17, జూన్ 2026, బుధవారం

ఆలోచనకూ ఒక విశిష్ఠత

 *మనలో కలిగే ప్రతీ ఆలోచనకూ ఒక విశిష్ఠత ఉంది, కనుక ఆలోచనలు సరియైనవిగా ఉండాలి.


*మితమైన ఆహారం, నడత, కర్మాచరణలో మితమైన ప్రవర్తన, మితమైన నిద్ర, జాగరణ కలిగి ఉన్న సాధకునికి సమస్తములైన దుఃఖాలు తొలగిపోతాయి. ఆ యోగం ఫలవంతమౌతుంది.


*మనస్సులో అలజడి కలిగినప్పుడు అది శరీరంపై ప్రభావాన్ని చూపుతుంది. మనస్సు, శరీరం సవ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యం, ఆనందం ప్రాప్తిస్తాయి.


*బాహ్య విషయాలను గురించి చింతించనవసరం లేదు. ఒక నిర్ణీత పద్ధతిలో ఒక క్రమముతో పనిచేస్తే ఆనందం స్వంతమవగలదు.


*మన ఆహార విహారాలు ఒక క్రమమును కలిగి ఉన్నప్పుడు శరీరం శక్తివంతంగా పనిచేస్తుంది. మన ఆలోచనలు, ఆచరణలు సక్రమంగా ఉంటే జీవితం నిస్సారంగ అనిపించదు.


*పనికి ఎప్పుడూ అలసట, విశ్రాంతి అనేవి ఉండవు, చేసే వ్యక్తి మనఃస్థితిని బట్టి అవి *మనలో కలిగే ప్రతీ ఆలోచనకూ ఒక విశిష్ఠత ఉంది, కనుక ఆలోచనలు సరియైనవిగా ఉండాలి.


*మితమైన ఆహారం, నడత, కర్మాచరణలో మితమైన ప్రవర్తన, మితమైన నిద్ర, జాగరణ కలిగి ఉన్న సాధకునికి సమస్తములైన దుఃఖాలు తొలగిపోతాయి. ఆ యోగం ఫలవంతమౌతుంది.


*మనస్సులో అలజడి కలిగినప్పుడు అది శరీరంపై ప్రభావాన్ని చూపుతుంది. మనస్సు, శరీరం సవ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యం, ఆనందం ప్రాప్తిస్తాయి.


*బాహ్య విషయాలను గురించి చింతించనవసరం లేదు. ఒక నిర్ణీత పద్ధతిలో ఒక క్రమముతో పనిచేస్తే ఆనందం స్వంతమవగలదు.


*మన ఆహార విహారాలు ఒక క్రమమును కలిగి ఉన్నప్పుడు శరీరం శక్తివంతంగా పనిచేస్తుంది. మన ఆలోచనలు, ఆచరణలు సక్రమంగా ఉంటే జీవితం నిస్సారంగ అనిపించదు.


*పనికి ఎప్పుడూ అలసట, విశ్రాంతి అనేవి ఉండవు, చేసే వ్యక్తి మనఃస్థితిని బట్టి అవి కలుగుతాయి.కలుగుతాయి.

నిర్ణయించేది వేదములు,

 మానవులు తన జీవిత కాలంలో ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో నిర్ణయించేది వేదములు, శాస్త్రములు, అవే అందరికీ ప్రమాణములు. కాబట్టి ఈ బాహ్యప్రపంచంలో ఏ పని చేయాలన్నా ఎలా చేయాలన్నా, వాటికి వేదములు, శాస్త్రములలో చెప్పబడిన ప్రమాణములను అనుసరించి చేయాలి కానీ తమ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు.

```

కాబట్టి మానవులు ఏం చేయాలో, ఏం చేయకూడదో నిర్ణయించడానికి వేదములు శాస్త్రములే ప్రమాణములు. వాటి ప్రకారం మనం ప్రవర్తించాలే గానీ మన ఇష్టం వచ్చినట్టు ఆచార వ్యవహారములను మార్చరాదు. మన తెలివితేటలు ప్రదర్శించకూడదు. దాని వలన నష్టమే కానీ లాభం లేదు.


(ప్రభుత్వాలు ఎలా నడవాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేది నిర్ణయించేది ఆ ప్రభుత్వం ఏర్పరచుకున్న రాజ్యాంగము. ఏ చట్టం చేసినా రాజ్యాంగానికి లోబడే చేయాలి కానీ నాకు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉన్న చట్టాలు మార్చడం, రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు చేయకూడదు. చేస్తే ఏమవుతుందో, మన జీవిత కాలంలో మనందరం చూసిన, అనుభవించిన, ఎమర్జెన్సీయే చక్కని ఉదాహరణ).


యజ్ఞాలు ఎలా చేయాలి. యజ్ఞ కుండం ఎంత పొడుగు, వెడల్పు ఉండాలి, ఎంత మంది ఋత్విక్కులు ఉండాలి, ఎవరు ఏ పని చేయాలి. ఏయే వస్తువులు హెూమంలో వేయాలి. ఇవన్నీ నిర్దిష్టంగా వేదాలలో శాస్త్రాలలో చెప్పారు. అలా కాదు మేము ఆవకాయలతో, మిరపకాయలతో హోమాలు చేస్తాము అంటే దాని అర్ధం మీరే ఆలోచించుకోవాలి. భగవంతునికి నివేదన చేయాల్సినవి పత్రం, పుష్పం, ఫలం, తోయం అని స్పష్టంగా చెప్పారు. కాదు మేము మద్యం మాంసం నివేదిస్తాము, జంతు బలులు నర బలులు ఇస్తాము అంటే అవి శాస్త్రవిరుద్ధములు అని తెలుసుకోవాలి. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఈ ప్రకారంగా ఎవరికి తోచినట్టు వారు పూజావిధానాలను, ఉపాసనలను, అర్చనలను మార్చేస్తున్నారు. తెలిస్తే శాస్త్రవిధానాలను బట్టి చేయాలి. తెలియకపోతే శాస్త్రములు చదివి తెలుసుకోవాలి. చదివిన వారి వద్ద నేర్చుకోవాలి. అంతే కాని, "అంతా నాకు తెలుసు.. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను" అనడం మూర్ఖత్వం. అది పనికిరాదు అంటున్నాడు పరమాత్మ.


వేదములు, శాస్త్రములు మనకు అందించిన మహాఋషుల స్థాయి, వారు చెప్పిన దాన్ని కాదనే అర్హత, విమర్శించే పరిజ్ఞానము మనకు లేదు. కాబట్టి వారు చెప్పిన వాటిని ఆచరించడమే మన కర్తవ్యం. అందుకే పరమాత్మ “జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం" అంటే కర్మలు చేసేముందు వాటికి సంబంధించిన శాస్త్రములు, విధివిధానముల గురించిన జ్ఞానం మనకు తెలిసి ఉండాలి. "కర్మ కర్తు మిహార్హసి' అంటే కర్మలు చేయాలి కానీ ఆ కర్మలు శాస్త్రములో చెప్పబడిన విధి విధానాలను అనుసరించి చేయాలి కానీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు

పంచాంగం 17.06.2026 Wednesday,

 ఈ రోజు పంచాంగం 17.06.2026 Wednesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాస శుక్ల పక్ష తృతీయ తిథి సౌమ్య వాసర పునర్వసు నక్షత్రం ధ్రువ యోగః తైతుల తదుపరి గరజి కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: తృతీయ


 

నమస్కారః సృష్టిలో జీవరాశులు… స్థావరములు, జంగమములు అని, రెండు వర్గములు వున్నాయి. 


జీవం ఉండి చలనం లేని, స్థిరంగా ఉండేవాటిని స్థావరములని అంటారు. 

ఉదాహరణకు మొక్కలు, వృక్షాలు మొదలైనవి. ఇవి ఏకేంద్రియ జీవులు. వీటిలో స్పర్శ మాత్రమే ఉంటుంది. 


చలనం ఉండే జీవరాశులను జంగమములని అంటారు. ఉదాహరణకు క్రిమికీటకాదులు, సర్పములు, పక్షులు, మానవులు మొదలగునవి.


ఈ జంగమాల్లో వాటివాటి స్థితినిబట్టి, రెండునుంచి అయిదు జ్ఞానేంద్రియాలవరకూ ఇంద్రియ జ్ఞానాన్నికల్గి ఉంటాయి. 


వీటిలో స్పర్శ, రుచి తెలిసే రెండు జ్ఞానేంద్రియాలు ఉండేవి - ఉదాహరణకు నత్తలు, క్రిమి కీటకాదులు. 


స్పర్శ, రుచి, వాసన అనే మూడు జ్ఞానేంద్రియాలు ఉండేవి - జెర్రులు, పేలు మొదలైనవి. 


స్పర్శ, రుచి, వాసన, దృష్టి అనే నాలుగు జ్ఞానేంద్రియాలు ఉండేవి- ఉదాహరణకు తేళ్ళు, ఈగలు, సాలెపురుగు మొదలైనవి. 


స్పర్శ, రుచి, వాసన, దృష్టి, శబ్ద గ్రహణం అనే అయుదు జ్ఞానేంద్రియాలు ఉండేవి- ఉదాహరణకు పశుపక్ష్యాదులు, మానవులు, దేవతలు మొదలైన వారు. 


సృష్టిలో ఎనుబదినాలుగు లక్షల జీవరాసులు ఉన్నట్లు చెబుతారు. ఇలా ఏకేంద్రియముల కన్న, క్రమంగా పంచేంద్రియాలున్న జీవులు అధికమైనవని తెలుస్తుంది. పంచేంద్రియ జీవులలో కూడా; పశుపక్ష్యాదులకు సుఖదుఃఖానుభూతి తప్ప, విచక్షణచేసే బుద్ది లేదు. మనస్సు చెవి, ముక్కు, కన్ను, చర్మం, నాలుక అనే పంచేంద్రియాల ద్వారా గ్రహించిన విషయ జ్ఞానాన్ని బుద్దిముందు ఉంచుతుంది.  


అలా మనస్సుతెచ్చిన విషయాలలో మంచిచెడులను నిర్ణయించేది బుద్ధి. 


ఈబుద్ధి వల్లనే మానవుడు మిగిలిన జీవరాశులకన్న ఉన్నతమైన వాడు అనవచ్చు. క్రిమికీటకాదులు మొదలు, అన్ని జంతువులలోనూ మనోవ్యాపారం ఉంటుంది. కాని వాటి మనస్సు, బుద్దిరూపాన్ని పొందలేదు. మానవుడిలోనే బుద్దిరూపాన్ని పొందింది. అంచేత సాధనద్వారా, నివృత్తిమార్గాన్ని అవలంబించి, సంసారబంధంలోనుండి విడివడే అవకాశం మానవునికి మాత్రమే ఉంది. 


మిగిలిన జీవరాశులకు సత్వరమే ముక్తి పొందడానికి సాధ్యం కాదు. ఇక దేవతలు, గంధర్వులు మొదలైన వారు కూడా మనలాగే పంచేంద్రియాలతో బాటు, బుద్ధి కూడా పరిణతి చెంది ఉంటుంది. వారు గతజన్మలలో చేసుకున్న అధికమైన పుణ్యకార్యాలవల్ల; వాటి ఫలితాలను అనుభవించడానికి ఆయా దేవతాస్థానాలు కలిగాయి. వారు సుఖానుభవాలలోనే తేలుతుంటారు. తమ పుణ్యఫలం అనుభవించడం పూర్తికాగానే, తిరిగి క్రిందిజన్మలను ఎత్తవలసి ఉంటుంది. అందుచేత దేవతలూ, గంధర్వాదులు కూడా వారి శరీరాలతో మోక్షం పొందలేరనేది స్పష్టం.


అందుచేతనే మానవజన్మ లభించడం కడుదుర్లభం అని పెద్దలు చెబుతారు. ప్రతి జీవికీ వాటి క్రమాభివృద్ధిలో 

ఈ జగత్తులో ఉంటూ మోక్షాన్ని అభిలషించే ప్రయత్నం చెయ్యవచ్చు. కాని మానవశరీరం ప్రాప్తిస్తేనే మోక్షం పొందటం జరుగుతుంది. అందుచేతనే మానవ జన్మ ఉత్తమమైనదిగా చెప్పబడినది. 


మనుష్యస్థితి ఉత్తమమైనదని చెప్పడంచేత ఇదే ఉన్నత స్థితిఅనుకోవద్దు. నిరాశ, నిస్పృహ లనే ఊబినుంచి బయటపడి, సంసారమనే సముద్రం నుంచి తరించాలి. మేధావులంతా సర్వజ్ఞమైన సహజస్థితిని పొందడానికి మానవజన్మ మనకో సాధనం అని బోధించారు.  


ఇలాంటి ఉత్కృష్టమైన మానవజన్మ పొందటానికి కారణం, గత జన్మల్లో చేసుకున్న పుణ్యకర్మల ఫలితమే. అందువల్లనే నీచజన్మలు పొందలేదు. 


బుద్ధిని ఉపయోగించుకొని, ఈ జన్మనెలా సార్ధకం చేసుకోవాలో తెలుసుకోవాలి. తానెక్కడనుండి వచ్చాడో, ఎక్కడకు పోవాలో, ఆ గమ్యాన్నిచేరే మార్గమేమిటో చక్కగా తెలుసుకోవాలి. అమరత్వం, సత్యాన్వేషణ, ఆనందం అనేవి, మానవ గమ్యాలని విజ్ఞులు చెబుతారు. ఉపనిషత్తులలోనూ ఇలాగే చెప్పబడింది. బ్రహ్మాన్ని తెలుసుకో కోరేవాడు ఈ విశ్వానికి మూలకారణం ఏమిటి? అది బ్రహ్మమా లేక మరొకటా? మనం ఎక్కడినుంచి వచ్చాం? మనం మరణం తర్వాత ఏమవుతాం? ఎవరి నియమానుసారం మనం ఈ సుఖదుఃఖాలకు లోబడి ఉంటున్నాం? అని చర్చ చేసుకుంటారు అని చెప్పబడింది., శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 

 యత్సాంఖ్యై: ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ।

ఏకం సాఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి ।। 5 ।।



ప్రతిపదార్థ:



యత్ — ఏదైతే; సాంఖ్యైః — కర్మ సన్యాసము ద్వారా; ప్రాప్యతే — పొందబడునో; స్థానం — స్థానము; తత్ — అది; యోగైః — భక్తితో పని చేయటం ద్వారా; అపి — కూడా; గమ్యతే — పొందవచ్చు; ఏకం — ఒకటే; సాంఖ్యం — కర్మ సన్యాసము; చ — మరియు; యోగం — కర్మ యోగము; చ — మరియు; యః — ఎవరైతే; పశ్యతి — చూస్తారో; సః — ఆ వ్యకి; పశ్యతి — నిజముగా చూచినట్టు.


 

 తాత్పర్యము : 


కర్మ సన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని భక్తితో కర్మలను ఆచరించటం ద్వారా కూడా పొందవచ్చు. కాబట్టి, కర్మ సన్యాసము మరియు కర్మ యోగము ఒక్కటే అని చూసినవాడే నిజముగా ఉన్నదున్నట్టుగా చూసినట్టు.



వివరణ:


ఆధ్యాత్మిక సాధనలో, మనస్సు యొక్క ఉద్దేశమే (అభిమతం) ప్రధానమైనది, బాహ్యమైన క్రియలు కావు. ఒక వ్యక్తి పవిత్ర బృందావన ధామములో నివసిస్తున్నా అతని మనస్సు కొలకత్తాలో రసగుల్లాలు తినటం కోసం భావన చేస్తే అతను కొలకత్తాలో నివసిస్తున్నట్టే లెక్క. దీనికి విరుద్ధంగా, ఒకడు కొలకత్తా నగర హడావిడి మధ్య నివసిస్తున్నా, బృందావన పుణ్యక్షేత్రం పైనే మనస్సు నిమగ్నం చేస్తే, అతనికి ఆ బృందావనంలో నివసించే ఫలితం దక్కుతుంది. మన మానసిక స్థితిని బట్టి, మన ఆత్మ ఉద్ధరణ స్థాయి ఉంటుంది అని సమస్త వైదిక శాస్త్రాలు పేర్కొంటున్నాయి:


మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః


(పంచదశీ)


 


‘బంధమునకు మరియు మోక్షమునకు కారణము మనస్సే.’ జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారు ఇదే సూత్రమును పేర్కొన్నారు:


బంధన్ ఔర్ మోక్ష కా, కారణ్ మన హి బఖాన్

యాతే కౌనిఉ భక్తి కరు, కరు మన తే హరిధ్యాన్


(భక్తి శతకము, 19వ శ్లోకం)


 


‘బంధము మరియు మోక్షము అనేవి మనస్సు యొక్క స్థితి మీద అధారపడుతాయి. ఏవిధమైన రూపంలో భక్తి చేసినా, మనస్సుని మాత్రం భగవంతుని ధ్యానంలోనే నిమగ్నం చేయుము.’


ఆధ్యాత్మిక దృష్టి లేనివారు, కర్మ సన్యాసికి, కర్మ యోగికి ఉన్న బాహ్యమైన తేడాలను చూసి, కర్మ సన్యాసి యే ఉన్నతమైనవాడు అని ప్రకటిస్తారు. కర్మ సన్యాసులు మరియు కర్మ యోగులు కూడా తమ మనస్సులను భగవంతుని యందే నిమగ్నం చేసినట్టు చూసి, జ్ఞానులు, వారిద్దరూ ఒకే సరిసమాన అంతర్గత స్థితిలో ఉన్నట్టు గమనిస్తారు.

పాదారవింద శతకం - 2*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 13*


*భవాని ద్రుహ్యేతాం భవనిబిడితేభ్యో మమ ముహు-*

*స్తమోవ్యామోహేభ్యస్తవ జనని కామాక్షి చరణౌ ।*

*యయోర్లాక్షాబిందుస్ఫురణధరణాద్ధ్వర్జటిజటా-*

*కుటీరా శోణాంకం వహతి వపురేణాంకకలికా ॥*


*భావము :*


*అమ్మా భవానీ, ఈశ్వరుని జటాజూటములో నీవు ఒక మొగ్గవై ఉన్నావు. ప్రణయ సమయములో నీ పాదములను తాకిన శివుని ముఖముపై అలముకున్న నీ పాదముల లత్తుక ఎర్రని తిలకమువలె భాసిస్తున్నది. అటువంటి నీ పాదములు నా తమో గుణమును నశింపచేయుగాక.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

17-06-2026 బుధవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏


17-06-2026 బుధవారం రాశి ఫలితాలు


మేషం


మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలన సూచనలున్నవి.  

---------------------------------------


వృషభం


దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఇంటాబయట సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా నడుస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు.

---------------------------------------


మిధునం


చేపట్టిన పనులలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------


కర్కాటకం


సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆర్థిక లాభాలు పొందుతారు. నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. 

---------------------------------------


సింహం


కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు అమలు చెయ్యడం మంచిది. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగస్తుల విధుల్లో సమస్యలు తప్పవు. బంధు వర్గం వారితో విభేదాలు కలుగుతాయి.

---------------------------------------


కన్య


వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. నూతన ఋణయత్నాలు కలసిరావు. స్థిరాస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.

---------------------------------------


తుల


చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

---------------------------------------


వృశ్చికం


సంఘంలో పెద్దల నుండి వివాదాలకు సంబంధించి ముఖ్య సమాచారం అందుతుంది. పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి వివాహ శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో సానుకూల ఫలితాలుంటాయి.

---------------------------------------


ధనస్సు


ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడుతాయి.

---------------------------------------


మకరం


ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. గృహమున మీ ఆలోచనలు అందరికి నచ్చవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------


కుంభం


 సన్నిహితుల నుండి కీలక విషయాలు తెలుసుకుంటారు. సంతనానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ విషయంలో సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు.ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగుతాయి.

---------------------------------------


మీనం

 

ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో భాగస్థులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------

నిత్యపూజగా

  ప్ర : నిత్యపూజగా శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన ఎలా చేయాలి?


జ : శంకరభగవత్పాదాచార్యులకు షణ్మతస్థాపనాచార్య అని పేరు. మోక్షం ఇవ్వగలిగిన రూపాలు ఏవి అన్నవాటిని ఆరింటిని ఆయన నిర్ధారణ చేశారు. మోక్షం ఇవ్వగలిగితే ఇక క్రింద వాటిని వేటిని ఇవ్వడంలోనూ వాళ్ళకి శక్తి లేనివారు చెప్పడానికి ఉండదు. అన్నింటికన్నా పతాకస్థాయి మోక్షం. అదే ఇవ్వగలరు అంటే ఇంక ఏదైనా ఇవ్వగలరు అని గుర్తు. అలా ఇవ్వగలిగిన వారిని ఆరుగురిని నిర్ధారించారు ఆయన – ౧. పరమశివుడు ౨. అంబిక(అమ్మవారు) ౩. సూర్యుడు ౪. గణపతి ౫. సుబ్రహ్మణ్యుడు ౬. విఘ్నేశ్వరుడు. ఈ ఆరుగురి పేర్లమీదే శైవము, శాక్తేయము, గాణాపత్యము, సౌరము, వైష్ణవము, కౌమారం అని ఆరు సిద్ధాంతాలు. ఈ ఆరుగురూ మోక్షప్రదాతలే. ఇందులో అయిదుగురికి పూజలో స్థానం ఇచ్చారు. పంచాయతనం అంటే అయిదు. పరమశివుడు, అమ్మవారు, శ్రీమహావిష్ణువు, సూర్యుడు, విఘ్నేశ్వరుడు పంచాయతనంలో ఉంటారు. మోక్షం ఇవ్వగలిగిన వాళ్ళలో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు. పూజలో మాత్రం సుబ్రహ్మణ్యుడు లేడు. మరి ఎలా పూజ చేయడం? సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉన్నా సరే జ్యోతిస్స్వరూపుడు. ఆయన పేరు పావకి. అగ్నిహోత్రుడి రూపంగా వచ్చాడు. ఆయన ఎక్కడ ఉంటే అజ్ఞాన దగ్ధం. అజ్ఞానాన్ని తీసేస్తాడు. అందుకే గోచీ పెట్టుకుని ఒక సన్యాసి ఎలా ఉంటారో అలా స్వామిమలై అన్న కొండమీద దండం చేత్తో పట్టుకొని జ్ఞానమూర్తిగా నిలబడి ఉంటారు. ఆ పేరుతోనే పుట్టారు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు, స్వామినాథన్. అందుకే ఇప్పటికీ ఆయన పుట్టినరోజునాడు ఆ క్షేత్రంలో ప్రత్యేకపూజ జరుగుతుంది. సుబ్రహ్మణ్యుడు అంటే ఎప్పుడూ జ్ఞానమూర్తి. వెలిగిపోతూంటాడు జ్యోతిస్వరూపంగా. పూజ మొట్టమొదటగా దీపం వెలిగించి మొదలుపెట్టాలి. ఆ దీపశిఖలో వెలుగుతున్నటువంటి జ్యోతి సుబ్రహ్మణ్యుడే. పూజ పూర్తి మంగళ నీరాజనంతో. నీరాజనంలో ఉన్న జ్యోతి సుబ్రహ్మణ్యుడే. జ్యోతిని చూస్తూ మీరు ఏ మూర్తి దగ్గర వేసినా సుబ్రహ్మణ్యుడికి అందుతుంది. కాదు కళ్ళతో చూస్తూ చేయాలని ఉంది అంటే సుబ్రహ్మణ్యుడి మూర్తి పెట్టుకొని ఆయన వంక చూస్తూ మంటపంలో వేయండి. ఆయన పాదాల దగ్గరే పడుతుంది ఆ పువ్వు. మనస్సు చేత వెళ్తుంది. కాబట్టి ఎక్కడెక్కడ జ్యోతిస్స్వరూపం ఉంటుందో అక్కడక్కడ సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు అని గుర్తు. కాబట్టి జ్యోతికీ చేయవచ్చు. దీపం దగ్గర ఒక పళ్ళెం పెట్టి జ్యోతిస్స్వరూపంగా సుబ్రహ్మణ్యుడు వెలిగిపోతున్నాడు అని భావన చేసి పళ్ళెంలో పువ్వులు వేస్తూ ఉంటే ఆ పువ్వులు వెళ్ళి ఆయన పాదాలమీద పడతాయి. లేదు అంతలా మనస్సు నిలబెట్టలేను అంటే మూర్తిని ఎదురుగా పెట్టుకుని ఆయన వంక చూస్తూ శివుడికి వేస్తే ’ఆత్మావై పుత్ర నామాసి’. విష్ణువు స్థితికారుడు – ఎప్పుడూ లోకాలను రక్షిస్తాడు. సుబ్రహ్మణ్యుడు రక్షణశక్తి. పైగా సుబ్రహ్మణ్యుడు శివకేశవులు ఇద్దరికీ ప్రతీక. అందుకే తమిళదేశంలో ఇప్పటికీ మురుగన్, మరుమగల్ అంటారు. అంటే మురుగన్ అంటే మేనల్లుడు, ఎందుచేత అంటే పార్వతీదేవి కొడుకు, పార్వతీదేవి శ్రీమన్నారాయణుడికి చెల్లెలు నారాయణి. కనుక పార్వతీదేవి కొడుకు విష్ణువుకు మేనల్లుడు అవుతాడు. మేనల్లుడు అల్లుడు ఎందుకంటే విష్ణువు యొక్క కూతురు వల్లి. మేనల్లుడే అల్లుడైనాడు. శైవము, వైష్ణవము వియ్యం అందాయి సుబ్రహ్మణ్యుడి వల్ల. స్థితికారశక్తిగా విష్ణుస్వరూపంగా ఉంటాడు. అందుకే సుబ్రహ్మణ్యుడు కొండలమీద ఉంటాడు తప్ప సాధారణంగా నేలమీద ఉండడు. సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నీ కొండలమీదే ఉంటాయి. ఆయన మేనమామ గారికీ అదే లక్షణం. కాబట్టి విష్ణువు పాదం దగ్గర వేసినా, చేతిలో ఉండేది వేలాయుధం – శక్తిని చేతిలో పట్టుకుంటాడు. అమ్మ ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు. అమ్మ శక్తియే ఆయన చేతిలో శూలం. అమ్మ దగ్గర వేస్తే సుబ్రహ్మణ్యుడికి అందుతుంది. తేజోమూర్తి సూర్యనారాయణమూర్తి దగ్గర వేసినా ఆయనకు అందుతుంది. గణపతి పెద్దకొడుకు పరమేశ్వరుడికి. ఆయనకి ఒక పేరు ఉంది. స్కందపూర్వజాయ నమః’ అని సుబ్రహ్మణ్య సంబంధంగా. ఆయన దగ్గర వేసినా సుబ్రహ్మణ్యుడికి అందుతుంది. అందుకని ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యుడికి పూజలో మూర్తిని శంకరాచార్యుల వారు ఇవ్వలేదు. జ్యోతిస్స్వరూపుడు దీపంగా ఉన్నాడు కాబట్టి అక్కడ చేసినవన్నీ సుబ్రహ్మణ్యుడికే అందుతాయి. ఇలా సుబ్రహ్మణ్య పూజను పూరణం చేసుకోవచ్చు.

విశ్వాసం లేనివారికి

  *విశ్వాసం లేనివారికి అన్నీ సందేహాలే. ప్రపంచాన్ని నమ్మేంత సులువుగా పరమేశ్వరుని కూడా నమ్మడం లేదు.


*సమస్య అయితే భగవంతునితో చెప్తున్నాం కానీ వేయి సందేహాలతో ఆలోచిస్తునే ఉంటాం.


*ఇదా విశ్వాసం అంటే!! 


*భగవంతునికి కావాల్సినది పూర్తి విశ్వాసం. అది లేకపోవడం చేతనే సమస్యలు పోవడం లేదు, కష్టాలు తీరడంలేదు.


*గుట్టల కొలదీ పేరుకుపోయిన సందేహాల వలనే ఆనందాన్ని, సంతృప్తిని పొందలేకతున్నాం.


*దీనికి తోడు నిందలు భగవంతునిపైకి విసురుతుంటాం.


*విశ్వాస పరంగా తప్పు మనది, నిందలు దేవునికా!!!.


*భగవంతునితో వాదించాలని చూడడం వెర్రితనం. మంచైనా చెడైనా అంతా ఆయనే చూసుకుంటాడన్న విశ్వాసంతో కార్యనిమగ్నులమై ఉన్నపుడు తప్పకుండా అంతా మంచే జరుగుతుంది.


*భగవంతుని సంకల్పాన్ని అడ్డుకునే శక్తి ఏ కాలంనందునూ లేదు. ఉండదు.ఉండబోదు..

నీసరి ఎవరయ్యా అంజనా

  *జై హనుమాన్ జై శ్రీ రామ్* 


నీసరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య

నీసరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య

దాసుడ నేనయ్య బ్రతుకున బాసట నీవయ్య


చూచిరమ్మని లంకకు పంపితే

కాల్చి వచ్చినావు లంకను కాల్చి వచ్చినావు

సీతను చూచి వచ్చినావు శిరోమణి తీసుకొచ్చినావు


సంజీవి మూలిక తెమ్మంటే

గిరిని తెచ్చినావు సంజీవి గిరిని తెచ్చినావు

గణదర శక్తి జూపినావు లక్ష్మణ మూర్ఛ బాపినావు


రామచంద్రుని యాలింగన సన్మానమందినావు

శ్రీరామ పదమె నమ్మినావు 

రాముని కరుణపొందినావు నిజముగ రామబంటు నీవు


శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి కూర్చినావు

ప్రభువుకు మంచి చేసినావు

సుగుణము లెంచి చూసినావు శుభమ్మును కలుగజేసినావు


భక్తి పరీక్షకు నిలబడి వడి నీగుండె చీల్చినావు

రాముని ఎదను చూపినావు

అనితర భక్తి చాటినావు భక్తికి మారుపేరు నీవు


రామరామ యని ఘోషించే జప సాగరమే నీవు

శ్రీరామ నామాంబుది నీవు

రాముని భక్తులకే నీవు ఆత్మబంధువైనావు


*శుభ శుభోదయం*

నమస్కారం

 ప్రతి ఒక్కరికీ నమస్కారం

  

మీకు ఈ గౄప్ నందు తెలియజేసే ఆధ్యాత్మిక విషయాలు మీకు నచ్చితే

   మరికొందరకి గృూప్ లింకు పంపి భక్తి మార్గం గురించి తెలియజేయాలని మనవి Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/LThVELlZEiq3TI4iTu1Tpg

నీవు కూడా

  ఏమో 

నీవు కూడా 

పూజలకు 

పరవశించి పోతావా 

అలంకారాలకు

ఆనందిస్తావా 

స్తోత్రములకు 

సంతోషిస్తావా 

కానుకలు 

కరిగిపోతావా 

అలాంటప్పుడు 

నీవు దేవుడవు కానీ 

నా తండ్రివి కాదు 

కదా శివయ్యా  

అడిగితే వరములిచ్చు వారు 

వేలుపులు 

నీవు అడగకనే ఆదరించి 

అక్కున చేర్చుకొనే

కరుణామూర్తివి కదా 

సర్వము ఎరిగిన నీకు 

నేను విన్నవించవలసినది 

ఏమున్నది సదాశివా ??

నీవు కదా నాకు రక్ష

నీ కింకరుని 

సర్వకాల సర్వావస్థలయందు 

ఆలించే 

లాలించే 

పాలించే 

భారము నీదే కదా 


 _హరః నమః పార్వతీ పతయే హరహర మహాదేవ శంభో శంకర_🙏

గౄప్

 ప్రతి ఒక్కరికీ నమస్కారం

  

మీకు ఈ గౄప్ నందు తెలియజేసే ఆధ్యాత్మిక విషయాలు మీకు నచ్చితే

   మరికొందరకి గృూప్ లింకు పంపి భక్తి మార్గం గురించి తెలియజేయాలని మనవి Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/LThVELlZEiq3TI4iTu1Tpg

పంటి నొప్పికి గృహ వైద్యం

 పంటి నొప్పికి గృహ వైద్యం


 మనలో చాలామందికి సాధారణంగా అప్పుడప్పుడు పంటి నొప్పి కలుగుతూ ఉంటుంది.  దానికి అనేక కారణాలు ఉండవచ్చు. కారణం ఏదైనా కానీ పంటి నొప్పికి బాధపడని వాళ్ళు ఉండరంటే అతిశక్తి లేదు.


కానీ చాలామంది ఆ నొప్పి భరించలేక నొప్పి మాత్రలు  బ్రో ఫ్ఫ్యాన్ లాంటి అనేక నొప్పి మాత్రలు వాడి శరీరాన్ని ఇబ్బందుల పాలు చేసుకునే వాళ్ళు తరచుగా మనకు కనబడతారు.


నొప్పి మాత్రలు ఎక్కువగా వాడితే అవి కిడ్నీల మీద తర్వాత  లీవారు మీద దుష్ప్రభావం చూపుతాయి.


దాని వల్ల భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి రుగ్మతలు రావటం జరుగుతుంది.


కిడ్నీలు కాలయము మనకు ఎంతో ముఖ్యమైనటువంటి అవయవాలు.


వాటిని ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషి మీద ఉన్నది.


కాగా నొప్పి ఎట్లా ఉన్నా సరే ఈ చిన్న చిట్కా చేసి చూడండి.


మీకు క్షణాలలో ఉపశమనం కలగటం ఖాయం.


రెండుమూడు వెల్లుల్లిపాయలను తీసుకొని దానికి తగినంత ఉప్పు కలిపి దంచిన మిశ్రమాన్ని నొప్పితో బాధ కలిగించే పన్ను మీద పేస్టులాగా పెట్టండి.


నోరు మూసుకుంటే మీకు బాగా  నోట్లో ఉమ్మి ఊరుతుంది.


ఆ ఉమ్మిని ఉమ్మి వేయండి.

పొరపాటున మింగిన ఏమి ఇబ్బంది లేదు.


నొప్పి తగ్గిన తరువాత నోరు నీటితో పుక్కిలిచ్చి వేయండి.


ఈ రకంగా మీరు పంటి నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.


మిత్రులారా ఈ చిట్కా మీలో ఎవరైనా ఆచరిస్తే  ఆ వివరాలను కామెంట్ రూపంలో తెలుపగలరు.


మరిన్ని చిట్కాలతో రేపు కలుద్దాం 

మీ 

చేరువేల భాగవశర్మ

పంచాంగము

*🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏*

        *📿పంచాంగం📿*

*శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*తేదీ ... 17 - 06 - 2026,*

*వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )*

శ్రీ పరాభవ నామ సంవత్సరం,

ఉత్తరాయణం,

గ్రీష్మ ఋతువు,

*నిజ జ్యేష్ఠ మాసం,*

శుక్ల పక్షం,


తిథి : *తదియ* రా2.09 వరకు,

నక్షత్రం : *పునర్వసు* సా6.00 వరకు,

యోగం : *ధృవం* రా1.44 వరకు,

కరణం : *తైతుల* మ3.16 వరకు

                   తదుపరి *గరజి* రా2.09 వరకు


వర్జ్యం : *ఉ6.45 - 8.15*

                           మరల రా1.34 - 3.05 వరకు*

దుర్ముహూర్తము : *ఉ11.34 - 12.26*

అమృతకాలం : *మ3.45 - 5.15*

రాహుకాలం : *మ12.00 - 1.30* 

యమగండం : *ఉ7.30 - 9.00*

సూర్యరాశి : మిథునం,

చంద్రరాశి : మిథునం 

సూర్యోదయం : 5.29,

సూర్యాస్తమయం : 6.31,


               *_నేటి విశేషం_*

*🌙 చంద్ర దర్శనం మహిమ*


అమావాస్య అనంతరం శుక్ల పక్షంలో కనిపించే తొలి చంద్రకళలను దర్శించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. చంద్రుడు మనస్సుకు అధిపతి. చంద్ర దర్శనం వల్ల మనశ్శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.


చంద్ర దర్శన శ్లోకం:

దధిశంఖ తుషారాభం

క్షీరోదార్ణవ సంభవమ్ ।

నమామి శశినం సోమం

శంభోర్మకుట భూషణమ్ ॥


🌙 చంద్రుడిని దర్శించి ఈ శ్లోకాన్ని పఠిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం


*🌿 తులసీ మహిమ*


బుధవారం తులసీదేవికి దీపారాధన చేసి, 11 లేదా 21 ప్రదక్షిణలు చేస్తే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రోక్తం.


తులసీదేవి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అందువల్ల తులసీ పూజ ద్వారా విష్ణు అనుగ్రహం కూడా లభిస్తుంది.


*🕉️ బుధ గ్రహ ఆరాధన*

బుధుడు జ్ఞానం, వ్యాపారం, గణితం, వాక్చాతుర్యానికి కారకుడు.

బుధ గ్రహ మంత్రం

ఓం బుం బుధాయ నమః ॥


ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో పురోగతి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది.


*🌺 నేటి ఆధ్యాత్మిక సందేశం*


"జీవితంలో సంపద కన్నా సద్బుద్ధి గొప్పది. సద్బుద్ధి ఉంటే సంపద, సంతోషం, గౌరవం అన్నీ స్వయంగా వస్తాయి.


🙏 ఈ రోజు తప్పక స్మరించవలసిన నామాలు


🔸 ఓం నమో నారాయణాయ

🔸 ఓం గం గణపతయే నమః

🔸 ఓం శ్రీ కృష్ణాయ నమః

🔸 ఓం బుం బుధాయ నమః


*🌺 సర్వేజనాః సుఖినో భవంతు 🌺*

            *_📿శుభమస్తు📿_*

*🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏**🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏*

        *📿పంచాంగం📿*

*శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*తేదీ ... 17 - 06 - 2026,*

*వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )*

శ్రీ పరాభవ నామ సంవత్సరం,

ఉత్తరాయణం,

గ్రీష్మ ఋతువు,

*నిజ జ్యేష్ఠ మాసం,*

శుక్ల పక్షం,


తిథి : *తదియ* రా2.09 వరకు,

నక్షత్రం : *పునర్వసు* సా6.00 వరకు,

యోగం : *ధృవం* రా1.44 వరకు,

కరణం : *తైతుల* మ3.16 వరకు

                   తదుపరి *గరజి* రా2.09 వరకు


వర్జ్యం : *ఉ6.45 - 8.15*

                           మరల రా1.34 - 3.05 వరకు*

దుర్ముహూర్తము : *ఉ11.34 - 12.26*

అమృతకాలం : *మ3.45 - 5.15*

రాహుకాలం : *మ12.00 - 1.30* 

యమగండం : *ఉ7.30 - 9.00*

సూర్యరాశి : మిథునం,

చంద్రరాశి : మిథునం 

సూర్యోదయం : 5.29,

సూర్యాస్తమయం : 6.31,


               *_నేటి విశేషం_*

*🌙 చంద్ర దర్శనం మహిమ*


అమావాస్య అనంతరం శుక్ల పక్షంలో కనిపించే తొలి చంద్రకళలను దర్శించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. చంద్రుడు మనస్సుకు అధిపతి. చంద్ర దర్శనం వల్ల మనశ్శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.


చంద్ర దర్శన శ్లోకం:

దధిశంఖ తుషారాభం

క్షీరోదార్ణవ సంభవమ్ ।

నమామి శశినం సోమం

శంభోర్మకుట భూషణమ్ ॥


🌙 చంద్రుడిని దర్శించి ఈ శ్లోకాన్ని పఠిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం


*🌿 తులసీ మహిమ*


బుధవారం తులసీదేవికి దీపారాధన చేసి, 11 లేదా 21 ప్రదక్షిణలు చేస్తే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రోక్తం.


తులసీదేవి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అందువల్ల తులసీ పూజ ద్వారా విష్ణు అనుగ్రహం కూడా లభిస్తుంది.


*🕉️ బుధ గ్రహ ఆరాధన*

బుధుడు జ్ఞానం, వ్యాపారం, గణితం, వాక్చాతుర్యానికి కారకుడు.

బుధ గ్రహ మంత్రం

ఓం బుం బుధాయ నమః ॥


ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో పురోగతి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది.


*🌺 నేటి ఆధ్యాత్మిక సందేశం*


"జీవితంలో సంపద కన్నా సద్బుద్ధి గొప్పది. సద్బుద్ధి ఉంటే సంపద, సంతోషం, గౌరవం అన్నీ స్వయంగా వస్తాయి.


🙏 ఈ రోజు తప్పక స్మరించవలసిన నామాలు


🔸 ఓం నమో నారాయణాయ

🔸 ఓం గం గణపతయే నమః

🔸 ఓం శ్రీ కృష్ణాయ నమః

🔸 ఓం బుం బుధాయ నమః


*🌺 సర్వేజనాః సుఖినో భవంతు 🌺*

            *_📿శుభమస్తు📿_*

*🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏*

ఈశ్వరే నిశ్చలా బుద్ధిః

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹



ఈశ్వరే నిశ్చలా బుద్ధిః

దేశార్థం జీవనస్థితిః।

పృథివ్యాం బంధువద్వృత్తిః

ఇతి కర్తవ్యతా సతామ్.॥


పరమేశ్వరునియందు నిశ్చలమైన బుద్ధి కలిగి ఉండటం, దేశముకోసమే తన జీవితమని భావించటం, లోకులందరియందు బంధుభావన కలిగి ఉండటం సజ్జనుల కర్తవ్యం.


జీవితంలో ఆచరించవలసిన ఉత్తమమైన ధర్మాన్ని, మానవత్వాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుంది.



🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

వాగ్బాటాచార్యుల

 వాగ్బాటాచార్యుల వారు వివరించిన భోజన పధ్ధతి -


ఆయుర్వేద చరిత్రలో వాగ్బాటాచార్యుల వారికి చాలా గొప్పస్థానం ఉన్నది. ఆయన రాసినటువంటి "అష్టాంగహృదయం" అనే గ్రంథం చాలా ప్రాచుర్యం పొందింది. వారు తెలియచేసిన

భోజనపద్ధతి గురించి మీకు వివరిస్తాను.


మనం తీసుకునే ఏ పదార్థం అయినా మోతాదుగా భుజించవలెను. ఈ మోతాదు జఠరాగ్నిని దీపనం చెందించును. తినగలిగినతలో గట్టిగా ఉండు పదార్దాలను సగమే తినవలెను . లఘుపదార్థాలను కడుపునిండా ఇక తినలేము అన్నంత అధికంగా తినకూడదు. అనగా మూడు వంతులు తిని కడుపులో ఒక వంతు ఖాళీగా ఉంచవలెను. మోతాదుకు తక్కువుగా భుజించకూడదు. దానివల్ల శరీరం యొక్క బలము , ఓజస్సు , పుష్టి నశించును. సకల వాతవ్యాధులు సంభవించును.


మన శరీరానికి అవసరం అయిన దానికంటే అతి తక్కువ మోతాదులో ఆహారాన్ని భుజించుచున్న వాత,పిత్తాలను ప్రకోపింపచేయును . దీనివలన త్వరగా అలిసిపోయి నీరసం వచ్చుట, బలహీనత వంటి సమస్యలు వచ్చును. ఒక్కోసారి అవి ప్రాణాంతకం కావోచ్చు . పదార్ధాలను అధికంగా భుజించటం ఒక్కటే దోషం కాదు. ఇష్టం లేని పదార్దాలు భుజించటం , కడుపుబ్బరం కలిగించునవి , సరిగ్గా పక్వము కానివి , గట్టిగా ఉండి అరుగుటకు బాగా సమయం తీసుకొనునవి, బాగా కారంగా ఉండునవి, చల్లబడిపోయినవి , అశుచిగా ఉండునవి , దాహాన్ని అధికము చేయునవి, ఆరిపోయి గట్టిగా అయినవి, నీళ్లలో ఉన్నవి , మొదలయిన పదార్దాలు కూడా జీర్ణం కావు. శోకం , కోపం , భయం చెంది ఉన్నప్పుడు తినిన ఆ పదార్దాలు కూడా జీర్ణం అవ్వవు.


భోజనం తరువాత అది పూర్తిగా అరగక పూర్వం మరలా భుజించకూడదు. సమయం కాని సమయంలో కొంచం కాని ఎక్కువ కాని భుజించరాదు . మలమూత్రములు సంపూర్ణంగా బయటకి వెడలిన తరువాత హృదయం నిర్మలమైనప్పుడు , వాత,పిత్త,కఫాలు స్వస్థానం నందు ఉన్నప్పుడు , త్రేన్పులు లేనప్పుడు , బాగుగా ఆకలి అవ్వుచున్నప్పుడు , జఠరాగ్ని పదార్దాలను జీర్ణం చేయు సమర్ధం అయి ఉన్నప్పుడు , శరీరం తేలికగా ఉన్నప్పుడు మాత్రమే భుజించవలెను .


భోజనకాలమున స్నానం చేసి శుచి అయ్యి , ఏకాంతంగా కూర్చుని పితృదేవతలు , బాలురు, అతిధులు వీరిని తృప్తులు కావించి తాను పెంచుతున్న పశుపక్ష్యాదులకు ఆహారం అందించి మనఃశుద్ధి కలిగి , ఎవరిని నిందించకుండా , మాట్లాడకుండా తనకు హితమైనది , తనయందు భక్తి కలిగినవారు పెట్టినది అయిన ఆహారంను భుజించవలెను.


ఉదరమును నాలుగు భాగాలుగా విభజించి రెండు భాగములను ఆహారపదార్థాల చేత , ఒక భాగం ఉదకాది ద్రవపదార్థాల చేత నిండింపవలెను . నాలుగో భాగం వాయుప్రసారానికి అనువుగా ఖాళీగా ఉంచవలెను. భోజనం అయిన వెంటనే చదువుట, నడుచుట, పడుకోవడం , ఎండలో ఉండటం, అగ్నికి సమీపాన ఉండటం , వాహనములు ఎక్కుట, ఈదుట, ఎగిరి దాటుట మున్నగునవి చేయకూడదు .


పైన చెప్పిన నియమాలు ప్రతి ఒక్కరు పాటించినచో మంచి ఆరోగ్యవంతులు అవుతారు.

ఆయుర్వేదం నందు ఒక సామెత ఉంది. "ఏకకాల భోజనే మహాయోగి , ద్వికాల భోజనే మహాభోగి , త్రికాల భోజనే మహా రోగి " అని దీనినిబట్టి చూడవచ్చు ఆయుర్వేదం మనం తీసుకునే ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో. ప్రతిఒక్కరు నియమిత సమయంలో నియమిత ఆహారాన్ని తీసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు.


మరిన్ని అతి సులభ యోగాలు, మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథాలను చదవగలరు.