18, జనవరి 2026, ఆదివారం

పంచాంగం

 


సోమవారం*🕉️ *🌹19జనవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

    🕉️ *సోమవారం*🕉️

 *🌹19జనవరి2026🌹*    

   *దృగ్గణిత పంచాంగం*


          *ఈనాటి పర్వం* 

          *మాఘమాసం*

     *పుణ్య స్నానారంభః*

   

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - బహుళపక్షం*


*తిథి  : పాడ్యమి* ‌రా 02.14 వరకు ఉపరి *విదియ*

*వారం    : సోమవారం* ( ఇందువాసరే )

*నక్షత్రం  : ఉత్తరాషాఢ* ఉ 11.52 వరకు ఉపరి *శ్రవణం*

*యోగం : వజ్ర* రా 08.45 వరకు ఉపరి *సిద్ధి*

*కరణం  : కింస్తుఘ్న* మ 01.50 *బవ* రా 02.14 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు*

            *ఉ 06.30 - 07.30 & 11.00 - 12.30*

అమృత కాలం  : *శేషం ఉ 06.44 & రా 02.10 - 03.51*

అభిజిత్ కాలం  : *ప 11.56 - 12.41*

*వర్జ్యం    : సా 04.04 - 05.45*

*దుర్ముహూర్తం  : మ 12.41 - 01.26 & 02.56 - 03.41*

*రాహు కాలం   : ఉ 08.04 - 09.29*

గుళికకాళం      : *మ 01.43 - 03.07*

యమగండం    : *ఉ 10.54 - 12.18*

సూర్యరాశి : *మకరం* 

చంద్రరాశి : *మకరం*

సూర్యోదయం :*ఉ 06.50* 

సూర్యాస్తమయం :*సా 06.04*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు* 

ప్రాతః కాలం          :  *ఉ 06.40 - 08.55*

సంగవ కాలం         :     *08.55 - 11.10*

మధ్యాహ్న కాలం    :    *11.10 - 01.26*

అపరాహ్న కాలం    : *మ 01.26 - 03.41*

*ఆబ్ధికం తిధి         : మాఘ శుద్ధ పాడ్యమి*

సాయంకాలం        :  *సా 03.41 - 05.57*

ప్రదోష కాలం         :  *సా 05.57 - 08.29*

రాత్రి కాలం           :*రా 08.29 - 11.53*

నిశీధి కాలం          :*రా 11.53 - 12.44*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.58 - 05.49*

*****************************

        🌷*ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*కిం యానేన ధనేన* 

*వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం*

*కిం వా పుత్రకలత్రమిత్ర* 

*పశుభిర్దేహేన గేహేన కిమ్*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

మూక పంచశతి*

  🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 07*


*ఐశ్వర్యమిందు మౌళేరైకాత్మ్యప్రకృతి కాంచిమధ్యగతం |*

*ఐందవ కిశోరశేఖరమైదంపర్యం చకాస్తి నిగమానామ్ ||*


*భావము :*


*ఈశ్వరునికే ఐశ్వర్యప్రదాత, అద్వైతజ్ఞానమును ప్రసాదించునది, సర్వ వేదముల సారమైనది, చంద్రరేఖను శిరసున ధరించినది అయిన తల్లి కాంచీపుర మధ్యములో వెలుగుచున్నది.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున ।

నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ।। 45 ।।


ప్రతిపదార్థ:


త్రై-గుణ్య — భౌతికప్రకృతి యొక్క త్రి-గుణాత్మకమైన; విషయాః — విషయములు; వేదాః — వేద శాస్త్రములు; నిస్త్రై-గుణ్యః — త్రిగుణములకు అతీతంగా; భవ — ఉండుము; అర్జున — అర్జున; నిర్ద్వంద్వః — ద్వంద్వములకు అతీతంగా; నిత్య-సత్వ-స్థః — నిత్యము సత్యములో స్థితుడై ఉండి; నిర్యోగ-క్షేమ — యోగ క్షేమములు గురించి పట్టించుకోని; ఆత్మ-వాన్ — ఆత్మ యందు స్థితుడవై.


 తాత్పర్యము :


 ఓ అర్జునా, వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రి-గుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును. నీవు ఈ త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము. ద్వంద్వముల నుండి విడివడి, నిత్యమూ పరమ-సత్యంలో స్థితమై ఉండి, మరియు భౌతిక లాభాలు, భద్రతల గురించి పట్టించుకోకుండా, ఆత్మ భావన యందే స్థితుడవై ఉండుము.



 వివరణ:


భౌతిక శక్తి తన మూడు గుణములచే దివ్యమైన జీవాత్మను శారీరక భావనలో బంధించివేస్తుంది. ఈ మూడు ప్రకృతి గుణములు ఏమిటంటే, సత్త్వ గుణము, రజో గుణము, మరియు తమో గుణము. లెక్కలేనన్ని గత జీవితాల నుండి వస్తున్న తమతమ పూర్వ జన్మ సంస్కారాల వలన ప్రతి వ్యక్తిలో ఈ గుణాలు వేరువేరు పాళ్ళలో ఉంటాయి, తదనుగుణంగా ప్రతి ఒక్కరూ వేరువేరు స్వభావాలు, ధోరణులను కలిగి ఉంటారు.


వైదిక శాస్త్రాలు ఈ భిన్నత్వాన్ని అంగీకరిస్తాయి మరియు అన్నీ రకాల జనులకు తగిన బోధనలను సూచిస్తాయి. ప్రాపంచిక విషయాసక్తి కలిగిన ప్రజలకు, ఈ శాస్త్రాలు సూచనలను కలిగిలేకపొతే, వారు మరింత దారితప్పిన వారు అయ్యేవారు. కాబట్టి, వారికి భౌతికమైన ప్రతిఫలాలు ఇచ్చే కర్మ కాండలను వేదాలు అందచేశాయి. ఇవి వారికి తమో గుణము నుండి రజో గుణానికి, రజో గుణము నుండి సత్త్వ గుణమునకు ఎదిగేందుకు దోహదపడతాయి.


ఈ ప్రకారంగా, వేదాలు రెండు రకాల జ్ఞానాన్ని - ప్రాపంచిక ఆసక్తితో ఉన్నవారికి కర్మకాండలు మరియు ఆధ్యాత్మిక పథంలో ఉన్నవారికి దివ్య జ్ఞానమును - కలిగి ఉంటాయి. శ్రీ కృష్ణుడు అర్జునుడికి వేదాలని తిరస్కరించమని చెప్పినప్పుడు, ఆ సూచనని మనం ఇంతకుముందు మరియు తదుపరి శ్లోకాల సందర్భంలో అర్థం చేసుకోవాలి. భౌతిక ప్రతిఫలాలను ప్రసాదించే యజ్ఞయాగాది క్రతువులు, విధివిధానాలు, నియమ నిబంధనలు చెప్పబడిన వేదాలలోని ఆయా విభాగాల పట్ల అర్జునుడు ఆకర్షితుడు కావద్దని ఇక్కడ శ్రీ కృష్ణుడి ఉద్దేశం. దానికి బదులుగా, వేదాలలోని ఆధ్యాత్మిక భాగాలని అవగాహన చేసుకొని పరమ సత్యం స్థాయికి తననుతాను ఉద్ధరించుకోవాలి.

మౌని అమావాస్య

  మౌని అమావాస్య హిందూ ధర్మంలో చాలా విశిష్టమైన మరియు పవిత్రమైన రోజు. మాఘ మాసంలో వచ్చే అమావాస్యను 'మౌని అమావాస్య' అని పిలుస్తారు. ఈ రోజున భక్తులు పాటించే ముఖ్యమైన నియమాలు మరియు దీని వెనుక ఉన్న ప్రాముఖ్యత గురించి ఇక్కడ తెలుసుకోండి:

​1. మౌన వ్రతం

​ఈ రోజుకు 'మౌని' అనే పేరు రావడానికి ప్రధాన కారణం మౌనం. భక్తులు ఈ రోజున రోజంతా మౌనంగా ఉండి భగవంతుని స్మరిస్తారు.

​అంతరార్థం: మాట ద్వారా చేసే దోషాలను (అబద్ధాలు, కఠిన పదాలు) అదుపు చేయడం మరియు మనస్సును ఏకాగ్రతతో ఉంచడం దీని ఉద్దేశ్యం.

​2. పవిత్ర స్నానం

​మౌని అమావాస్య రోజున గంగా నది వంటి పవిత్ర నదులలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు.

​ముఖ్యంగా ప్రయాగ (అలహాబాద్) లోని త్రివేణి సంగమంలో ఈ రోజున స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అందుకే కుంభమేళా సమయంలో మౌని అమావాస్య స్నానం చాలా ప్రత్యేకం.

​3. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

​మనువు పుట్టిన రోజు: పురాణాల ప్రకారం, ఈ రోజే బ్రహ్మ దేవుడు 'మనువు'ను సృష్టించాడు. మానవ జాతి ఆవిర్భావానికి మూల పురుషుడు మనువు కాబట్టి, ఇది మానవ సృష్టికి పుట్టినరోజు వంటిది.

​గ్రహ దోష నివారణ: జాతకంలో చంద్రుడి ప్రభావం వల్ల కలిగే మానసిక ఆందోళనలను తగ్గించుకోవడానికి ఈ రోజున చేసే ధ్యానం ఎంతో మేలు చేస్తుంది.

​4. దాన ధర్మాలు

​మౌని అమావాస్య రోజున చేసే దానానికి విశేషమైన ఫలితం ఉంటుంది.

​ముఖ్యంగా నువ్వులు, దుప్పట్లు, అన్నదానం మరియు వస్త్ర దానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు.

​5. పితృ తర్పణాలు

​ఈ రోజున పితృ దేవతలకు (చనిపోయిన పెద్దలకు) తర్పణాలు వదలడం వల్ల వారికి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.

​సూచన: నేడు మీరు వీలైతే కాసేపు మౌనంగా ఉంటూ, భగవంతుని స్మరిస్తూ గడపండి. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం - అమావాస్య - పూర్వాషాఢ -‌‌ భానువాసరే* (18.01.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtube.com/watch?v=1nKmqe4tfpU&feature=shared



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

సంపూర్ణ మహాభారతము

 🔯🌹🌷🏹🛕🪷🌷🌹🔯

``

           *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                            9️⃣7️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


    *సంపూర్ణ మహాభారతము*

            

                    *97 వ రోజు*                    

*వన పర్వము తృతీయాశ్వాసము*


*గంధమాధన పర్వతం*```


ఆ తరువాత ధర్మరాజు తమ్ములతోనూ, ద్రౌపదితోనూ కలసి ఎన్నో ప్రయాసలకోర్చి గంధమాదన పర్వతం చేరుకున్నారు. మార్గం రాళ్ళతోనూ ముళ్ళతోనూ చేరి దుర్గమంగా ఉంది. భీముడు తనకుమారుడైన ఘటోత్కచుని స్మరించాడు. ఘటోత్కచుడు తండ్రి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ధర్మరాజు కోరిక మేరకు ఘటోత్కచుడు అందరిని వీపుమీద ఎక్కించుకుని ఆకాశమార్గంలో బదరికావనం చేర్చాడు. రోమశుడు తన మంత్ర మహిమతో ఆకాశమార్గాన బదరికావనం చేరాడు. అందరూ నరనారాయణులు తపస్సు చేసుకుంటున్న ఆశ్రమం చేరారు.```


*భీముడు ఆంజనేయుని కలుసుకొనుట*```


ఒకరోజు ద్రౌపది,భీముడు గంధమాధన పర్వతచరియలలో విహరిస్తున్నారు. వారి ముందు సహస్రదళ పద్మం గాలిలో ఎగురుతూ వచ్చి పడింది. దానిని చూసి ద్రౌపది ముచ్చట పడింది. అలాంటి పద్మాలు మరికొన్ని కావాలని భీముని కోరింది. ద్రౌపది కోరిన సౌగంధికా పుష్పాలు తెచ్చేందుకు బయలుదేరాడు. అలా వెళుతూ భీముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు. ఈ శబ్దాలను అక్కడ ఉన్న హనుమంతుడు విన్నాడు. ఆ వచ్చినది తన సోదరుడు భీముడని గ్రహించాడు. గుహలో నుండి బయటకు వచ్చి అక్కడ ఉన్న చెట్లను పెరికి దారికి అడ్డం వేసాడు. తాను కూడా దారికి అడ్డంగా పడుకుని తోకను విలాసంగా ఆడించసాగాడు. భీముడు అక్కడికి వచ్చి హనుమంతుని చూసి సింహనాదం చేసాడు. ఆ శబ్దానికి హనుమంతుడు కళ్ళు తెరిచి “ఎవరయ్యా నీవు? పెద్దవాడిని, అలసిపోయి పడుకున్న వాడిని పడుకుని ఉంటే ఇలా అరవడం తగునా? అడవిలో ఉన్న పండ్లు ఫలాలు తిని వెళ్ళు ఇలా అరవకు!” అన్నాడు హనుమంతుడు. 


భీముడు “నేను పాండురాజు పుత్రుడను, ధర్మరాజు తమ్ముడిని. నా నామధేయం భీమసేనుడు. నేను కార్యార్ధినై వెళుతున్నాను. నాకు దారి వదులు” అన్నాడు. 


హనుమంతుడు “నేను ముసలి వాడిని కదలలేను. నీవే నా తోకను పక్కన పెట్టి నీదారిన నీవు వెళ్ళచ్చు”అన్నాడు.


భీముడు అదెంత పని అని తోకను ఒక్క చేత్తో ఎత్తి పెట్టబోయాడు. తోక కదల లేదు. రెండు చేతులు ఎత్తి పట్టుకుని ఎత్తబోయాడు. అప్పుడూ కదల లేదు. భీముడు అది చూసి ఆశ్చర్య పోయాడు. భీముడు హనుమంతునితో “అయ్యా! మీరెవరో నాకు తెలియదు. కాని మీరు మహాత్ములు. నన్ను మన్నించండి” అన్నాడు. 


హనుమంతుడు భీమునితో “భీమా! నేను హనుమంతుడిని, నీ అన్నను వాయు పుత్రుడను. నేను రామబంటును. రావణుడు రాముని భార్యను అపహరించగా నేను లంకకు వెళ్ళి సీతమ్మ జాడను తెలుసుకుని రామునికి తెలిపాను. రాముడు రావణుని సంహరించి సీతమ్మను పరిగ్రహించాడు. రాముడు నా సేవలకు మెచ్చి నన్ను చిరంజీవిగా ఉండమని దీవించాడు, అప్పటి నుండి నేను గంధమాధన పర్వతంపై నివసిస్తున్నాను” అని చెప్పాడు. 


అది విన్న భీముడు సంతోషించి “ఆంజనేయా! నీవు అలనాడు సముద్రాన్ని లంఘించిన రూపాన్ని చూడాలని కోరికగా ఉంది. ఒక్క సారి చూపించవా?” అని అడిగాడు. 


హనుమంతుడు “భీమా! అది ఎలా కుదురుతుంది. ఆ కాలం వేరు ఈ కాలం వేరు యుగధర్మాలు కృతయుగంలో ఒకలా, త్రేతాయుగంలో వేరేలా, ద్వాపరంలో మరోలా ఉంటుంది. అలాగే కలియుగంలో పూర్తి విరుద్ధంగా ఉండబోతుంది" అన్నాడు.```


               *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

సంపూర్ణ మహాభారతము*

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯


          *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                           9️⃣8️⃣``

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


       *సంపూర్ణ మహాభారతము* 

        

                    *98 వ రోజు*                   

*వన పర్వము తృతీయాశ్వాసము*


*హనుమంతుడు చెప్పిన యుగధర్మాలు*```


భీముడు “అన్నయ్యా! ఆయా యుగాలలోని ఆచారాల గురించి చెప్పవా?” అన్నాడు. 


హనుమంతుడు ఇలా చెప్పసాగాడు 

“భీమసేనా! కృతయుగంలో అన్నీ కృతములే కాని చెయ్యవలసినది ఏమీ లేదు. అందుకనే ధర్మం నాలుగు పాదాలతో నడిచింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు శుక్లవర్ణంతో ప్రజలను కాపాడాడు. సనాతన ధర్మం వర్ధిల్లింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వేదాలు తమకు విధించిన విధులు నిర్వర్తించారు. వారు కోరకుండానే తగిన ఫలితాలు కలిగాయి. కనుక వారు పుణ్యలోకాలు పొందారు. ఆ యుగంలో జనులకు అసూయ, ద్వేషము, గర్వము, మదము, మాత్సర్యము, కోపము, భయం, సంతాపం, ప్రజాక్షయం, అవయవక్షయం లాంటివి లేవు. తరువాత త్రేతాయుగం ఆరంభమైంది. ధర్మం మూడుపాదాలతో నడిచింది. 

ఆ రోజుల్లో ప్రజలు సత్యసంధులు, యజ్ఞయాగాదులు చేసే వారు, తపస్సులు చేసే వారు, దానాలు చేసేవారు. అప్పుడు విష్ణువు రక్తవర్ణంతో ప్రజలను రక్షించాడు. 


ద్వాపరయుగం వచ్చింది. ధర్మం రెండు పాదాలతో నడిచింది. వేదములు, శాస్త్రములు విధించిన ధర్మము కామము అనుసరించబడ్డాయి. కాని ద్వాపరయుగంలో ప్రజలు మాటమీద నిలవరు, సత్యము శమము హీనమౌతుంది. ప్రజలు కామ్యార్ధం మాత్రమే యజ్ఞాలు చేస్తారు. ఈ యుగంలో విష్ణువు కృష్ణవర్ణంతో ప్రజా రక్షణ చేస్తాడు. తరువాత వచ్చునది కలియుగం. ఈ యుగంలో ధర్మం ఒక పాదంతో నడుస్తుంది. విష్ణువు పసుపు పచ్చని వర్ణంతో లోకులను రక్షిస్తాడు. కలియుగంలో జనులు తమోగుణంతో ప్రవర్తిస్తారు. జనులు కామము, క్రోధము మొదలైన వాటికి వశులై అధర్మ వర్తనులై ప్రవర్తిస్తారు. కలియుగంలో తపస్సు, ధర్మము, దానము లాంటి పుణ్యకార్యాలు స్వల్పంగా ఆచరించబడతాయి. కాని వాటికి ఫలితం విశేషంగా ఉంటాయి" అని హనుమంతుడు చెప్పాడు. 


భీముడు "ఆంజనేయా ! అలనాడు నీవు సాగరం దాటిన భీమరూపాన్ని చూడకుండా నేను ఇక్కడ నుండి కదలను" అన్నాడు.```


*హనుమంతుడి బృహద్రూపం*```


ఆంజనేయుడు సాగరాన్ని దాటినప్పటి రూపాన్ని భీమునకు చూపాడు. రెండవ మేరు పర్వతమా అని భ్రమింప చేసే ఆంజనేయుని విరాట్రూపం చూసి భీముడు భీతి చెంది ఆ రూపాన్ని ఉపసంహరింపమని హనుమంతుని వేడుకున్నాడు. 


హనుమంతుడు రూపాన్ని ఉపసంహరించి “భీమసేనా! నీవు కావాలి అనుకున్న సౌగంధికా పుష్పములు ఉన్న కొలనును యక్షులు, గంధర్వులు సంరక్షిస్తుంటారు. అక్కడ నీ శౌర్యప్రతాపాలు పనికి రావు. ఆ పుష్పాలు దేవతలు అనుభవిస్తుంటారు. దేవతలు భక్తికి లొంగుతారు కనుక ధర్మమెరిగి ప్రవర్తించు. సదాచారం నుండి ధర్మం పుడుతుంది. ధర్మం వలన వేదం ప్రతిష్టించ బడుతుంది. వేదముల వలన యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాలవలన దేవతలు సంతృప్తి చెందుతారు. దేవతలు తృప్తి చెందితే సకాల వర్షాలు పడి సంపదలు వృద్ధి చెందుతాయి. ఆలోచించి నిర్ణయించుకో. పిల్లలతో, గర్వం కలవారితో, నీచులతో వ్యర్ధ ప్రసంగం చెయ్యవద్దు. నిన్ను చూస్తే సంతోషం కలుగుతుంది. నీకేమి కావాలో అడుగు. భీమా! నీకు, నీ వారికి అపకారం చేసిన కౌరవులు, దృతరాష్ట్రుడు మొదలైన వారిని సంహరించి హస్థినా పురం నేల మట్టం చెయ్యమంటావా?" అన్నాడు. 


భీముడు "అమిత బలశాలివి అయిన మీకు అది అసాధ్యంకాదు. కాని మా శత్రువులను మేమే జయించడం ధర్మం కదా" అన్నాడు. 


హనుమంతుడు “భీమా! యుద్ధభూమిలో నన్ను తలచిన ఎడల నేను అర్జునిని రథం మీద ఉన్న ధ్వజంపై ఉండి మీకు విజయం కలగడంలో సహకరిస్తాను. అలాగే మీ ధైర్య సాహసాలు ప్రత్యక్షంగా చూస్తాను" అన్నాడు. 


తరువాత హనుమంతుడు భీమునకు సౌగంధికా సరోవరానికి మార్గం చూపి వెళ్ళి పోయాడు.```


               *సశేషం* 

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

స్వామి వివేకానంద స్ఫూర్తి

 శుభ భాను వారే 🌹🌞🌹HappySunday. 


స్వామి వివేకానంద స్ఫూర్తి....
రోజుకో సూక్తి....


పరిపూర్ణ అంకితభావం, పవిత్రత, అతి సునిశితమైన ఋద్ధి, సర్వాన్ని జయించగల సంకల్పం - వీటిని కలిగిన కొద్దిమంది వ్యక్తులు పని చేసినా యావత్తు ప్రపంచంలో పెనుమార్పు సంభవిస్తుంది.


Swami Vivekananda’s Wisdom for

Daily Inspiration. 


Perfect sincerity, holiness, gigantic intellect, and an all - conquering will. Let only a handful of men work with these, and the whole world will be revolutionised.

సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు#*

 * సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు#*


మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా!


 అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశారు. చూడండి:


ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:


👉 *ధర్మో రక్షతి రక్షిత:*

👉 *సత్య మేవ జయతే*

👉 *అహింసా పరమో2ధర్మ:*

👉 *ధనం మూలమిదం జగత్*

👉 *జననీ జన్మ భూమిశ్చ*

👉 *స్వర్గాదపి గరీయసి*

👉 *కృషితో నాస్తి దుర్భిక్షమ్*

👉 *బ్రాహ్మణానా మనేకత్వం*

👉 *యథా రాజా తథా ప్రజా*

👉 *పుస్తకం వనితా విత్తం*

👉 *పర హస్తం గతం గత:*

👉 *శత శ్లోకేన పండిత:*

👉 *శతం విహాయ భోక్తవ్యం*

👉 *అతి సర్వత్ర వర్జయేత్*

👉 *బుద్ధి: కర్మానుసారిణీ*

👉 *వినాశ కాలే విపరీత బుద్ధి:*

👉 *భార్యా రూప వతీ శత్రు:*

👉 *స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:*

👉 *వృద్ధ నారీ పతి వ్రతా*

👉 *అతి వినయం ధూర్త లక్షణమ్*

👉 *ఆలస్యం అమృతం విషమ్*

👉 *దండం దశ గుణం భవేత్*

👉 *ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?*


*ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?*


ధర్మ ఏవో హతో హంతి

"ధర్మో రక్షతి రక్షిత:"

తస్మా ధర్మో న హంతవ్యో

మానో ధర్మో హ్రతోవ్రధీత్


🔥ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !


🔥 సత్యమేవ జయతే నా2నృతం

సత్యేన పంథా వితతో దేవయాన:

యేనా క్రమం తృషయో హా్యప్త కామా

యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్


🔥సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.


🔥 అహింసా పరమో ధర్మ:

తథా2 హింసా పరం తప:

అహింసా పరమం ఙ్ఞానం

అహింసా పరమార్జనమ్

🔥అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన


🔥 ధనమార్జాయ కాకుత్స్థ !

ధన మూల మిదం జగత్

అంతరం నాభి జానామి

నిర్ధనస్య మృతస్య చ


🔥ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.


🔥 అపి స్వర్ణ మయీ లంకా

న మే రోచతి లక్ష్మణ !

జననీ జన్మ భూమిశ్చ

స్వర్గాదపి గరీయసి.


🔥సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !


🔥 కృషితో నాస్తి దుర్భిక్షమ్

జపతో నాస్తి పాతకమ్

మౌనేన కలహం నాస్తి

నాస్తి జాగరతో భయం.


🔥చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.


🔥 గజానాం మంద బుధ్ధిశ్చ సర్పాణా మతి నిద్రతా

బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్


🔥ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !


🔥 రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా

రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !


🔥రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.


🔥 పుస్తకం వనితా విత్తం

పర హస్తం గతం గత:

అధవా పునరా యాతి

జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:


🔥పుస్తకం, స్త్రీ , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ. ( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి)


🔥 శత నిష్కో ధనాఢ్యశ్చ

శత గ్రామేణ భూపతి:

శతాశ్వ: క్షత్రియో రాజా

శత శ్లోకేన పండిత:


🔥వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.


🔥విద్వత్త్వం చ నృపత్వం చ

నైవ తుల్యం కదాచన

స్వ దేశే పూజ్యతే రాజా

విద్వాన్ సర్వత్ర పూజ్యతే.


🔥పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.


🔥 శతం విహాయ భోక్తవ్యం

సహస్రం స్నాన మాచ రేత్

లక్షం విహాయ దాతవ్యం

కోటిం త్యక్త్వా హరిం భజేత్


🔥వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.


🔥 అతి దానాత్ హత: కర్ణ:

అతి లోభాత్ సుయోధన:

అతి కామాత్ దశగ్రీవో

అతి సర్వత్ర వర్జయేత్

( ఇది మరోవిధంగా కూడా ఉంది)