19, ఫిబ్రవరి 2025, బుధవారం

పిప్పి పన్ను బాధ

 పిప్పి పన్ను బాధ హరించుటకు సిద్దయోగాలు  - 


 *  కర్పూర తైలం ( టర్పంటైన్ ) లో దూది తడిపి ఆ దూదిని పిప్పిపన్ను పైన పెట్టి నొక్కి పట్టి ఉంచిన పిప్పిపన్ను బాధ తగ్గును . 


 *  జిందా తిలిస్మాత్ రెండు చుక్కలు దూది పైన వేసి పిప్పిపన్ను రంధ్రములో పెట్టిన పిప్పిపన్ను బాధ తగ్గును. 


 *  కుప్పింటాకు చెట్టు ఆకు పసరు పిప్పిపన్ను రంధ్రములో వేసిన పిప్పిపంటి లోని పురుగు చచ్చి ఉపశమనం కలుగును. 


 *  జిల్లేడు పాలు రెండు చుక్కలు దూదికి అంటించి పిప్పి పన్ను రంధ్రము నందు ఉంచిన పిప్పిపన్నులోని పురుగు చచ్చిపడిపోవును. 


   గమనిక  - 


        దంతములు వదులుగా అవ్వడం , దంతముల తీపి , తీవ్రమైన నొప్పి , చిగుళ్లు బలహీనత , చీము , రక్తం కారడం వంటి సమస్యలు ఉన్నవారికి ఒక దంత చూర్ణం తయారుచేసి ఇస్తాను. 40 రోజుల్లోపే సమస్య చాలావరకు నయం అగును. ఇది పూర్తిగా మూలికలు , భస్మాలు ఉపయోగించి చేయడం వలన ఎటువంటి చెడుఫలితాలు కలగవు. దంతసమస్యలు అన్ని సంపూర్ణంగా నయం అగును. 

చిగుళ్లు మరియు దంతాలు బలంగా తయారయ్యి గట్టిగా ఉండును.


 

  గమనిక  -


     నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

మహా వాక్యాలు

 మహా వాక్యాలు

ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేద మహావాక్యము

అహంబ్రహ్మస్మి యజుర్వేద మహావాక్యము

తత్త్వమసి సామవేద మహావాక్యము

అయమాత్మాబ్రహ్మ అథర్వణ మహావాక్యము


ప్రజ్ఞానం బ్రహ్మ


ఋగ్వేద మహావాక్యముగా ప్రజ్ఞానం బ్రహ్మ ప్రసిద్ధికెక్కినది.అతి ప్రాచీనమైన ఋగ్వేదములో సృష్టిమూలమును తెలియజేస్తూ ఈ బ్రహ్మాండము పరబ్రహ్మము నుండి జనించినదని, ఈ చరాచర సృష్టికి శుద్ధ చైతన్యము బ్రహ్మమేనని తీర్మానించినది. బ్రహ్మమే సర్వజ్ఞతను కలిగియున్నది. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులను నడిపించే చైతన్యము బ్రహ్మము. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు తన పరిధిలోని గ్రహములను తన చుట్టూ భ్రమింపచేసుకొనే శక్తియే ఈ శుద్ధ చైతన్యము. ఆద్యంతములు కానరాని ఈ అనంత సూర్య మండలములను వ్యక్తావ్యక్తమైన ఈ ఆకాశములో పయనింపచేసే శక్తి కూడా ఈ బ్రహ్మయొక్కశుద్ధ చైతన్యమేనని వివరించినది. సృష్టికి ముందు తరువాత ఉండేది ఆత్మ ఒక్కటేనని తెలియజేసింది.


అహంబ్రహ్మాస్మి


యజుర్వేద మహావాక్యము ‘అహంబ్రహ్మాస్మి’.

అనగా నేనే పరబ్రహ్మమని జీవుడు భావించడం. అనేక జన్మలలో జీవుడు పరిభ్రమిస్తున్నాడు. కాని అన్ని జన్మలలోను స్వరూపము ఆత్మగా వెలుగొందుతున్నది. తనకు లభించిన దేహమనే ఉపాధిలో జ్ఞానమును ప్రోది చేసుకొని ‘నేనే ఆత్మస్వరూపుడను’ అనే సత్యాన్ని దర్శించి ముక్తిని పొందుతాడని ఈ యజుర్వేద మహావాక్యము విశదపరచింది. ఉత్కృష్టమైన మానవ జన్మలో ఆత్మశోధన ధర్మాచరణతోనే సాధించగలమని తెలియజేసింది. ధర్మబద్ధమైన కోరికలతో జీవించి తాను తరించి సమస్త ప్రకృతిని తరింపజేయాలని నొక్కి చెప్పింది.



తత్త్వమసి


సామవేద మహావాక్యము ‘తత్త్వమసి’.

చరాచరమంతా వ్యాపించియున్న శుద్ధచైతన్యము ఎక్కడో లేదు, నీలోనే వుండి, నీవైయున్నదని నిర్వచించడం చాలా ఆశ్చార్యాన్ని, తృప్తిని కలిగిస్తుంది. శంకర భగవత్పాదులు చాటి చెప్పిన అద్వైతము ఈ మహావాక్యమునుండే ఆవిర్భవించినది అని భావించడం మనం వినియున్నాము. ‘ఏక మేవ అద్వితీయం’, ఉన్నది ఒక్కటే! అదే పరబ్రహ్మము. అది నీలోన, అంతటా వ్యాపించి ఉన్నదనే ఒక గొప్ప సత్యాన్ని అద్వైతము ఆవిష్కరించినది. ఆత్మ పరమాణు ప్రమాణమైనది. అటువంటి పరమాణువునుండే ఈ బ్రహ్మాండము ఆవిర్భవించినది. కావున ఈ బ్రహ్మాండములో భాగమైన నీవే ఆత్మవు అని వర్ణించింది.



అయమాత్మాబ్రహ్మ


నాల్గవ వేదమైన అథర్వణ మహావాక్యము ‘అయమాత్మాబ్రహ్మ’.

ఈ వాక్యము కూడా ఆత్మయే బ్రహ్మమని తెలియజేస్తోంది. జీవాత్మ పరమాత్మలు ఒక్కటేనని విచారించింది. ఈ వేదములోనే ప్రణవ సంకేతమైన ఓంకార శబ్దమును మానవాళికి అందించినది. లౌకిక వస్తు సమదాయములన్నీ వివిధ నామములతో సూచించబడినట్లే అనంత విశ్వమును ఓంకారమనే శబ్ద సంకేతముతో సూచించినది. 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

బ్రాహ్మణులపై

 బ్రాహ్మణులపై బ్రాహ్మణేతర స్నేహితుడి దృక్పథం


ఒక నడకలో, ఒక స్నేహితుడు ఫోన్‌లో రియల్ ఎస్టేట్ బ్రోకర్‌తో మాట్లాడుతున్నాడు.


“శాలిగ్రామ్‌లో బ్రాహ్మణులు ఎక్కువగా నివసించే వీధిలో మాత్రమే ఇల్లు వెతకండి. అది కొంచెం ముందు లేదా వెనుక ఉన్నప్పటికీ, నేను సర్దుబాటు చేసుకోగలను!”


నాకు ఇది చాలా వింతగా అనిపించింది మరియు అతనిని కారణం అడిగాను. అతను నాకు ఈ క్రింది అంశాలను ఇచ్చాడు:


1. బ్రాహ్మణులు నివసించే వీధిలో, తగాదాలు ఉండవు. రాజకీయ పార్టీ జెండాలు, నీటి పైపులైన్ల గురించి వివాదాలు లేదా అనవసరమైన తగాదాలు ఉండవు.

2. చేపలు మరియు మాంసం మిగిలిపోయిన వాటిని బయట వేయరు కాబట్టి, ఆ ప్రాంతంలో వీధి కుక్కలు మరియు పిల్లులు తక్కువగా ఉంటాయి.

3. వీధులు శుభ్రంగా ఉంటాయి. మురుగునీటి లీకేజీ ఉంటే, వారు వెంటనే మెట్రో వాటర్‌కు ఫోన్ చేసి దాన్ని సరిచేస్తారు. విద్యుత్ కోత ఉంటే, వారు వెంటనే విద్యుత్ బోర్డును సంప్రదిస్తారు.

4. మీరు వారితో మాట్లాడినప్పుడు పదవీ విరమణ చేసిన మామలు ప్రస్తుత వ్యవహారాలపై విలువైన అంతర్దృష్టులను అందిస్తారు.

5. మన పిల్లలు తమ పిల్లలతో కలిసి ఉంటారని మనం నమ్మవచ్చు.

6. మన పిల్లలు తమ పిల్లల్లాగే సాధారణ పెరుగు అన్నం తినడం ద్వారా పాఠశాలలో అధిక మార్కులు సాధించే కళను నేర్చుకుంటారు.

7. వారు తమ సొంత పిల్లల్లాగే తమ ఆహారాన్ని ఇతరులతో పంచుకుంటారు.

8. పిల్లలు పరిశుభ్రమైన జీవన విధానం అయిన “మది ఆచారం” నేర్చుకుంటారు.

9. వారి పిల్లలతో చదువుకోవడం ద్వారా, మన పిల్లలు TOEFL మరియు GRE లకు సిద్ధమవుతారు మరియు చివరికి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళతారు.

10. ధూమపానం, మాదకద్రవ్యాలు లేదా మద్యానికి గురికాకుండా ఉంటారు.

11. మనం వేరే చోటికి వెళ్లినా, ఆ వీధిలోని ప్రజలు ఎల్లప్పుడూ మమ్మల్ని తనిఖీ చేస్తారు మరియు మాతో సంబంధంలో ఉంటారు.

12. పొంగల్ మరియు దీపావళి వంటి పండుగలను గొప్పగా మరియు సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారు.

13. కనీస జీతంతో ఇంటిని ఎలా నిర్వహించాలో మనం నేర్చుకోవచ్చు.

14. వారు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు మరియు ఏదైనా అధికారిక పనికి సరైన విధానాల గురించి జ్ఞానం కలిగి ఉంటారు.

15. మన మహిళలు వారి నుండి ఉచిత వంట చిట్కాలను పొందుతారు మరియు మమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు! (ఆ విధంగా నాకు “ఈయ సోంబు రసం” మరియు “కచట్టి పులికుళంబు” పరిచయం అయ్యాయి. నేటికీ, అందుకే నా కొడుకు పూర్తిగా శాఖాహారిగా ఉన్నాడు!)

16. కొన్నిసార్లు, నేను కూడా అనుకుంటున్నాను—నా కోడలిగా అయ్యర్ అమ్మాయి ఎందుకు ఉండకూడదు? వారు తమ కుమార్తెలను అంత పరిపూర్ణతతో పెంచుతారు!

17. ఇంట్లో ఎప్పుడూ కర్ణాటక సంగీతం లేదా భరతనాట్యం నేర్చుకునే ఎవరైనా ఉంటారు. మన పిల్లలకు ఆసక్తి ఉంటే, వారు కూడా నేర్చుకోవచ్చు.

18. వివాహాల సమయంలో, వారు మమ్మల్ని చేర్చుకుంటారు మరియు మమ్మల్ని కుటుంబంలా చూసుకుంటారు.

19. కుటుంబంలో మరణం సమయంలో కూడా, వారు దానిని నిశ్శబ్దంగా మరియు గౌరవంగా నిర్వహిస్తారు, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా.


నేను ఆశ్చర్యపోయాను మరియు అతని వైపు చూస్తూనే ఉన్నాను.


నేను అడిగాను, “సార్, నేను బ్రాహ్మణుడిని అని మీకు తెలుసా?”


“ఓహ్, నిజంగానా? క్షమించండి, నాకు తెలియదు! నేను ఏదైనా తప్పు చెప్పానా?”


“ఇది సరైనదా లేదా తప్పు అనే దాని గురించి కాదు. నేను కూడా ఆలోచించని చాలా విషయాలను మీరు జాబితా చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది! దీన్ని నా ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేయవచ్చా?"


"ఖచ్చితంగా! నేను నిజం మాత్రమే మాట్లాడాను! ఎందుకంటే, నా కొడుకు మాంబళం అగ్రహారంలో పెరిగాడు మరియు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఇదంతా అతను అనుబంధించిన బ్రాహ్మణుల 'ప్రభావం' వల్లనే!" అని అతను బిగ్గరగా నవ్వుతూ అన్నాడు.


చాలా ధన్యవాదాలు సార్... అందరికీ బ్రాహ్మణుల పట్ల అలాంటి దృక్పథం ఉంటే, నేను ఈ సమాజంలో పుట్టినందుకు చాలా గర్వపడతాను!


🙏🙏🙏😁😁😁

తాళపత్ర గ్రంధాలు

 🙏పూర్వకాలపు తాళపత్ర గ్రంధాలు🙏

పూర్వకాలంలో వాడిన తాళ పత్రాలు ఇప్పటికి గ్రంథాలయాలలో భద్రపరచారు. ఇన్నివేల సంవత్సరాలనుండి ఎలా ఉన్నాయా అని ఆశ్చర్యం కలుగుతుంది.పూర్వకాలంలో కాగితాలు లేవు.అవి ఇన్ని వేల సంవత్సరాలు ఉంటాయి అని నమ్మకం లేదు. అసలు మన పూర్వీకులు తాళ పత్రములను ఎలా తయారుచేసేవారో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.అప్పట్లో తాళ పత్రములను గ్రంధములుగా తయారుచేసిన విధానం పరిశీలిద్దాము.

సాహిత్యం, కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ముందుతరాలకు అందించడానికి మన పూర్వికులు ఎంచుకున్న గొప్ప మాధ్యమం తాళపత్ర గ్రంథాలు. వివిధ రోగాలను నయంచేసే ఆయుర్వేద విజ్ఞానంతోపాటు పురాణేతిహాసాలు, పంచాంగాలు, శాస్ర్తాలు, లౌకిక గ్రంథాలు, వ్యాకరణాలు.. అన్నిటినీ తాళపత్రాలపైనే గ్రంథస్థం చేశారు. బృహత్‌ గ్రంథాల రచనకూ తాటాకులనే ఉపయోగించారు. అందుకే.. ఆ చారిత్రక ప్రతులు విలువైన సాంస్కృతిక సంపదగా నిలుస్తున్నాయి.

తయారీ విధానం..

తాళపత్రాల తయారీకి ప్రధాన ముడిసరుకు భూలోక కల్పవృక్షంగా పేరున్న తాటిచెట్లే. ఇందుకోసం 10 నుంచి 15 మీటర్ల ఎత్తు పెరిగే తాటిచెట్ల నుంచి ఒక మీటరు పొడవుతో పొరలు పొరలుగా ఉండే ఆకులను సేకరిస్తారు. ఎక్కువ పొరలు ఉన్న ఆకులు రాతకు అనుకూలంగా ఉంటాయి. చాలా కాలం మన్నుతాయి. ఇలా సేకరించిన ఆకులను శుభ్రపరిచి ఎండబెట్టి, తాటి రేకులుగా తయారుచేస్తారు. తాటి ఆకుల నుంచి రాయడానికి అనుకూలంగా ఉండే ‘తాళపత్రాలు’ తయారుచేయడం అన్నది ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఎందుకంటే, అమూల్యమైన జ్ఞాన సంపదను నిక్షిప్తం చేసుకున్న తాళపత్రాలు వందల ఏండ్లు మన్నేలా కాపాడుకోవాలి. అందుకే, వీటి తయారీలో ఎంతో శ్రద్ధ చూపిస్తారు. ఇందుకు రకరకాల పద్ధతులు.

 ముందుగా తాటి ఆకులను నీడలో ఆరబెడు తారు. అవి మెత్తగా తయారవడానికి నువ్వుల నూనెను దట్టంగా పట్టిస్తారు.

› ఆకులను ఎండబెట్టిన తర్వాత మట్టిలో కానీ, ఇసుకలో కానీ 15 రోజులపాటు ఉంచుతారు. తర్వాత బయటికి తీసి శుభ్రపరుస్తారు. ఆకులకు చెదలు పట్టకుండా పసుపు రాస్తారు.

› తాటి ఆకులు సన్నగా, మృదువుగా మారడానికి వేడినీళ్లలో ఉడికిస్తారు. ఎక్కువ కాలం మన్నేలా ఆ నీటిలో పసుపు వేస్తారు. అనంతరం వాటిని ఎండలో ఆరబెడుతారు.

ఆకు పరిమాణాన్ని బట్టి ఒక్కో తాళపత్రంపై ఆరు నుంచి ఎనిమిది వరుసలు రాసేవారు. రెండువైపులా కలిపి నాలుగైదు పద్యాలను లిఖించేవారు. ఎడమవైపు పైభాగంలో తమ ఇష్టదైవాల చిత్రాలు వేసేవారు. ఇలా రాసిన పత్రాలను ఒక దగ్గర చేర్చి, గ్రంథాలుగా మారుస్తారు. ఇందుకోసం పత్రాలకు రెండు వైపులా (కొన్నిటికి ఒకవైపు మాత్రమే) రంధ్రాలు చేస్తారు. పత్రాలు విడిపోకుండా ఆ రంధ్రాల గుండా సన్నని తాడును దూర్చి ఆకులను బంధిస్తారు. ఈ పత్రాలు వంగిపోకుండా, విడిపోకుండా తాటిమట్టలు, టేకు చెక్కలను రక్షణగా వాడుతారు. ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమల రావు తాళపత్ర గ్రంథాల సేకరణ, పరిరక్షణ కోసం 30 ఏండ్లుగా కృషి చేస్తున్నారు. భారతదేశం అంతటా పర్యటించి వేల సంఖ్యలో తాళపత్రాలను సేకరించారు. వాటి వివరాలతో ‘తెలుగు రాతప్రతులు’ అనే పుస్తకాన్నీ రచించారు. ప్రాచ్య లిఖిత భాండాగారం, చెన్నై మ్యూజియం, వరంగల్‌లోని గిరిజన విజ్ఞాన పీఠాలలోనూ వేలాది తాళపత్ర గ్రంథాలున్నాయి.

సున్నితమైన మొనగలిగిన ‘ఘంటం’తో ఆకులపై అక్షరాలను చెక్కే పద్దతి పూర్వం ఉండేది. రాసేవారు నేల మీద కూర్చుని, ఘంటాన్ని కుడిచేతిలో పట్టుకుని.. ఆకుపై కావలసిన అక్షరాలను చెక్కుతారు. అయితే, తాటి ఆకుపై ఘంటంతో చెక్కిన అక్షరాలు సరిగ్గా కనిపించవు. అందుకే, ఆ అక్షరాలపై ప్రత్యేకంగా తయారుచేసిన బూడిద పూస్తారు. ఇందుకోసం కొబ్బరి చిప్పలు, గడ్డి కాల్చగా వచ్చిన నల్లటి బూడిదకు పసుపు, నువ్వుల నూనె కలుపుతారు. ఈ మిశ్రమాన్ని పత్రాలపై రాసిన అక్షరాలపై పూస్తారు. అక్షరాల చుట్టూ అధికంగా ఉన్న రంగును వస్త్రంతో శుభ్రం చేస్తారు.ఇంత కష్టపడితేగాని తాళ పత్రం తయారుగాదు. వేల సంవత్సరాలు మన్నిక కలిగి ఉన్నవి

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ఇష్టాలు మారుతున్నాయి

 🙏🕉️శ్రీమతేనమఃశుభోదయం🕉️🙏              🏵️ఇష్టాలు మారుతున్నాయి, కానీ ప్రేమ మారకూడదు.. కష్టాలు వస్తుంటాయి, కానీ నమ్మకం కోల్పోకూడదు.. మాటలు మారతాయి, కానీ ఇచ్చిన మాట మరువకూడదు.. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడమే మంచిది.. ఎందుకంటే ఏ బంధమైన మన అని మనం అనుకుంటే సరిపోదు.. ఎదుటి వారు కూడా మన అని అనుకున్నప్పుడే ఆ బంధం బలపడుతుంది🏵️నువ్వు ఎంత గొప్పవాడివి అనేది నీ పుట్టుకలోనో, నీ చదువులోనో, నీ డబ్బులోనో, నీ పొగడ్తలోనో కాదు.. నువ్వు ఇతరులను ఎలా అర్ధం చేసుకున్నావు, ఎలా గౌరవిస్తావు అనే దానిలో ఉంది🏵️నీ కోసం నీ జీవితం మొత్తంలో నీ కన్నా ఎక్కువగా ఆలోచించే వారు.. నువ్వు బాగుంటే చాలని తపన పడేవారు ఒక్క రైనా ఉంటే చాలు నీ జీవితం ధన్యమైనట్లే..అలాంటి వారు నీవు తిరిగి ఏదో చేయాలి అని ఆశించరు..నీవు చేయవలసిందల్లా నీపై ఎదుటి వారు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవడం..మంచి ఆలోచనతో ముందుకు సాగడం🏵️🏵️మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్యసలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు రాలేని వారు కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510*🙏🙏🙏

కలములు లేవు వాక్పటిమఁ గైకొని వ్రాయుదమన్న ధీమతిన్

 చ.కలములు లేవు వాక్పటిమఁ గైకొని వ్రాయుదమన్న ధీమతిన్

వెలుగులు జిందు యంత్ర పరి వేష్టిత మీ చరవాణి చక్రమే

కలదని నమ్మ సర్వము కకావికలమ్మగు వంతఁ గూర్చెడున్

దలఁపఁగ పూర్వసత్కవుల ధారణ నెన్నఁగ మేలు  భారతీ!౹౹ 55


చ.పరభృత రాగ వల్లరు లవాంఛిత మయ్యెను దిక్కు లేని యీ

కరభృత నాద వైఖరులె గానము లయ్యె నిదేమి మాయ?యె

ద్దరి చరవాణి దూషిత వితర్కిత భాషణ లెంచగా మనో

హరములుగా జనాళికిల హారములై చనె నేల భారతీ?౹౹56

నేటి వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం  - షష్ఠి -  స్వాతి-‌‌  సౌమ్య వాసరే* (19.02.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*