24, ఫిబ్రవరి 2024, శనివారం

Vijaya bhavan veg tirupati


 

Young


 

అత్యద్భుతమైన కథ

 అత్యద్భుతమైన కథ ఇది ప్రతి భారతీయుడికి వస్తుంది


🙏🏾


అనగనగా ఒక అడవి,

ఆ అడవిలో ఎన్నో జంతువులు. 

ఆ అడవికి సింహం రారాజు..


సింహం ఆకలేసినపుడు మాత్రమే వేటాడుతూ మిగతా సమయంలో తన గుహలో నిద్రపోయేది,


ఇదిలా ఉండగా పక్క ఇంకో అడివి నుండి కొన్ని అడవి పందులు వచ్చాయి,

వాటిని చూసి సింహం .."ఆ పందులే కదా మనకు ఏందిలే"అని ఊరుకుంది ,


ఆ పందులు కొన్నాళ్ళకు గుంపులు, గుంపులుగా పిల్లల్ని కని అడవంతా ఆక్రమించుకుని అడవిని నాశనం చేయసాగాయి.


 సింహం ఎప్పటిలాగే ఆకలేసినపుడు లేడినో, జింకనో వేటాడి, తిని గుహలో పడుకునేది. 


ఇంకొంత కాలం పోయాక ఆ అడవిలో కొండగొర్రెలు ప్రవేశించాయి, 


బద్దకానికి అలవాటు పడిన సింహం వాటిని వేటాడక దొరికింది తిని పడుకునేది. 


మరి కొంతకాలం గడిచే సరికి అడవి నిండా పందులూ, గొర్రెలే కనిపించసాగాయి. 


పందులు .. దుంపలు, వేర్లు పెకలిస్తూ చెట్లు నాశనం చేస్తుంటే, గొర్రెలు పచ్చని ఆకులు, చక్కని కాయలు తినేస్తూ అడవిని ఎడారిలా మార్చేసాయి ,


ఇది చూసిన మిగతా జంతువులు వేరే అడవికి వలస పోగా, మిగిలినవి ఆకలితో చచ్చాయి.


సింహం పరిస్థితి చేయిదాటి పోతుందని గ్రహించి సమావేశం పెట్టిి. "నేను రాజుగా అజ్ఞాపిస్తున్నా, వెంటనే ఈ అడవి వదిలి పోండి" అని పందులు,గొర్రెలను హెచ్చరించింది 


కానీ సంఖ్యాబలం ఉన్న పందులూ, గొర్రెలూ కలిసి సింహాన్ని చంపేసాయి..


ఇక్కడ సింహం చేసిన తప్పులు👇


1.తన సంతానాన్ని పెంచుకోకపోవడం.


2.తన అడివి లోకి వచ్చిన రోజే పందుల్ని, గొర్రెల్ని తరిమేయక పోవడం.


3.నాకెందుకులే , నా ఆహారం, నా ఆధారం ఉంటే చాలు అని అనుకోవడం.


4.తన అడివి పట్ల బాధ్యత, కృతజ్ఞత లేకపోవడం.


5.తన దాకా వచ్చే వరకు ముప్పుని గ్రహించకపోవడం.


6.తన బద్దకంతో దుష్టులకు ఆశ్రయం ఇవ్వడం.


7.ఆకులు, దుంపలు తినే పందులు, గొర్రెలు నన్ను ఏం చేస్తాయిలే అనే మొద్దు స్వభావం తో వుండడం.


*నీతి :-* శత్రువు ఆకారం కాదు, వాడి ఆలోచన చూసి జాగ్రత్త పడాలి..


*ఈ కధ చదివి మీకేదైనా గుర్తొస్తే మీరు కళ్ళు తెరుచుకున్న అసలైన  భారతీయులు అవుతారు..*

అస్థిరతను తెలియక

 శ్లోకం: ☝️


 యథా వ్యాలగలస్థోఽపి

భేకో దంశానపేక్షతే|

తథా కాలాహినా గ్రస్తో

లోకో భోగానశాశ్వతాన్||


"పాము నోట చిక్కిన కప్ప తన మృత్యువును తెలియక ఈగలను తినుటకు కోరినట్లుగా, జనులు కాలరూపమగు సర్పము నోట చిక్కిననూ తమ అస్థిరతను తెలియక అనిత్యమైన భోగములకై ప్రాకులాడుచుందురు".


*సర్వే జనాః సుఖినోభవంతు*

నేటి వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం  -‌ పూర్ణిమ - మఘ -‌ స్థిర వాసరే* (24.02.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

కొన్ని జ్ఞాపకాలు

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*కొన్ని జ్ఞాపకాలు..*


మొగలిచెర్ల గ్రామానికి సమీపంలో ఉన్న ఫకీరు మాన్యం వద్ద శ్రీ స్వామివారు తమ ఆశ్రమాన్ని నిర్మిచుకోవాలని సంకల్పించారు..మా తల్లిదండ్రులు శ్రీ శ్రీధరరావు నిర్మల ప్రభావతి గార్లు, శ్రీ స్వామివారు కోరిన విధంగా ఐదు ఎకరాల భూమిని ఆశ్రమానికి ఇచ్చేసారు..ఆశ్రమ నిర్మాణానికి శ్రీ బొగ్గవరపు చిన మీరాశెట్టి గారు ముందుకువచ్చి..నిర్మాణాన్ని ప్రారంభించారు..ఇదంతా 1972 - 73 నాటి ముచ్చట..శ్రీ స్వామివారు తన తపస్సు కొనసాగిస్తూనే..ఆశ్రమ నిర్మాణాన్ని కూడా పర్యవేక్షిస్తూ వుండేవారు..మీరాశెట్టి గారి దంపతులు వారం లో రెండు మూడు సార్లు వచ్చి వెళ్లేవారు..శ్రీ స్వామివారు తాను కోరుకున్న విధంగా ఆశ్రమాన్ని కట్టించుకున్నారు..


ఒక మంచిరోజు చూసి ఆశ్రమం లోకి శ్రీ స్వామివారు ప్రవేశించారు..తన సాధన, తన తపస్సు తప్ప ఇతర లౌకిక విషయాలపట్ల శ్రీ స్వామివారు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు..ఎవరైనా వచ్చి తమ భవిష్యత్ గురించి అడగబోతే.."నీ ప్రారబ్ధాన్ని బట్టి ఉంటుంది..దానిని నేను మార్చలేను కదా..నువ్వు ఏ దేవుడిని కొలుస్తున్నావో..ఆ దైవాన్నే గట్టిగా నమ్ము..మార్గం చూపుతాడు.." అని సున్నితంగా చెప్పి పంపేవారు..ఎందుకనో శ్రీ స్వామివారు జాతకాలు చెప్పడం లాంటివి చేసేవారు కాదు..ఎంతసేపు దైవాన్ని భక్తితో ప్రార్ధించమని చెప్పేవారు.."నీవు ఎంత భక్తితో..ఆర్తితో..దైవాన్ని కొలుస్తావో..అంతే ఉత్సాహంతో దైవం నీకు అండగా ఉంటాడు..దైవకృప పొందాలంటే..అంతఃశుద్ధి చాలా ముఖ్యం..నీలో దైవం పట్ల తపన ఉండాలి..అది నిరంతరమూ నీలో వృద్ధి చెందాలి..అంతరంగం నిర్మలంగా వుండాలి..అప్పుడే దేవుడు నీ మొర ఆలకిస్తాడు.." అని చెప్పేవారు..


ఒకరోజు సాయంత్రం ఐదు గంటల వేళ, నేను మా పొలం నుంచి తిరిగివస్తూ..శ్రీ స్వామివారి ఆశ్రమం దగ్గర ఆగాను..ఒకవేళ శ్రీ స్వామివారు ధ్యానం ముగించుకొని బైటకు వచ్చి వుంటే..కలిసి వెళదామని లోపలికి వెళ్ళాను..శ్రీ స్వామివారు బావి వద్ద నిలబడి వున్నారు..నన్ను చూసి..నవ్వి..దగ్గరకు రమ్మని సైగ చేశారు..వెళ్ళాను..


బావిలోంచి బక్కెట్ తో నీళ్లు తోడి..ఆ బక్కెట్ తీసుకొని ఆ దగ్గరలోనే నాటబడి ఉన్న మొక్క పాదులో పోశారు..ఇలా రెండు మూడు బక్కెట్ల నీళ్లు తోడి..ఆ మొక్కకు పోశారు..ఆ మొక్క చుట్టూ..ఉన్న పాదునే.. మరి కొంచెం పెద్దదిగా తన చేతులతో చేశారు..నేను సహాయం చేద్దామని ముందుకు వచ్చాను..వద్దని వారించారు..శ్రీ స్వామివారి చేతులకు పై భాగం దాకా ఆ తడిమట్టి తాలూకు బురద అంటుకున్నది..నా వైపు చూసి.."బావిలోంచి కొంచెం నీళ్లు తోడు..నేను చేతులు శుభ్రం చేసుకుంటాను.." అన్నారు..నేను నీళ్లు తోడి, శ్రీ స్వామివారి చేతులమీద పోశాను.. శుభ్రం చేసుకున్నారు..


(సాక్షాత్తూ దత్తావతారమైన ఒక దిగంబర అవధూత నన్ను తన చేతులు శుభ్రం చేసుకోవడానికి సహాయం అడుగుతున్నాడనే స్పృహ నాకు ఆనాడు కలుగలేదు..ఒక మహిమాన్వితుడి శరీరాన్ని స్పృశిస్తున్నాననే జ్ఞానం నాకు ఆనాడు మదిలో మెదలలేదు..ఒక సాధారణ మానవుడికి చేసిన సహాయం లాగా భావించాను..ఇప్పుడు తలుచుకుంటేనే శరీరం పులకరిస్తుంది..)


 ఆ తరువాత అక్కడనుంచి లేచి ఇవతలికి వచ్చి..

"ఇది పారిజాతం మొక్క!..మొన్న మీ అమ్మానాన్న ఇక్కడికి వస్తూ తీసుకొచ్చారు..మీ అమ్మగారు దీనిని నాటారు..ఆమె నాకూ తల్లిలాంటిది..అందుకని ఈ మొక్కను జాగ్రత్తగా చూసుకోవాలి కదా.." అన్నారు.."ఈ స్థలం లో బాగా చెట్లు పెంచుకోవాలి..నిన్న ఆ మూల ఒక వేప మొక్క నాటాను.." అని నాకు చూపించారు..


(శ్రీ స్వామివారి మందిరం లో ఈనాటికీ ఆ పారిజాతం చెట్టు, వేపచెట్టు..అలానే ఉన్నాయి..మందిర ప్రాంగణంలో ఎన్ని మార్పులు చేసినా..వాటిని మాత్రం తొలగించకుండా కాపాడుకుంటున్నాము..)


శ్రీ స్వామివారు ఆశ్రమం వద్ద తన ఖాళీ సమయాల్లో చాలానే మొక్కలను నాటారు..ప్రస్తుతం ఉన్న మందిరానికి ఉత్తరం వైపు ఉన్న వేప, రావి చెట్లు శ్రీ స్వామివారు స్వయంగా నాటినవే..వాటికి ప్రదక్షిణాలు చేయడం భక్తులకు ఒక అలవాటు..ఆ రెండుచెట్లకూ కలిపి క్రింద వైపు విశాలమైన అరుగును భక్తుల సహకారం తో నిర్మించాము.. అలానే ప్రస్తుతం శివాలయం ఉన్న ప్రాంతమంతా చెట్ల నీడలో చల్లగా ఉందంటే కారణం..ఆనాడు శ్రీ స్వామివారు తీసుకొన్న శ్రద్ధే!..

సత్పురుషులకూ..సాధువులకూ..అవధూతలకూ.. భక్తుల మీద ప్రేమతో పాటు..పర్యావరణం మీద కూడా ఎనలేని ప్రేమ ఉంటుంది..


మొగలిచెర్ల లో పుట్టి పెరిగిన మేము, ఫకీరు మాన్యం గా పిలవబడ్డ ఆ బీడు భూమి ఒక దత్త క్షేత్రంగా మారుతుందని ఆనాడు ఊహించలేదు..ఈనాడు మొగలిచెర్ల గ్రామానికి ఆ క్షేత్రం వల్లనే ఎనలేని గుర్తింపు వస్తోంది..కేవలం ఒక దిగంబర అవధూత చేసిన తపో సాధన ఫలితమే ఇది..


సర్వం..

శ్రీ దత్తకృప!.


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

_మాఘ పౌర్ణమి

 *_𝕝𝕝 ॐ 𝕝𝕝  నేడు - మాఘ పూర్ణిమా, మహామాఘి 𝕝𝕝 卐 𝕝𝕝_*

*≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈*


*_మాఘ పౌర్ణమి విశిష్టత_*

*~~~~~~~~~~~~~*


 మాఘపూర్ణిమ, మహామాఘి ఇది విశేష పర్వదినం. స్నానానికి ప్రాముఖ్యమైన మాఘమాసంలో ప్రతిరోజూ సూర్యోదయం ముందు చెయ్యలేని వారు (స్నానం అంటే సూర్యోదయాత్ పూర్వం సభక్తికంగా, విధివిధానంగా చేసే స్నానం) ఈ రోజునైనా చేయాలని ధర్మశాస్త్రోక్తి.


ఈ పూర్ణిమ నాడు సముద్రస్నానం విశేషం. తిధుల్లో ఏ పూర్ణిమ అయిన సంపూర్ణంగా దైవీశక్తులు దీవించే పుణ్యతిథి. ఈ తిధినాడు ఇష్టదేవతారాధన, ధ్యానజపాది అనుష్టానాలు మహిమాన్వితమైన ఫలాన్ని ఇస్తాయి. 


ఈ రోజు సూర్యోదయానికి ముందు సముద్రస్నానం చేయడం మంచిది. అన్ని పూర్ణిమల్లోకి ఆషాఢ, మాఘ, కార్తీక, వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతొ ఉత్కృష్టమైనవి. వాటిని వ్యర్ధంగా గడుపరాదని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.


*వైశాఖీ కార్తికీ మాఘీ*

*తిథయోఽతీవ పూజితాః౹*

*స్నాన దాన విహినాస్తా*

*ననేయాః పాండునందన॥*


స్నానదాన జపాది సత్కర్మలు లేకుండా వృథాగా ఈ మూడు మాసాలు పూర్ణిమలను గడుపరాదు.


మాఘపూర్ణిమ నాడు "అలభ్య యోగం" అని కూడా అంటారు. అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది గొప్పయోగం అవుతుంది. అది అంత తేలికగా లభించేది కాదు.


👉 స్నానంం చేస్తున్నప్పుడు పఠించాల్సిన శ్లోకం.


*దుఃఖదారిద్యనాశాయ* *శ్రీవిష్ణోస్తోషణాయాచ*

*ప్రాతః స్నానం కరోమ్యద్య* *మాఘేపాపవినాశనం*


*మకరస్దే రవౌ మాఘే* *గోవిందాచ్యుత మాధవ*

*స్నానేనానేన మే దేవ*

*యథోక్త ఫలదో భావ''*


అని పఠించి, మౌనంగా స్నానం చేయాలి. అంటే "దుఃఖములు, దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను. 


కనుక ఓ గోవిందా! అచ్యుతా! మాధవా!  ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు'' 

అని అర్థం. 


ఆ తరువాత ...


*"సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ*

*త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రథా''*


అని సూర్యునకు ఆర్ఘ్యప్రదానం చేయాలి. అంటే "ఓ పరంజ్యోతి స్వరూపుడా! నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందు బడి నశించుగాక'' అని అర్థం.


ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత, పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తిచేసుకుని, 

ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ తర్వాత, దానధర్మాలు చేయాలి. వస్త్రములు, కంబళములు (దుప్పటులు), పాదరక్షలు, గొడుగు, తైలము, నెయ్యి, తిలపూర్ణఘటము, బంగారము, అన్నము మొదలైనవి దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది.


🚩 *_స్వస్తి_* 🚩

రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

*24-02-2024 / శనివారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

మేషం


నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు.  గృహమున సంతాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక  పురోగతి కలుగుతుంది. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి అవుతాయి. దూర ప్రాంత దైవ దర్శనాలు చేసుకుంటారు.

---------------------------------------

వృషభం


దైవ చింతన పెరుగుతుంది ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ముఖ్యమైన పనులు మందగిస్తాయి. కుటుంబమున కొందరి మాటలు వివాదాస్పదంగా మారతాయి. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగాలలో ఊహించని  మార్పులు ఉంటాయి.

---------------------------------------

మిధునం


ఆప్తులతో  మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు  మరింతగా మందగిస్తాయి. మానసికంగా సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సహ వాతావరణం ఉంటుంది. ఆదాయమార్గాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుండి  విమర్శలు పెరుగుతాయి.

---------------------------------------

కర్కాటకం


ఉద్యోగమున ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. వ్యాపారమున నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. సంఘంలో పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన  వాహనం కొనుగోలు చేస్తారు.

---------------------------------------

సింహం


సంఘంలో పెద్దల  పరిచయాలు అంతగా కలసిరావు. కుటుంబ సభ్యుల ప్రవర్తన  కొంత చికాకు పరుస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది.  ఉద్యోగమున శ్రమకు తగిన గుర్తింపు లభించదు వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి ఇబ్బంది తప్పదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కన్య


దైవ కార్యక్రమాలకు ధన అందిస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో  మెరుగైన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలత పరిస్థితులుంటాయి. చుట్టుపక్కల వారితో వివాదాలలో పై చేయి సాధిస్తారు. రాజకీయ సభ సమావేశలకు హాజరవుతారు.

---------------------------------------

తుల


కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదించడం మంచిది. చేపట్టిన పనులు అతికష్టం మీద పూర్తి అవుతాయి.   వృత్తి,ఉద్యోగాలలో ప్రతికూల  పరిస్థితులు వేదిస్తాయి. స్థిరస్తి సంభందిత విషయాలలో వివాదాలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు.

---------------------------------------

వృశ్చికం


బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో  మీ అంచనాలు నిజం అవుతాయి. ఆర్ధిక ఇబ్బందుల నుండి కొంత వరకు బయటపడతారు.

---------------------------------------

ధనస్సు


వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి లాభాలు పొందుతారు. ఉద్యోగులు అధికారుల ఆదరణ  పెరుగుతుంది. మిత్రులతో  శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

---------------------------------------

మకరం


ఇతరులతో తొందరపడి మాట్లాడం మంచిది కాదు. దూర ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు బంధు వర్గం వారితో మాటపట్టింపులంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య  విషయంలో శ్రద్ద వహించాలి.

---------------------------------------

కుంభం


వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని పనులు  అనుకున్న సమయానికి పూర్తికావు  ఖర్చులకు తగిన ఆదాయం లభించదు.  ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన రుణయత్నాలు వ్యర్ధంగా మిగులుతాయి.

---------------------------------------

మీనం


అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. దీర్ఘ కాలిక వివాదాల నుండి ఉపశమనం పొందుతారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

🍀 *శుభం భూయాత్* 🍁

సూక్తము అంటే

 🙏🙏🙏🙏🙏


సూక్తము అంటే సు ఉక్తము - సుష్ఠు ఉక్తము - బాగుగా, చక్కగా చెప్పబడినది. ఉక్తము అంటే చెప్పబడినది అని అర్థం. బాగా చెప్పబడింది ఎప్పుడు కూడా పరమాత్మ గురించే అవుతుంది, భగవత్తత్త్వాన్ని గురించే అవుతుంది కనుక వేదములో పరమాత్మ వివిధ శక్తులను గురించి చేసే స్తోత్రాలను సూక్తములు - అంటాము. ఋగ్వేదంలో ఎన్నో సూక్తములు ఉన్నాయి. మనకి పురుష సూక్తము, నారాయణ సూక్తము, శ్రీ సూక్తము, ఇళా సూక్తము, మన్యుసూక్తము, రాత్రి సూక్తము, దూర్వా సూక్తము ... ఇలా అనేకమైనవి ఉన్నాయి. శ్రీ రుద్ర నమక చమకములను కూడా రుద్ర సూక్తము అంటాము. ఉన్న ఒక్క పరతత్వాన్ని మన కోర్కెలను తీర్చడానికి మనకు ఏమేమి కావాలో వాటిని మనకు ఇచ్చే స్వరూపాలుగా, అనేక నామరూపాలతో స్తోత్రించే సూక్తాలను మహర్షులు మనకి సూక్తముల రూపంలో అందించారు.


పురుష సూక్తంలో పరబ్రహ్మమును విరాట్ స్వరూపునిగా వర్ణించారు. నారాయణ సూక్తము నారాయణని గురించి, ఆయనే పరబ్రహ్మము అని వర్ణిస్తుంది. అలాగే శ్రీ సూక్తంలో శ్రీదేవి - మహాలక్ష్మి దేవి వర్ణించబడింది. భూ సూక్తం భూమాతను గురించి స్తోత్రిస్తుంది. అలాగే అన్ని సూక్తాలూను. వేదములలో వంద కంటే ఎక్కువ సూక్తాలున్నాయి. వేదంలోని సూక్తములన్నీ కూడా మంత్రభరితమైనవి. ప్రతి అక్షరము కూడా మంత్ర శక్తి యుతమైనవి. పరమాత్మ యొక్క విభూతులను గురించి చెప్పేవి వేదంలో ఉన్నవి. వీటిని సూక్తములు అంటాము. 


"పురుష సూక్తము.

నారాయణ సూక్తము.

శ్రీ సూక్తము.

భూ సూక్తము.

నీళా సూక్తము." - వీటిని పంచ సూక్తములు అంటారు. 

యజుర్వేదములో ఉన్న శ్రీ రుద్ర నమక చమకములను కూడా శ్రీ రుద్ర సూక్తము అంటాము.


లౌకికంగా చెప్పే మంచి మాటలను "సూక్తులు" అంటాము. సూక్తి అంటే కూడా మంచిగా, బాగుగా, చక్కగా చెప్పబడిన మాట అని అర్థం.చక్కగా ప్రజలందరికీ ఉపయోగపడే నీతి భరితమైన, దైవ సంబంధమైన, ఆధ్యాత్మికమైన ఏ మంచి మాటలనైనా సూక్తులు అని అంటాము. 


సూక్తి వేరే ! సూక్తము వేరే ! "సూక్తము" అనేది దైవం గురించి మనకు తెలియజేది, వేదములలో ఉన్నది. 


ఈ సూక్తాలన్నిటిని కూడా సమయం ఉన్నప్పుడు ఒక్కొక్క సూక్తాన్ని, ఆ సూక్తంలో ఏమేం చెప్పారు అన్నది అందరం కూడా భావన చేసుకోవచ్చు.