18, ఆగస్టు 2020, మంగళవారం

కరావలంబ స్తోత్రం*

హే స్వామినాథ కరుణాకర దీనబంధో
శ్రీపార్వతీశ ముఖపంకజ పద్మబంధో
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 1 ||

దేవాదిదేవ సుత దేవగణాధినాథ
దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 2 ||

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
భాగ్యప్రదాన పరిపూరిత భక్తకామ
శృత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 3 ||

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల
చాపాదిశస్త్ర పరిమండిత దివ్యపాణే
శ్రీకుండలీశ ధర తుండ శిఖీంద్రవాహ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 4 ||

దేవాదిదేవ రథమండల మధ్య వేద్య
దేవేంద్ర పీఠనగరం దృఢ చాపహస్తమ్
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 5 ||

హారాది రత్న మణియుక్త కిరీటహార
కేయూర కుండలలసత్కవచాభిరామ
హే వీర తారక జయామర బృందవంద్య
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 6 ||

పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః
పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 7 ||

శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా
కామాది రోగ కలుషీకృత దుష్టచిత్తమ్
శిక్త్వా తు మామవ కళాధర కాంతికాంత్యా
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 8 ||

*భళారే... తెలుగు!*

ఒకప్పుడు ప్రముఖ పాత్రికేయులు శ్రీ భండారు శ్రీనివాసరావుగారు ఫేస్‌బుక్‌లో ఆసక్తికరమైన ఈ క్రింది ఆంగ్ల వాక్యాన్ని పోస్ట్ చేశారు:

An Amazing Sentence in English

Remarkable indeed! The person who made this sentence must be a GENIUS in English vocabulary.

"I do not know where family doctors acquired illegibly perplexing handwriting; nevertheless, extraordinary pharmaceutical intellectuality, counterbalancing indecipherability transcendentalizes intercommunication's incomprehensibleness.''

ఈ వాక్యంలో ఇరవై పదాలున్నాయి. ఒకటవ పదంలో ఒక అక్షరం, రెండవ పదంలో రెండు అక్షరాలు, మూడవ పదంలో మూడు అక్షరాలు, ఈ విధంగా అక్షరవృద్ధిక్రమంలో ఇరవయ్యవ పదంలో ఇరవై అక్షరాలు ఉన్నాయి.

ఇదొక అపురూపమైన చిత్ర రచన. దీనికి ప్రతిగా తెలుగు భాషకు గల శక్తిని వెల్లడిస్తూ ఏల్చూరి మురళీధరరావు గారు ఈ క్రింది వాక్యాన్ని ప్రకటించారు: 

“ఏ మంచి కవైనా విశ్వనాథ గ్రంథావళిని చదవకపోతే కవిత్వరచనలో పద్యనిర్మాణశక్తికి, సద్గుణాలంకారవ్యక్తికి,
రసోచితశబ్దార్థయుక్తికి, సుమకోమలభావభావనకు, నవ్యసంప్రదాయపదగుంఫనకు, భవ్యరసాస్వాదరసాయనవాణికి, పురుషార్థోచితచిత్తవృత్తిచిత్రణకు, భారతీయతామరందాస్వాదలోలుపతకు, అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి, విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థకు, విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి, ఉత్కృష్టలోకసిద్ధార్థమహాపురుషగుణకీర్తనకు, రమణీయార్థనిర్మితశ్రవణమనోహరకావ్యలక్ష్మికి, నానార్థస్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు, అభిధావివక్షితాన్యపరవాచ్యసంలక్ష్యక్రమభావధ్వనికి, శృంగారవీరకరుణహాస్యరౌద్రాద్భుతశాంతాదిరసప్రతీతికి, గిరిశిఖరపతన్నిరర్గళస్రవంతీనిరుపమానధారాశుద్ధికి, ధర్మజ్ఞానభక్తిప్రేమసత్యాద్యుత్తమాదర్శప్రతిపాద్యవస్తుస్వీకృతికి, సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్రపంచశోభాదూరవర్తే!

పై వాక్యంలో 26  అక్షరవృద్ధి దళాలున్నాయి. మొదటి దళం ఒక అక్షరం, రెండవ దళం రెండక్షరాలు, మూడవ దళం మూడక్షరాలు.... ఇలా ఇరవై ఆరవ దళం ఇరవై ఆరు అక్షరాలతో అక్షరవృద్ధిక్రమంలో కూర్పబడి ఉన్నాయి.
*****************************

నీలోని గుడికి... 18 మెట్లు

డి.వి.ఆర్‌. భాస్కర్‌(సాక్షి)

మనిషి మనసులో దైవత్వం ఉంటే... మనిషి ఉనికి ఆలయం అవుతుంది. ఈ 18 మెట్లను అధిరోహించి... మీలోని దైవత్వాన్ని చాటి చెప్పండి. మీలోని సుగుణాలతో... సమాజంలోపరివర్తనకు దారులు వేయండి.

"బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు " గారి ప్రవచనాల నుంచి జల్లెడ పట్టి... మీ కోసం అల్లిన విశిష్ఠ సుమమాల ఇది.

సృష్టిలో ఎదుటివారు చెప్పినది విని దాంట్లోని నిజానిజాలు తర్కించే శక్తి మానవుడి కొక్కడికే ఉన్నది. కానీ దురదృష్టం ఏమంటే నేటిరోజుల్లో నేను నమ్మిందే కరెక్టు, నా ఇష్టం వచ్చిందే నేను చేస్తాను అనడమే గొప్ప విషయంగా చలామణి అవుతోంది. మహాభారతంలో దుర్యోధనుని వెంట భీష్మద్రోణ కృపాచార్యులున్నా ఎందుచేత మట్టుపెట్టబడ్డాడనేదానికి ఒకటే కారణం చెబుతారు పెద్దలు. దుర్యోధనుడితో మహర్షులందరూ చెప్పారు... ‘‘నీవు చేస్తున్నది తప్పు. నీ పనివల్ల పాడైపోతావు. మా మాట విను. ఇలా చెయ్యకు’’ అన్నారు. అందుకాయన– ‘‘మీరు చెప్పేది మంచని తెలిసినా నేను పాటించను, మీరు చెప్పేది చెడని తెలిసినా నేను పాటించకుండా ఉండలేను’’ అన్నాడు. ఆ తత్వం పశువు కన్నా హీనం, అత్యంత ప్రమాదకరం.

1 . సంస్కారబలం ఉండాలి
సంస్కారమనే మాట గొప్పది. చదువు దేనికోసం? సంస్కారబలం కోసం. చదువుకు సంస్కారం తోడయితే మీరు లోకానికి ఏ హితకార్యమైనా చేయగలరు. యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది. సంస్కారబలంతో మీకు తెలియకుండానే గొప్ప వ్యక్తిత్వం ఏర్పడుతుంది.

2 . మోహాన్ని పోగొట్టుకోవాలి
మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడేవాళ్లు ఎక్కడికెళ్ళినా దొరుకుతారు. మీ క్షేమం కోరి, మీతో కఠినంగా మాట్లాడేవ్యక్తి దొరకడం కష్టం. దొరికినా అటువంటి మాట వినేవారు ఉండరు. ఒకవేళ అలా ఇద్దరూ దొరికితే జన్మ సార్థకమౌతుంది. మోహంలో పడిన అర్జునుడికి భగవద్గీతంతా చెప్పాడు కృష్ణ పరమాత్మ. చివరన ‘నీకేం అర్థమయింది’ అని అడిగాడు. ‘‘నాకు మోహం పోయింది. స్మృతి కలిగింది. నేను యుద్ధానికి బయల్దేరుతున్నా’’ అన్నాడు అర్జునుడు.

3 . తప్పొప్పుల కూడిక
ఈప్రపంచంలో ఎవరూ ఒప్పులకుప్ప కాదు. నాలో దోషం తెలుసుకుంటే క్షమార్పణ అడుగుతా. మారీచుడు చెప్పాడు రావణుడికి... ‘‘నీకేంలోటు, ఇంతమంది భార్యలున్నారు. కాంచనలంక ఉంది, భటులున్నారు. రాముడి జోలికి వెళ్ళకు. వెళ్ళావా, అన్నీపోతాయి’’ అన్నాడు. అన్నీ విన్న రావణుడు ‘‘నువు చెప్పేది అయిపోయిందా. అయితే విను. నువ్వు చచ్చిపోవడానికి ఎలాగూ సిద్ధం. నామాట వింటే రాముడిచేతిలో చచ్చిపోతావు. వినకపోతే నా చేతిలో చస్తావు. ఎలా చచ్చిపోతావో చెప్పు’’ అన్నాడు. అంతేతప్ప నేను వింటానని అనలేదు. అలా అననందుకు అంత తపశ్శక్తి ఉన్న రావణాసురుడు చివరకు ఏమయిపోయాడు?

4. మాట వినడమన్నది తెలుసుకోవాలి
మహాభారతం సమస్తసారాంశం ఇదే. దుర్యోధనుడి దగ్గరకెళ్ళి మహర్షులందరూ చెప్పారు, కొన్ని గంటలపాటూ చెప్పారు... అన్నీ విన్నాడు. అన్నీ విని వెటకారమైన మాటొకటన్నాడు. అహంకారబలం అది – ‘‘నాకు ధర్మం తెలియదా! తెలుసు. కానీ అలా చెయ్యాలనిపించడం లేదు. అయినా నేను తప్పులు చెయ్యడమేమిటి! నాకు చెబుతారెందుకు’’ అన్నాడు. మహర్షులు మాట్లాడుతుంటే సరిగా వినకుండా తొడలుకొట్టాడు, చివరకు తొడలు విరిగి పడి పోయాడు.

5 . పెద్దలమాట శిరోధార్యంగా స్వీకరించు
తల్లి, తండ్రి, గురువులు, అనుభవజ్ఞులు, సమాజంలోని పెద్దలు చెప్పేది శ్రద్ధగా వినాలి. అయితే వారెప్పుడూ నీ దగ్గరే ఉండి ఇలా చెప్పడం సాధ్యపడుతుందా ? సాధ్యమే, ఎలానో తెలుసా? నేను చంద్రశేఖరేంద్ర భారతీ స్వామివారి అనుగ్రహభాషణం చదువుతుంటే, నా పక్కనే వచ్చి కూర్చుని స్వామి నాతో మాట్లాడుతుంటాడు. పరమాచార్య ప్రసంగాలు చదవండి, భారతీతీర్థస్వామి వారి ప్రసంగాలు చదవండి. పీఠాధిపత్యం వహించిన వారి వాక్కులు చదవండి. రామకృష్ణ పరమహంస, ఎపిజె అబ్దుల్‌ కలాం గారి మాటలు చదవండి.

6 .బాగుపడినా, పాడయిపోయినా కారణం–జడత్వమే
జడమనే మాట ఒకటుంది. జడం–అంటే చైతన్యముంటుంది, కానీ ప్రతిస్పందన ఉండదు. ఒక రాతిలో చైతన్యం లేదని చెప్పలేం. కానీ దానిలో ప్రతిస్పందన ఉండదు. మీరు వెళ్ళి ఒక చెట్టును కొట్టారనుకోండి. మీకు వినబడకపోవచ్చు కానీ, దానిలో ప్రతిస్పందన ఉంటుంది. ఈ ప్రతిస్పందించగల శక్తి జడత్వానికి విరోధి. జడత్వం–అంటే చైతన్యం ఉండి కూడా ప్రతిస్పందించలేని బతుకు. ఒక మాటంటే ప్రతిస్పందన ఉండదు. అలాంటి ప్రతిస్పందనలేని లక్షణంలో నుంచి జడత్వం ఆవహిస్తుంది. అసలు లోకంలో ఒక వ్యక్తి వృద్ధిలోకి వచ్చినా, ఒక వ్యక్తి పాడయిపోయినా కారణమేమిటని అడిగింది శాస్త్రం. అందుకు జడత్వమే కారణం.

7. ఆదర్శాలు చెప్పడమే కాదు... ఆదర్శంగా మారాలి
ఎప్పుడు ఏం చేస్తున్నా శ్రీరామాయణంలో చెప్పిన విషయాలను ఆదర్శంగా తీసుకుని ఆచరణలోకి తీసుకు వచ్చే ఒక కార్యశీలిని ‘నడిచే రామాయణం’ అంటారు. తాను చెప్పడం వేరు, తానే ఆ వస్తువుగా మారడం వేరు. చెప్పడం అందరూ చెప్తారు. ‘‘సర్వోపదేవ ఉపదేశాయ సర్వే వ్యాసపరాశరః:’’. ఇంకొకడికి చెప్పమంటే ప్రతివాడూ వ్యాసుడే, ప్రతివాడూ పరాశరుడే. కానీ నీవు చెప్పినదాంట్లో నీవెంత ఆచరిస్తావన్నదాన్నిబట్టి నీవు ఆదర్శంగా మారడమనే వస్తువు సిద్ధిస్తుంది.

8. ఎవరిలోపాన్ని వారే దిద్దుకోవాలి
నాకు ఇలా ఉండటం తప్ప ఇంకోలా రాదనుకోవడం చాలా భయంకరమైన స్థితి. అది దిద్దుకోవలసిన స్థితి. మనిషి తాను తనలో ఉండకూడని లోపాన్ని దిద్దుకుంటే పదిమందికీ అతను పనికొస్తాడు. పదిమంది మీతో మాట్లాడటానికి అవకాశం ఇస్తే, మీరేమీ చేయాలో మీరు నిర్ణయం చేసుకోగలరు. మీ అభిప్రాయానికి ఒక స్పష్టత వస్తుంది. అసలు అందరూ మీ దగ్గరికి రావడానికి భయపడిపోయే స్థితిని కలిగిస్తే, ‘‘మీరు ఎక్కడ ఎలా ఉండి ఏం ప్రయోజనం’’ చెప్పండి.

9. కోపాన్ని తగ్గించుకోవాలి
మీ కోపాన్ని మీకు మీరుగా పరిశీలించి దిద్దుకోవాలి తప్ప. నాకు కోపం వచ్చేసిందండీ. నేను కోపిష్టివాడినండీ అన్న తరువాత మీ ఆ కోపాన్ని తగ్గించగలిగే వాడు ఉండడు. దానికన్నా శత్రువు లేడు. నేను ఇలా ఉండవచ్చా? ఇంతటి కోపమేమిటి నాకు. ఈ కోపం వల్ల నేను సాధించేదేమిటి? అని కోపం వచ్చినప్పుడు మీరు కాసేపు ఏకాంతంలో కూర్చుని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీకు వచ్చిన కోపాన్ని మీరు పరిశీలనం చేసుకొని కోపాన్ని విడిచిపెట్టగలిగిన వాడెవరో వాడు దేశానికి, సమాజానికి పనికొచ్చి తీరుతాడు.

10. జీవితం ప్రణాళికా బద్ధంగా ఉండాలి
అధికారులు కింది వారిని సంప్రదించాలి. పని చేయడంలోని సాధకబాధకాలను తెలుసుకోవాలి. అధికారి చేతిలో వేలకోట్ల రూపాయల నిధులు విడుదల చేసే అధికారం ఉంటుంది. అవి సక్రమంగా ఖర్చుకావాలి. ప్రజలకు ఉపయోగపడాలి. అందుకు సరైన ప్రణాళిక ఉండాలి. రేపు మీరే ఆ అధికారి అయితే? అందుకే కత్తికి రెండు వైపులనూ అర్థం చేసుకుని ప్రణాళిక రచన చేయడానికి తగిన నైపుణ్యాన్ని అలవరుచుకోవాలి.

11. వినండి, వినడం నేర్చుకోండి
ఒక సమస్యను బాగా పరిశీలించి, అవసరం అయితే కిందికి వచ్చి విని దానిని విశ్లేషణం చేసే నైపుణ్యం ఉండాలి. ఎవరైనా మాట్లాడటం మొదలు పెట్టేటప్పటికి రంధ్రాన్వేషణ చేయడం అన్నది జీవితంలో అలవాటు అయిపోయిందనుకోండి. అంతకన్నా ప్రమాదకరమైన అలవాటు ఇంకోటి లేదు. మీ జీవితంలో పైకి రావాల్సిన మార్గాలన్నీ మూసేసుకున్నట్టే. ఎవరు మాట్లాడుతున్నారన్నది కాదు. ఆ మాటలలో మనకు ఏమైనా సారాంశం అందుతుందా? అని ఎదురు చూసి, అందులో ఒక్క మంచి మాటను పట్టుకుని జీవితాన్ని మార్చుకోగలిగితే... వారి జీవితం చక్కబడుతుంది.

12. మీరు ఏది ఎందుకు చేస్తున్నారో స్పష్టమైన అభిప్రాయంతో ఉండండి
నేను ఒక మాట చెబుతాను. మహాపురుషుడు వేరు, ఆ మహాపురుషుడు రాసిన పుస్తకం వేరు కాదు. వాల్మీకి వేరు, వాల్మీకి రామాయణం వేరు కాదు. ఇవి కలిసే ఉంటాయి. ఒక చంద్రశేఖరేంద్రస్వామివారు ఎప్పుడూ మీ పక్కన ఉండాలంటే ఆయన సందేశాల పుస్తకం మీ దగ్గర ఉండాలి.

13. మృత్పిండంలా కాదు... రబ్బరు బంతిలా ఉండాలి
పదిమందికి ఉపయోగపడకుండా ఎప్పుడు పోతారో తెలుసాండి. మీలో తట్టుకునే శక్తి లేనప్పుడు. మట్టి ముద్దను మీరు ఇలా పట్టుకుంటే పొరపాటున మీ చేతిలోంచి జారికిందపడిపోయిందనుకోండి. ఇహ అది పైకి లేవదు. అదే రబ్బరు బంతి అయితే ఎంత కిందపడిందో అంతపైకి లేస్తుంది. చిన్న పొరపాటు కూడా జరగకుండా మీ జీవితం ముందుకు సాగదు. మీరు ఎంత గొప్పవాళ్లయినా మీకు వంక పెట్టకుండా ఉండలేరు. ఎవరో ఒకరు వంకపెట్టారని మీరు మృత్పిండమై పాడైపోకండి. మీవల్ల ఏదో ఒకనాడు పొరపాటు జరగవచ్చు. జరిగిననాడు మట్టి ముద్దలా కిందపడిపోకండి.

14. నిరాశను దరిచేరనివ్వకండి
అబ్దుల్‌ కలాంగారి కెరీర్‌ ఎక్కడ నుండి ప్రారంభం. ఆయన కోరుకున్న ఉద్యోగం ఒకటి. ఆయనకు వచ్చిన ఉద్యోగం ఒకటి ఆయన నిరాశతో ఋషికేశ్‌లోని ఒక స్వామిజీ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. స్వామిజీ అలా వెళుతూ నీరసంగా కూర్చున్న కలాంగారిని పిలిచి అడిగారు. ఏం ఎందుకలా కూర్చున్నావని. ఈయనన్నారు. ‘‘నేను ఫలానా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లాను, అది పొందడం నాకిష్టం. కాని నేను సెలెక్ట్‌ అవ్వలేదు. ఏదో ఈ ఇంటర్వ్యూ అని మరో దానికి వెళ్లాను, సెలెక్ట్‌ అయ్యాను. ఇప్పుడు నాకీ ఉద్యోగం చేయాలని లేదు. నాకిష్టంలేదు’’ ఆ స్వామీజీ ఒక చిరునవ్వు నవ్వి అన్నారు. ‘‘నీవు కోరుకుంటున్నదే దొరకాలని ఎందుకనుకుంటున్నావు. ఏమో ఈశ్వరుడు నీ ద్వారా ఈ జాతికి యేం చేయించాలనుకుంటున్నాడో’’ ఆ మాట ఆయన మీద పనిచేసింది. అంతే ఈ దేశానికి ఉపగ్రహాలు తయారు చేసుకోవడానికి సత్తానిచ్చిన మహాపురుషుడయ్యాడు.

15. మంచి మంచి పుస్తకాలు చదవండి
ఏ పుస్తకం పడితే అది చదవకండి. వివేకానందుని ఉపన్యాసాలు చదవండి. మీకెంతో ధైర్యం వస్తుంది. పేడలో పురుగుపుట్టి పెరిగినట్లు బ్రతకకూడదు. మంచిగా బ్రతకడానికి కలేజా కావాలి. రామకృష్ణ పరమహంస కథలు చదవండి. చాలామందిలో తెలుగు మాట్లాడాలా? ఇంగ్లిషు మాట్లాడాలా అన్న సందిగ్ధం మొదలైంది. ఇంగ్లిషు బాగా చదువుకుని పాసవండి. చక్కగా తెలుగులో మాట్లాడండి. మీరు పెద్దయ్యాక రామాయణ గ్రంథప్రతుల్ని వేయి ముద్రించి పంచిపెట్టండి. ఆదివారాలు సాహితీ సభలకు వెళితే చక్కగా తెలుగులో మాట్లాడండి. పోతన గారి నాలుగు పద్యాలు చెబుతూ ప్రసంగం చేయండి. గురువుల పట్ల, పెద్దల పట్ల మర్యాదను సంతరించుకోండి.

16. ఆరాధించడం కాదు... ఆదర్శంగా తీసుకోవాలి
ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌కు ఉత్థాన పతనాలున్నాయి. ఎంత కిందకి పడిపోయాడో అంతపైకి లేచాడు. టెండూల్కర్‌ క్రికెట్‌ చూడటం కాదు. టెండూల్కర్‌ వెనుక ఆ స్థాయికి ఎదగడానికి ఉన్న కారణం చూడండి. ఒక బాల్‌ వస్తున్నప్పుడు గ్రద్ద ఆకాశంలో ఉండి కోడిపిల్లను చూస్తున్నట్టు చూస్తూ ఉంటాను. బంతి ఎక్కడ పడుతుంది. దీన్ని ఏ డైరెక్షన్లో కొట్టాలి? అని... అంతే! స్ట్రోక్‌ అప్లై చేస్తాను అన్నాడు. అలా మీరు కూడా మీ గురువుల గురించి చెప్పేటటువంటి శీలాన్ని అలవాటు చేసుకోండి.

17. విజయాన్నీ, వైఫల్యాన్నీ సమానంగా తీసుకోవాలి
మనం చేసే ప్రతి ప్రయత్నంలో విజయం, వైఫల్యం ఉంటుంటాయి. ఒక చోట విజయం వరిస్తే ఇక నా అంతటి వాడు లేడని రొమ్మువిరుచుకుని తిరగకూడదు, అక్కరలేని భేషజాలకు పోయి పాడయి పోకూడదు. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయత్నం ఫెయిల్‌ అయినట్లు కనబడుతుంటుంది. అలా ఫెయిలవడం నీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం కావాలి. కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా వైఫల్యం సంభవిస్తే బెంగపెట్టుకుని స్తంభించి పోకూడదు. మళ్ళీ ఉత్సాహంగా పూనికతో వృద్ధిలోకి రావాలి.

18. పొగడ్తకు పొంగిపోకండి
ఎప్పుడైనా సరే పొగడ్తకు మించిన మత్తు ఉండదు. పొగడ్తకు మించి లోకంలో పాడవడానికి మరొక కారణం కూడా కనిపించదు. జీవితంలో పొగడ్త అన్నది ఎంతమోతాదులో పుచ్చుకోవాలో అంతే మోతాదులో పుచ్చుకోవాలి. మందులే కదా అని మోతాదుకు మించి తీసుకుంటే విషమై చచ్చిపోతారు. అలాగే నీవు వృద్ధిలోకి రావడానికి పొగడ్త కూడా ఎంతవాడాలో అంతే వాడాలి.

గురుగీత వారి బ్లాగ్ నుండి  సేకరణ
***************

#బ్రాహ్మణులచరిత్ర

#బ్రాహ్మణులచరిత్ర - #బ్రాహ్మణగోత్రపురుషులు :
#బ్రాహ్మణులలోశాఖలు - #వైదికులు #మరియు #నియెాగులు (ప్రధమ భాగము)...

కొద్దిరోజుల క్రితం "మహామంత్రి తిమ్మరుసు చరిత్ర" పై నేను పెట్టిన టపా పై స్పందించిన ముఖపుస్తక మిత్రులు 'జానీ యాదవ్ గారు' - "బ్రాహ్మణులలోని వైదిక మరియు నియెాగి శాఖల తేడా ఏమిటని, సవివరంగా తెలియజేయమని" అడిగారు. దీనిపై 'బ్రాహ్మణుల చ

#బ్రాహ్మణులచరిత్ర - #బ్రాహ్మణగోత్రపురుషులు :
#బ్రాహ్మణులలోశాఖలు - #వైదికులు #మరియు #నియెాగులు (ప్రధమ భాగము)...

కొద్దిరోజుల క్రితం "మహామంత్రి తిమ్మరుసు చరిత్ర" పై నేను పెట్టిన టపా పై స్పందించిన ముఖపుస్తక మిత్రులు 'జానీ యాదవ్ గారు' - "బ్రాహ్మణులలోని వైదిక మరియు నియెాగి శాఖల తేడా ఏమిటని, సవివరంగా తెలియజేయమని" అడిగారు. దీనిపై 'బ్రాహ్మణుల చరిత్ర వారిలోని విభిన్న శాఖలకు' సంబంధించి నేను పరిశోధించి సేకరించిన సమాచారాన్ని సవివరంగా కొంత ఇక్కడ చర్చిస్తాను. 

పరాత్పరుడైన 'పరమేశ్వరుని' ముఖమునుండి ఆయన యెుక్క ఉఛ్వాశనిశ్వాసములుగా వెలువడినదే సృష్ట్యాదిలో ఒక్కటే ఐన "వేదరాశి". "వేదాలే" మన భారతీయ సంస్కృతికి మూలస్థంభం. ఈ వేదములే ప్రమాణముగా తీసుకొని, అవి బోధించే విధముగా జీవించే ప్రజల సంస్కృతినే "సనాతన ధర్మం" అంటున్నాం. సనాతన భారతీయ సంస్కృతి మరియు వైదికధర్మ స్థాపకులైన "#సప్తబుషులకు" 'వేదదర్శనం' అయిందని మనకు వైదిక సాహిత్యం మరియు బౌద్ధసాహిత్యం స్పష్టం చేస్తున్నాయి. 'అపౌరుషేయమైన' కాలనిర్ణయం చేయలేని ఈ అపార 'ఏకైక వేదరాశి' తదనంతర కాలములో బుక్, యజు, సామ మరియు అధర్వ భాగములుగా విభజించబడినది. ఇటువంటి అతిప్రాచీన బుషిధర్మమైన ఆర్షసంస్కృతినీ, వేదధర్మాన్ని మనసావాచాకర్మణా త్రికరణశుధ్ధిగా ఆచరిస్తూ, శాస్త్రప్రమాణాన్ని నిత్యజీవితంలో అనుసరిస్తూ, వేదవిహితమైన కర్మలనే ఉఛ్ఛాశ్వ నిశ్వాసములుగా జీవిస్తూ, 'బుషుల ఆదర్శాన్ని' సమాజంలో స్థాపించి, వైదిక సంస్కృతీ సంప్రదాయములను రక్షిస్తూ భారతదేశపు నలుమూలలా వ్యాపింపజేసిన వేదయుగపు ఆర్యబుషుల సంతతివారే #బ్రాహ్మణులు. 

#బ్రాహ్మణులఆవిర్భావం....

అతిప్రాచీనమైన "బుగ్వేదం" లో సుప్రసిద్ధమైన పురుషసూక్తం దశమ మండలం (10.90.12) లోని శ్లోకం : - 

"బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూ రాజన్యః కృతః |

ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత ||" 

ఇదే, 'తైత్తరీయారణ్యకమ్ - తృతీయప్రశ్న - 5' లో కూడా ఉన్నది. దీని అర్ధం "సహస్ర శీర్షుడు, సహస్రాక్షుడు, సహస్రపాదుడు, సర్వవ్యాపకుడు ఐన మహాపురుషుని ముఖమే 'బ్రాహ్మణుడు' అని అర్ధం. అనగా, 'బ్రాహ్మణుని జన్మ' ఆ విశ్వవ్యాపకుడైన విరాట్ పురుషుని వాక్కుకు కేంద్రమైన నోటి నుండి జరిగిందని అర్ధం. మిగిలిన భాగములైన బాహువులు, ఊరువులు, పాదములనుండి వరుసగా రాజన్యులు (క్షత్రియులు), వైశ్యులు, శూద్రులు ఉధ్భవించారని" పురుషసూక్తం స్పష్టం చేస్తున్నది. 'భారతీయ సంస్కృతి' వ్యాప్తికి మూలపురుషులైన 'ఆర్యులు' ఉత్తరాదినుండి దక్షిణాదికి వ్యాపిస్తూ స్థానిక ప్రాంతీయ అనార్య తెగలను తమలో లీనం చేసుకుంటున్న క్రమంలో, ఈ "చాతుర్వర్ణ వ్యవస్థ" రూపొందిందని చరిత్ర పరిశోధకుల అభిప్రాయం.

మనుస్మృతి 'బ్రాహ్మణుల విధుల' గురించి ఈ విధముగా చెప్పుచున్నది : - 

"అధ్యాపన మధ్యయనం యజనం యాజనం తధా
దానం ప్రతాగ్రహశ్చైవ షట్కర్యాణ్యగ్రజన్మనః" 

అనగా, "తను చదువుకుంటూ ఉండడం, శిష్యులకు బోధించడం, యజ్ఞాలను చేయించడం, దానాలు ఇవ్వడం, తీసుకోవడం అనేవి బ్రాహ్మణుల విధివిధానాలని" అర్ధం.

"బ్రహ్మన్" అనే సంస్కృత శబ్దం నుండి 'బ్రాహ్మణ' అనే మాట పుట్టింది. 'బృహ్' అనే ధాతువు నుండి 'బ్రహ్మన్' ఏర్పడినది. 'బృహ్' అనగా 'వ్యాపించే లక్షణం కలది' అని అర్ధం. 'బ్రహ్మన్' అనే పదానికి 'విశ్వశక్తి, యజ్ఞము' అనే అర్ధాలున్నవి. 'బ్రహ్మ' అంటే 'వేదం, జ్ఞానము'. ఈ 'బ్రహ్మ' శబ్దానికి 'అణ్' ప్రత్యయం చేర్చడంతో 'బ్రాహ్మణ' శబ్దం వచ్చిందనీ "బ్రాహ్మణ రాజ్య సర్వస్వం" వివరణ. అనగా వేదాధ్యయనం, యజ్ఞము చేయువారు, ఆత్మజ్ఞానము తెలిసిన వారు 'బ్రాహ్మణులు' అని అర్ధం చేసుకోవచ్చు. 

ఈ అర్ధంలోనే 'జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారు', 

"జన్మనా జాయతే శూద్రః సంస్కారా ద్ద్విజ ఉచ్చతే
వేదపాఠీ భవే ద్విప్రః బ్రహ్మజ్ఞానాత్తు బ్రాహ్మణః" 

 అని నుడివారు...

అనగా, పుట్టుకతో అందరూ 'శూద్రులే' అయినా, తమతమ విధినిర్వహణ సంస్కారాలను బట్టి 'ద్విజులు' గానూ, వేదపాఠాలను చదవడం వల్ల
'విప్రులు' గానూ, బ్రహ్మజ్ఞానము పొందడం వల్ల 'బ్రాహ్మణులు' గానూ అవుతారని శంకరులు వివరించారు.

#బ్రాహ్మణులలోతరగతులు...

బ్రాహ్మణవంశం లో పుట్టినంత మాత్రాన అందరూ బ్రాహ్మణులు కాలేరని అంటారు. తదనుగుణమైన సంస్కారాలను బట్టి  బ్రాహ్మణులలో ఈ క్రింది 'విభజన' (తరగతులు / స్థాయిలు) ఉన్నవి. 

ఉపనయనాది సంస్కారాలు, వైదికకర్మలు లేని వారు 'మాత్రులు', వైదికాచారాలు పాటిస్తూ శాంతస్వభావులైన వారు 'బ్రాహ్మణులు', బ్రాహ్మణోచితమైన సత్కర్మలు ఆచరించేవారు 'శ్రోత్రియులు', నాల్గు వేదాలనూ అధ్యయనం చేసిన వారు 'అనూచానులు', ఇంద్రియాలను తమ వశంలో ఉంచుకున్న వారు 'భ్రూణులు', ఎప్పుడూ అరణ్యాలలో, ఆశ్రమాలలో ఉండేవారు 'బుషికల్పులు', రేతస్కలనం లేక నియమితాహారులై సత్యప్రజ్ఞులైన వారు 'బుషులు', కామక్రోధాలకు అతీతులై, నిరతమైన సత్యనిష్ఠ తపోనిష్ఠ కలిగి సంపూర్ణ తత్వదర్శనులైన వారు 'మునులు'...

#బుషులు - #గోత్రపురుషులు
(గోత్రం, ప్రవర, సూత్ర, వేదశాఖ వ్యవస్థ)....

"బ్రాహ్మణులు" తమ మూలాన్ని వారి వంశమూలపురుషులైన 'సప్తబుషుల' పరంగానే చెప్తారు. ఆ బుషిమూలమే 'గోత్రవ్యవస్థ'. ఏ ఏ మహాత్ములు ఏ బుషియెుక్క వంశంలో పుట్టారో ఆ మహాత్ముల స్మరణే "గోత్రం" అని అనవచ్చు. 

'గౌః' అనే సంస్కృతపదం నుండి 'గోత్రం' అనే పదం ఆవిర్భవించింది. 'గౌః' అనగా 'గోవులు, ఆవులు' అని అర్ధం. 'గోత్ర' అనే సంస్కృత పదానికి 1. భూమి 2. గోవుల సమూహం అని రెండు అర్ధాలున్నవి. ప్రాచీన ఆర్యజనుల, బుషుల ప్రధానమైన సంపద ఇవే. బుగ్వేద సమాజంలో ఒక్కొక్క గోవుల సమూహానికి (గుంపుకు) ఒక్కో 'బుషి నాయకత్వం వహించేవారు. ఫలానా సమూహం లేదా గుంపు (మంద) కు నాయకత్వం వహించే 'బుషిప్రముఖుడిని' #గోత్రపురుషుడు అంటారు. ఇలా ఒక సమూహానికి (లేదా) గోత్రానికి అధినాయకత్వం వహించేవారిని #గోత్రపతులు అనేవారు. ఒక గుంపులోని
'సగోత్రీకులనీ', వారంతా సంబంధీకులనీ (నేటి జన్యుశాస్త్రపరంగా రక్తసంబంధీకులు), ఈ సగోత్రీకుల మధ్య వివాహం నిషిధ్ధమనే నిబంధన కాలక్రమంలో ఏర్పడినది. 'బ్రాహ్మణులకు గోత్రాలు' వారి మూలపురుషులైన బుషుల పేరుమీదే ఉంటాయి. వాటినే #బుషిగోత్రాలు అంటారు. వేదమతం వ్యాపించే క్రమంలో తదనంతరం ఈ వ్యవస్థ మిగిలిన వర్ణాల వారికీ అమలులోనికి వచ్చింది. 

#గోత్రం : ఒక వంశమునకు మూలపురుషునికి చెందినది 'గోత్రం'. 'వంశక్రమం' లో ఒక మహర్షిసంతతి కి చెందిన వారందరూ, ఆయన పేరుగల గోత్రమునకు చెందుతారు. ప్రాచీన ఆర్యులు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య తదితర విభాగములుగా విడివడ్డారు. వేర్వేరు బుషుల సంతతిగా ఉన్న బ్రాహ్మణులు తమను విభిన్న వర్గములుగా విభజించుకొనుటకు 'గోత్రవిధానం' అమలులోనికి తెచ్చారు. సప్తర్షులైన అంగీరసుడు, అత్రి, గౌతముడు, కశ్యపుడు, భృగుమహర్షి, వశిష్టుడు మరియు భరద్వాజ మహర్షి లాంటి వారినుండి బ్రాహ్మణుల గోత్రములు ఏర్పడ్డాయి. 

#ప్రవర  : 'ప్రవర' అనగా ఒక ప్రత్యేక గోత్రానికి చెందిన బుషుల సంఖ్య అని అర్ధం. ఇది ఒక వంశస్తునితో సంబంధము కల్గియున్న ఇద్దరు లేదా ముగ్గురు లేదా నల్గురు లేదా ఐదుగురు సప్తబుషులతో గల సంబంధమును తెలియజేయును. ఇవి రెండు రకములు 1. శిష్య - ప్రశిష్య - బుషి - పరంపర 2. ఉత్తర పరంపర. 'గోత్రప్రవర' లో ఏక బుషేయ, ద్విబుషేయ, త్రిబుషేయ, పంచబుషేయ, సప్తబుషేయ ఇలా 19 మంది బుషుల వరకూ ఈ వరుస కొనసాగుతుంది.

#సూత్రం  : క్రీ.పూ. 1000  - 2000 సం||ల మధ్య (అనగా 10 శతాబ్దాల కాలప్రమాణములో) "బ్రాహ్మణులు" అనేక శాఖలుగా చీలిపోయారు. వీరు విభిన్న 'వేదాలను' అనుసరిస్తూ, ఆ వేదాలకు (శృతులకు) విభిన్నమైన భాష్యాలు (వ్యాఖ్యానాలు) వెలయిస్తూ వేరువేరు 'సంప్రదాయ శాఖలను' సృష్టించి వాటికి ఆద్యులైనారు. కొందరు బ్రాహ్మణ పండితులు ఒకే వేదానికి విభిన్నమైన భాష్యములను చెప్పసాగారు. ఈ విభిన్న భాష్యాలనే 'సూత్రములు' అంటారు. ఇవి అపౌరుషేరములైన శృతులపై (వేదములపై) ఆధారపడినప్పటికీ, మానవులచే తయారుచేయబడటం చేత వీటిని 'స్మృతులు' అని పిలుస్తారు. అనగా 'గుర్తు తెచ్చుకొనబడినవి' అని అర్ధము. 21 మంది బుషులు ధర్మశాస్త్రములను రూపొందించారు. వాటిలో 'ఆపస్తంభ, బోధాయన, గౌతమ మరియు వశిష్ట సూత్రములు' అతి ప్రాచీనమైనవని తెలుస్తున్నది. 

#బ్రాహ్మణులుపాటించువేదములు : 

వివిధ గోత్రములకు చెందిన బ్రాహ్మణులు మరియు వారు పాటించు వేదములను చూద్దాం.

#వేదం : #గోత్రం : - 

(1)బుగ్వేదము : భార్గవ, శానికృత, గర్గ, భృగు, శౌనక
(2) సామవేదము : కాశ్యపస, కశ్యపస, వత్స, శాండిల, ధనుంజయ    
(3) యజుర్వేదము:  భరద్వాజ, భారద్వాజ, అంగీరస, గౌతమ, ఉపమన్యు
(4) అధర్వణవేదము : కౌశిక, ఘృత కౌశిక, మృద్గల, గాలవ, వశిష్ట     

#సప్తర్షులు : #ఆవిర్భావగోత్రములు.....

1. "భృగుమహర్షి" నుండి 'వత్స, బీద, ఆరిక్సికసేన, యస్క, మైత్రేయ, శౌనక, వైన్య' గోత్రములు ఉధ్భవించెను.

2. "అంగీరస మహర్షి" నుండి 'గౌతమ, భారద్వాజ, కేవర అంగిరస' గోత్రములు ఉధ్భవించెను.

3. "అత్రిమహర్షి" నుండి 'ఆత్రేయ, బధ్భూతక, గరిస్థిర, మృద్గల' గోత్రములు ఉధ్భవించెను.

4. "విశ్వామిత్రమహర్షి" నుండి 'కౌశిక, లోహిత, శౌక్షక, కంకాయన, అజ, కాతవ, ధనుంజయ, అజమర్కన, పురుణ, ఇంద్రకౌశిక' గోత్రములు ఉధ్భవించెను.

5. "కశ్యపమహర్షి" నుండి 'కశ్యప, విద్రుబ, శాండిల,రేభ, లంగాక్షి' గోత్రములు ఉధ్భవించెను.

6. "వశిష్ట మహర్షి" నుండి 'వశిష్ట, కుండిని, ఉపమన్యు, పరాశర, జతుకారణేయ' గోత్రములు ఉధ్భవించెను.

7. "అగస్త్య మహర్షి" నుండి 'సోమబహార, ఇధమబహార, శాంఖబహార, యజ్ఞభర' గోత్రములు ఉధ్భవించెను.

పైన పేర్కొనబడిన గోత్రాలలో ఒక్కొక్క గోత్రము వారు ఒక్కొక్క వేదాన్ని పాటిస్తారు.

#బ్రాహ్మణులువివిధశాఖలు....

వేదంలో పేర్కొన్న 'భరతవర్షం, భరత ఖండం' అనే అఖండభారతంలో పలుచోట్ల (నేటి భారతదేశానికి బయటి సరిహద్దులలో కూడా) ఆర్యబుషిసంతతి వారైన బ్రాహ్మణులు వ్యాపించి ఉన్నారని తెలుస్తుంది. వేదకాలంలో చారిత్రక యుగాలలో బ్రాహ్మణులు ఉత్తర భారతదేశంలో మాత్రమే జీవిస్తుండేవారు. వేదాలలో ప్రముఖంగా పేర్కొనబడిన "సరస్వతీ నది" తీరంలో బ్రాహ్మణులు నివసిస్తుండేవారు (ఇప్పుడు సరస్వతీ నది అంతర్వాహిని). అయితే, క్రీ.పూ. 300 వ సం||లో సరస్వతి నది ఎండిపోవుట వలన బ్రాహ్మణులు ఉత్తర భారత దేశం నుండి నదీప్రాంతాలు పుష్కలంగా కల దక్షిణ భారతదేశము వైపు వచ్చారు. ఆనాటి బ్రాహ్మణులలో శ్రేష్ఠుడైన "అగస్త్య మహర్షి" తో సహా బ్రాహ్మణులంతా ఉత్తరాది నుండి వింధ్యపర్వతములు దాటి దక్షిణభారతదేశములోకి ప్రవేశించారు. మిగిలిన బ్రాహ్మణులు తూర్పు, పశ్చిమ దిక్కులకు వెళ్ళారు.

12 వ శతాబ్దానికి చెందిన కాశ్మీరదేశ పండితుడైన కల్హనుడు 'రాజతరంగిణి' లో ఇలా ఉంది. 

"కర్ణాటకాశ్చ తైలంగా ద్రావిడ మహారాష్ట్రకాః
గుర్జరాశ్చేతి పంచైవ ద్రావిడా వింధ్యదక్షిణే
సారస్వతా కన్యాకుబ్జా గౌడా ఉత్కళ మైధిలాః
పంచగౌడా ఇతి ఖ్యాతా వింధ్యస్యోత్తర వాసినః" 

దీన్నిబట్టి, 12 వ శతాబ్దకాలంనాటి పూర్వంనుంచే బ్రాహ్మణులు పలుశాఖలుగా విస్తరించి ఉండేవారని తెలుస్తుంది. ఉత్తర భారతదేశంలో బ్రాహ్మణులను #పంచగౌడీయులు అంటారు. వీరిలో 'సారస్వత, కన్యాకుబ్జ, గౌడ, ఉత్కళ, మైధిలీ' శాఖలు కలవు. దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణులను #పంచద్రావిడులు అంటారు. వీరిలో 'కర్ణాటక, తైలంగ (తెలుగు), ద్రవిడ, మహారాష్ట్ర, గుర్జరా (గుజరాత్)' అను శాఖలు కలవు. బ్రాహ్మణులు విదేశాలకు సైతం విస్తరించి రాజ్యాలు సైతం స్థాపించారు.

భారతదేశములోని బ్రాహ్మణులనుసరించునది వైదికధర్మము. ఐతే తదనంతరం అవైదికాలైన "జైన, బౌద్ధ, చార్వాకాది" నాస్తికమతములు వేదధర్మాలను ప్రశ్నించాయి. ఈ సందర్భంలో వేదధర్మాన్ని పటిష్టం చేయుటకు, వేదప్రతిపాదనముననుసరించి పౌరాణికయుగాలలో  "శైవం, వైష్ణవం, శాక్తేయం" అను విభిన్న మతసంప్రదాయములు, శాఖాబేధములు తలెత్తాయి. నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణవంశములలో శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు తదనంతరం మల్లికార్జున పండితారాధ్యుడు, నీలకంఠ శివాచార్యుడు, అప్పయదీక్షితులు మెు||గు వేదాంతప్రవక్తలు, భాష్యకారులు ఉధ్భవించి ప్రజలందరినీ వేదమార్గంలోకి తెచ్చారు. 

ముఖ్యంగా దక్షిణాది బ్రాహ్మణులలో వారు పాటించు #గురుసంప్రదాయము ను బట్టి (శంకర, రామానుజ, మధ్వ), 3 ప్రధానమైన విభాగాలవారుంటారు.

1. స్మార్తులు (శంకర మతం) 2. శ్రీవైష్ణవులు (రామానుజ మతం) 3. మధ్వులు (మధ్వ మతం) 

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో అధికంగా ఉన్నవారు 'స్మార్తులు'. శ్రీవైష్ణవువులు, మధ్వవైష్ణవులు ఉన్నప్పటికీ స్మార్తులతో పోల్చుకుంటే వారి సంఖ్య స్వల్పం (ఈ సంగతులన్నీ ప్రత్యేకంగా వేరేటపాలో చర్చిస్తాను).

#ఆంధ్రబ్రాహ్మణులు (తెలుగు బ్రాహ్మణులు) : - - 

'శ్రుతి' అనగా 'వేదం', 'స్మృతి' అనగా 'ఉపనిషత్తులు'. వీటిని అనుకరించేవారిని 'స్మార్తులు' అంటారు. ఆంధ్రబ్రాహ్మణులలో అధిక సంఖ్యాకులు స్మార్తులు. వీరు శంకరాచార్యులవారినీ, శృతులనూ మరియు స్మృతులనూ అనుసరిస్తారు. గోదావరీ తీరములో క్రీ.పూ. 6 వ శతాబ్దంలో నివశించిన ఆపస్తంభుడు రచించిన 'ఆపస్తంభ సూత్రాలను' స్మార్త బ్రాహ్మణులు అనుసరిస్తారు. 

'ఆంధ్రస్మార్తబ్రాహ్మణులు' ముఖ్యంగా 'వైదిక మరియు నియెాగి' అనే రెండు తెగలుగా విభజింపబడినారు. 

(1) వైదికులు (2) నియెాగులు

(1) #వైదికులు : -  'వేదం తెలిసిన వారు వైదికులు' అనునది ప్రాధమికంగా అందరికీ తెలిసిన అంశం. వంశపారంపర్యంగా వస్తున్న వేదవేదాంగ విహితమైన పురోహిత కార్యక్రమాలను (పౌరోహిత్యం) నిర్వహిస్తూ, సమాజంలో జనులందరూ తమతమ జన్మానుసారం చేయదగిన సంస్కారనిర్వహణకు మంత్రసహితమైన కర్మకాండలతో తోడ్పడుతూ ప్రజాసేవకు, దైవసేవకూ అంకితమైన వారు వైదికులు. వేదవిద్యాభ్యాసం, వేదప్రచారం, వేదవిదితమైన మంత్రోక్తమైన యజ్ఞయాగాదుల నిర్వహణ, దేవాలయ విధుల నిర్వహణ మెు||న వేదం విధించిన విధులను నిర్వహిస్తూ, శాస్త్రానుసారంగా తు.చ. తప్పకుండ జీవించేవారే వైదికులు. వీరిలో అత్యధికులు 'కృష్ణయజుర్వేద శాఖకు' చెందినవారే. 

"వేదం తెలిసిన వారు వైదికులు" అన్నది నానుడి. మరల ఏ వేదం చదివిన వారు అని ప్రశ్న. వైదికులలో బుగ్వేద, యజుర్వేద, సామవేద పాఠకులు అందరూ ఉన్నారు. ఐతే, వీరంతా 'ఏకవేదపాఠకులే' (అనగా ఒక వేదాన్ని, దాని సంబంధిత అంశాలనూ పఠించేవారే). అంతేగాక 'ద్వివేదులు' (రెండు వేదాలలో నిపుణుడు), 'త్రివేదులు' (మూడు వేదాలలో నిష్ణాతుడు), 'చతుర్వేది' (నాలుగు వేదాలలో నిష్ణాతులు) సైతం కన్పిస్తున్నారు. కాలక్రమంలో ఇవే వారి 'ఇంటిపేర్లు' గా కూడా మారినవి. 

'తెలుగు స్మార్త బ్రాహ్మణులలో' ప్రాంతాలను బట్టి నేడు కన్పిస్తున్న అనేక తెగలు : - - తెలగాణ్యులు (నైజాం), మురికి (ముల్కి) నాడు, వెలనాడు (శుధ్ధ, కాకిమాని, పెరుంబటి), కాసల (కోసల) నాడు, కరణకమ్మలు (బాల కరణాటి, కొలింగేటి, ఓగేటి), వేగినాడు, తొండ్రనాడు (తిరుపతి), ఔదమనాడు, కోనసముద్ర ద్రావిడులు, ఆరామ ద్రావిడులు (తూర్పు, కోస్తా, కోనసీమ, పేరూరు), తుంబల వారు, ప్రధమ శాఖీయులు మెు||న తెగల వారు కలరు. 

నేటి వర్తమాన ఆర్ధిక పరిస్థితులను బట్టి వైదికులు అనేక పదవులు, ఉద్యోగాలలోనూ, ఇతర వృత్తివిద్యలలోనూ, విభిన్నరంగాలలోనూ ప్రవేశించి రాణిస్తున్నారు. 

(2) #నియెాగులు : - వైదికుల నుండి విడిపోయి, ఒక ప్రత్యేక శాఖగా ఏర్పడిన వారు నియెాగులు. ఇది ఒక విస్తృతమైన శాఖ.

ఆదిలో వేదశాఖలతో సంబంధించిన వేదసామ్రాజ్యసంప్రదాయాన్ని అనుసరించే విప్రులనే 'బ్రాహ్మణులుగా' పరిగణించేవారు. నిరంతర వేదఘోషతో అలరారే 'అగ్రహారాలే' వీరి నివాసభూములు. వీరే 'శుద్ధవైదిక బ్రాహ్మణులు'. ఐతే, తదనంతర కాలంలో వైదిక బ్రాహ్మణులనుండి కొన్ని శాఖలు 'వేదాధ్యయనానికి' దూరంగా జరిగి రాజాస్థానములయందు, రాజులను ఆశ్రయించి లౌకిక వృత్తులను నిర్వహించడానికి వినియెాగించబడినాయి. ఈ విధంగా 'మంత్రి, కరణీకం' లాంటి లౌకిక ప్రజోపయెాగమైన బాధ్యతలను నిర్వహించే సామర్ధ్యం గల 'బ్రాహ్మణులను' రాజాధిరాజులు తమ ఆస్థానాలలో 'వినియెాగించిన' కారణం చేత వీరు 'నియెాగులు' అయ్యారు. వీరు వ్యాపార దక్షుల గానూ, రాజులవద్ద అమాత్యులగానూ, సంస్థానాలలో కరణాలు గానూ నియుక్తులై వినియెాగింపబడేవారు. వీరే తదనంతర కాలంలో 'అమాత్య, ప్రగడ (ప్రగ్గడ), రాజు' తదితర బిరుదులను వారి గృహనామాలు మరియు పేర్ల చివర చేర్చుకొన్నారు. దీనికి గల కారణం, వీరు లౌకిక వృత్తికోసం రాజులను ఆశ్రయించి 'అమాత్య' పదవి పొందుటయెా (లేక) రాజులకు మారుగా వ్యవహారములు నడిపేవారన్నది స్పష్టం. 

లౌకిక వ్యవహారముల రిత్యా ఇలా వైదికుల నుండి విడిపోయి, వేరొక ప్రత్యేక శాఖగా ఏర్పడిన నియెాగులలో మరల అనేకానేక శాఖలున్నవి. అవి 

ఆర్వేల (ఆరువేల) నియెాగులు, నందవరీక నియెాగులు, కరణకమ్మ నియెాగులు, వెలనాటి నియెాగులు, తెలగాణ్య నియెాగులు, ద్రావిడ నియెాగులు, కరణాలు, శిష్ట కరణాలు, కాసలనాటి నియెాగులు, పాకలనాటి నియెాగులు, ప్రాంగ్నాటి (ప్రాజ్ఞాడు) నియెాగులు, ప్రధమశాఖ నియెాగులు లాంటి ఇంకా అరుదైన నియెాగి శాఖలు ప్రాంతాలను బట్టి నేడు దర్శనమిస్తున్నాయి. ఈ నియెాగులలో ఎక్కువమంది 'కృష్ణయజుర్వేదాన్నే' అనుసరిస్తారు. ఐతే, మహారాష్ట్రలో అధికంగా ఉండే ప్రధమశాఖ నియెాగులు 'శుక్ల యజుర్వేదాన్ని' అనుసరిస్తారు. ఈ 'ప్రధమ శాఖీయులలో' వాజసనేయులు, శైవులు, యాజ్ఞవల్క్యులు, కణ్వులు తదితర శాఖీయులు సైతం ఉన్నారు. 

నిరంతర రాచకార్యాల వత్తిడి వల్ల వీరిలో వేదాధ్యయనానికి తగినంత వీలుచిక్కక,  బ్రాహ్మణవంశ సంజాతులైన చాలామంది నియెాగులు వేదదూరులై, వైదిక కార్యక్రమాల పట్ల వారి శ్రధ్ధ కేవలం పర (వివాహ) మరియు అపర (శ్రాధ్ధ) కర్మలకే పరిమితమైపోయినట్లు, అదే నేటికీ కొనసాగుతున్నట్లు 'బ్రాహ్మణుల చరిత్ర' తెలియజేస్తున్నది.

ఇక, భారతదేశముపై వివిధ దండయాత్రలు చేసిన ముసల్మానులు, భారత భూమిపై వారి ఇస్లాం ధర్మవ్యాప్తికి హైందవ రాజులను ఓడించి సంహరించి, తరువాత బ్రాహ్మణులను సైతం సంహరించేవారు. కారణం, వారిని నాశింపజేస్తే సనాతన ధర్మాన్ని నశింపజేయవచ్చని. ఐనప్పటికీ వారు సాధించిన విజయం అత్యల్పం. ఎన్ని పరాయి ధర్మాలు వచ్చినా 'శంకర, రామానుజ, మధ్వ, నింబార్క, చైతన్యదేవుల' వంటి  బ్రాహ్మణోత్తములు వేదాంతాచార్యుల కృషి, వారు వేసిన ధార్మిక పునాదుల వల్లనే ఈ భూమిపై 'వేదవేదాంతధర్మం' ఎప్పటికీ నిలచిఉంటుందనేది పరమసత్యం.

అందుకే, ఏ యుగంలోనైనా ఏ కాలంలోనైనా ధర్మసంరక్షణ సంస్థాపనకై "గోబ్రాహ్మణ సంరక్షణ" రాజుల, పాలకుల కర్తవ్యమని శాస్త్రోక్తి.

"సప్తర్షుల చరిత్ర, అగస్త్య, వశిష్ఠ, కశ్యప, అత్రి"
మెు||న వారి చరిత్రను నా ఈ క్రింది లంకెలలో చూడవచ్చును. 

https://m.facebook.com/story.php?story_fbid=793181067782778&id=100012726760631

https://m.facebook.com/story.php?story_fbid=780902412343977&id=100012726760631

https://m.facebook.com/story.php?story_fbid=839290063171878&id=100012726760631

https://m.facebook.com/story.php?story_fbid=903626406738243&id=100012726760631

https://m.facebook.com/story.php?story_fbid=907113329722884&id=100012726760631

******************************************
******************************************

#పరిశోధనవ్యాసం - #సమగ్రసమాచారసేకరణ.......

#డాక్టర్ #ముళ్ళపూడిరవిచంద్రనాథచౌదరి,
M.Sc. (Tech.), Ph.D.... 
#శ్రీనరేంద్రనాధసాహిత్యమండలి, #కళాప్రపూర్ణశ్రీముళ్ళపూడితిమ్మరాజుస్మారకగ్రంధాలయంమరియుసాంస్కృతికకేంద్రము, తణుకు - ఉండ్రాజవరం సంస్థానం, పశ్చిమగోదావరిజిల్లా, ఆంధ్రప్రదేశ్.....
Mobile (9182978173) & 
Whats App (09959002050)..........రిత్ర వారిలోని విభిన్న శాఖలకు' సంబంధించి నేను పరిశోధించి సేకరించిన సమాచారాన్ని సవివరంగా కొంత ఇక్కడ చర్చిస్తాను. 

Whats App (09959002050)..........
****************

*పోలాల అమావాస్య - పూజ*

మనము, మన సంతానం ఆయురారోగ్యాలతో ఉండటానికి కారణం మన గ్రామ దేవతల కరుణా 
కటాక్షాలే! అందుకే మన పెద్దలు గ్రామ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి పండుగల రూపాలలో ఎన్నో అవకాశాలు కల్పించారు. మరి అటువంటి గ్రామదేవతలలో పోలేరమ్మ ఒక ముఖ్యమైన దేవత. 

పోలాల అమావాస్య నాడు భక్తి శ్రద్ధలతో జరుపుకుని, అమ్మవారుగా కొలవబడే పోలేరమ్మ వారిని 
పూజించు తారు.

పోలాల అమావాస్యనాడు పోలేరమ్మ ఆరాధన ఉత్తరాంధ్ర, ఒరిస్సాలలో  మహాళయపక్షములు అయిన చివరి రోజు అనగా భాద్రపద అమావాస్యనాడు చేస్తారు. మిగిలిన వారు శ్రావణమాసంలో అమావాస్యనాడు పోలేరమ్మను ఆరాధిస్తారు. ఆరోజున కొందరు మహిళలు తమ సంతానము ఆయురారోగ్య భాగ్యాలతో వర్ధిల్లాలని 3,5,9,11 బేసిసంఖ్యలో పిల్లపాపలతో కళకళలాడే ముత్తైదువల ఉన్న ఇళ్ళకు వెళ్ళి ఆ ముత్తైదువల చేతుల మీదుగా బియ్యం, కూరలు వగైరా జోగిరూపంలో సంగ్రహించి తమ ఇంటికి తీసుకు వచ్చి కొన్ని బియ్యపు (బియ్యం, కొబ్బరి కలిపి రుబ్బి) పిండితో నీటిలో ఉడికించి, అందులో బెల్లం వేసి హారది, మరియు తమకు జోగిరూపంలో దొరికిన పెసరపప్పు మరియు బియ్యం కలిపి పొంగలి (పప్పు హారది) చేసి, తొమ్మిదిరకాల కాయగూరలతో అందులో కంద, చామ తప్పనిసరిగా ఉండేవిధంగా కలగాయ పులుసు చేసి అవి పోలేరమ్మకు నివేదన చేసి ఆ ప్రసాదాన్ని ఇంట్లో పిల్లలతో సహా అందరూ ఆరగించుతారు.

 పొలాల అమావాస్య ముందు రోజు ఒక కంద మొక్క  (తల్లీ,పిల్ల మొక్కలు ఒకే కుదుటలో ఉండాలి).
ఇంకా  ఒక వరిదుబ్బు కూడా కందమొక్కతో కలిపి ఉంచడం ఉత్తరాంధ్రలో ఆనవాయితీ. ఆ కందమొక్క వీలయితే చిన్న కుండీలో ఉంటే మంచిది. పూజ అయినతరువాత మన మిగిలిన మొక్కలతో పెరుగుతుంది. మరల తరువాత సంవత్సరం అదే మొక్కను లేదా ఆ మొక్క పిల్లలు పూజకు ఉపయోగపడతాయి. (ఏదైనా కందమొక్క, దాని పిల్లమొక్క ఉండాలి) మిగతా పూజ సామాను అంతా అందరికీ తెలిసినవే; పసుపు, 
కుంకుమ, పూలు, కొబ్బరి కాయ ఒకటి, పసుపు కొమ్ములు రెండు, అరడజను అరటి పళ్ళు.

 కందమొక్కను పూజా మందిరంలో పెట్టుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. పసుపు 
వినాయకుని, పసుపు గౌరమ్మని, చేసుకుని తమల పాకుల్లో కంద మొక్క దగ్గరగా పెట్టుకోవాలి. 
నైవేద్యానికి పళ్ళు, కొబ్బరి కాయతో పాటు అమ్మ వారికీ వడ పప్పు, పానకం, చలిమిడి, ఆడ 
సంతానం కలవారు గారెలు, మగ సంతానం కల వారు బూరెలు సిద్దం చేసుకోవాలి. ఈ బూరెలు, గారెలు సంగతి ఎలా ఉన్నా పాలహారది (బియ్యం,కొబ్బరితో రుబ్బిన పిండితో పాలలో ఉడికించి, బెల్లము వేయబదినది), పప్పుహారది (బియ్యం, పెసరపప్పు ఉడికించి బెల్లము వేసినది). కలగాయపులుసు ముఖ్యము.  మూడు దారం పోగులకు పసుపు రాసి పసుపు కొమ్ములు (నడుం విరగకుండా ఉన్నవి, చిన్నవి) కట్టి ఉంచుకోవాలి.  తల్లి, పిల్లలకు అందరకూ సరిపడిన చిన్న పసుపుకొమ్ములు విరగకుండా ఉన్నవాటితో ఈ తోరాలు కడతారు.

ఇక పూజా విధానం ఇతర పూజల లాగానే. ముందుగా ఆచమనం చేసుకుని, సంకల్పం చెప్పుకుని గణపతి పూజ చేసుకుని అమ్మ వారికి షోడశోపచార పూజ చేసుకోవాలి. పసుపు అమ్మ వారిని, కంద మొక్క లేక కంద పిలకని, కుంకుమతో పుష్పాలతో పూజించి, దీప, ధూప, నైవేద్యాలు సమర్పించి, అక్షతలు చేత పట్టుకుని, వ్రత కథ చదువుకుని, కొన్ని అక్షతలు అమ్మ వారి మీద, కొన్ని కుటుంబ సభ్యుల అందరి మీద జల్లు కోవాలి. పసుపు కొమ్ము కట్టిన ఒక దారం అమ్మ వారి దగ్గర ఉంచి, ఇంకో దారం పూజ చేసిన స్త్రీ మెడలో కట్టు కోవాలి. పిల్లలకు కూడా ఆ పసుపుకొమ్ము తోరం కట్టాలి. తీర్థ ప్రసాదాలు భక్తి తో స్వీకరించాలి.

 *వ్రతకథ*

అనగా అనగా ఒక ఊర్లో ఓ ఇల్లాలు. ఆమెకు ప్రతి సంవత్సరం పిల్లలు పుడుతున్నారు, పోతున్నారు.   పోలాల అమావాస్యకు పుడుతున్నారు , మళ్లీ పొలలమావాస్యకి చనిపోతున్నారు . నోచుకుందామని ఎవర్ని పేరంటానికి పిలిచినా రామని అంటున్నారు . ఈ విధంగా బాధపడుతున్న ఆ ఇల్లాలుకు మళ్లీ ఎప్పటివలె సంతానం కలగడం, చనిపోవడం జరిగినధి . ఆ పిల్లను తీసుకుని స్మశాసంలో సమాధి చేయడానికి వెళ్ళింది. అప్పుడు పోలేరమ్మ అక్కడకు వచ్చింది. ఆ ఇల్లాలిని ఇలా అడిగింది. "ఈ ఊర్లలో వాళ్ళంత నాకు మొక్కేందుకు వస్తారు . పాయసం , వడలు నైవేద్యం తెస్తారు . ఎడ్లకు రంగులు వేసి నెమలి పించం పెట్టి గాలి , ధూళి తగలకుండా ప్రదక్షణం చేయిస్తారు . పాలేర్లు కల్లు తెస్తారు . వాళ్ళ పెళ్ళాలు కడవలతో పానకం తెస్తారు . నువ్వెందుకు శవాన్ని ఇక్కడ సమాధి చేస్తున్నావు?" అని  ప్రశ్నించింది. ఆ ఇల్లాలి ఇలా అంది "అమ్మా! పోలేరమ్మ తల్లీవేయి కళ్ళ తల్లివి నీకు తెలియనిది ఏముంది. నేను పూర్వ జన్మలో ఏ పాపం చేసానో నాకు పుట్టిన సంతానం ఎప్పటికప్పుడు మరణిస్తున్నారు" అని బాధ పడింది. అప్పుడు పోలేరమ్మ తల్లి  "ఓ ఇల్లాలా! క్రిందటి జన్మలో పొలలమావాస్య నాడు నీవు పేరంటాళ్ళు రాక ముందే పిల్లలు ఏడిస్తే ఎవరు చూడకుండా పాయసం , గారెలు పెట్టావు. పులుసు తీపి సరిపోయిందో లేదో చవిచూశావు. మడి , తడి లేకుండా అన్నీ ఎంగిలి చేశావు.  అందుకే నీకు పిల్లలు అలా పుట్టి పెరిగి చనిపోయారు".  అనిచెప్పింది . తన అపరాధాన్ని తెలుసుకున్న ఆ ఇల్లాలు పోలేరమ్మ తల్లి కాళ్ళమీద పడి తనను క్షమించమని వేడుకున్నది. ఆ ఇల్లాలు  ఆ వ్రత విధానం తనకు తెలుపమని వేడుకోగా పోలేరమ్మ ఇలా తెలిపింది.  పొలలమావాస్యనాడు  . గోడను ఆవు పేడ  పాలతో  అలికి, పసుపు కుంకుమతో బొట్టుపెట్టి కంద మొక్క,వరిదుబ్బు కలిపి ఉంచి అకుదురే అమ్మగా భావించి తొమ్మిది వరుసల దారంతో పసుపు కొమ్ము (నడుం విరగనిది) కట్టి, ఆ తోరం ఆ కందమొక్క తల్లికి కట్టి పూజ చేయాలి. తొమ్మిది వరుసల తోరం పేరంటాలకి ఇచ్చి మనము కట్టించుకోవాలి . పిండి వంటలు నైవేద్యం చేసి అమ్మకి నివేదన చేయాలి . భోజనం అనంతరం తాంబూలం దక్షిణ శక్తి కొలది సమర్పించాలి . ఇలా చేస్తే పిల్లలు మృత్యువాత పడకుండా కలరా, మలేరియా , మశూచి మొదలైన వ్యాధులు రాకుండా పోలెరమ్మ తల్లి కాపాడుతుందని " చెప్పింది.  ఈ విధంగా ఆ ఇల్లాలు ఈ వ్రతంని చేసి తన చనిపోయిన సంతానాన్ని తిరిగిపొందింది.
*********************

*సన్యాసం.....*

సన్యాసమంటే కాషాయం కాదు, ఇంటిని వదిలిపోవడం కాదు, వ్యక్తిత్వ విసర్జన..

సన్యాసమంటే.. ప్రపంచం నుంచీ, మరి దేని నుంచీ వెనక్కి తగ్గి, సర్వం వదిలి వేయడం కాదు. సమస్తాన్ని ప్రేమతో హృదయానికి హత్తుకోవడం. ఆ ఆలింగనంలో సంసారము అన్నీ వుంటాయి.

సన్యాసమంటే.. అహంకార పరిత్యాగం. కోర్కెలనీ, నాది అనే భావాన్ని, దానిపట్ల అనురక్తిని త్యజించడం.

సన్యాసమంటే.. పరిశుద్ధ జ్ఞానం...

ఇల్లు, సంసారం వదిలి కాషాయం కట్టడం కన్నా, ప్రేమతో ప్రపంచాన్ని తనలోనికి తీసుకోవడం ఉత్తమ సాధకుని లక్షణం. నిజమైన సాధకులు తమ ప్రేమను విశ్వప్రేమగా విస్తృతపరచి, సమస్త ప్రపంచాన్ని ప్రేమతో హత్తుకుంటారు. ప్రేమ, సమదృష్టి అలవర్చుకున్నవారు పరిత్యజించాలి, సన్యసించించాలి అని అనుకోరు. నిజమైన సంసారం మనస్సంసారం. దాన్ని వదలాలి గాని, ఇల్లునీ, ఇల్లాల్ని కాదు. కర్మ జీవనాన్ని పరిత్యజించవలసిన పనిలేదు. సర్వకర్మలు ఆచరిస్తూ, నిష్కామంగా ఉంటూ, స్వస్థితి చెడగొట్టుకోకుండా ఉన్నవారే నిజమైన సాధకులు. విషయవస్తువుల పట్ల అనురక్తచిత్తుడైన వ్యక్తి అరణ్యాలకు వెళ్ళిన లాభం లేదు. మనో నిగ్రహం లేక ఎక్కడకు పోయినను ఇక్కట్లే. సత్కార్యాచరణుడై పంచేద్రియ నిగ్రహం గల వ్యక్తికి గృహజీవనమే తపోవనం...

*|| ఓం నమః శివాయ ||
****************

**దశిక రాము**

**హిందూ ధర్మం** - 19

క్షమించమన్నారు కదా అనీ, అన్ని వేళలా ఇది వర్తించదు. దేశం విషయంలోనూ, ధర్మం విషయంలోనూ మితిమీరిన క్షమా గుణం పనికిరాదు. మాతృదేశంపై ఆక్రమణకు, యుద్ధానికి శత్రుదేశం పాల్పడినప్పుడు, స్వదేశరక్షణ కోసం ఎదుటివాడితో పోరాటం చేయాలి. అక్కడ క్షమించకూడదు, గట్టి సమాధానం చెప్పాలి, తగిన గుణపాఠం నేర్పాలి. అదే ధర్మం.అట్లాగే ధర్మానికి హానీ ఏర్పడినప్పుడు, ధర్మం మీద దాడి జరుగుతునప్పుడూ మౌనం వహించకూడదు, క్షమించకూడదు.

అదే మహాభారతంలో కనిపిస్తుంది. అంతా తన బంధువులేననీ, తనవారిపై పోరాటం చేయడం కంటే రాజ్యాన్ని విడిచిపెట్టడం మేలు అనుకున్న అర్జునుడికి శ్రీ కృష్ణపరమాత్మ గీత భోధించాడు. ధర్మానికి హానీ ఏర్పడప్పుడు, పిరికివాడిలా పారిపోవడం కాదు, నిజమైన క్షత్రియుడులా యుద్ధం చేసి, ధర్మాన్ని పునఃప్రతిష్టించమని చెప్పాడు, గీతను భోధించి అర్జునుడిని మానసికంగా బలవంతుడిని చేసి, యుద్ధం చేయించి, ధర్మరాజుకు రాజ్యం అప్పగించాడు. ధర్మానికి హాని ఏర్పడుతందంటే, బంధుత్వాలు, క్షమాగుణాలు అన్నీ విడిచిపెట్టాలని, ధర్మాన్ని, దేశాన్ని కాపాడడమే ప్రధమ కర్తవ్యం అని తెలియజేశాడు.

వందలమందిని దారుణంగా హతమార్చిన ముష్కరుడిని గట్టిగా దండించడమే రాజు యొక్క ధర్మం. అంతేకానీ, వాడిని క్రూరంగా దండిస్తే, మనకూ వాడికి తేడా ఏముంటుందండీ? వాడిని క్షమించి, విడిచిపెట్టాలి అంటారు కొందరు. అక్కడ క్షమాగుణం చూపవలసిన అవసరమే లేదంటుంది ధర్మం.

తరువాయి భాగం రేపు.......
*************

ఆత్మలింగం భూకైలాసం గోకర్ణం

మన దేశంలోని శైవక్షేత్రాలైన వారణాశి, రామేశ్వరం ఆలయాల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో ఆ కోవలోకి చెందినదే మహాబలేశ్వర ఆలయం. కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ జిల్లాలో గోకర్ణ పట్టణంలో కొలువుదీరి ఉన్న ఈ ఆలయాన్ని గోకర్ణం అని కూడా అంటారు. అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో గోకర్ణం ఒకటి. గోకర్ణ క్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వర క్షేత్రం, ఉత్తరాన గంగావళినది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఓ వైపు అపారమైన ఆధ్యాత్మికత, మరో వైపు ప్రకృతి రమణీయకతతో  అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్టితమైంది.

 గోకర్ణ క్షేత్రం గురించి రామాయణ, మహాభారత గ్రంథాలలో వివరించబడింది. ఇక స్కాందపురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది. పూర్వం రావణాసురుడు శివుని గురించి కఠోర తపస్సు చేయగా, అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు ఓ నిబంధన విధించిన శివుడు, రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఆ నింబంధన ఏమిటంటే.. రావణాసురుడు లంకకు వెళ్లేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు. అలా దించితే ఆ లింగం అక్కడే ప్రతిష్టితమైపోతుంది.

 అలా ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు తన లంక రాజ్యం వైపు పరుగులు తీయసాగాడు. ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని భయపడిన దేవతలు, తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ... తదితర దేవుళ్లను వేడుకున్నారు. అప్పుడు గణపతి చిన్నపిల్లవాని రూపంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది.

  అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసురుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకొమ్మని, తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాలవినాయకుడు తాను మూడుసార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కిందపెట్టేస్తానని చెబుతాడు. వేరే దారిలేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోవడానికి వెళతాడు. అయితే రావణాసురునికి ఏ మాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు గబగబా మూడుసార్లు రావణాసురుని పిలిచి, ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు.

 రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాలవినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కును ఇప్పటికీ, ఇక్కడున్న మహాగణపతి ఆలయంలో గణపతి విగ్రహానికి చూడవచ్చు.

 ఆత్మలింగం చుట్టూ పంచక్షేత్రాలు
 ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరంవైపు నుంచి లాగుతాడు. ఆ పెట్టె అతి విసురుగా వెళ్లి దూరంగా పడిపోయింది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలిసింది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవించింది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురడేశ్వరం లింగం వెలిసింది. పెట్టెను కట్టిన తాళ్లు పడిన చోట ధారేశ్వరలింగం ఉద్భవించింది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం ‘మహాబలేశ్వర లింగం’ గా గోకర్ణంలో వెలిసింది. ఆత్మలింగంతో ముడిపడిన ఈ ఐదు క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటారు.

 గో రూపం దాల్చిన భూమాత...
 మరొక కథనం ప్రకారం పాతాళలోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గోరూపాన్ని ధరించిందట. ఆ గోవుచెవి నుండి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రానికి గో (అవు) కర్ణం (చెవి) = గోకర్ణం అనే పేరు ఏర్పడిందంట.

 రాజుల కాలంలో గోకర్ణం
 దక్షిణ కాశి, భూ కైలాసం అని భక్తులచే కొనియాడబడుతున్న ఈ క్షేత్ర చరిత్ర ఎంతో పురాతనమైంది. కాళిదాసు తన ‘రఘువంశం’ కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేశాడు. క్రీ.శ. 7వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్దనుడు ‘నాగానంద’ కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు. కదంబ చక్రవర్తి మయూరశర్మ ఈ ఆలయంలో నిత్యపూజాదికాలను ఏర్పాటు చేశాడని, చెన్నమ్మాజీ, ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హళసునాడు- కుందపురానికి చెందిన విశ్వేశ్వరాయుడు చంద్రశాల, నందిమంటపాలను నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. క్రీ.శ 1665వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకుని పూజలు చేసినట్టు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది.

 సర్వపాప హరణం కోటి తీర్థంలో పుణ్యస్నానం
 గోకర్ణంలో ప్రధానాలయం శ్రీ మహాబలేశ్వరాలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటితీర్థంలో స్నానాలు ఆచరిస్తారు. కోటితీర్థంలో స్నానం చేస్తే సమస్తరోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటి తీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా ప్రక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి ప్రక్కనన్ను అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మిక, కోటితీర్థానికి దక్షిణం వైపు అగస్త్యులవారిచే ప్రతిష్టింపబడిన వరటేశ్వర లింగం ఉంది. ఈ ఆలయం భక్తుల సౌకర్యార్థం 24 గంటలూ తెరిచే ఉంటుంది.

 నయనానందకరం రథోత్సవం
 అతి ప్రాచీనమైన ఈ ఆలయం పెద్ద గాలిగోపురంతో భక్తులను ఆహ్వానిస్తుంది. ఈ లింగం కింది వైపు కాస్త వెడల్పుగా, పైన సన్నగా కనబడుతుంటుంది. రావణాసురుడు ఈ లింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నించడం వల్ల పై భాగాన సన్నగా ఉందంటారు. పైకి ఉండే ఒక రంధ్రంలో వేలును ఉంచినప్పుడు కిందనున్న లింగం వేలికి తగులుతుంది. భక్తులు శివలింగం చుట్టూ కూర్చుని పూజలు నిర్వహిస్తారు. అయితే, మహామంగళహారతుల సమయంలో గర్భగృహంలోకి భక్తులను అనుమతించరు. ఇక్కడ పన్నెండేళ్లకొకసారి జరిగే విశేష కార్యక్రమంలో శివలింగాన్ని బయటకు తీసి, నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారు. ఈ పుష్కర ఉత్సవాలకు దేశవిదేశాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది. ముందుగా వినాయక దర్శనం...

 రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు, అతడిని అడ్డుకున్న గణపతి చాతుర్యాన్ని మెచ్చుకున్న పరమశివుడు మహాబలేశ్వర క్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తరువాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు. రావణుడు వేసి మొట్టికాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనపడుతుంటుంది. ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పు దిక్కున ఉంది.

 ఉత్తరాన రుద్రుని సతి తామ్రగౌరి
 మహాబలేశ్వర ఆలయప్రాంగణంలో ఉత్తరం వైపున తామ్రగౌరి ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని అర్ధాంగి. ఈమె బ్రహ్మదేవుని కుడి చేయి నుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రుని వివాహం చేసుకుంది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయత్రం 5 గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది.

 సిద్ధించిన అమృతం
 నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకై త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఇక్కడే ఆవిర్భవించిందట. అమృతమథనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడకు వచ్చి ఆత్మలింగానికి పూజలు జరపడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి. గోకర్ణ క్షేత్రంలో ఆత్మలింగాన్ని దర్శించుకున్న వారికి జన్మజన్మల పాపకర్మలు తొలగిపోయి సర్వసుఖాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

 సమీప పుణ్యక్షేత్రాలు
 ధారేశ్వర ఆలయం: ఈ ఆలయం గోకర్ణానికి దక్షిణ దిక్కున దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆత్మలింగానికి సంబంధించిన లింగం. ఈ ఆలయం చాళుక్య, హోయసలల శిల్పశైలిలో కనపడుతుంది. దీనిని 11వ శతాబ్దిలో పునర్నిర్మించినట్లు తెలుస్తోంది.
 గుణవంతేశ్వర: ఈ ఆలయం కూడా గోకర్ణ ఆత్మలింగానికి సంబంధించిన క్షేత్రంగా చెప్పబడుతుంది. గోకర్ణం నుంచి సుమారు 60 కిలోమీటర్లు.  మురుడేశ్వర ఆలయం: పంచలింగాల క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఈ భారీ ఆలయం భక్తులను అమితంగా ఆకర్షిస్తుంటుంది. గోకర్ణక్షేత్రానికి 70 కిలోమీటర్ల దూరం.
పూర్తి సేకరణ.
********************

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం

నవగ్రహాల అనుగ్రహాన్ని కలిగించే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం

శ్రీ ఆంజనేయస్వామి వారిని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం వస్తుందని పరాశర సంహిత'లో ఉంది.

నవగ్రహాల అనుగ్రహం త్వరగా పొందాలంటే వాల్మీకి రామాయణం లోని ఈ 9 శ్లోకాలు నిత్యం పారాయణ చేయడం మంచిది.

నవగ్రహాలు అత్యంత కరుణా స్వరూపులు. మనం పూర్వజన్మలలో చేసిన పుణ్యపాపాల బట్టి ఫలితాలని ఇస్తారు.

కానీ భక్తితో వారిని ఇటువంటి స్తోత్రాలతో స్తుతిస్తే శుభఫలితాల్ని అనుగ్రహిస్తారు.

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా శ్లోకాల పారాయణం వల్ల విద్యార్థులకు మేధస్సు, ఉద్యోగస్తులు, వ్యాపారులకు అభివృద్ధి, స్త్రీలకు వివాహం, సత్సంతానము మరియు వృద్దులకు ఆరోగ్యం కలుగుతుంది.

నిత్యం లేదా శనివారం అయినా వీటిని పారాయణ చేయడం వలన శుభఫలితాలని పొందవచ్చు.

వాల్మీకి రామాయణమునకు సుందరకాండ తలమానికము.సుందరకాండ సారమైన 9 శ్లోకములతో ఏర్పడినదే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం.

రత్నములవంటి తొమ్మిది శ్లోకములను ఒక మాలగా కూర్చి శ్రీ ఆంజనేయస్వామి వారికి సమర్పించబడినది. ఈ తొమ్మిది శ్లోకములు తొమ్మిది గ్రహములకు చెందునని చెప్పబడినది.

ఇవి శ్రీ ఆంజనేయస్వామి వారి వైభవము, స్వామి వారికి నవ గ్రహములతో గల సంబంధము తెలియబర్చును. ఈ స్తోత్రం పారాయణ చేసినవారికి శ్రీ ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో బాటు నవగ్రహముల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడినది.

శ్లోకము తత్సంబంధిత గ్రహము, రత్నముల వివరములు స్తోత్రంలో తెలుపబడినవి. నవగ్రహములకు ఆయా శ్లోకములతో జపముచేసి ఫలితం పొందవచ్చునని చెప్పబడినది.

♦️మాణిక్యం (సూర్యుడు)..
తతో రావణనీతాయా: సీతాయాశ్శత్రుకర్శన: |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ||

అర్థము : అనంతరము అరివవీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృతయైన సీతజాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతులవారు సంచరించు ఆకాశమార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకొనెను.

♦️ముత్యం (చంద్రుడు).
యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ |
స్మృతిర్మతిర్ధృ తిర్ధాక్ష్యం స కర్మసు న సీదతి ||

అర్థము : నీవలె గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వముగలవాడు తన కార్యసిద్ధి యందు ఎన్నడును వైఫల్యమును పొందడు.

♦️పగడం (కుజుడు).
అనిర్వేద: శ్రియో మూలం అనిర్వేద: పరం సుఖం |
అనిర్వేదో హి సతతం సర్వార్ధేషు ప్రవర్తక: ||

అర్థము : దిగులుపడకుండా ఉత్సాహముతో నుండుటవలన కార్యసిద్ధియు, పరమ సుఖము కలుగును. ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగి యుండటయే శ్రేయస్కరము.

♦️మరకతం (బుధుడు).
నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చతస్యై జనకాత్మజాయై |
నమోస్తు రుద్రేంద్రయమనిలేభ్య:
నమోస్తు చంద్రార్కమరుద్గణభ్య: ||

అర్థము : శ్రీరామునకు నమస్కారము. జనకసుతయైన సీతామాతకు ప్రణతి, లక్ష్మణునకు నమస్కారము, వాయుదేవునకు నమస్కారములు. సూర్యచంద్రులకును మరుద్దేవతలకును నమస్కారములు.

♦️హీరకం (శుక్రుడు)
రామ: కమలపత్రాక్ష: సర్వసత్త్వమనోహర: |
రూపదాక్షిణ్యసంపన్న: ప్రసూతో జనకాత్మజే ||

అర్థము : ఓ జానకీ! శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులుగలవాడు. తన నిరుపమానకాంతిచే సమస్త ప్రాణులకును ఆనందమును గూర్చువాడు. పుట్టుకతోనే అతడు చక్కని దేహసౌందర్యము, గుణసంపదయు గలవాడు.

♦️ఇంద్రనీలం (శని)..
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల: |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ: ||

అర్థము : మహాబలసంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. అసహాయ శూరుడు, కోసలదేశప్రభువు ఐన శ్రీరామునకు నేను దాసుడను.

♦️గోమేదికం (రాహువు)..
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తప: |
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమత: ||

అర్థము : నేను పతిసేవాపరాయణనే ఐనచో, తపమాచిరించియున్నచో, నేను నిష్కలంక పతివ్రతనైనచో ఓ అగ్నిదేవా! హనుమంతుని చల్లగా చూడుము.

♦️వైడూర్యం (కేతువు)..
నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమం |
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం ||

అర్థము : శత్రుమర్ధనుడైన శ్రీరాముడు వనవాసము ముగిసిన పిమ్మట నీతోగూడి అయోధ్య యందు పట్టాభిషిక్తుడగుటను నీవు త్వరలో చూడగలవు.
ఇతి శ్రీ ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం సంపూర్ణం.
జై హనుమాన్*
*****************

*హనుమంతుడు బ్రహ్మ చారి కదా ? మరి సువర్చలాదేవి ఎవరు ?*

*మనం ఏదన్నా గొప్ప పనిని తలపెట్టాలన్నా, తలపెట్టిన పనిని పూర్తిచేయాలన్నా ఆ ఆంజనేయుడే ఆదర్శంగా నిలుస్తాడు. హనుమంతుడు అంత గొప్పవాడు కావడానికి కారణం ఆయన బ్రహ్మచర్య దీక్షే అని కూడా చెబుతారు. మరి అలాంటి హనుమంతునితో పాటుగా సువర్చలాదేవిని కూడా పూజిస్తామెందుకు. ఇంతకీ ఎవరీ సువర్చల. ఏమిటా కధ!*

*హనుమంతుడి గురువు, సూర్యుడు అన్న విషయం తెలిసిందే కదా! సూర్యునితో పాటు ఆకాశంలో తిరుగుతూ ఆయదన దగ్గర వేదాలన్నింటినీ నేర్చేసుకున్నాడు హనుమ. ఆపై నవ వ్యాకరణాలుగా పిలవబడే తొమ్మిది వ్యాకరణాలను కూడా నేర్చుకోవాలనుకున్నాడు. ఇప్పుడంటే పాణిని వ్యాకరణం ఒక్కటే ప్రచారంలో ఉంది. కానీ ఒకప్పుడు ఇంద్రం, సాంద్రం, కౌమారకం అంటూ తొమ్మిది రకాల వ్యాకరణాలు ఉండేవి. అయితే పెళ్లయినవారికి మాత్రమే వీటన్నింటినీ నేర్చుకునేందుకు అర్హత ఉండేదట. మరి హనుమంతుడేమో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలనే పట్టుదలతో ఉన్నాడు కదా. మరెలా!*

*హనుమంతుడి సమస్యను ఎలాగైనా తీర్చమంటూ త్రిమూర్తులు ముగ్గురూ సూర్య భగవానుడి దగ్గరకు వెళ్లారు. అప్పుడు సూర్యుడు తన వర్చస్సు నుంచి ఒక కుమార్తెను సృష్టించారు. వర్చస్సు నుంచి ఏర్పడింది కాబట్టి ఆమెకు సువర్చల అని పేరు పెట్టారు. ‘నా వర్చస్సుతో ఏర్పడిన ఈ కుమార్తెను నువ్వు తప్ప వేరెవ్వరూ వివాహం చేసుకోలేరు. ఇదే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ’ అంటూ ఆమెతో ఆంజనేయుడి వివాహం జరిపారు. ఆ తర్వాత ఆయనకు నవ వ్యాకరణాలన్నీ నేర్పారు.*

*ఇదీ సువర్చలాదేవి వెనుక ఉన్న కథ. ఆమె సూర్యుని తేజస్సుతో ఏర్పడి, హనుమంతుని శక్తికి ప్రతీకగా నిలుస్తుందే కానీ... ఆమెతో హనుమంతుని బ్రహ్మచర్యానికి వచ్చిన నష్టమేమీ లేదు. ఈ కథంతా కూడా పరాశర సంహితలో స్పష్టంగా ఉంది. అంతేకాదు... జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున ఆంజనేయస్వామికీ, సువర్చలాదేవికీ మధ్య వివాహం జరిగినట్లు కూడా ఇందులో ఉంది. అందుకే కొన్ని ఆలయాలలో ఆ రోజు ‘హనుమంత్‌ కళ్యాణం’ చేస్తుంటారు.*

*హనుమంతుని భార్య గురించి ఇంకా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. జైనుల కథల ప్రకారం హనుమంతునికి వందమందికి పైగా భార్యలు ఉన్నారు. వారిలో రావణాసురుడి చెల్లెలు చంద్రనఖ కూడా ఒకరు. ఇక థాయ్‌లాండ్ వాసులు కూడా హనుమంతునికి ఓ మత్స్యకన్యతో వివాహం జరిగిందనీ, వారికి మకరధ్వజుడు అనే కొడుకు పుట్టాడనీ నమ్ముతారు. కానీ భారతీయుల నమ్మకం ప్రకారం సువర్చలాదేవి మాత్రమే హనుమంతుని ధర్మపత్ని. అది కూడా కేవలం లోకకళ్యాణం 
******************

రామాయణమ్.34

రాముడు గొంతు తగ్గించి మృదువుగా .... పరశురామా ! నీ కధలు పెద్దలు చెప్పగా విన్నాను. అమోఘమైన నీ పితృభక్తి  ,తండ్రి ఋణము నీవు తీర్చుకున్న విధానము ఇతరులకు సాధ్యముకానిది.
.
నన్ను పరాక్రమం లేనివాని వలే ,క్షత్రియధర్మాచరణ సాధ్యముకాని వలే ,తేజోహీనుని వలే అవమానిస్తున్నావు!
.
నా పరాక్రమము నీకు చూడవలెనున్నదా ! అయితే ఇదిగోచూడు అంటూ పరశురాముని చేతినుండి చాపము ,శరము తీసుకొని విల్లెక్కుపెట్టి శరసంధానము చేసి  ,క్రుద్ధుడై !
నీవు బ్రాహ్మణుడవు కావున నీ ప్రాణము తీయను .
.
నేను ఒక్కసారి బాణం సంధిస్తే అది వృధాగా పోరాదు ! నీ పాదగమనశక్తిని కొట్టమంటావా !
.
నీవు తపస్సుచే సంపాదించుకున్న ఉత్తమలోకాలను కొట్టమంటావా !  అని అడిగాడు శ్రీరాముడు!.
.
రాముడు వైష్ణవధనుస్సును ఎక్కుపెట్టగనే పరశురాముడు నిర్వీర్యుడై,  జడుడై, నిశ్చేష్టుడాయెను.
.
అప్పుడు పరశురాముడు మెల్లగా రామా !
నా గమన శక్తిని కొట్టవద్దు ,నా తపోలోకములను కొట్టుము
ఇక ఆలస్యము చేయకు అనగా రాముడు అట్లే చేసినాడు!
.
నేను నీ చేతిలో పరాజితుడనయినాను ,అందుకు నేను సిగ్గుపడను అని పలికి రామునిచేతిలో భంగపడినవాడై మహేంద్రగిరికి అతివేగముగా వెళ్ళి పోయినాడు.
.
పరశురాముడు వెళ్ళిన పిదప రాముడు ఆ ధనుస్సును,శరమును వరుణునకు అప్పగించివేశాడు!.
.
తండ్రి వైపు తిరిగి ,తండ్రీ తదుపరి కర్తవ్యాన్ని సెలవివ్వండి ! మీ అధీనంలోని చతురంగబలాలను అయోధ్యవైపు కదలటానికి అనుజ్ఞ ఇవ్వండి అని వినయంగా పలికాడు!
.
ఒక్కసారిగా నడిసంద్రంలో పెనుతుఫాను వెలిసి గండంగడిచిన నావికుడి హృదయంలాగ దశరధుడి మనస్సు తేలిక పడి రాముని తన బాహువులతో కౌగలించుకొని శిరస్సుపై ముద్దిడి ఆనందభరితుడయినాడు.
.
అయోధ్య చేరుకున్నారంతా!
.
కౌసల్యా, సుమిత్ర, కైకేయి  కొత్తకోడళ్లకు ఎదురేగి ఆహ్వానంపలికి మంగళకరంగా గృహదేవతలను పూజించి పెద్దలందరి దీవనలు కోడళ్లకు ఇప్పించి ఎన్నో భూరిదానాలు చేశారు.
.
నూతన దంపతులు సుఖంగా కాలం గడపసాగారు.
.
కొంతకాలానికి మేనమామ యుధాజిత్తుతో కలసి భరతుడు ,శత్రుఘ్నునితో కూడి వారి వారి భార్యలను వెంటనిడుకొని కేకయ రాజ్యానికి ప్రయాణ మయినారు.
.
శ్రీరామచంద్రుడు ,లక్ష్మణుడు తండ్రికి సేవచేస్తూ పురజనుల అభిమానాన్ని చూరగొంటున్నారు.
.
సీతారాములు అన్యోన్య ప్రేమతో ఆనందంగా కాలము గడుపుతున్నారు .సీత అంటే రాముడు ,రాముడు అంటే సీత వీరిరువురికీ భేదంలేదు అని లోకం చెప్పుకోనారంభించింది!
.

శ్రీమద్రామయణంలోని బాలకాండ సమాప్తము
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
*******************

*ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు చేదు నియమాలు*

1.ప్రకృతి యొక్క మొదటి నియమం.
ఒకవేళ పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీగాదంతో నింపేస్తుంది. అదేవిధంగా మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడుఆలోచనలు చేరుకుంటాయి.

2. ప్రకృతి యొక్క రెండవ నియమం. ఎవరివద్ద ఏమిఉంటుందో వారు దానినే పంచుకోగలరు. సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచగలరు. దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచగలరు. జ్ఞానులు జ్ఞానాన్నే పంచగలరు. భ్రమలలో ఉన్నవారు భ్రమలనే పంచగలరు. భయస్తులు భయాన్నే పంచగలరు.

3. ప్రకృతి యొక్క మూడవనియమం.
మీకు మీ జీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి. ధనం అరగకపోతే బడాయి పెరుగుతుంది. మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి. ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది. నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది. అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది. దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది. సుఖం అరగకపోతే పాపం పెరుగుతుంది.

విషయం చేదుగా ఉన్నా ఇది నిజం.

జై శ్రీ రాం🙏
*************************

*సాక్షి* ఫ్యామిలీ పేజీ:(18-8-2020)

 🌹 *రసావతారుడు జస్ రాజ్*//భారతీయ సంగీత శిఖరం ఒరిగిపోయింది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత మేరువు పండిట్ జస్ రాజ్  అనంతలోకాలకు వెళ్లిపోయారు. తాన్ సేన్ ఎలా పాడుతారో మనకు తెలియదు. కబీర్ ఎలా ఉంటారో మనం ఊహించుకోవాల్సిందే. జయదేవుడు నుండి నారాయణతీర్థుడు వరకూ వాగ్గేయకార యోగ స్వరూపులు తమ భక్తిని సంగీతమయం చేసి, ఎలా రచించారో, ఎలా వినిపించారో ఊహా చిత్రాలు గీసుకోవాల్సింది. గంధర్వులు, కిన్నరులు, నారద, తుంబురులనే వారు అసలు ఉన్నారో ? లేరో ? మన మేధకు, అవాహనకు అందదు. ఒక వేళ ఉంటే, వారందరూ వీరి రూపంలో వచ్చారేమో అనిపించే సంగీత స్వరూపం, రసావతారుడు పండిట్ జస్ రాజ్. జయహో! మాతా! అని జస్ రాజ్ గొంతు నుండి వినగానే ప్రేక్షకులు అనిర్వచనీయమైన భావ తరంగాల్లోకి వెళ్లి పోతారు. ఏ రాగం ఎత్తుకుంటే, ఆ రాగ దేవత జస్ రాజ్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.రాగమై, గానమై, నాదమై, ప్రాణమై ధ్వనిస్తుంది. జస్ రాజ్ తాను లీనమై పాడుతూ, వినేవారిని తన్మయులను చేస్తూ, తనలో లీనం చేసుకుంటారు. సంగీతాన్ని ప్రతిభా ప్రదర్శనగా ఏనాడూ చెయ్యలేదు.భూమిపై పద్మాసనం వేసుకొని అనంతమైన ఆకాశంవైపు చూస్తూ, అనంతమైన శక్తి స్వరూపానికి నాదమయమైన అర్చన చేసిన యోగి పండిట్ జస్ రాజ్. దుర్గాదేవిని, శ్రీకృష్ణపరమాత్మను ఉఛ్వాస నిశ్వాసాలలో నిలుపుకొని గానం చేసిన భక్తి సామ్రాజ్య సమ్రాట్ జస్ రాజ్. ఇంట్లో రెండు తంబురలు పెట్టుకొని నాదోపాసన చేస్తున్నా, లక్షల మంది ప్రేక్షకుల మధ్య కచేరీ చేస్తున్నా పండిట్ జీ తీరు ఒకటే.పండిట్ హరి ప్రసాద్ చౌరాసియా, పండిట్ శివ్ కుమార్ శర్మ, ఎల్ సుబ్రహ్మణ్యం మొదలైన దిగ్గజ వాయిద్య విద్వాంసులతో జుగల్ బందీ, త్రిగళ్ బందీ చేసే సమయంలోనూ ఎక్కడా.. నువ్వా? నేనా? అనే ప్రదర్శన ఉండదు. యోగముద్రలో కూర్చొని,ఒక మౌని గానం చేస్తున్నట్లు ఉంటుంది పండిట్ జస్ రాజ్ సంగీత కచేరీ విధానం. సంగీత ప్రదర్శన అని అనడానికి ఏ మాత్రం వీలు లేదు. హిమవత్ పర్వతాల్లో కూర్చొని శివుడి కోసం తపస్సు చేసే భక్తుడిలా ఉంటుంది జస్ రాజ్ పాడుతున్నప్పుడు అక్కడి దృశ్యం. పండిట్ జీ చుట్టూ ఒక గొప్ప వెలుగు (ఆరా) ఉంటుంది. జస్ రాజ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేవి భజన్లు. శ్లోకాలు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ కొన్ని కోట్లమంది వీటిని వింటూ వుంటారు.డిజిటల్,సీడీ,డివిడి  వివిధ  రూపాల్లో నిక్షిప్తమై ఉన్న ఈ సంపద భారతీయ సంగీత ఖజానా.జస్ రాజ్ గొంతులోనే ఒక ప్రత్యేకమైన మాధుర్యం, మత్తు, ప్రేమతత్త్వం ఉన్నాయి.సంగీతం కోసం భక్తి కాదు.భక్తి కోసమే సంగీతం అని భావించి, గానంలో తరించి దశాబ్దాల పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందిని తరింప జేసిన సంగీతమూర్తి జస్ రాజ్. దర్బారీ,అహిర్ భైరవ్, విలక్షణ తోడి, భాగేశ్రీ, భూప్, మాల్కౌన్స్, కావేరి, యమన్.. ఇలా ఏ రాగంలో పాడుతున్నా, వినేవారిని రసలోకాల్లో విహరింపజేసే ప్రతిభామూర్తి, సంగీతజ్ఞుడు, పండితుడు, కళామూర్తి, పరమ భక్తుడు పండిట్ జస్ రాజ్. మేవాతీ ఘరానాకు చెందిన వీరి సంగీత విద్యా వికాసం అన్యులకు అసాధ్యం.చిన్ననాడే బేగం అక్తర్ గజల్స్ వింటూ స్కూల్ కు ఎగనామం పెట్టేవాడు. జుగల్ బందీలోనూ వినూత్న విన్యాసాలు చేశారు.త్రివేణి, ముల్తానీ, బేహడ, గౌడగిరి మల్హర్, పూర్వీ రాగాలు జస్ రాజ్ గొంతులో, గానంలో కొంగ్రొత్త సొగసులు వలికిస్తాయి. చిదానంద రూప శివోహం శివోహం, ఓం నమో భగవతే వాసుదేవాయ, గోవింద్ దామోదర మాధవేతి, మేరో అల్లా,శ్రీ కృష్ణ మధురాష్టకం మొదలైన గీతాలు  అద్భుత భక్తి సంగీత శిఖర సదృశాలు. అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హృదయం మధురం...అని  ఆయనే పాడినట్లు, జస్ రాజ్ గానం మధురం.ఆయన సంగీతం,  చరితం అఖిలం  మధురం. హైదరాబాద్ కు - పండిట్ జీకి ఉన్న అనుబంధం ఆత్మీయ సుగంధం. బాల్యం ఎక్కువ హైదరాబాద్ లోనే గడిచింది. ఆ అనుబంధం చిహ్నంగా, తండ్రి, సంగీత కళాకారుడు పండిట్ మోతీ రామ్ జీ  స్మృతి చిహ్నంగా , ప్రతి ఏటా హైదరాబాద్ లో, కార్తీకమాసంలో సంగీత సమారోహ్ నిర్వహించేవారు.ఆంధ్రప్రదేశ్ లో చివరగా,2014 లో విశాఖపట్నంలో శ్రీ కొప్పరపు కవుల కళా పీఠం నుండి  జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు.ఆ సందర్భంగా జస్ రాజ్ మాట్లాడుతూ తెలుగు నా మాతృభాష అని చెప్పుకున్నారు. తెలుగురాష్ట్రాలు రెండుగా ఏర్పడినా, తెలుగువారంతా ఒక్కటే అని పండిట్ జస్ రాజ్ తెలుగునేలపై తన కున్న మమకారాన్ని చాటుకున్నారు. పండిట్ జస్ రాజ్ కేవలం గాయక కళామూర్తి  కాదు, భక్తాగ్రేసరుల ప్రతిరూపం. పరమ భాగవతోత్తముడు పండిట్ జస్ రాజ్. ఒక మహా అవతారం అనంతనాదంలో విలీనమైంది. -మాశర్మ🙏
*****************

ఆంధ్రపత్రిక* సంపాదకీయం

 ఒరిగిన సంగీత శిఖరం*// భారతీయ సంగీతమూర్తి అవతారం చాలించింది.ప్రఖ్యాత హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయకుడు,విద్వాంసుడు  పండిట్ జస్ రాజ్ కన్నుమూశారు. తొమ్మిది పదుల జీవితంలో, ఎనిమిది దశాబ్దాలకు పైగా పాడుతూనే ఉన్నారు.పాడుతూనే తుది శ్వాస వదిలారు.ఉఛ్వాస నిశ్వాసలే సంగీతంగా జీవించారు.అద్భుతమైన పాండిత్యం.పరమాద్భుతమైన కళా విన్యాసం.అన్నింటికీ మించిన భక్తి.శ్రావ్యమైన గొంతు.ప్రతి శృతిలోనూ మాధుర్యం చిలికే గాత్ర సంపద ఆయన సొత్తు.గంభీరమైన రాగాలు, స్వరాలు  కూడా మాధుర్యంగా   ఆ గానంలో ఒదిగిపోతాయి.తాను నేర్చుకున్న విద్య తన వద్దే వుంచుకోలేదు.గొప్ప శిష్య సంపదను సృష్టించారు.సంజీవ్ అభయంకర్, సాధనా సర్గమ్, సుమన్ ఘోష్, తృప్తి ముఖర్జీ, కళా రామ్ నాథ్ మొదలైన ఎందరో పేరెన్నిక గన్న కళాకారులంతా జస్ రాజ్ కు శిష్యులు.సుప్రసిధ్ధ మేవాతీ ఘరానాలో సంగీత అభ్యాసం చేసిన పండిట్ జీ, ఆ ఘరానా గౌరవాన్ని ప్రపంచమంతా చాటి చెప్పారు.జయహో! మాతా! అని జస్ రాజ్ కచేరీ ప్రారంభించేవారు.భజన్లు, అభంగ్ లు, శ్లోకాలకు వీరు తీసుకువచ్చిన పేరు అంతా ఇంతా కాదు.వీరిది హిందుస్థానీ సంగీతమైనా, దక్షిణాది వారు కూడా వీరి పాటకు చెవి కోసుకుంటారు.ఉత్తరాది-దక్షిణాది అనే అడ్డుగీతలు చెరిపేసిన భారతీయ సంగీతమూర్తి. సంగీతాన్ని ప్రతిభా ప్రదర్శనగా ఏనాడూ చూపించలేదు.దేవతార్చనగానే భావించారు. దుర్గాదేవి ఉపాసకులు.తన కుమార్తెకు, ఇంటికి కూడా దుర్గాదేవి పేరు పెట్టుకున్నారు. శ్రీకృష్ణపరమాత్మను అంతగానే ఆరాధించారు.ఆ మూర్తులను హృదయ పద్మాలలో  నిలుపుకొని గానం చేసిన పరమ భక్తుడు జస్ రాజ్. ఎందరో మహా కళాకారులతో జుగల్ బందీలు,త్రిగళ్ బందీలు చేశారు.ఎవరైనా సరే, వీరి గానానికి బందీ కావాల్సిందే.పండిట్ హరి ప్రసాద్ చౌరాసియా, పండిట్ శివ్ కుమార్ శర్మ, ఎల్ సుబ్రహ్మణ్యం మొదలైన దిగ్గజ వాద్య విద్వాంసులు వీరితో జత కలిసి కచేరీలు చేశారు.  జుగల్ బందీల్లోనూ జస్ రాజ్ ఎప్పుడూ ప్రతిభా ప్రదర్శన చెయ్యలేదు.సహజ గంగా తరంగంలా, మెరుపు వేగంతో ఆ గానం ప్రవహించింది.ఆయన ఒక యోగి. ఒక జ్ఞాని.ఒక మౌని. సంగీత రూప తపస్సంపున్నుడు.వారు పాడుతూ ఉంటే, ఆ దృశ్యం మనకు ఆ భావం కలిగిస్తుంది. శిష్యవాత్సల్యంబు చెలువుతీరిన మూర్తి.ప్రేమ స్వరూపుడు. పండిట్ జీ పరమ వినయ సంపన్నుడు.జస్  రాజ్ కు  కొన్ని కోట్లమంది అభిమానులు ప్రపంచమంతా ఉన్నారు.విద్యలో ఆయన చూడని లోతులు లేవు.కీర్తిలో ఆయన ఎక్కని శిఖరాలు లేవు.ఎప్పుడో 20ఏళ్ళ క్రితమే పద్మవిభూషణ్ పొందిన ఘనుడు.35ఏళ్ళ క్రితమే సంగీత నాటక అకాడెమి అవార్డు సొంతం చేసుకున్నారు. జస్ రాజ్ గొంతులోనే ఒక చెప్పలేని మత్తు ఉంటుంది. భక్తి కోసమే పుట్టిన సంగీతమూర్తి. ఎనిమిది దశాబ్దాల  పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందిని గానంతో తరింప జేసిన, పురుషాకృతి దాల్చిన సంగీత సరస్వతి జస్ రాజ్.దర్బారీ,అహిర్ భైరవ్, విలక్షణ తోడి, భాగేశ్రీ, భూప్, మాల్కౌన్స్, కావేరి, యమన్.. ఇలా ఏ రాగంలో పాడుతున్నా, వినేవారు  రసలోకాల్లో విహరించాల్సిందే. ప్రతిభ,కళ, పాండిత్యం రంగరించుకున్న   పరమ భాగవతోత్తముడు. వీరి విద్యా వికాసం వినయ స్వరూపం .చిన్ననాడే బేగం అక్తర్ గజల్స్ కు ఆకర్షితుడయ్యారు.సంగీతమే లోకంగా జీవించారు.  జుగల్ బందీలోనూ వినూత్న ప్రయోగాలు  చేశారు.త్రివేణి, ముల్తానీ, బేహడ, గౌడగిరి మల్హర్, పూర్వీ రాగాలు జస్ రాజ్ గొంతులో కొత్తగా పలుకుతాయి. చిదానంద రూప శివోహం శివోహం, ఓం నమో భగవతే వాసుదేవాయ, గోవింద్ దామోదర మాధవేతి, మేరో అల్లా,శ్రీ కృష్ణ మధురాష్టకం మొదలైన గీతాలు సుప్రసిద్ధం.అధరం మధురం, వదనం మధురం గీతం పరమాద్భుతం. హైదరాబాద్ కు - పండిట్ జీకి ఉన్న అనుబంధం చాలా ఆత్మీయమైంది.  బాల్యమంతా  ఎక్కువగా  హైదరాబాద్ లోనే సాగింది. ఆ  చిహ్నంగా, తండ్రి, సంగీత కళాకారుడు పండిట్ మోతీ రామ్ జీ  స్మృతి చిహ్నంగా , ప్రతి సంవత్సరం  హైదరాబాద్ లో, కార్తీకమాసంలో సంగీత సమారోహ్ నిర్వహించేవారు. చివరగా 2014 లో ఆంధ్రప్రదేశ్ లో,విశాఖపట్నంలో,శ్రీ కొప్పరపు కవుల కళా పీఠంవారి జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు.ఆ సందర్భంగా జస్ రాజ్ మాట్లాడుతూ తెలుగు నా మాతృభాష అని చాటి  చెప్పుకున్నారు. తెలుగురాష్ట్రాలు రెండుగా ఏర్పడినా, తెలుగువారంతా ఒక్కటే అని పండిట్ జస్ రాజ్ తెలుగునేలపై తన కున్న అనురాగాన్ని ఆవిష్కరించారు.  నాదయోగి పండిట్ జస్ రాజ్  అవతారం సమాప్తమైంది. అనంత సంగీత లోకంలో, కాలంలో, ఆ నాదం వినిపిస్తూనే ఉంటుంది.జయహో! పండిట్ జీ -మాశర్మ🙏
*********************

ధరణికి నేమియయ్యెనొ?

ధరణికి నేమియయ్యెనొ? సతమ్ము నిపీడితమౌచుఁ ద్రెళ్ళెడున్
కరమరుదౌ గ్రహస్థితులు కక్షలు బూనెనొ? కాలుడల్గెనో?
కొరకొరలాడు తాపమున కుంభిని కిన్కవహించెనో?
పొరిపొరి రోగజాలములు, పొంగునదమ్ములు, భూప్రకంపముల్,
మరులు వెలార్చి జీవుల నమానుషపద్ధతి మట్టడించెడున్

*ధరణికి=ధరణియందలి జీవులకు* అనే అర్థంలో వాడబడింది.
                                       ✍️శ్రీశర్మద.
*******************

" రామాయణ పఠన మహిమ"

వాల్మీకి మహర్షి విరచిత రామాయణం మహా మహిమాన్వితమైనది.
గో హత్య వంటి ఘోర పాతకాలకు పాల్పడిన వారుగానీ ,  వారితో సహవాసం చేసిన వారుగానీ రామాయణ కావ్యాన్ని చదివినా, విన్నా పవిత్రులు అవుతారు.  దుస్వప్నాలు తొలగుతాయి. దుఃఖం నివారణ అవుతుంది . సకల శుభాలు కలుగుతాయి మోక్షాన్ని సైతం ప్ర" రామాయణ పఠన మహిమ" సాదించే శక్తి రామాయణ కావ్యానికి ఉంది. రామాయణ పఠనం.. శ్రవణం జనన మరణ భీతిని తొలగిస్తుంది.పుణ్యాలను ప్రసాదిస్తుంది. 
రామ కథను ఏకాగ్రచిత్తముతో వింటే మహా పాపాత్ములు కూడా                   పునీతులవుతారు.
రామాయణ ప్రవచనం జరిగే చోట దేవతలు, సిద్ధులు ఉంటారు.
రామ భక్తి పరులు ఉన్న చోట బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు కొలువై ఉంటారు. 
రామాయణ కథను విన్నంతనే సౌదాసుడనే రాక్షసునికి దివ్యత్వం ప్రాప్తించింది.
రామాయణ మహిమ అనంతం.., అనిర్వచనీయం .
రామాయణాన్ని పఠిద్దాం..
శ్రీరాముని సేవలో తరిద్దాం.

( ఏం.వి ఎస్ శాస్త్రి, ధర్మా చార్య, టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఒంగోలు 9948409528)
******************

" రామాయణ పఠన మహిమ"

వాల్మీకి మహర్షి విరచిత రామాయణం మహా మహిమాన్వితమైనది.
గో హత్య వంటి ఘోర పాతకాలకు పాల్పడిన వారుగానీ ,  వారితో సహవాసం చేసిన వారుగానీ రామాయణ కావ్యాన్ని చదివినా, విన్నా పవిత్రులు అవుతారు.  దుస్వప్నాలు తొలగుతాయి. దుఃఖం నివారణ అవుతుంది . సకల శుభాలు కలుగుతాయి మోక్షాన్ని సైతం ప్రసాదించే శక్తి రామాయణ కావ్యానికి ఉంది. రామాయణ పఠనం.. శ్రవణం జనన మరణ భీతిని తొలగిస్తుంది.పుణ్యాలను ప్రసాదిస్తుంది.
రామ కథను ఏకాగ్రచిత్తముతో వింటే మహా పాపాత్ములు కూడా                   పునీతులవుతారు.
రామాయణ ప్రవచనం జరిగే చోట దేవతలు, సిద్ధులు ఉంటారు.
రామ భక్తి పరులు ఉన్న చోట బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు కొలువై ఉంటారు.
రామాయణ కథను విన్నంతనే సౌదాసుడనే రాక్షసునికి దివ్యత్వం ప్రాప్తించింది.
రామాయణ మహిమ అనంతం.., అనిర్వచనీయం .
రామాయణాన్ని పఠిద్దాం..
శ్రీరాముని సేవలో తరిద్దాం.

( ఏం.వి ఎస్ శాస్త్రి, ధర్మా చార్య, టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఒంగోలు 9948409528)
*********************

జలధినెయ్యంబారజేరున్

ఎవరేమార్గమునన్ బ్రవర్తిలిన నిన్నేపొందు
చున్నారు, 
నిన్నెవరేరూపమునన్భజించినను నట్లేదర్శనంబిత్తు 
వుద్భవమైనీయెడవృద్ధిగాంచు జగ ,మంతర్భావమున్ జెందు,
నీయవనిన్ బుట్టుమహానదుల్ 
జలధినెయ్యంబారజేరున్ ,హరీ!
******************

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదమూడవ అధ్యాయము*

*రాబోవు ఏడు మన్వంతరముల వర్ణనము*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*13.1 (ప్రథమ శ్లోకము)*

*మనుర్వివస్వతః పుత్రః శ్రాద్ధదేవ ఇతి శ్రుతః|*

*సప్తమో వర్తమానో యస్తదపత్యాని మే శృణు॥6813॥*

*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! వివస్వంతుని (సూర్యుని) పుత్రుడగు శ్రాద్ధదేవుడగు ఏడవ మనువు. గొప్ప యశస్వియైన ఇతడు వైవస్వతుడు అని ఖ్యాతి వహించెను. ప్రస్తుతము ఈ మన్వంతరకాలమే నడుచుచున్నది. అతని సంతానమును గూర్చి వినుము-

*13.2 (రెండవ శ్లోకము)*

*ఇక్ష్వాకుర్నభగశ్చైవ ధృష్టః శర్యాతిరేవ చ|*

*నరిష్యంతోఽథ నాభాగః సప్తమో దిష్ట ఉచ్యతే॥6814॥*

*13.3 (మూడవ శ్లోకము)*

*కరూషశ్చ పృషధ్రశ్చ దశమో వసుమాన్ స్మృతః|*

*మనోర్వైవస్వతస్యైతే దశపుత్రాః పరంతప॥6815॥*

శత్రువులను తపింపజేసే మహారాజా! ఇక్ష్వాకుడు, నభగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూషుడు, పృపధృడు, వసుమంతుడు అను పదిమంది వైవస్వతమనువు యొక్క పుత్రులు.

*13.4 (నాలుగవ శ్లోకము)*

*ఆదిత్యా వసవో రుద్రా విశ్వేదేవా మరుద్గణాః|*

*అశ్వినావృభవో రాజన్నింద్రస్తేషాం పురందరః॥6816॥*

రాజా! ఈ మన్వంతరమున ఆదిత్యులు, వసువులు, రుద్రులు, విశ్వేదేవతలు, మరుద్గణములు, అశ్వినీకుమారులు, ఋభవులు అను వారు ప్రధాన దేవతా గణములు. పురందరుడు వారికి ఇంద్రుడు.

*13.5 (ఐదవ శ్లోకము)*

*కశ్యపోఽత్రిర్వసిష్ఠశ్చ విశ్వామిత్రోఽథ గౌతమః|*

*జమదగ్నిర్భరద్వాజ ఇతి సప్తర్షయః స్మృతాః॥6817॥*

ఈ మన్వంతరమున కశ్యపుడు, అత్రి, వసిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు అను వారు సప్తర్షులు.

*13.6 (ఆరవ శ్లోకము)*

*అత్రాపి భగవజ్జన్మ కశ్యపాదదితేరభూత్|*

*ఆదిత్యానామవరజో విష్ణుర్వామనరూపధృక్॥6818॥*

ఈ మన్వంతరమునందు కశ్యపుని ధర్మపత్నియైన అదితిగర్భమున విష్ణుభగవానుడు *వామన* రూపమున అవతరించెను. ఆయన ఆదిత్యులతో అందఱి కంటెను చిన్నవాడు.

*13.7 (ఏడవ శ్లోకము)*

*సంక్షేపతో మయోక్తాని సప్తమన్వంతరాణి తే|*

*భవిష్యాణ్యథ వక్ష్యామి విష్ణోః శక్త్యాన్వితాని చ॥6819॥*

రాజా! నేను ఏడుమన్వంతరములను గూర్చి సంక్షిప్తముగా ఇదివరకే చెప్పియుంటిని. ఇప్పుడు శ్రీహరి యొక్క శక్తిమంతమైన రాబోవు ఏడు మన్వంతరములను గురుంచి వర్ణించెదను.

*13.8 (ఎనిమిదవ శ్లోకము)*

*వివస్వతశ్చ ద్వే జాయే విశ్వకర్మసుతే ఉభే|*

*సంజ్ఞా ఛాయా చ రాజేంద్ర యే ప్రాగభిహితే తవ॥6820॥*

మహారాజా! వివస్వంతునకు (సూర్యునకు) సంజ్ఞా, ఛాయ అను భార్యలు ఉండిరని నేను ఇదివరలో (ఆరవ స్కంధమున) తెలిపియుంటిని. వీరిద్దరు విశ్వకర్మయొక్క కుమార్తెలు.

*13.9 (తొమ్మిదవ శ్లోకము)*

*తృతీయాం వడవామేకే తాసాం సంజ్ఞాసుతాస్త్రయః|*

*యమో యమీ శ్రాద్ధదేవశ్ఛాయాయాశ్చ సుతాంఛృణు॥6821॥*

*13.10 (పదియవ శ్లోకము)*

*సావర్ణిస్తపతీ కన్యా భార్యా సంవరణస్య యా|*

*శనైశ్చరస్తృతీయోఽభూదశ్వినౌ వడవాత్మజౌ॥6822॥*

సూర్యునికి *బడబ* అను మరియొక పత్ని గలదని కొందరు తెలిపెదరు. సూర్యపత్నియైన సంజ్ఞయందు యముడు, యమి (పుత్రిక), శ్రాద్ధదేవుడు అను వారు జన్మించిరి. ఛాయయందు గూడ సావర్ణి, శనైశ్చరుడు అను పుత్రులును, తఫతి అను పుత్రియును కలిగిరి. ఈమె సంవరణునికి పత్ని అయ్యెను. సంజ్ఞయందు, బడబయొక్క రూపమును ధరించినప్పుడు ఆమెకు ఇద్దరు అశ్వినీ కుమారులు జన్మించిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదమూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
*******************

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

*67వ నామ మంత్రము* 18.8.2020

*ఓం అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతాయై నమః*

అశ్వారూఢా దేవి అను దేవతచే అధిష్ఠింపబడిన అనేక గుర్రములచే ఆవరింపబడియున్న జగదీశ్వరికి నమస్కారము.

ఇంద్రియములు అనే  అశ్వములను అదుపులో ఉంచి జ్ఞాన సముపార్జనకు మార్గమును జూపు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతా* యను పదహారక్షరముల (షోదశాక్షరీ) నామ మంత్రమును *ఓం అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతాయై నమః* అని ఉచ్చరించుచూ జగన్మాతయైన ఆ లలితాంబను భక్తిప్రపత్తులతో ఉపాసనచేయు భక్తులకు వారి కోరికలు అనే గుర్రములు వారి అదుపులో ఉండి, ఇంద్రియలౌల్యమునకు గురికాకుండా, శాశ్వతజ్ఞాన సముపార్జన, తద్వారా ఆత్మానందమును పొందుదురు.

*అశ్వారూఢా* అనగా ఒక దేవత జగన్మాత పాశమునుండి ఉద్భవించినది. ఈ దేవత అమ్మవారి అశ్వదళములోని *అపరాజిత* అను గుర్రమును అధిష్టించియుండును. ఈ *అశ్యారూఢ* అన్ని జాతుల గుర్రములను అదుపులో ఉంచి రణరంగ మందు తన ఆజ్ఞలకు లోబడి గుర్రములు నడుచునట్లు చేయును. అందుచే జగన్మాత ఈ *అశ్వారూఢ* ను అశ్వసేనా నాయకురాలిగా చేసెను. *అశ్వారూఢ* అను ఈ దేవత *అపరాజితాశ్వము* ను అధిరోహించి, వివిధ జాతుల గుర్రముల సమూహములను తనతో ఉంచుకొని జగన్మాతను (చుట్టూ ఉండి - ఆవరించుతూ) సేవించుచుండును. అనగా అశ్వారూఢ తన సేనతో అమ్మవారికి ముందు ఉండును. శ్రీసూక్తంలో 

*అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినా''ద-ప్రబోధి'నీమ్*

 అను మూడవ శ్లోకము లోని మొదటి పాదము ద్వారా ఈ మాటే తెలియుచున్నది.

*కోరికలే గుర్రములయితే* అనే నానుడి ప్రకారం మనకోరికలు గుర్రములవంటివి. అమ్మవారి పాశము *అశ్వారూఢ* అను దేవత వంటిది. ఆ దేవత మన కోరికలను గుర్రములను అదుపులో పెట్టి శాశ్వతమైన బ్రహ్మానందము వైపు మరియు తద్వారా మోక్షసాధనవైపు నడిపించును. గాన ఈ నామమంత్రము జరిపించుటవలన మనకోరికలు అను గుర్రములు అదుపులో ఉండి, మోక్షసాధన దిశగా నడచుచూ జగన్మాత పాదసేవాభిలాష కల్పించును. కనుక జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*  అను గ్రంథమును మరియు వివిధ గ్రంథములు పరిశీలించి, వారికి పాదాభివందనమాచరించుచూ వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🕉🕉🕉🕉ఈ రోజు మంగళవారము🌻🌻🌻మంగళవారమునకు అధిపతి  అంగారకుడు అనగా భౌముడు గాన నేడు భౌమవారము అని కూడా అంటాము🌹🌹🌹పవనసుతుని ఆరాధించు శుభదినము🚩🚩🚩గులాబీ  నేటి పుష్పము🌸🌸🌸సిందూర వర్ణము శుభప్రదము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319
***********************