ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
26, నవంబర్ 2023, ఆదివారం
*మీకు ఓటర్ స్లిప్ అందలేదా?.. ఈ యాప్ నుంచి పొందొచ్చు!*
అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ ముమ్మరంగా జరుగుతున్నది. దాదాపు సగానికిపైగా ఓటర్లకు అందించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ రెండు రోజుల క్రితం మీడియాకు వెల్లడించారు.నేటిలోగా మొత్తం 3.26 కోట్ల మందికి పంపిణీ చేస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రతీ ఇంటికి వెళ్లి ఫిజికల్‌గా ఓటర్ స్లిప్పులను అందించడానికి బూత్ లెవల్ ఆఫీసర్ల (బీఎల్ఓ)కు బాధ్యతలు అప్పజెప్పినట్లు వివరణ ఇచ్చారు. కానీ చాలా మంది ఓటర్ స్లిప్పులు అందలేదనే ఫిర్యాదు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత బీఎల్‌ఓ మొబైల్ నెంబర్ తెలిస్తే ఫోన్ చేసి వారి నుంచి పొందే అవకాశమున్నది.
*అందకపోతే ఏం చేయాలి?*
ఓటర్ స్లిప్పులు ఎన్నికల సిబ్బంది నుంచి అందకపోతే ఆన్‌లైన్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా, హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా, మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా పొందడానికి ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఒకవేళ ఫిజికల్ లేదా డిజిటల్ ఓటర్ స్లిప్ లేకపోయినా నేరుగా పోలింగ్ బూత్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అదే పోలింగ్ కేంద్రంలో పేరు ఉన్నట్లయితే గుర్తింపు కార్డును చూపి ఓటేయవచ్చు. లేదంటే ఈ పద్ధతుల్లో ఓటర్ స్లిప్‌ను లేదా వివరాలను పొందే వెసులుబాటు ఉన్నది.
*ఒక్క మెసేజ్‌తో..*
ఓటరు గుర్తింపు కార్డు నెంబర్‌ను టైప్ చేసి 1950 లేదా 9211728082 అనే నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే వివరాలు వస్తాయి.
*ఆన్‌లైన్‌లో అయితే..*
www.ceotelangana.nic.in అనే వెబ్‌సైట్‌లో సెర్చ్ యువర్ నేమ్-అసెంబ్లీ-ఓటర్స్ సర్వీస్ పోర్టల్ మెనూ ద్వారా ఓటరు గుర్తింపు కార్డు లేదా మొబైల్ నెంబర్ లేదా పేరును ఇవ్వడం ద్వారా ఏ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయవచ్చో తెలుసుకోవడంతో పాటు డిజిటల్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
www.electoralsearch.eci.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా ఇవే వివరాలను పొందుపర్చి ఓటర్ డిజిటల్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
*ఇలా కూడా పొందచ్చు*
www.voters.eci.gov.in అనే వెబ్‌సైట్‌లో సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అనే ఆప్షన్‌ను సెలెక్టు చేసి వ్యక్తుల వివరాలను పొందుపర్చడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
www.ceotelangana.nic.in అనే వెబ్‌సైట్‌లో ఆఫీసర్స్ డీటెయిల్స్ - బూత్ లెవల్ ఆఫీసర్స్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ద్వారా జిల్లా, నియోజకవర్గం, అక్కడి పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్ఓల ఫోన్ నెంబర్లను తెలుసుకుని వారికి ఫోన్ చేసి బూత్ నెంబర్ వివరాలను పొందొచ్చు. లేదా *www.ceotserms2.telangana.gov.in./TS_ERODETAILS/BLO_Details.aspx అనే వెబ్‌సైట్ ద్వారా జిల్లా, నియోజకవర్గం వివరాలను పొందుపర్చి బీఎల్ఓల ఫోన్ నెంబర్లను తెలుసుకోవచ్చు.
*టోల్-ఫ్రీ నెంబర్ ద్వారా..*
కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో 24 గంటలూ పనిచేసే హెల్ప్ లైన్ (టోల్-ఫ్రీ) నెంబర్ 1950కి ఫోన్ చేసి ఓటర్ల వివరాలను లేదా ఓటరు గుర్తింపు కార్డు నెంబర్‌ను తెలియజేయడం ద్వారా కూడా పోలింగ్ కేంద్రం, బూత్, నెంబర్ తదితరాలను పొందవచ్చు.
*మెయిల్ ద్వారా..*
ఎన్నికల సంఘానికి మెయిల్ (complaints@eci.gov.in) ద్వారా కూడా మన గ్రీవెన్స్ (ఫిర్యాదు)ను ఇచ్చి పోలింగ్ బూత్ వివరాలను తిరిగి మెయిల్ ద్వారానే పొందవచ్చు.
*మొబైల్ యాప్‌తో..*
ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ వినియోగదారులు యాప్ స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అనే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వివరాలను ఇవ్వడం ద్వారా ఏ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయవచ్చో తెలుసుకోవచ్చు.
*ప్రశ్న : కార్తిక మాసంలో ఎలాంటి వ్రతం చేస్తే మంచిది. ఏ ఏ నియమాలు పాటించాలి?*
జ : కార్తికంలో స్నానం,జపం,దానం పారాయణ ఏదైనా మహోన్నత ఫలాన్నిస్తుంది. ఎవరికి వీలైన వ్రతాన్ని వారు పాటించవచ్చు. ముఖ్యంగా దీపదానానికి సమానమైన దానం లేదు.
అవ్రతః కార్తికో యేషాం
గతో మూఢధియా మిహ l
తేషాం పుణ్యస్యలేశోపి
న భవేత్.....
" కార్తిక మాసంలో ఏ వ్రతమూ చేయకుండా గడిపే మూఢులకు పుణ్యం లేశమైనా లభించదు. అట్టివారి జన్మ నీచజన్తు జన్మకు సమానమని ధర్మశాస్త్రం కొంచెం గట్టిగానే ఘాటుగానే చెప్పింది.
కార్తిక మాసంలో రామాయణ, సుందరకాండాది పురాణాలను పారాయణం ప్రారంభించి, మాసాంతంలోగా పూర్తి చేయడం కూడా ధర్మశాస్త్రాలు విధించాయి. ఉత్తముడైన పండితుని ద్వారా ఈ మాసం దివ్య పురాణాలను శ్రవణం చేయడం గొప్ప ఫలితాన్నిస్తుందని పురాణవచనం. తాంబూలం, కేశఖండనం వంటివి విసర్జించడం ఉత్తమం. ఆకాశదీపాన్ని విష్ణు ప్రీతికై ఏర్పాటు చేస్తారు కొందరు. కార్తికంలో ఉల్లి, ఇంగువ,పుట్టుకొక్కు,గంజాయి,ముల్లంగి, ఆనపకాయ, మునగ కాడలు, వంగకాయ, గుమ్మడికాయ, వాకుడు,పుచ్చకాయ, వెలగపండు,నూనె, లవణశాకం,చద్ది మొదలైనవీ రెండు మార్లు వండిన అన్నం, మాడిన అన్నం,మినుములు, పెసలు,సెనగలు, ఉలవలు, కందులు మొదలైన ద్విదళ ధాన్యాలువాడరాదు. సప్తమి నాడు - ఉసిరిక,తిలలు,
అష్టమినాడు - కొబ్బరి, ఆదివారం - ఉసిరికపప్పు కార్తికంలోనే కాక ఏ మాసమందూ ఉపయోగించరాదు.
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *88వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*గురుగ్రహ చరిత్ర - 4*
తార మళ్ళీ గర్భవతి అయ్యింది. తనకు మళ్ళీ మరొక అందగాడు కొడుకుగా జన్మిస్తాడంది ఆమె , బృహస్పతితో బృహస్పతి చిరునవ్వు నవ్వాడు.
*"ఎప్పుడు ఎవరి గర్భాన ఎవరు జన్మించాలో విధాత నిర్ణయిస్తాడు ! సంతానాన్ని పొందే మనలాంటి దంపతులు కేవలం నిమిత్తమాత్రులం !"*
భర్త మాటలు తారలో ఏదో అవ్యక్తమైన అనుమానాన్ని పుట్టించాయి. ఆయన మాటలు అంతరార్థంతో కూడి ఉన్నాయేమో అనిపించిందామెకు.
బృహస్పతి మాటల అంతరార్థం నవమాసాల అనంతరం ఆమెకు బోధపడిండి ! తార ఒక సుముహూర్తంలో మగశిశువును ప్రసవించింది. శిశువును చూడగానే ఆమె శరీరం ఒక్కసారిగా జలదరించింది.
శిశువు శరీరం పూర్తిగా రోమాలతో నిండి ఉంది. ముఖం ఎర్రగా వానర ముఖంలా. ఉంది. ఆ శిశువు వానరుడే అని చెప్తున్నట్లు పృష్ఠ భాగంలో తోక కదలాడుతోంది ! పొత్తిళ్ళలో పడుకోబెట్టిన శిశువును చూస్తూ , తార దుఃఖసాగరంలో మునిగిపోయింది. వానరపుత్రుడు పుట్టడం ఆ విధి తనకు విధించిన శిక్షలా భావించిందామె.
బృహస్పతి తారను ఓదార్చాడు. తార పుత్రుడైన ఆ వానర కుమారుడు కారణ జన్ముడన్నాడాయన.
*“నీ కొడుకు వికారంగా ఉన్నాడని విచారించాల్సిన అవసరం లేదు. తన జాతిలో తను అందగాడే ! నీ శరీర సౌందర్యంతో మరొక ప్రాణి శరీర సౌందర్యాన్ని పోల్చి చూడకూడదు సుమా ! నాతి అందం నాతిది. కోతి అందం కోతిది !"*
*"స్వామీ..."*
*"నీ కుమారుడు నిజంగానే కారణజన్ముడు. మన పోషణలో పెరగడు. వనచరుడుగా వనాలలో స్వేచ్ఛగా , స్వచ్ఛంగా ఎదుగుతాడు. మన వానర కుమారుడు దీర్ఘశరీరుడవుతాడు. దీర్ఘశరీరుడే కాదు. నీ పుత్రుడు దీర్ఘాయుష్కుడూ అవుతాడు !"* బృహస్పతి చెప్పుకుపోతున్నాడు.
*"నా బిడ్డ గురించి ఇదంతా ఎందుకు చెప్తున్నారు ?"* తార అడిగింది.
*"విను !"* బృహస్పతి ఆమెను తదేకంగా చూస్తూ అన్నాడు.
*"మన వానరపుత్రుడికి నీ పేరు శాశ్వతం అయ్యేలా - 'తారుడు' అనే పేరు నిర్ణయిస్తున్నాను. భవిష్యత్తులో శ్రీమహావిష్ణువు ధరించే అవతార రూపాన్ని సేవిస్తూ తన భుజబలంతో ప్రసిద్ధి చెందుతాడు ! మరొక అంశం కూడా ఉంది. వానర స్త్రీగా అంజన పొందపోయే కుమారుడూ , ఈ తారాకుమారుడూ కలిసి ఆ అవతార పురుషుణ్ణి సేవిస్తారు !".*
*“అలాగా ! నా తారుడు అంత అదృష్టవంతుడా స్వామీ ?”* తార దుఃఖాన్ని పూర్తిగా మరిచిపోయి అంది.
*"ఔను ! మహాదీర్ఘమైన , బలిష్టమైన దేహాన్ని నేను తారుడికి ప్రసాదిస్తాను. ఆ రెండింటితో బాటు మహా మేధస్సు కూడా మన తారుడికి లభిస్తుంది !"* బృహస్పతి తారుడి శరీరాన్ని నిమురుతూ అన్నాడు.
కచుడు పరుగు పరుగున వచ్చాడు. తారుణ్ణి చూసి , ప్రశ్నార్థకంగా అమ్మ వైపు చూశాడు.
*"నీ తమ్ముడు , నాయనా ! వీడి పేరు తారుడు !"* తార కచుడితో అంది.
కచుడి కళ్ళు విశాలంగా విచ్చుకున్నాయి. *"తమ్ముడా ? తారుడా ? ఎంత బాగున్నాడో ? తమ్ముడితో నేను ఆడుకుంటాను !"* కచుడు ఉత్సాహంగా అన్నాడు.
*"చూశావా , తారా ! మనకు కనిపించని అందం తారుడిలో కచుడికి కనిపిస్తోంది. సౌందర్యం సృష్టిలో మాత్రమే కాదు , దృష్టిలో కూడా ఉంటుంది సుమా !”* బృహస్పతి నవ్వుతూ అన్నాడు.
**************************
తారుడు రోజురోజుకీ పొడవుగా , దృఢంగా పెరుగుతున్నాడు. అతని పెరుగుదల ఆశ్చర్యం కలిగించే రీతిలో సాగుతోంది.
తారు వృక్షవిహారానికి ఆశ్రమంలో చెట్లు చాలడం లేదు ! ఇరుకైన ప్రదేశంలో ఉన్న భావం తారుడి ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తోంది. బృహస్పతి అది గమనించాడు.
*"తారుడికి మన ఆశ్రమ ప్రాంగణం ఇరుకుగా ఉంది. వాడు విశాలారణ్యాలకు వెళ్ళడం మంచిది. అక్కడ లభించే స్వేచ్ఛ తారుడికి ఇక్కడ ఉండదు !"* అన్నాడు తారతో.
తార మౌనంగా తల పంకించింది.
బృహస్పతీ , తారా , కచుడూ తారుడికి వీడ్కోలు పలికారు. తారుడు ఆనందంతో గంతులు వేస్తూ అరణ్యమార్గాన పరుగు ప్రారంభించాడు.
*"అమ్మా ! తమ్ముడిలాగా నేనెప్పుడు పెద్దగా అవుతాను ?"* కచుడు కుతూహలంగా అడిగాడు.
*"గురుగ్రహం బృహస్పతి చరిత్ర అంత విస్తృతంగా లేదు గురువుగారూ !”* విమలానందుడు , గురుచరిత్ర కథనం ముగిశాక అన్నాడు.
నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. *“అవగాహనా సౌలభ్యం కోసం , ఎంత అవసరమో , అంతే వినిపించాను మీకు ! దేవగురువైన బృహస్పతి చరిత్రా , అసురగురువైన ఉశనుడి చరిత్రా అక్కడక్కడా కలిసిపోతూ ఉంటాయి. ఆ కారణంగా , ఉశనుడి కథాంశాలతో పాటు గురుగ్రహానికి సంబంధించిన అంశాలూ మనకు తెలుస్తాయి. నవగ్రహాలలో ఎవరి చరిత్ర వారికి ఉంది. మనం గుర్తించాల్సింది చరిత్ర పరిమాణం కాదు. ప్రభావం.”*
*"మీ కథనం , విధానం అనుక్షణం మాలో ఉత్కంఠను రేకెత్తిస్తూనే ఉంది , గురువుగారూ !"* చిదానందుడు అన్నాడు.
*"మంచిది ! కథనం విసుగు కలిగించే విధంగా ఉండకూడదు. ఇప్పుడు ఆరవగ్రహమైన శుక్రుడి చరిత్ర చెప్పుకుందాం ! పులోమా , భృగు దంపతుల కుమారుడైన ఉశనుడు రాక్షసుల ఆచార్య పదవిని స్వీకరించాడనీ , రాక్షసరాజు వృషపర్వుడి ఆస్థానంలో ఉంటూ , రాక్షసులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నాడనీ చెప్పుకున్నాం. ఒకరోజు వృషపర్వుడు కొలువు కూటంలో ఉన్నాడు. ఉశనుడు కూడా ఉన్నాడు. ఆనాడు సభలో జరిగిన సంఘటన ఉశనుడు 'శుక్రుడు'గా మారడానికి 'బీజావాసం' చేసింది...”* అంటూ శుక్ర గ్రహ చరిత్రను వినిపించడం ప్రారంభించాడు నిర్వికల్పానంద.
*రేపటి నుండి శుక్రగ్రహ చరిత్ర ప్రారంభం*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *33వ అధ్యాయం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*పురాణ పఠనం ప్రారంభం*
*గురుగ్రహ జననం - 4*
తారా బృహస్పతుల దాంపత్య జీవితం ప్రారంభమైంది.
నిర్వికల్పానంద నవగ్రహ పురాణం కథనం కొనసాగిస్తూ ఇలా అన్నాడు. *"గురు గ్రహం అనబడే బృహస్పతి జన్మ వృత్తాంతం ఆలకించారు. ఆ బృహస్పతికి సమకాలికుడూ , సముడూ అయిన శుక్రుడి జన్మ గాథ వినండి.*
*"నవ గ్రహాలలో ఆరవ గ్రహమైన శుక్రుడు బ్రహ్మ మానస పుత్రులలో ప్రముఖుడైన భృగుమహర్షి కుమారుడు. 'శుక్రుడు' అన్నది ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. ఒక మహత్తరమైన కారణంతో ఆయనకు 'శుక్రుడు' అనే సార్ధక నామధేయం ఏర్పడింది..."* అంటూ ఆగాడు నిర్వికల్పానంద.
*"ఈ రహస్యం మాకు తెలీదు ! శుక్రుడు - 'శుక్రుడే' అనుకుంటున్నాం ! ఆ పేరు రావడానికి కారణం ఏమిటి గురువు గారు ?"* సదానందుడు అడిగాడు.
నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. *“అంత తొందర ఎందుకు , సదానందా ! శుక్రుడి చరిత్రను సంపూర్ణంగా ఆకర్ణిస్తారు గదా ! ఆ క్రమంలో ఆ 'రహస్యగాథ' తెలుస్తుందిలే ! శుక్రుడి తండ్రి భృగుమహర్షి అని చెప్పాను కదా ! ఆయన భార్య పులోమ. ఆమెను పౌలామి అని కూడా అంటారు. పులోమ అసుర వంశానికి చెందింది. భృగు మహర్షిని వివాహం చేసుకున్నాక , ఆమె గర్భవతి అయింది. మొదటి నుంచీ ఆమె మీద మనసు పడిన రాక్షసుడు (పులోముడు) భృగువు లేని సమయంలో సూకర రూపం ధరించి , పులోమిని అపహరించుకుపోయాడు. ఆ రాక్షసుడు పరిగెడుతున్న సమయంలో నిండు చూలాలైన పులోమకు ప్రసవం జరిగిపోయింది. పురుష శిశివు ఆమె గర్భం లోంచి నేల మీదకు పడిపోయాడు. ఆ శిశువే చ్యవనుడు...”* కథ చెప్తున్న నిర్వికల్పానంద ఆగాడు.
*"చ్యవనుడంటే... సుకన్య భర్త. చ్యవన మహర్షేనా గురువు గారూ ?"* చిదానందుడు అడిగాడు.
*“ఔను... ఆ చ్యవనమహర్షి గాథ అటుంచి ఆ భృగుపత్ని పులోమను గురించి వినండి. ఆమె మహామహిమ కలిగిన వనిత. ఆమోఘమైన తపశ్శక్తి ఆమెది. భృగుపత్నిగా ఆమె అలవరచుకున్న పతిభక్తి ఆమె శక్తిని ఇతోధికంగా పెంచింది. భూపతనమై జన్మించిన చ్యవనుడు తపస్సులో నిమగ్నుడైపోయాడు. తదనంతరం పులోమా , భృగు దంపతులకు 'వజ్రశీర్షుడు', 'శుచి', 'ఔర్వుడు' అనే కుమారులు కలిగారు. అయితే ఆ పుత్రుల సాధారణ మేధోశక్తీ , సాత్వికతా పులోమను సంతోష పెట్టలేక పోయాయి. మహాశక్తి సంపన్నుడూ , కత్తివాదర లాంటి బుద్ధికుశలత కలిగిన వాడూ , కార్యదక్షతా , పట్టుదలా కలిగిన వాడూ , ముఖ్యంగా తాను ఏ కులంలో ఉద్భవించిందో , ఆ అసురకులం పట్ల చెరగని పక్షపాత ధోరణి కలిగినవాడూ అయిన అసాధారణ పుత్రుడు కావాలన్నది పులోమ చిరకాల వాంఛ...”* అంటూ వివరించ సాగేడు నిర్వికల్పానంద.
_*రేపటి నుండి శుక్రగ్రహ జననం ప్రారంభం*_
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
. *⚜️పెరియ పురాణం⚜️*
. *నాయనార్ల చరిత్ర - 11*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
*11. మానకంజార నాయనారు*
కంజారు అనే గ్రామంలో మానకంజారుడు అనే భక్తుడు నివసిస్తూ
ఉండేవాడు. వేలాల కులంలో జన్మించిన అతడు రాజుగారి సైన్యానికి
దళపతిగా ఉండేవాడు. శివుని మీద అచంచలభక్తి విశ్వాసాలను కలిగిన
మానకంజారుడు తన సంపదలన్నీ శివభక్తులకు చెందినవేనని భావించి
వారు కోరకనే వారికి కావలసినవన్నీ ఇస్తుండేవాడు.
పరమేశ్వరుని
నియమనిష్ఠలతో పూజిస్తూ వచ్చిన అతనికి ఒక కుమార్తె జన్మించింది.
అల్లారుముద్దుగా పెరిగిన ఆ అమ్మాయి కొంతకాలానికి యుక్తవయసుకు
చేరుకుంది. మాన కంజారు తన కుమార్తెను ఎయర్ కోన్ కలిక్కామరుకు
ఇచ్చి పెళ్లిచేయడానికి నిశ్చయించాడు.
కంజారు గ్రామం పెళ్లి సంబరాలతో కల కలలాడింది.
ఎయిర్కోన్నాయనారు, అతని బంధువులు మంగళవాయిద్యాలు మ్రోగుతుండగా
మానకంజారు పెళ్లి ఇంటికి బయలుదేరారు. వారు రావడానికి పూర్వమే
ఒక మునివరుని వేషాన్ని ధరించి పరమేశ్వరుడు కంజారు ఇంటిలో
అడుగుపెట్టాడు. కంజారు తన కుమార్తెను పిలిచి ఆ మునివరుని పాదాలకు
నమస్కరింపజేశాడు.
తన పాదాలకు నమస్కరించిన పెళ్లికుమార్తె తల
వెండ్రుకలను మునీశ్వరుడు చూశాడు. కంజారుతో "మీ అమ్మాయి తల
వెండ్రుకలు నాకు జంద్యానికి ఉపకరిస్తాయి" అన్నాడు. వెంటనే పొడవుగా
వేలాడుతున్న తన కుమార్తె తల వెండ్రుకలను మొదలంట కత్తరించాడు.
కంజారనాయనారు. దానిని మునివరుని చేతిలో పెట్టడానికి ముందుకు
రాగా మునివరుడు మాయమయ్యాడు. ఉమాదేవి సహితుడై
వృషభవాహనారూఢుడై పరమేశ్వరుడు గగనవీధిలో ప్రత్యక్షమయ్యాడు.
"భక్తుడా! నీభక్తి లోకానికి తెలియజేయడం కోసమే నేను ఇలాచేశాను” అని చెప్పి అంతర్ధానమయ్యాడు. పరమేశ్వరుని అనుగ్రహంతో పెళ్లి కుమార్తె
తలవెండ్రుకలు యథాప్రకారం వచ్చాయి.
*పదకొండవ చరిత్ర సంపూర్ణం*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *భాగం 98*
అత్యున్నత భావ భూముల్లో
మఠ నిర్వహణ, కుటుంబ సమస్యలు ఏవీ నరేంద్రుని ఆధ్యాత్మిక అత్యున్నత భావభూములను చలింపజేయలేదు. అతడి మనస్సు సదా అత్యున్నత భావ భూముల్లోనే సంచరించసాగింది. ఒక రోజు సాయంత్రం 4 గంటలు అయ్యుండవచ్చు. ఆ రోజు నరేంద్రుణ్ణి చూడడానికి ఆతడి సోదరుడైన మహేంద్రుడు మఠానికి వచ్చాడు. మెట్లెక్కి మేడ మీది వసారాలోకి వచ్చినప్పుడు అక్కడ నరేంద్రుడు పచార్లు చేస్తూ కనిపించాడు.
పచార్లు చేస్తున్నాడో లేక ఎవరైనా ఆతణ్ణి నడిపిస్తున్నారో తెలియరాలేదు.. అలాంటి స్థితిలో ఆతడున్నాడు. నిశ్చలమైన కళ్లు, ఊర్ధ్వముఖమైన దృష్టి. - శారీరకస్మృతిలేని ఆకృతి, దివ్య తేజస్సుతో ప్రకాశించే ముఖాకృతి! చెరిగిపోని పరమ ప్రశాంతత ఆ ప్రాంతమంతా ఆవరించి ఉంది.
మహేంద్రుడు చాలాసార్లు నరేంద్రుణ్ణి పిలిచాడు, స్పందన లేదు. అతడు నడుస్తూ తన ప్రక్కకు వచ్చినప్పుడు బిగ్గరగా పిలిచి చూశాడు. అయినప్పటికీ నరేంద్రుని నుండి ఎలాంటి జవాబు లేదు. మహేంద్రునికి భయం వేసింది. వెనుకకు కాస్త దూరం వెళ్లగా అక్కడ రాఖాల్, శరత్ ప్రభృతులు ఏమీ పాలుబోక నిలబడి కనిపించారు. "మధ్యాహ్నం ఒకటిన్నర నుండి ఇలాగే ఉన్నాడు. అతణ్ణి ఈ స్థితిలో మేం ఎన్నడూ చూసింది లేదు. కొన్ని రోజులు జపధ్యానాదులలో బాగా లయించిపోయి ఉన్నాడు.
సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అంటూ బాగా లోతైన విషయాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చింతనలో అతడి మనస్సు అత్యున్నత స్థితులలో నెలకొని ఉన్నది. నువ్వు ప్రయత్నించి అతడి మనస్సును సామాన్య స్థితికి తీసుకురాగలవేమో చూడు. ఇలా అత్యున్నత స్థితులలో మనస్సు నెలకొనే దశలో శరీరం రాలిపోతుందని గురుదేవులు చెప్పేవారు. మా అందరికీ ఎంతో ఆందోళనగా ఉంది" అని వారు మహేంద్రునితో చెప్పాడు.
చీకటి పడసాగింది. మహేంద్రుడు నరేంద్రుని ప్రక్కకు వెళ్లి బిగ్గరగా అతణ్ణి పేరుపెట్టి పిలువసాగాడు. ఫలితం శూన్యం. కాళ్లు యాంత్రికంగా నడుస్తూనే ఉన్నాయి; చూపు ఎక్కడో చూస్తూన్నట్లుగా ఉంది. అతడు మామూలు స్థితికి వచ్చే సూచనలు ఏమీ కనిపించడం లేదు. మహేంద్రుడు కూడా ఎడతెగక బిగ్గరగా పిలవడమేగాక, తిట్టడం కూడా ప్రారంభించాడు. అలా ఏడెనిమిది నిమిషాలు. గడిచిపోయాయి.
ఆ తరువాత నరేంద్రుడు క్రమక్రమంగా సాధారణ స్థితిలోకి రాసాగాడు. అనంత జ్యోతిర్మయ లోకాన్ని తిలకించిన ఆతడి నేత్రాలు వెలుగు చీకట్లు మారిమారి వచ్చే ఈ లోకాన్ని ప్రప్రథమంగా చూస్తూన్నట్లుగా అనిపించాయి. నూతన లోకాన్ని చూస్తూన్నట్లుగా ఆతడి కళ్లు దేనినీ నిలకడగా చూడలేక పోతున్నాయి. చివరకు అస్పష్ట స్వరంలో, "ఏమిటిది, ఏమిటిది" అనే మాటలు ఆతడి నోటి నుండి వెలువడ్డాయి. చాలాసేపు గడచిన తరువాతే అతడు పూర్తి బాహ్యస్మృతిలోకి రాగలిగాడు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
. *శ్లోకం - 88*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*పదం తే కీర్తీనాం ప్రపద మపదం దేవి విపదాం*
*కథం నీతం సద్భిః కఠినకమఠీకర్పరతులామ్ l*
*కథం వా బాహూభ్యా ముపయమనకాలే పురభిదా*
*యదాదాయ న్యస్తం దృషది దయమానేన మనసా ‖*
*కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా*
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము 43 వ నామము. అనగా అమ్మవారి మోకాళ్ళు తాబేటి డిప్ప వలె కొద్దిగా ఉబ్బివున్నాయి అని. ఇది మంచి సౌభాగ్య లక్షణము. ప్రపదములనగా ప్రజ్ఞానం బ్రహ్మ మొదలుగా కల నాలుగు మహావాక్యములని కూడా భావించవచ్చు. అలాగే ఉపమానంగా చూపిన తాబేటి డిప్ప అంటే క్షీరసాగరమధనంలో తన డిప్పపై మందర పర్వతాన్ని నిలిపి సహకరించిన కూర్మావతార శ్రీమహావిష్ణువు యొక్క సమస్త లోకములను ఉద్ధరించగల పాదములని గ్రహించవచ్చు.
ఇక్కడ శంకరులు అంటున్నారు అమ్మ
పదం దేవి విపదాం = అన్ని విపత్తులను తొలగించగలిగిన నీ పాదములు
పదం తే కీర్తీనాం ప్రపదమ్ = శోభాయమానమని కీర్తింపబడే నీ దివ్య పాదములు
కథం నీతం సద్భిః కఠినకమఠీ కర్పరతులామ్ సద్భిః = పండితులు అంటే వశిన్యాది వాగ్దేవతలు సహస్ర నామములను అమ్మవారి అనుజ్ఞపై పలికినవారు. నీ సుకుమారమైన మీగాళ్లను కఠినమైన తాబేటి డిప్పతో ఎలా పోల్చారమ్మా?
పురభిదా = త్రిపురారి అయిన శివుడు
బాహుభ్యా ముపయమనకాలే దయమానేన మనసా = నీ వివాహ సమయమందు జాలి పడినవాడై తన రెండు చేతులతో
కథం వా యదాదాయ న్యస్తం దృషది = నీ పాదమును సున్నితముగా సన్నికల్లు ( దృషది) పైన ఉంచాడమ్మా. అంటే నీ పాదములు సున్నితమైనవి కాని, కఠినమైనవి కావని శంకరుల వాక్కు.
సనాతన ధర్మ సంప్రదాయములో వివాహములో ఆశ్మారోహణము అనే కార్యక్రమం ఉంటుంది. ఇది స్థాళీపాక సందర్భంగా చేయిస్తారు వధూవరుల చేత. హోమకుండమునకు ఉత్తర దిశలో సన్నికల్లును ఉంచి, వరుడు వధువు కుడి అరచేతిని పట్టుకొని ప్రదక్షిణముగా వచ్చి తన ఎడమ చేతితో ఆమె కుడి పాదము బ్రొటనవేలును పట్టుకొని, ఆ సన్నికల్లు రాతి పైన ఆమె కుడి పాదమును ఉంచి మంత్ర పూర్వకముగా చెప్తాడు జీవితములో ఎట్టి ఒడిదుడుకులు కలిగినా ఈ రాయి వలె దృఢముగా ఉండవలసినది అని. మళ్ళీ అగ్నిహోత్రము వద్దకు వెళ్లి హోమము చేస్తారు వారు. ఆ విధముగా మూడుసార్లు చేసాక వధువు పాదముల రెండవ వ్రేలికి సౌభాగ్య చిహ్నముగా వెండి మట్టెలు తొడుగుతాడు వరుడు.
ఈ సందర్భాన్ని చెపుతూ శంకరులు అన్నారు అమ్మా శివుడు నీ సుకుమారమైన పాదములు కందిపోతాయోమోననే భయముతో నీ పాదమును జాగ్రత్తగా పట్టుకొని సన్నికల్లు పైన నిదానముగా ఉంచాడమ్మా అని.
వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ🙏🏻
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
. *శివానందలహరీ – శ్లోకం – 11*
. శ్రీ ఆదిశంకరాచార్య విరచితం
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
*వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో*
*నరో వా యః కశ్చిద్భవతు భవ! కిం తేన భవతి |*
*యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే!*
*తదీయస్త్వం శంభో భవసి భవ భారం చ వహసి 11*
ఓ శివా! మానవుడు, బ్రహ్మచారియైననూ, గృహస్థైననూ, సన్యాసియైననూ, జటాధారియైననూ, మరి ఇంక ఎట్టివాడైనా కానిమ్ము దానిచేత (ఆయా ఆశ్రమముల చేత) ఏమి అగును? కానీ ఓ పశుపతీ! ఎవని హృదయపద్మము నీవశమగునో, నీవు అతనివాడివై అతని సంసార భారమును మోసెదవు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
నేను విశ్వామిత్రులవారి భార్యను. వీడు మా అబ్బాయే. విషమపరిస్థితిని తట్టుకోలేక వీడిని అమ్మెయ్యడానికి
తీసుకుపోతున్నాను. మాకు చాలా రోజులుగా అన్నం లేదు. నా భర్త తపస్సుకు వెళ్ళాడు. వీడిని అమ్మేసి
వచ్చిన ధనంతో తక్కిన సంతానాన్ని బతికించుకుందామని ఆశ.
ఓ పతివ్రతా ! ఈ పుత్రుణ్ణికూడా రక్షించుకో. వెనక్కి వెళ్ళు. నీ భర్త తపస్పునుంచి తిరిగివచ్చే
వరకూ మీకందరికీ ఆహారం నేను అందిస్తాను. మీ ఆశ్రమం ఎదుట ఉన్న చెట్టుకి రోజూ ఆహారం కట్టి
వెడుతుంటాను. ఇది నా ప్రతిజ్ఞ. నామాట నమ్ము. నేను అరుణపుత్రుణ్ణి. రాకుమారుణ్ణి. నా పేరు
సత్యవ్రతుడు.
సరేనని ఆ తల్లి కొడుకు మెడలో బంధనం విప్పేసి ఆశ్రమానికి తిరిగి వెళ్ళింది. గళబంధనం
కారణంగా ఆనాటినుంచి ఆ మునికుమారుడు “గాలవుడు” అయ్యాడు. ఆశ్రమం చేరుకుని మిగతా
పుత్రులను చేరబిలుచుకుని గాఢంగా కౌగిలించుకుంది. కష్టాలు తీరాయికదా, ఇక ప్రాణాపాయం లేదని
సంబరపడింది.
పత్యవ్రతుడు మాట తప్పలేదు. అడవిలో మృగాలను వేటాడి రోజూ ఏదో ఒక సమయంలో
మాంసం తెచ్చి ఆశ్రమవృక్షానికి మూటవేలాడగట్టి వెడుతున్నాడు. మునిపత్ని ఆ మూటను తెచ్చి
కొడుకులకు పెట్టి తామ తింటోంది. సుఖంగా కాలం గడుస్తోంది.
అరుణమహారాజు పుత్రార్థియై తపస్సుకు వెళ్ళినప్పటినుంచీ రాజ్యాన్నీ రాజధానినీ అంతఃపురాన్నీ
వసిష్ఠులవారే రక్షిస్తున్నారు. సత్యవ్రతుడు రాజధానికి దూరంగా అడవుల్లోనే జీవిస్తున్నాడు. అతడికి
వసిష్ఠులవారి మీద కోపం తగ్గలేదు. తనను అడవులకు పొమ్మంటున్న తండ్రిని వారించలేదని ఇతడికి
ఆ కులగురువుమీద కోపం. పెళ్ళిపీటల మీదనుంచి విప్రభార్యను అపహరించాడని వసిష్ఠుడికి
సత్యవ్రతుడిమీద ఆగ్రహం. పెళ్ళి మంత్రాలు నడిచాయే తప్ప, సప్తపది ముగియకుండానే అపహరించాను
కనక ఇది విప్రకన్యాపహరణమే కానీ విప్రభార్యాపహరణం కాదనీ అనవసరంగా నాకు పెద్ద శిక్ష
విధించారనీ ధర్మసూక్ష్మాలు అన్నీ తెలిసిన వసిష్ఠుడే దీనికి ప్రేరకుడనీ సత్యవ్రతుడి అభిప్రాయం.
త్యాజ్యమానం వనే పిత్రా ధర్మిష్ఠం చ ప్రియం సుతమ్ ।
న వారయామాస మునిర్వసిష్ఠః కారణేన హ॥
పాణిగ్రహణమంత్రాణాం నిష్ణా స్యాత్సప్తమే పదే |
జానన్నపి స ధర్మాత్మా విప్రదారపరిగ్రహే ॥
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*
🌷🌷🌷
*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - శుక్ల పక్షం - చతుర్ధశి - భరణి - భాను వాసరే* *(26-11-2023)*
ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.
https://youtu.be/0rejF2cCA5M?si=S_154lX1vPsfHuLb
🙏🙏
*కార్తికపురాణము - 14*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔
కార్తిక పురాణము -పదునాల్గవ అధ్యాయము
కార్తీక పూర్ణిమాదినమందు వృషోత్సర్గమును(ఆబోతు, అచ్చుపోయుట) చేయువానికి జన్మాంతరీయ పాపములు కూడా నశించును. కార్తీకవ్రతము మనుష్యలోకమందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చునది. కార్తీక పూర్ణిమనాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును జేయువానికి కోటిమారులు గయాశ్రాద్ధమును జేసిన ఫలముగలుగును. రాజా! స్వర్గమందున్న పితరులు మన వంశమందెవ్వడైనను కార్తీక పూర్ణిమనాడు నల్లని గిత్తను, గిత్తదూడను లేక ఆబోతును విడుచునా, అట్లయిన మనము తృప్తిబొందుదుమని కోరుచుందురు. ధనవంతుడుగాని, దరిద్రుడుగాని కార్తీకపూర్ణిమ రోజున వృషోత్సర్గమును జేయనివాడు యమలోకమందు అంథతమిస్రమను నరకమును బొందును. కార్తీకపూర్ణిమ రోజున వృషోత్సర్గమును జేయక గయాశ్రాద్ధ మాచరించినను, ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను, పుణ్యతీర్థములు సేవించినను, హాలయము పెట్టినను పితరులకు తృప్తిలేదు. వాటన్నిటికంటే కోడెదూడను అచ్చుపోయుట మిక్కిలి గొప్పది. గయాశ్రాద్ధము వృషోత్సర్గము సమానమని విద్వాంసులు వచించిరి. కాబట్టి కార్తీకపూర్ణిమనాడు వృషోత్సర్గము సుఖమునిచ్చును. అనేక మాటలతో పనియేమున్నది? కార్తీకమాసమందు అన్ని పుణ్యములకంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవఋణ మనుష్యఋణ పితృ ఋణములనుండి విముక్తుడగును. ఈరోజు దక్షిణతో గూడ ధాత్రీఫలమును(ఉసిరి) దానమిచ్చువాడు సార్వభౌముడగును. అనగా భూమికి ప్రభువగును. కార్తీకపూర్ణిమనాడు దీపదానమాచరించువాడు విగతపాపుడై పరమపదము నొందును. దీపదానమాచరించువాని మనోవాక్కాయ కృతపాపములన్నియు నశించును. ఈరోజు ఈశ్వర లింగదానమాచరించువాడు ఈజన్మమందు అనేక భోగములననుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడు అగును. ఈశ్వర లింగదానము వలన సమస్త పాపములు నశించును. పుణ్యము గలుగును. కార్తీకమాసమందు లింగానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమును కరిగిపోవు. (ఈశ్వరలింగము - బాణము). కార్తీకవ్రతము అనంత ఫలప్రదము. సామాన్యముగ దొరకనిది. కనుక కార్తీకమాసమందు ఇతరుల అన్నమును భుజించుట, పితృశేషమును, తినగూడని వస్తువులను భక్షించు, శ్రాద్ధాన్నమును సేవించుట అనగా భోక్తగానుండుట, తిలదానము గ్రహించుట ఈఅయిదును విడువవలెను. కార్తీకమాసమందు సంఘాన్నమును, శూద్రాన్నమును, దేవార్చకులయన్నమును, అపరిశుద్ధాన్నమును, కర్మలను విడిచిపెట్టిన వాని అన్నమును విథవాన్నమును భుజించరాదు. కార్తీకమాసమున అమావాస్యయందును, పూర్ణిమయందును, పితృదినమందును, ఆదివారమందును, సూర్ చంద్ర గ్రహణములందును రాత్రి భోజనము చేయరాదు. కార్తీక ఏకాదశినాడు రాత్రింబగళ్ళును, వ్యతీపాత వైధృతి మొదలైన నిషిద్ధ దినములందును జ్రాత్రి భుజించరాదు. అప్పుడు చాయానక్తమును జేయవలెను గాని రాత్రి భోజనము చేయగూడదు. చాయానక్తమే రాత్రి భోజనఫలమిచ్చును. కనుక రాత్రి భోజనము కూడని దినములందు కార్తీకవ్రతము చేయువాడు చాయా నక్తమునే గ్రహించవలెను. చాయానక్తమనగా తన శరీరము కొలతము రెట్టింపునీడ వచ్చినప్పుడు భుజించుట. ఇది నిషిద్ధ దినములందు గృహస్థునకు ఎల్లప్పుడు యతి విధవలకు చాయనక్తము విహితము. సమస్త పుణ్యములను యిచ్చు కార్తీకమాసమందు నిషిద్ధ దినములందు భుజించువాని పాపములు అనంతములగును. ఆపాపవిస్తారము నేనెట్లు చెప్పగలను. చెప్పుటకు కూడా అశక్తుడను. కాబట్టి విచారించి కార్తీకవ్రతమును ఆచరించవలెను. కార్తీకమామందు ౧. తలంటుకొనుట ౨. పగలునిద్రయు, ౩. కంచుపాత్రలో భోజనము, ౪. మఠాన్న భోజనము, ౫. గృహమందు స్నానము, ౬. నిషిద్ధ దినములందు రాత్రి భోజనము, ౭. వేదశాస్త్ర నింద యీ ఏడునూ జరుపగూడదు. తలంటుకొనుట-తైలాభ్యంగము.
ఈమాసమందు శరీర సామర్ధ్యముండియు, గృహమందు ఉష్ణోదక స్నానమాచరించినయెడల ఆస్నానము కల్లుతో స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పెను. తులయందు రవియుండగా కార్తీకమాసమందు నదీస్నానము ఖ్యము. సర్వశ్రేష్ఠము. తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెల రోజులు నదీస్నానమే చేయవలెను. అట్లు నదియుండనిచో తటాకమందుగాని, కాలువలయందుగాని, బావులవద్దగాని స్నానము చేయవలెను. తటాక కూపములందు స్నాన సమయమున గంగా ప్రార్థన చేయవలెను. ఇది గంగయందును, గోదావరియందును, మహానదులయందును అవసరము. (లేక) గంగా గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాకస్నానము కర్తవ్యము. గంగకు నమస్కరించవలెను. కార్తీకమాసము ప్రాతస్నానమాచరించి వాడు నరకమందు యాతనలను అనుభవించి తరువాత చండాలుడై పుట్టును. గంగాది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్యమండల గతుడైన హరిని ధ్యానించి హరిచరిత్రను విని గృహమునకు వెళ్ళవలెను. పగలు చేద్యదగిన వ్యాపారములన్నియు చేసికొని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమించి పూజాస్థానమందు పీఠముంచి దానియందు శంకరుని ఉంచి పంచామృతములతోను, ఫలోదకములతోను, కుశోదకముతోను మహాస్నానము చేయించి షోడశ ఉపచారములతోను పూజించవలెను. తరువాత శంకరుని ఆవాహనము చేయవలెను. శంకరాయ ఆవాహనము సమర్పయామి తరువాత ౨.వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి, ౩. గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి, ౪. లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి, ౫. రుద్రాయ ఆచమనీయం సమర్పయామి ౬. గంగాధరాయ స్నానం సమర్పయామి. ౭.ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి ౮. జగన్నాధాయ ఉపవీతం సమర్పయామి ౯. కపాలధరిణే గంధం సమర్పయామి. ౧౦. ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి. ౧౧. పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి. ౧౨. తేజోరూపాయ దీపం సమర్పయామి ౧౩. లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి. ౧౪. లోకసాక్షిణే తాంబూలం సమర్పయామి ౧౫. భవాయ ప్రదక్షిణం సమర్పయామి. ౧౬. కపాలినే నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారముగా షోడశోపచారముల చేత శంకరుని పూజింపవలెను. పైనజెప్పిన నామములతో భక్తితో పూజించి మాసమంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజావసానమందు
శ్లో!! పార్వతీకాంత దేవేశ పద్మజార్చ్యాంఘ్రి పంకజః!
అర్ఘ్యం గృహాణ దైత్యారేదత్తంచేదముమాపతే!!
అను మంత్రముతో అర్ఘ్యము నివ్వవలెను. ఇట్లు భక్తితో చేయువాడు ముక్తుడగును. సంశయము లేదు. రాజా! తనశక్తి కొలది దీపమాలలను సమర్పించి శక్తివంచన చేయక బ్రాహ్మణులకు దానమివ్వవలెను. ఈప్రకారము కార్తీకమాసమంతయు బ్రాహ్మణులతో గూడి నక్తవ్రతమును జేయువాడు వేయి సోమయాగమును, నూరు వాజపేయయాగములు, వేయి అశ్వమేధయాగములు చేసిన ఫలమును బొందును. కార్తీకమాసమునందీ ప్రకారముగా మాస నక్తవ్రతమాచరించు వాడు పాపములను సమూలముగా పరిహరించుకొనునని నారదాదులు చెప్పిరి. కార్తీకమందు మాస నక్తవ్రతము వలన పుణ్యమధికమగును. సమస్త పాపములు నశించును. ఇందుకు సందేహము లేదు. చతుర్దశియందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనమును బెట్టిన యెడల పితరులందరు తృప్తినొందుదురు. కార్తీకమాసమున శుక్ల చతుర్దశినాడు ఫలదానమాచరించువాని సంతతికి విచ్ఛేము గలుగదు. సందేహము లేదు. చతుర్దశినాడు ఉపవాసమాచరించి శంకరుని ఆరాధించి తిలదానమాచరించు వాడు కైలాసమునకు ప్రభువగును. సమస్తపాపములను బోగొట్టునదియు, సమస్త పుణ్యములను వృద్ధిపరచునదియు అయిన కార్తీకవ్రతమును జేయువాడు విగతపాపుడై మోక్షమొందును. పవిత్రకరమైన యీ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములకు ప్రాయశ్చిత్తమును జేసుకొన్న వారగుదురు.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే చతుర్దశాధ్యాయస్సమాప్తః
కార్తిక పురాణము - 13*
*కార్తిక పురాణము - 13*
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
*కార్తిక పురాణము - పదమూడవ అధ్యాయము*
వశిష్టుడిట్లు చెప్పెను.జనకరాజా! కార్తీకమాసమందు చేయదగిన ఆవశ్యకములైన కార్తీక ధర్మములను మా తండ్రియైన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి.అవన్నియు చేయదగినవి. చేయనియెడల పాపము సంభవించును.ఇది నిజము.సంసార సముద్రమునుండి దాటగోరువారును, నరకభయముల వారును ఈధర్మములను తప్పక చేయవలెను.కార్తీకమాసమందు కన్యాదానము, ప్రాతఃస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించుటకు ధనమిచ్చుట, విద్యాదానము, వస్త్ర దానము, అన్నదానము, ఇవి ముఖ్యములు.
కార్తీకమాసమందు ద్రవ్య హీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయనమును చేయించ దక్షిణనిచ్చిన యెడల అనేక జన్మములలోని పాపములు నశించును.తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటువుచే చేయబడిన గాయత్రీ జపఫలము వలన పంచమహాపాతకములు భస్మమగును.
గాయత్రీ జపము, హరిపూజ, వేదవిద్యాదానము వీటిఫలమును చెప్పుటకు నాకు శక్యముగాదు. పదివేలు తటాకములను త్రవ్వించు పుణ్యమును, నూరు రావిచెట్లు పాతించిన పుణ్యమును, నూతులు దిగుడుబావులు, నూరు బావులు త్రవ్వించిన పుణ్యమును, నూరు తోటలు వేయించిన పుణ్యమును ఒక బ్రాహ్మణునకు ఉపనయనము చేయించిన పుణ్యములో పదియారవవంతుకు కూడ సరిపోవు.
కార్తీకమాసమందు ఉపనయన దానమును చేసి తరువాత మాఘమాసమందుగాని, వైశాఖమాసమందుగాని, ఉపనయనమును చేయించవలయును.సాధువులు శ్రోత్రియులును అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన యెడల అనంతఫలము గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి.ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీకమాసమందు చేయవలెను.అట్లు చేసిన యెడల గలిగెడి ఫలమును చెప్పుటకు భూమియందు గాని, స్వర్గమందుగాని ఎవ్వనికి సామర్ధ్యము లేదు.పరద్రవ్యము వలన తీర్థయాత్రయు, దేవబ్రాహ్మణ సంతర్పణము చేసిన యెడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు గలుగును.
కార్తీక మాసమందు ధనమిచ్చియొక బ్రాహ్మణునకు ఉపనయనమును, వివాహమును చేయించిన యెడల అనంత ఫలము గలుగును. కార్తీకమాసమందు కన్యాదాన మాచరించువాడు తాను పాపవిముక్తుడగును.తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించినవాడగును.
ఓ జనకరాజా! ఈవిషయమై పురాతన కథ ఒకటి గలదు, ఆ కథ చెప్పెదను సావధానుడవై వినుము.
ద్వాపరయుగమున వంగదేశమున సువీరుడను రాజుకలడు.మిక్కిలి వీర్య శౌర్యములు కలవాడు.అతడు దురాత్ముడు.ఆరాజు కొంతకాలమునకు దైవయోగము వలన దాయాదులచేత జయించబడిన వాడై రాజ్యభ్రష్టుడై 'అర్థోవా ఏషా ఆత్మనోయత్పత్నీ' అను శ్రుత్యుక్త ప్రకారముగా భార్య అర్ధాంగి కనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యమునకుబోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖపడుచుండెను.
ఆ అరణ్యమందు రాజును, భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండిరి.అట్లుండగా భార్య గర్భవతియాయెను.నర్మదాతీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను.ఆ పర్ణశాలయందామె సుందరియైన ఒక కన్యను కనెను. రాజు అరణ్య నివాసము, వన్యాహారము, అందు సంతాన సంభవము, సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వాటిని తలచుకొని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను.తరువాత పూర్వ పుణ్యవశముచేత ఆ కన్యక వృద్ధినొంది సౌందర్యముతోను, లావణ్యముతోను ఒప్పియున్నదై చూచువారికి నేత్రానందకారిణియై యుండెను.
ఆ చిన్నదానికి ఎనిమిది సంవత్సరముల వయస్సు వచ్చినది.మనస్సుకు బహురమ్యముగా ఉన్నది.ఇట్లున్న కన్యకను చూసి ఒక ముని కుమారుడు సువీరా! నీకూతురుని నాకిచ్చి వివాహము చేయుమని యాచించెను.
ఆమాటవిని రాజు "మునికుమారా! నేను దరిద్రుడను గనుక నేను కోరినంత ధనమును నీవిచ్చితివేని ఈకన్యను నీకిచ్చెదను" అనెను.
ఈమాటను విని మునికుమారుడు ఆ కన్యయందు కోరికతో రాజుతో, "ఓరాజా! నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకిచ్చెదను.దానితో నీవు సుఖములను బొందగలవు" అని మునికుమారుడు చెప్పెను.
ఆమాటలను విని రాజు సంతోషించి అలాగుననే చేసెదను అనెను.తరువాత మునికుమారుడు ఆ నర్మదాతీరమందే తపము ఆచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజునకిచ్చెను.రాజు ఆ ధనమంతయు గ్రహించి, ఆనందించి తృప్తినొంది ఆ మునికుమారునకు తన కూతురునిచ్చి తనయొక్క గృహ్యసూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమునందే చేసెను.
ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరెను.రాజు కన్యావిక్రయ ద్రవ్యముతో తాను భార్యయు జీవించుచుండిరి.రాజు భార్య తిరిగియొక కుమార్తెను కనెను. రాజు దానిని జూచి సంతోషించి ఈసారి ఈ కన్యకను విక్రయించిన యెడల చాలా ద్రవ్యము రావచ్చును,దానితో నాజన్మమంతయు గడుచునని సంతోషించుచుండెను.
రాజు ఇట్లు తలచుచుండగా పూర్వపుణ్యవశముచేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదానదికివచ్చి పర్ణశాలముందు ఉన్న రాజును, రాజుభార్యను, రాజుకూతురుని జూచెను.కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో, "ఓయీ! నీవెవ్వడవు?ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నావు?చెప్పము" అని అడిగెను.
"దారిద్ర్యముతో సమానమైన దుఃఖము, పుత్రమృతితో సమానమైన శోకము, భార్యావియోగముతో సమానమయిన వియోగదుఃఖములు లేవు.దారిద్ర్య దుఃఖముతో శాకమూల ఫలాదులను భుజింపుచు ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను.ఈ అరణ్యమునందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది.ఆ చిన్నదానిని యౌవనము రాగానే ఒక మునికుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహముచేసి ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను.ఇంక ఏమి వినగోరితివో చెప్పుము".
ఇట్లు రాజు వాక్యమును విని యతి, "రాజా! ఎంత పనిచేసితివి?మూఢునివలె పాపములను సంపాదించుకొంటివి.కన్యాద్రవ్యముచేత జీవించువాడు యమలోకమందు అసిపత్రవనమను నరకమందు నివసించును. న్యాద్రవ్యము చేత దేవఋషి పితరులను తృప్తి చేయుచున్న వానికి పితృదేవతలు ప్రతిజన్మమందును ఇతనికి పుత్రులు కలుగకుండుగాక అని శాపమునిత్తురు. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆవృత్తివల్ల జీవనము చేయు పాపాత్ముడు రౌరవనరకమును పొందును. సమస్తమయిన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడియున్నది కాని కన్యావిక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎచ్చటా చెప్పబడియుండలేదు.కాబట్టి ఈకార్తీకమాసమందు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురికి బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకను దానము ఇచ్చి వివాహము చేయుము.కార్తీకమాసమందు విద్యాతేజశ్శీలయుక్తుడయిన వరునకు కన్యాదానము చేసిన వాడు గంగాది సమస్త తీర్థములందు స్నానదానములు చేసెడివాడు పొందెడి ఫలమును, యధోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసిన వాడు పొందెడి ఫలమును పొందును".
ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్తయయిన యతీశ్వరునితో, నీచుడై ధనాశతో, "బ్రాహ్మణుడా !ఇదియేమి మాట? పుత్రదారాదులు, గృహక్షేత్రాదులు, వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలెను గాని ధర్మమనగా ఏమిటి? పుణ్యలోకమనగా ఏమిటి? దానమనగా ఏమిటి?నా ఈ రెండవ కూతురుని పూర్తిగా ద్రవ్యమిచ్చువానికిచ్చి ఆ ద్రవ్యముతో సుఖభోగములను పొందెదను.నీకెందుకు నీ దారిని నీవుపొమ్ము" అనెను.
ఆ మాటవిని యతి స్నానముకొరకు నర్మదానదికి పోయెను.తరువాత కొంతకాలమునకు ఆయరణ్యమందే సువీరుడు మృతినొందగా యమదూతలు పాశములతో వచ్చి రాజును కట్టి యమలోకమునకు తీసుకొనిపోయిరి.
అచ్చట యముడు వానిని జూసి కళ్ళెర్రజేసి అనేక నరకములందు యాతనలనుబొందించి అసిపత్రవనమందు రాజును, రాజు పితరులను గూడ పడవేయించెను.అసిపత్రమనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతోగూడిన చిక్కనివనము.
ఈ సువీరుని వంశమందు శ్రుతకీర్తి యనువాడొకడు సమస్త ధర్మములను నూరు యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యపాలనము కావించెను.స్వర్గమునకుబోయి ఇంద్రాదులచేత సేవించబడుచుండెను.ఈ శ్రుతకీర్తి, సువీరుని పాపశేషముచేత స్వర్గమునుండి తాను నరకమున పడి యమయాతనలనొందుచు ఒకనాడు, 'ఇది ఏమి అన్యాయము? పుణ్యము చేసిన నన్ను యమలోకమందుంచినారని' విచారించుకుని ధైర్యముతో యమునితో, "సర్వమును తెలిసిన ధర్మరాజా! నా మనవి వినుము.ఎంతమాత్రమును పాపమును చేయని నాకు ఈ నరకమెందుకు వచ్చినది? అయ్యో ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నియు వృధాగా పోయినవే. ఇదిగాక స్వర్గమందున్న నాకు నరకమున పడుట ఎందుకు గలిగినది?" అని శ్రుతకీర్తి చెప్పిన మాటలను విని యముడు పల్కెను.
"శ్రుతకీర్తీ! నీవన్న మాట సత్యమే గానీ,నీవంశస్థుడు సువీరుడనువాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవ్యముచేత జీవించినాడు.ఆ పాపముచేత వాని పితరులైన మీరు స్వర్తస్థులైనను నరకమందు ఉన్నారు.తరువాత భూమియందు దుష్టయోనులందు జన్మించెదరు.శ్రుతకీర్తీ! సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది.నర్మదా నదీతీరమందు పర్ణశాలలో తల్లివద్ద ఉన్నది.దానికింకను వివాహము కాలేదు.కాబట్టి నీవు నాప్రసాదము వలన ఈ దేహముతో అచ్చటికి వెళ్ళి అచ్చట ఉన్న మునులతో ఈమాటను చెప్పి కార్తీకమాసమందు ఆకన్యను యోగ్యుడైన వరునికిచ్చి కన్యాదానము పెండ్లి చేయుము.కార్తీకమాసమందు సర్వాలంకార యుక్తమయిన కన్యను వరునకిచ్చువాడు లోకాధిపతి యగును. శాస్త్రప్రకారము కన్యాదానము ప్రశస్తము.అట్లు కన్యాదానము చేయుటకు కన్యా సంతాము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన యెడల ధనదాతయును, లోకాధిపతియు అగును.కన్యలు లేనివాడు రెండు పాడియావులనిచ్చి కన్యకను దీసికొని వరునికిచ్చి వివాహము చేసిన యెడల కన్యాదాన ఫలమును పొందును. నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణునకు కన్యామూల్యము ఇమ్ము.దానిచేత నీపితరులందరు తృప్తినొంది నిత్యము సంతోషింతురు" అని పలికెను.
శ్రుతకీర్తి యముని మాటవిని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదాతీరమందున్న కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్లపక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేసెను.
ఆ పుణ్యమహిమచేత సువీరుడు యమపాశ విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా ఉండెను.తరువాత శ్రుతకీర్తి పదిమంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను.దానిచేత వాని పితరులందరు విగతపాపులై స్వర్గమునకు పోయిరి.తానును యథాగతముగా స్వర్గమును చేరెను.
కార్తీకమాసమందు కన్యాదాన మాచరించువాడు విగతపాపుడగును.ఇందుకు సందేహములేదు.కన్యామూల్యము ఇవ్వలేని వారు మాటతోనయినా వివాహమునకు సహాయము చేసిన వారి పుణ్యమునకు అంతములేదు.కార్తీకమాసమందు కార్తీకవ్రతమాచరించువాడు హరి సాయుజ్యమును పొందును.ఇది నిజము. నామాట నమ్ముము.
ఈ ప్రకారముగా కార్తీక వ్రతమాచరించని వారు రౌరవనరకమును బొందుదురు.
*ఇతి శ్రీస్కాందపురాణే కార్తీహాత్మ్యే త్రయోదశోధ్యాయసమాప్తః*
*26-11-2023*
*భాను వాసరః ఆది వారం*
*రాశి ఫలితాలు*
*మేషం*
చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించు కుంటారు.
*వృషభం*
ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు.
*మిధునం*
సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రయత్నలలో అవరోధాలు తొలగుతాయి.
*కర్కాటకం*
సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తా. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
*సింహం*
కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
*కన్య*
దూరపు బంధువుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. నూతన ఋణ యత్నాలు కొంత కష్టంతో పూర్తిఅవుతాయి బందు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపార వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి.
*తుల*
కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ క్రయవిక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
*వృశ్చికం*
సమాజంలో గౌరవ మర్యాదలు విస్తృతమౌతాయి. ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
*ధనస్సు*
సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు ఊహించని సమస్యలు కలుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
*మకరం*
ముఖ్యమైన వ్యవహారాలలో కొంత జాప్యం కలుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది. ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.
*కుంభం*
గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. బంధు మిత్రుల సహాయం సహకారాలు అందుతాయి. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి అధికారుల సహాయంతో బయటపడతారు.
*మీనం*
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఋణ సంభంధిత సమస్యలు వలన ఒత్తిడి తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో సమస్యలు తప్పవు.
🕉️
🕉️🪔 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️
🪔 ॐ卐 *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 🪔
*శ్లోకం*
*సంసారసాగర విశాల కరాళకామ*
*నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య* !
*మగ్నస్య రాగలసదూర్మినిపీడితస్య*
*లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్* !!
_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం-03_* _
తా॥
ఓ దేవా నేను సంసారమనెడి సముద్రములో మునిగి, భయంకరములై, పెద్ద వైన కోరికలనెడి మొసళ్ళు మున్నగు క్రూర జల చరములచే మ్రింగబడుచున్నాను. రాగ మనెడి ధ్వనించు అలలచే బాదింపబడుచున్నాను. ఓ నృసింహ దేవా! అట్టినాకు చేయూత నిచ్చి నన్నుద్ధరింపుము. లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము.
ఒక ప్రభుత్వ టీచర్ చేసిన విశ్లేషణ ..
తప్పకుండా ఆలోచించాల్సిన అంశాలు ...
ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ప్రైవేటు విద్యా వ్యవస్థ మధ్య పోటీలో.. ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎలా "బలిపశువులు" చేసి చూపుతున్నారో, వాళ్ళు అలా ఎందుకు బలికావాల్సి వస్తుందో వివరించే ప్రయత్నం నాది...
కొంత హిస్టరీలో కి వెళ్దాం...
30 సంవత్సరాలకు పూర్వం అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్య అభ్యసించేవారు.
డాక్టర్ కొడుకైనా, లాయర్ కొడుకైనా, ఇంజనీర్ కొడుకైన, టీచర్ కొడుకైనా, రాజకీయ నాయకుడి కొడుకైనా, రైతు కొడుకైనా, కూలి కొడుకైన ఎవరైనా ఒకే పాఠశాలలోనే చదవాల్సిందే..
అప్పుడు పాఠశాలలన్నీ తెలుగు మీడియంలోనే ఉండేవి..
దాదాపు ప్రతి గ్రామంలోనూ పాఠశాలలు విద్యార్థులతో కిటకిటలాడేవి.
అప్పుడు కూడా విద్యార్థులకు సరిపడే టీచర్లు కూడా ఉండేవారు కాదు.
ఏ కొంత మంది విద్యార్థులకో ప్రత్యేక తర్ఫీదు లు ఉండేవి కాదు.
కానీ విద్యార్థులు వారి యొక్క సామర్ధ్యాన్ని బట్టి ముందు తరగతులకు వెళ్తూ ఉండేవారు.
తెలివైన విద్యార్థులు 5 నుండి 10 శాతం మంది ఉన్నత తరగతులు చదువుతూ కాలేజీల్లోనూ.. యూనివర్సిటీల్లోని సీట్లు సంపాదిస్తూ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేవారు.
మిగతా 90 శాతం మంది విద్యార్థుల్లో ప్రాథమిక విద్యలో విద్యను ఆపేసిన వారు కొందరు, హైస్కూల్ స్థాయిలో విద్యను ఆపేసిన వారు కొందరు, కాలేజీ స్థాయిలో కొందరు, రకరకాల వృత్తులో స్థిరపడిన వారు కొందరు ఉండేవారు.
అలా ఉన్న 90 శాతం మందిలో ఏ ఒక్కరు కూడా ఆ పాఠశాల వలనే మాకు చదువు రాలేదు అని ఎవరూ అనుకోలేదు.
మేము చదువు మీద సరైన శ్రద్ధ చూపలేదు అని మాత్రమే అనుకునేవారు.
వారికి చదువు చెప్తున్న ఏ ఉపాధ్యాయుని కూడా నిందించే వారు కూడా కాదు.
తర్వాత వాస్తవం లోకి వెళ్దాం ...
కాలంతో పాటు జనాభా కూడా పెరుగుతోంది. గ్రామాల్లోని విద్యార్థులకు కూడా చదువుకోవాలనే ఆసక్తి పెరిగింది.
కానీ ప్రాథమిక విద్య తర్వాత హైస్కూల్ లో జాయిన్ చేయడానికి అందుబాటులో లేక చదువు మానేసిన వాళ్లు కొందరు.
దీనికి కారణం ఉపాధ్యాయులా? ప్రభుత్వమా?
ఏదోలా దూరాన ఉన్న హై స్కూల్లో చేరి హైస్కూలు చదువు పూర్తి చేసిన తర్వాత జూనియర్ కాలేజీలో చేరుదామనుకుంటే రెండు, మూడు మండలాలకు కలిపి ఒక జూనియర్ కళాశాల దానిలో 100 నుంచి 200 సీట్లు ఉండేవి.
మరి మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి ? ప్రభుత్వాలు వాళ్లకి ఎందుకు చదువుకునే అవకాశాలు కల్పించలేకపోయింది?
అప్పుడే విద్యార్థులు అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ కళాశాలలు పుట్టుకొచ్చాయి.
ప్రభుత్వం కూడా తన భారం తగ్గుతుంది కదా! అని పర్మిషన్ లు కూడా ఇచ్చేసేది.
కానీ ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వాడు మాత్రమే ప్రైవేటు కళాశాలలో జాయిన్ అయ్యే వారు.
కానీ ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వారి సంఖ్య పెరుగుతూ పోయింది.
కానీ ప్రభుత్వ కళాశాలలు పెరగలేదు.వాటిల్లో సీట్ల సంఖ్య పెరగలేదు.
ప్రైవేటు కళాశాలల సంఖ్య మాత్రం వారికి అనుగుణంగా పెరుగుతూ పోయింది.
అపార్ట్ మెంట్ లో నడుస్తున్నా.. విద్యా ప్రమాణాలు పాటించకున్నా.. ప్రభుత్వం తన మీద భారం లేదు కదా! అనుకుంటూ పర్మిషన్ ఇచ్చుకుంటూ పోయింది.
మరి ప్రాథమిక విద్య లో విద్యార్థులను ఆకర్షించడం ఎలా..?
వాళ్ల దగ్గర లేనిది మన దగ్గర ఏముంది?
దానికి సమాధానమే ఇంగ్లీష్ మీడియం...
ఇబ్బడిముబ్బడిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభమయ్యాయి...
ఉన్నత తరగతి వ్యక్తులందరూ అటు వైపు ఆకర్షింపబడ్డారు.
ప్రభుత్వం ప్రాథమిక విద్యని మాతృభాషలోనే బోధించాలని రూల్ ఏమి పెట్టలేదు.
అడిగిన వాళ్లందరికీ ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ ఇచ్చేసింది.
కానీ ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్లోనే ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం పెట్టలేదు.
ప్రభుత్వం మీద భారం లేకుండా ఎవరికి వారే కదా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ గా చదివేస్తున్నారు.
ప్రభుత్వానికి చాలా సంతోషించదగ్గ విషయమే కదా..! ప్రభుత్వ ఖర్చు లేకుండా ప్రజలు విద్యావంతులై పోతుంటే..!!
అలా ఉన్నత, మధ్య తరగతి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్ళిపో సాగారు. అది సమాజంలో లో స్టేటస్ సింబల్ గా మారిపోయింది.
ప్రభుత్వ పాఠశాల క్రమేపీ పేదల పాఠశాల గా మారిపోయింది.
కష్టం చేసుకునే ప్రజల పిల్లలు..
ఇంటి దగ్గర కష్టపడుతూ స్కూల్ కి వచ్చి చదువుకునే పిల్లలు..
ఏ మాత్రము చదువుకు సహకరించని తల్లిదండ్రులున్న పిల్లలు... ప్రభుత్వ పాఠశాలలకు దిక్కయ్యారు.
వాళ్లలో కూడా తెలివైనవారిని రెసిడెన్షియల్ పాఠశాలలు, నవోదయ పాఠశాలలు లాంటివి పరీక్షలు పెట్టి తీసుకెళ్లిపోయారు.
ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల మీద భారం వేసి నీవల్లే ప్రభుత్వ పాఠశాల నాశన మయ్యిందంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల మీద దురభిప్రాయం రుద్దింది.
ఆకులు చిదిమేసి, కొమ్మలు నరికేసి, చెట్టు మొదలు కి నీరు పోసినట్టు..
ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం అని.. తూతూమంత్రంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాయి.
పెట్టినా.. అందుకు తగ్గట్టు వనరులు సమకూర్చ లేకపోయింది.
ప్రైవేటు పాఠశాల పక్కన, ప్రభుత్వ పాఠశాల చిన్న పోయేలా ప్రభుత్వం తయారుచేసింది.
1.సరిపడినంత మంది ఉపాధ్యాయులు ఇవ్వలేక పోవడం
2.విద్యార్థులకు ఫర్నిచర్ తరగతి గదులు సరిపడా లేకపోవడం.
3.ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు సరైన సమయంలో చేసి, సరైన పద్ధతిలో పాఠశాలలను నడిపించలేక పోవటం
4.ప్రైవేటు విద్యాసంస్థలు సొంతంగా సిలబస్ రూపొందించుకున్నా వారిని అదుపు చేయలేక పోవడం.
5.కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, క్లాస్ రూమ్ సిలబస్ కి సంబంధం లేకపోవడం..
ఉదాహరణకు 5వ తరగతి పూర్తి చేసి నవోదయ రాస్తున్న విద్యార్థికి ఐదవ తరగతి సిలబస్ లో ఉన్న ప్రశ్నలు కాకుండా ఇతరత్రా జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ ఉండటం వల్ల వాటిని పాఠశాలలో బోధించే విధంగా సిలబస్ లేకపోవడం.
ఇంటర్మీడియట్ రెండు సంవత్సరములు MPC గ్రూప్ గవర్నమెంట్ కాలేజీలో చదివి లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్క లైను కూడా మిస్ అవ్వకుండా మొత్తం అవపోసణ చేసిన వాడికి ఐఐటీలో సీటు వస్తుందా? రాదు...
ఎందుకంటే ఆ సిలబస్లో లేని అంశాలు, అంతకు మించిన అంశాలను ఆ ఎక్జామ్ లో ప్రశ్నించడం వలన...
అంటే ప్రభుత్వం ఆ అంశాలను ఎందుకు సిలబస్ లో పొందుపరచ లేకపోయింది. లేదా ఇంటర్మీడియట్ సిలబస్ కు మించకుండా ఐఐటీ ఎగ్జామ్ ని ఎందుకు నిర్వహించలేక పోతుంది?
అంటే గవర్నమెంట్ పాఠశాల పుస్తకాలు, గవర్నమెంట్ కాలేజీ చదువులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు సరిపోవు.. అనే భావాన్ని ప్రజల్లో బాగా నాటింది...
ఈ విధంగా ప్రభుత్వం తన విధానాలతో ప్రభుత్వ స్కూళ్ల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ.. ఆ తప్పిదాన్ని ఉపాధ్యాయులు మీదికి నెట్టేస్తూ ప్రజల్లో ఆ భావాన్ని గట్టిగా నాటింది.
నిజంగా ఇప్పుడు ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న రాష్ట్రంలో విద్యార్థులందరూ ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయితే వారి సంఖ్యకు తగ్గట్టు స్కూళ్లను ఏర్పాటు చేసి, ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించగలదా...?
ఆ సామర్ధ్యం ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వ స్కూళ్లు ఎందుకు బలోపేతం కావు ..?!
ఇక్కడ నేను చెప్ప వచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే ...
ఫలితాలు చూపిస్తూ మేము మీ కంటే మెరుగ్గా ఉన్నాం అని విర్రవీగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, వాటిని సమర్థించే గొర్రె మంద లాంటి జనాలు ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి.
నీళ్లు ఉన్నచోట ఎవరైనా పంట పండిస్తారు..
ఎడారిలో పండించండి ...
మీ ప్రవేట్ స్కూల్ కి వచ్చిన ప్రతి పిల్లాడు ప్రతి రోజు స్కూల్ కి వస్తాడు.
వారిని స్కూల్ దాకా దింపే తల్లిదండ్రులు ఉంటారు.
నువ్వు అడిగిన ప్రతి పుస్తకం కొంటాడు.
నువ్వు ఎన్ని గంటలు రుద్దుతున్నా వింటాడు.
వాళ్ల తల్లిదండ్రులు విద్యావంతులై ఉంటారు.
ఇంటి దగ్గర మాత్రం వారి కోసం సమయం కేటాయించగల వారై ఉంటారు.
ఆ పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు.
మరి నా ప్రభుత్వ స్కూల్ కి వచ్చిన పిల్లాడు ..
నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, రోజువారి కూలీల పిల్లలు...
అడిగిన పుస్తకం కూడా లేని పరిస్థితి..
ఇంటి పని అంతా చేసుకొని సమయానికి స్కూలు రాని పరిస్థితి...
పేదరికంలో ఉన్న వాళ్లు ఆరోగ్యం చెడిపోతే మధ్య లోనే నెలలపాటు పాఠశాల మాని వేసే పరిస్థితి..
ఉదయాన్నే పనికిపోయే తల్లిదండ్రులు వాడు పాఠశాలకు వెళ్తున్నాడు లేదో కూడా పట్టించుకోని పరిస్థితి..
పౌష్టికాహారం లేక బక్కచిక్కిన పిల్లలు..
★నువ్వు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలను చేర్చుకోవు.
మేము చేర్చుకుంటాం...
★మీరు పుస్తకం లేకపోతే బడీకి రానివ్వరు..
మేము రానిస్తాం...
★మీరు పాఠశాలకు ఆలస్యమైతే ఒప్పుకోరు..
మాకు వాడు పాఠశాలకు ఎప్పుడు వచ్చినా అదే పదివేలు..
★మీరు మీ విద్యార్థులకు హోం వర్క్ చేయకపోతే వాళ్ల తల్లిదండ్రులను కూడా మందలిస్తారు.
మా పిల్లల తల్లిదండ్రులు 90 శాతం నిరక్షరాస్యులు..
★మీ పాఠశాలను శుభ్రం చేసే మనుషులు ఉంటారు.
మాకు మా విద్యార్థులు మరియు మేమే ఆ పని చేస్తాం.
★మీరు చదువులో వెనుకబడిన విద్యార్థులకు పాఠశాల నుండి తీసివేసి పంపించేస్తారు.
ఎందుకంటే వాడు ఉంటే మీ పాఠశాల పరువు తక్కువ కాబట్టి.
మేము వెనుకబడిన విద్యార్థులకు పిలిచి మరీ పాఠశాలలో చేర్చుకుంటాం.
★మీ పాఠశాలలో క్రీడలు లాంటివి లేవు. అంతెందుకు గ్రౌండ్ లే లేవు.
మా పాఠశాలలో తప్పనిసరిగా క్రీడలు ఆడించ వలసిందే...
మీ పాఠశాలలో తెలివైన విద్యార్థులను మీరే దాచుకుంటారు. ఫీజు రాయితీలు అంటూ బయటికి పోనివ్వరు.
ఎందుకంటే వాడి పేరు చెప్పి ఇంకో వందమందిని ఆకర్షించాలిగా..
మా పాఠశాలలో తెలివైనవారిని నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్ కి పంపించేస్తుంటాం...
★మీరు కొన్ని వందల పాఠశాలల బ్రాంచ్ లు కలిపి అది మీ యొక్క పాఠశాల రిజల్ట్ గా చెప్పుకుంటారు...
మాకు మా పాఠశాలలో వస్తేనే మా గొప్ప...
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి...
అవన్నీ మీకు కూడా తెలుసు...
వ్యవస్థలో లోపాలు సరిచేయకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుడిదే లోపం అని మాట్లాడుతున్న .. అందరూ ఈ అన్ని విషయాలు గమనించండి.
అయినా మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ తోపులు కాలేదు..
లక్షల మంది దగ్గర్నుంచి ఐఐటీ సీట్లంటూ లక్షలు.. గుంజేస్తుంటే ఏ వందమందికో సీట్లు వస్తున్నాయి...
మరి మిగతా వాళ్ల సంగతేంటి..?
మా ప్రభుత్వ పాఠశాలలో పదికి పది పాయింట్లు వచ్చిన వారిని నీలాగ రాష్ట్రం అంతా కలిపి లెక్కేస్తే, టీవీల్లో ప్రకటనలు ఇస్తే నువ్వు ఒక పక్కకు కూడా రావు.. అది నీ లాంటి సౌకర్యాలు లేకుండా..
ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు ఉంది.
ప్రైవేట్ పాఠశాలలు గోదారి బ్రిడ్జి మీద కారులో పోతున్నట్టు ఉంది..
అన్ని తెలుసుకోకుండా ఎవడికి వాడు ఈ రంగంలో లేకుండా ఒడ్డున కూర్చుని మామీద రాళ్లువేయడం సరికాదు.
దయచేసి ప్రభుత్వ పెద్దలు ఈ లోపాలను సరి చేయండి.
నిజమే.. అనిపిస్తే ఈ నిజాలను ఎంత ఎక్కువ మందికి చేరవేస్తే (share) అంత మంచి చేసినవారు అవుతారు.
ఆలస్యమెందుకు... చదివిన వెంటనే ఆ పని మొదలు పెట్టండి మరి....
.....
👌👌👌👌🙏
🕉 *మన గుడి : నెం 250*
⚜ గుజరాత్ : గాంధ్వి గ్రామం
⚜ శ్రీ హరసిద్ధిమాత ఆలయం
💠 మన దేశంలో అనేక దేవతా దేవాలయాలు ఉన్నాయి, వాటికి కొన్ని సంప్రదాయాలు లేదా విశ్వాసాలు ఉన్నాయి.
మత గ్రంధాల ప్రకారం, తల్లి సతీదేవి శరీర భాగాలు ఎక్కడ పడితే అక్కడ ఆమెను శక్తిపీఠంగా పూజిస్తారు.
హిందూ మతంలో మొత్తం 51 శక్తిపీఠాలు గుర్తించబడ్డాయి. మాతా సతి మోచేయి పడిపోయిన ఉజ్జయినిలో ఉన్న మా హర్సిద్ధి (దేవి హర్సిద్ధి) వీటిలో ఒకటి.
హరసిద్ధి దేవి రాత్రిపూట ఉజ్జయినిలో మరియు పగటిపూట గుజరాత్‌లోని హర్షద్ మాతా ఆలయంలో నివసిస్తుందని నమ్ముతారు.
ఈ నమ్మకానికి సంబంధించిన కథ కూడా ప్రాచుర్యం పొందింది.
💠 గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు 48 కి.మీ అసలు ద్వారకకు సమీపంలో, హర్షద్ మాత (హర్సిద్ధి) ఆలయం ఉంది.
ఉజ్జయిని చక్రవర్తి విక్రమాదిత్య ఇక్కడి నుంచి పూజలు చేసి అమ్మవారిని ఉజ్జయినికి తీసుకొచ్చాడని ప్రతీతి. అప్పుడు దేవత విక్రమాదిత్యునితో నేను రాత్రిపూట నీ నగరంలోనూ, పగలు ఈ ప్రదేశంలోనూ నివసిస్తాను.
ఈ కారణంగానే నేటికీ అమ్మవారు పగలు గుజరాత్‌లో, రాత్రి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంటారు.
💠 స్కంద పురాణం ప్రకారం, ఒకప్పుడు చంద మరియు ప్రచండ అనే ఇద్దరు రాక్షసులు కైలాస పర్వతంలోకి ప్రవేశించడం ప్రారంభించినప్పుడు, నంది వారిని అడ్డుకున్నాడు. రాక్షసులు నందిని గాయపరిచారు. దీనిపై శివుడు భగవతి చండీని స్మరించుకున్నాడు.
శివుని ఆజ్ఞ మేరకు దేవి రాక్షసులిద్దరినీ సంహరించింది. సంతోషించిన మహాదేవుడు, నీవు ఈ రాక్షసులను చంపావు.
అందుచేత ఈరోజు నుండి నీ పేరు హరసిద్ధి ప్రసిద్ధి చెందుతుంది.
💠 ఇది శ్రీ కృష్ణ భగవానుని ,రాజ విక్రమాదిత్యుని కులదేవి ఆలయం.
ఆమె అనేక క్షత్రియ , బ్రాహ్మణ , రాజపుత్ర మరియు వైశ్య వర్గాలచే కులదేవిగా పూజించబడుతోంది .
లోహనాస్ , బ్రహ్మక్షత్రియుల వంశం , గుర్జర్ల హర్సన వంశం , అనేక జైన కులాలు అలాగే పంచరియా వంటి బ్రాహ్మణులు మరియు అనేక ఇతర సంఘాలు కూడా ఆమెను తమ కులదేవిగా పూజిస్తారు.
ఆమె సముద్రంలో నౌకలకు రక్షకురాలిగా పరిగణించబడుతున్నందున, ఆమెను మత్స్యకారులు మరియు సముద్రంలో ప్రయాణించే ఇతర తెగలు మరియు గుజరాత్ ప్రజలు కూడా మతపరంగా పూజిస్తారు.
💠 హర్షిధి మాత దేవాలయాన్ని హర్షల్ మాత ఆలయం అని కూడా పిలుస్తారు.
ప్రధాన ఆలయం మొదట సముద్రానికి అభిముఖంగా ఉన్న కొండపై ఉండేది.
కృష్ణుడు తన జీవితకాలంలో ఆమెను పూజించాడని మరియు అప్పటి నుండి కోయిల దుంగార్ అనే కొండపై నివసిస్తున్నారని చెబుతారు .
కొండపై ఉన్న అసలు ఆలయాన్ని కృష్ణుడు స్వయంగా నిర్మించాడని చెబుతారు.
💠 కృష్ణుడు అసురులను మరియు జరాసంధులను ఓడించాలని కోరుకున్నాడు కాబట్టి అతను శక్తి కోసం అంబా మాతను ప్రార్థించాడు.
దేవత ఆశీస్సులతో కృష్ణుడు అసురులను ఓడించగలిగాడు. ఈ విజయం తరువాత, అతను ఆలయాన్ని నిర్మించాడు.
జరాసంధుని చంపబడినప్పుడు, యాదవులందరూ అమితానందం పొందారు ( హర్షిత్ ) మరియు వారు ఇక్కడ తమ విజయాన్ని జరుపుకున్నారు.
అందుకే దీనికి హర్షద్ మాత లేదా హర్సిద్ధి మాత అని పేరు.
అప్పటి నుండి ఆమె యాదవ్ యొక్క కులదేవిగా పూజించబడుతోంది .
💠 ఇక్కడి హారతి చాలా అసాధారణమైనది. దాదాపు 1 గంట ఆర్తి మరియు మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు.
ఆరతి సమయంలో మా హరసిద్ధి ఉంటుందని చెబుతారు.
ఒక ఉయ్యాల ఉంది మరియు అమ్మవారు వచ్చిన వెంటనే ఉయ్యాల స్వయంచాలకంగా ఊగడం ప్రారంభమవుతుంది.
💠 పోర్‌బందర్ నుండి 40 కి.మీ మరియు ద్వారక నుండి 65 కి.మీ దూరం
*_ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు, రాయితీలు మన కష్టార్జితాలే అవి ఎలానో తెలుసుకుందాం._*
_1 సంపాదిస్తే_
*_income tax_*
_2. అమ్మితే_
*_sales tax_*
_3. ఉత్పత్తి చేస్తే_
*_production tax_*
_4. మార్కెట్ చేస్తే_
*_commercial tax_*
_5. సినిమాకి వెళ్తే_
*_entertainment tax_*
_6. వెహికల్ కొంటే_
*_life tax_*
_7. దాన్ని రోడ్ పైకి తెస్తే_
*_road tax_*
_8. లాంగ్ జర్నీ చేస్తే_
*_toll tax_*
_9. బండిలో పెట్రోల్ పోస్తే_
*_fuel surcharge tax_*
_10. భార్య, పిల్లలతో పార్క్ కి వెళితే_
*_entry tax_*
_11. ఉద్యోగం చేస్తే_
*_professional tax_*
_12. వ్యాపారం చేస్తే_
*_trade tax_*
_13. బట్టలు కొంటే_
*_vat tax_*
_14. కరెంటు, వాటర్ బిల్ కడితే_
*_service tax_*
_15. ఆస్థి పై_
*_property tax_*
_16. చివరకి పబ్లిక్ urinals కి వెళ్తే__*swachh bharat charge_*
_17. సబ్బు కొంటే-_*customer charge_*
_18. ఒక వస్తువు కొంటె-tax,_
_19. దాన్ని వినియోగిస్తే-tax,_
_20. దాన్ని రిపేరు చేపిస్తే-tax,
_21.దాన్ని లెక్కల్లో చూపిస్తే-tax,_
_22. సంపాదించింది ఖర్చుపెడితే-tax_
_23. మొత్తం మీద మనిషి జన్మిస్తే-tax,_
_24. మనిషి సంపాదిస్తే-tax,_
_25. మనిషి సంతోషిస్తే_-tax_
_26. మనిషి మరణిస్తే-tax._
*_ఇలా పలు రకాల టాక్స్' లతో మనిషి పుట్టి పెరిగిన నుండి మొదలుకొని అతడు చచ్చే వరకు వారి శక్తికి మించి పన్నులు చెల్లిస్తూ, ఆ వచ్చే రాయితీలు ప్రభుత్వాల, నాయకుల బిక్షగాభావించుకుంటున్నారు అది నిజంకాదు, అవన్నీ ప్రజల యొక్క కష్టార్జితాలే........_*
_Note_ :- బీరు బిర్యానీ డబ్బులకు ఓట్లు అమ్ముకునే చదువురాని గ్రామీణ ఓటర్లకు ఎవరు చెప్పాలి ఈ విషయాలు? విద్యావంతులైన నిరుద్యోగ యువత కదలాలి... రిటైర్డ్ ఎంప్లాయిస్, మంచి ఆశించే ప్రతి ఒక్కరూ కదలాలి.
ఇది కరెక్టు అనుకుంటే మీ గ్రూపుల లో పంపండి
అందరిలో చైతన్యం తీసుకురండి ఓటు విలువ తెలియజేయండి తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.
*ఈ సందర్భంగా అందరి చేత ప్రతిజ్ఞ చేయిద్దాం. *ఓటరు* అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడడానికి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటకు ఒక ఓటరుగా,నా కర్తవ్యమైన *"ఓటును"* శ్రద్ధతో, అంతఃకరణ శుద్దితో, భయంగాని,పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా, నోటుకు,మద్యానికి, కులానికి, మతానికి, సంక్షేమ పథకాల ఎరకు కూడా లొంగకుండా వివేచనా, విచక్షణా జ్ఞానంతో రాజ్యాంగం నాకు కల్పించిన అత్యద్భుతమైన అవకాశం అయినటువంటి *ఓటు* హక్కును వినియోగించుకుంటానని మన *భారత రాజ్యాంగం* మీద త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. *జైహింద్.* *సర్వేజనా సుఖినోభవంతు* 🤝🙏✊🙏 *పెద్దినేని వేంకట చౌదరి*
శ్లోకం:☝️
*యజ్జాగ్రతో దూరముదైతి దైవం*
*తదు సుప్తస్య తథైవైతి l*
*దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం*
*తన్మే మనః శివసంకల్పమస్తు ll*
- శివసంకల్పోపనిషత్ / సంకల్ప సూక్తమ్
భావం: జ్యోతి స్వరూపమైన ఆత్మ జాగ్రదావస్థలో బయటకు వెళ్లి, నిద్రావస్థలో అంతర్ముఖమౌతుంది. అనంత దూరాలకు వెళ్లేదీ, యావత్ప్రపంచానికి ప్రకాశమైనది, అద్వితీయమైన ఆ ఆత్మ నా మనసుకు సత్సంకల్పము కలిగేలా ప్రేరేపించుగాక!
మనకు ఏదైనా పని నెరవేరాలంటే దానికి దృఢమైన సంకల్పము ఉండాలి. అన్య మనస్కంగా పని మొదలుపెడితే నెరవేరదు. ఆ సంకల్పము కూడా సత్సంకల్పమై యుండాలి. అలా (శుభ) సంకల్పం కలగాలన్న కోరికతో పఠించేదే యీ సూక్తము.🙏
ఈ రోజు పంచాంగం 26.11.2023 Sunday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు కార్తీక మాస శుక్ల పక్ష: చతుర్థశి తిధి భాను వాసర: భరణి నక్షత్రం పరిఘ యోగ: వణిజ తదుపరి భద్ర కరణం ఇది ఈరోజు పంచాంగం.
చతుర్థశి మధ్యాహ్నం 03:56 వరకు.
భరణి మధ్యాహ్నం 02:07 వరకు.
సూర్యోదయం : 06:31
సూర్యాస్తమయం : 05:35
వర్జ్యం : రాత్రి 01:52 నుండి 03:26 వరకు.
దుర్ముహూర్తం : సాయంత్రం 04:06 నుండి 04:51 వరకు.
రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.
యమగండం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు
శుభోదయ:, నమస్కార: