13, మార్చి 2024, బుధవారం

బ్రహ్మ వాదినిలు

 ప్రాచీన కాలంలో బ్రహ్మ వాదినిలు: 1 గార్గి --- గార్గ మహర్షి వంశంలో వచక్ను ముని కుమార్తె.ప్రముఖ బ్రహ్మ వాదినిగా ప్రసిద్ధి చెందినది.జనక మహారాజు నిర్వహించిన బ్రహ్మ యజ్ఞంలో పాల్గొన్న వేద విద్వాంసులలో ప్రముఖురాలు గార్గి. 2 యాజ్ఞవల్క్య మహర్షి భార్య మైత్రేయి. 3 అగస్త్యముని భార్య లోపాముద్ర. 4 మండనమిశ్రుని భార్య ఉభయభారతి. ‌ఆదిశంకరాచార్య మండనమిశ్రుని మధ్య జరిగిన వేదాంత చర్చాగోష్టిలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించినది సరస్వతీ రూపియైన ఉభయభారతియే.

*రమణ సందేశము

 *రమణ సందేశము*



ఈ మధ్య అరవిందబోస్ బెంగళూరునుండి ఖరీదైన పెన్సిళ్ళు కొన్ని తెచ్చాడు.

అవి శ్రీవారికి సమర్పించి, నమస్కరించి కుశల ప్రశ్నానంతరం “మహాప్రస్థానం”

అనే పేరుతో ఇక్కడ కట్టబడ్డ తన బంగళాకు వెళ్ళాడు.


 అతను వెళ్ళిన తరువాత భగవాన్ ఆ పెన్సిళ్ళు అటూ ఇటూ త్రిప్పీ, రాసీచూస్తూ వాటి మంచినంతా వర్ణించి, కృష్ణస్వామి చేతికి ఇస్తూ "ఇవి భద్రంగా దాచి ఉంచయ్యా. జాగ్రత్త, మన సొంత పెన్సిల్ ఎక్కడో ఉండాలి. అది చూచి

తెచ్చి యివ్వు" అన్నారు. కృష్ణస్వామి అవి తీసుకొని భగవాన్ సోఫాకు ప్రక్కనే

టేబిల్ మీద వున్న సన్నవి కొయ్యపెట్టె తెఱచి, అటూ యిటూ వెతికి, ఇంకొకటి

మంచి పెన్సిలే తీసి ఇచ్చాడు..

భగవాన్ అదీ తిప్పి తిప్పి చూచి "ఇదెందుకయ్యోయ్. ఇది దేవరాజమొదలియారు ఇచ్చింది. అసలు మన సొంత పెన్సిల్ ఉండాలి కదా. అది ఇచ్చి, ఇది

కూడా భద్రంగా దాచిపెట్టు" అన్నారు.


 కృష్ణస్వామి అక్కడెంత వెతికినా

కనుపించలేదు. “హాల్లో ఉన్నదేమో, వెతకండి" అన్నారు భగవాన్. ఒకరు వెళ్లి

చూచివచ్చి "కనిపించలేదు" అన్నారు. "అయ్యయ్యో, అది మన సొంత పెన్సిలయ్యా. ఎక్కడ పోయిందో సరిగా చూడండి" అన్నారు భగవాన్. దేవరాజమొదలియారు అక్కడే ఉండి "అదేమి భగవాన్, ఇవన్నీ మాత్రం సొంతం కాదా?”అన్నారు.


భగవాన్ నవ్వుతూ “అది కాదండీ. ఇది మీరిచ్చారు, అవి బోసు తెచ్చాడు.ఇవన్నీ ఖరీదైనవి. ఏమరుపాటుగా ఉంటే, ఎవరైనా ఎత్తుకు పోతారు. స్వామిఅందఱికి ఉమ్మడియే కదా. భగవానుకు అని అంత ఖరీదు పెట్టి తెచ్చామే,పోయిందే అని మీరు అనుకోవచ్చు. అదంతా ఎందుకు? మన సొంత పెన్సిలైతే ఎలా పెట్టుకున్నా బాధ లేదు. దాని వెల అర్ధణా. అదీ కొన్నది కాదు. ఎక్కడో

దొరికిందని వీరెవరో తెచ్చియిచ్చారు. అది మనకు సొంతం. వీటన్నిటికీ

చెప్పాలి. అది ఏమయిందని ఎవరూ అడగరు. అందుకని అదే కావాలి అంటున్నాను. ఇవన్నీ గొప్పవారు వాడేవి. మనకెందుకు? మనమేమి పరీక్షలు ప్యాసు కావాలా? ఉద్యోగాలు చేయాలా? మన రాతకు అది చాలును" అని

చెప్పి, కడకు అది వెతికించి తెప్పించుకున్నారు భగవాన్.


కొంతకాలం క్రిందట ఇటువంటిదే ఒక సంఘటన జరిగింది. అది ఏమంటే:

ధనికులెవరో వెండిది కప్పూ, సాసరూ, చెంచాతో సహా ఆఫీసు ద్వారా శ్రీవారి

సన్నిధికి తెచ్చి "భగవాన్ ద్రవపదార్థం ఏదైనా పుచ్చుకొనేప్పుడు ఇవి ఉపయోగింప వలసింది” అని సమర్పించారు. భగవాన్ అవి చూచి పరిచారకుల

చేతికి ఇచ్చారు. ఆ వచ్చినవారు వెళ్ళిన తరువాత, పరిచారకుడు అవి అక్కడి

బీరువాలో పెట్టబోతూ ఉంటే, భగవాన్ వారించి "అక్కడెందుకోయ్, ఆఫీసులోనే

ఉంచుకోమను" అన్నారు. “భగవాన్ వాడుకునేందుకని కదా వారిచ్చింది?”

అన్నారొక భక్తులు. “సరిపోయింది. ఇవన్నీ ధనవంతులు వాడేవి. మనకెందుకు?కావాలంటే మన సొంత కప్పులూ చెంచాలు ఉన్నవి కదా. అవి వాడుకోవచ్చు.ఇవెందుకు?” అని ఆ పరిచారకుని చూచి 'ఏమోయ్ రేపటినుండీ సొంతకప్పు వాడుకుందాం. తీసి ఇవ్వు" అన్నారు భగవాన్. “సొంత కప్పేమిటి భగవాన్?”

అన్నాడా భక్తుడు.

“అదా. టెంకాయ చిప్పలు అరగదీసి నునుపు చేసి పెట్టుకున్నాం. అవే

నాకు కప్పులూ చెంచాలూను. అవి మనకు సొంతం. అవి వాడుకుంటే సరిపోతుంది. ఇవి భద్రం చేయమనండి" అన్నారు భగవాన్. "ఇవి మాత్రం

భగవానుని కాదా?” అన్నాడా భక్తుడు. భగవాన్ నవ్వుతూ “అది సరేనండీ. ఆ

ఆడంబరమంతా మనకెందుకు చెప్పండి? అవి ఖరీదైనవి. ఎవరైనా

ఎత్తుకొనిపోతారు. కాపలా కాయాలి. స్వామికి అదేనా పని? అదీ గాక స్వామికదా

అడిగితే ఇవ్వడా? అని ఎవరైనా అడగవచ్చు. కాదనేందుకు లేదు. ఇచ్చామా,

స్వామికని తెస్తే ఎవరికో ఇచ్చారే అని వారనుకోవచ్చును. ఎందుకది? మన సొంత కప్పులైతే ఎలా వాడుకున్నా, ఏం చేసినా ఫరవాలేదు" అని చెప్పి ఆ

వెండివి పంపి, సొంత కప్పులు తీయించి అందరికీ చూపించారు.


 ఆ రోజుల్లోనే ఉద్యోగస్థుడుగా వున్న ఒక భక్తుడు ఊరినుంచి

భగవాన్ సన్నిధికి వస్తూ వెండి పొన్నులు వేసిన చక్కని చేతికఱ్ఱ ఒకటి తెచ్చి

శ్రీవారికి సమర్పించాడు. భగవాన్ అటూ యిటూ త్రిప్పి చూచి "భేష్, చాలా

బాగున్నదండీ, భద్రంగా వాడుకోండి" అని సెలవిచ్చారు. “అయ్యో, నాకని కాదు, భగవాన్ వాడుకుంటారనే తెచ్చాను. మీరు ఉపయోగించాలి" అన్నాడా భక్తుడు.

“సరిపోయింది. వెండి పొన్నులు వేసిన నాజూకు కఱ్ఱలు మీవంటి ఉద్యోగస్థులు

వాడాలి కాని నాకెందుకు? అదుగో నా సొంత కఱ్ఱ వున్నది. అది చాలును”అన్నారు భగవాన్. “అది శిథిలమైనప్పుడు ఇది వాడవచ్చును కదా" అన్నారింకో భక్తులు.

"ఈ అలంకారాలన్నీ మనకి ఎందుకండోయ్. కట్టెపేడు చెక్కితే క్షణంలో కఱ్ఱ

అమరుతుంది. అది మనకు మూడో కాలు. ఈ కట్టెకు ఆ కట్టె సహాయం.కొండమీద ఉండగా ఎన్నో కట్టెలు కఱ్ఱలుగా చెక్కి నునుపు చేసి ఉంచేవాణ్ణి.కానీ ఖర్చులేదు. ఆ కఱ్ఱలు ఎందరో పట్టుకొని వెళ్ళారు. మనకవి సొంతం. ఈ

ఆడంబరాలన్నీ మనకెందుకు? మనమేం ఉద్యోగాలు చెయ్యాలా? ఊళ్ళేలాలా?

మనకది చాలును" అని చెప్పి వారి కఱ్ఱ వారికి ఇప్పించారు భగవాన్.


భగవాన్ నిరాడంబర వస్తువులు తప్ప తదితరములు వాడరు. కాణీ కూడా ఖర్చుకాని వస్తువులంటేనే వారికి ప్రీతి. 


💐💐💐💐💐💐💐💐

Violinist


 

Panchaag


 

Experiment

Water bottle experiment 

ఆర్థికభారం..అన్నదానం..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి లీలలు..


*ఆర్థికభారం..అన్నదానం..*


"అప్పులన్నీ..ఒక్క నయాపైసా కూడా బాకీ లేకుండా..అణా పైసలతో సహా..తీర్చేసానండీ..ఇప్పుడు ప్రశాంతంగా వున్నాను..మూడు నెలల క్రితం వరకూ ఒక్క క్షణం కూడా మనసుకు శాంతి అనేదే లేకుండా నరకం అనుభవించాను." అన్నారు విశాఖపట్నం నుంచి వచ్చిన శ్రీ చింతా సుధాకర్ గారు..


శ్రీ సుధాకర్ గారు MBBS చదివి, హోమియోపతి లో MD పట్టా తీసుకున్నారు..విశాఖపట్నం లో డాక్టర్ గా పనిచేస్తున్నారు..కొన్ని సంవత్సరాల పాటు విదేశాలలో కూడా పని చేసి వచ్చారు..ఆ సమయం లో ఆర్ధికంగా స్థిరపడ్డారు కూడా..ఒక ఇల్లు కట్టుకున్నారు..భార్యా పిల్లలతో ఏ లోటు లేని జీవితం గడుపుతున్నారు..అనుకున్న విధంగానే జీవితం సాఫీగా జరిగిపోతూ వుంటే మనిషికి దైవం గుర్తుకు రాడు..శ్రీ సుధాకర్ గారు కూడా తన వద్ద ఉన్న డబ్బుతో ఏదైనా చేయాలని ఆలోచన చేసి..తనకు అవగాహన లేని కొన్ని వ్యవహారాలలో డబ్బు పెట్టుబడి పెట్టారు..అందులో భారీగా నష్టం వచ్చింది..తాను కూడబెట్టుకున్న డబ్బే కాక..అప్పుతెచ్చి మరీ పెట్టుబడిగా పెట్టింది కూడా పూర్తిగా నష్టపోయారు..కేవలం తన వృత్తి మీద వచ్చే సంపాదన తో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి దాపురించింది..ఇల్లు అమ్మివేసి, అప్పుతీరుద్దామనుకున్నారు..కానీ సుధాకర్ గారి పరిస్థితి ఆసరాగా తీసుకుని..ఇంటిని అతి తక్కువ ధరకు కొంటామని కొందరు ప్రయత్నం చేశారు..ఆ ధరకు అమ్ముకోలేక..అప్పులవాళ్లకు సమాధానం చెప్పుకోలేక సుధాకర్ గారు సతమతం అవసాగారు..


"మీరు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్న స్వామివారి లీలలను ప్రతి నిత్యం చదువుకునే వాడిని..కానీ ఒకతట్టు ముప్పైలక్షల రూపాయల అప్పు  నెత్తిన ఉన్నది..అప్పిచ్చిన వాళ్ళు ప్రతిరోజూ ఫోన్ చేసి తమ బాకీ తీర్చమని అడుగుతున్నారు..దిక్కుతోచని స్థితిలో ఈ స్వామివారి కి మనసులోనే మొక్కుకొని..మొగలిచెర్ల కు ప్రయాణమై వచ్చేసానండీ..ఆరోజు మీరు ఇక్కడ లేరు..నేను ఉదయాన్నే మందిరానికి వచ్చి..స్నానాదికాలు ముగించుకొని..శ్రీ స్వామివారి వద్ద పూజ చేయించుకున్నాను..పూజారి గారి అనుమతి తీసుకొని శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..నా కష్టాలన్నీ చెప్పుకున్నాను..ఆరోజు మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేశానండీ..అప్పుడే నిర్ణయం తీసుకున్నాను..తండ్రీ నా కున్న ఆర్ధిక బాధల నుంచి నన్ను విముక్తుడిని చేస్తే..నీ సన్నిధిలో అన్నదానం చేస్తానని..మనస్ఫూర్తిగా మొక్కున్నాను..ఎందుకనో శ్రీ స్వామివారు పరిష్కారం చూపుతారనే నమ్మకం కలిగిందండీ..నేను ఇక్కడినుంచి విశాఖపట్నం చేరిన మూడోరోజు..మా ఇల్లు కొనడానికి వచ్చారండీ..స్వామివారి లీల అప్పుడే కనబడింది..నేను ఊహించిన దానికన్నా ఎక్కువ ధరకు కొంటామని చెప్పారండీ..చెప్పడమే కాదు..అప్పుడే ఐదు లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చారండీ..అంతా కలలో జరిగినట్లు జరిగిపోయింది..మరో నెలకల్లా మరో ఇరవై లక్షలు ఇచ్చారండీ..నా అప్పులన్నీ తీర్చేసానండీ..అందరికీ చెప్పుకున్నాను..ఆ మొగలిచెర్ల దత్తాత్రేయుడే నాకు అండగా నిలబడ్డాడని..ముందు స్వామివారి వద్ద మొక్కుకున్నాను కదండీ..అందుకని ఈరోజు అన్నదానం చేయడానికి వచ్చానండీ.." అని చెప్పుకొచ్చారు..


సుధాకర్ గారు శ్రీ స్వామివారి సమాధిని మనసారా దర్శించుకున్నారు..దగ్గరుండి మరీ అన్నదానం చేశారు..తనకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు నేరుగా శ్రీ స్వామివారి వద్దకు వస్తానని పదే పదే చెప్పి వెళ్లారు..ఒక్కొక్కరి అనుభవం ఒక్కో విధంగా ఉంటుంది..భక్తుడికి, స్వామివారికి మధ్య అన్యులెవరూ వుండరు.. వారి వారి భక్తి విశ్వాసాలే వారికి ఫలితాలను కలుగ చేస్తాయి..


సర్వం..

శ్రీ దత్తకృప!.


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

చతుర్ధామాలు

 చతుర్ధామాలు (మఠాలు) వివరాలు:

🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳


మఠము-పీఠము :- 

~~~~~~~~~~~

సన్యాసులు,బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించాడనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు.


ద్వారకా మఠము :-

****************

ఈ మఠము శంకరులచే,దేశానికి పశ్చిమంగా, మొదటగా స్థాపించబడింది.దీనిని కాళికామఠమనీ, సిద్ధేశ్వరమఠమనీ, పశ్చిమామ్నాయ మఠమనీ అంటారు. ఇది కీటవాళ సాంప్రదాయ మఠము.భూతదయతో నిత్యము కీటకములు మొదలైన వాటిని హింసించకుండా అహింసా వ్రతాన్ని ఆచరించడాన్ని కీటవాళ సాంప్రదాయమంటారు. ఈ మఠ సన్యాసులకు చివర 'తీర్ధ' అనిగాని 'ఆశ్రమ' అని గాని ఉంటుంది.ఈమఠానికి క్షేత్రం ద్వారక (గుజరాత్లో ఉంది); పీఠ దేవత సిద్ధేశ్వరుడు; పీఠ శక్తి భద్రకాళి; మఠము యొక్క మొదటి ఆచార్యుడు శంకరుని ముఖ్య శిష్యులలో ఒకడైన పద్మపాదాచార్యుడు; గోమతీ నది ఈపీఠ తీర్థము.ఇక్కడ ఉండే బ్రహ్మచారులను స్వరూపులని వ్యవహరిస్తారు.సన్యాసంతీసుకోబోయేముందు బ్రహ్మచారిగాచేరి శిక్షణపొంది సన్యాసం స్వీకరిస్తారు. స్వరూపులనే ఈ మఠ సన్యాసులు సామవేదాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసి ఉంది.తత్త్వమసి అనేది ఈమఠంయొక్క మహావాక్యం.ఈ వాక్యం జీవ, బ్రహ్మల ఐక్యతను ప్రతిపాదిస్తుంది.బ్రహ్మచారులు అవిగత గోత్రానికి చెందినవారుగా పరిగణింప బడతారు.సింధు,సౌరాష్ట్ర,మహారాష్ట్రములు వాటి మధ్యనున్న పశ్చిమభారత ప్రాంతం ఈ మఠం పరిధిలోకి వస్తాయి.ఈ ప్రాంతంలో హిందూమతధర్మాన్ని సుస్థిరం చేయవలసిన బాధ్యత ఈ ద్వారకామఠానిది.


గోవర్ధన మఠము :-

****************

దీనినే పూర్వామ్నాయ మఠము అని అంటారు.ఇది దేశానికి తూర్పున గలపూరీ పట్టణంలో ఉంది.ఈ మఠం భోగవార సంప్రదాయానికి చెందినది. ఇక్కడి సన్యాసులు 'వన','అరణ్య'అను యోగపట్టములు ధరిస్తారు.మఠక్షేత్రం పురుషోత్తమం (పూరీ);పీఠ దేవత పురుషోత్తముడు (జగన్నాథుడు; పీఠశక్తి వృషలాదేవి (సుభద్ర);మఠము యొక్క మొదటి ఆచార్యుడు హస్తామలకాచార్యుడు; మహోదధి ఈ మఠ తీర్థము.ఈమఠానికి చెందిన సన్యాసులను 'ప్రకాశకులు' అని వ్యవహరిస్తారు.భోగమంటే విషయములు. ఎవరు జీవులను విషయ లంపటముల నుండి దూరంగా ఉంచేందుకు వారిస్తారో వారిది భోగవాళ సాంప్రదాయం.ప్రజల భోగలాలసత్వాన్ని నివారించి ఉన్నత లక్ష్యాలవైపు మళ్ళించడానికి ఈ మఠం ప్రత్యేక బాధ్యత వహిస్తుంది.'ప్రజ్ఞానం బ్రహ్మ' అనేది ఈ మఠం యొక్క మహావాక్యము.ఇక్కడ ఋగ్వేదం ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది. ఇక్కడి బ్రహ్మచారులు కాశ్యపగోత్రీకులుగా పరిగణింపబడతారు. అంగ,వంగ,కళింగములు ఈ మఠ పరిధిలోని ప్రాంతాలు.ఈ ప్రాంత హిందూధర్మ పరిరక్షణ ఈ పీఠం బాధ్యత.


శృంగేరీ మఠము :-

****************

ఇది దక్షిణామ్నాయమఠమని, శారదాపీఠమనీ పిలువబడుతుంది.కర్ణాటక రాష్ట్రములోని శృంగేరి (శృంగ లేక ఋష్యశృంగ)లో ఈ మఠము స్థాపించబడింది.ఈ పీఠ దేవత వరాహుడు; పీఠ శక్తి శ్రీ శారదాదేవి; పీఠ క్షేత్రం రామేశ్వరం; పీఠ తీర్థం తుంగ నది.ఇక్కడి బ్రహ్మచారులను చైతన్యులని పిలుస్తారు. ఈ మఠము యొక్క మొదటి అధిపతి సురేశ్వరాచార్యుడు.ఈ మఠ సన్యాసులు పదియోగపట్టములలో దేనినైనా స్వీకరించవచ్చు. వీరు భూరివాళ సంప్రదాయానికి చెందిన వారు.భూరి అంటే బంగారము అని అర్థము.ఏ సాంప్రదాయం మానవులను కాంచనశక్తి (ధన వ్యామోహం,ధర్మబద్ధమైన ధనాపేక్షకాక) నుండి వారిస్తుందో అది భూరివాళ సాంప్రదాయం.ఇక్కడ యజుర్వేదం ప్రత్యేకంగా పఠించబడుతుంది.అహం బ్రహ్మాస్మి అనేది ఈ మఠము అనుసరించే మహావాక్యం. వీరిది భూర్భువ గోత్రం. ఆంధ్ర, కర్ణాట, ద్రవిడ, కేరళ ప్రాంతములు ఈ మఠ పరిధిలోకి వస్తాయి.


జ్యోతిర్మఠము :-

*************

దీనిని ఉత్తరామ్నాయ మనీ, బదరికాశ్రమమనీ కూడా అంటారు. ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం; పీఠ దేవత నారాయణుడు; పీఠ శక్తి పూర్ణగిరి; పీఠ తీర్థం అలకనంద (గంగానది). వీరిది నందవాళ సాంప్రదాయం. ఈ మఠ సన్యాసులు "గిరి","పర్వత","సాగర" యోగపట్టములను ధరిస్తారు. ఇక్కడ అథర్వణ వేదము ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది. అయమాత్మా బ్రహ్మ అనేది ఈ మఠపు మహావాక్యము. ఈ మఠానికి తోటకాచార్యుడు మొదటి అధిపతి. భారతదేశపు ఉత్తర భాగం ఈ మఠం పరిధిలోకి వస్తుంది.


శంకర మఠము{కంచికామకోటి పీఠము} :-

**************** ****************

సాక్షాత్తూ శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలు పైవి. ఇవి కాకుండా, శంకరుడు విదేహ ముక్తి పొందిన కంచి మఠం అయిదవది.


ఈ మఠము శంకర మఠముగా కన్న కంచి మఠముగానే ప్రసిద్ధము.దీనిని సర్వజ్ఞ పీఠము అని కూడా అంటారు. ఇది దక్షిణదేశము లోని కాంచీపురము లో ఉన్నది. ఇక్కడి ఆచార్యుల యోగ పట్టనామము 'ఇంద్రసరస్వతి'. ఈ నామము శ్రీ చంద్ర శేఖర ఇంద్ర సరస్వతి,శ్రీ జయేంద్ర సరస్వతి,శ్రీవిజయేంద్ర సరస్వతి ఈ విధముగా వాడబడుతున్నది. కంచిపీఠములో దేవత చంద్రమౌళీశ్వరస్వామి, శక్తి కామాక్షీదేవి. ఈ పీఠప్రథమ ఆచార్యుడు సాక్షాత్తు ఆది శంకరుడే అంటారు.తన తర్వాత పీఠాధిపతి గా సర్వజ్ఞాత్ముడనే బాల సన్యాసిని ఏర్పరచి, శృంగేరీ పీఠాధి పతి అయిన సురేశ్వరాచార్యుడి సంరక్షణ లో ఉంచాడని కంచి పీఠం చరిత్ర చెబుతోంది .ఐదవ శతాబ్దము నుండి కంచి పీఠము విజయ పథములో నడుప బడుతున్నది.

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

సేకరణ:

పరమాత్మను

 *🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


🍁పరమాత్మను కనుక తెలుకోకపోతే నీవు చదివిన శాస్త్రాలన్నీ వృధాయే.ఆయనను గనక తెలుసు కొంటే ఇక శాస్త్రాలన్నీ వృధాయే._


🍁భవబంధాలనుంచి విముక్తి పొందాలంటే మనిషి తానైనదానికి, తాను కానీ దానికి మధ్య తేడాను అభ్యాసం చేయాలి. అప్పుడు మాత్రమే అతడు సత్యాన్ని తెలుకోగలుగుతాడు._


🍁చీకటి, అది కల్పించే భ్రమలూ అవన్నీ కూడా సూర్యుడు రానంతవరకే. సూర్యుడు వచ్చాకా అవన్నీ మటుమాయం కావలసిందే కదా ! అలాగే ఆత్మసాక్షాత్కారం కానంతవరకే ఈ మాయ పొరలన్నీనూ..


🍁నీవు కానిదాని గురించి ఆలోచించకు. అది నిన్ను కృంగదీస్తుంది. భాధ కలిగిస్తుంది. దానికి బదులుగా నీ అసలు స్వరూపం మీదా ద్రుష్టి సారించు. అది నిన్ను అన్నింటినుంచి విముక్తుడిని చేస్తుంది.


🍁మనసును నిశ్చలంగా ఉంచితే అది నిన్ను భగవంతుడి వైపు తీసుకుపోతుంది. లేదంటే నిన్ను భ్రమలలోనే ముంచేస్తుంది.


🍁సంపదల వెంట పరుగులు పెట్టకు. ఎందుకంటే సంపద మనిషిని పతనం చేస్తుంది. సంపద గల మనిషి తన స్వంత కుమారులకు కూడా భయపడతాడు. ఇది సంపద వల్ల వచ్చే ఫలితం.


🍁సూర్యుడు నుంచి వచ్చే వేడి నుంచి చంద్రుడు భూమిని కాపాడుతూ ఉన్నట్లుగా, మహాత్ములు ఎల్లప్పుడు భాదల్లో ఉన్నవాళ్ళకి సహాయం చేస్తుంటారు


🍁నిర్గుణ సమాధి ద్వారా మనిషి తన వృదయంలో ఉన్న అజ్ఞాన ముడిని విప్పేసుకుంటాడు.


🍁బంగారాన్ని మండుతున్న కొలిమిలో గనక పెడితే ఎలాగైతే దానిలోని మాలిన్యాలన్నీ పోతాయో అలాగే మనిషి కూడా ధ్యానమగ్నుడైతే పరిశుద్ధుడౌతాడు.


🍁ఇంద్రియనిగ్రహంతో వైరాగ్యభావం గల మనిషిలో ఉన్న శాంతినీ, సంతోషాన్ని ఎవరు పోగొట్టగలరు...?_


🍁శ్వాసమీదనే ధ్యాస పెట్టుకొని ధ్యానమగ్నుడైన వాడికి అన్నీ ఉన్నట్లే.


🍁అజ్ఞానమే అన్ని బంధాలకు ఆదిమూలం. అదిపోతే దానితో బాటు వచ్చిన అన్ని బంధాలూ పటాపంచలవుతాయి.


 🍁తామరాకుమీది నీటిబిందువు ఎలాగైతే నిలకడగా ఉండదో అలాగే ఈ జీవితం కూడా నిలకడగా ఉండదు.


🍁ఇంద్రియాలు సహకరిస్తే సుఖం. అవి సహకరించకపోతే దుఃఖం. కాబట్టి సుఖదుఃఖాలు రెండు కూడా శాశ్వతమైనవి కాదని తెలుసుకొంటే మంచిది.


🌸