ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
11, ఏప్రిల్ 2026, శనివారం
పంచాంగం 11.04.2026 Saturday,
ఈ రోజు పంచాంగం 11.04.2026 Saturday,
స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాస కృష్ణ పక్ష నవమి తిథి స్థిర వాసర ఉత్తరాషాఢ నక్షత్రం సిద్ధ యోగః తైతుల తదుపరి గరజి కరణం.
రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.
యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.
శ్రాద్ధ తిథి: నవమి
నమస్కారః , శుభోదయం
ఆర్యా శతకం - 1*
*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*ఆర్యా శతకం - 1*
*శ్లోకము - 79*
*మాలిని మహేశచాలిని కాంచీఖేలిని విపకాలిని తే ౹*
*శూలిని విద్రుమశాలిని సురజనపాలిని కపాలిని నమోస్తు॥*
*భావము :*
*ఓ మాలినీ! ఈశ్వరుని సైతము చలింపచేయగల మాతా, కాంచీపురమందు క్రీడాసక్తి కలదానా, శూలమును ధరించి శత్రు సంహారము చేసే పగడపు హారమును ధరించి, కపాలధారిణియైన శ్రీమాతకు నమస్కారము.*
🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏
భగవద్గీత
--------------------------భగవద్గీత. ------------------------
చతుర్దోధ్యాయః
జ్ఞాన కర్మ సన్యాస యోగము
శ్రీ భగవానువాచ ।
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ ।
వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్ ।। 1 ।।
ప్రతిపదార్థ:
శ్రీ భగవానువాచ — పరమేశ్వరుడైన శ్రీ కృష్ణ భగవానుడు పలికెను; ఇమం — ఈ యొక్క; వివస్వతే — సూర్య భగవానునికి; యోగం — యోగ శాస్త్రము; ప్రోక్తవాన్ — ఉపదేశించాను; అహం — నేను; అవ్యయం — సనాతనమైన; వివస్వాన్ — సూర్య భగవానుడు; మనవే — మనువుకు, మానవ జాతి యొక్క మూల పురుషుడు; ప్రాహ — చెప్పెను; మనుః — మను; ఇక్ష్వాకవే — ఇక్ష్వాకుడుకి, సూర్య వంశపు మొదటి చక్రవర్తి; అబ్రవీత్ — బోధించెను.
తాత్పర్యము :
పరమేశ్వరుడైన శ్రీ కృష్ణ భగవానుడు ఇలా అన్నాడు: నేను ఈ యొక్క సనాతనమైన యోగ శాస్త్రమును సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతను మనువుకి, మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు.
వివరణ:
అమూల్యమైన, వెలకట్టలేని జ్ఞానాన్ని ఎవరికైనా కేవలం తెలియపరిస్తే సరిపోదు. ఆ జ్ఞానాన్ని అందుకున్నవారు దాని విలువని తెలుసుకొని, గౌరవించాలి మరియు ఆ జ్ఞానం యొక్క ప్రామాణికత మీద విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే వారు తమ జీవిత నడవడికలో దానిని ఆచరించటానికి కావలసిన పరిశ్రమ చేస్తారు. అర్జునుడికి తను అనుగ్రహించే ఆధ్యాత్మిక విజ్ఞానం యొక్క విశ్వసనీయత, ప్రాముఖ్యతని ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు స్థిరపరుస్తున్నాడు. తను ఉపదేశించే ఈ జ్ఞానం, కేవలం అర్జునుడిని యుద్ధం కోసం ప్రేరేపించే సౌలభ్యం కోసం, అప్పటికప్పుడే పుట్టించింది కాదు అని శ్రీ కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు. శ్రీ కృష్ణుడు మొట్టమొదట వివస్వానుడికి, అంటే సూర్య భగవానుడికి, ఇదే యోగ శాస్తాన్ని బోధించాడు. అతను మానవ జాతికి మూలపురుషుడైన మనువుకి, మనువు దానిని సూర్య వంశ ప్రథమ రాజైన ఇక్ష్వాకుడికి బోధించారు. ఇది జ్ఞాన సముపార్జన యొక్క అవరోహణ క్రమం; ఈ పద్ధతిలో జ్ఞానంపై సంపూర్ణ ప్రామాణ్యము కలిగిన వారు దానిని తెలుసుకోగోరిన వారికి ఆపాదిస్తారు.
దీనికి భిన్నంగా, ఆరోహణ క్రమ జ్ఞాన సముపార్జన పద్ధతిలో, విజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి స్వంత ప్రయత్నం ద్వారా పరిశ్రమించాల్సి ఉంటుంది. ఈ ఆరోహణ క్రమ పద్ధతి కఠినమైనది, లోపభూయిష్టమైనది మరియు చాలా సమయం తీసుకుంటుంది. ఉదాహరణకి ఫిజిక్స్ (భౌతిక శాస్త్రం) నేర్చుకోవాలంటే, ఆరోహణ క్రమ పద్ధతిలో ప్రయత్నించవచ్చు - ఈ పద్ధతిలో మన సొంత తెలివితో ఆయా సూత్రాలను ఊహకల్పన చేసి ఒక అభిప్రాయానికి రావచ్చు; లేదా అవరోహణ పద్ధతిలో నేర్చుకోవచ్చు – ఈ పద్ధతిలో మనం ఫిజిక్స్ బాగా తెలిసిన ఒక ఉపాధ్యాయుడిని ఆశ్రయిస్తాము. ఆరోహణ క్రమ పద్ధతి చాలా సమయం తీసుకుంటుంది, నిజానికి ఈ రకమైన అధ్యయనానికి ఒక జీవిత కాలం సరిపోకపోవచ్చు. తుదకు తేలిన విషయాలు నిజమైనవో కాదో కూడా మనకు నమ్మకముండదు. పోల్చి చూస్తే, అవరోహణ క్రమ పద్ధతితో ఫిజిక్స్ యొక్క నిగూఢ రహస్యాలు మనకు తక్షణమే తెలుస్తాయి. మన ఉపాధ్యాయుడికి ఫిజిక్స్‌లో సంపూర్ణ జ్ఞానం ఉంటే ఇది చాలా సులువౌతుంది – ఆయన చెప్పిన దాన్ని శ్రద్ధతో విని దాన్ని జీర్ణం చేసుకోవటమే మన పని. ఈ యొక్క అవరోహణ క్రమంలో ఉన్న జ్ఞాన సముపార్జన ప్రక్రియ సులువైనది మరియు దోషరహితమైనది.
ప్రతి సంవత్సరం కొన్ని వేల స్వయం-సహాయక (self-help) పుస్తకాలు విపణిలో విడుదలవుతాయి. అవి, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆయా రచయితల యొక్క పరిష్కారాలను వివరిస్తాయి. ఈ పుస్తకాలు, ఒక పరిమితిలో సహాయపడవచ్చు, కానీ ఇవి ఆరోహణ క్రమ పద్ధతిలో పొందిన జ్ఞానం ఆధారంగా వ్రాయబడ్డాయి కాబట్టి అవి లోపభూయిష్టమయినవి. ప్రతి కొన్ని సంవత్సరాలకీ, ఏదో ఒక కొత్త సిద్ధాంతం వచ్చి ఆ సమయంలో ఉన్న సిద్ధాంతాలని పక్కకి నెడుతుంది. ఈ యొక్క ఆరోహణ పద్ధతి అనేది పరమ సత్యాన్ని తెలుసుకోవటానికి పనికిరాదు. దివ్య జ్ఞానాన్ని స్వీయ-పరిశ్రమ ద్వారా సృష్టించవలసిన అవసరం లేదు. అది భగవంతుని యొక్క శక్తి, ఎలాగైతే అగ్ని ఉన్నప్పటి నుండీ దాని వెలుగు, వేడిమి ఉంటాయో, అది (దివ్య జ్ఞానం) భగవంతుడు ఉన్నప్పటి నుండీ ఉంది.
భగవంతుడు మరియు జీవాత్మ రెండూ కూడా సనాతనమైనవి, అలాగే జీవాత్మను భగవంతునితో కలిపే యోగ శాస్త్రము కూడా సనాతనమైనదే. దీని కోసం ఏదో ఊహించి, కొత్తకొత్త సిద్ధాంతాలను తయారుచేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రత్యక్షసత్యం యొక్క అద్భుతమైన తార్కాణం, ఈ భగవద్గీతయే. ఇది చెప్పబడి యాభై శతాబ్దములు దాటినా, తనలో ఉన్న శాశ్వత/సనాతన జ్ఞాన ప్రజ్ఞతో, ఇది ఇప్పటికీ మన దైనందిన జీవితంలో ఉపయోగపడుతూ, జనులను ఆశ్చర్య చకితులను చేస్తున్నది. తాను అర్జునుడికి తెలియజేసే ఈ యోగ విద్య జ్ఞానం, సనాతనమైనది మరియు ప్రాచీన కాలంలో అవరోహణ క్రమంలో గురువు నుండి శిష్యుడికి పరంపరగా అందించబడింది అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
మహాభారతము
🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
*శుక్రవారం 10 ఏప్రిల్ 2026*
``
*ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
1️⃣9️⃣1️⃣
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*191 వ రోజు*
*విరాట పర్వము పంచమాశ్వాసము*
*పంచమాశ్వాసం*```
అర్జునుడు దూరంగా ఉన్న సుయోధనుని చూడగానే “ఉత్తర కుమారా! అడుగో సుయోధనుడు. రథం అటు పోనివ్వు” అన్నాడు.
ఇంతలో కౌరవ సేనలోని ప్రముఖులైన వారు ఒక్కొక్కరు ఒక వెయ్యి రథములను తీసుకుని సుయోధనుని వైపు వెళ్ళారు.
సుయోధనుడికి అర్జునినికి మధ్య సైన్యం మూడు నిలిచేయి.. చేత చిక్కిన గోగణములు అర్జునుడు తోలుకు పోవడం చూసి సుయోధనుడు నిట్టూర్చాడు.```
*ఉత్తరకుమారుడికి కుఱువీరులను పరిచయము చేయుట*```
అర్జునుడు కుఱు సేనను తేరి పార చూసాడు. “ఉత్తరకుమారా! కుఱుసేనను చూడు. కాంచనమయ వేదిక కేతనముగా కలవాడు ద్రోణాచార్యుడు. ఎగురుతున్న సింహం తోక కేతనముగా కలవాడు అశ్వథ్థామ. బంగారు గోవును కేతనముగా కలిగిన వాడు కృపాచార్యుడు. తెల్లని కేతనమ కలవాడు కర్ణుడు. పాము పడగను కేతనముగా కలిగిన వాడు సుయోధనడు. తాటి చెట్టును కేతనముగా అలంకరించిన వాడు భీష్ముడు" అని తిరిగి "ఉత్తరకుమారా! ఇప్పుడు మన రథం గురువు గారు ద్రోణాచార్యునకు ప్రదక్షిణగా పోనిమ్ము. ధనుర్విద్యలో అపార పాండిత్యము కలిగిన గురువు గారిని అవమానించకూడదు. కనుక నేను ముందుగా సుయోధనునితో యుద్ధం చేస్తాను. సుయోధనుని రక్షించడానికి గురువుగారు వస్తారు. అప్పుడు నేను ఆయనతో యుద్ధం చేస్తాను. గురు పుత్రుడు అశ్వథ్థామ శివుని వరం వలన పుట్టాడు. భీకరమైన యుద్ధం చేయగల సమర్ధుడు. ఆ ప్రక్కన ఉన్నవాడు కృపాచార్యుడు. నాకు చిన్న నాటి గురువు, ద్రోణ సమాన పరాక్రమవంతుడు. కనుక వారితో యుద్ధం వద్దు, రథం పక్కకు పోనివ్వు. అక్కడ సుయోధనుని మిత్రుడు కర్ణుడున్నాడు చూడు పరశురాముని శిష్యుడైన ఇతడు మహా పరాక్రమ శాలి నాకు సరి జోడు. ఇతనితో యుద్ధం చేయాలని నా కోరిక. నన్నుచూస్తే ఊరుకోడు. కనుక రథం అతనికి ముందుగా నిలిపి మేము చేయబోయే యుద్ధం చూడు. మా పెదనాన కుమారుడు సుయోధనుడు. అతడు అభిమానధనుడు కోపం ఎక్కువ, పరాక్రమ వంతుడు, అత్యంత దుష్టుడు, మా మీద ద్వేషం పెంచుకున్న వాడు. అతడు కనపడితే వదల వద్దు. అదుగో పితామహుడైన భీష్ముడు, అత్యంత పరాక్రమ వంతుడు, బుద్ధి కుశలత కలిగిన వాడు, పరశురాముని ఎదిరించిన ధీశాలి, ఎన్నో శస్త్ర రహస్యాలు తెలిసిన వాడు. ఆయనకు కోపం రానివ్వ వద్దు. అలా చేస్తే నన్ను సుయోధనుని దగ్గరకు చేరనివ్వడు” అని కుఱువీరులను ఉత్తరునికి పరచయం చేసాడు.```
*అశ్వథ్థామ ఎత్తి పొడుపు*```
ఆ సమయంలో అశ్వథ్థామ కర్ణుని చూసి "కర్ణా నిన్ను నీవు పొగుడు కున్నావు కదా! అర్జునుడు వచ్చాడు పోరాడు. నీకు ఒక వేళ చేతకాకపోతే శకునితో మంతనాలు చెయ్యి. రారాజు ఈ యుద్ధ భారం నీ మీద పెట్టాడు కదా! తప్పుతుందా" అన్నాడు పరిహాసంగా.
కర్ణుడు ఆగ్రహించి "నేను నీలా భీరువుని కాదు యుద్ధం నుండి
తప్పు కోవడానికి! అర్జునుడే కాదు అతని తండ్రి ఇంద్రుడు వచ్చినా నేను ఎదిరించగల పరాక్రమ వంతుడను కావాలంటే చూడు" అన్నాడు.
కర్ణుడు అలా మాట్లాడుతూ ఉండగానే భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వథ్థామ సుయోధనునికి రక్షణగా నిలిచారు. వారి వెనుక బాహ్లిక సోమదత్తులు తమతమ సైన్యాలతో పోరాడారు.```
*(సశేషం)*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
శ్రీ మహావిష్ణు పురాణం
🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*శుక్రవారం 10 ఏప్రిల్ 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
`` *53వ భాగం*``
*అనసూయ పరీక్షించడానికి వచ్చినత్రిమూర్తులనుపసిపాపలను చేయటం - త్రిమాతల కోరిక పై యధారూపం కలిగించుట*```
సరస్వతీదేవి లక్ష్మీదేవి ఉమాదేవి కోరిక పై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సతీ అనసూయ పాతివ్రత్య పరీక్ష చేయడానికి అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. ఆ సమయంలో అత్రి మహర్షి ఆశ్రమంలో లేరు. వేరొక ప్రదేశానికి ఆహ్వానం పై యజ్ఞం చూడటానికి వెళ్లారు.
మధ్యాహ్నం వేళ త్రిమూర్తులు యతీశ్వరుల రూపంలో అత్రి మహర్షి ఆశ్రమం బయట నుంచుని "మాతా! భిక్షాం దేహి" అని ముగ్గురు గట్టిగా పిలిచారు.
అనసూయ ఆ పిలుపు విని బయటకు వచ్చి తేజస్సుతో విరాజిల్లుతున్న ముగ్గురు యతీశ్వరులకు నమస్కరించింది. యతులు
ఆశీర్వదించి "భవతీ భిక్షాం దేహి" అని అడిగారు.
అనసూయ "మహాత్ములారా!
నా పతి అత్రి మహర్షుల వారు యజ్ఞం చూడటం కోసం బయటకు వెళ్లారు. వారి తరపున నేను మీకు అర్ఘ్యపాద్యములు సమర్పించి భోజనం ఏర్పాటు చేస్తాను. పాదపూజకు లోనకు రండి" అని స్వాగతం పలికింది.
యతులు "సరే తల్లి! ఆకలితో ఉన్నాము. త్వరగా భోజన ఏర్పాట్లు చేయము" అని ఆమె వెంట లోనికి వెళ్లారు.
త్రిమూర్తులకు అనసూయ గృహస్థ ధర్మం ప్రకారం పాదపూజ, అర్ఘ్యపాద్యములు ఇచ్చింది.
బ్రహ్మదేవుడు."భోజనం సిద్దం అయితే త్వరగా వడ్డించే ఏర్పాట్లు చేయండి" అని అడిగాడు.
అనసూయ "సిద్దంగా ఉంది! స్వామీ! లోపలికి రండి" అని భోజనశాలకు తీసుకు వెళ్లింది.
ముగ్గురికి ఉచితాసనాలు ఏర్పాటుచేసింది. ఆసీనులయ్యాక వారి ముందు శుభ్రపరచిన అరటి ఆకులు, మంచినీటి పాత్రలు ఏర్పాటు చేసింది.
ఆహార పదార్థాలు లోన నుంచి తెచ్చి వడ్డించబోతుంటే ముగ్గురు యతులు ఆగమని చెప్పారు.
అనసూయ ఆశ్చర్యంగా చూస్తుంటే మహేశ్వరుడు "మాకుభోజనం వడ్డించడానికి, మేము తినడానికి ఒక నియమం నీవు పాటించాలి. అప్పుడే మేము స్వీకరిస్తాము" అని బ్రహ్మవంక నియమం చెప్పమన్నట్టు చూశాడు.
యతి రూప బ్రహ్మదేవుడు ముఖంలో ఏ భావం కనపడకుండా "మాకు నీవు వివస్త్రవై వడ్డించాలి. అప్పుడే మేము భోజనం చేయగలము" అన్నాడు.
అనసూయ ఉలిక్కిపడ్డి, త్రిమూర్తుల వైపు అనుమానంతో చూసింది. ఒక ఇల్లాలిని వివస్త్రగా (వస్త్రములు లేకుండా) వడ్డించమంటున్నారు. వీరు అతిథి రూపంలో వచ్చిన రాక్షసులు కాదు కదా" అని వారి వంక తీక్షణంగా చూడబోయింది.
అనసూయ కోపంగా చూస్తే తాము ముగ్గురం భస్మం అవుతామోనని విష్ణువు వెంటనే "అమ్మా! అది మా యతుల నియమం" అని నెమ్మదిగా పలికాడు. అమ్మా అని పిలిచేసరికి అనసూయలో కోపం తగ్గింది. తల్లిగా భావిస్తున్నారు తనను అనుకుంది.
మహేశ్వరుడు "తల్లీ! తప్పుగా అనుకోకు. అది మా నియమం. కాదంటే మేము లేచి వెళ్ళి పోతాము" అన్నాడు.
వెంటనే బ్రహ్మ కూడా "అమ్మా! ఆకలితో వచ్చిన అతిథుల ఆకలి తీర్చడం గృహిణి ధర్మం. భోజనం పెడతాను అని లోనికి రమ్మన్నావు. ఇప్పుడు మాట తప్పితే బ్రహ్మహత్యాపాతకం వస్తుంది. నీఇష్టం ఆలోచించు" అని హెచ్చరిస్తునట్టు అన్నాడు.
యతులు ముగ్గురు తనను తల్లిగా సంబోధించడంతో అనసూయకు వీరెవ్వరో తనను పరీక్షించడానికి వచ్చిన మహాపురుషులు అనిపించింది. తన పాతివ్రత్య శక్తితో అంతర్ముఖంగా పరిశీలిస్తే వచ్చిన యతులు ముగ్గురు త్రిమూర్తులైన బ్రహ్మవిష్ణుమహేశ్వరులుగా తెలుసుకుంది. మువ్వురు తనను తల్లిగా భావించారంటే వారు తనకు బిడ్డలు కావాలని కోరుకుంటున్నారు. తను ఏంచేయాలో అర్థం అయ్యింది.
అనసూయ మందహాసం చేస్తూ "మీరు నన్ను అమ్మగా భావించారు. పిల్లల కోరిక తల్లి కాదనదు కదా. ఈ క్షణమే పసిపాపలై మీ తల్లి పెట్టే గోరుముద్దలు తినండి" అని అక్కడ ఉన్న కమండలం లోని ఉదకాన్ని అభిమంత్రించి ముగ్గురి మీద చల్లింది.
తక్షణమే ముగ్గురు త్రిమూర్తులు పసిబిడ్డలుగా మారిపోయారు. ఆకలికి కెవ్వుమని ఏడవ సాగారు.
అనసూయ త్రిమూర్తులు కోరినట్లు వివస్త్రయై వచ్చి ముగ్గురు పసివాళ్ళను దగ్గరకు తీసుకుని లాలిస్తూ అరిటాకులలోగల అన్నం కూరలు కలిపి గోరుముద్దలు చేసి తినిపించింది. మంచినీరు త్రాగించింది. ఆకలి తీరిన పసివాళ్ళూ ఆనందంతో బోసినవ్వులు నవ్వారు. ఒడిలోకి తీసుకుని లాలిస్తూ జోలపాటలు పాడుతూ ముగ్గురిని నిద్రపుచ్చింది. అక్కడే చక్కటి పడక ఏర్పాటు చేసి పడుకోబెట్టి తను వెళ్లి వస్త్రములు ధరించింది.
త్రిమూర్తులు ముగ్గురు పసిపాపలై పోవడంతో వారినివాసాలైన సత్య లోకం వైకుంఠం, కైలాసం తేజస్సు కోల్పోయాయి. త్రిమూర్తులు లేక పోవడంతో సృష్టి స్థితి లయ కార్యాలు ఆగిపోయాయి. హవిర్భా గాలు స్వీకరించడానికి త్రిమూర్తులు లేకపోవడంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి.
విశ్వం గందరగోళంలో పడింది. ఇంద్రాది దేవతలు త్రిమూర్తులను వెతుకుతూ సత్యలోకం, విష్ణు లోకం, శివలోకం వచ్చి త్రిమాత లైన సరస్వతి లక్ష్మి గౌరికి పరిస్థితి చెప్పి త్రిమూర్తుల ఆచూకి అడిగారు. త్రిమాతలకు అర్థం అయ్యింది. తమ పతులు అన సూయను పరీక్షించబోయి ఆమె వద్దనే బందీలైనారు అని. నారదుడు ఇంద్రాది దేవతలతో కలసి అనసూయ దగ్గరకు వెళ్ళారు.
అత్రి మహర్షి విషయం తెలుసుకుని వాయుమార్గంలో ఆశ్రమం చేరాడు. త్రిమాతలు, ఇంద్రాది దేవతలు, నారదాది మహర్షులు, అత్రి మహర్షి ఒకేసారి ఆశ్రమం చేరారు. అక్కడ పసిబిడ్డలుగా నిద్రిస్తున్న త్రిమూర్తులను చూశారు. అందరికి అనసూయాదేవి పాతి వ్రత్యం మహిమ తెలిసి వచ్చింది.
అలజడికి బయటకి వచ్చిన అనసూయను చూసి సరస్వతి లక్ష్మి ఉమాదేవిలు నమస్కరించి "అమ్మా! అనసూయా! నీ పాతివ్రత్య మహిమ అందరికి తెలియ చేయాలనే మా నాథులను నిన్ను పరీక్షించమని పంపాము. నీపాతివ్రత్య శక్తితో ముగ్గురు త్రిమూర్తులను పసిబిడ్డలను చేశావు. సృష్టి స్థితి లయ కార్యాలు నిలిచిపోయాయి. కరుణించి లోకాలను రక్షించడానికి మా భర్తలకు యధా స్వరూపం వచ్చేట్టు చేయి తల్లీ!" అని ప్రార్ధించారు.
అనసూయ భర్త అత్రి మహర్షి వంక అనుమతి కోసం చూసింది. అత్రి మహర్షి మందహాసం చేస్తూ చూపులతోనే అనుమతి ఇచ్చాడు అనసూయ పసిబిడ్ఢలపై మంత్రోదకం సంప్రోక్షణ చేసింది. మరుక్షణం పసిబిడ్డలు బ్రహ్మవిష్ణుమహేశ్వరులుగా తమ యధారూపాలు పొందారు. త్రిమాతలు త్రిమూర్తుల చెంత చేరారు. అక్కడ ఉన్న దేవతలు మహర్షులు ఆనందంతో హర్షధ్వానాలు చేసారు. సృష్టిస్థితి లయ కార్యాలు తిరిగి ప్రారంభమయ్యాయి. యజ్ఞయాగాదులు క్రతువులు మొదలయ్యాయి. విశ్వంలో శాంతి నెలకొంది.
అత్రి అనసూయలు త్రిమూర్తులకు, త్రిమాతలకు భక్తితో నమస్కరించారు. మహావిష్ణువు వారిని చూసి "అత్రి మహర్షీ! అనసూయ మాతా! నేను మీకు పుత్రునిగా జన్మిస్తాను అని వరం ముందే ఇచ్చాను. పసిపిల్లలుగా అనసూయ మాత మాతృ ప్రేమ చవిచూసిన తరువాత బ్రహ్మ మహేశ్వరులు కూడా నాతోపాటు మీకు పుత్రులుగా జన్మించాలని
అనుకుంటున్నారు.
కనుక మీకు బ్రహ్మాంశతో, వైష్ణవాంశతో, ఈశ్వరాంశతో ముగ్గురు కుమారులుగా మేము జన్మిస్తాము. త్రిమూర్తుల కన్న తల్లిదండ్రులుగా శ్వేతవరాహ కల్పాంతము వరకు మీకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మాతా! అనసూయా! నీవు స్త్రీల కందరికి ఆదర్శమూర్తివై, పతివ్రతా లోకానికి శిరోమణివై ఉంటావు" అని ఆశీర్వదించి త్రిమాతలతో కలసి అదృశ్యమయ్యారు.
ఇంద్రాది దేవతలు, నారదాది మహర్షులు అభినందనలు తెలియజేసి తమ నివాసాలకు ప్రస్థానమయ్యారు.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
శనివారం🍁* *🌹11ఏప్రిల్ 2026🌹* *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🍁శనివారం🍁*
*🌹11ఏప్రిల్ 2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*చైత్రమాసం - కృష్ణ పక్షం*
*తిథి : నవమి* రా 12.37 వరకు ఉపరి *దశమి*
*వారం : శనివారం* (స్ధిరవాసరే)
*నక్షత్రం : ఉత్తరాషాఢ* మ 01.39 వరకు ఉపరి *శ్రవణం*
*యోగం : సిద్ధ* సా 06.39 వరకు ఉపరి *సాధ్య*
*కరణం : తైతుల* మ 12.01 *గరజి* రా 12.37 ఉపరి *వణజి*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 10.30 - 01.00 సా 05.00 - 05.50*
అమృత కాలం : *ఉ 06.40 - 08.25 & రా.తె 04.09 - 05.51*
అభిజిత్ కాలం : *ప 11.44 - 12.33*
*వర్జ్యం : సా 05.55 - 07.37*
*దుర్ముహూర్తం :ఉ05.55- 07.35*
*రాహు కాలం :ఉ09.02- 10.35*
గుళికకాళం : *ఉ 05.55 - 07.28*
యమగండం : *మ 01.42 - 03.15*
సూర్యరాశి : *మీనం*
చంద్రరాశి : *మకరం*
సూర్యోదయం :*ఉ 06.03*
సూర్యాస్తమయం :*సా 06.31*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.55 - 08.25*
సంగవ కాలం :*08.25 - 10.54*
మధ్యాహ్న కాలం :*10.54 - 01.23*
అపరాహ్న కాలం :*మ 01.23- 03.53*
*ఆబ్ధికం తిధి :చైత్ర బహుళ నవమి*
సాయంకాలం :*సా 03.53 - 06.22*
ప్రదోష కాలం :*సా 06.22 - 08.40*
రాత్రి కాలం :*రా 08.40 - 11.45*
నిశీధి కాలం :*రా 11.45 - 12.31*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.08*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🙏శ్రీ వేంకటేశ్వర స్తోత్రం🙏*
*అవనీతనయాకమనీయకరం* *రజనీకరచారుముఖాంబురుహమ్*
*!!.ఓం నమో వెంకటేశాయ నమః.!!*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁*
*క్రోధా ద్దశానన పురీ దహన ప్రకారిన్*
*శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
మీ గోత్రం యొక్క నిజమైన శక్తి..
మీ గోత్రం యొక్క నిజమైన శక్తి......!!
ఇది ఒక ఆచారం కాదు. మూఢనమ్మకం కాదు. ఇది మీ ప్రాచీన కోడ్. ఈ థ్రెడ్‌ను పూర్తిగా చదవండి… ఇది మీ గతాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో అవసరం.
1. గోత్రం అనేది మీ ఇంటి పేరు కాదు. ఇది మీ ఆత్మిక DNA.
అవును, చాలా మందికి తమ గోత్రం కూడా తెలియదు.
పూజలో పండితుడు ఏదో చెబుతాడు అని అనుకుంటాం. కానీ ఇది అంత తేలిక కాదు.
మీ గోత్రం అంటే - మీరు ఏ ఋషి యొక్క మనస్సుకు, ఆలోచనలకు, శక్తికి, జ్ఞానానికి అనుసంధానమయ్యారు అన్నదే.
ప్రతి హిందువును ఒక ఋషి వరకు ఆధ్యాత్మికంగా అనుసంధానించవచ్చు.
ఆ ఋషి మీ రక్త సంబంధి కాకపోయినా, ఆత్మ సంబంధి.
2. గోత్రం అనేది కులం కాదు.
ఇప్పటి కాలంలో ఇది ఎక్కువగా గందరగోళంగా మారింది.
గోత్రం అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్య, శూద్రుడు అన్న భావన తప్పు భావన.
గోత్ర వ్యవస్థ కులాలకు ముందే ఉంది. ఇది ఒక విద్యాపరమైన గుర్తింపు.
ఋషులు తమ విద్యార్ధులకు గోత్రం ఇచ్చేవారు – అది విద్య ద్వారా సంపాదించేది.
అందువల్ల, గోత్రం అనేది శక్తి గుర్తింపు కాదు – జ్ఞానం గుర్తింపు.
3. ప్రతి గోత్రం ఒక మహాఋషి నుండి వస్తుంది
మీరు వశిష్ఠ గోత్రానికి చెందినవారై ఉంటే – మీరు వశిష్ఠ మహర్షి మానసిక వారసత్వాన్ని కలిగి ఉన్నవారు.
ఆయన రాముడి గురువు, దశరథుడి సలహాదారు కూడా.
భరద్వాజ గోత్రం అంటే – వేదాల రచనలో భాగం, యుద్ధ విద్యలో నిపుణులైన ఋషి వారసత్వం.
మొత్తం 49 ప్రధాన గోత్రాలు ఉన్నాయి – ప్రతి గోత్రం ఒక విశిష్ట రంగంలో నిపుణులైన ఋషికి సంబంధించినది.
4. ఎందుకు పెద్దలు ఒకే గోత్రం మధ్య వివాహాన్ని నిషేధించారు?
ఇది జనరల్ స్కూల్లో చెప్పే విషయం కాదు.
గోత్రం వంశ పరంపరలో పురుషుల ద్వారా వెళ్తుంది.
అంటే, ఇద్దరూ ఒకే గోత్రానికి చెందినవారైతే, వారు జన్యుపరంగా దగ్గర బంధువులే.
దీని వల్ల పిల్లల్లో శారీరక, మానసిక లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది.
గోత్ర వ్యవస్థ = ప్రాచీన భారతీయ జన్యుపరమైన విజ్ఞాన శాస్త్రం.
5. గోత్రం = మీ మానసిక ప్రోగ్రామింగ్
కొంతమంది జన్మతః తత్త్వవేత్తలు. కొంతమందికి ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ.
కొంతమంది సహజంగా ధైర్యవంతులు. ఇదంతా ఎందుకు?
మీ గోత్ర ఋషి యొక్క మానసిక ఫ్రీక్వెన్సీ ఇంకా మీలో పనిచేస్తోంది.
ఋషి యోధుడైతే, మీలో ధైర్యం ఉంటుంది.
ఔషధ ఋషి అయితే, ఆయుర్వేదం అంటే మక్కువ ఉంటుంది..
6. విద్యను కూడా గోత్రాన్ని బట్టి తీసుకునే వారు
ప్రాచీన గురుకులాల్లో విద్యార్ధికి మొదటి ప్రశ్నే: "బేటా, నీ గోత్రం ఏంటి?"
ఎందుకంటే అది విద్యార్ధి నేర్చుకునే శైలిని, ఇతని బలాల్ని తెలిపేది.
అత్రి గోత్రం వారు ధ్యానం, మంత్రాల్లో శ్రేష్ఠత పొందేవారు.
కశ్యప గోత్రం వారు ఔషధ విజ్ఞానంలో.
7. బ్రిటిష్ తక్కువగా చూశారు. బాలీవుడ్ నవ్వించింది. మనం మర్చిపోయాం.
బ్రిటిష్‌లు వచ్చాక గోత్రం వ్యవస్థను అర్థం చేయక పోయారు.
దాన్ని మూఢనమ్మకం అని పేర్కొన్నారు.
బాలీవుడ్ దాన్ని సరదాగా తీసుకుంది.
ఇలా మనం పిల్లలకు చెప్పడం మానేశాం. 10,000 సంవత్సరాల వ్యవస్థ 100 ఏళ్లలో కరిగిపోతుంది.
8. మీ గోత్రం తెలియకపోతే – మీరు ఆత్మిక మ్యాప్‌ను కోల్పోతారు
ఇది మీ ఆధ్యాత్మిక GPS.
– సరైన మంత్రం
– సరైన పూజా విధానం
– సరైన ధ్యానం
– సరైన వివాహం
– సరైన ఆధ్యాత్మిక మార్గం
ఇవి అన్నీ గోత్రం ఆధారంగా తెలుసుకోవచ్చును.
9. పూజలో గోత్రం చెబుతారు అంటే – అది ఒక శక్తివంతమైన కాల్.
పూజ ప్రారంభంలో “సంకల్పం”లో మీ గోత్రాన్ని చెప్పడం వల్ల
మీ ఋషి యొక్క ఆత్మశక్తి పూజలో చేరుతుంది.
అదే వాక్యం: “భరద్వాజ గోత్రాన్విత శ్రీనివాసుడిగా నేను ఈ పూజను శ్రద్ధతో చేయుచున్నాను.”
10. ఆలస్యం కాకమునుపే మీ గోత్రాన్ని పునరుద్ధరించండి
– తల్లిదండ్రులను అడగండి
– తాతమామల వద్ద తెలుసుకోండి
– రీసెర్చ్ చేయండి
– మీ పిల్లలకు చెప్పండి
– గర్వంగా ఉంచండి
మీరు పుట్టింది 1990లో కావచ్చు. కానీ మీలో ప్రవహిస్తున్న జ్ఞానం కృతయుగం నాటి ఋషులది.
11. గోత్రం = మీ ఆత్మకు పాస్‌వర్డ్
మనం Wi-Fi పాస్‌వర్డ్లు గుర్తుపెట్టుకుంటాం.
కానీ మన ఆత్మ పాస్‌వర్డ్ అయిన గోత్రాన్ని మర్చిపోతాం.
మీ మనశ్శక్తి, కర్మ, జ్ఞానం – ఇవన్నీ గోత్రంతో అనుసంధానంగా ఉంటాయి.
12. వివాహం తర్వాత స్త్రీలు గోత్రం మారతారా?
లేదు. గోత్రం Y-క్రోమోసోమ్ ద్వారా వస్తుంది – అంటే పురుషుల ద్వారా.
స్త్రీలు తమ తండ్రి గోత్రాన్నే శ్రాద్ధాదుల్లో ఉంచుతారు.
అందుకే, స్త్రీ గోత్రం మారదు – అది ఆమెలో శాశ్వతంగా ఉంటుంది.
13. దేవతలు కూడా గోత్ర నియమాలను అనుసరించారు
రాముడి వివాహం సమయంలో:
– రాముడు: ఇక్ష్వాకు వంశం, వశిష్ఠ గోత్రం
– సీత: జనకుని కూతురు, కశ్యప గోత్రం
ఇంత పవిత్రమైనది గోత్ర వ్యవస్థ.
14. గోత్రం మరియు ప్రారబ్ధ కర్మ
కొంతమంది పిల్లలు చిన్ననాటి నుంచే ప్రత్యేకమైన అలవాట్లు కలిగి ఉంటారు.
ఇది వారి ప్రారబ్ధ కర్మ మరియు గోత్రం వల్ల.
ఋషులు తమకు ప్రత్యేకమైన కర్మ బీజాలు కలిగి ఉన్నారు – మీలోనూ అలాంటి ప్రభావాలు ఉంటాయి.
15. ప్రతి గోత్రానికి ప్రత్యేక మంత్రాలు, దైవాలు ఉంటాయి
మీ గోత్రానికి సరిపోయే మంత్రాన్ని ఉపయోగించకపోతే, ఫలితం తక్కువగా ఉంటుంది.
సరైన మంత్రం + మీ గోత్ర శక్తి = 10x శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభవం.
16. గోత్రం = గందరగోళంలో ఉన్నపుడు ఆత్మదీపం
మీరు దారి తప్పినట్టు అనిపిస్తే, మీ గోత్రం ఋషిపై ధ్యానం చేయండి.
ఆ ఋషి ఏ ఆలోచనల్లో జీవించాడో, అదే శక్తి మీలో ఉంది.
17. గొప్ప రాజులు గోత్రాన్ని గౌరవించేవారు
చంద్రగుప్త మౌర్యుడు నుండి శివాజీ మహారాజ్ వరకు
రాజకార్యాలలో కూడా గోత్ర జ్ఞానం ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవారు.
గోత్రం లేని పాలన అంటే – రీడులేని శరీరం లాంటిది.
18. గోత్ర వ్యవస్థ = స్త్రీ రక్షణ విధానం
పురాతన కాలంలో – గోత్రం ఆధారంగా స్త్రీలను వారి వంశానికి తిరిగి గుర్తించగలిగేవారు.
దీన్ని మూఢనమ్మకం అనడం కాదు – ఇది ఒక జ్ఞాన శాస్త్రం.
19. ప్రతి గోత్రం = విశ్వంలో ప్రత్యేక పాత్ర
ఋషులు తమ తమ విధులను నిర్వర్తించేవారు:
– ఆరోగ్యాన్ని రక్షించడం
– నక్షత్రాలను పరిశీలించడం
– ధర్మాన్ని స్థాపించడం
– న్యాయాన్ని నిర్మించడం
మీ గోత్రం ఈ పాత్రలలో ఒకదానిని కలిగి ఉంటుంది.
20. ఇది మతం కాదు – ఇది మీ అసలైన గుర్తింపు
మీరు మతసంబంధమైనవారు కాకపోయినా, ఆధ్యాత్మికతను అనుసరించకపోయినా –
గోత్రం మీ ఆత్మ సంబంధిత గుర్తింపు.
మీరు నమ్మాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోవాలి.
చివరి మాటలు:
మీ పేరు ఆధునికం కావచ్చు.
మీ జీవితం గ్లోబల్ కావచ్చు.
కానీ మీ గోత్రం – శాశ్వతం.
మీరు దీన్ని పట్టించుకోకపోతే – మీకు సొంతంగా మీరు ఎవరో తెలియని నదిలా అవుతారు.
గోత్రం అనేది మీ గతం కాదు.
అది భవిష్యత్తులో జ్ఞానాన్ని తెరవే పాస్‌వర్డ్..*
.
*బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర: సనాతన ధర్మం యొక్క నాలుగు దిక్కులు, ఒకే తేజస్సు *
(సమగ్రమైన వ్యాసం - ఐక్యత యొక్క శక్తిని చాటేది, భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలిపేది)
"ధర్మం యొక్క సారాంశం సమ్మేళనం, విచ్ఛేదనం కాదు."
వేల సంవత్సరాల ప్రస్థానం కలిగిన సనాతన ధర్మం కేవలం జీవన విధానాన్ని నేర్పడమే కాకుండా, ఆత్మలను అనుసంధానించే అద్భుతమైన మార్గాన్ని చూపింది. వర్ణ వ్యవస్థ యొక్క అంతరార్థాన్ని లోతుగా పరిశీలిస్తే - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కేవలం కులాలు కావు, అది సమాజంలోని విభిన్న కర్తవ్యాల యొక్క సుందరమైన అమరిక. ఇది పుట్టుకతో వచ్చినది కాదు, కర్మలతో, స్వభావంతో ముడిపడిన వ్యవస్థ.
నలుగురు వర్ణాలు - ఒకే దేహంలోని భిన్న భాగాలు
ఈ నాలుగు వర్ణాలను మన పురాణాలు ఒకే విరాట్ పురుషుని (సమస్త సృష్టికి అధిపతి) శరీరంలోని విభిన్న భాగాలతో పోల్చాయి.
* బ్రాహ్మణుడు:~ విరాట్ పురుషుని ముఖం వంటివాడు - జ్ఞానాన్ని ప్రసరించే మెదడు, వివేకంతో మార్గనిర్దేశం చేసేవాడు. సమాజానికి విద్యాదానం చేసేవారు, ధర్మశాస్త్రాలు బోధించేవారు.
* క్షత్రియుడు:~ విరాట్ పురుషుని భుజాల వంటివాడు - ధర్మాన్ని రక్షించేవి, నీతిని కాపాడే ధీరులు. వీరు సమాజాన్ని దుష్టశక్తుల నుండి రక్షిస్తారు, న్యాయాన్ని పరిపాలిస్తారు.
* వైశ్యుడు:~ విరాట్ పురుషుని ఉదరం వంటివాడు - సమృద్ధిని పెంపొందించేది, వ్యాపారంతో అభివృద్ధిని చేకూర్చేవారు. వీరు సంపదను సృష్టించి, సమాజ శ్రేయస్సు కోసం పంపిణీ చేస్తారు.
* శూద్రుడు:~ విరాట్ పురుషుని పాదాల వంటివాడు - సేవతో అందరినీ నిలిపేవి, శ్రమతో సమాజానికి ఆధారమిచ్చేది. వీరు సమాజానికి అవసరమైన సేవలను అందిస్తూ, అందరికీ అండగా నిలుస్తారు.
తల లేకుండా శరీరం నిలువగలదా? భుజాలు లేకుండా శక్తి ఉంటుందా? ఉదరం నిండకుండా జీవం ఉంటుందా? పాదాలు లేకుండా గమ్యం చేరుకోగలమా? లేదు కదా! అదే విధంగా, సనాతన ధర్మంలోని ఈ వర్ణ వ్యవస్థ పరస్పర సహకారం మరియు అవసరాల యొక్క గొప్ప సమన్వయాన్ని తెలుపుతుంది, అంతేకానీ ఇది శ్రేష్ఠతను చూపించే విభజన కాదు. ప్రతి వర్ణం సమాజానికి అత్యవసరం.
సనాతన ధర్మం ఎల్లప్పుడూ ఐక్యత, ప్రేమ, మరియు సమానత్వాన్ని బోధించింది. మన ఇతిహాసాలు, పురాణాలు దీనికి ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు.
* శ్రీరాముడు ఒక శూద్ర మహిళ అయిన శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను ప్రేమతో స్వీకరించాడు - ఇది కేవలం పండ్లు తినడం కాదు, అది కుల భేదాలను తుడిచిపెట్టే ప్రేమ బంధం. భక్తికి, ప్రేమకు కులం, వర్ణం అడ్డు కాదని నిరూపించాడు.
* శ్రీకృష్ణుడు, అప్పటి సమాజంలో తక్కువ కులంగా భావించబడిన విదురుని ఇంట్లో ఆనందంగా భోజనం చేశాడు - "న హి వై శూద్ర రాజానం, నైవ వైశ్యం న శూద్రకం" (మహాభారతం) అని చెప్పి, హృదయం శుద్ధంగా ఉంటే ఏ కులమైనా గొప్పదే అని చాటాడు.
* మహాభారతంలో విదురుడు ధర్మజ్ఞానానికి ప్రతీకగా నిలిచాడు. ఆయన ధృతరాష్ట్రునికి, పాండవులకు ఇచ్చిన ఉపదేశాలు అద్భుతమైనవి. ఇది పుట్టుకతో కాక, జ్ఞానంతోనే గౌరవం వస్తుందని నిరూపిస్తుంది.
* శబరి, గుహుడు వంటి భక్తులను శ్రీరాముడు ఆదరించడం, హనుమంతుడు వంటి వానరుడిని తన అత్యంత ప్రియమైన భక్తునిగా స్వీకరించడం - ఇవన్నీ సనాతన ధర్మంలో మానవత్వం, భక్తి, మరియు సేవలకే ప్రాధాన్యత ఇస్తారని చూపుతాయి.
* ఛత్రపతి శివాజీ మహారాజ్ తన రాజ్యంలో బ్రాహ్మణులు, మరాఠాలు, ముస్లింలు మరియు శూద్రులను సమానంగా ఆదరించాడు - సమైక్య పాలనకు ఆదర్శంగా నిలిచాడు. ఆయన సైన్యంలో అన్ని వర్గాల వారికి స్థానం కల్పించారు, వారి సామర్థ్యాలనే పరిగణనలోకి తీసుకున్నారు.
* సంత రవిదాస్ (శూద్రుడు), కబీర్ (ముస్లిం నేత), తులసిదాస్ (బ్రాహ్మణుడు), నామ్‌దేవ్ (తెరజిప్ప) , మీరాబాయి (రాజపుత్ర స్త్రీ) వంటి ఎందరో మహానుభావులు "జాతి పాతి పూచే నహి కోయి" (కులమత భేదాలు అడగరు) అని గొంతెత్తి చాటారు - భక్తి మార్గంలో అందరూ ఒక్కటే అని నిరూపించారు. వారి భక్తి ఉద్యమాలు కులాల సరిహద్దులను చెరిపివేశాయి.
* ఋషి విశ్వామిత్రుడు ఒక క్షత్రియుడై ఉండి కూడా తన తపస్సు ద్వారా బ్రహ్మజ్ఞానిగా మారాడు. ఇది వర్ణం కర్మను బట్టి మారుతుందని, పుట్టుకను బట్టి కాదని తెలియజేస్తుంది.
* వాల్మీకి మహర్షి, పుట్టుకతో బోయవాడైనప్పటికీ, తన తపస్సు మరియు జ్ఞానంతో బ్రహ్మఋషిగా మారి, రామాయణం వంటి మహాకావ్యాన్ని రచించాడు. ఇది మానవుని అంతర్గత శక్తికి, పరివర్తనకు గొప్ప ఉదాహరణ.
సనాతన ధర్మం యొక్క మహత్తరమైన సూక్తులు:
"వసుధైవ కుటుంబకం" - ఈ భూమండలం అంతా ఒకే కుటుంబం. ఇది కేవలం మాట కాదు, మన జీవన విధానానికి మూలం.
"ఏకం సత్ విప్రాః బహుధా వదంతి" - సత్యం ఒక్కటే, జ్ఞానులు దానిని వివిధ రకాలుగా వివరిస్తారు. ఇది భగవంతుని ఏకత్వాన్ని, మత సామరస్యాన్ని తెలియజేస్తుంది.
"సర్వే జన సుఖినో భవంతు" - అందరూ సుఖంగా ఉండాలి. ఈ భావనే సనాతన ధర్మం యొక్క మూల స్తంభం.
ముగింపు:..........
సనాతన ధర్మంలోని నాలుగు వర్ణాలు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్రులు - ఉన్నత లేదా నీచ భావనలను కలిగించే గోడలు కావు, అవి సమాజం యొక్క అభివృద్ధికి నిర్దేశించిన కర్తవ్యాల యొక్క మెట్లు. కాలక్రమేణా వచ్చిన కొన్ని దురాచారాలను సనాతన ధర్మం కాదు, మానవుల స్వార్థం సృష్టించింది. ఈ రోజు మనం ఈ ఐక్యత యొక్క శక్తిని గుర్తించాలి, తప్పుడు ప్రచారం చేసే వారి ఉచ్చు నుండి బయటపడాలి, మరియు గర్వంగా ప్రకటించాలి -
"మేము సనాతనులం, మా ధర్మంలో ప్రతి ఒక్కరికీ స్థానం ఉంది!"
మన పూర్వీకులు అందించిన ఈ జ్ఞాన సంపదను కాపాడుకుంటూ, సమైక్య సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేద్దాం.
