26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

కుమ్మరి కేశప్పకథ

 🏵️🌸🌸🏵️🌸🌸🏵️🌸🌸కుమ్మరి కేశప్పకథ

అటికేశ్వరుని కథ

          పూర్వం శ్రీశైలమునకు కొంతదూరంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కేశప్ప అనే కుమ్మరి ఉండేవాడు. గొప్ప శివభక్తుడు అయిన కేశప్ప కుండలు చేసుకుని జీవిస్తూ కాలినడకన శ్రీశైలమునకు వచ్చే భక్తులకు అన్నదానం చేస్తూ తేనె పండ్లు మొదలైన పదార్థాలను అతిథి సేవకు ఉపయోగించుతూ కాలం వెళ్ళబుచ్చేవాడు. ఆ ఊరి మీదుగా వచ్చి వెళ్లే భక్తులు, జంగములు కేశప్ప భక్తిని, అతిధి సేవలనూ ఊరురా చెప్పుకుంటూ వెళ్ళేవారు. ఈవిధంగా కేశప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందాడు.

             కేశప్పకు మంచిపేరు రావడాన్ని అతని ఇంటిలో భక్తులు సందడిని చూసి సాటి కుమ్మరులు కొందరు ఓర్చుకోలేకపోయారు. ఎలాగైనా సరే అతడు దానధర్మములు చేసే అవకాశం లేకుండా చేయాలని అనుకొని కుట్రపన్ని అర్ధరాత్రి వేళ కేశప్ప కుండలను ముంతలను ఇతర సామాగ్రిని పగులగొట్టి ఉన్న కాస్త సొమ్ము దొంగిలించి కుండలు తయారు చేసే అటికను(సారెను) కూడా పగులగొట్టారు. కేశప్ప తెల్లవారుజామున లేచి ఇల్లంతా చూసి బావురమన్నాడు. శివరాత్రి వచ్చింది. వచ్చే యాత్రికులు లో కనీసం కొంతమంది కి అయినా అన్న సంతర్పణ చేయలేకపోతానే అని దిగులు పడ్డాడు.

        కేశప్ప చేసేది ఏమి లేక చివరకు ధైర్యం తెచ్చుకుని అటిక తయారు చేయడం ప్రారంభించాడు. ఆ సమయం చూసి సాటి కుమ్మరులు దారిని పోయే కొందరు భక్తులు ను పిలిచి కేశప్ప ఇంటికి భోజనానికి పంపించారు. చీకటి పడింది. శివభక్తులకు భోజనం ఎలా ఏర్పాటు చేయాలో కేశప్పకు తోచలేదు. ఆరోజు తన ఇంటిలో ఎవరూ భోజనం చేయలేదు. పదార్థాలు కూడా లేవు. అయినా భక్తులు ను ఇంట్లో కి ఆహ్వానించాడు. పెరటిలోకి వెళ్లి మారేడు చెట్టు కింద దిగాలుగా కూర్చుని ఆలోచించసాగాడు. అతనికి ఏడుపు ఆగలేదు. కంటి నిండా నీళ్లు నిండినాయి. ఎదురుగా అటికపై పగిలిన కుండ పెంకులో శివుడు బంగారు లింగ రూపంలో ప్రత్యక్చమయ్యాడు. "కేశప్పా! ఇంటిలోనికి వెళ్లి నా భక్తులు కు భోజనం వడ్డించు. నా భక్తులు కు ఎన్నడూ లోటుఉండదు. లే! వెళ్ళు!" అన్నాడు. కేశప్ప లోపలికి వెళ్లి చూసేసరికి కుండల నిండా వివిధ భోజన పదార్థాలు ఉన్నాయి. భక్తులకు భోజనం పెట్టి పంపించాడు కేశప్ప.

      శివుడు అటికలో ప్రత్యక్చం అయిన ప్రదేశమే అటికేశ్వరము.

శ్రీశైలం లో ఈ అటికేశ్వరుని లింగ రూపంలో చూడవచ్చును. 🌸🏵️🌸🏵️🌳🏵️🌸🏵️🌸🏵️

వ్రుద్ధ మల్లికార్జునుని కథ

 🍁🍁🍀🍀🍁🍁🍀🍀🍁🍁వ్రుద్ధ మల్లికార్జునుని కథ

       పూర్వం ఒక రాజకుమార్తె ఆ పరమేశ్వరుడు ని ప్రేమించి ఆయననే వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. తల్లిదండ్రులు ఆమె కోరికను నిరాకరించారు. ఆమె నిరంతరం ఆ పరమేశ్వరుడు ని గురించి ఆలోచించుతూ పూజలలోనూ జపాలలోనూ కాలం వెళ్ళబుచ్చ సాగింది. అంతలో ఒకరోజు ఆ పరమేశ్వరుడు ఆమెకు కలలో కనిపించి ఒక తుమ్మెదను చూపించి అది వాలినచోట తనకోసం వేచి ఉండమని, తానే వచ్చి వివాహం ఆడతానని చెప్పాడు ఆమెకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూచేసరికి ఎదురుగా ఒక భ్రమరం (తుమ్మెద)

కనిపించింది ఆ రాజకుమారి ఎగురుతున్న ఆ తుమ్మెదను అనుసరిస్తూ శ్రీశైలం ప్రాంతంలోని అడవికి చేరి అక్కడ తుమ్మెద వాలిన పొదక్రింద శివుని ధ్యానిస్తూ ఆయనకోసం నిరీక్చించ సాగింది. ఆ అడవిలో చెంచులు ఆమెను చూసి ప్రతీ రోజూ పాలు, తేనె, పండ్లు మొదలైనవి ఆమెకు ఆహారం గా

ఇవ్వసాగారు.

           ఇది ఇలా ఉంటే ఒక రోజు పరమేశ్వరుడు పార్వతీదేవి తో కలిసి ఆ ప్రాంతానికి వచ్చాడు. పార్వతీదేవి కి ఆ రాజకుమార్తె ను చూపించి ఆమె తనను వివాహం చేసుకోబోతోంది అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి హేళన చేయగా పరమేశ్వరుడు తన మాటను నిరూపించ దలచి ఒక వ్రుద్ధుని రూపంలో రాజకుమార్తె వద్దకు వెళ్లి "రాకుమారి! నేను నీకొరకై వెదికి వెదికి ముసలివాడ నైతిని. ఇంతకాలమునకు నీచెంత చేరగలిగితిని. నా ముసలి రూపం లెక్కచేయకుండా వివాహం ఆడెదవా" అని అడిగాడు. అందుకు ఆ రాజకుమార్తె సమ్మతించి తనను సొంత బిడ్డ వలే సాకిన చెంచులు వద్దన్నా వినక ఆ పరమేశ్వరుని వివాహం చేసుకుంది.

         ఈ సందర్బంగా చెంచులు కొత్త అల్లునికొరకు వివాహము ఏర్పాటు చేయగా మధ్య మాంసము ల లోని విందుకు శివుడు అంగీకరించలేదు. రాజకుమార్తె ఎంతగానో నచ్చ జెప్పింది. అయినా వినబడనట్టు అలిగి పోసాగాడుశివుడు.అప్పుడు ఆమె మల్లయ్యా!..... ఓ చెవిటి మల్లయ్యా! నిలబడు"అని గట్టిగా అరిచింది. అయినా ఆ పరమేశ్వరుడు లెక్క చేయలేదు. అప్పుడు రాజకుమార్తె" లింగ రూపియైన నిన్ను వివాహం ఆడలాని అనుకోవడం నాదే తప్పు. అక్కడే లింగముగా మారిపో"అని శపించింది. వ్రుద్ధుడైన శివుడు అక్కడే అదే రూపములో లింగముగా మారిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన పార్వతీదేవి రాజకుమార్తె ను చూసి "ఓసీ భ్రమరమును వెంబడించిన నీవు తుమ్మెదగా మారిపోదువుగాక"అని శపించింది. శివుడి భార్య అయిన భ్రమరి(తుమ్మెద) భ్రమరాంబ గా నిలిచిపోయింది. ఇప్పటికీ వ్రుద్ధ మల్లికార్జున స్వామి ని చెవిటి మల్లయ్య, వ్రుద్ధ మల్లయ్య అని భక్తులు పిలుస్తారు. మీరు శ్రీశైలం వెళ్లినప్పుడు తప్పకుండా గుడిలో ఉంటుంది. ఈ వ్రుద్ధ మల్లయ్య లింగము. ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍁🍀🍁🍀🍁🍀🍁🍀🍁

శ్రీశైలం మహిమ :- 12

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁శ్రీశైలం మహిమ :- 12 జ్యోతి ర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి కి 18 శక్తి పీఠం లలో ఒకరైన శ్రీభ్రమరాంబాదేవికి, నిలయమైన ఈ మహాక్షేత్రం వేదములు కు అలవాలమై సకల సంపదలకు పుట్టినిల్లైఎనిమిది శ్రుంగాలతో 44 నదులతో 60 కోట్ల తీర్ధరాజాలతో పరాశర, భరద్వాజాది మహార్షులతో తపోవనాదులతో, చంద్రగుండ, సూర్యగుండ, మొదలైన పుష్కరిణులతో స్పర్శవేదులైన లతలు, చెట్లు మరియు లింగాలతో అనంతమైన ఓషధులతో విరాజిల్లుతున్నది.

శ్రీశైల దర్శనం పలితం :-కురు క్చేత్రమునందు లక్షల కొలది దానము ఇచ్చిన రెండువేల సార్లు గంగా స్నానం చేసినా నర్మదా నదీతీరం నందు బహుకాలం తపస్సు ఆచరించినా కాశీ క్షేత్రం లో లక్షల సంవత్సరాలు నివసించినా ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి మహా పుణ్యం శ్రీశైలమల్లికార్జునుని దర్శించినంతనే కలుగుతుంది అని స్కాందపురాణము చెబుతోంది.

          ఇక శిఖరం దర్శన మాత్రాన, అనంతమైనటువంటి పుణ్యాన్ని సంతరించిపెట్టే పునర్జన్మ నుండి ముక్తి ని కలిగించే ఈ క్చేత్రమును ఆయా మాసాల్లో సందర్శించేవారు వాజపేయ, అతిరాత్ర మొదలైన మహాయఙ్ఞాలు ఆచరించినందువలన కలిగిన ఫలాన్ని కన్యాదానం గోదానం మొదలైన మహాదానాలు చేసినందువలన కలిగే ఫలాన్ని అనాయాసంగా పొందుతారని శివుడు పార్వతీదేవి కి స్వయంగా చెప్పినట్లు స్కాందపురాణము చెబుతున్నది.

         యుగయుగాలుగా ప్రసిద్ధి చెందిన ఈ శైవక్చేత్రాన్ని క్రుతయుగంలో హిరణ్యకశిపుడు కి పూజా మందిరం కాగా, అహోబిలక్చేత్రం సభామండపం అనీ, త్రేతాయుగం లో శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం సమయంలో సతీసమేతుడై శ్రీశైల నాధుని సేవించి సహస్ర లింగాన్ని ప్రతిష్ఠించాడని, పాండవులు తమ వనవాసం సమయంలో ద్రౌపది సమేతంగా ఈ క్చేత్రము లో కొంతకాలం ఉండి లింగాలను ప్రతిష్ఠించారని చెప్పబడుచున్నది. అందుకు నిదర్శనం గా నేటికీ ఈ క్చేత్రము లో రామప్రతిష్ఠిత సహస్ర లింగము, సీతాప్రతిష్ఠిత సహస్ర లింగం, పాండవులచే ప్రతిష్ఠించబడిన 'సద్యోజాత' మొదలైన ఐదు లింగాలు భక్తుల సేవలు అందుకుంటున్నాయి.

      క్చేత్రము ప్రాముఖ్యత :-

       సకల లోకారాధ్యమైన శ్రీశైల మహాక్షేత్రం భూమండలం నకు నాభిస్ధానమని పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఏ ప్రాంతములో ఏ పూజ చేసినా ఏ వ్రతము చేసినా మనము సంకల్పం లో శ్రీశైలాన్ని స్మరిస్తూ శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, ఉత్తరదిగ్భాగే అని, తాము శ్రీశైల క్చేత్రమునకు ఏ దిక్కున ఉండి పూజ చేస్తున్నారో వివరంగా సంకల్పం చెబుతాము.

         అక్చయ వరాలను ఇచ్చే దక్చాధ్వరహరుడు తనను చూడటానికి వచ్చే లక్షలాది మంది భక్తులు కు మోక్షం ను ప్రసాదిస్తూ కొలువుతీరి ఉన్న ఈ దక్షిణ కైలాసం ప్రతీ భక్తుని మనస్సు ను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఉత్సవసమయాల్లో తప్ప సాధారణ రోజుల్లో కుల మత లింగ వయో వివక్షత లేకుండా స్వామిని తాకి, తల ఆనించి తమ కష్టాలను చెప్పుకునే అవకాశం ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు అది కనపడలేదు.

        బ్రహ్మ గిరి, విష్ణు గిరి, రుద్ర గిరి, అనే మూడు పర్వతాలకు, పాదాభివందనాలు చేస్తూ తన మువ్వలసవ్వడులతో వేదఘోషలను గుర్తుకు తెచ్చే పావన క్రుష్ణవేణీనది, పాతాళగంగ అనేపేరు తో ఉత్తర వాహిని గా ప్రవహిస్తోంది మరియు ఈ క్చేత్రమునకు మరింత శోభను పవిత్రతను సంతరించి పెడుతోంది.

         ఇక 18 పురాణాలలోనే కాకుండా భారతరామాయణాల లోనూ సంస్క్రుతాంద్ర తమిళ కన్నడ మరాఠి గ్రంధాలెన్నింటిలోనో ప్రస్తావించబడిన ఈ క్చేత్రము గురించి స్కాందపురాణము లో "శ్రీశైలఖంఢం" పూర్తిగా వివరిస్తోంది.

     ఇంకా చెప్పాలంటే ఈ క్చేత్రము ప్రశాంతతకు ముగ్ధులైన శ్రీ శంకరభగవత్పాదులు కొంతకాలంగా ఇక్కడ తపస్సు చేసి "శివానందలహరి" అనే గ్రంథం ను వ్రాసినట్లు చెప్పబడుతోంది. హర హర మహాదేవ శంభో శంకర.. ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

నక్షత్రము - నాటాల్సిన వృక్షం

 నక్షత్రము - నాటాల్సిన వృక్షం


వ్యక్తి జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్నే జన్మ నక్షత్రముగా జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే శాస్త్రమే జ్యోతిష్యం. ఈ శాస్త్రంలో జీవితంలో సంభవించే సమస్యలు ఎలా వస్తాయో, వాటికి ఏ గ్రహాలకుకు శాంతులు చేయాలో ఈ శాస్త్రములో పరిహారాలు సూచించబడతాయి. దానికనుగుణంగా మనం నక్షత్ర శాంతులు, గ్రహ శాంతులు జరిపించుకోవాల్సి ఉంటుంది.


జ్యోతిష్య శాస్త్రములోని 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు, అధిదేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు కూడా  ఉన్నాయి. చాలామందికి నక్షత్రాలకి వృక్షాలు ఉంటాయన్న సంగతి తెలియదు. అయితే నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచటం ద్వారా దోషాలేమన్నా ఉంటే తొలగటమే గాక, సర్వ సౌఖ్యాలను పొందవచ్చు. ఈ సూత్రాన్ని ఆచరించడం శుభం. మీరు జన్మించిన నక్షత్రానికి దగ్గర సంబంధం గల వృక్షాన్ని పెంచితే అది పెరిగి పెద్దయ్యే కొద్దీ శుభాలను కలుగుతాయి.


నాటవలసిన మొక్కనుగాని లేక, విత్తనాన్ని గాని మీకు ఎక్కడ వీలైతే అక్కడ, రోడ్లపక్కన, పార్కు, కొండ, అడవి, దేవాలయాలలో ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నాటవచ్చు. అయితే అది పెరిగేలా శ్రద్ద చూపించాలి. మీ నక్షత్రము చూసుకుని ప్రతి నెల ఒక్కసారయినా ఆ వృక్షాన్ని దర్శించి నమస్కరించడం శుభం. మీ గ్రామంలో లేదా నివాస సమీపంలో ఎక్కడ ఆ వృక్షం కనిపించినా నమస్కరించండి. ఎలాంటి పరిస్థితిలోనూ ఆ వృక్షాన్ని దూషించటంగాని, నరకటం గాని చేయకూడదు. పసి పిల్లలచేత కూడా ఇలా జన్మనక్షత్రానికి అనుగుణంగా వృక్షాన్ని నాటించి చూడండి వారి జీవితంలోనూ శుభాలే కలుగుతాయి.

 

జన్మనక్షత్రాన్ని అనుసరంచి పెంచాల్సిన వృక్షాలు - ఫలితాలు

 

అశ్వని నక్షత్రము

అశ్వని నక్షత్ర జాతకులు విషముష్టి లేదా జీడి మామిడిని పెంచాలి, పూజించడం మంచిది. దీని వలన జననేంద్రియాల, చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కూడా కలుగుతుంది. 

 

భరణి నక్షత్రము

భరణి నక్షత్ర జాతకులు ఉసిరి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత, పైత్యం, పైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటి ఎక్కువగా ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది 

 

కృత్తిక నక్షత్రము

కృత్తిక నక్షత్రము అత్తి / మేడి చెట్టును పెంచాలి, పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షింపబడతారు. అలాగే  సంపూర్ణ ఆరోగ్యము కూడా చేకూరుతుంది.  అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి.

 

రోహిణి నక్షత్రము

రోహిణి నక్షత్ర జాతకులు నేరేడు చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల చక్కెర వ్యాధి, నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం, సత్ప్రవర్తన వంటి లక్షనాలు కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబందించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.

 

మృగశిర నక్షత్రము

మృగశిర నక్షత్ర జాతకులు మారేడు, చండ్ర చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్, అజీర్త.. వంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.

 

ఆరుద్ర నక్షత్రము

ఆరుద్ర నక్షత్ర జాతకులు చింత చెట్టుని పెంచాలి. పూజించాలి. దీంతో గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. అంతే కాకుండా విష జంతువుల నుంచి సమస్యలు ఎదురుకావు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది.

 

పునర్వసు నక్షత్రము

పునర్వసు నక్షత్ర జాతకులు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచాలి, పూజించాలి. దీంతో ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుంచి, రొమ్ము క్యాన్సర్  నుంచి బయటపడతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదని చెప్పవచ్చు.  జఠిల సమస్యలు వచ్చినా , చాకచక్యంతో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది.

 

పుష్యమి నక్షత్రము

పుష్యమి నక్షత్ర జాతకులు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల  నరాల సంబంధిత బాధలు నుంచి బయటపడతారు. శత్రువుల బారి నుంచి కూడా బయటపడతారు. రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. స్త్రీలు సంతానవతులవుతారు. 

 

ఆశ్లేష నక్షత్రము

ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచాలి, పూజించాలి. దీనివలన శ్వేత కుష్ఠు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. విపత్కార పరిస్థితుల్లో చాకచక్యంతో బయట పడటానికి కూడా ఉపయోగపడుతుంది.

 

మఖ నక్షత్రము

మఖ నక్షత్ర జాతకులు మర్రి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి, అనుకోని వ్యాధుల నుంచి బయటపడతారు. అలాగే భార్యభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి, తల్లిదండ్రులకు, సంతానానికి కూడా మేలు కలుగుతుంది. జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి

 

పుబ్బ నక్షత్రము

పుబ్బ నక్షత్ర జాతకులు మోదుగ చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివలన సంతానలేమి సమస్య తీరుతుందని శాస్త్రం చెబుతోంది. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడడానికి ఎటువంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

 

ఉత్తర నక్షత్రము

ఉత్తర నక్షత్ర జాతకులు జువ్వి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలను చేతనైనంతగా అందించడానికి. మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది

 

హస్త నక్షత్రము

హస్త నక్షత్ర జాతకులు సన్నజాజి, కుంకుడు చెట్లను పెంచాలి, పూజించాలి. దీని వలన ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి, దైవభక్తి కలగడానికి  ఉపయోగపడుతుంది.

 

చిత్త నక్షత్రము

చిత్త నక్షత్ర జాతకులు మారేడు లేదా  తాళ చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వలన పేగులు, అల్సర్, జననాంగ సమస్యల నుంచి బయటపడతారు. ఎవరిని నొప్పించకుండా తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన చాకచక్యం కలగడానికి ఉపయోగపడుతుంది.

 

స్వాతి నక్షత్రము

స్వాతి నక్షత్ర జాతకులు మద్ది చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దూరంగానే వుంటాయి. రకరకాల విద్యలలోను రాణిస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది.  భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి  ఉపయోగపడుతుంది.

 

విశాఖ నక్షత్రము

విశాఖ నక్షత్ర జాతకులు వెలగ, మొగలి చెట్లను పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.

 

అనురాధ నక్షత్రము

అనురాధ నక్షత్ర జాతకులు పొగడ చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి ఉపయోగపడుతుంది.

 

జ్యేష్ఠ నక్షత్రము

జ్యేష్ఠ నక్షత్ర జాతకులు విష్టి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల బాధ తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయడానికి ఉపయోగపడుతుంది.

 

మూల నక్షత్రము

మూల నక్షత్ర జాతకులు వేగి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల పళ్ళకి సంబంధించిన, మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి.  అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది.

 

పూర్వాషాడ నక్షత్రము

పూర్వాషాడ నక్షత్ర జాతకులు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచాలి, పూజించాలి. దీనివల్ల కీళ్ళు, సెగ గడ్డలు, వాతపు నొప్పులు, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

 

ఉత్తరాషాడ నక్షత్రము

ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు పనస చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడవు. ఆర్దికపరమైన సమస్యలు తలెత్తవు. భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అభివృద్దిలోకి రావడానికి ఉపయోగపడుతుంది.

 

శ్రవణం నక్షత్రము

శ్రవణ నక్షత్ర జాతకులు జిల్లేడు చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి. న్యాయం, ధర్మం పాటించేడానికి. కార్యజయం సిద్దించడానికి ఉపయోగపడుతుంది.

 

ధనిష్ఠ నక్షత్రము

ధనిష్ఠ నక్షత్ర జాతకులు జమ్మి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల మెదడుకి సంబంధించిన సమస్యలు ఏర్పడవు. అలాగే వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.

 

శతభిషం నక్షత్రము

శతభిషం నక్షత్ర జాతకులు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల శరీర పెరుగుదలకి సంబంధించిన, మోకాళ్ళ సమస్యల నుంచి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం, చక్కటి ఉద్యోగం కొరకు, జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.

 

పూర్వాభాద్ర నక్షత్రము

పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మామిడి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు తలెత్తవు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి. కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాలలో తిరిగే అవకాశం కొరకు, ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించడానికి  ఉపయోగపడుతుంది.

 

ఉత్తరాభాద్ర నక్షత్రము

ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వేప చెట్టుని పెంచాలి. పూజించాలి. దీనివల్ల శ్వాస కోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే  విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది.

 

రేవతి నక్షత్రము

రేవతి నక్షత్ర జాతకులు విప్ప చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ , గౌరవం అప్యాయతలు వృద్ది చెందడానికి,  జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది.....

మొగలిచెర్ల

 *శిష్యుడికి బోధ..*


"మీరొకమారు స్వామివారి సహాధ్యాయి అని ఒక సాధువు గురించి వ్రాసారు..మొగిలిచెర్ల గ్రామ సరిహద్దులో ఉన్న ఫకీరు బీడు..లేదా ఫకీరు మాన్యం అనే పేరుతో పిలువబడుతూ..ఉన్న పొలంలో ఒక అవధూత ఆశ్రమం నిర్మించుకొని..తీవ్రమైన తపస్సు చేసి..కఠోర నియమాలు పాటించి..తనకుతానే హఠయోగం పట్టి..కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన దిగంబర అవధూత దత్తాత్రేయుడి తోపాటు కొంతకాలం ఏర్పేడు వ్యాసాశ్రమం లో సాధన చేసాను..అని మా గురువుగారు నాతో చెప్పేవారు..ఆయన ఇక్కడికి ఒకసారి వచ్చి వెళ్లారని కూడా చెప్పారు..అదే విషయాన్ని మీరు కూడా వ్రాసారు..మీరు చెప్పిన సాధువు గారి వద్ద శిష్యరికం చేస్తూ ఉండేవాడిని..వారు హృషీకేశ్ లో వున్నప్పుడు కూడా నేను కొంతకాలం వారివద్ద శిష్యరికం చేసాను..ప్రస్తుతం నేను మా ఊరిలో ఉంటున్నాను..సంవత్సరం లో రెండు మూడు సార్లు మా గురువు గారి వద్దకు వెళ్లివచ్చేవాడిని..గత ఆరునెలలుగా వారి వద్దకు వెళ్ళలేదు..వారెక్కడ ఉన్నారో కూడా నాకు సమాచారం తెలియలేదు..మా గురువుగారి తో పాటు సాధన చేసి సిద్ధిపొందిన ఈ స్వామివారిని చూడలేకపోయాను..కనీసం వారి సమాధిని దర్శించుకొని వెళదామని వచ్చాను.." అని కాషాయ వస్త్రాలు ధరించిన ఆ వ్యక్తి నాతో చెప్పాడు..అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చారు..


"ముందుగా మీరు కాళ్ళూ చేతులూ శుభ్రం గా కడుక్కొని రండి..స్వామివారి సమాధి దర్శించుకొని వచ్చిన తరువాత మనం మాట్లాడుకుందాము.." అని చెప్పాను.."అలాగే నండీ.." అని ముగ్గురూ బైటకు వెళ్లి..స్నానాలు చేసి వచ్చారు..శిష్యరికం చేసాను అని చెపుతున్న అతనితో పాటు మిగిలిన ఇద్దరు కూడా స్వామివారి సమాధి వద్దకు వెళ్లారు..సమాధికి నమస్కారం చేసుకొని..ఇవతలికి వచ్చి ఉత్సవ మూర్తి వద్ద హారతి తీసుకొని..మళ్లీ నావద్దకు వచ్చారు..


"ఇప్పుడు చెప్పండి..మీరు శిష్యరికం చేశానన్నారు కదా..మీరు కూడా సాధన చేసేవారా..?" అని అడిగాను..


"మా గురువుగారు కొంత బోధ చేసారండీ..కానీ నాకు సాధన మీద పట్టు దొరకలేదండీ..ఆయన వద్ద వున్నంతకాలం నాకేదో ఒకటి చెప్పేవారు..అలా చెప్పే క్రమం లోనే..ఈ స్వామివారి గురించి కూడా చాలాసార్లు చెప్పారు..సాధన చేస్తే..అలా మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన దత్తాత్రేయ స్వామిలాగా కఠోర సాధన చేయాలి..అప్పుడే మోక్షప్రాప్తి కలుగుతుంది..సగం లౌకికం..సగం సాధన అనుకుంటే..ఎటూ కాకుండా పోతావు..ఒక్కసారన్నా మొగిలిచెర్ల వెళ్లి ఆ స్వామివారి సమాధిని దర్శించు..నీకు జ్ఞానం వస్తుంది..పో..పోయి..ఆ స్వామిని శరణు వేడుకో..ఇంతదూరం నా వద్దకు వచ్చి నువ్వు సాధించేది ఏమీ లేదు." అని పదే పదే చెప్పారు..నేను అంతగా ఆలకించలేదు..ఈమధ్య నాకు రాత్రివేళ "నువ్వు మొగిలిచెర్ల వెళ్ళావా..?" అని మా గురువుగారు తీవ్ర స్వరంతో అడుగుతున్నట్టు ఆలాపనగా అనిపించింది..ఒకసారి కాదు..రెండుమూడు సార్లు అలానే అనిపించింది..ఇక వుండబట్టలేక ఈరోజు వచ్చాను..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి అక్కడ నిలుచున్నప్పుడే నా ఒళ్ళంతా ఒక విధమైన జలదరింపు కలిగింది..ఆ ప్రకంపనలు తట్టుకోలేకపోయాను..స్వామివారి పాదుకలు ముట్టుకొని..వాటికి నా శిరస్సు ఆనించి కళ్ళుమూసుకున్న తరువాతే నా ఒళ్ళు నా స్వాధీనం లోకి వచ్చింది..మా గురువుగారు నన్ను ఎందుకు ఇక్కడికి వెళ్ళమన్నారో అర్ధం అయింది..ఈ స్వామివారు సిద్ధిపొంది సుమారు నలభై ఏళ్ళు పైబడే అయింది..కానీ ఆయన తపశ్శక్తి ఇక్కడ ఉన్నది..స్వామీ యేదారీ తెలియక అటు సంసారం లోనూ..ఇటు సన్యాసం లోనూ ఇమడలేకుండా వున్నాను..నువ్వే దారి చూపించు అని మొక్కుకున్నాను..నా ప్రశ్నకు సమాధానం దొరికింది..స్వామివారి ఆదేశం అనిపించింది..మా గురువుగారు కూడా ఈ స్వామినే శరణు వేడుకో అన్నారు..మా గురువుగారి జాడ తెలిసిన తరువాత వారిని కలిసి..ఈరోజు నేనుపొందిన అనుభూతి వారికి చెప్పుకుంటాను..ఇన్నాళ్లకు ఒక సాధకుడి సమాధి వద్ద నాకు మార్గ నిర్దేశనం జరిగింది.." అంటూ కళ్ళ నీళ్లతో చెప్పాడు..


స్వామివారి తపశ్శక్తి గురించి చాలామంది తాము పొందిన అనుభూతులను నాతో చెప్పుకుంటూ వుంటారు..ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా స్వామివారు తమ అనుగ్రహాన్ని చూపుతారు..అది వారి వారి మనో పరిపక్వత మీద ఆధారపడి ఉంటుందని అనుకుంటూ ఉంటాను..అది నా భావన..కానీ స్వామివారు తనను శరణు వేడిన వారికి ఏ రకంగా తన కృప చూపుతారో అది వారికే తెలియాలి..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

అమ్మతో మాట*

 🕉️🕉️🕉️                  *🍀అమ్మతో మాట* 



ఏంటమ్మా ఇది.. ఎప్పుడూ ఆ ఆదిశంకరుడు, కాళిదాసు, మూకశంకరులేనా! 

కొంచెం మావైపు కూడా చూడొచ్చు కదా! 

 “ఏమిట్రా నీ గోల! నేను మీవైపు చూడకుండానే మీరంతా పెద్దాళ్ళైపోతున్నార్రా!” అని ఉరమకు. 

చూడటం అంటే అలా ఇలా చూడమని కాదు. 

పామరుడిని మహాకవిని చేయడానికీ, మూగవాడితో అయిదొందల పద్యాలు చెప్పించడానికీ, నువ్వొక చూపు చూశావే! అదీ, ఆ చూపూ చూడాలి. అమ్మా! అవడానికి అక్షరాలను పుట్టించింది మీ ఆయనే అయినా, నీ చూపు పడకపోతే అవి కదలనే కదలవేంటమ్మా! 


ఆమాట కొస్తే, సర్వేశ్వరుడైన నీ మగడే, నీ అనుమతి లేనిదే ఏ పనీ చేయడు. 

అప్పట్లో హాలాహలం పుట్టి లోకాలను దహించి వేస్తుంటే.. 

పాపం ఆ దేవతలంతా మీ ఇంటిముందు బారులు తీరి.. “కుయ్యో! మొర్రో! విను; మాలింపుము; చిత్తగింపుము; దయన్ వీక్షింపు” అని ఏడుపులు, పెడబొబ్బలూ పెడుతుంటే.., 

అప్పుడు కూడా అంతటి ఆ భోళాశంకరుడూ, వెళ్ళిరానా?  అన్నట్టు నీవైపు చూశాడు. 

“పాపం మీ అన్నయ్య ఒక్కడే అక్కడ కష్టపడుతున్నాడు. నేను వెళ్ళి ఈ హాలాహలం సంగతేదో చూస్తే, అతను పొంగిపోతాడు” అంటూ నీ పుట్టింటి వారి మాటలు చెప్పి మరీ, నిన్ను ఒప్పించి బయల్దేరాల్సి వచ్చింది. మరి నువ్వు భర్తను కొంగున ముడేసుకున్న *“స్వాధీనవల్లభ”* వు కదా! 


పుట్టింటివాళ్ళ పేరు చెబితే పొంగిపోతావన్న మాట నిజమే కానీ, వాళ్ళైనా మీ ఆయన గురించి, ఒక చిన్నమాట తప్పుగా అన్నా, కళ్ళెర్ర జేస్తావు. అసలే నువ్వు *సదాశివ పతివ్రతవు*

*కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరవు.* 


మీ నాన్న దక్షుడు నీ మగని కోసం నానా మాటలు అంటే, ఆ తరువాత ఏం జరిగిందో మాకు తెలియనిదా! 

మీ  ఆయనకు కూడా నీవంటే ఎంత ప్రేమో కదా! నువ్వు నవ్వితే ఉబ్బితబ్బిబ్బైపోతాడు ఆ కామారి. 

మరి *“మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా”* అని ఊరికే అన్నారా ఆ వసిన్యాది దేవతలు. 


నీ నవ్వులో ఉన్న మధురిమ ముందు ఆ చదువుల తల్లి వీణానాదమే వెలవెల బోయిందటగా. *“నిజసల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్ఛపీ”* అని వాళ్ళువీళ్ళూ చెప్పుకుంటుంటే ఈ విషయం తెలిసింది.

 

*మా ఆది శంకరులు* కూడా *సౌందర్య లహరిలో *“విపంచ్యా గాయంతీ వివిధమపదానం పశుపతేః.. ”* అంటూ మొదలయ్యే ఓ శ్లోకంలో ఈ విషయాన్నే చెప్పారు. 

*సరస్వతీ దేవి నీ దగ్గర కూర్చొని, మీ ఆయన లీలలను తన వీణ కచ్ఛపిపై గానం చేస్తోందట. నువ్వేమో పొంగిపోయి, “భలే పాడుతున్నావ్!” అన్నావట. అసలు నీ మాటలలో ఉన్న మాధుర్యం ముందు నా వీణానాదం మరీ తీసికట్టుగా ఉందనుకుంటూ*, ఆవిడా గభాలున ఆ వీణను మూటకట్టేసిందట. 


ఇక్కడ ఇంకొక విషయం.. మీ ఆయనన్నా, మీ ఆయనను కీర్తించేవారన్నా నీకు ఎంతిష్టమో కదా! 

 *“ఓ మహా కామేశ మహిషీ”* అని పిలిస్తే చాలు పొంగిపోతావ్. అవున్లే అసలు ఉన్నదంటూ మీ ఇద్దరే కదా! 

ఈ సృష్టి మొత్తం లయం చేసేసి, నీ మగడు ఆనంద తాడవం చేస్తుంటే.. అసలు పోలికే లేనంత అందమైన చుబుకం గల *“అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా”* వైన నువ్వు, నీ పల్లవముల వంటి అందమైన చేతులను అలా ఆ చుబుకం కింద పెట్టుకుని, ఆ తాండవాన్ని చూసి పరవశించిపోతూ.. *“మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి”గా* ఉన్నావు. 


నువ్వసలే *“లాస్యప్రియ”వు* కూడానాయే. 

   ఎంతటి *“మహాలావణ్య శేవధి”వి*. *“ఆబ్రహ్మకీటజనని”వి* అయినా, 

నీకు మీ ఆయన తొడమీద కూర్చుని, *“శివకామేశ్వరాంకస్థా”* అని అనిపించుకోవడమే ఇష్టం.  

 అందుకే మా కాళిదాసు 

*"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే*

*జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ”* అంటూ మీ ఇద్దరి అభేదాన్ని చూపిస్తూ, నమస్కరించుకున్నాడు. 

అసలు *మా కాళిదాసు నీపై వ్రాసిన *“దేవీ అశ్వధాటి”* స్తోత్రం చదివితే తెలుస్తుందమ్మా! మా కవుల కవిత్వంలోని సొగసు. 

సంగీతం ఏమాత్రం రానివాడికి కూడా తనకు సంగీతం వచ్చేసునేమో అన్న భ్రమకలిగించేంత అందంగా ఉంటుందా శ్లోకాల నడక.


*చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ* 

*కోటీర చారుతర కోటీ మణీ కిరణ కోటీ కరంబిత పదా* 

*పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిప సుతా ఘోటీఖురా దధికధాటీ ముదార ముఖ వీటీరసేన తనుతామ్* 


ఆహా! మొదటి శ్లోకమే ఎంత అందంగా ఉందో చూశావా? 

*ఇలాంటివి 13 శ్లోకాలున్నాయి* ఆ స్తోత్రంలో. ఈ శ్లోకాలలో కూడా ఒకచోట నీకు మీ ఆయన మీద ఉన్న ప్రేమను రసవత్తరంగా చెప్పాడు కాళిదాసు. 

*“శంభా వుదార పరిరంభాంకుర త్పులక దంభానురాగ పిశునా..”* అంటాడు. 

మీ ఆయన నిన్ను గాఢంగా ఆలిగనం చేసుకున్నప్పుడు నీకు కలిగే పులకరింతలు నీకా పరమేశ్వరునిపై ఉన్న అపారమైన అనురాగానికి సూచికలట. 

మీ ఆయన కోసమే చెప్పుకుంటూ కూర్చుంటే నీకూ, నాకూ ఇద్దరికీ ఇక ఈ లోకం పట్టదు. 

కనుక కాసేపు వేరే విషయాలు కూడా మాట్లాడుకుందాం.


అమ్మా! అసలు మీ *అన్న దశావతారాలను* అలా నీ చేతివేళ్ళ గోళ్ళలో నుండి అలా ఎలా పుట్టించేశావమ్మా! చిత్రం కాకపోతేను. 

*“కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః”* అన్న మాట తలచుకుంటేనే భలేగా ఉంటుంది. ఇక్కడే ఇంకొక్క విషయం చెప్పాలి. మళ్ళీ మరచిపోతానేమో! *“సాగరమేఖలా”* అనే నీ పేరు కూడా నాకెంత ఇష్టమో!  

*సముద్రాన్నే వడ్డాణంగా* పెట్టుకున్న దానివంటకదా! ఎంత బావుంటుందో తెలుసా ఈ మాట. 


ఈ నీ నామాన్నే 

*మా ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు* 

*“తేనెలతేటల మాటలతో, మన దేశ మాతనే కొలిచెదమా..”* అనే ఓ చక్కని గీతంలో అందంగా వాడారు. 

*“సాగర మేఖల చుట్టుకొని -  సురగంగ చీరగా మలచుకొని”* అంటూ నీ నామాన్ని దేశమాతకు అన్వయిస్తూ వ్రాశారు. 

అసలు మా సినీ కవులు కూడా నీమీద పాట రాయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెలరేగిపోతారు. 


ముందుగా మాత్రం నేను *మా మల్లాది రామకృష్ణశాస్త్రి* గారినే చెబుతాను. 

*“లలిత భావ నిలయ నవ రసానంద హృదయ*

*విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ*

*మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ*

*సుమరదన విధువదన.. దేవి…”* అంటూ ఆయన వ్రాస్తే, 

ఆ సాహిత్యానికి మా ఘంటశాల వేంకటేశ్వర్రావు గారు బాణీ కట్టారు. 

మల్లాది వారి సూచన మేరకు, ఈ పాటలో 

*సరస్వతీ దేవి కోసం వచ్చినప్పుడు సరస్వతి రాగంలో*, 

*శ్రీదేవి కోసం వచ్చినప్పుడు శ్రీరాగంలో, లలితాదేవి కోసం వచ్చినప్పుడు లలితరాగంలో స్వరరచన చేశారు *మా ఘంటశాల*. ఇలాంటి పాట వింటూ నాలాంటి పామరుడే పులకించిపోతుంటే.. 

   *“కావ్యాలాప వినోదిని”వి,* 

  *“రసజ్ఞ”వు.* *“కావ్యకాళా”* రూపిణివి అయిన నీవెంత మురిసిపోతుంటావో కదా! 

ఆయనే వ్రాసిన *“శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా”* పాట కూడా మరో మేలిమి ముత్యం! 

   *“జగముల చిరునగవుల పరిపాలించే జననీ*

    *అనయము మము కనికరమున కాపాడే జననీ”* అంటూ.. 

*“అనేకకోటిబ్రహ్మాండజనని”* వైన నిన్ను కీర్తిస్తూ.. 

*“మనసే నీ వశమై స్మరణే జీవనమై*

*మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి”* అంటూ మా అందరి తరపునా ఆయనే ప్రార్థించేశారు.


ఇక *సముద్రాలగారి* *“జననీ శివకామినీ..”*, *పింగళిగారి *“శివశంకరీ..”* పాటలు కూడా మమ్మల్ని ఆనందడోలికల్లో మునకలేయించేవే.


మా *వేటూరి* గారి సంగతైతే చెప్పనక్కరనే లేదు. 

*“అఖిలాండేశ్వరి చాముండేశ్వరి*

 *పాలయమాం గౌరీ*  *పరిపాలయమాం గౌరీ”* అంటూ మొదలయ్యే ఆ పాట, కాళిదాసు కవిత్వంలా సొగసుగా పరుగులు తీస్తుంది.

*“శుభగాత్రి గిరిరాజపుత్రి*  

 *అభినేత్రి శర్వార్ధ గాత్రి* 

 *సర్వార్థ సంధాత్రి* 

 *జగదేక జనయిత్రి”* ఇలా అద్భుతంతా సాగిపోతుందా పాట. 

మీ ఆయన అయిన శర్వునిలో నీవు సగభాగం కాబట్టి *శర్వార్ధ గాత్రి* అన్నారు. గాత్రము అంటే శరీరం అనే అర్థం ఉంది కదా!  అలానే *సర్వ కార్యసిద్ధిని ఇచ్చుదానవు కనుక *సర్వార్థ సంధాత్రి* అన్నారు. 


అసలు *శర్వార్థ, సర్వార్థ అనే పదాలు వినడానికి కొంచెం ఒకేలా ఉన్నా, ఎంతటి భేదం ఉందో కదా వాటి మధ్య*. అదీ మరి మా వేటూరంటే! 

అదీ నీ కరుణ ప్రసరించిన వారి కవిత్వమంటే. ఈరోజు  నీతో ఇలా ఏవోవో చెప్పేస్తున్నాను.

 

అప్పట్లో శివరాత్రికి మీ ఆయనకోసం, శ్రీరామనవమికి మీ అన్నయ్యకోసం రెండుత్తరాలు వ్రాశాను. 

వాళ్ళకు వ్రాసి, మీ అందరికీ తల్లినైన నాకు మాత్రం వ్రాయవా అంటావమోనని ఈ మాటలన్నీ అరచి మరీ చెబుతున్నాను. వింటున్నావు కదా! 

ఇక్కడ వంటింట్లో పని చేసుకుంటున్న మా అమ్మకు ఏదో ఒకటి చెబుతూ, మధ్య మధ్యలో “ఇదిగో అమ్మా, వింటున్నావా? ఓ అమ్మా!!” అని అరుస్తుంటాను. 

మా అమ్మేమో, ఊ! చెప్పరా” అంటుంది తన పని తాను చేసుకుంటూనే. కాకపోతే ఆవిడకు ఇక్కడ ఒకింటి పనే కాబట్టి ఇబ్బంది లేదు. 


కానీ నీ సంగతి అలా కాదు కదా! 

అనంతకోటి బ్రహ్మాండాలన్నింటినీ పరిపాలించే తల్లివి. 

లోకాలన్నీ తన బొజ్జలో దాచుకున్న ఆ పరమశివుని భార్యవు. *“సదా శివ కుటుంబిని”వి.* 

అందుకే, కోట్లాదిమంది పిలుపులలో నా పిలుపెక్కడ వినబడదో అన్న భయం చేత, ఇంకాస్త గట్టిగా అరచి చెబుతున్నాను.  *ఇదిగో అమ్మా! ఇటూ.. ఈవైపు.. నావైపు చూడు! నేనూ..* 

          *స్వస్తి!*


చాలా బాగుంది కదా! 

*సద్గురు దేవదత్త*

🕉️🍁🍀🍁🍀🕉️

మొగలిచెర్ల

 *సాయి..స్వామి..*


"మేము శ్రీ సాయిబాబా భక్తులమండీ..తరచూ శిరిడీ వెళ్లి, ఆ సాయినాథుణ్ణి దర్శించుకొని వస్తూ వుంటామండీ..రెండు మూడు సార్లు గాణుగాపురం, పిఠాపురం కూడా వెళ్ళొచ్చాము..ఎందుకనో తెలీదండీ గత సంవత్సరకాలంగా ఏ క్షేత్రానికి వెళ్లినా..అక్కడ దైవం మీద మనసు లగ్నం కావడం లేదు..ఏదో అశాంతి..మా ఇద్దరికీ ఆర్ధికంగా ఇబ్బందులేవీ లేవు..మా ఇద్దరికీ వచ్చే పెన్షన్ తోటి మాకు హాయిగా జరిగిపోతున్నది..ఒకరికి పెట్టగలిగే స్థితిలోనే ఉన్నాము..పిల్లలు కూడా స్థిరపడ్డారు..అమ్మాయి అల్లుడు కెనడాలో వుంటారు..కొడుకూ కోడలు అమెరికా లో వున్నారు..ఇక్కడ ఒక అవధూత సిద్ధిపొందారు అని తెలుసుకున్నాము..ఆ తరువాత ఈ స్వామివారి చరిత్ర చదివాము..దత్తక్షేత్రం దర్శించుకోవాలి అని అనిపించింది..బయలుదేరి వచ్చాము..గురువారం నాడు గురుదర్శనం చేసుకుంటే మంచిదనే అభిప్రాయం తో ఈరోజు ఇక్కడికి వచ్చాము..తీరా ఇక్కడికి వచ్చాక తెలిసింది ఈ క్షేత్రం లో పల్లకీసేవ శనివారం విశేషంగా జరుగుతుందని..రేపుదయాన్నే తిరిగి వెళ్లాలనే సంకల్పంతో వచ్చాము..పల్లకీసేవ లో పాల్గొనలేకపోతున్నామే అనే అసంతృప్తి ఉన్నది..చెప్పాను కదా..ఏదో ఒక కొరవ..ఏదో ఒక అశాంతి.." అన్నారా దంపతులు..


ఆ దంపతుల జీవనానికి ఏ కొరవా లేదు..కానీ వాళ్లకు మనోశాంతి లేదు..ఇంకా ఏదో ఉన్నది..అది మనకు అందలేదే అనే ఒక బాధ తప్ప..నా వరకూ వాళ్ళ మాటలు విన్నప్పుడు.."అన్నీ వుండి కూడా అసంతృప్తితో బాధ పడుతున్నారు.." అని అనిపించింది.."ముందు మీరిద్దరూ స్నానాదికాలు ముగించుకొని రండి..స్వామివారి సమాధిని దర్శనం చేసుకుని..ఆపై మాట్లాడుకుందాము.." అని చెప్పాను..ఇద్దరూ వెళ్లారు..మరో గంట తరువాత ఆ దంపతులు ఇద్దరూ మందిరం లోకి వచ్చారు..మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేసి వస్తామని చెప్పి వెళ్లారు..మొదటి ప్రదక్షిన చేస్తూ..స్వామివారి గర్భాలయం కు నైరుతి మూల ఉన్న శ్రీ సాయిబాబా మందిరం వద్దకు వచ్చి..అలాగే నిలబడిపోయారు..ఆ దంపతులిద్దరిలో..ఆవిడ ఒక్కసారిగా "సాయిబాబా..తండ్రీ..సాయినాథా..ఇక్కడ కూడా ఉన్నావా..?"అని బిగ్గరగా కేక పెట్టింది..శ్రీ సాయిబాబా విగ్రహం వద్దకు వెళ్లి రెండు చేతులతో సాయిబాబా పాదాలు పట్టుకొని..తల ఆనించి..రెండు మూడు నిమిషాలు అలానే వుండిపోయింది..ఆ తరువాత ఇవతలికి వచ్చి..మళ్లీ సాయిబాబా విగ్రహానికి నమస్కారం చేసుకొని..ప్రదక్షిణ పూర్తి చేశారు..మందిరం లోకి వచ్చి..స్వామివారి సమాధి వద్దకు వెళ్లారు..గర్భాలయం లో స్వామివారి సమాధి ప్రక్కన పడమర గోడలో అమర్చిన స్వామివారి పాలరాతి విగ్రహం వద్దకు వెళ్లి నమస్కారం చేసుకుని..స్వామివారి పాదుకులకు కూడా నమస్కారం చేసుకొని..అక్కడే నిలబడ్డారు..దాదాపు ఐదు నిమిషాలపాటు కళ్ళుమూసుకుని నిలబడిపోయారు..పూజారి గారు వాళ్ళను ఇవతలికి వచ్చేయమని చెప్పారు..ఇవతలికి వచ్చి..స్వామివారి ఉత్సవ మూర్తి వద్ద హారతి తీసుకొని..ఆ మంటపం లోనే ఒక ప్రక్కగా ఇద్దరూ ధ్యానం చేసుకుంటూ సుమారు ఒక అరగంట ఉండిపోయారు..


ఆరోజు సాయంత్రం స్వామివారి మందిరం తలుపులు మూసివేసిన తరువాత.."ప్రసాద్ గారూ..మేమిద్దరం శనివారం నాటి పల్లకీసేవ లో పాల్గొనాలి అని అనుకున్నాము..ఈరాత్రికి, రేపు రాత్రికి కూడా ఇక్కడే మంటపం లో పడుకుంటాము..మా ఆవిడకు ఇక్కడే వుండి పల్లకీసేవ లో పాల్గొనండి అని సాయిబాబా ఆదేశం ఇచ్చినట్లు అనిపిస్తోందట..బాబా మాట మీరలేము కదా..అందుకని పల్లకీసేవ లో పాల్గొంటాము.." అన్నారు.."మీ ఇష్టం..అలాగే వుండండి.." అన్నాను..ఆరెండు రోజులూ ఆ దంపతులు స్వామివారి మంటపం లోనే వున్నారు..శనివారం నాడు సాయంత్రం స్వామివారి పల్లకీసేవ లో పాల్గొన్నారు..ఆదివారం ఉదయం వాళ్ళ ఊరు వెళ్లిపోతూ.."ప్రసాద్ గారూ ఏదో తెలీని అసంతృప్తి తో వచ్చాము..కొండంత తృప్తి తో వెళుతున్నాము..సాయినాథుని ఆదేశం వల్ల ఈ స్వామివారి పల్లకీసేవ లో పాల్గొన్నాము..ఆ తరువాత మనసంతా ప్రశాంతంగా ఉంది..మళ్లీ మళ్లీ ఇక్కడకు రావాలని అనిపించింది..ఆ సాయినాథుడే..మాలో ఉన్న అశాంతి దూరం చేయడానికి మాకు ఈ క్షేత్రాన్ని దర్శించే ఏర్పాటు చేసాడేమో అనిపిస్తోంది.." అని చెప్పి.."ఈ మారుమూల ప్రదేశం లో వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేస్తున్నారు..అన్నదాన సత్రం బాగు చేస్తున్నారు..వసతి కొఱకు  కూడా మీరు ఏర్పాట్లు చేస్తున్నారని విన్నాము..మేమూ మా వంతుగా సహకరిస్తాము..ఈ క్షేత్రం ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉన్నది..మేము ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లు శిరిడీ వెళతామని చెప్పాము కదా..ఈరోజు నుంచి..శిరిడీ తో పాటు ఇక్కడికి తరచూ వస్తాము..మావరకూ..ఆ సాయినాథుడు..ఈ స్వామివారు ఇద్దరూ రెండు కళ్ళ లాంటి వారు.." అని ఉద్వేగంతో చెప్పారు..


ఆ శిరిడీ సాయినాథుడు మార్గం చూపితే..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు తమ మనసు లోని అశాంతి ని దూరం చేశాడని ఆ దంపతులు విశ్వసించారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

మంత్ర పుష్పం

 మంత్ర పుష్పం ఏమి తెలియజేయుచున్నది వక పరిశీలన. సృష్టి పరిణామ క్రమం ఏవిధంగా జరిగినది పరమాత్మ తత్వం ఏమి. దీనిని  సూత్రబధ్దంగా ఎలా వర్ణన. వర్ణన అనగా కల్పిత మని చాలామంది ఊహ. కాని సూత్ర మనగా వక క్రమం . వేదము కూడా వక క్రమంగా అక్షర శక్తిని తెలియు విధానమే. క్రమంగా అనగా వక పద్దతిగా శక్తని తెలియుట. ప్రదీశశ్చ తస్రః  ప్రదీతశ్చ  తస్రః అని వివరించింది. ప్ర అనగా జీవ  మూల లక్షణమని ఈశశ్చ అనగా ఈ శ అనే చైతన్య లక్షణమని జీవ లక్షణమని. సూక్ష్మంగా మనకు వున్న ఙ్ఞానం తో అక్షర శక్తిని గమనించుట.అది పదార్ధ మూలమైన ప్ర అనే విశిష్టమైన జీవ చైతన్య మైన నీటి శక్తి. దీనికి మూలం అగ్నియే. ప్రదీశ నిన్ను నీవు తెలియుట ప్రవిద్వాన్ యని తెలియుతున్నది. దీని మూల తత్వం అహం బ్రహ్మాస్మి.మంత్ర పుష్పం ఋగ్వేద మంత్ర అక్షర మిశ్రమ శక్తి సంకేత మని. అదేదో విశిష్ట మని మనకెందుకులే యని వదలి పర భాషలపై ఆధారపడిన సమస్త విన్నాను సూవన్యమగును. పరభాషలమూలం కూడా చిన్న చిన్న మార్పులతో పలకుబడిలో శక్తి పరిణామ సూచనలే తప్ప వేరేమీగాదు. అన్నింటికీ మూలం సంస్కృతమని దానిఅక్షర శక్తి తెలుగు భాషలో అంతర్లీనమైయున్నదని మనకు దీని వివరణ సులువుగా విశ్లేషణకు మూల సూత్ర మనగా యున్నది. పంచభూతాత్మకమైన జీవ దేహ నవివరణయే మంత్ర పుష్పం వివరణ. శక్తి సమస్త వ్యాప్తమై పరమేశ్వర పరమేశ్వరీ స్వరూపం. అమ్మ అనుగ్రహం వుంటే సమస్తం అధీనమే. అనగా కోరికలకు కాదు. ఙ్ఞానమునకు. ఙ్ఞానియే అగ్రగణ్యం.పూర్ణాను స్వర రూపమే శక్తి. అను స్వరూపము అనగా అణుశక్తియే యని తెలియ వలెను. దీనికి నక్షత్ర శక్తియే మూలం. క్షతముగాని త్రిగుణాత్మకమైన శక్తి నక్షత్రమని అది ఎల్లప్పుడు వకే కాంతి శక్తని భూమిని ప్రభావితం చేయునని తెలియును.

మన మహర్షులు - 34

 మన మహర్షులు - 34


రైభ్య మహర్షి 


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


రైభ్యుడు చిన్నతనం నుంచే వేదాధ్యయనం ప్రారంభించాడు. ఇతనికి గురుభక్తి చాలా ఎక్కువ. గురువుగారి కంటే ముందుగా నిద్రలేచి ఆయన పడుకొనే వరకు ఆయనకు కావల్సినవన్నీ చేస్తూ చదువుకునేవాడు.


గురువుగారు కూడా అతని గురుభక్తికి సంతోషించి అన్ని వేద శాస్త్రాలు అతనికి బాగా వచ్చేటట్లు నేర్పించాడు. మొత్తం అన్నీ నేర్చుకున్నాక గురువుగారి ఆజ్ఞ తీసుకుని బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు


రైభ్యుడు తనకి సందేహాలు కలిగినప్పుడు బృహస్పతినడిగి తెలుసుకునే వాడు. 


ఒకసారి వసు మహారాజుని తీసుకుని బృహస్పతి దగ్గరకి వెళ్ళి దేవా! మోక్షం కర్మలు చెయ్యడం వల్ల వస్తుందా? జ్ఞానాన్ని సంపాదించడం వల్ల వస్తుందా? అనడిగాడు.


మునీంద్రా! తామరాకు మీద నీరు ఎట్లాయితే అంటుకోదో అట్లాగే చేసిన కర్మల్ని పరమేశ్వరార్పణమస్తు అని భగవంతుడికి అర్పిస్తే మనల్ని ఏ కర్మా అంటదు. 


దీనికి ఒక కథ చెప్తాను వినమన్నాడు బృహస్పతి.


            పూర్వం సంయముడనే మహారాజు భగీరథీ తీరంలో తిరుగుతుండగా ఒక బోయవాడు లేళ్ళ గుంపుని కొట్టబోతే సంయముడు ఆపి పాపం! అవేం చేశాయి? వాటిని చంపకు అన్నాడు.


బోయవాడు చంపడానికి మానడానికి నేనెవర్ని? అంతా ఈశ్వరేచ్ఛ అన్నాడు.


 సంయముడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్! అన్నాడు.


 బోయివాడు వీపు మీదున్న ఇనప వల క్రిందపడేసి దీంట్లోంచి అగ్ని పుట్టించమన్నాడు సంయముడిని. 


అతడి వల్ల కాలేదు.

బోయవాడు మంటల్ని పుట్టించి ఆర్పేసి ఇలా అన్నాడు. ..ఈ మంటలు ఎల్లా అయితే వెలిగి ఆరిపోతున్నాయో, అలాగే భగవంతుడు ప్రకృతి స్థితుడైనప్పుడు జీవులు నశించి, వికృతడై మళ్లీ పుట్టిస్తాడు.


ఇంక శరీర ధర్మాలకొస్తే ఎవరికేదిష్టమో అది చేసి పరమాత్మకి అర్పించాలి. 

అంటే మనం ఏదేనా తింటున్నా త్రాగుతున్నా, ఎవరికేనా ఏమన్నా ఇస్తున్నా ఏపని చేస్తున్నా 'పరమేశ్వరార్పణం' అంటే అది భగవంతుడికే చెందుతుందని చెప్పగానే దేవతలు బోయవాడి మీద పుష్పవర్షం కురిపించారు.


తర్వాత దేవతలు విమానంలో బోయవాణ్ణి సంయముడు చూస్తూండగానే తీసుకుపోయారు. 


బృహస్పతి చెప్పింది విని రైభ్యవసువులు ఆనందంగా వెళ్ళారు.


  రైభ్యునికి అర్వావసువు, పరావసువు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. పిల్లద్దరికి వేద విద్యలు నేర్పించి వాళ్ళతోపాటు రైభ్యుడు చదువుతుంటే మిగిలిన మహర్షులు ఆనందంగా చూసి ఆశీర్వదించి వెళ్ళేవాళ్ళు.


 రైభ్య మహర్షి కొడుకులు అర్వావసువు, పరావసువుల్ని చూసి భరద్వాజుడి కొడుకు అవక్రీతుడు అసూయపడేవాడు. 


రైభ్యుడు, భరద్వాజుడు మాత్రం అన్నదమ్ముల్లా కలిసి

మెలిసి వుంటూ తప్పస్సు చేసుకుంటూ వుండేవాళ్ళు.


 అన్నీ వేదాలు రావాలని అవక్రీతుడు ఇంద్రుడి గురించి తపస్సు చేశాడు. వేదాలు

గురువు ద్వారా నేర్చుకోవాలి గానీ తపస్సు ద్వారా కాదన్నాడు ఇంద్రుడు.


 అవక్రీతుడు వినకపోతే ఇంద్రుడు సరే తీసుకో వరమయితే ఇస్తానుగాని అలా

వచ్చిన వేదాలు నీకు ఎంతవరకు ఉపయోగ పడతాయో మాత్రం చెప్పలేనన్నాడు. 


అవక్రీతుడుకి వేదాలు నేర్చుకున్నానన్న గర్వం పెరిగిపోయింది. 

బృహస్పతి గర్వం

మంచిదికాదని ఎంత చెప్పినా వినలేదు .


ఒకరోజు రైభ్యుడి కోడల్ని అవమానించాడు అవక్రీతుడు. రైభ్యుడు ఒక రాక్షసిని, ఒక రాక్షసుడ్ని పుట్టించి అవహేతుడ్ని చంపించాడు.


భరద్వాజుడు కొడుకుకి జరిగినది న్యాయమే అని దహనక్రియ జరిపించి పుత్రశోకం భరించలేక శరీర త్యాగం చేశాడు.


ఒకనాడు రైభ్యుడి కొడుకు రాత్రి యింటికి వస్తుండగా ఒక మృగం మీదపడింది. దాన్ని కొట్టడానికి కర్రవిసిర్తే అది అక్కడే నిద్రపోతున్న తండ్రి రైభ్యుడికి తగిలి మరణించాడు. రైభ్యుడి కొడుకు అర్వావసువు తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అతని తపస్సుకి మెచ్చుకుని దేవతలు వరాలు కోరుకోమన్నారు. రైభ్య భరద్వాజ అవక్రీతుల్ని బ్రతికించమన్నాడు అర్వావసువు. 


అప్పటి నుండి అవక్రీతుడు గర్వం వదిలి అందరితో కలిసిమెలిసి వున్నాడు.


రైభ్యుడు తీర్థ యాత్రలు చేస్తూ అనంతశాయిని, రంగధాముణ్ణి, కంచి వరదరాజుని వెంకటేశ్వరస్వామిని, అహోబలేంద్రుణ్ణి సింహాచల నాయకుణ్ణి, శ్రీకూర్మపతిని, పురుషోత్తముడ్డి అందర్నీ దర్శించి ప్రయాగ వెళ్ళి గయలో పితృదేవతలికి పిండ ప్రదానం చేసి ఒకచోట తపస్సు చేసుకుంటూ వుండిపోయాడు.


అలా తపస్సు చేస్తూవుండగా సనత్కుమారుడు రైభ్యుడి దగ్గరికి వచ్చి అతని తపోదీక్షని పొగిడాడు.


 రైభ్య మహర్షి తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి కనిపించి ఏం కావాలనడిగాడు. సనకాదులుండే చోటికి నన్ను కూడ పంపమని మోక్ష సామ్రాజ్యాన్ని పొందాడు రైభ్య మహర్షి.


ఇదీ  రైభ్యమహర్షి కథ...


విద్య గురువు ద్వారా నేర్చుకోవాలనీ, ఏ పని చేసినా భగవంతుడి మీద భారం వెయ్యాలనీ ఈ కథ ద్వారా నేర్చుకొన్నాము కదా...


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కులశేఖర ఆళ్వారు

 ✍️...నేటి చిట్టికధ


కులశేఖర ఆళ్వారు  తిరునక్షత్రం సందర్భం గా...

  

     ఆళ్వార్లలో ఐదవ వాడు కులశేఖర ఆళ్వార్‌.  కొల్లినగర్ (తిరువన్జిక్కళమ్) అను రాజ్యములో క్షత్రియ వంశములో శ్రీకౌస్తుభం అంశతో జన్మించాడు. ఇతడిని కొల్లికావలన్, కొజియర్ కోన్, కూడల్ నాయకన్ మొదలగు నామములతో కూడా వ్యవహరిస్తారు.


        తనియన్ లో వివరించినట్లుగా ‘మాఱ్ఱలరై  వీరంగెడుత్త శెంగోల్ కొల్లి కావలన్ విల్లవర్ కోన్  శేరన్ కులశేఖరన్ ముడివేందర్ శిఖామణియే’


        ఆళ్వారు చేరరాజ్యమునకు రాజుగా, శత్రువులను నిర్మూలించే గొప్ప సైన్యము కలిగి రథములు, గుఱ్ఱములు, ఏనుగులతో చతురంగ బలగాలు  కలిగి ఉన్నాడు. 


        రాజైన ఆళ్వార్ ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ, శ్రీరాముడి లాగా ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటూ,  సరైన నిర్ణయములతో రాజ్యమును తమ ఆధీనంలో ఉంచుకొనేవాడు.     


        శ్రీమన్నారాయణుడు మాత్రమే పరమ పదమునకు మరియు సంసారమునకు సర్వాధికారి అని నమ్మేవాడు. వారి  నిర్హేతుక కృపచే, అపారమైన దైవిక విషయములందు పరిఙ్ఞానమును కలిగి,  రజో/తమో గుణములు నిర్మూలించుకొని పూర్తిగా సత్వగుణముచే భగవంతుడి దివ్యస్వరూపమునే ఆరాధిస్తూ , కులశేఖరాళ్వార్ తమ రాజ్యముతో ఎటువంటి సంభదము పెట్టుకోకుండ  శ్రీవిభీషణాళ్వాన్ వలే తమ సంపదను శ్రీ రాముని పాదాల వద్ద ఉంచి శరణువేడాడు.


        అధిక సమయమును శ్రీవైష్ణవులైన సాధువులతో  గడిపెడివాడు. ‘అన్నియరంగన్ తిరుముట్రత్తు అడియార్’ అంటే అధికముగా తమ దినచర్యను శ్రీరంగనాధుడి  ఆలయం లోనే గడిపేవాడు. 


        కులశేఖరాళ్వార్  ప్రతిరోజు దినచర్యగా శ్రీరామాయణాన్ని శ్రవణం చేస్తూ  ప్రవచిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి  శ్రీరామాయణ శ్రవణంలో  తన్మయత్వంగా  మునిగి తనను తాను మరచిపోతుండేవాడు.


        ఒకానొకసారి పురాణ శ్రవణంలో ఒక ప్రవచకుడు రామాయణంలోని ఖరదూషణ ఆదిగాగల పదనాల్గువేలమంది రాక్షసులతో శ్రీరాముడు  యుద్ధానికి సిద్ధమయ్యే సన్నివేశం చెబుతున్నాడు.


         శ్రీరాముడు ఒక గుహలో సీతాదేవిని ఇళయపెరుమాళ్ (లక్ష్మణుని) సంరక్షణలో ఉంచి, తానొక్కడే పదనాల్గువేల మంది రాక్షసులను ఒంటి చేత్తో ఎదుర్కొనుచుండగా,   ఋషులందరు భయముతో చూస్తుండే ఘట్టం ప్రవచిస్తున్నారు. 


        అది విన్న ఆళ్వార్ వళ్లు తెలియని భావోద్వేగముతో శ్రీరాముడికి యుద్ధంలో సహాయం చేయాలనే తలంపుతో, తన సేనలను  యుద్ధరంగం వైపు  వెళ్ళడానికి సిద్ధం కావల్సినదని ఆఙ్ఞాపించాడు.  


        ఇది చూసిన మంత్రులు ఆశ్చర్యపోయి రాజును ఆ భ్రమనుండి మళ్లించడం కోసం కొందరు ప్రముఖులను దండయాత్రకు బయలుదేరిన రాజుగారికి ఎదురు వచ్చేలా చేసారు. వారు రాజుగారితో...


        “మహారాజా శ్రీరాముడు యుద్ధములో విజయాన్ని వరించాడు, సీతాదేవి అతని గాయాలకు ఉపశమన చర్యలు చేస్తున్నది కావున మీరిక వెళ్ళవలసిన పనిలేదు” అని చెప్పారు. 


        దానితో కులశేఖర ఆళ్వార్ సంతృప్తి చెంది తన రాజ్యానికి వెనుదిరిగాడు. మంత్రులంతా ఆళ్వార్ వింతప్రవర్తన గురించి ఆలోచించి శ్రీవైష్ణవుల అనుభంధ వ్యామోహము నుండి విడదీయాలని నిర్ణయించుకొన్నారు. 


       అందుకోసం వారొక  యుక్తిని పన్నారు. వారు ఆళ్వార్ తిరువారాధన గది నుండి ఒక వజ్రాలనగను దొంగిలించి ఆ దొంగతనాన్ని అత్యంత సన్నిహితులైన శ్రీవైష్ణవులపై మోపారు.  ఇది విన్న ఆళ్వార్ విషనాగుతో ఉన్న ఒక కుండను తెప్పించి దానిలో  తన చేతిని పెడుతూ 


        “శ్రీవైష్ణవులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే  పాము నన్ను కాటువేయును గాక”  అనగా, వారి నిజాయితికి ఆ పాము కాటువేయలేదు. 


        దీనిని చూసిన మంత్రులు సిగ్గుపడుతూ ఆ నగను తిరిగి ఆళ్వార్ కు ఇచ్చి,  ఆ శ్రీవైష్ణవులను క్షమాపణ అడిగారు.


        గొప్ప రామభక్తుడైన అతడిని పెరుమాళ్‌  (అతి గొప్పవాడు) అనికూడా పిలిచేవారు.  ఇది సాక్షాత్తూ శ్రీవెంకటేశ్వరస్వామికి ఉపయోగించే పేరు. 


        అతడి భక్తి ఎంత గొప్పదంటే స్వామి భక్తులను సైతం స్వామిని పూజించినట్లు పూజించే వాడు. అతడు శ్రీరంగములో నివసిస్తూ అక్కడి ఆలయములో రంగనాథ స్వామికి సేవచేస్తుండేవాడు.


       క్రమంగా, ఆళ్వార్  ఈ సంసారుల మధ్యన ఉండటానికి ఇష్టపడక, ‘శౌనక సంహిత’ లో చెప్పిన విధంగా ‘భగవంతుడిని కీర్తించని  సంసారుల మధ్య నివసించుట ఒక అగ్నిగోళం మధ్యన ఉండుట లాటింది’ అని ఆలోచించి...


        ఆళ్వార్ తన రాజ్యభారాన్ని, బాధ్యతలను తన కుమారుడి చేతిలో ఉంచి, పట్టాభిషేకం చేసి ఇలా నిర్ణయించుకొన్నాడు ‘ఆనాద శెల్వతత్తు అరంబైయర్గళ్ తార్చుజ వానాళుం శెళ్వముం మన్నాన్నరశుం యాన్ వేన్నాదెన్’  అంటే సేవకులచే పరివేష్టించబడి ఉండే వినోదాలను మరియు  సంపదను ఇక కోరను అని.


        ఆళ్వార్  తన సన్నిహితులైన శ్రీవైష్ణవులతో  రాజ్యాన్ని వదిలి శ్రీరంగమును చేరి,  బంగారపు పళ్ళెములో వజ్రమువలె ఉన్న(ఆదిశేషునిపై పవళించి ఉన్న) శ్రీరంగనాధున్ని మంగళాశాసనము చేసాడు.  తన భావ సంతృప్తి ఫలముకై ప్రతి క్షణమును ఎంపెరుమాన్ కీర్తిస్తు, ‘పెరుమాళ్ తిరుమొజి’ రచించి అందరి ఉన్నతికై ఆశీర్వదించాడు.


తర్వాత కాలంలో స్వామి పుష్కరిణితో కూడిన తిరువేంగడంపై (తిరుమల) అధిక వ్యామోహం పెంచుకున్నాడు. స్వామి పుష్కరిణి గంగాయమునాది నదులకన్నా విశేషమైనదని కీర్తించబడింది. 


        ఆండాళ్ కూడ  ‘వేంకటత్తైప్ పతియాగ వాళ్వీర్గాళ్’  అంది. అంటే సదా మనసా వాచా తిరువేంకటముపై నివాసము చేయాలి అని. అక్కడ గొప్పఋషులు  మరియు మహాత్ములు నిత్యవాసము చేస్తారు కారణం వారు కూడా అదేవిధమైన కోరికని కలిగిఉన్నారు కనుక.  


        పెరుమాళ్  రచించిన తిరుమొజి 4 వ పదిగంలో  తిరుమల దివ్యదేశములో పక్షిలా, చెట్టులా, రాయిలా, నదిలా ఉండాలనే ఆళ్వార్ కోరిక మనకు కనపడుతుంది. ఇది కాకుండా  దివ్యదేశములలోని అర్చావతార భగవానుడిని  వారి భక్తులను సేవించాలనే కోరికను కలిగి ఉండేవాడు.


        అతడొకరోజు వేంకటేశ్వరస్వామితో  “స్వామీ నీ గర్భగుడి ముందు గడపగా నైనా పడివుండే వరమివ్వండి” అని అడిగాడు. దానికి స్వామి “తదాస్థు !” అన్నాడు. 


        అందుకే తిరుమలలో గర్భగుడి ద్వారాని కున్న గడపని 'కులశేఖర పడి' అని అంటారు. ఇతడు ముకుందమాల అను భక్తి స్తోత్రాన్ని సంస్కృతంలో రచించాడు.


        ముకు౦ద మాలలో శ్రీకృష్ణుడు దేవదేవుడుగా గీతాచార్యుడిగా కూడా కనిపిస్తాడు. పెరుమాళ్ తిరుమెళి అనే ప్రబ౦ధ౦లో తానే దశరధుడిగా శ్రీరాముని మీద ప్రేమని, శ్రీరాముని యొక్క సౌ౦దర్యాన్ని, గుణస౦పదని పొగడట౦ కనిపిస్తు౦ది.

   

        ‘శ్రీరామ, శ్రీకృష్ణ అనే ఏ నామన్ని ఉచ్చరి౦చినా అది మ౦త్రమే ! అజ్ఞానమనే వ్యాధిని పోగొడుతు౦ది. మహర్షులకు భగవద్దర్శన౦ కలిగి౦చి౦ది రాక్షసులకి బాధ కలిగి౦చి౦ది కూడా ఆ నామమే. 


        మూడు లోకాలకి జీవమిచ్చేది ,  భక్తులకు మ౦చిని కలుగ చేసేది, పాప భయము పోగొట్టేది, మోక్షాన్నిచ్చేది వైష్ణవ శక్తి.  భగావన్నామ౦ దివ్యౌషధ౦ వ౦టిది. దీన్ని సేవి౦చి తరి౦చ౦డి’ అని బోధి౦చాడు. 


        బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసము అనేటటువ౦టి చతురాశ్రమాలను నియమబద్ధ౦గా లోక కళ్యాణార్థ౦ గడిపిన పుణ్య పూర్ణజీవి కులశేఖరాళ్వారు.


        కొంతకాలము ఈ సంసారములోజీవించి చివరకు దివ్యమైన పరమపదమునకు వేంచేసి పెరుమాళ్ కి నిత్య కైంకర్యమును చేసారు.


🙏🏻🙏🏻🌸🌸🌸🙏🏻🙏🏻

నాస్తికునికి, #ఆస్తికునికి మద్య

 #నాస్తికునికి, #ఆస్తికునికి మద్య సంభాషణ:*


నేను జాతకాలు నమ్మను.

--- అవును అది మీ జాతకంలోనే ఉంది.


నేను దేవుడిని నమ్మను.

---- తప్పేముంది? రావణుడు, కంసుడు వంటివారు కూడా నమ్మలేదు.


నాకు దేవుడిని చూపించగలరా?

---- ఆయన మిమ్మల్ని చూట్టానికి ఇష్టపడాలికదా.


ప్రసాదాలు సమర్పిస్తారు. మరి దేవుడు స్వీకరిస్తే ప్రసాదాల్లో ఒక్క మెతుకు కూడా తగ్గదేం?

----- మీరు పుస్తకం చదువుతారు. అందులో ఒక్క అక్షరమన్నా మాయం కాదేం.


మనుషులను దేవుడే పుట్టిస్తే మరి అంతా సమానంగా లేరేం?

---- అదేంటి. అందరూ తొమ్మిదినెలలు గర్భంలో ఉండి నగ్నంగానే పుట్టి కెవ్వుమనే ఏడుస్తారుగా?


దేవుళ్లకు, రాక్షసులకు పిల్లలున్నారుగా. మరి వాళ్ల పిల్లల పిల్లలు ఎవరూ లేరా?

----- ఉన్నారుగా. మనమంతా వారి వంశాలలోని వారిమేగా


దేవుడు సర్వాంతర్యామికదా. మరి గుడిలో విగ్రహం ఎందుకు?

---- నీకు నిగ్రహం తక్కువ కదా. దాన్ని నిలపటానికి.


దేవుడిని తలచుకోకపోతే జరగదా?

--- ఏమో! నువే చెప్పాలి. క్షణం వదలకుండా తలచుకుంటున్నావుగా....


ఇంకేముంది గోగినేని తలవంచుకుంటు వెనుదిరిగారు.....

neurological test:

 *Only for senior citizens*


Here is a little neurological test:

Only use your eyes!

1- Find the C in the table below!

OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOCOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO


2- If you have already found the C,


Then find the 6 in the table below.


999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999969999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999


3- Now find the N in the table below.

Attention, it's a little more difficult!


MMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMNMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM


If you pass these three tests without problem:


- you can cancel your annual visit to the neurologist.


- your brain is in perfect shape!


- you are far from having any relationship with Alzheimer's.


So, share this with your over-60 friends, it can reassure them.



🙏🌹🙏🌹🤝🤝🌹🙏🌹🙏