26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

వ్రుద్ధ మల్లికార్జునుని కథ

 🍁🍁🍀🍀🍁🍁🍀🍀🍁🍁వ్రుద్ధ మల్లికార్జునుని కథ

       పూర్వం ఒక రాజకుమార్తె ఆ పరమేశ్వరుడు ని ప్రేమించి ఆయననే వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. తల్లిదండ్రులు ఆమె కోరికను నిరాకరించారు. ఆమె నిరంతరం ఆ పరమేశ్వరుడు ని గురించి ఆలోచించుతూ పూజలలోనూ జపాలలోనూ కాలం వెళ్ళబుచ్చ సాగింది. అంతలో ఒకరోజు ఆ పరమేశ్వరుడు ఆమెకు కలలో కనిపించి ఒక తుమ్మెదను చూపించి అది వాలినచోట తనకోసం వేచి ఉండమని, తానే వచ్చి వివాహం ఆడతానని చెప్పాడు ఆమెకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూచేసరికి ఎదురుగా ఒక భ్రమరం (తుమ్మెద)

కనిపించింది ఆ రాజకుమారి ఎగురుతున్న ఆ తుమ్మెదను అనుసరిస్తూ శ్రీశైలం ప్రాంతంలోని అడవికి చేరి అక్కడ తుమ్మెద వాలిన పొదక్రింద శివుని ధ్యానిస్తూ ఆయనకోసం నిరీక్చించ సాగింది. ఆ అడవిలో చెంచులు ఆమెను చూసి ప్రతీ రోజూ పాలు, తేనె, పండ్లు మొదలైనవి ఆమెకు ఆహారం గా

ఇవ్వసాగారు.

           ఇది ఇలా ఉంటే ఒక రోజు పరమేశ్వరుడు పార్వతీదేవి తో కలిసి ఆ ప్రాంతానికి వచ్చాడు. పార్వతీదేవి కి ఆ రాజకుమార్తె ను చూపించి ఆమె తనను వివాహం చేసుకోబోతోంది అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి హేళన చేయగా పరమేశ్వరుడు తన మాటను నిరూపించ దలచి ఒక వ్రుద్ధుని రూపంలో రాజకుమార్తె వద్దకు వెళ్లి "రాకుమారి! నేను నీకొరకై వెదికి వెదికి ముసలివాడ నైతిని. ఇంతకాలమునకు నీచెంత చేరగలిగితిని. నా ముసలి రూపం లెక్కచేయకుండా వివాహం ఆడెదవా" అని అడిగాడు. అందుకు ఆ రాజకుమార్తె సమ్మతించి తనను సొంత బిడ్డ వలే సాకిన చెంచులు వద్దన్నా వినక ఆ పరమేశ్వరుని వివాహం చేసుకుంది.

         ఈ సందర్బంగా చెంచులు కొత్త అల్లునికొరకు వివాహము ఏర్పాటు చేయగా మధ్య మాంసము ల లోని విందుకు శివుడు అంగీకరించలేదు. రాజకుమార్తె ఎంతగానో నచ్చ జెప్పింది. అయినా వినబడనట్టు అలిగి పోసాగాడుశివుడు.అప్పుడు ఆమె మల్లయ్యా!..... ఓ చెవిటి మల్లయ్యా! నిలబడు"అని గట్టిగా అరిచింది. అయినా ఆ పరమేశ్వరుడు లెక్క చేయలేదు. అప్పుడు రాజకుమార్తె" లింగ రూపియైన నిన్ను వివాహం ఆడలాని అనుకోవడం నాదే తప్పు. అక్కడే లింగముగా మారిపో"అని శపించింది. వ్రుద్ధుడైన శివుడు అక్కడే అదే రూపములో లింగముగా మారిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన పార్వతీదేవి రాజకుమార్తె ను చూసి "ఓసీ భ్రమరమును వెంబడించిన నీవు తుమ్మెదగా మారిపోదువుగాక"అని శపించింది. శివుడి భార్య అయిన భ్రమరి(తుమ్మెద) భ్రమరాంబ గా నిలిచిపోయింది. ఇప్పటికీ వ్రుద్ధ మల్లికార్జున స్వామి ని చెవిటి మల్లయ్య, వ్రుద్ధ మల్లయ్య అని భక్తులు పిలుస్తారు. మీరు శ్రీశైలం వెళ్లినప్పుడు తప్పకుండా గుడిలో ఉంటుంది. ఈ వ్రుద్ధ మల్లయ్య లింగము. ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍁🍀🍁🍀🍁🍀🍁🍀🍁

కామెంట్‌లు లేవు: