🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁శ్రీశైలం మహిమ :- 12 జ్యోతి ర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి కి 18 శక్తి పీఠం లలో ఒకరైన శ్రీభ్రమరాంబాదేవికి, నిలయమైన ఈ మహాక్షేత్రం వేదములు కు అలవాలమై సకల సంపదలకు పుట్టినిల్లైఎనిమిది శ్రుంగాలతో 44 నదులతో 60 కోట్ల తీర్ధరాజాలతో పరాశర, భరద్వాజాది మహార్షులతో తపోవనాదులతో, చంద్రగుండ, సూర్యగుండ, మొదలైన పుష్కరిణులతో స్పర్శవేదులైన లతలు, చెట్లు మరియు లింగాలతో అనంతమైన ఓషధులతో విరాజిల్లుతున్నది.
శ్రీశైల దర్శనం పలితం :-కురు క్చేత్రమునందు లక్షల కొలది దానము ఇచ్చిన రెండువేల సార్లు గంగా స్నానం చేసినా నర్మదా నదీతీరం నందు బహుకాలం తపస్సు ఆచరించినా కాశీ క్షేత్రం లో లక్షల సంవత్సరాలు నివసించినా ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి మహా పుణ్యం శ్రీశైలమల్లికార్జునుని దర్శించినంతనే కలుగుతుంది అని స్కాందపురాణము చెబుతోంది.
ఇక శిఖరం దర్శన మాత్రాన, అనంతమైనటువంటి పుణ్యాన్ని సంతరించిపెట్టే పునర్జన్మ నుండి ముక్తి ని కలిగించే ఈ క్చేత్రమును ఆయా మాసాల్లో సందర్శించేవారు వాజపేయ, అతిరాత్ర మొదలైన మహాయఙ్ఞాలు ఆచరించినందువలన కలిగిన ఫలాన్ని కన్యాదానం గోదానం మొదలైన మహాదానాలు చేసినందువలన కలిగే ఫలాన్ని అనాయాసంగా పొందుతారని శివుడు పార్వతీదేవి కి స్వయంగా చెప్పినట్లు స్కాందపురాణము చెబుతున్నది.
యుగయుగాలుగా ప్రసిద్ధి చెందిన ఈ శైవక్చేత్రాన్ని క్రుతయుగంలో హిరణ్యకశిపుడు కి పూజా మందిరం కాగా, అహోబిలక్చేత్రం సభామండపం అనీ, త్రేతాయుగం లో శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం సమయంలో సతీసమేతుడై శ్రీశైల నాధుని సేవించి సహస్ర లింగాన్ని ప్రతిష్ఠించాడని, పాండవులు తమ వనవాసం సమయంలో ద్రౌపది సమేతంగా ఈ క్చేత్రము లో కొంతకాలం ఉండి లింగాలను ప్రతిష్ఠించారని చెప్పబడుచున్నది. అందుకు నిదర్శనం గా నేటికీ ఈ క్చేత్రము లో రామప్రతిష్ఠిత సహస్ర లింగము, సీతాప్రతిష్ఠిత సహస్ర లింగం, పాండవులచే ప్రతిష్ఠించబడిన 'సద్యోజాత' మొదలైన ఐదు లింగాలు భక్తుల సేవలు అందుకుంటున్నాయి.
క్చేత్రము ప్రాముఖ్యత :-
సకల లోకారాధ్యమైన శ్రీశైల మహాక్షేత్రం భూమండలం నకు నాభిస్ధానమని పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఏ ప్రాంతములో ఏ పూజ చేసినా ఏ వ్రతము చేసినా మనము సంకల్పం లో శ్రీశైలాన్ని స్మరిస్తూ శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, ఉత్తరదిగ్భాగే అని, తాము శ్రీశైల క్చేత్రమునకు ఏ దిక్కున ఉండి పూజ చేస్తున్నారో వివరంగా సంకల్పం చెబుతాము.
అక్చయ వరాలను ఇచ్చే దక్చాధ్వరహరుడు తనను చూడటానికి వచ్చే లక్షలాది మంది భక్తులు కు మోక్షం ను ప్రసాదిస్తూ కొలువుతీరి ఉన్న ఈ దక్షిణ కైలాసం ప్రతీ భక్తుని మనస్సు ను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఉత్సవసమయాల్లో తప్ప సాధారణ రోజుల్లో కుల మత లింగ వయో వివక్షత లేకుండా స్వామిని తాకి, తల ఆనించి తమ కష్టాలను చెప్పుకునే అవకాశం ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు అది కనపడలేదు.
బ్రహ్మ గిరి, విష్ణు గిరి, రుద్ర గిరి, అనే మూడు పర్వతాలకు, పాదాభివందనాలు చేస్తూ తన మువ్వలసవ్వడులతో వేదఘోషలను గుర్తుకు తెచ్చే పావన క్రుష్ణవేణీనది, పాతాళగంగ అనేపేరు తో ఉత్తర వాహిని గా ప్రవహిస్తోంది మరియు ఈ క్చేత్రమునకు మరింత శోభను పవిత్రతను సంతరించి పెడుతోంది.
ఇక 18 పురాణాలలోనే కాకుండా భారతరామాయణాల లోనూ సంస్క్రుతాంద్ర తమిళ కన్నడ మరాఠి గ్రంధాలెన్నింటిలోనో ప్రస్తావించబడిన ఈ క్చేత్రము గురించి స్కాందపురాణము లో "శ్రీశైలఖంఢం" పూర్తిగా వివరిస్తోంది.
ఇంకా చెప్పాలంటే ఈ క్చేత్రము ప్రశాంతతకు ముగ్ధులైన శ్రీ శంకరభగవత్పాదులు కొంతకాలంగా ఇక్కడ తపస్సు చేసి "శివానందలహరి" అనే గ్రంథం ను వ్రాసినట్లు చెప్పబడుతోంది. హర హర మహాదేవ శంభో శంకర.. ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి