15, అక్టోబర్ 2020, గురువారం

తల్లిపాలలో కలుగు దోషాలు -

 తల్లిపాలలో కలుగు దోషాలు - శిశువుకు కలుగు ఉపద్రవాలు - 3 . 


   అంతకు ముందు పోస్టు నందు వాత , పిత్త , కఫ దోషాల వలన తల్లిపాలలో కలుగు దోషాల గురించి కొంత వివరించాను. ఇప్పుడు అలా దోషం పొందిన పాలు తాగడం వలన శిశువు కు కలుగు ఉపద్రవాల గురించి సంపూర్ణముగా వివరిస్తాను . 



 * వాతదోషం పొందిన పాలు తాగుట వలన శిశువుకు కలుగు దుష్ప్రభావాలు - 


    తల్లి యందు వాతం పెరుగుట వలన స్తన్యం యొక్క రుచి చెడిపోవును . ఇలా దోషమును పొందిన స్తన్యమును సేవించిన బాలుడు కృశించును. శిశువు వృద్ది చెందుటకు చాలాకాలం పట్టును . వాతప్రభావం వలన స్తన్యము నురుగుతో కూడుకుని ఉండును. స్తన్యము కష్టము మీద బయటకి వచ్చును. ఇట్టి స్తన్యము సేవించిన శిశువుకు కృశించిన స్వరము , మలమూత్ర బంధనం జరిగి వాతదోషము వలన శిరోరోగము , పీనసరోగము ( పీనస రోగము అనగా ముక్కు వెంట నీరు కారుతూ ఉండును ) సంభంవించును . 



 * పిత్త దోషం పొందిన పాలు తాగుట వలన శిశువుకు కలుగు ఉపద్రవాలు - 


       తల్లి యందు పిత్తము పెరుగుట వలన స్తన్యము పచ్చగా లేదా నలుపు రంగుతో వచ్చును. ఇట్టి స్తన్యమును తాగిన శిశువుకు శరీరవర్ణం మారును . చెమటయు , మలస్రావము ఎల్లప్పుడూ వేడిగా ఉండును. శరీరము ఎల్లప్పుడూ వేడిగా ఉండును . స్తన్యము నందు ఇష్టము లేకపోవుట జరుగును . పిత్తదోషము పొందిన స్తన్యమును సేవించు శిశువుకు పాండురోగము , కామెర్ల వ్యాధి సంభంవించును . 


 * కఫ దోషం పొందిన పాలు తాగుట వలన శిశువుకు కలుగు ఉపద్రవాలు - 


       తల్లి యందు కఫము పెరుగుట వలన స్తన్యము జిడ్డుగా , జిగటగా ఉండును. ఇట్టి స్తన్యము సేవించిన శిశువుకు వాంతి , బాధ , నోటి నుండి చొల్లు కారుట , ఆయాసము , దగ్గు , నోటి నుంచి అతిగా నీరు వూరుట , నేత్రములు వాచుట , మందముగా ఉండటం వంటి సమస్యలు కలుగును. 



       తరవాతి పోస్టు నందు దోషము పొందిన స్తన్యమును శుద్ది చేయు చికిత్సలు మరియు తీసుకోవలసిన ఆహారం గురించి వివరిస్తాను . 


    గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

హైదరాబాద్


 

రామ రామ శ్రీ రామ


 

పరిణయం వెనుక.

 *పాంచాలీ పరిణయం వెనుక..*


ధరించేది ధర్మం అన్నారు. ధర్మాన్ని రక్షిస్తేచాలు ధర్మమే మనలను రక్షిస్తుంది. స్వధర్మాన్ని ఆచరిస్తూ అందులో ప్రాణాలు కోల్పోయినా ఫర్వాలేదు కాని పరధర్మాన్ని ఆశ్రయించరాదని శ్రీకృష్ణ్భగవానుడు అన్నారు. రూపుకట్టిన ధర్మమే రాముడన్నారు. ధర్మాన్ని ఆచరించనివారు నరకలోక ప్రయాణికులేకాని మరే దారి వారికి లేదన్నారు. ఇలా ధర్మాన్ని గురించి ఎందరో ఎన్నో చెప్పారు. ధర్మం అంటే అంతా తెలిసినట్టే ఉంటుంది. కాని ఆచరించటానికి పోతే ఏన్నో సందేహాలు కలుగుతుంటాయి. ధర్మం తెలిసిన వారు ధర్మం చాలా సూక్ష్మమైనది. ధర్మసూక్ష్మం తెలుసుకొన్నవారు జ్ఞానస్వరూపులే. వారు భగవంతునికి అనురూపులే అంటారు. అలాంటి ధర్మాన్ని గురించి సామాన్యులు కూడా తెలుసుకోవటానికి మహాభారత గ్రంథం ఉపయుక్తమైంది. వేదవ్యాసమహర్షి ఏ సమయంలో ఏవిధమైన ధర్మాన్ని ఆచరించాలో ధర్మం ఆచరిస్తే కలిగే ప్రయోజనమేమిటో ఉపాఖ్యానాలతో చిన్న చిన్న కథలతో మనసుకు హత్తుకునే విధంగా మహాభారతంలో చెప్పారు. కాని మహాభారతం ఉద్గ్రంథం. ఈ పరిగెత్తి పాలుతాగే ఈ కంప్యూటర్‌యుగంలో మహాభారత గ్రంథాన్ని చదివే ఓపికగాని, ఆసక్తిగాని లేకుండానే తరాలు ముందుకు సాగుతూ కొత్త తరాలకు వాకిళ్లు తెరుస్తున్నాయి.


 దానివల్లే నేడు మానవుల్లో అభద్రతాభావం, అనిశ్చిత, అయోమయం బంధువుల మధ్య స్నేహితుల మధ్య చివరకు తల్లితండ్రులు, అక్కచెళ్లెళ్లు, అన్నదమ్ముల మధ్యా కూడా సఖ్యత కరువు అవుతోంది. అటువంటి వారు కనీసం భారతం అంతా చదవకపోయినా కొన్ని కొన్ని ఘట్టాలు కొన్ని ధర్మసూక్ష్మాలు తెలుసుకొంటే వారి జీవనపథంలో వికాసం కలుగుతుందని అనిపిస్తుంది. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది కొండంత ఉంది అనిపించే మన వాఙ్మయసంపదలో భాగమైన మహాభారతంలో వేదవ్యాసుడు చెప్పిన ధర్మసూక్ష్మాన్ని నాకు తెలిసినంత వివరిస్తున్నాను. ఎందుకంటే మన గురించి మనం తెలుసుకోకుండానే ఇతరులు ముఖ్యంగా విదేశీయులుకాని, పరమతం వారు ఆ ఏముంది? మీ సంస్కృతీ సంప్రదాయాలు చెట్టుపుట్టను మొక్కుతారు కాని మా మతంలో ఇది చాలా ప్రముఖమైంది అనగానే దాన్ని వెంట పోయేవారు ఎక్కువ అవుతున్నారు. అసలు మనది సనాతన ధర్మం. మనకు ఉన్న రామాయణాది కావ్యాలు మహాభారతం లాంటి ఇతిహాసాలు పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు ఇలా ఎన్నో మన ధర్మాన్ని కాదు కాదు అసలు మానవులంతా ఆచరించదగ్గ ధర్మాన్ని ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఉద్ఘోషించి ఉన్నారు. అలా ఋషులు దర్శించి చెప్పిన వాటిని మనం మరొక్కసారి స్మరించుకుంటే నేటి తరమూ ధర్మానికి మారుపేరుగా మారుతారని ఈ ప్రయత్నం. మహాభారతంలో ఒక స్ర్తికి ఐదుగురు భర్తలా అంటూ హేళన చేసే వర్గమూ మనలో ఉంది. అటువంటి వారికి అసలు ఐదుగురు భర్తలు కలిగి ఉండడంలో ఔచిత్యమూ, ధర్మము ఇలా వివరిస్తోంది మహాభారతం.

అది పాంచాల రాజైన ద్రుపదుని రాజ్యసభ. అక్కడ కొద్ది సేపట్లో ద్రుపదుని కుమార్తె రాజకుమారి ద్రౌపదీ స్వయంవరం జరుగనున్నది. అక్కడికి దేశ దేశాల నుండి అనేక రాజులు, రాజకుమారులు వచ్చారు. దుర్యోధనుడు, అతని తమ్ములు, కర్ణుడు, జయద్రధుడు, శల్వశకునులాంటి వారే కాకుండా కృష్ణబలరాములు కూడా ఉన్నారు.


రాజకుమార్తె సర్వాలంకార భూషితయైన ద్రౌపది తన అన్న దృష్ట్ధ్యుమ్నునితో సభకు విచ్చేసింది. అందరి చూపులూ అద్వితీయ సౌందర్యవతియైన ద్రౌపది మీదే నిలిచాయి. అప్పుడే బ్రాహ్మణ రూపంలో ఉన్న పాండవులు కూడ సభకు వచ్చారు ఆ స్వయవరంలో బ్రాహ్మణ వేషధారులై వచ్చిన పాండవులలో పాండవ మధ్యముడు చివరకు మత్స్యయంత్ర భేదనం చేసి ద్రౌపది చేతిలోని వరమాలను పొందగలిగాడు. శ్రీకృష్ణుని ఆదేశంతో ద్రుపదరాజ పరివార ఆదరంతో పాండవులు ద్రౌపదీతో కూడ తమ తల్లి అయిన కుంతీదేవి దగ్గరకు బయలుదేరారు. అర్జునుడు భీముడితో ‘‘అన్నయ్యా మనం సరదాగా, నీకు మంచి భిక్ష తీసుకుని వచ్చాము తల్లీ’ అని ద్రౌపదిని ముందు నిలబెడితే ఎలా ఉంటుంది?’’ అని అడిగాడు. ‘‘రాజకుమార్తెను భిక్ష అని చెపుతావా, వద్దు’’ అని మందలించాడు భీముడు. ‘‘పరిహాసానికి అలా అనటంలో నష్టమేముందన్నయ్యా! ఏమంటావు పాంచాలీ? అని అడిగాడు. ‘‘మీ ఇష్టప్రకారమే కానివ్వండి’’ అన్నది ద్రౌపది. ఇంటి ద్వారం వద్ద ముగ్గురూ నిలబడి, ‘‘నీకోసం ఈ మంచి భిక్ష తెచ్చామమ్మా’’ అని ముక్తకంఠంతో అన్నారు భీమార్జునులు. పనిలో నిమగ్నమై ఉన్న కుంతి ద్వారం వంక తిరిగి చూడకుండానే ‘‘మీ ఐదుగురన్నదమ్ములు సమంగా పంచుకోండని’’ ఆదేశించింది. భీమార్జునులు ద్రౌపదీ సమేతంగా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. నోటమాట రాకుండా నిల్చుండిపోయారు. తిరిగి చూచిన కుంతికి ఎదురుగా ద్రౌపది దర్శనం!


అపుడు భీముడు స్వయంవరంలో అర్జునుడు ద్రౌపదిని గెలుచుకున్న వైనాన్ని వివరించాడు. వెంటనే ద్రౌపది వంగి కుంతికి పాదాభివందనం చేసింది. అఖండ సౌభాగ్యవతీభవ అని ఆశీర్వదించింది కుంతి. అప్పుడు అర్జునుడు తల్లీ మీరు ఈమెను మమ్మల్నందర్ని సమానంగా పంచుకోమని ఆదేశించారు... ఇపుడెలా?’’ అని అన్నాడు. ఇంతలో యుధిష్టురుడు నకుల సహదేవులతో సహా అక్కడికి వచ్చాడు. సమస్య తెలుసుకున్నాడు. తన వివరణ ఇలా చెప్పాడు.


‘‘తల్లీ స్ర్తి శక్తి స్వరూపిణి. స్ర్తిలేనిదే పురుషుడు అసంపూర్ణుడు. నారి తల్లీ రూపంలో గానీ, భార్యరూపంలో గానీ ఎల్లప్పుడు ఆదరణీయురాలు. భీమార్జునులు ద్రౌపదిని భిక్షగా ప్రకటించి నారిని అవమానించారు. ఇక తల్లి పరమ గురువు. తల్లి నోట్లోంచి ఎపుడూ అస్వీకరణీయమైన ఆదేశం రాదు.’’ మ్రాన్పడి చూస్తున్న భీమాదులతో ధర్మరాజు- అమ్మ చెప్తున్న ఆదేశంలో ఏదో ఒక రహస్యం అవశ్యం దాగి ఉండవచ్చు.


ఇలా ఎక్కడైనా జరిగిన సంఘటనలున్నాయా అని వెదికితే - గౌతమ కులకన్య ‘జటిల’ యొక్క వివాహం ఏడుగురు ఋషులతో జరిగుంది. అట్లే హిరణ్యాక్షుడి కుమార్తె ‘ప్రత్తిచ్ఛి’ యొక్క వివాహం పది మంది సోదరులతో అయింది. కనుక మనకు అమ్మ ఆదేశాన్ని పాటించటమే మార్గమంటున్న తరుణంలో శ్రీకృష్ణుడూ వచ్చాడు. పాండవులంతా విషయం వివరించారాయనకు. తమ సందేహాన్ని నివృత్తి చేయమని కోరారు. దీనికి జవాబు ద్రౌపదే ఇవ్వగలదు అన్నాడా కృష్ణుడు.


పూర్వజన్మలో ద్రౌపది శివుడి గురించి తపస్సు చేసి ఆయన ప్రత్యక్షం అయాక ఐదు వరాలడిగింది. తనకు ధర్మానికి ప్రతీకయైన మరియు సత్యానికి సంకేతాక్షరమైనవాడు హనుమంతుని వలె బలవంతుడు, పరశురాముడి వంటి ధనుర్ధనుడు, అందరికంటె అందగాడు, అందరికన్న సహనశీలియైన భర్తను ఇవ్వమని అడిగింది. మహాదేవుడు అన్ని శ్రేష్టమైన గుణాలు ఒక్కరిలో ఉండవని అంటున్నా, ఆమె తన పట్టు విడువలేదు. అందుకే ఆ మహాదేవుడే ఈ రోజు అత్తనోట్లోంచి ఇలా అందరూ పంచుకోండని పలికించాడు. ఆధునిక యుగంలో యుధిష్టురుడు ధర్మానికి చిహ్నము. ఇది ఆమె అడిగిన మొదటి వరం, భీముడు అందరికన్నా బలశాలి. ఇది ఆమె అడిగిన రెండవ వరం. అర్జునుడు సర్వశ్రేష్ట ధనుర్ధరుడు. ఇది ఆమె కోరిన మూడవ వరం. అందరిలోకి అందగాడు నకులుడు. ఇది ఆమె నాల్గో వరము. సహదేవుని మించిన సహనశీలి ఈ యుగంలో లేడు. ఇదామె ఐదవ వరం. ఇవన్నీ ఈ జన్మలో పరమేశ్వరుడు పంచపాండవుల రూపంలో ద్రౌపదికి ప్రసాదించాడు. ఇక ఈ వరాలను తిరస్కరించి ఆమె మహేశ్వరుణ్ణి అవమానించదలుచుకుంటే అది ఆమె ఇష్టం మీద ఆధారపడి ఉంది.

అనంతరం అర్జునుణ్ణి ఉద్దేశించి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ‘‘అర్జునా నీవు స్వయంవరం అవశ్యం గెలిచావు. కానీ అంతమాత్రం చేత జీవించి ఉన్న ద్రౌపది భిక్ష అయినట్లు కాదు కదా! నీవు పరమగురువైన నీ తల్లితో అసత్యం చెప్పావు’’ అని కుంతివైపు తిరిగి అత్తా ‘‘అమ్మ అయినందుకు అర్థం ఏదీ చూడకుండా, ఆలోచించకుండా, అర్థంచేసుకోకుండా ఆదేశించడం కాదుకదా! నీవు నీ మాతృత్వం యొక్క మర్యాదను ఉల్లంఘించావు. అందుకే ఇకనుంచి మీ జీవితం ఒక తపస్సే కాదు, ప్రాయశ్చిత్తం కూడా’’ అని పాండవులకు కుంతికి బోధించాడు శ్రీకృష్ణుడు.

శరన్నవరాత్రులు

 శరన్నవరాత్రులు - పూజా విధానం


రాబోయే 17 వ తేదీ నుండి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి కదా!


కాస్త అందరి అవగాహన కోసం, పూజలు కొత్తగా మొదలు పెట్టాలి అనుకొనే వారికోసం, తెలిసిన వారికి మరోసారి పరిశీలించు కోవడం కోసం.


శ్లోకాలు మాత్రం గోరఖ్ పూర్ పుస్తకాల నుండి చదువు కోవడం మంచిది. ఒక అవగాహన కోసం మాత్రమే ఇస్తున్నాను. ఇందులో అక్షర దోషాలు ఉన్నాయి. కావున *ఈ ఆర్టికల్ లో పొందు పరిచినవి మాత్రం పూజ లో చదవవద్దు.* 


ముందుగా పసుపు గణపతిని పూజించి నిర్విఘ్నంగా మీ నవరాత్రి పూజ జరగాలి అని కోరుకోవాలి . 


కలశాన్ని మీకు అలవాటు ఉంటే పెట్టండి లేకపోతే ఉద్దరిణిలో పువ్వు వేసి దానిపై చెయ్యి పెట్టి కలశంగా భావించి మంత్రం చదివి ఆ నీటిని పూజ ద్రవ్యాల పైన చల్లి సంకల్పమ్ చెప్పుకుని,


ఆచమనం చేసి, 


ఏ రోజు ఏ దేవత రూపాన్ని పూజించాలి, ఆ దేవతకు సంబంధించిన అష్టోత్తరం, స్త్రోత్రం తో, అర్చన చేసి, నివేదన చేసి, హారతి ఇవ్వాలి. 


కలశం, సంకల్పమ్, ఆచమనం అన్ని వ్రత పుస్తకాలులో లభిస్తుంది. గమనించండి.


శరదృతువులో వస్తుంది కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు. 


ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. 


ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. 


అందుకే ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరు తో ప్రజలంతా శుచి గా, శుభ్రం గా ఉండి, ఎలాంటి రోగాలు దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. 


మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.


నవదుర్గలు గా పూజించే వారు ఆ రూపంలో, ఆ రోజుల్లో వివిధ రూపాల్లో పూజించే వారికి ఆ రూపంలో వివరాలు ఉన్నాయి చూడండి. 


ప్రతి రోజూ లలితా సాహస్త్ర నామం పారాయణ చేయాలి.


కుంకుమతో అర్చన చేయడం ఇంకా మంచిది.


ప్రధమం శైలపుత్రిణి, 

ద్వితీయం బ్రహ్మచారిణి

తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధకమ్||

పంచమం స్కంధమాతేతి 

షష్ఠం కాత్యాయనీతిచ

సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం

నవమం సిద్ధితి ప్రోక్త, 

నవదుర్గ ప్రకీర్తిత||


1. శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి): 


దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే మొదటి అవతారం శైలపుత్రి. 


దక్షుని ప్రథమ పుత్రిక. 


శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. 


పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. 


ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మించింది. 


ఆమె వాహనం ఎద్దు. 


ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి.


ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.


శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||


బాలా త్రిపుర సుందరి దేవి గా గృహంలో పూజించేవారు 

తల్లి స్త్రోత్రం , అష్టోత్తరం తో అర్చన చేయాలి. లలితా సహస్త్ర నామం చదివి నివేదించి హారతి ఇవ్వాలి 


2. బ్రహ్మచారిణి ( గాయత్రి ): 


రెండవ రూపం అయిన గాయత్రి గా పూజించేవారు శతగాయత్రీ జపించాలి,


గాయత్రి ఉపదేశం లేనివారు అష్టోత్తరం, లలితా సహస్త్ర నామంతో పూజ పూర్తిచేయాలి.  


దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. 


పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. 


ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. 


పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. 


ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. 


ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి.


శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||


పాయసం నివేదించాలి


3. చంద్రఘంట ( అన్నపూర్ణ):  


అన్నపూర్ణగా ఆరాధించే వారు అష్టోత్రం, లలితా సహస్త్ర నామంతో అర్చించాలి.


అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట. 


ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. 


శిరస్సు పై ధరించిన అర్థచంద్రుడు అర్ధాకృతలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. 


ఈ తల్లిని శరణు జొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.


శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||


పులిహోర, పెసరపప్పు పాయసం నివేదించాలి


4. కూష్మాండ ( కామాక్షి స్త్రోత్రం): 


అమ్మవారి నాలుగవ అవతారం కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ.


ఈమె తేజోమయి. 


ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.


శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ| దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||


కూరగాయలు వేసి చేసిన కాదంబం నైవేద్యం పెట్టాలి


5. స్కందమాత (లలిత అష్టోత్తర, సహస్త్ర నామంతో): 


అయిదో అవతారం స్కందమాత. 


స్కంధుడు అనగా కుమారస్వామి. 


స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. 


ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేతపద్మంతో శోభిల్లుతుంది. 


తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందునటానికి సంకేతమే ఇది.


శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||


గోధుమ రవ్వతో చేసిన కేసరి, మిర్యాల పొంగలి నివేదించాలి


6. కాత్యాయని (లక్ష్మి అష్టోత్తరం, సహస్త్ర నామం): 


దుర్గామాత ఆరో అవతారం కాత్యాయని. 


‘కొత్స’ అనే రుషి తనకు పార్వతీమాత కుమర్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. 


అతనికి కూతురుగా జన్మించింది. 


కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. 


మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. 


మొట్టమొదట ఈ కాత్యాయనిని, మహర్షి ని పూజిస్తారు. 


ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమి నాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.


శ్లో||చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||


బెల్లం అన్నం, అన్నం ముద్దపప్పు, నైవేద్యం


7. కాళరాత్రి ( సరస్వతి స్త్రోత్రం ,లలితా సహస్త్ర నామం ): 


దుర్గామాత ఏడో అవతారం కాళరాత్రి. 


ఈమె శరీరం ఛాయ చీకటివలె నల్లగా ఉంటుంది. 


ఇందుకే ఈదేవికి కాళరాత్రి అని పేరు. 


ఈమె వాహనం గాడిద. 


ఈ తల్లి ఎప్పుడూ శుభఫలితాలను ఇస్తుంది.


అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.


శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |

వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||


దద్దోజనం, చక్కెర పొంగలి నైవేద్యం


8. మహాగౌరి ( దుర్గ అష్టోత్రం, విజయ దుర్గా స్త్రోత్రం, లలితా సహస్త్ర నామం) : 


అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. 


ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. 


దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. 


ఆమె తపస్సుకు మెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. 


దాని వలన ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. 


అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.


శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||


గారెలు, పులిహోర నైవేద్యం


9. సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని స్త్రోత్రం, లలితా సహస్త్ర నామం ) ( రాజ రాజేశ్వరి స్త్రోత్రం ):


దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. 


ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాదిస్తుంది. 


పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.


శ్లో| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి| 

సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||


కొబ్బరి అన్నం, నిమ్మకాయ పులిహోర. 


విజయ దశమి నాడు యాధాశక్తి పూజ చేసి, ఆయుధపూజ, శమీవృక్షం పూజ, దానం, బ్రాహ్మణ సత్కారం ఎవరి శక్తి కొద్దీ వారు చేయాలి..


పైన చెప్పిన నైవేద్యాలే చేయాలని నియమంలేదు మీ శక్తి కొద్దీ మీకు ఉన్నది భక్తిగా సమర్పించండి.


శమీవృక్షం ప్రార్థన:


శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ,

అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.


శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా,

ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ.


కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,

తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.''


పైన చెప్పిన మంత్రార్థం ఏమిటో చూద్దాం.


శమీవృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. 


శత్రువులను నాశనం చేస్తుంది. 


ఇది నాడు అర్జునుని ధనువును కల్గి ఉండింది. 


శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది.


యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. 


పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది."


ఈ విధంగా శక్తి కొద్దీ అమ్మవారికి పూజ చేసుకోవాలి, 


శ్రీ మాత్రే నమః అని నిరంతరం జపించాలి.



సర్వే జనా సుఖినోభవంతు🙏🙏

నవరాత్రులలో శివుడు.

 నవరాత్రులలో శివుడు..తాండవం చేస్తాడట..!!💐💐💐


'రాత్రము అనే మాట 'రేపు' ను సూచిస్తుంది. ఉత్తరభారతంలో వాడే పదం. 

సాధారణంగా పగటిపూట పురుష దేవతలకు, 

రాత్రి పూట స్త్రీ దేవతలకు పూజలు జరుపుతారు. 

కానీ, నవరాత్రుల సమయంలో రెండు పూటలా జరిపే పూజలు పరాశక్తి అమ్మవారికే చెందుతాయి. 


నవరాత్రులలో పరమశివుడు తాండవనృత్యం చేస్తాడనే విషయం ,అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం. 

 అమావాస్య, పౌర్ణమి తిధులకు ముందు వచ్చే త్రయోదశి నాడు సాయం సమయంలో నాలుగు గంటల తర్వాత .ప్రదోషకాలంలో కైలాసనాధుడు లాస్యతాండవం చేస్తాడని పురాణాలు చెపుతాయి.


ప్రపంచమంతటికి జలప్రళయం సంభవించేప్పుడు శివుడు 'ప్రళయతాండవం ' చేస్తాడని , ఆ తాండవాన్ని జగదంబిక మాత్రమే వీక్షించగలదని పురాణాలు వివరిస్తున్నాయి. 

ఈ విషయాన్ని 'లలితా సహస్ర నామాలలో' ' మహాప్రళయ సాక్షిణి' అనే నామం స్పష్టం చేస్తోంది.


పరమశివుడు యీ నవరాత్రులలో నవ విధములైన తాండవ భంగిమలు ప్రదర్శించి కాలి వ్రేళ్ళతో అద్భుతమైన రంగవల్లులను తీర్చి దిద్దుతాడని, 

తన తాండవంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గను రంగవల్లుల ద్వారా రూపొందించి నవదుర్గలను వెలయింపజేస్తాడని , 

అలా వెలసిన నవ దుర్గలనే శరన్నవరాత్రులు లో మనం దర్శనం చేసుకుంటామని ప్రతీతి.


ఆ నవ దుర్గలే -

1. శైలపుత్రి : మొదటి రోజు అధిదేవత. 

శివుడు తన కుడికాలును నేలపై ఆన్చి ఎడమకాలును పైకెత్తి చేసే తాండవమే 'ఆనంద తాండవం'. 

ఈ భంగిమలో తీర్చిదిద్దిన రంగవల్లి  

'ఋషిమండల రంగవల్లీ ' 

దీని నుండే ' అక్షరములు జన్మించాయి.


2. కూష్మాండాదేవి : రెండవరోజు సాయంసంధ్యలో పరమేశ్వరుడు చేసే తాండవసమయంలో ఎడమకాలి వ్రేలితో దిద్దిన రంగవల్లి 'సప్తప్రకాశిని'. 

ఇందునుండే, కూష్మాండాదేవి ఉద్భవించింది.


3.బ్రహ్మచారిణి : మూడవ రోజు తాండవంలో ఎడమకాలు పెద్దవ్రేలితో తీర్చి దిద్దిన రంగవల్లి 'అష్టవసు రంగవల్లి. 

దీని నుండి 'బ్రహ్మచారిణి' ఆవిర్భవించింది.


4. చంద్రఘంటాదేవి : నాలగవరోజు తాండవం ఊర్ధ్వతాండవం. 

ఈ తాంతవంలో మహేశ్వరుడు ఒక కాలును నేలపై ఆన్చి తన మరియొక కాలును తన భుజములకు ఆన్చియుంచుతాడు. 

'తిరువేలంగాడు' క్షేత్రంలో శివుడు కాళికాదేవిని యీతాండవంతోనే ఓడించాడని స్థలపురాణాలు చెపుతాయి. 

శివుడు దిద్దిన 'ప్రణవనాద' రంగవల్లి నుండి 'చంద్రఘంటాదేవి' ఉద్భవించింది.


5. స్కందమాత :దేవ దానవులు అమృతం కోసం జరిపిన మధనంలో వచ్చిన కాలకూట విషాన్ని పరమశివుడు తన గొంతులో దాచుకొని 'నీలకంఠుడు' అయ్యాడు.

ఆ సందర్భంగా చేసిన తాండవమే 'భుజంగతాండవం' . అప్పుడు దిద్దిన రంగవల్లి నుండి 'స్కందమాత' ఆవిర్భవించింది.


6. 'కాత్యాయనీ దేవి' : శివభక్తుడైన పతంజలిముని మృదంగం వాయింప శివుడు తగిన విధంగా నాట్యం చేసి తన భక్తునికి ఆనందం కలిగించాడు. 

అందుకే యీ తాండవాన్ని 'మునితాండవం' అంటారు. శివుడు తన మూడవనేత్రం ద్వారా తీర్చిన రంగవల్లినుండే 'కాత్యాయనీ దేవి' ఉద్భ్యవించింది.


7. 'కాళరాత్రి' : గజ రూపంలో వచ్చిన దానవుని పరమశివుడు సంహారం చేసి ఆ గజ చర్మాన్ని ధరించి , కరములలో ఆయుధములు ధరించి చేసిన తాండవమే భూత తాండవం.

ఈ తాండవంలో దిద్దిన రంగవల్లి నుండి 'కాళరాత్రి' దేవి జన్మించింది.


8. "మహాగౌరీదేవి" : దండకారణ్యాలలోని మునులను అసురుల బారినుండి కాపాడిన సందర్భంగా మహేశుడు చేసిన తాండవం ' శుధ్ధ తాండవం' . 

అప్పుడు తీర్చిదిద్దిన రంగవల్లినుండి 'మహాగౌరీ' ఉద్భవించింది.


9. 'సిధ్ధిధాత్రీదేవి' : నవరాత్రులలో ఆఖరి రోజున సిధ్ధిధాత్రీదేవి ఆరాధన. 

నవరసములతో అత్యంత మనోహరంగా శివుడు చేసిన శృంగార తాండవం. 

ఈ నవరస తాండవ రంగవల్లినుండి 'సిధ్ధిధాత్రీదేవి' ఆవిర్భవించింది. 

ఈ నవరాత్రి ఆరాధన గురించి పరశురాముడు శ్రీరామునికి వివరించగా శ్రీరాముడు యీ నవరాత్రి మహోత్సవాలను భక్తితో జరిపి పరమేశ్వరుని అనుగ్రహం పొందినట్లుగా , 

ఆయనకు సర్వకార్యసిధ్ధి జరిగినట్లుగా పురాణాలు విశదీకరిస్తున్నాయి. 


అందువలన‌, ఈ నవరాత్రులలో విధివిధానాలు పాటించి నవదుర్గా స్వరూపిణియైన ఆది పరాశక్తి దేవిని పూజించడం ఎంతో శుభదాయకం.ఓం నమః శివాయ..!!

పరమాత్మ తో

 పరమాత్మ తో మన వ్యవహారం


ఒకరిని మనం ఇష్ట పడుతున్నాము అంటే, అది

మన మనస్సు యొక్క ప్రవర్తన. 

ఒకవేళ మన మనస్సు వారిని ఇష్ట పడక పోతే, వారిని ద్వేషిస్తాము.

ఇది మన మనస్సుకు మనము ఇచ్చే ఆహారము.


ఒకరిని అనుసరిస్తున్నాము అంటే,  

వారు చెప్పే దానిలో, 

లేదా వ్రాసేదానిలో జ్ఞానం గ్రహిస్తున్నాము. 

ఇది వారి ద్వారా మన బుద్ధికి ఇచ్చే ఆహారం.


ఒకరిని ప్రేమిస్తూన్నాము అంటే,  

వారిని మన భావనలో మనకంటే ఎక్కువగా చూస్తున్నాం. 


వారికి కావాల్సింది తెలుసుకొని వారు అడగకుండానే, మళ్ళీ ఇస్తారు, ఇవ్వాలి, అన్న భావము లేకుండా వారికి ఇస్తాము. 


వారికి ఏది ఇష్టమో తెలుసుకొని వారు అది కొరకున్నా, 


మనంతట మనం వారికి ఇస్తాము, 

లేదా వారికోసం చేస్తాము. 


ఒక వేళ వారు మనకి దూరంగా కనబడకుండా ఉంటే, వారిని ఎపుడెప్పుడు చూస్తామా అని ఆరాట పడతాము. 


వారితో ఎదో విధంగా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తాము.


ఇలా ఇవన్ని మనం ప్రేమించేవారికోసం చేస్తాము.


మరి మనం కనక పరమాత్మ ని ప్రేమిస్తే,  


ఆయానతో నాకిది చేస్తే నీకిది చేస్తా అన్ని వ్యాపారాలు చేస్తామా?

చెయ్యకూడదు కదా!!


అమ్మో ఆయనకి ఇది చేయకపోతే, నెత్తి అనుస్తాడు అని భయపడి పోతామా?

అలా భయపడకూడదు కదా!!


ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, మనం చెప్పేది వింటాడో వినడో తెలియదు అని ఆయనను తలవడం మర్చిపోతామా.


మర్చిపోకూడదు కదా, 

ఆయన మనలోనే, నిశ్శబ్దంగా మనని ప్రేమీస్తున్నాడు అని తెలుసుకోవాలా వద్దా?


ఒకవేళ మనం ఆయనని ప్రేమిస్తే కనుక


ఆయనను మన భావనలో మనకంటే ఎక్కువగా చూడాలి కదా!

అలా చుస్తున్నామా? 


ఆయనకు కావాల్సింది తెలుసుకొని, 

ఆయన అడగకుండానే,  

ఆయనకి ఇవ్వాలి కదా. 

ఇస్తున్నామా?

ఆయనకి ఎం కావాలి అని సందేహమా, 

ఆయనకి తన సృష్టిలోని ప్రాణికోటీని తనలాగా ప్రేమించమని కోరతారు మననుంచి.

అది చేస్తున్నామా మనం


ఒక వేళ ఆయన మనకి దూరంగా కనబడకుండా ఉంటే, (అలా అనుకోవడము మూర్ఖత్వం, ఎందుకంటే ఆయన మనలోనే ఉన్నాడు కనక) ఎపుడెప్పుడు చూస్తామా అని ఆరాట పడనవసరం లేదు, మనం. ఇది తప్పు కాదా?


మనం అంతర్ముఖం అయిన మరుక్షణం ఆయన సన్నిధిలో ఉంటాము. 

ఆయనతో కమ్యూనికేట్ చేయ్యాలి అంటే ప్రార్ధన (మన వైపు నుంచి ఆయనకి కమ్యూనికేషన్ కోసం ), మౌనం (ఆయన వైపు నుంచి మనకి కమ్యూనికేషన్ కోసం ) చెయ్యాలి కదా. అలా చేస్తున్నామా?

చెప్పండి.


నేను కూడా ఇలా చేయడంలేదేమో, చెయ్యాలి కదా, చేస్తా లెండి.


అంతే గా


ఏమంటారు

మంచి కథ 🌹

 🌹ఒక మంచి కథ 🌹


ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహం లో భాగవత ప్రవచనం ఇస్తున్నారు..


అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి, ఒక మూల దాక్కున్నాడు.


భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది. 


తల్లి యశోద, కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు. 


దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు.


భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము అని అనుకున్నాడు. 


దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు.


బ్రాహ్మణుడు భయపడి 'నా దగ్గర ఏమీ లేదు ' అని అన్నారు.


దొంగ, మీ దెగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ పడటంలేదు.


మీరు చెప్పిన, నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు, ఎక్కడ ఉంటాడో చెప్పండి' అని అన్నాడు.


బ్రాహ్మణుడు ఆలోచించి, "బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు రోజూ ఇద్దరు పిల్లలు వస్తారు.


ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు.


ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు , తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు. 


ఆ నల్ల మబ్బు ఛాయలో, పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండే వాడే, నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు"

అని ఆ దొంగ నుండి తప్పించుకోటానికి చెప్పాడు.


దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు.


యమునా నది తీరం వద్ద కూర్చుని, ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు. 


ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది , ఇద్దరు పిల్లలు వస్తున్నారు.


ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి, పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ.


బాల కృష్ణుడిని చూడగానే, దొంగ మనసులో ఆనందం కలిగి, అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ,

 'ఏ తల్లి కన్న బిడ్డో, ఇంత అందంగా ఉన్నాడు ' అని అనుకున్నాడు.


ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది.. తరువాత చూస్తే, దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది.


అది తీసుకుని,ఆ దొంగ బ్రాహ్మణుడి దెగ్గరకి వెళ్లి, జరింగింది అంతా చెప్పాడు.


ఆనందబాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన చోటు, తనకు చూపించమని దొంగని అడిగాడు. 


ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగానే, దొంగకి కనిపించిన బాల కృష్ణుడు, బ్రాహ్మణుడికి, కనిపించలేదు.


అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణడిని ,నీవు ఒక దొంగని అనుగ్రహించావు , నాకు కూడా దర్శనం ఇవ్వవా?" అని బాధపడ్డాడు.


అప్ప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు 


' నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా చదివావు , కాని , దొంగ, నువ్వు చెప్పిన కథని, మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు.


అపార నమ్మకం, సమర్పణ, "శరణాగతి" ఉన్న చోటే నేను ఉంటాను." (అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ)


మనం చేసే ధ్యానం అయినా అంతే మనస్ఫూర్తిగా సాధన చేస్తే కచ్చితంగా అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఫలితాన్ని పొందగలం!


సర్వేజనా సుఖినోభవంతు!     

(సేకరణ)...జై శ్రీ క్రిష్ణ 🙏

బ్రహ్మరాత

  బ్రహ్మరాత


సర్వం..పుణ్య మయం.. సర్వం..పాప మయం..

   

అనగనగా ఓ ముని చాలా ప్రతిభావంతుడు. సకలశాస్త్రాలు, విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తూ అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్నబిడ్డల్లా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. 


ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో, అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి. 


వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు. 


ఇక అతనికి నేర్పడానికి తనవద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో, తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమవద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు. 


ఇదిలావుండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో, వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ, తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు క్రింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమంలోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు. 


కాసేపట్లో లోపలి నుండి చంటిబిడ్డల ఏడుపులు వినవచ్చాయి. గురుపత్ని కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్యపురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెడుతూ, గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి వుండేవాడు కాదు. 


కాని వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు ''బ్రహ్మ''. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు వసంతుడు. బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి ''స్వామి'' మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అనరి వినమ్రపూరితంగా అడిగాడు. 


బ్రహ్మ తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని, వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి, ఇతరులకు తెలియజెయ్యరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా చెప్పాడు - నాయనా !


పూర్వ జన్మ కర్మ ల కారణంగా ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు. ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప మరిక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కనాకష్టంగా పెళ్లాన్ని, పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు. 


ఇక ఆ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తూ దైవసమానులైన తన గురుదంపతులకి పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాసాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. 


వెంటనే తన గురువుగారిని బ్రహ్మ రాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి, ఆయన అది సాధ్యం కాదు నాయనా. అది ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది. 


ఆ ఇద్దరికీ చదువులు వంటపట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా? అనే దిగులుతో, వసంతుడికి దేనిమీద ఏకాగ్రత కుదరడంలేదు. 


దానికితోడు ఆ పిల్లలిద్దరు వసంతుడి వెంటపడి అన్నయ్య, అన్నయ్య అని తిరుగుతూ వుంటే, అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒకరోజు గురువుగారితో చెప్పి, ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిసాడు. 


వారందరిని వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా? దానికి వసంతుడికి అందరు చెప్పిన సమాధానం బ్రహ్మరాత మార్చడం అసాధ్యం. అది ఎవరితరమూ కాదు అని. అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ, తన అన్వేషణను కొనసాగిస్తూ ఇరవై సంవత్సరాలకు పైగా గడిపాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు పాతికేళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది. 


ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలిపని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అని దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి, గురు దంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు. 


వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్యా! అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్య్రం ఇదీ శంకరుడి దుస్థితి. తమ్ముడూ, నువ్వు బాధపడకు. ఇప్పటినుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, ''సరే అన్నయ్యా! ఇకనుండి నువ్వు ఎలా చెపితే అలానే చేస్తాను'' అన్నాడు శంకరుడు. 


ముందు ఆ ఆవుని తోలుకుని పట్టణానికి వెళదాం పద అన్నాడు వసంతుడు. ఏమి మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్టణంలోని సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఈ ఆవుని ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు. తరువాత అతను చెప్పిన ధరకు అమ్మేసాడు వసంతుడు. 


శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా, వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరం అయిన సరుకులను, శంకరుడి భార్యకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురుమని తిని ఆకలి తీర్చుకున్నారు. 


తర్వాత వసంతుడు శంకరుడితో తమ్ముడూ అన్నదానం చేద్దాం. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్యా! ఇంతవరకు ఆ ఆవు వుంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది, ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా వుంది అని అన్నాడు. దానికి వసంతుడు తమ్ముడూ, నువ్వు ఏమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో. ప్రొద్దునకంతా సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పాడు. 


ప్రొద్దున్నే లేచి తలుపు తెరచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. శంకరుడి ఇంటిముందు ఒక ఆవు నిలబడి వుంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయే స్వయంగా ఒక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ కట్టేసాడు. 


ఆ రోజు కూడా ఆవును తీసుకెళ్ళి సంతలో అమ్మి, వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. 


తమ్ముడూ, ఇక ఇలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు. 


వసంతుడు వాళ్ళని, వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది.


 అన్నయ్యా! నేను మహాపాపిని. ఈ పాపపంకిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని బావురు మంది. ఊరుకో చెల్లీ! ఊరుకోమ్మా! ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన. 


ఆ రాత్రికి విటులు ఎవ్వరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. ఆమె ఆశ్చర్యపడుతూ అయ్యా! ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. ఆ రాత్రి ఇద్దరు, ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. 


అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కాని అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటిరోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని, లక్ష వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తూ ఆ బ్రహ్మే నని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటివరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమైంది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి, గురుదంపతుల రుణం తీర్చుకున్నాడు. 


ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు, దానిని నిరూపించాడు. అలా బ్రహ్మ రాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపాడు వసంతుడు.

       

            🙏సర్వేజనాఃసుఖినోభవంతు🙏

హిరణ్యకశిపుడు

 ఆ సమయం కోసం నారాయణుడు 


స్వాతి నక్షత్రం రోజున ఆవిర్భావం


హిరణ్యకశిపుడు సోదరుడి మరణానికి విష్ణువు పైన పగ తీర్చుకోవాలి అని బ్రహ్మకు తపస్సు చేసి మరణం లేకుండా వరం కోరుకుంటాడు, ఆ వరం ఇవ్వడం కుదరదు కనుక ఇంకేదైన వరం కోరుకోమని అజ్ఞాపిస్తారు బ్రహ్మ దేవుడు.. ఈ విధంగా కోరుకుంటాడు 


హిరణ్యకశిపుడు కోరిన వరం

1 గాలిలో మరణం లేకుండుట

2 నేలమీద మరణం లేకుండుట

3 నిప్పుతో మరణం లేకుండుట

4 నీటిలో మరణం లేకుండుట

5 ఆకాశంలో మరణం లేకుండుట

6 దిక్కులలో మరణం లేకుండుట

7 రాత్రి సమయంలో మరణం లేకుండుట

8 పగటి సమయంలో మరణం లేకుండుట

9 చీకట్లో మరణం లేకుండుట

10 వెలుగులో మరణం లేకుండుట

11 జంతువులచే మరణం లేకుండుట

12 జలజంతువులచే మరణం లేకుండుట

13 పాములచే మరణం లేకుండుట

14 రాక్షసులుతో యుద్ధంలోమరణం లేకుండుట

15 దేవతలుతో యుద్ధంలో మరణం లేకుండుట

16 మానవులు తో యుద్దంలో మరణం లేకుండుట

17 అస్త్రాలు వలన మరణం లేకుండుట

18 శస్త్రాలు వలన మరణం లేకుండుట

19 యుద్దాలలో ఎవరూ ఎదురు నిలువలేని శౌర్యం

20 లోకపాలకు లందరిని ఓడించుట

21 ముల్లోకాలమైన విజయం


దీని అర్ధం ఎక్కడా ఎవ్వరి చేత మరణం లేదు అనే అర్థం, ఒక విధంగా అమరుడు అయినట్టే కానీ తలరాతను రాసుకునే శక్తి సృటించ బడిన వాడికి లేదు సృష్టి చేసిన శక్తికే ఉంటుంది ఎంత తపస్సు చేసిన అంత చిన్న సూక్ష్మ రహస్యం అర్తం కాలేదు కారణం అహంకారం అనే మాయ లో ఉండటం.


అతని కుమారుడు ప్రహ్లాదుడు తల్లి గర్బం నుండే హరి భక్తుడు ,ఎలా అయినా అతన్ని మార్చే ప్రయత్నం చేయాలి అని ఎన్నో విధాలుగా చెప్పి వినక పోయే సరికి పసి వాడు అని చూడకుండా ఎన్నో విధాలుగా కష్టాలు పెడతాడు హిరణ్యకశిపుడు ఆ పసి వాడు బాధతో భయంతో నారాయణ అని పిలిచినప్పుడల్లా తల్లి పేగు కదిలినట్టు ఎన్నోసార్లు ఆ నారాయణుడు ఉలిక్కిపడతాడు ఆ బిడ్డను ఎన్నో ఆపదల నుండి రక్షించగలడు కానీ అతనికి ఉన్న వరం వల్ల ఆ సమయంలోనే వదించాలి.


ఎన్నోసార్లు ప్రహ్లాదుడు నారాయణ అని పిలిచినప్పుడు ఆ సమయం హిరణ్యకశిపుని వదించే ముహూర్తం కాదు, పగలు రాత్రి కానీ సంధ్య సమయంలో ప్రహ్లాదుడు పిలవాలి ఆ సమయం దాటక ముందే స్వామి అక్కడికి చేరుకోవాలి, చీకటి పడక ముందే సంహారం జరిగిపోవాలి, ఆ బిడ్డ పిలవడం, ఆ సమయం రెండూ ఆ వరానికి తగ్గ విధంగా కలిసి రావాలి ఆ క్షణం కోసం స్వామి ఎంతగానో ఎదురు చూస్తున్నారు , అతని క్రూరత్వం మరింతగా వికృతంగా మారుతున్న కొద్దీ అతని రాక్షసత్వం యొక్క పాపం పెరిగిపోతోంది స్వామి కి పట్టరాని ఆగ్రహం , ప్రహ్లాదుడు పైన మమకారం తో బాధ కలుగుతుంది. అతన్ని సంహరించాలి అంటే ఆ సమయం రావాలి చాలా కాలానికి అతని పాపం పండి అటువంటి సాయంసంధ్యా కాలంలో ఎక్కడ నీ హరి అని ప్రహ్లాదుని అడగటం ఎక్కడైనా ఉంటాడు నా స్వామి అని ప్రహ్లాదుడు అనడంతో వాడి పాపం వాడి నోటితో ఈ స్తంభమున చూపిస్తావ అని అడుగుతాడు, ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న స్వామి ఆ స్తంభమున పుడతాడు పగలు రాత్రి కాకూడదు సంధ్యా సమయం చిటి వెలుతురు కాదు పొద్దు వాలిన సమయం ఇంటా బయట కాకుండా గడప నింగి నెల కాకుండా స్వామి కాలిపైన పెట్టుకున్నారు ఆయుధం కాదు గోర్లుతో, మనిషి మృగం కాదు నరసింహం అవతారం లో ఎప్పటి నుండో దాచుకున్న కోపాన్ని ఒక్కసారిగా ఉగ్ర నరసింహ అవతారంలో చీల్చి చెండాలుతాడు..


సాధువులను స్త్రీలను, పసివాడు అయిన ప్రహ్లాదుడు ని ఎన్నో బాధలకు గురి చేస్తున్న ప్రతి సారి వారికన్నా ఎక్కువగా ఆ నారాయణుడే బాధను అనుభవిస్తారు కానీ ఆ తపస్సుకు ఆ వారానికి ఒక విలువ ఉంది భగవంతుడు అయినా ఆ కట్టుబాట్లు తప్పలేదు ఆ బాధ అనుభవించక తప్పలేదు ఎందరో పుణ్యాత్ములు బలి కాక తప్పలేదు. అలా పాపం చేయబట్టి అతని నోటితో అతని మరణ సమయంలో స్వామి ని పులిచేలా చేసుకున్నాడు. ఆ సమయం కోసం నారాయణుడు తపస్సే చేసాడు అంటే అంతలా నిరీక్షణ చేసాడు, చివరికి స్వాతి నక్షత్రం సంధ్యా కాలంలో అవిర్భవించాడు స్వామి. 


ఎదైనా అది జరాల్సిన సమయంలో జరుగుతుంది, దాన్ని ఎవరూ ఆపలేరు. మనవల్ల కాని వాటిని కూడా కాలం సమాధానం చెప్తుంది ఓపికతో ఉండాలి. 


ఉగ్రం గా కనిపించినా స్వామి కరుణామూర్తి ఈ స్వాతి నక్షత్రం రోజు సాయంత్రం 6 గం తర్వాత ఒక పళ్ళెంలో 9 దీపాలుపెట్టి పానకం నైవేద్యం పెట్టి స్వామి కి స్త్రోత్రం చదివి హారతి ఇస్తే ఆటంకాలు తొలగిపోతాయి, శత్రువులు తొలగిపోతారు, గండాలు తొలగిపోతాయి. ప్రతి నెలా వచ్చే స్వాతి నక్షత్రం రోజు ఇలా చేసుకుంటే మంచిది.


(సేకరణ)

అశ్వినీదేవతా_స్తోత్రం

 




అశ్వినీదేవతా_స్తోత్రం

   వీరినే తథాస్తు దేవతలు అంటారు, కోరికను తీర్చేవారు. 


ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభానూ గిరి

వాశం సామి తపసాహ్యనమ్ తౌ| 

దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానౌ

అధిక్షిపన్తౌ భువనాని విశ్వాః||


హిరణ్మయౌ శకునీసాంపరాయౌ

నా సత్య దస్రౌ సునసౌ వైజయంతౌ|

శుక్రమ్ వయంతౌ తరసా సు వేమ్నా

వధి వ్యతంతౌ వసితం వివశ్వతః||


గ్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికాం

అముంచతా మస్వినౌ సౌభగాయ|

తావత్సువ్ఱుతౌ అనమంత మాయయా

వాసత్త మాగా అరుణా ఉదా వహన్||


షష్టిశ్చ గావః త్రిశతశ్చ ధేనవః|

ఏకం వత్సం సువతీతం దుహంతి||


అక్షరదోషం లేకుండా లిఖించిన స్తోత్రం 

ధర్మం


















 

ప్రవచనములు






 

భూకైలాసం

 





#భూకైలాసం

కర్ణాటక రాష్ట్రం

ఉత్తర కన్నడజిల్లా లో

గోకర్ణ పట్టణం లో

కొలువైఉన్న

పరమేశ్వర ఆత్మలింగం భూకైలాసం...గోకర్ణం


   *మన దేశంలోని శైవక్షేత్రాలైన వారణాశి, రామేశ్వరం ఆలయాల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో ఆ కోవలోకి చెందినదే మహాబలేశ్వరఆలయం. ***కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ జిల్లాలో గోకర్ణ పట్టణంలో కొలువుదీరి ఉన్న ఈ ఆలయాన్ని గోకర్ణం అని కూడా అంటారు. 

 *అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో 'గోకర్ణం' ఒకటి. 

  *గోకర్ణ క్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వర క్షేత్రం, ఉత్తరాన గంగావళినది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఓ వైపు అపారమైన ఆధ్యాత్మికత, మరో వైపు ప్రకృతి రమణీయకతతో అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్టితమైంది.

 

 ***గోకర్ణ క్షేత్రం గురించి రామాయణ, మహాభారత గ్రంథాలలో వివరించబడింది. ఇక స్కాందపురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది. పూర్వం రావణాసురుడు శివుని గురించి కఠోర తపస్సు చేయగా, అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు ఓ నిబంధన విధించిన శివుడు, రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఆ నింబంధన ఏమిటంటే.. రావణాసురుడు లంకకు వెళ్లేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు. అలా దించితే ఆ లింగం అక్కడే ప్రతిష్టితమైపోతుంది.

 

*** అలా ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు తన లంక రాజ్యం వైపు పరుగులు తీయసాగాడు. ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని భయపడిన దేవతలు, తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ... తదితర దేవుళ్లను వేడుకున్నారు. అప్పుడు గణపతి చిన్నపిల్లవాని రూపంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది.

 

*** అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసురుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకొమ్మని, తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాలవినాయకుడు తాను మూడుసార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కిందపెట్టేస్తానని చెబుతాడు. వేరే దారిలేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోవడానికి వెళతాడు. అయితే రావణాసురునికి ఏ మాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు గబగబా మూడుసార్లు రావణాసురుని పిలిచి, ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు.

 

 ***రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాలవినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కును ఇప్పటికీ, ఇక్కడున్న మహాగణపతి ఆలయంలో గణపతి విగ్రహానికి చూడవచ్చు.

 

 ఆత్మలింగం చుట్టూ పంచక్షేత్రాలు

 ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరంవైపు నుంచి లాగుతాడు. ఆ పెట్టె అతి విసురుగా వెళ్లి దూరంగా పడిపోయింది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలిసింది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవించింది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురడేశ్వరం లింగం వెలిసింది. పెట్టెను కట్టిన తాళ్లు పడిన చోట ధారేశ్వరలింగం ఉద్భవించింది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం ‘మహాబలేశ్వర లింగం’ గా గోకర్ణంలో వెలిసింది. ఆత్మలింగంతో ముడిపడిన ఈ ఐదు క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటారు.

 

 "గోరూపం" దాల్చిన భూమాత...

 మరొక కథనం ప్రకారం పాతాళలోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గోరూపాన్ని ధరించిందట. ఆ గోవుచెవి నుండి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రానికి గో (అవు) కర్ణం (చెవి) = గోకర్ణం అనే పేరు ఏర్పడిందంట.

 

 రాజుల కాలంలో గోకర్ణం

 దక్షిణ కాశి, భూ కైలాసం అని భక్తులచే కొనియాడబడుతున్న ఈ క్షేత్ర చరిత్ర ఎంతో పురాతనమైంది. కాళిదాసు తన ‘రఘువంశం’ కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేశాడు. క్రీ.శ. 7వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్దనుడు ‘నాగానంద’ కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు. కదంబ చక్రవర్తి మయూరశర్మ ఈ ఆలయంలో నిత్యపూజాదికాలను ఏర్పాటు చేశాడని, చెన్నమ్మాజీ, ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హళసునాడు- కుందపురానికి చెందిన విశ్వేశ్వరాయుడు చంద్రశాల, నందిమంటపాలను నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. క్రీ.శ 1665వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకుని పూజలు చేసినట్టు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది.


 సర్వపాప హరణం కోటి తీర్థంలో పుణ్యస్నానం

 గోకర్ణంలో ప్రధానాలయం శ్రీ మహాబలేశ్వరాలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటితీర్థంలో స్నానాలు ఆచరిస్తారు. కోటితీర్థంలో స్నానం చేస్తే సమస్తరోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటి తీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా ప్రక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి ప్రక్కనన్ను అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మిక, కోటితీర్థానికి దక్షిణం వైపు అగస్త్యులవారిచే ప్రతిష్టింపబడిన వరటేశ్వర లింగం ఉంది. ఈ ఆలయం భక్తుల సౌకర్యార్థం 24 గంటలూ తెరిచే ఉంటుంది.

 

 నయనానందకరం రథోత్సవం

 అతి ప్రాచీనమైన ఈ ఆలయం పెద్ద గాలిగోపురంతో భక్తులను ఆహ్వానిస్తుంది. ఈ లింగం కింది వైపు కాస్త వెడల్పుగా, పైన సన్నగా కనబడుతుంటుంది. రావణాసురుడు ఈ లింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నించడం వల్ల పై భాగాన సన్నగా ఉందంటారు. పైకి ఉండే ఒక రంధ్రంలో వేలును ఉంచినప్పుడు కిందనున్న లింగం వేలికి తగులుతుంది. భక్తులు శివలింగం చుట్టూ కూర్చుని పూజలు నిర్వహిస్తారు. అయితే, మహామంగళహారతుల సమయంలో గర్భగృహంలోకి భక్తులను అనుమతించరు. ఇక్కడ పన్నెండేళ్లకొకసారి జరిగే విశేష కార్యక్రమంలో శివలింగాన్ని బయటకు తీసి, నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారు. ఈ పుష్కర ఉత్సవాలకు దేశవిదేశాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది. ముందుగా వినాయక దర్శనం...

 

 రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు, అతడిని అడ్డుకున్న గణపతి చాతుర్యాన్ని మెచ్చుకున్న పరమశివుడు మహాబలేశ్వర క్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తరువాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు. రావణుడు వేసి మొట్టికాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనపడుతుంటుంది. ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పు దిక్కున ఉంది.

 

 ఉత్తరాన రుద్రుని సతి తామ్రగౌరి

 మహాబలేశ్వర ఆలయప్రాంగణంలో ఉత్తరం వైపున తామ్రగౌరి ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని అర్ధాంగి. ఈమె బ్రహ్మదేవుని కుడి చేయి నుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రుని వివాహం చేసుకుంది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయత్రం 5 గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది.

 

 సిద్ధించిన అమృతం

 నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకై త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఇక్కడే ఆవిర్భవించిందట. అమృతమథనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడకు వచ్చి ఆత్మలింగానికి పూజలు జరపడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి. గోకర్ణ క్షేత్రంలో ఆత్మలింగాన్ని దర్శించుకున్న వారికి జన్మజన్మల పాపకర్మలు తొలగిపోయి సర్వసుఖాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

 

 సమీప పుణ్యక్షేత్రాలు

 ధారేశ్వర ఆలయం: ఈ ఆలయం గోకర్ణానికి దక్షిణ దిక్కున దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆత్మలింగానికి సంబంధించిన లింగం. ఈ ఆలయం చాళుక్య, హోయసలల శిల్పశైలిలో కనపడుతుంది. దీనిని 11వ శతాబ్దిలో పునర్నిర్మించినట్లు తెలుస్తోంది.

 గుణవంతేశ్వర: ఈ ఆలయం కూడా గోకర్ణ ఆత్మలింగానికి సంబంధించిన క్షేత్రంగా చెప్పబడుతుంది. గోకర్ణం నుంచి సుమారు 60 కిలోమీటర్లు. మురుడేశ్వర ఆలయం: పంచలింగాల క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఈ భారీ ఆలయం భక్తులను అమితంగా ఆకర్షిస్తుంటుంది. గోకర్ణక్షేత్రానికి 70 కిలోమీటర్ల దూరం....

ఓం నమఃశివాయ 

శుభం

విశ్వాసం

 *1.విశ్వాసం*

వర్షాలు పడటం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్లారు. కానీ ఒకడు మాంత్రం గొడుగు తీసుకొని వెళ్ళాడు ఇదే *విశ్వాసం*.


*2.నమ్మకం*

తండ్రి బిడ్డను పైకి ఎగరేస్తాడు, బిడ్డ ఏడవాలి కానీ నవ్వుతుంది, అదే *నమ్మకం*.


*3.ఆశ*

రేపు మనం బతికుంటామో లేదో తెలియదు, కానీ అలారం పెట్టుకుని మరీ పడుకుంటాం. ఇదే *ఆశ*.


*4.కాన్ఫిడెన్స్*

రేపు ఏం జరుగుతుందో తెలియదు, మన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో, ప్రతికూలతలను ఎలా ఓడించాలో ఆలోచిస్తుంటాం. ఇదే *కాన్ఫిడెన్స్*.


చేసే పనిమీద *విశ్వాసం,*

చేయగలను అనే *నమ్మకం,*

చేస్తే బాగుపడతాను అనే *ఆశ,*

ఏం జరిగినా ఎదుర్కోగలను అన్న *కాన్ఫిడెన్స్* మనిషి *విజయానికి పునాదులు,* ఈ పునాదులు బలంగా ఉంటేనే *జీవితం అనే భవనం దృఢంగా ఉంటుంది.*

సంధ్యా దీపం

 🙏🪔🪔🙏🪔🪔🙏


       సంధ్యా దీపం నమోస్తుతే 

     

        *శుభంకరోతి కల్యాణం 

        ఆరోగ్య ధన సంపద  

        శత్రు బుద్ధి వినాశాయ 

         దీప జ్యోతి నమోస్తుతే 


       * దీపం జ్యోతి పరబ్రహ్మం

         దీపం సర్వ తమోపహం 

         దీపేన సాధ్యతే సర్వం

         సంధ్యా దీపం నమోస్తుతే  


       * వర్తి ర్దేహొ కర్మ తైలం 

         జ్యొతిరాత్మేతి చింతయేత్

         అధ కర్పూర కీలావత్ 

         భవేన్ని శ్శేషతావధి:🙏

ఆదర్శానికి నిదర్శనం శ్రీకృష్ణుడు

 Srikrishna Mallikarjuna:

ఆదర్శానికి నిదర్శనం శ్రీకృష్ణుడు


సంప్రదాయ, శాస్త్రీయ, సంస్కార, సామాజిక, విషయాలపై పూర్తి అవగాహనతో చాతుర్వర్ణనం మయాస్పష్టం అంటూ వర్ణాశ్రమ ధర్మమును స్నేహభావంతో ఆవిష్కరించి అందించిన మహాభావుడు శ్రీకృష్ణుడు. మర్యాదపాలన, నిరంకుశ నిర్మూలనతో సంపూర్ణ మానవజాతి కల్యాణమే కాక సమస్త ప్రాణికోటి శ్రేయస్సు కోరి అవతరించిన శ్రీకృష్ణుడు దివ్యపురుషుడు. జీవితంలో ఎదురయ్యే అనేక పరిస్థితులను సమన్వయపరిచి ఎలా చతురతతో పరిష్కరించాలో తన జీవిత చరిత్ర ద్వారా విశేషంగా తెలియజేశాడు. అందుకే ఆయన అపూర్వ విజయాలు సాధించిన చారిత్రక పురుషుడు. చెరసాలలో జన్మించి, గోవులను మేపుతూ పెరిగినవాడు.. ఆదర్శవిద్యార్థిగా, మిత్రుడిగా, కర్మయోగిగా, రాజ శ్రేష్టుడుగా లోకాదర్శమైన మానవ జీవితాన్ని చూపుతూనే మరోపక్క విశ్వరూప సందర్శనం, గీతాప్రవచనం వంటి ఘట్టాలలో తన అవతార పరమార్థాన్ని, భగవదాంశనూ ప్రదర్శించాడు.


పూర్ణ పురుషుడు శ్రీకృష్ణుడు


సకల గుణవంతుడు, ఆదర్శ చరిత్రకారుడు అయిన శ్రీకృష్ణుడి చరిత్రలో మానవ జీవనం సర్వతో ముఖవికాసం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఉత్తములు దేనిని ఆచరిస్తారో సామాన్యులు అదే బాటను అనుసరిస్తారు. మంచి నడవడిక, నిస్వార్థ భావన, ధర్మ రక్షణతో భూభారాన్ని తొలగించి తన చరిత ద్వారా లోకాదర్శమైన పరిపూర్ణ మానవత్వాన్ని ప్రభోదించాడు. రాజనీతి కోవిడుదు, శీలవంతుడు, సదాచారుడు, నీతిమంతుడు, శూరుడు శ్రీకృష్ణుడు అని వర్ణించిన మహాభారత గాథకు నాయకుడైన దేశ ఐక్యతకు తోడ్పడి భారతీయమైన దేశాన్ని అందించి ఆచంద్రతారార్కం చరిత్రలో నిలిచిపోయాడు ఆ పరంధాముడు. నిష్పక్షపాతం, ధర్మం, శాంతి, నమ్రత, వినయం, శ్రద్ధాభక్తులు శ్రీకృష్ణుని దివ్యగుణాలు. రాజసూయ యాగం పూర్తయిన తర్వాత ధర్మరాజు సభలో అర్ఘ్యం స్వీకరించి, అగ్రతాంబూలం అందుకునే అర్హతగల రాజెవ్వరని భీష్ముడిని అడుగుతాడు. స్థితప్రజ్ఞుడు, యోగివర్యుడు, సహనశీలుడు, అపరిమితబల సంపన్నుడు, తేజోమయుడు అయిన శ్రీకృష్ణుని కంటే అధికులైన వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అంటూ భీష్ముడు శ్రీకృష్ణుని ఘనతను కీర్తిస్తాడు. శిశుపాలుని విషయంలో మనోనిగ్రహంతో సహనం పాటించి ధర్మస్థాపనకై చిరుమందహాసంతో వేచి ఉంటాడు. కురుక్షేత్ర సంగ్రామం వలదని శాంతి దూతగా మారి హితువు పలికిన ఉత్తముడు అచ్యుతుడు. కర్మబంధాలకు కారణమైన కామక్రోధాదులను జయించిన కర్మయోగి శ్రీకృష్ణుడు.

శివుడు లేనిదెక్కడ?

 శివుడు లేనిదెక్కడ?


అరుణాచలంలోని ఆశ్రమంలో రమణ మహర్షిని సందర్శించేందుకు స్వదేశీయులే కాకుండా విదేశీయులు కూడా చాలా మంది వచ్చేవారు. స్థానిక భక్తులు, సిబ్బంది ఆచారాల పేరుతో అక్కడకు వచ్చేవారికి కఠిన నిబంధనలు పెట్టేవారు. ఇవి మహర్షి దృష్టికి కూడా వచ్చేవి. ఓసారి ఓ అమెరికా భక్తురాలు అరుణాచలం వచ్చారు. భారతీయ సంప్రదాయాలు, ఆచారాలు అంతగా తెలియని ఆమె మహర్షి ఆశీనులయ్యే సోఫా వద్ద కుర్చీలో కూర్చున్నారు. ఆమెకు కీళ్ల నొప్పులు ఉండడంతో కాళ్లను చాచి కూర్చున్నారు. దీంతో ఆశ్రమ సిబ్బంది ఆమెను మందలించబోయారు. అప్పుడు రమణులు వారిని వారించారు. ఈ సందర్భంగా పెరియ పురాణంలోని ఓ శివ భక్తురాలి కథను చెప్పారు.

అవ్వయ్యార్‌ అనే భక్తురాలిని గణపతి సశరీరంగా కైలాసానికి తీసుకెళతారు. ఆమె బాగా వృద్ధురాలు కావడంతో కాళ్లు మడిచి కూర్చోలేక శంకరుడి ముందు కాళ్లు చాపి కూర్చుంది. ఆమె వైఖరి చూసి పరమేశ్వరుడి పక్కన ఉన్న పార్వతి మనసు చివుక్కుమంది. అలా కూర్చోవడం అపరాధం కదా... ఆమెకు ఓ సారి చెప్పమని భర్త అయిన శంకరుణ్ణి కోరింది. ‘ఆమె పరమ భక్తురాలు ఆమెనేమీ అనకూడదు’ అంటూ ఆయన మౌనందాల్చాడు. పరమేశ్వరి వూరుకోలేదు. తన చెలికత్తెకు చెప్పి పంపింది.

పార్వతీ దేవి సఖి ఆ వృద్ధురాలిని సమీపించి ‘అవ్వా నీ కాళ్లు ఈశ్వరుడివైపు పెట్టకు’ అంది. అప్పుడామె ‘అలాగా అమ్మా! ఈశ్వరుడు లేని చోటెక్కడో చెప్పు. కాళ్లు అటు పెట్టుకుంటాను’ అంటూ కాళ్లను పక్కకు తిప్పింది. వెంటనే పరమేశ్వరుడు ఆ వైపు కనిపించాడు. మరో వైపు తిప్పితే అక్కడా శంకరుడే.

ఆ సర్వేశ్వరుడు సర్వకాలసర్వావస్థల్లోనూ ఉన్నాడు... ఆచారాలు, సంప్రదాయాలకన్నా విశుద్ధ భక్తితోనే భగవంతుణ్ణి చేరగలమని బోధించారు మహర్షి           



నేటి ఈనాడు పత్రిక నుండి🙏👆

ప్రవచనములు






 

సువాసినీ, కుమారీ పూజల ప్రాధాన్యం


నవరాత్రులు లో సువాసినీ, కుమారీ పూజల ప్రాధాన్యం ఏమిటి?

      శాంత స్వరూపం, స్థిర చిత్తం, సద్గుణం, భక్తి, వినయవిధేయతలు కలిగిన ఒక ముత్తైదువును అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి, ఆమె దీవెనలు పొందడమే సువాసినీ పూజ. నడివయసు స్త్రీ కి చేసే పూజ ఇది. అలాగే కన్యలను పూజించే ఆచారం కూడా ఉంది. ఒక్కో వయస్సు కన్యను ఒక్కో నామధేయంతో ఆరాధించడం సంప్రదాయం. ఈ నవరాత్రులు లో ఎందరు కుమారికలను పూజించితే ఏ ఫలితం కలుగుతుందో దేవీ భాగవతము తెలియజేసింది.

         ఒక్క కన్యకను పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఇద్దరు కన్యలను పూజిస్తే భుక్తి, ముక్తి కలుగుతాయి. ముగ్గుర్ని పూజిస్తే ధర్మ కామాలు సిద్ధిస్తాయి. నలుగురు ని పూజిస్తే శత్రునాశనం అవుతుంది. అయిదుగురు ని పూజిస్తే విద్యాలాభం, ఆరుగురు ని పూజిస్తే షట్కర్మ సిద్ధి. ఏడుగురు ని పూజిస్తే రాజ్యలాభం. ఎనిమిది మంది ని పూజిస్తే సర్వగుణ లాభం. తొమ్మిది మంది కన్యలను పూజిస్తే అధికార ప్రాప్తి కలుగుతుంది. కన్యాపూజకు తొలి నియమం ఏమిటంటే కన్యకల వయస్సు 2-10సంవత్సరాల మధ్య ఉండాలి. రెండేళ్ల బాలిక మహాలక్చ్మీ స్వరూపం. ఆమె తల్లి లేక నిలబడలేదు. అందువల్ల అటువంటి బాలికలను కన్యాపూజకు నియమించి కష్ట పెట్ట కూడదు. 2నుంచి పది సంవత్సరాల వరకూ ఒక్కో వయస్సు బాలికకు ఒక్కో పేరుంది.

కుమారి(2ఏళ్ళబాలిక):కుమారిని పూజిస్తే దారిద్ర్యం దుఃఖం పోతుంది. శత్రువులు నశిస్తారు. ఆయుష్షు, బలం, ధనం వ్రుద్ధి పొందుతాయి.

త్రివర్ష(3 ఏళ్ళ బాలిక) :త్రివర్ష లేదా త్రిమూర్తి పూజ వల్ల పుత్రపౌత్రాభి వ్రుద్ధి కలుగుతుంది. ఆయుష్షు, ధనదాన్య సమ్రుద్ధి, త్రివర్గ ఫల ప్రాప్తి పొందుతారు.

కళ్యాణి(4 ఏళ్ళ బాలిక) :విద్యార్ధి, విజయార్ధి, రాజ్యసుఖార్ధి కళ్యాణిని పూజించాలి.

రోహిణి (5 ఏళ్ళ బాలిక) :రోగాలతో బాధపడే వారు రోహిణి ని అర్చించాలి.

కాళిక(6 ఏళ్ళ బాలిక) :శత్రునాశనం నకు కాళికను పూజించాలి.

చండిక(7 ఏళ్ళబాలిక) :ఐశ్వర్య ప్రాప్తికి చండికను పూజించాలి.

శాంభవి (8 ఏళ్ళ బాలిక) :దారిద్య్ర శోక నాశనానికి, సమర విజయానికి, అధికారులు ను మెప్పించడానికి శాంభవిని పూజించాలి.

దుర్గ (9 ఏళ్ళ బాలిక) :క్రూరమైన శత్రు బాధలను పోగొట్టడానికి, పరలోక సుఖాలు పొందడానికి దుర్గను పూజించాలి.

సుభద్ర (10 ఏళ్ళ బాలిక) :సుభద్ర కోరిన కోర్కెలు తీర్చగలదు.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

అమ్మ వారి పూజకు

🏵️🌸🏵️🌸🏵️🌸🏵️🌸అమ్మ వారి పూజకు కలశం, విగ్రహం, శ్రీచక్రం తదితరాలలో ఏది శ్రేష్టమైనది? అంటే అమ్మవారిని ఎనిమిది రూపాల్లో అర్చించుకోవచ్చును అని దేవీ భాగవతము తెలియజేస్తోంది. ప్రత్యేకించి నవరాత్రులు లో పూజల్లో కలశ స్తాపన చేస్తారు. ఇంటి సంప్రదాయాన్ని అనుసరించి ఆఖండ దీపాన్ని వెలిగించాలి. ఉత్తర దిక్కు లో గానీ పూజగదిలో గానీ ఉత్తరం దిశగా పద్మం ముగ్గు వేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరచాలి. దానిపై గోధుమలు, బియ్యం, జొన్నలు, శనగలు, మినుములు, నువ్వులు వంటి ధాన్యాలను ఒకదానిపై ఒకటి ఉండేలా పేర్చాలి. కొందరు శనగలు, మినుములు, నువ్వులు ఈ మూడింటిని వేర్వేరు వస్త్రాలు లో ఉంచుతారు. వాటిపైన శక్తి కొద్ది బంగారం, వెండి, రాగి లేదా మట్టి కలశాన్ని పెడతారు. అందులో నీరు పోసి, పంచ పల్లవాలు(రావి, మర్రి, మామిడి, మేడి, జువ్వి) ఉంచి పైన కొబ్బరి కాయను పెట్టాలి. కొబ్బరికాయ పైన రవికెను గోపురం గా చుట్టాలి. కొందరు కలశంపై అమ్మ వారి రూపును కూడా ఉంచి పూజిస్తారు. అమ్మ ను ఆరాధించేందుకు నాలుగు విధానాలు మంచివే. శ్రీచక్రం, విగ్రహం వంటివి ఉంచడమంటే మరింత ఎక్కువగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఏ రూపంలోనైనా భక్తి శ్రద్ధ లతో అమ్మను ఆరాధించవచ్చు.
🏵️🌸🏵️🌸🏵️🌸🏵️🌸

మహాభారతము ' ...51.

 మహాభారతము ' ...51. 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


సభా పర్వం..


దుర్యోధనుని కోర్కెమేరకు శకుని, ధృతరాష్ట్రుని వద్దకు, పాండవులను జూదక్రీడకు ఆహ్వానించడానికి అనుమతి కోసం వెళ్ళాడు. అయితే, శకుని, తాను యేవిధమైన ప్రసంగము ఆ విషయంపై చెయ్యకుండా, అత్యంత చతురతతో, బావగారైన ధృతరాష్ట్రునితో కుటుంబ యోగక్షేమాలు మాట్లాడుతున్నట్లుగా సంభాషణ మొదలు పెట్టి,దుర్యోధనుని ప్రసక్తి తెచ్చాడు. అతనెందుకో యీమధ్య ఆత్మన్యూనతతో బాధ పడుతున్నాడని విచారం వెలిబుచ్చాడు. అతని అంతరంగం తెలుసుకోగలవాడు తండ్రి తప్ప యింకెవరున్నారని, అన్నాడు.


ఆమాట వినగానే, ధృతరాష్ట్రుడు చివ్వునలేచి, విదురుని పిలిపించి, తనను దుర్యోధనుని వద్దకు తీసుకెళ్లమని అడిగాడు. దుర్యోధనుడు కలిసినంతనే, ' కుమారా ! నీకు కావలసిన రాజ్యాధికాము, నీవు చెప్పినట్లు వినే మంత్రాంగమంతా వున్నదికదా ! అయినా దేని గురించో నీవు మధనపడుతున్నావని నాకు అనిపిస్తున్నది. ఆ విషయం యేమై ఉంటుంది. నాకు చెప్పు. నేనేమైనా నీకు సహాయపడగలనేమో ! ' అన్నాడు.


' జనకా ! మీరు నాగురించి యింతశ్రద్ధగా అడిగినందుకు ధన్యవాదాలు. నాకు యుధిష్ఠరుని సిరిసంపదలు చూసినప్పటినుండి, మనసు వ్యాకులంగా వున్నది. అసూయా భారంతో మనసుకృంగిపోతున్నది. నేను వారి ఐశ్వర్యాన్ని యెలాగైనా దక్కించుకోవాలి లేదా వారిచేతిలో యుద్ధంలో వీర మరణం పొందాలి.. ' అంటూ విదురుడు చూడకుండా, శకునికి సైగ చేశాడు.  


'వెంటనేశకుని, ' దుర్యోధనా ! పాండవులను జయించడం అంత సులభంకాదు. వేరే యేదైనా యుక్తి ఆలోచించు. ' అని ధృతరాష్ట్రుని మనసులో నాటుకునేటట్లు జూద ప్రసక్తి తెచ్చి, ' వారిని ఆహ్వానించు జూదానికి. నీకు వారి రాజ్యలక్ష్మిని కానుకగా నేను యేర్పాటు చేస్తాను. ' అని ముగించాడు. దుర్యోధనుడు, యీ వుపాయమేదో బాగున్నది. యిదే తక్షణ కర్తవ్యమ్, తండ్రీ. ' అని తండ్రి అనుమతికై తొందరపెట్టాడు.  


పుత్రవాత్సల్యం ధృతరాష్ట్రుని మరియొకసారి దుర్బలుని చేసింది. అయినా, విదురుని సలహా తీసుకుందామని విదురునివైపు తిరిగి అభిప్రాయం చెప్పమని అడిగాడు. విదురుడు మాట్లాడేలోపే, ' ఈ సంభాషణ యింతటితో సరి. విదురుడు ఈ మాటకు యెదురుచెబితే, నాప్రాణత్యాగమే దీనికి పరిష్కారం. ' అని మారు మాటాడనీయకుండా, ధృతరాష్ట్రుని ఆమోదం తీసుకున్నాడు, పాండవులను జూదక్రీడకు పిలవడానికి. 


ధృతరాష్ట్రుడు విదురునితో, ' జూదక్రీడకు వెంటనే ఒక ప్రత్యేక భవనం నిర్మింప జేయమని పురమాయించి, అతనినే ఇంద్రప్రస్థం వెళ్లి పాండవులను తీసుకురమ్మని చెప్పాడు. అయినా మనసు వూరకుండక, విదురుడు ధృతరాష్ట్రునికి, దుర్యోధనునికి, జూదక్రీడ వద్దని ప్రాధేయ పడినంతగా చెప్పినా, యేప్రయోజనం లేకపోగా, ఇంద్ర ప్రస్థానికి ప్రయాణమయ్యాడు.  


విదురుడు ధర్మరాజుకు తాను వచ్చిన కార్యం చెప్పాడు. విదురుడు అన్యమనస్కంగా తమను రమ్మని చెప్పడం గమనించి, ధర్మరాజు, ' మహాత్మా ! జూదక్రీడ మిగుల ప్రమాదకరమైనది, మిత్రులను, శత్రువులుగా చేసేది అని తెలిసీ, మీరు మమ్ములను తీసుకు వెళ్ళడానికి యెలా వచ్చారు ? ' అని ధర్మరాజు అడిగాడు. దానికి విదురుడు, 'ధర్మజా ! నేను చెప్పిచూశాను. అయినా ప్రయోజనం లేకపోయింది. జూదంవలన కలిగే అనర్ధాలు అన్నీ పూసగ్రుచ్చినట్లు తండ్రీకొడుకులకు చెప్పాను. అయినా నామాట వినలేదు. ఈ విషయంలో, నీవే స్వతంత్రంగా ఒకనిర్ణయం తీసుకో. హస్తినకు రావడమో, నిరాకరించడమో ! ' అనిమాత్రం చెప్పాడు.


ఈమాటలు విన్న ధర్మరాజుకు దుర్యోధన ధృతరాష్ట్రుల అంతరంగం అర్ధమైంది. ఏదో కీడుతలపెట్టారని వూహించాడు. ' నేను అక్కడ యెవరితో జూదమాడాలి ' అని ధర్మజుడు విదురుని అడుగగా, ' అక్కడ శకుని , అతనితో పాటు సత్యవ్రత, పురుమిత్ర, చిత్రసేన, వివింశతి, జయుడు మొదలగు వారు జూదవిశారదులు వున్నారని ' చెప్పాడు విదురుడు.  


' విదురా ! నేను పెదతండ్రిగారి ఆజ్ఞకు కట్టుబడి వస్తున్నాను. లేకుంటే నాకు శకునితో జూదమాడడం సుతరామూ యిష్టంలేదు. అని యెంతో వేదనాభరిత హృదయంతో ధర్మజుడు జూదమాడడానికి హస్తినకు బయలుదేరాడు. ఏదో ఉపద్రవం కనిబెట్టి తనతో తమ్ములను, ద్రౌపదినికూడా వెంట తీసుకువెళ్ళాడు ధర్మరాజు. వెళ్ళగానే, హస్తినలో పెద్దలందరినీ మర్యాదపూర్వకంగా కలిసి, వారి ఆశీర్వాదం తీసుకున్నాడు ధర్మరాజు, తమ్ములతో సహా. ధృతర్రాష్ట్రుడు గాఢమైన ఆలింగనంచేసుకుని వారి రాకవలన తాను పొందిన ఆనందం తెలియజేశాడు.


జూదక్రీడకు శకుని ఆధ్వర్యంలో అన్ని సన్నాహాలు జరుగుతున్నవి.    


స్వ స్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.


తీర్థాల రవి శర్మ 

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం. హిందూపురం.

9989692844

తిరుమల శ్రీవారు


 

సమాచార హక్కు

 న్యూఢిల్లీ : సమాచార హక్కు చట్టం కింద వేసిన ఓ ప్ర‌శ్న‌కు.. జ‌న‌న‌, మ‌ర‌ణ ద్రువీక‌ర‌ణ రిజిస్ట్రేష‌న్ కోసం ఆధార్ కార్డు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా స్ప‌ష్టం చేసింది.


★ సమాచార హక్కు చట్టం కింద వేసిన ఓ ప్ర‌శ్న‌కు ఆర్జీఐ ఈ వివ‌ర‌ణ ఇచ్చింది. ఒక‌వేళ ఎవ‌రైనా ఆధార్‌ను స్వ‌చ్ఛంధ‌గా స‌మ‌ర్పిస్తే, ఆ డాక్యుమెంట్‌ను డేటాబేస్‌లో స్టోర్ చేయ‌రాదు అని ఆర్జీఐ త‌న స‌ర్క్యూల‌ర్‌లో పేర్కొన్న‌ది. 


★ మ‌ర‌ణ ద్రువీక‌ర‌ణ ప‌త్రం రిజిస్ట్రేష‌న్ కోసం ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రిగా స‌మ‌ర్పించాలా అని విశాఖ‌కు చెందిన అడ్వ‌కేటు ఎంబీఎస్ అనిల్ కుమార్ ఆర్టీఐ వ‌ద్ద అభ్య‌ర్థ‌న చేశారు. 


★ ఆ అభ్య‌ర్థ‌న‌కు బ‌దులిస్తూ.. జ‌న‌న‌, మ‌ర‌ణ ద్రువీక‌ర‌ణ కోసం ఆధార్ నెంబ‌ర్ అవ‌స‌రం లేద‌ని ఆర్జీఐ పేర్కొన్న‌ది. 


★ 1969 నాటి రిజిస్ట్రేష‌న్ ఆఫ్ బ‌ర్త్స్ అండ్ డెత్స్‌(ఆర్‌బీడీ) యాక్టు ప్ర‌కారం ప్ర‌స్తుతం జ‌న‌న‌, మ‌ర‌ణ ద్రువీక‌ర‌ణ కోసం రిజిస్ట్రేష‌న్ జ‌రుగుతున్న‌ట్లు ఆర్జీఐ వెల్ల‌డించింది.

పండితులు చదివిన మంత్ర పఠనం

 అహోబిల నరసింహ స్వామికి జరిగిన అర్చన లో భాగంగా వేద పండితులు చదివిన మంత్ర పఠనం వినండి...అందరి క్షేమం కోసం వారు చదివిన మంత్రాలు వినండి...వారి వాక్కులు ఎంత స్వచ్ఛముగా ఉన్నాయో వినండి..ఎంత స్పష్టముగా ఉన్నాయో కూడా వినండి...నిజంగా వారెంత అదృష్టవంతులు...


ఈ వీడియో ను అందరికీ పంచమని అందరి ఇళ్లల్లో మార్మోగాలని నాకు ఒక మిత్రుడు పంచితే అవశ్యం అని భావించి అందరికీ పంచుతున్నాను...తప్పక వినండి...🙏



జడ్జిలపై జేపీ సంచలన వ్యాఖ్యలు

 జడ్జిలపై జేపీ సంచలన వ్యాఖ్యలు.... ! 


రాజకీయపార్టీల కోసం పనిచేసిన వాళ్ళు జడ్జీలు అవుతున్నారు. చట్టాల పట్ల, రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేని వాళ్ళు కేవలం రికమండేషన్ లతో జడ్జీలు అవుతున్నారు.


జడ్జీలని జడ్జిలే నియమించుకునే విధానంలోనే లోపం ఉంది.


దానిని అడ్డం పెట్టుకొని ఏ మాత్రం అర్హత లేకపోయినా వాళ్ళ సొంత మనుషులని నియమించుకొంటున్నారు . 


ఎలాంటి అర్హతా పరీక్షలు లేకపోవటం కారణంగా వాళ్లకి నచ్చిన జడ్జీలనే నియమించుకొంటున్నారు . 


ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం చేస్తున్న వాదన సమర్ధనీయం.


జడ్జీలకు కూడా పబ్లిక్ కమిషన్ కిందకి తీసుకొచ్చి పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేసే కొత్త విధానం రావాలి. 


                 --- లోక్ సత్తా అధినేత జేపీ...!

ఇంటర్ నెట్ వాడేవారు

 ఈ మెసేజ్ ను భద్రపరచండీ..,షేర్ ఛేయండీ..👇👇👇👇👇


చాలామంది ఇంటర్ నెట్ వాడేవారు మోసపోయి, నన్ను అడుగుతున్న ప్రశ్న...

"నన్ను వేధిస్తున్నారూ, బ్లాక్ మెయిల్ చేస్తున్నారూ, నా అకౌంట్లో డబ్బంతా మాయమైపోతోంది.. ఎలా, ఎవరికి కంప్లైంట్ చేయాలీ.?

అని..



దానికి సమాధానం ఈ లింక్ ను తాకి మీ వివరాలతో పాటూ సమస్య రాసి పంపండి.. ఇక అంతా వీరే చూసుకుంటారు..👇👇👇👇👇👇👇👇👇


మీ MOHAN RAJU DIGALA




Report complaints related to cyber crime or online financial fraud at National Cyber Crime Reporting Portal https://www.cybercrime.gov.in of MHA - Ministry of Home Affairs


సేకరణ

పెట్రోల్ బంక్ లో




 














తిరుమల కొండపై రూమ్

 తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా.. ఇదిగోండి ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ!!


తిరుమల శ్రీవారి దర్శనం ఒకెత్తు.. 

అక్కడ వసతి మరో ఎత్తు.. 

కేశఖండనం, నామకరణం, పెళ్లి తదితర ఫంక్షన్లకు వెళ్తే.. ఏం చేయాలో తెలియదు, 

ఎక్కడ తల దాచుకునే వసతి దొరుకుతుందో తెలియదు.. టీటీడీ కేటాయించే సత్రాల్లో గదుల కేటాయింపు మరో అర్థంకాని బ్రహ్మపదార్థం.. 

రాజకీయంగా పలుకుబడి కలిగిన వారికి,

ఆర్థికంగా బలవంతులకు,

సెలబ్రిటీలకు, అధికారులు, పోలీసులు, ప్రెస్.. ఇలా ఎందరికో ప్రాధాన్యమిచ్చిన తర్వాత చివరాఖరుకు సామాన్యులకు శ్రీవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. దీంతో వసతి దొరక్క అనేక మంది భక్తులు ఆ ఆవరణలోనే గాలికి పడుకుని ఉండే సీన్లు అనేకం… 

అక్కడ పలు మఠాలకు చెందిన, కులాలకు చెందిన సత్రాలున్నాయి… అవి ఆదరిస్తాయి, 

తలదాచుకునే చోటు చూపిస్తాయి… అయితే…?

వాటిని కంటాక్ట్ చేయడం ఎలా..?

ఇదుగో మఠాలు, సత్రాలు, నంబర్లు….

కాకపోతే కాస్త ముందే సంప్రదించండి…

రిజర్వ్ చేసుకొండి… 

ఆ స్వామి కొలువైన ప్రాంగణంలో మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకొండి…

ఇవిగో నంబర్లు, పేర్లు….


మనకు తిరుమలలో వసతి దొరికే ప్రాంతాలు,

వాటి ఫోన్ నంబర్లు:


Mool Mutt Ph:0877-2277499.


Pushpa Mantapam Ph:0877-2277301.


Sri Vallabhacharya Jee Mutt Ph:0877-2277317.


Uttaradhi Mutt (Tirupati) Ph-0877-2225187.


Shree Tirumala Kashi Mutt Ph-0877-2277316.


Sree Raghavendra Swamy Mutt Ph-0877-2277302.


Sri Vaykhanasa Divya Siddanta

Vivardhini Sabha Ph:0877-2277282.


Sri Kanchi Kamakoti Mutt Ph:0877-2277370.


Sri Pushpagiri Mutt Ph-0877-2277419.


Sri Uuttaradi Mutt Ph-0877-2277397.


Udupi Mutt Ph-0877-2277305.


Sri Rangam Srimad Andavan Ashramam Ph:0877-2277826.


Sri Parakala Swamy Mutt Ph:0877-2270597,2277383.


Sri Tirupati Srimannarayana Ramanuja

Jeeyar Mutt Ph:0877-2277301.


Sri Sringari Saradha Mutt Ph:0877-2277269,2279435.


Sri Ahobita Mutt Ph:0877-2279440.


Sri Tirumala Kashi Mutt phone : 222 77316


Udipi Mutt Ph:0877 222 77305


Sri Sri Sri Tridandi Ramanujajeeyar Mutt Ph:0877 222 77301)


Sri Kanchi Kamakoti Peetam Mutt/ Sarva Mangala Kalyana Mandapam Ph:0877 222 77370)


Sri Vallabhacharya Mutt phone : 222 77317


Mantralaya Raghavendra Swami Mutt/ Brindavanam Ph:0877 222 77302


Arya Vysya Samajam S.V.R.A.V.T.S Ph:0877 222 77436


Srirangam Srimad Andavan Ashram Ph:0877 222 77826


Sri Vaikhanasa Ashram Ph:0877 222 77282


Sri Ahobila Mutt Ph:0877-2279440


Sri Sringeri Shankara Mutt/ Sarada Kalyana Mandapam Ph:0877 222 77269


Motilal Bansilal Dharmasala Ph:0877 222 77445


Hotel Nilarama Choultry Ph:0877 222 77784


Sri Srinivasa Choultry Ph:0877 222 77883


Sri Hathiramji Mutt Ph:0877 222 77240


Karnataka Guest House Ph:0877 222 77238


Dakshina India Arya Vyaya Gubba Muniratnam Charities Ph:0877 222 77245


Sri Sringeri Sankara Nilayam Ph:0877 222 79435


Sri Swamy Hathiramji muttam Ph:0877-2220015


అందరికీ ఎంతో ఉపయోగ పడే సమాచారం పదిమందికి Share చెయ్యండి…


ఇట్లు.

మీ..

వెలగా నారాయణరావు.

నర్సీపట్నం.

శ్లోకం 32*

 *శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః*

*శ్రీ సద్గురు పరమాత్మనే నమః – సర్వమహర్షిభ్యోనమః*

*జగద్గురు ఛారిటబుల్ ట్రస్ట్*

*9100939567*

*ఓం శ్రీ లలితాంబికాయై నమః*

*సౌందర్య లహరి – సాధన*

*ప్రథమ భాగః – ఆనంద లహరి*


*శ్లోకం 32*


*శివః శక్తిః కామః క్షితి-రథ రవిః శీతకిరణః*

*స్మరో హంసః శక్ర-స్తదను చ పరా-మార-హరయః |*

*అమీ హృల్లేఖాభి-స్తిసృభి-రవసానేషు ఘటితా*

*భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ || 32 ||*


*ప్రతిపదార్థము :*


*జననీ* = మాతా!;

*శివః* = శివుడు; శక్తిః = శక్తి;

*కామః* = మన్మథుడు;

*క్షితిః* = భూమి;

*అధః* = అటుపైన;

*రవిః* = సూర్యుడు;

*శీతకిరణః* = చంద్రుడు;

*స్మరః* = మన్మథుడు;

*హంసః* = సూర్యుడు;

*శక్రః* = ఇంద్రుడు;

*తత్ అనుచ* = వానికి తర్వాత;

*పరా* = పరాశక్తి;

*మారః* = మన్మథుడు;

*హరయః* = హరి, (విష్ణువు);

*అమీ* = ఈ పన్నెండు అక్షరాలు;

*త్రిసృభిః* = మూడు విధాల;

*హృల్లేఖాభిః* = హ్రీం కారముల చేత;

*అవనానేషు* = విరామస్థానాలలో;

*ఘటితాః* = సమకూర్చబడినవై;

*తే వర్ణాః* = ఆ అక్షరాలు;

*తవ* = నీ యొక్క;

*నామావయవతాం* = రాజరాజేశ్వరి దేవీ మంత్రం యొక్క అవయవాలుగానే;

*భజన్తే* = అంగీకరింపబడి;

సమస్తాన్నీ పొందుతున్నాయి. 


*తాత్పర్యము / భావము :*


*మంగళ ప్రదమైన ‘క’ వర్ణమూ, “శక్తి”ని బోధపరచే “ఏ” వర్ణమూ, కామ ప్రదమైన “ఈ” వర్ణమూ, పృథ్వీ ప్రతిపాదితమైన “ల” వర్ణమూ, తేజస్సుతో కూడిన “హ” వర్ణమూ, శీతలత్వాన్ని చేకూర్చే “స” వర్ణమూ, తత్వాన్ని సూచించే (క) వర్ణమూ, సూర్య బోధితమగు “హ” వర్ణమూ, ప్రతిభను సువ్యక్తంచేసే “ల” వర్ణమూ, పరబ్రహ్మను సువ్యక్తం చేసే సకల వర్ణాలనూ ‘హ్రాం హ్రీం హౄం’ అన్న మూడక్షరాలు చివర చేర్చబడినవై (ఇంతకు ముందే బీజాక్షర ప్రశక్తి చెప్పబడినది). నీ నామావయవము లవుతున్నాయి.*


*కంఠమునకు క్రింది నుండి మొదలుకొని, కటి పర్యంతం నితంబ (పిరుదుల) ప్రదేశము వరకు ఉండే కామరాజకూటమి అనే; (మధ్య కూట స్వరూపిణీ) – మధ్యకూటము స్వరూపముగా గలది.*


*పంచదశీ మంత్ర రాజము యొక్క అయిదు అక్షరములు వాగ్భవ కూటము. అది ముఖ రూపము అని తెలియదగును.*


*కంఠము నుండి కటి పర్యంతము ఉండే భాగము మధ్య కూటమి అని తెలుపబడుచున్నది. దీనినే "కామ రాజు కూటమి" అనియు అందురు. మొదటిది సూక్ష్మము, రెండవదియైన ఇది సూక్ష్మతరము అనబడును. "హ-స-క-హ-ల-హ్రీం" అనే షడక్షరములు, మధ్య భాగముగ భావించి ఉపాసించి తరింతురుగాక. పంచదశీ మంత్ర రాజమునకు ఇప్పటికి 5+6 = 11 అక్షరములు వచ్చినవి. సూక్ష్మరూపమైన పంచదశీ మంత్ర షడక్షరములకు ౼ స్థూలరూప కంఠ్యాధ్యో భాగమునకు దీనిచే అభేదము గ్రహింప దగును.*


*పంచదశాక్షరీ మంత్రానికి శ్రీం బీజం జత చేస్తే షోడశి అని లొల్ల లక్ష్మీ ధర పండితుల వాఖ్య. కాగా కొందరు ఈ బీజము జతచేయడమే షోడశాక్షరి అని నిర్ధారిస్తున్నారు. 'ఈం'కారమే లక్ష్మీ బీజాక్షరం అని, శ్రీ సూక్తంలో చెప్పబడిన 'పద్మినీ మీమ్ శరణ మహం ప్రపద్యే' అనేది దీనికి ప్రమాణమని వీరి భావము.*


*ఋషి పత్ని లోపాముద్ర అర్చించిన పంచదశాక్షరీ మంత్రమిది ౼ 'క ఏ ఈ ల హ్రీం హసకల హ్రీం సకలహ్రీం'.*


*ఉపాసన :*


*బంగారు రేకుపై చెక్కించి పూజించాలి. పెరుగు అన్నం, మినపగారెలు నివేదించాలి. జపసంఖ్య రోజుకి 1000 సార్లు, రసవిద్య లబ్ధికి ఈ ఆరాధన శ్రేష్ఠమైనది.*


*శివః శక్తిః కామః క్షితి-రథ రవిః శీతకిరణః*

*స్మరో హంసః శక్ర-స్తదను చ పరా-మార-హరయః |*

*అమీ హృల్లేఖాభి-స్తిసృభి-రవసానేషు ఘటితా*

*భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ || 32 ||*

పరమత సహనం

 "భారతదేశంలో పరమత సహనం తగ్గిపోతోందో" అని  ఇది తప్పక చదవాలి. 


ఖలాఫ్ అల్-హర్బీ సౌదీ అరేబియాకి చెందిన స్వతంత్ర భావాలు కల కమ్యూనిస్టు మేధావి. పలు విషయాలపై అతడు తన రచనలలో వెలిబుచ్చిన భావాలు ఎన్నో దేశాలలో చర్చనీయాంశాలు అయ్యాయి. 


ఇటీవల "సౌదీ గెజెట్" పత్రికలో తాని వ్రాసిన 'India - A country that rides elephants' వ్యాసంలో భారతదేశాన్ని అత్యంత సహనశీలియైన దేశంగా పేర్కొన్నాడు. భారతీయుల మనోవైశాల్యాన్నే కాదు, అరబ్బుల సంకుచిత ధోరణిని కూడా ఆ వ్యాసం చదివితే అర్థం అవుతుంది. ఆ వ్యాసంలో అతడు ఇలా పేర్కొంటాడు.


"భారతదేశంలో వంద కన్నా ఎక్కువ మతాలున్నాయి. వందకన్న ఎక్కువ భాషలున్నాయి. అయినా అక్కడి ప్రజలు ఎంతో సంయమనంతో శాంతియుత జీవనం సాగిస్తున్నారు. బట్టలు కుట్టుకునే సూది దగ్గర్నుంచీ అంగారక గ్రహంపైకి పంపించిన ఉపగ్రహం వరకు ఏదైనా తయారు చేయగలిగే గొప్ప దేశంగా ఎదగడం కోసం అక్కడి వారందరూ కలసి శ్రమిస్తున్నారు. 


"భారతదేశాన్ని, అక్కడి ప్రజల శాంతియుత సహజీవనాన్ని చూస్తుంటే నాకు కాస్త అసూయ కలుగుతుంది. ఎందుకంటే నేను ఒకే మతాన్ని పాటించే, ఒకే భాషను మాట్లాడే దేశంలో జన్మించేను. ప్రజలంతా ఒకే మతానికి, భాషకు చెందిన వారైనా మా దేశంలో ఎప్పుడూ అల్లర్లు, హత్యాకాండలు జరుగుతూంటాయి. 


"ప్రపంచంలో వివిధ దేశాధినేతలు శాంతి, సహనం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం మనం చూస్తుంటాం. కానీ మతము, భాష, ప్రాంతం, వర్గం వంటి భేధాలేవీ లేకుండా అతి ప్రాచీన కాలం నుండీ శాంతియుత సహజీవనాన్ని ఆచరణాత్మకంగా ప్రపంచానికి చూపించిన దేశం ఒక్క భారతదేశం మాత్రమే.


"కానీ చాలా దేశాలలో ఈ వాస్తవాన్ని ప్రక్కనపెట్టి భారతదేశాన్ని పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న దేశంగానే ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా అసమంజసమైనది, అవాస్తవమైనది. 


"ఈ భూమండలంపై అత్యంత సహనం గల ఏకైక దేశం ఒక్క భారతదేశం మాత్రమే.


"పెట్రోలియం యుగం ప్రారంభం కాక ముందు అరబ్బు దేశాలు చాలా పేద దేశాలు. అప్పుడు అరబ్బులమైన మన దృష్టిలో భారతీయులంటే చాలా ధనవంతులు, నాగరికులు. కానీ ధనవంతులైన మరుక్షణం మన దృష్టిలో భారతదేశం అంటే పేదరికంలో మగ్గిపోతూ వెనుకబడిపోయిన దేశం ఎలా అయిపొయింది? ఇలా భారతదేశం పట్ల క్షణాలలో మన అభిప్రాయం మారిపోవడంలో ఔచిత్యం ఏముంది? 


"అసలు మనమెప్పుడూ భారతీయులు పేదవారా, ధనికులా అనే ఆలోచిస్తుంటాం. నిజంగా మనకు జ్ఞానం ఉంటే పరస్పర విరుద్ధమైన ఆదర్శాలను, ఆలోచనలను ఎలాంటి భావోద్వేగాలు, సంశయాలు లేకుండా స్వాగతించి, విభిన్న ఆలోచనలు కలవారితో వందల సంవత్సరాలుగా శాంతియుతంగా సహజీవనం చేస్తూన్న భారతదేశం నుండి మనం ఎంతో నేర్చుకుని ఉండేవారం. 


"ఒకవేళ మొత్తం అరబ్బు దేశాలలో ఉన్నవారందరినీ భారతదేశానికి తరలించినట్లయితే వారంతా భారతదేశంలో ఒక చిన్న భాగం మాత్రమే అవుతారు. మానవత్వం అనే మహాసాగరంలో ఎలాంటి భయసంకోచాలూ లేకుండా వారు కలిసిపోగలరు. వారిలోని జాత్యహంకారం పూర్తిగా లయమైపోతుంది. ఈ ప్రపంచంలో అన్నదమ్ముల్లా బ్రతకాల్సిన వాళ్ళు ఒకరినొకరు చంపుకోవడం ఏమాత్రం సమ్మతం కాదని తెలుసుకుంటారు. 


"భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద అతి ప్రాచీనమైన ప్రజాస్వామ్య దేశం. మత, జాతి, ప్రాంత, భాషా భేదాలంటే భారతీయులకు తెలియదు. ఎందుకంటే వైవిధ్యాలతో సహజీవనం చేయగలిగే లక్షణం వారి జన్యువులలోనే ఉంది సహజంగా. 


"భారతీయులు ఏనాడూ పేదవారి పట్ల రోత, ధనికుల పట్ల ద్వేషము చూపలేదు.


భారతీయులు చాలా గొప్పవారు. వారిలో ఎన్నో రకాల ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలో ఎవరూ దీనిని త్రోసివేయలేరు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే అందుకు వారిలో భారతీయుల పట్ల కల ఈర్ష్యయే కారణం. దానికి వారు ఎంతో సిగ్గుపడాలి. 


"ఒకవేళ అరబ్బులే భారతదేశానికి వెళ్తే భయపడాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళు భారతీయుల మనసులను ఎక్కడ కలుషితం చేస్తారోనన్నదే. వారు భారతీయులలో మతపరమైన, ప్రాంతీయపరమైన విద్వేషాలకు ఎక్కడ ఉసిగొల్పుతారన్నదే. అంతేకాదు భారతీయులలో గల వైవిధ్యాలను ఆధారంగా చేసుకొని వాళ్ళు ఒకరినొకరు చంపుకునేంత వరకు రెచ్చగొడతారు కూడా."

122. *ఓం శాంభవ్యై నమః.🙏*

 122. *ఓం శాంభవ్యై నమః.🙏*


వరమీవే కద సృష్టికంతటికి, నా భాగ్యంబు నీవే కదా,


కరుణాసాగర! కాంచుమమ్మ నను, నీ కారుణ్య సద్భాగ్యముల్


నిరవద్యంబుగ కొల్చి నీదు పదముల్ నే పొందెదన్, శాంభవీ!


పరమానంద పథంబు నీ స్మరణయే భద్రంబదే మాకిలన్.🙏


అమ్మ పాదములకు ప్రణమిల్లుచు🙏

చింతా రామకృష్ణారావు.

ధార్మికగీత - 46

 *ధార్మికగీత - 46*

                                 *****


       *శ్లో:-ఋణానుబంధ రూపేణ ౹*

             *పశు పత్ని సుతాలయా: ౹*

             *ఋణ క్షయే క్షయం యాంతి౹*

             *తత్ర కా పరిదేవనా ?*


వసుధ ఋణానుబంధమున 

         వర్తిలు పుత్ర కళత్ర వాసముల్ 

పశువులు మానవాళికిని 

          పాయకనుండియు నెల్ల వేళలన్ ,

వసుధ ఋణంబు దీరగను 

          వాటికవే మరి వీడు చుండ , యా 

మసలిన బంధమున్ దలచి

           మానవు డేలను చింత చెందగన్ ? .


✍️ గోపాలుని మధుసూదన రావు