15, అక్టోబర్ 2020, గురువారం

నవరాత్రి పూజా

 🔱నవరాత్రి పూజా మహిమలు🔔

         🚩🦜🚩

 

శ్రీ దేవీ భాగవతంలో దేవీ నవరాత్రుల విశిష్ఞతను , మహత్యాన్ని తెలిపే కధలు ఎన్నో . అలాటి కధలలో ఇది ఒకటి. 5వ స్కందములోనిది. ఈ కధ శ్రీ దేవీ మహాత్యంలోనూ

వున్నది.


సురధనుడనే 

మహారాజు

చాలా ఉత్తముడు , ధర్మపాలకుడు. ఇతని

రాజ్యాన్ని కబళించాలని

ఒక కొండజాతి వారు ఆక్రమించుకుంటారు. తన మంత్రులే శతృవర్గము లో చేరి తనను మోసగించారని తెలుసుకొని

మనోవేదన చెందేడు. ప్రాణరక్షణ కోసం తపో వనాలకి వెళ్ళాడు.


అక్కడ సుమేధస్సు మహర్షి కాళ్ళమీద పడి శరణు వేడుకున్నాడు

సురధనుని ఎవరని అడిగి

విషయం తెలుసుకున్నాడు

" రాజా! నీవు ఇక్కడ భయం లేకుండా

వుండవచ్చును. మా తపోభూమిలో మా మహిమని మీరి ఎవరూ రాలేరు.  

కానీ , నీవు మావలనే రాలిన ఎఱ్ఱరంగు

ధాన్యాలను ఏరుకొని తిని జీవించాలి"

అని అన్నాడు మహర్షి.

మహారాజు దానికి అంగీకరించాడు.  

కాని ,సురధనుడి మనసు మాత్రం సదా

ఓడిపోయిన రాజ్యం మీద కోల్పోయిన

సిరిసంపదల మీదే వుండేది.


ఒకనాడు ఇదే చింతనతో

ఒక చెట్టు క్రింద కూర్చుని వుండగా , వ్యాపారి ఒకతను

వచ్చాడు. విరక్తిగా వున్న వ్యాపారిని చూసి " ఎవరు నీవు, ఎక్కడ నుండి వస్తున్నావు? అని అడిగాడు రాజు.


"నా పేరు సమాది . సిరిసంపదలకి కొరత లేదు. ధనాశకి లోనైన నాపిల్లలు,బంధువులు , నన్ను మోసగించి, యిలా అడవులకి

తరిమివేశారు. వారు నాకు ఎంత కీడు చేసినా నా మనసు

వారినే తలుచుకుని ,వారి కోసమే తపిస్తున్నది అని బాధపడ్డాడు వ్యాపారి. 


వ్యాపారిని ఓదార్చిన మహారాజు 

వ్యాపారిని కూడా 

సుమేధస్సు మహర్షి వద్దకు తీసుకువెళ్ళాడు. 


వీరి వేడుకోలు విన్న ఋషి

" నవరాత్రి వ్రతం చేసి అంబికను పూజిస్తే

దేవి అనుగ్రహము వలన మీ కష్టాలు తొలగి పోతాయి " 

అని నవరాత్రి మహిమను

అంబికను పూజించే విధానాన్ని వివరించి, 

మంత్రోపదేశం చేశాడు. 


ఆ విధంగానే మహారాజు, వ్యాపారి, ఇద్దరూ మంత్రాన్ని జపిస్తూ 

కఠోరతపస్సు చేశారు. 

విధి విధానలతో నవరాత్రి

వ్రతం చేశారు. ఫలితంగా

దేవి ఇద్దరికి దర్శనం యిచ్చింది. " రాజా! నీశతృవులను నీవు జయించి

 నీ రాజ్యన్ని సుభిక్షంగా పాలిస్తావు. " అని కటాక్షించింది.


వ్యాపారి ప్రార్ధన వ్యత్యాసంగా వున్నది. " అమ్మా! నాకు ఈ లౌకిక మోహాలనుండి విముక్తి కలిగించే జ్ఞానాన్ని ప్రసాదించు..నేను

యీ సంసార సాగరాన్ని

దాటాలను

కుంటున్నాను.

అని కోరుకున్నాడు.

దుర్గాదేవీ వ్యాపారి కోరుకున్న

విధంగా వరం అనుగ్రహించి

 అంతర్ధానమైనది.

వ్యాపారి, మహారాజు తమ

కష్టాలు తీర్చిన మునికి కృతజ్ఞతలు తెలుపుకొని

ఆశీర్వాదాలు పొంది వెళ్ళిపోయారు.


భక్తుల మొరలాలకించి అంబిక సదా తగిన వరాలిచ్చి కాపాడు

కామెంట్‌లు లేవు: