15, అక్టోబర్ 2020, గురువారం

ప్రహ్లాదుడు

 🌺 *ఓం నమో నారాయణాయ* 🌺




*31. అని కుమారకుం డాడినప్రతిపక్షానురూపంబు లయిన సల్లాపంబులు విని దానవేంద్రుండు నగుచు నిట్లనియె.*



*భావము:-* ఇలా శత్రు పక్షానికి అనుకూలమైన మాటలు మాట్లాడుతున్న కొడుకు సల్లాపాలు విని, ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు నవ్వుతూ ఇలా అన్నాడు.



*32. భావము:- ఇలా శత్రు పక్షానికి అనుకూలమైన మాటలు మాట్లాడుతున్న కొడుకు సల్లాపాలు విని, ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు నవ్వుతూ ఇలా అన్నాడు.*



*భావము:-* “మిగతా వాళ్ళందరి పిల్లలు ఎలా చెప్తే అలా వింటారు. ఎదురు చెప్పనే చెప్పరు. చిన్న పిల్లాడికి శత్రు పక్షానికి అనుకూలమైన వాదాలు ఎవరు ఇంత గట్టిగా ఎక్కించారో ఏమిటో?




*33. నాకుంజూడఁగఁ జోద్య మయ్యెడిఁ గదా నాతండ్రి! యీ బుద్ధి దా నీకున్లోపలఁ దోఁచెనో పరులు దుర్నీతుల్ పఠింపించిరో యేకాంతంబున భార్గవుల్ పలికిరో lయీదానవశ్రేణికిన్ వైకుంఠుండు గృతాపరాధుఁ డతనిన్ వర్ణింప నీ కేటికిన్?*



*భావము:-* ఓ నా కుమారా! ప్రహ్లాదా! చూస్తుంటే ఇదంతా నాకు వింతగా ఉంది. ఇలాంటి బుద్ధి నీ అంతట నీకే కలిగిందా? లేక పరాయి వాళ్ళు ఎవరైనా ఎక్కించారా? లేక నీ గురువులు రహస్యంగా నేర్పారా? విష్ణువు మన రాక్షసులకు ఎంతో ద్రోహం చేసినవాడు. అతనిని కీర్తించకు, అతని పేరు కూడా తలచుకోకు

కామెంట్‌లు లేవు: