18, ఆగస్టు 2020, మంగళవారం

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

*644వ నామ మంత్రము* 

*ఓం జ్ఞాన విగ్రహాయై నమః*

వేద వేదాంగాదులకు,, సర్వశాస్త్రములకు సంబంధించిన విషయములయందు మూర్తీభవించిన జ్ఞాన స్వరూపిణియైన తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *జ్ఞాన విగ్రహా* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం జ్ఞాన విగ్రహాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ జ్ఞాన స్వరూపిణిని అత్యంత భక్తి ప్రపత్తులతో ఆరాధించు సాధకుడు ఆ తల్లి కరుణచే అఖండ సర్వ శాస్త్రజ్ఞానమును ఆకళింపు చేసికుని, పండితునిగా రాణించి, లౌకిక జ్ఞానముతో బాటు, ఆధ్యాత్మిక తత్త్వమందు తనదైన నడతతో పలువురికి మార్గదర్శకుడై, లబ్ధప్రతిష్టుడై  జీవించును. శ్రీమాత పాదసేవతో తరించును.

ఈ నామ మంత్ర భావముచే అమ్మ జ్ఞానము కలిగినది కాదు. జ్ఞానమే తానై, మూర్తీభవించిన జ్ఞాన స్వరూపిణియై, *జ్ఞానవిగ్రహా* యని స్తుతింపబడుచున్నది.  జ్ఞానమనగా ఏదో ఒక శాస్త్రముగాని, ఏదో ఒక అంశము అని గాని కాదు. వేదవేదాంగములకు, సర్వశాస్త్రములకు తాన సారమై, అందలి జ్ఞానమే తన రూపముగా, జ్ఞానమూర్తిగా, జ్ఞానవిగ్రహగా విరాజిల్లుచున్నది. అందుచే జగన్మాతను *జ్ఞానవిగ్రహా* యని స్తుతించుచున్నాము.

అటు జ్ఞానమూర్తికి నమస్కరించు నపుడు *ఓం జ్ఞాన విగ్రహాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*  అను గ్రంథమును మరియు వివిధ గ్రంథములను పరిశీలించి, వారికి పాదాభివందనమాచరించుచూ వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏🕉🕉🕉🕉ఈ రోజు మంగళవారము🌻🌻🌻మంగళవారమునకు అధిపతి  అంగారకుడు అనగా భౌముడు గాన నేడు భౌమవారము అని కూడా అంటాము🌹🌹🌹పవనసుతుని ఆరాధించు శుభదినము🚩🚩🚩గులాబీ  నేటి పుష్పము🌸🌸🌸సిందూర వర్ణము శుభప్రదం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*****************

కామెంట్‌లు లేవు: