9, మే 2024, గురువారం

వైశాఖ పురాణం - 1.

 వైశాఖ పురాణం - 1.


1వ అధ్యాయము - వైశాఖమాస ప్రశంస


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||


సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను. మహర్షులారా! వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి మహర్షీ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు. వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి? మానవులాచరింవలసిన దానములను, వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని యే దైవము నుద్దేశించి చేయవలయును? వాని ఫలమెట్టిది? పూజాద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నానని సవినయముగ ప్రశ్నించెను.


నారదుడును రాజర్షీ! అంబరీషా! వినుమని యిట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు 'నారదా! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోను కార్తికము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటిని నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజా, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. విద్యలలో వేదవిద్యవలె, మంత్రములలో ఓంకారమువలె, వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేనువువలె, సర్వసర్పములలో శేషునివలె, పక్షులలో గరుత్మంతునివలె, దేవతలలో శ్రీమహావిష్ణువువలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె యిష్టమైన వానిలో ప్రాణమువలె, సౌహార్దములు కలవారిలో భార్యవలె, నదులలో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రమువలె, ధాతువులలో సువర్ణమువలె, విష్ణుభక్తులలో రుద్రునివలె, రత్నములలో కౌస్తుభమువలె, ధర్మహేతువులగు మాసములలో వైశాఖమాసముత్తమమైనది. విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించినవారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు. వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను, పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్లు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియనుగ్రహ బలమున, కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక, స్నాన సంకల్పము దృఢముగనున్నచో నతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖస్నానము నది/ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను, కొంతదూరమైనను యింటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును.


అంబరీష మహారాజా! సర్వలోకములయందున్న తీర్థ దేవతలు బాహ్యప్రదేశముననున్న జలము నదియైనను, తటాకమైనను, సెలయేరైనను,అందుచేరియుండును. జీవి చేసిన సర్వపాపములను, జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును, యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్యప్రదేశమున నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు. సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుచుందురు.


వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయము సంపూర్ణము.

Panchaag


 

పూర్వజన్మ కృతం పాపం

 *పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే*


ఏజన్మలో ఏమి చేసినానో కాని నాకు రెట్రోపెరిటల్ ఫైబ్రోసిస్ అనే వ్యాధివల్ల ఇబ్బంది పడుతున్నాను. దానివల్ల ఒక కిడ్నీ పాడయింది. రెండవది ఉన్నది కావున ఇబ్బంది లేదు. అలాగే రెండు కాళ్ళల్లో రక్తప్రసరణ రోజురోజుకు తగ్గి నడవలేకపోతున్నాను. రెండు కాళ్ళల్లో స్టంట్ వేయించుకోమంటున్నారు డాక్టర్. 650000/- నుండి 700000/- అవుతాయట. 

మీ సహకారం కోరుకొనుచున్నాను. 


నాచే మరింత ధార్మిక కార్యక్రమాలు చేయ భగవంతుని అనుగ్రహం లభించాలని కోరుకుంటూ సహృదయులందరికి ధన్యవాదాలు. 


గూగుల్ పే నెంబర్ 9491898091


ఫోన్ పే నెంబర్ 

7013393570


శ్రీ మాత్రే నమః 

M V RAMANA RAO

_మే 9, 2024_

 ॐ  卐  ॐ  

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

       🌞 *_మే 9, 2024_* 🌝

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*ఉత్తరాయణం*

*వసంత ఋతువు*

*వైశాఖ మాసం*

*శుక్ల పక్షం*

🔔తిథి: *పాడ్యమి* ఉ7.09

🔯వారం: *బృహస్పతివాసరే*

(గురువారం)

⭐నక్షత్రం: *కృత్తిక* మ1.06

✳️యోగం: *శోభన* సా4.05

🖐️కరణం: *బవ* ఉ7.09

*బాలువ* సా6.27

😈వర్జ్యం: మర్నాడు *తె4.45నుండి*

💀దుర్ముహూర్తము: *ఉ9.48-10.39*

*మ2.53-3.44*

🥛అమృతకాలం: *ఉ10.47-12.20*

👽రాహుకాలం: *మ1.30-3.00*

👺యమగండం: *ఉ6.00-7.30*

🌞సూర్యరాశి: *మేషం*

🌝చంద్రరాశి: *వృషభం*

🌅సూర్యోదయం: *5.34*

🌄సూర్యాస్తమయం: *6.17*

లోకాః సమస్తాః*

  *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

 ఇరగవరపు రాధాకృష్ణ🙏

వైశాఖ పురాణం

 _*🚩వైశాఖ పురాణం - 1 వ అధ్యాయము🚩*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*వైశాఖమాస ప్రశంస*


☘☘☘☘☘☘☘☘☘


*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*

*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||*


సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను. మహర్షులారా ! వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి మహర్షీ ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు. 


వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి ? 


ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి ? 


మానవులాచరింవలసిన దానములను , వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ , దానము మున్నగు వానిని యే దైవము నుద్దేశించి చేయవలయును ? 


వాని ఫలమెట్టిది ? పూజాద్రవ్యములెట్టివి ? 


మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నానని సవినయముగ ప్రశ్నించెను.


నారదుడును రాజర్షీ ! అంబరీషా ! వినుమని యిట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు 'నారదా ! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోను కార్తికము , మాఘము , వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము , పూజ , దానము మున్నగునవి పాపములన్నిటిని నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన , పూజా , జప , దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. 


విద్యలలో వేదవిద్యవలె ,


మంత్రములలో ఓంకారమువలె , 


వృక్షములలో దివ్యవృక్షమైన 

కల్పవృక్షము వలె , 


ధేనువులలో కామధేనువువలె , 


సర్వసర్పములలో శేషునివలె , 


పక్షులలో గరుత్మంతునివలె , 


దేవతలలో శ్రీమహావిష్ణువువలె , 


చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె 


ఇష్టమైన వానిలో ప్రాణమువలె , 


సౌహార్దములు కలవారిలో భార్యవలె , 


నదులలో గంగానది వలె , 


కాంతి కలవారిలో సూర్యుని వలె , 


ఆయుధములలో చక్రమువలె , 


ధాతువులలో సువర్ణమువలె , 


విష్ణుభక్తులలో రుద్రునివలె , 


రత్నములలో కౌస్తుభమువలె , 


ధర్మహేతువులగు మాసములలో వైశాఖమాసముత్తమమైనది. విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ , తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించినవారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు. వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును , పూజను చేసినను , పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్లు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియనుగ్రహ బలమున , కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక , స్నాన సంకల్పము దృఢముగనున్నచో నతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖ స్నానము నది , ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను , కొంతదూరమైనను ఇంటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును.


అంబరీష మహారాజా ! సర్వలోకములయందున్న తీర్థ దేవతలు బాహ్యప్రదేశముననున్న జలము నదియైనను , తటాకమైనను , సెలయేరైనను , అందుచేరియుండును. జీవి చేసిన సర్వపాపములను , జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును , యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్యప్రదేశమున నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు. సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుచుందురు.


*వైశాఖ పురాణం  మొదటి అధ్యాయం సంపూర్ణం*

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

వైశాఖమాస విశిష్టత

 *వైశాఖమాస విశిష్టత* 


వైశాఖ మాసం ఆధ్యాత్మిక సాధనకి అద్భుతమైన మాసాలలో ఒకటి. వైశాఖము, మాఘము, కార్తికము – ఈ మూడింటినీ ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు. ఏవిధంగా అయితే కార్తీక పురాణం, మాఘ పురాణం ఉన్నాయో అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు. ఆధ్యాత్మికంగా భగవదనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్ని విధాలా అనుకూలమైనది. సాధనా మాసంగా దీనిని నిర్వచించవచ్చు.


వసంతఋతువులో రెండవ మాసం. ఇది. దీనికి వైదిక నామం మాధవ నామము. మధు అని చైత్రమాసానికి, మాధవ అని వైశాఖ మాసానికి అంటారు. వైశాఖమాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది.

వైశాఖంలో రకరకాల వ్రతాలు చెప్పారు.


వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం నారాయణుని తులసితో ఆరాధించడం చేయాలి. ఆ తులసి కూడా కృష్ణ తులసి సమర్పిస్తే శ్రేష్టం అని ధర్మశాస్త్రం చెప్తున్నది.

విష్ణుసహస్రనామ పారాయణ వైశాఖం అంతా చాలా ప్రశస్తమైనటువంటిది.


అనునిత్యం కూడా అశ్వత్థ వృక్షానికి సమృద్ధిగా జలం పోసి ప్రదక్షిణలు చేయడం, వైశాఖం అంతా చేసినట్లయితే అభీష్ట సిద్ధి లభించడమే కాక పితృదేవతలు తృప్తి చెందుతారు అని చెప్తున్నారు.

గళంతిక ఆరాధన – శివునకు ఈ మాసమంతా అభిషేకం చేస్తే చాలా ప్రసిద్ధి. అనునిత్యం శివారాధన అభిషేకంతో చేయాలి. ఆది ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆదిదైవిక తాపత్రయాలను తొలగించి మనశ్శాంతినిస్తుంది. అందుకు శాంతి కోసం శివునికి అభిషేకం చేస్తారు. శివాలయాలలో శివునకు పైన గళంతికను ఏర్పాటు చేయడం కూడా చాలా మంచిది. దీనినే దారాపాత్ర అంటారు.


 నిరంతరం శివుడి మీద ధార పడేటట్లుగా ఒక పాత్రను ఏర్పాటు చేయాలి. ఇలా నెలంతా శివునిపై ధార పడేటట్లు చేసినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి వేదనలు, తాపాలు, అరిష్టాలు నశిస్తాయని ధర్మశాస్త్రములు చెప్తున్న విషయం.


వైశాఖంలో ఉదకకుంభ దానము. అంటే నీటితో నింపిన పాత్రను దానం చేయడం. బాటసారులకు చలివేంద్రములు ఏర్పాటు చేసి జలాన్ని ఇవ్వడం వైశాఖంలో ప్రసిద్ధి.

_సముద్రం

 *🔔   _శుభోదయం_    🔔*

        

         *_సముద్రం అందరికీ ఒకటే కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి. వల వేయడం వచ్చినవాడికి చేపలు దొరుకుతాయి. నిలబడి చూసిన వాడికి కాళ్లు మాత్రమే తడుస్తాయి._*  

       *_జీవితం కూడా అంతే. అందరికి ఒకటే జీవితం. కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటె అంతే._*   

       

🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞

తెనాలి

 83  సంవత్సరాల  క్రితం  " తెనాలి " పట్టణము గురించి ఆంధ్రపత్రిక లో ప్రచురితమైన వ్యాసం .


తెనాలి గురించి

    ~కొడవటిగంటి కుటుంబరావు


1.

గుంటూరు వారున్నారు,

చేబ్రోలు వారున్నారు,

ఒంగోలు వారున్నారు,

తెనాలివారు లేరు.

నేనెరిగినంత మట్టుకు లేరు. రామలింగడు తప్ప.


రామలింగడివల్ల

తెనాలికి ప్రసిద్ధి వచ్చిందా,

తెనాలి వల్ల రామలింగడు ప్రసిద్ధికి వచ్చాడా ?


చెట్టు ముందా, 

విత్తు ముందా వంటి ప్రశ్న ఇది

ఆ విషయం ఎవరూ తేల్చలేరు.


2. 

రెండు సికింద్రాబాదులూ,

రెండు హైదరాబాదులూ,

రెండు అన్నవరాలు,

రెండు పూండ్లలూ 

-ఒకటే తెనాలి.

'ప్రపంచమంతటికీ!'


అందుకనే

రామలింగడా పేరు 

ఇంటి పేరు చేసుకున్నాడేమో.


3.

రామలింగడి కాలం వదిలి

వర్తమానానికి వస్తే 

తెనాలి చాలా విషయాలకు ప్రసిద్ధి కెక్కింది.


బియ్యానికి, 

కాఫీ హొటెళ్ళకూ,

పత్రికల అమ్మకానికీ

దోమలకూ,

వానాకాలం బురద రోడ్లకు,

వగైరాలకు.


4.

తెనాలి బియ్యం లండన్లో కూడా చెప్పుకుంటారు అని నేను నమ్మకంగా విన్నాను.

తెనాలి కాఫీ హొటెళ్ళు జగత్ప్రఖ్యాతి గలవి.

తెనాలి చుట్టు పట్ల వారంతా

ఒక్కొక్కప్పుడు 20 మైళ్ళనించి కూడా 

-ఉదయం పూట రైళ్ళ మీదా,

 జట్కా బళ్ళ మీదా,

నడిచి తెనాలి చేరుకుంటారు.

తెనాలిలో చెప్పుకోదగ్గ అయ్యరు హొటలు లేదు.

కాఫీ ఇవ్వడం అయ్యర్లకే చేతనవుననే అనుమానం ఎవరికైనా ఉంటే

తెనాలి పోయి కాఫీ తాగి చూడండి.

మా తెనాలి వాళ్ళు

నలుగురువచ్చి 

మద్రాసులో కాఫీ హొటళ్ళు ప్రారంభిస్తే 

అరవాళ్ళు 

పంజాలు తెంచుకొని 

పట్నం వదిలి పారిపోతారు.


5. 

తెనాలి వాళ్ళు 

పత్రికలు చదవడంలో కూడా ప్రధములు

ఆంధ్రదేశం మొత్తం మీద అమ్ముడుపోయే పత్రికల సంఖ్యలో 

ఏ పదో వంతో తెనాలిలో అమ్ముడుపోతుంది.

అది రామలింగడి ఆశీర్వాదం కావచ్చు,

సాహితీ సమితి పుట్టిన ప్రభావం కావచ్చు.


6. 

తెనాలి దోమలు 

దాదాపు విశాఖపట్నం దోమలంత ఉంటై. 


ఒక దోమలషో పెట్టి 

(బేబీ షో పెట్టినట్టు) 

అందులో విశాఖపట్నం దోమనీ

తెనాలి దోమనీ తూకం వేస్తే

విశాఖపట్నం దోమకి

డిపాజిట్ కూడా నమ్మకం లేదు


7. 

వేసవి కాలమంటే జ్ఞాపకం వచ్చింది ,

వేసవి కాలంలో మా ఊరు బెజవాడ వారికీ ,

గుంటూరు వారికి సిమ్లా  లాంటిది.


8. 

తెనాలి నాటకాలకి, 

నటులకీ ప్రసిద్ధి కెక్కింది.

మొదటి నాట్య కళా పరిషత్తు తెనాలిలో జరిగింది.

మిగిలిన ఆంధ్రదేశమంతా కలిసి ఎంతమంది పెద్దా చిన్నా నటులున్నారో తెనాల్లో అంతమంది ఉన్నారు.

అసలు ప్రతీ తెనాలివాడూ వేషధారే.


అంత దాకా ఎందుకు 

తెనాలి నటుడు లేని టాకీ ఉందీ? 


9. 

నాట్యకళ 

మా తెనాలి వారి కంత బాగా తెలుసు కనకనే

మా తెనాల్లో పై ఊళ్ళవాళ్లు పరాభవం పొందారు.

పైనుంచి వచ్చి తెనాలి వారిని మెప్పించి పోయినవాడు గట్టిగా లెక్కిస్తే ఒక్క బళ్ళారి రాఘవాచారి గారే.


10. 

తెనాలిలో అనిర్వచనీయమైన ఆకర్షణ ఉంది.

అది తెనాలి వాళ్ళ కన్నా

పై వాళ్ళకు తెలుస్తుంది.

తెనాలి నుండి బదిలీ అయిపోయి పోవలసి వస్తే ఉద్యోగానికి నీళ్ళొదలిన వాళ్లున్నారు.


ఏ పని మీదో వచ్చి 

తెనాలిలో వేళ్ళతో సహా పాతుకు పోయిన వాళ్ళున్నారు.

ఇంకే పనీ లేక తెనాలిలో ఉండటమే

జీవితాశయంగా పెట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారు.


ఇందులో 

అతిశయోక్తి ఏమీ లేదు.

ఏ బస్తీలో కన్నా తెనాల్లో నిరుద్యోగులు అధికంగా ఉండటానికి కారణం ఈ ఆకర్షణే.

తెనాలి గురించి " వెధవ తెనాలి " అంటుంటే నమ్మకండి.

గవర్నరు గిరి వచ్చినా చేయడానికి

తెనాలి వాడు 

తెనాలి వదలడు.


11. 

మరి కొన్ని బస్తీల మాదిరిగా

తెనాలి అట్టే గొప్పవారిని చెప్పుకోక పోవడానికి కారణం..


బుద్ధిమంతుడు సులభంగా ఊహించవచ్చు.


మా తెనాలి వాళ్ళం 

ఇతర ఊళ్ళ మాదిరిగా 

ఒక వ్యక్తిని ఆరాధించి పైకెత్తం.


మా చవిలి నాగేశ్వర రావుకీ

మా గోవిందురాజు సుబ్బారావుగారికి

మా స్థానం వారికి,

మా మాధవపెద్దికి,

ఇతరులు బ్రహ్మరధం పట్టొచ్చు గాక

మేం పట్టం.


మాకు వాళ్ళు 

మామూలు మనుష్యులే.


వారిని ఆరాధిస్తూ కూర్చుంటే

ప్రపంచం ఆరాధించే మనుష్యుల్ని మేమెట్లా సృష్టించగలుగుతాం ?


మనుష్యుల్ని తయారు చేసి లోకం మీద వదలటం మాత్రమే మా వంతు.

మాస్టర్ అంజిని,

బసవలింగాన్ని,

పిల్లమర్రి సుందర రామయ్యనూ

మేమే తయారు చేసాం.


భీమవరపు నరసింహరావునూ, 

ప్రభల సత్యన్నారాయణనూ,

మేమే తయారు చేసాం.


ములుగు శివానందం గారు 

మా వాడు.

మా గొప్ప వాళ్ళెవరూ

మా ఊళ్ళో ఉండరు.

దేశాలు పట్టి పోతారు.

కాంచనమాలది మా ఊరే

ఆవిడా అంతే. 


మూడు కాలువలు నడుమ నడిచేదే తెనాలి

ఇలా ప్యారీస్ లోనూ

తెనాలి లోనే ఉంటుంది


అందుకే

*_తెనాలిని_*

*_ఆంద్రా ప్యారీస్ అంటారు_* 


*ఆంధ్రపత్రిక*

*12-2-1941*

*(కొకు వ్యాస ప్రపంచం నుంచి* )

ఈ గ్రూపులో తెనాలి వారికి అంకితం....😄

రక్షణ ఇస్తుంది.

 🙏🙏🙏

********

              **శుభోదయం**

                         ***

""పరోపదేశే పాణ్డిత్యం సర్వేషాం సుకరం నృణామ్!

ధర్మే స్వీయమనుష్టానం కస్యచిత్ సుమహాత్మనః!!""

                      ***

**ఇతరులకు ధర్మాన్ని ఉపదేశించడం అందరికీ చాలా తేలికైన పని. ఆ ధర్మముయందు ఆచరణము అనునది ఏ ఒక్క మహాత్ముడి యందో ఉండును.*

*గొడుగు వర్షాన్ని ఆపక పోవచ్చు. కానీ వర్షంలో తడిచి పోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చి పెట్టకపోవచ్చు కానీ విజయపథంలో అవరోధాలను అధిగమించే శక్తినిస్తుంది.*

*మన సమస్యలకు పరిష్కారం కేవలం మన దగ్గర మాత్రమే ఉంటుంది. ఎదుటి వాళ్ల దగ్గర సూచనలు, సలహాలు మాత్రమే ఉంటాయి.**

                        ***

              **ఇదం న మమ**

          **శుభప్రదమైన రోజు**

                        ***

**యం.వి.శర్మ**

🙏🙏🙏

వైశాఖమాస స్నానవైశిష్ట్యం

 *🌹వైశాఖమాస స్నానవైశిష్ట్యం-పండుగలు🌹* 

🙏🌹🪷\|/🪷🌹\|/🌹🪷\|/🪷🌹🙏



🙏\|/ వైశాఖ మాసం లో శ్రీమహావిష్ణువు ఆదేశంమేరకు దేవతలందరూ తెల్లవారుజామున నీటిలో ఉంటారనీ, అందువలన ఆ సమయంలో స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. వీలైతే సముద్ర స్నానం. లేదంటే నదీస్నానం .. అందుకు అవకాశం లేకపోతే బావి నీటినే పవిత్ర నదీ జలాలుగా భావించి స్నానం చేయాలని స్పష్టం చేస్తోంది. ఈ మాసమంతా కూడా శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో అర్చిస్తూ ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తూ దానధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన సకలశుభాలు చేకూరడమే కాదు, మోక్షాన్ని సాధించడానికి అవసరమైన అర్హత కలుగుతుందని చెప్పబడుతోంది.

              

 *🌹వైశాఖ మాసం- స్నాన వైశిష్ట్యం🌹* 


🙏\|/స్నానము ఎప్పుడు చేసినా ఎలా చేసినా శరీర మలినాలను తొలగించుకునే మార్గాలలో ఒకటి. ఆది మానవుడు ఆచరించడానికి స్నానానికి దైవత్వాన్ని మిలితం చేసి మన పూర్వికులు మనకందించిన ఆత్యాద్మిక ఆరోగ్యసూత్రాలే ఈ స్నానవ్రతాలు .


🙏\|/సాధారణంగా నీటికి గల శక్తులు పరమ పావనమైనవి. స్నానం, పానం జలానికి ఉపయోగాలు. కల్మషాలను కడిగేది, దాహాన్ని తీర్చేది నీరు. స్నాన, ఆచమనాలనే మార్గాల్లో జలశక్తి మానవులకు మేలు చేస్తుందని వేదవాక్కు.


🙏\|/సాధారణ స్నానం దేహాల్ని శుద్ధిచేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి శాంతాన్ని, స్థిరత్వాన్ని కలిగిస్తుందంటారు. అందుకే స్నానం నిత్యవిధి అని విజ్ఞులు చెబుతారు. పొద్దున్నే నిద్రను వదిలి స్నానాదులుచేసి రావిచెట్టుకు నీరు పోసి ప్రదక్షిణలు చేసి మాధవుని తులసీదళాలతో పూజించడం అనేది ఈ వైశాఖమాసానికి ఉన్న ప్రత్యేకత. మాసాల్లో వైశాఖం మహావిష్ణువుకు ప్రీతికరమైనదని చెబుతారు.


🙏\|/వైశాఖమాసంలో జలదానము మిక్కిలి శ్రేష్ఠమైనది. అందుకే వైశాఖ మాసంలో చలివేంద్రాలు కట్టించి, దాహమేసిన వారికి దాహము తీర్చిన సమస్త పాపాలూ నశిస్తాయ్. దప్పిక తీర్చుటకు జలం గానీ, ఎండకు గొడుగును గానీ, పాదరక్షలుగానీ , శరీరతాపం తగ్గుటకు విసనకర్రను గానీ దానమిస్తే సమస్త పాపాలూ తొలిగిపోతాయట. వైశాఖ మాసం ఆరంభం కాగానే ఒక బీద బ్రాహ్మణునకు కలశం నిండా జలం పోసి దానం చేసి నమస్కరిస్తే అన్ని దానాల కన్నా ఈ దానం మిక్కిలి ఫలము పొందుతాడు. ఈ మాసంలో ఒక బ్రాహ్మణుడికి గొడుగును దానం చేస్తే విష్ణుమూర్తి సంతోషించి సకలైశ్వర్యాలూ ఇస్తాడు.


🙏\|/సాధారణంగా నీటికి గల శక్తులు పరమ పావనమైనవి. స్నానం, పానం జలానికి ఉపయోగాలు. కల్మషాలను కడిగేది, దాహాన్ని తీర్చేది నీరు. స్నాన, ఆచమనాలనే మార్గాల్లో జలశక్తి మానవులకు మేలు చేస్తుందని వేదవాక్కు. సాధారణ స్నానం దేహాల్ని శుద్ధిచేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి శాంతాన్ని, స్థిరత్వాన్ని కలిగిస్తుందంటారు. అందుకే స్నానం నిత్యవిధి అని విజ్ఞులు చెబుతారు.


🔶 వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం నారాయణుని తులసితో ఆరాధించడం చేయాలి. ఆ తులసి కూడా కృష్ణ తులసి సమర్పిస్తే శ్రేష్టం అని ధర్మశాస్త్రం చెప్తున్నది.


🔶 విష్ణుసహస్రనామ పారాయణ వైశాఖం అంతా చాలా ప్రశస్తమైనటువంటిది.


🔶 అనునిత్యం కూడా అశ్వత్థ వృక్షానికి సమృద్ధిగా జలం పోసి ప్రదక్షిణలు చేయడం, వైశాఖం అంతా చేసినట్లయితే అభీష్ట సిద్ధి లభించడమే కాక పితృదేవతలు తృప్తి చెందుతారు అని చెప్తున్నారు.


🔶 వైశాఖంలో ఉదకుంభ దానము. అంటే నీటితో నింపిన పాత్రను దానం చేయడం. బాటసారులకు చలివేంద్రములు ఏర్పాటు చేసి జలాన్ని ఇవ్వడం వైశాఖంలో ప్రసిద్ధి.


 *🌹వైశాఖ మాసంలో వచ్చు పండుగలు🌹* 


 *🙏అక్షయ తృతీయ🙏* 

 

వైశాఖ శుద్ధ తృతీయనాడు కృతయుగం ఆరంభమైందని, కనుక ఈ కృతయుగాదినే అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుతారని అంటారు. ఈ అక్షయ తృతీయ గురించి భవిషోత్తర పురాణం చెప్తోంది. సౌభాగ్యాన్ని వృద్ధి చేసే ఈ అక్షయ తృతీయనాడు బదరీ నారాయణుని దర్శించితే సకల పాపాలు నశిస్తాయని అంటారు. అక్షయ తృతీయనాడు లక్ష్మీదేవిని పూజించే ఆచారం కూడా కొన్నిచోట్ల కనిపిస్తుంది. ఈ రోజు మొదలుకొని అన్నీ పర్వదినాలే.


 *🙏సింహాచలంలో చందనోత్సవం🙏* 

 

వైశాఖ శుక్ల తదియని అక్షయ తదియఅంటారు. ఈనాడు సింహాచలేశుడు తన భక్తులకు నిజరూప దర్శనాన్ని కలుగచేస్తాడు. తదియనాడు ఆ సింహాచల వరాహ నృసింహుని చందనోత్సవాన్ని జరుపుతారు. లోకాలన్నీ కూడా చందనమంత చల్లగా ఉండాలనీ కోరుకొని ఈ చందనోత్సవంలో జనులందరూ పాల్గొంటారు. 


 *🙏శ్రీ బలరామ జయంతి🙏* 


వైశాఖ శుద్ధ తదియనాడు శ్రీకృష్ణుని సోదరుడైన బలరాముడు కూడా రోహిణీ దేవికి జన్మించిన కారణాన బలరామ జయంతిని జరుపుకొంటారు. 


 *🪓శ్రీ పరశురామ జయంతి🪓* 


వైశాఖ శుద్ధ తదియ నాడు పరశురామ జయంతి.తండ్రి మాటలను జవదాటకుండా పితృవాక్య పరిపాలకునిగా పేరుతెచ్చుకొన్న జమదగ్ని పుత్రుడు ఈ భూమిని ఏలే రాజుల దాష్టీకాన్ని చూడలేక పరశువును పట్టుకొని 21సార్లు రాజులపై దండయాత్ర చేసాడు. అటువంటి పరశురాముడు దశరథ తనయుడు శివచాపాన్ని విరచాడన్న వార్త విని ఆ రాముని బలమేమిటో తెలుసుకొందామని వచ్చి రామునికి తన అస్త్రాలన్నింటినీ సంతోషంతో ధారపోసి మహేంద్రగిరికి తరలిపోయాడు. 


 *\|/శ్రీ శంకరాచార్య జయంతి\|/* 


వైశాఖ శుద్ధ పంచమినాడు అద్వైతాన్ని లోకంలో అక్షయంగా నిలిపిన ఆదిశంకరాచార్యుని జయంతి. ఆ ఆదిశంకరుడు చిన్ననాడే దరిద్రనారాయణులను చూసి కరుణాసముద్రుడై లక్ష్మీదేవిని స్తోత్రం చేసి వారిళ్ళను సౌభాగ్యాలకు నెలవు చేసాడు. ఆ లక్ష్మీ స్తోత్రమే కనకధారస్తోత్రంగా ఈనాటికీ విరాజిల్లుతోంది.


  *\|/శ్రీ రామానుజ జయంతి\|/* 


వైశాఖ శుద్ధ షష్టినాడు బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్పిన రామానుజాచార్యుడు షష్ఠినాడు జన్మించిన కారణంగా రామానుజ జయంతిగా విశేషపూజలు చేస్తారు. తిరుక్కోటి యార్నంబి దగ్గర మోక్షపాప్త్రి కోసం తీసుకొన్న రహస్య మంత్ర రాజాన్ని లోకులందరినీ పిలిచి రామానుజుడు ఆనందంగా చెప్పేశాడు. రహస్యమైన దాన్ని బహిరంగ పరిచాడనే గురాగ్రహాన్ని కూడా లోకులకోసం భరించడానికి సంసిద్ధమైన రామానుజాచార్యుని గొప్పతనం తెలుసుకొని ఆ మార్గంలో నడవాల్సిన అవసరం నేటి మానవులకు ఎంతైనా ఉంది అని జ్ఞప్తి చేయడానికే ఈ రామానుజాచార్య జయంతి జరుపుతారంటారు.


  *🙏గంగావతరణం🙏* 


వైశాఖ శుద్ధ సప్తమి నాడు తన పినతండ్రులు కపిల ముని కోపావేశానికి కాలి బూడిద అవ్వడం చూసి సహించలేని భగీరథుడు ఎన్నో ప్రయత్నాలు చేసి తపస్సులు చేసి కైలాసనాథుడిని మెప్పించి ఆకాశగంగను భువిపైకి తీసుకొని వచ్చాడు. ఈ గంగోత్పత్తి కూడా వైశాఖమాస సప్తమినాడే జరిగింది. ఈ గంగోత్పత్తిని పురస్కరించుకొని గంగాస్తుతిని చేసినవారికి పతితపావన గంగ సకలపాపపు రాశిని హరిస్తుందని పండితులు చెప్తారు.


 *🙏\|/మోహినీ ఏకాదశి\|/🙏* 


వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని మోహినిఏకాదశి అని అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించినవారికి మహావిష్ణువు అక్షయంగా సంపదలు ఇస్తాడని, వారు ఇహలోక ఆనందాన్ని అనుభవించిన పిమ్మట వారికి విష్ణ్ధుమ ప్రవేశం కలుగుతుందని పురాణ ప్రవచనం. 


 *🦁శ్రీనృసింహజయంతి🦁* 


వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు తన భక్తుని కోరిక మేరకు సర్వాన్ని ఆక్రమించిన మహావిష్ణువు నృసింహుడై స్థంభంనుంచి ఆవిర్భవించి లోకకంటకుడైన హిరణ్యకశపుడిని సంహారం చేసి లోకాలన్నింటిని కాపాడినరోజు శుద్ధ చతుర్థశిగా భావించి నృసింహ జయంతిని చేస్తారు.హిరణ్యకశిపుడిని అంతమొందించడానికి శ్రీమహావిష్ణువు అవతరించినది ఈ దినమే. ఈ దినం ఉపవాసంను పాటించి స్వామివారిని పూజించడం లేదా స్వామివారి వ్రతం చేయడంతో పాటు స్వామివారు ఉద్బవించిన స్తంభం, ఇంటిగడపలను పూజిస్తారు. 


 *🐢వైశాఖ పూర్ణిమ -శ్రీకూర్మ జయంతి🐢* 


వైశాఖ పూర్ణిమకి మహావైశాఖి అని పేరు. దశావతారాల్లో ద్వితీయ అవతారమైన కూర్మరూపంను శ్రీమహావిష్ణువు ఈనాడే ధరించాడు.


 *🐒హనుమజ్జయంతి🐒* 


వైశాఖ బహుళ దశమి హనుమజ్జయంతిగా చెప్పబడుతూ ఉన్నది. ఈ రోజు ఆంజనేయస్వామి వారిని సింధూర, తమలపాకులతో పూజించడంతో పాటూ వడమాలను ధరింపచేసి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించవలెను.

ప్రభు భక్తికి ప్రతీకగా నిలిచిన హనుమంతుడు జన్మించిన కారణంగా, హనుమజ్జయంతి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే జరుగుతాయి. 


🙏\|/గౌతమ బుద్ధుడి జన్మదినం కూడా ఈరోజే. ఇంతటి విశిష్టమైన ఈనాడు సముద్రస్నానం చేయడం విష్ణువును పూజించడంతో పాటు సత్యనారాయణస్వామి వ్రతం చేయడానికి ఈ దినం ఉన్నతమైనది. అలాగే శ్రీవాసవీకన్యకాపరమేశ్వరీ, కూర్మజయంతి,నారద జయంతులు కూడా వైశాఖంలోనే కావడం ఈ మాస విశిష్టత. ఈ మాసంలో ఆచరించాల్సిన విధులన్నీ ఆరోగ్యరహస్యాలు కావడం విశేషం. బుద్ధపూర్ణిమ, సంపద్ గౌరీ వ్రతం వంటి పర్వదినాలు ఉన్నాయి. వైశాఖ మాసంలో అన్నదానాలు, వస్త్ర దానాలు, బియ్యం, మంచం, మామిడిపళ్ళు, మజ్జిగ, ఆవునెయ్యి, చెరుకురసం, అరటిపళ్ళు దానం చేసిన వారు అనంతమైన పుణ్యఫలాలు పొందుతారు.ఎందరో మహానుభావుల జయంతులు జరిపే ఈ వైశాఖం నుంచి మనం కూడా లోకకల్యాణకారకమైన పనులు చేయాలనే భావనను ఏర్పరుచుకోవాలి. ఇక కార్తీక మాసం. మాఘ మాసాల మాదిరిగానే ఈ మాసంలో చేసే నదీ స్నానం విశేషమైన ఫలితాలను ఇస్తుందని చెప్పబడుతోంది.

ఆచరణలో పెడదాం!

 మిత్రులారా;*చిన్న విన్నపము.* 

ఆచరించాలా? లేదా? అన్నది మీ యిష్టం. కంగారు పడకండి.🙏

మీకు 60 ఏళ్ళు దాటాయా? పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయా?  ఇంట్లో  భార్య భర్తలు ఇద్దరే మిగిలారు కదా? ఇక ఇంటినిండా ఉన్న అనవసర వస్తువులు,  తలనిoడా చేయవలసిన చివరి పనులు, మిగిలాయి కదా. అన్ని పూర్తి(క్లియర్) చేసేయడం మంచిది .మిగిలిన జీవిత ప్రయాణం హ్యాపీగా జరగాలంటే

" లెస్ లగ్గేజ్ మోర్ కంఫర్ట్" . 

అందుకుఒకసారి ఈ వ్యాసం చదవండి! 

A.మొదటి విషయం ఇల్లు 'సర్దడం'.

1.కిచెన్....

వంటగది ఒక్కసారి చూద్దాం! ఎన్ని ఎక్స్ట్రా గిన్నెలు, డబ్బాలు, కంచాలు, క్యారేజులు, క్యాన్లు, ఇత్తడివి, రాగివి, కంచువి, దేముడి సామాన్లు, ప్లాస్టిక్, గాజు, టప్పర్వేర్, ఇంకో వేర్, ఆ వేర్, ఈ వేర్. 

పిల్లల పెళ్ళిళ్ళకీ, వ్రతాలు, నోములకీ, ఆఖరికి మనవల బారసాల,అన్నప్రాసనల లాంటి శుభకార్యాలలో  ఇరవై, ముఫైమందికి కూడా బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకూ క్యాటరింగ్. మంచినీళ్ళు, నెయ్యి, తినే విస్తరి, తాగేందుకు ప్లాస్టిక్ గాజులూ అన్నీ ఆ ప్యాకేజ్ లోనే. మరి మనకి అన్ని గిన్నెలు, కంచాలు ఎందుకటా? మిగిలిన ఫుడ్ తీసుకోవడానికి మన దగ్గర రెగ్యులర్ గా వాడే పాత్రలు బోలెడు. 

ఒకసారి , నిచ్చెన వేసుకుని పైన ఉన్న సామాన్లు చూద్దాం!

ఏం చేస్తాం ఆ ఇత్తడి సామాను? మనం పోతే, ఒక్కసారి ఊహించుకోండి!

అవన్నీ ఓ కూలివాడికిచ్చి దింపించి, పట్టుకుపోండి ఎవరికి కావాల్సినవి వాళ్ళు అంటారు మన పిల్లలు. అంతేనా? లేదంటే వాళ్ళింటికి తీసుకువెళతారంటారా? వాళ్ళిల్లు ఏమైనా ఖాళీగా ఉంటుందంటారా? 

వాళ్ళ విసుగు, చిరాకు చూపులు ఓ సారి ఊహించుకోండి. "ఇవన్నీ దాచుకున్నారు , వెళ్ళేటప్పుడు పట్టుకెళదామనుకున్నారేమో " అని  గొణుక్కుంటారు కదా! ఔనా? 

ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఏదో ఒక అనాధ శరణాలయంకి గానీ, వృద్ధుల ఆశ్రమానికి కానీ ఇచ్చేయాలి.

అక్కడ ఎవడు తినేస్తాడో, అసలువాళ్ళకి అందుతుందో లేదో, ఇవన్నీ ఆలోచించకూడదు. మనం ఒక అనాధ శరణాలయానికి ఇచ్చేసాం, అక్కడితో మన పనయిపోయింది, అంతే, అనుకుని ప్రశాంతంగా ఉండాలి. 

అలాగే మధ్య తరగతి వారయితే, అమ్మేయాలి. ఆ డబ్బులు ఉంచుకొని పనిమనుషులకి , హౌస్ కీపింగ్, వాచ్మాన్, సెక్యూరిటీ ఇలా అందరికీ పంచేయాలి. 

మినిమమ్ వస్తువులు  మాత్రమే ఉంచుకోవాలి అంతే . 


2.దేముడి మందిరం విగ్రహాలతో నింపేయకూడదు. దేముళ్ళని కూడా తీసుకువెళ్ళకుండా పిల్లలు అమ్మి పారేసారు, అన్న అప్రదిష్ట పిల్లలకు రానీయకూడదు.


3.ఇక బీరువాల నిండా చీరలు మగవారి బట్టలు ఇతర బట్టలు.

అసలు మనకు చీరలు ఎన్ని కావాలి? ఓ 30, పోనీ ఓ 50, అవి ఉంచుకోవాలి. పదేళ్ళ క్రితం కొన్న చీరలు తీసేయాలి. పట్టుచీరలైనా ఎక్కువ రోజులు బీరువాలో ఉన్నా చీకిపోతాయి. 

కొన్ని చీరలు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి మన చుట్టాలలో పిల్లలకు ఇచ్చేయాలి. మేము రిచ్ అని గోల పెట్టేవారికి కాదు. ఎవరికి ఇవ్వాలో మనకు తెలుసు.  మగవారి బట్టలు ఇతర బట్టలు షరా మామూలే.


4.ఇక లాకర్....

చిన్నా చితకా వాడని వెండి సామానూ, కాయిన్స్ తీసేసి ఓ వెండి కంచంగా కానీ, పూజ ప్లేట్ గా కానీ మార్చేయాలి. పిల్లలు పంచుకోవడం ఈజీ. లేదంటే గంధం గిన్ని 10 తులాలంటే, కుంకుమ భరిణె 10తులాల 10 మిల్లీ గ్రాములుందని కూడా గొడవలొస్తాయి.

ఇక ఓ 4 రకాల  ముక్కు పుడకలు, ఓ పది రకాల చెవుల దిద్దులు , శ్రావణమాసం రూపులు వీటన్నిటినీ కూడా సర్దేయాలి. 70 ఏళ్ళు వచ్చాక ఒకే రకమైన చెవుల దిద్దులు , ముక్కుపుడకలు, ఉంగరాలు అవీ మనకు నచ్చినట్లుగా చేయించుకుని పెట్టుకోవాలి.


5.ఇక, కప్ బోర్డ్స్...

రిటర్న్ గిఫ్ట్ గా వచ్చిన రకరకాల సామాన్లు ఉంచుకుని ఏం చేస్తాం? అనాధాశ్రమాల్లో పెళ్ళిళ్ళు చేసుకునే ఆడపిల్లలకి సారె గా ఇవ్వచ్చు!

షాల్స్, వాడని దుప్పట్లు ఒక పెద్ద బ్యాగ్ లో వేసుకుని కార్ లో పెట్టుకొని రోడ్లమీద పడుకునే వారికి కప్పిరావాలి.

"తిరిగి ఏమీ ఆశించకుండా చేసిన దానాలకే పుణ్యం వస్తుంది. ఆశించి చేసేవి ఏవీ ఫలితాన్ని ఇవ్వవు." 


*ఇల్లు,, బుర్రా( కూడా) ఎంత ఖాళీ చేసుకుంటే అంత మంచిది.  పిల్లలకి కావాల్సిన వస్తువులే ఉంచాలి. వారిని ఇబ్బంది పెట్టకూడదు.


B.ఇక జాగర్థలు

6..మన ఇన్స్యూరెన్స్ ఫైల్స్, హెల్త్ ఫైల్స్ అన్నీ జాగ్రత్త చేసుకోవాలి. మందుల బాక్స్ ఎప్పటికప్పుడు సర్ది ఉంచుకోవాలి.


6.ఇక మనం పోయాక, పిల్లలు వస్తే కనుక అయోమయం, అంధకారంలో ఉంటారు. వారికి అందరూ సలహాలు ఇచ్చేవారే! ఏం చేయాలో తోచక బిక్కు బిక్కు మంటారు. అందుకే, మనమే వీలు చేసుకుని అన్ని విషయాలు చెప్పి ఉంచాలి, లేదా వ్రాసి ఉంచాలి ఏం చేయాలో ఎలా చేయాలో అన్న విషయం.ఆ పన్నెండురోజులూ అయ్యాక, వాళ్ళకి ఉద్యోగ హడావుడిలే! అందుకే మన అన్ని పనులు ఈజీగా క్లియరాఫ్ చేసుకునే వీలు కల్పించాలి.*


7. *ఇంకొక మాట,భాగస్వాముల్లో ఒకరు పోతే, ఇంకొకరు ఎప్పుడూ లేని ఎమోషన్స్ చూపి పిల్లల్ని  విసిగిస్తారు. మనిషే శాశ్వతం కాకపోయిన తర్వాత, ఇంక దేనికి విలువ ఇవ్వాలో మనమే విజ్ఞతగా నిర్ణయం తీసుకొని వ్యవహరించాలి.*


8.ఫొటోలు కూడా మనం అలా వెళ్ళగానే, ఇలా డస్ట్బిన్ లోకి వెళతాయి. వాళ్ళేం చేసుకుంటారు? మన అభిలాషలన్నీ మన పిల్లల మీద రుద్దకూడదు. 


9.మరో ముఖ్యమైన మాట. ఆడపిల్లలకి ఇవ్వాలనుకున్నవి మనచేతులమీదు గానే ఇచ్చేసుకోవాలి. వాళ్ళు అన్నదమ్ములని అడిగి, వాళ్ళు ఇవ్వక, పిల్లలు గొడవ పడి  , కొట్టుకుని, తిట్టుకునే వరకూ విషయం రచ్చకెక్కించకూడదు. మన సంపాదన మన ఇష్టం అది స్పష్టంగా కోడళ్ళకి/ అల్లుళ్ళకీ తెలియచెప్పాలి. ఈ విషయంలో మొహమాటం కూడదు.


 చెప్పే విషయాలుఅయిపోయాయి,

ఇక సర్దడం మొదలు పెడదామా? ఈ రోజునుండే.  చాలా టైముంది అని మాత్రం అనుకోకూడదు.


ఇక ఎలా,వ్యవహరించాలి

హాయిగా ఫ్రీ బర్డ్ లా ఉండాలి. జీవితాన్ని మనకు నచ్చినట్లుగా ఆనందంగా, ఆధ్యాత్మికంగా మలచుకోవాలి.

ఇప్పటివరకూ పట్టుక్కూర్చున్న ఇల్లు, ఆస్తులు, ఆభరణాలు, దుస్తులు, పిల్లలు, మనవలు, బాధ్యతలు మీద మమకారం తగ్గించుకోవాలి. రోజు రోజూ పూట పూటా విచారాలను వదిలి ఆనందంగా ప్రయాణానికి సిద్ధం కావాలి. 

పిల్లలతో మనసా వాచా హృదయం లోంచి మంచి మాటలు మాట్లాడాలి. కొడుకు విషయాలు కూతురు దగ్గర, కూతురు విషయాలు కొడుకు దగ్గర చెప్పడం తగ్గించుకోవాలి.

కోపాలు, తాపాలు పూర్తిగా మర్చిపోవాలి. పిల్లలను మనవలను మనసారా దగ్గరకు తీసుకుని ఆప్యాయతలు పంచి, దీవించాలి 

మనం వెళ్ళిపోయాక కూడా  , మనల్ని కనీసం ఒకరో, ఇద్దరో ఆదర్శంగా తీసుకొనేటట్లు జీవించాలి. మన మరణానంతరం పిల్లలు గొడవలతో, చికాకులతో కాకుండా ప్రశాంతంగా ఉండేలా చూసే బాధ్యత కూడా మనదే!


*చివరగా....అన్ని ఆలోచించి ఆచరణలో పెడదాం!ఆనందంగా బ్రతుకుదాం!

ఆనందం గానే దేవుని దగ్గరకు వెళదాం!

స్వస్తి! 🌹శుభం భూయాత్ 💐🌹*

*వ్యాసం పూర్తిగా చదివినవారికి, ధన్య వాదాలు🙏,ఆచరించబోయేవారికి హృదయ పూర్వక అభినందనలు👏*

 Recd.from Other Group

సంకల్పము

 *శుభోదయం*

*********

 సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.09.05.2024

బృహస్పతివాసరే( గురువారము)

************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ వైశాఖ మాసే శుక్ల పక్షే ప్రతి పత్తిథౌ

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

బృహస్పతివాసరే( గురువారము)

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

వైశాఖ మాసే  శుక్ల పక్షే  ప్రతి పత్తిథౌ పరి ద్వితీయాయాం

గురు వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.34

సూ.అ.6.17

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

వైశాఖ మాసం 

శుక్ల పక్షం 

పాడ్యమి ఉ.7.12 వరకు.

బృహస్పతివాసరే( గురువారము)

నక్షత్రం కృత్తిక 

మ.1.06 వరకు. 

అమృతం ప.10.47 ల 12.19 వరకు. 

దుర్ముహూర్తం ప. 9.48 ల 10.39 వరకు. 

దుర్ముహూర్తం మ. 2.54 ల 3.45 వరకు. 

వర్జ్యం రా.తె.4.46 ల మరునాడు ఉ. 6.20 వరకు. 

యోగం శోభన సా.4.26 వరకు.  

కరణం బవ ఉ.7.12 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం మ.1.30 ల 3.00 వరకు. 

గుళిక కాలం ఉ. 9.00 ల 10.30 వరకు. 

యమగండ కాలం ఉ.6.00 ల 7.30 వరకు.   

*****************    

పుణ్యతిధి క్రోధి నామ సంవత్సర వైశాఖ   శుధ్ధ విదియ. 

****************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు  జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

Panchaag


 

పంచాంగం 09.05.2024 Thursday

 ఈ రోజు పంచాంగం 09.05.2024 Thursday 


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస శుక్ల పక్ష: ప్రతిపత్తి తదుపరి ద్వితీయా తిధి బృహస్పతి వాసర: కృత్తిక నక్షత్రం శోభన యోగ: బవ తదుపరి బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


పాడ్యమి ఉదయం 06:21 వరకు తదుపరి విదియ రా.తె 04:18 వరకు.

కృత్తిక మధ్యాహ్నం 11:58 వరకు. 

సూర్యోదయం : 05:50

సూర్యాస్తమయం : 06:35


వర్జ్యం : రాత్రి 03:12 నుండి 04:44 వరకు. 


దుర్ముహూర్తం : పగలు 10:05 నుండి 10:56 వరకు తిరిగి మధ్యాహ్నం 03:11 నుండి 04:02 వరకు.


అమృతఘడియలు : పగలు 09:44 నుండి 11:13 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*09-05-2024 / గురువారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ఇంటాబయట బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమునకు ఆప్తులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారమున లాభాలు అందుకుంటారు.

---------------------------------------

వృషభం


దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

---------------------------------------

మిధునం


ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంత బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో శుభకార్యాలు గూర్చి చర్చిస్తారు. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

---------------------------------------

కర్కాటకం


చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

సింహం


కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అనుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు కొంత వరకు తొలగుతాయి. నూతన వస్త్ర వస్తు లాభాలు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు.

---------------------------------------

కన్య


చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.

---------------------------------------

తుల


దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిదికాదు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------

వృశ్చికం


నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

---------------------------------------

ధనస్సు


పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఇంటాబయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

---------------------------------------

మకరం


బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

---------------------------------------

కుంభం


వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. భూ సంభందిత క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. ఉద్యోగమున అధికారులతో చర్చలు అధిగమిస్తారు.

---------------------------------------

మీనం


స్ధిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి. వాహన యోగం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో సమయ పాలనతో పనులు పూర్తి చేస్తారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

శిష్యుడిని పరీక్షించాలి

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 *యథా హి కనకం శుద్ధం తాపచ్ఛేదనకర్షణైః*।

       *పరీక్షేత తథా శిష్యాన్ ఈక్షేత్కులగుణాదిభిః*॥


తా𝕝𝕝 "అగ్నిలో కాల్చటం, ముక్కలుచేయడం, గీటురాయి మీద రుద్దడంతో బంగారం స్వచ్ఛతను గుర్తించినట్లే కులం, గుణాలు మొదలైన వాటితో శిష్యుడిని పరీక్షించాలి"


     👇 //------- ( *మోహముద్గరం* )------// 👇


*అంగం గలితం పలితం ముండం*

*దశనవిహీనం జాతం తుండం* *వృద్ధో యాతి గృహీత్వా దండం*

*తదపి న ముంచత్యాశాపిండం* 

॥15॥


భావం: శరీరం కృశించిపోయింది, తల నెరసిపోయింది, నోటిలో పళ్ళు ఊడిపోయినవి. ముసలితనం పైబడి కఱ్ఱ చేతికొచ్చింది. ఐనా సరే ఆశల - కోరికల మూట మాత్రం వదిలిపెట్టడు.