న్యూఢిల్లీ : సమాచార హక్కు చట్టం కింద వేసిన ఓ ప్రశ్నకు.. జనన, మరణ ద్రువీకరణ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు ఇవ్వాల్సిన అవసరం లేదని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
★ సమాచార హక్కు చట్టం కింద వేసిన ఓ ప్రశ్నకు ఆర్జీఐ ఈ వివరణ ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా ఆధార్‌ను స్వచ్ఛంధగా సమర్పిస్తే, ఆ డాక్యుమెంట్‌ను డేటాబేస్‌లో స్టోర్ చేయరాదు అని ఆర్జీఐ తన సర్క్యూలర్‌లో పేర్కొన్నది.
★ మరణ ద్రువీకరణ పత్రం రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాలా అని విశాఖకు చెందిన అడ్వకేటు ఎంబీఎస్ అనిల్ కుమార్ ఆర్టీఐ వద్ద అభ్యర్థన చేశారు.
★ ఆ అభ్యర్థనకు బదులిస్తూ.. జనన, మరణ ద్రువీకరణ కోసం ఆధార్ నెంబర్ అవసరం లేదని ఆర్జీఐ పేర్కొన్నది.
★ 1969 నాటి రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్(ఆర్‌బీడీ) యాక్టు ప్రకారం ప్రస్తుతం జనన, మరణ ద్రువీకరణ కోసం రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్లు ఆర్జీఐ వెల్లడించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి