17, ఏప్రిల్ 2022, ఆదివారం

జ్ఞాని - భక్తుడు

 జ్ఞాని - భక్తుడు


ఇద్దరు వ్యక్తులు అడవిలో వెళుతున్నారు. వారికి ఒక పులి ఎదురైంది. వారిలో ఒకరు 'అంతా భగవంతుడే, కాబట్టి ఈ పులి బారి నుండి నన్ను భగవంతుడే కాపాడుతాడు ' అని చేతులు జోడించుకుని నిలబడ్డాడు. మరో వ్యక్తి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మొదటి వ్యక్తిని కూడా చెట్టు పైకి లాగాడు. ఇంతలో పులి ఏమీ అనకుండా వెళ్ళిపోయింది. మొదటి వ్యక్తి ' నీకు భగవంతుడు వచ్చి కాపాడుతాడు అని నమ్మకం లేదా? చెట్టు ఎక్కావు, నన్నూ పైకి లాగావు ' అన్నాడు. అందుకు రెండో వ్యక్తి ' ఇంత చిన్న విషయానికి భగవంతుని కష్టపెట్టడం ఎందుకు అని చెట్టు ఎక్కాను' అని అన్నాడు. వీరిలో మొదటి వాడు జ్ఞాని, రెండవ వాడు భక్తుడు.

ఒంటరి బ్రతుకు

 ఒంటరి బ్రతుకు 

ప్రపంచంలో వింతలు ఎన్ని అంటే మనం తడుముకోకుండా వెంటనే చెపుతాము.  కానీ నా దృష్టిలో అవి ఏవి వింతలు కావు నిజానికి అసలైన వింత ఏమిటంటే మనం నిత్యం మన కళ్ళముందు జరుగుతున్న సత్యాన్ని గమనించక పోవటమే.  అదేమిటంటే మనం అందరం అనుకుంటాము నాకు భార్య, పిల్లలు అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు వున్నారు.  నేను వంటరిని కాదు నా బంధువులు నాకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తారు.  నేను నిశ్చింతగా ఉండవచ్చని . నిజంగా ఇది నిజామా చెప్పండి. ఇది అస్సలు నిజం కాదు నిజం ఏమిటంటే ఈ ప్రపంచంలో నేను, నీవు వంటరివి అనేది మాత్రమే నిజం. కానీ ఈ నిజాన్ని ఒప్పుకోవటానికి ఎవ్వరు ఇష్టపడరు. అదే మాయ ఈ మాయనుంచి జ్ఞ్యానులు బయటపడతారు.  అజ్ఞ్యానంలో వున్నవారు జ్ఞ్యానం పొందేవరకు మాయలోనే మునిగి వుంటారు. 

నిత్యసత్యం: ఒక సత్యం మన కళ్ళముందు రోజు గోచరిస్తూవున్నది. అదేమిటంటే ఈ భూమిమీదికి పసిపాపగా ప్రతివారు వంటరిగా వస్తున్నారు. వచ్చిన తరువాత మాత్రమే అతనికి ఇక్కడ తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు అన్నదమ్ములు ఇంకా ఇతర చుట్టరికాలు తెలుస్తున్నాయి. మాటలు రాని పసిగుడ్డుకి వాడి బోసినవ్వుకు సంతోషిస్తూ అరె నేను నీకు అన్నను, అక్కను అని మనకు మనమే పరిచయం చేసుకుంటాము. ఏమితెలియని వాడు బిత్తరపోతూ మనలని చూస్తుంటాడు. కాలక్రమంలో ఒక దాని తరువాత ఒకటి గుర్తుస్తూ పెరిగి తనవారనే వారిని గుర్తించటం చేస్తాడు. అప్పటినుండి నాకు నావారు వున్నారు నేను ఒంటరిని కాదనే భరొసా కలిగి ఉంటాడు. ఈ అజ్ఞానంలోనే కొంతమంది తమ జీవితం పూర్తిగా గడిపి వెళతారు. కానీ జ్ఞానులైన వారు ఏది సత్యం ఏది అసత్యం (మిధ్య) అనేది తెలుసుకునే ప్రయత్నం చేసి ఈ మాయను ఎలా వదలాలి అనే చింతనలో పడతారు. వారు మాత్రమే జీవన్ముక్తి ప్రయత్నిస్తారు.. 

తన కళ్ళ ముందరే ఎందరోతనువు చాలించి వీళ్ళటం చూసి అయ్యో పాపం నిన్నటిదాకా బాగా వున్నాడు పాపం పొద్దునే లేవగానే  పోయాడు అని జాలి పడటం మనకు తెలుసు అంతేకాదు ఆలా జాలి పడే వారిలో నీవు నేను కూడా వున్నాను. 

ఆ రోజు నాకు వస్తుందని మనం అనుకోవక పోవటమే అజ్ఞానం ఆ అజ్ఞ్యానం నుంచి బయట పడే దారిని వెతకటమే జ్ఞ్యాన జిగ్న్యస జిగ్న్యాసపరుడు చివరకు జ్ఞ్యానిగా మారుతాడు. తరువాత మోక్షపదం చేరుతాడు. 

ఈ చరాచర ప్రపంచాన్ని చుస్తే మనకు ఒకటి సుస్పష్టంగా కనిపిస్తున్నది.  అదేమిటంటే నిన్న లేనిది ఏదో ఈ రోజు మనకు కనిపిస్తున్నది ఆలా కనిపించింది కనిపించినట్లు ఉండక మార్పు చెందుతూ వున్నది.  మార్పుచెంది, చెంది ఒకరోజు కనిపించకుండా పోతున్నది. ఈ మార్పు మొదట్లో అభివృద్ధి వైపు వుంది కొంత కాలం తరువాత తిరోగాభివృద్ది వైపు మళ్ళి తుదకు ఒకనాడు నశిస్తున్నది. ఈ విషయాన్నీ మనం అర్ధంచేసుకోవటానికి చెంద్రుని ఉదాహరణగా తీసుకుందాం. అమావాస్య నాడు మన కంటికి చంద్రుడు గోచరించాడు, కానీ పాడ్యమినుండి రోజు కొంత కొంత వృద్ధి చెందుతూ పౌర్ణమి నాడు పూర్తి చంద్రుడు అగపడతాడు. మరలా పౌర్ణమినుండి రోజు రోజుకు క్షీణిస్తూ అమావాస్యనాడు పూర్తిగా కనిపించకుండా పోతున్నాడు.  నిజానికి ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ చంద్ర కళలే కనిపిస్తున్నాయి. బాల్యంలో చిన్నగా ఉన్ననీవు యవ్వనం వచ్చేవరకు వృద్ధి చెందుతూ యవ్వన దశ కాగానే క్షీణిస్తూ చివరకు ఒకరోజు ఈ ప్రపంచంనుండి నిష్కామిస్తున్నావు. ఇది ప్రతి మనిషిలో వున్నదే, ఎవ్వరు దీనికి అతీతులు కారు. చివరకు భగవంతుడు ఈ మత్స్యలోకంలో మనిషిగా పుట్టినా ఆయనకు కూడా ఇది తప్పదు. 

ఖరీదైన భవనాలలో నివసించే వారికి ఆరు బయట వున్న పున్నమి వెన్నెల యొక్క ఆనందం ఉండదు.  నిజానికి చందుని వెన్నెల ఎవ్వరో ఒక్కరికి సొంతం కాదు కానీ ధనవంతులు వారు కృత్తిమంగా నిర్మించుకున్న సుఖాల వలన వాటిలోనే మునిగి తేలుతూ వారు చంద్రుని వెన్నెలను  ఆస్వాదించ లేక పోతున్నారు.  అదే విధంగా నేను, నాది అనే కుంచిత భావంలో వున్న సగటు మానవుడు ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోలేక పోతున్నాడు. అంతేకాక ఆ జ్ఞ్యానం పొందాలనే భావన కూడా లేకుండా ఐహికమైన జీవనమే సర్వశ్వము అని తలుస్తున్నాడు. 

ఇంకా వుంది

పెళ్లి విందు తయారీ :

 ( శ్రీనివాసుడి పెళ్లి భోజనాలు )


🛎 పెళ్లి విందు తయారీ : 


👉స్వామివారి కల్యాణం చదివితే కలియుగంలో మధ్యతరగతి కుటుంబాలలో కల్యాణం చెయ్యడమెంత కష్టమో తెలుస్తుంది . 

 

👉 కుబేరుడు నుండి అప్పు దొరికి, అన్నీ పెళ్లి సరుకులు తెచ్చాక ఇవన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తు , వచ్చేవాడు మనఇంటికి భోజనానికి లేక వస్తాడా ? ఇప్పటి కిప్పుడు ముహూర్తం పెట్టుకుంటే వంట బ్రాహ్మణుడు ఎక్కడ దొరుకుతాడు ? అనుకున్నారు . 

స్వామి అగ్నిహోత్రుని వంక చూస్తే “ నేను చేస్తాను స్వామి ! ” అన్నాడు . కానీ వంటపాత్ర సామానులేవి ? అన్నాడు అగ్నిదేవుడు. 


👉 అగ్నిదేవుడు, వంట చేయడానికి పాత్రలు కావాలనడంతో వేంకటాచలం మీదనున్న తీర్ధాలలో వంట వండండి అంటాడు శ్రీనివాసుడు.


👉నిజమే జనాన్ని బట్టి పాత్రలు వాడతాం. వందల్లో వస్తే పెద్దపెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది. కానీ ఈయన పెళ్ళికి సమస్త బ్రహ్మాండం అంతా దిగివస్తుంది. కొన్ని కోట్ల మంది వస్తారు. అంతమందికి వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి. పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్ధాలు తిరుమలలో కొలువై ఉన్నాయి.


👉అగ్నిహోత్రుడు పాపనాశనంలో పైన చింతపండు పిసికి పోసేయండి . కింద నేను పులుసు చేసేస్తాను అన్నాడు . 


👉ఒక్కో తీర్ధంలో / సరోవరంలో ఒక్కో వంటకం వండుతారు. 


👉స్వామి పుష్కరిణిలో @ అన్నం, 

👉పాపనాశనంలో @ పప్పు, 

👉ఆకాశగంగలో @ బెల్లం పరమాన్నం,

👉 దేవతీర్థంలో @ కూరలు,

👉తుబురతీర్ధంలో @ పులిహోర, 

👉కుమార తీర్ధంలో @ భక్ష్యాలు (బూరెలు, పూర్ణాలు, బొబ్బట్లు వంటివి), 

👉పాండుతీర్ధంలో @ పులుసు, 

👉ఇతర తీర్ధాల్లో @ లేహ్యాలు మొదలైని తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడిని ఆజ్ఞాపిస్తాడు. 


👉అలన్నిటిలోనూ పప్పులు , పులుసులు , చక్కెర పొంగళ్లు , కట్టు పొంగళ్లు , జీలకర్ర పొంగళ్లు , ఎన్నో రకాల పొంగళ్ళు , పులిహోర పొంగళ్ళు చేసారు .

వడ్డన చేయాలి కూర్చోమని అన్నారు .  


👉భోజనాల బంతులు వేంకటాచలం నుండి శ్రీశైలంవరకు వేశారు .


👉భోజనాలు సిద్ధం అయిన తరువాత నివేదనకు ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు.


👉"నైవేద్యం పెట్టిన తరువాతే అతిథులందరీకి వడ్డన.

 "నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిధులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు, అది సంప్రదాయం కాదు" అంటాడు స్వామి. 

మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి. మనకు అది ఎప్పుడు గుర్తుండడం కోసం స్వామి పలికిన మాటలవి. 

మరి నివేదన చేయని పదార్ధాలను అతిధులెవ్వరూ ముట్టుకోరు, మరి నివేదన ఎవరికి చేయాలి? అంటాడు బ్రహ్మ.   

 

👉ఇదే కొండ (శేషాచలం) మీద, అహోబలంలో (ఈనాడు అహోబిలం) నరసింహస్వామికి నివేదన చేసి అందరీకి నైవేద్యం వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు. 

సాక్షాత్తు బ్రహ్మ అహోబల నరసింహస్వామికి నివేదన చేస్తారు.


👉 (తిరుమల కొండ శేషాచలం పర్వతం మీద ఉంది. శేషాచలం అంటే సాక్షాత్తు ఆదిశేషుడు. వీటిని ఆకాశం నుంచి చూసిన పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో కనిప్సితాయి. శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లావరకు వ్యాపించి ఉన్నాయి. 


👉ఆదిశేషుడి తలపై శ్రీనివాసుడి,

నడుమ భాగాన అహోబిల నృసింహుడు, తోక భాగాన శ్రీశైలంలో మల్లిఖార్జునుడు భ్రమరాంభ సమేతంగా వెలసి ఉన్నారు. 


👉చక్కగా శివుడు అతిధులందరినీ కూర్చోబెట్టే బాధ్యత శివుడు తీసుకున్నాడు. పాండు తీర్ధం (గోగర్భం డ్యాము నుంచి దక్షిణగా కొద్ది రూరంలో ఉంది. ఇప్పటికి చూడవచ్చు) నుంచి శ్రీశైలం వరకు విస్తళ్ళను (ఆకులను) ఆశీసులు చేశాక అందరికి ఒకేసారి వడ్డించారు.


🛎 భోజనాలు వడ్డన :


 👉ముందు విస్తళ్ళపై నీరు చల్లి, తుడిచి, పాత్రశుద్ధికి కొంత నెయ్యి వడ్డించి, సంస్కారపూర్వకంగా ఉప్పు, శాస్త్రం ప్రకారం ఇతర పదార్ధాలు వడ్డించారు.

 వడ్డన పూర్తి అయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తయ్యిందన్న విషయం శ్రీనివాసుడికి చెప్పగా, అందరిని ఉన్నంతలో ఏర్పాట్లు చేసాను, లోటుపాట్లు ఉంటే మన్నించి అందరూ భోజనాలు చేయండి అని వేడుకున్నాడు.


 👉అందరి భోజనాలు ముగిశాకా, అందరికి దక్షిణతామ్మూలాలు శ్రీనివాసుడు ఇచ్చాడని పురాణ వచనం.


👉అందరూ భోజనాలు చేసి , బ్రేవుమని త్రేన్చి కూర్చున్నారు . అందరినీ భోజనమైందా అని పేరు పేరునా అడిగిన తరువాత  శ్రీనివాసుడు,వకులమాత, మన్మథుడు,  లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేశారు. వీరి భొజనాలు మిగిసేసరికి సూర్యాస్తమయం అయిందని పురాణంలో కనిపిస్తుంది.


👉అందరి భోజనాలు పూర్తయ్యాక, రాత్రికి అక్కడే గడిపేసి,తెల్లవారుఝామునే మంగళవాయిద్యాల నడుమ మగ పెళ్ళివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది. ...!


సేకరణ 

🙏🙏🙏గోవిందా గోవిందా 🙏🙏🙏

ఇందుపల్లి మావయ్య- కథ

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

       *🌷చా.ప్ర రాతలు🌷* 

                      ***                         

*🌷ఇందుపల్లి మావయ్య- కథ🌷* 

                  🌷🌷🌷               

వేసవి మండి పోతోంది. దానికి తోడు "సన్ డే " ఆయన రోజుకదా ఇంకా వేడెక్కి పోతున్నాడు.

 ఈ వేడిలోనే తెలుగువార్కి కష్టమైనా,  ఇష్టమైన  ఆవకాయలు పెట్టడం, గుమ్మడి వడియాలు పెట్టడం యుథ్థప్రాతి పదిక మీద  అందరూ ఉసూరు మంటూనే  చేసుకుపోతారు. ఇవన్ని తీపి కష్టాలంటాడు మా ఇందుపల్లి మావయ్య , అనుకుంటూ అటకమీద నుండి అమ్మ ఇచ్చిన ప్యారీ కంపెని జాడీలు దింపుతున్నాను.


ఇలా తలుచుకున్నానో లేదో మా ఆయన  ఓయ్ మీ ఇందుప్పల్లి  మామయ్య  వస్తున్నాడుట రేపు అని బాంబు పేల్చారు మా వారు బాబోయ్! ఏంటిట విషయం అనగానే ఏదో కోర్టు పనిపడిందిట. ఆయనకి ఏర్పాట్లు అవీ చూడు అని మా ఆయన కూరలు అవి తెస్తాను అని బయటకి వెళ్ళారు.


మా ఇందుపల్లి మావయ్య అంటే మాకందరికి ఇష్టంతో పాటు చాలా భయం కూడా! ఎందుకంటే ఆయన పద్దతి పద్దతి అంటూ చంపేస్తాడు.ఆయనకి ఓపట్టాన ఏది నచ్చదు. మా అత్తయ్య వంట, పనులు కూడా నచ్చవు ఆయనకి.


 దాంతో ఆవిడ ఆయన బాథ పడలేక ఇంటిపని వంటపని కూడా ఆయనేకే అప్పచెప్పి కాలు మీద కాలేసుకొని "విసనకర్ర విసురుకుంటూ " ఆయన వండి పెట్టినవన్ని రుచిచూస్తూ దాంట్లో  ఇదెక్కువ దీంట్లో అదెక్కువ అని ఆయనకే వంకలు పెడుతూ హాయిగా తింటూ మరింత ఒళ్ళుచేసింది. 


అలాంటి మా మావయ్య వస్తున్నాడని తెలియగానే కంగారు మొదలైంది. తెల్లవారుఝాము 4 గంటలకి బస్ దిగి ఆటోవాడు ఎక్కువ అడిగాడని మార్నింగ్ వాకింగ్ ఒంటికి మంచిది అని నడుచుకుంటు వచ్చి తలుపు తట్టాడు.


ఎప్పుడూ  పొద్దెక్కినా లేవని నేను అప్పటికే లేచి  వాకిలి చిమ్మి ముగ్గు వేసి  డికాక్షన్ వేసి స్నానం చేసి రెడీగాఉన్నాను.ఒక చేతిలో సంచి , పనసపండు,  మరోచేతిలో పెద్ద స్టీలు కారేజీతో వచ్చాడు.   చెరుకుపానకం కామయ్య తెచ్చిచ్చాడు. లోపలపెట్టు వరం! అనగానే రెండూ అందుకుని లోపలపెట్టాను.


మావయ్య వచ్చాడని మా ఆయన్ని నిద్ర లేపాను. ఆయన బధ్ధకంగా లేచేసరికి మావయ్య స్నానం చేసి పూజా గదిలో చేరి సంధ్యవార్చి పూజ చేస్తున్నాడు. ఎప్పుడు బోసిగా ఉండే మా దేవుని మందిరం మావయ్య పూజతో దేవుడు కూడా చిరునవ్వుతో అందంగా హమ్మయ్య! నన్ను ఈ రోజైనా చూసారని అంటున్నట్టుగా అనిపించింది. 


 పూజ అయ్యాకా నేను ఇద్దరికి కాఫీ కలిపి తెచ్చాను. ఇద్దరు ఒకరికొకరు  కుశల ప్రశ్నలు వేసుకున్నాకా , మామయ్య కాఫీ సిప్ చేసి ఏం కాఫీపొడే వరం ! ఇది అని పెదవి విరిచాడు.  నేను చెప్పే లోగానే కాఫీ డికాక్షన్ వేయడం ఒక కళే! అంటూ వంటింట్లోకి అడుగు పెట్టాడు.


 మొదలైంది ఇక అని నేను స్వగతం అనుకొని ఆయన వెనకాలే  స్కూలు పిల్లలా వెళ్ళా!చూడు వరం! తక్కువలో తక్కువ 6 ఫుల్ చెంచాలు కాఫీపొడి వేస్తేగాని రుచి రాదు కాఫీకి. చిక్కని పాలు కాచడం కూడా ఒక కళ! పొంగు వచ్చాకకాసేపు కాగనిచ్చిన పాలలో కలుపుకు తాగితే స్వర్గమే . అని మళ్ళీకలిపి మా ఇద్దరికి తలో కప్పు ఇచ్చాడు. అది తాగిన మా వారు ఆహా ఏం కలిపారు మావయ్యగారు! అంటూ పొగడగానే దానిమీద అరగంట ఉపన్యాసం ఇచ్చాడు. ఏవోయ్ చూసి నేర్చుకో అనగానే ఇలా డికాక్షన్ వేస్తే వారానికి ఒక అరకేజీ హుళక్కి! నెలకి రెండుకేజీలా! అయ్యబాబోయ్ అని మనసులోఅనుకుని, సర్లెండి అని వంటలో దిగి దిగగానే మావయ్య! వరం ! ఏం వండుదామనుకుంటున్నావంటు వంటింట్లో కి రావడం తో నా గుండె గుభేలుమంది. 


ఎక్కడ భారీ ఎత్తున వండేస్తాడో అని! ఈలోగా చక చక నాలుగు రకాల కాయగూరలు తీసి తరిగి ఆడవాళ్ళకన్నా మించిన క్రమపధ్ధతిలో  చేయతిరిగిన మా మావయ్య చేసిన వంటకాలు  నలుడనిపించాడు, వలలుణ్ణి మరిపించాడు.  చక్కగా అరిటాకు వేయించుకొని.సుష్టుగా భోజనం చేసి,  జాజికాయ, జాపత్రి లాంటివి చిన్న చిన్న గదులు గల ఒక నగిషీలు చెక్కిన బాక్సులోంచి తీసి తమలపాకుల్లో వేసుకొని తాంబులాలు మా ఇద్దరికి కూడా కిళ్ళీ కట్టి తను వేసుకొని మంచంమీద నడుం వాల్చేడు.


 చెప్దొద్దు నాకు కూడా ఈరోజు వంటబాథ తప్పిందని ఆనందం గానే ఉంది.


అలాగే ఆవకాయే కూడా కాంప్రమైజు అవ్వకుండా , ఇది "ఆంధ్రుల వరప్రసాదం" దీన్ని చాలా గౌరవంగా చూడాలి అంటూ మామిడికాయల్ని  తనే మరకత్తిపీఠ మీద కొట్టి , నువ్వులనూనే పోసి కొత్త ఆవకాయి కలిపి జాడీల లో వేసి  జాగ్రత్తగా చూడమని  చెప్పేడు. అన్నీ తనే దగ్గరుండి జరిపించాడు. 


వేసవికాలంలో "అమృత సుఫలం:" మామిడి ఫలం తినకపోతే వచ్చే జన్మలో కాయలు కాయని మామిడిచెట్టై పుడతామని "ఆమ్రాక్ష ఫల చరితం" లో "చూతాశుడనే "మహర్షి రాసిపారేసేడోయ్ అంటూ మా మావయ్య మామిడి పళ్ళ గురించి క్లాసు పీకి మా ఆయన్ని మామిడి పళ్ళ మార్కెట్టుకి లాక్కెళ్ళాడు. 




అక్కడ ఇది బంగనపల్లి అంటారందరు కాని ఇది బనగానెపల్లెనుంచి రావడం వల్ల దాని పేరు  బంగనపల్లి

గా మారి బంగారు రంగు తో మనల్నందరిని మురిపిస్తోంది.ఇది చిన్న చెరుకు రసం. చాలా డిగ్నిఫైడ్ గా ఉండి  పంచామృతం లా మధురం గా ఉంటుంది.


ఇదిగిదిగో ఇది పెద్దరసం అల్లసాని పెద్దన్న గారు దీనిని భోజనం చేసి పెద్దగాదీవించారు చిరంజీవిగా ఉండమన్నారు.


ఇక కృష్ణాజిల్లా కి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన  నూజువీడు రసాలు పై మోజుగల వాళ్ళ హృదయాల్లో "మేజువాణి"యే!ఇమామ్ పసందు, ఆ పసందు ఈపసందు అంటూ వాటిగురించి ఉపన్యాసం ఊదరగొట్టి , మావయ్య  ఒక పాతిక పళ్ళు నూజువీడు రసాలు  ఎన్నిక చేసి తీసుకొచ్చారిద్దరు. 


వాటిని ఎలా తినాలో కూడా వివరిస్తుంటే నేను మా ఆయన గీతోపదేశం లా విన్నాం.


రోజు తెల్లవారుఝామున నాలుగు గంటలకే లేచి మాఆయననికూడా మార్నింగ్ వాకింగ్ కి కూడా లేపి బలవంతాన తీసుకెళ్ళేవాడు. మా ఆయన బధ్ధకం పూర్తిగా ఎగిరిపోయింది.


ఇప్పుడందరు డైట్ కంట్రోలంటూ  డొక్కలు మాడ్చుకుంటూ నీరసంగా ఛస్తున్నారు. అసలు అన్నిరకాల "మనతిండి" హాయిగా తిని ఇంట్లో పని, నడక ,వ్యాయామం వంటివి చేస్తే ఏ రోగాలు రావని యోగిలా ఉపదేశం చేసాడు.


నాకు రకరకాల వంటలు కూడా నేర్పించాడు.అలా తన కోర్టు పని పూర్తయ్యకా!    ఇక మీ అత్తయ్య ఏం తింటోందో పాపం! బయలదేరతాను అన్నాడు. వెడుతూ వెడుతూ నాకు చేతిలో కొంత డబ్బు పెట్టి నేను పుచ్చుకోబోతే , వరం నాకా ఆడ పిల్లలు లేరు. ఉన్న మగ నలుసులు కాస్తా విదేశాలు! నువ్వు నా కూతురు లాంటిదానివి. కాదనకు అంటూ బలవంతాన చేతిలో పెట్టాడు. 


నేను కూడా మావయ్య కి పంచెలచాపు పెట్టి ఇద్దరం కాళ్ళకి దణ్ణం పెడితే . చక్కని దేశవాళి మామిడి పళ్ళ  లాంటి, పనసపళ్ళ లాంటి పిల్లలు పుట్టాలి అని మనః స్పూర్తిగా దీవించాడు.


వెడుతూంటే నాకు కూడా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. ఎవరైన ఊరెడుతోంటే అలా కన్నీరు పెట్టకూడదని అందంగా మందలించి ఆజానుబాహుడైన మా ఇందుప్పల్లి మామయ్య నిష్క్రమించాడు.


ఇల్లంతా బావురుమంది!


చాగంటి ప్రసాద్

9000206163

BHAGAVAN SRIRAMANA MAHARSHI At the Age of Sixteen

 DEATH EXPERIENCE OF BHAGAVAN SRIRAMANA MAHARSHI At the Age of Sixteen


W RAMANA MANARSNI realized the Self he was a las of an attached to took a ak step and nowhed the gok MANARSNI himself described how this happened.


"It was to weeke tekre et Asapal fe that the great che ne p on the fest fix of my un home I nokk at any times and on that there we the word with my health but a masters violent fee of death overbe There was nothing state of health to atte axt1o not try to count to its to find out alsout we masayf the t eta goby to de' and been they what to assit R. Itky not so to to avut a doctoras y aseo felt that I fod to aste the pobok there and thens


The ask of the fee of death drove my b was to myoelf mentally without actually family the worde: Now death com what see it? What it that Indy Thin Ang And at ose dethed the wxxxce of death by with my #tiff Nugh od net in and beated a come so as to ghe greater reality to the holy booth and kept my lipe that the wos Twee any other word d be offens Will then I ak to me this b


to dosl. It will be careled stiff to the burning around and there burnt and reduced to ashes. But with the death of this body am I dead in the body 17 It la ellent and meet tsit I feel the full force of my personality and even the vole of the 'T' within me, apart from it. So I am spirit transcending the bob. The body dea but the apleit that transcende it cannot be touched by death. That means I am the deathless mplett. All this was not doll thought It flashed thesh me vikity en living truth which I pesolved directly almost without thought process


Two something very real, the only real thing my present state, and all the conecious activity connected with my body was centred on that T. From that moment onwards the Tor Solf T used attention on elf by a powerful schation foon of death had windshed once and for all.


Abeption in the Belf continued unteolien from that the on. Other thoughts might come and go the the veke note of muel, but the continued Be the eximental se note that underlies and boude with all the other notes. Whether the body weeped in baking, reading anything else. Tsabit contred on Previous to that criola I ception of my Self and was not acter to Ib. I felt re pesceptible os et een in, much less ang inclination


case that no ass csil) escapes to chvell permanently in it."

హనుమ ద్విజయోత్సవం

 *ఈ రోజు చైత్రమాసం పౌర్ణమి హనుమ ద్విజయోత్సవం*



చాలా మంది భక్తులకు ఒక సందిగ్ధం - హనుమాన్ జయంతి ఎప్పుడు ?? -


 హనుమాన్ విజయోత్సవ దినం ఎప్పుడూ అనేది ..


హనుమంతుని జన్మ తిథి చైత్రమాసం లోనా , వైశాఖంలోనా ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుంది...!!


అలాంటి వారు ఈ కథనం చదివితే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు.


పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని తెలిపారు. 


అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు.


అయితే కొన్ని ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. 


ఈ కారణంగా ఆ రోజు హనుమద్‌ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. 


దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మ తిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు.


అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు.


ఆంజనేయస్వామి వారి నిలువెత్తు విగ్రహం దగ్గర దగ్గరగా 60 అడుగుల శోభా యాత్రగా ఊరేగిస్తారు.


చైత్ర పూర్ణిమ హనుమత్ విజయోత్సవం నుండి నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు.


ఈ దీక్ష చివరి రోజున  హనుమంతుని జన్మ తిథి చేసుకుంటారు. 

ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. 


వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు.


హనుమంతుని జన్మ తిథి వైశాఖ బహుళ దశమినాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం వుంది. 


"కలౌ పరాశర స్మృతి:" అని శాస్త్రాలు చెప్తున్నాయి.

 

శ్లో: వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే

పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే ||


అని చెప్పబడింది.  దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుని జన్మ తిథి జరుపుకుంటారు. 


ఈ రోజున హనుమాన్ చాలీసా , ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.


చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు.


 శ్రీ రాముడి సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక, లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమయేనని రాముడు ప్రకటించి, చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట.


 మన హిందూ సమాజంలో జాడ్యం, బద్దకం, నిర్లిప్తత, తమస్సు మొదలైన గుణాలు పెరిగిపోయాయి. అవన్నీ వదలాలంటే, తప్పకుండా ఆంజనేయ స్వామి వారిని వేడుకోవాలి.


 అప్పుడే హిందువుల్లో చైతన్యం ఉట్టిపడుతుంది, జడత్వం నశిస్తుంది. కనుక సనాతన ధర్మ పునర్వైభం, భారతదేశ సంరక్షణ, ప్రపంచ శాంతి అనేవి సంకల్పాలుగా చేసుకుని, మనం కూడా ఈ 40 రోజుల పాటు ఇంట్లోనే హనుమాన్ చాలీసా పారాయణ చేయవచ్చు. 


మన కోసం చేసిన పూజ కంటే, పదిమంది మేలు కోరి చేసింది, మరింత ఫలితం ఇవ్వడమే కాదు, మనకు శీఘ్ర ఫలాన్ని, రక్షణను, కామ్యసిద్ధిని, కార్యసిద్ధిని ఇస్తుంది.


*మనోజవం మారుత తుల్యవేగం*

*జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్౹*

*వాతాత్మజం వానరయూధ ముఖ్యం*

*శ్రీరామదూతం శిరసా సమామి॥*


ఆరోగ్యప్రదాత, జ్ఞానప్రదాత, అభయప్రదాతైనటువంటి ఆ సంజీవనీ దాత మనందరికీ మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాలు ప్రసాదించాలని  కోరుకుంటూ ... అందరికీ హనుమద్విజయోత్సవ శుభాకాంక్షలు....