26, నవంబర్ 2023, ఆదివారం

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 11*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో*

*నరో వా యః కశ్చిద్భవతు భవ! కిం తేన భవతి |*

*యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే!*

*తదీయస్త్వం శంభో భవసి భవ భారం చ వహసి  11*


ఓ శివా! మానవుడు, బ్రహ్మచారియైననూ, గృహస్థైననూ, సన్యాసియైననూ, జటాధారియైననూ, మరి ఇంక ఎట్టివాడైనా కానిమ్ము దానిచేత (ఆయా ఆశ్రమముల చేత) ఏమి అగును? కానీ ఓ పశుపతీ! ఎవని హృదయపద్మము నీవశమగునో, నీవు అతనివాడివై అతని సంసార భారమును మోసెదవు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: