🏵️🌸🏵️🌸🏵️🌸🏵️🌸
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
15, అక్టోబర్ 2020, గురువారం
అమ్మ వారి పూజకు
🏵️🌸🏵️🌸🏵️🌸🏵️🌸అమ్మ వారి పూజకు కలశం, విగ్రహం, శ్రీచక్రం తదితరాలలో ఏది శ్రేష్టమైనది? అంటే అమ్మవారిని ఎనిమిది రూపాల్లో అర్చించుకోవచ్చును అని దేవీ భాగవతము తెలియజేస్తోంది. ప్రత్యేకించి నవరాత్రులు లో పూజల్లో కలశ స్తాపన చేస్తారు. ఇంటి సంప్రదాయాన్ని అనుసరించి ఆఖండ దీపాన్ని వెలిగించాలి. ఉత్తర దిక్కు లో గానీ పూజగదిలో గానీ ఉత్తరం దిశగా పద్మం ముగ్గు వేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరచాలి. దానిపై గోధుమలు, బియ్యం, జొన్నలు, శనగలు, మినుములు, నువ్వులు వంటి ధాన్యాలను ఒకదానిపై ఒకటి ఉండేలా పేర్చాలి. కొందరు శనగలు, మినుములు, నువ్వులు ఈ మూడింటిని వేర్వేరు వస్త్రాలు లో ఉంచుతారు. వాటిపైన శక్తి కొద్ది బంగారం, వెండి, రాగి లేదా మట్టి కలశాన్ని పెడతారు. అందులో నీరు పోసి, పంచ పల్లవాలు(రావి, మర్రి, మామిడి, మేడి, జువ్వి) ఉంచి పైన కొబ్బరి కాయను పెట్టాలి. కొబ్బరికాయ పైన రవికెను గోపురం గా చుట్టాలి. కొందరు కలశంపై అమ్మ వారి రూపును కూడా ఉంచి పూజిస్తారు. అమ్మ ను ఆరాధించేందుకు నాలుగు విధానాలు మంచివే. శ్రీచక్రం, విగ్రహం వంటివి ఉంచడమంటే మరింత ఎక్కువగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఏ రూపంలోనైనా భక్తి శ్రద్ధ లతో అమ్మను ఆరాధించవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి