5, డిసెంబర్ 2020, శనివారం

సూక్తం అంటే మంచిమాట

 ఈ సకల విశ్వం పాంచభౌతికం...సర్వాన్నీ సృష్టించి, నిర్వహించే పరమాత్మను దర్శించడానికి రుషులు తపించారు. మహా పురుషుని అర్థం చేసుకుని ఆరాధించాలని ఆరాటపడ్డారు. ఆ విరాణ్మూర్తిపై వారి భక్తి ప్రపత్తులు, ప్రాకృతిక శక్తులపై వారి అవగాహనను క్రోడీకరిస్తే సూక్తాలయ్యాయి. మానవాళికి వేదాంత సూత్రాలయ్యాయి.

    సూక్తం అంటే మంచిమాట. ‘బాగా చెప్పింది’ అనే అర్థం కూడా ఈ పదానికి ఉంది. సమగ్రంగా నిరూపణ చేయడాన్ని కూడా సూక్తం అని అంటారు. ఈ అర్థాలన్నిటినీ సమన్వయం చేస్తే మనిషిని తీర్చిదిద్దే సమున్నతమైన మార్గదర్శకత్వ బోధన సూక్తం అని చెప్పొచ్చు. ప్రకృతి పరిణామక్రమం, దానిపై మనిషికి ఉండాల్సిన అవగాహన, చేయాల్సిన పనులు, చేయకూడని చర్యలు, సాధించాల్సిన అద్వైతభావన మొదలైన విషయాలన్నిటినీ వేదాల్లోని సూక్తాలు వివరిస్తాయి. భక్తుడి మనస్సు ఎప్పుడూ నిశ్చలంగా ఉండడానికి, పరమాత్మ మీద లగ్నం కావటానికి భారతీయ రుషులు ప్రతిపాదించిన ప్రాథమిక సూచన వేద సూక్త పఠనం. నిజానికి ఇవి వేదాల్లో ఒకే చోట, ఒకే మంత్రభాగంగా ఉండవు. విభిన్న భాగాల నుంచి గ్రహించిన మంత్రాలతో సూక్తం తయారవుతుంది. వేదంలో చెప్పిన కొన్ని పరమ ప్రామాణికమైన అంశాలు, మనిషికి అత్యవసరంగా అందాల్సిన సందేశాన్ని గ్రహించి మహర్షులు చేసిన క్రోడీకరణే సూక్తాలు. నాలుగు వేదాల్లో వందలాదిగా ఉన్న సూక్తాల్లో పురుషసూక్తం, శ్రీసూక్తం, నారాయణసూక్తం, భూ, నీలాసూక్తం... పంచసూక్తాలుగా ప్రసిద్ధిపొందాయి.

పురుష సూక్తం

‘పురుష’ అనే పదానికి భగవంతుడు అని అర్థం చేసుకోవాలి. విశ్వానికి మూలశక్తి అయిన విరాట్పురుషుడి స్వరూప, స్వభావ వర్ణన, విశ్లేషణ ఈ సూక్తంలో ప్రధానాంశాలుగా ఉంటాయి. సాధారణభావనలో మనం ఊహించుకునే విష్ణుమూర్తి, పురుషసూక్తం ప్రకటించే నారాయణుడు ఇద్దరూ వేర్వేరు. ఈయన త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణువు కన్నా పూర్వమే ఉన్నాడు. విశ్వం ఆవిర్భావానికి ఇతనే మూలకారణశక్తి.

ఓం తచ్ఛంయో రావృణీమహే

గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే...

అనే ప్రసిద్ధ మంత్రంతో పురుషసూక్తం ప్రారంభమవుతుంది. ఇందులో సకల దేవతల స్వరూపంగా విరాజిల్లే విరాట్పురుషుడి వైభవాన్ని శ్లాఘిస్తారు. భగవంతుడి సంకల్పంతోనే సృష్టి జరుగుతుందని, ఈ సృష్టి కార్యమంతా ఓ యజమని చెబుతుంది.దానికి కారకులైన వారికి, ఈ యజ్ఞాన్ని నిర్వహించేవారికి, ఇందులో భాగం తీసుకున్న ప్రతి ఒక్కరికీ చివరకు పశు పక్ష్యాదులతో సహా ప్రతి ప్రాణికీ శుభం కలగాలని ఆశిస్తూ పురుష సూక్తం ఆరంభమవుతుంది.

సబ్రహ్మః, సశివః, సహరిః - అతడే బ్రహ్మ, అతడే శివుడు, అతడే హరి అంటుంది పురుషసూక్తం. అమ్మవారి ఆలయమైనా, శివాలయమైనా, విష్ణ్వాలయమైనా పూజించే దేవుడు ఎవరైనా సరే అన్ని ఆలయాల్లోనూ మంత్రపుష్పంలో చెప్పే పురుషసూక్త భాగం ఇది. దైవశక్తి అంతటా నిండి ఉందనే అద్వైతభావాన్ని పురుషసూక్తం ప్రబోధిస్తోంది. విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ చైతన్యం ఒక్కటే. దాన్ని ఎవరు ఏ శక్తిగా భావించి పూజిస్తారో ఆ శక్తిరూపంలోనే ఆ చైతన్యం వ్యక్తమవుతుందనే విషయాన్ని పురుషసూక్తం విస్పష్టంగా ప్రకటిస్తుంది. అద్వైతభావనకు పురుషసూక్తం పునాదిగా నిలుస్తుంది.

ఎక్కడ ఉంది?


రుగ్వేదం పదోమండలంలో ఈ సూక్తం ఉంది. కృష్ణయజుర్వేదం అరణ్యకం, 3వ ప్రపాఠకంలో, 12వ అనువాకంలో కూడా పురుషసూక్తం కనిపిస్తుంది. యజుర్వేదంలో ‘నారాయణ ఉపస్థాన మంత్రం’, ‘ఉత్తర నారాయణ అనువాకం’ పేర్లతో ఈ సూక్తాన్ని పేర్కొన్నారు.

నారాయణ సూక్తం

పురుషసూక్తం విశ్వవ్యాప్తమైన విరాట్‌ స్వరూపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, నారాయణుడిగా ప్రకటించింది. నారాయణసూక్తం ఆ పరబ్రహ్మాన్ని నారాయణ స్వరూపంలోనే పూర్తిగా విశదీకరించింది. ఈ సూక్తంలో ప్రధానంగా రెండు భాగాలు కనిపిస్తాయి. మొదటి భాగంలో భగవంతుడి మహిమ ప్రకటితమవుతుంది. రెండో భాగంలో ఆ భగవంతుడిని ఎలా, ఏవిధంగా, ఎక్కడ ధ్యానం చేయాలో, మనస్సును ఎలా లగ్నం చేయాలో వివరణత్మాకంగా ఉంటుంది.

నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః

నారాయణ పరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః

నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః

విశ్వమంతా జ్యోతిస్వరూపంగా నిండి ఉన్నవాడు నారాయణుడే. ఆయనే పరబ్రహ్మ. నారాయణుని ధ్యానం చేసేవారిలో శ్రేష్ఠుడు నారాయణుడే అంటుందీ సూక్తం. సర్వోన్నతమైన ప్రతి అంశంలోనూ నారాయణ అంశను, నారాయణ తత్త్వాన్ని దర్శించడం ఇందులో ప్రధాన విషయం. ప్రపంచానికి లోపల, బయటా, కనిపించేదీ, వినిపించేదీ కూడా నారాయణుడే.

సముద్రేంతం విశ్వశంభువం... పద్మకోశ ప్రతీకాశగ్‌ం హృదయంచాప్యధోముఖం..’

సముద్రానికి అవతల భగవంతుడు ఉంటాడని ఈ మంత్రభాగానికి అర్థం. ఇక్కడ సముద్రమంటే సంసారసాగరం అని అర్థం చేసుకోవాలి. కోరికలు, భావోద్వేగాలనే అలలతో సంసార సాగరం ఎప్పుడూ కల్లోలంగా ఉంటుంది. సాధకుడు వీటిని అదుపులో ఉంచుకోవాలి. ఇది జరిగితే ధ్యానంలో మనస్సు లగ్నమవుతుంది. అంతిమంగా ఆ అనంతుడి సాక్షాత్కారాన్ని మనస్సు పొందుతుంది.


ఎక్కడుంది?

కృష్ణయజుర్వేదం అరణ్యకభాగం... నారాయణోపనిషత్తు, 13వ అనువాకంలో...


శ్రీసూక్తం

    శ్రీ అంటే సంపద, లక్ష్మి అనే అర్థాలు ఉన్నాయి. పరమాత్మ అనంతమైన శక్తుల్లో లక్ష్మీశక్తి ఒకటి. జగత్తును పోషించేందుకు ఈ శక్తి చాలా అవసరం.

    ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్‌ / చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ.. శ్రీసూక్తంలో తొలి మంత్రమిది.

    ఇక్కడ లక్ష్మి అంటే మనం చూసే లౌకిక సంపద కాదు. ఎప్పటికీ తొలగిపోని, తరిగిపోని జ్ఞాన సంపదే అసలైన లక్ష్మి. యజ్ఞానికి ముఖ్యదేవత అగ్ని. ఇతని ద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. అగ్ని జ్ఞానానికి సంకేతం. అగ్ని ద్వారా లక్ష్మిని ఆహ్వానించడం అంటే జ్ఞానసంపదను ఆరాధించడమే. ఈ భావాన్ని కొనసాగిస్తూ శ్రీసూక్తంలోని రెండో మంత్రం ‘లక్ష్మీం అనపగామినీం’ అంటుంది. అంటే ఎప్పటికీ తొలగిపోని లక్ష్మి కావాలని కోరుకుంటాడు భక్తుడు. ఎప్పటికీ తొలగిపోని సంపద తత్త్వజ్ఞానం. తనను తాను తెలుసుకునే ఆత్మజ్ఞానం. ఆ జ్ఞానాన్నివ్వాలని లక్ష్మీస్వరూపంలో ఉన్న ప్రకృతిస్వరూపిణికి భక్తుడు శ్రీసూక్తం ద్వారా విన్నవించుకుంటాడు.

    ‘అలక్ష్మీర్నాశయామ్యహం..’ అంటుంది శ్రీసూక్తంలోని మరో మంత్రం. నాలోని అలక్ష్మి నశించిపోవుగాక అని భక్తుడు కోరుకుంటాడు. అలక్ష్మి అంటే సాధారణ అర్ధంలో సంపద లేకపోవటం, దారిద్య్రాన్ని అనుభవించడం అవుతుంది. కానీ, ఇక్కడ వేరు. మనిషిలో ఉండే దుర్గుణాలన్నీ అలక్ష్మికి ప్రతిరూపాలే. అవన్నీ తొలగిపోవాలని కోరుకుంటాడు భక్తుడు. ఎప్పుడైతే దుర్గుణాలు తొలగిపోతాయో అప్పుడు మిగిలేది అనంతమైన జ్ఞానలక్ష్మి మాత్రమే. ఈ భావాన్ని కొనసాగిస్తూ శ్రీసూక్తంలో మరో చోట దారిద్య్రాన్ని ధ్వంసం చేయాలని భ¡గవతిని భక్తుడు వేడుకుంటాడు. భావదారిద్య్రాన్ని కలగకుండా ఉండేలా అనుగ్రహించమని భగవంతుణ్ణి కోరుకోవడం శ్రీసూక్తం ప్రకటిస్తున్న ప్రధానాంశం.

ఎక్కడుంది?

శ్రీ శక్తిని ఆరాధించే ఈ మంత్ర భాగం రుగ్వేదంలో కనిపిస్తుంది.


భూసూక్తం

మనిషి ఈ లోకంలోకి ఒంటరిగా వచ్చాడు. ఇక్కడ అతడు నిలబడటానికి భూమి ఆధారంగా నిలిచింది. ఎదగటానికి అవసరమైన అన్ని పదార్థాలను భూమాతే ఇచ్చింది. చివరగా భౌతికమైన దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత దాన్ని కూడా తనలోనే కలిపేసుకుంటుంది. అందుకే భూమిపై మనిషికి కృతజ్ఞత తప్పనిసరిగా ఉండి తీరాలి. భూమి చూపిస్తున్న ఉదారతకు, ఆమెను దైవంగా ఆరాధించాలనే భావనను కలిగించే వేద మంత్ర భాగమే భూసూక్తం.

    యత్‌ తే మధ్యం పృథివి యచ్చ నభ్యం యాస్త ఊర్జస్తన్వః సంబభూవుః తాసు నోధే హ్యభినః పవస్వ... మాతాభూమిః పుత్రోహం పృథివ్యాః పర్జన్యః పితాన ఉనః పిపర్తు... ’ భూమిని తన తల్లిగా, తనను భూమి పుత్రుడిగా భావించాల్సిన కర్తవ్యాన్ని మనిషికి ఈ మంత్రం సదా గుర్తుచేస్తుంది. వైదిక సంప్రదాయంలో భూమిని కేవలం నివాసయోగ్యతను కలిగించిన జడరూపమైన పదార్థంగా భావించలేదు. భూమితో ఒకవిధమైన అనుబంధాన్ని వేదం మనిషికి కలిగించింది. ఈ భూమిపై ఉన్న ప్రతి మట్టికణంలో దివ్యత్వాన్ని దర్శింపచేసుకోవాల్సిన అవసరాన్ని వేదం ప్రకటిస్తుంది.

ఎక్కడుంది?

అధర్వణ వేదంలో, యజుర్వేదంలో ఈ మంత్ర భాగాలు కనిపిస్తాయి.


నీలాసూక్తం

సామవేదంలో ప్రస్తావించిన ‘స్తోమత్రయస్త్రింశం’ అనే హోమానికి సంబంధించిన మంత్రాలు ఈ సూక్తంలో ప్రధానాంశాలు. ఈ సూక్తంలో ఆకాశానికి సంబంధించిన అంశాలుంటాయి. భూమికి ఊర్ధ్వదిశలో ఉండే నింగి ప్రాణికోటి అవసరాలు ఎన్నిటినో తీరుస్తుంది. భూమికి, ఆకాశానికి మధ్య సంబంధం, సూర్యగమనం, దిక్కులకు సంబంధించిన ప్రస్తావన ఇందులో ఉంది. మన వాతావరణంలో అనేక వాయువులు ఉంటాయి. వీటిలో ప్రత్యేకించి ‘మాతరిష్వ’ అనే వాయువు గురించి నీలాసూక్తం ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. దీనికి దక్షిణ దిక్కు నుంచి వీచేగాలికి మాతరిష్వ అని పేరు. ప్రాణులను సంరక్షించే వాయువనే అర్థం కూడా ఉంది.ఈ సర్వవ్యాపకమైన వాయువును గురించి వివరణ ఇక్కడ కనిపిస్తుంది.

నీలాసూక్తంలో భూమిని విష్ణుపత్నిగా సంబోధిస్తుంది వేదం. ఇక్కడ విష్ణుపత్ని అంటే విష్ణువును పరిపాలకుడిగా కలిగినది అనే అర్థం చేసుకోవాలి. ప్రకృతిని సంరక్షించుకోవాలనే సందేశం అంతర్లీనంగా ఉంది.

ఎక్కడుంది?

కృష్ణయజుర్వేదం ఒకటో కాండ 7వ పన్నం, 10వ అనువాకంలో కొంతభాగం, 4 కాండ, 4వ పన్నంలో కొంతభాగం కలిపి నీలాసూక్తంగా మహర్షులు పేర్కొన్నారు.


ఇందులో సైన్స్‌ ఉంది...

మనిషికి అంతుచిక్కని రహస్యాల్లో సృష్టి క్రమం ఒకటి. ఈ సృష్టికి ఏది మొదలు? ఇందుకు కారణం ఎవరు? అనే ప్రశ్నలు చాలాకాలంగా మనిషిని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. వీటికి సమాధానాలు చెబుతూ, అందులోని వైజ్ఞానిక కోణాన్ని తట్టిలేపే ప్రయత్నం చేస్తుంది పురుషసూక్తం. సనాతన భారతీయ వేదవ్యవస్థలోని సమున్నతమైన వైజ్ఞానికతకు, తార్కికతకు ఈ సూక్తం చక్కటి ఉదాహరణ.


సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్‌

సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠర్దశాంగులం

పురుషసూక్తంలో అత్యంత ప్రసిద్ధిపొందిన మంత్రభాగం ఇది. విశ్వావిర్భావానికి ముందే ఉన్న విరాట్పురుషుడికి వెయ్యి తలలు, వెయ్యి కళ్లు అంటుంది పురుషసూక్తం. ఇక్కడ సహస్రం అంటే వెయ్యి అనే అర్థం ఉన్నా ‘అనంతం’ అనే అర్థాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. అనంతమైన వ్యాపక స్వభావం కలిగిన వాడు పరమాత్మ. నిశ్చలంగా ఉన్న నీటి మీదకు చిన్నరాయి విసిరేస్తే తరంగాలు ఏర్పడతాయి. ఈ తరంగాలకు మొదటి స్థానం బిందువు. రాయి నీటికి తగిలిన చోట బిందువు ఏర్పడి, వ్యాకోచం చెంది తరంగాలుగా మారి, అవి వ్యాపకత్వాన్ని పొంది ఎలాగైతే ఆ నది లేదా తటాకం అంతా విస్తరిస్తాయో అదే క్రమంలో ఈ విశ్వసృష్టి క్రమం ఓ మహాబిందువు కేంద్రంగా జరిగింది. గణితపరంగా చూస్తే వృత్తం మీద ఉండే ప్రతి బిందువూ శీర్షమే. అలాంటి ఎన్నో శీర్షాల కలయికే వృత్తం. అనంతమైన శీర్షాలు కలిగినవాడు పరమ పురుషుడు అనటంలో కూడా ఆ మహానుభావుడి అనంతమైన వ్యాపకత్వ లక్షణం కనిపిస్తుంది. ఇలా ఎన్నో గణిత భావనలు పురుషసూక్తంలో కనిపిస్తాయి.

సహస్రశీర్షా పురుషః.. భావాన్ని గణితశాస్త్రంలో అన్వయిస్తే శ్రీచక్రం ప్రాథమిక రూపం ఏర్పడుతుంది.

    శ్రీచక్రం శక్తి స్వరూపం. లలితాదేవికి ప్రతిరూపం. ఈ రెండు భావనల్ని సమన్వయం చేస్తే ఎవరు విరాట్పురుషుడిగా ఉన్న నారాయణుడో ఆయనే దేవీ స్వరూపంలో ఉన్న మహాశక్తి అని అర్థమవుతుంది.

- కప్పగంతు రామకృష్ణ 


గండాంతము - అపోహలు

 🌅శ్రీ భగవతే హిరణ్యగర్భాయనమః🌄

🙏


🏵గండాంతము - అపోహలు.🏵


జలము మరియు అగ్ని రెండు కూడా పరస్పర విరుద్ధ భావాలు కల తత్వములు.

నిప్పు నీటిని ఆవిరిగా మార్చగలదు. అలాగే నీరు నిప్పును ఆర్పి వేయగలదు.

కాలపురుష చక్రములో 12 రాశులు కూడా అగ్ని వాయు జల భూతత్వ రాసులు తో నిండి ఉంది అని తెలుసుకున్నాం. ఈ జలతత్వ రాశులకు అగ్ని తత్వ రాశుల కి మధ్య గల సంబంధాన్ని గండాంతము అని అంటూ ఉంటారు. మేష సింహ ధను రాశులు అగ్నితత్వ రాశులు అని, వాటికి ముందు గల రాశులను అనగా మీనము, కర్కాటకము, వృశ్చికము ..వీటిని జలతత్వ రాశులు అని అంటారు.

మీన- మేషము, కర్కాటకము -సింహము(ఆశ్లేష) మరియు వృశ్చిక(విశాఖ-4పా -ధనరాసులు(మూలా) మధ్య ఉండే సున్నితమైన సంబంధాన్ని ఆ రెండింటినీ కలిపి బిందువును గండాంత అని అంటారు.


ఆశ్లేష చివరి రెండు ఘటికల మరియు మఘ మొదటి రెండు ఘటికల కాలము ,

జ్యేష్ట నక్షత్రపు చివరి రెండు ఘటికల మరియు మూలా నక్షత్రపు మొదటి రెండు ఘటికలుగా

ఏదైనా ఒక గ్రహం తన సంచార నుండి ఈ గండాంత బిందువు వద్దకు వచ్చినప్పుడు తన సాధారణ ప్రభావాన్ని లేదా శక్తిని కోల్పోతుంది. కనుక ఈ గండాంత మునందు గ్రహములు ఉండటం అంత మంచిది కాదు అంటారు.

🏵 అందులో చంద్రుడు మనః కారకుడు, బలం కోల్పోతూ ఉంటాడు. 🏵

కనుక ఆయా సమయములందు చంద్ర బలం ఉండదు గనక కొన్ని పనులు నిషిద్ధము అవుతుంటాయి.


జ్యోతిష్కులు ఈ గండాంతములు మూడు రకములుగా విభజించారు 1) నక్షత్ర గండాంతము 2)లగ్నగండాంతములు 3 ) తిథి గండాంతములు.

 బృహత్పరాశరము లో, హోరా రత్నాకరం లోనూ..

 నక్షత్ర గండాంతము అంటే రేవతి నక్షత్రము చివరి రెండు ఘటికల మరియు అశ్వినీ నక్షత్రం మొదటి రెండు ఘటికల కాలమును ,

(ఆశ్లేష చివరి రెండు ఘటికల మరియు మఘ మొదటి రెండు ఘటికల కాలము ,

జ్యేష్ట నక్షత్రపు చివరి రెండు ఘటికల మరియు మూలా నక్షత్రపు మొదటి రెండు ఘటికలుగా వివరించారు.)


లగ్న గండాంతములు అంటే 

మీన లగ్నం లో చివరి సగం మేష లగ్నము నందు మొదటి సగం ఘటికలను,

అదే విధముగా కర్కాటకలగ్నము సింహలగ్నము మరియు వృశ్చిక లగ్నము ధనుర్లగ్నము ల చివరి సగం , మొదటి సగము ఘటికలను కలిపి అంటారు.


పూర్ణ తిధుల (5,10,15) చివరి రెండు ఘటికల కాలము మరియు మొదటి రెండు ఘటికల కాలం రిక్త తిథుల ( 1,6,11) కు సంధిని తిథి గండాంతము అని అంటారు.


ఇచ్చట ఘటికల సమయము అనగా డిగ్రీలు కాదు రెండు ఘటికలు అనగా 48 నిమిషములు అని అర్థం.

కనుక, గండాంతములు అనగా ముందు 48 నిముషములు తర్వాత 48 నిమిషములు మొత్తం మీద 96 నిమిషముల కాలం మంచిసమయం కాదు అని అర్థం. 


సాధారణంగా గండాంతములు అనేది జన్మ నక్షత్రము నుండి మాత్రమే చూస్తారు. అనగా ఇది చంద్రుని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని మనం శుభ కార్యం నిమిత్తం వాడుకోరాదు. 

🏵దీని మీద ఇతర గ్రహ సంచారము గండంగా చెప్పు కొనరాదు.🏵

 ఇతర విషయాలపై అనవసరమైన అనుమానాలు అపోహలు భయాలు అవసరం లేదు.


"గౌరవ సభ్యులు శ్రీ రామకృష్ణ గారి" ఆవేశాన్ని తప్పక సభ్యులందరూ అర్థం చేసుకో గలరు.


మన పూర్వీకులు విశాఖ -4 పాదమునకు కూడా దోషము ఆపాదించారు. (అది గురువు అధిపతిగా గల నక్షత్రం అయినప్పటికినీ). కారణము విశాఖ -4పాదము వృశ్చికము లో చంద్రుడు (౦డిగ్రీ లనుండి 3డిగ్రీలవరకూ నీచస్థానము కనుక).


🏵కొందరు ఆశ్లేష (స్వంత మేనత్త కూతురు మాత్రమే ), మూల( స్వంత మేనమామ మాత్రమే) వివాహ మునకు పనికి రారని వివరణ ఇస్తున్నారు.🏵

లగ్నమనగా శరీరము , దాని ని నడిపే చంద్రుడు(జన్మనక్షత్రం)‌మనస్సు ను ప్రభావితం చేస్తుంది కనుక పై నక్షత్రాలు గండముగా మన పెద్దలు తెలియజేసారు. ఇది దుష్ప్రచారం కానేకాదు.

🙏🙏🙏

శ్రీ శివ మహా పురాణం

 **దశిక రాము**


**శ్రీ శివ మహా పురాణం**


20 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


అరుణాచలేశ్వరుడు

మనకి అష్టమూర్తి తత్త్వము అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు. అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు సాకారోపాసన శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు. కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతగుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యాజమాన లింగం – ఈ ఎనిమిది అష్టమూర్తులు. ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే. కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.

అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది. అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర. అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు. అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది. కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి. అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.

అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు. అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు. అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.

మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు.

దర్శనాత్ అభ్రశదసి జననాత్ కమలాలే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించినది. మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. దాని పేరే అరుణాచలం. అచలము అంటే కొండ. దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది. ఆకొండ అంతా శివుడే. అక్కడ కొండే శివుడు. కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి. గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గురి ఉంటుంది. అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు. అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి. ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి. అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది.

ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది. అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగాస్థానం. కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.

అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు. అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.

మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది. అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది. అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు.

అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు. అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం. ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు. ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి. అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది. అప్పడికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు. ‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను. నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని చందా ఇవ్వమని అడిగేది. ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది. అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు. అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది. తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.

అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు. ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది. తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది. ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు. అటువంటి పరమ పావనమయిన క్షేత్రం.

ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు. దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది. అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది.

ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది. ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది. పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.

అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉంది. ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు. లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది.

అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు. శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని ప్రమాణము. స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే. అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రామించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు. అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ. అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ. భగవాన్ రమణుల మూర్తి ప్రతి ఇంట ఉండాలి. అందరం తిరువణ్ణామలై వెళ్ళాలి. అందరం గిరి ప్రదక్షిణం చేయాలి. మన పిల్లలకి అటువంటి మహాపురుషుని గురించి చెప్పాలి. సూరినాగమ్మ లేఖల పుస్తకం తప్పకుండా ఇంట్లో ఉంచుకుంటే మంచిది. ఆ పుస్తకం సులభశైలిలో ఉంటుంది. రమణులు ఎప్పుడెప్పుడు ఏమి మాట్లాడారో ఆ పుస్తకంలో చదువుతుంటే మీరు రమణాశ్రమంలో ఉన్నట్లుగా ఉంటుంది. రమణుల అనుగ్రహమును మనం పొందుతాము.


🙏🙏🙏

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము**


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


ఉద్యోగపర్వం.149


భీష్ముడు దుర్యోధనునికి చెబుతున్నాడు :


అంబకు సాంబశివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు కదా !  


ఆమె నన్ను యుద్ధంలో ఓడించి వధించే సామర్ధ్యం యివ్వమని వరంకోరింది. పరమశివుడు అనుగ్రహించాడు.  కోరికైతే కోరింది గానీ, శివుడు వరం ప్రసాదించినట్లు     చెప్పినా కూడా ఆమెకు నమ్మకం కుదరక, ' నేను స్త్రీని కదా శంకరా ! నాకు యుద్ధరంగం లో భీష్మునిచంపే అవకాశం యెలావస్తుంది ? అని అడిగింది.  ' నావాక్కు అసత్యం కాదు.  నీవు పురుషునిగానే భీష్ముని సంహరిస్తావు.' అని ఆమె సందేహనివృత్తి చేసాడు, శంకరుడు. 


ఆమెను యింకా అయోమయంలో వుంచే వుద్దేశంలేక శివుడు, ' అంబా !  నీవు ద్రుపదుని యింటిలో, ఆడశిశువుగా జన్మిస్తావు.  ఎదుగుతున్న కొద్దీ క్రమంగా నీలో పురుషలక్షణాలు బహిర్గతమౌతాయి.  తరువాత నీవు అనుకున్నట్లుగానే అన్నీ జరుగుతాయి. ' అని చెప్పి సాంబశివుడు మాయమైనాడు.  ఆమె శంకరుని మాటలకు సంతృప్తి చెంది,  తానే స్వయంగా యెండుపుల్లలను చితిగా పేర్చుకుని, స్వయంగా ' భీష్ముని వధించేందుకు' అని సంకల్పం చెప్పుకుని, హుతాశనుని వుదరంలోనికి యే జంకూ లేకుండా ప్రవేశించి, ఆహుతి అయింది.


ఇదంతా అమిత ఆశ్చర్యంగా వింటున్నాడు, దుర్యోధనుడు.  ఇంకొకప్రక్క సంజయుడు ధృతరాష్ట్రునికి భీష్మ దుర్యోధనుల సంభాషణ తెలియచేస్తున్నాడు.  దుర్యోధనుడు ఆశ్చర్యం చంపుకోలేక, '  స్త్రీగా ప్రాయోపవేశంచేసిన అంబ, పురుషునిగా  యేవిధంగా  జన్మించింది, త్వరగా వివరింపు,పితామహా ! 'అని అడిగాడు.  ' దుర్యోధనా !  ద్రుపద మహారాజు చిరకాలంగా సంతానలేమితో బాధపడుతున్నాడు.  నేను ద్రోణునికి ఆశ్రయమిచ్చానని,  అతడుకూడా నాపై  ద్వేషంతో రగిలిపోతున్నాడు.  ఎంతకాలానికీ సంతానం కలుగకపోవడంతో, తన కోరిక తీరదేమోనని, రెట్టించిన సంకల్పంతో, శివునిగురించి ఘోరతపస్సు చేసి,శివుడు ప్రత్యక్షమవగానే, భీష్మునిచంపే, పరాక్రమ వంతుడైన పుత్రుని ప్రసాదించమని అడిగాడు.   


ఆనాడు అంబకు యిచ్చిన వరం జ్ఞప్తిలో వుంచుకుని, శివుడు,   '  ద్రుపదా ! నీ కోరిక తీరుతుంది.   ముందుగా నీకు ఒక ఆడశిశువు జన్మిస్తుంది.  క్రమంగా ఆమె పురుషునిగా మారిపోయి, భీష్ముడిని చంపడానికి కారకురాలవుతుంది. '  అని అంతర్ధానమయ్యాడు.  ' దుర్యోధనా!  ఈ విషయాలన్నీ నాకు వేగులవారి ద్వారా, తెలుస్తూనే వున్నాయి. కొంతకాలానికి  ద్రుపదుని భార్య గర్భం ధరించి,  ఆడశిశువుని కన్నది.  లేక లేక కలిగిన శిశువు అవడం వలన, ఆడబిడ్డ అని తెలిసికూడా, తనకు పుత్రుడు పుట్టాడని లోకానికి తెలియబరచి, భర్త ద్రుపదునికూడా  అదేవిధంగా చెప్పమని చెప్పింది.  శిఖండి అనే నామంతో ఆమెను పిలువసాగారు  . వివాహమైతే ఆమె పురుషుడుగా మారుతుందనే ఆశతో ఆమెకు రహశ్యజీవితం కలిపించారు.


 వీరు యెంత రహస్యంగా పెంచదల్చుకున్నా, ప్రకృతిధర్మాలు శరీరానికి సహజంగా వచ్చేవేకదా !  శంకరుని వరంమీద నమ్మకముంచి, ఆమెకు శీఘ్రముగా,  వివాహం చెయ్యడానికి సిద్ధపడ్డారు తల్లిదండ్రులు.   దశార్ణ దేశాధిపతి, హిరణ్యవర్మ  కుమార్తెను ఆమెకు భార్యగా నిర్ణయించి, ఆయనకు వర్తమానం పంపారు.  ద్రుపదునితో వియ్యమని ఆయన సంతోషించి, తన కుమార్తెను శిఖండికిచ్చి వివాహం జరిపించాడు. 


కొద్దిరోజులకు శిఖండి  స్త్రీ  అనేవిషయం బయటపడింది,  తన భార్య దగ్గర.  ఇంకేముంది.  ద్రుపదుని కోడలు, తనపుట్టింటి వారికి యీవిషయం తెలియజేసి, తనను పుట్టింటికి తీసుకువెళ్ళమని వారిని కోరింది.  ఆమెతండ్రి ద్రుపదునిపై యుద్హం ప్రకటించి,  నిజం చెప్పమని కబురు చేసాడు. 


ఈలోపు, శిఖండి, తనముఖం యెవరికీ చూపించలేక, అరణ్యాలలలోనికి  పరుగులు తీసింది.   ఆమెవెళ్లిన అరణ్యప్రాంతం స్థూణాకర్ణుడు అనే యక్షుని అధీనంలో వున్నది. అతని భయంకర ప్రవృత్తికి భయపడి ఆయన భవనంలోకి యెవరూ అడుగుపెట్టరు.  ఆ విషయం తెలియక శిఖండి ఆ భవనం లోనికి అడుగుపెట్టి అన్నపానీయాలు విసర్జించి, తపస్సు చేసుకుంటూ వున్నది, భగవంతునిపై భారంవేసి.


స్థూణాకర్ణుడు ఆమెకు తెలియకుండా ఆమెను గమనిస్తూ, ఆమె నిజాయితీగా తపస్సు చేసుకోవడం గమనించి, ఆమెకువచ్చిన ఆపద యేమిటో చెబితే, తాను తీరుస్తానన్నాడు.


' దుర్యోధనా! నాకు ఆందోళన చెందే పరిస్థితి వుత్పన్నమై స్థూణాకర్ణునికి, ఆమెకు సహాయం చెయ్యాలని బుద్ధిపుట్టింది.  ఆయక్షుడు శిఖండికి తన మగతనం కొంతకాలం మార్పిడి చెయ్యడానికి సిద్ధపడ్డాడు.  ఆమె సంతోషించి తన మామగారైన  హిరణ్యవర్మని తాను పురుషుడినని నమ్మించి, తిరిగివచ్చి, తన ఆడతనం  తీసుకుంటానని కృతజ్ఞతలు చెప్పి పురుషునిగా అక్కడ నుండి ద్రుపదరాజును వెళ్లి కలిసింది.  ఆమె తల్లిదండ్రులు యెంతో సంతోషించి, హిరణ్యవర్మకి  కబురుపెట్టి, ' మీరు విన్నదంతా  అబద్ధం.  కావాలంటే మీ అల్లుడిని మీరు కలిసి మీ సందేహ నివృత్తి చేసుకోవచ్చు. '  అని  చెప్పారు.  హిరణ్యవర్మ కూడా సమస్య లేనందుకు సంతోషించి,  కావలసిన పరీక్షలు జరిపించి శిఖండి ఉత్తమజాతి పురుషుడుగా తేల్చుకున్నాడు.


అదే సమయంలో, స్థాణాకర్ణుడు వున్న ప్రదేశంపైనుండి,  విమానంలో,  స్థూణాకర్ణునికి ప్రభువైన కుబేరుడు వెళ్తూ,   అక్కడ దిగి స్థూణాకర్ణుని చూసి వెళదామని అతని భవంతి లోనికి వచ్చాడు..  అయితే, ఆడతనంతో వున్న స్థూణాకర్ణుడు, కుబేరుని కంటబడలేక చాలాసేపు కుబేరునికి కనబడకుండా వుండిపోయాడు.  తరువాత విషయం తెలుసుకుని,  అతనిపై కోపించి, అతని జీవితాంతం ఆడదానిగా వుండిపొమ్మని శపించాడు.  దానికి స్థూణాకర్ణుడు ' తాను చేసిన మంచిపని యీవిధంగా వికటించింది ' అని కుబేరునికి మొరబెట్టుకోగా,  శిఖండి మరణించిన తరువాత,స్థూణాకర్ణుడు తిరిగి పురుషజీవితం గడుపుతాడని వెసులుబాటు ఇచ్చాడు. 


ఇదేమీ తెలియని శిఖండి,  తాను అనుకున్న ప్రకారం తిరిగివచ్చి, తన ఆడతనం తనకు ఇచ్చేయమని స్తూనాకర్ణుని అడిగాడు.  శిఖండి నిజాయితీకి అతడు చాల సంతోషించాడు.  జరిగినదంతా స్థూణాకర్ణుడు శిఖండికి చెప్పి, ఆమెను బ్రతికి వున్నన్నాళ్ళూ పురుషజీవితం గడపమని దీవించి,  ఆమె ' సంకల్పం నెరవేరుగాక ! ' అని దీవించాడు.  స్థూణాకర్ణునికి కృతజ్ఞతా నమస్కారం చేసి, శిఖండి తిరిగివెళ్లి,  తన తల్లిదండ్రులకూ భార్యకూ జరిగినది చెప్పి, వారిని సంతోషపెట్టాడు.  ద్రుపదుడు, శిఖండిని ద్రోణాచార్యుని వద్దకు శిష్యునిగా పంపి, విలువిద్య నేర్పించాడు.  


' దుర్యోధనా !  మీరందరూ ద్రోణుని వద్ద శిక్షణ తీసుకున్నట్లే, శిఖండి కూడా విలువిద్యలో పరిపూర్ణత సాధించాడు.  ఇదీ శిఖండి కధ.   కాశీరాజు పెద్దకుమార్తె, అంబ యిప్పుడు శిఖండిగా వచ్చిన విషయం నాకుతెలుసు కాబట్టి, నేను నా నియమం ప్రకారం స్త్రీలతో యుద్ధం చెయ్యను కనుక,   ఆతడు పురుషరూపంలో వున్న స్త్రీ.. అతనిపై   నేను ధనుస్సు యెక్కుపెట్టను.' అని భీష్ముడు దుర్యోధనునితో చెప్పాడు. ' భీష్ముని నిర్ణయం సరి అయినదే అని దుర్యోధనుడు కూడా సమాధానపడ్డాడు '  అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు.  


తూర్పు తెల్లవారుతుండగా, దుర్యోధనుడు మళ్ళీ బీష్ముని వద్దకువచ్చి, ' పితామహా !  పాండవసేన యుద్ధానికి సిద్ధంగా వున్నది.  సాగరఘోషలాగా వినపడుతున్న  పాండవసేన ఆర్భాటం చూస్తుంటే, దేవతలు కూడా వారిని జయించలేరేమో అనిపిస్తున్నది.  మీ సర్వసైన్యాధ్యక్షతన యెన్నిరోజులలో మనం వారిని మట్టు పెట్టగలం ? ' అని కుతూహలంగా అడిగాడు. 


దానికి సమాధానంగా భీష్ముడు, '  మన శక్తివంతమైన అస్త్రశస్త్రాలు అన్నీ వినియోగిస్తే, ఒక మాసంలో వారిని తుడిచిపెట్టవచ్చు.' అన్నాడు.  ప్రక్కనే వున్న ద్రోణుడిని అడుగగా, ' నాకూ అదే అనిపిస్తున్నది. ' అన్నాడు.  కృపాచార్యుడు రెండు నెలలు పడుతుంది అనగా, అశ్వద్ధామ పదిరోజులు చాలన్నాడు.  అక్కడే వున్న కర్ణుడు యెవరూ అడగకుండానే, ' నాకైతే ఐదురోజులు చాలు. ' నన్నాడు.  


ఆమాటలకు భీష్ముడు నవ్వి, ' అవును కర్ణా !  నీకు ఐదురోజులు చాలు.  ఎందుకంటె, నీవు మునుపెన్నడూ, శ్రీకృష్ణుని రధసారధ్యంలో గాండీవం పట్టుకుని యుద్ధం చేస్తున్న అర్జునుని చూడలేదు కదా ! అందుకే యథేచ్ఛగా మాట్లాడుతున్నావు. ' అన్నాడు.  .    


ఇదంతా వేగుల ద్వారా తెలుసుకున్న ధర్మరాజు, అర్జునునితో, ' అర్జునా ! అక్కడ దుర్యోధనుడు వేసిన ప్రశ్ననే నేనూ వేస్తున్నాను.  నీకు యెంతకాలం పడుతుంది కౌరవసేనను నిర్జించడానికి ? '  అని అడిగాడు.   ' అన్నా !  కౌరవశ్రేష్ఠుల మాటలకు నీవు బాధపడవద్దు.  నీ మనస్థాపం హరించిపోవుగాక ! ఇది సత్యం.  నా రథంలో వాసుదేవుడు తోడుగా వుంటే,  ఒక్క కౌరవసేననే   కాదు, ముల్లోకాలను రెప్పపాటులో తుడిచి పెట్టెయ్యగలను.  ప్రళయసమయంలో జీవ సమాప్తికి వుపయోగించే అస్త్రం నాకు పరమేశ్వరుడు  అనుగ్రహించిన సంగతి వారెవరికీ తెలియదు.   కర్ణునికి అసలే తెలియదు.  నాకు పరమేశ్వరుడు పెట్టిన నియమం ప్రకారం,  అస్త్రాన్ని సామాన్య పరిస్థితిలో వాడకూడదు.  మనం మామూలుగానే గెలుద్దాము.  అంతెందుకు అగ్రజా !  అలుగుటయే యెరుంగని, మహామహితాత్ముడవు అజాతశతృడవు, నీవు అలిగిన చాలదా, సప్త సముద్రాలూ యేకమై శత్రువులను  తుడిచిపెట్టడానికి ?  నీకోపాగ్నికి నిలువబడ గలిగే ప్రాణి  యీభూమిమీద లేదని నాకు ఖచ్చితంగా తెలుసు. '  అన్నాడు దృఢంగా అర్జునుడు. 


ఇరుపక్షాలవారు, ఉదయసంధ్యా కార్యక్రమాలు పూర్తి చేసుకుని, అగ్నిహోత్రుడిని పూజించి, మంగళవాక్యాలు అవధరించి, కవచములు, శిరస్త్రాణాలు ధరించి వారివారి రథకేతనములు రెపరెపలాడుతూ యెగురుతుండగా,  విజయం మీద విశ్వాసంతో తమ సర్వ సేనాధిపతుల ఆజ్ఞలకు అనుగుణంగా,  తమతమ స్థానాలను గుర్తించి బయలు దేరారు, సమరానికి.


శంఖనాదాలు, భేరీధ్వనులు మిన్నంటుతుండగా, రధ, గజ, తురగ, పదాతి దళాలు

( చతురంగ బలాలు ) దూసుకుపోతుండగా, రెండు సముద్రాలూ ' ఢీ ' కొంటున్నాయా అన్నట్లుగా యిరుసేనలూ, ఏనుగుల ఘీంకారావాలతో, వీరుల సింహనాదాలతో, కురుక్షేత్ర రణరంగంలో  యెదురుబొదురుగా నిలిచాయి.  అని జనమేజయునకు వైశంపాయనుడు సర్పయాగం సమయంలో మహాభారతగాధ ఉద్యోగపర్వం లో వివరించాడని, నైమిశారణ్యంలో, శౌనకాది మహామునులకు, సూతమహర్షి చెప్పాడు.


ఉద్యోగ పర్వం సమాప్తం. 


స్వస్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.


🙏🙏🙏

సౌందర్య లహరి**

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఇరవైమూడవ శ్లోక భాష్యం - మొదటి భాగం


త్వయా హృత్వా వామం వపు-రపరితృప్తేన మనసా

శరీరార్ధం శంభో-రపరమపి శంకే హృతమభూత్ !

యదేతత్ త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం

కుచాభ్యామానమ్రం కుటిల-శశిచూడాల-మకుటమ్ !!

(అమ్మా! నీవు శివుని ఎడమభాగమును పొందిన  మాత్రముతో తృప్తి పొందక కుడి భాగమును కూడా హరించినావని శంకపొడముచున్నది. ఎందుచేత ననగా 'నా హృదయములో నీ రూపమంతయూ (ఎడమ కుడి భాగములు రెండూ) ఎఱ్ఱటి ప్రకాశము కలది, మూడు నేత్రములు కలది, స్తనభారముచేత కొంచెము వంగినది, చంద్రవంక తోడి చూడా కిరీటము కలదిగా అనబడుచున్నది).


వేదములు శివునకు రెండు దేహములున్నా యని ప్రకటించాయి. “శివాతను” - అందు ఒకటి పూర్తిగా అంబికది. అర్ధనారీశ్వర రూపంతో ఒకే దేహంలో అంబిక, శివుడు సగం సగంగా ఉంటారు. ఆచార్యులవారు ఈ రెండు విషయములను కలిపి అంబిక చౌర్యం చేసిందని ఆరోపిస్తున్నారు. శివశక్తులు భిన్నభిన్నములుగా (విడివిడిగానూ, ఐక్యరూపంలోనూ) కన్పిస్తూ ఉంటారు. ఒకప్పుడు రెండు శరీరములతోను మరొకప్పుడు ఏకదేహంతోనూ దర్శనమిస్తారు. ఈవిధంగా భిన్నరూపములుగా శివుడు లింగరూపంలో ఉన్నప్పుడు అంబిక సర్పమై ఆయనను చుట్టి ఉంటుంది. ఇది భిన్నరూపం. దక్షిణామూర్తిగా శివుడున్నపుడు బయటకు కనిపించకుండా ఆయనతో కలిసి పోయి ఉంటుంది. ఇది  ఏకరూపం. ఆయన ఒక్కడే కన్పిస్తాడు.  వీటికి వ్యతిరిక్తంగా దుర్గ ఉన్నది. ప్రతి రూపం ఒక సత్యాన్ని, ఒక భావనను తెలియజేస్తుంది.


ఈ భావనలు, సత్యాలను ఆధారం చేసుకొని కవులు చమత్కారం చేస్తారు. “నిరంకుశాః కవయః" ఒకప్పుడు చనువుతో హేళన చేస్తారు. ఆరోపణలు చేస్తారు. ఇదంతా మిక్కుటమైన భక్తితో. అదే విధంగా ఈ శ్లోకంలో  ఆచార్యుల వారు అంబిక చేసిన పెద్ద చౌర్యం గురించి చెబుతున్నారు. ఆమె తన పతి పూర్తిదేహాన్ని కాజేసిందట. దొంగిలించిన సొమ్ము దాచి ఉంచుతారుకదా! ఆ రకంగా అంబిక తాను దొంగిలించిన శంకరుని దేహాన్ని తనలో దాచి ఉంచుకొన్నదట. ఆరోపణ ఒక్కదొంగతనమే కాదు. దొంగిలించిన సొమ్ము మీంగేసిందనికూడా. 


శ్లోకమే ఆరోపణతో మొదలవుతున్నది. “త్వయాహృత్వా వామం” నీచేత శివుని వామభాగం దొంగిలించబడింది. దీనికి “అమ్మా! నీచే శివుని ఎడమభాగము దొంగిలించబడిన తరువాత కూడా” అని అర్థం చెప్పుకోవాలి. ఈ తరువాత కూడా ఏమిటి? అపరితృప్తీన మనసా = తృప్తిపొందని మనస్సు తో; "శంభోః అపరం శరీరార్ధం అపి హృతమ్ అభూత్” = ఇంకొక భాగము కూడా దొంగిలించావు.


(సశేషం)


కృతజ్ఞతలతో 🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

సంపూర్ణ తిరుమల చరిత్ర - 13

 **దశిక రాము**


**సంపూర్ణ తిరుమల చరిత్ర - 13**


పెరియాళ్వార్లు


అంతయు నీవే హరిపుండరీకాక్ష, చెంతయు నీవే శ్రీరఘురామ


కులమును నీవే గోవిందా, నా కలిమియు నీవే కరుణానిధి


తలపును నీవే ధరణీధర, నా నెలవును నీవే నీరజనాభ


అంతయు నీవే హరిపుండరీకాక్ష, చెంతయు నీవే శ్రీరఘురామ


పుట్టువు నీవే పురుషోత్తమా, కోన నట్టనడుమ నీవే నారాయణా


ఇట్టె శ్రీ వేంకటేశ్వరా నాకు నెట్టన గతి ఇంకా నీవే నీవే


అంతయు నీవే హరిపుండరీకాక్ష, చెంతయు నీవే శ్రీరఘురామ


ఇది అన్నమయ్య ఆలాపన. కానీ ఈ పాటను ఒక్కసారి రూపకల్పన చేస్తే ఏర్పడే రూపమే పెరియాళ్వార్లు. తన తనువు, మనసు, జీవనం, జీవితం - అంతా పుండరీకాక్షుడే. చిత్తములో భావమెల్ల, శ్రీ వేంకటేశుడే అన్నట్లు నిరంతరం విష్ణు చింతన. కనులు తెరిచినా, మూసినా ఆ శ్రీమన్నారాయణుని ధ్యాసే. నిత్య సౌందర్యమూర్తి ధ్యానం, అర్చన తప్ప వేరు ధ్యాస లేని విప్రపుంగవుడు శ్రీ పెరియాళ్వార్లు. ద్రవిడ దివ్య ప్రబంధాల్లో ప్రముఖంగా పేర్కొనబడింది తిరుప్పల్లాండు, ఇంకా తిరుప్పావై. తిరుప్పల్లాండు రచించింది పెరియాళ్వార్లు కాగా తిరుప్పావై రచించింది అతని కుమార్తె గోదాదేవి. భగవంతుని నిరంతర ధ్యానంలో అనంతమైన ఆనందాన్ని పొంది, స్వామి సేవలో తరించి దివ్య సాన్నిధ్యాన్ని పొందిన ధన్యజీవులు.


పెరియాళ్వార్లనే విష్ణుచిత్తులని పిలిచేవారు. అందుకేనేమో విష్ణునామాన్ని ఎప్పుడూ చిత్తంలో ధ్యానంచేస్తూ తన పేరును సార్ధకం చేసుకున్నాడు. విష్ణుచిత్తుడు చిన్నతనం నుండీ శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీకృష్ణుని ఆలయంలోనే గడిపేవాడు. ఆ ఆలయంలోని తులసివనంలో నిత్యం పరంధాముని ధ్యానం చేస్తూ బాలప్రహ్లాదుని తలపింపచేసేవాడు. వనంలోని పూలమొక్కలకు నీళ్ళుపోస్తూ, పూలు కోస్తూ, మాలలు కడుతూ ఉండే ఈ బాలభక్తుడు అక్కడికి వచ్చే భక్తులకు చూడముచ్చటగా కనిపించేవాడు. ఆ దేవదేవునికే పిల్లను ఇచ్చినందుకు కాబోలు ఈయనకు పెరియాళ్వార్లు అని పేరు వచ్చింది.


విష్ణుచిత్తుడినే శ్రీమహావిష్ణువు వాహనమైన గరుడుని అంశగా శ్రీవైష్ణవులు భావిస్తారు. భక్తుల మరోరథాలను తీర్చే భక్తమందారుని తన భుజస్కంధాలపై తీసుకుని వచ్చి భక్తుల ముంగిట నిలిచినట్లుగా ఈ విష్ణుచిత్తుడు తన సేవలతో గోవిందుని మురిపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. వీరు కూడా మిగిలిన ఆళ్వారుల మాదిరిగానే ఎక్కడా విద్యను అభ్యసించలేదు. స్వయం జ్ఞానసంపన్నుడు, నిరంతర భగవన్నామ సంకీర్తనాచార్యులు. వీరికెప్పుడూ వాసుదేవుని దివ్యచరణారవింద సేవయే తప్ప అన్య ధ్యాస తెలీదు.


ఆ నిష్టానిది గేహసీమ నడురే యాలించినన్ మ్రోయునెం


తే నాగేంద్రశయాను పుణ్యకథలున్, దివ్య ప్రబంధానుసం


ధాన ధ్యానము, నాస్తి, శాకబాహుతా, నాస్త్యుష్ణతా, నాస్త్యపూ


పో, నాస్తోద్నసౌష్టవం చ కృపయా భోక్తవ్యమన్ పల్కులున్


శ్రీవిల్లి పుత్తూరుకు పది మైళ్ళ దూరంలో పాండ్య రాజధాని మధురానగరి ఉంది. శ్రీకృష్ణునకు ఉత్తర మధుర విహార భూమి కాగా ఈ మధుర సర్వ విద్యా కేంద్రమై ప్రాచీన దాక్షిణాత్య శిల్పముల కాలవాలమై వాపీకూప తటాకాదులచే సుమనోహరమైన పుష్పవనాలతో పరివృతమైన మహా నగరం ఈ మధురానగరం.


మధురా నగరాధినాథుడు వల్లభదేవుడు. ధర్మచింతనుడు, భగవద్భక్తి పరాయణుడు. ప్రజల కష్టసుఖాలను విచారించాలని ప్రతిరోజూ మారువేషంలో నగర సంచారం చేసేవాడు. అలా నగర సంచారం చేస్తూ ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణ వీధిలో ఒక పరదేశీ పడుకుని ఉండటం చూసి ఆతని వద్దకు వెళ్ళి ''మీరెవరు, ఏం పనిమీద ఇక్కడికి వచ్చారు? తమకు అభ్యంతరం లేకపోతే సెలవీయండి'' అన్నాడు. అంత అతడు ''అయ్యా! నేను బ్రాహ్మణుడను. తీర్థయాత్రలు చేస్తూ కాశీ నుండి బయల్దేరి రామేశ్వరం వెళ్తూ దారిలో ఈ నగరం వచ్చాను'' అని బదులిచ్చాడు.


ఆవిధంగా బాటసారికి, వల్లభదేవునికీ మధ్య సంభాషణ సాగింది. వారి మాటల మధ్యలో ఆ పరదేశీ ఒక పండితుడని, వీలయితే తన పాండిత్యాన్ని నగర పాలకుని ఎదుట ప్రదర్శించాలని విన్నవించుకున్నాడు.


అసలే సాహిత్యాభిలాషి అయిన వల్లభదేవుడు ఆ పండితుని ఒక పద్యం ఆలపించమని కోరగా ఆ పండితుడు


వర్షార్ధ మష్టో ప్రయతేతి మాసాన్ నిశార్ధ మర్ధం దివసం యతేత 


వార్ధక్యహేతోర్వయసా ననేన పరత్ర హేతోరిహ జన్మనాచ


అంటూ పాడాడు. మానవుడు వర్షాకాలానికి అవసరమయ్యే పదార్ధాలను మిగిలిన ఎనిమిది మాసాలకు కష్టపడి సేకరించి ఉంచుకోవాలి. రాత్రికి కావలసిన వస్తువులు పగలే సంపాదించాలి. ముదిమి మీద పడినప్పుడు అవసరమయ్యే వస్తువులను ధాన్యాదులను పదచుదనంలోనే గడించాలి. పరమునకు అవసరమయ్యే పరమార్థమును ఈ జన్మలోనే పొందేందుకు ప్రయత్నించాలి.


ఈ శ్లోకార్ధం వల్లభదేవునకు ఎంతో సంతోషం కలిగించింది. కానీ అతని మనసులో అలజడి కూడా కలిగింది. మొదటి మూడు విషయాలకు సర్వ సంపద సమన్వితుడైనందున చింతలేదు. కానీ పరమార్థ లాభమున కై తానేం చేయాలి? ఇంతకాలం వృథా అయిపోయింది కదా! మానవ జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలీదు కదా! పరమార్ధ సాధనకు తాను ఏమీ చేయలేదే అని బాధపడి ఇకపై తానేం చేస్తే పరమార్థం సిద్ధిస్తుందో తెలుసుకునేందుకు దేశం నలుమూలల నుండి పండిత గోష్టిని ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాడు.


ఆయువు వీచి చంచలము, యౌవన మల్ప సుఖోదయంబు, పు


ష్పాయుధ కేళిజన్యసుఖమస్థిర, మర్ధము వాంఛవోలె సా


పాయము, భోగముల్ మెళపులట్లు చలంబు భావాబ్దిలంఘనో


పాయము బ్రహ్మ చింతనము బ్రాయక సేయుండు సజ్జనోత్తముల్


అని భర్తృహరి చెప్పినట్లు భావించి పరలోక ప్రాప్తికి పరతత్వ జిజ్ఞాస అవసరము కదా! అట్టి పరతత్వము నిర్ణయించుటకై వేదవేదాంతవేత్తలగు పండితులను పిలిపించి సభ చేయించిన యెడల ఈ పరమార్ధ సాధనకు ఏం చేయాలో తగిన సూచనలు పండితులు చేయగలరని ఆశించాడు. అందుకే సకల శాస్త్ర విశారదులు, పండిత ప్రకాందులు, విద్యావేత్తలు, తత్వవేత్తలు, వేదాంత మహామహోద్యాయులను సవినయంగా ఆహ్వానించి పెద్ద ఎత్తున అతిథి మర్యాదలు చేయించాడు. అందరినీ సంతుష్టులను చేసి వారిచ్చే సముచిత సలహాలతో తనలో ఉన్న సంశయాలను పోగొట్టుకోవాలనుకున్నాడు.


మర్నాడు ఆ బ్రాహ్మణుని ఆస్థానానికి ఆహ్వానించి తగురీతిన సత్కరించి ''ఆర్యా! పురుషార్ధ ప్రదమగు వస్తువేదో శాస్త్ర ప్రమాణ పూర్వకంగా పండితులచే తెలుసుకోవలసి ఉంది. కనుక మోక్ష ప్రాప్తికి, జగదుత్పత్తికి మూలమైన పదార్ధం గురించి తెలుసుకోకపోతే జన్మకు సార్ధక్యం లేదు కదా! కనుక వెంటనే వేదవేదాంత వేత్తలైన పండిత శ్రేష్టులను దేశదేశాల నుండి రప్పించి పురుషార్ధ సాధనకు తగిన మార్గం ఏదో తెలుసుకోదలచానని తెలియజేశాడు రాజు.


అంతటితో ఆగక ఆ మహారాజు తక్షణమె తగిన ఏర్పాట్లు చేసి పండిత గోష్టి ఏర్పాటు చేశాడు. కానీ ఎవరూ కూడా తగిన సమాధానంటో మహారాజును సంతృప్తి పరచలేకపోయారు. భగవంతుని తత్వాన్ని, అంతర్మధనంచేసి అవగాహన చేసుకున్న మహాభక్తునికి కానీ సాధ్యంకాని పరమాత్మ తత్వం తెలియజేయాలంటే మామూలు వ్యక్తికి సాధ్యంకాదు కదా! నిరంతరం భక్తి సాగరంలో తన్మయత్వంతో పరవశించే భక్త శిఖామణియే దీనికి పరిష్కారం ఇవ్వగలడనే భావం అందరికీ కలిగి తమ రాజ్యంలో అటువంటి పరమాత్మ భక్తవశుడైనవాడు విష్ణుచిత్తుడే నని తెలుసుకున్నాడు.


శ్రీవల్లి పుత్తూరులోని శ్రీకృష్ణుని ఆలయమ్లో నిత్య కైంకర్యంలో ఇహపరాలను వాసుదేవుని సేవకు అంకితం చేసిన విష్ణుచిత్తుని తన వద్దకు తీసుకురమ్మని ఆదేశించాడు రాజు. వాసుదేవుని ఆజ్ఞగా భావించిన విష్ణుచిత్తుడు ముకుళిత ధ్యానచిత్తంటో రాజప్రాసాదం చేరుకున్నాడు. రాజప్రాసాదం అంతా పండిత గోష్టితో శోభాయమానంగా ఉండి ముకుందుని రాకకై ఎదురుచూసే రేపల్లె మాదిరిగా కనిపించింది. ఎందరో విద్వాంసులు, పండితులు, జ్ఞానసంపన్నులు నిండు సభలో ఉండగా తాను విష్ణు పారాయణం తప్ప ఏం పురుషార్ధ నిర్ణయం చేయగలడు?!


నిత్య ధ్యాన సముద్రుడైన విష్ణుచిత్తుడు మహారాజు అడిగిన ప్రశ్నకు బదులుగా సర్వ పదార్థాలు వేదాల్లో ఇమిడిఉన్నాయి. వేదం అష్టాక్షరీ మంత్రంలో ఉంటుంది. అలాంటి నారాయణాష్టాక్షరి ప్రణవమున ఓంకారంలో ఉంటుంది. ఆ, ఓ, ఇ కారమునకు అకారము మూలం. వేదములకు మొదట ఓంకారం ఉంటుంది. అ, ఉ,మ – వీని కలయికయే ఓం. కనుక వేదములకు మూలం అకారమే. వేదాది అయిన ఆ అకారమే వేదాంతమునకు బ్రహ్మ విద్యకు మూలం. బ్రహ్మమే పరతత్వం. కనుక పరతత్వమునకు మూలం కూడా అకారమే. ఈ దృశ్యమానమైన ప్రకృతిని సృష్టించినవాడే పరుడు, స్థితికర్త. ఆ పరుడే పరమాత్మ, బ్రహ్మం లేక పరబ్రహ్మం. ''అక్షరాల్లో నేను అకారాన్ని'' అని గీతాచార్యుడు కూడా పలికాడు. అకారమే సర్వమునకు ఆత్మ. అట్టి ఆకారం విష్ణువునే చెప్తుంది. ఇతర దేవతలను అది యెంత మాత్రం చెప్పాడు. అకారవాచ్యుడైన ఆ విష్ణుభగవానుడే పరతత్వం, శ్రీమన్నారాయణుడు. మోక్ష ప్రదానార్హట బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో విష్ణువునకు ఒక్కనికే గలదను విషయం మోక్షమిచ్చేత్ జనార్దనాత్ అనే మాట రుజువు చేస్తోంది కదా! కనుక అకార వాచ్యుడగు ఆ విష్ణు భగవానుడు ఒక్కడే అనడంలో విప్రతిపత్తి ఎంతమాత్రం లేదు. విష్ణువు నుండి ఉద్భవించిన ఈ జగత్తు అతనిలోనే ఉండి అతనిలోనే లీలమౌతుంది. కనుక నారాయణుని మించిన పరతత్వం నభూతో నభవిష్యతి. ఇదే అఖిల వేద పురాణసారం. వేదములను మించిన శాస్త్రంలేదు, కేశవుని మించిన పరతత్వం లేదు అని పండిత గోష్టిలో వినమ్రంగా విన్నవించుకుని ఎలుగెత్తి సుస్వరంగా సకల వేదసారమైన విష్ణు సహస్రనామ శ్లోకాలను గానం చేయసాగాడు. అద్భుతమైన తన గాన మాధుర్యంతో నిండు సభాస్థలిని అంతా తన్మయం చేయసాగాడు. నిశ్శబ్దం ఆవరించగా ప్రతి హృదయం విష్ణు పారాయణంతో నిండు సభాస్థలిని అంతా తన్మయం చేయసాగాడు. నిశ్శబ్దం ఆవరించగా ప్రతి హృదయం విష్ణుపారాయణంతో పరవశించసాగింది. ఉదయం ప్రారంభమైన విష్ణు సహస్రనామ సంకీర్తన సాయంత్రంవరకూ ప్రతి అణువూ పులకించగా పరవశించిపోయింది. అక్కడున్న అందరికీ అప్పుడు అర్ధమైంది మానవజన్మకు అవసరమైన చతురార్ధమైన ధర్మార్థ కామమోక్షాలలో పురుషార్ధకారకమైన ఏకైకమార్గం వేదవేద్యుడైన పరందాముని ధ్యానం, అర్చన, ఆరాధన తప్ప మరేం కాదని, అది బోధించిన విష్ణుచిత్తుని అంతరార్థం అర్ధమైంది. అంతట ఆ మహారాజు తన సింహాసనం నుండి దిగివచ్చి పరదేశీ పండితుని సముచితంగా సత్కరించి, విష్ణుచిత్తుని పండిత గోష్టి ముందు గజారోహణం చేయించి నగర వీధుల్లో ఊరేగించసాగారు.


అంతట నిరంతర విష్ణుచింతనాపరుడైన ఆ విష్ణుచిత్తుని ఆశీర్వదించగోరి మహాలక్ష్మి సమేతుడైణ శ్రీహరి గరుడారోహితుడై ప్రత్యక్షమయ్యాడు. అంతట విష్ణుచిత్తుడు అమందానంద పరవశుడై అఖిలాండ కర్తనధికుడైన పుండరీకుని చూసి సర్వాలంకార భూషితుని కాంచిన పారవశ్యంతో స్వామికి నమస్కరించుతాకు బదులు మహా మహితాత్ముడైన శ్రీమహావిష్ణువుని దివ్య మంగళ సౌందర్యరూపునికి సకల కల్యాణవిభుని గుణసంపదకును ప్రాకృత జనుల దృష్టి ఎక్కడ తగులుతుందోనని భీతి మనస్కులై యుక్తాయుక్తములు మరచి గజఘంటలనే తాళంగా చేసుకుని హృద్యమైన మృదుమధురమైన ద్రావిడ పాశురగానంతో స్వామివారిని ఆశీర్వదించారు. దీన్నే మంగళాశాసనం అని కూడా అంటారు. ఈ మంగళా శాసనానికి తిరుప్పల్లాండు అని పేరు. అది ఏమని స్తుతించారంటే -


పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి సూరాయిరం


మల్లాండ తిండోళ్ మణివణ్ణా ఉన్ శేవడు శెవ్వి తిరుక్కాప్పు


అనే తమిళ పాశురమే ముందుగా గానం చేసి మిగిలిన పాశురాలను తర్వాత గానం చేస్తారు.


హరి నీల కోమల శ్యామల దేహ, క్రూర కంస నిసృష్ట ఘోర చాణూర మల్లనిబర్హణ


మహిత బలిష్ట బాహుయుగళ నీదు పాదారవింద సౌందర్య సమధిక సంవత్సరమృద్ధి


బహు వత్సరములు బహు వత్సరములు బహు సహస్రాబ్దముల్


బహు కోటి లక్ష వర్షముల్ కొరలేక వర్ధిల్లు గాక


అని దేవదేవుడినే ఆశీర్వదించాడు. అందువల్లనే విష్ణుచిత్తునికి పెరియాళ్వారులని పేరు వచ్చింది. మహావిష్ణువునే బాలగోపాలునిగా భావించి దిష్టితీసిన విష్ణుచిత్తుని ఉన్నత భావనకు గుర్తుగా వీరికి పెరియాళ్వారులనే పేరు సార్ధకమైంది.


వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి 


దయచేసి షేర్ చేయండి 


స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన నామం " గోవిందా " ... ఎవరు తనని గోవిందా అని పిలుస్తారా అని ఎదురు చూస్తుంటారట స్వామి వారు ... 


కనుక మనం ఆలస్యం చేయక 


అందరం " గోవిందా గోవిందా " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ...


గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా


🙏🙏🙏

సేకరణ

ధార్మికగీత - 100*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                         *ధార్మికగీత - 100*

                                   *****

   *శ్లో:- రూపం జరా౹ సర్వసుఖాని తృష్ణా ౹*

          *ఖలేషు సేవా పు రుషాభిమానం౹* 

          *యాచ్నా గురుత్వం౹ గుణ మాత్మపూజా౹*

          *చింతా బలం౹ హన్త్య దయా చ లక్ష్మీమ్౹౹*

                                        *****

*భా:- మానవ జీవనసరళిలో అనూహ్యంగా చోటుచేసుకునే అంశాలు పరిశీలిద్దాం.1."జర":- హీరోగా రాణించడానికి ప్రధాన ఆలంబనమైన దేహసౌందర్యాన్ని "ముదిమి" పగబట్టి జీర్ణించి జీరోగా చేస్తుంది. 2."తృష్ణ":- తీరనికోరికలకై పరుగెత్తేవాణ్ణి ఎదురుగా ఉన్న సుఖాలను కూడ ప్రతీకారంతో అనుభవించకుండ చేస్తుంది "ఆశ". 3."ఖలసేవ":- "దుర్జన సేవ" మన ఆత్మాభిమానాన్ని, పౌరుషాన్ని కసిదీరా మంటగలుపుతుంది. 4. "యాచన":- యోగ్యత,అర్హత,ఉచితజ్ఞత లేనిచోట చేసే యచనావృత్తి మన ఆత్మగౌరవాన్ని నిర్దాక్షిణ్యంగా రూపుమాపుతుంది. 5."ఆత్మస్తుతి":- మన గొప్ప మనం చెప్పుకోవడం వల్ల అప్పటివరకు ఉన్న సుగుణాలన్ని సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి.6."చింత":- మనకున్న శారీరక, మానసికమైన వేయి ఏనుగుల బలాన్ని కూడ "దిగులు" అనేది నామరూపాలు లేకుండా చేస్తుంది.7. "ఆదయ":- "క్రౌర్యము" కట్టలు తెంచుకొని మితిమీరితే, మన సకల సిరి సంపదలు హరించుకు పోతాయి. వీనిలో ఒక్క "ముసలితనం" వయోరీత్యా సంక్రమిస్తుంది. కాని మిగిలినవన్ని మనకు మనం బలవంతాన కొని తెచ్చిపెట్టుకొనేవే. మనోబలం పటిష్ఠంగా ఉంటే వీనిని ధైర్యస్త్థెర్యాలతో అధిగమించవచ్చునని సారాంశము*

                                   *****

                    *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

*కార్తీక పురాణం

 *కార్తీక పురాణం*

*21వ అధ్యాయము*

🕉🌺🕉🌺🕉🌺🕉🌺🕉


*పురంజయుడు కార్తీక ప్రభావము నెరు౦గుట*


ఈ విధముగా యుద్దమునకు సిద్దమై వచ్చిన పురంజయునకు, కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్దము జరిగింది. ఆ యుద్దములో రధికుడు రధికునితోను, అశ్వసైనికుడు అశ్వసైనికునితోను, గజసైనికుడు గజసైనికునితోను, పదాతులు పదాతి సైనికులతోను, మల్లులు మల్లయుద్ద నిపుణులతోను ఖడ్గ, గద, బాణ, పరశువు మొదలగు ఆయుధాలు ధరించి, ఒండొరుల ఢీకొనుచు హుంకరించుకొనుచు, సింహ నాదములు చేసి కొనుచు, శూరత్వవీరత్వములను జూపుకోనుచు, భేరీ దుందుభులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములును విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొ౦డెములు, తొండలు, తలలు, చేతులు - హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు. పర్వతాల వలె పడియున్న ఏనుగుల, గుఱ్ఱముల కళేబరాల దృశ్యములే. ఆ మహా యుద్దమును వీరత్వమును జూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్దము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్ట మై పోయెను. అయినను, మూడు అక్షౌహిణులున్న పురంజయుని సైన్యమునెల్ల అతి సాహసముతో, పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను.


దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రు రాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయములో వశిష్టులు వచ్చి పురంజయుని ఊరడించి "రాజా! మున్నొకసారి నీ వద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చెస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైననూ సన్మార్గుడవయి వుండుమని హెచ్చరించితిని. అప్పుడు నామాట లానలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తునుడవై వున్నందుననే యీ యుద్దమును ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితిని. ఇప్పటికైనా నామాట లాలకింపుము. జయాపజయాలు దైవాధీనములని యెఱ్ఱి౦గియు, నీవు చింతతో కృంగి పోవుటయేల? శత్రురాజులను యుద్దములో జయించి, నీరాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపుకలదేని, నాహితోపదేశము నాలకింపుము. ఇది కార్తీకమాసము. రేపు కృత్తికానక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన, స్నాన జపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి, భగవన్నామస్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లోనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతియేగాదు, శ్రీమన్నారాయణుని సేవించుటవలన శ్రీహరి మిక్కిలి సంతోషమొంది నీ శత్రువలను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక, రేపు అట్లు చేసిన యెడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్టసహవాసము చేయుట చేతగదా నీకీ అపజయము కలిగినది? గాన లెమ్ము. శ్రీహరి నీ మదిలో దలచి నేను తెలియ జేసినటుల చేయు" మని హితోపదేశము చేసెను.


*అపవిత్రః పవిత్ర వా నానావస్దాన్ గతోపివా |*

*యః స్మరే *త్పుండరీకాక్షం స బాహ్యాభ్యాంతరశ్శుచిః ||*


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి ఏకవింశోధ్యాయము - ఇరవయ్యోకటోరోజు పారాయణము సమాప్తము.*


🙏🙏

మణిద్వీపం

 మణిద్వీపం


శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం


🌻 మణిద్వీపం అని తలచినంత మాత్రంగానే సకల దరిద్రాలూ.. దరిదాపుకు చేరవని శాస్త్ర ప్రమాణం. మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చే ఫలితాలను వర్ణించడానికి వేయిపడగల ఆదిశేషుడుకి కూడా సాధ్యం కాదు.


🌻 ఈ బ్రహ్మాండమును కనురెప్పపాటులో సృష్టించి లయం చేయగల ముప్పై రెండు మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వమూ ఉండటంవలన ముప్పై రెండు రకాల పూలతో, పసుపు..కుంకుమలతో..నవరత్నాలతో.. రాగి, కంచు, వెండి, బంగారము మెదలగు లోహాలతో యథాశక్తి అమ్మవారికి పూజచేసుకుంటూ.. నైవేద్యాలుగా 32 రకాలు చేసి, సుగంధ ద్రవ్యాలతో మణిద్వీప నివాసినిని పూజిస్తారు.


🌻 32 రకాల నైవేద్యాలకు శక్తి లేనివారు తమ శక్తి కొలది నైవేద్యాలను సమర్పించుకొని పూజించుకోవచ్చు. అమ్మకు భక్తి ప్రధానము.


🌻 మొగలి పూవు, బంతి పూవూ పూజకు పనికిరాదు. మందారాలలో, గులాబీలలో, చామంతులలో చాలా రకాలు ఉన్నా.. వాటన్నిటినీ ఒక్కొక్కటిగానే పరిగణించి ఈ క్రింద ఇవ్వడం జరిగింది. 


1. మల్లె పువ్వులు 

2. గులాబి 

3. సన్నజాజి 

4. విరజాజి 

5. సెంటుమల్లి 

6. డిసెంబరం పువ్వులు 

7. చామంతులు 

8. లిల్లీ 

9. ముద్ద గన్నేరు పువ్వులు 

10. నందివర్ధనం 

11. పారిజాత పువ్వులు 

12. చంద్రకాంత పువ్వులు 

13. సువర్నగన్నేరు పువ్వులు 

14. కలువ పువ్వులు 

15. పాటలీ పుష్పాలు 

16. ముద్ద నందివర్ధనం 

17. గన్నేరు పువ్వులు 

18. కదంబ పువ్వులు 

19. మందారాలు 

20. తామరలు 

21. కనకాంబ్రాలు 

22. దేవగన్నేరు పువ్వులు 

23. అశోక పుష్పాలు 

24. నిత్యమల్లె పువ్వులు 

25. కుంకుమ పువ్వులు 

26. పొన్న పువ్వులు 

27. మంకెన పువ్వులు 

28. రాధా మనోహరాలు 

29. కాడమల్లె 

30. నాగమల్లె 

31. విష్ణుక్రాంతం 

32. రామబాణాలు లేక నూరు వరహాలు 

33. దేవకాంచన పువ్వులు 

34. చంపక ( సంపంగి) 

35. పున్నాగ పుష్పాలు.


గమనిక:- 

దయచేసి ఈ పువ్వుల రకాలన్నీ ఎక్కడ దొరుకుతాయో నన్ను అడగకండి.


ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంతే చేయండి.


మణిద్వీప వర్ణన మహత్యమేమిటి?


🌻 శ్రీచక్ర బిందు రూపిణి.. శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి.. 

శ్రీ మహావిద్య శ్రీ మహాత్రిపురసుందరి, శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం. పద్నాలుగు లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై వున్నారు. యావత్‌ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగానే ఈ లోకం ఉద్భవించింది. నాలుగువైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా వున్న ఈ ద్వీపాన్ని.. వర్ణించాలంటే మన శక్తి చాలదు. (నా శక్తి చాలదు). మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితయై వుంటారు. దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించిన వర్ణన వుంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో బాటు, బంగారు మయమైన కొండలు ఈ ద్వీపంలో వున్నాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు.


🌻 మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు వుంటారు. వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు. 

అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం వుంటుంది. పచ్చటి అరణ్యములతో, వివిధ రకాల జంతువులు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు వుంటారు. జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్‌ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ వుంటుంది. అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో వుండటమే అదొక మహా వరం. అందుచేతనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తుంటారు. ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తుదోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలూ లభిస్తాయి.

నుదుటిన బొట్టు

 నుదుటిన బొట్టు, సింధూరం దీనికి జ్యోతిషానికి సంబంధం.


మనకు తెలిసినంత వరకు బృహత్ జాతకంలో నాలుగవ శ్లోకంలో కాలాంగాని అనే శ్లోకంలో మొదట అంగ నిరూపణ చేస్తారు. వరాంగము అనగా శిరోభాగం. అది మేష రాశి. మేషానికి అధిపతి కుజుడు. కుజుని కి సంబంధించినటువంటి రంగు ఎరుపు సింధూరం. ఇదంతా మేష రాశి కి ఉన్నటువంటి లక్షణాలు. అయితే మరో విశేషాన్ని మనం గమనించాలి. మేష రాశి రవికి ఉచ్చ స్థానం. సహజంగా జ్యోతిష్యంలో రవిని ఆత్మకారకుడు అని పిలుస్తారు. ఇది జైమిని జ్యోతిషం లో కొంత భిన్నంగా ఉంటుంది. అక్కడ ఒక రాశిలో అత్యధిక భాగలు తిరిగిన గ్రహాన్ని ఆత్మకారకుడు గా చెబుతారు. ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే.... ఆత్మ కారకుడు రవి గా ఉన్నప్పుడు, (స్థిర కారకత్వాలు లో) దానిని మేషంలో ఉచ్చ గా మనం చెబుతాం. అనగా ఆత్మ కారకుడు ఉచ్చ పట్టిన స్థితి రవి. స్త్రీ యొక్క నుదుటున సింధూరం ధరించి నట్లయితే ఆత్మ విభుడు దొరికినట్లు అర్థం చేసుకోవచ్చు. అతనికి ఇచ్చే విలువ ఆవిడ సింధూరం ధరించడంతో ఉంటుంది. దాన్ని ఫాల భాగము అంటాము. పాపిట తీస్తూ ఉంటారు. ఆ పాపిట అనేది రవి సంచరించే మార్గం. అది వంకరగా వస్తే జీవితం బాగోదని పెద్దల సూచన చేస్తూ ఉంటారు. తిన్నగా పాపటి వస్తే అదృష్టవంతురాలు గా చెప్తారు. జుట్టు చీకటి కి చిహ్నంగా ఉంటుంది. చీకటి లో నుంచి  వెలుగు ప్రసరింపచేసేటువంటి, చీకటిని చీల్చుకుని వచ్చే సూర్యబింబం మాదిరిగా స్త్రీ సింధూరం ధరిస్తుంది. అప్పుడు ఫాల భాగము సంపూర్ణం అవుతుంది. ఈ సింధూరం గాని లేకపోతే, జీవితంలో అది రాకపోతే వారిని అఫాల  అని పిలుస్తూ ఉంటారు. అంటే పాలకుడు లేని స్త్రీ అని అర్థం. మనకు ఉదాహరణగా ధూమావతి ని చెప్తారు. శివుడు లేని పార్వతి రూపం అది. పార్వతి లేని శివుణ్ణి ఇంటిలో ఫోటో కింద పెట్టడం నిషిద్ధం అని చెబుతారు... అలా పెడితే తే.గీ మందికి పెళ్లిళ్లు కాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెబుతూ ఉంటారు.  పూర్వజన్మలో భర్త, తిరిగి భర్తీ గా ఆత్మకారకుడు గా దొరికిన స్త్రీ అదృష్ట జాతకురాలు అని చెప్పవచ్చు. వారి మధ్య అన్యోన్యత, సంబంధములు బాబు గా ఉంటాయి అని అర్థం. కాబట్టి ఈ భారతదేశంలో నుదుట సింధూరం ధరించడం అనే వ్యవహారం, స్త్రీ తనకు గొప్ప భర్త దొరికినట్లు ప్రకటించడం. మహాభారతంలో ద్రౌపతి వస్త్రాపహరణం తరువాత, నుదట సింధూరాన్ని చెరిపేస్తుంది, తరువాత జుట్టు విరబోసుకుని పాపటి లేకుండా చేసుకుంటుంది. తనకి సూర్యోదయం లేదని, తన భర్తలు తన మనసును అర్థం చేసుకోలేదని ఆవిడ ప్రకటన చేసినట్లు అవుతుంది.  కానీ ద్రౌపతి రవి (సిందూరంతో) శోభిల్లాలి అంటే కుజుడి (రక్తంతో) శిరోజాలను (కేతు నక్షత్రం అశ్విని, అది దేవతులు అశ్వినీదేవతలు, శక్తి కారకులు, ఆరోగ్యప్రదాయిలు) తడపాలని కోరుతుంది, అప్పుడే మోక్షాన్ని ప్రసాదించే కలిగిన భర్త అవుతాడని ఆవిడ నమ్మి చెప్పినటువంటి మాట అది. సింధూరము అత్యంత పవిత్రమైనది, భాగ్య ఒక్క నమ్మకానికి భర్త యొక్క శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. ఎవరైనా కుటుంబసభ్యులు కాలం చేసినప్పుడు అశౌచం లో ఉన్నప్పుడు నల్ల బొట్టు ధరిస్తారు. అది శనికి గుర్తుగా ఉంటుంది.🙏🌹🙏

మహానుభావుల బాట

 మహానుభావుల బాట - శ్రీ చాగంటి వారి మాట


శ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావు గారు


ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు, నిరంతర స్ఫూర్తిదాయకములు. అటువంటి ఎన్నో విషయములు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో...


కాకినాడ శ్రీమతి ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల లో విద్యార్థులని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు శ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావు గారి అమృత గానము గురించీ, వారి దేశ భక్తి గురించీ, వారి ఉదాత్తమైన గుణము గురించీ పూజ్య గురువులు ప్రస్తావించిన విషయములు.. శ్రీ ఘంటసాల గారి జయంతి సందర్భముగా..


తిరుమల కొండలకు వెళ్ళినప్పుడల్లా నాకు... "మహానుభావుడు ఘంటసాల గారు. ఆయన ఎక్కడ కూర్చుని చేస్తే ఏం! స్వామి యొక్క పవిత్రమైన సన్నిధానము ఈ ఏడుకొండల మీద ఆయన కంఠము వినపడుతూ ఉంటుంది. భగవంతుడు చెప్పినది భగవద్గీత. ఆయన చెప్పిన భగవద్గీత ఘంటసాల గారు చెబుతూ ఉంటే శ్రీ వేంకటేశ్వరుడు కూడా దేవేరులిద్దరితో కలిసి వింటాడు. 'నేను ఎంత గంభీరంగా చెప్పానో అంత గంభీరంగా చెప్తున్నాడు' అని ఈశ్వరుడు కూడా ప్రశంసిస్తాడు. ఆయన ధన్యుడు! ఆయన శరీరం వెళ్ళిపోయినా, ఆయన కీర్తి శరీరం మిగిలిపోయింది. ఒక మనిషి బ్రతుకు అంటే అలా ఉండాలి." అని అనిపిస్తూ ఉండేది. అందుకే నేను.. "అసలు ఈయన ఇలా ఎలా కాగలిగారు?" అన్న విషయము తెలుసుకోవాలి అని తాపత్రయ పడే వాడిని.


నా అదృష్టం, శ్రీ వరప్రసాద్ గారు ముద్రించిన "అమ్మకు జే! జే!! నాన్నకు జే! జే!! గురువుకు జే! జే!!" అనే పుస్తకము నేను చదివాను. అసలు ఆ పుస్తకము ప్రతీ ఇంట్లోనూ తల్లితండ్రులు పిల్లలచేత చదివించాల్సిన పుస్తకము. అందులో - "ఘంటసాల గారు చిన్నతనములో ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన తన చేతికున్న ఉంగరము అమ్మేసుకొని, విజయనగరములో సంగీతము నేర్చుకోవటానికి వెళ్తే, ఆయన వెళ్లగానే అక్కడ ఆయనకు ప్రవేశము లభించక, సాలూరులో కొన్నాళ్ళు సంగీతము నేర్చుకొని వచ్చి, ప్రతీ రోజూ సాయంకాలం ఒక తువ్వాలు పట్టుకొని, ప్రతీ ఇంటికీ బిక్ష కోసము వెళ్ళేవారు. ఎవరింట్లోనో భోజనము చేసి, ఒక హనుమ దేవాలయములో పడుకునేవారు. నేను విజయనగరము వెళ్లినప్పుడు ఆ హనుమ దేవాలయము చూద్దామని ఎందరినో అడిగి ఆ దేవాలయమునకు వెళ్లాను. అటువంటి దేవాలయము నేను ఎన్నడూ చూడలేదు. అక్కడ ఉన్న హనుమ ప్రత్యేకముగా గాంధర్వ వేదమును ఉపాసన చేస్తున్న హనుమ. ఆయన తాళము వేస్తూ, ఒక పక్కకు చూస్తూ, సంగీతము పాడుతూ, పరవశించిపోతూ ఉంటారు. చిన్న గుడి. ఘంటసాల గారు ఇల్లు లేక అక్కడ పడుకునేవారట. నాకప్పుడు అనిపించింది.. ఈయన ఏ రాత్రి నిద్రపోతూండగా స్వామి హనుమ వచ్చి బీజాక్షరాలు రాసేసాడో.. లేక తల మీద చెయ్యి పెట్టి వెళ్ళిపోయాడో.. మహానుభావుడు అందుకే ఆ కంఠం లోంచి అంతటి అమృత ఝరి వంటి సంగీతం వచ్చింది అని".


అంత కష్టపడిన వ్యక్తికి జీవితములో ఒక పెను మలుపు వచ్చింది. ఆకాశవాణి లో ఆయన పాడిన ఒక పాట విని, చలన చిత్రాలన్నిటిలో ఆయన చేత పాడించి, ఆయన గొప్ప వృధ్ధిలోకి వస్తున్న రోజుల్లో, స్వాతంత్ర సంగ్రామము చేస్తున్న పెద్దలందరినీ తీసుకెళ్ళి బ్రిటీష్ ప్రభుత్వము కారాగారములో పెట్టింది. ఇంతమంది పెద్దలు స్వాతంత్రము కోసం ఎలుగెత్తి పోరాటము చేస్తూంటే, నేనొక్కడినీ, నాకు బాగుంది.. మంచి అవకాశాలు, డబ్బు వస్తున్నాయని ఇలా ఉండిపోనా అని సిగ్గుపడి, ఆయన, ప్రజల్లోకి వెళ్ళి, దేశ భక్తి గీతాలు పాడుతూ, ఉపన్యసిస్తూ, కారాగారబధ్ధులై 18 నెలలు కారాగారవాసము చేసారు. నా వృధ్ధి కన్నా ఈ దేశము గొప్పది. తన ఆర్జన కన్నా దేశ సేవ గొప్పదని నమ్మిన గొప్ప దేశ భక్తుడాయన.


కష్టపడి ఆయన కొంత డబ్బు సంపాదించుకున్న రోజులు... ఆ రోజుల్లో, ఉత్తర భారతదేశము నుంచి ఆలీ ఖాన్ అని ఒక సితార్ విద్వాంసుడు చెన్నై కచేరీల కోసం వచ్చారు. ఆయన దురదృష్టం.. ఎవ్వరూ కచేరీ పెట్టుకోలేదు. ఆయన బాధతో వెళ్ళిపోతున్నారు. సాటి విద్వాంసుడు కష్టాలలో ఉన్నాడని, ఘంటసాల గారు ఆయనని ఇంటికి పిలిచి, ఆయనే కచేరీ పెట్టి, ఆ రోజుల్లో వెయ్యి రూపాయలు తాంబూలము ఇచ్చి పంపించారు. అలాగే బడే గులాబ్ ఆలీ ఖాన్ అని ఒక హిందుస్తానీ గాత్ర విద్వాంసుడు చెన్నై వచ్చి, ఉండటానికి తగిన వసతి దొరకకపోతే ఘంటసాల గారు ఆయన్ని తన ఇంట్లోనే ఉండమన్నారు. ఆ విద్వాంసుడి స్థాయి ఎంత గొప్పదీ అంటే... ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారు, ఎం ఎల్ వసంత కుమారి గారు వంటి వారు కూడా ఆయనకోసం వస్తూండేవారు. దానితో రోజుకి ఎంతో మందికి కాఫీలు, ఫలహారాలు, భోజనాలు వగైరా అన్నీ పెట్టి, ఆలి ఖాన్ గారు ఉన్నంత కాలం సంతోషంగా తన ఇంట్లోనే ఉంచుకుని సాగనంపారు ఘంటసాల గారు. తాను బాగా సంపాదిస్తూ, తన సాటి సంగీత విద్వాంసుడికి ఒక రూపాయి రాకపోయినా పట్టించుకోకుండా ఉన్న వారు కాదు ఘంటసాల గారు. అంత గొప్పది ఆయన మనసు. ఉదాత్తమైన గుణము ఆయనది.

మూడనమ్మకాలు గల గండ నక్షత్రాలు

 నేను కొత్తగా చదివిన విషయం.

మన సభ్యుల అభిప్రాయం కోసం పెడుతున్నాను


మూడనమ్మకాలు గల గండ నక్షత్రాలు


వివాహ పొంతనలకు జాతకం తీసుకోగానే అమ్మో అమ్మాయిది అశ్లేష నక్షత్రం అట అత్తగారికి గండం మాకు ఆ సంబంధం వద్దు అని వెంటనే చెప్పే మాటలు వింటుంటాం. అశ్లేష, మూల, విశాఖ,మఖ, జ్యేష్ఠా ప్రతి 27 రోజులకు ఒకసారి మొత్తంమీద అయిదు రోజుల పాటు వుండే ఈ నక్షత్ర కాలంలో పుట్టిన ఆడవారు పెళ్లికి పనికిరారా? వారిని చేసుకోకూడదా? శాస్త్రం ఇలా తప్పుడు మాటలు చెప్పిందా? అంటే శాస్త్రం పిచ్చిమాటలు ఎప్పుడూ చెప్పలేదు. అపోహలు, అపవాదులు సంఘంలో అధికంగా ప్రబలిన రోజులివి. శాస్త్ర దూరమైన అంశాలు ఎన్నో మనం అధిక ప్రాచుర్యంలో చూస్తాం.


మూల నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే మామగారు చనిపోతారని, మతాంత రంలో మొదటి పాదం మాత్రమే హానికరమని,2,3,4 పాదాలు శుభమని చెప్పటం జరిగింది. ముహూర్త చింతామణిలో ‘మూలాంత్య పాద సార్పాద్య పాద ఔతమ్ శుభౌ’ అనగా మూల చివరి పాదము నందు అశ్లేష ప్రథమ పాదము నందు జన్మించిన దోషం కలిగించదు అని వున్నది.


అశ్లేష నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే అత్తగారు చనిపోతారని,మతాంతరంలో మొదటి పాదం మాత్రమే శుభమని,2,3,4 పాదాలు అశుభమని చెప్పటం జరిగింది.


జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే కోడలి యొక్క బావగారు అంటే ఇంటికి పెద్ద కుమారుడు చనిపోతారని,జ్యేష్టా నక్షత్రం అమ్మాయిని ఇంటిలో చిన్నవారికి ఇచ్చి చేయటం వలన బావగారికి గండము అని చెప్పబడినది. అందువలన ఇంటిలో జ్యేష్ఠులకు ఇచ్చి చేస్తే ఇక బావగారు అనే అంశం ఉండదు కదా! అందువలన దోషం లేదు.


విశాఖ నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే ఆఖరి మరిది చనిపోతాడని ,మతాంత రంలో మొదటి పాదం మాత్రమే హానికరమని,2,3,4 పాదాలు శుభమని చెప్పటం జరిగింది. మతాంతరంలో ‘విశాఖా తులాయా యుక్తఃదేవరస శుభావహ’ అని వున్నది. తులలో వున్న విశాఖ అనగా విశాఖ 1,2,3 పాదాలు మరుదులకు శుభమే అని వున్నది.


మఖ నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే ఇంట్లో ఎవరైన చనిపోవచ్చని ...

ఇలా చాలా మూడ నమ్మకాలు ప్రతి వారి హృదయంలో పాతుకు పోయి ఉన్నాయి .


ఈ భయాల వల్ల భవిష్యత్తులో మీరు కూడ అంద విశ్వాసాలకు బలి కావచ్చును.ఎలాగంటే మీరు కోరి మంచిదని నమ్మిన నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకున్నా ఆమెకు కలిగే శిశువు మూల,అశ్లేష,జ్యేష్ట,విశాఖ,మఖ నక్షత్రాలలో జన్మిస్తే మీరు ఆ శిశువుకి వివాహం భవిష్యత్తులో చేయగలరా?అప్పుడు శాస్త్రాన్ని నిందించి ప్రయోజనం ఉండదు.


ఒకరి జన్మ నక్షత్రాల వల్ల మరణాలు మరొకరికి సంభవించవు.నక్షత్రాలవల్ల జరిగితే మంచి జరుగుతుంది గాని చెడు జరగదు.


నక్షత్రాలపై మీకు ఏదైనా సంశయం ఉంటే అది వివాహం చేసుకున్న భార్యా భర్తలకే వర్తిస్తుంది కాని వారి తల్లితండ్రులకు,అక్క చెల్లెల్లకు,లేక అన్నదమ్ములకు వర్తించదు.


కాబట్టి మీరు ఏమాత్రం సంకోచం లేకుండా మిగిలిన విషయాలన్నింటికి పొంతన కుదిరితే మూడ నమ్మకాలను వదిలి వివాహం చేయవచ్చు.


జాతక పరిశీలనలో అన్ని విషయాలకు పొంతన కుదిరితే నక్షత్రం పేరు మీద అనవసరంగా భయానికి లోనై విద్యా,వినయం,వివేకం,గుణం,సాంప్రదాయం,సంస్కారం,రూపం గల వదువులను విసర్జింపక మీరు ఆ కన్యను కోడలిగా తెచ్చుకోవచ్చు.


జాతకం సంబంధం రాగానే మూలా నక్షత్రం,అశ్లేష నక్షత్రం అని సంబంధం వద్దు అని అప వాక్యములు పలకకుండా విచారణ చేయమని విజ్ఞప్తి. శాస్త్రంలో ప్రతి అంశానికీ దోషం గురించి ప్రస్తావించిన గ్రంథంలో దోష పరిహారములు ప్రస్తావించలేదు. గ్రంథాలు అనేకం పరిశీలించిన తరువాత చేయవలసిన నిర్ణయాలు ఏమీ చదవకుండా చేయవద్దు అని సూచన.


‘‘మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా

కంఠేబథ్నామి సుభగే త్వంజీవ శరదాం శతమ్’’


ఇది కల్యాణ మంత్రం. రెండు జీవితాలను ఒకటిగా చేసి ముడివేసేదే మాంగల్యం.

జాతకచక్రం: విదేశీయానం

 జాతకచక్రం: విదేశీయానం.. ఎవ‌రికి.. ఎప్పుడు ఎలా?


టెక్నాల‌జీ పెరిగిపోతున్న ఈ కాలంలో మ‌న దేశ యువ‌త దూసుకుపోతోంది. అన్ని దేశాల్లోనూ, అన్ని రంగాల్లోనూ మ‌న యువ‌త ముందుంటున్నారు. మ‌న వారికి విదేశాల్లో మంచి డిమాండ్ కూడా పెరుగుతోంది. దీంతో విదేశాలకు వెళ్ళాలనే కోరిక ప్రతి ఒక్కరులోను పెరుగుతోంది. దీనికి తగ్గట్టే ఉపాదికి తగ్గ విద్యను ఇక్కడే ఆర్జిస్తున్నారు. ఉద్యోగం కాకపోయిన విద్యా కోసమైన విదేశాలకు వెళ్ళాలని ఆశించేవారు చాలా మంది ఉన్నారు. అయితే అందరు వెళ్ళగలుగుతున్నారా, అందరికి అలాంటి అవకాశాలు లభిస్తున్నాయా లేదా అనేది వారి వారి జాతకాలను బట్టి ఉంటుంది. ఏయే గ్రహాలు జాత‌కుడిని విదేశీయానం వైపుకి తీసుకుపోతాయో పరిశీలిద్దాం. 


దూర ప్రాంతాల‌కు ప్ర‌యాణించే వారు పూర్వ‌కాలంలో జ‌ల యానం చేసే వారు. అంటే నౌక‌ల ద్వారా త‌మ గ‌మ్యం చేరుకునే వాళ్లు. అప్ప‌టి కాలంలో విమానయానం లేదు కాబట్టి. జలయానం చేయాలంటే జల రాశులైన కర్కాటకం, మీనం, వృశ్చిక రాశులతో పాటు చంద్రబలం కూడా ఉండితీరాలి. ఇప్పుడు విమాన ప్రయాణాలు పెరిగాయి. దీనికి వాయుతత్వ రాశులైన మిధున, కుంభ, తుల రాశుల యొక్క ప్రభావం అధికమని చెప్పవచ్చును. దీనితో పాటు ఆకాశతత్వ ప్రభావాన్ని కలిగి ఉండే గురుగ్రహాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 


రాశులు తమ తమ స్వభావాలను బట్టి యాత్రలను చేసే అవకాశాలను కలిగిస్తాయి. వాటి వాటి స్వభావాల ప్రకారం విభజిస్తే చర, స్ధిర, ద్విస్వభావ రాశులనే మూడు రకాలుగా ఉంటాయి.


చరరాశులు: మేషం, కర్కాటకం, తుల, మకరం

స్ధిర రాశులు: వృషభం, సింహాం, వృశ్చికం, కుంభం

ద్విస్వభావ రాశులు: మిధునం, కన్య, ధనస్సు, మీనం 


చరరాశులు వాటి స్వభావరీత్యా చలన గుణ సంపన్నమై ఉంటాయి. దాని వలన ఈ రాశిలోని వారు ఎప్పుడు యాత్రలు చేయాలనే అభిలాష కలిగి ఉంటారు. ముఖ్యంగా జలారాసులైన కర్కాటకం, మకర రాశులైతే మరింత యాత్రలు చేయాలనే అభిలాష కలిగి ఉంటారు. ద్వి స్వభావ రాశులలో ధనస్సు, మీనరాశులు సైతం ఇలాంటి విదేశీయాత్ర స్వభావాన్నే కలిగి ఉంటాయి. స్దిర రాశులకు ఇలాంటి విదేశీ ఆకాంక్షలు తక్కువనే చెప్పాలి. స్దిర రాశుల్లో వృశ్చికరాశికి విదేశీ అవకాశాలు కొంతవరకు ఉంటాయి. మిగిలిన వారికి వారి వారి జన్మదేశంలోనే ఉండి పోవాలనే ఆకాంక్ష అధికంగా ఉంటుంది. 


కొన్ని నక్షత్ర స్వభావాలు కూడా విదేశీ ప్రయాణాల వైపుకు మొగ్గు చూపుతున్నాయి. అవి...

శనిగ్రహ నక్షత్రాలైన పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర

రాహుగ్రహ నక్షత్రాలైన ఆరుద్ర, స్వాతి, శతభిషం

గురుగ్రహ నక్షత్రాలైన పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర

చంద్రగ్రహ నక్షత్రాలైన రోహిణి, హస్త, శ్రవణం

ఇంకా చర నక్షత్రాలైన స్వాతి, పునర్వసు, శ్రవణం, ధనిష్ట, శతభిషం మొదలగు నక్షత్రాలు విదేశాలకు వెళ్ళాలనే కోరికను ప్రేరేపిస్తాయి. 


జాతకచక్రంలో ఒక వ్యక్తికి విదేశీ గమన ఆకాంక్షను లగ్నం, తృతీయం, పంచమం, సప్తమం, అష్టమం, నవమం,

ద్వాదశ భావాలు కలిగిస్తాయి. చరలగ్న జాతకుడు తన భ్రమణ కారక ప్రవృత్తి వలన జన్మస్ధలానికి దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. స్దిరలగ్న జాతకులు తమ జన్మ స్ధలంలోనే ఉండిపోతారు. ద్విస్వభావ లగ్న జాతకులు అప్పుడప్పుడు విదేశీ యాత్రలు చేసిన అధికంగా వారు స్వస్ధలానికే వచ్చేస్తుంటారు. తృతీయ స్ధాన ప్రభావం వలన దేశ సరిహద్దులకు మించి విదేశాలకు వెళ్ళలేరు. సప్తమ స్ధానాన్ని అనుసరించి విదేశాలలోనే స్దిర నివాసం ఉంటుందా లేదా స్వదేశానికి తిరిగి వస్తారా అన్నది తెలుసుకోవచ్చు. పంచమం, నవమ స్ధానాల వలన విదేశాలకు వెళ్ళాలనే కోరికలు పుడుతుంటాయి. అష్టమ భావం వలన వ్యక్తి విదేశాలలోనే ఉండిపోయే అవకాశాలను నవమ, ద్వాదశాల ప్రభావం కూడా ఉంటే తెలుసుకోవచ్చును. అష్టమ భావం వృశ్చికం అయితే విదేశాలలో ఉండిపోయే అవకాశాలు ఎక్కువ. అష్టమ భావం ధనస్సు నుండి మీనం వరకు ఉన్న రాశులలో ఉంటే విదేశీ అవకాశాలు ఎక్కువ. 


నవమ భావం గమనాన్ని, పరివర్తనను, తీర్ధ యాత్రలను, దేశాంతర యానాన్ని తెలియజేస్తుంది. విదేశీయాత్రకు అవసరమైన భూమికను తయారుచేస్తుంది. నవమభావం ఆదిపత్యం లేకుండా విదేశీ ప్రయాణం చేయలేము.

ద్వాదశభావం దూరం అవటం, ఎడబాటు కలగటం తెలియజేస్తుంది. కుటుంబ సభ్యులకు, బందు మిత్రులకు దూరం కావటం. కుటుంబ సభ్యులకు ఎడబాటు కలగటం అంటే విదేశాలకు వెళ్ళటం. 


విదేశాలలో స్ధిర నివాసం గురించి లగ్నం, లగ్నాధిపతి, చతుర్ధం, చతుర్ధాధిపతికి సంభంధం ఉంటే విదేశీ యోగం ఉంటుంది కానీ స్ధిర నివాసానికి అవకాశాలు తక్కువ. చతుర్ధభావం, చతుర్ధభావాధిపతికి ద్వాదశ భావ ప్రభావం ఉంటే అతడు విదేశాలకు వెళ్తాడు గాని స్దిర నివాస అవకాశాలు తక్కువ. 


‘సర్వేశ్చరే స్ధితౌ రజ్జః’ అనే శ్లోకం ఆధారంగా రజ్జుయోగం ఉంటేనే విదేశీ యోగం ఉంటుందని అర్ధం. గ్రహాలన్నీ చరరాశిలో ఉన్న రజ్జుయోగం అంటారు. 


“అనరప్తియ సురపాః ప్రదేశ జాతాః క్షీవ ప్రవాసీ వ్యయేశే పాపి సంయుక్తే వ్యవపాప సమన్వితే పాపగ్రహణే సందృష్టే దేశాంతర గతః “ సప్తమభావం రాహువు కలసి విదేశాలకు వెళ్ళే కారకాలు అవుతాయి. సప్తమం, రాహువు నిర్వాసనా స్దితిని తెలియజేస్తుంది. పూర్వకాలంలో నిర్వాసనా స్ధితి రాజదండన వలన కలిగేది ఇప్పుడు విదేశీయానంగా మారింది. రాహువు వ్యయంలో ఉండటం వలన బందనయోగం ఎర్పడి శుభగ్రహ ద్రుష్టి ఉంటే కుటుంబ సభ్యులను వదలి దూరంగా విదేశాలకు వెళ్తాడు.


అష్టమ, నవమాధిపతుల యుతి ఉంటే విదేశీగమన యానం ఉంటుంది. చతుర్ధభావంలో పాపగ్రహం ఉండి, చతుర్ధాధిపతి పాపగ్రహ యుతి కలిగి చంద్రుడు కూడా పాపగ్రహంతో కలసి ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న చదువు కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ. దీనికి తోడు దశమాధిపతికి, షష్టమాధిపతికి సంబంధం ఉన్నా లేదా దశమభావం పైన షష్టమాధిపతి ప్రభావం ఉన్న ఆ వ్యక్తి విదేశాలలో ఉద్యోగం చేసే అవకాశాలు ఎక్కువ. 


వ్యయాధిపతి వ్యయంలో గాని, కోణంలో గాని ఉన్న ధనార్జన కొరకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ. దశమాధిపతి సంబంధం ఉంటే ఉద్యోగరీత్యా ధనార్జన ఉంటుంది. సప్తమభావాధిపతి, లగ్నాధిపతి ద్వాదశభావంలో కలసి ఉన్న లేదా, సప్తమాధిపతికి, లగ్నాధిపతికి, ద్వాదశాధిపతికి సంభంధం ఉన్న విదేశాలలో వివాహం చేసుకుంటాడు. 


సప్తమాధిపతికి, దశమాధిపతికి సంభంధం ఉన్న, సప్తమాధిపతి దశమంలో ఉన్న, దశమాధిపతి సప్తమంలో ఉన్న, సప్తమభావ, దశమభావ గ్రహాధిపతుల మధ్య పరివర్తన ఉన్న విదేశాలలో ఉద్యోగం లభిస్తుంది. నవమస్ధానం పైన గాని, నవమాధిపతి పైన గాని శని ప్రభావం ఉంటే వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ. నవమస్ధానంపైన గాని, నవమాధిపతి పైన గాని గురుగ్రహ ప్రభావం ఉంటే విద్య కొరకు, దేవాలయ దర్శనం కొరకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ. 


షష్ఠమాధిపతి నవమంలో ఉన్న, నవమాధిపతి షష్థంలో ఉన్న నవమ, షష్ఠ భావ గ్రహాదిపతుల మధ్య పరివర్తన జరిగిన ఆరోగ్య సమస్యలరీత్యా విదేశీయానం చేయవలసి ఉంటుంది. నవమస్ధానం, నవమాధిపతులపైన, ద్వాదశ స్ధానం, ద్వాదశాధిపతుల పైన శుక్రగ్రహ ప్రభావం ఉంటే టూరిస్ట్ లుగా విదేశీ అందాలను తిలకించటానికి విదేశీయాత్ర చేసే అవకాశాలు ఉంటాయి.  


నవమస్ధానం పైన, నవమాధిపతికి గురుగ్రహ, శని గ్రహ సంబంధం ఉంటే స్వాములు, అవధూతలు, మత ప్రచారకులు, మతభోధకులు, ప్రవాచాలాలు చేసే ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం విదేశాలకు వెళ్తుంటారు. నవమస్ధానంలో రవి ఉన్న చంద్రుడు ఉన్న కాళ్ళకు చక్రాలు పెట్టుకున్నట్లుగా భ్రమణకాంక్షగా విదేశాలకు తరచుగా వెళ్తుంటారు. 


చరలగ్నం, లగ్నాధిపతి చరలగ్నంలో ఉండి, నవాంశ కూడా చరలగ్నం అయితే ఆ జాతకుడు విదేశీ యాత్రలద్వారానే ధనార్జన చేస్తాడు. నవమస్ధానంలో గురువు ఉండి శని, చంద్రుల దృష్టి ఉంటే వారు విదేశాలకు వెళ్ళటమే కాకుండా అక్కడ స్దిర నివాసాన్ని ఏర్పరచుకుంటారు. నవమస్ధానంలో శుక్రుడు, గురువు, బుధుడు, శని గ్రహాలు ఉంటే ఆ వ్యక్తి అశేషమైన విదేశీ ధనాన్ని సముపార్జిస్తారు. 


జాతకచక్రంలో గ్రహాల పొందికను బట్టి విదేశీయానం ఉన్న, ఆ వ్యక్తి యొక్క కుటుంబం, ఆర్ధిక పరిస్ధితులు పరిగణనలోకి తీసుకోవాలి. నక్షత్రాలు, గ్రహాలు, రాశులు అన్నీ కలసిన కుటుంబంలో ధనలక్ష్మీ లేకున్నా, దైవానుగ్రహం, పూర్వపుణ్య బలం లేకున్నా నక్షత్రాలు, గ్రహాలు, రాశులు ఏవి మనకు సహాయపడలేవని గుర్తించాలి.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

శ్రీలలితా సహస్రనామ వివరణ

 🌹శ్రీలలితా సహస్రనామ వివరణ 🌹


*45.పదద్వయప్రభాజాల, పరాకృత సరోరుహా*


శ్రీ మాత యొక్క పాదములు నుండి వచ్చే కాంతులలో పద్మములు కూడా ఓడిపోతున్నాయి ఆ పాదములకున్న అతిశయమైన కాంతులకు లక్ష్మీ దేవికి స్థానమైన పద్మాలయము కూడా వెలవెలబోతున్నవి.


అందుచేత శ్రీ మాత పాదములే మిక్కిలి గొప్పవి.


శ్రీ మాత పాదములు 'శ్రీ గురు' పాదములతో సమానము శ్రీ మాత గురువు లందరికంటే మించిన 'గురుమూర్తి.


కం॥ చరణంబుల సొగసును, గనియరణంబుగ, కళలనిచ్చే, నాజాబిలియున్ విరిసిన కుముదము లవిగని,

అరవిచ్చిన పద్మకాంతులని సిగ్గిలెగా! 


        లలితానామసుగంధం

                  M.s.s.k

శివానందలహారీ

 🙏శివానందలహారీ🙏


తన వక్షసీమపై తన్నెదవని నెంచి

              శంకించి పాఱును శమను డరయ

నిర్జరు లందఱు నీ పదయుగళిపై

              మణిమయ మకుట0పు మహితమైన

భవ్యమౌ కాంతులు పరిఢవిల్లుచు నుండ

             నీరాజనంబును నెఱపు చుండె

ముక్తి వధూకాంత మురిపంబు తోడను

             కౌగలించెను నిన్ను గాఢముగను

సకల భక్తులకెల్లను స్వామి వీవ

యీప్సితార్థంబులందీర్చు నీశు డీవు

ధరణి వరములనిడు కల్పతరువు నీవు

దుర్లభం బేది త్వద్భక్త ధుర్యతతికి 65 # 



ఈ ప్రపంచమునెల్ల ఈశ ! నీ క్రీడకై

          సృష్టించినాడవు శ్రేష్ఠముగను

సకల జనంబులు సకల జీవంబులు

          నీ క్రీడ మృగములే నిక్కముగను

నీ వల్ల బుట్టిన నిఖిల జీవంబుల

           సలుపుచేష్ట లవెల్ల తెలియు నీకు

ప్రేమాస్పదా ! నీకు ప్రీతి కరంబులే

            యవ్వారి నడవడు లరయ నెపుడు

శ్రీకరా ! నాదు పశుతుల్య చేష్టితములు

నరయ సత్కర్మ దుష్కర్మ లైన గాని

ప్రీతీ కరముగ నీకు సంప్రీతి నొసగ

మఱియు ననుగావ కర్తవ్య మవదె నీకు ?. 66 #



✍️గోపాలుని మధుసూదన రావు 🙏

పరమాచార్య స్వామివారు

 పరమాచార్య - పెరుమాళ్


కంచి వరదరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో, ఆరవ రోజు స్వామివారికి వేణుగోపాల స్వామి అలంకారం చేశారు. ఆ అలంకారంలో విరాజమానమై వెలుగొందుతున్న స్వామివారిని చూసి అర్చకులు సీమా భట్టార్ ఆనందపరవశులయ్యారు. ఊరెరిగింపులో భాగంగా శ్రీమఠం ముందుకు రాగానే, పరమాచార్య స్వామివారు బయటకు వచ్చి భక్తులందరితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.


ఆ దృశ్యాన్ని చూసి సీమా భట్టార్ భావోద్వేగానికి లోనయ్యారు. అప్పుడే ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. వేణుగోపాల స్వామివారిని చూస్తూ, హఠాత్తుగా ఒక్కసారి పరమాచార్య స్వామివారి వైపు తిరిగారు. కాని పరమాచార్య స్వామివారు కనపడలేదు. అక్కడ వేణుగోపాల స్వామి కనపడ్డారు. ఎంతగా పరికించి చూసినా మహాస్వామివారు కనపడడం లేదు. నోటమాట రాక అలా స్థాణువై నిలబడిపోయారు. కేవలం వారికి మాత్రమే అలాంటి దర్శనం జరిగింది.


ఈ సంఘటనతో పరమాచార్య స్వామివారు సాక్షాత్ వేణుగోపాల స్వామివారే అని సీమా భట్టార్ కు అవగతమైంది. తను ఏదైతే అనుకునాడో అది నిజమని మరొక సంఘటనలో రుజువు చేశారు మహాస్వామివారు.


అప్పుడు పరమాచార్య స్వామివారు తెనంబాక్కంలొ మకాం చేస్తున్నారు. సీమా భట్టార్ ను తీసుకునిరమ్మని సేవకులను ఆదేశించారు స్వామివారు. ఆయన వచ్చి స్వామివారి ముందు నిలబడ్డారు.


“ఈరోజు ఏమి తిథి?” అని అడిగారు పరమాచార్య స్వామి.


చిన్నగా “ఏకాదశి” అని చెపారు సీమా భట్టార్.


“ఉపవాసం మనకు మాత్రమే కదా? వరదునికి(వరదరాజ స్వామి) కాదు కదా?” అని పరమాచార్య స్వామివారు అడగగానే, భట్టార్ కాస్త కలవరపడ్డారు. “పెరుమాళ్ కి నైవేద్యం ఎందుకు సమర్పించలేదు?” అని అడిగారు స్వామివారు. ఈ ప్రశ్నతో భట్టార్ ఉలిక్కిపడ్డారు. జవాబు చెప్పలేక అతి కష్టంతో, “వెంటనే కనుక్కుంటాను” అని దేవాలయానికి పరిగెత్తారు.


విషయం ఏమిటని అడుగగా, దేవస్తానం వంటశాలలో కొంచం గందరగోళం వల్ల స్వామికి నైవేద్యం వండలేదు. వెంటనే ఆ సమస్యని పరిష్కరించి, ప్రసాదాలు వండించి నైవేద్యం చేశారు. నివేదన చేసిన ఆ ప్రసాదాన్ని మహాస్వామి వారికి సమర్పించారు.


పెరుమాళ్ కు నైవేద్యం పెట్టలేదని పరమాచార్య స్వామివారికి ఎలా తెలుసు? పోనీ ఆ విషయం తెలిసినా, దాని గురించి తాపత్రయ పడవలసిన అవసరం ఏమిటి? కాని భట్టార్ ఇలా ఆలోచించలేదు. ఎందుకంటే, పరమాచార్య స్వామివారే సాక్షాత్ కంచి వరదరాజ స్వామి అని భట్టార్ కు అనుభవం అయ్యింది.


ఎందరికో వారి వారి ఆరాధ్య దైవంగా పరమాచార్య స్వామివారు అగుపించారు. అన్ని దేవతా స్వరూపాలు ఉన్నది ఈ పరబ్రహ్మ స్వరూపంలోనే కదా! కేవలం భక్తీ, శరణాగతి మాత్రమె మనల్ని పరమాచార్య స్వామివారికి దగ్గర చేస్తుంది. శ్రేయస్సును కలిగిస్తుంది.


--- సీమా భట్టార్, కాంచీపురం. ‘శ్రీ పెరియవ మహిమై’ పత్రిక నుండి


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

నవగ్రహాల అనుకూల స్తితి*

 శ్రీనివాస సిద్ధాంతి.9494550355



*నవగ్రహాల అనుకూల స్తితి*


గ్రహాలు అనుకూలించాలి అంటే పరిహార ప్రక్రియలు చేసుకోలేని వారికి ఈ విధంగా చేస్తే గ్రహాలు కొంత వరకు అనుకూలిస్తాయి. రవిచంద్రులు అనుకూలించాలి అంటే తల్లిదండ్రుల్ని గౌరవించాలి. తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి. గురు బలం కావాలంటే ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలి. లేకుంటే రోజు పసుపును పాలతో కలిపి నుదుటన బొట్టు పెట్టుకోవాలి. ఆడవారు అయితే ముఖానికి పసుపు రాసుకోవాలి. శుక్ర గ్రహం అనుకూలించాలి అంటే ఇంటి ఆడ పిల్లలను గౌరవించాలి. ఆదరించాలి అలా చేస్తే శుక్ర గ్రహము వందకు రెండు వందల శాతం అనుగ్రహం ఇస్తుంది. ఒకవేళ ఇంటిలో ఆడపిల్లలు లేకుంటే మేనత్తను గౌరవించాలి. అత్త కూడా లేకుంటే కన్నతల్లిని గౌరవించాలి. కన్నతల్లి కి శుక్రవారం రోజు తాంబూలం ఇచ్చి పాద నమస్కారం చేసుకోవాలి. కుజుడు అనుభవించాలంటే సోదర వర్గాన్ని ఆదరించాలి. సోదరి బాగా చూసుకోవాలి. కార్తీకమాసం వచ్చిన భగినీహస్తభోజనం శుద్ధ విదియ నాడు వస్తుంది. ఆడపిల్ల ఇంటికి వెళ్ళి భోజనం చేసి బట్టలు పెట్టి రావాలి. శని భగవానుడు అనుకూలించాలి అంటే ఇంట్లో పని మనుషుల పై చికాకు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పనిచేసే వారికి తగినంత జీతం ఇవ్వాలి. ఇంట్లో పని వారు లేకుంటే బీద సాద లను వికలాంగులను ఆదరించాలి. బుధుడు అనుగ్రహించాలంటే మేనమామను ఆదరించాల బాగా చూసుకోవాలి. యోగక్షేమములు బాగా చూసుకోవాలి. 


జాతక,వాస్తు,ముహూర్త విషయాలకు phone ద్వారా కూడా సంప్రదించవచ్చును.

*ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*

*జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి*

*లక్ష్మీ లలితా వాస్తుజ్యోతిష నిలయం.

*9494550355*

దత్తాత్రేయ పరిశీలన

 దత్తాత్రేయ పరిశీలన దత్త ఆత్రేయ యత్ వ్యాప్తేయః తత్ త్తిగుణాత్మకః అగ్ని. అగ్నికి పూర్వ నామం ద్రాం అని కూడా కలదు. ద్రాం తత్ త్రిగుణః త్రిగిణరూప శక్తి అత్రి యని త్రిగుణము అనగా అగ్ని యెక్కి వ్యాపితంగా ధాతుపరమగా మారిన గాని దాని లక్షణము అనగా అగ్ని లక్షణమును తెలియుట. సత్వ రజస్సు తమెూ గుణముల మిశ్రమం దత్త స్వరూపం. యిది మానవ నిర్మాణమునకు ఆత్మ రూపమూలమువలననే తెలియువు. యివి పరిణామంలో హెచ్చు తగ్గులు జీవ వాసన లుగా, యివి జీన్ పరంపరగా వచ్చునని తెలియుట దత్త స్వరూపమని దత్త స్వరూపం తెలియుట దత్త అవతార లక్షణము. యిది త్రిగుణలక్షణ స్వరూపమే అత్రి యని, దీనిని అవగాహన చేయుటయు సృష్టిని తెలియుట. అత్రోతు శక్తికి కూడా న అసూయ అసూయ లేని తత్వమే సున్నతి సత్వ గుణము. అందువలననే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వ రూప గుణముల కలయిక యే మూల ప్రకృతి గా తెలియుచున్నది. యిది యే తత్వ ఙ్ఞానమునకు. అది తెలియుట నేను బ్రహ్మ మని, బ్రహ్మ మని తెలియుట ఙ్ఞానము.అహంకారంలేని ఙ్ఞానమే కైవల్యమని తెలియుచున్నది.

పుట్టగానే పరిమళించిన పువ్వు

  పుట్టగానే పరిమళించిన పువ్వు   🙏🙏🙏🙏🙏

                                      ఏల్చూరి మురళీధరరావు  

         🙏🙏🙏

అద్వైతశాస్త్రానికి ఆచార్యపీఠం శృంగేరి.

 

 శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు - 

 పదవాక్యప్రమాణపారావారపారీణులు - 

 యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగయోగనిష్ఠాగరిష్ఠులు - 

 తపశ్చక్రవర్తులు - 

 అనాద్యవిచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురుపరంపరాప్రాప్త షడ్దర్శనస్థాపనాచార్యులు -  

 వ్యాఖ్యానసింహాసనాధీశ్వరులు -  

 సకలనిగమాగమసారహృదయులు -  

 సాంఖ్యత్రయప్రతిపాదకులు -  

 వైదికమార్గప్రవర్తకులు -  

 సర్వతంత్రస్వతంత్రాది   

 రాజధానీ విద్యానగరమహారాజధానీ   

 కర్ణాటకసింహాసన ప్రతిష్ఠాపనాచార్యులు -  

 శ్రీమద్రాజాధిరాజగురుభూమండలాచార్యులు -  

 ఋష్యశృంగపురవరాధీశ్వరులు -  

 తుంగభద్రాతీరనివాసులు -

 శ్రీమద్విద్యాశంకరపాదపద్మారాధకులు -  

 

        శ్రీశ్రీశ్రీ మహాగురుస్వాములవారు అధివసించిన పుణ్యనివాసం శృంగేరి. 

 

ఆస్తికు లందరికీ ఆశ్రయమైన తీర్థయాత్రాస్థలం.    


ఇది 1966 నాటి మాట. 


పరాభవ నామ సంవత్సరంలో జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర భారతీస్వామివారి శిష్యవర్యులు శ్రీమదభినవ విద్యాతీర్థస్వామివరేణ్యులు చాతుర్మాస్యదీక్షావ్రతులై  ఉజ్జయినిలో ఉన్నప్పుడు 


ఉత్తరాదిలోని పద-వాక్య-ప్రమాణ పారావార పారంగతులందరూ వారి సన్నిధిసేవకై ఏతెంచిన తరుణం. 


సంస్కృతంలో ‘పదము’ అంటే వ్యాకరణమని సంకేతం. 


‘వాక్య’మంటే పూర్వోత్తరమీమాంసలని అర్థం. 


‘ప్రమాణం’ అంటే తర్కశాస్త్రం అన్నమాట. 


ఆ పదవాక్యప్రమాణములే గాక సర్వశాస్త్రాలలోనూ, కావ్యనాటకసాహిత్యంలోనూ కోవిదులైన అగ్రగణ్యుల సమావేశం అది. 


ఆ సమావేశాలకు వెళ్ళి ఆ వాక్యార్థాలూ, వాకోవాక్యాలను తిలకించినవారి భాగ్యమే భాగ్యం.  


ఒకప్పుడు శ్రీ శృంగేరిలోని వాక్యార్థసభలో “విశ్వామిత్ర” శబ్దాన్ని గురించిన చర్చ వచ్చిందట. ఎవరో ‘విశ్వానికి అమిత్రుడు విశ్వామిత్రుడు’ అని హాసపూర్వకంగా అన్నారట. 


అప్పుడు వైయాకరణసార్వభౌములు భట్నవిల్లి అప్పన్నశాస్త్రి గారు లేచి, విశ్వ శబ్దానికి విశ్వానికి మిత్రుడన్న అర్థంలో సమాసవిధి వల్ల దీర్ఘం వచ్చి, ‘విశ్వామిత్ర’ అవుతుందని సవిస్తరంగా ప్రసంగించారట. 


ఆ తరుణంలో ప్రౌఢవయఃపరిపాకంలో ఉన్న విద్వత్కవి శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు లేచి - 


చంద్రునికి పదహారు కళలు ఉన్నట్లే, ప్రమితిస్వరూపుడైన సూర్యునికీ పదహారు కళలు ఉన్నాయనీ 


వాటిలో “విశ్వా” అనే కళ నుంచి జన్మించిన “మిత్రుడు” (సూర్యుడు) కనుక విశ్వామిత్రుడయ్యాడనీ 


వేదప్రామాణ్యంతో నిరూపించి మెప్పులందుకొన్నారట. 


వాక్యార్థసభలలో పూర్వపక్ష సిద్ధాంతాల నీడల జాడలలో ఇటువంటి ఉల్లాసదోహద చమత్కారాలూ జరుగుతుంటాయి.   


శ్రీ అభినవ విద్యాతీర్థ జగద్గురువుల వారు షడ్దర్శనీపారంగతులైన మహావిద్వాంసులు. 


ఎంతటి మహావిద్వాంసులో అంతటి దయామయులు. 


లోకానుగ్రహం కోసం అవతరించిన మహాపురుషులు వారు. 


వారి భక్తరక్షణలీలలను స్మరిస్తుంటే యుగాలు క్షణాలుగా ఇట్టే గడిచిపోతాయి.     


ఆ రోజు ఉజ్జయినిలో విద్యార్థుల సంస్కృతభాషా వక్తృత్వప్రదర్శనం జరిగింది. 


ఆంధ్రదేశం నుంచి వచ్చిన ఒక పధ్నాలుగు - పదిహేనేళ్ళ పిల్లవాడు తనవంతు రాగానే – 


నిరర్గళమైన ధారాశుద్ధితో, 

ఉజ్జ్వలమైన తేజస్సుతో, 

మేఘగంభీరమైన కంఠస్వరంతో 

ఉద్దండపాండితీమండితంగా, 

మధ్య మధ్య ఛందోమయవాణీభణితిపూర్వకంగా, 

సర్వజనాహ్లాదకరంగా 


వక్తవ్యాంశాన్ని పురస్కరించుకొని సంస్కృతంలో ప్రసంగించాడు. 


విద్వత్పరిషత్తు విభ్రాంతి చెంది, పెద్దలందరూ నిండైన మనస్సుతో మెండైన ప్రశంసలు ఉట్టిపడే కన్నుల కాంతి వెల్లువను ఆ పిల్లవాడిపై వెల్లివిరియింపజేస్తున్నారు. 


రాంకవ పుస్తకాది ప్రోత్సాహక పురస్కారాలు పూర్తయిన తర్వాత, శ్రీమదభినవ విద్యాతీర్థస్వాముల వారు ఆ పిల్లవాడికేసి చూస్తూ, 


“కా పూర్వః?” 


అని ప్రశ్నించారు. 


ఏది పూర్వం? 


సృష్టికంటె, 

సృష్ట్యాది కంటె, 

అన్నింటికంటె మునుపటిది ఏమిటి? 


అని కాబోలు ఆ ప్రశ్నార్థం. 


పిల్లవాడిని అడిగే ప్రశ్నేనా అది? 


అని పెద్దలు, పండితులందరూ తెల్లపోయారు.  


వేదలతాంతాలైన ఉపనిషత్తుల కుదుళ్ళ నుంచి పుట్టిన అపురూపమైన ప్రశ్నమని అందరూ అనుకొన్నారు. 


సృష్టిలో పూర్వం జలము లుండేవట. 


“యా సృస్టిః స్రష్టు రాద్యా” అన్నాడు కాళిదాసు శాకుంతలాదిని. 


అంతకు మునుపో? 


మైత్రాయణీ ఉపనిషత్తులోని కథ: 


బృహద్రథు డడిగిన గడ్డుప్రశ్నకు వేదవేత్త, శాస్త్రవేత్త, ఆత్మవేత్త శాకాయనుడు, 


“దుశ్శక్య మేతత్ప్రశ్నమ్” అంటాడు.


“అమ్మో, నీ ప్రశ్నకు సమాధానం చెప్పటమే!” అని. 


ఇదీ అటువంటిదే. 


అంతే కాదు. 


పండితపరిషత్తులో పెద్దల ముందు ఎన్ని ఉదాహరణలతో, ఏమని చెప్పినా – 


శాస్త్రవాదం “అథాతో బ్రహ్మజిజ్ఞాసా” అంటూ మళ్ళీ మొదటికే వస్తుంది.  


ఏమని బదులిచ్చినా అంతకు ముందు మరేదో ఉండేదని – 


ఏ శాస్త్రమో, పురాణమో 


చర్చకు రాకుండా ఉంటుందా? 


ఏదో వక్తృత్వాన్ని ప్రదర్శించినంత మాత్రాన ఆ చిన్న పిల్లవాడు – 


అడిగిన ప్రశ్నకల్లా సమాధానాలు చెప్పాలని లేదు కదా!


అదీగాక, 


జగద్గురువుల వారు “కః పూర్వః” అని అడగకుండా - లింగవ్యత్యయం చేసి, పుంలింగమైన “పూర్వ” శబ్దానికి మునుపు “కా” అని స్త్రీలింగాన్ని ప్రశ్నార్థకంగా జోడించారు.  


అన్నింటికంటె పూర్వం ఉండినది పరాశక్తి అన్న స్త్రీత్వభావంతో అడిగితే మాత్రం, ఆ అవతారపురుషుని నోట లింగవ్యత్యయపూర్వకమైన అపశబ్దం దొర్లుతుందా? 


లేక, విద్యార్థి తెలివితేటలను ఆ విధంగా పరీక్షించాలనుకొన్నారా?  


ముసిముసి నవ్వులతో తండ్రిగారికేసి చూస్తున్న ఆ పిల్లవాడికేసి చూస్తున్నారు అందరున్నూ. 


ఏమంటాడోనని ఆసక్తిగానూ, జగద్గురువులవారి దృష్టిని అంతగా ఆకర్షించినందుకు అమితాశ్చర్యంగానూ. 


అదే ప్రశ్న నన్నడిగితే ఏమి చెప్పాలని కొంద రాలోచిస్తున్నారు.  


ఆ పిల్లవాడి ఆత్మవిశ్వాసం చూడండి: 


“మాది నరసరావుపేట” అన్నాడు. 


సభ సభంతా విస్తుపోయింది. 


మహాపండితుల కరతాళధ్వనులు మిన్నుముట్టకుండా ఉంటాయా?      


“పూః పురీ” అని అమరకోశం. 


జనములచే పూరింపబడేది కాబట్టి పురమునకు “పూః” అని పేరు. 


“పూః” శబ్దం స్త్రీలింగం. 


“కా పూః వః” అని ఆ పిల్లవాడి విరుపు. 


వః = మీ యొక్క; పూః = పురము; కా = ఏది - అని. 


మీ ఊరేమిటి? అన్నమాట. 


“నరసరాట్ పూర్ నః” అన్నాడు. 


మా ఊరు నరసరావుపేట అన్నాడు. 


మాతృశ్రీ అనంతలక్ష్మమ్మ గారు, తండ్రి వేంకటేశ్వర అవధాని గారు ఇంటికి వెళ్ళి దిష్టి తీశారో లేదో. 


ఎన్ని జన్మల పుణ్యఫలం కాకపోతే అటువంటి కొడుకును కనటం సంభవిస్తుంది కనుక! 


ఆ పిల్లవాడి పేరు తంగిరాల సీతారామాంజనేయులు. 


పల్నాటి సీమలో అలుగుమల్లెపాడు నుంచి నరసరావుపేటకు వచ్చి స్థిరపడిన కుటుంబం వారిది. 


పసిపిల్లవాడుగా ఉండగానే కావ్యశాస్త్రాలలో, వేదవిద్యలలో, సంస్కృతాంధ్రాలలో ఆ బాలసరస్వతి అనుభవాన్ని చూసి బెజవాడలో విశ్వనాథ సత్యనారాయణ గారంతటివారు ముచ్చటపడి మెచ్చుకొని మరీ దీవెనలు కురిపించారు.  


ఆ బాలుడే, ఇప్పుడు యుగయుగాంతరానుగత కర్కశ సమస్యల సంక్షోభంలో అల్లకల్లోలమై ఉన్న జగత్తుకు కర్తవ్యాన్ని తెలియజెప్పి సన్మార్గోపదేశం చేస్తూ 

 శ్రీ శృంగేరీ జగద్గురు మహాపీఠాన్ని అధిష్ఠించిన అపర శంకరాచార్యులు,

యతిసార్వభౌములు, ధర్మప్రచార దృఢదీక్షావ్రతులు, జగదేకవిద్వాంసులు, 

శ్రీమదభినవ విద్యాతీర్థస్వామి కరకమలసంజాతులు 


శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివరేణ్యులు.  

 

(శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానమువారు శిష్యస్వాములుగా ఉన్నప్పుడు వారికి ఆంధ్రవిద్యాగురువులై, ఆ తర్వాత శ్రీ అద్వయానంద భారతీస్వామిగా తురీయాశ్రమస్వీకారం పచేసిన మహాకవి శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారి ముఖతః నా చిన్నప్పుడు 1972 లో విన్న ఉదంతాన్ని మీకిప్పుడు విన్నవించాను.

మొగలిచెర్ల

 *దత్తహోమము..దత్త దయ..*


"ఈసారి కూడా గురుపౌర్ణమి నాడు శ్రీ స్వామివారి మందిరం వద్ద 'దత్తహోమము' నిర్వహిస్తున్నారు కదా..మా దంపతుల పేర్లు కూడా నమోదు చేసుకోండి..ఆరోజుకు ఎన్ని పనులున్నా అక్కడికి వచ్చి, ఆ కార్యక్రమంలో పాల్గొంటాము.." అంటూ బెంగుళూరు నుంచి సురేష్ గారు ఫోన్ చేశారు..


"జూలై నెల పదహారో తారీఖు నాడు ఆషాడ పూర్ణిమ..ఆరోజే దత్తహోమము..మీ గోత్రము, పూర్తి పేర్లు మావద్ద ఉన్నాయి కనుక ఇబ్బంది లేదు..ఇప్పుడే నమోదు చేసి ఉంచుతాను.." అన్నాను.."ధన్యవాదములండీ.." అన్నాడు.


ప్రతి సంవత్సరం గురుపౌర్ణమి నాడు మొగలిచెర్ల వద్ద గల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం నందు దత్త హోమము నిర్వహించడం ఒక ఆనవాయితీ..నాలుగైదేళ్ల క్రితం గురుపౌర్ణమి నాడు, శ్రీ స్వామివారి మందిరానికి దర్శనార్థం వచ్చిన సురేష్ దంపతులకు, ఆరోజు దత్తహోమము ఉందని తెలుసుకున్నారు..నిజానికి సురేష్ గారికి వివాహం జరిగి అప్పటికి ఆరు సంవత్సరాలు అవుతున్నది..సంతానం కలుగలేదు..బెంగళూరు, చెన్నై ల లోగల సంతాన సాఫల్య కేంద్రాలను సంప్రదించారా దంపతులు..ఒకసారి సురేష్ గారి భార్యకు నెల తప్పింది కానీ..రెండో నెలలోనే అబార్షన్ జరిగింది..ఆ తరువాత మరో చోట ప్రయత్నం చేశారు..డబ్బు ఖర్చు అయింది గానీ ఫలితం కలుగలేదు..


మరో నెలరోజుల తరువాత సురేష్ దంపతులు తమ బంధువుల ఇంటికి నెల్లూరు వచ్చారు..మాటల సందర్భంలో తమకు జరిగిన అనుభవాన్ని వాళ్ళతో చెప్పుకున్నారు..ఆ బంధువుల ఇంట్లో ఉన్న పెద్దావిడ..ఈ దంపతులను దగ్గర కూర్చోబెట్టుకొని.."మీరిద్దరూ నా మాట విని ఒక్కసారి మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వెళ్లి, ఆ స్వామివారి సమాధిని దర్శించి..సంతానం కావాలని ఆ స్వామిని వేసుకోండి..తప్పక ఫలితం ఉంటుంది..ఎలాగూ ఇంతదూరం వచ్చారు..రేపో ఎల్లుండో గురుపౌర్ణమి..ఆరోజుకు శ్రీ స్వామివారి సమాధిని దర్శించి, మ్రొక్కుకోండి..పెద్దదాన్ని చెపుతున్నాను వినండి.." అన్నది..


ఆ పెద్దావిడ మాటలు సురేష్ గారిమీద గట్టి ప్రభావాన్నే చూపాయి..భార్యతో చర్చించారు..ఆవిడ కూడా.."ఒకసారి వెళ్లి చూసొద్దాము..ఇంతకాలం డాక్టర్ల వెంట తిరిగాము..ఒకసారి దైవాన్ని నమ్ముదాము.." అన్నది..ఆరకంగా ఆ దంపతులు సరిగ్గా గురుపౌర్ణమి నాటి ఉదయానికి తమ కార్లో మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి చేరారు..అక్కడ అర్చకస్వాములు, ఆరోజు జరుపబోయే దత్తహోమానికి ఏర్పాట్లలో వున్నారు.."మీరిద్దరూ కూడా హోమం లో పాల్గొంటారా?..అంతా శుభమే జరుగుతుంది.." అని ఒక అర్చక స్వామి తమను అడగడం..అది ఆ దత్తాత్రేయుడి మాట గానే భావించి..ఆ దంపతులు సరే అని అంగీకారం తెలపడం క్షణాల్లో జరిగిపోయాయి..


దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన దత్తహోమము లో సురేష్ దంపతులు అత్యంత శ్రద్ధగా పాల్గొన్నారు..ఆ తరువాత శ్రీ స్వామివారి సమాధి ని దర్శించుకొని..ఆ సాయంత్రం దాకా అక్కడే గడిపి, తిరిగి తమ ఊరికి వెళ్లిపోయారు..


వెళ్లేముందు..నాదగ్గరికి వచ్చి.."ప్రసాద్ గారూ సంతానం గురించి మ్రొక్కుకుందామని ఇక్కడకు వచ్చాము..అనుకోకుండా ఈ హోమం లో పాల్గొన్నాము..స్వామివారి కృప అనిపించింది..అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.." అన్నారు..


సరిగ్గా మూడు నెలల తరువాత..సురేష్ ఫోన్ చేసి..తన భార్య గర్భవతి అని చెపుతూ.."ఈసారి ఎవ్వరికీ చెప్పుకోలేదండీ..స్వామివారి దయతో సంతానం కలిగిన తరువాత అందరికీ తెలియచేస్తాము.." అన్నాడు..మరో ఏడు నెలలకు ఆడపిల్ల పుట్టిందని ఉద్వేగంతో చెపుతూ..త్వరలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటానన్నారు..ప్రస్తుతం సురేష్ దంపతులకు ఇద్దరు సంతానం..ఇద్దరూ ఆడపిల్లలే..తాము దత్తహోమము లో పాల్గొన్నందునే ఫలితం కనబడిందనీ..శ్రీ స్వామివారి కృప, కరుణ తమ మీద ఉన్నాయని బలంగా నమ్మారు ఆ దంపతులు..అప్పటినుంచీ ప్రతి సంవత్సరం గురుపౌర్ణమి నాటి దత్తహోమము లో పాల్గొనడం ఒక అలవాటుగా మార్చుకున్నారు..


మరి భక్తి విశ్వాసాలనే కదా భగవంతుడు మననుంచి ఆశించేది..


సర్వం..

శ్రీదత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

రెండు_ఇడ్లీలు

 #రెండు_ఇడ్లీలు..


వేదవతి  ప్రతిరోజు  తన ఇంటి పిట్ట గోడపై ఆకులో రెండు ఇడ్లిలు పెడుతూ  వచ్చేది  

ఆకలితో ఉన్నవాళ్లు  ఎవరైనా  తింటారు  అని


ఆ దారివెంట  వెళ్ళే ఒక ముసలాయన ఆ ఇడ్లిలు తీసుకోవడం ఏదో  చిన్నగా  గొణుక్కుంటూ  వెళ్లడం  జరిగేది  

ఒకరోజు వేదవతి గోడ  పక్కనే  నిలబడి  అతను  ఏమి అంటున్నాడో  వినాలని  అనుకున్నది  


అతను చెప్తున్న మాటలు  


#నువ్వు_చేసిన_పాపం_నీదగ్గరే_ఉంటుంది 

#నువ్వు_చేసే_పుణ్యం_వచ్చి_నిన్నే_చేరుతుంది  


ప్రతిరోజు అతను ఈ మాటలే చెప్తున్నాడు  

రోజు ఇడ్లి  పెడుతున్నాను  తీసుకు  పోతున్నాడు 


నువ్వు మహాలక్ష్మివి  చల్లగా ఉండమ్మా అని చేతులెత్తి మొక్కక పొయినా పర్లేదు

ఇడ్లిలు బావున్నాయని  చెప్పకపోయినా  పర్లేదు 

ధన్యవాదాలు అమ్మ అని చెప్పడం  కూడా  తెలియలేదా  ఇతనికి  


ఏదో ఆ చెత్త వాగుడు  వాగిపోతున్నాడు  అని చాల కోపంతో  రగిలిపోయింది  అయినా ఇడ్లిలు పెట్టడం మరిచిపోలేదు 


రోజురోజుకి అతనిపై  పెరుగుతున్న  కోపం  అతనిని  చంపేయాలి  అనేంతగా  మారిపోయింది  


ఒకరోజు ఆ ఇడ్లిలపై  కాస్త విషం  చల్లి పెట్టబోయింది 


కానీ మనసు ఒప్పుకోలేదు 

చేతులు వణకడం  మొదలెట్టింది  


ఆలోచన మొదలయింది  


చ వద్దు  అతను అలాఉంటే  నేను ఎందుకు  ఇలా మారిపోయాను  అని ఆ ఇడ్లిలు పడేసి  మంచి ఇడ్లిలు పెట్టింది  


ఆ వ్యక్తి  ఇడ్లిలు తీసుకుని  మళ్ళీ అవే మాటలు చెప్తూ  వెళ్ళాడు  

కొట్టాలన్న కోపం  వచ్చినా తనను  తాను  సమాధాన  పరుచుకుంది  


ఆ రోజు మిట్ట మధ్యాహానం  ఎవరో తలుపు కొట్టినట్టు   ఉంటె వెళ్లి  తలుపు తీసింది  

ఎదురుగా మురికి  బట్టలతో ఓ యువకుడు 

అతను ఎవరో కాదు సొంతంగా ఉద్యోగం  చేసుకుంటానని ఇల్లు వదిలి  అలిగి  వెళ్లిన తన కొడుకు 


అమ్మా

ఇంటికి వస్తుంటే ఎవరో నా పర్సు దొంగలించేసారు  

చేతిలో చిల్లి గవ్వ లేదు 

బాగా ఆకలి కళ్ళు తిరిగి పడిపోయాను  

ఎవరో ఓ ముసలాయన రెండు ఇడ్లిలు ఇచ్చి  నా ఆకలి తీర్చాడు  నా ప్రాణాలు  కాపాడాడు  అని చెప్పాడు  


ఆ మాటలు వినగానే  ఆమెకు  వణుకు  పుట్టేసింది  

విషం కలిపిన ఇడ్లిలు పెట్టుంటే నా కొడుకుకి  నేనే  యముడినై  ఉండిఉంటానే  అని కంటతడి  పెట్టుకుంది   


ఇప్పుడు ఆమెకు  ఆ ముసలాయన మాటలు అర్థం  అయింది  


*నువ్వు చేసిన #పాపం నీతోనే  ఉంటుంది*

*నువ్వు చేసే #మంచి నిన్ను వెతుక్కొని మరీ  వచ్చి చేరుతుంది*


అందరికి అన్ని అర్థం అవ్వవు  

అర్థం అయ్యేంతవరకు  ఎవరూ  ఎదురుచూడము  


*చేసిన ధర్మం  ఎప్పుడూ   ఏదో ఒక రూపంలో  మనకు  వచ్చిచేరుతుంది*


*ఏదో ఒక ధర్మం చేయడం అలవాటు చేసుకోండి*


*మనం తెలియక చేసే తప్పులనుండి  బయట పడే  మార్గం  మంచి చేయడం మాత్రమే*

🙏🙏

వినాయకుడి శ్లోకం

 ఎంత గొప్ప వినాయకుడి శ్లోకం. 


దేవతారాధనలో ముందుగా మనం పూజించే దేవుడు విఘ్నేశ్వరుడు. ఎందుకు గణపతిని పూజించాలి అంటే ఏ పని అయినా ప్రారంభించే ముందు విఘ్నం కలగకూడదని విఘ్నధిపతి అయినా విఘ్నేశ్వరుడిని పూజించమని చెబుతారు. గజాననుని శ్లోకం అనగానే అందరికి ముందు వచ్చేది..


శుక్లం బరధరం విష్ణుం,శేషివర్ణం చతుర్భుజం| 

ప్రసన్నవదనం ధ్యాయేత్ ,సర్వ విగ్నోప శాంత యే...  


తెల్లటి వస్త్రాన్ని ధరించి, చంద్రుని వంటి కాంతి కలిగి, ధర్మార్ధ కామమోక్షములను నాలుగు శ్రుతులనే భుజాలు గా ధరించి, ప్రసన్న వదనం కలిగి అంతటా వ్యాపించి ఉన్న ధర్మ స్వరూపుడైన పరమాత్మను, అన్ని అడ్డంకులను తొలగించి శాంతి కలిగించమని చేసే దైవ ప్రార్ధన.


ఇది వినాయకుడి ప్రార్ధనగా మన అందరికి తెలుసు. విఘ్నశబ్దం ఉంది కనుక వినాయకుడి ప్రార్ధన అని, హిందూ మతానికే చెందినది అని అనుకుంటాము. కాని, అంతటా వ్యపించి ఉన్న పరమాత్మను ప్రార్ధించే శ్లోకంగా, అర్ధం తెలిసినవారు అంగీకరిస్తారు.


శుక్లాంబర ధారిణిగా సరస్వతీదేవిని తలచి ప్రార్ధించవచ్చు. గణేశుడు కూడా ఈ శ్లోకం ద్వార పూజలు అందుకుంటాడు. నిజానికి ఇది ఒక మహా మంత్రరాజం.


ఇది 32 బీజాక్షరాలు కలిగిన మహామంత్రం. ఇది పూర్ణ గాయత్రీ మంత్రంతో సమానం. పూర్ణగాయత్రి కి కూడ 32 అక్షరాలే. ఈ బీజాక్షరాలలో శబ్దశక్తి ఉంది. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని శ్రుతి. ఆ అద్వితీయమైన పరబ్రహ్మ అనుగ్రహప్రాప్తికై చేసే ఏకైక ప్రార్ధనా శ్లోకమిది.


ఏకో దేవః సర్వభూతేషు…అనే శ్రుత్యర్ధం తెలిస్తే, ఈ శ్లోకం మహా మంత్రమని తెలుస్తుంది. సమస్త విఘ్న నివారిణి ఐన ఈ శ్లోకాన్ని జపిస్తే ఎటువంటి ఆటంకాలు ఉండవు..