🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🏵️ఎవరి నైనా ప్రశంసించినప్పుడు పర్యాలేదు.. కానీ విమర్శించేటప్పుడు జాగ్రత్త.. ఎందుకంటే విమర్శ ఋణం వంటిది.. ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చడానికి ప్రయత్నిస్తారు.. మనిషిని బాధ పెట్టె విధంగా ఎలాంటి బంధంతో ముడి వేసుకోకు🏵️అవసరానికి మించి తినే ఆహారం అనవసరపు శక్తిని తెచ్చి అనారోగ్యానికి గురి చేస్తుంది..అవసరానికి మించి కోరుకునేవి అనవసరపు ఆలోచనలకు గురి చేసి ఆవేదన గురించేస్తాయి...ఉన్నంతలో తృప్తి చెందే సంస్కారం వెలకట్టలేని సంతోషాన్ని తెచ్చిపెడుతుంది..చెప్పడానికి సులువే కానీ ఆచరించుట కస్టమని బావిస్తే జీవితంలో అసంతృప్తి మిగులుతుంది🏵️ఎత్తులకు బయపడేవారు ఆకాశాన్ని తాకే కలను కనలేరు.. జీవితంలో ప్రతీ కష్టానికి ఒక కారణం ఉంటుంది.. కానీ ప్రతీ కష్టాన్ని దాటడానికి ఒక అవకాశం ఉంటుంది..కారం మన నాలుకను మండిస్తుంది.. అహంకారం ఎదుటి వారి హృదయాలను మండిస్తుంది.. అదే మమకారం ఐతే మన జీవితాలను పండిస్తుందని తెలుసుకున్న వారు ఉత్తములు🏵️🏵️మీ *అల్లంరాజుభాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్యసలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు రాలేని వారు రాలేని వారికి కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510*🙏🙏🙏
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
1, మార్చి 2025, శనివారం
నటవిటగాయకగణికాకుటిలవచశ్శీధురసము గ్రోలెడువారికి కటువీశాస్త్రము...."
నటులు,గాయకులను మొదలైనవారిని నాటి సమాజం పంక్తిబాహ్యులుగా చేసి దూరంపెట్టినమాట వాస్తవం.
"నటవిటగాయకగణికాకుటిలవచశ్శీధురసము గ్రోలెడువారికి కటువీశాస్త్రము...."
అంటూ తనకు విద్యనేర్పమని కోరి వచ్చిన ఒక మద్యపానమత్తుడైన వానికి ఒకానొక ముని విద్యనేర్పటానిటి ఇష్టపడక ఆడిన మాటలివి. (ఇది ఏ కావ్యంలోనిదో జ్ఞప్తికి రావటంలేదు)
శ్రీమద్ భాగవతం*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(63వ రోజు)*
*(క్రితం భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*పురూరవుడు*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*బుధుడికీ, ఇలకీ పురూరవుడు జన్మించాడు. షట్చక్రవర్తులలో పురూరవుడు ఒకడు.*
*గంగా యమునా సంగమ తీరాన ఉన్న ప్రతిష్ఠానపురం రాజధానిగా పరిపాలించాడితను. గొప్ప పరాక్రమశాలి. దేవతలకూ దానవులకూ యుద్ధం జరిగినప్పుడల్లా ఇంద్రుడు, పురూరవుని సహాయాన్ని అర్థించేవాడు. పురూరవుడు కత్తి పట్టాడంటే విజయం తథ్యం. చాలా యుద్ధాల్లో అతను దేవతలకు విజయం చేకూర్చాడు. ఈ కారణంగానే పురూరవుడంటే ఇంద్రునికి గొప్ప గౌరవం. ముల్లోకాల్లోనూ పురూరవుడు యథేచ్ఛగా సంచరించేవాడు.*
*ఒకనాడు దేవలోకంలోని అప్సరసను చూశాడతను. మోహించాడు. అదో కథ. ఆ కథ అలా ఉండగా...*
*ఒకనాడు దేవసభలో పురూరవుణ్ణి నారదుడు ప్రశంసించాడు. అతని వీరవిక్రమాలనూ, గుణగుణాలనూ తెగ మెచ్చుకున్నాడు. అతని అందం గురించి కూడా పొగిడాడు. అదంతా విన్నది ఊర్వశి. పురూరవుణ్ణి ప్రేమించసాగింది. అందుకు మిత్ర వరుణుల శాపం కూడా కలసి వచ్చిందామెకు. ఊర్వశిని వారు భూలోకంలో పుట్టమని శపించారు. దేవలోకం నుంచి భూలోకానికి వచ్చిన ఊర్వశి, ప్రతిష్ఠానపురంలో విహరించసాగింది. పురూరవుడు చూశాడామెను. మోహించాడు. పెళ్ళి చేసుకుందామన్నాడు.*
*భార్యగా ఉండేందుకు కొన్ని షరతులు విధించింది ఊర్వశి. ‘‘నా దగ్గర రెండు మేకపిల్లలు ఉన్నాయి. ప్రాణసమానంగా పెంచుకుంటున్నాను. వాటిని నువ్వు కాపాడాలి. నేను నెయ్యి తప్ప వేరేదీ తినను. నాకు నువ్వు ముప్పూటలా నేతినే వడ్డించాలి. సంభోగసమయంలో తప్ప నువ్వెప్పుడూ నాకు దిసమొలతో కనిపించకూడదు. ఈ మూడు షరతులూ నువ్వు పాటిస్తానని నాకు మాట ఇస్తే తప్పకుండా పెళ్ళి చేసుకుందాం.’’ అన్నది ఊర్వశి.*
*పాటిస్తాననని ప్రమాణం చేశాడు పురూరవుడు. పెళ్ళి చేసుకున్నారిద్దరూ. అనేక సంవత్సరాలపాటు సుఖాల్ని అనుభవించారు. ఇంతలో ఊర్వశికి శాపవిమోచనకాలం దగ్గరపడింది.*
*ఆమెను దేవసభకు రప్పించేందుకు ఇంద్రుడు ప్రయత్నించాడు. పురూరవునికీ, ఊర్వశికీ ఎడబాటు కల్పించాలి. అందుకు గంధర్వులను పురిగొల్పాడతను. వారు ఓ రాత్రివేళ ఊర్వశి ప్రాణసమానమయిన మేకపిల్లలను దొంగిలించారు. తమనెవరో ఎత్తుకునిపోతున్నారని చెబుతూ మేకపిల్లలు బిగ్గరగా అరవడం ప్రారంభించాయి. ఆ సమయంలో ఊర్వశీ పురూరవులిద్దరూ ఏకశయ్యాగతులై ఉన్నారు. మేకల అరుపులు విని, ఊర్వశి గొల్లుమంది. ఏడ్చింది. వాటిని కాపాడమని పురూరవుణ్ణి వేడుకుంది. మేకపిల్లలను కాపాడేందుకు దిసమొలతోనే కత్తిపట్టి పరిగెత్తాడు పురూరవుడు. గంధర్వులను ఓడించాడు, మేకపిల్లలను తీసుకొచ్చి, ఊర్వశిని ఓదార్చాడు. అయితే అప్పుడు కూడా అతను దిసమొలతోనే ఉన్నాడు. దిసమొలతో ఊర్వశికి కనిపించి, నియమభంగం చేశాడు. దాంతో అతన్ని విడిచి పెట్టింది ఊర్వశి. వెళ్ళిపోయిందక్కణ్ణుంచి.*
*ఊర్వశి వియెగాన్ని తట్టుకోలేని పురూరవుడు పిచ్చెక్కి తిరుగుతూంటే అతనికి ఊర్వశి కురుక్షేత్రంలో కనిపించింది. ఆనందించాడతను. వెంట రమ్మని బతిమలాడాడు. రాలేనని చెప్పింది ఊర్వశి.*
*గర్భవతిని అంది. ఒక ఏడాది ఆగి, రమ్మంది అతన్ని. ఆగాడు పురూరవుడు. ఏడాది తిరగ్గానే వచ్చాడు. రమ్మని ఊర్వశిని బతిమలాడాడు మళ్ళీ. గంధర్వులను ప్రార్థించమందామె. ప్రార్థించాడు పురూరవుడు. గంధర్వులు అతని ప్రార్థనకు సంతోషించి, అగ్నిస్థాలి (వంటకుండ)ని బహూకరించి అదృశ్యమయ్యారు. దానిని జాగ్రత చేశాడు పురూరవుడు. దానినే ఊర్వశిగా భావించి కొంతకాలం గడిపాడు. చివరికి అది ఊర్వశి కాదని తెలిసింది. దాంతో దానిని అడవిలో విడిచి పెట్టి వచ్చాడు. అయినా ఊర్వశి మీద మోహం పోలేదతనికి. ఆ మోహంలో మనోవ్యధకు గురయ్యాడు. ఆ వ్యధలో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. కృతయుగం అంతరించిపోయింది. త్రేతాయుగం ప్రారంభమయింది.*
*పురూరవునికి అప్పుడు కర్మబోధకమయిన వేదత్రయం అగుపించింది. అగ్నిస్థాలిని విడిచిన చోటుకి పరిగెత్తాడతను. దాని కోసం వెదికాడు. కనిపించలేదది. శమీగర్భజాతమయిన అశ్వత్థవృక్షం కనిపించిందతనికి. దానిని రెండు అరణులుగా రూపొందించాడు. ఒక అరణిని తాననుకుని, రెండోదానిని ఊర్వశిగా భావించాడు పురూరవుడు. మధ్యగల కాష్ఠాన్ని కుమారుడనుకున్నాడు.*
*మంత్రోచ్చారణ చేస్తూ అరణులను మథించాడు. అప్పుడు అందులో నుంచి అగ్ని పుట్టింది. దాని పేరు జాతవేదసుడు. పుత్రుడుగా ప్రకాశించింది. అంతవరకూ ఉపాసన అర్హమయి ఉన్న అగ్నిని పురూరవుడు ఆనాడు మూడుభాగాలు చేశాడు. వాటినే ‘త్రేతాగ్నులు’ అన్నారు. దక్షిణాగ్ని, గార్హపత్యం, అవహనీయం వాటి పేర్లు.*
*అలా త్రేతాగ్ని ముఖాన పురూరవుడు ‘త్రయీవిద్య’కు ఆద్యుడయినాడు. అగ్నిని సంతానంగా పొందడంతో అతనికి ఉత్తమలోకం సంప్రాప్తించింది.*
*పురూరవునికీ, ఊర్వశికీ ఆయువు, శ్రుతాయువు, సత్యాయువు, రయుడు, విజయుడు, జయుడు అని ఆరుగురు కుమారులు కలిగారు.*
*వారిలో విజయుడికి భీముడు, అతనికి కాంచనుడు, కాంచనుడికి హోత్రకుడు పుట్టారు. ఈ హోత్రకుని కొడుకే జహ్నువు.*
*ఈ జహ్నుముని కారణంగానే గంగకు ‘జాహ్నవి’ అని పేరు వచ్చింది. ఈ జహ్నుని వంశంలోనే గాధిరాజు జన్మించాడు. ఈ గాధి కుమారుడే విశ్వామిత్రుడని వాల్మీకి తన రామాయణంలో పేర్కొన్నాడు.*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
నిత్య సత్యాలు
🏵️100రకాల.. నిత్య సత్యాలు🏵️
1. తల్లిదండ్రులను పూజించాలి.
ఏ స్థితిలోనూ దూషించరాదు.
2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు.
ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.
3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.
4. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు,
గుడికి వెళ్ళేటప్పుడు,
గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు,
పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు
ఒట్టి చేతులతో వెళ్ళరాదు.
ఏదో ఒకటి సమర్పించుకోవాలి
5. భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి
వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు.
6. తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం,
నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం
ఈ సృష్టిలో లేవు.
7. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని,
ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.
8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే
వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.
9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని
కొంచెం దూరం అనుసరించాలి.
10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు,
భోజనం చేయకూడదు.
11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.
12. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని,
ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు
13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.
14. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.
15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.
16. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం
తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు .
17. పిసినిగొట్టుతో,
శత్రువుతో,
అసత్యం పలికే వాడితో
భర్తను తిట్టే స్త్రీతో
కలిసి భోజనం చేయటం మహాపాపం.
18. స్నానం చేయకుండా అన్నం వండరాదు.
ఆ అన్నం తినరాదు.
19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.
20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.
21. పుణ్య కార్యాల్లో
చోళ్ళు,
జొన్నలు,
వెల్లుల్లి,
ఉల్లి,
చద్ది పదార్థాలు తినరాదు,
ఉపయోగించరాదు.
22. కాళ్ళు కడుక్కొన్నాక తుడుచుకోకుండా,
తడి కాళ్ళతో భోజనం చేయరాదు.
23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.
24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు
పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.
25. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట,
గోళ్ళుకొరుకుట చేయరాదు
26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు.
కండువా మాత్రమే ఉండవలెను.
27. ఆదివారం, శుక్రవారం, మంగళవారం
తులసి ఆకులు కోయరాదు.
28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు.
అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు.
29. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.
30. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.
31. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు.
అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.
32. శవాన్ని స్మశానం దాకా మోసినా,
శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.
33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం
కలుగ చేయుట,
భార్యాభర్తలను విడదీయుట,
తల్లిని బిడ్డను విడదీయుట
బ్రహ్మహత్యాపాతకాలతో సమానం.
(వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు.)
34. పుట్టిన రోజునాడు దీపాలు కానీ,
కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు.
నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.
35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.
36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.
37. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య,
కాపురం చేయక ఏడిపించటం,
చెప్పిన మాట వినకపోవటం,
తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు.
ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.
38. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు.
ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.
39. తలమీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొనరాదు.
40. వికలాంగులను వేళాకోళం చేయరాదు.
41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు.
ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు.
42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే.
నదీస్నాన ఫలితంరాదు.
43. ఉమ్మితో వేళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.
44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.
45. ఏడవటం వలన దారిద్ర్యం,
సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి.
46. భోజన సమయంలో మాట్లాడుట,
నవ్వుట పనికిరాదు.
47. పెద్దన్న గారు,
పిల్లనిచ్చిన మామ గారు,
గురువు
ఈ ముగ్గురు కన్నతండ్రితో సమానం
కనుక వీరు ముగ్గురినీ తండ్రిలాగే పూజించాలి.
48. ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి క్రొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి.
పాత వత్తిని మళ్ళీ వెలిగించరాదు.
49. ఒక చెట్టును నరికేముందు మూడుచెట్లు నాటితే కాని ఆ దోషం పోదు.
50. అన్నమును తింటున్నపుడు ఆ అన్నమును దూషించుట కాని,
కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టుటకాని చేయరాదు.
51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట,
ఒట్టు పెట్టుట దోషం.
52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.
53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.
54. నదిలో చీమిడి చీదుట, ఉమ్ముట,
చిల్లర డబ్బులు వేయుట దోషం.
55. ఒడిలో కంచం పళ్ళాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు.
అలా చేస్తే ఘోర నరకాలు కలగటమే కాక,
వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు.
56. చీటికి మాటికి తనను తాను నిందించుకొనుట, అవమానించుకొనుట, తక్కువ వేసికొనుట చేయరాదు.
57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు.
కనుక ఉపదేశం పొందితీరాలి.
58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు.
ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.
59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు
సరిగా పారితోషంఇవ్వక,
వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.
60. శివలింగార్చన ఆడవారు కూడా చేయవచ్చు.
61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు.
తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.
62. ఎంతకోపం వచ్చినా తల్లిదండ్రులను, గురువును కొట్టరాదు.
వారిపైకి చేయి ఎత్తరాదు.
ఇంటి నుండి గెంటివేయరాదు.
వారికి పెట్టకుండా పదార్థాలేవీ తాను తినరాదు.
63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.
64. మేడి చెట్టుకు ప్రదక్షిణ,
రావి చెట్టుకు పూజ,
వేప చెట్టును నాటుట,
మామిడి పళ్ళు దానం
అశ్వమేథ యాగ ఫలితాన్ని ఇస్తాయి.
65. తీర్థం తీసుకున్నాక,
ఆ చేతిని కడుక్కోవాలి తప్ప,
అరచేతిని తలపై రాసుకొనరాదు.
66. పాడయిపోయిన లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కాని,
చెరువులో కాని, సముద్రంలో కాని కలుపవలెను. ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతిపెట్టవలెను.
67. ఉపవాసం ఉన్నపుడు,
జాగరణ చేసినపుడు
పరులదోషాలు తలుచుకోరాదు.
68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు.
కొంచెం దూరం ఉంచాలి.
69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు.
సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి.
పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే
ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.
70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు,
దెప్పి పొడవరాదు.
71. కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి.
ఆ కుమారుడు మరణించినట్లైతే తండ్రితో పాటు అందరూ కట్టు బట్టలతో స్నానం చేయాలి.
72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు,
వాగ్బంగం చాలా దోషం.
73. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు.
శుభ్రత కోసం పీచు తీయవచ్చు,
తీయకపోతే దోషం లేదు.
74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి.
దీనిని కాయిక తపస్సు అంటారు.
75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే
7 జన్మల పాపాలు తొలుగుతాయి.
76. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు,
కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.
77. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.
78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలంలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.
79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.
80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.
81. నిత్యం తామువాడే పాత్రలలో పండితులకు ఆహారం పెట్టుట దోషం,
కనుక ఆకులలోకాని, క్రొత్త పాత్రలలోకాని
వారికి ఆహారం పెట్టాలి.
82. గృహప్రవేశ కాలంలో గాని,
ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయడం మంచిది.
ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.
83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.
84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.
85. రేపు చేయవలసిన పనిని ఈ రోజు,
ఈ రోజుపని ఈ క్షణమే చేయాలి.
వాయిదాలు పనికిరావు.
86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.
87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము.
ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.
88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం,
తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.
89. పుష్కర సమయాలలో స్నానం,
శ్రాద్ధకర్మ ఎవరైనా చేసి తీరాల్సిందే.
90. ప్రదక్షిణలు చేసేటపుడు,
మంత్ర పుష్పం ఇచ్చేటపుడు
ఆసనాలపై నిలబడరాదు.
కింద నిలబడి చేయాలి.
పూజా సమయాలలో కొందరు చాపలు పీకుట, దర్భాసనాలు తుంచటం చేస్తారు.
ఇవి మహా పాపాలు.
91. గణపతికి గరికపూజ మహాప్రీతి
ఏ పరిస్థితులలోనూ తులసితో పూజ చేయరాదు(వినాయక చతుర్థినాడు కుడా తులసిని సమర్పించరాదు.
92. మనుష్యుని పాపం వాడి అన్నంలోనే ఉంటుంది. అందువలన పాపాత్ముల ఇంటి భోజనం చేయరాదు. మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏనాటికీ మోక్షంరాదు.
93. జపమాల మెడలో వేసుకొనరాదు.
మెడలో వేసుకొన్న మాలతో జపం చేయరాదు.
94. బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదు. దాని వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి.
దొరికిన బంగారం వెంటనే దానం చేయుట కాని,
లేదా దేవాలయాలకు ఇచ్చివేయుట కాని చేయాలి.
95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని
ఏ శాస్త్రాలు చెప్పలేదు.
కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.
96. భోజనసమయంలో వేదములు చదువుట,
గిన్నె మొత్తం ఊడ్చుకొని తినుట పనికిరావు. ఏడుస్తూ అన్నం తినరాదు.
97. దేవాలయం నీడను,
దేవతల నీడను,
యజ్ఞం చేసే వారి నీడను,
గోబ్రాహ్మణుల నీడను దాటరాదు.
98. శ్రాద్దములో భోక్తగా మిత్రుడు పనికిరాడు. అతిథులుగా భోజనం పెట్టుకొనవచ్చు.
99. విశిష్ట వ్యక్తులను,
మహాత్ములను అగౌరవపరచి,
నిందించు దుర్మార్గుని పాపం చిత్రగుప్తుడు కూడా వర్ణించలేడు
100. శివాలయం లేని ఊరిలో భోజనం చేయరాదు
చదవండి. పిల్లలతో చదివించండి ఇంతకు మంచిన గొప్ప సంపద పిల్లలికి ఇవ్వలేమేమో..!🙏
పెళ్లిమంత్రాలకు అర్థం-పరమార్థం
పెళ్లిమంత్రాలకు అర్థం-పరమార్థం
పెళ్లంటే... తప్పెట్లు, తాళాలు, మూడు ముళ్లు, ఏడడుగులు... అంతేనా?
పెళ్లంటే... రెండు మనసుల కలయిక, నూరేళ్ల సాన్నిహిత్యం...!
పెళ్లంటే... ప్రమాణాలు, వాటికి కట్టుబడి ఉండటం ప్రమాణాలకు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం.
ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం.
మానవజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం ‘వివాహం.’
ఆ సందర్భంలో వధూవరులతో పలికించే ప్రామాణిక మంత్రాలు...
వాటి అర్థాలపై ప్రత్యేక కథనం...
జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువకాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం.
ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. వాటినే లౌకికంగా ‘పెళ్లినాటి ప్రమాణాల’ని చెబుతారు. ఆ ప్రమాణాలను త్రికరణశుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతుంది. ఆ బంధం నిండునూరేళ్లు పవిత్రంగా, పచ్చగా ఉంటుంది.
వైవాహిక జీవితానికి మూలం...
వివాహం అంటే స్వార్థజీవితం కాదని, జీవితాన్ని ఆనందంగా గడపడమని మహర్షులు చెబుతారు.
ఆధ్యాత్మిక, సాంఘిక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు సఖ్యంగా, చనువుగా, ప్రేమగా ఉండటమే దీని మూలమని పెద్దలు వివాహాన్ని నిర్వచించారు.
*సంప్రదాయ వివాహాలలో ముఖ్యంగా తొమ్మిది అంశాలు ఉంటాయి.*
అవి… సమావర్తనం, కన్యావరణం, కన్యాదానం, వివాహహోమం, పాణిగ్రహణం, అగ్నిపరిచర్య, లాజహోమం, సప్తపది, నక్షత్ర దర్శనం.
*1.) సమావర్తనం :*
పెళ్లితంతులో అత్యంత ప్రధానమైన ‘సమావర్తనం’ అంటే తిరిగిరావటం అని అర్థం. గురుకులంలో విద్యపూర్తయ్యాక, ‘చరితం బ్రహ్మచర్యోహం’ అనే శ్లోకాన్ని గురువుల అనుజ్ఞ కోసం పఠించి, గురువు అనుజ్ఞతో గృహస్థాశ్రమం స్వీకరించడానికి సిద్ధపడడం. వివాహం చేసుకున్నాక, గురువుకు ఇచ్చిన మాటను అతిక్రమించకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది.
గృహస్థ ధర్మాన్ని స్వీకరించబోయే సమయంలో...
“రాత్రి సమయంలో స్నానం చేయను, వస్త్రరహితంగా స్నానం చేయను, వర్షంలో తడవను, చెట్లు ఎక్కను, నూతులలోకి దిగను, నదిని చేతులతో ఈదుతూ దాటను, ప్రాణ సంశయం ఏర్పడే సన్నివేశాలోకి ఉద్దేశపూర్వకంగా ప్రవేశించను...”
అని పలికిస్తారు.
*2.) అంకురారోపణం :*
వివాహానికి ముందే కన్యాదాత ఈ కార్యక్రమం నిర్వర్తిస్తాడు….
పంచపాలికలలో పుట్టమన్ను పోసి నవధాన్యాలను పాలతో తడిపి మంత్రయుక్తంగా వేసి పూజిస్తారు. ఇందులోని పరమార్థం... “కొత్తగా పెళ్లి చేసుకుంటున్న దంపతులారా! భూమిలో విత్తనాలను వేస్తే పంట వస్తోంది. కాబట్టి నేలతల్లిని నమ్మండి, పంట సంతానాన్ని పొందండి!” అని ధర్మసింధు చెబుతోంది.
*3.) కన్యావరణం :*
కన్యను వరించటానికి రావటాన్ని ‘కన్యావరణం’ అంటారు. మంగళవాద్యాల నడుమ వధువు ఇంటికి వచ్చిన వరుడిని, వధువు తండ్రి గౌరవంగా ఆహ్వానించి మధుపర్కం ఇస్తాడు.
*4.) మధుపర్కం :*
మధుపర్కమంటే ‘తీయని పానీయం’ అని అర్థం.(కొన్ని చోట్ల బెల్లంతో చేసిన పానకం ఇస్తారు) వరుడికి... తేనె, పెరుగు, బెల్లం కలిపిన మధురపదార్థం తినిపించాక, మధుపర్కవస్త్రాలను ఇస్తారు.
ఎదుర్కోలు సన్నాహం:
ఇరుపక్షాలవారు శుభలేఖలు చదివి, ఒకరికొకరు ఇచ్చుకుని, పానకం అందచేస్తారు.
*5.) కన్యాదానం- విధి :*
వధువు తండ్రి, తన కుమార్తెను మరో పురుషుడికి కట్టబెట్టడమే కన్యాదానం. కన్యాదానం చేసేటప్పుడు వల్లించే మంత్రాలు...
అష్టాదశవర్ణాత్వియకం కాన్యపుత్రవత్పాలితామయా
ఇదానిల తపదాస్వామి దత్తాం స్నేహేన పాలయం
‘కుమారుడితో సమానంగా పెంచుకొన్న ఈ కన్యను నీకు ఇస్తున్నాను. నీవు ప్రేమాభిమానాలతో కాపాడుకో’
‘శ్రీలక్ష్మీనారాయణ స్వరూపుడైన వరునికి ఇదిగో నీళ్లు... అంటూ వరుడి పాదాలు కడుగుతారు.
‘పితృదేవతలు తరించడానికి ఈ కన్యను నీకు దానం చేస్తున్నాను. సమస్తదేవతలు, పంచభూతాలు నేను చేస్తున్న ఈ దానానికి సాక్షులుగా ఉందురుగాక’ ‘అందంగా అలంకరించిన సాధుశీలవతి అయిన ఈ కన్యను ధర్మకామార్థ సిద్ధికోసం ప్రయత్నం చేస్తున్న ఈ సాధుశీలుడైన బుద్ధిమంతునికి దానంగా ఇస్తున్నాను’
‘ధర్మబద్ధంగా సంతానం పొందడానికి, ధర్మకార్యాలు నిర్వహించడానికి ఈ కన్యను ఇస్తున్నాను’ వధువు తండ్రి ‘పృణీద్వం’ (వరించవలసినది) అంటాడు.
అప్పుడు వరుడు…‘పృణేమహే’(వరిస్తున్నాను) అంటాడు.
ఆ తరువాత వధువు తండ్రి వరునితో,
“నేత్రాయ పౌత్రపుత్రా లక్ష్మీం కన్యాంనామ్నీం
ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషా నాతిచరితవ్య
‘ధర్మంలోనూ, అర్థంలోనూ, కామంలోనూ లక్ష్మీస్వరూపిణి అయిన ఈ కన్యను అతిక్రమించనివాడవై ఉండు!’ అని పలికిన వధువు తండ్రితో, ‘నాతిచరామి’ (అతిక్రమించను) అని వరుడు మూడుసార్లు వాగ్దానం చేస్తాడు.
ఇది వేదోక్త మంత్రార్థం. ఆ మాటకు అంత మహత్తు ఉంది. అలా అన్న తరవాతే వరుడి పాదాలను కడిగి, కన్యాదానం చేస్తారు.
*6.) యోక్త్రధారణం :*
యోక్త్రం అంటే దర్భలతో అల్లిన తాడు. వివాహ సమయంలో వరుడు దీనిని వధువు నడుముచుట్టూ కట్టి ముడి వేస్తాడు. ఈసమయంలో వరుడు...
“ఆశాసానా సౌమ నవ ప్రజాం సౌభాగయం తను మగ్నే,
రనూరతా భూత్వా సన్న హ్యే సుకృతాయ కమ్” అంటాడు.
‘ఉత్తమమైన మనస్సును, యోగ్యమైన సంతానాన్ని, అధికమైన సౌభాగ్యాన్ని, సుందరమైన తనువును ధరించి, అగ్నికార్యాలలో నాకు సహచారిణివై ఉండు. ఈ జీవిత యజ్ఞమనే మంగళకార్యాచరణం నిమిత్తమై వధువు నడుముకు దర్భలతో అల్లిన తాటిని కడుతున్నాను...’ అనేది ఈ మంత్రార్థం.
*7.) జీలకర్ర , బెల్లం :*
వధూవరులు... జీలకర్ర, బెల్లం కలిపిన మెత్తని ముద్దను శిరస్సు భాగం లో, బ్రహ్మరంధ్రం పైన ఉంచుతారు.
ఒకరిపట్ల ఒకరికి అనురాగం కలగడానికి, భిన్నరుచులైన ఇద్దరూ ఏకం కావడానికి, పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడేలా మనసు సంకల్పించటం దీని అంతరార్థం.
ఈ సమయంలో “ఆభ్రాతృఘ్నీం వరుణ ఆపతిఘ్నీం బృహస్పతే లక్ష్యం తాచుస్యై సవితుస్సః” వరుణుడు, సోదరులను వృద్ధిపరచుగాక. బృహస్పతి, ఈమెను భర్తవృద్ధి కలదిగా చేయుగాక. సూర్యుడు, ఈమెను పుత్రసంతానం కలదానిగా చేయుగాక” అని అర్థం.
ఇదే అసలైన సుముహూర్తం.
*8.) మంగళ సూత్రధారణ :*
(తాళి... తాటి ఆకులను గుండ్రంగా చుట్టి, పసుపు రాసి, పసుపుతాడు కడతారు. దానిని తాళిబొట్టు అంటారు. తాళవృక్షం నుంచి వచ్చింది).
వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని ముడి వేస్తూ ఈ కింది మంత్రాన్ని పఠించాలి…
“మాంగల్య తంతునానేన మమజీవన హేతునా
కంఠే బధ్నామి సుభగే త్వం జీవశరదాశ్శతం”
‘నా జీవానికి హేతువైన ఈ సూత్రాన్ని నీకంఠాన మాంగల్యబద్ధం చేస్తున్నాను. నీవు నూరు సంవత్సరాలు జీవించు... అని దీని అర్థం.
*పాణిగ్రహణము :*
ధృవంతే రాజా వరుణో ధృవం దేవో బృహస్పతిః
ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధృవం॥
చంద్రుడు (మనస్సు), బృహస్పతి (కాయం), అగ్నిహోత్రుడు (వాక్కు) ... వీరు ముగ్గురి నుంచి బతిమాలి, వధువును తీసుకువస్తాడట వరుడు. అంటే త్రికరణశుద్ధిగా కాపురం బావుంటుంది అని అర్థం!
(కన్య పుట్టగానే కొంతకాలం చంద్రుడు, కొంతకాలం గంధర్వుడు, కొంతకాలం అగ్ని కాపాడతారట. ఆ తరువాత వారి ముగ్గురిని అడిగి వరుడు వధువును తీసుకువస్తాడట).
‘సోముడు నిన్ను గంధర్వుడికిచ్చాడు, గంధర్వుడు అగ్నికిచ్చాడు, నేను నిన్ను కాపాడవలసిన నాలుగవవాడను’ అని అభిమంత్రించి పెళ్లికూతురు చేయి పట్టుకొంటాడు. ఇదే పాణిగ్రహణం.
*తలంబ్రాలు :*
దీనినే అక్షతారోహణంగా చెబుతారు. అక్షతలు అంటే నాశం లేనివి.
వీరి జీవితం కూడా నాశనరహితంగా ఉంటుందని చెప్పడం కోసమే ఈ తంతు.
ఇందులో ముందుగా... ఒకరి తరవాత ఒకరు కొన్ని మంత్రాలు ఉచ్చరించాక వేడుక ప్రారంభం అవుతుంది. సంతానం, యజ్ఞాది కర్మలు, సంపదలు, పశుసంపదలు కలగాలని భార్యాభర్తలు వాంఛిస్తారు.
*9.) సప్తపది :*
ఏడడుగులు నడిస్తే సంబంధం దృఢపడుతుందట. ఈ ఏడడుగులు ఏడేడు జన్మల అనుబంధాన్నిస్తుంది. వరుడు వధువుని చేయి పట్టుకొని అగ్నిహోత్రానికి దక్షిణంగా కుడికాలు ముందుకి పెడుతూ, ఏడు మంత్రాలు చెబుతాడు. ఇదే సప్తపది.
ఇందులో వరుడు వధువుని ఏడు కోరికలు కోరతాడు. అన్నం, బలం, ప్రతిఫలం, వ్రతాదికం, పశుసంపద, సంతానం, ఋషుల అనుగ్రహం కలగాలని ఒక్కో అడుగూ వేస్తూ చదువుతారు.
ఈ మంత్రాలను త్రికరణశుద్ధిగా వల్లిస్తూ, అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని, ‘పెళ్లినాడు చేసే ప్రమాణాల’ను అతిక్రమించకూడదని, వీటికోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మహర్షులు చెప్పారు.
ప్రమాణాలను నిలబెట్టుకున్న నాడు వివాహవ్యవస్థ పటిష్టంగా ఉంటుందనే పెద్దల వాక్కు ఆచరణీయం.
*కొత్త బంధాలు, పరిచయాలు :*
మానవజీవితంలోని అన్ని సంస్కారాలలోకీ అతి ముఖ్యమైనది వివాహం. దీనితో రెండు జీవితాల బంధం ముడిపడి ఉంటుంది. మూడుముళ్ల బంధంతో వివాహజీవితం కొనసాగుతుంది. వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టాలు స్నాతకం, కాశీయాత్ర, కన్యాదానం, శుభముహూర్తం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, సప్తపది, అరుంధతీ దర్శనం. ఈ కార్యక్రమాలు పురోహితుల వేదమంత్రాల మధ్య, బంధుమిత్రుల శుభాశీస్సుల మధ్య వైభవోపేతంగా జరుగుతుంది. వివాహంతో ఇరువర్గాల బంధువుల మధ్య కొత్త పరిచయాలు, కొత్త బంధాలు, అను బంధాలు కలుగుతాయి.
*ఆత్మల అనుసంధానం :*
మానవుడు... కడుపులో ఉన్నప్పటి నుంచి, తనువు చాలించేవరకు మొత్తం 16 కర్మలు ఉంటాయి. వాటిల్లో వివాహం అతి ప్రధానమైనది, స్త్రీపురుషులు కలిసి ధర్మార్థకామమోక్షాలను సాధించుకోవడమే వివాహ పరమార్థం.
జీవిత భాగస్వామ్య వ్యవస్థ నుంచి రెండు ఆత్మలుగా ఏకమవ్వడమే వైవాహిక జీవితం. పెళ్లితో స్త్రీపురుషుల అనుబంధానికి నైతికత ఏర్పడుతుంది. లౌకికంగా ఏర్పడే అన్ని అనుబంధాలలోకి వివాహబంధం అతి ముఖ్యమైనది, పవిత్రమైనది. పెళ్లి వెనుక ఉన్న సృష్టి రహస్యం, పెళ్లి పేరుతో జరిగే మంత్రోచ్చారణలు అన్నీ కలిసి దంపతులను సృష్టికారకులుగా నిలబెడుతున్నాయి.
శివయ్య
✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️
*సర్వాన్ని ప్రసాదించే శివయ్య*
✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️
*ఒక మంత్రాన్ని ఉపదేశించడానికి లేదా స్మరించడానికి ఎన్నో నియమాలు, నిబంధనలు ఉంటాయి. మంత్రాల విషయంలో నియమాలను ఉల్లంఘించకూడదని శాస్త్రం చెబుతుంది. ఇటువంటి నియమాలు, విధానాలు అవసరం లేకుండా సిద్ధించే మంత్రం "శివాయ గురవే నమః".*
*"శివాయ గురవే నమః" అనే మంత్రానికీ ఏ నియమాలూ అవసరం లేదు కనుక దీనిని "పరమమంత్ర సామ్రాట్" అంటారు.*
*శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం.*
*దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.*
*మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి.*
*దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.*
*మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది. ఆ రూపాలు వరుసగా....*
*శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మి దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సంబ దక్షిణామూర్తి¸హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి¸కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి¸శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి.*
*ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది. భస్మాన్ని అలముకున్న తెల్లని వాడు, చంద్రకళాధరుడు, జ్ఞానముద్ర, అక్షమాల, వీణ, పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి. తెలివిని, విద్యను మంచిబుద్ధిని ప్రసాదిస్తాడు.*
*పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.*
*దక్షిణామూర్తి మంత్రం:~*
*ఓం వృషభ-ధ్వజాయ విద్మహే,*
*ఘృణి హస్తాఆ ధీమహి తన్నో,*
*దక్షిణామూర్తి ప్రచోదయాత్।*
*ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకామూర్తయే !*
*నిర్మాలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః !!*
*చిద్దనాయ మహేశాయ వటమూలనివాసినే !*
*ఓంకారవాచ్యరూపాయ దక్షిణామూర్తయే నమః !!*
*గురవే సర్వలోకానాం భిషజే భవరోగినమ్ !*
*నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః॥*
*ఓం నమః శివాయ।*
✴️✴️✴️✴️✴️✴️✴️✴️
*ఓం శాంతిః శాంతిః శాంతిః!*
*సర్వేజనా సుఖినోభవంతు!!*
*ఓం తత్సత్!!*
*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*
*ఓం నమః శివాయ!!!*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
గజ్జిని హరించుటకు ఔషధయోగములు -
గజ్జిని హరించుటకు ఔషధయోగములు -
* ముదిరిన కొబ్బరిచిప్పలు నిప్పులపైన కాల్చగా వచ్చిన చమురు లేపనముగా రాసినచో గజ్జి తగ్గును.
* ఎండిన నిమ్మకాయ పైన పొట్టు కాల్చి మసిచేసి కొబ్బరినూనె కలిపి రాసినచో గజ్జి తగ్గును.
* లేత చిక్కుడు ఆకురసము రాసినచో గజ్జి తగ్గును.
* జీడిమామిడి గింజల పైపెచ్చులను కాల్చి మసిచేసి కొబ్బరినూనె కలిపి రాసిన గజ్జి మొదలగు చర్మవ్యాధులు నశించును.
* పండిన పనస ఆకులను ఎండబెట్టి చూర్ణం చేసి , ఆ చూర్ణమునకు వ్యాసలిన్ కలిపి రాయుచున్న గజ్జి తగ్గును.
* బొప్పాయిపాలు , ఆవునెయ్యి సమపాళ్లలో కలిపి రాసిన గజ్జి మొదలగు చర్మవ్యాధులు తగ్గును.
* వాక్కాయవేరును , హారతి కర్పూరం , కొబ్బరినూనెతో కలిపి రోజుకు రెండు నుంచి మూడుసార్లు రాయుచున్న గజ్జి తగ్గును.
గజ్జి మొదలుగు చర్మవ్యాధులు ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు -
మినుప పదార్దాలు , పాతపచ్చళ్ళు , టీ , కాఫీ , పెరుగు , వంకాయ , గోంగూర , ఫ్రిజ్ నీరు , మద్యము , చేపలు , కోడిగుడ్డు , కోడికూర , మసాలా పదార్దాలు , అతిగా కారం , అతిగా ఉప్పు , నూనెవేపుళ్ళు తినకూడదు .
పైన చెప్పిన ఆహారనియమాలు పాటిస్తూ ఔషధాలను వాడవలెను. గజ్జి , తామర వంటి చర్మవ్యాధులు ముఖ్యంగా శరీరం నందు వేడి అధికమైనప్పుడు రక్తంలో దోషం ఏర్పడి కలుగును . చర్మవ్యాధులతో భాధపడేవారు శరీరం నందు వేడిని కలుగచేసే పదార్దాలు సేవనం చేయరాదు .
మరిన్ని అనుభవపూర్వక, రహస్య ఆయుర్వేద ఔషధ యోగాలు గురించి మరింత వివరణాత్మక సమాచారం నా గ్రంధాల యందు వివరించాను. వాటిని క్షుణ్ణముగా చదవగలరు.
గమనిక ~
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
నాటక సమీక్ష
🙏తెలుగు నాటక సమీక్ష 🙏
నాటక కళ ఎంత గొప్పది. నాటకం కంటే గొప్ప దృశ్య కావ్యం మరొకటి ఉన్నదా?
సంస్కృత భాషలో విశేష ఖ్యాతి గడించిన నాటకాలు ప్రాచీన తెలుగు కవులు ఆదరించలేదు.
ప్రాచీన తెలుగు మహాకవులు కావ్యాలు, ప్రబంధాలు రాశారే కానీ నాటకాలు రాయలేదు. ఎందుకని? సంస్కృత సాహిత్యంతో అంత సంబంధం ఉండీ అక్కడి నాటక రచన సంప్రదాయం ఎందుకు పట్టుకోలేదు?
ప్రాచీన తెలుగు సాహిత్యంలో నన్నయకు ముందు ఎవరైనా నాటకాలు రాశాారా? లేదా అనే ప్రశ్న గనుక ఉద్భవిస్తే, అందుకు తగిన ఆధారాలు లేవు. కానీ ఆ కాలంలో తెలుగు నేలపై నాటక సంప్రదాయం బతికే ఉందనడానికి మాత్రం ఆధారాలు ఉన్నాయి. నన్నయ్య తన మహాభారత అవతారికలో రసాన్విత కావ్యనాటకముల్ పెక్కుజూచితి అన్నాడు. కాబట్టి, నన్నయ కాలంలోనూ, అంతకు ముందూ నాటక ప్రదర్శనలు ఉండేవని అర్థం చేసుకోవాలి. బహుశా అవి సంస్కృత నాటకాలు అయ్యి ఉండవచ్చు
నాకు తెలిసి గ్రంథరూపేణ వచ్చిన తెలుగు నాటక రచనలు 14 వ శతాబ్దంలో కొంతవరకు ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా ఆ శతాబ్దంలో వినుకొండ వల్లభరాయడు రాసిన సుప్రసిద్ధ వీధినాటకం క్రీడాభిరామం ఒక చరిత్రకు సాక్ష్యం. పైగా తెలుగులో లభ్యమైన తొలి నాటకంగా కూడా ఘనతకెక్కింది.
అయితే క్రీడాభిరామం మీద కూడా కొన్ని విమర్శలు, వాదనలు ఉన్నాయి. అసలు ఈ నాటకాన్ని వల్లభరాయుడు రాయనేలేదని, శ్రీనాథుడు రాశాడని కొందరు అంటారు. మరో విషయం ఏమిటంటే, తెలుగులో నాటక రచనలు పెక్కురీతిలో అందుబాటులోకి రాకపోయినా, తెలుగు సాహితీ అభిమానులు మాత్రం సంస్కృత నాటకాలను ఎన్నడూ మర్చిపోలేదు. ఉదాహరణకు 1వ శతాబ్దం వాడైన కాళిదాసు రాసిన నాటకాలైన అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము, మాళవికాగ్ని మిత్రము ఇవన్నియూ ఆనాటి తెలుగు సాహితీవేత్తలకు కంఠోపాఠాలే. అవి తెలుగు నేలపై కూడా పలు రాజ్యాలలో ప్రదర్శించినట్లు ఆధారాలున్నాయి.
కావ్యేషు నాటకం రమ్యమ్’, ‘నాటకాంతంహి సాహిత్యమ్’, ‘నాటకాంతం కవిత్వమ్’.. అంటూ నాటకమును ఉత్కృష్ట సాహితీ సృష్టిగా ప్రకటించారు సంస్కృత పండితులు. అయితే కావ్యాలను తెనిగీకరించిన రీతిలో నాటకాలను ప్రాచీన తెలుగు కవులు లేదా నాటక రచయితలు అనువదించడానికి ప్రయత్నించలేదు.
సంస్కృత నాటకాలను కూడా ప్రబంధాలుగానే అనువదించారు. ఉదాహరణ శృంగార శాకుంతలం కవి పిల్లలమర్రి పినవీరభద్రుడు. సంస్కృత నాటకాలకు ఉన్న గౌరవం తమ అనువాద నాటకాలకు రాదని భయమో? కాళిదాసాది కవుల ముందు నిలవలేమని భయమో? మరే కారణమో? చెప్పలేను. మొత్తం దిగ్గజ కవులు ఎవరు కూడా నాటకాలను స్పృశించలేదు.
ఈ ప్రయత్నం కూడా ఆధునిక యుగంలోనే జరిగింది. పరవస్తు వెంకట రంగా చార్యులు 1872 లో కాళిదాసు రచించిన "అభిజ్ఞాన శాకుంతలము"ను ఆంధ్రీకరించారు.
మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రాసిన తెలుగు వారి జానపద కళారూపాలు అనే గ్రంథంలో హాలుడు రచించిన గాథా సప్తశతి గురించి ఒక వ్యాఖ్య ఉంది. దీని ప్రకారం క్రీస్తుకు పూర్వమే ఆంధ్ర దేశంలో సంగీతం, నృత్యంతో పాటు నాటక కళ కూడా అందుబాటులో ఉండేదని ఆ గ్రంథం చెబుతోంది. అయితే ఏ రూపేణ నాటకం ఆనాడు బతికి బట్టకట్టింది అనేది తెలుసుకోవాలి. బహుశా నగరాల వరకూ ఈ నాటకం ప్రాచుర్యం పొందక పొయినా, గ్రామీణులకు మాత్రం ఏదో ఒక రూపంలో అందుబాటులో ఉండేదని మాత్రం గ్రహించాలి. బహుశా వీధి నాటకం రూపేణా ఇది ప్రాచుర్యం పొంది ఉండవచ్చు.
మరొక విషయం ఏమిటంటే, శివకవుల యుగంలో అనగా నన్నయకు, తిక్కనకు సంధికాల సమయంలో (అనగా 1100 నుండి 1225 వరకు), తెలుగు నేలపై శైవ భక్తులు ఎన్నో దేశీయ తెలుగు నాటకాలు ప్రదర్శించినట్లు చరిత్ర చెబుతోంది. అలాగే తిక్కన రాసిన మహాభారతం విరాటపర్వంలోని కొన్ని భాగాలు మనకు నాటకం చదువుతున్న భావాన్ని కలిగిస్తాయి.
ఇక్కడ కూడా ఓ చిన్న విషయం ఉంది. ఒకప్పుడు ఆర్య సంప్రదాయం ప్రకారం (ముఖ్యంగా సంస్కృత నాటకాలలో) నాటకాలాడే నటులను పంక్తి బాహ్యులుగా నిర్ణయించారు. అటువంటివి చాలా తక్కువగా చూసేవారు. కానీ తెలుగు నేల పై శివకవులు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన దేశీయ నాటకాలలో, శివ తత్వానికి కట్టుబడి ఉన్న అగ్రజాతి వారు కూడా నటించేవారు. ఈ నాటకాలు రాత రూపంలో లేకపోవడం వల్ల వాటి గురించి చాలామందికి తెలియదు. కానీ ఇవి మౌఖిక సాహిత్య రూపంలో మాత్రం జనాల నాల్కలపైనే ఉన్నాయి. ఈ దేశీ నాటకాలను జంగమలు ఎక్కువగా ప్రదర్శించేవారు. అయితే ఈ నాటకాలన్ని కూడా శైవమత ప్రచారం కోసం రాసినవే అని గుర్తుపెట్టుకోవాలి. పాల్కురికి సోమనాథుడు రాసిన బసవపురాణం, పండితారాధ్య చరిత్రలలో కూడా దేశీ నాటకాల ప్రస్తావన ఉంది.
ఇక ఆంధ్ర రెడ్డి రాజుల కాలంలో అనగా 13వ శతాబ్డంలో పాటల నాటకాలుగా యక్షగానాలు తమదైన పాత్ర పోషించాయి. నిజం చెప్పాలంటే యక్షగానాలు తెలుగు నాటకానికి చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఇవి సంప్రదాయ నాటక ప్రమాణాలను అందుకోకపోయినా, నాటక కళ ఏదో విధంగా ఆ కాలంలో తెలుగు నేలపై బతికుండడానికి దోహదపడ్దాయి.
15 వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో నాటక కళ నగరాలలో ప్రయోగాత్మకమైన రీతిలో పలువురి ఆదరణను పొందింది. గంగాధర కవి రచించిన " గంగాదాస ప్రతాపవిలాసం" ఒక ప్రయోగాత్మక నాటకం. కానీ రంగస్థలంపై ఆ నాటకం రాణించకపోవడంతో మరుగుపడిపోయింది.
అలాగే విజయనగర రాజ్యంలో పలుమార్లు నాటక ప్రదర్శనలు కోట లోపల జరిగినట్లు కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఇవి కూడా సంస్కృత నాటకాలే. ఇలాంటి ప్రదర్శనలప్పుడు స్త్రీ పాత్రధారులను లోబరుచుకొని, వారి స్థానంలో శత్రు సేనలు కోటలోకి ప్రవేశించేవని, అందుకే అటువంటి ప్రదర్శనలను తర్వాత నిషేధించారని తెలుగు వారి జానపద కళారూపాలు అనే గ్రంథంలో ఉంది.
అలాగే విజయనగర రాజుల కాలంలోనే హరిహరరాయలు కుమారుడైన విరుపాక్ష రాయలు నారాయణ విలాసం, ఉన్మత్తరాఘవం అనే రెండు నాటకాలు రచించాడు. కానీ వాటినికూడా ఆయన తెలుగులో రాయలేదు. సంస్కృతములోనే రాశాడు. ఆ రోజులలో తెలుగులో సరైన నాటక రచనలు రాని మాట వాస్తవం. కానీ ఎక్కడో పల్లెలలో పాట నాటకాలుగా పేరొందిన యక్షగానాల గురించి ఎవరో శ్రీ కృష్ణదేవరాయల వారి అన్న వీరనరసింహరాయలు చెవిని వేస్తే, ఆయన స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి ఆ నాటకాలను చూసి వచ్చేవారట.
క్రీ.శ, 1514 లో కర్నూలు జిల్లా చెరువు బెళగల్లు గ్రామంలో తాయికొండ నాటక ప్రదర్శనాన్నిచ్చిన చేగయ్య కుమారుడు నట్టువ నాగయ్యకు రాయలవారు భూమిని కూడా దానమిచ్చారట. 16వ శతాబ్దంలో యక్షగాన నాటకాలకు తంజావూరు రఘునాథనాయకుడి ఆస్ధానంలో దక్కిన గౌరవం అంతాఇంతా కాదు. ముఖ్యంగా ఆ రోజులలో తంజావూరు మేలటూరు భాగవతులు కోసం వెంకటరామ శాస్త్రి అనే ఆయన అనేక వీధి నాటకాలను రచించి ఇచ్చేవారట. అవి అన్ని ఆయన తెలుగులోనే రాసేవారు.
మేలటూరు భాగవతులు తర్వాత, తెలుగు నేలపై పల్లె నాటకాలను ప్రదర్శించడంలో కొఱవంజి నాటకకర్తలు సఫలమయ్యారు. సంస్కృత నాటకాల్లో విదూషకుడి పాత్ర మాదిరిగానే, తెలుగు యక్షగానాల్లోని కొరవంజి పాత్ర నాటకాన్ని మొత్తం తన భుజంపై వేసుకొని నడిపిస్తుంది. ఒకరకంగా ఎరుకలసానిని ఈ కొరవంజి పాత్ర పోలి ఉంటుంది.
అయితే పలువురు పరిశోధకులు ఇప్పటికీ యక్షగానాలు, వీధినాటకాలు అనేవి అసలు నాటక సంప్రదాయానికి చెందినవే కాదని వాదిస్తుంటారు. కాకపోతే ఒకప్పుడు పల్లె కవులకు మాత్రమే దగ్గరైన యక్షగానాలను ఆ తర్వాత అనేక పద్య కవులు కూడా రాసారు. కోటల్లో ప్రదర్శించారు. 1624 సంవత్సర ప్రాంతంలో కోకుల పాటి కూర్మనాథ కవి మృత్యుంజయ విలాసమనే యక్షగానాన్ని వ్రాశాడు. అది అతి ప్రౌఢంగా వుందని విమర్శలు వచ్చాయి.
ఆ తర్వాత చెంచు నాటకాలు కూడా పల్లె ప్రాంత ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. చాలా నాటక సమాజాలు కూడా పుట్టాయి. తాయికొండ కళాకారులు, కూచిపూడి భాగవతులు బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు.
ఆ తర్వాత తెలుగు నాటకానికి పునర్వైభవం 18, 19 శతాబ్దాలలోనే వచ్చిందని చెప్పుకోవాలి. కోరాడ రామచంద్రశాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు, పరవస్తు వెంకట రంగాచార్యులు, వావిలాల వాసుదేవశాస్త్రి మొదలైన వారు ఆధునిక తెలుగు నాటక రచనా ప్రారంభ విషయాన ప్రథములు.
కందుకూరి వీరేశలింగం, కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, నాదెళ్ళ పురుషోత్తమ కవి, ఆధునిక తెలుగు నాటక ప్రదర్శనారంభ విషయంలో ప్రథములు. వడ్డాది సుబ్బరాయుడు లాంటి గొప్ప వ్యక్తులు పద్య నాటకానికి సైతం ప్రాణం పోశారు. 1887లో ప్రకటితమైన గురజాడ అప్పారావుగారి "కన్యాశుల్కం" వ్యావహారిక భాషలో రచించబడ్డ అత్యుత్తమైన నాటకం.కాగా 1894 ప్రాంతాల నుంచి వివిధ నాటక రచనలు చేసినవారు కోలాచలం శ్రీనివాసరావుగారు. వీరు అధికంగా చారిత్రక నాటకాలు రచించడం చేత "చారిత్రక నాటక పితామహుడు"గా పేరొందారు
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
నీపంచంబడియుండగాఁగలిగినన్
శు భో ద యం 🙏
"నీపంచంబడియుండగాఁగలిగినన్ భిక్షాన్నమేచాలు, ని/క్షేపంబబ్బిన రాజకీటముల నే సేవింపఁగా నోప,నా/
శాపాశంబులఁ జుట్టిత్రిప్పకుము సంసారార్ధమై, బంటుగా/
జేపట్టందగుఁబట్టి మానదగదో శ్రీకాళహస్తీశ్వరా!
కాళహస్తీశ్వర శతకం.
ధూర్జటి మహాకవి.
భావము:స్వామీ! నన్ను నీపంచన పడియుండనిమ్ము,భిక్షాన్నమబ్బినను అగియేనాకు చాలును.
నిధి నిక్షేపములొసంగినను రాచపురుగులను సేవింపను.ఆశాపాశముతో నన్నుబంధించి నన్ీసంసారముకొఱకై త్రిప్పవలదు.నీసేవకునిగా గైకొనుము నన్నెచ్టిపరిస్థితులలోను దూరముగావింపకు.
విశేషములు:
పంచ అనునది పల్లెలలో వసారాగా చెప్పబడు చిన్నఅరుగు.
శినసన్నిలోనున్నపంచయైనచాలునట.భిక్షాన్నమైనను అభ్యంతరములేదట.(శివుడునిత్యభైక్షికుడు అతనికడదొరుకునది భిక్షాన్నమేకదా! "లోకంలోవాడుక మీయిట్లో పచ్చడి మెతుకులైనా నాకుపరమాన్నమే"-ననివాడుక,అట్లే యిదియు.
నిధినిక్షేపములనిచ్చిననురాజకీటములసేవింపనొల్లడట! ఇటప్రభువులు కవికి కీటక సమానులుగా దోచుచున్నారు.బహుశఃఇది రాయలయనంతరపు మాటయైయుండవచ్చును
సంసారభారమునుజూపి ఆశాపాశములతో ననుబంధించి పరిభ్రమింపజేయకుము.నీబంటుగా సేకొన్నచాలును చేపట్టి యెన్నటికి విడువబోకుము.నాకంతకుమించి వలదనుచున్నాడు.
లోకమున నాశనుజయించినవాడు.లేడు.నిజముగా నదిపాశమువంటిదే"ఆశాపాశముదాగడున్నిడుపు లేదంతంబు రాజేంద్ర!" యన్నవామనోక్తులు సర్వధాస్మరణీయములు.ఆశను జయించినవాడే ఆధ్యాత్మిక సింహాసనమున నధివశిచుటకు యోగ్యుడు.ఆయోగ్యనుప్రసాధింప గోరుట ధూర్జటి యాధ్యాత్మిక జ్ఙానపరిపక్వతకు నిదర్శనము.
స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷💐💐🌷🌷🌷💐🌷💐💐💐💐🌷🌷💐💐🌷🌷💐🌷🌷🌷🌷🌷
ఈశ్వరునే శరణంబు వేడెదన్!
శు భో ద యం 🙏 ఈశ్వరునే శరణంబు వేడెదన్!
ఎవ్వనిచేజనించు జగమెవ్వనిలోపలనుండు లీనమై
ఎవ్వనియందుడిందు పరమేశ్వరుడెవ్వడుమూలకారణం
బెవ్వ డనాదిమధ్యలయుడెవ్వడు సర్వముతానయైనవా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్;
- గజేం-మో-బమ్మెఱపోతన. 🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
శఠగోపం యొక్క ప్రాముఖ్యత.
*శఠగోపం యొక్క ప్రాముఖ్యత.
గోపం లేక శడగోప్యం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. శఠగోపంను వెండి , రాగి, కంచుతో తయారు చేస్తారు. శఠగోపం వలయాకారంలో ఎందుకుండాలి, నేరుగా పాదాలనే తలపై పెట్టోచ్చు కదా అంటే దానికీ ఒక లెక్క ఉందంటున్నాయి మన శాస్త్రాలు, ఎందుకంటే నేరుగా పదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారుచేసి పైన పాదుకలు ఉంచడం జరిగిందంట.దాని మీద దేవుని పాదాలుంటాయి. అంటే మనము కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట. పూజారికి కూడా వినిపించకుండా మన కోర్కెలను భగవంతునికి విన్నవించుకోవాలి. అంటే మన కోరికే శడగోప్యము. అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది.
దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, షడగోప్యం తప్పక తీసుకోవాలి. చాలమంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చినపనైపోయిందని చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి, షడగోప్యం పెట్టించుకుంటారు. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలూస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.
సహజంగా చిల్లర లేకపోవటం వల్ల, షడగోప్యమును ఒక్కోసారి వదిలేస్తుంటాము. ప్రక్కగా వచ్చేస్తాము. అలా చెయ్యొద్దు. పూజారి చేత శడగోప్యము పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి. శడగోప్యమును రాగి, కంచు, వెండిలతో తయారు చేయటం వలన శడగోప్యమును తలమీద ఉంచినపుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బైటికెళుతుంది. తద్వార శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. శడగోప్యమును శఠగోపనం అని కూడా అంటారు.శాస్త్రపరంగా చూస్తే శఠగోపం పంచలోహాలతో కాని, ఇత్తడి, వెండి, రాగి, బంగారం, కంచులతో విడివిడిగా గాని తయారు చేస్తారు. వీటన్నిటికీ వేడిని సంగ్రహించే శక్తి ఉంది. అందుకే తలమీద పెట్టగానే తలలో వేడిని ఇది సులువుగా లాగేస్తుంది.
🌸🌸🌸🌸
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5125*
*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం - ద్వితీయ - పూర్వాభాద్ర - స్థిర వాసరే* (01.03.2025)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
*"ద" కార త్రయము
*"ద" కార త్రయము*
సభ్యులకు నమస్కారములు.
మానవులు ఎల్లప్పుడూ *"ద"* కార త్రయమును దృష్టిలో పెట్టుకొని జీవించాలంటారు పెద్దలు.
మొదటి *ద* దేహ భక్తిని సూచిస్తుంది. రెండవ *ద* దైవ భక్తికి సంకేతము. మూడవ *ద* దేశ భక్తికి ప్రతీక.
మొదటిది *దేహ భక్తి*. శరీరారోగ్యము పట్ల నిరంతర శ్రద్ధ వహించడము. ఏ ధర్మ కార్యము నిర్వహించాలన్నా, మొదట శరీరము స్వస్తతగా ఉండాలి. ఆరోగ్యవంతమైన శరీరములో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది. జపానికైనా, తపానికైనా, ప్రాణాయామము, యోగ వ్యాయామము, వ్రతం, ఉద్యోగం ఏది చేయాలన్నా ముందు దేహం ఆరోగ్యంగా, పరిశుద్ధంగా కూడా ఉండాలి.
*శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం* మహాకవి కాళిదాసు ఉవాచ. చతుర్విధ పురుషార్ధాలలో మొదటిది *ధర్మం*. ఆ ధర్మాన్ని ఆచరించడానికి ఈ శరీరమే సాధనము.
రెండవ *"ద'* దైవ భక్తికి నిదర్శనము. శ్రవణము కన్న బోధన గొప్పది. భోధన కన్న సాధన గొప్పది. ఆ సాధనకు కావల్సింది నిశ్చలమైన, నిర్మలమైన మనస్సు. *సర్వం భగవత్ స్వరూపమే* అన్న విశ్వాసాన్ని కల్గి ఉండడమే భక్తి యొక్క ప్రథమ లక్షణము. భక్తి అంటే పువ్వులతో పూజ చేసి ప్రసాదములు పంచుకోవడమే గాక భగవంతుని ఉనికిని అనుభవ సిద్దము చేసుకుని, సర్వాంతర్యామిని ఎన్నడూ, ఎప్పుడు మరువక, ఎల్లప్పుడూ పరమాత్మకు సాధనా మాత్రులమై, అతని ఆజ్ఞానుసారము నడుచుకోవడము. ఆలా చేయడము వలన భగవంతుని గూర్చిన విస్మృతి కలుగదు. మనకు భగవంతుని అండ, భగవత్ పక్షమునకు చెందినవారమనే మనోధైర్యం మనను ముందుకు నడిపిస్తుంది. *భగవంతుని నిదించే వారిపట్ల ఉపేక్ష కూడదు*.
మూడవ *"ద"* దేశ భక్తికి ఆనవాలు. విజ్ఞులైన సభ్యులకు దేశ భక్తి గురించి అతిగా చెప్పడము దుస్సాహసమే అవుతుంది .
దేశ, కాల, సామాజిక, సాంస్కృతిక అంశాలను నిరంతరము గమనిస్తూ, అప్రమత్తంగా ఉండడమే దేశ భక్తిగా పరిగణిద్దాము.
సూక్ష్మంగా చెప్పుకోవాలంటే, మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే పరాయి పీడన తొలగించుటకు, మన పూర్వీకులు చేసిన గొప్ప త్యాగాలే కారణము. ధన, మాన, ప్రాణ హానిని గూడా లెక్క చేయక వారు చేసిన పోరాట ఫలితమే *ఈ స్వాతంత్ర దినము సుదినము* మరియు స్వేచ్ఛాయుత జీవనమునకు నాంది.
*శ్లో! దేశ రక్షా సమం పుణ్యం, దేశ రక్షా సమం వ్రతం, దేశ రక్షా సమం యోగో దృష్ట్యా నైవచ నైవచ*. ప్రత్యేకంగా అర్థం విశదీకరించి చెప్పాల్సిన అవసరం లేని సులువైన శ్లోకం. *దేశ రక్షణకు మించిన ధర్మం, వ్రతం ఏవి లేవు*.
*స్వాతంత్రమనే ఈ సుదినమును మన భవిష్యత్ తరాలకు అందించాలంటే, మళ్ళీ జాతికి హాని కలిగే సూచనలు చూచాయగా కనిపిస్తున్నప్పుడే* ప్రజలందరూ
(మనము గూడా) అప్రమత్తులై, ముందు చూపుతో తగిన జాగ్రత్తలు తీసుకోవడము ప్రథమ కర్తవ్యము.
*ఎప్పుడో, ఎక్కడో జరుగుచున్న దురాక్రమణ, దుష్టుల దౌర్జన్యము మనకెందుకులే అన్న ఉదాసీన భావన విపరీత పరిణామాలకు దారి తీస్తుంది*.
దేశ క్షేమము, జాతి క్షేమము గురించి బహిరంగంగా మాట్లాడుకోవాలన్నా, చర్చించు కోవాలన్నా బిడియపడే, భయపడే *లౌకిక* మనస్తత్వము *దేశ భక్తి లక్షణాలకు విరుద్ధము*.
"జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" సాధారణంగా ఈ వాక్యమును మాత్రమే వాడుతూ ఉంటాము. పూర్తి శ్లోకము
*అపి స్వర్ణమయీ లంకా, నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి*. ప్రత్యేకంగా వివరణ అవసరము లేని శ్లోకము.
*స్వర్గము కంటే గొప్పదైన మన మాతృ దేశము గురించిన ఉపద్రవ నివారణ చర్యలు విడనాడక పోవడమే నిజమైన దేశ భక్తికి సంకేతము*.
అవుతే హిందూ పద నిర్వచనము ఒక సారి పరిశీలిద్దాము *హింసాం దూషయతి ఖండ యతి ఇతి హిందుః* అర్థము:- ఎక్కడైతే హింస, పాపము ఉన్నాయో, అట్టి చర్యలను ఖండించే వాడే హిందువు. కాబట్టి హింస మరియు పాపపు పనులకు తలపడే వారిని అడ్డగిద్దాము. దేశరక్షణ, దేశోద్ధారణ బాధ్యతలను అత్యుత్సాహముతో స్వీకరిద్దాము. అంతే గాక అన్నివర్గాల సాధు జనులకు రక్షణ కల్పించుట గూడా మానవ ధర్మమే. మహా కవి గురజాడ అప్పారావు గారి గేయములోని ప్రారంభ చరణాలు.. *దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుష్యులోయ్*.ఆలాగే బంకించంద్ర ఛటర్జీ విరచిత సంస్కృత గీతము..
*వందే మాతరమును*,
మనము ఎల్లప్పుడూ మననము చేసుకుందాము. గురు దేవులు రవీంద్ర నాథ్ టాగూరు మనకందించిన *జనగణమన* జాతీయ వాదులందరికి శ్వాస లాంటిది.
ఏతా వాతా నేను సభ్యులకు విన్నవించాలనుకుంటున్న విషయము.. *దేశ భక్తి ఒక భిన్న అంశము కాదు. మన దైనందిన జీవితములో ఒక ప్రధాన అంశము. దేశ కాల పరిస్థితులు బాగుంటేనే దేశ ప్రజలు (మనము వేరు కాదు) గూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు*.
ధన్యవాదములు.
తెలుపన్ శక్యమె మాతృభాషల
మ॥
తెలుపన్ శక్యమె మాతృభాషల మహాదీపప్రభావమ్ములన్
తొలుతన్ మాతృకుచామృతమ్ముఁ గుడువన్ తోడౌను జన్మమ్మునన్
మలి యుచ్చారణ విద్యనేర్చుకడ సమ్మానించు నుద్యోగమున్
కలలం భావనలన్ మిత్రుని వలెన్ కౌశల్యముం గాచెడిన్
*~శ్రీశర్మద*
శనివారం🍁* *🌹01, మార్చి, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🍁శనివారం🍁*
*🌹01, మార్చి, 2025🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిరఋతౌః*
*ఫాల్గుణ మాసం - శుక్లపక్షం*
*తిథి : విదియ* రా 12.09 వరకు ఉపరి *తదియ*
*వారం : శనివారం* ( స్ధిరవాసరే )
*నక్షత్రం : పూర్వాభాద్ర* ఉ 11.22 వరకు ఉపరి *ఉత్తరాభాద్ర*
*యోగం : సాధ్య* సా 04.25 వరకు ఉపరి *శుభ*
*కరణం : బాలువ* మ 01.43 *కౌలువ* రా 12.09 ఉపరి *తైతుల*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 11.00 - 01.00 సా 05.00 - 06.00*
అమృత కాలం: *రేపు (02) తె 04.40 - 06.06*
అభిజిత్ కాలం : *ప 11.56 - 12.43*
*వర్జ్యం : రా 08.01 - 09.27*
*దుర్ముహూర్తం : ఉ 06.25 - 08.00*
*రాహు కాలం : ఉ 09.23 - 10.51*
గుళికకాళం : *ఉ 06.25 - 07.54*
యమగండం : *మ 01.48 - 03.17*
సూర్యరాశి : *కుంభం*
చంద్రరాశి : *మీనం*
సూర్యోదయం :*ఉ 06.25*
సూర్యాస్తమయం :*సా 06.14*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 06.25 - 08.47*
సంగవ కాలం : *08.47 - 11.09*
మధ్యాహ్న కాలం : *11.09 - 01.31*
అపరాహ్న కాలం : *మ 01.31 - 03.53*
*ఆబ్ధికం తిధి : ఫాల్గుణ శుద్ధ విదియ*
సాయంకాలం : *సా 03.53 - 06.14*
ప్రదోష కాలం : *సా 06.14 - 08.40*
రాత్రి కాలం : *రా 08.40 - 11.55*
నిశీధి కాలం :*రా 11.55 - 12.44*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.47 - 05.36*
________________________________
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🙏శ్రీ వేంకటేశ్వరస్వామి🙏*
*🔯ద్వాదశనామ స్తోత్రం🔯*
*ఇందిరాపతిగోవిందః చంద్రసూర్యప్రభాకరః |*
*విశ్వాత్మా విశ్వలోకేశో జయ శ్రీవేంకటేశ్వరః*
*🙏ఓం నమో వెంకటేశాయ🙏*
******************************
*🚩||జై శ్రీ రామ్ - జై హనుమాన్!!🚩*
*యశోజయంచ మే దేహి శత్రూన్ నాశయ నాశయ*
*స్వాశ్రితానామ భయదం య ఏవం స్తౌతి మారుతిం*
*హానిమేతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్.!!*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹