*ఒక సాధారణ దొంగకూ రాజకీయ దొంగకూ మధ్య ఉండే తేడా ఏమిటి?*
1. సాధారణ దొంగ మీ డబ్బు దోచుకుంటాడు;పర్సు, చేతి గడియారం, బంగారు గొలుసు మొదలైనవి దోచుకుంటాడు.
కాని రాజకీయ దొంగ మీ భవిష్యత్తునూ, మీ జీవితాన్నీ, విద్యారోగ్యాలనూ, వ్యాపారాన్నీ దోచుకుంటాడు.
2. చిత్రమేమిటంటే -
సాధారణ దొంగ ఎవరిని దోచుకోవాలో తానే ఎంచుకుంటాడు.
కాని నిన్ను దోచుకునే రాజకీయ దొంగను నువ్వే ఎంచుకుంటావు.
3. సాధారణ దొంగను పోలీసులు తరిమి తరిమి పట్టుకుంటారు.
కాని రాజకీయ దొంగకు ఏ హాని కలుగకుండా పోలీసులే కాపాడుతుంటారు.
మన సమాజం ఉన్న విచిత్ర పరిస్థితి ఇది.
కాని మేం గుడ్డివాళ్ళం కాదని మనం గుడ్డిగా అంటాం.
4. ఈ వ్యవహారమంతటిలోనూ మహా మూర్ఖపు విషయం ఏమిటంటే –
మనం సాధారణ దొంగను అసహ్యించుకుంటాం, చావగొడతాం.
కాని రాజకీయ దొంగను ప్రేమిస్తాం; వాడి కోసం మనం పరస్పరం కొట్టుకుచస్తాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి