17, జూన్ 2026, బుధవారం

నీసరి ఎవరయ్యా అంజనా

  *జై హనుమాన్ జై శ్రీ రామ్* 


నీసరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య

నీసరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య

దాసుడ నేనయ్య బ్రతుకున బాసట నీవయ్య


చూచిరమ్మని లంకకు పంపితే

కాల్చి వచ్చినావు లంకను కాల్చి వచ్చినావు

సీతను చూచి వచ్చినావు శిరోమణి తీసుకొచ్చినావు


సంజీవి మూలిక తెమ్మంటే

గిరిని తెచ్చినావు సంజీవి గిరిని తెచ్చినావు

గణదర శక్తి జూపినావు లక్ష్మణ మూర్ఛ బాపినావు


రామచంద్రుని యాలింగన సన్మానమందినావు

శ్రీరామ పదమె నమ్మినావు 

రాముని కరుణపొందినావు నిజముగ రామబంటు నీవు


శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి కూర్చినావు

ప్రభువుకు మంచి చేసినావు

సుగుణము లెంచి చూసినావు శుభమ్మును కలుగజేసినావు


భక్తి పరీక్షకు నిలబడి వడి నీగుండె చీల్చినావు

రాముని ఎదను చూపినావు

అనితర భక్తి చాటినావు భక్తికి మారుపేరు నీవు


రామరామ యని ఘోషించే జప సాగరమే నీవు

శ్రీరామ నామాంబుది నీవు

రాముని భక్తులకే నీవు ఆత్మబంధువైనావు


*శుభ శుభోదయం*

కామెంట్‌లు లేవు: