15, అక్టోబర్ 2020, గురువారం

శ్రీమద్భాగవతము

 శుభోదయం 🙏 


వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  


* పద్యం: 1927 (౧౯౨౭)*


*10.1-917-వ.*

*10.1-918-*


*శా. బాలుం డాడుచు నాతపత్ర మని సంభావించి పూగుత్తి కెం*

*గేలం దాల్చిన లీల లేనగవుతోఁ గృష్ణుండు దా నమ్మహా*

*శైలంబున్ వలకేలఁ దాల్చి విపులచ్ఛత్రంబుగాఁ బట్టె నా*

*భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీగోపగోపంక్తికిన్.* 🌺



*_భావము: శ్రీకృష్ణుడు కొండను పైకెత్తిన పద్ధతిని పోతన గారు అద్భుతంగా వర్ణించారు: మేఘాల్లో నుండి పడుతున్న రాళ్ళ వర్షానికి భయభీతులైన నంద వ్రజము లోని ప్రజలను, గోవులను రక్షించటానికి ఆ చిన్ని కృష్ణుడు ఒక పిల్లాడు ఒక గడ్డిపోచ (ఊచ)తో ఆడుకుంటున్నట్టుగా, ఒక పూల గుత్తిని అరచేతిలో పట్టుకున్నంత అలవోకగా, పెద్దదైన ఆ కొండను కుడి చేతితో పైకెత్తి (ఉద్ధరించి) పెద్దగా విస్తరించిన గొడుగు లాగా ఎత్తిపట్టుకున్నాడు._* 🙏🏻



*_Meaning: To protect the frightened folk and cows of Nanda’s village from the rain of stones, the child Sri Krishna lifted Goverdhana hill from its roots and held it high as an umbrella like a child playing with a blade of straw or holding a bunch of flowers in hand._* 🙏🏻



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

కామెంట్‌లు లేవు: