ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
11, సెప్టెంబర్ 2023, సోమవారం
⚜ శ్రీ దేవుర్ శివాలయం
🕉 మన గుడి : నెం 175
⚜ ఛత్తీస్‌గఢ్ : గండాయి ( రాజ్‌నంద్‌గావ్ జిల్లా)
⚜ శ్రీ దేవుర్ శివాలయం
💠 గండాయి శివాలయం భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని గండాయి పట్టణంలో ఉన్న శివుని దేవాలయం . ఈ ఆలయాన్ని దేవర్ శివమందిర్ అని కూడా పిలుస్తారు .
ఛత్తీస్‌గఢ్‌లోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించిన రక్షిత స్మారక కట్టడాలలో ఈ ఆలయం ఒకటి.
💠 ఈ ఆలయాన్ని 13 వ - 14 వ శతాబ్దంలో కలచూరి రాజవంశం నిర్మించింది .
💠 ఇది తూర్పు ముఖంగా ఉన్న ఆలయం.
ఈ ఆలయం నాగరా శైలి నిర్మాణ శైలిని అనుసరిస్తుంది.
ఆలయం త్రిరథం ప్రణాళికలో ఉంది. గర్భాలయానికి అభిముఖంగా నందిని చూడవచ్చు.
💠 ఈ ప్రదేశంలో భోరమ్‌దేవ్ సమకాలీన పురాతన శివాలయం.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 41 సంవత్సరాల క్రితం వరకు ఈ ప్రదేశంలో పురాతన శివాలయం ఉందని కూడా ఎవరికీ తెలియదు.
భూమిలో సమాధి అయిన ఈ ఆలయం 1979లో గుట్ట తవ్వకం ద్వారా వెలుగులోకి వచ్చింది.
అయితే వందల ఏళ్లుగా భూమిలో పాతిపెట్టి ఉండడంతో ఆలయంలోని చాలా విగ్రహాలు విరిగిపోయాయి.
💠 గండాయిలోని ఈ అందమైన పురావస్తు ఆలయం కాకుండా, గంగై మాత ఆలయం అని పిలువబడే మరొక ఆలయం ప్రసిద్ధి చెందింది, గంగై మాత కారణంగా ఈ నగరానికి గండాయి అని పేరు వచ్చిందని చెబుతారు.
💠 ఈ ఆలయంలో ముఖ్యంగా మహాశివరాత్రిలో, ఈ ఆలయానికి చేరుకోవడానికి చాలా మంది రద్దీ ఉంటుంది.
💠 ఈ ఆలయం రాజ్‌నంద్‌గావ్ నుండి 73 కి.మీ దూరంలో ఉంది.
ఇది బిలాస్పూర్ నుండి 153 కి.మీ దూరంలో ఉంది.
జలగలు ఆయుర్వేద వైద్యం
ఆయుర్వేద వైద్యం నందు జలగలు ఉపయోగించే విధానం -
జలము ఆయువుగా కలవి కావున జలాయుకములు అనియు , జలము నివాసస్థానం కలవి కావున జలౌకలని మరియు జలగలు అని పిలవబడుతున్నవి. ఇవి 12 విధములు గా ఆయుర్వేదం విభజించింది. ఇందు విషము కలిగినవి నల్లటి రంగులోని బేధము వలన 6 విధములు . అందు కృష్ణ అనునది కాటుక రంగు పెద్ద శిరస్సు గలది. కర్బూర అనునది బొమ్మిడ అను చేప వంటి ఆకృతి కలిగి ఒకచోట చిన్నగా , మరొకచోట పెద్దగా ఉండు పొట్ట కలిగి ఉండును. కలగర్ద అనునది ముడుతలతో కూడి ఉండి పెద్ద పార్శ్వములతో కలిగిన ముఖం
ఉండును. ఇంద్రాయుధ అనునది ఇంద్రధనస్సులోని నానారంగులు గల నీలపు చారలతో కూడుకుని ఉండును. సాముద్రిక అనునది కొద్దిగా నలుపు , పసుపు రంగులతో ఉండి అనేక ఆకృతులుగల తెల్లని మచ్చలతో కూడుకుని ఉండును. గోచందనం అనునది ఆంబోతు బుడ్డ వలే పొట్ట యందు ఒక గీత కలిగి సన్నని ముఖం కలిగి ఉండును.
పైనచెప్పిన 6 రకాల జలగలు విషము కలిగి ఉంటాయి. ఇవి కరిచినచో కాటునందు వాపు , మిక్కిలి దురద, మూర్చ, జ్వరం, తాపము , వాంతి కలుగును.
ఇప్పుడు మీకు విషము లేని జలగలు గురించి వివరిస్తాను. విషములేని జలగలు మొత్తం 6 రకాలు . అందులో కపిల అనునది ప్రక్కల యందు మనశ్శిలతో రంగు వేసినట్లు ఉండి వీపున నిగనిగలాడుచూ పెసలవలే ఆకుపచ్చ రంగు కలిగి ఉండును. పింగళి అనునది కొంచం ఎరుపు రంగు గుండ్రని శరీరం పచ్చని రంగు ఉండి వేగముగా కదులును. శంఖముఖి అనునది యకృత్ వలే ఎరుపు నలుపు రంగులు కలిగి శీఘ్రముగా రక్తమును తాగే స్వభావం పొడవైన వాడి అయిన ముఖం కలిగి ఉంటుంది. మూషిక అనునది ఎలుక వంటి ఆకారం , రంగు , దుర్వాసన కలిగి ఉంటుంది. పుండరీకం అనునది పెసల వలే పచ్చని రంగు , పద్మముల వలే విశాలమైన ముఖం కలిగి ఉండును. సావరిక అనునది నిగనిగలాడుచూ తామరాకు వంటి రంగు కలిగి 18 అంగుళముల పొడవు కలిగి ఉండును. ఇది ఏనుగులు, గుఱ్ఱములకు చికిత్స చేయుటలో మాత్రమే వాడవలెను .మనుష్యులకు పనికిరాదు. వీటిని నిర్విష జలగలు అందురు.
ఈ విషము లేనటువంటి జలగలు లభించు ప్రదేశాలు ముఖ్యంగా ఢిల్లీకి పశ్చిమ దిశలోను , సహ్యాద్రి పర్వతాలు అనగా నర్మదా నది ప్రవహించు పర్వత ప్రాంతాలలోను, మధురా ప్రాంతంలోనూ ఈ విషము లేనటువంటి జలగలు ఉండును. ఈ ప్రదేశాలలో లభించు జలగలు పెద్ద శరీరం కలిగి మంచి బలముతో ఉండి శీఘ్రముగా రక్తమును పీల్చెడి స్వభావం ఎక్కువుగా ఉండి విషము లేకుండా ఉండును.
విషముతో కూడిన చేపలు , పురుగులు , కప్పలు , మూత్రపురీషములు క్రుళ్ళుట చేత పుట్టిన జలగలు మరియు కలుషిత జలము నందు పుట్టిన జలగలు, నీటిలోని పద్మములు కుళ్లుటచేత పుట్టిన జలగలు విషపూరితంగా ఉండును. శుద్ధజలము నందు పుట్టిన జలగలు విషం లేకుండా ఉండును.
ఇప్పుడు జలగలను పట్టే విధానం వాటిని పోషించే విధానం మీకు తెలియచేస్తాను .
రక్తముతో కూడిన తోలు , జంతుమాంసం , వెన్న , నెయ్యి, పాలు మొదలగు వాటితో కూడిన అన్నమును జలగలు ఉన్న ప్రదేశంలో వేసినచో అవి పైకి వచ్చును. అప్పుడు వాటిని పట్టుకొని మంచి కుండలో చెరువునీటిని , బురదని పోసి అందులో ఉంచవలెను. వాటికి తిండి కొరకు నాచు, ఎండిన మాంసము , నీటిలో పుట్టే దుంపల చూర్ణం ఇవ్వవలెను. అవి నిద్రించుటకు గడ్డి, నీటి యందు పుట్టే పచ్చి ఆకులను ఆ కుండ నందు వేయవలెను . రెండు మూడు రోజులకు ఒకసారి ఆ కుండ యందలి నీటిని తీసివేసి కొత్తనీటిని పోసి ఆహారం కూడా కొత్తదానిని వేయవలెను . ప్రతి ఏడు రోజులకు ఒకసారి కుండను మార్చవలెను . ఈ జలగలను శరత్కాలం పట్టుకొనుట మంచిది .
జలగలను వైద్యంలో ఎలా ఉపయోగించాలో మీకు వివరిస్తాను.
జలగలచే పోగొట్ట తగిన రోగము కలిగిన వానిని కూర్చుండబెట్టి కాని , పడుకోపెట్టి కాని జలగ పట్టించవలసిన ప్రదేశములో వ్రణము లేనిచో ఆ ప్రదేశంలో ఎండించిన ఆవుపేడ చూర్ణం , మన్ను కలిపి మర్దన చేయవలెను . ఆ తరువాత జలగలను తీసుకుని ఆవాలు , పసుపు కలిపి నూరి కలిపిన నీటిలో ముంచి వేరొక మంచినీటి పాత్రలో ముంచి వాటిని రోగమున్న ప్రదేశములో పట్టించవలెను. ఆ తరువాత ఆ జలగకు మంచి కాటన్ గుడ్డ ముక్కతో ముఖము విడిచి శరీరం అంతయు కప్పవలెను. అప్పుడు ఆ జలగ రోగ స్థానమును పట్టును . అలా పట్టనిచో ఆ రోగస్థానం పైన పాలచుక్క గాని రక్తపుచుక్క గాని వేయుట లేక కత్తితో గీయుట చేసినచో జలగ వెంటనే రోగస్థానమును పట్టును . అప్పుడు కూడా జలగ పట్టనిచో దానిని వదిలి వేరొక జలగ పట్టించవలెను .
జలగ ఎప్పుడూ తన ముఖమును గుర్రపుడెక్క వలే విస్తరించి స్కంధమును పైకెత్తి రోగస్థానమును తగులుకొనునో అప్పుడు అది రక్తమును పీల్చుతుంది అని అర్ధంచేసుకొనవలెను వెంటనే దానిని తడిగుడ్డతో కప్పి మధ్యమధ్యలో తడుపుచుండవలెను . అలా చేస్తున్నచో రక్తం బాగుగా పీల్చును. ఆ పీల్చుటలో ముందుగా దుష్టరక్తమునే పీల్చును .
జలగ రక్తం పీల్చుతూ ఉన్నప్పుడు కొంత సమయం తరువాత పోటు , దురద మొదలగుచున్న అప్పటివరకు అది దుష్టరక్తం పీల్చి ఆ తరువాత మంచిరక్తం పీల్చడం మొదలు అయినది అని అర్థం . ఆ తరువాత వెంటనే జలగను తీసివేయవలెను . రక్తం యొక్క రుచి మరిగి ఆ జలగ రానిచో దాని ముఖము పైన సైన్ధవ లవణము వేసినచో విడిచివేయును .
చెడు రక్తం పీల్చిన జలగను శుద్దిచేయు విధానం గురించి మీకు తెలియచేస్తాను.
పైన చెప్పినట్టు రోగస్థానమును విడిచిన జలగకు శరీరం పైన బియ్యపు పిండిని పూసి ముఖం నందు నూనె, ఉప్పు కలిపి రాసి ఎడమచేతితో తోకను పట్టుకొని కుడిచేతితో ముఖము వరకు ఆవుపాలు పితికినట్లు చేయవలెను . ఈ విధంగా చేస్తూ తాగిన రక్తమును బయటకి కక్కునట్టు చేయవలెను . ఆ తరువాత ఆ జలగను శుభ్రపరచి మంచినీటితో కూడిన పాత్ర యందు ఉంచవలెను. అప్పుడు అది ఉత్సాహముగా సంచరించును. అలా సంచరించకుండా కదలక మొద్దుగా ఉన్నచో చెడురక్తం దాని శరీరం నుంచి పూర్తిగా బయటకి పోలేదు అని గ్రహించి మరలా కక్కించు ప్రయత్నం చేయవలెను . కక్కించాక మరలా కుండ నందు భద్రపరచవలెను.
జలగతో రోగనివారణ క్రియ చేశాక చేయవలసిన విధి గురించి వివరిస్తాను.
జలగ ద్వారా చెడు రక్తం తీసాక ఆ గాయమునకు ఔషదాలు కలిపిన ఆవునెయ్యి పూయవలేను . కొందరికి తేనె కూడా పూయవచ్చు.
పైన చెప్పిన జలగతో చెడు రక్తాన్ని తీయు విధానాన్ని రక్తమోక్షణం అంటారు. ఈ క్రియను రోగి యెక్క బలం, రోగం యొక్క బలాన్ని అంచనా వేసుకొని మాత్రమే అంచనా వేసుకొని చేయవలెను .
********** సంపూర్ణం ************
మరెంతో విలువైన మరియు అతి సులభ యోగాలకు నేను రచించిన గ్రంథములు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్
9885030034
మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .
కాళహస్తి వేంకటేశ్వరరావు .
అనువంశిక ఆయుర్వేద వైద్యులు .
9885030034
సంప్రదాయ పచ్చళ్ళు*
*SP PICKLES*
*సంప్రదాయ పచ్చళ్ళు*
*బ్రాహ్మణ సంప్రదాయ పద్దిలో బ్రాహ్మణ మహిళలతో తయారుచేయబడిన పచ్చళ్ళు*
**మాదగ్గర తయారు చేసిన అన్ని పచ్చళ్ళు పొడులు సంప్రయం పద్దతిలో కలర్స్ ప్రిసర్వేటివ్స్ లేకుండా క్వాలిటీ పదార్ధాలతో తయారుచేస్తాము**
*పచ్చళ్ళు*: *1kg cost*
చింతకాయ తొక్కు450/-
ఉసిరి తొక్కు450/-
ఉప్పు గోంగూర 550/-
పులిహోర గోంగూర 750/-
పండుమిర్చి గోంగూర 650/-
పండుమిర్చి 550/-
ఉసిరికాయ 550/-
దబ్బకాయ 550/-
నిమ్మకాయ 550/-
ఆవకాయ(వెల్లుల్లి/లేకుండా) 600/-
బెల్లం ఆవకాయ 600/-
పెసర ఆవకాయ 600/-
మెంతి ఆవకాయ 600/-
నువ్వు ఆవకాయ 600/-
కాలి్ఫ్లవర్ ఆవకాయ 600/-
పనసపోట్టు ఆవకాయ 750/-
పచ్చఆవకాయ 850/-
దోసవకాయ. 600/-
మాగాయ 600/-
*వంకాయ నిల్వ పచ్చడి* 750/-
అల్లం పచ్చడి 650/-
మామిడి అల్లం పచ్చడి 650/-
టొమోటో పచ్చడి 550/-
మునక్కాయ టమోటా 650/-
*పచ్చిమిరప ఆవకాయ* 600/-
*పొడులు* : *1kg cost*
కంది పొడి 550/
నువ్వులపొడి 500/-
ధనియాల పొడి 500/-
పప్పులపొడి 500/-
కరివేపాకు కారప్పొడి 550/-
అవిశగింజల పొడి 600/-
కొబ్బరి పొడి 550/-
రసం పొడి 500-
సాంబారు పొడి 650/-
నల్లకారం 600/-
పుదీనా కారపోదడి 750/-
మునగాకుపోడి 2000/-
మునగాకు కారపోడి 650/-
*వడియాలు* & *అప్పడాలు*:
సగ్గుబియ్యం వడియాలు 1kg - 500/-
పెసర అప్పడాలు 650/-
మినప అప్పడాలు 650/-
మిర్చి 850/- *soldout*
గుమ్మడి వొడియలు 850/-
మినపిండి వోడియలు 600/-
*మాదగ్గర ఇంకా*
*చిట్టెంటాపోటు* *పాల ఇంగువ* *లభించును*
*మేము అన్నిరకాల పచ్చళ్ళు పొడులు AS బ్రాండ్ పప్పునూనెతో మాత్రమే తయారు చేస్తాము*
*అన్ని ప్రదేశాలకు కొరియర్ సౌకర్యం కలదు* *చార్జీలు అదనం*
*అందరికీ నమస్కారం. మీరు దేశ విదేశాలలో ఎక్కడున్నా, మేము మీకు సహకరించగలము. మేము ఆహార పదార్థాలు (స్వీట్లు, ఖారా, పొడులు, పచ్చళ్ళు, చలిమిడి) స్వయంగా శుచి, శుభ్రతతో తయారు చేసి ఇయ్యగలము. మీ ఇంట్లో జరిగే ఏ శుభకార్యక్రమానికైనా మేము కావలసిన సరంజామా, మీ బడ్జెట్ ప్రకారం చీరలు, ధోవతులు, లుంగీలు, తువ్వాళ్ళు, జాకెట్టు బట్టలు, కర్చీఫ్లు, రిటర్న్ గిఫ్టులు పసుపు కుంకుమ పాకెట్లు, ఇట్లా మీకు కావాల్సిన ప్రతీది మీ సమయం ఆదా చేస్తూ, మీ ఇంటి దగ్గరకే ఏర్పాటు ఔతాయి. మీరు ఏ వయస్సు వారైనా మీకు పూజకైనా, పెళ్ళికైనా లేదా వ్రతాలకైనా అన్నీ ఏర్పాటు చేయబడతాయి. మీరు మమ్మల్ని సంప్రదించండి *
*దయచేసిమీకుతెలిసిన
బ్రాహ్మణ గ్రూపులలో
ఈ మెసేజ్ ని పంపవలసినదిగా
కోరుకుంటునను*
*జలసూత్రం పల్లవి*
*విజయవాడ*
*సంప్రదించండి* : *7981370664**Gp number*
*08662533848*
*7382665848* Gp or Pp number
శ్రీ దేవుర్ శివాలయం
🕉 మన గుడి : నెం 175
⚜ ఛత్తీస్‌గఢ్ : గండాయి ( రాజ్‌నంద్‌గావ్ జిల్లా)
⚜ శ్రీ దేవుర్ శివాలయం
💠 గండాయి శివాలయం భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని గండాయి పట్టణంలో ఉన్న శివుని దేవాలయం . ఈ ఆలయాన్ని దేవర్ శివమందిర్ అని కూడా పిలుస్తారు .
ఛత్తీస్‌గఢ్‌లోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించిన రక్షిత స్మారక కట్టడాలలో ఈ ఆలయం ఒకటి.
💠 ఈ ఆలయాన్ని 13 వ - 14 వ శతాబ్దంలో కలచూరి రాజవంశం నిర్మించింది .
💠 ఇది తూర్పు ముఖంగా ఉన్న ఆలయం.
ఈ ఆలయం నాగరా శైలి నిర్మాణ శైలిని అనుసరిస్తుంది.
ఆలయం త్రిరథం ప్రణాళికలో ఉంది. గర్భాలయానికి అభిముఖంగా నందిని చూడవచ్చు.
💠 ఈ ప్రదేశంలో భోరమ్‌దేవ్ సమకాలీన పురాతన శివాలయం.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 41 సంవత్సరాల క్రితం వరకు ఈ ప్రదేశంలో పురాతన శివాలయం ఉందని కూడా ఎవరికీ తెలియదు.
భూమిలో సమాధి అయిన ఈ ఆలయం 1979లో గుట్ట తవ్వకం ద్వారా వెలుగులోకి వచ్చింది.
అయితే వందల ఏళ్లుగా భూమిలో పాతిపెట్టి ఉండడంతో ఆలయంలోని చాలా విగ్రహాలు విరిగిపోయాయి.
💠 గండాయిలోని ఈ అందమైన పురావస్తు ఆలయం కాకుండా, గంగై మాత ఆలయం అని పిలువబడే మరొక ఆలయం ప్రసిద్ధి చెందింది, గంగై మాత కారణంగా ఈ నగరానికి గండాయి అని పేరు వచ్చిందని చెబుతారు.
💠 ఈ ఆలయంలో ముఖ్యంగా మహాశివరాత్రిలో, ఈ ఆలయానికి చేరుకోవడానికి చాలా మంది రద్దీ ఉంటుంది.
💠 ఈ ఆలయం రాజ్‌నంద్‌గావ్ నుండి 73 కి.మీ దూరంలో ఉంది.
ఇది బిలాస్పూర్ నుండి 153 కి.మీ దూరంలో ఉంది.
బసవ పురాణం - 28 వభాగము
🎻🌹🙏 బసవ పురాణం - 28 వభాగము ...!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸ఈమె శివాపచారం చేసింది కదా!’ అన్నాడు పూజారి బాలుడు భయపడుతూ.పూజారీ! నీవు తప్పే చేశావు.
🌿ఆమె శివపూజా ద్రవ్యాన్ని ముక్కుతో వాసన చూడకుండా చేతితో కదా పుష్పాన్ని అందుకున్నది. కాబట్టి ముందుగా తప్పు చేసింది చెయ్యి ముక్కు కాదు.
🌸అందుకని చేతిని నరకకుండా ముందు ముక్కునెందుకు నరికావు?’ అని నరసింగ నయనారు పెద్ద కత్తితో పట్టమహిషి చేతిని నరికివేశాడు. జనం దిగ్భ్రాంతులైనారు.
🌿మరుక్షణమే శివుడు ప్రత్యక్షమై పట్టమహిషికి ముక్కునూ చేతినీ ప్రసాదించాడు. నరసింహనాయనారుకు సామీప్య ముక్తిని ఇచ్చాడు.
🌸కొట్టరువుచోడని కథ
(శివుడు సిరియాలునికి చెప్పినది)
పూర్వం ఒక చోడరాజు పట్టమహిషి గర్భిణీ అయి వుంది. శివనైవేద్యానికై వండిన పదార్థాన్ని నోరూరి నివేదనకు ముందే ఆమె ఆరగించింది.
🌿అది తెలిసి కొట్టరువు చోడడు కోపగించి ‘శివ నైవేద్యం కాకుండా శివునికై వండిన పదార్థం నీ గర్భంలో ప్రవేశించింది కాబట్టి ఈ గర్భం అపవిత్రమైంది’
🌸అని ఆమె కడుపును కోయడానికి ప్రయత్నించాడు. వివుడు వెంటనే ప్రత్యక్షమై వాని భక్తికి మెచ్చి మోక్షమిచ్చాడు.
🌿హలాయుధుని కథ
పూర్వం హలాయుధుడనే రాజు ఉండేవాడు. శివుడు, సిరియాలుడు భక్తవేషాలతో హలాయుధుని నగరానికి పోయారు.
🌸హలాయుధుడు మహేశ్వరులకు మ్రొక్కి అర్చించాడు. అప్పుడు హలాయుధుడు సిరియాలుని భక్తి కథను విన్పించాడు. హలాయుధుడది విని కోపించి ‘ఇది భక్తి కాదు దారుణం.
🌿శివుడేమి రాక్షసుడా నరభక్షణ చేయడానికి? భక్తుడైన ఆ శిశువును చంపిన తండ్రి, సిరియాలుడేమి మనిషి? అని నిందించాడు.
🌸అది విని శివుడు సిరియాలుని ఘనతను భక్తి కూటములు పాటలుగా కట్టి పాడుతున్నారు. కవులు గద్య పద్య కావ్యములు వ్రాస్తున్నారు.
🌿సాంగ భాషాంగ క్రియాంగ నాటకములుగా ఆడుతున్నారు. అలాంటిదినువ్వువిమర్శిస్తున్నా వేమిటి? అని ప్రశ్నించాడు. దానికి హలాయుధుడు కోపించి ఇలాఅన్నాడు.
🌸శివుడు దేవుడైతే మాంసం ఎందుకడిగాడు? సిరియాలుడు భక్తుడైతే భక్తుడైన కొడుకును ఎందుకు చంపాడు? సిరియాలుడు కోమటి.
🌿కోమటి బుద్ధి పోనిచ్చుకున్నాడు కాడు. ముక్తిమీద ఆశతో కొడుకును కూడా చంపాడు. పోనీ శివుడైనా ఏమి బుద్ధిమంతుడు? పరీక్షకే అనుకుంటే సిరియాలుడు కత్తి ఎత్తగానే ఇక చాలు అని ఆపి వుండవలసింది.
🌸అట్లా కాక చంపనిచ్చి ఆ మాంసం కూడా వడ్డింపమన్నాడు. సిరియాలుడు అంత గొప్పవాడైతే తనను తాను వండుకొని ఎందుకు సమర్పణ చేసుకోలేదు? కాబట్టి సిరియాలునీ, శివుణ్ణీ నేను వెలివేస్తున్నాను.
🌿అంతేకాదు, వారిని గూర్చిఎవరు ముచ్చటించినా వారికి అస్పృశ్యత వస్తుంది అని హలాయుధుడు వెలిబెట్టాడు.అది విని కైలాసంలోని పార్వతీదేవి వణికిపోయింది.
🌸సంగళవ్వను వెంటబెట్టుకొని పరుగు పరున వచ్చి మా భర్తలపై వెలిని తీసివేయమనిప్రార్థించింది.హలాయుధుడు దయతో సిరియాలునికీ శివునికీ పెట్టిన వెలిని తీసివేశాడు.
🌿హలాయుధుని భక్తి ప్రమథులంతా కీర్తించారు. శివుడు హలాయుధుణ్ణి దివ్యవిమానంలోకైలాసానికితీసుకొనిపోయాడు.
🌷మిండనైనారు కథ
🌸(చతుర్థ - మాచయ్య బసవనికి చెప్పినది)పూర్వం మిండనయనారు అనే భక్తుడు ఉండేవాడు. ఆయన శివరాత్రి నియమం పన్నెండు సంవత్సరాలు వరుసగా కలిపి
పదమూడవ సంవత్సరంలో తిరువాలూరులోని
🌿వాల్మీకేశుని గుడికి వె ళ్లి జా గారం చేసి సద్భక్తసమూహంతో గోష్ఠిలో ఉన్నాడు.అప్పుడు ఒడయనంబి అనే పాలకుడు వందిమాగధులు పొగుడుతుండగా వాల్మీకేశుని గుడికి వచ్చాడు.
🌸అయితే అక్కడ కూర్చున్న భక్తులనెవరినీ గౌరవించలేదు. అది చూచి మిండనయనారు ‘వీడెవడు? భక్తులంటే గౌరవం లేదు అని కోపగించు కున్నాడు. అమ్మా!ఆయనను ఏమీ అనకండి.
🌿వాల్మీకేశుడు ఈయన భక్తికి పాటకూ మెచ్చి నిత్యపడి వేయి మాడలు ఇస్తుంటాడు. అంతటి గొప్పవాడు’’ అని ఒడయనంబి గూర్చి అక్కడివారు చెప్పారు.
🌸అది విని మిండనయనారు కోపించి ఇంతటి గర్విష్ఠిని గౌరవించిన ఆ వాల్మీకేశుడెంతటి పనికిమాలినవాడు? ఈ క్షణంనుంచి నేను వాల్మీకేశునికీ ఒడయనంబికి వెలిపెట్టుతున్నాను’ అని గంట వాయించాడు.
🌿మిండనయనారు గొప్పతనం సమాజానికి ప్రదర్శింపదలచి వాల్మీకేశుడు సాకారుడై గుడినుండి పారిపోయాడు. ఒడయనంబి ఇదేమిటని అడిగితే ఆభక్తునికి నేను ప్రాణం...ఇంకా ఉంది....🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
ధనం మీద అత్యాశ ఉన్నవారు
ಸುಭಾಷಿತ . 620 .
ಅರ್ಥಾರ್ಥೀ ಜೀವಲೋಕೋಯಂ ಶ್ಮಶಾನಮಪಿ ಸೇವತೇ | ತ್ಯಕ್ತ್ವಾ ಜನಯಿತಾರಂ ಸ್ವಂ ನೀಸ್ವಂ ಗಚ್ಛತಿ ದೂರತಃ ||
ಹಣದ ಆಸೆ ಹಿಡಿದ ಜನರು ಬಡವನಾದ ತಮ್ಮ ತಂದೆಯನ್ನೇ ತ್ಯಜಿಸಿ ಮಸಣದಲ್ಲಿ ನೆಲೆಸಲೂ ಸಿದ್ಧರಾಗಿರುತ್ತಾರೆ .
ಪಂಚತಂತ್ರ .
ధనం మీద అత్యాశ ఉన్నవారు స్మశానం లో నివాసానికి కూడా సిద్ధమే. వారు ధనం లేని పితరులని విడిచి దూరంగా వెడతారు
Modi's second blow
*Modi's second blow is coming,*
*Act 30-A may be abolished-.*
Modi ji is fully prepared to rectify Nehru's betrayal of Hindus.
*Have you heard of “Law 30” and Law “30A”?*
Do you know what *"30A"* means in Hindi?
Don't delay to learn more ⬇️
*30-A* is a law contained in the Constitution.
When Nehru tried to include this law in the Constitution, Sardar Vallabhbhai Patel strongly opposed it.
Sardar Patel said, *"This law is a betrayal of Hindus,* therefore if this law is brought into the Constitution, I will resign from the Cabinet and the Congress Party against it.
Ultimately, Nehru had to bow down to Sardar Patel's wish.
But unfortunately don't know.. Sardar Vallabhbhai Patel died suddenly in a few months after this incident..?
*After the death of Sardar Patel, Nehru immediately included this law in the constitution.*
*What is 30-A, let me tell you its features!...*
According to this law - Hindus are not allowed to teach/teach their "Hindu religion". *"Act 30-A"* does not allow or empower him.....
Therefore Hindus should not teach Hinduism in their private colleges.
Colleges should not be started to teach Hinduism. Hindu schools should not be started to teach Hinduism. No one is allowed to teach Hindu religion culture in public schools or colleges under Act 30-A.
It sounds strange, (30-A) Nehru made another law in his constitution *"Law 30"*. According to this "Law 30" Muslims, Sikhs and Christians can start Islamic, Sikh, Christian religious schools for their religious education.
Muslims, Sikhs and Christians can teach their religion.
Law 30 gives full right and permission to Muslims to start their own 'Madrassa' and Article 30 of the constitution gives full right and permission to Christians to establish and teach their own religious schools and colleges. Preach your religion for free... The other legal aspect of this is that all money and property of Hindu temples can be left to the discretion of the government, all money and other donations made by Hindu devotees to Hindu temples go to the state treasury Can be taken in.
At the same time, donations and alms from Muslim and Christian mosques are given only for the Christian-Muslim community. The features of this *"Law 30"* are as follows.
Therefore, *Act 30-A" and "Act 30"* is a deliberate discrimination against Hindus and a deliberate systematic betrayal of great magnitude.
Everyone should understand this very well that today Hindu is limited to folk tales. Hindus do not have knowledge of their scriptures. *Learn*
Awareness towards others Let us all protect Sanatan Dharma. Read, learn and spread..
This is due to *Article 30-A*
That we cannot teach *Bhagavad Gita* anywhere in our country.
After reading, if you find it right then please forward it. So that everyone knows the truth.
🙏🙏 Thank you.
శ్రీ హరి నిద్ర! కవి చమత్కారం!!
శ్రీ హరి నిద్ర!
కవి చమత్కారం!!
కలశపయోధిమీద తరగల్ మరి"హో"యనిమ్రోయ,వేయిభం/
గుల తలపాన్పుపాముబుసకొట్టగ,నేగతినిద్రచెందెదో?
అలసత తండ్రి!చీమచిటుకన్ననునిద్దురరాదుమాకు ఓ
బలవదరీ!దరీకుహర భాస్వదరీ! యదరీ!దరీ!హరీ!//
చాటుపద్యం:అజ్ఙాతకర్తుకం.
చివరిపాదంపద్యావికి మకుటంలాకనిపిస్తోంది.అర్ధంమాత్రం సులభంగా బోధపడటంలేదు.మహావిష్ణువును సంబోధించుచున్నట్లున్నది.
ఒకవంకపాలసముద్రపుకెరటాలహోరు.
మరియొకవంక ఆదిశేషువు బుస,
ఈరెండూ మహాధ్వనిచేస్తుంటే,యింతగడబిడలో యెట్లానిదురపడుతున్నదయ్యా !స్వామీ!నీకు.
మరి మాకేమోచీమచిటుక్కుమన్నా మెళకువ వచ్చేస్తుంది.ఇకనిదుర పట్టమన్నాపట్టదు.అనిమొత్తుకుంటున్నాడీకవిగారు.
"నిద్రసుఖమెరుగదు ఆకలిరుచియెరుగదు"-అంతేమరి.ఎవరికైనా.
చివరిపాదంసంగతిచూద్దాం!
బలవదరీ-బలవంతుడైనశత్రువుగలవాడా(హిరణ్యకశ్యపుడు)
దరీకుహర-పర్వతబిలంలో;
భాస్వత్+హరీ-ప్రకాశించు విష్ణుమూర్తీ!
అదరీ-భయరహితుడా!(చక్రధారీ!)
దరీ-శంఖహస్తుడా!
హరీ!-హేనృహరీ!
అనియర్ధం;
"అహోబిలక్షేత్రలోవెలసిసిన శంఖచక్రధారీ!ఓనృహరీ! యని సంబోధన.
స్వస్తి!🙏🙏🙏🙏🙏🙏👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🌷🌷
⚜ శ్రీ భోరమ్‌దేవ్ మందిర్
🕉 మన గుడి : నెం 174
⚜ ఛత్తీస్‌గఢ్ : కవార్ధా ( కబీర్ ధామ్ జిల్లా)
⚜ శ్రీ భోరమ్‌దేవ్ మందిర్
💠 ఈ ఆలయం శివుడి ఆలయం.
ఇది 7వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించబడింది.
ఛత్తీస్‌గఢ్ దక్షిణ కోశాల అని పిలువబడే ప్రాంతం, ఇది రామాయణం మరియు మహాభారతం రెండింటిలోనూ ప్రస్తావనను పొందింది.
💠 భోరామదేవుని ఆలయ నిర్మాణ ఘనత ఫనింగ వంశానికి చెందిన లక్ష్మణ్ దేవ రాయ్ మరియు గోపాల్ దేవకు ఇవ్వబడింది.
ఈ ప్రాంతంలోని గోండు గిరిజనులు శివుడిని పూజిస్తారు, ఆయనను వారు భోరమ్‌దేవ్ అని పిలుస్తారు, అందుకే ఈ ఆలయానికి భోరమ్‌దేవ్ ఆలయం అని పేరు వచ్చింది.
💠 ఇది అజంతా-ఎల్లోరా, ఖజురహో మరియు ఒరిస్సాలోని కోణార్క్ సూర్య దేవాలయానికి సమకాలీనంగా ఉండాలి.
ఆలయ నిర్మాణం ఈ దేవాలయాల మాదిరిగానే ఉంటుంది.
ఈ ఆలయం యొక్క వైభవం, శృంగార చిహ్నాలు మరియు పురావస్తు ప్రాముఖ్యతను చూడటానికి భారతదేశం మరియు విదేశాల నుండి ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు ఇక్కడకు వస్తుంటారు.
భోరమ్‌దేవ్ ఆలయాన్ని మధ్యప్రదేశ్‌లోని ఖజురహోను పోలి ఉన్నందున దీనిని "ఛత్తీస్‌గఢ్ ఖజురహో" అని కూడా పిలుస్తారు.
💠 ఆలయంలోకి 3 ప్రవేశాల నుండి నేరుగా ఆలయ మంటపంలోకి ప్రవేశించవచ్చు. మంటపం పొడవు 60 అడుగులు, వెడల్పు 40 అడుగులు. మంటపం మధ్యలో 4 స్తంభాలు మరియు ప్రక్కన ఇంకో 12 స్తంభాలు ఉన్నాయి,
అన్ని స్తంభాలు చాలా అందంగా మరియు కళాత్మకంగా ఉన్నాయి.
💠 ఇది నాలుగు దేవాలయాల సమూహాన్ని కలిగి ఉంది. వీటిలో మొదటిది,
ప్రధాన ఆలయం రాతితో నిర్మించిన భోరామదేవ దేవాలయం.
💠 ఇక్కడ నుండి దాదాపు 1 కిమీ దూరంలో ఉన్న మరొక ఆలయం మద్వా మహల్..
అంటే స్థానిక మాండలికంలో కళ్యాణ మండపం అని అర్థం .
దీనిని దుల్‌హడియో అని కూడా పిలుస్తారు. ఇది 1349లో నాగ రాజవంశానికి చెందిన రామచంద్ర దేవ్ పాలనలో నిర్మించబడింది మరియు 16 స్తంభాలకు పైగా ప్రతిష్టించబడిన ప్రత్యేకమైన శివలింగాన్ని కలిగి ఉంది.
💠 ఈ ఆలయానికి ప్రధాన ద్వారం ఎడమవైపు ఇటుకలతో నిర్మించబడిన శిధిలమైన ఆలయం మరియు కుడివైపున హనుమంతునికి ఒక ఒక చిన్న ఎరుపు రంగు మందిరం కలదు.
💠 గర్భగుడి ప్రవేశ ద్వారం వద్ద , శివుడు మరియు గణేశుడి చిత్రాలే కాకుండా విష్ణువు యొక్క పది అవతారాల చిత్రాలు చాలా చక్కగా చెక్కబడ్డాయి .
💠 ఆలయ ముఖ ద్వారం దాని ద్వారంపై గంగా మరియు యమునా చిత్రాలను చెక్కారు .
💠 కాల్చిన మట్టి ఇటుకలతో నిర్మించిన ఆలయం ప్రధాన భరమ్‌డియో ఆలయానికి ఆనుకొని ఉంటుంది. ఇది 2వ మరియు 3వ శతాబ్దాల మధ్య నిర్మించిన మొదటి దేవాలయం. ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది. ఇది మంటపం లేని గర్భగుడిని మాత్రమే కలిగి ఉంది.
"అల్లింద" అని పిలువబడే ఈ ఆలయం వెలుపలికి గోడ ఉంది. గర్భగుడిలో కనిపించే ఇతర నిర్మాణ లక్షణాలు కొన్ని చెక్కబడిన స్తంభాలు. ఉమా మహేశ్వరుని మరియు రాజు మరియు రాణి పూజాభరిత భంగిమలో నిలబడి ఉన్న చిత్రాలతో పాటు చెక్కబడిన శివలింగం ఇక్కడ ప్రతిష్టించబడింది.
💠 ప్రధాన ఆలయానికి ఒక కిమీ దూరంలో ఉన్న మద్వా మహల్, పడమటి ముఖంగా ఉన్న ఆలయం, ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు.
ఆలయాన్ని కళ్యాణ మండపంలాగా నిర్మించారు, దీనిని స్థానిక మాండలికంలో "మద్వా" అని పిలుస్తారు.
ఇది 1349లో జరిగిన నాగవంశీ రాజు రామచంద్ర దేవ్ మరియు హైహవంశీ రాణి రాజ్ కుమారి అంబికా దేవి వివాహ జ్ఞాపకార్థం నిర్మించబడింది.
💠 ఈ దేవాలయం యొక్క బాహ్య గోడలపై కామసూత్రంలో వివరించబడిన శృంగార లైంగిక భంగిమలలో 54 చిత్రాలు ఉన్నాయి, ఇవి నాగవంశీ రాజులు ఆచరించిన తాంత్రిక సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.
💠 పురాతన సంస్కృతి మరియు వాస్తుశిల్పం యొక్క ప్రత్యేక నమూనాగా ఉన్న ఈ ఆలయం రెండు భాగాలుగా విభజించబడింది. శివలింగం దాని ప్రధాన భాగంలో ప్రతిష్టించబడింది, ఇది తూర్పు ముఖంగా ఉన్న లింగం. ఈ ఆలయ స్తంభాలలో విష్ణువు, నరసింహ, వామన మరియు నటరాజ విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. దీనితో పాటు, గణేశుడు, సూర్యదేవుడు, కాలభైరవుడు విగ్రహాలు దాని రెండవ భాగంలో ఉన్నాయి.
💠 భోరమ్‌దేవ్ పండుగ :
1995 నుండి, చత్తీస్‌గఢ్ పరిపాలన చైత్ర కృష్ణ పక్షం త్రయోదశి నాడు భోరమ్‌దేవ్ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. ఇది మూడు నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ రోజున ఇక్కడ జాతర కూడా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం భోరమ్‌దేవ్ మహోత్సవ్ 2023 ఏప్రిల్ 02 నుండి ఏప్రిల్ 04 వరకు జరిగింది.
💠 సమీప రైల్వే స్టేషన్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో ఉంది.
ఇది దాదాపు 120 కి.మీ కవార్ధా నుండి.
సోమవారం, సెప్టెంబర్ 11, 2023* రాశి ఫలాలు
. *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*
. *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*
*సోమవారం, సెప్టెంబర్ 11, 2023*
*శ్రీ శాలివాహన శకం: 1945*
*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు*
*నిజ శ్రావణ మాసం - బహుళ పక్షం*
*తిధి* : *ద్వాదశి రా12.05* వరకు
. *🌹రాశి ఫలాలు🌹*
*మేషం*
నూతన ప్రయత్నాలు ముందుకు సాగవు. బంధువుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ప్రయాణాలలో మార్పులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది.
---------------------------------------
*వృషభం*
ముఖ్యమైన వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. సంతానానికి నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
---------------------------------------
*మిధునం*
దూరప్రయాణాలు వాయిదా పడతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగడం మంచిది కాదు. ముఖ్య కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి.
---------------------------------------
*కర్కాటకం*
సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
---------------------------------------
*సింహం*
బంధుమిత్రులతో సేవా కార్యక్రమాలు చేపడతారు. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో రాజీ చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాలలో విలువైన పత్రాలు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
---------------------------------------
*కన్య*
ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
---------------------------------------
*తుల*
ఇంటా బయట విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన వస్తులాభాలు పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి కొంత ఉపశమనం పొందుతారు.
---------------------------------------
*వృశ్చికం*
చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాలలో మార్గాలు అవరోధాలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు సాగిస్తారు. మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు కొంతమందికి స్థాయి ఉద్యోగాలలో మీకు రావలసిన గుర్తింపు వేరే వారికి వస్తుంది.
---------------------------------------
*ధనస్సు*
ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్పదు. దీర్ఘకాలిక రుణాల వలన ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పనుల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఆలోచన తప్పదు. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.
---------------------------------------
*మకరం*
స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి. గృహమున బందు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. నూతన పరిచయాలు సంతోషాన్నిస్తాయి. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
---------------------------------------
*కుంభం*
సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి ధన సహాయం అందిస్తారు. చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
---------------------------------------
*మీనం*
కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు పెరుగుతుంది. పని ఒత్తిడి అధికమై శిరో బాధలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄
👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*
👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్*
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻
*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻
*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻
🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
జీవితము చాలా బాధాకరం.
🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️
ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐
𝕝𝕝శ్లోకం𝕝𝕝
*వరం వనం వ్యాఘ్ర గజాది సేవితమ్*
*ద్రుమాలయం పత్ర ఫలాని భోజనమ్I*
*తృణాని శయ్యా వసనం చ వల్కలమ్*
*న బంధు మధ్యే ధన హీన జీవితమ్II*
𝕝𝕝తా𝕝𝕝
పులులు మరియు ఏనుగులతో నిండి ఉన్న అడవిలో ఉండవచ్చు, అడవిలో ఆకులు మరియు పండ్లు తిని, గడ్డి మంచంలో నిద్రించవచ్చు, ఆకులతో చేసిన దుస్తులు ధరించవచ్చు, కానీ ధన గర్వంతో నిండిన బంధువుల మధ్య ధనము లేని జీవితము చాలా బాధాకరం.
నవగ్రహా పురాణం🪐* . *22వ అధ్యాయం*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *22వ అధ్యాయం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*పురాణ పఠనం ప్రారంభం*
*చంద్రగ్రహ జననం - 4*
*“ఆ విధంగా భయాందోళనలకు గురైన శీలవతి నిశ్చేష్టంగా నిలిచిపోయింది”.* చంద్రగ్రహ జన్మ వృత్తాంతం వినిపిస్తున్న నిర్వికల్పానందులు అన్నారు.
*"ఆ విధంగా శపించింది ఎవరు గురువుగారూ ?”* విమలానందుడు అడిగాడు. *"ఆయన పేరు మాండవ్యుడు. ఆయన ఒక మహా తపస్వి... మహర్షి... శీలవతి భర్తను మోసుకొని వెళుతున్న దారి పక్కనే నిలువెత్తు శూలానికి గుచ్చబడి , ఆ మాండవ్యుడు. భయంకరమైన శిక్ష అనుభవిస్తున్నాడు...”* నిర్వికల్పానంద చెప్పసాగాడు.
*"మాండవ్యుడు తన ఆశ్రమంలో తపోనిష్ఠలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుగారి మందిరంలో దొంగలు పడ్డారు. ధనంతో పారిపోతున్న దొంగలను రాజభటులు వెంటాడారు. దొంగలు అరణ్యంలోని మాండవ్య మహర్షి ఆశ్రమ ప్రాంతానికొచ్చారు. మాండవ్యుడు ఆశ్రమం ముందున్న చెట్ల కింద నిలబడి చేతుల్ని నిటారుగా పైకెత్తి తదేక నిష్ఠతో తపస్సు చేస్తున్నాడు. చోరులు తప్పించుకునే ఉద్దేశంతో ఆయన ఆశ్రమంలో దాక్కున్నారు.
రాజభటులు వచ్చి మహర్షిని దొంగల గురించి అడిగారు. మౌనవ్రతంలో ఉన్న మాండవ్యుడు వాళ్ళకు సమాధానం చెప్పలేదు. చివరికి ఆ భటులు ఆశ్రమంలో దాక్కున్న దొంగల్ని పట్టుకొన్నారు. మౌనంగా ఉండిపోయిన మాండవ్యుడు కూడా ఆ దొంగల్లో ఒకరనీ , ముని వేషంలో నాటకం ఆడుతున్నాడనీ భావించి , ఆయనను కూడా రాజు వద్దకు లాక్కెళ్ళారు. రాజు దొంగలకు మరణ దండన విధించాడు. చోరుడై ఉండి , సాధువులా నటిస్తున్నాడన్న భావనతో మాండవ్యుడికి దారుణమైన 'శూలపోత' శిక్ష విధించాడు. భటులు మాండవ్యుడిని నేలలో పాతిన వాడి శూలానికి దిగవేశారు..
శూలాగ్రానికి దిగవేయబడిన మాండవ్యుడు భరింపరాని బాధను మౌనంగా అనుభవిస్తూ ఉండిపోయాడు. ఆ విధంగా శూలం మీద దుర్భరమైన శిక్షను అనుభవిస్తున్న మాండవ్యుడికి తాకింది. ఉగ్రశ్రవుడి పాదం. దాంతో ఆయన నరకయాతన ఎక్కువైంది. నిష్కారణంగా తన బాధను పెంచిన వ్యక్తి సూర్యోదయం కాగానే చనిపోవాలని శాపం పెట్టాడు మాండవ్యుడు. భర్తను మోసుకెళుతున్న శీలవతి నిర్ఘాంతపోయింది.
*"సూర్యోదయం కాగానే మరణిస్తారు ! ఇది మాండవ్య మహర్షి శాపం !"* మాండవ్యుడి పలుకు శీలవతి చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఏదో భయం , ఏదో ఆందోళన ఆమెలో సుళ్ళు తిరుగుతున్నాయి.
*"నాకెవరో శాపం పెట్టారు. సూర్యోదయం కాగానే చచ్చిపోతాను !"* ఉగ్రశ్రవుడు వణికే కంఠంతో పలవరిస్తున్నాడు. *“పొద్దు పొడిస్తే చచ్చిపోతాను. విన్నావా? త్వరగా నన్ను మన ఇంటికి చేర్చు.”*
శీలవతిని ఉగ్రశ్రవుడి కంఠం హెచ్చరించింది. భర్త మాటకు ఎదురాడి ఎరగని ఆ సాధ్వి మారు పలకకుండా , అప్రయత్నంగా వెనుదిరిగింది. *"విన్నావా ? సూర్యోదయం కాగానే నా ఆయువు తీరిపోతుందిట !"* ఉగ్రశ్రవుడి కంఠంలో ఏడుపు లీలగా ధ్వనించింది..
శీలవతి మెల్లగా నడుస్తూ ఆలోచిస్తోంది. సూర్యోదయం అయితే... తన భర్త మరణిస్తాడు. మాండవ్య మహర్షి శాపం తప్పక ఫలిస్తుంది. తన పతి దేవుడు మరణిస్తాడు... సూర్యోదయం అయితే... ఔను ! సూర్యోదయం అయితే ! సూర్యోదయమే కాకుంటే ? సూర్యుడు ఉదయించకుండా ఉంటే... ?!
శీలవతి అసంకల్పితంగా ఆగింది. ఆమెలో ఏదో ఆలోచన కుండలినీ శక్తిలా పడగ ఎత్తుతోంది. ఆమె కనురెప్పలు కదలడం మానేశాయి. ఏకోన్ముఖమైన నిర్ణయంతో ఆమె లేత పెదవులు కదిలాయి. *"నేను పతివ్రతనైతే , వివాహానికి ముందు భగవంతుణ్నే భర్తగా , వివాహానంతరం భర్తనే భగవంతుడిగా భావించిన సాధ్వినే అయితే ఇంక సూర్యోదయమే సంభవించకుండా ఉండుగాక !"*
శీలవతి కంఠం ఆ నిశ్శబ్ద నిశీధిలో స్పష్టంగా ప్రతిధ్వనించింది. ఆమె కాళ్ళు ఇంటి వైపు కదుల్తున్నాయి...
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 35*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 35*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
ఆ వింత వ్యక్తి నైజాన్నీ, శక్తినీ ఎలాగైనా పరిశోధించి నిజం కనుగొని తీరాలని మూడవసారి నరేంద్రుడు దక్షిణేశ్వరం వెళ్లాడు...
రెండవసారి జరిగినట్లు ఈసారి జరుగకూడదనే గట్టి పట్టుదలతో ఉన్నాడు. కాని కించిత్తు కూడా ఎదురు చూడనిది జరిగింది!ఆ రోజు దక్షిణేశ్వరంలో బాగా రద్దీగా ఉన్నందువల్లనో ఏమో శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి సమీపంలోని యదుమల్లిక్ ఉద్యానానికి తోడ్కొని వెళ్లారు.
ఆ ఉద్యానంలో కాసేపు నరేంద్రునితో పచార్లుచేస్తూ అనేక విషయాలు శ్రీరామకృష్ణులు ముచ్చటించారు. పిదప ఆ గదిలోకి వెళ్లి కూర్చున్నారు. ఇంతలోనే భావపారవశ్య స్థితిలో మగ్నులయ్యారు. కాస్త దూరం నుండే ఇదంతా నరేంద్రుడు గమనిస్తూనే ఉన్నాడు. అప్పుడు, ఆ పారవశ్య స్థితిలోనే హఠాత్తుగా వచ్చి నరేంద్రుణ్ణి ఆయన స్పృశించారు.
నరేంద్రుడు ఎంతో అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఆ శక్తిమంతమైన స్పర్శచే స్మృతి కోల్పోయాడు. మునుపటి అనుభవాల మాదిరి కాకుండా ఈసారి అతడు బాహ్యస్మృతిని పూర్తిగా కోల్పోయాడు. కాసేపటి తరువాత అతడికి బాహ్యస్మృతి కలిగినప్పుడు, శ్రీరామకృష్ణులు చిరునవ్వులు చిందిస్తూ అతడి ఛాతీని చేత్తో నిమురుతూ కనిపించారు.
ఏం జరిగిందో నరేంద్రునికి అర్థం కాలేదు. బహుశా అతడు అర్థం చేసుకోవలసిన అవసరం లేదని శ్రీరామకృష్ణులు భావించి ఉండవచ్చు. శ్రీరామకృష్ణుల పావన స్పర్శచే నరేంద్రుని మానసిక స్థితిలో గొప్ప మార్పు వచ్చింది. అప్పటి నుండి శ్రీరామకృష్ణులను అతడు పిచ్చి వానిగా భావించలేదు. అందుకు మారుగా, కామకాంచన పీడితులూ, స్వార్థపరులూ అయిన పిచ్చివారి మధ్య జీవిస్తూ బుద్ధి స్పష్టత గల వారిగా ఆయనను పరిగణించాడు. అయినప్పటికీ జరిగిన సంఘటనలు అతడికి అంతుబట్టలేదు.🙏
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
సౌందర్యలహరి🌹* *శ్లోకం - 19*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 19*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*ముఖం బిందుం కృత్వా కుచయుగ మధస్తస్య తదధో*
*హరార్ధం ధ్యాయేద్యో హరమహిషి తే మన్మథ కలామ్ |*
*ససద్య స్సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు*
*త్రిలోకీ మప్యాశు భ్రమయతి రవీందుస్తన యుగామ్ ||*
ఈ శ్లోకంలో మూడు బిందువులను (త్రినేత్రములు) ధ్యానించమన్నారు. పైన ఒకటి, క్రింద రెండు. ఇవి అగ్ని,సూర్య చంద్ర బిందువులు. ఈ బిందువుల త్రికోణమును (ఇచ్ఛాశక్తి, జ్ఞాన శక్తి, క్రియాశక్తి) మధ్యలోనున్న మరొక బిందువును (శివ శక్తుల సంగమం) దీనినీ ధ్యానించాలి.
ఓ తల్లీ నీ ముఖారవిందమును జగద్బీజంగా (బిందువుగా) సూర్యచంద్రులు సృష్టి స్వరూపిణివైన నీ స్తనయుగ్మముగా(అమ్మ స్తన్యము బిడ్డకు పోషణ ఇచ్చినట్లుగా సూర్యచంద్రుల వల్ల వర్షము కలిగి, పంటలు పండి ప్రపంచానికి పోషణ లభిస్తుంది) ఈ భౌతిక జగత్తు మొత్తం నీ ప్రకృతిగా తలచి, నీ మన్మధకళను(జీవుడిని భ్రాంతికి గురి చేసే స్వభావం) మంగళ రూపమును ఎవరు ధ్యానిస్తారో వారు ఈ కర్మబద్ధమైన ఈ దృశ్యమాన జగత్తు మొత్తం అమ్మ రూపంగా తెలుసుకొని దానితో సంయోగం వీడి ముక్తుడవుతాడు.
అమ్మవారి అవయవ వర్ణన లౌకిక దృష్టితో చూడరాదు. అవి శక్తి కేంద్రాలుగా, శక్తిస్వరూపాలుగా భావించి ధ్యానించాలి.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*రెండు మంగళసూత్రాలు*
👉 *నీతికథలు* 👈
*రెండు మంగళసూత్రాలు*
➖➖➖
*రెండు మంగళసూత్రాల వెనుక ఉన్న అద్బుత రహస్యం ఏమిటో తెలుసుకుందాం..!*
హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అతి ప్రధానమైంది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతో బాటు వివిధ రూపాలు కూడా ఉన్నాయి.
*మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం.*
మంగళసూత్రం లేదా మాంగళ్యం హిందూ సాంప్రదాయంలో పెళ్ళి జరిగిన స్త్రీలు మెడలో ధరించే గొలుసు లాంటి వస్తువు. దీనిలో తాళి లేదా తాళిబొట్టు, కొన్ని నల్ల పూసలు మొదలైనవి గుచ్చుకుంటారు.
వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమయింది.
మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో ‘మంగళ’ అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు ఉన్నాయి.
సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు.
ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రాన్ని పఠిస్తారు…
“మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! ”
మంగళ సూత్రం భార్యా భర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడు నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం.
*శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రం ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు. అందుకే హిందూ స్తీ మంగళ సూత్రం ధరిస్తుంది. వివాహిత మెడలో మంగళ సూత్రం లేదంటే భర్త చనిపోయినట్లుగా భావించే వారు అప్పటి కాలంలో!*
భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రంలో ముత్యం మించిన విలువైంది లేనేలేదు.
దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధం ఉంది. అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాతతరరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం. కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్ లేనిదే జరగకపోవటం సర్వసాధారణమై పోయింది. ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రాలను ఉత్తేజపరచి శారీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనడంలో ఎటువంటి సందేహం వలదు.
కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలు సమకూర్చగలదు.
మరొక విషయమేమిటంటే శుక్రుడు వివాహకారకుడు మాత్రమే, కాని సంసారిక జీవితాన్ని నడిపేవాడు కుజుడేనన్న మాట మరువకూడదు. అందుకే తొలుతగా కుజ దోషం ఉన్నదా లేదా అని చూస్తారు.
ప్రతి స్త్రీ జీవితంలో పైన చెప్పబడిన మూడు గ్రహాలు వాటి స్థితిగతులు బాగుంటే యిక జీవితం ఆనందమయమే అని భావన.
ఈ రోజుల్లో ఎంతమంది మంగళ సూస్త్రాలను, కాలికి మెట్టెలను ధరిస్తున్నారు!!
భర్త ఉన్నవారికి, భర్త చనిపోయిన వారికి ఏమైనా తేడా కనపడుతోందా!!
దీనికి కారణం చరిత్ర, సాంప్రదాయాలు తెలియక పోవటం.
👉ప్రతి ఒక్కరికీ మన సాంప్రదాయాలను తెలియచేద్దాం👈
🙌సర్వేజనాః సుఖినోభవంతు 🙌
మౌనంబే మునిజనులకు
*కం*
మౌనము దివ్యాభరణము
మౌనంబే మునిజనులకు మాహాత్మ్యమిడున్.(మహిమల నొసగున్)
మౌనమ విశిష్ట సహనము
మౌనము నందుండు టెల్ల మాన్యము సుజనా.
*భావం*:-- ఓ సుజనా! మౌనమనేది ఒక గొప్ప ఆభరణము,మౌనమే మునులకు గొప్ప శక్తుల నిచ్చును. మౌనమనేది గొప్ప సహనము, మౌనముగా ఉండగలగడమే గొప్ప గుర్తింపు అవుతుంది.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
*కం*
ఆయువు తీరకమునుపే
కాయమువిడనెంచినంత కాలుడు గొనడే!!(గొనునా)
రేయుగ యత్నించిన కడు
గాయంబుల వేగవలయు కాయము సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ఆయువు తీరక ముందే దేహము విడిచిపెట్టాలనుకున్నా యముడు తీసుకెళ్ళడు (కదా!!). విజృంభించి (రేయున) ప్రయత్నాలు చేసినచో పెద్ద గాయముల తో శరీరం బాధపడవలసి వస్తుంది.
*సందేశం*:-- కష్టాలకు భయపడి చావాలని ప్రయత్నాలు చేస్తే తీరని ఆయువు నీకు తీరని వేదన మిగుల్చుతుంది. ఆయువు తీరేవరకూ కర్మఫలములైన కష్టసుఖాలను అనుభవించక తప్పదు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
నవగ్రహ పురాణం - 52 వ అధ్యాయం*
*నవగ్రహ పురాణం - 52 వ అధ్యాయం*
🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷
*శనిగ్రహ జననం - 3*
*"ఛాయా ! నువ్వు నా ప్రతిబింబమన్న సంగతి భవిష్యత్తులో బైటపడకుండా ఉండాలంటే , మనకు సంబంధించిన - అంటే నాకు సంబంధించిన విషయాలు అన్నీ నీకు తెలియాలి. తెలియడమే కాకుండా ఆ విషయాలు నీకు హృదయగతం కావాలి ! రక్తగతం కావాలి !”* అంది సంజ్ఞ.
*“ఒక్కసారి వింటే చాలు... అవి నాకు రక్తగతం అయిపోతాయి !"* ఛాయ నవ్వుతూ అంది.
తనలాగే తక్షణం ప్రతిస్పందిస్తూ , సూటిగా మాట్లాడుతున్న ఛాయను తృప్తిగా చూస్తూ ఇలా అంది సంజ్ఞ.
*"నేను విశ్వకర్మ కుమార్తెను. ఆయన వసుపుత్రుడు , దేవశిల్పి..."* సంజ్ఞ పరిచయ ప్రసంగం ప్రారంభించింది.
*"నువ్వు కాదు , సంజ్ఞ నేను !”* ఛాయ అడ్డు తగుల్తూ, చిరునవ్వుతో అంది. *“నేను విశ్వకర్మ పుత్రికను ! నాకు సంబంధించిన విషయాలు చెప్పు !”*
సంజ్ఞ అర్థం చేసుకున్నట్లు నవ్వింది. *“నిన్ను విశ్వకర్మ దంపతులు కశ్యప ప్రజాపతీ , అది దంపతుల పుత్రుడు సూర్యునికి కన్యాదానం చేశారు. నీకు , నీ భర్త సూర్యుడి వల్ల వైవస్వతుడూ , యముడూ అనే ఇద్దరు కుమారులూ , 'యమి' అనే కుమార్తె కలిగారు. నీ భర్త శరీరం నుండి నిరంతరం వెలువడే వేడినీ , వెల్తురునీ భరించలేక నువ్వు కొన్ని రోజుల క్రితం నీ పుట్టింటికి వెళ్ళావు. అర్ధమవుతోంది కదా !”*
ఛాయ నవ్వింది. *“సందేహానికి అవకాశం లేకుండా ! అంటే నువ్వు వెళ్ళావని భావం. సరే... చెప్పు !”*
*“ఆయన వేడిమినీ , వెలుగునూ తట్టుకోవడానికి అవసరమైన మానసిక శక్తినీ , శారీరక సంసిద్ధతనూ సమకూర్చుకుని , సూర్యమందిరానికి తిరిగి వెళ్తున్నావు !”*
*"వెళ్ళి , నీ స్థానంలో సూర్యపత్నిగా రాణిస్తూ , నీ బిడ్డలను నా బిడ్డలలాగే చూసుకుంటాను !"* ఛాయ నవ్వింది.
*"ఏకాంతంలో ఆయనతో ఏ విధంగా మసలుకోవాలో నీకు వివరిస్తాను ! తదనంతరం నువ్వు సూర్య మందిరానికి వెళ్ళు !”* అంటూ చెప్పసాగింది సంజ్ఞ....
*"సంజ్ఞా !"* ద్వారం ముందు నిలుచున్న ఛాయను చూడగానే ఆశ్చర్యానందాలతో అన్నాడు సూర్యుడు.
*"స్వామీ !"* ఛాయ అప్రయత్నంగా అంది , సంజ్ఞ బోధించిన నటనావిన్యాసాన్ని గుర్తుచేసుకుంటూ.
*"నువ్వు వెళ్ళిపోయాక మందిరం కాంతి విహీనం అయిపోయింది , సంజ్ఞా !"* సూర్యుడు ఆమె వైపు అడుగులు వేస్తూ అన్నాడు.
ఛాయ చిరునవ్వుని బలవంతాన ఆపుకుంది. నిజంగా సూర్యుడు అమాయకుడే ! కాంతి ఆయన ఆస్తి ! సంజ్ఞ వెళ్ళిపోయాక మందిరంలో కాంతి మాయమైందట !
*"మీ కోసం , నా బిడ్డల కోసం వచ్చేశాను స్వామీ..."* ఛాయ భావ స్ఫోరకంగా అంది. *"మీ కోసం... పూర్తిగా , పూర్తిగా మారిపోయి , నూతనంగా వచ్చాను స్వామీ !”*
*"నిజంగా !"* సూర్యుడు ఆశ్చర్యంగా అన్నాడు. ఆశగా ఆమెనే చూస్తూ రెండు చేతుల్నీ ఎడంగా చాచాడు. ఛాయ వేగంగా వచ్చి , ఆయన చేతుల మధ్య ఇమిడి పోయింది. సూర్యుడిలోని అనురాగం ఆమెను దగ్గరగా తీసుకుంది. తన్మయత్వంతో ఉండిపోయాడు సూర్యుడు ! ఔను ! సంజ్ఞ తాను చెప్పినట్టు తనను పరివర్తింపజేసుకుని , సర్వసిద్ధంగా తన లోగిలిలోకి , తన కౌగిలిలోకి తిరిగి వచ్చింది. తన వేడిమినీ , వెలుగునూ భరించే శక్తిని సమీకరించుకుని వచ్చింది. అందుకే తన గాఢపరిష్వంగంలో ఆమె శరీరం కంపిస్తోంది.
*“సంజ్ఞా !”* సూర్యుడు తన ఛాతీ మీద ఆనిన ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు.
*"స్వా... మీ...”*
*"ఇంక ఎప్పుడూ నన్ను వదిలి వెళ్ళకూడదు !'*
*"...అలాగే...”*
*"ఇంకెప్పుడూ నాకు 'దగ్గరగా ఉంటూ, దూరంగా ఉండకూడదు !"* సూర్యుడి కంఠంలో భావోద్వేగం వణికింది.
ఛాయ సూర్యుణ్ణి చుట్టిన తన చేతులతో ఆయనకు సమాధానం చెప్పింది. *"అమ్మా !"* చిన్న బాలిక పిలుపు ఛాయను హెచ్చరించింది. యమి పిలుపు ఛాయా సూర్యుల్ని విడదీసి దూర దూరంగా జరిపింది.
యమి వాళ్ళ వైపు పరుగెట్టుకు వస్తోంది.
*"అమ్మా !"* రెండు కంఠాలు ఒకేసారి పిలిచాయి. యమిని దగ్గరకు తీసుకుంటూ , చూసింది ఛాయ. వైవస్వతుడూ , యముడూ నవ్వుతో అమ్మను చూస్తున్న ఆనందంతో , వికసిస్తున్న ముఖాలతో వేగంగా వస్తున్నారు.
*"ఛాయా ! నా భర్తని నీ భర్తగా చూసుకున్నట్టే , నా బిడ్డల్ని నీ బిడ్డలుగా జాగ్రత్తగా , ప్రేమగా , భద్రంగా చూసుకోవాలేం !"* సంజ్ఞ పదేపదే చెప్పిన మాట ఛాయ చెవుల్లో గింగురుమంది.
సూర్యుడి సాహచర్యమనే అదృష్టాన్ని అందిచ్చిన అక్క సంజ్ఞను తలచుకుంటూ ఛాయ ముగ్గురు పిల్లల్నీ ఒకేసారి దగ్గరగా తీసుకొని , ముగ్గురి బుగ్గల మీదా ముద్దులు పెట్టుకుంది.
కాలం గడిచిపోతోంది. ఛాయ సంజ్ఞ పాత్రలో పూర్తిగా లీనమైపోయింది. సూర్యుణ్ణి తన భర్తగా స్వీకరించి , అతనితో సుఖిస్తూ , సంజ్ఞ సంతానాన్ని తన సంతానంగా చూసుకుంటూ హాయిగా కాలం వెళ్ళబుచ్చుతూ ఉండిపోయింది. సూర్యుడు ప్రస్తుత సంజ్ఞ , సత్య సంజ్ఞ కాదనీ , ఛాయ అనీ లేశమాత్రం కూడా సందేహించకుండా ఆనందంగా ఉన్నాడు.
ఇలా ఉండగా - నారదుడు శ్రీమహావిష్ణువు దర్శనానికి వెళ్ళాడు. లక్ష్మీ విష్ణువులకు వందనాలు అర్పించాడు.
*"నారదా , నువ్వు ఇక్కడికి వస్తే బాగుండేదని నాకు అనిపించింది. సంకల్పం కలిగింది ; సన్నిధికి వచ్చావు !"* అన్నాడు శ్రీమహావిష్ణువు నవ్వుతూ.
*“నారాయణ ! నేను రావాలని మీరనుకున్నారు. అందుకేనేమో రావాలని నాకు అనిపించింది !"* నారదుడు నవ్వాడు.
*“ఎవరికైనా , ఏదైనా వర్తమానం అందజేయాలా , స్వామీ?”*
*“నవగ్రహాలలో సప్తమ గ్రహం జన్మించాలి కదా ! నువ్వు కల్పించుకుంటే గానీ సంకల్పం ఫలించేలా లేదు సుమా !"* విష్ణువు నవ్వుతూ అన్నాడు.
*“నారాయణ ! నారాయణ ! మీరు సంకల్పిస్తే , మరొకరు కల్పించుకోవడం దేనికి ? వృధా ప్రయాస !"*
*"లేదు నారదా ! నువ్వు కల్పించుకోవాలి. సప్తమ గ్రహం సూర్యపుత్రుడుగా సంభవించాలి"* అన్నాడు విష్ణువు.
*"సూర్య పుత్రుడిగానా ? ఇప్పటికే సూర్యుడికి ఇద్దరు పుత్రులున్నారుగా... నారాయణా !"*
*"ఆ ఇద్దరూ సూర్యుడికి భార్య వల్ల కలిగిన పుత్రులు నారదా ! మన ఏడవ గ్రహం భార్య కాని భార్య ద్వారా సూర్యుడికి జన్మించాలి !"* శ్రీహరి వివరించాడు.
*"నారాయణ ! భార్య కాని భార్యకా ?"* నారదుడు ఆశ్చర్యంగా అన్నాడు.
*"సూర్యుడి శరీర ఉష్టాన్నీ , కాంతినీ భరించలేకపోయిన సంజ్ఞ తన నీడకు ప్రాణ ప్రతిష్ఠ చేసి 'ఛాయ' అనే నామధేయంతో మందిరానికి పంపింది. ఛాయ సూర్యుడికి పత్నిగా , సంజ్ఞ సంతానానికి తల్లిగా నటిస్తూ జీవిస్తోంది. సంజ్ఞ బిడ్డల పోషణలో పూర్తిగా లీనమై పోయిన 'ఛాయ'కు తల్లి కావాలన్న తలంపే లేదు ! నువ్వు సూర్యమందిరానికి వెళ్ళి , ఆమెకూ స్వీయ సంతతి ఉండాలని రెచ్చగొట్టు. సూర్యుణ్ణి ప్రార్థించి సంతానాన్ని పొందమంటూ ప్రేరేపించు. తద్వారా మన నవగ్రహాలలోని సప్తమ గ్రహం ఆవిర్భవిస్తాడు !"*
*"ఆజ్ఞ ! కానీ... చిన్న సందేహం. సంజ్ఞ ఏమైంది ? పుట్టినిల్లు చేరిందా ?"* నారదుడు అడిగాడు.
*"లేదు ! పుట్టినింటికి వెళ్తే రహస్యం బట్టబయలు కాదా ? సంజ్ఞ అరణ్యంలో తపస్సులో మునిగిపోయిందిలే ! నువ్వు వెళ్ళు - సూర్య మందిరానికి !”* అన్నాడు శ్రీమహావిష్ణువు.
*రక్షణ వలయం-జాతక విశ్లేషణ*
లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం
శ్రీనివాససిద్ధాంతి9494550355
*రక్షణ వలయం-జాతక విశ్లేషణ*
కొందరి జాతకాలలో గ్రహాల యొక్క అమరికను అనుసరించి వారి జీవితం రక్షణ వలయంలో ఉంటుంది అనగా హై సెక్యూరిటీ జోన్ లో ఉంటారు. వీరికి జీవితంలో అన్ని వైపుల నుంచి రక్షణ ఏర్పడుతుంది శత్రువులు ఉండరు శిక్షలు ఉండవు ధనానికి లోటు ఉండదు సమాజం గౌరవం ఉంటుంది అనుకున్న పని సాధించగలుగుతారు ప్రమాదాలు ఉండవు దీర్ఘకాలిక ఇబ్బందులు ఉండవు. వీరు పట్టుదలగా, సరి అయిన ప్లానింగ్ ద్వారా పనిచేస్తారు. జాతకుడు యొక్క లగ్నానికి ద్వాదశ అధిపతి శుభగ్రహం అయి ఉండి ఆ గ్రహానికి శని భగవానులతో సంబంధం ఏర్పడాలి. శని భగవానుని తో కలిసి ఉన్నా, దృష్టి ఉన్నా, శని భగవానుని నక్షత్రంలో స్థితి పొందినా, శని భగవానుడు 12వ అధిపతి యొక్క నక్షత్రంలో స్థితి పొందినా, 12వ అధిపతి మకర కుంభాలలో స్థితి పొందినా,శని భగవానుల నుండి 8, 12 స్థానాలలో ఆ శుభగ్రహం ఉన్నప్పటికీ ఈ యోగం ఉంటుంది. వీరు జీవితకాలం అంతా హై సెక్యూరిటీ జోన్ లో ఉంటారని చెప్పాలి ఈ 12వ అధిపతికి శని భగవానుని తో సంబంధం ఏర్పడినప్పుడు ఆ శుభ గ్రహము మరియు శుభగ్రహం ఉన్న నక్షత్ర అధిపతి , ఆ శుభగ్రహము ఉన్న రాశి అధిపతి కూడా అద్భుతమైన ఫలితాలను జాతకులకు ప్రసాదిస్తారు. ఒక లగ్నానికి12వ అధిపతి శుభగ్రహం అయినప్పుడు మాత్రమే ఈ యోగం వర్తిస్తుంది. ఉదాహరణకి మేష లగ్నానికి 12వ అధిపతి గురుడు వీరికి ఈ రకమైన కాంబినేషన్ ఉంటే యోగం వర్తిస్తుంది. అదేవిధంగా మిధున లగ్నం, సింహ లగ్నం, తులా లగ్నం వృశ్చిక లగ్నం మకర లగ్నం.వీరికి మాత్రమే పై కాంబినేషన్ ఉన్నప్పుడు ఈ యోగం వర్తిస్తుంది. మేష లగ్న జాతకులకి గురువు మకరంలో ఉన్నప్పుడు నీచ పొందుతారు. అయినప్పటికీ గురు భగవానుడు ఈ జాతకులకు శుభ ఫలితాలు ఇస్తారు. తులా లగ్న జాతకులకు బుధుడు మీనంలో నీచమైన ఫలితాలు ఇస్తారు కానీ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంటే మాత్రం అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తారు. సింహలగ్న జాతకులకు చంద్రుడు శుక్లపక్ష చంద్రుడు అయితే మాత్రమే శుభ ఫలితాలను పొందగలుగుతారు లేనిచో ఈ యోగం వర్తించదు. మీ జాతకాలు ఈ రక్షణ వలయంలో ఉన్నాయేమో పరిశీలించుకోండి. మీ భవిష్యత్తు గురించి ఎటువంటి చింతా అవసరం ఉండదు.
రామాయణమ్ 321
రామాయణమ్ 321
...
క్రోధమెంత పాపిష్ఠిది!!
.
ఏమి అనాలి
ఏమి అనకూడదు !
.
ఎవరిని అంటున్నాం ?
ఎందుకు అంటున్నాము!
.
ఏది పలుకుతున్నాం !
ఏది పలుకరాదు!
.
ఎవరు పెద్ద
ఎవరు చిన్న
.
ఏదీ తెలియదు
అది ఒక మత్తు
మనిషిని చిత్తుచిత్తుగా ఓడిస్తుంది
మనిషిలోని మృగాన్ని నిద్ర లేపుతుంది !
.
పాము కుబుసము విడిచినట్లు
కోపము ఎవరు విడిచి వేయగలరో
వాడెపో ! ఘనుడు !
వాడెపో ! ఉత్తముడు !
.
సిగ్గు లేక ఎగ్గులేక
ఆలోచించే శక్తిలేక
అమ్మకు కీడు చేశానే !
.
నా తెలివిమాలిన పనికి
ప్రభు కార్యము నాశనమయ్యెగదా!
.
నా సముద్రలంఘనము వ్యర్ధము
నా ప్రయత్నములన్నీ వ్యర్ధము
.
నా కోపము
నా ఆవేశము
అసలుకే ఎసరు పెట్టినవి
.
సీతమ్మ నిస్సంశయముగా కాలిపోయి ఉంటుంది.
.
సీతమ్మ మరణిస్తే?
.
రామడుండడు
రామానుజుడుండు
రామసఖుడుండు
రామబంధువెవ్వడూ ఉండడు
.
ఇక నా బ్రతుకెందుకు?
.
అగ్నికి ఆహుతి అయిపోవుదునా
బడబాగ్నిలో దూకివేయుదునా ..
.
అయినా !
.
నా తోకనే కాల్చని అగ్ని
పరమ పావని సీతమ్మను అంటునా ?
.
అగ్నిని అగ్ని కాల్చివేయగలదా !!!
.
నేను ఇంత జలధి లంఘించి
ఇంత కార్యము చేసితినన్న
అమ్మ మహిమగాక
అన్యమేదియు లేదు
.
అమ్మ క్షేమము !
అమ్మక్షేమము!
అమ్మక్షేమము!
.
అని ఆలోచించి వడిగా వడివడిగా సుడిగాలి వలె అశోకవనమునకు చేరుకొనెను రామదూత హనుమంతుడు.
.
వూటుకూరు జానకిరామారావు
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -41🌹
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -41🌹*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*అన్నమయ్య జననం-2*
ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాథ. కొండలయ్య తాను ధరించే "బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని" వారికందజేశాడట. అలా పుట్టిన శిశువే అన్నమయ్య.
లక్కమాంబ గర్భవతి అయింది. వైశాఖమాసం విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో మూడు గ్రహాలు ఉన్నత దశలో వుండగా నారాయణసూరి, లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైనది, మగశిశువు ఉదయించాడు. సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు.
8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘన విష్ణుదీక్ష నొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడింది. నారాయణసూరి ఆ శిశువునకు ఆగమోక్తంగా జాతకర్మ చేశాడు.
"అన్నం బ్రహ్మేతి వ్యజనాత్" అనే శ్రుతి ప్రకారం నారాయణసూరి పరబ్రహ్మ వాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేశాడు. అన్నమయ్యకు అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయగురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళ్ళపాక సాహిత్యంలోను, శాసనాల్లోను కనిపిస్తాయి
శ్రీమహావిష్ణువు వక్షస్ధలమందలి కౌస్తుభమే శఠకోపయతిగా, వేంకటేశ్వరస్వామి గుడి ఘంట వేదాంతదేశికులుగా స్వామి హస్తమందలి నందకమనే ఖడ్గాంశలో పేయాళ్వారులు, అన్నమయ్యలు అవతరించారని ప్రాజ్గ్యుల విశ్వాసం.
అన్నమయ్య బాల్యం
"హరి నందకాంశజుం డగుట డెందమునపరమ సుగ్యాన సంపద పొదలంగ........."
అన్నమయ్య బొసి నవ్వులు వొలకబోస్తూ నలుగురినీ మురిపించేవాడు. మాటి మాటికి వెంకటప్పకు జోతలు పెట్టేవాడు. వెంకన్న పేరు చెబితేనే ఉగ్గుపాలు త్రాగేవాడు. వేంకటపతికి మొక్కుమని చెబితేనే మొక్కేవాడు. వేంకటపతిమీద జోలపాడనిదే నిద్రపోడు. లక్కమాంబ భక్తిగీతాలు పాడుతుంటే పరవశించి పోయేవాడు. నారాయణసూరి కావ్యాలలో అర్ధాలు వివరిస్తూవుంటే తానూ ఊ కొట్టేవాడు.ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వేంకటపతి మీది ధ్యానంతో ప్రొద్దులు గడిపేవాడు.అన్నమయ్యకు అయిదు సంవత్సరాలు నిండాయి. నారాయణసూరి ఆర్యుల సమ్మతి ప్రకారం ఉపనయనం చెయించాడు. అన్నమయ్యకు -
అహినాయకాద్రివెన్నుని వరముచే విద్య లన్నియునునమితంబు లగుచు జిహ్వరంగసీమ
తము దామె సొచ్చి నర్తనమాడ దొడగె
అన్నమయ్య ఆడిన మాటల్లా అమృతకావ్యంగ, పాడినదల్లా పరమగానంగా భాసించేది. చిన్ననాటనే వేంకటపతి మీద వింత వింతలుగా సంకీర్తనలు ఆలపించేవాడు. కాని అన్నమయ్య సంకీర్తన రచనకు స్వామి ఆదేశం పొదినది తన పదహారవ సంవత్సరంలోనే ! వేంకటేశ్వరస్వామి ఆదేశం ప్రకారం అన్నమయ్య తన పదహారో ఏటనుండి రోజుకొక్క సంకీర్తనకు తక్కువ కాకుండా వ్రాయడం ప్రారంభించాడు. ఈ విషయం రాగిరేకులమీద తొలి వ్యాక్యాలవల్ల కూడా స్పస్టమవుతున్నది.
అన్నమయ్య ఏక సంథాగ్రహి. గురువులు చెప్పిన పాఠాలు చెప్పినట్లు వెంటనే అప్పచెప్పేవాడు. వాళ్లు ఆశ్చర్యపడెవాళ్లు. ఇంక అన్నమయ్యకు నేర్పిన్చవలసింది ఏమీ లేదని త్వరలోనే తెలుసుకున్నారు. అన్నమయ్య చెన్నకేశవుని గుడిచేరి "బుజ్జి కేశవా" అని పిలిచేవాడు.
బుజ్జిబాలుని ముద్దు మాటలకు మురిసి చెన్నకేశవుడు సిరినవ్వులు చిందించేవాడు. అన్నమయ్య ఎప్పుడూ ఆటల్లో పాటల్లో మునిగి తేలేవాడు. చెఋవు కట్టలమీద చేరి చెట్టుమీద పిట్టలతో గొంతు కలిపేవాడు. చిరుగాలుల సవ్వడికి మురిసేవాడు. చెరువులోని అలలలో ఉయ్యాలలూగే కమలాలను చూస్తూ గంతులేసేవాడు. కన్నెపిల్లలు వెన్నెల రోజుల్లో జాజర ఫడుతూంటే అక్కడ చేరుకొని వాళ్లను అల్లరి పెట్టేవాడు. రాగం పాడీ, తాళం వేసీ చూపేవాడు. "మీకెం తెలీదు పోమ్మ"ని ఎగతాళి చేసేవాడు. కలుపు పాటల్లో, కవిల పాటల్లో జానపదులతో బాటు శ్రుతి కలిపేవాడు. అన్నమయ్య మాటన్నా పాటన్నా ఆ వూరి వాళ్లు ఎంతో సంబరిపడిపోయే వాళ్లు.నారాయణసూరిది పెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబాలలో చిన్న చిన్న కలతలు తప్పవు. వాళ్ల కోపతాపాలు అర్ధం లేనివి కావు ఇంతలో తగువులాడతారు. అంతలో కలిసిపోతారు.అన్నమయ్య బాల్యంలో తల్లిదండ్రులు, వదిన చెప్పిన పనులు అన్నీ విసుగు చెందగ చేసేవాడు. ఉమ్మడి కుటుంబాలల్లో పనులు తప్పవు. అందుకనె ఎప్పుడూ దండె భుజాన తగిలించుకొని పాటలు పాడడం ఇంటివారలకు అంతగా నచ్చేది కాదు. ఒకనాడు అందరు కలిసికట్టుగ అన్నమయ్య మీద విరుచుకు పడ్డారు. అన్నమయ్యకు దిక్కు తెలియలేదు. "అప్పుడు ఆ దండె భుజాన తగిలించుకొని పిచ్చి పాటలు పాడుకొవడమేనా? ఇంట్లో పనీ పాట ఎవరు చూస్తారు? "అని ఇంటివాళ్లు దెప్పి పొడిచారు. "గాలి పాటలు కట్టిపెట్టి అడవికెళ్ళి పశువులకింత గడ్డి తెచ్చిపడేయ్." ఏ విసుగులో వున్నాడో నారాయణసూరి కొడుకును కసిరినంత పనీచేశాడు. లక్కమాంబ మాత్రం కొడుకువైపు జాలిగ చూసింది. అన్నమయ్య ఏమీ బదులు పలకలేదు. కొడవలి భుజాన తగిలించుకొని అడవికి బయలుదేరాడు.
అన్నమయ్యకు అడవికి వెళ్ళదం అలవాటు లేదు. ఒక చెట్టు కింద చతికిలబడ్డాడు. తంబుర చేతిలోనే ఉంది. తీగలు సవరించి పాడబోయాడు. పక్కనే కొడవలి ఉంది. దాన్ని చూస్తూనే వచ్చిన పని గుర్తుకు వచ్చింది. లెచి చుట్టూ పరికించాడు. ఒక చోట పచ్చిక బాగా బలిసి ఉంది.
’పాపవల్లరుల శ్రీపతినామహేతినే పార దఋగు యోగీంద్రు చందమున ’
అంటూ కొడవలితో పచ్చికను కోస్తున్నాడు. పచ్చిక కోస్తున్నా మనసంతా శ్రీ హరి మీదనే ఉంది. అందుకే మరికొంత పచ్చికను కొయబోతున్న అన్నమయ్య ఒక్కసారి "అమ్మా !!" అని కేక పెట్టాడు, చిటికిన వేలు తెగి రక్తం బొటబొటా కారుతున్నది. రక్తం చూస్తూనే కళ్లు తిరిగిపోయాయి. బాధతో మూలిగాడు. ఈ అవస్థకు కారణం ఎవరు? ఒక్కమారు తనబంధువుల్ని తల్లిదండ్రుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. వేదనలో విరక్తి,భక్తి జన్మించాయి.
వేదనలో వేదం ప్రభవించినట్లు ఈ సంఘ్హటన అన్నమయ్య జీవితంలో భక్తిరసావేశానికి నాంది పలికింది. "అంతా అబద్ధం. తనకు ఎవ్వరూ లేరు. లౌకిక బంధాలతో తనకు పనిలేదనుకున్నాడు.
"అయ్యోపోయ బ్రాయముగాలము
మయ్యంచు మనసున నే మొహమతినెత్తి||
తగు బంధూలా తనకు దల్లులును దండ్రులును
వగలబెట్టుచు దిరుగువారేకాక
మిగుల వీరల పొందు మేలనుచు హరినాత్మ
దగిలించలేక చింతాపరుడనైతి ||అని చింతించి.....
"తల్లియుదండ్రియు దైవంబు గురువు
నెల్ల సంపదలునై యెల్ల చందముల
ననుబ్రోచు శెశాద్రినాధుని,గొలిచి
మనియెద........."అని నిర్ణయించుకొంటాడు.
*శ్రీ నారసింహ గోవిందా, శ్రీ* *రామచంద్ర గోవిందా, శ్రీ కృష్ణ* *మూర్తీ గోవిందా, శ్రీ వెంకటేశా గోవిందా; |*
*గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా. |* |41||
*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.🙏*
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
నవగ్రహా పురాణం🪐* . *22వ అధ్యాయం*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *22వ అధ్యాయం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*పురాణ పఠనం ప్రారంభం*
*చంద్రగ్రహ జననం - 4*
*“ఆ విధంగా భయాందోళనలకు గురైన శీలవతి నిశ్చేష్టంగా నిలిచిపోయింది”.* చంద్రగ్రహ జన్మ వృత్తాంతం వినిపిస్తున్న నిర్వికల్పానందులు అన్నారు.
*"ఆ విధంగా శపించింది ఎవరు గురువుగారూ ?”* విమలానందుడు అడిగాడు. *"ఆయన పేరు మాండవ్యుడు. ఆయన ఒక మహా తపస్వి... మహర్షి... శీలవతి భర్తను మోసుకొని వెళుతున్న దారి పక్కనే నిలువెత్తు శూలానికి గుచ్చబడి , ఆ మాండవ్యుడు. భయంకరమైన శిక్ష అనుభవిస్తున్నాడు...”* నిర్వికల్పానంద చెప్పసాగాడు.
*"మాండవ్యుడు తన ఆశ్రమంలో తపోనిష్ఠలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుగారి మందిరంలో దొంగలు పడ్డారు. ధనంతో పారిపోతున్న దొంగలను రాజభటులు వెంటాడారు. దొంగలు అరణ్యంలోని మాండవ్య మహర్షి ఆశ్రమ ప్రాంతానికొచ్చారు. మాండవ్యుడు ఆశ్రమం ముందున్న చెట్ల కింద నిలబడి చేతుల్ని నిటారుగా పైకెత్తి తదేక నిష్ఠతో తపస్సు చేస్తున్నాడు. చోరులు తప్పించుకునే ఉద్దేశంతో ఆయన ఆశ్రమంలో దాక్కున్నారు.
రాజభటులు వచ్చి మహర్షిని దొంగల గురించి అడిగారు. మౌనవ్రతంలో ఉన్న మాండవ్యుడు వాళ్ళకు సమాధానం చెప్పలేదు. చివరికి ఆ భటులు ఆశ్రమంలో దాక్కున్న దొంగల్ని పట్టుకొన్నారు. మౌనంగా ఉండిపోయిన మాండవ్యుడు కూడా ఆ దొంగల్లో ఒకరనీ , ముని వేషంలో నాటకం ఆడుతున్నాడనీ భావించి , ఆయనను కూడా రాజు వద్దకు లాక్కెళ్ళారు. రాజు దొంగలకు మరణ దండన విధించాడు. చోరుడై ఉండి , సాధువులా నటిస్తున్నాడన్న భావనతో మాండవ్యుడికి దారుణమైన 'శూలపోత' శిక్ష విధించాడు. భటులు మాండవ్యుడిని నేలలో పాతిన వాడి శూలానికి దిగవేశారు..
శూలాగ్రానికి దిగవేయబడిన మాండవ్యుడు భరింపరాని బాధను మౌనంగా అనుభవిస్తూ ఉండిపోయాడు. ఆ విధంగా శూలం మీద దుర్భరమైన శిక్షను అనుభవిస్తున్న మాండవ్యుడికి తాకింది. ఉగ్రశ్రవుడి పాదం. దాంతో ఆయన నరకయాతన ఎక్కువైంది. నిష్కారణంగా తన బాధను పెంచిన వ్యక్తి సూర్యోదయం కాగానే చనిపోవాలని శాపం పెట్టాడు మాండవ్యుడు. భర్తను మోసుకెళుతున్న శీలవతి నిర్ఘాంతపోయింది.
*"సూర్యోదయం కాగానే మరణిస్తారు ! ఇది మాండవ్య మహర్షి శాపం !"* మాండవ్యుడి పలుకు శీలవతి చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఏదో భయం , ఏదో ఆందోళన ఆమెలో సుళ్ళు తిరుగుతున్నాయి.
*"నాకెవరో శాపం పెట్టారు. సూర్యోదయం కాగానే చచ్చిపోతాను !"* ఉగ్రశ్రవుడు వణికే కంఠంతో పలవరిస్తున్నాడు. *“పొద్దు పొడిస్తే చచ్చిపోతాను. విన్నావా? త్వరగా నన్ను మన ఇంటికి చేర్చు.”*
శీలవతిని ఉగ్రశ్రవుడి కంఠం హెచ్చరించింది. భర్త మాటకు ఎదురాడి ఎరగని ఆ సాధ్వి మారు పలకకుండా , అప్రయత్నంగా వెనుదిరిగింది. *"విన్నావా ? సూర్యోదయం కాగానే నా ఆయువు తీరిపోతుందిట !"* ఉగ్రశ్రవుడి కంఠంలో ఏడుపు లీలగా ధ్వనించింది..
శీలవతి మెల్లగా నడుస్తూ ఆలోచిస్తోంది. సూర్యోదయం అయితే... తన భర్త మరణిస్తాడు. మాండవ్య మహర్షి శాపం తప్పక ఫలిస్తుంది. తన పతి దేవుడు మరణిస్తాడు... సూర్యోదయం అయితే... ఔను ! సూర్యోదయం అయితే ! సూర్యోదయమే కాకుంటే ? సూర్యుడు ఉదయించకుండా ఉంటే... ?!
శీలవతి అసంకల్పితంగా ఆగింది. ఆమెలో ఏదో ఆలోచన కుండలినీ శక్తిలా పడగ ఎత్తుతోంది. ఆమె కనురెప్పలు కదలడం మానేశాయి. ఏకోన్ముఖమైన నిర్ణయంతో ఆమె లేత పెదవులు కదిలాయి. *"నేను పతివ్రతనైతే , వివాహానికి ముందు భగవంతుణ్నే భర్తగా , వివాహానంతరం భర్తనే భగవంతుడిగా భావించిన సాధ్వినే అయితే ఇంక సూర్యోదయమే సంభవించకుండా ఉండుగాక !"*
శీలవతి కంఠం ఆ నిశ్శబ్ద నిశీధిలో స్పష్టంగా ప్రతిధ్వనించింది. ఆమె కాళ్ళు ఇంటి వైపు కదుల్తున్నాయి...
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
సౌందర్యలహరి🌹* *శ్లోకం - 19*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 19*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*ముఖం బిందుం కృత్వా కుచయుగ మధస్తస్య తదధో*
*హరార్ధం ధ్యాయేద్యో హరమహిషి తే మన్మథ కలామ్ |*
*ససద్య స్సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు*
*త్రిలోకీ మప్యాశు భ్రమయతి రవీందుస్తన యుగామ్ ||*
ఈ శ్లోకంలో మూడు బిందువులను (త్రినేత్రములు) ధ్యానించమన్నారు. పైన ఒకటి, క్రింద రెండు. ఇవి అగ్ని,సూర్య చంద్ర బిందువులు. ఈ బిందువుల త్రికోణమును (ఇచ్ఛాశక్తి, జ్ఞాన శక్తి, క్రియాశక్తి) మధ్యలోనున్న మరొక బిందువును (శివ శక్తుల సంగమం) దీనినీ ధ్యానించాలి.
ఓ తల్లీ నీ ముఖారవిందమును జగద్బీజంగా (బిందువుగా) సూర్యచంద్రులు సృష్టి స్వరూపిణివైన నీ స్తనయుగ్మముగా(అమ్మ స్తన్యము బిడ్డకు పోషణ ఇచ్చినట్లుగా సూర్యచంద్రుల వల్ల వర్షము కలిగి, పంటలు పండి ప్రపంచానికి పోషణ లభిస్తుంది) ఈ భౌతిక జగత్తు మొత్తం నీ ప్రకృతిగా తలచి, నీ మన్మధకళను(జీవుడిని భ్రాంతికి గురి చేసే స్వభావం) మంగళ రూపమును ఎవరు ధ్యానిస్తారో వారు ఈ కర్మబద్ధమైన ఈ దృశ్యమాన జగత్తు మొత్తం అమ్మ రూపంగా తెలుసుకొని దానితో సంయోగం వీడి ముక్తుడవుతాడు.
అమ్మవారి అవయవ వర్ణన లౌకిక దృష్టితో చూడరాదు. అవి శక్తి కేంద్రాలుగా, శక్తిస్వరూపాలుగా భావించి ధ్యానించాలి.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
నరేంద్ర మోదీ అధికారము
నరేంద్ర మోదీ అధికారములోకి రాకుంటే ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ యెంత అద్వాన్నంగా ఉండేదో పూర్తి ఆధారాలతో రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ దైర్యంగా వ్రాసిన సంచలన వ్యాసానికి తెలుగు స్వేచ్ఛానువాదము.ఈ వ్యాసాన్నిభారతపౌరులు,జాతీయభావాలు గలవారు ముఖ్యం గా హిందువులమని చాటుగా అనుకునేవారు విధిగా చదువాలి.
🚩ఏ దేశ ప్రభుత్వమైనా మొదట చేయాల్సింది తమ దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠం గావించడం,రుణ విముక్తి గావించడం,దేశ జి.డి.పిని పెంచుకోవడం, అంతర్జాతీయ స్థాయిలో తన దేశాన్ని నిలదొక్కుకునే విధంగా చేయడం,ఇంటా,బయట శత్రువులను అణచి వేయడం, సైనికపాటవాన్ని ,పటాలాన్ని పెంచుకోవడం మరియు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకో వడం.
🚩ఈ విషయాలలో నరేంద్ర మోదీ రాకపూర్వం భారత్ యెలా ఉండింది?వచ్చాక ప్రస్తుతం ఎలా వుంది?అని బేరీజు వేసుకున్నప్పుడే అతడి పాలనా దక్షత దేశ ప్రజలకు అర్థమవుతుంది.వారు 2014 మే 26 వ తేదీన మన్మోహన్ సింగ్ నుండి 14 వ భారతదేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
🎈మన్మోహన్ సింగ్ నేతృత్వములోనున్న యూ.పి.ఏ ప్రభుత్వ హయాములో అగస్టు,29,2013 నఈ దేశ మీడియా ఒక సంచలన వార్త ప్రచురించింది.
అది అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశ ప్రతిష్టను దిగజార్చింది.అదేమంటే అప్పటి కేంద్ర ప్రభుత్వ వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ దేశములోని 5 లక్షల 57 వేల కిలోల బంగారములో 5 లక్షల కిలోల బంగారాన్ని తీసివేయాలని నిర్ణయిం చింది. అంటే 90% గోల్డ్ కార్పస్ ను తనఖా పెట్టాలని నిర్ణయించిందన్న మాట.ఈ వార్త మన దేశ ఆర్థిక పరిస్థితి యెంత క్లిష్ట స్థితిలో ఉందో చెప్పకనే చెబుతుంది.ఆర్థిక నిపుణుడని సర్టిఫికేటు పొందిన మన్మోహన్ సింగ్ పది సంవత్సరాల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను యెంత దిగజార్చారో తెలుస్తుంది.
🎈అప్పుడు మనదేశ గోల్డ్ కార్పస్ నిల్వలు కేవలం
5 లక్షల 57 వేల కిలోలు మాత్రమే .అప్పుడు పది గ్రాముల బంగారం ధర రూ.27,750లు. అంటే,మొత్తం బంగారం విలువ రూ.1.38 లక్షల కోట్లు.
🎈ఈ వార్త ప్రచురించ బడ్డాక దేశప్రజలు అగ్రహెూద గ్రులై,అభద్రతకు గురై ఒత్తిడికి లోసయ్యారు.అప్పుడు వాణిజ్య శాఖా మాత్యులు ఆనంద్ శర్మ తన ప్రతిపాదనను ఉపసంహరించుకొని తన అభిప్రాయాన్ని మీడియా తప్పుగా ప్రచురించిందని,సవరణ వివరణనిచ్చారు.
ఆ తరువాత రెండు,మూడు సంఘటనలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది.అంతర్జాతీయంగా భారతదేశ పరువు పోతుందని బంగారాన్ని కుదువబెట్టే చర్యను మానుకొన్నారు.
🎈మరి ఆర్థిక దుస్థితినుండి బయట పడడానికి మన్మోహన్ సింగ్ నేతృత్వములోని యూ.పి.ఏ. ప్రభుత్వము చేసిన పని అప్పు చేయడం.అదే,విదేశీ కరెన్సీ,నాన్ రెసిడెంట్ డిపాసిట్(F.C.N.R[B])ద్వారా 25బిలియన్ల రుణాలు+32.32 బిలియన్ల (రూ2.23లక్షల కోట్లు)రుణం తీసుకొంది.
🎈మోదీ అధికారములోకి వచ్చేనాటికి 5 లక్షల 57 వేల కిలోల బంగారము మరియు 2.23 లక్షల కోట్ల రుణమున్నది.
🎈ఆ రుణాన్ని వడ్డీతో సహా మోదీ ప్రభుత్వం చెల్లించింది.
🎈బంగారం నిల్వలను 5.57 టన్నులనుండి
148 టన్నులకు పెంచారు.
🎈30 వ జూన్ 2021 నాటికి దేశంలో బంగారం నిల్వలు 705 టన్నులయ్యాయి.
🎈తమ కాంగ్రేస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాములో జరిగిన దివాలాకోరు ఆర్థిక వ్యవస్థను కప్పిపుచ్చి రాహుల్ గాంధీ కాంగ్రేస్ మరియు కమ్యూనిస్టు పార్టీలకు వత్తాసు పలికే Lutyens media సైకోఫాంటిక్ జర్నలిస్టులు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని నిరంతరం దుఃఖం నటిస్తున్నారు.
🎈1. అప్పటి RBI గవర్నర్ రఘురామ్ రాజన్ యొక్క ఈ *ఒప్పుకోలు* చదవండి.
https://indianexpress.com/article/business/banking-and-finance/fcnr-bonds-were-least-bad-option-to-raise-dollars-raghuram-rajan-3011772/
🎈2. మోదీ ప్రభుత్వం ఆ రుణాన్ని తిరిగి చెల్లించింది. దీన్ని ధృవీకరించడానికి ఈ లింక్‌పై క్లిక్ చేసి ని చదవండి.
https://www.thehindubusinessline.com/money-and-banking/fcnr-deposits-of-2013-set-to-mature-reserve-bank-ready-to-tackle-volatility/article8472235.ece
🎈కాంగ్రెస్, కమ్యూనిస్టు మున్నగు పార్టీల తప్పుడు ప్రచారాలను తెలుసుకొని అర్థం చేసుకోండి.
🎈కావున దేశ ప్రయోజనాల దృష్ట్యా మేలుకోండి.
🚩స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు యెవరూ చేయలేని పనిని నరేంద్ర మోదీ ఈ 7 ఏళ్లలో చేశారు. తప్పక చదవండి, మధ్యలో ఎక్కడైనా వదిలేస్తే, మీ కళ్ళు మూసుకుపోతాయి, కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా చదవండి.
🎈తొలి విజయం:మన దేశాన్ని 200 ఏళ్ల పాటు బానిసలుగా మార్చిన బ్రిటన్ దేశములో జరిగిన 53 కామన్ వెల్త్ దేశాల సమావేశంలో నరేంద్ర మోదీగారు జనరల్ ప్రెసిడెంట్ అయ్యాడు.దీనికి ప్రతి భారతీయుడు గర్వించాలి.మరియు అతడి వక్షస్థలం విశాలం కావాలి.
🎈రెండవ విజయం: UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌లో భారత్‌కు భారీ విజయం లభించింది, అందు సభ్యుడగుటకు 97 ఓట్లు అవసరం,కాగా మనకు 188 ఓట్లు వచ్చాయి.ఇది చూశాక ,భారత ప్రజలు నరేంద్ర మోడీ విదేశాలకు ఎందుకు వెళ్ళాడని ఇంకా అడుగుతారా?
🎈మూడవ విజయం:ప్రపంచంలోని 25 అత్యంత శక్తివంతమైన దేశాల జాబితా విడుదలైంది.అందు భారత్ ఉండడం,పాకిస్తాన్ లేకపోవడం గర్వం కాదంటారా?
🎈నాల్గవ విజయం:మన GST నెలవారీ పన్ను వసూళ్లు 1 లక్ష కోట్లకు చేరుకొంది.ఇది రైల్వే ప్లాటుఫామ్ పైన టీ అమ్మిన నరేంద్రమోదీ ఆర్థశాస్త్ర పరిమళం కాదా?
🎈ఐదవ విజయం:నూతన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో అమెరికా మరియు జపాన్‌లను వెనక్కి నెట్టి భారతదేశం రెండవ స్థానానికి చేరుకుంది.
🎈ఆరవ విజయం:2017-18లో సౌరశక్తి ఉత్పత్తి రెండింతలయింది.దీన్ని చూసి చైనా, అమెరికాలు కంగుతిన్నాయి.
🎈ఏడవ విజయం:ఆకాశాన్నంటుతున్న భారతదేశ జి.డి.పిని చూడండి.మన దేశ జి.డి.పి 8.2% కాగా,చైనాది 6.7% మరియు అమెరికాది 4.2%. నరేంద్రుడు విదేశాలకు ఎందుకు వెళ్ళాడో ఇప్పుడు భారతీయులకు అర్థమై యుండాలి.
🎈ఎనిమిదవ విజయం:భూమి,జలము మరియు ఆకాశం అనే మూడు ప్రాంతాల నుండి సూపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగించిన మొదటి దేశం మన భారతదేశం.ఇది రాజరాజనరేంద్రుని యుగం.
మీకు గర్వంగా ఉంటే, “జైహింద్ “అని వ్రాయడం మర్చిపోకండి.
🎈తొమ్మిదవ విజయం:70 ఏళ్లలో పాకిస్థాన్ పేదరికాన్ని ఎప్పుడూ చవి చూడలేదు, కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక దొంగనోట్ల రద్దుతో , పాకిస్తాన్ దరిద్రంగా మారింది.
🎈పదో విజయం: 2014లో కాంగ్రెస్ రక్షణ మంత్రి ఎ.కె.ఆంథోనీ దేశం ఆర్థిక దుస్థితిలో ఉందని, మనము రాఫెల్, చిన్న జెట్ కూడా కొనలేని స్థితిలో ఉన్నామని అన్నారు.కాని నరేంద్రుడి హయాములో,
రాఫెల్ డీల్ కుదిరింది.ఎస్-400 కూడా తీసుకుంటోంది.
మరి కాంగ్రెస్ హయాంలో దేశ సొమ్ము ఎక్కడికి పోయింది?
🎈పదకొండవ విజయం:సైన్యం బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో యొక్క రక్షణ కవచాన్ని పొందగలిగింది.
జమ్మూ కాశ్మీర్‌లో సైన్యానికి 2500 బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియోలు అందించబడ్డాయి.
🎈పండ్రెండవ విజయము:ఈ 4 సంవత్సరాలలో భారతదేశములో యెంత అభివృద్ధి జరిగిందో నేను మీకు చెబుతాను.
🎈ఆర్థిక వ్యవస్థలో ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టి భారత్ 6 వ స్థానానికి చేరుకుంది.
🎈పదమూడవ విజయం:ఆటోమోబైల్ రంగములో జర్మన్ ను వెనక్కి నెట్టి భారత్ 4 వ స్థానంలో నిలిచింది.
🎈పద్నాలుగో విజయం:విద్యుత్ ఉత్పత్తిలో రష్యా వెనుకబడి పోగా,భారత్ 3వ స్థానంలో నిలిచింది.
🎈పదిహేనవ విజయం ;వస్త్ర ఉత్పత్తిలో ఇటలీని అధిగమించి,భారత్ రెండవ స్థానానికి చేరుకుంది.
🎈పదహారవ విజయం:మొబైల్ ఉత్పత్తిలో వియత్నాం వెనుకబడి పోగా,భారత్ రెండవ స్థానంలో నిలిచింది.
🎈పదిహేడవ విజయం: ఉక్కు ఉత్పత్తిలో జపాన్‌ను అధిగమించి భారత్ రెండవ స్థానానికి చేరుకుంది.
🎈పద్దెనిమిదవ విజయం:చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్‌ను అధిగమించి భారత్ నెంబర్ వన్ గా నిలిచింది.
🎈పంతొమ్మిదవ విజయం:శ్రీ రామమందిరం, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, CAA.NRC మరియు యువతులకు వివాహ వయస్సు 18 నుండి 21 సంవత్సరాలకు బిల్లులను ప్రవేశపెట్టి విజయాన్ని సాధించారు.యూనిఫాం సివిల్ కోడ్, జనాభా నియంత్రణ చట్టములు చేయుటకు అడుగులు పడుతున్నాయి.
🎈ఇరువదవ విజయం:గాఢ నిద్రలోనున్న హిందువులలో, జాతీయవాదాన్ని మేల్కొల్పారు. ప్రపంచం మొత్తం మీద 125 కోట్ల మంది ఉన్న హిందువులకు తమకంటూ ఒక్క దేశం కూడా లేదనే విషయం చెప్పగలిగారు.
🚩నేను ఈ పనిని అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నాను.
🚩దీన్నే నరేంద్ర మోదీ యుగం అంటారు.
🚩మోదీ ప్రభుత్వంలో ఉగ్రవాదులు కాశ్మీర్ లోయల నుంచి తుడిచిపెట్టుకుపోతున్నారు.
🚩లష్కరే తోయిబా ఉగ్రవాది నవేద్ వట్ హతమయ్యాడు.
🚩హిజ్బుల్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
🚩8 నెలల్లో, 72 మందిని హురాన్ సమీపంలో, 230 మంది ఉగ్రవాదులను నరకానికి పంపారు.
🚩కాంగ్రేసు పార్టీ ఉగ్రవాదులను చూచి భయందోళనలకు గురికాగా,నరేంద్ర సింగమును చూచి ఉగ్రవాదులు భయాందోళనలకు గురవుతున్నారు.
🚩 కాంగ్రేసు హయాములో భారత సైన్యం ఉగ్రవాదులకు భయపడగా,నరేంద్రుని పాలనలో, ఉగ్రవాదుల దాడి కొరకు సైన్యం విజృంభిస్తున్నది.
🚩తమ అవినీతి వ్యూహాలు ఫలించలేకపో తున్నాయని, కాంగ్రేస్, కమ్యూనిస్టులు.,తృణమూల్, టి.ఆర్.ఎస్.యు,సమాజ్ వాది,బహుజనసమాజ్, యం.ఐ.యం మున్నగునవన్ని, నరేంద్రుడనే అభిమన్యుడిని చంపాలని అనగా 2024 సార్వత్రిక ఎన్నికలలో ఓడించేందుకు పద్మవ్యూహం పన్నుతున్నారు.రోజురోజుకు నరేంద్రమోదీజీకి పెరుగుతున్న కీర్తిప్రతిష్టలను చూసి ప్రతిపక్ష పార్టీలన్ని కంగు తింటున్నాయి.కానీ ఆ అవినీతిపర పార్టీలు మోదీని ఏం చేయలేవు.ద్వాపర యుగములో అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించడం తల్లి గర్భంలో యున్నప్పుడు గ్రహించాడు.ఈ మోడి రూప అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ప్రవేశించి,తిరిగి ఛేదించుకొని రాగల విద్యలను భరతమాత ఒడిలో నేర్చుకొన్నాడు.ఆమె అజేయురాలు, తన పుత్రుడైన నరేంద్రుడిని అజేయుడగుటకు ఆశీర్వదిస్తున్నది.
🚩2024లో భరతమాత పుత్రుడిని గతంలోకంటె భారీ మెజారిటీతో గెలిపించేలా ఈరోజు మనమందరం ఒక తీర్మానం చేద్దాం, ఆ సంఖ్య ఎవరూ చేరుకోలేని విధంగా గిన్నిస్ బుక్‌లో నమోదవ్వాలి.
🚩2024లో నరేంద్రుడిని తిరిగి భారత ప్రధానిని చేయవలయునని భారత ప్రజలందరికి నమస్కరిస్తున్నాను 👏🙏