురణకు వచ్చింది. నీలుడిని పిలిచి, అన్ని దిశలనుండి వానరులను వెంటనే పిలిపించమన్నాడు. పదిహేను రోజుల్లోపు రాని వానరులకు మరణదండన అని శాసించాడు.


రాముడు సీతా వియోగంతో కుములుతున్నాడు. తాను చేసిన మేలు మరచి  సుఖభోగాలలో మునిగి తేలుతున్నా  సుగ్రీవుని ప్ర‌వ‌ర్త‌న రాముడికి మరీ బాధ కలిగించింది. అది చూసి లక్ష్మణునికి ఆగ్రహం పెల్లుబుకింది. ఆగ్ర‌హంతో కిష్కింధకు వెళ్ళాడు.  కోపంతో వచ్చిన లక్ష్మణుని చూచి వానరులు భయంతో వణికిపోయారు. అంగదుడు, మంత్రులు లక్ష్మణుని రాకను సుగ్రీవునికి తెలియజేశారు. వినయంతో మెలిగి ల‌క్ష్మ‌ణుడిని ప్రసన్నం చేసుకోమని హనుమంతుడు హితవు చెప్పాడు. భ‌యంతో సుగ్రీవుడు ముందుగా తార‌ను పంపాడు.

 తార వచ్చి సుగ్రీవుని త‌ప్పుని  మన్నించమనీ, అతడు తన మిత్ర ధర్మాన్ని తప్పక నెరవేరస్తాడనీ లక్ష్మణుని ప్రాధేయపడుతూ విన్నవించుకొని అతనిని శాంతింపజేసింది. దానితో సుగ్రీవుడు కాస్త ధైర్యం తెచ్చికొని తన అపరాధాన్ని మన్నించమని వేడుకొన్నాడు. సమస్త వానర గణాలనూ కిష్కింధకు రావాలని ఆజ్ఞాపించాడు. తన సేనా గణంతో లక్ష్మణుని వెంట శ్రీరాముని వ‌ద్ద‌కు వెళ్ళి రాముని పాదాలపై పడ్డాడు. అతనిని రాముడు ఆలింగనం చేసుకొన్నాడు. స్నేహితులిద్దరూ కలసి సీతాన్వేషణా పధకాన్ని సిద్ధం చేసుకొన్నారు.


*సీతాన్వేషణ ఆరంభం*


సుగ్రీవుని ఆజ్ఞపై తూర్పు, ప‌డ‌మ‌ర‌, ఉత్త‌ర దిక్కుల‌కు వాన‌ర సేన వెళ్లింది.. దక్షిణం వైపుకు నిర్దేశించిన బృందంలో అంగదుడు, జాంబవంతుడు, నీలుడు, హనుమంతుడు వంటి మహావీరులున్నారు. దక్షిణ దిశవైపు సీతను తీసికొని పోయిన రాక్షసుడు లంకాధిపతి రావణుడే కావచ్చునని సుగ్రీవుని అభిప్రాయం. అది గ్రహించిన రాముడు తన అంగుళీయకాన్ని సీతకు ఆనవాలుగా ఇమ్మని హనుమంతునికిచ్చాడు.

ఒక మాసం కాలానికి తూర్పు, పడమర, ఉత్తర దిశలుగా వెళ్ళిన వానర సేనలు తమ అన్వేషణ ముగించి తిరిగి వచ్చారు. సీత జాడ తెలియ‌ద‌ని విచార వ‌ద‌నంతో మనవి చేశారు.


*దక్షిణ దిశలో అన్వేషణ*


దక్షిణ దిశగా వెళ్ళిన వీరులు ప్రతిచోటా గాలిస్తూ వింధ్య పర్వతం దాటారు.  అప్పటికే సుగ్రీవుడు పెట్టిన నెల గడువు ముగిసింది. సీతమ్మ జాడ కానరాలేదు. వట్టిచేతులతో కిష్కింధకు పోలేరు. ఇక మరణమే తమకు శరణమని అంగదుడూ అతని అనుచరులూ ప్రాయోపవేశానికి సిద్ధమయ్యారు. వారిలో వారు

రామ లక్ష్మణుల జననం నుంచి సీతా అపహరణమ్ వరకు గుర్తు చేసుకుంటూ బాధ పడుతున్నారు. అక్కడ కొండపైన ఉండే వృద్ద పక్షి సంపాతి ఇదంతా వింటున్నాడు. సంపాతి జటాయువు సోదరుడు. ముందు వానర మూకను తినవచ్చని అనుకున్నాడు. కానీ వారి మాటలలో వానరులు దశరధుడి కుమారుడయిన రాముడికి సహాయం చేస్తున్నారని గ్రహించాడు. దశరధుడి తో తనకు గల స్నేహం గుర్తు చేసుకున్నా డు. తమ్ముడు జటాయువు మరణ వార్త విని బాధపడ్డాడు. రావణాసురుడు సీతమ్మ ను అపహరించి ఆకాశ మార్గంలో లంకకు తీసుకుపోతుండగా సంపాతి చూసి వున్నాడు.

   రావణుడు సముద్రంలో నూరు యోజనాల అవతల లంకానగరంలోసీతమ్మని దాచాడని వారికి చెప్పాడు.


*హనుమంతుని సంకల్పం*


 సంపాతి ద్వారా సీత జాడ తెలిసి వానరులు ముందు సంబరపడ్డారు. అయితే సముద్రం దాటడం ఎలా అన్న ప్రశ్నతో ఉత్సాహం  నీరుగారిపోయింది. వానర సేనలోని గజుడు పది ఆమడలు గెంతగలనన్నాడు. గవాక్షుడు ఇరవై ఆమడలూ, గంధమాదనుడు ఏభై ఆమడలూ, మైందుడు అరవై ఆమడలూ, ద్వివిదుడు డెబ్భై ఆమడలూ, సుషేణుడు ఎనభై ఆమడలూ లంఘించగలమన్నారు. వృద్ధుడైన జాంబవంతుడు తొంభై యోజనాలు మాత్రం ఎగురగలనన్నాడు. అంగదుడు నూరు యోజనాలు లంఘించగలను గాని తిరిగిరావడం కష్టమైతే పని చెడుతుందని అన్నాడు. అంద‌రిమాట‌లూ విన్న‌త‌ర్వాత‌....

జాంబవంతుడు హనుమంతునితో ఇలా అన్నాడు – నాయనా! ఈ కష్టాన్ని తరింపజేయడానికి నిన్ను మించిన సమర్ధుడు లేడు. గరుత్మంతునితో సమానమైన వేగ విక్రమాలు కలవాడవు. నీకు సమానమైన బలం, తేజం, బుద్ధి కుశలత, పరాక్రమం మరెవరికీ లేవు. నీ శక్తి నీకు తెలియదు. నీవు బహు వర సంపన్నుడవు. వాయుపుత్రుడవు. ఈ సముద్రం దాటడం నీకు మాత్ర‌మే సాధ్యం. త్రివిక్రముడివై విజృంభించు, లేవయ్యా ఆంజనేయా! - అని ఉత్సాహపరిచాడు.

ఆంజనేయుడు సముద్రంలా ఉప్పొంగిపోయాడు. 

దీర్ఘ దేహుడై విజృంభించాడు. జాంబవంతునికీ,  వానర ప్రముఖులకూ వందనం చేశాడు.సీతమ్మను చూచి రామకార్యాన్ని నెరవేరుస్తాను. అవసరమైతే లంకా నగరాన్ని పెళ్ళగించుకువస్తాను.నాకు అనేక శుభశకునాలు క‌నిపిస్తున్నాయి. మీరు ఇక నిశ్చింతగా ఉండండి.  అన్నాడు.


కార్య సాధకుడవై తిరిగి రమ్మని జాంబవంతుడు,హనుమను ఆశీర్వదించాడు. మహాకాయుడైన హనుమంతుడు వాయుదేవునికి మ్రొక్కి మహేంద్రగిరిపై కొంతసేపు విహరించాడు. అతడు కాలు పెట్టిన‌ చోట పర్వతం బీటలువారి కొత్త సెలయేళ్ళు పుట్టాయి.

శత్రు నాశన సమర్ధుడు,   వాయువేగంతో ప్ర‌యాణించ‌గ‌ల ధీరుడు అయిన  హనుమ లంకాపట్టణం చేరడానికి సంకల్పించి లంక వైపు తిరిగి నిలుచున్నాడు......

లంకకు బయలుదేరేందుకు సన్నద్దుడు అవుతున్నాడు...


శ్రీ‌రామ రామ రామేతి 

రమే రామేమ‌నోర‌మే

స‌హ‌స్ర‌నామ త‌త్తుల్యం 

రామ‌నామ వ‌రాన‌నే

              *****

*మనోజవం మారుత తుల్యవేగం*

*జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం!*

*వాతాత్మజం వానరయూధ ముఖ్యం*

*శ్రీరామదూతం మనసా స్మరామి!!!*

         

*(కిష్కింధ కాండ స‌మాప్తం)*