ఒంటరి బ్రతుకు
ప్రపంచంలో వింతలు ఎన్ని అంటే మనం తడుముకోకుండా వెంటనే చెపుతాము. కానీ నా దృష్టిలో అవి ఏవి వింతలు కావు నిజానికి అసలైన వింత ఏమిటంటే మనం నిత్యం మన కళ్ళముందు జరుగుతున్న సత్యాన్ని గమనించక పోవటమే. అదేమిటంటే మనం అందరం అనుకుంటాము నాకు భార్య, పిల్లలు అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు వున్నారు. నేను వంటరిని కాదు నా బంధువులు నాకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తారు. నేను నిశ్చింతగా ఉండవచ్చని . నిజంగా ఇది నిజామా చెప్పండి. ఇది అస్సలు నిజం కాదు నిజం ఏమిటంటే ఈ ప్రపంచంలో నేను, నీవు వంటరివి అనేది మాత్రమే నిజం. కానీ ఈ నిజాన్ని ఒప్పుకోవటానికి ఎవ్వరు ఇష్టపడరు. అదే మాయ ఈ మాయనుంచి జ్ఞ్యానులు బయటపడతారు. అజ్ఞ్యానంలో వున్నవారు జ్ఞ్యానం పొందేవరకు మాయలోనే మునిగి వుంటారు.
నిత్యసత్యం: ఒక సత్యం మన కళ్ళముందు రోజు గోచరిస్తూవున్నది. అదేమిటంటే ఈ భూమిమీదికి పసిపాపగా ప్రతివారు వంటరిగా వస్తున్నారు. వచ్చిన తరువాత మాత్రమే అతనికి ఇక్కడ తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు అన్నదమ్ములు ఇంకా ఇతర చుట్టరికాలు తెలుస్తున్నాయి. మాటలు రాని పసిగుడ్డుకి వాడి బోసినవ్వుకు సంతోషిస్తూ అరె నేను నీకు అన్నను, అక్కను అని మనకు మనమే పరిచయం చేసుకుంటాము. ఏమితెలియని వాడు బిత్తరపోతూ మనలని చూస్తుంటాడు. కాలక్రమంలో ఒక దాని తరువాత ఒకటి గుర్తుస్తూ పెరిగి తనవారనే వారిని గుర్తించటం చేస్తాడు. అప్పటినుండి నాకు నావారు వున్నారు నేను ఒంటరిని కాదనే భరొసా కలిగి ఉంటాడు. ఈ అజ్ఞానంలోనే కొంతమంది తమ జీవితం పూర్తిగా గడిపి వెళతారు. కానీ జ్ఞానులైన వారు ఏది సత్యం ఏది అసత్యం (మిధ్య) అనేది తెలుసుకునే ప్రయత్నం చేసి ఈ మాయను ఎలా వదలాలి అనే చింతనలో పడతారు. వారు మాత్రమే జీవన్ముక్తి ప్రయత్నిస్తారు..
తన కళ్ళ ముందరే ఎందరోతనువు చాలించి వీళ్ళటం చూసి అయ్యో పాపం నిన్నటిదాకా బాగా వున్నాడు పాపం పొద్దునే లేవగానే పోయాడు అని జాలి పడటం మనకు తెలుసు అంతేకాదు ఆలా జాలి పడే వారిలో నీవు నేను కూడా వున్నాను.
ఆ రోజు నాకు వస్తుందని మనం అనుకోవక పోవటమే అజ్ఞానం ఆ అజ్ఞ్యానం నుంచి బయట పడే దారిని వెతకటమే జ్ఞ్యాన జిగ్న్యస జిగ్న్యాసపరుడు చివరకు జ్ఞ్యానిగా మారుతాడు. తరువాత మోక్షపదం చేరుతాడు.
ఈ చరాచర ప్రపంచాన్ని చుస్తే మనకు ఒకటి సుస్పష్టంగా కనిపిస్తున్నది. అదేమిటంటే నిన్న లేనిది ఏదో ఈ రోజు మనకు కనిపిస్తున్నది ఆలా కనిపించింది కనిపించినట్లు ఉండక మార్పు చెందుతూ వున్నది. మార్పుచెంది, చెంది ఒకరోజు కనిపించకుండా పోతున్నది. ఈ మార్పు మొదట్లో అభివృద్ధి వైపు వుంది కొంత కాలం తరువాత తిరోగాభివృద్ది వైపు మళ్ళి తుదకు ఒకనాడు నశిస్తున్నది. ఈ విషయాన్నీ మనం అర్ధంచేసుకోవటానికి చెంద్రుని ఉదాహరణగా తీసుకుందాం. అమావాస్య నాడు మన కంటికి చంద్రుడు గోచరించాడు, కానీ పాడ్యమినుండి రోజు కొంత కొంత వృద్ధి చెందుతూ పౌర్ణమి నాడు పూర్తి చంద్రుడు అగపడతాడు. మరలా పౌర్ణమినుండి రోజు రోజుకు క్షీణిస్తూ అమావాస్యనాడు పూర్తిగా కనిపించకుండా పోతున్నాడు. నిజానికి ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ చంద్ర కళలే కనిపిస్తున్నాయి. బాల్యంలో చిన్నగా ఉన్ననీవు యవ్వనం వచ్చేవరకు వృద్ధి చెందుతూ యవ్వన దశ కాగానే క్షీణిస్తూ చివరకు ఒకరోజు ఈ ప్రపంచంనుండి నిష్కామిస్తున్నావు. ఇది ప్రతి మనిషిలో వున్నదే, ఎవ్వరు దీనికి అతీతులు కారు. చివరకు భగవంతుడు ఈ మత్స్యలోకంలో మనిషిగా పుట్టినా ఆయనకు కూడా ఇది తప్పదు.
ఖరీదైన భవనాలలో నివసించే వారికి ఆరు బయట వున్న పున్నమి వెన్నెల యొక్క ఆనందం ఉండదు. నిజానికి చందుని వెన్నెల ఎవ్వరో ఒక్కరికి సొంతం కాదు కానీ ధనవంతులు వారు కృత్తిమంగా నిర్మించుకున్న సుఖాల వలన వాటిలోనే మునిగి తేలుతూ వారు చంద్రుని వెన్నెలను ఆస్వాదించ లేక పోతున్నారు. అదే విధంగా నేను, నాది అనే కుంచిత భావంలో వున్న సగటు మానవుడు ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోలేక పోతున్నాడు. అంతేకాక ఆ జ్ఞ్యానం పొందాలనే భావన కూడా లేకుండా ఐహికమైన జీవనమే సర్వశ్వము అని తలుస్తున్నాడు.
ఇంకా వుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి