25, మే 2023, గురువారం

పరిపూర్ణుడు హనుమ*

 👌 *ఏష ధర్మః సనాతనః*👌


     *25. పరిపూర్ణుడు హనుమ*


✍️ పూజ్యగురువులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు.

🌹💫🌈💫🌈🕉️🕉️💫🌈💫🌈🌹


🙏 *పరిపూర్ణుడు హనుమ* 🌹


💫 మన దేశంలో ఆంజనేయోపాసనకు ప్రాధాన్యం ఎక్కువ. అత్యధిక దేవాలయాలు ఆ స్వామికే ఉన్నాయి. 


💫 శ్రీమద్రామాయణం మంత్రగర్భిత కావ్యం. అందులో పరమేశ్వర చైతన్యం విష్ణు, రుద్ర, శక్తి రూపాలతో నిక్షిప్తమై ఉంది. విష్ణుతేజం శ్రీరామునిగా, శక్తిస్వరూపం సీతమ్మగా, రుద్రమూర్తి హనుమంతునిగా వ్యక్తమయ్యారు. ముగ్గురూ సమప్రాధాన్యం కలవారిగా రామాయణంలో మన్ననలందారు.


💫 శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయువు ద్వారా రుద్రతేజం అంజనీదేవిలో ప్రవేశించింది. ఆమె కారణ జన్మురాలైన అప్సరః కాంత. ఆ తల్లి తనయునిగా జన్మించాడు హనుమ. అతడు బాల్యంలోనే అలవోకగా సూర్యమండలం వరకు ఎగిరిన బలశాలి. వేదమూర్తి అయిన సూర్యుడికి శిష్యుడు. సూర్యుని నుంచి ఆయనకు వరంగా లభించిన దివ్యతేజశ్శక్తే సువర్చస్సు. ఈ శక్తినే స్త్రీ దేవతగా – ఉపాసనా సంప్రదాయంలో 'సువర్చల' అన్నారు. *వైశాఖ బహుళదశమి శనివారం హనుమ జననం.*


💫 రామాయణంలో తనకోసం కాక, పరులకోసం తన ప్రతాపాన్ని ప్రదర్శించినవాడు ఆంజనేయుడే. రావణుని తాను సంహరించ గలిగినప్పటికీ, అది శ్రీరాముని అవతార కార్యమని, అందుకు తగిన సహకారం అందించాడు. “రాముని బాణంలా లంకలోకి వెళతాను" అనడంలోనే తన వినయాన్నీ, భక్తిభావాన్నీ ప్రకటించాడు.


💫 జ్ఞానం, వినయం, యోగం, బలం, ధైర్యం, చాతుర్యం, వాగ్వైభవం... ఇన్నింటి కలబోత హనుమ.


💫 అభయం, ఆనందం... ఈ రెండూ హనుమ అందించే వరాలు. భయ పడిన సుగ్రీవుడికి అభయమిచ్చి శ్రీరామమైత్రిని అందించాడు. శోకంలో ఉన్న సీతకు శ్రీరామ సందేశాన్ని వినిపించి ప్రాణాలను నిలబెట్టి, సంతోష పరచాడు. సీత జాడను తెలిపి, లక్ష్మణుని ప్రాణాలు నిలిపి శ్రీరాముని ఆనందపరచాడు. ఇలా అభయాంజనేయునిగా, ఆనందాంజనేయునిగా భాసించాడు.


💫 నరసింహుడు, హయగ్రీవుడు, గరుత్మంతుడు, వరాహ స్వామి, ఆంజనేయుడు - ఈ అయిదూ ఒకే తత్త్వం తాలూకు విభిన్న వ్యక్తీకరణలు. ఇది మంత్రపరమైన ఔచితీదర్శనం. 


💫 మృగ వదనం, నరశరీరం కలిగిన దేవతలు *'క్షిప్రప్రసాద’*(వెంటనే అనుగ్రహించే లక్షణం కలవారు. రాక్షస సంహారంలో ప్రతాపాన్ని చూపిన నారసింహ లక్షణం, జ్ఞానస్వరూపునిగా హయగ్రీవ స్వభావం, గరుత్మంతునిగా మహావేగం, వరాహస్వామిగా సంసార సాగరం నుంచి, శోకపంకం నుంచి ఉద్ధరించే తత్త్వం, తనకు సహజమైన వానరాకారం - ఇవన్నీ కలబోసిన లీలలను రామాయణంలో ప్రదర్శించాడు హనుమ. అందుకే *పంచముఖాంజనేయుని* గా దర్శనమిచ్చాడు. 


అంతేకాక-


💫 గజవదనుడైన గణపతితత్త్వం, హనుమ తత్త్వమూ కూడా ఒకటేనని విజ్ఞుల విశదీకరణ. *“అవ్యక్త అప్రమేయ పరతత్త్వమితడు"* అని వాల్మీకి సుందరకాండలో పేర్కొన్నాడు.


💫 *'సుతరాం ఆద్రియతే ఇతి సుందరః'* అందరి ఆదరణా పొందే గుణమహిమ రూపాలు కలవాడు హనుమయే సుందరుడు. మంత్రశాస్త్రంలో హనుమ నామం సుందరుడు. అందుకే హనుమ కథ *'సుందరకాండ’* గా రామాయణ రత్నమాలలో కొలికిపూసలా ప్రకాశిస్తున్నవాడు.


🙏 *ఆదర్శవంతమైన వ్యక్తిత్వం, ఆరాధించదగిన దైవత్వం - కలబోసిన పరమేశ్వర స్వరూపమే శ్రీ ఆంజనేయ స్వామి.* 🙏



*సేకరణ:*

🌹💫🌈💫🌈🕉️🕉️💫🌈💫🌈🌹

రహస్య గ్రంథాలు

 ప్రాచీన భారతీయ మహర్షులు రచించిన రహస్య గ్రంథాలు -  వాటి గురించి విశేషాలు .


     మన ప్రాచీన మహర్షులు మహా తపస్సంపన్నులు మరియు గొప్ప విజ్ఞానులు . వీరు తమయొక్క విజ్ఞానాన్ని గ్రంధరూపంలో భద్రపరిచారు. ప్రస్తుతం ఆయా గ్రంథాలు మనకి దొరకటం లేదు .  నాకున్న పరిఙ్ఞానం మరియు కొన్ని పురాతన గ్రంధాలను పరిశోధించి వారు రాసిన గ్రంథాలు వేటికి సంభంధించినవో వాటిలో ఉన్న కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నాను . 


 *  బృహద్యంత్ర సర్వస్వము  - 


         ఈ గ్రంథమును భరద్వాజ మహర్షి రచించెను . ఈ గ్రంధము నందు అనేక యంత్రాల గురించి వివరంగా ఇచ్చాడు. ముఖ్యంగా " విమానాధికారణము" అను ఒక అధ్యాయం కలదు. ఇందు అనేక విమానాలు మరియు విచిత్రంగా మెలికలు తిరుగుతూ ప్రయాణించే విమానాల గురించి వివరించారు . ఈ విమానాలు ఆకాశంలో ఎగురునప్పుడు విమానాన్ని నాశనం చేసే వివిధ రకాల సూర్యకిరణాల గురించి , భయంకర వాయుగుండాల గురించి , అమిత విద్యుత్ శక్తి నుండి , అత్యుష్ణము , అతి శీతలం నుండి విమానం మరియు అందులో ప్రయాణించే వారిని రక్షించేందుకు పదమూడు రకాల దర్పణములు ( అద్దములు ) గురించి వివరించారు 


                   ఇందు దుష్టశక్తులను నిరోధించి ఉత్తమ శక్తులను ఆకర్షించు దర్పణములు ఆరున్నూ , సూర్యుని నుండి రకరకాల సూర్యకిరణములు ఆకర్షించి అక్కరలేని వాటిని నిరోధించే దర్పణములు ఆరున్నూ కలవు. పదమూడొవది వివిధరకాల పొగను సృష్టించును. విచిత్రకార్యములకు ఉపయోగపడును.


                 ఇప్పుడు మనం తయారుచేసే అద్దాలలో ప్రధానంగా సోడియమ్ గ్లాసులు , పొటాషియం గ్లాసులు మాత్రమే . కాని మన ప్రాచీనులు అద్దం తయారుచేసేప్పుడు సువర్ణం , పాదరసం , అయస్కాంతం , ముత్యములు మొదలగునవి కలిపెదరు . అంతే కాకుండా కొన్నిరకాల దివ్యోషదాలు కూడా అద్దం తయారీలో కలిపేవారు.  


          అనేక రకాల విచిత్ర వస్తువుల గురించి కూడా ఈ గ్రంథంలో విపులంగా ఉంది.


 *  ఆగతత్వలహరీ  - 


         ఇందు వ్యవసాయం , అనేక వృక్షాల వర్ణనలు , వాటి చికిత్సా పద్దతులు కలవు. ఈ గ్రంథం అశ్వలాయన మహర్షి రచించెను .


 *  అవతత్వ ప్రకరణం  - 


          ఈ గ్రంథాన్ని కూడా అశ్వలాయన మహర్షి రచించారు . దీనిలో స్నానఫలాలు జలాల్లో రకాల గురించి వివరించారు . 


 *  అండ కౌస్తభం  - 


           ఇది పరాశర కృతం . బ్రహ్మాండ చరిత్ర 

జీవకోటి విమర్శ మొదలగునవి వివరించబడినవి.


 *  అంశు బోధిని - 


           ఇది భరద్వాజ మహర్షి రాశారు. ఇందు గ్రహములు వేధించు పద్దతులు  , ప్రకాశం ( light ) , ఉష్ణం ( heat ) , ధ్వని ( sound ) , తంత్రీ వార్తావిధి ( టెలిఫోనీ ) , విమాన నిర్మాణ విధి ,విద్యుతశక్తి ప్రయోగాలు కలవు.


 *  ఆకాశ తంత్రం  - 


            ఇది భరద్వాజ మహర్షి రచించారు . ఇందు ఆకాశం యొక్క 7 విధములు , ఆకాశక్షేత్ర విభాగములు , ఆకాశంలోని శక్తి సంయోగ విధములు , ఆకాశం నందలి అగ్ని, కాంతి, గ్రహ కక్ష్యలు , భూములు , నదులు మొదలగు వాటి వివరణలు కలవు.


 *  ఋక్ హృదయ తంత్రం  - 


            ఇది అత్రి మహర్షి కృతం . ఇందు రోగములు , చికిత్సలు విశేషముగా వివరించబడి ఉన్నాయి.


 *   ఔషధీ కల్పం  - 


            ఇది అత్రి మహర్షి కృతం . ఇందు ఔషధముల ప్రభావములు . చిరకాలం జీవించుటకు యోగాలు , గుళికా యోగములు, ఆయుర్వృద్ది మొదలగునవి కలవు.


 *  కరక ప్రకరణము  - 


             ఇది అంగీరస మహాముని రచించెను . ఇందు మేఘములలొని మార్పులు , జీవరాశుల ఉత్పతి విధానం , సూర్యరశ్మిలోని మార్పులు మేఘములకు సంబంధము , నవరత్నములు పుట్టుటకు సంబందించిన సూర్యరశ్మి విభాగాలు కలవు.


 *   కర్మాబ్దిసారము  - 


             ఇది ఆపస్తంబ మహర్షిచే రచించబడెను . ఇందు కర్మలు , చేయవలసిన విధులు , వాటి ప్రాముఖ్యత , వాటి ఫలములు , శారీరక , మానసిక ఫలములు మొదలైనవి కలవు.


 *   కౌముదీ  - 


               ఇది సోమనాథ కృతం ఇందు బ్రహ్మాండం గురించి విపులంగా రాసి ఉన్నది.


 *   ఖేట సర్వస్వము  - 


              ఇది జైమినీ మహర్షి చే రచించబడెను . ఇందు ఆకాశ విభాగములు , అందలి గ్రహకక్షలు మొదలగునవి కలవు.


 *  ధాతు సర్వస్వము  - 


             ఇది బోధాయన మహర్షిచే రచించబడెను . ఇందు ధాతువులు , వాటి ఉత్పత్తులు , గనులు , గనుల నుండి

లోహములు తీయు పద్దతి , విషములు , విషహరణోపాయములు , భస్మములు , గంధకం , పాదరసం మొదలగువాటి వర్ణన కలదు . 


 *  ధూమ ప్రకరణం  - 


           ఇది నారద మహర్షి కృతం . ఇందు వివిద ధూమములు , వాటిని కొన్ని రకాల అద్దములచే పట్టుట వాటిని కొన్నిరకాల ఆమ్లములచే పరిశోధించుట . ఆ ధూమం మంచిదో కాదో తెలుసుకొనుట అనగా ఆయాపదార్థాలలోని విషగుణములను తెలుసుకొనుట తద్వారా శరీరాన్ని , బుద్ధిని పోషించుకొనుట ఈ విషయాలన్నీ కలవు.


 *  నామార్థ కల్పం  - 


           ఇది అత్రి మహర్షిచే రచించబడెను. ఇందు 84 లక్షల శక్తులు వాటి నామాలు , నామార్థాలు కలవు.


 *  ప్రపంచ లహరీ  - 


             ఇది వశిష్ట మహర్షి చే రచించబడెను . ఇందు అణువుల వలన బ్రహ్మండా నిర్మాణమా లేక బ్రహ్మతత్వం వలనా ? అని చర్చ కలదు. అణువు ల విమర్శ కూడా కలదు.


 *  బ్రహ్మాండ సారం  - 


               ఇది వ్యాస మహర్షిచే రచించబడెను . ఇందు బ్రహ్మాండ చరిత్ర కలదు.


 *  మేఘోత్పత్తి ప్రకరణం  - 


              ఇది అంగీరస మహర్షి కృతం . ఇందు మేఘములు , మెరుపులు , పిడుగులు మొదలగు వాటి ఉత్పత్తి వర్ణణలు కలవు.


 *  లోక సంగ్రహము  - 


              ఇది వివరణాచార్య కృతం . ఇందు 1714 భాషలు , జీవజాతులు , వాటి పుట్టుక , ఆహార నియమాలు , మతములు మొదలగు వివరములు కలవు. మొత్తం ప్రపంచం యొక్క సంగ్రహం కలదు.


 *  లోహ తంత్రము  - 


              ఇది శాక్త్యాయన మహార్షి చే రచించబడెను . ఇందులో లోహోత్పత్తి మొదలగు విషయాలు కలవు.


 *  వాయుతత్వ ప్రకరణము  - 


              ఇది శాక్త్యాయన మహర్షి కృతం . ఇందులో 84 వేల రకాల వాయువులు , వాటి పొరలు , భూమి మీద  ఆయా వాయువుల యొక్క ప్రభావములు , అవి వృక్ష సంపద పైన ఎట్లు పనిచేయుచున్నవి ? ఈ వాయువులను కనిపెట్టుటకు తగిన యంత్ర సాధనాలు మొదలగునవి కలవు. 


 *  వైశ్వనర తంత్రము - 


              ఇది నారద మహర్షి కృతం . ఇందు 128 రకాల అగ్నులు , వాటి రంగులు , గుణములు , ఉపయోగములు , కొలతలు తరతమ బేధములు కలవు.


 *  శక్తి తంత్రము  - 


            ఇది అగస్త్య మహార్షి చే రచించబడినది. ఇందు విద్యుత్ శక్తి యొక్క సర్వాకర్షణ సామర్ధ్యము , రూపాకర్షని , రసాకర్షిణి , గంధాకర్షిణి , స్పర్శాకర్షిణి , శబ్దాకర్షిణి , ధైర్యాకర్షిణి , శరీరాకర్షిణి , ప్రాణా కర్షిణీ  మొదలగు ముఖ్యమైన పదహారు శక్తుల వర్ణనం , సెకనుకు 1 , 86 ,000 మైళ్ళ వేగముతో ఇప్పుడు టెలివిజన్ , రేడియో ప్రసారాలు ఎలా పోవుచున్నవో అదే విధముగా విధ్యుత్ శక్తి సహాయముతో రసము , గంధకం , స్పర్శము చివరికి శరీరం కూడా అంతే వేగముతో ప్రయాణించగల విధివిధానాలు చెప్పెను . బహుశా వాయువేగంతో మనిషి ఎలా ప్రయాణించాలో తెలియచేశారు అనుకుంటా . 


 *  శుద్ద విద్యాకల్పం  - 


         ఇది అశ్వలాయన మహర్షి కృతం . ఇందు ప్రపంచోత్పత్తి నిర్ణయము కలదు.


 *  సమరాంగణ సూత్రధారము  - 


         ఇది భోజమహారాజుచే రాయబడినది. ఇందు అనేక యంత్రములు కలవు. ఈ యంత్రములు యందు ఉపయోగించు పంచభూత బీజముల విధానములు , విమాన నిర్మాణ విధానములు , ద్వని ( సైరన్ ) యంత్రము చేయు పద్ధతులు , బొమ్మలచే యుద్ధము , నాట్యము , సంగీతము , ద్వార రక్షణము మొదలగు విచిత్రములు కలవు.


           పైన చెప్పినవే కాకుండా భరద్వాజ మహర్షి రచించిన బృహద్విమాన శాస్త్రంలో అశని కల్పం , అంశుమ తంత్రం , ఉద్బిజ్జతత్వ సారాయణము , దర్పణకల్పము , దర్పణశాస్త్రం , దర్పణ ప్రకరణం , ద్రావక ప్రకరణం , మణికల్ప ప్రదీపిక , మణి ప్రకరణము , మణి రత్నాకరం , ముకుర కల్పము , యంత్ర కల్పము ,  యంత్ర కల్పతరువు , లోహతత్వ ప్రకరణం , లోహ ప్రకరణం , లోహ రత్నాకరం , లోహ రహస్యము , లోహ శాస్త్రం , విమాన చంద్రిక , విష నిర్ణయాధికారం , వ్యోమయాన తంత్రం , శక్తి తంత్రము , శక్తి బీజము , శక్తి కౌస్తుభం , సమ్మోహన క్రియాకాండం , సౌదామినీకలా మొదలగు 150 గ్రంథాలు కలవు. అదియే కాక  అగస్త్య, అత్రి , అంగీర, ఆపస్తంబ , ఈశ్వర , కపర్ది , గర్గ, గాలవ,  గోభిల , గౌతమ, నారద , పరాశర, భరద్వాజ , వశిష్ట , వాల్మీకి , వ్యాస , శౌనక , సిద్ధనాధ  మొదలగు 140 మంది గ్రంథకర్తలు కలరు. ఋషులు అంటే ముక్కులు మూసుకుని మూలన  కూర్చుని తపస్సు చేసుకునే వారు కాదు. వీరు గొప్ప వైజ్ఞానికులు .భారతదేశంలో అధికారంలో ఉన్న వారు వీటిపైన సరైన దృష్టి పెట్టకపోవడం వలన ఎంతో విజ్ఞానాన్ని కోల్పోయాము. కాని మన ప్రాచీన విఙ్ఞానం పైన విదేశీయులు అమిత మక్కువ చూపిస్తారు. దీనిపై మీకో ఉదాహరణ చెప్తాను. 1936 వ సంవత్సరం లో  1936 వ సంవత్సరం వరకు ముద్రించబడిన గ్రంథాల జాబితా ని                 "రసరత్న సముచ్ఛయ" అనే పేరుతో ముద్రించారు . ఒక కేటలాగ్ లాగా అది మనదేశంలో దాని విలువ 1 రూపాయి . జర్మనీ దేశంలో మన భారతీయ గ్రంథాల గురించి ఇచ్చిన కేటలాగ్ 5000 రూపాయిల చొప్పున అమ్ముడు అయినది.  ఇది మన భారతీయ వైఙ్ఞానిక విలువ కాని అది మరుగున పడుతుంది. మనం అయినా కాపాడుకొని మన తరవాతి తరాలకు ఆ విజ్ఞానాన్ని అందించాలి. 


   మరింత విలువైన సమాచారం , సులభ ఆయుర్వేద చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     

నామకరణం

 శ్లోకం:☝️నామకరణం

*జాతానంతరమేవ నామకరణం*

  *త్వేకాదశాహేస్ఫుటం*

*పుత్రస్యైవ సమాక్షరంతు యువతేః*

  *కార్యంతతోవ్యత్యయం l*

*శుద్ధిర్జాతకవచ్చనామ్ని*

  *సకలై స్తద్ద్వాదేశేషోడశే*

*ద్వావింశేప్యధవింశకేహ్ని*

  *విహితం జాతివ్యవస్థాంవినా ll*


భావం: కుమారుడు కలిగిన వెంటనే ( జాతకర్మ అనంతరం ) అతను పుట్టిన నక్షత్ర నామమును ( అనగా రోహిణి నక్షత్రంలో జననమైతే రౌహిణుడు మొ..గు విధంగా) రహస్యముగా నామకరణము చేయవలెను. తదనంతరం 11 రోజు కుమారునికైతే సరి సంఖ్య ( అనగా శివ, మహేశ్వర, కృష్ణ ) లో, కుమార్తెకైతే బేసి సంఖ్య ( అనగా జానకీ, పార్వతీ, భవానీ ) లో నామములు నిర్ణయించవలెను. జాతకర్మ వలెనే ఈ నామకరణమునకు కూడా లగ్నాది శుద్ధి చూసుకుని చేయవలెను. జాతి భేదములేక నాలుగు వర్ణములవారు పుట్టినది మొదలు 12, 16, 20 లేదా 22 దినములలో నామకరణం చేయవలెను.

రోహిణి కార్తే

 *రేపటి నుండి రోహిణి కార్తే ప్రారంభం.*

*రోహిణి కార్తె అంటే ఏంటీ ?*

*ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి ?*


*రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలోమెదలాడుతూ ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తోలి రోజులలో కొద్ది కొద్దిగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు. మాములుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతాయి. మరి ఈ సంవత్సరం రోహిణి కార్తె ఏలా ఉంటుందో గమనిద్దాం. ఈ సంవత్సరం రోహిణి కార్తే మే 25న ప్రారంభమై జూన్ 8వరకు రోహిణి కార్తె ఉంటుంది. రోహిణి కార్తె ఫలితంగా ఈ పక్షం రోజులు అధిక వేడిగాలులు, ఎండ తీవ్రతలు, అగ్ని ప్రమాదాలు, ఉక్కపోతలు ఉంటాయి. ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. కావునా ఆరోగ్య రీత్య తగు శ్రద్దలు తీసుకోవాలి. ఎక్కువ మట్టి కుండ నీళ్ళు త్రాగడం, మజ్జిగా, పండ్లరసాలు, కొబ్బరినీళ్ళు, నిమ్మరసం, రాగిజావ లాంటివి ఎక్కువగా త్రాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. కొంత ఉపశమనం లభిస్తుంది. మసాలాకు సంబంధించిన ఆహార పదార్ధాలు, వేపుళ్ళు, పచ్చళ్ళు, ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్ధాలు తినకూడదు. నీళ్ళ సౌకర్యం ఉన్నవారు తప్పకుండా రెండు పూటల స్నానం చేయండి. అన్ని రకాల వయస్సు వారు ఎక్కువ కాటన్ దుస్తులు వాడండి, తెల్లని రంగు కల్గినవి, తేలిక రంగులు గల కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణ తాపం నుండి ఉపశమనం లభిస్తుంది. శారీరక తాపం తగ్గుతుంది. చిన్నపిల్లలకు మీరు ఉండే ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడి గుడ్డతో తుడిచి బట్టలు మార్చండి. ఎవరైనా సరే ముదురు రంగు దుస్తులు వేయకపోవడం ఉత్తమం. ముఖ్యంగా సాటి జీవులైన పశు, పక్ష్యాదులకు త్రాగడానికి మీరు నివసించే చోట వాటికి నీళ్ళను ఏర్పాటు చేయండి. బాటసారులు ఎవరైనా సరే వాళ్ళు అడగక పోయిన వాళ్ళ దాహాన్ని తీర్చెందుకు వారికి త్రాగడానికి చల్లటి నీళ్ళను అందివ్వండి. ఇలాంటి సంఘ సేవా కార్యక్రమాలు చేయడం వలన మీకున్న గ్రహభాదలు నివారణకు మార్గమై కొంత ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో పుణ్యఫలం దక్కి అంతా మంచి జరుగుతుంది.*

ప్రసాదం

 గుళ్ళల్లో ప్రసాదం పెడతారు ఎందుకు?

మేము తిరుపతి వెళ్లి వచ్చాము అనో, శబరి మలై వెళ్లి వచ్చామనో ప్రసాదం istharu. అసలు గుళ్ళల్లో ప్రసాదం ఎందుకు పెడతారు, కేవలం అది భక్తితోనేనా లేక మరేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధ పడుతుంది. మరే వ్యవస్థలో లేని సోషలిజం మనకు ఈ ప్రసాద వితరణ లో కనపడుతుంది.  అదేదో ఊరికే నైవేద్యం పెట్టి మనం లాగించడానికి కాదు అనే తత్వం బోధపడుతుంది. 

ఒక ఊరి లో ఉండే ప్రజలందరూ మంచి పౌష్టికాహారం  తీసుకునే స్థితిలో ఉండరు. బాగా డబ్బులున్న వాళ్ళు పేదవాళ్ళ గురించి పట్టించుకోరు. వారికి కూడా మీరు తినే బలమైన ఆహారం పెట్టండి అంటే ఎవరూ ముందుకు రారు. అదే దేముడికి ప్రసాదం చేయించండి, మీకు పుణ్యం వస్తుంది అంటే సంతోషంగా ఒప్పుకుంటారు. అలా చేయించిన పౌష్టికాహారాన్ని  దేముడికి నైవేద్యం పెట్టి ప్రసాదం పేరుతో అన్ని వర్గాల వారికి అందించడం ప్రసాద వితరణ వెనుక ఉన్న అసలు రహస్యం. మనం తీసుకునే పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి, సెనగలు, కట్టె పొంగలి మొదలైన వాటిల్లో ఇనప ధాతువు (ఐరన్), కార్బో హైడ్రేట్లు, కాల్షియం, పీచు పదార్థాలు, సోడియం, పొటాసియం, ఇంకా అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి.

 Mind your mind !

💐💐💐💐💐💐

(సేకరణ)


ఇది చదవండి...కాదు, కాదు... ఆచరించండి 

మీ జీవితంలో మార్పుకోసం !


"కొద్దిగా నీరసంగా ఉంది...


కొద్దిగా బద్దకంగా ఉంది...


కాసేపు పడుకోవాలనిపిస్తోంది..


కాసేపాగి పని చేసుకోవచ్చులే...


ఇప్పటికిప్పుడు కొంపలేం మునిగిపోవట్లేదు కదా.." 


నీకు నువ్వు ఇచ్చుకునే ఈ auto suggestions ని నువ్వు ఎప్పుడైనా గమనించావా?


~ హ్యూమన్ బ్రెయిన్ చాలా గొప్ప executor.


 మీరు అనుకున్నవన్నీ,,,,,,

 తు..చ .. తప్పకుండా అమలు చేస్తుంది.


నిద్ర వస్తోంది అనుకోండి...


 అప్పటి నుండే ఆవలింతలు మొదలవుతాయి.


ఇవ్వాళ రిలాక్స్ అయి రేపు పని చేద్దాంలే అనుకోండి..

వెంటనే సాకులు వెదికిపెట్టి, మనం కంఫర్టబుల్‌గా రిలాక్స్ అయ్యేలా చేస్తుంది.


బ్రెయిన్ ప్రోగ్రామింగ్.. ఓ గొప్ప సబ్జెక్ట్.


ప్రతీ క్షణం మన థాట్ ప్రాసెస్‌ని గమనించుకుంటూ 

మన బ్రెయిన్‌ని సిస్టమాటిక్‌గా పెట్టుకుంటూ 

outputని సమీక్షించుకుంటూ  చేయాల్సిన పని!


ఒక్క క్షణం కమిట్ అవ్వు...

"నేను ఏది ఏమైనా ఈ పని చేస్తానని"! 


Next మినిట్ నీ చావు రాసిపెట్టి ఉన్నా... 

మొదట నువ్వు అనుకున్న పని చేశాకే చచ్చిపోతావు.


అది మన గొప్పదనం కాదు, మన బ్రెయిన్ గొప్పదనం.


నువ్వు ఏదనుకుంటే అది చేసి చూపెడుతుంది.


అందుకే ఎప్పుడూ...


గొప్పగా ఆలోచించు....    


నువ్వు  ఇప్పటికిప్పుడు కష్టపడతానంటే....

   

నీ ఆవలింతలను,,,,,,,

నీ నిద్రనీ,,,,,,, 

నీ బద్ధకాన్నీ,,,,,,

నీ జలుబునీ,,,,,,,, 

నీ జ్వరాన్నీ,,,,,,


నీ చుట్టూ ఉండే అన్నీ,,,,, అన్నీ,,,,,


 డిజప్పాయింట్‌మెంట్లనీ పక్కన పడేసి,

 నీ బ్రెయిన్....

నీ పని మీద ఫోకస్ చెయ్యడం 

మొదలుపెడుతుంది.


గుర్తుంచుకో,, నీ బ్రెయిన్‌కి...

feed ఇవ్వాల్సింది,,,,.......

.............నువ్వే!


నీ లైఫ్..నీ గమ్యం కోసం 

నీ బ్రెయిన్‌ని సిద్ధపరుచుకో !


"చుట్టూ చెత్త ఉంటే....

నేను ఫోకస్ చెయ్యలేకపోతున్నాను" అనకు.


బురదలో నుండి పద్మం పుట్టుకొస్తే

 దాని విలువ మాటల్లో చెప్పలేం.


అంతా క్లీన్‌గా పాజిటివ్ గా ఉంటే...

నువ్వేంటి....ప్రతీ ఒక్కరూ సాధించగలరు.


నీ చుట్టూ ఉండే బలహీనతలను దాటుకుని,

 నువ్వెలా ఎదిగావన్నదే నీ గొప్పదనం.


ఇంకొక (మనందరి) చిన్న అనుభవం.


ఏదైనా ముఖ్యమైన పని కోసం 

మనం అలారం పెట్టుకుంటే.....


అలారం కొట్టక ముందే 

రెండు మూడు సార్లు మనలని నిద్ర

లేపుతుంది నిద్రావస్థలో ఉన్న మన మెదడు.


అంటే... తాను.... 24×7

అంత అలర్ట్ గా ఉంటుంది, 

మనల్ని ఉంచుతుంది.


ఎటొచ్ఛీ... మనమే దాన్ని జోకొట్టేస్తుంటాం !


ఇంకొక ఆశ్చర్య కరమైన విషయం విన్నాను.


ఒక మనిషికి రోడ్డు ప్రమాదంలో తల పగిలి,

మెదడు బయటకి వచ్చి ఉన్న స్థితిలో....

హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగే లోపు...


అతని మెదడుకి డాక్టర్లు 

"నీకేమీ కాదు, నువ్వు బాగుంటావు, బాగుంటావు"


అని positive suggestions ఇస్తూనే ఉన్నారట.


ఆ మెదడు ఆ positive suggestions వల్లనే కోలుకుని, operation success అయి, అతను ఇప్పటికీ బాగానే ఉన్నాడట  !!!


ప్రమాదం జరిగిన మెదడే కొలుకోగా లేనిది....


ఆరోగ్యంగా ఉన్న మన మెదళ్ళు...


రోజూ మనం positive suggestions ఇస్తుంటే...


 బ్రహ్మాన్డంగా  పనిచేయవా ?


"బుర్ర" పెట్టి ఆలోచిద్దాం....


"....తద్భవతి"


అనే సూక్తి  అంతరార్ధం ఇదే....


ఆల్ ది బెస్ట్ !

💐💐💐👍👍👍🧘❤️

కృష్ణార్పణం

 అగ్నౌ దగ్ధం జలే మగ్నం హృతం తస్కరపార్థివైః l 

 తత్సర్వం దానమిత్యాహుః యది క్లైబ్యం న భాషతే ll 

    - సుభాషితరత్నభాణ్డాగారము 


ఒకవేళ మన వస్తువేదయినా , అగ్నిలోబడి కాలి పోవడము గానీ, నీటిలోబడి మునిగి పోవడము గానీ లేక చోరులచేత తస్కరింపబడటము కానీ జరిగితే , పోగొట్టుకొన్న దానిని గూర్చి పరితపించక  కృష్ణార్పణం అన్న దృష్టిని అలవరచుకొంటే అంతకు మించిన ఆనందమే ఉండదు. మనసులో బాధ లేకుంటే వుండబోయేది ఆనందమేగదా . కాబట్టి పోగొట్టుకొన్న వస్తువును దానమిచ్చిన  దృష్టితో చూస్తే ఆవేదన పోతుంది, ఆత్మ సంతృప్తి వస్తుంది. ఆవిధంగా మనము వుండలేకపోయినంత మాత్రాన ఎవరూ ఉండరని మాత్రం అనుకోవద్దు. ప్రపంచములో మహా పురుషులింకా వున్నారు. వారలే మనకాదర్శము.

శీలముచేత (ప్రవర్తనచేత) మాత్రమే శోభిల్లుతాడు‌

 .

                 _*సుభాషితమ్*_

 𝕝𝕝శ్లోకం𝕝𝕝

*న ముక్తాభిర్న మాణిక్యైః*

*న వస్త్రైర్న పరిచ్ఛదైః*।

*అలఙ్క్రియేత శీలేన* 

*కేవలేన హి మానవః॥*


తా𝕝𝕝  మానవుడు ముత్యాలహారములచే గానీ మాణిక్యాలు ధరించుటచేగానీ విలువైన వస్త్రాలు ధరించుటచే గానీ శోభిల్లడు.

*_మానవుడు తన శీలముచేత (ప్రవర్తనచేత) మాత్రమే శోభిల్లుతాడు‌ అని భావము.*

షష్టిపూర్తి ఎందుకు చేస్తారు?🌷

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌷షష్టిపూర్తి ఎందుకు చేస్తారు?🌷*     

                 🌷🌷🌷

*మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120                       సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది.             60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేది                  షష్టిపూర్తి. ప్రతివారికీ మృత్యువు 60 వ యేట          ‘ఉగ్రరథుడు’ అను పేరుతో, 70 వ యేట ‘భీమరథుడు’        అను పేరుతో , 78 వ యేట ‘విజయరథుడు’      అనుపేరుతో ఎదురుచూస్తుంటాడు. ఆరోగ్య.        సమస్యలకు తట్టుకోవటానికి చేసే శాంతి ప్రక్రియ.*       *షష్టిపూర్తి."*


*బృహస్పతి, శని 30 సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.*


*మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి.*


*షష్టిపూర్తి సందర్భంగా ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. ఆయువును కోరి చేయు యజ్ఞము… ‘ఆయుష్కామనయజ్ఞము’*


*పెద్దలు ఈ ఆయుష్కామన యజ్ఞాన్ని చేసే పధ్ధతిని ఇలా చెప్పారు.*


*తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీసి వాటిమీద అయిదు అడ్డగీతలు గీసి మొత్తము 60 గదులు వచ్చే విధంగా చేస్తారు. వరుసకు 12 అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ నుంచి క్షయ వరకు 60 సం. అధిదేవతలతో ఆవాహన చేస్తారు. దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను , 6 ఋతువులను 12 మాసములను ఆవాహన చేస్తారు.*


*పక్షములను, తిదులను వారములను - వారదేవతలు అయిన - సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శనిని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు - అగ్ని, జలము, భూమి, విష్ణువు ఇంద్రుడు, ప్రజాపతి లను ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు శివుడు, దుర్గ, కుమారస్వామి, బ్రహ్మ - ఇంకా ఏకాదశ రుద్రులు , నక్షత్ర దేవతలు 27 యోగములు 11 కరణములు ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరనములతో వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు.*


*అపమృత్యు నివారణార్థం హోమాల్ని , జపాలని కుడా చేస్తారు. తదుపరి బ్రహ్మణులను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు.* 


*పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరిగినట్టే భావించేవారు కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారంలేదు.*


*పెళ్లి సాధారణంగా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట. ఎందుకంటే షష్టిపూర్తి దృఢమైన ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక. బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకొనే అపురూప సందర్భం షష్టిపూర్తి."*


*సేకరణ:- వాట్సాప్ పోస్ట్.*

తెలుసుకుని వ్యవహరించాలి

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

😀


అమెరికా వెళ్లే భారతీయులందరూ తప్పక చదవాల్సిన వ్యాసం..


US ఖరీదైన దేశం, కానీ దాని పౌర సేవలు అత్యున్నత ప్రమాణాలు.  


వేసవిలో, యుపిలోని కాన్పూర్ నుండి ఒక కుటుంబం సెలవు కోసం యుఎస్ వెళ్ళింది.  అందులో ఒక జంట, వారి ఇద్దరు పిల్లలు మరియు ఆ వ్యక్తి తండ్రి ఉన్నారు.


న్యూయార్క్ నగరంలో మూడు రోజుల తర్వాత, నయాగరా జలపాతానికి వెళ్లేందుకు కారును అద్దెకు తీసుకున్నారు.  NYC నుండి నయాగరా వరకు ఉన్న ఇంటర్‌స్టేట్ హైవే అద్భుతంగా ఉంది.


 ఒక 80+ అమెరికన్ మహిళ వారి వెనుక కారులో ఉంది, సురక్షితమైన దూరం ఉంచింది.  


భారతీయ పిల్లలు వెనుక సీటుపై మోకరిల్లి, వెనుకకు చూస్తూ, నవ్వుతూ, వెనక్కి ఊపుతూ ఉండే అమెరికన్ లేడీకి తరచూ ఊపుతూ ఉంటారు.


అకస్మాత్తుగా అమెరికన్ లేడీ వెనుక సీటు కిటికీలో నుండి ఒక వృద్ధ భారతీయుడి తల బయటకు వచ్చి రక్తం వాంతి చేసుకోవడం చూసింది.


ఆమె తన కారును పక్కన ఆపి వెంటనే సహాయం కోసం 911కి కాల్ చేసింది.


వెంటనే, అంబులెన్స్ హెలికాప్టర్ కనిపించింది.  అది ఒక మైలు ముందుకి దిగి, కారును ఆపమని భారతీయ కుటుంబానికి సంకేతాలు ఇచ్చింది మరియు శిక్షణ పొందిన వైద్య సిబ్బంది వృద్ధుడిని దాదాపు ICUలో ఉన్న ఛాపర్‌లోకి తీసుకెళ్లారు.  ఆక్సిజన్ సరఫరా ప్రారంభమైంది.


హృదయ స్పందన రేటు మరియు ఇతర పారామితులు పర్యవేక్షించబడ్డాయి.  సూచనలను అందించడానికి జాన్ హాప్‌కిన్స్ నుండి ఒక స్పెషలిస్ట్ MD వీడియో కాల్‌లో ఉన్నారు.


అరగంటలో, వృద్ధుడు క్షేమంగా ఉన్నాడని మరియు మళ్లీ ప్రయాణించడానికి సరిపోతాడని ప్రకటించారు.


అమెరికన్ లేడీ త్వరిత సహాయం మరియు సమయానుకూల చర్యకు అభినందనలు!


ఈ సేవల కోసం, వ్యక్తి నుండి 

$ 5,000 వసూలు చేయబడింది...


ఒక భారతీయ కుటుంబానికి ఇది చాలా డబ్బు.


ప్రణాళికేతర ఆర్థిక ఖర్చులతో, కాన్పూర్ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు మరియు అతని తండ్రిని తిడుతూ...


"పాన్ (తమలపాకులు) తిని కారులోంచి ఉమ్మివేయాల్సిన అవసరం ఎక్కడిది!"


*సేకరణ: వాట్సాప్ పోస్ట్.*

నీతి:-

వేరే దేశానికి వెళ్ళినపుడు అక్కడి పరిస్థితులు, పద్ధతులు తెలుసుకుని వ్యవహరించాలి.  లేకపోతే ఇలాగే ఔతుంది. 

🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 70*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 70*


ఖణెల్ ... ఖణెల్... మంటూ కత్తులు ఒకదానిని మరొకటి మార్కొంటుంటే వాటి రాపిడికి, నిప్పురవ్వలు రాలాయి. 


అలెగ్జాండరూ, చంద్రుడూ తెగబడి వీరావేశంతో రంకెలు వేస్తూ పోరాడుతుంటే ఎవరు ఎక్కువో, ఎవరు తక్కువో వారి ద్వంద యుద్ధాన్ని చూస్తున్న వారికి అర్థం కాలేదు. పోరు అంతకంతకీ తీవ్రమవుతోంది. ఆవేశకావేషాలు మిన్నంటుతున్నాయి. ఖడ్గచాలన శబ్దాలతో ఆ మందిరం దద్దరిల్లిపోతుంది. 


అంతలో మెరుపు మెరిసినట్లు అలెగ్జాండర్ విసిరిన కత్తి వ్రేటుని చప్పున తలవెనక్కి వంచి తప్పించుకున్న చంద్రుడు, రెప్పపాటులో అడుగుముందుకు వేస్తూ తన కరవాలాన్ని చక్రవర్తి మీదకు విసిరాడు. అత్యంత లాఘవంగా విసిరిన ఆ వ్రేటుకి చక్రవర్తి చేతనున్న ఖడ్గం పై కెగిరి, పై నుంచి జర్రున కిందికి జారుతూ చక్రవర్తి నడుముకి వ్రేలాడుతున్న వొరలోకి దూరిపోయింది. 


క్షణం పాటు నిశ్చేష్టుడయ్యాడు యవన చక్రవర్తి. మరుక్షణమే తేరుకుని చప్పట్లు చరుస్తూ... 

"శభాష్ ! వీరుడివని నిరూపించుకున్నావ్. ఈ యవన సార్వభౌముని మనస్సు గెలుచుకున్నావు. నీకు తప్పక సహాయం చేస్తాం" అన్నాడు అభినందిస్తూ. 


చంద్రుడి వదనం వికసించింది. చాణక్యుని ముఖం ప్రకాశవంతమైంది. పర్వతకుని ముఖం ముడుచుకుపోయింది. 


"కానీ..." అన్నాడు చక్రవర్తి చిరునవ్వు నవ్వుతూ. 


చంద్రుడు అనుమానంగా చూస్తూ "కానీ... ?" రెట్టించాడు. 


అలెగ్జాండర్ మందహాసం చేసి "మగధని సంపాదించుకోవడానికి నీకు సహకరిస్తాం. అనంతరం మగధ సార్వభౌమత్వాన్ని అంగీకరించాలి. అది మా మొదటి నిబంధన" చెప్పాడు. 


చంద్రుడు అసహనంగా చూస్తూ "రెండోదేమిటి?" రెట్టించాడు. 


చక్రవర్తి సూటిగా చాణక్యుని వైపు చూస్తూ "చాణక్యుని అర్థశాస్త్రంతో పాటు మాకు అప్పగించాలి" చెప్పాడు. 


"ఏమిటీ.... చాణక్యుల వారిని మీకు అప్పగింతపెట్టాలా ? మగధని మీకు సామంతరాజ్యం చెయ్యాలా ? ఏం అడుగుతున్నావ్ నువ్వు ? ఎవరనుకుంటున్నావు మమ్మల్ని ? నువ్వేం చేసినా, నువ్వేం చెప్పినా తలవంచి, నీ అడుగులకు మడుగులోత్తే తొత్తులమనుకుంటున్నావా ? నీకు సామంతులుగా ఉండాల్సి వస్తే నీ సహాయం నాకు అవసరం లేదు. అవసరమైతే మగధరాజ్య కాంక్షనైనా వదులుకుంటానే గానీ చాణక్యుల వారిని నీకు అప్పగించే ప్రసక్తే లేదు. నీ యవన బలగం లేకుండా, నీ మద్దతు లేకుండా నా బలంతోనే మగధను నా హస్తగతం చేసుకుంటాను" అని హుంకరించాడు చంద్రుడు ఆవేశంతో. 


"ఆ అవకాశం నీకు ఇస్తే గదా..." అంటూ కనుసైగ చేసాడు అలెగ్జాండర్. రెప్పపాటులో యవన సైనికులు చాణక్య చంద్రగుప్తులను చుట్టుముట్టి బంధించారు. 


అలెగ్జాండర్ కోపంగా పర్వతకుని వైపు చూస్తూ... 

"ఈ దుర్హంకారులలిద్దర్నీ చెరసాలలో బంధించండి. వీళ్ళని ఏం చెయ్యాలో రేపు నిర్ణయిస్తాం" అని ఆదేశించాడు. 


చాణక్య చంద్రగుప్తులను కారాగరంలో బంధించారు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సామ గానం - ఖగోళ జ్ఞానం

 సామ గానం - ఖగోళ జ్ఞానం


శ్రీరంగం ఆలయ గోపుర నిర్మాణ సహాయానికి ముందుగా ఇష్టం వ్యక్తం చేసిన మంత్రాలయ మఠం వారు ఇప్పుడు కాస్త వెనకడుగు వేస్తున్నారని, కాబట్టి ఈ పనికి వేరొకరిని వినియోగించాలి కాబట్టి మరెవరిని అయినా సూచించాలని జీయర్ గారు శ్రీ దేశికన్ ని పరమాచార్య స్వామి వద్దకు పంపించారు. అప్పుడు స్వామివారు మౌనంలో ఉన్నారు. 


మహాస్వామివారు నేలపైన గ్రామఫోను బొమ్మ వేసి, పక్కనున్నవారిని సినీప్రముఖుల పేర్లను చెప్పమని సంజ్ఞలతో ఆదేశించారు. అందరి పేర్లూ ఒక్కొక్కటిగా చెబుతున్నారు కాని స్వామివారు ఇంకా ఇంకా అని అడుగుతున్నారు. హఠాత్తుగా ఎవరో నాపేరు చెప్పగానే, నేనే ఆ వ్యక్తి అని స్వామివారు చెప్పారు. 


నాకు పరిచయస్తుడైన తిరుచ్చి నివాసి చంద్రమౌళి నాకు ఈ విషయం తెలిపాడు. ఈయన మంచి మృదంగ విద్వాంసుడు. ఒకరోజు సాయింత్రం ఏడు గంటలప్పుడు ప్రాసాద్ స్టూడియో నన్ను కలుసుకొని జరిగిన సంగతి మొత్తం చెప్పాడు. 


“శ్రీరంగం ఆలయ గోపురం కట్టించమని నిన్ను ఆదేశించి, నిన్ను స్వామివారు అనుగ్రహించారు” అని చెప్పాడు. ”ఓహ్! పరమాచార్య స్వామివారు ఆదేశించారా? అయితే తప్పక చెయ్యాలి. నేను ఖచ్చితంగా చేస్తాను” అని చంద్రమౌళికి చెప్పాను. 


కాని దాని గురించి ఆలోచిస్తే నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నేను అప్పటిదాకా స్వామివారిని కలవలేదు. ఈ విషయం గురించి నాకు స్వామివారి వద్ద నుండి కాని, జీయర్ గారి వద్దనుండి కాని ప్రత్యక్షంగా సమాచారం రాలేదు. 


“మొత్తం గోపురం ఖర్చు 22 లక్షలు అవుతుంది. కాని స్వామివారు మిమ్మల్ని కేవలం ఆరవ అంతస్తు గురించి మత్రమే మీకు అప్పగించారు. అది దాదాపు 8 లక్షల రూపాయలు అవుతుంది” అని చెప్పాడు. “నేను మొత్తం గోపుర నిర్మాణానికే నా సమ్మతిని తెలిపాను. అంత ధైర్యం నాకు ఎలా కలిగిందో తెలుసా? అది కేవలం మహాస్వామివారి పైన ఉన్న భక్తి మాత్రమే. ఆ బరువు స్వామివారే చూసుకుంటారు. వారు ఏదైనా విషయం చెప్పారు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందులో నా పాత్ర, ప్రమేయము ఏమి ఉండదు” అని చెప్పాను.


ఆ తరువాత నాకు మహాస్వామి వారిని చూడాలనే కోరిక చాలా బలపడింది. నేను ఈ విషయాన్ని ప్రముఖ చిత్రకారుడు శిల్పికి చెప్పగా నేను కూడా వస్తాను అన్నాడు. మేమిద్దరమూ చంద్రమౌళితో కలిసి పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళాము. అప్పుడు మహాస్వామివారు సతారాలో మకాం చేస్తున్నారు. 


సతారాకి దగ్గర్లోని మహాగావ్ లో మహాస్వామి వారిని కలిసాను. అది సదూర ప్రాంతం. స్వామివారు గోశాలలో ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం మూడు గంటలు అయ్యింది. మేము వచ్చినట్టుగా అక్కడి కైంకర్యానికి చెప్పాము. అప్పుడు స్వామివారు మౌనంలో ఉన్నారు. మమ్మల్ని స్వామివారి వద్దకు తీసుకునివెళ్ళారు. స్వామివారు సంజ్ఞలతోనే మేమెవరమని అడిగారు. కైంకర్యం మమ్మల్ని ఒక్కొక్కరిగా పరిచయం చేశాడు. స్వామివారు చెయ్యెత్తి మమ్మల్ని ఆశీర్వదించారు. తరువాత వారు కొద్దిగా తల ఇటు తిప్పడంతో వారి కళ్ళను నేను చూడగలిగాను. ఎంతటి దేదీప్యమానమైన ప్రకాశవంతమైన కళ్ళు అవి. నా జీవితంలో అప్పటి దాకా అంతటి అమోఘమైన కళ్ళను నేను చూదలెదు. అవి నాకు ఏమో చేశాయి. ఆ కళ్ళను చూడడంతోనే నేను స్థాణువై నిలబడిపోయాను. రెండు చేతులు పైకెత్తి నమస్కరిస్తూ, నా ప్రమేయం లేకనే కళ్ళ నీరు కార్చాను. కొద్దిసేపు ఒక మామిడి పండును చేతిలో ఉంచుకొని దాన్ని ప్రసాదంగా నాకు ఇచ్చారు. ఎప్పటికి లభించని పెద్ద అనుగ్రహం అది.


స్వామివారు ఆ సాయింత్రం దగ్గర్లోని గ్రామానికి వెళ్తున్నారని కొందరు మాకు చెప్పారు. మేము తిరిగి వెళ్ళిపోవాలని చాలా బాధపడ్డాము. కాని మాకోసమే అన్నట్టుగా స్వామివారు ఎక్కడికి వెళ్ళడం లేదని తెలుసుకొని చాలా సంతోషించాము. ఆరోజు రాత్రి అందరమూ ఆకాశం క్రింద పచ్చని తోటలో కూర్చున్నాము. నాకు తెలిసి ఆ రోజు పొర్ణమి అనుకుంటా. ఆకాశంలో ఒక్క మబ్బు కూడా లేదు. మొత్తం నక్షత్రాలతో నిండి ఎంతో అహ్లాదాన్ని కలిగిస్తోంది. నన్ను అడగకుండానే స్వామివారి శిష్యులు నేను పాడాలనుకుంటున్నానని స్వామివారితో చెప్పారు. సరే అన్నారు. చెంబై వైద్యనాథ భాగవతార్ గారి ‘సామ గాన వినోదిని’ పాడటం మొదలుపెట్టాను. 


‘సామ గాన’ అని మొదలుపెట్టగానే మహాస్వామివారు వెంటనే నా వైపు తిరిగి వారి దివ్య కరుణా కటాక్ష వీక్షణాలను నాపై ప్రసరింపజేశారు. అలా పాడుతూనే కళ్ళ నీరు పెట్టడం మొదలుపెట్టాను. నన్ను నేను నియంత్రించుకోలేక పాట పూర్తి చెయ్యడానికి చాలా కష్టపడ్డాను. తరువాత స్వామివారు మౌనవ్రతం వీడి నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. కేవలం నన్ను కరుణించడానికే స్వామివారు నాతో మాట్లాడుతున్నారు. తరువాత స్వామివారు ఆకాశంలో 27 నక్షత్రాలను చూపించి, వాటి గురించిన విశేషాలను, స్థానాలను విపులంగా వివరించారు. అలాగే 12 రాశులను కూడా చూపించారు. “సర్వేశ్వరా! ఎంతటి అనుగ్రహం”. 


దాంతో మహాగావ్ లో మా దర్శనం పూర్తయ్యింది. వారిని తరచుగా దర్శించుకోవాలనే కోరిక చాలా బలపడింది. వారి భౌతిక దర్శనం ఒక ‘తత్వయోగి’ని చూసినట్టు. వారి స్వరూపం అవ్యాజ కరుణ, ప్రేమ, భక్తి స్వరూపం. వారి తీక్షణమైన వీక్షణాలను ఆ యోగిక శక్తిని నేను ఎన్నటికి మరచిపోలేను. అవి దక్కడం నా అదృష్టం. అది కేవలం వారి అనుగ్రహం.


--- ‘మ్యూసిక్ మాస్ట్రో’ ఇళయరాజా గారి ఇంటర్వ్యు నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

శ్రీశైలం

 మహత్యానికి మరోపేరు శ్రీశైలం ఇష్టకామేశ్వరి.......!!


కోరికలు అనేకం. వాటిని తీర్ఛుకోవడానికి మార్గాలు అనేకానేకం. మానవ ప్రయత్నంతో కాని వాటిని దైవానికి విన్నవించి తీర్చుకోవాలనుకొంటాం. దేవుడికి మన ఇష్టకామాలను (కోరికలు) చెప్పుకొంటాం. మన కోరికలు వినే దైవాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి ఆలయం ఒకటి. శ్రీశైలానికి 20 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఇష్టకామేశ్వరీ దేవి భక్తుల కోరికలు తీర్చి వారిలో ఆస్తికతను పెంచుతున్నది.


ఇష్టకామేశ్వరి దేవత విగ్రహం చాలా విశిష్టమైనది. ఈ రాతి విగ్రహాన్ని తాకితే చాలా గట్టిగా ఉంటుంది. #అయితే నుదట కుంకుమ పెట్టినప్పుడు నుదురు వేలికి మెత్తగా చర్మంలా తాకుతుంది. ఎన్నో సంవత్సరాలుగా వేలాది మంది భక్తులు ఈ అనుభూతిని పొందుతున్నారు. దేవి మందహసంతో భక్తులకు దర్శనం ఇస్తున్నది.


భక్తులకు దేవిపై అపార నమ్మకం. రెండు మూడు మార్లు ఈ దేవిని దర్శించిన వారున్నారు. మళ్ళీ మళ్లీ వస్తుంటారు. దానికి కారణం వారు వచ్చివెళ్లిన తర్వాత కోరిన కోరికలు సాఫల్యం కావడమే. కోరికలు తీరినందుకు కృతజ్ఞతాభావంగా ఆలయం సందర్శించి మళ్ళీ కొత్త కోరికలు అప్పగించి వెడతారు. అవి నెరవేరుతాయి. దీనితో మళ్లీ వస్తారు.


#ఇష్టకామేశ్వరి విగ్రహం అరుదైనదని, ఇలాటి విశిష్టత కలిగిన విగ్రహ దేశంలో మరెక్కడా లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో అరుదైన విషయం. భక్తులు తమంతట తామే ఆలయానికి రారని, వారిని దేవి ఆహ్వానిస్తుందని ప్రతీతి. అమ్మ భక్తులకు పిలుపు ఇస్తుందని, ఆ పిలుపు మేరకు వారు ఇక్కడికి వచ్చి పూజలు జరుపుతున్నారని నిర్వాహకులు చెబుతారు.


ఎంతోకాలం క్రిందట అడవిలో కొందరు చెంచులకు అమ్మ విగ్రహం కనిపించిందని, వారు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి పూజలు జరిపారని, ఇప్పటికీ వారి సంతతి వారే ఆలయ అర్చకులుగా వ్యవహరి‌అస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

 మువ్వురు మానవులకు రథోత్సవాలు

దాదాపు ముప్పైయేళ్ళు గడిచిపోయాయి. అప్పుడు నేను కాంచీపురం తాలూకా కార్యాలయంలో రెవెన్యు ఇనస్పెక్టర్ గా పనిచేస్తుండేవాడిని. ఒకరోజు తహసీల్దారు గారు పిలుస్తున్నారని నా సహాయకుడు చెప్పడంతో వెళ్లాను.

“సుబ్రహ్మణ్యన్ ఈరోజు ఎండోమెంట్ బోర్డు కమీషనరు కంచి వస్తున్నారు. ఆయన మన కలెక్టరుకు కూడా స్నేహితులు కనుక కంచి పెరియవా దర్శనానికి దగ్గరుండి ఏర్పాట్లు చెయ్యి” అని ఆదేశించారు.

తరువాత నేను కంచి మఠానికి విషయం తెలిపి, కావాల్సిన ఏర్పాట్లను చేశాను. ముందుగా నిర్ణయించిన సమయానికే ఎండోమెంట్ బోర్డు కమీషనరు మఠానికి వచ్చి, పరమాచార్య స్వామివారికి నమస్కరించి, స్వామి ఎదురుగా కూర్చున్నారు.

దివ్యతేజస్సు ఉట్టిపడుతుండగా మహాస్వామి వారు కమీషనరుతో మాట్లాడటం మొదలుపెట్టారు. వారి సంభాషణ చిన్న దేవాలయాలలో జరగాల్సిన జీర్ణోద్ధరణతో పాటు పెద్ద పెద్ద దేవాలయాలలో చెయ్యాల్సిన కుంబాభిషేకాల దాకా వెళ్ళింది.

శ్రీ శంకరాచార్య స్వామివారికి సాధారణంగా ఒక అలవాటు ఉంది. అక్కడున్న భక్తులను మన ధర్మానికి సంబంధించిన ప్రశ్నలను అడిగి సమాధానం చెప్పమంటారు. వారు ఇరకాటంలో ఉన్నప్పుడు స్వామివారే వాటికి సమాధానాలు చెప్పి అందరినీ సంతోషపరుస్తారు. అలా శ్రోతలను ప్రశ్నలను అడిగి వారే సమాధానాలు చెప్పడం ద్వారా అవి మరుగునపడక బాగా జ్ఞాపకం ఉంటాయని స్వామివారి ఆలోచన.

ఆరోజు కూడా కంచి స్వామివారు ఒక ప్రశ్న అడిగారు. అది కూడా కమీషనరుకే. “ఇది నువ్వు చెప్పగలవా? మానవ జన్మను పొంది పరమపదం చేరిన మువ్వురు వ్యక్తులకు తీర్థ్-తిరువిళ (రథోత్సవం) జరుపుతారు ఇప్పటికి. ఆ మువ్వురు ఎవరు?” అని అడిగారు.

అది అడిగినది కమీషనరుకే ఆయినే అక్కడున్న మేమందరమూ మా బుద్ధికి పనిపెట్టాము. సాధారణంగా రథోత్సవం దేవుళ్ళకు మాత్రమే చేస్తాము. కానీ పరమాచార్య స్వామివారు అడుగుతున్నది మానవులుగా పుట్టినవారు అని!

మా పరిస్థితిని గమనించిన స్వామివారు “మరొక్క ఐదు నిముషాల సమయం ఇస్తాను. ఎవరైనా సమాధానం చెప్పవచ్చు” అని అన్నారు.

ఐదు నిముషాలు గడిచినా ఎవ్వరం సమాధానం చెప్పలేకపోయేసరికి స్వామివారు, “పర్లేదు. మిమ్మల్ని మీరు బాధపెట్టుకోకండి. నేనే సమాధానాలు చెబుతాను” అని చెప్పనారంభించారు.

“’చూడికొడుత్త నాచ్చియార్’ గా ప్రసిద్ధి పొందిన ఆండాళ్ కు శ్రీవిల్లిపుత్తూర్ లో రథోత్సవం; శ్రీవైష్ణవ స్థాపకులైన శ్రీ రామానుజులకి శ్రీపెరుంబదూర్ లో రథోత్సవం; శ్రీ మాణిక్యవాచకులకు తిరుప్పేరుందురైలో రథోత్సవం జరుగుతాయి. ప్రతి సంవత్సరం వీరు మువ్వురికి పెద్ద ఎత్తున రథోత్సవం జరుగుతుంది. ఇటువంటి చిన్ని విషయాలు కూడా మీకు తెలిసిఉంటే మంచిది, అందుకనే అడిగాను” అని చిన్నపిల్లాడిలా గట్టిగా నవ్వారు.

ఆ నవ్వు ఎలాంటిది అంటే పచ్చని చెట్టుకు కొట్టిన మేకులాగా ఇప్పటికి నా జ్ఞాపకాల పొరల్లో తాజాగా ఉంది.

- ఏరాసు, చెన్నై - 61. మహాపెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం 🙏