15, అక్టోబర్ 2020, గురువారం

ధ్యానం

 🌏 ధ్యానం🌏


 ** (ఉత్తరగీత)**


👉 ధ్యానం: - నీ లోపల, నీ బయట, సర్వత్రా వ్యాపించి వున్న పరమాత్మను దర్శించ టానికి నీ లోనికి, నీ పయనం చేసి ఆత్మదర్శనం పొందడం.


🔺 ధ్యానం:- మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో మనలోనికి మనం చేసే ప్రయాణం.


🔺 ధ్యానం:-ఆత్మ, పరమాత్మల కలయిక కోసం చేసే ప్రయత్నంలో ఓ మార్గం.


🔺 ధ్యానం:- వంచించే ఇంద్రియాలు ద్వారా పరమాత్మను గ్రహించగలమన్న అజ్ఞానమును వీడి, బాహ్యవిషయములనెరిగే మనస్సుని, ఎగిసిపడే అహంకారాన్ని అంతమొందించి హృదయంలోని అవ్యక్తమైన కాంతినీ, స్వస్వరూపస్థితిని ఎరుక లోనికి తెచ్చే ప్రక్రియ.


🔺 ధ్యానం:- మనస్సు యొక్క నిశ్చలత్వం.


🔺 ధ్యానం:- మనల్ని పరమసత్యానికి దగ్గరగా తీసుకెళ్ళే మార్గం.


🔺 ధ్యానం:- ఇతర భావాలను విడిచి ఒకే ఒక భావంపై ఏకాగ్రతను కల్గించడం.


🔺 ధ్యానం:- అంతరంగ చైతన్యముకు చేరువకావడం.


🔺 ధ్యానం:-హృదయాంతర్గత ఆత్మచైతన్యంలో జీవించడం.


👉 ఇలాఎందఱో ధ్యానసిద్ధిని పొందినవారు ధ్యానత్వంలో ఉన్న మహిమత్వాన్ని ఇలా ఎన్నోరాకాలుగా నిర్వచించినను ఇది ఎవరికి వారే తెలుసుకోవాల్సిన సత్యం.


 🔺 ఎవరికి వారే తప్పనిసరిగా చేయాల్సిన అంతర్ముఖ ప్రయాణం.


🔺 ఎవరికివారే పొందాల్సిన స్థితి. 


🔺 ఎవరికి వారే పొందాల్సిన అనిర్వచనీయమైన చైతన్యానుభూతి.


👉 ప్రాపంచిక జీవనం, పారమార్ధిక జీవనం సమతుల్యముగా ఉన్నప్పుడే మానవుడిది పరిపూర్ణజీవితమౌతుంది. అది తెలిపేదే ధ్యానం.


👉 ప్రాపంచిక, పారమార్ధిక జీవనగమనములో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత తప్పనిసరి. ఈ రెండూ ధ్యానం వలనే సాధ్యం.


👉 పరిపూర్ణజీవనానికి ధ్యానమే మార్గమని శ్రీకృష్ణ పరమాత్మ, పతంజలి, బుద్ధుడు, గురునానక్, మహావీరుడు మొదలు రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, నేటి సద్గురువులు వరకు; అలానే ఎందఱో ఆధునిక శాస్త్రీయ పరిశోధకులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


👉 ధ్యానం మైండ్ ని శుద్ధిచేసే ఓ ప్రక్రియ.


👉 జీవితం ఎన్నెన్నో సంఘటనలతో, ఒడిదుడుకులతో, మార్పులూచేర్పులతో, సుఖదుఃఖాలతో కూడుకున్నదే జీవితం.


🔺 వీటన్నిటినీ యధాతధంగా స్వీకరించేశక్తి ధ్యానంవలన అలవడుతుంది.


🔺 ధ్యానంవలన సాక్షిభావం, తద్వారా భావ సమతుల్యత అలవడుతుంది.


👉 గతాన్ని నెమరువేసుకోకుండా, భవిష్యత్తు గురించి ఊహాగానాలు చేయకుండా, దేన్నీ ఆశించకుండా ఏ క్షణంకా క్షణం జాగురుకతతో, ఎరుకతో సంపూర్ణముగా జీవించడం ఎలాగో ధ్యానం ద్వారానే అలవడుతుంది.


👉 అంతే కాదు, సంస్కారశుద్ధి, విషయ వాసనలనుండి విముక్తి ధ్యానసాధన ద్వారానే సాధ్యమౌతుంది.


🔺 పరమాత్మ మన ఎరుకలోనికి రావాలంటే హృదయం నిర్మలం కావాలి.


🔺 *హృదయం నిర్మలం కావాలంటే మానసిక అలజడులు, ఆలోచనలు, విషయ వాసనలుండకూడదు

ఇవేవీ ఉండకూడదంటే ధ్యానం ఒక్కటేమార్గం*.


🔺 ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. 


🔺 వాటిని అదిలించి నెట్టివేయలేము. అవి మరల మరల వస్తూనే వుంటాయి. అందుకే పుట్టుకొస్తున్న ప్రతీ ఒక్క ఆలోచనను సాక్షిభావంతో చూడడం, ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టకుండా, కొనసాగించకుండా అలా గమనిస్తూ వుంటే కొంతకాలంకు ఆ ఆలోచనలన్నీ ఆగిపోతాయి.  


👉 ఇదేరీతిలో ధ్యానం చేస్తున్నప్పుడు కొందరు - కృష్ణుడు, బుద్ధుడు, సూర్యుడు, దేవతలు, ప్రకృతి దృశ్యాలు దర్శిస్తూ తాము ధ్యానస్థితిలో ముందుకు పోతున్నామని, మంచి మంచి అనుభవాలు కల్గుతున్నాయని, ఉన్నతమైన ధ్యానస్థితిలో ఉన్నామని అనుకుంటారు.


👉 కానీ అది సరికాదు. నిజమైన ధ్యానంలో మనస్సు మహానిశ్చలంగా ఉండిపోతుంది.


👉 అలా నిశ్చలమైన మనస్సులో ఎటువంటి చిత్రణలు ఉండవు. ఇవన్నీ ఒకవిధంగా స్వాప్నిక దృశ్యాలే అని గ్రహించాలి.


👉 ధ్యానం దైవత్వాన్ని చేరుకోవడానికే తప్ప అనుభవాల కోసం కాదని గ్రహించాలి.


👉 ఇది పరిపూర్ణ ధ్యానం కాదని గ్రహించాలి.


🔺 ధ్యానమంటే కొన్నిమాటలు పునరుక్తి చేస్తూ, జపం చేస్తూ నియమిత సమయంలో కళ్ళుమూసుకొని కూర్చొని చేసే ప్రక్రియ కాదు.


🔺 ఏ పని చేస్తున్ననూ ధ్యానం లా జరుగుతూ ఉండాలి. 


🔺 అంటే చేస్తున్న ప్రతీపనియందు సాక్షిభావంతో ఉండి పనిచేయగలిగినప్పుడు మాత్రమే అది అర్ధవంతమైన, ధ్యానయుక్తమైన పరిపూర్ణజీవితం అవుతుంది.


👉 ధ్యాన సాధన చేస్తున్నమొదట్లో ధ్యానస్థితిలో ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానం చేయడానికి ఆలంబనగా తీసుకున్న ధ్యానవస్తువు (నామం, రూపం, దీపం, శ్వాస మొదలగునవి) ఉంటాయి.


🔺 ధ్యానంలో కొంత ప్రగతి సాధించాక ధ్యానవస్తువు ఉండదు. ఇంకా ధ్యానం తీవ్రతరం అయ్యేసరికి ధ్యానం చేసే వ్యక్తి అంటే ధ్యాని కూడా ఉండడు. 


🔺 సమస్తమూ ధ్యానమందు లయమై పోతాయి.


🔺 ధ్యానకేంద్రమైన విశ్వాత్మలో అంటే పరమచైతన్యంలో ధ్యాని దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, శ్వాస....అన్నీ అన్నీ సమీకృతమై వీలీనమైపోతాయి. 


🔺👉 ఇదీ పరిపూర్ణ ధ్యానస్థితి.


🔺👉 ఇదే సంపూర్ణ ఆత్మధ్యానం. ఇదే ఆత్మనిష్ట.


👉ఆత్మనిష్ట కలుగుటకు ధ్యానమే సాధనమని, ఆ సాధన ఎలా చేయాలో కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయము నందు తెలియజేసెను. 


🔺👉 *మహర్షులనుండి ఇంద్రాది దేవతలవరకు; మహాయోగులనుండి ముముక్షువులవరకు; సద్గురువులనుండి సత్


సాధకులవరకు.........ప్రతివొక్కరూ ధ్యానం చేసి జ్ఞానం పొంది తరించినవారే.*


🔺 ఆత్మధ్యానం యొక్క మహిమత్వమును శుక మహర్షి ఇలా తెలియజేసెను.

సర్వదా నారాయణ స్వరూపమైన ఆత్మను ధ్యానించుటయే గొప్పదని.


🔺👉 ధ్యానయోగం యొక్క మహిమత్వాన్ని ఎన్నో శాస్త్రాలు ద్రువీకరిస్తున్నాయి .ఒక ధ్యానయోగంచే, కట్టెలన్ని అగ్నిచే భస్మమగునట్లు మనకర్మలన్నీ ధ్యానం చేత భస్మమగుచున్నవి.


🔺 భ్రూమధ్యమందు శ్వాసను నిలిపి మనస్సును ఐక్య పరచి ఎవరు ధ్యానింతురో, వారియొక్క శత జన్మార్జితమైన పాపాలన్నియు నశించి నిర్మలు లగుదురు.


 ** (ఉత్తరగీత)**


🔺👉 *నిముషముగానీ, అర్ధనిముషముగానీ ఆత్మధ్యానం చేసిన యెడల మానవులకు కోటి ఆశ్వమేధాది యాగములకంటే ఎక్కువ ఫలితము ఉంటుంది


Courtesy.... Daiva Darsanam

కామెంట్‌లు లేవు: